
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డీఎస్సీ రాసే అభ్యర్థుల వయో పరిమితిని ప్రభుత్వం పెంచింది. అభ్యర్థుల గరిష్ట వయసును 42 సంవత్సరాల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ గురువారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులిచ్చారు. 2024 జూలై 1 నాటికి ఈ వయసును పరిగణిస్తామని, ఈ ఒక్కసారికే ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
పలు పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడించిన ఏపీపీఎస్సీ
సాక్షి, అమరావతి: పలు పోస్టుల భర్తీకి ఉద్దేశించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను https://psc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి రాజాబాబు చెప్పారు. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు– సీనియర్ పౌరుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల రాత పరీక్షను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. 27న మధ్యాహ్నం పేపర్–2, 28న ఉదయం పేపర్–1 ఉంటుంది.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో లైబ్రేరియన్ పోస్టులకు ఈనెల 27న ఉదయం పేపర్–2, 28న ఉదయం పేపర్–1 పరీక్ష ఉంటుంది. ఏపీ ఫిషరీస్ సర్వీస్‌లో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల మెయిన్స్ పరీక్షలో భాగంగా ఈనెల 28న ఉదయం పేపర్–1, 30న ఉదయం పేపర్–2, మధ్యాహ్నం పేపర్–3 పరీక్ష జరగనుంది.
ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోసు్టల రాత పరీక్ష ఈనెల 28న ఉదయం, మ«ద్యాహ్న సమయాల్లో నిర్వహించనుంది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల పరీక్ష ఈనెల 28, 29 తేదీల్లో జరగనుంది.