APPSC
-
గ్రూప్–2 మెయిన్స్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 905 పోస్టులకుగాను 1:2 నిష్పత్తిలో 2,168 మందితో ప్రొవిజినల్ లిస్టును వెల్లడించింది. అందులో 370 మంది స్పెషల్ కేటగిరి అభ్యర్థులున్నారు. వీరందరికీ త్వరలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహించిన తర్వాత తుది అభ్యర్థులను ప్రకటిస్తారు. గ్రూప్–2పై కోర్టులో కేసులున్నా ఫలితాల ప్రకటనపై కోర్టు అభ్యంతరం తెలపకపోవడంతో శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీ ని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. -
42 ఏపీపీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టంచేసింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో మొదలు పెట్టాలని తేల్చి చెప్పింది. ఏపీపీ పోస్టులను పెంచినట్లే, మిగిలిన కేడర్ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని, దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్‌ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టుల్లో పీపీలు, ఏపీపీలు, అసిస్టెంట్ సీనియర్ పీపీల పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని, అందువల్ల పీపీల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సీజే ధర్మాసనం... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు విజయానంద్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి తీసుకుంటున్న చర్యల గురించి విజయానంద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం ఏపీపీల కేడర్ స్ట్రెంత్ 204గా ఉందని, దీనిని 209కి పెంచనున్నామని విజయానంద్ చెప్పారు. 42 ఖాళీలను డైరెక్టుగా భర్తీ చేస్తామని, ఇందుకు సంబంధించి ప్రక్రియను రెండు నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు. -
కూటమి ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీపీలు, ఏపీపీల నియామకంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ,సభ్యుల నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని, కాబట్టి వాటిని వెంటనే రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో పాటు కింది కోర్టులో పీపీలు ,ఏపీపీలు తోపాటు మరికొన్ని పోస్టుల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.విచారణలో భాగంగా ఏపీపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామక నోట్ ఫైళ్లను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, పీపీలు,ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. -
గ్రూప్–2 మెయిన్స్.. పేపర్–1 సులభం.. పేపర్–2 కొంచెం కఠినం
సాక్షి, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలో పేపర్–1 సులభంగా ఉందని, పేపర్–2 ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించినవారు, ప్రామాణిక మెటీరియల్‌తో సిద్ధమైనవారు సులువుగా సమాధానాలు గుర్తించేలా ప్రశ్నపత్రం ఉందంటున్నారు.పేపర్–2లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల నుంచి ఎక్కువ శాతం ఇటీవల పరిణామాలపై ప్రశ్నలు అడిగారని చెబుతున్నారు. అయితే రెండు పేపర్లలోనూ అసెర్షన్ అండ్ రీజన్, స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉండటంతో అన్నింటికి సమాధానాలు గుర్తించడానికి సమయం సరిపోలేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. పేపర్–1 కోర్ అంశాల నుంచే.. పేపర్–1లో రెండు సెక్షన్లలోనూ ప్రశ్నలు కోర్ అంశాల నుంచే ఉన్నాయి. సెక్షన్–ఎగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక, సాంస్కృతిక చరిత్ర విభాగం నుంచి 75 ప్రశ్నలు ఇచ్చారు. ఇందులో ఎక్కువ శాతం.. కవులు, శాసనాలు, ఆయా రాజ్య వంశాల కళలు, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక ఉద్యమాల నుంచే అడిగారు. చోళులు, చాళుక్యులు, కాకతీయులు గురించి ప్రశ్నలు ఉన్నాయి. అదే విధంగా నిజాం రాజుల గురించిన ప్రశ్నలు కూడా ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు సంబంధించిన అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడిగారు. పేపర్–1 సెక్షన్ 2.. రాజ్యాంగానికి ప్రాధాన్యత పేపర్–1లోని సెక్షన్–2లో రాజ్యాంగ అధికరణలు, ప్రకరణలకు సంబంధించిన ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. అయితే ఈ విభాగంలో డైరెక్ట్ కొశ్చన్స్ దాదాపు 50 వరకు ఉండడం అభ్యర్థులకు ఉపశమనం కలిగించే అంశమని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. కాగా అసెర్షన్ అండ్ రీజన్ విధానంలో అడిగిన 15 ప్రశ్నలకు విశ్లేషణాత్మక అధ్యయనం చేసినవారే సమాధానాలు ఇవ్వగలరని పేర్కొంటున్నారు. 10 ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు.రాజ్యాంగంలోని అంశాలు, వాటిని ఏ దేశాల నుంచి సంగ్రహించారు? ఏ ఆర్టికల్‌ను ‘రాజ్యాంగానికి హృదయం, ఆత్మ’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వరి్ణంచారు? భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో జోడించారు? 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి సరైన అంశం? ఆర్టికల్ 365కు సంబంధించిన ప్రశ్న, సెక్యులర్ అనే పదాన్ని ఏ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు? వంటి కోర్ పాలిటీ ప్రశ్నలు అడిగారు.అదేవిధంగా రాజ్యాంగ బద్ధ సంస్థలైన కాగ్, ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ? భారత ప్రభుత్వ చట్టం, లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013 అమల్లోకి వచ్చిన సంవత్సరం? 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ? వంటి ప్రశ్నలు, అశోక్‌మెహతా, రాజమన్నార్ కమిటీలపై ప్రశ్నలు కోర్ సిలబస్ నుంచే ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. పేపర్–1కు సంబంధించి సిలబస్‌ను పూర్తిగా చదివిన వారికి 150 మార్కులకు గాను 110కి పైగా మార్కులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.పేపర్–2.. ఎకానమీ, ఎస్ అండ్ టీ.. ఇక.. రెండో పేపర్లో ఎకానమీ విభాగంలో ఎక్కువ శాతం ప్రశ్నలు సమకాలీన అంశాల నుంచే వచ్చాయి. కోర్ అంశాల నుంచి 15 వరకు మాత్రమే ప్రశ్నలు ఉన్నాయి. ఆయా విభాగాలకు సంబంధించి తాజా గణాంకాలు, పాలసీలు (రైతు భరోసా కేంద్రాలు, జల్ జీవన్ మిషన్, గోకుల్ మిషన్, పూర్వోదయ తదితర పథకాలు) గురించి ప్రశ్నలు అడిగారు. అయితే వీటిలో ఎక్కువ శాతం ప్రశ్నలు అసెర్షన్ అండ్ రీజన్, మ్యాచింగ్ టైప్ విధానంలో ఉండడంతో అభ్యర్థులకు సమాధానాలు గుర్తించడానికి సమయం సరిపోలేదు. కోర్ అంశాలపైనే దృష్టి సారించినవారు కొంత ఇబ్బంది పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేపర్–2లోని సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువగా పర్యావరణ కాలుష్యం, కాలుష్య కారకాలు, వ్యర్థాలు, వ్యాధులు, వ్యవసాయం, సేంద్రియ ఎరువులు, పక్షులు, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి ప్రశ్నలు అడిగారు. అదే విధంగా పథకాలు (ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య మిత్ర, స్వచ్ఛ్ భారత్ అభియాన్ తదితర) నుంచి ప్రశ్నలు వచ్చాయి. టెక్నాలజీకి సంబంధించి డిజిటల్ అరెస్ట్, పవన శక్తి ఉత్పాదనలో భారత్ స్థానం, బ్రహ్మోస్ క్షిపణి సంబంధిత ప్రశ్నలు వచ్చాయి.ఈ విభాగంలోనూ ఎక్కువగా మ్యాచింగ్ టైప్ కొశ్చన్స్, అసెర్షన్ అండ్ రీజన్ కొశ్చన్స్ ఉన్నాయి. తాజా పరిణామాలు (ఇటీవల ప్రయోగాలు)పై ఎక్కువ ప్రశ్నలు లేకపోవడం గమనార్హం. ఈ విభాగంలో ప్రశ్నలకు.. కోర్ సబ్జెక్ట్‌ను పూర్తిగా ఆకళింపు చేసుకున్న వారే సరైన సమాధానాలు ఇవ్వగలిగి ఉంటారని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా గ్రూప్–2 మెయిన్స్ పేపర్–2లో.. పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులు 110–120 మార్కులు పొందే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.కోర్ టాపిక్స్ నుంచే.. గ్రూప్–2 మెయిన్స్ పేపర్–1 ఎంతో సులభంగా ఉంది. ప్రిలిమ్స్‌తో పోల్చితే దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ప్రశ్నలు అడిగారు. అభ్యర్థులు అసెర్షన్ అండ్ రీజన్ కొశ్చన్స్ విషయంలో కొంత తికమక పడటం సహజం. మొత్తంగా చూస్తే ఓ మోస్తరు ప్రిపరేషన్ సాగించిన వారు 115 మార్కులు, సిలబస్‌పై బాగా పట్టు సాధించినవారు అంతకంటే ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. పేపర్–2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో కోర్ టాపిక్స్‌కు ప్రాధాన్యం కనిపించింది. రెండు పేపర్లలోనూ ఎక్కువగా అసెర్షన్ అండ్ రీజన్, కాంబినేషన్ టైప్ కొశ్చన్స్ ఉన్నాయి. ప్రామాణిక మెటీరియల్ చదివిన వారు సమాధానాలు ఇచ్చే విధంగానే ప్రశ్నలు ఉన్నాయి. – కృష్ణప్రదీప్, డైరెక్టర్, ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ -
వెబ్సైట్లో గ్రూప్–2 మెయిన్స్ ‘కీ’
సాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ ప్రాథమిక ‘కీ’ని కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.ప్రశ్నలు, జవాబులపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 27వరకు http://psc.ap.gov.in లో తెలపాలని విజ్ఞప్తి చేసింది. -
గ్రూప్-2 పై చంద్రబాబుకు అవగాహన లేదు: సలామ్ బాబు
-
గ్రూప్–2 అభ్యర్థులతో 'బాబు బంతాట'
డ్రామాలో భాగంగానే సీఎం పలుకులు మెయిన్స్ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావంతోనే ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది. పరీక్షను రద్దు చేయాలని చెప్పినా ఏపీపీఎస్సీ చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఈ డ్రామాలో భాగమే. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు నిరుద్యోగులకు బాగా బుద్ధి చెప్పారు. యువగళం పేరుతో లోకేశ్ ఎన్నో హామీలిచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడంలేదు. ఈ 900 పోస్టులు పూర్తి చేసి ఈ ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేసేశాం అని డబ్బా కొట్టుకోవడానికే ఈ డ్రామాలు. – గ్రూప్–2 అభ్యర్థినిసాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులను అనేక రకాలుగా మభ్యపెట్టిన చంద్రబాబు సర్కార్ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు వారి భావోద్వేగాలతో ఆడుకుంది. ఆదివారం పరీక్ష ఉందనగా.. శనివారం సాయంత్రం వరకు రకరకాల విన్యాసాలతో నాటకాలాడిన తీరు విస్తుగొలుపుతోంది.. ఓ పరీక్ష విషయంలో ఇంతటి గందరగోళం, 8 గంటల ముందు వరకు నాన్చుడు వ్యవహారం ఏపీపీఎస్సీ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. బాబు సర్కారు బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట. ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అభ్యర్థుల్లో ఆశలు రేపారు. అయితే, పరీక్ష వాయిదా అంటూ ‘సోషల్ మీడియా’లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ శనివారం ఉదయం ఏపీపీఎస్సీ ప్రకటించింది. తర్వాత శనివారం మధ్యాహ్నానికి పరీక్ష వాయిదాకు అనువుగా నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. వాస్తవానికి రోస్టర్ అమలులో సమస్యలున్నాయని, వాటిని సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని, అప్పటిదాకా పరీక్ష వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం కలిసి విజ్ఞప్తులు చేశారు. కానీ, ఏ ఒక్కరూ నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే, కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఎమ్మెల్సీలు హామీ ఇవ్వడంతో ఈ నెల 20వ తేదీ వరకు ఆగారు. కోర్టు గ్రూప్–2 మెయిన్స్ రద్దుకు అంగీకరించకపోవడంతో పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు నేడు యథాప్రకారం జరగనున్నాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం కుదరదని ఏపీపీఎస్సీ చైర్మన్ అనూరాధ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ప్రభుత్వ తీరుపై గ్రూప్ –2 అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని చూసి లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ కూడా కోపంతో రగిలిపోతున్నారు. ఇంత దగా చేసిన కూటమి సర్కారును వదిలిపెట్టకూడదని, ‘బాయ్‌కాట్ ఎలక్షన్’ కాదు.. ఎన్నికల్లో పాల్గొని తగినవిధంగా బుద్ధిచెప్పాలని గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రాడ్యుయేట్స్ తీర్మానించుకుంటున్నారని తెలుస్తోంది. ‘బాయ్‌కాట్ ఎలక్షన్’ నిర్ణయంతో సర్కారు డ్రామాలు.. గ్రూప్–2 మెయిన్స్ నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతుందని అభ్యర్థులు సర్కారుకు మొరపెట్టుకున్నారు. కోర్టు తీర్పు అనంతరం నిర్ణయాధికారం ప్రభుత్వ పరిధిలోకి వచ్చినందున రోస్టర్ సవరించే వరకు పరీక్షను వాయిదా వేయాలని ఈనెల 20నుంచి కోరుతున్నారు. అయిన్పటికీప్రభుత్వం స్పందించలేదు. దీంతో అభ్యర్థులు ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించింది. ‘‘పరీక్షలను వాయిదా వేయమని గ్రూప్–2 అభ్యర్థుల నుంచి నాకు అనేక అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆందోళనలను అర్థం చేసుకున్నాను. మా న్యాయ బృందాలతో సంప్రదించి, పరిష్కారాన్ని కనుగొనేందుకు అన్ని మార్గాలను అన్వేíÙస్తాము’’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే, శనివారం ఉదయం ఏపీపీఎస్సీ మరో ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఒకే అంశంపై రెండు వ్యవస్థలు భిన్న అభిప్రాయాలను వెల్లడించడంతో అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారు. పరీక్ష మరో 14 గంటలు ఉందనగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో రోస్టర్ సమస్యను పరిష్కరించి పరీక్ష నిర్వహించాలని, అప్పటిదాకా మెయిన్స్ వాయిదా వేయాలని ప్రభుత్వ కార్యదర్శి.. ఏపీపీఎస్సీకి రాసినట్టుగా ఓ లేఖ శుక్రవారం తేదీతో శనివారం మధ్యాహ్నం బహిర్గతమైంది. దీనిపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సర్వీస్ కమిషన్ చైర్మన్ అనురాధను తప్పుబడుతూ ఉన్న ఆడియోను లీక్ చేశారు. ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయమంటే ఏపీపీఎస్సీ పట్టించుకోవడం లేదన్నది ఆ ఆడియో సారాంశం. ఈ నిర్ణయం ముందే ఎందుకు తీసుకోలేదు? గ్రూప్–2 రిజర్వేషన్లలో రోస్టర్ అమలు తప్పులున్నాయని ఏడాది కాలంగా ప్రచారం చేస్తూ వచి్చన కూటమి ప్రభుత్వంలోని నేతలు కేసు కోర్టు పరిధిలోకి వచ్చేవరకు ఎందుకు మార్చే ప్రయత్నం చేయలేదన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. వాస్తవానికి ఎన్డీఏ సర్కారు ఏర్పడి దాదాపు 9 నెలలు పూర్తవుతోంది. గ్రూప్–2 మెయిన్స్ ఒకసారి జూలైకి, మరోసారి డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ క్రమంలో తప్పులు సరిచేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కోర్టుకు సైతం తప్పులు లేవని చెప్పారని, ఒకవేళ తప్పులుంటే సరి చేస్తామని పేర్కొన్నట్టు చెబుతున్నారు. పరీక్ష తేదీ సమీపించే వరకు వాయిదా వేసే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని నిలదీస్తున్నారు. ఆదివారం పరీక్ష ఉందనగా, శనివారం మధ్యాహ్నం పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ తప్పేంలేదని చెప్పేందుకే ఈ డ్రామా ఆడుతున్నట్టుగా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ తీరుతో సుదూర ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరుకావాల్సిన వారు మూడు రోజులుగా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వివాదాలే ‘అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ కేలండర్ ఇస్తాం. నిరుద్యోగులకు మేలు చేసేలా సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తా’మని చెప్పిన ఎన్డీఏ కూటమి నాయకులు.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక సర్వీస్ కమిషన్‌ను నీరుగార్చే పనిలో పడ్డారు. ఏడాది పదవీ కాలం ఉండగానే.. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న కమిషన్ చైర్మన్‌ను రాజకీయ కుట్రతో తొలగించారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు జరగకుండా వాయిదాలు వేశారు. ఇందులో గ్రూప్–2తో పాటు గ్రూప్–1 మెయిన్స్, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు వంటి కీలమైన 21 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటికి నిర్విరామంగా సిద్ధమవుతున్న దాదాపు 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చేశారు. ఇప్పుడూ గ్రూప్–2 మెయిన్స్ కొన్ని గంటల వ్యవధిలో ఉందనగా రాజకీయం ప్రారంభించారు. ఇందులో సాక్షాత్తూ ‘ముఖ్య’ నేతలే అభ్యర్థుల భావోధ్వేగాలతో ఆడుకోవడం గమనార్హం.ఇప్పటికిప్పుడు మెయిన్స్ వాయిదా వేయలేం : ఏపీపీఎస్సీ చైర్మన్ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను ఇప్పటికిప్పుడు వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ ద్వారా అవసరమైన వివరణ ఇచ్చేందుకు పరీక్షను వాయిదా వేయాలని శనివారం జీఏడీ సర్వీస్ కమిషన్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పైవిధంగా స్పందించినట్టు సమాచారం. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాక.. గంటల వ్యవధిలో వాయిదా వేయాలనడం సబబుకాదని చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం. నేడు గ్రూప్–2 మెయిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాలు సిద్ధంగ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 పేపర్–2 నిర్వహిస్తారు. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంతో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సర్వీస్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు ఉదయం 9.30 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9.45కు కేంద్రాల గేట్లను మూసివేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అన్ని సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీల వీరంగంవిజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కోట కూడలిలో శనివారం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీలు వీరవిహారం చేశారు. ఉన్నత విద్యావంతులని కూడా చూడకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. నిరసన శిబిరాన్ని చెదరగొట్టారు. పలువురు అభ్యర్థులను రాత్రి సమయాన జీపుల్లో దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. రోస్టర్ విధానంపై స్పష్టత ఇచ్చాకే గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించాలని కోరిన పాపానికి ప్రభుత్వం పోలీసులతో నిరుద్యోగుల ఆందోళనను అణచివేయడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. గ్రూప్–2 పరీక్షల్లో రోస్టర్ విధానం ప్రకటించాలని కోరుతూ కోట కూడలి వద్ద అభ్యర్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, ఆదేశాలు రాకపోవడంతో సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో కోట వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో వన్‌టౌన్, టుటౌన్ సీఐలు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడలి వద్దకు చేరుకుని నిరుద్యోగులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు.ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా చెప్పుతో మేం కొట్టుకుంటున్నాం..నిరుద్యోగులకు మేలు చేస్తుందని ఆశించి మేమంతా ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా రెండు చెప్పులతో మేం కొట్టుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా రోస్ట్‌ర్ సరిచేయకుంటే మేమంతా పెద్ద ఎత్తున నష్టపోతామంటూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించకుండా మెయిన్స్ నిర్వహిస్తోంది. మా భవిష్యత్‌ను, ఆశలను తుంగలొకి తొక్కిన ఈ ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా మేం బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. – గ్రూప్–2 అభ్యర్థి -
గ్రూప్-2 వాయిదాపై చంద్రబాబు సర్కార్ డ్రామా
సాక్షి, విజయవాడ: పరీక్ష వాయిదా కోసం గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనలు చేసినా కానీ చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయని ఏపీపీఎస్సీ.. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానం పంపింది. పరీక్ష నిర్వహించాలని అన్ని జిల్లాల అధికారులకు ఏపీపీఎస్సీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, గ్రూప్-2 వాయిదాపై చంద్రబాబు సర్కార్ డ్రామాకు తెరలేపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామా నడుపుతోంది.లేఖలు, ఆడియో లీక్స్ పేరుతో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారు. డ్యూటీ టైమింగ్స్ అయిపోవడంతో ఏపీపీఎస్సీ కార్యాలయం సిబ్బంది వెళ్లిపోయారు. కార్యాలయానికి తాళం వేసి ఉందని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. ఏపీపీఎస్సీ కార్యాలయానికి వచ్చి.. అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు. విశాఖలో గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన ఉధృతం చేశారు. ఇసుక తోట నేషనల్ హైవేపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేస్తున్నారు. -
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. ఉంటుందా? ఉండదా?
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2(Group 2) అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళం నెలకొంది. అందుకు ఏపీ ప్రభుత్వం చేసిన పనే కారణం. మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ APPSC సెక్రటరీకి లేఖ రాసింది. అయితే స్వయంగా ప్రభుత్వమే లేఖ రాసినా బోర్డు నుంచి ఇంతదాకా స్పందన లేదు. షెడ్యూల్ ప్రకారం రేపు(ఫిబ్రవరి 23, ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంది. రోస్టర్ తప్పులను సరి చేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది. ఆ పరీక్షను వాయిదా వేయాలంటూ శనివారం ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. మార్చి 11న రోస్టర్ అంశంపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అఫిడవిట్ వేసేందుకు సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే.. మరోపక్క మెయిన్స్(Group 2 Mains Exam) వాయిదా పడింది అంటూ వస్తున్న కథనాలను ఇంతకుముందు బోర్డు కొట్టిపారేసింది. యధావిథిగా రేపు(23 ఫిబ్రవరి) పరీక్ష జరుగుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విజ్ఞప్తిని బోర్డు పరిగణనలోకి తీసుకుంటుందా? ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.చట్టరీత్యా చర్యలు తప్పవుపలు సామాజిక మాధ్యమాల ద్వారా గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు వాయిదా అని సర్కులేట్ అవుతున్న వార్త అవాస్తవం. ఏపీపీఎస్సీ నుండి అందిన సమాచారం మేరకు గ్రూప్ -2 పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం.:::తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ -
చెప్పారంటే.. చేయరంతే!
సాక్షి, అమరావతి: ‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. పారిపోయే బ్యాచ్ కాదు నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ కేలండర్ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు.. ఎప్పుడు ఎగ్జామ్స్.. ఎప్పుడు ఇంటర్వ్యూలు.. ఎప్పుడు ఆఫర్ లెటర్లు (Offer Letters) ఇచ్చేది చాలా స్పష్టంగా 2025 జనవరి ఫస్ట్‌నే ప్రకటిస్తాం’ అని ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు యువగళం సభల్లో నారా లోకేశ్ (Nara Lokesh) ఆర్భాటంగా సెలవిచ్చారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచాయి. జనవరి ఒకటో తేదీ వెళ్లిపోయింది. ఫిబ్రవరి వస్తోంది. జాబ్ కేలండర్ (Job Calendar) ప్రకటన మాత్రం లేదు. ఇప్పటిదాకా జాబ్ కేలండర్ ఏమైందో పట్టించుకున్నదే లేదు. లోకేశ్ మాత్రమే కాదు.. నారా చంద్రబాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్–1, 2 మెయిన్స్ పరీక్షలను పలుమార్లు వాయిదా వేశారు. సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర అటవీ శాఖలోని 689 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించి 10 నెలలు దాటినా, వాటికి నోటిఫికేషన్ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించకపోగా, కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని స్పష్టమవుతోంది.10 లక్షల మందిలో తీవ్ర ఆందోళన కూటమి ప్రభుత్వంలో గ్రూప్–2, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రెండుసార్లు వాయిదా వేశారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఫిబ్రవరిలో గ్రూప్–2, మే నెలలో గ్రూప్–1 మెయిన్స్‌కు తేదీలు ప్రకటించారు. అయితే, గత సంఘటనలతో ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయో లేదో అనే అనుమానం నిరుద్యోగులను వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన మరో 21 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఎనిమిది నెలలుగా ఈ పరీక్షల నిర్వహణపై ఇటు ఏపీపీఎస్సీ, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. దీంతో యువత భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్‌తో పాటు ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేశారు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని నీరుగార్చింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఇంకా శిక్షణ కొనసాగించాలా.. లేక విరమించాలో తేల్చుకోలేక నిరుద్యోగ అభ్యర్థులు మదనపడుతున్నారు. ఈ 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా వేశారు. సెప్టెంబర్‌లో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ మే నెలకు వెళ్లిపోయింది. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అలాగే ఉంది. కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి మెయిన్స్‌కు అర్హత సాధించిన వారు దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు. వారంతా దీర్ఘకాలిక సెలవులు పెట్టి మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ‘యువగళం’లో యువతకు హామీ ఇచి్చన విషయాన్ని 2023 నవంబర్ 30న ‘ఎక్స్’లో పోస్టు చేసిన లోకేశ్ మభ్య పెట్టడమే సర్కారు విధానంరాష్ట్ర అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గతేడాది అనుమతిచ్చింది. ఇందులో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 70, బీట్ ఆఫీసర్ పోస్టులు 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375, తానాదార్ 10, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 12, జూనియర్ అసిస్టెంట్లు 10 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వీస్ కమిషన్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. కానీ కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీకి ముందు ఖాళీలను గుర్తించాలి. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు పేర్కొని నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను చేర్చి ‘డ్రాఫ్ట్ జాబ్ కేలండర్–2025’గా ప్రచారం చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.యువత సంక్షేమం పేరుతో జ్యాబ్ క్యాలెండర్ ఇస్తామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం గత ప్రభుత్వంలో షెడ్యూల్ ప్రకారమే భర్తీవైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా పోస్టులు భర్తీ చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా నియామకాలు పూర్తి చేశారు. రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి, ఏకంగా 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఏ ఒక్క నోటిఫికేషన్ వాయిదా పడిన సందర్భంగానీ, రద్దు చేయడం గాని జరగలేదు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పని తీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. చదవండి: అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు2019కి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లపై వివాదాలు చెలరేగి నిరుద్యోగ యువత నష్టపోయారు. ప్రస్తుతం ఉద్యోగ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతినెలా సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. 2018 డిసెంబర్లో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చినా, ఒక్క నోటిఫికేషన్‌కు పరీక్షలు నిర్వహించ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 2019కి ముందున్న పరిస్థితే వచ్చిందని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మే 3 నుంచి గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏడు పేపర్లకు వరుసగా ఏడు రోజులు పరీక్షలు(డిస్క్రిప్టివ్) నిర్వహిస్తారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రశ్నాపత్రాలను ట్యాబ్స్ ద్వారా పంపిణీ చేయనున్నారు. 2023 డిసెంబర్లో 89 గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. గతేడాది మార్చి 17న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఏప్రిల్‌లో ఫలితాలు వెల్లడించారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున (1:50) 4,496 మంది మెయిన్స్‌కి ఎంపికయ్యారు. వీరికి మేలో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. పరీక్షల షెడ్యూల్ ఇదీ.. మే 3: తెలుగు పేపర్ (అర్హత పరీక్ష) మే 4: ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష) మే 5: పేపర్–1: జనరల్ ఎస్సే మే 6: పేపర్–2: భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర–సంస్కృతి, భూగోళిక అంశాలు మే 7: పేపర్–3: పాలిటీ,భారత రాజ్యాంగం, పాలన, లా అండ్ ఎథిక్స్ మే 8: పేపర్–4: భారత, ఆంధ్రప్రదేశ్ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి. మే 9: పేపర్–5: సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు -
గ్రూప్–2 మెయిన్స్ వాయిదా
సాక్షి, అమరావతి: ప్రభుత్వం గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను 2025 ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. పూర్తి వివరాలు కమిషన్ వెబ్సైట్లో చూడాలని పేర్కొంది. అక్షరాస్యత కమిటీ ఏర్పాటుసాక్షి, అమరావతి: వయోజన విద్యకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర అక్షరాస్యత కేంద్రానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులిచ్చారు. పాఠశాల విద్య కార్యదర్శి చైర్మన్‌గాను, ఏపీ లిటరసీ మిషన్ అథారిటీ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. మెడికల్ అండ్ ఫ్యామిలీ సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, స్కిల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ ఐటీ కార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్, ఐటీ సెల్ డైరెక్టర్‌తో పాటు ఇండియన్ పోస్టల్ సర్వీస్ రిటైర్డ్ అధికారి సభ్యులుగా ఉంటారు.ట్రిపుల్ ఐటీలో 14న జాతీయ సదస్సునూజివీడు: జాతీయ మెటలర్జీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 14న ఏలూరు జిల్లా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మంగళవారం తెలిపారు. జాతీయ సదస్సు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. లోహ పదార్థాలు, వాటి ప్రాసెసింగ్‌లపై పరిశోధన చేసి, దేశానికి వెన్నుదన్నుగా నిలిచే శాస్త్రవేత్తల సేవలను గుర్తిస్తూ మెటలర్జీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
AP: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా
సాక్షి,విజయవాడ: ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. 2025 జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ మంగళవారం(నవంబర్ 12) ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది దాకా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.ఇదీ చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నిరసన -
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఎట్టకేలకు గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై నాటికే పూర్తి కావాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో గత ఏడాది డిసెంబర్లో 899 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. జూలై నాటికి గ్రూప్ -2 మెయిన్స్ పూర్తి చేసేవిధంగా నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ నిర్ణయించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్చే బలవంతపు రాజీనామా చేయించారు. నాలుగు నెలలగా చైర్మన్ లేకపోవడంతో గ్రూప్-1 , గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త చైర్మన్‌గా అనూరాధ బాధ్యతలు స్వీకరించడంతో గ్రూప్-2 మెయిన్స్‌కి ఏపిపిఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్షలో 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాయిదా పడిన గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్‌పైనా నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. -
నిస్తేజంలో ఏపీపీఎస్సీ.. నైరాశ్యంలో అభ్యర్థులు!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. సీఎం చంద్రబాబు తన రాజయకీయాలకు నిరుద్యోగ యువతను బలిచేస్తున్నారు. బాబు ప్రభుత్వ నిర్వాకంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరర్ధకంగా మారిపోయింది. కమిషన్‌కు చైర్మన్ కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షల నిర్వహణ, ఎంపికలు గందరగోళంలో పడ్డాయి. గతంలోనే ప్రకటించిన నోటిఫికేషన్లకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో తెలియక నిరుద్యోగులు అందోళనకు గురవుతున్నారు.మరోపక్క ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయి, ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉన్నా.. అదీ చేయడం లేదు. లక్షల్లో ఉద్యోగాలిస్తాం, జాబ్ కేలండర్ విడుదల చేస్తామని సీఎం, మంత్రుల ప్రకటనలే తప్ప ఒక్క ఉద్యోగమూ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడంలేదు. ఏపీపీఎస్సీ ద్వారా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలపైనా స్పష్టత ఇవ్వడంలేదు. దీనిని అవకాశంగా మార్చుకుంటున్న శిక్షణ సంస్థలు ‘వచ్చే నెలలో పరీక్షలు.. స్పెషల్ బ్యాచ్ శిక్షణ’ పేరుతో నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. మూడు నెలలుగా చైర్మన్ పదవి ఖాళీసర్విస్ కమిషన్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షల తేదీల ప్రకటన, పోస్టింగ్స్.. ఇలా దేనికైనా చైర్మన్ అనుమతి తప్పనిసరి. అయితే, ఈ ఏడాది జూన్‌లో అధికారంలోకి వచి్చన వెంటనే కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న సర్విస్ కమిషన్ చైర్మన్‌పై కుట్రకు తెరతీసింది. 2025 జూలై వరకు పదవిలో ఉండాల్సిన చైర్మన్‌పైన, సభ్యులపైన వేధింపులకు దిగి, చివరికి తొలగించింది. నిబంధనల ప్రకారం సర్విస్ కమిషన్ చైర్మన్ ఏదైనా కారణాలతో అందుబాటులో లేకున్నా, లేదా ఆ పోస్టు ఖాళీ అయినా ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి కొత్త చైర్మన్ వచ్చే వరకు ఆ బాధ్యతలను సభ్యుల్లో ఒకరికి అప్పగించాలి.కానీ ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలలుగా చైర్మన్‌ను నియమించకుండా కమిషన్‌ను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఏపీపీఎస్సీకి ఇన్ని రోజులు చైర్మన్ లేకపోవడం ఇదే తొలిసారని అధికారవర్గాలు చెబుతున్నాయి. చైర్మన్ లేకపోవడంతో గతంలో ఇచి్చన 21 నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను ప్రకటించలేదు. కీలకమైన గ్రూప్–1, 2 పోస్టులకు నిర్వహించాల్సిన మెయిన్స్ వాయిదా వేశారు. దీంతో 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి బాబు సర్కారుకేదీ? వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీపీఎస్సీ ద్వారా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇచ్చి, ఉద్యోగాలు భర్తీ చేసింది. ఆ చిత్తశుద్ధి ప్రస్తుత చంద్రబాబు సర్కారులో కనిపించడంలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్విస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగాయి, ఉద్యోగాల భర్తీ పక్కాగా పూర్తి చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లోను 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేశారు. బాబు ప్రభుత్వం వచ్చాక ఉన్న చైర్మన్‌ను కుట్రపూరితంగా తొలగించడమే కాకుండా, కొత్త చైర్మన్‌ను నియమించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాయిదాలతో అభ్యర్థుల భవిష్యత్‌తో ఆటలుగతంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తికావాలి. ఇందులో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు గత ప్రభుత్వ హయాంలో షెడ్యూల్ ప్రకారం ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను సైతం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా, వాయిదా వేశారు.ఈ నెలలో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ కూడా వాయిదా వేశారు. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అంతే. ఈ మూడు పరీక్షల మెయిన్స్‌కు అర్హత సాధించిన దాదాపు 1.15 లక్షల మంది అభ్యర్థుల జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయాయి. వీటితోపాటు డిగ్రీ, జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లతో పాటు వివిధ శాఖల్లో దాదాపు 1,475 పోస్టులకు పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వలేదు. ఆయుష్ విభాగంలో హోమియో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు జూలైలనే సరి్టఫికెట్ల పరిశీలన కూడా పూర్తయినా, చైర్మన్ లేకపోవడంతో ఇప్పటికీ నియామకపత్రాలు ఇవ్వలేదు. -
ఏపీపీఎస్సీ నిర్వీర్యం 'చైర్మన్ కావలెను'
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వస్తే జాబ్ క్యాలండర్ విడుదల చేస్తాం.. నిరుద్యోగులకు మేలు చేసేలా సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తాం’ అంటూ హామీలిచ్చిన కూటమి నాయకులు కొత్త సర్కారు కొలువుదీరాక ఏపీపీఎస్సీని నీరుగార్చారు. మరో ఏడాది పాటు పదవీ కాలం ఉన్న కమిషన్ చైర్మన్‌ను రాజకీయ కుట్రతో ఆగమేఘాలపై తొలగించి గత నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు జరగకుండా అడ్డుపడ్డారు. కూటమి సర్కారు నిర్వాకాలు, కాలయాపనతో గ్రూప్–2, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులతో పాటు మరో 19 నోటిఫికేషన్లకు సంబంధించి నిర్విరామంగా సిద్ధమవుతున్న దాదాపు 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్‌తో పాటు ఇచ్చే షెడ్యూల్లోనే పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించి షెడ్యూల్ ప్రకారం పోస్టులు భర్తీ చేశారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చీ రాగానే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీపై దాడి ప్రారంభించింది. పదవిలో ఉన్న ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కుటిల రాజకీయాలతో తొలగించింది. జూలై 2025 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ అర్ధాంతరంగా తొలగించడంతో గతంలో ఇచ్చిన పలు నోటిఫికేషన్ల తాలూకు పరీక్షలు, ప్రకటించాల్సిన కొత్త నోటిఫికేషన్లు పెండింగ్‌లో పడిపోయాయి. దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు సర్వీస్ కమిషన్‌కు ప్రభుత్వం కొత్త చైర్మన్‌ను నియమించలేదు. నిబంధనల ప్రకారం సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏదైనా కారణంతో అందుబాటులో లేకుంటే కొత్త చైర్మన్ వచ్చే వరకు ఆ బాధ్యతలను సభ్యుల్లో ఒకరికి అప్పగించాలి. విషయాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చి చైర్మన్‌గా బాధ్యతలు మరొకరికి అప్పగించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇన్ని రోజులు కమిషన్‌కు చైర్మన్ లేని పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని పేర్కొంటున్నారు.ఖర్చు భరించలేక.. కొనసాగించలేకగతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల మేరకు గ్రూప్–1, 2 ప్రిలిమ్స్, డీవైఈవో (డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్) ప్రిలిమ్స్‌ను గత ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం నిర్వహించి ఫలితాలను సైతం ప్రకటించింది. ముందుగా ప్రకటించిన తేదీల్లోనే మెయిన్స్ కూడా నిర్వహిస్తారని భావించి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అశనిపాతంగా మారింది. దీంతో ఎప్పుడు జరుగుతాయో తెలియని మెయిన్స్ కోసం శిక్షణ కొనసాగించాలా? లేక విరమించాలా? అనేది తేల్చుకోలేక నిరుద్యోగ అభ్యర్థులు సతమతమవుతున్నారు.పలు నోటిఫికేషన్ల పరీక్షలపై నీలినీడలుఏపీపీఎస్సీ ద్వారా వెలువడే అన్ని నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణకు చైర్మన్ అనుమతి తప్పనిసరి. చైర్మన్ ఆదేశాల మేరకు కార్యదర్శి పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ప్రకటించిన 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తియాలి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లాంటి కీలమైన 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను సైతం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా వాయిదా వేశారు. సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన గ్రూప్–1 మెయిన్స్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. డీవైఈవో మెయిన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి మెయిన్స్‌కు అర్హత సాధించిన వారే దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిలో చాలామంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులున్నారు. వారంతా తమ దీర్ఘకాలిక సెలవులు పెట్టి మెయిన్స్ కోసం సిద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారంతా ఎటూ తేల్చుకోలేక ఆందోళన చెందుతున్నారు.మిగిలిన 19 నోటిఫికేషన్లకు మోక్షం ఎప్పుడు?ప్రిలిమ్స్ నిర్వహించిన మూడు నోటిఫికేషన్లకు సంబంధించి మెయిన్స్ మాట అటుంచితే.. గతంలో ఇచ్చిన మరో 19 నోటిఫికేషన్లకు కూటమి ప్రభుత్వం కనీసం పరీక్షల నిర్వహణ తేదీలను కూడా ప్రకటించలేదు. వీటిలో డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ కాలేజీ లెక్చరర్లతో పాటు వివిధ శాఖల్లో దాదాపు 1,475 పోస్టులున్నాయి. వీటికి సుమారు 6.35 లక్షల మంది దరఖాస్తు చేసుకుని సిద్ధమవుతున్నారు. దీంతో పాటు కొత్తగా అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు లాంటి పోస్టులతో పాటు వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన దాదాపు 800 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. వీటిపై గతంలో ఏపీపీఎస్పీ ప్రకటన ఇవ్వడంతో లక్షలాది మంది కొద్ది నెలలుగా శిక్షణ పొందుతున్నారు. దీంతో పాటు కొత్తగా ఆర్థికశాఖ అనుమతి పొందిన 10కి పైగా నోటిఫికేషన్లు ప్రకటించాల్సి ఉంది. ఆర్థిక భారంతో ఆందోళన.. వైఎస్సార్ సీపీ హయాంలో సర్వీస్ కమిషన్ నుంచి వెలువడ్డ అన్ని నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగాయి. ఉద్యోగాల భర్తీని పక్కాగా పూర్తి చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లో 78 నోటిఫికేషన్లు ఇవ్వగా అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేశారు. ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌కు షెడ్యూల్లో ప్రకటించిన తేదీల్లోనే పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కటీ వాయిదాగానీ, రద్దు చేసిన సందర్భాలు లేవు. 2019కి ముందు నాటి టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పనితీరుపై ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకున్నట్లు పేర్కొనగా వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీలో ఏపీపీఎస్సీ ప్రథమస్థానంలో నిలవడం గమనార్హం. 2019కి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు వివాదాల్లో చిక్కుకోవడంతో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడ్డారు. 2018 డిసెంబర్లో 32 నోటిఫికేషన్లు జారీ చేయగా ఒక్క నోటిఫికేషన్‌కూ పరీక్షలు నిర్వహించకపోవడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ అదే దుస్థితి నెలకొందని నిరుద్యోగులు వాపోతున్నారు.రాజ్యాంగం ఏం చెబుతోంది..?టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించింది. ఇతర సభ్యులపైనా ఒత్తిళ్లు తెస్తోంది. వాస్తవానికి ప్రభుత్వాలు మారినా రాజ్యాంగ బద్ధమైన ఈ పోస్టుల్లో ఉన్నవారిని పదవీ కాలం పూర్తయ్యే వరకు తొలగించకూడదు. గతంలో ఇదే విధానం కొనసాగింది. టీడీపీ హయాంలో నియమితులైన ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తి కాలం కొనసాగారు. కూటమి సర్కారు అందుకు విరుద్ధంగా బలవంతంగా రాజీనామాలు చేయిస్తోంది. రాజ్యాంగంలోని 316, 317 నిబంధనల ప్రకారం కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం, పదవీ కాలాన్ని నిర్దేశించారు. దీని ప్రకారం ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు ఆరేళ్ల వరకు లేదా 62 ఏళ్ల వయసు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) బాధ్యతల్లో కొనసాగవచ్చు. ఆయా పోస్టుల్లో ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేయాలి. ముఖ్యంగా చైర్మన్ పదవి ఖాళీ అయితే ఆ స్థానంలో కొత్త చైర్మన్ వచ్చే వరకు ఇన్‌చార్జీగా మరొకరికి బాధ్యతలు అప్పగించాలి. తెరపైకి పలువురి పేర్లు..కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీపీఎస్సీ చైర్మన్‌గా తొలుత వివాదాస్పద పోలీసు అధికారి (రిటైర్డ్) ఏబీ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. రిటైర్డ్ ఐఏఎస్ పూనం మాలకొండయ్యతో పాటు పోలా భాస్కర్ పేర్లు కూడా వినిపించాయి. కేరళ టూరిజం శాఖలో పనిచేస్తున్న కె.శ్రీనివాస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా పనిచేసిన అప్పారావు, అదే వర్సిటీలో పనిచేస్తున్న యలమంచిలి రామకృష్ణ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. -
ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈనెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే టెస్టుల వివరాలను https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు.⇒ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 12న ఉదయం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు.⇒ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25న పరిశీలించనున్నారు. అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ⇒ హోమియో విభాగంలో మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 23 నుంచి 25 తేదీ వరకు పరిశీలించనున్నారు. ⇒ రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కార్యదర్శి పేర్కొన్నారు. -
ప్రభుత్వ ఒత్తిడితో సవాంగ్ రాజీనామా
-
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో పరీక్ష వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. -
రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయ దాడి..
-
రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయ దాడి
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాజ్యంగ వ్యవస్థలపై దాడికి దిగింది. రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్న వారు సైతం వెంటనే దిగిపోవాలని ఒత్తిడి తెస్తోంది. ఇదివరకు టీడీపీ ప్రభుత్వ (2014–2019) హయాంలో ఆయా రాజ్యాంగబద్ధ పదవుల్లో నియమితులైన వారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొనసాగారన్న వాస్తవాన్ని ప్రస్తుత టీడీపీ సర్కారు విస్మరించి కక్ష సాధింపులకు దిగింది. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు ఇతర సభ్యులను, సమాచార హక్కు చట్టం కమిషనర్లతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై కూడా ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేయాలని తీవ్ర ఒత్తిడి తెస్తోంది. రాజ్యాంగం సృష్టించిన ఈ పోస్టుల్లో నియమితులైన వారు ప్రభుత్వాలు మారినా పదవీ కాలం పూర్తయ్యే వరకు తొలగించడం వీలు కాదు. గతంలో రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇదే విధానం కొనసాగింది. అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనూ గత టీడీపీ ప్రభుత్వంలో నియమితులైన ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు పూర్తి కాలం కొనసాగారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా టీడీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. రాజ్యంగబద్ధమైన పోస్టుల్లో నియమితులైన వారికి పదవీ కాలం ముగిసే వరకు కొనసాగే అధికారం ఉన్నా వారిపై ఒత్తిడి తెచ్చి పోస్టులకు రాజీనామా చేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) సర్వీసెస్ కార్యదర్శి పోలా భాస్కర్ తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ నిర్ణయంపై సాటి ఐఏఎస్ అధికారులే విస్తుపోతున్నారు. మరోపక్క అవసరమైతే సభ్యులపై కేసులు పెట్టి అయినా లొంగ దీసుకోవాలని టీడీపీ రాజకీయ పెద్దలు పావులు కదుపుతున్నారు. గత ప్రభుత్వంలో రాజకీయ పరమైన పదవుల్లో నియమితులైన (నావిునేటెడ్) వివిధ బోర్డులు, కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అయితే, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని సైతం రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడమంటే రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయ దాడేనని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కాలం పదవులని తెలిసీ ఒత్తిడి కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఉద్యోగాల భర్తీ కోసం సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగంలోని 315 ఆర్టికల్ చెబుతోంది. దీనికి చైర్మన్, సభ్యులకు నిర్దిష్ట పదవీ కాలాన్ని ఇచ్చింది. ఏపీపీఎస్సీ కూడా అలా ఏర్పడి, చైర్మన్‌కు మూడేళ్లు, సభ్యులకు ఆరేళ్ల వరకు లేదా 62 ఏళ్ల వయసు వచ్చే వరకు (ఏది ముందు పూర్తయితే అది) ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. ఫైనాన్స్ కమిషన్, సమాచార హక్కు కమిషన్, రెరా, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్లు కూడా రాజ్యాంగబద్ధ సంస్థలే.వీటి కమిషనర్లు/చైర్మన్లు, సభ్యులు ప్రభుత్వాలు మారినా వారికి ఇచ్చిన నిర్దిష్ట కాల పరిమితి మేరకు పని చేయాల్సి ఉంటుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య నియమితులైన ఏపీపీఎస్సీ సభ్యులు జగన్ ప్రభుత్వంలో 2022 వరకు పూర్తి కాలం కొనసాగారు. అంతేగాక వీరు బోర్డులో కీలక బాధ్యతలు సైతం నిర్వర్తించడంతో పాటు 2018 గ్రూప్–1 ఇంటర్వూ్యలు కూడా పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ 2015 నవంబర్ 27 తేదీన నియమితులై 2021 నవంబర్ 26 వరకు పూర్తి కాలం కొనసాగారు. నాడు టీడీపీ ప్రభుత్వం నియమించిన ఆరుగురు సర్వీస్ కమిషన్ సభ్యుల్లో ప్రొఫెసర్ జి.రంగ జనార్ధన మాత్రమే జేఎన్టీయూ వైస్ చాన్సలర్‌గా అవకాశం రావడంతో సభ్యుడిగా రాజీనామా చేశారు. అయినప్పటికీ ప్రొఫెసర్ రంగ జనార్ధన దాదాపు నాలుగేళ్ల నాలుగు నెలల ఐదు రోజుల పాటు కొనసాగారు. మిగిలిన ఐదుగురు సభ్యులు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏనాడూ సభ్యులను రాజీనామా చేయాలని గానీ, వారికి ప్రాధాన్యం తగ్గించడం గానీ చేయలేదు. గత టీడీపీ ప్రభుత్వం నియమించిన సభ్యుల్లో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్, సేవారూప, రామరాజు జగన్ ప్రభుత్వంలోనూ కొనసాగారు. వీరిలో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్ ఇద్దరూ 2018 గ్రూప్–1 అభ్యర్థులకు 2022లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ఇంటర్వూ్యలకు రెండు బోర్డుల్లో చైర్మన్లుగా వ్యవహరించారు. ప్రొఫెసర్ పద్మరాజు సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆరేళ్ల కాలాన్ని పూర్తి చేసిన అనంతరం నన్నయ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా నియమించి జగన్ ప్రభుత్వంప్రతిభకు పట్టం కట్టింది. అలాగే అందరు సభ్యులు, చైర్మన్ ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ కూడా రాజ్యాంగం కల్పించిన çపదవీ కాలం పూర్తి చేసుకుని వైదొలిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా ఆయా సభ్యులు పదవీ కాలం పూర్తయిన తర్వాతే వివిధ సామాజిక వర్గాల నుంచి అర్హతలున్న వారు, సమర్థతతో పనిచేసే వారిని, నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వారిని ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమించింది. కానీ ఇప్పుడు ఐఏఎస్ అధికారి పోలా భాస్కర్.. చంద్రబాబు ప్రభుత్వం తరఫున వకాలత్ పుచ్చుకుని సభ్యులను తప్పించేందుకు యత్నిస్తుండటం గమనార్హం.తప్పుడు కేసులకు రంగం సిద్ధంప్రస్తుతమున్న ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు మొత్తం 9 మందిని ఎలాగైనా పదవుల్లో నుంచి తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. అవసరమైతే వారిపై ఏదో ఒక కేసు బనాయించాలని చూస్తున్నట్టు తెలిసింది. గ్రూప్–2 మెయిన్స్ కొద్ది రోజులు వాయిదా వేయాల్సిందిగా ఇటీవల ఓ మంత్రిని కలిసి నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇప్పుడున్న సర్వీస్ కమిషన్ సభ్యులను తప్పించి పోస్టులను భర్తీ చేస్తామని సదరు మంత్రి సమాధానమిచ్చారు.అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నామని, అవసరమైతే వారిపై ఏదో ఒక కేసు పెట్టి తప్పిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఏపీపీఎస్సీ సభ్యుల కుటుంబ వివరాలు, ఆస్తుల వివరాలు సేకరించినట్టు సమాచారం. ప్రస్తుత ప్రభుత్వం రాజకీయం గా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందనడానికి పోలా భాస్కర్ ఒత్తిడి, సభ్యుల కుటుంబ వివరాలు సేకరించడమే నిదర్శనంగా కనిపిస్తోంది.ఎన్నికల ప్రధానాధికారి, స.హ చట్టం సభ్యులపై కూడా.. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే ఆ వర్గం నాయకులు, సానుభూతిపరులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. చైర్మన్‌తో పాటు సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. ఇది రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని తెలియక టీడీపీ నాయకులు చేసిన అంశంగా చెప్పుకున్నారు. కానీ చట్టం, రాజ్యాంగంపై పూర్తి అవగాహన ఉన్న కొందరు ఐఏఎస్‌లు సైతం ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని, సమాచార హక్కు చట్టం చైర్మన్, సభ్యులను సైతం రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కనిపిస్తుండటం విడ్డూరం.గత టీడీపీ ప్రభుత్వంలో నియమితులై వివాదాస్పద ఎన్నికల ప్రధానాధికారిగా ముద్రపడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ చివరి వరకు తన పదవిలో కొనసాగారు. తన పదవి చివరి రోజు కూడా ఆయన కమిషన్ కార్యాలయంలోనే మధ్యాహ్న భోజనం చేసి సాయంత్రం వైదొలిగారు. అయితే తాజాగా ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ఐఏఎస్ అధికారి ‘రాజకీయ’ బాధ్యతలు తీసుకోవడం రాష్ట్ర సివిల్ సర్వెంట్స్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అధికారులే అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం చూసూ్తంటే వచ్చే ఐదేళ్లల్లో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని చట్టం తెలిసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే నిరుద్యోగులకు మళ్లీ కష్టాలే!గత టీడీపీ ప్రభుత్వం నియమించిన సర్వీస్ కమిషన్ సభ్యులు పూర్తి పదవీ కాలం అనంతరం తప్పుకోవడంతో ఖాళీ అయిన సభ్యుల స్థానాలను జగన్ ప్రభుత్వం 2019 అక్టోబర్ నుంచి భర్తీ చేయడం ప్రారంభించింది. ఇలా ఇప్పటి వరకు ఎనిమిది మంది సభ్యులను నియమించింది. వీరు పదవీ కాలం ఆరేళ్లు పూర్తి చేసుకుని వైదొలగాలి. ఈ క్రమంలో వచ్చే ఏడాది జూలైలో చైర్మన్, అక్టోబర్‌లో ఇద్దరు సభ్యులు, 2026 మార్చిలో ఒకరు, 2027 ఏప్రిల్, మే నెలల్లో ఇద్దరు సభ్యులు, 2029 జూన్, జూలైలో మరో ఇద్దరు, 2030 ఫిబ్రవరిలో ఒకరు పదవి నుంచి తప్పుకోవాలి. ఇది రాజ్యాంగం వారికి కల్పించిన హక్కు. కానీ సభ్యులందరినీ ఏదోలా తప్పించి, గతంలో మాదిరిగానే టీడీపీ సభ్యులతో నింపేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం సవ్యంగా సాగుతున్న సర్వీస్ కమిషన్ పనితీరు గతంలో మాదిరిగానే గాడి తప్పడంతో పాటు వివిధ ఉద్యోగ పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీ వంటివి నిలిచిపోయే ప్రమాదం ఉంది. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. మెయిన్స్‌కు 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 2–9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ శనివారం తెలిపారు. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో 4,496 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కేవలం 26 రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెల్లడించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన 81 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది డిసెంబర్ 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులకు 3 నెలలు సమయమిచ్చి ప్రిలిమ్స్‌ను మార్చి 17న రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నిర్వహించగా, 91,463 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరికి మరో ఐదున్నర నెలల సమయం ఇచ్చి సెప్టెంబర్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు. నోటిఫికేషన్లో పేర్కొన్న 81 పోస్టులకు అనంతరం మరో 8 పోస్టులను చేర్చడంతో గ్రూప్–1 పోస్టుల సంఖ్య 89కి పెరిగింది. ఇటీవల గ్రూప్–2 ఫలితాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ 1:100 నిష్పత్తిలో 905 పోస్టులకు 92,250 మంది అభ్యర్థులను మెయిన్స్ కోసం ఎంపిక చేసింది. చరిత్రలో ఇంత మంది అభ్యర్థులకు అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. ఫలించని ఎల్లో బ్యాచ్ వ్యూహం మార్చి 17న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు. దీనికోసం రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయించారు. ఈ ప్రయత్నం కూడా ఫలించకపోయేసరికి బాబుకు దిక్కుతోచలేదు. చివరికి 2018 గ్రూప్–1 పోస్టుల భర్తీపై ఎన్నోసార్లు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి, ఓడిపోయిన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన 2018 గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పరీక్షను రద్దు చేయమని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు చెలరేగిపోయారు. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ మీడియాకు స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. గత మూడేళ్లల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను సకాలంలో నిర్వహించి, ముందే ప్రకటించిన షెడ్యూల్ మేరకు పోస్టులను భర్తీ చేసింది. అయినప్పటికీ ఏపీపీఎస్సీ ఇచ్చిన పలు నోటిఫికేషన్లు, పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నమంటూ లేదు. గత ఫిబ్రవరిలో గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పటికే తన బృందంతో కేసులు వేయించి పరీక్షను రద్దు చేయించాలని యత్నించారు. ఆ చిక్కులను అధిగమించి ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. తాజాగా గ్రూప్–1 విషయంలోనూ తన కుట్రలు ఫలించకపోవడంతో బాబు కంగుతిన్నారు. -
AP: గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. మార్చి 27వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ.. రికార్డు స్థాయిలోనే 27 రోజుల్లో ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. గ్రూప్ వన్‌కి మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. కిందటి ఏడాది డిసెంబర్ 08వ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 Group 1 పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 02, 09 తేదీల మధ్య మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ప్రెస్ నోట్లో ఏపీపీఎస్సీ పేర్కొంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి పోస్టుల వివరాలివే.. ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9; ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18; డీఎస్పీ (సివిల్) 26; రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ 6; కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5; జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3; అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2; జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. -
ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
-
గ్రూప్–2 ఫలితాల విడుదల
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన 45 రోజుల రికార్డు వ్యవధిలోనే ఫలితాలను కూడా వెల్లడించింది. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. గత ఏడాది డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ గ్రూప్–2 నోటిఫికేషన్ జారీ చేయగా.. 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముందే ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఫిబ్రవరి 25న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4,04,039 మంది (87.17 శాతం) హాజరయ్యారు. సర్విస్ కమిషన్ గతంలో నిర్వహించిన గ్రూప్–2తో పాటు ఇతర పరీక్షలకు గరిష్టంగా 70 శాతం మాత్రమే హాజరవగా, ఈ ఏడాది ప్రిలిమ్స్‌కు మాత్రం భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావడం గమనార్హం. తొలుత మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్ నిర్ణయించింది. అయితే, నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీకి అందిన విజ్ఞప్తుల మేరకు ఎక్కువ మందికి మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక పోస్టుకు 100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు. ఏపీపీఎస్సీ డిసెంబర్ 7వ తేదీన 897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి 21 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం మరో 8 పోస్టులు నోటిఫికేషన్‌కు కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 905కి పెరిగాయి. పెరిగిన పోస్టుల ఆధారంగా మెయిన్స్‌కు మొత్తం 92,250 మందిని ఎంపిక చేశారు. గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను జూలై 28న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. సర్విస్ కమిషన్ పరీక్షల నిర్వహణలో అనేక సవాళ్లు, ఆటంకాలు ఎదురయ్యాయని, అయినా.. గ్రూప్–2, గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను విజయవంతంగా నిర్వహించామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన పూర్తి సహకారంతో తక్కువ సమయంలోనే గ్రూప్–2 ప్రిలిమ్స్ ఫలితాలను సైతం ప్రకటించామని ఆయన తెలిపారు. 92,250 మందికి మెయిన్స్‌కి చాన్స్ 2018లో నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్ రాసినవారి నుంచి 1:12 నిష్పత్తిలో మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయగా.. ఈసారి ఎక్కవ సంఖ్యలో 92,250 మంది అభ్యర్థులకు మెయిన్స్ రాసే ఛాన్స్ లభించింది. గ్రూప్ పరీక్షలకు 1:100 విధానంలో ఎంపిక చేయడం సర్విస్ కమిషన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, కమిషన్ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్–3 మునిసిపల్ కమిషనర్ పోస్టులు 4, గ్రేడ్–2 సబ్ రిజి్రస్టార్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతో కలిపి 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏఓ), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. కాగా, ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే మెయిన్స్ పరీక్షలో పేపర్–1, పేపర్–2 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్సైట్ http://www.psc.ap.gov.in లో చూడవచ్చు. నిరుద్యోగులకు ఎంతో మేలు గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షను అడ్డుకునేందుకు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవేమీ ఫలించలేదు. ఇంత తక్కువ సమయంలో ఫలితాలను ప్రకటించడం చాలా గొప్ప విషయం. నిరుద్యోగుల పట్ల సీఎంకు చిత్తశుద్ధి ఉంది. చెప్పిన సమయానికి ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు 1:100 నిష్పత్తిలో గ్రూప్–2 మెయిన్స్‌కు ఎంపిక చేయడం అభినందనీయం. చరిత్రలో ఇంతమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించడం ఇదే ప్రథమం. ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – వై.రామచంద్ర, అధ్యక్షుడు, నిరుద్యోగ ఐక్య సమితి -
APPSC Group 2 Prelims Result: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ: గ్రూప్- 2 పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం(ఏప్రిల్10) ప్రకటించింది. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జులై 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలిపింది. 1:100 నిష్పత్తిలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్ 7న గ్రూప్ -2 నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్ధాయిలో ఏడు వారాల్లో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలీను ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్డ్ర వ్యాప్తంగా 899 పోస్టులకి గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 4,04,037 మంది అభ్యర్ధులు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలు రాయగా 92 వేల మంది క్వాలిఫై అయ్యారు. త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించనుంది. ఇదీ చదవండి.. వాలంటీర్లకు గాలం వేయడం నీ తరం కాదు -
బాబు ‘గ్రూప్’ పాలి‘ట్రిక్స్’... ఆ ఉద్యోగులకు ఊరట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2018లో జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు పొంది ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్న 167 మందికి తాత్కాలిక ఊరటనిస్తూ హైకోర్టు ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27వతేదీకి వాయిదా వేసింది. న్యాయ ప్రయోజనాల నిమిత్తం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంటూ న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్–1 మెయిన్స్‌కు సంబంధించి ఏపీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్‌తో ముడిపడిన అన్ని వ్యాజ్యాలను ఈ అప్పీల్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈ నెల 13న తీర్పునిచ్చారు. అలాగే గ్రూప్–1 మెయిన్స్‌లో అర్హత సాధించిన వారి జాబితాను కూడా రద్దు చేశారు. తిరిగి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్‌పై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే ఉద్యోగాలు పొందిన 167 మందికి ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు వెలువరించింది. ఉదయించిన వివాదాలు.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి స్వామికార్యం, స్వకార్యాలు చక్కబెట్టి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. తప్పులను నిలదీసిన వారిపై కేసులు బనాయించి బెదిరించారు. చంద్రబాబు సర్కారు హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన ఉదయ్ భాస్కర్ 2015 నవంబర్ 27 నుంచి 2021 నవంబర్ 26 వరకు పదవిలో కొనసాగారు. ఆ కాలంలో ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, నిర్లక్ష్యంతో సర్వీస్ కమిషన్ నిర్వీర్యమైంది. 2018 గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 62 తప్పులు దొర్లాయని 2019 జూన్‌లో అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించ వద్దని సెప్టెంబర్‌లో హైకోర్టులో రిట్ వేయడంతో స్టే ఇచ్చింది. దీనిపై సర్వీస్ కమిషన్ కోర్టులో వాదనలు వినిపించగా ఐదు తప్పులను సవరించాలని ఆదేశిస్తూ రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి మెయిన్స్ నిర్వహించేందుకు మార్గం ఏర్పడింది. బాబు బృందం మెయిన్స్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడంతో మూడుసార్లు షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది. డిజిటల్ మూల్యాంకనం నాటిదే.. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లను సంప్రదాయ పద్ధతిలో సబ్జెక్టు నిపుణులు మూల్యాంకనం చేయడం రివాజు. ఈ విధానంలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందంటూ నాటి కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదించారు. కమిషన్‌లో చంద్రబాబు నియమించిన అత్యధిక మంది సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ పేపర్లను ఈ విధానంలోనే మూల్యాంకనం చేసి 2021 ఏప్రిల్ 28న ఫలితాలను ప్రకటించారు. అయితే నోటిఫికేషన్లో డిజిటల్ మూల్యాంకనం గురించి పేర్కొనక పోవడంతో ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సంప్రదాయ విధానంలో మరోసారి మూల్యాంకనం చేయాలని 2021 అక్టోబర్ 1న హైకోర్టు ఆదేశించింది. ఉదయ్ భాస్కర్ పదవీ కాలం అదే ఏడాది నవంబర్‌లో ముగియడంతో ఏవీ రమణారెడ్డి ఇన్చార్జి చైర్మన్‌గా 2021 డిసెంబర్ 20న బాధ్యతలు చేపట్టి దాదాపు రెండు నెలలు సేవలందించారు. అనంతరం 2022 ఫిబ్రవరి 19న గౌతమ్ సవాంగ్ చైర్మన్‌గా వచ్చి మార్చిలో సంప్రదాయ మూల్యాంకనం చేశారు. మోడరేషన్‌పై తప్పుడు ప్రచారం సబ్జెక్టు నిపుణులు మాన్యువల్‌గా మూల్యాంకనం చేసినప్పుడు మార్కుల్లో చోటు చేసుకునే వ్యత్యాసాలను సరిచేసేందుకు మోడరేషన్ ప్రక్రియ చేపడతారు. అంటే ఒక ప్రొఫెసర్ దిద్దిన పేపర్లను మరో నిపుణుడికి పంపిస్తారు. రెండుసార్లు చేసిన మూల్యాంకనంలో 15 శాతం మార్కులు తేడా వస్తే మూడోసారి మోడరేషన్ చేస్తారు. అంటే మరో ప్రొఫెసర్‌తో దిద్దిస్తారు. ఈ విధానాన్ని 2016లో చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ పేపర్ల విషయంలోనూ ఇదే జరిగింది. మోడరేషన్ ప్రక్రియ చేపడితే మూడుసార్లు పేపర్లు మూల్యాంకనం చేశారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మెయిన్స్ పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేసిన అనంతరం సర్వీస్ కమిషన్ 1:2 నిష్పత్తిలో 325 మందిని, స్పోర్ట్స్ విభాగంలో మరో 48 మందిని 2022 మేలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది. ‘రిట్లు’.. మొట్టికాయలు మెయిన్స్ పరీక్షలు, ఫలితాలను అడ్డుకునేందుకు బాబు బృందం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంటర్వ్యూలను అడ్డుకోవాలని ఎత్తులు వేశారు. అందుకోసం హైకోర్టు, సుప్రీంకోర్టులోను రిట్లు వేశారు. మాన్యువల్ మూల్యాంకనం, ఇంటర్వ్యూలు రద్దు చేయాలని 2022 జూన్ 13 హైకోర్టులో రిట్ వేయగా సరైన ఆధారాలు లేవని కొట్టివేసింది. దాంతో పదిరోజుల వ్యవధిలో ఇంటర్వ్యూలపై స్టే విధించాలని డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేయగా తిరస్కరించింది. ఈ మధ్యలో ఏపీపీఎస్సీ జూలై 5 నాటికి ఇంటర్వ్యూలు పూర్తి చేసింది. చంద్రబాబు బృందం అదే ఏడాది జూలై 14న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇన్నిసార్లు భంగపడ్డ బాబు బృందం ఇంటర్వ్యూలు రద్దు చేయాలని మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతేడాది ఆగస్టు 21న తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఎనిమిది నెలల తర్వాత 2018న గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలని ఈ ఏడాది మార్చి 13న తీర్పు వెలువరించారు. తెలంగాణ తరహాలోనే గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో ఏపీలోనూ అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో స్క్రీన్‌పై లెక్కలు చెబుతూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేశారు. అయితే సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పుపై సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్‌కు వెళ్లి వాదనలు వినిపించడంతో స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఏడాది మార్చి 17న జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను కూడా నిలిపివేయాలని హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయించిన ఎల్లో బ్యాచ్ తర్వాత పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. 2019 నుంచి 2023 వరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన 78 నోటిఫికేషన్లకు సంబంధించి ఒక్క వివాదం కూడా లేకపోవడం గమనార్హం. మేం కోరకున్నా మొదటి మూల్యాంకనం రద్దు చేశారు.. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు జొన్నలగడ్డ సుధీర్, రవిశంకర్ వాదనలు వినిపిస్తూ సింగిల్ జడ్జి తీర్పులోని కొంత భాగంపై తమకు అభ్యంతరం ఉందన్నారు. మొదటి మూల్యాంకనంపై తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఆ మూల్యాంకనం తాలూకు ఫలితాలను వెల్లడించాలని మాత్రమే కోరామన్నారు. అయితే సింగిల్ జడ్జి మొదటి మూల్యాంకనాన్ని కూడా రద్దు చేశారని నివేదించారు. అందువల్ల తాము సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగులను తదుపరి విచారణ వరకు తొలగించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్లు కోరిన దానికి మించి సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు.. ఏపీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపించారు. పిటిషనర్లు కోరిన దానికి మించి సింగిల్ జడ్జి నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారని నివేదించారు. అడగని వాటిని పరిగణనలోకి తీసుకున్నారని, అభ్యర్థించిన వాటిని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. జడ్జి పరిగణనలోకి తీసుకున్న అంశాలను పిటిషనర్లు అభ్యర్థించలేదన్నారు. తిరిగి మూల్యాంకనం చేపట్టాలన్న సింగిల్ జడ్జి నిమ్మగడ్డ ఆదేశాలు ఎంత మాత్రం సహేతుకం కాదన్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన పిటిషనర్లు ఎవరూ మూల్యాంకనాన్ని సవాల్ చేయలేదని, అయినప్పటికీ సింగిల్ జడ్జి మూల్యాంకనాన్ని తప్పుపట్టి మొత్తం పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. సింగిల్ జడ్జి ముందు పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లు సైతం ఆ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీళ్లు దాఖలు చేయడం ఆసక్తికరమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గ్రూప్–1 మెయిన్స్, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించి పోస్టులు పొందిన 167 మంది ఇప్పటికే సర్వీసులో కొనసాగుతున్నారని, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు వల్ల వారిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని నివేదించారు. -
ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..!
-
గ్రూప్ 1 మైన్స్ సింగల్ బెంచ్ తీర్పు పై హై కోర్ట్ స్టే
-
2018 గ్రూప్-1 మెయిన్స్‌పై రాజకీయ విమర్శలా? : గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: 2018 మెయిన్స్ పరీక్ష రద్దుపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. సర్వీస్ కమిషన్, ప్రభుత్వంపైనా రాజకీయ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అసలు రాజకీయ విమర్శలకు కమిషన్ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా జరిగిందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. మెయిన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలను పకడ్బందీగా ఒకేసారి మాన్యువల్ వ్యాల్యువేషన్ చేశామని, రెండోసారి జరగలేదని స్పష్టం చేశారు. 162 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు 55 రోజులు క్యాంపులో కూర్చుని వ్యాల్యువేషన్ చేశారన్నారు. వ్యాల్యువేషన్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపారు. నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలూ ఎపీపీఎస్సీ వద్ద ఉన్నాయని చెప్పారు. నియామకాల్లో ఏపీపీఎస్సీ చాలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉద్యోగాలు చేస్తున్న 162 ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అప్పీల్ దాఖలు చేశారు. 2019 నుంచి ఇప్పటి దాకా కమిషన్ ఒక్క తప్పు లేకుండా పూర్తి పారదర్శకతతో వేలాది పోస్టులు భర్తీ చేసిందని పేర్కొన్నారు గౌతమ్ సవాంగ్. 2018 గ్రూప్-1 పోస్టుల భర్తీలోనూ అంతే పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాయని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల్లో 14 మంది ఐఏఎస్‌కు ఎంపికవ్వడమే అందుకు నిదర్శనమని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాదరహితంగా భర్తీ చేసిందని తెలిపారు. బాబు హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను సీఎం జగన్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్-1, గ్రూప్-2 వంటి గెజిటెడ్ పోస్టులతోపాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టులకు నియామకాలు జరిగాయని తెలిపారు. నాడే పడిన వివాదాల బీజం 2018లో బాబు హయాంలో గ్రూప్-1 విషయంలో వివాదాలు తలెత్తిన్నట్లు గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. 2018 మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పేపర్లో దాదాపు 62 తప్పులు దొర్లాయని చెప్పారు. వీటికి నాటి చంద్రబాబు ప్రభుత్వంగానీ, నాటి సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్గానీ సమాధానం చెప్పలేదని ప్రస్తావించారు. గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను సంప్రదాయ పద్ధతిలో సబ్జెక్టు నిపుణులు మూల్యాంకనం చేయడం ఎప్పటి నుంచో ఉండగా..డిజిటల్ మూల్యంకనం ప్రతిపాదన నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్‌దేనని అన్నారు. సంప్రదాయ పద్ధతి విధానంలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉదయ్ భాస్కర్ డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదన చేయగా, నాటి కమిషన్‌లోని సభ్యులు కూడా ఆమోదం తెలిపి కొత్త ప్రభుత్వం ముందుంచారని చెప్పుకొచ్చారు. అనంతరం దీనిపై జాతీయ స్థాయి సదస్సును విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేయగా అందుకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందని తెలిపారు. మెయిన్స్ పేపర్లను ఈ విధానంలోనే మూల్యాంకనం చేయాలని చూడగా.. నోటిఫికేషన్లో చెప్పని కారణంగా కోర్టు ద్వారా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. దీంతో సంప్రదాయ విధానంలోనే పేపర్లను మూల్యాంకనం చేశారన్నారు. ‘2018 గ్రూప్-1 ఇంటర్వ్యూలకు 325 మంది ఎంపిక అయ్యారు. ఇందులో ఐఐటీ నుంచి 19 మంది, ఐఐఎం నుంచి 7, ఎన్ఐటీ నుంచి 17, బిట్స్ పిలానీ నుంచి 2, ట్రిపుల్ ఐటీల నుంచి 13 మంది ఉన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ చేసినవారు 177 మంది, సాధారణ పీజీ 51, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు. ఇక ఇంటర్వ్యూకు ఎంపికైన వారిలో 40 మంది సివిల్స్ రాయగా.. వీరిలో 14 మంది అదే ఏడాది ఐఏఎస్ సాధించగా, ఇద్దరు కేంద్ర సర్వీసుకు ఎంపికయ్యారు. మరో 24 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 163 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నారు. వీరంతా 2018 గ్రూప్-1 కంటే ముందే పలు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నవారు. వీరంతా మెయిన్స్‌లో ప్రతిభ చూపిన తర్వాతే ఇంటర్వ్యూని ఎదుర్కొన్నారు. సివిల్స్ ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుని చదివినవారికి గ్రూప్-1లో గెలవడం లెక్కకాదు’ అని తెలిపారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశాంతం
సాక్షి, అమరావతి/ఒంగోలు అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 18 జిల్లాల్లో ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్విస్ కమిషన్ తెలిపింది. సెల్‌ఫోన్‌తో పట్టుబడిన అభ్యర్థి గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌తో ప్రశ్నపత్రాన్ని ఫొటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. స్థానిక క్విస్ కాలేజిలోని 121701 వెన్యూకోడ్‌లో హాల్ టికెట్ నంబర్ 121100538 ఉన్న ఒక అభ్యర్ధి ఐఫోన్‌తో ప్రశ్న పత్రాన్ని ఫొటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఫోన్ తీసుకునేందుకు ఇన్విజిలేటర్ ప్రయత్నించగా ఆ అభ్యర్థి వాదనకు దిగాడు. దీంతో చీఫ్ సూపరింటెండెంట్‌కు తెలపగా ఆయన వచ్చి ఫోన్ తీసుకునేందుకు ప్రయ తి్నంచడంతో కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. అదే సమయానికి పరీక్ష కేంద్రాల తనిఖీకి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ వచ్చారు. దీంతో ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను సేకరించారు. పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న విద్యార్థులు -
AP: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్–1 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇక, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించామని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులు ఉంటారన్నారు. అలాగే పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్చార్జిగా నియమించామని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులకు సూచించారు. పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లు, ఇతర సామగ్రిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
ఏపీలో రేపే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
సాక్షి, విజయవాడ: ఏపీలో రేపు గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. రాష్డ్ర వ్యాప్తంగా 89 పోస్టులకి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా, ఈ పరీక్షకు 1,48,881 మంది అభ్యర్ధుల దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లగా గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-1 ప్రిలిమనరీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో 301 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ -1 జనరల్ స్టడీస్ పరీక్ష, ఉదయం 9.45 గంటల వరకు అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ -2 జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్షకి 18 జిల్లాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమారాలతో పర్యవేక్షించనున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్ష పర్యవేక్షణకు 18 మంది ఐఏఎస్‌లను నియమించారు. జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలని అభ్యర్ధులకు ఎపీపీఎస్సీ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమనరీ నిర్వహణకు 301 మంది లైజనింగ్ అధికార్లు, 6612 మంది ఇన్విజలేటర్లు నియమించారు. ఏపీపీఎస్సీ నుంచి 39 మందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇదీ చదవండి: ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే.. -
2018 గ్రూప్–1 మెయిన్స్ రద్దు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2018లో నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష మాన్యువల్ మూల్యాంకనాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని తేల్చింది. అందువల్ల గ్రూప్ –1 మెయిన్స్ పరీక్ష మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. నిబంధనల ప్రకారమే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలని చెప్పింది. పరీక్ష నిర్వహణకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. 2022 మే 26న ఏపీపీఎస్సీ ప్రకటించిన అర్హుల జాబితాను కూడా రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం తీర్పు వెలువరించారు. ‘పబ్లిక్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా ఉండాలి. పోస్టుల భర్తీ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడంపైనే అభ్యర్థుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. పరీక్షల నిర్వహణ ప్రక్రియ ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఒకసారికి మించి మాన్యువల్ మూల్యాంకనం చేసేందుకు నిబంధనలు అనుమతించకపోయినప్పటికీ, అధికారులు రెండుసార్లు మాన్యువల్ మూల్యాంకనం చేశారు. మరికొన్ని పత్రాలను మూడోసారి కూడా మూల్యాంకనం చేశారు. ఇది చట్ట విరుద్ధం. రెండు, మూడోసారి చేసిన మూల్యాంకనం మొత్తం మూల్యాంకనంపైనే అనుమానాలు రేకెత్తించింది. ఇలాంటప్పుడు అర్హులైన అభ్యర్థులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. అనర్హులు లబ్ధి పొందే అవకాశం ఉంది. కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే, పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని పిటిషనర్లు నిరూపించగలిగారు. మూల్యాంకనంలో నిష్పాక్షికతను కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారు. మూడుసార్లు జరిపిన మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడి ఎవరు లబ్ధి పొందారన్న విషయాన్ని గుర్తించడం సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల మొత్తం పరీక్షనే రద్దు చేయడం ఉత్తమం’ అని జస్టిస్ నిమ్మగడ్డ తన 85 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే పోస్టింగులు తీసుకున్న అభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో మిగిలిన అభ్యర్థులతో సమానంగా ఎలాంటి హక్కులూ కోరబోమంటూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మూల్యాంకనంలో అక్రమాలంటూ పిటిషన్లు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, అందువల్ల పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ తరువాత డిజిటల్ మూల్యాంకనంపైనా పిటిషన్లు దాఖలు చేశారు. పలు సందర్భాల్లో వీటిపై హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇంటర్వ్యూలకు, ఎంపిక ప్రక్రియకు అనుమతినిచ్చింది. అయితే వారి నియామకాలన్నీ కూడా అంతిమంగా సింగిల్ జడ్జి ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అనంతరం సింగిల్ జడ్జి అన్ని వ్యాజ్యాలపై తుది విచారణ జరిపారు. ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్నారు. బుధవారం తీర్పు వెలువరించారు. మూల్యాంకనం విషయంలో పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అక్రమాలు రుజువైనందున మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. -
2018 గ్రూప్-1 రద్దు తీర్పు.. ఆందోళన వద్దన్న ఏపీ ప్రభుత్వం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మెయిన్స్‌ను మళ్లీ ఆరు నెలల్లోపు నిర్వహించాలంటూ బోర్డుకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. 2018లో 167 పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ. అయితే.. డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ హైకోర్టుని అశ్రయించిన కొందరు అభ్యర్ధులు. అయితే తాము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని ఎపీపీఎస్సీ వాదించింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనల అనంతరం.. మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సిందేనని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలిచ్చారు అయితే హైకోర్టు తీర్పుపై గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని అంటోంది. ఈ క్రమంలో.. ఈ సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించింది. -
నిరుద్యోగులకు మరో శుభవార్త
-
ఏపీ: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్
సాక్షి, విజయవాడ: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ అందించింది. నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు, అయిదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు, నాలుగు ఫిషరీస్ డెవలప్మెంట్ అధిరారి పోస్టులకు, మూడు ఎలక్ట్రికల్ ఎన్స్పెక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు ►37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్...ఏప్రియల్ 15 నుంచి మే 5 వరకు ధరఖాస్తుల స్వీకరణ. ►అయిదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్...ఏప్రియల్ 18 నుంచి మే 8 వరకు ధరఖాస్తుల స్వీకరణ. ►నాలుగు ఫిషరీష్ డెవలప్మెంట్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్.. ఏప్రియల్ 23 నుంచి మే 13 వరకు ధరఖాస్తులకు అవకాశం. ►మూడు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. మార్చ్ 21 నుంచి ఏప్రియల్ 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ. చదవండి: యువతరానికి దిక్సూచి ‘భవిత’ -
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ కీ విడుదల
సాక్షి, గుంటూరు: ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. గ్రూప్-2 కింద 897 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్ర వ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 4,04,037 (87.17%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక ప్రాథమిక కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని సూచించింది. పోస్టు/వాట్సప్/ఎస్ఎంఎస్/ఫోన్/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది. స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను ఐదు నుంచి ఎనిమిది వారాల్లో ప్రకటించే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్ -2 మెయిన్ పరీక్షను జూన్/జులైలో నిర్వహించే అవకాశం ఉంది. -
AP: రేపు గ్రూప్-2 ప్రిలిమనరీ పరీక్ష
విజయవాడ: ఏపీలో రేపు(ఆదివారం) జరుగనున్న గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్-2 పరీక్షలు జరుగుతుండగా, 4, 83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,327 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఉదయం గం. 10.30ని.ల నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ గ్రూప్-2 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించనున్నారు.. గ్రూప్ 2 ప్రిలిమనరీ పరీక్షకి అన్ని జిల్లాలలో ఏర్పాట్లు చేశారు. 24 మంది జిల్లా కలెక్టర్లకి గ్రూప్ 2 ప్రిలిమనరీ పరీక్ష పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారుల్ని ఈ నియమించారు. 24 వేల మంది ఇన్విజిలేటర్లు, 8,500మందిని కూడా నియమించారు. ఇక ఏపీపీఎస్సీ నుంచి 51 మందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గ్రూప్-2 పరీక్షల ఏర్పాట్లపై ఈరోజు(శనివారం) కలెక్టర్లతో సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. -
అప్పటి సర్వీస్ కమిషన్ కాదు బాసూ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌సర్వీస్ కమిషన్.. ఒకప్పుడు చంద్రబాబు సేవలో తరించిన ఈ సంస్థ.. ఇప్పుడు నిరుద్యోగుల సేవలో లీనమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంస్థను పూర్తిగా ప్రక్షాళన జరిపి, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే కేంద్రంగా మలిచారు. ఇది గత నాలుగున్నరేళ్లల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేసింది. అంతేకాకుండా సచివాలయాల్లో ఒకేసారి 1.21 లక్షల మందిని నియమించి రికార్డు సృష్టించింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్–1, గ్రూప్–2 వంటి గెజిటెడ్ పోస్టులతో పాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టులకు నియామకాలు పూర్తి చేశారు. ఒక్క కోర్టు కేసు లేదు.. ఒక్క విమర్శా లేదు.. ఒక్క ఫిర్యాదూ లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదకలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడే పచ్చ మీడియా బాసు రామోజీకి కాలేది. ‘ఏ వివాదం లేకుండా, ఉద్యోగాలెలా ఇచ్చేస్తారు? అసలు వివాదాలు పెట్టేదే ఉద్యోగాలు ఎగ్గొట్టడానికి కదా. చంద్రబాబు హయాంలో అంతా ఇలానే జరిగింది కదా! ఇప్పుడంతా సక్రమంగా జరగడమేంటి’ అంటూ లోలోన మండిపోయి.. ఏపీపీఎస్సీపై ఓ బండ వేయాలని చూశారు. చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీలో చైర్మన్, సభ్యుల నియామకాల్లో జరిగిన ఆశ్రిత పక్షపాతం, అవకతవకలను వదిలేసి, ఇప్పుడు కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలన్నీ రాజ్యాంగబద్ధంగా జరిగినప్పటికీ, ‘‘ఏపీపీఎస్సీనా? వైసీపీఎస్సీనా?’’ అంటూ ఈనాడు పత్రికలో విషం కక్కారు. కమిషన్‌ను కమీషన్లతో నింపేసిన బాబు చంద్రబాబు సీఎంగా ఉండగా ఏపీపీఎస్సీని తన అభిమానులు, తనకు సేవ చేసే వారితో నింపేశారు. ఆయన హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది, నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేదీ తెలియని పరిస్థితి. ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ పైనా అనేక వివాదాలు.. కోర్టు కేసులు వంటి కారణాలతో నిలిచిపోవడమో లేక పరీక్షలు రద్దు కావడమో జరిగేవి. 2014–18 మధ్య ఇచ్చిన నోటిఫికేషను వేళ్లపై లెక్కించేవే అయినా దాదాపు 350కి పైగా కేసులు పడ్డాయి. అసలు సభ్యుల నియామకమే కమీషన్లపై జరిగిందని ఆ పార్టీలోని ముఖ్య నేతలే విమర్శించారు. 2014 ఎన్నికలకు ఎన్నారైల నుంచి నిధులు సేకరించినందుకు ఉదయ్ భాస్కర్‌కు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టారన్న విమర్శలు ఉండేవి. సభ్యుల విషయానికి వస్తే నాటి ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె గుర్రం సుజాత, తాడికొండలో టీడీపీ అభిమాని విజయకుమార్, నాటి హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సిఫారసుతో పద్మరాజును నియమించారు. చంద్రబాబు ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాటి ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్ర తన శిష్యుడు రామరాజుకు సభ్యుడిగా పదవి ఇప్పించారు. మరో సభ్యుడు రంగ జనార్థన్ కూడా ఇలా వచ్చినవారే. వీరికి పదవులు ఇచ్చే ముందే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగి భాస్కర్ నాయుడు తిరుపతిలో వీరితో వేర్వేరుగా సమావేశమై, తాము చెప్పినట్టు వింటేనే పదవులు ఉంటాయని హెచ్చరించిన విషయం ఎల్లో మీడియా కప్పిపుచ్చినా బయటకు వచ్చేసింది. ♦ 2016లో నోటిఫికేషన్ ఇచ్చి, 2017 జూలైలో నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను ఎంత వివాదాలతో నింపేశారో ప్రతి నిరుద్యోగికీ తెలుసు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగాల్సిన పరీక్షను వారికి అవసరమైన వారికోసం విశాఖపట్నం గీతం కాలేజీ, మరికొన్ని చోట్ల సాయంత్రం 5 నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్వహించి వేల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. కొన్ని ప్రశ్నలు ఉద్దేశపూర్వకంగా బయటకు వెల్లడించగా.. ఇవన్నీ గీతం కాలేజీ కేంద్రంగానే జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ♦ అధికార పార్టీ పెద్దలతో సాన్నిహిత్యమున్న కొన్ని కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఏపీపీఎస్సీలో తిష్టవేసి ఇష్టారీతిన వ్యవహారాలు నడిపించాయి. తమ వద్ద చదివిన వారు ఒకే కేంద్రంలో వరుసగా వచ్చేలా ఏర్పాట్లు చేయించుకొని మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాల స్క్రీన్షాట్లు ఏకంగా వాట్సప్‌లలో ప్రత్యక్షమయ్యాయి. ♦ కమిషన్‌లో మెజారిటీ సభ్యుల ఆమోదంతో తీసుసుకోవాల్సిన నిర్ణయాలను నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఒక్కరే తీసుకుని వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ♦ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంది. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకుండా 2017లో జీవో నం.55 విడుదల చేసి, డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ‘మైనస్ మార్కు’లను అమల్లోకి తెచ్చింది. దాంతో అంతకుముందు ఏటా సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులైతే.. జీవో నం.55 వచ్చాక ఆ సంఖ్య 4 నుంచి 6 శాతం మించలేదు. కొన్ని విభాగాల్లో ఒక్క శాతం కూడా పాసవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జీవోతో దాదాపు ఉద్యోగులు మూడేళ్లపాటు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కోల్పోయారు. ♦ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్లో 32 నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఇప్పుడు నిబద్ధతతో పనిచేసే వారికే సభ్యులుగా అవకాశం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. అన్ని అర్హతలున్నవారు, సమర్థతతో పనిచేసే వారు, నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వారిని సభ్యులుగా నియమించింది. దాంతో గత నాలుగేళ్లల్లో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 పోస్టులను సకాలంలో భర్తీ చేసింది. ‘సచివాలయ’ వ్యవస్థలో ఒకేసారి 1.21 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే బాధ్యతను కూడా కమిషన్ విజయవంతంగా నిర్వర్తించింది. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశచరిత్రలోనే లేదు. గత డిసెంబర్లో 899 గ్రూప్–2 పోస్టులతో పాటు గ్రూప్–1, పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు వంటి దాదాపు 1,446 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈనెల 25న జరిగే గ్రూప్–2 పరీక్షకు ఎల్లో మీడియా, టీడీపీ కలిసి ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ, సర్వీస్ కమిషన్ సమర్థంగా అధిగమించి ముందుకెళుతోంది. 2019–23 మధ్య ఏపీపీఎస్సీ నిర్వహించిన 78 నోటిఫికేషన్లలో ఒక్కటి కూడా వాయిదా పడలేదు. నిరుద్యోగుల నుంచి ఒక్క కేసు నమోదైందీ లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రశంసలూ పొందింది. అయినా, వాస్తవాలన్నింటినీ కప్పిపుచ్చి ఎల్లో బాసు రామోజీ మాత్రం అక్రమాలంటూ అభాండాలు వేస్తున్నారు. -
ఏపీలో యధావిధిగా గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష
-
25నే గ్రూప్–2 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: ఒకే రోజు గ్రూప్–2 ప్రిలిమ్స్, ఎస్బీఐ పరీక్షలు ఉన్నాయని.. ఈ రెండింటికి దరఖాస్తు చేసినవారు ఉన్నారని.. ఈ నేపథ్యంలో గ్రూప్–2 పరీక్ష వాయిదా వేయించాలని కుయుక్తులు పన్నిన ఎల్లో బ్యాచ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్–2 పరీక్ష జరిగే ఈ నెల 25న ఎస్బీఐ పరీక్ష కూడా రాస్తున్నవారు కేవలం 550 మందే ఉన్నారని తేలింది. ఈ 550 మందికి మార్చి 4న పరీక్ష నిర్వహిస్తామని ఎస్బీఐ తెలిపింది. దీంతో యధావిధిగా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. గ్రూప్– 2 పరీక్షను ఈ నెల 25న నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కోసం 1,327 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 4.30 లక్షల మంది హాల్‌టికెట్లను కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. 4.83 లక్షల మంది శ్రమను వృథా చేయాలని.. దాదాపు 4.83 లక్షల మంది గ్రూప్–2 అభ్యర్థుల శ్రమను వృథా చేయాలని ఎల్లో బ్యాచ్ కుట్ర పన్నింది. గ్రూప్–2 ప్రిలిమ్స్ రోజే ఎస్బీఐ జూనియర్ అసోíÜయేట్ పరీక్ష కూడా ఉందని.. ఇలాంటి వారు 10 వేల మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. వీరికి నష్టం కలగకుండా గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కానీ లక్షల మంది గ్రూప్స్ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఏపీపీఎస్సీ.. ఎస్బీఐ బ్యాంకు ఉన్నతాధికారులను సంప్రదించింది. ఈ నెల 25న పరీక్ష స్లాట్ కేటాయించిన ఎస్బీఐ అభ్యర్థులకు మరోరోజు అవకాశం ఇవ్వాలని విన్నవించింది. దీంతో ఎస్బీఐ అధికారులు గ్రూప్–2, ఎస్బీఐ రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను తమకు పంపించాలని ఏపీపీఎస్సీని కోరారు. దీంతో ఏపీపీఎస్సీ ఈనెల 19 వరకు రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను సేకరించగా మొత్తం 550 మంది ఉన్నట్టు తేలింది. దీంతో వీరికి మార్చి 4న పరీక్ష నిర్వహిస్తామని ఎస్బీఐ తెలిపింది. ఈ అభ్యర్థులు 23వ తేదీ ఉదయం 9 గంటల్లోగా https://ibpsonline.ibps.in /sbijaoct23/ లో పరీక్ష తేదీ మార్పుకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో ఏదో ఒక సాకుతో గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయించాలనుకున్న ఎల్లో బ్యాచ్ ఎత్తుగడ బెడిసికొట్టింది. వాయిదాలు లేకుండా 31 నోటిఫికేషన్లు పూర్తి గత టీడీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ నుంచి ఇచ్చిన నోటిఫికేషన్లు అరకొరే. వాటి పరీక్షలు కూడా ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉండేది. ఏళ్ల తరబడి అభ్యర్థుల భావోద్వేగాలతో టీడీపీ ప్రభుత్వం ఆడుకుంది. ఒకే రోజు రెండు పరీక్షలు వచ్చినప్పుడు సమస్యను అధిగవిుంచడంపై దృష్టి పెట్టకుండా ‘వాయిదా’ నిర్ణయం తీసుకునేవారు. దీంతో గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షలకు సిద్ధమయ్యే ఎంతోమంది నష్టపోయేవారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019 జూన్ నుంచి 2023 మధ్య ఏపీపీఎస్సీ 31 నోటిఫికేషన్లను నేరుగా జారీ చేసింది. నోటిఫికేషన్ ఇచ్చే ముందే వివాదాలు, ఇతర పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుంది. ఈ నాలుగేళ్లల్లో ఒక్క కోర్టు వివాదం లేకుండా, ఒక్క నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా దాదాపు 6,300 పోస్టులను భర్తీ చేసింది. అంతేకాకుండా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ పరీక్షలను సైతం ఏపీపీఎస్సీనే విజయవంతంగా నిర్వహించింది. తద్వారా ఒకేసారి 1.34 లక్షల మందికి మేలు చేసింది. గతేడాది డిసెంబర్లో గ్రూప్–1, గ్రూప్–2, పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్‌తో పాటు 11 నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. మరో వారం రోజుల్లో ఇంకో 5 నోటిఫికేషన్లు జారీ చేయనుంది. -
ఏపీపీఎస్సీ.. మరో ఐదు
సాక్షి, అమరావతి: నిరుద్యోగ యువతకు శుభవార్త! ఇప్పటికే గ్రూప్– 1, 2 పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఏపీపీఎస్సీ త్వరలో అటవీ శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో ఈమేరకు వివిధ కేటగిరీల్లో 861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. ఒకవైపు గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం. వీటిలో 37 ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదార్లు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, మరో 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలిపి 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఇవి కాకుండా ఎఫ్ఎస్ఓ, బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లాంటి మరో 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌తో పాటు పరీక్షల షెడ్యూల్‌ను కమిషన్ త్వరలో ప్రకటించనుంది. ఇవే కాకుండా విద్యుత్తు శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, మత్స్యశాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టు, ఏపీ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. గ్రూప్–2 హాల్ టికెట్ల విడుదల గ్రూప్–2 ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) పరీక్షకు సంబంధించి హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఒక్క రోజులోనే 2 లక్షల మందికిపైగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈనెల 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏపీపీఎస్సీ 24 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేసింది. గ్రూప్–2లో మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
డిగ్రీ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ షురూ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 11 సబ్జెక్టుల్లో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డిసెంబర్ 30న సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సబ్జెక్టుల వారీగా పోస్టులు, వేతనం, రిజర్వేషన్, విద్యార్హతలు వంటి పూర్తి వివరాలతో కూడిన సమాచారం సర్వీస్ కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.inలో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. -
గ్రూప్–2 పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ.. దరఖాస్తు గడువును మరో వారం రోజల పాటు పొడిగించింది. వాస్తవానికి బుధవారంతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ తెలిపారు. ప్రిలిమ్స్ నిర్వహణ తేదీలో మార్పు లేదని, ఫిబ్రవరి 25నే పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.inలో చూడవచ్చని పేర్కొన్నారు. చదవండి: Group 2 Preparation Plan: గ్రూప్–2పై గురిపెట్టండిలా! -
డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్–2, గ్రూప్–1, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ.. తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 11 సబ్జెక్టుల్లో 240 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా పోస్టులు, విద్యార్హతలు, వేతనం, పరీక్ష విధానం తదితర వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో జనవరి 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్–1) 150 మార్కులకు డిగ్రీ స్థాయిలో ఉంటుంది. పేపర్–2 సంబంధిత సబ్జెక్టు పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి మైనస్ మార్కులు ఉంటాయని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల సబ్జెక్టు సిలబస్ https://psc.ap.gov.inలో చూడవచ్చు. -
నిరుద్యోగులకు ఏపీపీ ఎస్సీ మరో గుడ్ న్యూస్
-
నిరుద్యోగులకు మరో శుభవార్త
సాక్షి, అమరావతి: ఇప్పటికే 897 పోస్టులతో గ్రూప్–2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్–1 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 81 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. గురువారం గ్రూప్–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మరో నోటిఫికేషన్ విడుదల అవ్వడం పట్ల ఉద్యోగార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్–1 అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ పేర్కొంది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది. డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్స్ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు సైతం ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహించనున్నారు. మొత్తం పోస్టులు, వేతనం, అర్హతలతో కూడిన పూర్తి సమాచారం కమిషన్ వెబ్సైట్ https://psc. ap.gov.in లో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. కాగా, ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతినిచ్చిన మరికొన్ని పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివాదరహితంగా పోస్టుల భర్తీ గతంలో ఉండే అనేక న్యాయపరమైన వివాదాలను, చిక్కులను పరిష్కరించి ప్రభుత్వం సర్వీస్ కమిషన్‌లో సంస్కరణలు తీసుకొచ్చింది. దాంతో గతేడాది ఏపీపీఎస్సీ ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి వివాదాలకు తావులేకుండా 11 నెలల కాలంలో పూర్తి పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసింది. గ్రూప్–1 పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక సమర్థవంతంగా నిర్వహించి, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి ఎంపిక చేశారు. ఈ నియామకాలు అతి తక్కువ సమయంలోనే కమిషన్ పూర్తి చేసింది. ఇదే తరహాలో ఇప్పుడు ప్రకటించిన నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులు సైతం సమర్థవంతంగా, సత్వరం భర్తీ చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. -
గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
-
AP: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 81 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. గురువారం 897 గ్రూప్–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సర్వీస్ కమిషన్ తాజాగా గ్రూప్–1 పోస్టులకుసైతం నోటిఫికేషన్జారీ చేసింది. అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది. డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్స్ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు సైతం ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహించనున్నారు. మొత్తం పోస్టులు, వేతనం, అర్హతలతో కూడిన పూర్తి సమాచారం కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.inలో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. కాగా, ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతినిచ్చిన మరికొన్ని పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివాదరహితంగా పోస్టుల భర్తీ గతంలో ఉండే అనేక న్యాయపరమైన వివాదాలను, చిక్కులను పరిష్కరించి ప్రభుత్వం సర్వీస్ కమిషన్‌లో సంస్కరణలు తీసుకొచ్చింది. దాంతో గతేడాది ఏపీపీఎస్సీ ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి వివాదాలకు తావులేకుండా 11 నెలల కాలంలో పూర్తి పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసింది. గ్రూప్–1 పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక సమర్థవంతంగా నిర్వహించి, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి ఎంపిక చేశారు. ఈ నియామకాలు అతి తక్కువ సమయంలోనే కమిషన్ పూర్తి చేసింది. ఇదే తరహాలో ఇప్పుడు ప్రకటించిన నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులు సైతం సమర్థవంతంగా, సత్వరం భర్తీ చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. -
APPSC : జాబ్స్ పిలుపు.. 897 పోస్టులతో గ్రూప్–2 నోటిఫికేషన్
త్వరలో గ్రూప్–1 నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ త్వరలోనే వంద గ్రూప్–1 పోస్టులతో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్‌తో మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. గతేడాది ఎలాంటి వివాదాలకు తావులేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలల కాలంలోనే పారదర్శకంగా మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. పలు న్యాయపరమైన వివాదాలను అధిగమించి గత నాలుగేళ్లల్లో సంస్కరణలు తెచ్చిన కమిషన్ తాజాగా గ్రూప్–2 పోస్టుల భర్తీని సైతం పారదర్శకంగా, 6 నెలల వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. సాక్షి, అమరావతి: యువత ఉత్కంఠకు తెర దించుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ నెల 21వతేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఫిబ్రవరి 25వతేదీన ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మెయిన్స్ సైతం ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్ లేదా సీబీటీలో నిర్వహించనున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. మే నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి కమిషన్ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ల పోస్టులు 4, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతో పాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏఓ), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియను మే నెల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో కమిషన్ ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసింది. వెబ్సైట్లో సిలబస్ అభ్యర్థుల అభ్యర్థన, సౌలభ్యం మేరకు గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో పేపర్–1, పేపర్–2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. పరీక్ష సిలబస్‌ను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఖాళీలు, వేతనం, వయసు, విద్యార్హతలతో పాటు పూర్తి సమాచారం కోసం కమిషన్ వెబ్సైట్ http://www.psc.ap.gov.inలో చూడవచ్చు. -
AP: గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ‘ఇంగ్లిష్’లో మనమే టాప్! -
ఉద్యోగాలు వచ్చేశాయ్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వీటిల్లో 900 వరకు గ్రూప్–2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్–1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసి 11 నెలల వ్యవధిలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు. గత నాలుగేళ్లల్లో న్యాయపరమైన పలు వివాదాలను అధిగమించి సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థంగా ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. ఇందుకోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీ, హెచ్‌సీయూతో పాటు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లోని నిపుణులతో చర్చించి సిలబస్‌లో సమూల మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై, కమిషన్‌పై తప్పుడు కథనాలను ప్రచురిస్తూ నిరుద్యోగ యువతలో ఆందోళన రేకెత్తించేందుకు ప్రయత్నించటాన్ని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో ఖండించింది. గ్రూప్ 2 విషయంలో ఇప్పటికే దాదాపు 900 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతులు లభించాయని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా జీవో నం.77కు అనుగుణంగా సమాచారం రావడం ఆలస్యమైందని పేర్కొంది. ఈ అంశంపై కసరత్తు దాదాపు పూర్తయిందని, ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కొన్ని పత్రికలు ఉద్దేశపూర్వకంగా సర్వీస్ కమిషన్‌పై తప్పుడు కథనాలను వెలువరిస్తూ నిరుద్యోగులను ఆందోళననకు గురి చేస్తున్నాయని పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్ల జారీపై తప్పుడు వార్తలు ప్రచురించడాన్ని ఖండించింది. సాధారణంగా ఏపీపీఎస్సీ పరిధిలోని నియామకాలకు మాత్రమే ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ వినియోగిస్తామని, శాసనసభ ప్రత్యేక చట్టం ద్వారా కమిషన్ పరిధిలోకి రాని పోస్టుల నియామక బాధ్యతలను తమకు అప్పగించినప్పుడు వాటి భర్తీ ఖర్చును ఆయా శాఖలే భరిస్తాయని తెలిపింది. 2018లో కూడా ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్షల ఖర్చును ఆయా విద్యాసంస్థలే భరించాయని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి పరీక్ష నిర్వహణ ఖర్చు అంచనాలను ఉన్నత విద్యా మండలికి పంపించామని తెలిపింది. ఈ లేఖను వక్రీకరిస్తూ కథనాలు ప్రచురించడం బాధాకరమని, వీటిని నమ్మవద్దని సూచించింది. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు వెల్లడించింది. -
AP: నెలాఖరులో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు
సాక్షి, విజయవాడ: ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్లు ఇస్తామని, గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 గ్రూప్ వన్ ప్రక్రియను రికార్డుస్ధాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ గ్రూప్ వన్ ప్రక్రియ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో రెండు పేపర్ల స్ధానంలో ఒకే పేపర్ ఉంటుందని తెలిపారు. గ్రూప్ వన్ మెయిన్స్ లో అయిదు పేపర్లకు బదులు నాలుగే ఉంటాయన్నారు. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో, రెండు పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయని చెప్పారు. లాంగ్వేజ్ లో రెండు పేపర్లకి బదులు ఒక పేపర్ మాత్రమే ఉంటుందన్నారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. నిరుద్యోగ అభ్యర్ధులకు మేలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లలో పరీక్షలను పరిశీలించిన తర్వాతే మార్పులు చేశామన్నారు. డిసెంబర్ లో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరిపి జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. APPSC Group-1&2 ఉద్యోగాల స్డడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, ప్రీవియస్ పేపర్స్, ఆన్లైన్ టెస్టులు, సక్సెస్ స్టోరీల కోసం క్లిక్ చేయండి -
ఆంధ్రప్రదేశ్‌లో 3220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
-
ఏపీ వర్సిటీల్లో ఖాళీల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో నవశకానికి నాంది పలికింది. విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాలుగా భర్తీకి నోచుకోని అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల్లో నియామకాలకు శ్రీకారం చుట్టింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 18 యూనివర్సిటీల్లో ఏకంగా 3,220 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్ ప్రొఫెసర్, 2,001 అసిస్టెంట్ ప్రొఫెసర్ (రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం 220 లెక్చరర్ పోస్టులతో కలిపి) పోస్టుల నియామకాలను చేపడుతోంది. ఉన్నత విద్యా మండలి ‘ఉమ్మడి పోర్టల్’ ద్వారా మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. అభ్యర్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు మాత్రం ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. గతంలో అయితే ప్రతి వర్సిటీకి ఒక్కో దరఖాస్తు పెట్టుకోవాల్సి వచ్చేది. వీటికే అభ్యర్థులు రూ.వేలు చెల్లించాల్సి వచ్చేది. భవిష్యత్ తరాలకు సైతం యూనివర్సిటీల్లో అత్యుత్తమ బోధన సామర్థ్యాలు అందించేందుకు వీలుగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తోంది. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి పారదర్శకంగా ఎంపికలు చేపట్టనుంది. దరఖాస్తు రుసుము ఇలా.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,500.. ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు (పర్సన్ బెంచ్ మార్క్ విత్ డిజేబిలిటీ) రూ.2 వేలు, ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో టెస్ట్‌లు రా>యాలనుకుంటే మాత్రం విడివిడిగా ఫీజులు చెల్లించాలి. ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు, ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్ పోస్టుకు రూ.150 డాలర్లు/రూ.12,600, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు 100 డాలర్లు/రూ.8,400 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అభ్యర్థుల దరఖాస్తు కోసం జ్టి్టp:// ట్ఛఛిటuజ్టీఝ్ఛn్టట. unజీఠ్ఛిటటజ్టీజ్ఛీట. ్చp. జౌఠి. జీn వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచింది. వర్సిటీల వారీగా అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ తేదీలను దరఖాస్తు పరిశీలన అనంతరం వెల్లడించనుంది. దరఖాస్తులకు గడువు ఇలా.. ఆన్లైన్లో దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు తుది గడువు: 20.11.2023 పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ, ఇతర పత్రాల సమర్పణ గడువు: 27.11.2023 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్‌కు అర్హులు, అనర్హుల ప్రాథమిక జాబితా ప్రదర్శన: 30.11.2023 అభ్యంతరాల స్వీకరణ: 07.12.2023 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ స్క్రీనింగ్ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 08.12.2023 10 మార్కులు వెయిటేజీ ఇలా.. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీ కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే.. కాంట్రాక్ట్ అధ్యాపకుల్లో ఎక్కువ మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్స్ కింద పని చేస్తున్నారు. ప్రస్తుతం చేపట్టే పోస్టుల భర్తీ ప్రక్రియలోకి వీరు రావట్లేదు. ఫలితంగా వారి విధులకు ఎటువంటి ఆటకం ఉండదు. మిగిలిన అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే వారి అనుభవాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. బాబు భర్తీ చేసింది ‘సున్నా’ చంద్రబాబు అధికారంలో ఉన్న మొదటి తొమ్మిదేళ్లూ అంటే 1995 నుంచి 2004 వరకు.. రాష్ట్రం విడిపోయాక 2014 నుంచి 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. ఫలితంగా విశ్వవిద్యాలయాల్లో 71 శాతం అధ్యాపక పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండిపోయాయి. గత ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల తీర్మానంతో పోస్టుల భర్తీ చేపట్టినా నోటిఫికేషన్ ప్రక్రియ గందరగోళాన్ని సృష్టించింది. రోస్టర్ విధానం, హేతుబద్ధీకరణ, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో తమకు నష్టం జరుగుతోందంటూ అనేక మంది అభ్యర్థులు కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. కనీసం కోర్టు కేసులను కూడా పరిష్కరించాలనే ఆలోచన కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయకపోవడం గమనార్హం. ఇక్కడ యూజీసీ నిబంధనలను గాలికొదిలేసి, అనుయాయులకు మేలు చేసేలా అశాస్త్రీయ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేశారు. వర్సిటీలను సంప్రదించకుండా.. వాటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. కొన్నిచోట్ల అవసరానికి మించి ఎక్కువ పోస్టులు చూపించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు పోస్టుల స్థాయి తగ్గించేశారు. యూనివర్సిటీ యూనిట్‌గా కాకుండా సబ్జెక్టుల వారీగా పోస్టులను హేతుబద్ధీకరించడంతో చాలామంది నష్టపోయారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పూర్తిగా విస్మరించారు. బోధనేతర పోస్టులకూ ప్రాధాన్యం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యూనివర్సిటీల పునరుజ్జీవానికి చర్యలు చేపట్టారు. కోర్టు కేసులను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ యుద్ధప్రాతిపదికన పెద్దఎత్తున శాశ్వత పోస్టుల భర్తీని చేపట్టారు. యూనివర్సిటీల్లో పని భారం, కేడర్ నిష్పత్తికి అనుగుణంగా ఫ్యాకల్టీని ప్రభుత్వం హేతుబద్ధీకరించింది. యూనివర్సిటీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం విభాగాల వారీగా పోస్టుల హేతుబద్ధీకరణ చేసింది. ఫలితంగా మొత్తం 18 యూనివర్సిటీల్లో 4,330 పోస్టులొచ్చాయి. వీటిల్లో ఇప్పటికే పని చేస్తున్న అధ్యాపకులు కాకుండా తాజాగా 3,200 మందిని నియమిస్తోంది. ఇక బోధన పోస్టులతోపాటు ప్రతి యూనివర్సిటీలో అకడమిక్ నాన్ వెకేషన్ పోస్టులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసిస్టెంట్ డైరెక్టర్/డిప్యూటీ డైరెక్టర్/ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్, అసిస్టెంట్ లైబ్రేరియన్/డిప్యూటీ లైబ్రేరియన్/వర్సిటీ లైబ్రేరియన్, ప్లేస్మెంట్ ఆఫీసర్, నాక్ గుర్తింపులో కీలక భూమిక పోషించే ఐక్యూఏసీ డైరెక్టర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ పోస్టులను తప్పనిసరి చేసింది. -
APPSC: ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ను ఏపీపీఎస్సీ ఈ ఏడాది రానున్న నోటిఫికేషన్ల నుంచి అమలు చేయనున్నట్లు కమిషన్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ తెలిపారు. గతంలో దివ్యాంగులకు 3 శాతం ఉన్న రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. -
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
-
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిరుద్యోగులకు వీలైనంత మేలు చేయాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనకి అనుగుణంగా గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల అభ్యర్థనకు సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎం జగన్ ఆదేశాలతో అన్ని విభాగాలను మరోసారి ఖాళీల వివరాలని తెప్పించుకున్న జీఎడీ.. పరిశీలన తర్వాత అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. చదవండి: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ సాక్షి తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
APPSC: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: వయసు మీరిన నిరుద్యోగులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నాన్ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచింది. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండు సంవత్సరాలను పెంచింది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: తత్తరపాటు.. బిత్తర చూపులు! -
శాస్త్రీయంగా.. సమర్థంగా..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక విధానాన్ని శాస్త్రీయంగా, మరింత సమర్థంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ తెలిపారు. అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి పూర్తి సమర్థులైన వారిని ఎంపిక చేసేలా కొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరీక్షా విధానాల మార్పునకు సంబంధించి జరుగుతున్న కసరత్తు గురించి వివరించారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవసరమైన మార్పులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులతో ఒక కమిటీ నియమించిందని తెలిపారు. దానికి అనుబంధంగా ఏపీపీఎస్సీలో అంతర్గతంగా తాము రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నియామక విధానాలపై ఏపీపీఎస్సీ సభ్యుడు సలాం బాబు నేతృత్వంలో అపార నైపుణ్యం ఉన్న ఐదుగురితో ఒక కమిటీ, వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్లతో మరో కమిటీ నియమించినట్లు వివరించారు. దీంతోపాటు వివిధ రంగాలకు చెందిన మేధావుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత విధానాలపై అభ్యర్థులు, తల్లిదండ్రులు, సమాజంలోని పలువురి నుంచి రకరకాల అభ్యంతరాలు వస్తున్నాయని, అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వీటన్నింటికి పరిష్కారం చూపేలా సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాము నియమించిన కమిటీలు వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నియామక విధానాలు, ఉత్తమ ప్రాక్టీసులను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తాయని చెప్పారు. ఐఐఎం వంటి అత్యుత్తమ సంస్థల ప్రొఫెసర్ల నుంచి సైతం అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నపత్రాలు ఎలా ఉండాలి? ఎలా రూపొందించాలి? మూల్యాంకనం ఎలా ఉండాలి? ఎలా చేయాలి? ఇతర రాష్ట్రాలు, యూపీఎస్సీ వంటి సంస్థలు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నాయి? అనే అంశాలను వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నట్లు సవాంగ్ వివరించారు. కమిటీలు ఇచ్చిన సిఫారసులు, ప్రజలు, మేధావుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించి మార్పులు చేపడతామని చెప్పారు. మార్పులు ఇలా...! ప్రస్తుతం గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉన్నాయని, దాన్ని ఒక పేపర్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు గౌతం సవాంగ్ తెలిపారు. స్క్రీనింగ్ దశ పరీక్ష కాబట్టి ఒక పేపర్ సరిపోతుందనే అభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. గతం కన్నా సులభంగా ప్రిలిమ్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెయిన్స్‌లో కూడా ఇప్పుడు ఉన్న ఐదు పేపర్లను నాలుగు పేపర్లకు తగ్గించి, అందులో రెండు పేపర్లు వ్యాసరూప ప్రశ్నలు (డిస్క్రిప్టివ్), రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో రూపొందించాలనే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, సిలబస్ మారదని, ఉన్నదాన్నే కొంత రీఫ్రేమ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. సిలబస్ గురించి అభ్యర్థులకు ఎలాంటి అపోహలు, ఆందోళన అవసరం లేదన్నారు. మూల్యాంకన విధానాన్ని మార్చేందుకు అధ్యయనం జరుగుతోందన్నారు. మొత్తంగా నియామక విధానాన్ని సులభంగా, సౌలభ్యంగా మార్చే దిశగా కసరత్తు చేస్తున్నామన్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వారిలో వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీసేలా కొత్త విధానం ఉంటుందన్నారు. గ్రూప్–1 నోటిఫికేషన్ నెల రోజల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. గ్రూప్–2 పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. -
త్వరలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యను అత్యున్నతంగా తీర్చిదిద్ది, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాల పెంపుతో పాటు పలు సంస్కరణలు తెచ్చారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో శాశ్వత పోస్టుల భర్తీకి కూడా సంకల్పించారు. ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా వర్సిటీల్లోని ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్, రెండు అసోసియేట్, నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండేలా ఏకీకృత హేతుబద్ధీకరణ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం 16 వర్సిటీల్లో 3,480 పోస్టులను మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 474 ప్రొఫెసర్, 859 అసోసియేట్ ప్రొఫెసర్, 2,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్సిటీల్లో 2,635 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ల పోస్టుల భర్తీని ఒకే రిక్రూట్మెంట్లో చేపట్టనుంది. ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులతోపాటు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు కూడా వర్సిటీలు ఇంటర్వ్యూలు చేసి, ఎంపిక చేస్తాయి. త్వరలోనే ప్రత్యేక పోర్టల్‌లో వర్సిటీల వారీగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అభ్యర్థులు వాటిని చూసుకొని నచ్చిన వాటికి పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా సమయం ఆదాతో పాటు దరఖాస్తు రుసుము తగ్గుతుంది. వర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీనీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయని చంద్రబాబు చంద్రబాబు పాలనలో ఏనాడూ వర్సిటీలను పట్టించుకోలేదు. ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోగా వర్సిటీల్లో కుల రాజకీయాలను ప్రోత్సహించి భ్రష్టుపట్టించారు. గత ఎన్నికలకు ముందు హడావుడిగా పోస్టుల హేతుబద్ధీకరణకు కమిటీని నియమించారు. యూజీసీ నిబంధనలను గాలికొదిలేసి, అనుయాయులకు మేలు చేసేలా అశాస్త్రీయ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేశారు. వర్సిటీలను సంప్రదించకుండా, వాటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. కొన్ని చోట్ల అవసరానికి మించి ఎక్కువ పోస్టులు చూపించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు పోస్టుల స్థాయి తగ్గించేశారు. వర్సిటీ యూనిట్‌గా కాకుండా సబ్జెక్టులవారీగా పోస్టులను హేతుబద్ధీకరించడంతో చాలా మంది నష్టపోయారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పూర్తిగా విస్మరించారు. ఈ అవకతవకలతో నష్టపోయిన వారు కోర్టుల్లో కేసులు వేశారు. పనిభారం, కేడర్ నిష్పత్తి ప్రకారం.. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్సిటీల పునరుజ్జీవానికి చర్యలు చేపట్టారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేందుకు కృషి చేశారు. అనంతరం వర్సిటీల్లో యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున శాశ్వత పోస్టుల భర్తీని చేపట్టారు. వర్సిటీల్లో పని భారం, కేడర్ నిష్పత్తికి అనుగుణంగా ఫ్యాకల్టీని ప్రభుత్వం హేతుబద్ధీకరించింది. ఇందుకోసం జేఎన్టీయూ–అనంతపురం మాజీ వీసీ ప్రొఫెసర్ కె.లాల్ కిషోర్ అధ్యక్షతన ఐదుగురితో సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వర్సిటీల్లో అన్ని విభాగాల పనితీరును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, యూజీసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పోస్టులపై మార్గదర్శకాలను రూపొందించింది. వర్సిటీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం విభాగాలవారీగా పోస్టుల హేతుబద్ధీకరణకు సిఫారసు చేసింది. ఈ పోస్టులు తప్పనిసరి బోధన పోస్టులతోపాటు ప్రతి వర్సిటీలో అకడమిక్ నాన్ వెకేషన్ పోస్టులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసిస్టెంట్ డైరెక్టర్/డిప్యూటీ డైరెక్టర్/ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్, అసిస్టెంట్ లైబ్రేరియన్/డిప్యూటీ లైబ్రేరియన్/వర్శిటీ లైబ్రేరియన్, ప్లేస్మెంట్ ఆఫీసర్, నాక్ గుర్తింపులో కీలక భూమిక పోషించే ఐక్యూఏసీ డైరెక్టర్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ పోస్టులు తప్పనిసరిగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
597 గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో 89 గ్రూప్–1, 508 గ్రూప్–2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) చిరంజీవి చౌధరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వ్యవసాయ, సహకార, బీసీ సంక్షేమం, ఆర్థిక, హోం, మున్సిపల్ పరిపాలన, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, రవాణా, రహదారులు–భవనాల శాఖల్లో గ్రూప్–1 పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక, సాధారణ పరిపాలన, న్యాయ, లేజిస్లేచర్ తదితర శాఖల్లోనూ గ్రూప్–2 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్–1లో అత్యధికంగా హోంశాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్–కేటగిరి–2లో 25 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్–2 కేటగిరీలో రాష్ట్ర సచివాలయంలో అత్యధికంగా 161 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. సంబంధిత శాఖలు ఆయా పోస్టుల వివరాలతో పాటు జోన్, జిల్లాల వారీగా ఖాళీలతో పాటు రోస్టర్ పాయింట్స్, విద్యార్హత వివరాలను వెంటనే ఏపీపీఎస్సీకి సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్స్ పోస్ట్‌ల భర్తీకి ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గ్రూప్-1లో 89 పోస్ట్‌లు, గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు (ఆగస్ట్ 28) ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలను నిర్వహించనుంది. -
ఏపీ గ్రూప్-1 ఫలితాలు విడుదల
-
గ్రూప్–1 ఫైనల్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 111 గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గురువారం విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 11 నెలల వ్యవధిలోనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ ఫలితాల వివరాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మీడియాకు వెల్లడించారు. మొత్తం 111 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను నిర్దేశిత తేదీల్లో ఏపీపీఎస్సీ నిర్వహించింది. 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఒక పోస్టుకు ఎంపికపై క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) నుంచి నివేదిక రావాల్సి ఉంది. పోటీపడ్డ ఉన్నత విద్యావంతులు.. మొత్తం 111 పోస్టులకు గాను 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా వారిలో పురుషులు 59 మంది (53.6 శాతం) మహిళలు 51 (46.4 శాతం) మంది ఉన్నారు. టాప్ 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలుండగా నలుగురు పురుషులున్నారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన 220 మందిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే. వీరిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ రాసిన వారు 32 మంది ఉండగా ఇంటర్వ్యూలకు వరకు వెళ్లిన వారు 13 మంది ఉన్నారు. విద్యార్హతల పరంగా చూస్తే.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) వంటి జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారు 35 మంది ఉన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను, ఇంటర్వ్యూలను అత్యంత పకడ్బందీగా ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు అఖిల భారత సర్వీస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులు, వైస్ చాన్సలర్లు, ఐఐటీ, ఐఐఎం తదితర అత్యున్నత సంస్థల ప్రముఖులను సభ్యులుగా చేర్చింది. అత్యున్నత ప్రమాణాలతో ఎంపికలు జరిగి రాష్ట్రానికి ఉత్తమ సేవలు అందించేలా తుది ఎంపికలను పూర్తి చేసింది. మెయిన్స్ పరీక్షలకు 6,455 మంది ఎంపిక.. గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ వెలువరించింది. మొత్తం 1,26,450 మంది దరఖాస్తు చేయగా జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 86,494 మంది హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలను కేవలం 19 రోజుల్లోనే కమిషన్ వెల్లడించింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 6,455 మందిని ఎంపిక చేసింది. జూన్ 6 నుంచి 10 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 4,688 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని అత్యంత పారదర్శకంగా 34 రోజుల్లోనే ఏపీపీఎస్సీ పూర్తి చేయించింది. జూలై 14న మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. వీరిలో 220 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఆగస్టు 2 నుంచి 11 వరకు మూడు బోర్డులతో వీటిని నిర్వహించింది. టాప్–5 ర్యాంకర్లు వీరే.. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష భూమిరెడ్డి పావని కంబాలకుంట లక్ష్మీప్రసన్న కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భానుప్రకాశ్‌రెడ్డి మిమ్మితి టాపర్స్ ఇలా.. పేరు: గణేశ్న భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష విద్యార్హత: గ్రాడ్యుయేషన్, ఢిల్లీ యూనివర్సిటీ స్వస్థలం: సీసలి, కాళ్ల మండలం, పశ్చిమ గోదావరి తండ్రి: వెంకట రామాంజనేయులు ( ప్రభుత్వ ఉపాధ్యాయుడు, డీఈవో కార్యాలయంలో ఏపీవో) ► భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష గ్రూప్–1లో మొదటి ర్యాంకు సాధించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రిలిమ్స్ పూర్తిచేసి సెప్టెంబర్ 15 నుంచి జరగనున్న మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్టు తండ్రి రామాంజనేయులు తెలిపారు. పేరు: భూమిరెడ్డి పావని విద్యార్హత: బీటెక్ (ఈసీఈ) తండ్రి: భూమిరెడ్డి గంగయ్య (రైతు) తల్లి: లక్ష్మీదేవి స్వస్థలం: మైదుకూరు, వైఎస్సార్ జిల్లా ► పావని గ్రూప్–1 ఫలితాల్లో 2వ ర్యాంకు సాధించారు. 2016 నుంచి హైదరాబాద్‌లో గ్రూప్స్‌కి సన్నద్ధమవుతున్నారు. 2016, 2017లో గ్రూప్–2 మెయిన్స్వరకు వెళ్లారు. 2018లో గ్రూప్–1 ఇంటర్వ్యూ వరకు వెళ్లగలిగారు. తల్లిదండ్రులు, సోదరి భాగ్య, సోదరుడు గణేష్ సహకారంతో కష్టపడి చదివి ఈసారి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. పేరు: కె.లక్ష్మీప్రసన్న విద్యార్హత: బీటెక్ (ఐటీ) 2013, రాజంపేట స్వస్థలం: టంగుటూరు గ్రామం, అన్నమయ్య జిల్లా భర్త: పి.చంద్రదీప్ (పంచాయతీ సెక్రటరీ) తండ్రి: కె.సుబ్బారాయుడు (ఆర్టీసీ రిటైర్డ్ కండక్టర్) తల్లి: సరస్వతి ► లక్ష్మీ ప్రసన్న గ్రూప్–1 ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆమె టీవీ పురం పంచాయతీలో గ్రామ–వార్డు సచివాలయ వ్యవస్థలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నారు. 2014 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు. పేరు: కుప్పిరెడ్డి ప్రవీణ్ కుమార్‌రెడ్డి విద్యార్హత: బీటెక్ (ఈఈఈ), 2009, మదనపల్లె స్వస్థలం: ప్రొద్దుటూరు, వైఎస్సార్ జిల్లా తండ్రిపేరు: కేసీ వెంకటరెడ్డి(డీసీసీబీ రిటైర్డ్ సూపర్వైజర్) తల్లి: కె.రామసుబ్బమ్మ ► ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో 4వ ర్యాంకు సాధించారు. ఆయన 2018లో గ్రూప్–1 నోటిఫికేషన్లో పరీక్ష రాయగా.. 2022లో రిజల్ట్స్ వచ్చాయి. 47వ ర్యాంకు సాధించగా.. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా సెలక్టయ్యారు. కానీ.. 2018లోనే గ్రూప్–2 పరీక్ష రాయగా.. 2020లో వెలువడిన ఫలితాల్లో 11వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా ఎంపికై ప్రస్తుతం మదనపల్లెలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. అంతకు ముందు ఎనిమిదేళ్లు ఒరాకిల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేశారు. 2018 నాటి గ్రూప్–1 ఫలితాలు 2022లో వెలువడే నాటికే ఆయన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరిపోవడంతో.. మరింత మెరుగైన ర్యాంకు కోసం శ్రమించారు. -
త్వరలో గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. గ్రూప్–1, గ్రూప్–2లే కాకుండా డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు (డీఈవో), ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, లైబ్రేరియన్లు తదితరాలు కలిపి 1,199 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వీటితోపాటు 2020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 220 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వనున్నామని వెల్లడించారు. 17 ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో గ్రూప్–2 పరీక్షల సిలబస్, పరీక్ష విధానంలోనూ మార్పులు చేస్తున్నామన్నారు. పాత సిలబస్ పూర్తిగా డూప్లికేషన్‌తో ఉందని.. దీన్ని మార్చాలని అభ్యర్థుల నుంచి వినతులు వచ్చాయన్నారు. గ్రూప్–2లో గతంలో మూడు పేపర్లుండగా ఇప్పుడు రెండు పేపర్లుగా మార్చామని తెలిపారు. కొత్త నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఏపీపీఎస్సీ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు గతంలో లాగా లోపాలు తలెత్తకుండా అంతర్గత కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాలుగేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 1,31,364 పోస్టుల భర్తీ కాగా గత నాలుగేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 1,31,364 పోస్టులను భర్తీ చేశామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో పోస్టుల భర్తీ జరగలేదని గుర్తు చేశారు. వీటిలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 1,26,728 పోస్టులను భర్తీ చేశామన్నారు. మీడియా సమావేశంలో ఏపీపీఎస్సీ సభ్యులు సలాంబాబు, సుధీర్, సెలీనా, శంకరరెడ్డి, కార్యదర్శి ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూళ్లు విడుదల కాగా రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల షెడ్యూళ్లను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ ప్రకటన విడుదల చేశారు. -
ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
సాక్షి, కృష్ణా: గ్రూప్-1 పరీక్షా తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. విజయవాడలో బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఫలితాలను రిలీజ్ చేశారు. గ్రూప్-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలను ప్రకటించారాయన. నోటిఫికేషన్ నుంచి ఫలితాలు వెల్లడి వరకు పూర్తి పారదర్శకత పాటించిన ఏపీపీఎస్సీ.. అతి తక్కువ సమయంలో వివాదాలకి దూరంగా ప్రక్రియ పూర్తి చేసింది. ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రికార్డు సమయంలోనే గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించాం. గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా పూర్తి చేశాం. మొదటిసారిగా సీసీ కెమెరాలను వినియోగించాం. 111 పోస్టులకి 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం. స్పోర్ట్స్ కోటాలో మరో పోస్టు ఎంపిక జరుగుతుంది. 1:2 కోటాలో ఇంటర్వ్యూలకి అభ్యర్ధులని ఎంపిక చేశాం. 11 నెలల రికార్డు సమయంలో గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలిసారిగా ఇంత తక్కువ సమయంలో ఎంపిక ప్రక్రియ పూర్తి కావడం ఇదే. ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి వచ్చిన వాళ్లలో ఉన్నారు. ఎంపికైన వారిలో మొదటి పది స్ధానాలలో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే అని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ర్యాంకర్ల వివరాలు ఫస్ట్ ర్యాంకర్- భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష ( బిఎ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీ) సెకండ్ ర్యాంకర్ - భూమిరెడ్డి భవాని ( అనంతపురం) మూడవ ర్యాంకర్ - కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న నాలుగవ ర్యాంకర్ - కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి ( అనంతపురం జెఎన్ టియు) అయిదవ ర్యాంకర్ - భానుప్రకాష్ రెడ్డి ( కృష్ణా యూనివర్సిటీ) ఆ పుకార్లు నమ్మొద్దు ఏపీపీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల విషయంలో.. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ పుకార్లపైనా చైర్మన్ గౌతమ్ సవాంత్ స్పందించారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని, గ్రూప్ -2 కి వెయ్యి పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని, అలాగే.. గ్రూప్-1 వంద పైనా పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని’’ తెలిపారాయన. గ్రూప్-1 ప్రక్రియ సాగిందిలా.. గత ఏడాది సెప్టెంబర్ 30 న 111 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలకాగా.. జనవరి 8 న ప్రిలిమ్స్ నిర్వహించింది ఏపీపీఎస్సీ. కేవలం 19 రోజులలో అంటే.. జనవరి 27 న ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్ కి 86 వేల మంది హాజరు కాగా.. 6, 455 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు. జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్ పరీక్ష నిర్వహించారు. 111 పోస్టులకిగానూ 220 మంది అర్హత సాధించారు. ఇక.. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది ఏపీపీఎస్సీ. -
ఆన్లైన్లో ఏపీపీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు
సాక్షి, అమరావతి: ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్‌ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల పరీక్ష హాల్‌టికెట్లు వెబ్సైట్లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 18న ఉదయం, మధ్యాహ్నం పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు www. psc. ap. gov. in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 19న శాంపిల్ టేకర్ పరీక్ష ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ అడ్మిని్రస్టేషన్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టుల భర్తీకి చేపట్టిన పరీక్ష ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హాల్‌టికెట్లు కమిషన్ వెబ్సైట్లో ఉంచామని, అభ్యర్థులు 18వ తేదీ లోగా డౌన్లోడ్ చేసుకోవాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక కారణాల రీత్యా ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు సర్విస్ కమిషన్ వెబ్సైట్ సేవలు నిలిచిపోతాయని, ఆలోగా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. 21, 22 తేదీల్లో ఏఈఈ పరీక్ష వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ రాత పరీక్షను ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో 21న మధ్యాహ్నం, 22న ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. -
3,295 ప్రొఫెసర్ పోస్టులు 3 నెలల్లో భర్తీ ‘ఉన్నత’ అధ్యాయం
ఇంటర్వ్యూలో వారికి వెయిటేజీ ఇప్పటికే వైద్యారోగ్య శాఖలో 51 వేల పోస్టుల భర్తీతోపాటు అంతకు ముందు 1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలను ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పూర్తి చేసిన విషయాన్ని సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించారు. ఇదే తరహాలో వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలను కూడా వేగంగా, సమర్థంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూటికి నూరుశాతం మెరిట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించగా ఇంటర్వ్యూ సమయంలో కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోద ముద్ర వేశారు. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉత్తమ ఫలితాల సాధనకు వర్సిటీల్లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు అధ్యాపక సిబ్బంది నియామకాల్లో అర్హత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో అధ్యాపకుల నియామకాలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదించగా ఒకే రిక్రూట్మెంట్లో చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఆగస్టు 23వ తేదీన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుండగా నవంబర్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. ఏపీపీఎస్సీ ద్వారా పారదర్శకంగా.. వర్సిటీల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి షెడ్యూల్, పరీక్షా విధానంపై అధికారులతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆగస్టు 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబరు 3, 4వ వారాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 10వతేదీ నాటికి ఫలితాలను ప్రకటించి ఆ తర్వాత నెల రోజుల్లోగా ఇంటర్వ్యూలు చేపట్టాలని నిర్ణయించారు. నవంబర్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సెక్రటరీ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ వర్సిటీ, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్మెంట్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్మెంట్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో రెగ్యులర్ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది జగన్ ప్రభుత్వం. నవంబర్ 15 నాటికి నియామక ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా.. ఇప్పటికే ప్రపంచస్థాయి కరిక్యులమ్ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో 51 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన సంగతి తెలిసిందే. -
2 నుంచి గ్రూప్–1 ఇంటర్వ్యూలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వి స్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. జనరల్, స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైనవారికి ఆగస్టు 2 నుంచి మౌఖిక పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులకనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. వచ్చే నెల 2న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైనవారికి ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఏపీపీఎస్సీ గతేడాది సెపె్టంబర్ 30న 111 గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) నిర్వహించి.. అదే నెల 27న ఫలితాలను వెల్లడించారు. 5,035 మంది మెయిన్స్ పరీక్షలకు ఎంపికయ్యారు. వీరికి జూన్ 3 నుంచి 10 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో నుంచి పోస్టుకు ఇద్దరు చొప్పున 110 పోస్టులకు 220 మందిని, స్పోర్ట్స్ కోటాలోని ఒక పోస్టుకు 39 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన తక్కువ కాలంలోనే ఎలాంటి వివాదాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించడం, అంతే వేగంగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుండటం ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఇదే తొలిసారి. ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన నాటి నుంచి 19 రోజుల్లో, మెయిన్స్ పరీక్షలు జరిగిన నాటి నుంచి 33 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం. అధికారులకు అర్ధ వార్షిక పరీక్షలు రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత, రాష్ట్ర సర్వీసు అధికారులకు అర్ధ వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీరికి సెపె్టంబర్ 12 నుంచి 15 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఆగస్టు 14లోగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
-
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
అమరావతి: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 111 గ్రూపు-1 పోస్టులకు గాను 259 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్ కోటా నుండి ఎంపికయ్యారు. గ్రూప్-1 పరీక్ష జరిగిన కేవలం 34 రోజులలోనే ఫలితాలు విడుదల చేసింది ఏపీపీఎస్సీ . జూన్ 3 నుండి 10వ తారీఖు వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు మొత్తం 5035 మంది హాజరు కాగా వారిలో నుండి 259 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఏపీపీఎస్సీ ప్రతిష్టాత్మంకంగా నిర్వహించిన గ్రూపు-1 పరీక్షలు ఎటువంటి అక్రమాలకు, అవినీతికి తావివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ పర్యవేక్షణలో మూల్యాంకనం స్క్రూటినీ కార్యక్రమాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరిగింది. ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూలను నిర్వహించి సెప్టెంబర్ నాటికి అభ్యర్థుల నియామకాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది కమిషన్. ముందుగా నిర్ణయించినట్టుగానే క్యాలెండర్ ప్రకారం సకాలంలోనే నియామకాలు జరుగుతాయని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రెడీ
-
AP: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, విజయవాడ: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇది కూడా చదవండి: నేడు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ -
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రెడీ
-
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ మేలు జరుగుతోందని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక, ప్రత్యేక అర్హతలతో కూడిన పోస్టుల నియామకాలకు ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. వీటిని తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్–1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పేపర్–1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలుంటాయి. ఆంగ్లం ప్రశ్నలను తెలుగులో అనువదించి ఇస్తారు. అయితే ఈ రెండు మాధ్యమాల్లో ఆంగ్లంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇక పేపర్–2లో సబ్జెక్టు పేపర్లను మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించనున్నారు. (చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!) -
అంగన్వాడీల్లో 243 పోస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 61 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో), అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో), మహిళా–శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్–1 సూపర్వైజర్ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. (చదవండి: ఈఏపీసెట్‌లో ‘ఇంటర్’కు వెయిటేజీ) -
జూన్‌లో గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రీషెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిర్వహించాలని గతంలో నిర్ణయించిన ఈ పరీక్షలను జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ పరీక్షలకు సంబంధించిన మూడోవిడత ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు జరుగనుండడంతో ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు ఆ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేలా సన్నద్ధమయ్యేందుకు వీలుగా గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్.సలాంబాబు తెలిపారు. రాష్ట్రం నుంచి 25 మందికిపైగా సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి సివిల్స్‌లో ఎక్కువమంది విజయం సాధించేలా ఆయా అభ్యర్థులు ప్రిపేరయ్యేందుకు వెసులుబాటు కల్పించేందుకు కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 3, 5, 6, 7, 8, 9, 10 వ తేదీల్లో గ్రూప్–1 మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. కమిషన్ ఇచ్చే ఏ నోటిఫికేషన్ అయినా సకాలంలో పూర్తిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన సూచనలు ఇచ్చిన నేపథ్యంలో కమిషన్ అదేబాటలో నడుస్తోంది. టైమ్‌బౌండ్‌లో ఆయా నోటిఫికేషన్లను పూర్తిచేసి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేలా చేసింది. గ్రూప్–1 పోస్టుల విషయంలోను అదేరీతిన నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ ఫలితాల వరకు చర్యలు తీసుకుంది. ఇంటర్వ్యూలు ఉండే పోస్టుల నోటిఫికేషన్లను తొమ్మిదినెలల్లో, ఇంటర్వ్యూలు లేని పోస్టుల నియామకాలను ఆరునెలల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను మూడునెలల్లోనే పూర్తిచేయించి పోస్టులు భర్తీచేయించింది. అదే మార్గంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి 2022 అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీచేసి జనవరి 8న ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. ఫలితాలను అదేనెల 27న విడుదల చేసింది. మెయిన్స్‌కు అభ్యర్థుల సన్నద్ధానికి వీలుగా 85 రోజుల వ్యవధి ఇస్తూ ఏప్రిల్ 23 నుంచి పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చింది. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో కూడా మెయిన్స్ పేపర్లు తొమ్మిదికిగాను సగటున 90 రోజుల వ్యవధి ఇస్తుంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్–1లో ఏడు పేపర్లకు 85 రోజుల వ్యవధిని కమిషన్ అభ్యర్థులకు కల్పించింది. ఆగస్టు, సెప్టెంబర్ల నాటికి అభ్యర్థుల నియామకాన్ని పూర్తిచేయించేలా కమిషన్ కాలవ్యవధి నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతం యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలు.. గ్రూప్–1మెయిన్స్ తేదీల్లోనే జరుగనుండడంతో ఆ అభ్యర్థుల మేలును దృష్టిలో పెట్టుకుని ఏపీపీఎస్సీ మెయిన్స్ తేదీలను వాయిదా వేసింది. కమిషన్ నిర్ణయం పట్ల అభ్యర్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సివిల్స్‌లో రాష్ట్రం నుంచి ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఎంతో మేలు చేకూరడంతో పాటు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను ఎదుర్కొనేందుకు తమకూ అవకాశం కలుగుతోందని వారు పేర్కొంటూ కమిషన్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. గతంలో అంతా గందరగోళం గత ప్రభుత్వ హయాంలో గ్రూప్–1 నుంచి అన్ని నోటిఫికేషన్లలోను నిరుద్యోగులు తీవ్ర గందరగోళానికి గురికావలసి వచ్చిందని నిరుద్యోగ విద్యావంతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో గ్రూప్–1లో చోటుచేసుకున్న నిర్వాకాలను గుర్తుచేస్తున్నారు. 2016లో నాటి ప్రభుత్వ హయాంలో 78 గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 2017 మే 7న ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ ఫలితాలు మే 27న విడుదల చేసి ఆగస్టు 17 నుంచి మెయిన్స్ పరీక్షలను పెట్టారు. అంటే కేవలం 81 రోజుల వ్యవధిని మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. అప్పట్లో మెయిన్స్‌లో ఇంగ్లిష్‌లో అర్హత సాధించకపోయినా నాటి ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధించిన ఐదుగురిని ఇంటర్వ్యూలకు దొడ్డిదారిన ఎంపిక చేశారు. దీనిపై వివాదం రేగడంతో తిరిగి కొత్తజాబితాను ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక 2018 గ్రూప్–1 గురించి చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. సరిగ్గా అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ జారీచేసి నిరుద్యోగులను నాటి టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. ఆనాటి గ్రూప్–1 ప్రిలిమ్స్ 2019 మే 26న జరిగింది. ఈ పరీక్షల్లో పూర్తి అక్రమాలు, అవకతవకలు జరగడంతో గందరగోళం ఏర్పడింది. ఏకంగా 42 ప్రశ్నలు, సమాధానాలు తప్పుగా రావడం, న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో మొత్తం ప్రక్రియ ఆలస్యమైంది. చివరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ గ్రూప్–1పై న్యాయవివాదాలన్నిటినీ పరిష్కరించి మెయిన్స్ నిర్వహించి నిరుద్యోగులకు న్యాయం చేసింది. మెయిన్స్‌లో కూడా డిజిటల్ ఇవాల్యుయేషన్‌పై న్యాయవివాదాన్ని లేవనెత్తుతూ తెలుగుదేశం నేతలు నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినా వాటిని కూడా పరిష్కరించి అభ్యర్థులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం న్యాయం చేసింది. కాగా, గ్రూప్–1 మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ మంగళవారం విడుదల చేశారు. జూన్ 3 నుంచి 10వ తేదీవరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. 2022 సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను యూపీఎస్సీ సోమవారమే విడుదల చేసింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి ఏపీ నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరవుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూల కారణంగా గ్రూప్-1 మెయిన్స్‌ని జూన్‌లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకునే మెయిన్స్ వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు పేర్కొన్నారు. చదవండి: ‘ఓటుకు కోట్లు 2.0’ ప్రకంపనలు -
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: గ్రూపు–1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 8న ఇందుకు సంబంధించి రాతపరీక్షలు నిర్వహించారు. అయితే, ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు వ్యవధిలో కేవలం 19 రోజుల్లో ఫలితాలు వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరు 30న ప్రభుత్వం గ్రూపు–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 1,26,449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,06,473 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 87,718 మంది ఈనెల 8న రాతపరీక్షకు హాజరయ్యారు. మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొప్పున మొత్తం 6,455 మందిని ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తూ అందుకు సంబంధించిన ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. మరోవైపు.. ఏప్రిల్ 23 నుంచి వారం రోజులపాటు జరిగే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షల తుది కీ వివరాలు ఠీఠీఠీ.pటఛి.్చp.జౌఠి.జీn వెబ్సైట్లో చూసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి జె. ప్రదీప్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేగంగా ఉద్యోగ నియామకాలకు సీఎం ఆదేశాలు ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యానికి లోనుకాకుండా నియామకాల ప్రక్రియ వేగంగా పూర్తికావాలని బోర్డు చైర్మన్‌కు సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన సూచనలు చేశారని ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులు సలాం బాబు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఇంత స్వల్ప వ్యవధిలో రాతపరీక్షల ఫలితాలు ప్రకటించడం ఎప్పుడూ జరగలేదని ఆయన వివరించారు. -
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త
-
ఏపీ వ్యాప్తంగా ఇవాళ గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నేడు (ఆదివారం) ప్రిలిమినరీ పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) జరగనుంది. పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్–2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు హాల్ టిక్కెట్లతోపాటు నిర్దేశిత గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 9.45 గంటల వరకు అనుమతి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు పరీక్ష హాల్లోకి వెళ్లాలి. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 1.45 గంటల వరకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఎవరినీ అనుమతించరు. అభ్యర్థి దరఖాస్తులో బయోడేటా వివరాలను తప్పుగా పేర్కొని ఉంటే ఇన్విజిలేటర్ వద్ద అందుబాటులో ఉన్న నామినల్ డేటాను అప్డేట్ చేసుకోవాలి. అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్ సమాధాన పత్రం ఒరిజినల్, డూప్లికేట్ కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థి ఒరిజినల్ కాపీని ఇన్విజిలేటర్‌కు ఇచ్చి డూప్లికేట్ కాపీని తన వద్ద ఉంచుకోవాలి. ప్రాథమిక ‘కీ’ ఆదివారం రాత్రి లేదా సోమవారం విడుదల చేస్తారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
AP: గ్రూప్–2 మెయిన్స్‌లో ఇక రెండు పేపర్లే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2 పోస్టులకు నిర్వహించే పరీక్ష విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకు గ్రూప్–2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని రెండుకు కుదించింది. ఈ మేరకు శుక్రవారం జీవో 6ను విడుదల చేసింది. పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్టును 150 మార్కులకు నిర్వహించేవారు. మెయిన్స్‌లో పేపర్–1 జనరల్ స్టడీస్ ఉండేది. అలాగే మరో రెండు పేపర్లుండేవి. పేపర్‌కు 150 చొప్పున 450 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి నుంచి ఈ విధానంలో మార్పులు చేశారు. గతంలో మెయిన్స్‌లో పేపర్–1గా ఉన్న జనరల్ స్టడీస్‌ను రద్దు చేసి దాన్ని స్క్రీనింగ్ టెస్టుకు మార్చారు. దీన్ని గతంలో మాదిరిగానే 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక మెయిన్స్‌ను రెండు పేపర్లకు తగ్గిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులు ఉంటాయి. ఈ క్రమంలో మెయిన్స్ సిలబస్ అంశాల్లోనూ మార్పులు చేశారు. కొత్త విధానం ప్రకారం.. గ్రూప్–2 పరీక్ష, సిలబస్ మార్పులు ఇలా.. స్క్రీనింగ్ టెస్ట్: జనరల్ స్టడీస్ –మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు మెయిన్ పరీక్షలు పేపర్–1: (150మార్కులు) 1. సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ సామాజిక చరిత్ర, సాంస్కృతోద్యమాలు) 2. జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెయిన్ పరీక్షలు పేపర్–2: (150మార్కులు) 1. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 2. సైన్స్ అండ్ టెక్నాలజీ -
ఏపీపీఎస్సీ కొత్త నిబంధన.. ఆ అభ్యంతరాలకు రూ.100 చెల్లించాలి
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు, వాటి జవాబులపై అభ్యర్థులు లేవనెత్తే అభ్యంతరాలకు ఒక్కో దానికి రూ.100 చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నిబంధన విధించింది. ఇటీవల విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు అన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షల్లో కీలపై వస్తున్న వేలాది అభ్యంతరాల్లో తప్పుడువే అత్యధికంగా ఉంటున్నాయి. ‘కమిషన్ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్ష (స్క్రీనింగ్ టెస్టు)ల్లో ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లోని ప్రశ్నలు, వాటి సమాధానాల కీలకు వ్యతిరేకంగా అభ్యర్థులు తప్పుడు, అసంబద్ధమైన అభ్యంతరాలను వేలాదిగా దాఖలు చేస్తున్నారు. వీటిని పరిశీలించి పరిష్కరించే క్రమంలో ఫలితాల ప్రకటన సహా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో విపరీత జాప్యం జరుగుతోంది. చదవండి: (ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?) అందువల్ల కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు వర్తించేలా ఒక నిబంధన చేర్చాలని కమిషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రశ్న పత్రం, జవాబు కీ, ఇతర విషయాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కింద ఈ నిబంధన పెట్టాలని కమిషన్ నిర్ణయించింది. ఇకపై అభ్యర్థి ప్రశ్న, జవాబు కీకి వ్యతిరేకంగా లేవనెత్తే ప్రతి అభ్యంతరానికి రూ.100 చొప్పున నిర్ణీత గడువులోగా చెల్లించాలి. తుది పరిశీలనలో ఈ అభ్యంతరాల్లో నిజమైన వాటిని దాఖలు చేసిన అభ్యర్ధులకు ఆ మొత్తాన్ని తిరిగి కమిషన్ చెల్లిస్తుంది.’ అని కమిషన్ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త నిబంధనను అదనంగా జోడించిన నోటిఫికేషన్ల నంబర్లు: 08/2021, 16/2022, 09/2021, 17/2022, 10/2021, 18/2022, 14/2021, 14/2022, 15/2021, 15/2022, 23/2021, 24/2021, 6/2022, 11/2022, 12/2022, 19/2022, 20/2022, 21/2022, 25/2022, 28/2022 -
‘ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు’.. తదుపరి చర్యలన్నీ నిలుపుదల
సాక్షి, అమరావతి: వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. అలాగే ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా తదుపరి చర్యలన్నింటినీ స్తంభింపజేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీపీఎస్సీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షను కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తున్నారని.. ఇది చట్టవిరుద్ధమంటూ నెల్లూరు జిల్లాకు చెందిన బాణాల చరణ్, ప్రకాశం జిల్లాకు చెందిన మద్దుల రాజారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 26న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సైతం ఇంగ్లిష్‌లోనే రాత పరీక్ష నిర్వహించనున్నారని, ఇది చట్టవిరుద్ధమంటూ ప్రకాశం జిల్లాకు చెందిన డి.శివశంకర్‌రెడ్డి, మద్దుల రాజారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ.. ఇంగ్లిష్‌లో మాత్రమే రాతపరీక్ష నిర్వహించడం అధికార భాషా చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష నిర్వహించడం వల్ల తెలుగు మీడియం విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. తెలుగులో కూడా పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి రెండు నోటిఫికేషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీసుల్లో అసిస్టెంట్ మోటార్ వాహన ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
జనవరి 8న గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: గ్రూప్–1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షను జనవరి 8న నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పాలనా కారణాలతో డిసెంబర్ 18న జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నామన్నారు. డిసెంబర్ 17 నుంచి 20 తేదీ వరకు బ్యాంకింగ్ పరీక్షలు జరగనున్నందున అభ్యర్థుల మేలు కోసం గ్రూప్–1 పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. గ్రూప్–1 పోస్టుల నియామక ప్రక్రియను 9 లేదా 10 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లతో పాటు త్వరలో వెలువరించనున్న వాటికీ నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం అనుమతులిచ్చిన అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేశామని గుర్తు చేశారు. వీటిలో కొన్నింటికి పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించామని తెలిపారు. సవాంగ్ ఇంకా ఏం చెప్పారంటే.. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు.. గ్రూప్–1తో సహా అన్ని పోస్టుల భర్తీలో ఎక్కడా జాప్యం లేకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. న్యాయవివాదాలు, పలుమార్లు ఫలితాల వెల్లడి, మెయిన్స్ మూల్యాంకనం రెండుసార్లు నిర్వహించాల్సి రావడం వంటి కారణాలతో 2018 గ్రూప్–1 పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ చొరవతో ఆ న్యాయ వివాదాలన్నింటినీ పరిష్కరించి ఆ పోస్టులను భర్తీ చేశాం. సెప్టెంబర్ 30న గ్రూప్–1 కొత్త నోటిఫికేషన్ ఇచ్చాం. దీనిద్వారా 92 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేస్తాం. గత గ్రూప్–1 నోటిఫికేషన్లో భర్తీ కాని పోస్టులు ఈ కొత్త నోటిఫికేషన్లో చేరతాయి. దీంతో ప్రస్తుత నోటిఫికేషన్‌లోని పోస్టుల సంఖ్య కొంత పెరిగే అవకాశముంది. కొన్ని పొరపాట్లతో అప్పటి గ్రూప్–1 పోస్టులకు వయోపరిమితి మించిపోయి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గ్రూప్–1 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 2తో ముగిసినా 5 వరకు అవకాశం ఇచ్చాం. దీంతో 1.26 లక్షల దరఖాస్తులు వచ్చాయి. త్వరలో గ్రూప్–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తాం. ఈ పోస్టుల భర్తీకి సీఎం అనుమతి కూడా ఇచ్చారు. అత్యంత ప్రతిభావంతుల ఎంపిక ఏపీపీఎస్సీ పకడ్బందీ చర్యలతో వివిధ కేడర్ పోస్టుల్లో అత్యంత ప్రతిభావంతులు ఎంపికవుతున్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2018 గ్రూప్–1 పోస్టులకు అత్యంత ప్రతిభావంతులు ఎంపికయ్యారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ డిజిటల్ వాల్యుయేషన్‌పై న్యాయ వివాదం ఏర్పడడంతో హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా 55 రోజుల్లో మూల్యాంకనాన్ని పూర్తి చేయించాం. ఇంటర్వ్యూలను గతంలో మాదిరి ఒక్క బోర్డుతో కాకుండా మూడు బోర్డులతో నిర్వహించాం. గతంలో కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఒకే బోర్డుతో వీటిని నిర్వహించేవారు. ఇప్పుడు మూడు బోర్డుల్లోనూ కమిషన్ సభ్యులతోపాటు ఇద్దరు చొప్పున సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులుగా యూనివర్సిటీ వీసీ/విశ్రాంత వీసీలను నియమించాం. దీంతో 11 రోజుల్లోనే ఇంటర్వ్యూలను పూర్తిచేశాం. ఐఏఎస్‌కు ఎంపికైననలుగురు, ఐపీఎస్‌కు ఎంపికైన ఇద్దరు ఈ గ్రూప్–1 పోస్టులకు ఎంపికయ్యారు. సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ ఈసారి గ్రూప్–1 పోస్టులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా న్యాయపరమైన అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందుకు అనుగుణంగా నిర్దిష్ట విధానాలను రూపొందించాం. సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తాం. ప్రభుత్వం నుంచి కూడా çసహకారాలు అందుతున్నాయి. -
గ్రూప్–1 దరఖాస్తు గడువు 5 వరకు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రూప్–1 కేడర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రూప్–1 కేడర్‌లోని 92 పోస్టులకు నియామక ప్రక్రియ కోసం ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షల కోసం అక్టోబర్ 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 2వ తేదీతో(బుధవారంతో) గడువు ముగిసింది. అయితే గడువు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వందలాదిగా ఏపీపీఎస్సీకి అభ్యర్థనలు అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. సంబంధిత ఫీజును 4వ తేదీ రాత్రి 11.59లోపు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్ 18న ప్రిలిమ్స్ గ్రూప్–1 పోస్టుల నియామకాలకు సంబంధించి ప్రిలిమినరీ(స్క్రీనింగ్ టెస్టు)ని డిసెంబర్ 18న నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. దరఖాస్తు గడువు పొడిగించినా పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. మెయిన్స్ పరీక్షలను మార్చి రెండో వారం తర్వాత చేపడతామని వెల్లడించారు. -
APPSC: గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, విజయవాడ: గ్రూప్-1 పరీక్షల కోసం దరఖాస్తు తేదీ పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వివరాలను వెల్లడించారు. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 2వ తేదీ కాగా.. ఆ తేదీని నవంబర్ 5కి మార్చినట్లు వెల్లడించారు. ఎల్లుండి(4వ తేదీ) అర్థరాత్రి లోపు ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. డిసెంబర్ 18న స్క్రీనింగ్ టెస్ట్, మార్చ్ 2023లో మెయిన్స్ పరీక్షలు ఉంటాయని.. ఈ దరఖాస్తు పొడిగింపును గమనించి వినియోగించుకోవాలని అర్హులకు సవాంగ్ సూచించారు. -
పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ఈ షెడ్యూల్ లోని పోస్టులన్నింటికీ జనరల్ స్టడీస్ మెంటల్ ఏబిలిటీ పరీక్ష నవంబర్ 7న జరగనుంది. అన్ని పోస్టులకు ఇది కామన్ పేపర్. దేవదాయ శాఖ ఈవో స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు దేవదాయ శాఖ ఈవో స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష రాసిన మొత్తం 52,915 మందికి గాను 1,278 మంది మెయిన్ పరీక్షకు ఎంపికయ్యారు. -
నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ నోటిఫికేషన్ విడుదల
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అటవీశాఖకు సంబంధించి ఎనిమిది ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అలాగే సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలోని ఎనిమిది కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ అక్టోబర్ 17న తెలిపారు. కాగా, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చునని పేర్కొన్నారు. కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టులకు నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. ఇతర వివరాలకు psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. -
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
-
ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి :రాష్ట్రంలో గ్రూప్–1 కేడర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్లో గ్రూప్–1 పోస్టులతో పాటు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్–1 పోస్టులు 92 ఉండగా అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టులు 17 ఉన్నాయి. ఇక గ్రూప్–1 పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు, ఎఎంవిఐ పోస్టులకు నవంబర్ 2 నుంచి 22 వరకు గడువు విధించారు. పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్ psc.ap.gov.in/ లో చూడొచ్చని కార్యదర్శి పేర్కొన్నారు. గ్రూప్–1 సహా అత్యున్నత కేడర్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఇలా ఉండగా.. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్–1 సహా ఇతర అత్యున్నత కేడర్ పోస్టులకు రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూల విధానాన్ని పునరుద్ధరించింది. ఈ అత్యున్నత పోస్టులన్నింటికీ ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి రెండేళ్లకు పెంచుతూ గతంలో జారీచేసిన జీఓ 105 అమలును మరో రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. గతంలో 34ఏళ్ల వయోపరిమితిని 42ఏళ్లకు పెంచి జీఓ 105 జారీచేశారు. తాజా ఉత్తర్వులతో ఈ 42ఏళ్ల గరిష్ట వయోపరిమితి 2023 సెప్టెంబర్ 30వరకు అమల్లో ఉంటుంది. -
గుడ్ న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని 269 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్–4, మెడికల్ ఆఫీసర్లు, లెక్చరర్ తదితర పోస్టులు వీటిలో ఉన్నాయి. పోస్టులు, దరఖాస్తు గడువు వివరాలు ఇలా ఉన్నాయి.. చదవండి: ఒంటరిగా ఉంటున్నారా?.. ఈ ఆప్షన్ మీ కోసమే.. -
‘పంచాయతీరాజ్’లో భారీగా పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో ప్రస్తుతం ఈవోపీఆర్డీలుగా పనిచేస్తున్న వారితోపాటు జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఏవో)గా పనిచేస్తున్న వారికి ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాతికేళ్ల తర్వాత 237 మంది ఎంపీడీవోలకు ఇటీవల ఒకేసారి పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఎంపీడీవోల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉండడంతో కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇక సాధారణ నిబంధనల ప్రకారం మండలాల్లో ఎంపీడీవో పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు మూడు మార్గాల్లో వాటిని భర్తీచేస్తుంటారు. మొత్తం ఖాళీల్లో 30 శాతం పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన పోస్టులను ఈవోపీఆర్డీలు.. జెడ్పీలు, ఎంపీడీవో ఆఫీసుల్లో ఏవోలుగా పనిచేసే వారికి పదోన్నతుల ద్వారా భర్తీచేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, 20 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తీర్ణులైన 45 మందిని నేరుగా ఎంపీడీవోలుగా నియమించింది. మిగిలిన వాటిలో సుమారు 220 ఎంపీడీవో పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు ఇప్పుడు అధికారులు చర్యలు చేపట్టారు. నెలాఖరుకల్లా సీనియారిటీ జాబితాలు.. ఇక సెప్టెంబరు మొదటి వారానికల్లా ఈ పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసేందుకు పంచాయతీరాజ్ శాఖాధికారులు కార్యాచరణను సిద్ధంచేసుకున్నారు. ఇందులో భాగంగా.. జోన్ల వారీగా ఈఓపీఆర్డీలు, ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది. సెప్టెంబరు నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తయితే, అక్టోబరులో డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీ ద్వారా పదోన్నతులు పొందే వారి తుది జాబితాలను అధికారులు రూపొందిస్తారు. నవంబరు ఐదో తేదీ కల్లా పదోన్నతులు పొందిన అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కూడా ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. -
ఏపీపీఎస్సీ ప్రకటన: గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పరీక్షల తేదీలు ఇవే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ విభాగాల్లోని పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల నిర్వహణ తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సోమవారం ప్రకటించింది. ఈమేరకు కమిషన్ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ (జీఎస్ఎంఏ) పరీక్ష, సబ్జెక్టు పేపర్ల పరీక్షలకు వేర్వేరు తేదీలను ప్రకటించారు. షెడ్యూళ్లను కమిషన్ వెబ్సైట్లో ఉంచారు. తెలుగు రిపోర్టర్ ఏపీ లెజిస్లేచర్ పోస్టులకు పరీక్షను విజయవాడలో మాత్రమే నిర్వహించనున్నారు. -
గ్రూపు–1 ఫలితాల్లో కడప యువకుడి సత్తా
కడప : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూపు–1 ఫలితాల్లో కడప ఎర్రముక్కపల్లెకు చెందిన యువకుడు భార్గవ్ సత్తాచాటి జిల్లా రిజిస్టార్ కొలువును సాధించారు. ఇతని తల్లిదండ్రులు సూర్యుడు, ఆదిలక్ష్మిలది పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లె గ్రామం. అయితే ఇతని తండ్రి ఉద్యోగరీత్యా కడపలో స్థిరపడ్డారు. భార్గవ్ 1 నుంచి 10వ తరగతి వరకు ఎక్కముక్కపల్లెలోని బాలవికాస్ స్కూల్లో చదివారు. ఇంటర్ హైదరాబాదులోని శ్రీచైతన్యలో చదివాడు. ఇంజినీరింగ్‌ను కడపలోని కేఎస్‌ఆర్‌ఎంలో పూర్తి చేశారు. హైదరాబాదులో శాప్ కన్సెల్టెంట్‌గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేçస్తున్నాడు. 2018లో గ్రూపు–1 పరీక్షకు సిద్ధం అయ్యారు. ప్రిలిమనరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి ఇటీవల వెలువడిన ఫలితాల్లో జిల్లా రిజిస్ట్రార్ పోస్టుకు ఎంపికయ్యారు. భవిషత్తులో ఐఏఎస్ సాధించడమే లక్ష్యమని భార్గవ్ చెప్పారు. యువత పట్టుదలతో కృషి చేస్తే గ్రూపు–1, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలిపారు. -
తొలి ప్రయత్నంలోనే డీఎస్పీ ఉద్యోగం
నెల్లూరు: ‘క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగినప్పుడే కలలను సాకారం చేసుకోగలం. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు పుస్తక పఠానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవే తన విజయానికి బాటలు వేశాయి.’ అని గ్రూప్–1లో విజేతగా నిలిచి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన వల్లెం విష్ణుస్వరూప్‌రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంటలేఅవుట్‌లోని పావని అపార్ట్మెంట్లో నివాసముంటున్న వల్లెం ప్రతాప్‌రెడ్డి విశ్రాంత మున్సిపల్ ఉద్యోగి. ఆయన సతీమణి వెంకటరమణమ్మ గృహిణి. వారికి విష్ణుస్వరూప్‌రెడ్డి, సుక్రుతరెడ్డి సంతానం. విష్ణుస్వరూప్‌రెడ్డి చెన్నైలోని ఎస్ఆర్ఎంలో బీటెక్ ఈసీఈ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష అతడిలో బలంగా ఉండేది. మేనమామ శివారెడ్డి, ఇంకా డాక్టర్ వివేకానందరెడ్డి ప్రోత్సాహంతో ఢిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకున్నారు. గ్రూప్–1 ప్రకటన వెలువడడంతో ప్రణాళికతో సన్నద్ధమై రాశారు. తొలి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఎంపికయ్యారు. కుమారుడు డీఎస్పీగా ఎంపికవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రస్తుతం విష్ణుస్వరూప్‌రెడ్డి దుబాయ్‌లో ఎంబీఏ చదువుతున్నారు. -
Vizianagaram: గ్రూప్–1 ఫలితాలు.. రాణించిన రైతు బిడ్డ
గ్రూప్–1 ఫలితాల్లో విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు, మరో అధికారి ప్రతిభ చూపారు. వీరిలో ఇద్దరు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నతోద్యాగాలకు సిద్ధమై విజయం సాధించగా, మరొకరు సివిల్స్ శిక్షణ తీసుకుంటూ గ్రూప్–1 ఉద్యోగానికి అర్హత సాధించారు. డిప్యూటీ కలెక్టర్‌గా కీర్తి విజయనగరం పూల్‌బాగ్: విజయనగరం జిల్లా బీసీ సంక్షేమాధికారి దాట్ల కీర్తి గ్రూప్ –1లో విజేతగా నిలిచారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపి కయ్యారు. ఆమె రాష్ట్ర స్థాయిలో 8, ఉత్తరాంధ్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఆమె గత మూడేళ్లుగా జిల్లా బీసీ సంక్షేమాధి కారిగా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో ఆమె డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. రెండో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆమె తల్లి దాట్ల నిర్మల విశాఖపట్నం జిల్లా చోడపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తుండగా, తండ్రి జగన్నాథ రాజు హెచ్‌సీ వెంకటాపురం మండలం జెడ్పీహెచ్ లో స్కూల్ అసిస్టెంట్(సైన్సు)గా పనిచేసి ఉద్యోగవిరమణ పొందారు. కీర్తి స్వస్థలం విశాఖజిల్లా మాకివారిపాలెం మండలంలోని రాజులనగరం. కీర్తికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. రాణించిన రైతు బిడ్డ గుర్ల: గుర్ల మండలంలోని నాగళ్లవలసకి చెందిన అట్టాడ అప్పలనాయుడు ఓ వైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు గరివిడి ఫేకర్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కుమారుడు వెంకటరమణ మూర్తి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ చూపడంతో ప్రోత్సహించాడు. ఇప్పుడు ఆయన గ్రూపు–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన గరివిడిలోని గోదావరి స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించడంతో పుటపర్తిలోని శ్రీ సత్యసాయి విద్యాలయాల్లో ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఢిల్లీలో మూడేళ్లుగా శిక్షణ తీసుకున్నారు. మొదటి ప్రయత్నం విఫలం అయిన నిరాశ చెందకుండా చదువుతున్నారు. సచివాలయ ఉద్యోగానికి ఎంపికైనా చేరలేదు. సివిల్స్‌లో రాణించి ఐఏఎస్ అవ్వాలన్నదే అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు అప్పలనాయుడు, పద్మావతి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసిస్టెంట్ ట్రజరీ అధికారిగా సన్యాసిరావు వేపాడ: మండలంలోని బంగారయ్యపేట ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తరిణి సన్యాసిరావు గ్రూపు–1లో విజేతగా నిలిచారు. అసిస్టెంట్ ట్రజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఆయనది ఎల్.కోట మండలం గొల్జాం స్వగ్రామం. తల్లిదండ్రులు తరిణి రామారావు, ఈశ్వరమ్మల ప్రోత్సాహంతో ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. 2006లో డీఎస్సీ క్వాలిఫై అయ్యారు. 2008 ఫిబ్రవరి 28న ఎస్.కోట మండలం వెంకటరమణపేట ఎంపీయూపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ 2009 వరకు పనిచేశారు. 2009 ఆగస్టు నుంచి 2017 జూలై వరకు ఎంపీయూపీఎస్ జాకేరులో పనిచేశారు. 2017 ఆగస్టు నుంచి నేటివరకు ఎంపీపీఎస్ బంగారయ్యపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన గ్రూపు–1లో విజయం సాధించడంతో తల్లిదండ్రులతో పాటు భార్య పద్మశ్రీ, కుమారై లిఖితరామ్, కుమారుడు భార్గవ్‌రామ్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డే లక్ష్యం) -
వచ్చే నెలలో గ్రూప్–1, 2 నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం సూచించిన మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ పి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంగళవారం గ్రూప్–1 తుది ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో 110 గ్రూప్–1 పోస్టులు, 182 గ్రూప్–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. 2 వేల వరకు వివిధ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. 670 జూనియర్ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా నిపుణులైన ఉద్యోగులను రాష్ట్రానికి అందించేలా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. పోస్టులకు ఎంపిక ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్ ముందుకు వెళ్తుందన్నారు. గ్రూప్–1 కేడర్‌లోనూ సీపీటీ పరీక్ష గ్రూప్–1 కేడర్ పోస్టులకు కూడా ఇకనుంచి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహించనున్నట్టు సవాంగ్ తెలిపారు. ఈ–గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లతో పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు సంబంధించి సీపీటీ సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రొబేషనరీ ఖరారుకు ఎంపికైన వారికి డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా నిర్వహించే ప్రతిపాదన ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చేనెల 8న విశాఖపట్నంలో ఆలిండియా కమిషన్ల సమావేశం ఉంటుందని అందులోనూ చర్చిస్తామని తెలిపారు. గవర్నర్‌కు వివరణలు పంపించాం గ్రూప్–1పై ఇటీవల కొందరు అభ్యర్థులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సవాంగ్ సమాధానమిస్తూ.. ఈ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున బయటకు స్పందించలేమన్నారు. సంబంధిత అంశాలపై గవర్నర్ కార్యాలయానికి వివరణలు పంపించామన్నారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనడం వాస్తవం కాదని, వీటిపై ఇంతకుమించి స్పందించలేమని పేర్కొన్నారు. అన్ని ఫైళ్లను కోర్టు ముందుంచామన్నారు. సమాధాన పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడమనే విధానం ఏపీపీఎస్సీలో లేదని, యూపీఎస్సీలో కూడా లేదని వివరించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి వయోపరిమితి సడలించాలని అభ్యర్థుల నుంచి వస్తున్న వినతిపై స్పందిస్తూ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు విజయకుమార్, ప్రొఫెసర్ పద్మ రాజు, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, సలాంబాబు, రమణా రెడ్డి, పి.సుధీర్, ఎన్.సోనీవుడ్, ఎన్.సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి అరుణకుమార్ పాల్గొన్నారు. -
ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 ఫలితాల ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మంగళవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం లక్షా నలభై వేల మంది పరీక్షలు రాయగా. స్క్రీనింగ్ టెస్ట్‌కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారు. 167 గ్రూప్ వన్ పోస్టులకి గాను 325 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. కరోనాతో పాటు న్యాయపరమైన అంశాల వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఫలితాల్లో.. పిఠాపురం ప్రాంతానికి చెందిన సుష్మితకు ఫస్ట్ ర్యాంక్ దక్కింది. వైఎస్సార్ జిల్లా కొత్తులగుట్టకు చెందిన శ్రీనివాసులుకు రెండో ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన సంజన సిన్హాకు మూడో ర్యాంక్ దక్కింది. మొదటి పది స్ధానాలలో ఏడుగురు మహిళలు ఉండడం గమనార్హం. గ్రూప్-1 2018 నోటిఫికేషన్లో 167 పోస్టులకుగానూ.. 165 పోస్టులకు ఇప్పుడు ఫలితాలు ఇచ్చారు. వీటిలో 30 పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోపు బోర్డు ముందు హాజరై.. హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారాయన. వచ్చే నెలలోనే గ్రూప్-2 నోటిఫికేషన్లు ఉంటాయని, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
గ్రూప్–1 ఇంటర్వ్యూ ఫలితాలు వెల్లడించండి
సాక్షి, అమరావతి : గ్రూప్–1 ఇంటర్వ్యూలు, నియామక ప్రక్రియలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం సైతం నిరాకరించింది. ఇంటర్వ్యూలు, వాటి ఫలితాల వెల్లడి, తదనంతర నియామక ప్రక్రియను యథాతథంగా కొనసాగించవచ్చని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే నియామకాలన్నీ కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని, ఈ విషయాన్ని అభ్యర్థులకు ఇచ్చే నియామక ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని చెప్పింది. ఎంపికైన అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేక హక్కులను (ఈక్విటీస్) కోరజాలరని, దీనిపై వారి నుంచి హామీ తీసుకోవాలని కమిషన్‌ను ఆదేశించింది సింగిల్ జడ్జి ముందున్న వ్యాజ్యాల్లో జూలై మొదటి వారానికల్లా కౌంటర్లు దాఖలు చేయాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. ఆ కౌంటర్లకు 13వ తేదీకల్లా సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు చెప్పింది. రిట్ పిటిషన్లను జూలై 14న లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇరుపక్షాలూ ఎలాంటి వాయిదా కోరకుండా ఆ రోజున వాదనలు వినిపిస్తారని ఆశిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. గ్రూప్–1 మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, అందువల్ల ఇంటర్వ్యూలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఇంటర్వ్యూలు, నియామక ప్రక్రియ నిలుపుదలకు నిరాకరిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ ధర్మాసనం రెండు రోజుల క్రితం వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ ఆదేశాలతో అందరి ప్రయోజనాలు పరిరక్షించినట్లు అవుతుందని పేర్కొంది. సమాధాన పత్రాలు జాగ్రత్త చేయండి 2018 డిసెంబర్ 31 నాటి నోటిఫికేషన్ ఆధారంగా గ్రూప్–1 మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థులందరి సమాధాన పత్రాలను జాగ్రత్త చేయాలని సర్వీస్ కమిషన్‌ను ధర్మాసనం తన తీర్పులో ఆదేశించింది. డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన అభ్యర్థుల సమాధాన పత్రాలు, వారు మాన్యువల్ మూల్యాంకనంలో సాధించిన మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచాలని ఆదేశించింది. మాన్యువల్ మూల్యాంకనంలో అర్హత సాధించిన అభ్యర్థుల సమాధాన పత్రాలను కూడా సీల్డ్ కవర్లో తమ ముందుంచాలంది. కోర్టు ఏ సమాధాన పత్రం చూడాలన్నా తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. మాన్యువల్ మూల్యాంకనం చేసిన వారిలో 50 శాతంకి తగిన అర్హతలు లేవని పిటిషనర్లు చెబుతున్నారని, అయితే, 50 శాతం మందికి పీహెచ్డీ డిగ్రీలు ఉన్నాయని, వారు ఆయా సబ్జెక్టుల్లో మంచి పరిజ్ఞానం ఉన్న వారని ఏపీపీఎస్సీ చెబుతోందని తెలిపింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మూల్యాంకనకర్తల వివరాలను ముందే సోషల్ మీడియాలో పోస్టు చేసినా, వారికి అభ్యర్థుల పేర్లు తెలిసే అవకాశం లేదని, సమాధానపత్రాలన్నీ డీకోడ్ చేస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ వాదన తోసిపుచ్చలేం మాన్యువల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్లను సింగిల్ జడ్జి అనుమతించిప్పటికీ, వారికి మాత్రం ఉద్యోగాలు రావని, కోర్టు ఆదేశాల ప్రకారం మొత్తం ప్రక్రియను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందన్న ఏపీపీఎస్సీ వాదనను తోసిపుచ్చలేమని తెలిపింది. తమ అభిప్రాయాలు ఈ అప్పీళ్లను తేల్చడానికి మాత్రమే పరిమితం అవుతాయే తప్ప అంతకు మించి కాదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల ఫలితాలను ప్రభుత్వానికి పంపడానికి ఏపీపీఎస్సీకి 7–9 రోజులు పడుతుందని, ఆ తరువాత కమిషన్ సిఫారసులను ఆమోదించి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రభుత్వానికి 4–6 వారాల సమయం పడుతుందని తెలిపింది. అందువల్ల సింగిల్ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాలను జూలై 14న లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నట్లు తెలిపింది. -
ఏపీలోని గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో అవకాశం
సాక్షి, అమరావతి: గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం సవరించిన అర్హుల జాబితాలోని అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు ఏపీపీఎస్సీ శుక్రవారం తెలిపింది. చదవండి: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే.. అప్పట్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోడేటా సమర్పణకు కొంతమంది హాజరు కాలేకపోయారని పేర్కొంది. వారు ఈ నెల 5న విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోడేటా వివరాల సమర్పణకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరింది. -
‘ఫ్లాట్‌ఫుట్’తో దక్కని కొలువు
సాక్షి, అమరావతి: చదునైన పాదం (ఫ్లాట్ ఫుట్) ఉంటే అదృష్టం అంటారు. కానీ, ఓ యువకుడికి అది దురదృష్టంగా మారింది. ప్రభుత్వోద్యోగాన్ని దూరం చేసింది. చివరకు ఆ యువకుడు రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ఫ్లాట్ ఫుట్ ఉన్న వ్యక్తులు అసిస్టెంట్ మోటారు వెహికల్స్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)గా నియమితులు కావడానికి అనర్హులని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీఓలను, నోటిఫికేషన్‌ను హైకోర్టు సమర్థించింది. వీటిని అతను సవాల్‌చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇదీ వివాదం.. రవాణా శాఖలో ఏఎంవీఐ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 2018లో నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో వైఎస్సార్ కడప జిల్లా, రాయచోటి మండలానికి చెందిన నల్లమల నాగేశ్వరయ్య దరఖాస్తు చేసుకున్నారు. 2019లో నిర్వహించిన పరీక్షల్లో నాగేశ్వరయ్యకు 300 మార్కులకు గాను 194.26 మార్కులు వచ్చాయి. మెరిట్ జాబితాలో అతనిది రెండో స్థానం. అనంతరం మెడికల్ టెస్ట్ నిర్వహించగా ఫలితాల్లో అతని పేరులేదు. కుడిపాదం చదునుగా ఉండటంతో అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో నాగేశ్వరయ్య నోటిఫికేషన్‌తో పాటు ఇందుకు సంబంధించిన జీఓలను సవాలు చేస్తూ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఇవన్నీ కూడా ఏపీ రవాణా సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌కు, దివ్యాంగుల చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం ఇటీవల విచారించింది. వైకల్యం కారణంగా వివక్ష చూపడానికి వీల్లేదని నాగేశ్వరయ్య తరఫు న్యాయవాది వాదించారు. ఫ్లాట్‌ఫుట్ ఆ పోస్టుకు అనర్హతే.. దివ్యాంగుల చట్టం ప్రకారం ఫ్లాట్‌ఫుట్ వైకల్యం కాదని, అందువల్ల నాగేశ్వరయ్య ఆ చట్టం కింద రిజర్వేషన్ కోరలేరని ప్రభుత్వ, ఏపీపీఎస్సీ న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ సర్వీసు రూల్స్ ప్రకారం ఏఎంవీఐ పోస్టుకు ఫ్లాట్‌ఫుట్ ఉన్న వ్యక్తి అనర్హుడని, అందువల్ల అతన్ని ఎంపిక చేయలేదన్నారు. ఏఎంవీఐ, మెటారు వాహనాల ఇన్స్పెక్టర్ (పదోన్నతి ద్వారా), అసిస్టెంట్ మోటారు వాహనాల ఇన్స్పెక్టర్ (పదోన్నతి, ప్రత్యక్ష భర్తీ), ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్ (పదోన్నతి), ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ (ప్రత్యక్ష భర్తీ) పోస్టులకు దివ్యాంగుల రిజర్వేషన్‌ను మినహాయిస్తూ ప్రభుత్వం 2021లో జీఓ కూడా ఇచ్చిందని కోర్టుకు నివేదించారు. ఈ పోస్టులన్నింటికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరన్నారు. అందువల్ల ఈ పోస్టుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించడం లేదన్నారు. వీటన్నింటి దృష్ట్యా పిటిషనర్ ఏఎంవీఐగా నియామకం కోరజాలరని వారు కోర్టుకు విన్నవించారు. రిజర్వేషన్‌ను మినహాయించొచ్చు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ, ఏపీపీఎస్సీ న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. ఉద్యోగ స్వభావాన్ని బట్టి రిజర్వేషన్‌ను మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఇదే విషయాన్ని దివ్యాంగుల చట్టం చెబుతోందని ధర్మాసనం పేర్కొంది. అంతేకాక.. ‘ఫ్లాట్ ఫుట్ కలిగి ఉన్న వ్యక్తి ఏఎంవీఐగా అనర్హుడని తేల్చడం చట్ట విరుద్ధమన్న పిటిషనర్ వాదన అర్ధరహితం. ఫ్లాట్‌ఫుట్ అనేది అంగవైకల్యం కానప్పటికీ, ఏఎంవీఐగా విధులు నిర్వర్తించేందుకు అది అడ్డంకి అవుతుంది. అది ఉన్న వ్యక్తికి నడిచేందుకు, పరిగెత్తేందుకు సరైన పట్టు ఉండదు. ఇది విధి నిర్వహణలో అతనికి ఇబ్బందవుతుంది. కాబట్టి పిటిషనర్, ఆ నిబంధనలను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరలేరు’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
గ్రూప్–1,2 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్ – 1, 2 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు భర్తీ చేస్తారు. గతంలో ప్రకటించిన జాబ్ క్యాలండర్ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ 1, 2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు. ఆ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినివ్వడంతో త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి. -
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: గ్రూప్ 1,2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 292 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 110 గ్రూప్-1.. 182 గ్రూప్-2 మొత్తం 292 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్ రాష్ట్రంలో గ్రూప్–1, 2 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టులు బాగా పెరిగాయి. గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు.. మొత్తం కలిపి 292 పోస్టులు వచ్చాయి. అలాగే, గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓ, సీటీఓ, డీఎస్పీ, డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి. -
నిరుద్యోగులకు తీపికబురు చెప్పిన సీఎం జగన్
-
గుడ్‌న్యూస్.. ఏపీలో గ్రూప్–1, 2 పోస్టులు భారీగా పెంపు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో గ్రూప్–1, 2 పోస్టులకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టులు బాగా పెరిగాయి. గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు.. మొత్తం కలిపి 292 పోస్టులు వచ్చాయి. అలాగే, గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓ, సీటీఓ, డీఎస్పీ, డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీచేయనుంది. -
AP: అంగన్వాడీ’లకు తీపికబురు
సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పదోన్నతుల కోసం ఎనిమిదేళ్ల వీరి నిరీక్షణకు తెరదించి అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే, ప్రస్తుతమున్న పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ఫోన్లు సైతం అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనూరాధ వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వీరికి పదోన్నతులు కల్పించాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న 560 విస్తరణాధికారులు (ఈఓ) గ్రేడ్–2 (సూపర్వైజర్లు) పోస్టులు వీరితో భర్తీకానున్నాయి. నిజానికి.. రాష్ట్రంలో మంజూరైన మొత్తం గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులు 976 ఉన్నాయి. వాటిలో 416 పోస్టులను గతంలో భర్తీచేశారు. అంగన్వాడీ వర్కర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా మిగిలిన పోస్టులను భర్తీచేస్తారు. వచ్చే మార్చిలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుంది. అంగన్వాడీ వర్కర్ల చేతికి ’స్మార్ట్ ఫోన్’ ఇక రాష్ట్రంలోని అంగన్వాడీ సూపర్వైజర్లు, వర్కర్ల చేతికి ప్రభుత్వం కొత్త స్మార్ట్ఫోన్లు ఇవ్వనుంది. 55,607 అంగన్వాడీ వర్కర్లు, 1,377 సూపర్వైజర్లకు కలిపి మొత్తం 56,984 స్మార్ట్ఫోన్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఒక్కో ఫోన్ ఖరీదు రూ.14,998 కాగా, మొత్తం రూ.85.47 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత సర్కారు వీరిని నిర్లక్ష్యం చేసింది రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు విశేష సేవలందిస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం తరఫున తమ వంతు సేవలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్ల మేలు కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రేడ్–2 సూపర్వైజర్లకు గ్రేడ్–1 సూపర్వైజర్లుగాను, గ్రేడ్–1 సూపర్వైజర్లకు సీడీపీఓలుగాను, సీడీపీఓలకు ఏపీఓలుగాను పదోన్నతులు కల్పించాం. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లకు గ్రేడ్–2 సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం వీరిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంగన్వాడీ వర్కర్ల పదోన్నతుల విషయంలో వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. – తానేటి వనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పారదర్శకంగా పదోన్నతులు అంగన్వాడీ వర్కర్లకు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. 2013లో వీరికి పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత ఇప్పటిదాకా లేవు. అప్పటి నుంచి ఉన్న ఖాళీలను అర్హులైన అంగన్వాడీ వర్కర్లతో భర్తీ చేయాలనే డిమాండ్ ఉంది. వీరి విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పదోన్నతులకు ఆమోదం తెలిపింది. దీనికి మార్చిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. – కృతికా శుక్లా, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు -
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
-
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, 2019 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన సవాంగ్‌ను ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: హత్య, కుట్ర రాజకీయాలే చంద్రబాబు నైజం.. ఈ ప్రశ్నలకు సీబీఐ, సీబీఎన్ సమాధానం చెప్పాలి) -
ఉద్యోగాల భర్తీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సంస్కరణలు
సాక్షి, అమరావతి: పారదర్శకంగా ఉద్యోగ నియామకాలతోపాటు పోస్టుల భర్తీలో అక్రమాలకు తావులేకుండా పలు కీలక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు రద్దు, డిజిటల్ మూల్యాంకనం, ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలు, రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ పోస్టులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కోటా అమలు తదితరాలు ఇందులో ఉన్నాయి. ఎక్కువ అభ్యర్థులున్న పోస్టులకే ప్రిలిమ్స్ గ్రూప్–1 పోస్టులకు మినహా మిగతా అన్ని కేటగిరీల పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు రావడం, మెరిట్ అభ్యర్థులను నిర్ణయించడంలో సమస్యలు తలెత్తడంతో కొన్ని మినహాయింపులు చేపట్టింది. అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందే పోస్టులకు మినహా మిగతా వాటికి ప్రిలిమ్స్ లేకుండా ఒకే పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. దీంతోపాటు గ్రూప్–1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలను పూర్తిగా తొలగించారు. గత సర్కారు హయాంలో ఇంటర్వ్యూల పేరిట తమ వారికే పోస్టులు వచ్చేలా చేసి అర్హులకు అన్యాయం చేశారు. అన్ని బోర్డులకు ఏపీపీఎస్సీ చైర్మనే నేతృత్వం వహించడంతో అక్రమాలకు తెర లేచింది. దీన్ని పూర్తిగా రద్దు చేసి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో కొన్ని పోస్టులకు బహుళ బోర్డులతో ఇంటర్వ్యూలను నిర్వహించారు. బోర్డులకు వేర్వేరు చైర్మన్లను నియమించారు. గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు రద్దయిన నేపథ్యంలో ఏపీ స్టేట్ సర్వీస్ కేడర్ పోస్టుల అభ్యర్థుల ఎంపికలో వ్యక్తిత్వం, పరిపాలనా దక్షతను అంచనా వేసేందుకు ప్రత్యామ్నాయ విధానాలపై కమిషన్ కసరత్తు చేస్తోంది. మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రం టీడీపీ సర్కారు గ్రూప్ 1తో పాటు అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రిలిమ్స్‌ను తప్పనిసరి చేసింది. గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా దాన్ని రద్దు చేసి 1:15 ప్రకారం మార్చింది. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారు. పాత విధానాన్ని కొనసాగించాలని ఆందోళన చేసినా పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాన్ని మార్చి నిరుద్యోగులకు మేలు చేసేలా 1: 50 నిష్పత్తిని తిరిగి ప్రవేశపెట్టింది. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల అభ్యర్థులందరికీ ఒకేసారి ప్రశ్నపత్రం అందడంతో పాటు లీకేజ్ లాంటి వాటికి ఆస్కారం లేకుండా చేశారు. అవకతవకలను నివారించేందుకు ఏపీపీఎస్సీ డిజిటల్ మూల్యాంకనాన్ని చేపట్టింది. దీనివల్ల పారదర్శకతతో పాటు అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది. నెగిటివ్ మార్కులు రద్దు.. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్టుమెంట్ పరీక్షల్లో గత సర్కారు నెగిటివ్ మార్కులు ప్రవేశపెట్టడంతో పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కోసం పరీక్షలు రాసే ఉద్యోగులు నష్టపోయారు. దీన్ని రద్దు చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఆలకించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిపార్టుమెంట్ పరీక్షలలో నెగిటివ్ మార్కులను రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయోపరిమితి పొడిగింపు ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి నిబంధనల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కల్పిస్తున్న ఐదేళ్ల సడలింపును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వర్గాలకు కల్పిస్తున్న సడలింపు కాలపరిమితి 2021 మే నెలతో ముగిసింది. కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో ఈ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా వయోపరిమితి సడలింపును 2026 మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ పోస్టులు గత సర్కారు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు తమ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని ముఖ్యంగా వయోపరిమితి మినహాయింపును వినియోగించుకుంటే వారిని ఆ కేటగిరీ పోస్టులకే పరిమితం చేస్తూ ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనర్హులుగా చేసింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలతో పాటు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులందరికీ తీరని నష్టం వాటిల్లింది. దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదులు అందినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకున్నా మెరిట్లో అగ్రస్థానంలో ఉంటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హులుగా నిర్ణయిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి మేలు చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడ బ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటాను రిజర్వు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2018లో చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో ఆ కోటా సంగతిని ప్రస్తా వించకుండా నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఆ వర్గాల యువతకు అన్యాయం జరిగింది. పైగా పది శాతం కోటాలో 5 శాతాన్ని కాపులకు ప్రత్యేకిస్తున్నట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు ఇవ్వడంతో అది న్యాయపరంగా చెల్లుబాటు కాకుండా నిలిచిపోయింది. దీనివల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు చర్యలు తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఏపీపీఎస్సీ ఆమేరకు చర్యలు చేపట్టింది. కొత్త నోటిఫికేషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థుల వివరాలను పొందుపర్చేలా వీలు కల్పించింది. -
ఉద్యోగాల భర్తీకి రెడీ.. ఏపీపీఎస్సీ ద్వారా 3,946 పోస్టులు భర్తీ
సాక్షి, అమరావతి: నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తూ అందుబాటులో ఉన్న అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా గ్రూప్–1, గ్రూప్–2 పోస్టులను సాధ్యమైనంత ఎక్కువగా భర్తీ చేసేలా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసిన పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా త్వరగా పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయనున్నారు. మరిన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకూ ఏపీపీఎస్సీ సన్నాహాలు ప్రారంభించింది. 6 లక్షలకుపైగా పోస్టుల భర్తీతో సరికొత్త చరిత్ర దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో సీఎం జగన్ నిరుద్యోగ అభ్యర్థులకు మేలు చేకూరుస్తున్నారు. రెగ్యులర్ పోస్టులతో పాటు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ తదితర మార్గాల్లో యువతకు ప్రయోజనం కల్పిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 6,03,756 పోస్టులను భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1,84,264 ఉండగా కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్ సోర్సింగ్ పోస్టులు 3,99,791 ఉన్నాయి. వీటిలో ప్రధానంగా సచివాలయ వ్యవస్థ ద్వారా 1,21,518 మందికి ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. నాడు నోటిఫికేషన్లతో సరి.. నేడు పోస్టులన్నీ భర్తీ గత సర్కారు హయాంలో ఎన్నికల ముందు వరకు పట్టించుకోకుండా ఆరు నెలల ముందు 2018 చివరిలో హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేశారు. కేవలం యువతను మభ్యపెట్టేలా నోటిఫికేషన్లు ఇవ్వడమే కానీ పోస్టులు భర్తీ చేయలేదు. కొన్ని న్యాయవివాదాలతో నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం 3,946 పోస్టులకు సంబంధించిన న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంది. రెండున్నరేళ్లలో దాదాపు రెండేళ్లు కరోనాతో ఇబ్బందులు ఎదురైనా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం పోస్టులు భర్తీ చేసింది. కొత్తగా 1,237 పోస్టులకు నోటిఫికేషన్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొత్తగా 1,237 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడంతో పాటు పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇవేకాకుండా త్వరలో మరో 458 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో వాటి సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు గ్రూప్ 1లో 31, గ్రూప్ 2 సర్వీస్‌లో 30 పోస్టులను గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరగనుంది. వైద్యశాఖలో 39 వేల పోస్టుల భర్తీ వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇప్పటికే 27 వేల మంది నియామకాలు పూర్తి కాగా మొత్తం 39 వేల పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లా బోధనాసుపత్రినుంచి విలేజ్ క్లినిక్ వరకు అన్ని చోట్లా పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఏపీపీఎస్సీ ద్వారా ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించినా న్యాయవివాదాలతో ప్రక్రియ నిలిచిపోయింది. రేషనలైజేషన్ పేరుతో పోస్టులను టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మార్చేశారు. వీటన్నిటినీ సరిదిద్దడంతో పాటు పోస్టుల సంఖ్యను 2 వేలకు పెంచి న్యాయవివాదాలకు తావులేని విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ద్వారా చర్యలు చేపట్టింది. న్యాయవివాదాలను పరిష్కరించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు. 10,143 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అయితే నిరుద్యోగులకు మేలు చేస్తూ పోస్టుల సంఖ్య మరింత పెరిగేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు పోలీసు విభాగంలో ఏటా 6,500 పోస్టుల భర్తీకి ఇటీవల పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులకు న్యాయం ఎన్నికలకు ముందు గత సర్కారు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకొన్న 2018 డీఎస్సీకి సంబంధించి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేసి వారందరికీ ఉద్యోగాలు కల్పించింది. మొత్తం 7,902 మందికి ఇలా ఉద్యోగాలు వచ్చాయి. ఇదే కాకుండా దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయిన 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులకు సీఎం జగన్మోహన్రెడ్డి న్యాయం చేశారు. ఆ డీఎస్సీలో 2,192 మందికి ఉద్యోగాలు కల్పించి మినిమం టైమ్‌స్కేలును అమలు చేస్తున్నారు. అలాగే కేజీబీవీల్లో 958 పోస్టులను, మోడల్ స్కూళ్లలో 164 టీచింగ్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. -
ముందు ఆప్షన్ ఇచ్చినవారికే తొలి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులకు పరీక్ష కేంద్రాల కేటాయింపులో ముందుగా ఆప్షన్ ఇచ్చిన వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఫిబ్రవరి 5లోగా ఆప్షన్లను వెబ్ లింక్‌లో కొత్తగా నమోదు చేయాలని సూచించింది. ఈ వెబ్ లింక్ ( https:// psc. ap. gov. in) ఈ నెల 27 నుంచి అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా వెబ్ ఆప్షన్లను సమర్పించాలి. ఇంతకు ముందు దరఖాస్తుల సమర్పణ సమయంలో ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోరు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రం ఆప్షన్లతోపాటు తమ సబ్జెక్ట్, పోస్టు ప్రాధాన్యతలను ఫిబ్రవరి 5లోపు కమిషన్ వెబ్సైట్లో నమోదు చేయాలి. ఈ ఆప్షన్లనే తుది ఆప్షన్లుగా పరిగణిస్తారు. అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో మూడు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. కేంద్రాల ఎంపిక సహా ఇతర అంశాలను ఎడిట్ ఆప్షన్ ద్వారా జాగ్రత్తగా నమోదు చేయాలి. కాగా, ఏపీపీఎస్సీ 190 ఏఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్–2018 ఫలితాలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను మాన్యువల్‌గా పునర్ మూల్యాంకనం చేయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష సమాధాన పత్రాలను ఇంతకుముందు డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయించి ఫలితాలు విడుదల చేశారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనం గురించి ముందుగా నోటిఫికేషన్లో పేర్కొనకపోవడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈసారి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. వాస్తవానికి 2018 గ్రూప్–1 మెయిన్స్‌కు డిజిటల్ మూల్యాంకనం చేపడుతున్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనకున్నా పరీక్షలకు ముందునుంచే అభ్యర్థులకు కమిషన్ వెబ్సైట్ ద్వారా, మీడియా ద్వారా తెలియచేస్తూ వచ్చింది. అప్పట్లో అభ్యర్థులెవరి నుంచీ వ్యతిరేకత రాకపోగా అంతా స్వాగతించారు. అయితే ఫలితాలు విడుదల చేశాక ఎంపిక కాని కొందరు అభ్యర్ధులు పలు సందేహాలు, అనుమానాలతో డిజిటల్ మూల్యాంకనాన్ని తప్పుబడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అభ్యర్థుల అనుమానాలను, సందేహాలను కోర్టు ఆమోదించలేదు. కేవలం మూల్యాంకన విధానం సరైన రీతిలో అమలు చేయనందున ఈసారికి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లే అవకాశమున్నా మరింత జాప్యం అయ్యే ఆస్కారం ఉండటం, ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో అప్పీల్‌కు వెళితే మరో రెండేళ్లు సమయం వృథా అవుతుందని భావించిన ఏపీపీఎస్సీ మాన్యువల్ మూల్యాంకనానికే మొగ్గు చూపింది. మూల్యాంకనాన్ని త్వరితంగా ముగించి ఫిబ్రవరి నెలలో ఫలితాలను విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ‘సాక్షి’కి చెప్పారు. యువత, నిరుద్యోగ సంఘాలతో భేటీ ఇలా ఉండగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ చేపడుతున్న విధానాలు, కొత్తగా చేపట్టబోయే సంస్కరణలు, ఇతర అంశాలపై యువత, నిరుద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. సంక్రాంతి తరువాత ఈ సమావేశం నిర్వహించనున్నారు. గతంలో ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు, నిరుద్యోగ యువత, సంఘాలతో సమావేశం నిర్వహించారు. అందరినుంచి అభిప్రాయాలు సేకరించారు. అయితే ఈ సమావేశంలో ఒకేసారి అందరినీ అనుమతించడంతో ఎవరేం చెబుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ అనుభవంతో ఈసారి ఏపీపీఎస్సీ కార్యాలయంలోనే సమావేశాన్ని ఏర్పాటుచేసి ఆయా సంఘాలను, అభ్యర్థులను ఆహ్వానించి బృందాల వారీగా అభిప్రాయాలు తీసుకోవాలని కమిషన్ భావిస్తోంది. -
ఏపీపీఎస్సీ గెజిటెడ్ ఉద్యోగాలు.. ఆన్లైన్లో అప్లై చేయండి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)... వివిధ విభాగాల్లో గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 25 ► పోస్టుల వివరాలు: ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏపీ ఫిషరీస్ సర్వీస్)–11, సెరీకల్చర్ ఆఫీసర్(ఏపీ సెరీకల్చర్ సర్వీస్)–01, అగ్రికల్చర్ ఆఫీసర్(ఏపీ అగ్రికల్చర్ సర్వీస్)–06, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్)–02, టెక్నికల్ అసిస్టెంట్(ఏపీ పోలీస్ సర్వీస్)–01, అసిస్టెంట్ కమిషనర్(ఏపీ ఎండోమెంట్స్ సర్వీస్)–03, అసిస్టెంట్ డైరెక్టర్(ఏపీ హార్టికల్చర్ సర్వీస్)–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ► వయసు: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 21–28 ఏళ్లు, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు 28–42 ఏళ్లు, మిగతా పోస్టులకు 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.29,760 నుంచి రూ.93,780 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రారంభ తేది: 08.12.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 28.12.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in -
మేలుకో మహిళ.. ఈ మేటి కొలువులు నీకోసమే!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. మరో చక్కటి నోటిఫికేషన్‌తో ఉద్యోగార్థుల ముందుకొచ్చింది! మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగంలోని..ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. హోంసైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, సోషల్ వర్క్ తదితర విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళలు ఈ కొలువులకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్‌లకు అర్హతలు, ఎంపిక విధానం, విజయం సాధించేందుకు ప్రిపరేషన్ గైడెన్స్.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విభాగాల్లో ఒకటి. అంతటి కీలక విభాగంలో ఖాళీగా ఉన్న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అకడమిక్‌గా ఆయా సబ్జెక్ట్లపై పట్టున్న వారు ఈ పరీక్షలో విజయం సాధించడం సులభమే అంటున్నారు నిపుణులు. ► మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 22 ► పోస్టుల వివరాలు: ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1(సూపర్వైజర్) అర్హతలు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్‌లలో ఏదో ఒకటి గ్రూప్ సబ్జెక్ట్‌గా బీఎస్సీ (బీజెడ్సీ) ఉత్తీర్ణత ఉండాలి. ► హోంసైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో.. ఉన్నత విద్య అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వయో పరిమితి ►వయసు జూలై 1, 2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ప్రారంభ వేతనం ► ఏపీపీఎస్సీ భర్తీ చేయనున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని సబార్డినేట్ సర్వీస్‌లోని ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను గ్రేడ్–1 హోదా పోస్ట్‌లుగా పేర్కొన్నారు. ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లనే సూపర్వైజర్లుగా కూడా పిలుస్తారు. వీరికి వేతన శ్రేణి రూ.24,440–రూ.71,510గా ఉంటుంది. ఎంపిక విధానం ఆన్లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో జరిగే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక చేస్తారు. ఈ ఆన్లైన్ పరీక్షలో రెండు పేపర్లు మొత్తం 300 మార్కులకు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు–150 మార్కులకు; పేపర్ 2 హోం సైన్స్ అండ్ సోషల్ వర్క్ 150 ప్రశ్నలు–150 మార్కులకు నిర్వహిస్తారు. ► ప్రశ్నలన్నింటినీ ఆబ్జెక్టివ్ తరహా బహుళైచ్ఛిక విధానంలోనే అడుగుతారు. ► ఈ రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)గా నిర్వహిస్తారు. ► ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు ఉంటుంది. ► ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 తగ్గిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్‌లకు అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వ్డ్ కేటగిరీలకు కేటాయించిన పోస్ట్‌లు తదితర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని.. ఆయా కేటగిరీల్లో మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు. దరఖాస్తు విధానం: ► ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: నవంబర్ 18–డిసెంబర్ 8, 2021 ► అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెంబర్ 7, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులో సవరణ:దరఖాస్తు చివరి తేదీ నుంచి ఏడు రోజుల లోపు సవరణలు చేసుకోవచ్చు. ► వెబ్సైట్ https://psc.ap.gov.in/ రాత పరీక్షలో రాణించాలంటే ► రెండు పేపర్లుగా నిర్వహించే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రాత పరీక్షలో రాణించేందుకు అభ్యర్థులు పక్కా ప్రిపరేషన్ ప్రణాళికతో ముందుకు సాగాలి. ► పేపర్–1(జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ) అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సమకాలీన పరిణామాలపై పట్టు సాధించాలి. తాజాగా ముగిసిన కాప్ సదస్సు, ఆయా అంశాలకు సంబంధించి ఐరాస నివేదికలు, భారత్–ఇతర దేశాల మధ్య ఇటీవల కాలంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ►రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలు, కళలు, క్రీడలు, సంస్కృతి, పాలనకు సంబంధించి జాతీయ అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై పట్టు సాధించాలి. ► కరెంట్ ఆఫైర్స్‌కు సంబంధించి.. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి అంతకుముందు సంవత్సర కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై దృష్టి పెట్టాలి. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమకాలీన అంశాలకు సంబంధించి తాజా పాలసీలు, పథకాలు, నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై గణాంక సహిత సమాచారంతో సిద్ధంగా ఉండాలి. ►మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన పోస్ట్‌లకు పరీక్ష నిర్వహిస్తున్న∙నేపథ్యంలో.. ఏపీలో మహిళలు, చిన్నారుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వారి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి తెలుసుకోవాలి. ► ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆధునిక భారత దేశ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలపై పట్టు సాధించాలి. పాలిటీ, గవర్నెన్స్‌కు సంబంధించి రాజ్యాంగం, ఇటీవల కాలంలో పాలనలో చోటు చేసుకుంటున్న సాంకేతిక పరిణామాలు(ఈ–గవర్నెన్స్ తదితర), తాజా విధానాల గురించి తెలుసుకోవాలి. ఈ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పరిపాలన పరమైన నూతన విధానాలపై ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. ► ఆర్ధికాభివృద్ధికి సంబంధించి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు.. దేశ ఆర్థిక ప్రగతి, ఆర్థికాంశాల క్రమాన్ని తెలుసుకోవాలి. ► జాగ్రఫీలో.. భారత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సహజ వనరులు, అవి లభించే ప్రాంతాలు, అభివృద్ధికి దోహదపడే తీరుపై అవగాహన పెంచుకోవాలి. ► ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న డిజాస్టర్ మేనేజ్మెంట్, సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తాజా పరిణామాలు, అదే విధంగా ప్రాథమిక లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. ► మెంటల్ ఎబిలిటీలో... లాజికల్ రీజనింగ్, డేటాలు, ఫ్లో చార్ట్స్, డేటా విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి. ► అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతర పరిణామాలు, సమస్యలను ప్రత్యేక దృష్టితో చదవాలి. ► 2021–22 బడ్జెట్లోని ముఖ్యమైన అంశాలు, ఏపీ, ఇండియా సోషియో–ఎకనామిక్ సర్వేలు, వాటిలో పేర్కొన్న ముఖ్య వివరాలను, గణాంకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పేపర్–2కు ఇలా ► హోంసైన్స్, సోషల్ వర్క్ సబ్జెక్ట్ అంశాలు రెండు విభాగాలుగా ఉండే పేపర్–2లో రాణించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు.. ► ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ సబ్జెక్ట్‌లోని పలు రకాల ఆహార ధాన్యాలు, బలమైన ఆరోగ్యానికి దోహదం చేసే తృణ ధాన్యాలు గురించి తెలుసుకోవాలి. ► అదే విధంగా పోషకాహార పదార్థాలు, వాటి నిల్వ, వాటి వల్ల కలిగే లాభాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. ► ఆయా ఆహార పదార్థాల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకోవాలి. ► వయో వర్గాల వారీగా అవసరమైన ఆహార, పోషకాల వివరాలు గురించి తెలుసుకోవడం కూడా మేలు చేస్తుంది. ► ఆయా వ్యాధులకు సంబంధించి అనుసరించాల్సిన ఆరోగ్య, ఆహార నియమాల గురించి తెలుసుకోవాలి. ► శిశు అభివృద్ధికి సంబంధించి ఇమ్యునైజేషన్, మానసిక–శారీరక అభివృద్ధి, ప్రీ–స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యం, పాపులేషన్ ఎడ్యుకేషన్‌లపై దృష్టిపెట్టాలి. ► అదే విధంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆయా ఏజెన్సీలు/సంస్థల ఆధ్వర్యంలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ సేవల గురించి తెలుసుకోవాలి. ► చిన్నారులకు రాజ్యాంగ, శాసన పరంగా అందుబాటులో ఉన్న హక్కుల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. ► ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి విషయంలో చేపడుతున్న చర్యలపై దృష్టి పెట్టాలి. ► వ్యవసాయానికి సంబంధించిన అంశాలు.. ముఖ్యంగా ఆహార ధాన్యాల డిమాండ్–సప్లయ్, సాగు ప్రణాళికలు, ప్రభుత్వ విధానాల గురించి తెలుసుకోవాలి. ► ఎక్స్టెన్షన్ వర్క్‌కు సంబంధించిన విధానాలు, పద్ధతులు, ప్రోగ్రామ్ ప్లానింగ్, నిర్వహణ, మూల్యాంకన, గ్రామాల్లో మహిళల ఆధ్వర్యంలోని స్వయంసహాయక సంస్థల ► అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ► సోషల్ వర్క్‌కు సంబంధించి మూల భావన, పరిధి, స్వరూపం తెలుసుకోవాలి. ► భారతీయ సంస్కృతిలో మార్పు విషయంలో సోషల్ వర్క్ సిద్ధాంతం ప్రాముఖ్యతపై అవగాహన ఏర్పరచుకోవాలి. ► సోషల్ వర్క్‌లో.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలు, స్థానిక సంస్థలు, కుటుంబం, శిశు సంక్షేమ చర్యలు, మహిళలకు ఎదురవుతున్న సమస్యలు, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ స్వరూపం, విధులపై అవగాహన అవసరం. డిగ్రీ పుస్తకాల అధ్యయనం పేపర్–2కు సంబంధించిన విభాగాల్లోని ప్రశ్నలు డిగ్రీ స్థాయి పుస్తకాల నుంచే అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సిద్ధాంతాలు, మూల భావనలకు సంబంధించి డిగ్రీ స్థాయి పుస్తకాల అభ్యసనం మేలు చేస్తుంది. సంక్షేమ పథకాలు, సేవలు, సమస్యలకు సంబంధించి సమకాలీన అంశాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఇలా ఒకవైపు బేసిక్స్, మరోవైపు సమకాలీన పరిణామాలపై అవగాహన పెంచుకుంటూ.. ప్రిపరేషన్ సాగిస్తే విజయావకాశాలు మెరుగవుతాయి. -
ఆంధ్రప్రదేశ్: డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులకు శుభవార్త...
ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులకు శుభ వార్త. రాష్ట్రంలో ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) స్థాయి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది! దీనిద్వారా పలు శాఖల్లో 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులు ఏఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే చక్కటి ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. గత కొద్ది రోజులుగా వరుస నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగార్థుల్లో ఆశలు నింపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నోటిఫికేషన్‌తో ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో.. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. చదవండి: ఆర్ఆర్సీ– ఎన్సీఆర్లో భారీగా అప్రెంటిస్ ఖాళీలు మొత్తం పోస్టులు 190 ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఏఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది విభాగాల్లో 190 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్ట్‌లలో 155 తాజా పోస్ట్‌లు కాగా, 35 పోస్ట్‌లను క్యారీ ఫార్వర్డ్ పోస్ట్‌లు(గత నోటిఫికేషన్లో భర్తీ కానివి)గా పేర్కొన్నారు. ఎంపికైతే వేతన శ్రేణి: రూ.31,460–రూ.84,970 లభిస్తుంది. అర్హతలు ► ఏపీ సబార్డినేట్ సర్వీస్ పరిధిలోని ఈ ఏఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు డిప్లొమా, బీఈ/బీటెక్ అభ్యర్థులు అర్హులు. ► దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌ను అనుసరించి ఆయా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. ► వయోపరిమితి: జూలై 1,2021 నాటికి 18–42ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. చదవండి: ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగాలు ఎంపిక విధానం రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులు, దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌లు, అందుబాటులో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. తుది విజేతల జాబితా విడుదల చేసి.. నియామకాలు ఖరారు చేస్తారు. రాత పరీక్ష ఇలా రాత పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ప్రశ్నపత్రం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది. పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు సమయం 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 150 150ని 2 సివిల్/మెకానికల్ 150 150 150ని 3 ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్/ సివిల్ 150 150 150ని ► పేపర్–3 పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో ఎన్విరాన్మెంట్/సివిల్ ఏఈ పోస్ట్‌లకు మాత్రమే (పోస్ట్ కోడ్–3) నిర్వహిస్తారు. ► పేపర్ 2 అన్ని శాఖల్లోని సివిల్/మెకానికల్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది. ఈ ప్రశ్న పత్రం డిప్లొమా స్థాయిలో ఉంటుంది. ► నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా అమలు చేయనున్నారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు. విజయానికి మార్గం ఇదిగో పేపర్–1 ఇలా ► పేపర్–1 జనరల్ స్టడీస్‌లో.. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ సమకాలీన అంశాలు, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ; ఏపీ, ఇండియా హిస్టరీ; పాలిటీ, గవర్నెన్స్; ఏపీలో అమలవుతున్న ఈ–గవర్నెన్స్ విధానాలు; ఆర్థికాభివృద్ధి అంశాలు, ఏపీలో ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న చర్యలు; డిజాస్టర్ మేనేజ్మెంట్; ఏపీ, ఇండియా ఫిజికల్ జాగ్రఫీ అంశాలపై దృష్టి పెట్టాలి. ► అదేవిధంగా లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్లను ప్రాక్టీస్ చేయాలి. ► డేటా అనాలిసిస్ విషయంలో డేటా విశదీకరణ, విశ్లేషణ, డేటా రూపకల్పన తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పేపర్–2లో ఉమ్మడిగా సివిల్, మెకానికల్ ఏఈ పోస్ట్‌లకు ఉమ్మడిగా నిర్వహించే పేపర్ ఇది. ఇందులో విజయానికి అభ్యర్థులు సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్‌లోని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి. డిప్లొమా స్థాయిలో ప్రశ్నలు ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలకు సంబంధించి డిప్లొమా లేదా బీటెక్ పుస్తకాలను చదవడం మేలు చేస్తుంది. అదే విధంగా ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన ఏఈ ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. పేపర్–3లో రాణించాలంటే ► పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో.. ఎన్విరాన్మెంట్ ఏఈ పోస్ట్‌లకు మాత్రమే నిర్వహించే ఈ పేపర్లో ఎన్విరాన్మెంటల్/సివిల్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వాటర్ సప్లయి ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, వాయు, శబ్ద కాలుష్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్,డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్,బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ విభాగాల్లోని ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి. ► ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించి పర్యావరణ పరిరక్షణ కోసం దేశంలో అమలవుతున్న విధానాలు,చేపడుతున్న చర్యలు,పర్యావరణ పరిరక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. సిలబస్ క్షుణ్నంగా అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌లు, వాటికి సంబంధించి రాత పరీక్షలో పేర్కొన్న సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. దాని ఆధారంగా తాము కొత్తగా చదవాల్సిన అంశాలతోపాటు, ఇప్పటికే అవగాహన ఉన్న టాపిక్స్‌పై స్పష్టత లభిస్తుంది. ఫలితంగా ప్రిపరేషన్లో ఏ అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలో ముందే నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగా సమయ పాలనతో ముందుకు సాగాలి. అకడమిక్ పుస్తకాలు ► సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకున్నాక..ఆయా అంశాలకు సంబంధించి బీటెక్ లేదా డిప్లొమా స్థాయిలోని అకడమిక్ పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్లో అప్లికేషన్ అప్రోచ్‌ను అనుసరించాలి. దీనివల్ల ప్రాక్టికల్ థింకింగ్ అలవడి, ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుంది. ► మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్‌లు రాయడం పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది. అదే విధంగా ఆయా బ్రాంచ్‌లకు సంబంధించి ఈసెట్, పీజీఈసెట్ తదితర ఇంజనీరింగ్ సెట్ల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ► పేపర్–2లోని ప్రశ్నలు డిప్లొమా స్థాయిలోనే ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాని అభ్యర్థులు బీటెక్ స్థాయిలోని అంశాలపైనా దృష్టిపెడితే విజయావకాశాలు మరింత మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. -
38 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా జారీ చేస్తున్న నోటిఫికేషన్లలో భాగంగా మరో 38 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల్లో.. అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ రిలేషన్ ఆఫీసర్ (ఏపీఆర్వో) (6), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (29), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (1), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 (2) ఉన్నాయి. ఈ పోస్టులకు నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మరిన్ని వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్://పీఎస్సీ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ చూడొచ్చన్నారు. -
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్.. అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: అసిస్టెంట్ ఇంజనీర్స్ ► మొత్తం పోస్టుల సంఖ్య: 190 ► విభాగాలు: సివిల్, ఈఎన్‌వీ, మెకానికల్. ► సర్వీస్‌లు: ఏపీ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, పీహెచ్ అండ్ ఎంఈ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పంచాయతీరాజ్ అండ్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీస్‌లు, ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీస్. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ /బీటెక్, ఎల్సీఈ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు:01.07.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. దీన్ని మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 21.10.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.11.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in -
2018 గ్రూప్–1 మెయిన్స్‌కు మాన్యువల్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ (2018 నోటిఫికేషన్) సమాధాన పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేయిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మూడు నెలల్లో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు గ్రూప్–1 మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనంపై హైకోర్టు తీర్పును గౌరవిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 190 అసిస్టెంట్ ఇంజనీర్, 670 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల సంఖ్య పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇది పూర్తి కాగానే వెంటనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గ్రూప్–1లో ఇంటర్వ్యూల రద్దుకు జీవో వచ్చిందని.. దాని అమలుపై ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని తెలిపారు. డిజిటల్ మూల్యాంకనంతోనే పారదర్శకత, నిష్పాక్షికత ముందుగా నోటిఫికేషన్లో పేర్కొనకుండా డిజిటల్ మూల్యాంకనం ఎలా చేయిస్తారని మాత్రమే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. ఈ విధానాన్ని తప్పుపట్టలేదని చెప్పారు. ఇకపై ముందుగానే ప్రకటించి డిజిటల్ మూల్యాంకనం చేపట్టవచ్చని సూచించిందన్నారు. రానున్న నోటిఫికేషన్లన్నిటికీ డిజిటల్ మూల్యాంకనాన్నే అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి అధిక వ్యయమైనా పారదర్శకత, నిష్పాక్షికతతోపాటు అర్హులైన అభ్యర్థులకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. గ్రూప్–1 మెయిన్స్‌కు డిజిటల్ మూల్యాంకనం చేపడుతున్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనకపోయినా.. పరీక్షలకు ముందు నుంచే అభ్యర్థులకు తెలియజేస్తూ వచ్చామని గుర్తు చేశారు. దీన్ని అభ్యర్థులెవరూ వ్యతిరేకించకపోగా స్వాగతించారన్నారు. అయితే.. గ్రూప్–1 మెయిన్స్‌లో ఎంపిక కాని కొందరు డిజిటల్ మూల్యాంకనాన్ని తప్పుపడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో డిజిటల్ మూల్యాంకనం సివిల్స్‌లో విజయం సాధించిన కొందరు గ్రూప్–1లో ఎంపిక కాలేదని.. డిజిటల్ మూల్యాంకనంలో లోపాలున్నందు వల్లే ఇలా జరిగిందనే వాదన తప్పన్నారు. సివిల్స్‌లో ఐపీఎస్‌లుగా ఎంపికైనవారు తర్వాత ఐఏఎస్ కోసం మళ్లీ సివిల్స్ రాస్తే ప్రిలిమ్స్ కూడా ఉత్తీర్ణులు కాని సందర్భాలు అనేకమున్నాయన్నారు. అభ్యర్థి ఆరోజు పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగానే ఎంపికవ్వడం ఆధారపడి ఉంటుందని తెలిపారు. డిజిటల్ మూల్యాంకనం ఎంతో శాస్త్రీయ విధానంలో జరిగిందన్నారు. ఏపీపీఎస్సీ ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. గత 18 నెలల్లో కరోనా సమయంలోనూ 32 నోటిఫికేషన్లలోని 4 వేల పోస్టుల్లో 3 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని పోస్టులు భర్తీ చేయలేదన్నారు. మిగిలిన పోస్టుల్లోనూ 450 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేక ఖాళీగా మిగిలిపోయాయన్నారు. మరో 550 పోస్టులు కోర్టు కేసులతో భర్తీ కాలేదని తెలిపారు. వరుసగా కొత్త నోటిఫికేషన్లు విడుదల కొత్తగా పలు పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. ఇప్పటికే పలు పోస్టుల నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అన్ని పోస్టులతో ఒకేసారి క్యాలెండర్‌ను ప్రకటించడం సాధ్యం కాదని వివరించారు. ఆన్లైన్లో పరీక్షలు జరగనున్నందున పరీక్ష కేంద్రాల అందుబాటు, ఇతర విభాగాల పరీక్షల తేదీలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. -
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. త్వరలోనే 670 జూనియర్ అసిస్టెంట్స్, మరో 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. (చదవండి: ఏపీ జాబ్స్: ఇలా చేస్తే.. కొలువు ఖాయం) ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ..‘‘త్వరలోనే జూనియర్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తాం. ఒక్కొక్కటిగా వివిధ శాఖలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తాం. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకణంపై ఏపీ హైకోర్టు తీర్పును గౌరవిస్తాము’’ అని తెలిపారు. చదవండి: ఏపీపీఎస్సీ నియామకాలకు ఇకపై ఒకే పరీక్ష -
ఏపీపీఎస్సీ: హార్టికల్చర్ ఆఫీసర్లు, తెలుగు రిపోర్టర్ జాబ్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)... ఏపీ హార్టికల్చర్ సర్వీస్‌లో.. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: హార్టికల్చర్ ఆఫీసర్లు ► మొత్తం పోస్టుల సంఖ్య: 39 ► అర్హతలు: హార్టికల్చర్‌లో నాలుగేళ్ల బీఎస్సీ డిగ్రీ/ బీఎస్సీ ఆనర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహా పద్ధతిలో నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు– 100 మార్కులకు అర్హత పరీక్ష ఉంటుంది. దీనికి పరీక్ష సమయం 100 నిమిషాలు. పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు–150 మార్కులకు; పేపర్2 హార్టికల్చర్–1, 150 ప్రశ్నలు– 150 మార్కులకు; పేపర్ 3, హార్టికల్చర్–2 150 ప్రశ్నలు– 150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ మూడు పేపర్లకు ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం 150 నిమిషాలు కేటాయించారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in ఏపీపీఎస్సీ– 05 తెలుగు రిపోర్టర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)... ఏపీ లెజిస్లేచర్ సర్వీస్‌లో తెలుగు రిపోర్ట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: తెలుగు రిపోర్టర్లు ► మొత్తం పోస్టుల సంఖ్య: 05 ► అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్బీటీఈటీ హైదరాబాద్ నిర్వహించిన షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్(తెలుగు)లో హయ్యర్ గ్రేడ్ అర్హతతోపాటు నిమిషానికి 80 పదాల వేగంతో తెలుగు షార్ట్ హ్యాండ్ టైపింగ్ చేయాలి. ► వయసు: 01.07.2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ /ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీపై 150 ప్రశ్నలు–150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2లో 150 మార్కులకు తెలుగులో షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్, లాంగ్‌హ్యాండ్‌లో ట్రాన్స్‌స్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.10.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in -
ఆంధ్రప్రదేశ్: త్వరలో 1,180 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మరో వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఈ నెలాఖరున నోటిఫికేషన్లు విడుదల చేసేలా కమిషన్ కసరత్తు పూర్తి చేసి అంతా సిద్ధంగా ఉంచింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్ క్యాటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి మే నెలలో ముగిసింది. ఈ నేపథ్యంలో రిజర్వుడ్ అభ్యర్ధుల గరిష్ట వయో పరిమితి ఉత్తర్వుల పొడిగింపుపై కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు ప్రభుత్వం ఇంతకు ముందే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కోటాలో పోస్టులు మిగిలితే కనుక వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం కమిషన్ లేఖ రాసింది. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. 1,180 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో 49 విడుదల చేయడం తెలిసిందే. రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ కోటా మిగులు పోస్టులపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తుందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే 15 విభాగాల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తూ పోస్టుల భర్తీకి కమిషన్ చర్యలు చేపట్టనుంది. -
విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారు
సాక్షి, అమరావతి: తన అధికార విధులను నిర్వర్తించకుండా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శి, అదనపు కార్యదర్శి అడ్డుకుంటున్నారని కమిషన్ చైర్మన్ పి.ఉదయ భాస్కర్ హైకోర్టుకు నివేదించారు. అటెండర్, పేషీ సిబ్బందిని పొందే హక్కు తనకు ఉన్నప్పటికీ.. దానిని హరించారని పేర్కొన్నారు. చైర్మన్‌గా తన విధుల్లో జోక్యం చేసుకోవద్దని కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నాటినుంచీ తన ఆమోదం లేకుండా కమిషన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 2020 జనవరి నుంచి తనను ఏ అధికారిక సమావేశాలకు ఆహ్వానించడం లేదని, ఇది చట్ట విరుద్ధమని వివరించారు. 2020 ఫిబ్రవరి 25న జరిగిన సమావేశంలో నిబంధనలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాలేవీ చట్ట ప్రకారం చెల్లుబాటు కావన్నారు. గ్రూప్–1 ప్రధాన పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసే బాధ్యతలను థర్డ్‌పార్టీకి అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గత నెల 17న జరగాల్సిన ఇంటర్వ్యూలకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనతో పలువురు అభ్యర్థులు గత నెలలో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, ఇంటర్వ్యూలతో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న సర్వీస్ కమిషన్ కార్యదర్శి, చైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు కమిషన్ చైర్మన్ ఉదయ్‌భాస్కర్ పైవివరాలతో కౌంటర్ దాఖలు చేశారు. -
గుడ్‌న్యూస్: సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ల జాబితా విడుదల
సాక్షి,అమరావతి: గ్రూప్-2 సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు సహకార శాఖ కమిషనర్ ప్రకటన జారీ చేశారు. apcooperation.nic.in వెబ్సైట్లో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను పొందుపరిచినట్లు తెలిపారు -
ఇక పోస్టుల భర్తీ చకచకా.. ఏపీపీఎస్సీ కసరత్తు
సాక్షి, అమరావతి: ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు చకచకా భర్తీ కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపట్టి ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కసరత్తు చేపట్టింది. ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి పోస్టుల భర్తీ ప్రక్రియను నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం ఏపీపీఎస్సీ సమావేశం జరిగింది. సభ్యులు పలు అంశాలపై చర్చించారు. నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, అభ్యర్థుల ఎంపిక తదితర ప్రక్రియలను త్వరత్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ వంటి అంశాల్లో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 1,180 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నివేదించగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయడంపై సమావేశంలో చర్చించారు. విడుదలైన నోటిఫికేషన్లలో పోస్టుల భర్తీపైనా .. గత టీడీపీ సర్కారు ఐదేళ్లపాటు ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయించి చేతులు దులుపుకుంది. అప్పట్లో ప్రభుత్వంపై నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలతో ఉండటంతో వారిని పక్కదోవ పట్టించేందుకు, వారి దృష్టిని ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దారి మళ్లించేందుకు ఈ నోటిఫికేషన్లను ఇచ్చింది. కేవలం ఎన్నికల దృష్టితో ఇచ్చిన ఈ నోటిఫికేషన్లన్నీ లోపభూయిష్టంగా ఉండటం, అప్పట్లో జరిగిన పరీక్షలు, ఇతర అంశాలు అవకతవకల మయంగా మారడంతో వాటిపై న్యాయపరమైన, ఇతర వివాదాలు తలెత్తాయి. అప్పటి నోటిఫికేషన్లకు సంబంధించిన పలు పోస్టులకు సంబంధించి న్యాయ వివాదాలను పరిష్కరింపచేస్తూ ప్రస్తుత కమిషన్ భర్తీ చేసింది. మొత్తం 32 నోటిఫికేషన్లకు సంబంధించిన 3,944 పోస్టులలో ఇప్పటికే 3,013కి పైగా పోస్టుల్లో నియామకాలను ప్రస్తుత కమిషన్ పూర్తి చేయించింది. ఇతర పోస్టులపైనా వివాదాలను పరిష్కరింపజేసి నియామకాలు పూర్తి చేయించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. కోర్టు కేసులతో ఆగిపోయిన నియామకాలను తీర్పులు వచ్చిన వెంటనే భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఇటీవల ఆమోదం లభించిన 1,180 పోస్టులతో పాటు మరికొన్ని గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీకి అవకాశముందని, వాటన్నిటినీ కలుపుకుని ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కమిషన్ వర్గాలు వివరించాయి. -
ఏపీ జాబ్స్: ఇలా చేస్తే.. కొలువు ఖాయం
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే.. ఎండమావే! ఎదురుచూసి చూసి నిరుద్యోగుల కళ్లు కాయలు కాసేవి!! ఒకవేళ అరకొరగా ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినా.. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేందుకు సంవత్సరాలు గడిచిపోయేవి!! అలాంటి పరిస్థితులకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయా జాబ్ నోటిఫికేషన్లు వెలువడే నెలను సైతం ప్రకటించడం.. ఉద్యోగార్థులకు అత్యంత శుభ పరిణామం! ఈ నేపథ్యంలో.. నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవడమెలాగో తెలుసుకుందాం... ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలతోపాటు నోటిఫికేషన్లు వెలువడే నెలను కూడా నిర్దిష్టంగా ప్రకటించారు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే రోజు వరకు వేచి చూడకుండా.. తమ అర్హతలకు సరితూగే ఉద్యోగాలను గుర్తించి.. వాటిని సాధించేందుకు కృషి చేయాలని సలహా ఇస్తున్నారు. గ్రూప్స్, పోలీస్, మెడికల్.. ఇంకా ఎన్నో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జ్యాబ్ క్యాలెండర్ ప్రకారం–గ్రూప్–1,2 సర్వీసులు మొదలుకొని మరెన్నో శాఖల్లో పోస్టుల భర్తీ జరుగనుంది. గ్రూప్స్ తర్వాత ఎంతో క్రేజ్ ఉండే పోలీస్ రిక్రూట్మెంట్, భావి భారత పౌరులను తీర్చిదిద్దే అధ్యాపకులు, ప్రొఫెసర్లు; వైద్య రంగంలో ఎంతో కీలకమైన డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు, పారా మెడికల్ ఉద్యోగాల భర్తీ జరుగనుంది. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. ఇలా మొత్తంగా అన్ని శాఖల్లో కలిపి 10,143 పోస్ట్‌లకు ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదలైంది. వీటితోపాటు తాజా మరో 1180 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండటం నిరుద్యోగులకు మరో తీపికబురుగా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికీ అవకాశం ► జ్యాబ్ క్యాలెండర్లో పేర్కొన్న పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే.. సంప్రదాయ డిగ్రీ కోర్సులు మొదలు మెడికల్ ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ.. ప్రతి ఒక్కరికీ అవకాశం లభించనుంది. ఉదాహరణకు.. గ్రూప్–1,2 సర్వీసులకు బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. అదే విధంగా డిగ్రీతో ఎస్ఐ స్థాయి ఉద్యోగాలకు, ఇంటర్మీడియెట్ అర్హతతో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► పారా మెడికల్ సిబ్బంది విషయానికొస్తే.. ఆయా విభాగాల్లో పారా మెడికల్ కోర్సుల్లో డిప్లొమా తదితర కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అర్హత లభించనుంది. ► వైద్య శాఖలో పేర్కొన్న డాక్టర్లు, ప్రొఫెసర్ల పోస్టులకు.. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ వంటి కోర్సులు పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులు వైద్య శాఖలో నర్స్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ► విద్యా శాఖలో లెక్చరర్ల పోస్టులకు ఆయా సబ్జెక్ట్ స్పెషలైజేషన్లలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం పీజీ ఉత్తీర్ణతతోపాటు నెట్ లేదా సెట్ స్కోర్ సాధించిన వారికి దరఖాస్తుకు అర్హత లభించనుంది. సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి గతంలో వివిధ పోస్టులకు మూడంచెలు, రెండంచెల విధానంలో.. నియామక ప్రక్రియ సుదీర్ఘంగా సాగేది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అన్ని నియామకాల్లో స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ టెస్ట్ విధానానికి స్వస్తి పలికింది. ఒకే ఒక రాత పరీక్ష నిర్వహించి.. అందులో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో.. గ్రూప్స్ మొదలు అన్ని రకాల నియామక ప్రక్రియల్లో ప్రిలిమ్స్ విధానం నుంచి విముక్తి లభించనుంది. దీనివల్ల ఉద్యోగార్థులకు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం లభిస్తుంది. అంతేకాకుండా ఏకకాలంలో తమకు అర్హత ఉన్న పలు పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. సిలబస్‌ను పరిశీలించి ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ప్రకారం–ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ముందుగా తమ అర్హతకు సరితూగే పరీక్షలకు సంబంధించిన సిలబస్ అంశాలను పరిశీలించాలి. పరీక్ష విధానం, సిలబస్‌పై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ సిలబస్‌లో వెయిటేజీ ఆధారితంగా ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. వాటికి సంబంధించి అకడమిక్ పుస్తకాలతోపాటు.. ప్రామాణిక స్టడీ మెటీరియల్‌ను అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. జనరల్ స్టడీస్ ఏ ఉద్యోగ పరీక్ష అయినా.. జనరల్ స్టడీస్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జనరల్ స్టడీస్ అంశాలుగా పేర్కొనే ఏపీ, ఇండియన్ హిస్టరీ; జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కోర్ అంశాలతోపాటు..సమకాలీన పరిణామాలపైనా అవగాహన పెంచుకునేలా ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలను.. జనరల్ స్టడీస్‌లోని కోర్ టాపిక్స్‌తో అనుసంధానిస్తూ చదవాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. రాష్ట్ర స్థాయి అంశాలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు.. రాష్ట్ర స్థాయి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. ప్రధానంగా రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సహజ వనరులు, కళలు–సంస్కృతి, రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ప్రధాన ఘట్టాలను అవపోసన పట్టాలి. సహజ వనరులు ఎక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలు, సదరు సహజ వనరులు అభివృద్ధికి దోహదపడుతున్న తీరును తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలు జనరల్ స్టడీస్తోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అభ్యర్థులు దృష్టిపెట్టాలి. ముఖ్యంగా నవ రత్నాలు.. ఉద్దేశాలు, లక్షిత వర్గాలు, వాటికి బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి సంఖ్య వంటి అంశాలపై గణాంక సహిత వివరాలతో సంసిద్ధంగా ఉండాలి. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల(ఉదా: ఐటీ పాలసీ, పారిశ్రామిక ప్రణాళిక, ఉపాధి కల్పనకు తీసుకుంటున్న చర్యలు) గురించి తెలుసుకోవాలి. అకడమిక్స్ + సమకాలీన జాబ్ క్యాలెండర్లో పలు స్పెషలైజ్డ్ పోస్ట్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు: వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు వంటివి. వీటి నియామక ప్రక్రియలో జనరల్ స్టడీస్తోపాటు ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాలను పరిశీలించే సబ్జెక్ట్ పేపర్లు కూడా ఉంటాయి. ఈ సబ్జెక్ట్ పేపర్లలో రాణించాలంటే.. అభ్యర్థులు అకడమిక్‌గా ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వాటికి సంబంధించి తాజాగా పరిణామాల గురించి కూడా తెలుసుకోవాలి. డిస్క్రిప్టివ్ ప్రిపరేషన్ ఉద్యోగ నియామక పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలోనే జరిగినా.. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మాత్రం డిస్క్రిప్టివ్ పద్ధతిలో కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో చదవడం ద్వారా విభిన్న కోణాల్లో నైపుణ్యం లభిస్తుంది. ఫలితంగా ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇవ్వగలిగే సంసిద్ధత లభిస్తుంది. చదివేటప్పుడే ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు వేగంగా పునశ్చరణకు ఉపయోగపడుతుంది. స్వీయ విశ్లేషణ అభ్యర్థులు.. ఎప్పటికప్పుడు తమ స్వీయ సామర్థ్యాలను విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా తమ ప్రిపరేషన్ స్థాయిపై ఒక అంచనాకు రావాలి. దీనివల్ల ఇంకా సామర్థ్యం పెంచుకోవాల్సిన అంశాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష సిలబస్, టాపిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రతి రోజు ఆయా అంశాలకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. టైమ్ టేబుల్ ప్రకారం చదవడం పూర్తిచేయాలి. ఒకే అర్హతతో పలు పరీక్షలు ఒకే అర్హతతో ఒకటి కంటే ఎక్కువ శాఖల్లోని పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్వహించే గ్రూప్స్, పోలీస్–ఎస్ఐ పోస్ట్‌లను ఇందుకు ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఇలాంటి అభ్యర్థులు రెండు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. రెండు పరీక్షలకు సంబంధించి ఉమ్మడిగా ఉన్న సిలబస్ అంశాల ప్రిపరేషన్‌ను ముందుగా పూర్తిచేయాలి. ఆ తర్వాత వేర్వేరుగా ఉన్న టాపిక్స్‌పై పట్టు సాధించేలా ముందుకు సాగాలి. ముందుగా ఏ పరీక్ష జరగనుందో.. ఆ పరీక్షకు నెల రోజుల ముందు నుంచి సదరు పరీక్ష సన్నద్ధతకే పూర్తి సమయం కేటాయించాలి. ఇలా.. ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో, నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. విజయావకాశాలను మెరుగు పరచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ముందస్తు ప్రణాళికే ముఖ్యం ఏపీ జ్యాబ్ క్యాలెండర్లో.. ఆయా శాఖలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే నెలను కూడా ముందుగానే ప్రకటించడం అభ్యర్థులకు ఎంతో మేలు చేసే అంశం. ఆ టైమ్ లైన్‌కు అనుగుణంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించొచ్చు. తాము లక్ష్యంగా ఎంచుకున్న పోస్టులకు సంబంధించి సిలబస్ పరిశీలన, ప్రీవియస్ పేపర్ల అధ్యయనంతో ముందుగా పరీక్ష స్థాయిపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించి.. టాపిక్‌వారీగా వెయిటేజీని అనుసరించి అధ్యయనం చేయాలి. ఏ పరీక్ష అయినా ప్రణాళిక, సమయ పాలన ఎంతో ముఖ్యం. ఈ రెండూ ప్రిపరేషన్లో ముందంజలో నిలిచేలా చేస్తాయి. – జి.బి.కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు -
ఏపీపీఎస్సీ ద్వారా 1,180 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి
-
ఏపీపీఎస్సీ ద్వారా 1,180 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం జీవో 49 విడుదల చేసింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు 1,180 పోస్టుల భర్తీకి ఆమోదం కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటితో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయాలని కోరారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేందుకు గాను ఏపీపీఎస్సీకి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ ఇవ్వనున్న పోస్టులు పోస్టు సంఖ్య మెడికల్ ఆఫీసర్(యునాని) 26 మెడికల్ ఆఫీసర్(హోమియోపతి) 53 మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) 72 లెక్చరర్(హోమియో) 24 లెక్చరర్(డాక్టర్ ఎన్ఆర్ఎస్జీఏసీ ఆయుష్) 3 జూ.అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ 670 అసిస్టెంట్ ఇంజినీర్లు 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్–3 (ఎండోమెంట్) 60 హార్టికల్చర్ ఆఫీసర్ 39 తెలుగు రిపోర్టర్(లెజిస్లేచర్) 5 డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 4 ఇంగ్లిష్ రిపోర్టర్(లెజిస్లేచర్) 10 జూనియర్ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ 10 డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ 5 అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్టు సర్వీస్ 9 మొత్తం 1,180 -
ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ప్రభుత్వానికి లేఖరాశారు. గతంలో ప్రభుత్వం భర్తీకి అనుమతించిన పోస్టుల్లో మిగిలి ఉన్న 1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని సోమవారం రాసిన లేఖలో కోరారు. వాటితోపాటు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లలో అర్హులైన అభ్యర్థులు లేకపోవడం, పోస్టులకు ఎంపికైనవారు చేరకపోవడం వంటి కారణాలతో 150 పోస్టులు మిగిలి ఉన్నాయని వివరించారు. వీటినీ భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున రోస్టర్ పాయింట్లను ఖరారు చేయాలని కోరారు. -
ఏపీపీఎస్ ద్వారా త్వరలో 1,200కు పైగా పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 1,200కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టుల సంఖ్యపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే సమగ్రంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2 సహా 1,200కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో ఈ నోటిఫికేషన్లు జారీచేస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్.సలాంబాబు మీడియాతో చెప్పారు. ‘ఇటీవల ప్రభుత్వం జారీచేసిన జాబ్ క్యాలెండర్‌పై కొందరిలో కొన్ని అపోహలు తలెత్తాయి. అవేవీ నిజం కాదు. వాస్తవానికి అనేక పోస్టుల భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ వద్ద 1,180 వరకు ఖాళీ పోస్టుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా గ్రూప్–1, గ్రూప్–2 కేటగిరీల్లో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది’ అని ఆయన వివరించారు. 2018లో జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేక దాదాపు 364 పోస్టులు భర్తీ కాలేదు. వాటితో పాటు ఇతర ఖాళీలభర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. -
ఏపీపీఎస్సీ నియామకాలకు ఇకపై ఒకే పరీక్ష
సాక్షి, అమరావతి : గ్రూప్ 1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాంబాబు తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తికి ఏడాది, ఆ పైన సమయం పడుతోందని, త్వరగా పోస్టులు భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేశామని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్నందున పాలిటెక్నిక్ లెక్చరర్లు, గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేయలేకపోయామన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు 1180 ఖాళీ పోస్టులను మేము గుర్తించాం. వీటిలో గ్రూప్ 1,2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పోస్టులు పెంచి ఆగస్టులో గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. ఆగస్టులో నోటిఫికేషన్ ప్రకటించే నాటికి ఎన్ని ఖాళీలు వస్తే అన్ని పోస్టులు పెంచి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. వచ్చే ఆగస్టులో చెప్పుకోదగ్గ రీతిలో పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తాం. అభ్యర్థుల వయోపరిమితిని 47ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వినతులను పరిశీలించాలని ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. ఇకపై 3-4 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తాం. ఉద్యోగాల సాధన కోసం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించిన వారిపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించాం. నిరుద్యోగులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తాం. నిరుద్యోగుల భవిష్యత్తుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకే కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని అన్నారు. -
ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై కేసు పెట్టి న్యాయపోరాటం చేస్తా..
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు ఏపీపీఎస్సీ సభ్యునిగా పదవి ఇవ్వడంతో కొందరు తమ సంస్థపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని నూతలపాటి సోనివుడ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎంపీ రఘరామకృష్ణంరాజు తనపై కొన్ని ఛానెల్స్‌లో వ్యంగ్యంగా మాట్లాడారని గుర్తుచేశారు. గత 24 ఏళ్లుగా తమ సంస్థ అనాథ పిల్లలను చదివిస్తోందని పేర్కోన్నారు. అదే విధంగా, తమ సంస్థచే నిర్వహిస్తున్న హస్టల్లో బాలికల సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టం చేశారు. తమ సంస్థపై, తనపై అసత్య ఆరోపణలు చేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై మండిపడ్డారు. వారిపై కేసు పెట్టి న్యాయపోరాటం చేస్తానని నూతల పాటి సోనివుడ్ అన్నారు. -
ఏపీపీఎస్సీ సమాచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు కేటగిరీ నోటిఫికేషన్ల పరీక్షల్లో అర్హత సాధించిన, పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో విడుదల చేశారు. ► ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రయిబల్ వెల్ఫేర్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులకు ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ ప్రకటించింది. దీన్ని కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొంది. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టుల పోస్టులకు ఎంపికైన వారి ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ బుధవారం విడుదల చేసి.. కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. మైన్స్ అండ్ జియాలజీ మైన్స్ అండ్ జియాలజీ విభాగంలోని టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 27న పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఈ పరిశీలన జరగనుంది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ నుంచి మెమో, చెక్‌లిస్ట్, అటెస్టేషన్ ఫారాలు, నాన్ క్రిమీలేయర్ ప్రొఫార్మా(బీసీ అభ్యర్థులు) డౌన్లోడ్ చేసుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో వాటిని కమిషన్‌కు అందించాలి. ఆగస్టు 6 నుంచి డిపార్టుమెంటల్ టెస్ట్ డిపార్టుమెంటల్ టెస్ట్‌ను ఆగస్టు 6వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఆగస్ట్ 28న రిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీలో 8వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఆగస్ట్ 28న నిర్వహిస్తున్నట్టు కమిషన్ వివరించింది. మేథమెటిక్స్, జనరల్ నాలెడ్జి, ఇంగ్లీషు సబ్జెక్టులకు సంబంధించి సెషన్లలో పరీక్ష జరగనుంది. -
తప్పులు సరిదిద్ది పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో 2 వేల అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులు భర్తీచేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై దృష్టి సారించిన ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ప్రస్తుతం వర్సిటీల వారీగా పోస్టులు తదితర అంశాలపై కసరత్తు ప్రారంభించాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ యూనివర్సిటీ పోస్టుల భర్తీ ప్రక్రియను అస్తవ్యస్తంగా మార్చిన సంగతి తెలిసిందే. తమవారికి వర్సిటీ పోస్టులు కట్టబెట్టేందుకు ఇష్టానుసారం వ్యవహరించారు. న్యాయవివాదాల్లో చిక్కుకోవడంతో ఆ నోటిఫికేషన్ల ప్రకారం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల అర్హులైన నిరుద్యోగ విద్యావంతులు తీవ్రంగా నష్టపోవలసి వస్తోంది. అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులే కాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ నియామకాల్లోనూ న్యాయవివాదాల్లో ఉన్నాయి. వీటిని పూర్తిగా ఒక కొలిక్కి తెచ్చి పూర్తి పారదర్శకతతో, అర్హులైన వారికే వర్సిటీల్లో ఉద్యోగాలు దక్కేలా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 1,100 అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు వీటిస్థానంలో 2 వేల అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గతంలోని 14 యూనివర్సిటీలతో పాటు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ఐటీల్లో కూడా అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషనలైజేషన్ నుంచి అన్నీ అవకతవకలే గత తెలుగుదేశం ప్రభుత్వం యూనివర్సిటీ పోస్టుల భర్తీ ప్రక్రియలో అనేక అవకతవకలకు పాల్పడింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సన్నిహితుడైన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్‌ను సీఎంవో కార్యాలయంలో సలహాదారుగా నియమించుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు. తమ వర్గానికి చెందినవారిని నియమించుకోవడానికి ఎలాంటి జీవోలు ఇవ్వకుండా రాష్ట్రస్థాయిలో అన్ని యూనివర్సిటీ పోస్టులను హేతుబద్ధీకరణ చేయించారు. అన్ని యూనివర్సిటీలకు కలిపి 2015లో హైపవర్ కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు రేషనలైజేషన్‌ను పూర్తిచేసింది. దాదాపు 570 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులుగా మార్చింది. ఒక విభాగం పోస్టును మరో విభాగానికి మార్చేసింది. 2 విడతల్లో మొత్తం 1,385 పోస్టుల భర్తీకి అప్పటి ప్రభుత్వం జీవో 137 విడుదల చేసింది. న్యాయవివాదంతో సవరణ ఆదేశాలిచ్చింది. కమిటీ నియామకం, రేషనలైజేషన్ ప్రక్రియలపై కోర్టులు స్టేలు విధించినా పట్టించుకోకుండా వర్సిటీల ఆమోదంతో అంటూ మళ్లీ అవే పోస్టులు భర్తీచేసేలా వర్సిటీల వారీగా 14 జీవోలిచ్చింది. వీటిపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మరోవైపు ఏపీపీఎస్సీ ద్వారా అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే స్క్రీనింగ్ టెస్టు నిర్వహించింది. దీనిపైనా న్యాయవివాదం నెలకొంది. ఈ తప్పులేవీ లేకుండా అర్హులైన మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగేలా వర్సిటీల నియమనిబంధనల ప్రకారం ఆయా విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతున్నాయి. -
ఏపీపీఎస్సీపై నిరాధార ఆరోపణలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)పై కొంతమంది రాజకీయ, నిరాధార విమర్శలు, ఆరోపణలు చేయడం తగదని కమిషన్ సభ్యుడు ఎస్.సలాంబాబు పేర్కొన్నారు. డిజిటల్ మూల్యాంకనం గురించి కనీస పరిజ్ఞానం లేకుండా లోకేశ్ మాట్లాడుతున్నారని, ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు ఏమైనా సందేహాలుంటే అపాయింట్మెంటు తీసుకుని కమిషన్ దగ్గరకు వస్తే నివృత్తి చేస్తామని చెప్పారు. ఈ రెండేళ్లలో ఒక్క ఆరోపణ కూడా లేకుండా చాలా నియామకాలు పూర్తిచేసినట్లు తెలిపారు. గతంలో ఇంటర్వ్యూలకు సింగిల్‌బోర్డు ఉండేదని, ఇప్పుడు బహుళ బోర్డులు చేశామని చెప్పారు. ఏ సభ్యుడు ఏ బోర్డులోకి వెళ్తారో కూడా తెలియదని పేర్కొన్నారు. విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలిచ్చారు. అభ్యర్థుల ఎంపిక రేషియో కమిషన్ ఇష్టం గ్రూప్–1 మెయిన్స్‌లో ఒక అభ్యర్థి నెల్లూరులో 2 పేపర్లు, హైదరాబాద్‌లో 5 పేపర్లు రాశారనడం సరికాదని, ఆ అభ్యర్థి మొత్తం పేపర్లన్నీ హైదరాబాద్‌లోనే రాశారని చెప్పారు. జీవో ప్రకారం 2 శాతం పోస్టుల్ని స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాలని, అందుకు అర్హులు లేకపోతే అవి ఓపెన్ కేటగిరీలో భర్తీచేయాలని నిబంధనలున్నాయని తెలిపారు. ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఏ రేషియోలో పిలవాలన్న అధికారం కమిషన్‌కు ఉంటుందని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలున్నందున అందరికీ సమానావకాశాలిచ్చేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. కొత్తగా ఎంపికైనవారి జాబితా ప్రకటించే సమయానికే బుక్లెట్లు ప్రింట్ అయ్యాయని, ఈ సమయంలో కొందరు ఫలానా లాంగ్వేజ్‌లో రాసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరడంతో గ్రూప్–1లోని 5 పేపర్లను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో దేన్లోనైనా రాసుకోవచ్చని అందరికీ అవకాశం ఇచ్చామని వివరించారు. శ్రీకాకుళం, కాకినాడల్లో బుక్లెట్లు మారిపోయాయని ఆరోపణలు సరికాదన్నారు. మూల్యాంకన విధానం కమిషన్ నిర్ణయిస్తుంది డిజిటల్ మూల్యాంకనమంటూ రూలు మార్చారన్న విమర్శలు సరికాదని చెప్పారు. నోటిఫికేషన్‌లోని విద్యార్హతలు, వయసు వంటివి మారిస్తే రూలు మార్చడం అంటారని తెలిపారు. మూల్యాంకన విధానం అనేది ఎక్కడా నోటిఫికేషన్లో పేర్కొనరని, అది కమిషన్ పరిధిలో నిర్ణయిస్తారని చెప్పారు. అయినా.. అభ్యర్థులకు తెలియాలన్న ఉద్దేశంతో డిజిటల్ మూల్యాంకనం గురించి మెయిన్స్ పరీక్షలకు ఏడాది ముందు 2019 డిసెంబర్లోనే ప్రకటించినట్లు గుర్తు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడా లోపాల్లేకుండా 4 నెలల్లో డిజిటల్ మూల్యాంకనాన్ని పూర్తిచేసినట్లు చెప్పారు. అభ్యర్థులెవరికీ నష్టం రాకూడదని ట్యాబ్ ఆధార ప్రశ్నపత్రాలు ఇచ్చి ఒకేసారి అవి ఓపెన్ అయ్యేలా చేశామన్నారు. థర్డ్ పార్టీ సాంకేతిక, సాఫ్ట్వేర్ సహకారం, స్కానింగ్, మ్యాపింగ్ వంటి పనులకే తప్ప మూల్యాంకనానికి కాదన్నారు. ఫూలిష్ ఆరోపణలు సహించం పెద్ద ఎత్తున డబ్బులు మారాయని లోకేశ్‌గానీ, ఎవరైనా సరే ఫూలిష్ ఆరోపణలు చేస్తే కమిషన్ సహించదని హెచ్చరించారు. ఆధారాలుంటే కోర్టుకు సమర్పించవచ్చన్నారు. ఇదే గ్రూప్–1లో 51 తప్పులు వచ్చాయని, వాటిని తాము సరిదిద్ది ఇంటర్వ్యూల వరకు తెచ్చామని చెప్పారు. అప్పుడు లోకేశ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. గతంలో అనేక లోపాలు జరిగినా ఆయన మాట్లాడలేదన్నారు. చదవండి: 2018 గ్రూప్-1 క్వాలిఫైడ్ అభ్యర్ధుల ఆందోళన -
గ్రూప్ వన్ పరీక్షల పై విమర్శలు అర్ధరహితం
-
ప్రిలిమ్స్‌కు స్వస్తి: ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదన
సాక్షి, అమరావతి: గ్రూప్ -1 పోస్టుల్లో మినహా మిగతా క్యాడర్ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షల విధానాన్ని రద్దు చేయాలని యోచిస్తోంది. గ్రూప్ – 1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం తొలుత ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు చేపట్టి అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై గ్రూప్ – 2, గ్రూప్ – 3 సహా ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కమిషన్ తలపోస్తోంది. కేవలం ఒక పరీక్షనే నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు వివరించాయి. ఒత్తిడి నుంచి అభ్యర్థులకు ఊరట... ప్రిలిమ్స్ నిర్వహణతో అభ్యర్థులు ఆర్థిక భారం, వ్యయప్రయాసలకు గురవుతుండగా కోచింగ్ పేరిట కొన్ని సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. గతంలో గ్రూప్–1 పోస్టులకే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల విధానం ఉండేది. గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులకు ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు జరిగేవి. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక తమ వారి కోచింగ్ సెంటర్లకు మేలు జరిగేలా పోస్టుల భర్తీ విధానాన్ని మార్చింది. గ్రూప్ –1 సహా అన్ని పోస్టులకూ ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేలా ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల అభ్యర్థులు పరీక్షల సన్నద్దత కోసం ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చేది. కోచింగ్ కేంద్రాల దోపిడీకి చెక్‌పెట్టేలా ఏపీపీఎస్సీ సమూల మార్పులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రిలిమ్స్/ స్క్రీనింగ్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. తద్వారా అభ్యర్థులకు మేలు జరగడంతోపాటు కోచింగ్ సెంటర్ల దందాకు అడ్డుకట్ట పడుతుందని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఇంటర్వ్యూ బోర్డును అభ్యర్థులే ఎంచుకోవచ్చు
సాక్షి, అమరావతి: ఈ నెల 17 నుంచి వచ్చే నెల 9 వరకు జరిగే గ్రూప్–1 పోస్టుల ఇంటర్వ్యూలను అత్యంత పారదర్శకంగా.. ఎలాంటి అనుమానాలు, సందేహాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పటిష్ట చర్యలు చేపట్టింది. గతంలో తలెత్తిన లోపాలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేకుండా కొన్ని కొత్త విధానాలను అమలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇంటర్వ్యూ బోర్డు ఎంపిక అభ్యర్థులదే.. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. అభ్యర్థులు ఏ బోర్డు ముందు ఇంటర్వ్యూకు హాజరు కావాలో తమకు తామే నిర్ణయించుకోవచ్చు. గతంలో ఏ బోర్డు ముందు ఇంటర్వ్యూకు హాజరు కావాలో ఏపీపీఎస్సీ ముందుగా నిర్ణయించి.. ఆ మేరకు అభ్యర్థులకు తెలిపేది. దీనివల్ల అనేక లొసుగులకు ఆస్కారం ఉండేది. అనేక ఆరోపణలు, విమర్శలూ వెల్లువెత్తేవి. ఇప్పుడు అలాంటి వాటికి చెక్ పెడుతూ అభ్యర్థులే ఇంటర్వ్యూ బోర్డును ఎంచుకునే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు అభ్యర్థులు కమిషన్ కార్యాలయంలోని డబ్బాలో 1, 2, 3 ఇంటర్వ్యూ బోర్డుల నంబర్లతో కూడిన చిట్టీల్లో ఒకదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏ బోర్డు నంబర్ వస్తే.. ఆ బోర్డు వద్దకు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. బోర్డుల ఏర్పాటులో పలు జాగ్రత్తలు గ్రూప్–1 ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు రెండు లేదా మూడు బోర్డులను ఏర్పాటు చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఈ బోర్డులకు చైర్మన్, సభ్యుల ఎంపికలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవరు ఏ బోర్డులో ఉంటారో అనే విషయం ఆ సభ్యుడికి ఇంటర్వ్యూ సమయానికి కొద్ది నిముషాల ముందు మాత్రమే తెలియనుంది. గతంలో అయితే బోర్డులో ఎవరెవరు సభ్యులో ముందుగానే అందరికీ తెలిసిపోయేది. ఈ విధానంలో అవకతవకలకు, ఆరోపణలకు ఆస్కారమేర్పడుతోందన్న ఉద్దేశంతో ఇప్పుడీ కొత్త పద్ధతిని కమిషన్ ప్రవేశపెడుతోంది. ప్రతి బోర్డులో చైర్మన్‌తో సహా ఐదుగురు ఏరోజుకారోజు ఇంటర్వ్యూ బోర్డుల కూర్పు ఉంటుంది. ప్రతి బోర్డులో చైర్మన్‌తో సహా మొత్తం ఐదుగురు ఉంటారు. వీరిలో ముగ్గురు ఏపీపీఎస్సీ సభ్యులు కాగా.. ఒకరు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి, మరొకరు ఐటీ, తదితర రంగాలకు చెందిన ప్రముఖుడు ఉండేలా కమిషన్ చర్యలు చేపడుతోంది. ఒక్కో బోర్డు ఉదయం ఐదుగురికి, సాయంత్రం ఐదుగురికి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముంది. మార్కుల పద్ధతిలోనూ మార్పులు గ్రూప్–1 ఇంటర్వ్యూలను 75 మార్కులకు నిర్వహిస్తారు. గతంలో.. మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, కావాల్సినవారికి అత్యధిక మార్కులు వేస్తున్నారని, మిగతా వారికి అతి తక్కువ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తేవి. మొత్తం 75 మార్కుల్లో తమ వారికి 70కి పైగా వేస్తూ.. మిగతావారికి 10, 20 మార్కులతోనే సరిపెడుతున్నారని, దీనివల్ల రాతపరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన మెరిట్ అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారని విమర్శలు చెలరేగేవి. రాతపరీక్షల్లో 500 మార్కులతో అగ్రస్థానంలో ఉన్న అభ్యర్థికి ఇంటర్వ్యూలో 20 మార్కులతో సరిపెట్టి.. తమకు సంబంధించిన అభ్యర్థికి 450 మాత్రమే వచ్చినా ఇంటర్వ్యూలో 70కి పైగా మార్కులు వేయడంతో మెరిట్ అభ్యర్థులు నష్టపోయేవారు. ఇప్పుడు అలాంటి వాటికి ఆస్కారం లేకుండా కమిషన్ మార్కుల కేటాయింపులోనూ నిర్దిష్ట ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపడుతోంది. గ్రేడుల ప్రకారం మార్కులు.. 45 నుంచి 68 మార్కుల వరకు ప్రతి నాలుగు మార్కులను ఒక గ్రేడుగా పరిగణిస్తారు. ఆ గ్రేడ్ల ప్రకారం.. అభ్యర్థులకు మార్కుల కేటాయింపు ఉంటుంది. ఎవరికీ 45 మార్కుల కంటే తక్కువ.. 68 మార్కుల కంటే ఎక్కువ ఉండకుండా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అనంతరం బోర్డు సభ్యులు ఆయా అభ్యర్థికి వచ్చిన గ్రేడ్ల మార్కులను అనుసరించి.. చివరిగా ఏకాభిప్రాయంతో ఒక గ్రేడ్‌ను నిర్ణయించి.. బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో తుది మార్కులను ఖరారు చేస్తారు. తర్వాత వాటిని రికార్డులోకి ఎక్కించి బోర్డు చైర్మన్, సభ్యులంతా సంతకం చేస్తారు. ‘మాకు తక్కువ వేశారు.. వారికి ఎక్కువ వేశారు’ అనే వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్త వహిస్తారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు అభ్యర్థుల హాల్‌టిక్కెట్ నంబర్, వారు ఏం చదువుకున్నారన్న వివరాలను తప్ప మరే అంశాలను తెలియనివ్వరు. -
ఏపీ గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాలు విడుదల
అమరావతి: 2018లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్ (www.psc.ap.gov.in)లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారులు ఉంచారు. అభ్యర్థులకు జూన్ 14వ తేదీ నుంచి ముఖాముఖి పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు. చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త -
ఉద్యోగాల భర్తీకి చర్యలు : ఏపీపీఎస్సీ సభ్యుడు సోనీవుడ్
-
‘సచివాలయ’ ఖాళీల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రభుత్వం అప్పగించింది. గతంలో రెండు విడతలుగా సచివాలయ ఉద్యోగాలను పంచాయతీరాజ్‌శాఖ భర్తీచేసింది. ఇంకా వివిధ విభాగాల్లో మిగిలిన దాదాపు 8,500 ఉద్యోగాలను భర్తీచేసే బాధ్యతను ఇప్పుడు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పంచాయతీరాజ్‌శాఖ నెలరోజుల కిందటే వివిధ శాఖాధిపతులకు తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రెవెన్యూ శాఖ పరిధిలో పనిచేసే వీఆర్వో, విలేజి సర్వేయర్ గ్రేడ్–3 పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే ఏపీపీఎస్సీకి పంపాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మంగళవారం రాత్రి శాఖాధిపతులకు మెమో ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు సీసీఎల్ఏ, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 15 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, వాటిలో పనిచేసేందుకు మొత్తం 19 విభాగాల్లో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీరాజ్‌శాఖ 2019 జూలైలోను, 2020 జనవరిలోను నోటిఫికేషన్లు ఇచ్చి రాతపరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీచేసింది. ఇంకా మిగిలిన దాదాపు 8,500 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల ఖాళీలు, నోటిఫికేషన్లు, రాతపరీక్షల వివరాలతో మే నెల 30న ఏపీపీఎస్సీ కేలండర్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ వివరాలు సేకరిస్తున్నారు. -
పరీక్ష నిర్వహించేది ఇలానేనా?
సాక్షి, అమరావతి: గ్రూప్–1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేందుకు సింగిల్ జడ్జి నిరాకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు సోమవారం తన తీర్పును వాయిదా వేసింది. ఇదే సమయంలో గ్రూప్–1 ప్రశ్నపత్రం రూపకల్పన విషయంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తీరును హైకోర్టు తప్పుపట్టింది. అభ్యర్థుల భవిష్యత్తు గురిం చి ఏ మాత్రం పట్టించుకోరా అంటూ నిలదీసింది. ప్రశ్నపత్నంలో 50కి పైగా తప్పులు ఏమిటంటూ అడిగింది. పరీక్షలు నిర్వహించేది ఇలాగేనా అంటూ ప్రశ్నించింది. ఇంగ్లిష్ లో ఉన్న ప్రశ్నలను తెలుగులోకి సక్రమంగా అనువదించేందుకు అవసరమైన సామర్థ్యం కమిషన్‌కు లేదా అంటూ నిలదీసింది. నిపుణులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. 169 గ్రూప్–1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నల్లో 51 తప్పులు దొర్లాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్లను అనుమతించలేదని, అందువల్ల పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని కోరారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, పరీక్ష తిరిగి నిర్వహించేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్, న్యాయవాది జొన్నలగడ్డ సుదీర్ వాదనలు వినిపించారు. ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తప్పులున్న ప్రశ్నలకు అభ్యర్థులందరికీ సమానంగా మార్కులిచ్చామన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ పరీక్షలు నిర్వహించడం ఇలాగేనా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పును వాయిదా వేసింది. -
నేటి నుంచి గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 20 వరకు ఏడు సెషన్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. తొలిసారిగా ట్యాబ్ ఆధారిత ఆన్లైన్ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు అందించనున్నారు. ఈ పరీక్షలకు 9,679 మంది దరఖాస్తు చేసుకోగా 8,099 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు అధికారిక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును కూడా వెంట తెచ్చుకోవాలి. కోవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థులను లోపలకు అనుమతిస్తారు. అభ్యర్థులు మాస్కులు, గ్లవుజ్‌లు ధరించడంతోపాటు శానిటైజర్‌ను తెచ్చుకోవాలి. సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. అభ్యర్థులు తమ సీట్ల వద్ద ఏర్పాటు చేసిన ట్యాబులను పరీక్షకు ముందు ప్రకటించే పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేసి ప్రశ్నపత్రాలను చూడొచ్చు. ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఉంటాయి. అభ్యర్థులు తాము ఎంచుకున్న మాధ్యమంలో అన్ని పేపర్లను రాయాల్సి ఉంటుంది. రోజూ ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆలస్యంగా వచ్చే వారి కోసం మరో 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు స్పష్టం చేశారు. -
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు 14 నుంచి యథాతథం
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి యథాతథంగా జరగనున్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం స్పష్టం చేశారు. ఈనెల 20వ తేదీ వరకు రోజూ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు మొత్తం 9,678 మంది హాజరు కానున్నారు. ఈ పరీక్షలను నవంబర్ 2 నుంచి 13 వరకు నిర్వహించేలా ఏపీపీఎస్సీ ఇంతకు ముందు షెడ్యూల్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ఐదు ప్రశ్నలకు సంబంధించి లోపాలు ఉండడంతో కోర్టు చేసిన సూచనల ప్రకారం ఏపీపీఎస్సీ వాటిని పునః పరిశీలన చేయించింది. ఈ పరిశీలన అనంతరం కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు కూడా మెయిన్స్ రాసేందుకు అవకాశం ఇచ్చింది. సింగిల్ జడ్జి తీర్పుపై జోక్యానికి నిరాకరణ ఐదు ప్రశ్నలను ఆయా సబ్జెక్టుల్లో నిపుణులకు నివేదించి, సరైన జవాబులను పరిశీలించి, వాటి ఆధారంగా తిరిగి మెరిట్ జాబితాను తయారు చేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యానికి నిరాకరించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ కొందరు దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. ప్రశ్నలు, జవాబుల ప్రామాణికతను తేల్చాల్సింది నిపుణులే తప్ప, న్యాయస్థానాలు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ దొనడి రమేశ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. ట్యాబ్‌బేస్డ్ విధానంపై డెమో వీడియో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలను పంపిణీ చేయనున్నారు. అభ్యర్థులకు ప్రశ్నపత్రాన్ని ట్యాబ్ (ఎలక్ట్రానిక్ డివైస్) ద్వారా ఇస్తారు. ఇది తెలుగు, ఇంగ్లిష్‌లలో ఉంటుంది. అభ్యర్థులు క్వాలిఫయింగ్ పేపర్లయిన తెలుగు, ఇంగ్లిష్ మినహా మిగతా పేపర్లకు సమాధానాలను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలలో వారు ఎంచుకున్న భాషలో రాయవచ్చు. పరీక్ష పూర్తయిన అనంతరం అభ్యర్థులు ఆన్సర్ బుక్‌ను, ట్యాబ్‌ను తాము కూర్చున్న టేబుల్‌పై ఉంచడమో, లేదా ఇన్విజిలేటర్‌కు అందించడమో చేయాలి. వాటిని ఎవరూ బయటకు తీసుకువెళ్లరాదు. ట్యాబ్‌బేస్డ్ పరీక్ష విధానంపై డెమో వీడియో కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. -
సీట్ల సంఖ్య మారింది..
సాక్షి, అమరావతి: ‘బదిలీలు చేశారు.. నియామకాలు ఏవీ?’ అంటూ ఈనాడు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం అసంబద్ధంగా, కుట్రపూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఇంటర్మీడియెట్ విద్య కమిషనరేట్ పేర్కొంది. ఈ కథనాన్ని ఖండిస్తూ కమిషనర్ వి.రామకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తగినంత మంది అధ్యాపకులున్నారు. కొత్తగా మంజూరైన 84 జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాం. కృష్ణా జిల్లా పాయకాపురం, రాధానగర్, గుంటూరు జిల్లాలోని బాపట్ల, అచ్చంపేట, శ్రీకాకుళం జిల్లా రాజాం, ఎల్ఎన్.పేట, జి.సిగడాం, కొయ్యం, తూర్పుగోదావరి జిల్లా గంగవరం పామర్రు, నెల్లూరు జిల్లా టివి గూడూరు, వెంగమాంబ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకులను పూర్తిగా బదిలీ చేశామనేది అవాస్తవం. విద్యార్థుల చేరిక మేరకు అతిథి అధ్యాపకుల ద్వారా ఖాళీలు భర్తీ చేయడానికి, ప్రిన్సిపాళ్ల ద్వారా నియామకాలను జరపడానికి ఉత్తర్వులు ఇచ్చాం. సుమారు 237 మంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లను ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వం అతి త్వరలో నియమించనుంది. ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. అన్ని కళాశాలల్లో తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేదు. ఈనాడు, ఇతర దినపత్రికలలో ప్రచురితమైన వార్తలను ఖండిస్తున్నాం. తల్లిదండ్రులు వాస్తవాలు తెలుసుకొని తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పంపాలని కోరుతున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అడ్మిషన్లలో గందరగోళం ఏమీ లేదు ఇంటర్మీడియెట్ అడ్మిషన్లపై వచ్చిన కథనాలను కూడా రామకృష్ణ మరో ప్రకటనలో ఖండించారు. ‘ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియలో ఎటువంటి గందరగోళం లేదు. ఆన్లైన్ అడ్మిషన్ల గురించి చాలా ముందుగా మార్చిలోనే అన్ని కళాశాలలకు సర్క్యులర్ ఇచ్చాం. అడ్మిషన్ల ప్రక్రియ కంటే ముందుగానే బోర్డు వెబ్సైట్లో విధివిధానాలను విద్యార్థులందరికి అందుబాటులో ఉంచాం. కొన్ని ప్రైవేటు కళాశాలలు ఇన్‌టేక్ వివరాలు నమోదు చేయనందున వాటి పేర్లు ఆన్లైన్లో కనిపించడం లేదు. అలాంటి కళాశాలల వివరాలను కూడా బోర్డు మంజూరు చేసిన గ్రూపులు, సెక్షన్ల ప్రకారం ఆన్లైన్లో ఉంచుతున్నాం. కోవిడ్–19 కారణంగా ఫైర్ ఎన్వోసీ లేని కళాశాలలకు కూడా 60 రోజుల గడువుతో అనుమతి మంజూరు చేస్తున్నాం. వ్యాపార భవన సముదాయాలలో, రేకుల షెడ్లలోని కళాశాలలకు కూడా 2020–2021 విద్యా సంవత్సరానికి అనుమతి ఇచ్చాం. మొత్తం 7,42,780 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి సీట్ల కొరత లేదు. 10వ తరగతి పాసైన ప్రతి ఒక్కరికి సీటు లభిస్తుంది. ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింపు, సీట్ల సంఖ్య కోర్టు ఉత్తర్వులకు లోబడి వుంటుంది . దీని గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. -
గ్రూప్–1 మెయిన్స్‌కు 9,678 మంది
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు మొత్తం 9,678 మంది అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 2 నుంచి 13 వరకు ఈ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ ఇచ్చింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో పరీక్షలను వాయిదా వేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ఐదు ప్రశ్నలకు సంబంధించి లోపాలు ఉండడంతో కోర్టు చేసిన సూచనల ప్రకారం వాటిపై సవరణ చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు కూడా మెయిన్స్‌కు అవకాశం కల్పిస్తోంది. ఇంతకు ముందు అర్హులుగా ఎంపికైన వారితోపాటు వీరూ పరీక్షలు రాయనున్నారు. మెయిన్స్ పరీక్షలకు ఎంపికైనవారి జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. కాగా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు ఎంపికైనవారి ప్రొవిజినల్ జాబితాలను కమిషన్ గురువారం విడుదల చేసింది. -
గ్రూప్- 1 మెయిన్స్ వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
సాక్షి, విజయవాడ : గ్రూప్-1 మెయిన్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయించింది. వచ్చేనెల 2 తేదీ నుంచి 13 తేదీ వరకూ పరీక్షలు నిర్వహించేలా గతంలో షెడ్యూలు విడుదల చేసింది. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షల షెడ్యూలును ఈనెల 29వ తేదీన ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు.