
సాక్షి, అమరావతి: అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులకు పరీక్ష కేంద్రాల కేటాయింపులో ముందుగా ఆప్షన్ ఇచ్చిన వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఫిబ్రవరి 5లోగా ఆప్షన్లను వెబ్ లింక్‌లో కొత్తగా నమోదు చేయాలని సూచించింది. ఈ వెబ్ లింక్ ( https:// psc. ap. gov. in) ఈ నెల 27 నుంచి అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా వెబ్ ఆప్షన్లను సమర్పించాలి. ఇంతకు ముందు దరఖాస్తుల సమర్పణ సమయంలో ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోరు.
ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రం ఆప్షన్లతోపాటు తమ సబ్జెక్ట్, పోస్టు ప్రాధాన్యతలను ఫిబ్రవరి 5లోపు కమిషన్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఈ ఆప్షన్లనే తుది ఆప్షన్లుగా పరిగణిస్తారు. అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో మూడు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. కేంద్రాల ఎంపిక సహా ఇతర అంశాలను ఎడిట్ ఆప్షన్ ద్వారా జాగ్రత్తగా నమోదు చేయాలి. కాగా, ఏపీపీఎస్సీ 190 ఏఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment