![Ap Govt Has Increased 212 Additional Posts In Group 2 - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/20/cmysjagan12.jpg.webp?itok=3e_qdipu)
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిరుద్యోగులకు వీలైనంత మేలు చేయాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనకి అనుగుణంగా గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల అభ్యర్థనకు సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎం జగన్ ఆదేశాలతో అన్ని విభాగాలను మరోసారి ఖాళీల వివరాలని తెప్పించుకున్న జీఎడీ.. పరిశీలన తర్వాత అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
చదవండి: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment