additional
-
రంగారెడ్డి: రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో నిన్న సాయంత్రం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్‌ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. -
ప్రఫుల్ దేశాయ్‌పై ట్రోలింగ్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) ప్రఫుల్ దేశాయ్‌పై వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేద్కర్ తరహాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన ఆయన సివిల్స్‌లో 523వ ర్యాంకుతోపాటు ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ కూడా క్లెయిమ్ చేశారు. ఇటీవల మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్ ఖేద్కర్ తరహాలోనే ప్రపుల్ దేశాయ్ కూడా నకిలీ దివ్యాంగుడని, ఆయన సర్టిఫికెట్ తప్పని పలువురు ‘ఎక్స్’ వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాలోని ఆయన సైక్లింగ్, హార్స్ రైడింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ చేసిన ఫొటోలను ఉదహరిస్తున్నారు. కాలు బాగాలేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఈ పోస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆయన మిత్రులు, తెలిసినవారు ప్రఫుల్ దేశాయ్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్య ంగా ఆయనతో చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వారంతా ప్రఫుల్ కాలికి ఉన్న సమస్య నిజమైనదేనని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన మనసు గాయపరచవద్దని హితవు పలుకుతున్నారు. అయినా, ట్రోలింగ్ ఆగడకపోవడం గమనార్హం. ఒక ఖాతా నుంచి కాకుండా వివిధ సోషల్ మీడియా ఖాతాల నుంచి ట్రోల్ చేస్తుండటంతో ఇది ఉద్దేశపూర్వక చర్యగా కరీంనగర్ కలెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు.చట్టపరమైన చర్యలు తీసుకుంటాంతనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఐఏఎస్ ప్రఫుల్ దేశాయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. మూడు పేజీల లేఖతో నెటిజన్లకు స్పష్టత ఇచ్చారు. అందులో.. ‘2019 యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనంతరం ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్(ఏఐఐఎంఎస్) మెడికల్ బోర్డు ముందు హా జరయ్యాను. వారు నాకున్న లోపాన్ని సర్టిఫై చేశారు. అనంతరం అదే రిపోర్టును డీవోపీటీతోపాటు యూపీఎస్సీకి పంపారు. కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇది ఎంతో బాధాకరం. నిజంగానే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిని ప్రశ్నిస్తే అందులో అర్థముంది. కానీ, నిజాయతీగా ఉన్న వారిని ఆన్లైన్లో వ్యక్తిగత ఫొటోలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చే యడం మా పనితీరును, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే అవుతుంది.’ అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ‘సాక్షి’కి వివరణ ఇస్తూ.. తనను ఆన్లైన్లో ట్రోల్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.యూపీఎస్సీ స్కాం పేరిట ట్రెండింగ్మొత్తం మీద ఖేద్కర్ వ్యవహారంతో ఇప్పుడు సోషల్ మీడియాలో యూపీఎస్సీ స్కాం, ఈడబ్ల్యూఎస్, వీల్‌చైర్ యూజర్ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఎకనమిక్ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్), నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్లు తీసుకొని, సివిల్స్ ర్యాంకు సాధిస్తున్నారంటూ ఇటీవల సివిల్స్ ర్యాంకు సాధించినవారి ఫొటోలతో నేరుగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. వీటిని ప్రధాని కార్యాలయం, డీవోపీటీ, ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్ చేస్తున్నారు. మొత్తానికి పూజా ఖేద్కర్ వివాదంతో యూపీఎస్సీ తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటోంది. ఆన్లైన్లో ర్యాంకర్ల ర్యాంకులు, వారి రిజర్వేషన్లను స్క్రీన్ షాట్లు తీసి, పెడుతుండటంతో సదరు అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు. -
AP: రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది అదనపు ఎస్పీలు బదిలీ
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా 21 మంది అదనపు ఎస్పీ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అదనపు ఎస్పీ అధికారుల జాబితా.. -
విస్తరణ దిశగా ఆర్బీఎల్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ ఆర్బీఎల్ బ్యాంక్ విస్తరణపై దృష్టి సారించింది. వచ్చే మూడేళ్లలో 226 శాఖలను అదనంగా జోడించుకుంటామని ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఉన్న మొత్తం వ్యాపారం (డిపాజిట్లు, రుణాలు) రూ.1.55 లక్షల కోట్లను 2026 మార్చి నాటికి రూ.2.70 లక్షల కోట్లకు పెంచుకోనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి 514 శాఖలు ఉండగా, 2026 మార్చి నాటికి వీటిని 740కు తీసుకెళతామని ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 190 జిల్లాల పరిధిలో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆర్బీఎల్ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూ.84,887 కోట్లుగా ఉన్న డిపాజిట్లను రూ.1.45 లక్షల కోట్లకు పెంచుకోవాలని అనుకుంటోంది. అదే సమయంలో రుణాలు రూ.70,209 కోట్లుగా ఉంటే, వీటిని రూ.1.25 లక్షల కోట్లకు విస్తరించాలనే ప్రణాళికలతో ఉంది. ఈ వివరాలను ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లో ఆర్బీఎల్ బ్యాంక్ పేర్కొంది. మార్చి నాటికి హోల్ సేల్, రిటైల్ రుణాల నిష్పత్తి 46:54గా ఉంటే, దీన్ని 35:65 రేషియోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపింది. -
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిరుద్యోగులకు వీలైనంత మేలు చేయాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనకి అనుగుణంగా గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల అభ్యర్థనకు సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎం జగన్ ఆదేశాలతో అన్ని విభాగాలను మరోసారి ఖాళీల వివరాలని తెప్పించుకున్న జీఎడీ.. పరిశీలన తర్వాత అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. చదవండి: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ సాక్షి తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
ఇదేనా మీ పనితీరు ?
కల్లూరు/కల్లూరు రూరల్: కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను అదనపు కలెక్టర్ స్నేహలత, అసిస్టెంట్ కలెక్టర్ రాధికాగుప్తా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్యసేవలు, పరీక్షల్లో లోపాలపై వైద్యుడు లవన్‌కుమార్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఆస్పత్రిలో కనీస సంఖ్యలో ప్రసవాలు జరగకపోవడం, టీహబ్‌లో పరీక్షల లక్ష్యాలను చేరుకోకపోవడంతో పాటు రికార్డు నిర్వహణపై అసంతృప్తి వ్యక్తంచేశారు. అలాగే, మండలంలోని చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిని కూడా అదనపు కలెక్టర్ స్నేహలత, అసిస్టెంట్ కలెక్టర్ తనిఖీ చేసి ‘ఆరోగ్య మహిళ’లో భాగంగా వైద్యసేవలపై ఆరా తీశారు. డీఆర్డీఓ విద్యాచందన, డిప్యూటీ డీఎంహెచ్ఓ సీతారాం, ఎంపీపీ బీరవల్లి రఘు, ఎంపీడీఓ బి.రవికుమార్, ఎంపీఓ వీరస్వామి, డాక్టర్ తబుస్సుంతో పాటు డాక్టర్ లక్కినేని రఘు, సీహెచ్.కృష్ణారావు, లక్ష్మీకాంతమ్మ, నాగశేషరెడ్డి, సాకేత్ పాల్గొన్నారు. -
చట్ట ప్రకారమే జీవో నెంబర్ 1 : ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్
-
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అదనపు ఛార్జిషీట్
-
వీరసింహరెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరణ వార్తల్లో నిజం లేదు
-
రుణ లక్ష్యాన్ని తగ్గించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని రూ.10,000 కోట్లు కుదించుకుంది. పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడం దీనికి కారణం. భారీ పన్ను వసూళ్ల వల్ల ఉచిత రేషన్ పంపిణీపై అదనపు వ్యయం రూ.44,762 కోట్లు భర్తీ అయ్యే పరిస్థితి నెలకొందని, ఇది కేంద్ర రుణ లక్ష్యాన్ని తగ్గించుకోడానికి సైతం దోహదపడిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విండ్‌ఫాల్ ట్యాక్స్ కూడా ఖజానాకు లాభం ఒనగూర్చనుందని వివరించింది. 2022–23 బడ్జెట్ రూ.14.31 లక్షల కోట్ల మార్కెట్ రుణ సమీకరణలను నిర్దేశించుకుంది. తాజా కేంద్ర నిర్ణయంతో ఇది రూ.14.21 లక్షల కోట్లకు తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–మార్చి మధ్య రూ.5.92 లక్షల కోట్ల (రూ.14.21 లక్షల కోట్లలో రూ.41.7 శాతం) రుణ లక్ష్యాలను జరపాల్సి ఉంది. ఇందులో ఒక్క సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా రూ.16,000 కోట్ల సమీకరణలు జరపనుంది. కాగా, సెప్టెంబర్ 17 నాటికి 30 శాతం అధికంగా (2020–21తో పోల్చి) రూ.8.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. -
పొరపాటున అడిషనల్ బోనస్: ఉద్యోగుల కుటుంబాల్లో చిచ్చు
న్యూఢిల్లీ: జపాన్ కార్ మేకర్ హోండా తప్పులో కాలేసింది. ఓహియో-ఆధారిత మేరీస్‌విల్లే ఫ్యాక్టరీలోని ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్‌లో అనుకోకుండా అదనపు మొత్తంలో చెల్లించింది. ఆలస్యంగా పొరపాటు గ్రహించిన సంస్థ అదనంగా చెల్లించిన సొమ్మను ఇచ్చేయాలంటూ తన ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తాజా పరిణామంతో అవాక్కయిన ఉద్యోగులు చేతికొచ్చిన సొమ్ములు ఎలా ఇవ్వాలో తెలియక తికమకలో పడిపోయారు. మరోవైపు ఉద్యోగులు డబ్బులువాపస్ ఇస్తారా లేదా, లేదంటే భవిష్యత్తు బోనస్‌లో కట్ చేసుకోవాలో తేల్చుకోలేక హోండా అధికారులు తలలు పట్టుకున్నారు. (SpiceJet Salary Hikes: సంచలనం,పైలట్లకు 20 శాతం జీతం పెంపు!) సెప్టెంబరు 22 వరకు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని భవిష్యత్ చెల్లింపుల నుండి తీసుకోవాలా, భవిష్యత్ బోనస్‌లో మినహాయించుకోవాలా లేదా ముందుగా చెల్లిస్తారా మీరే తేల్చుకోమని ఉద్యోగులను కోరింది. ఈ విషయాన్ని హోండా ప్రతినిధి కూడా ధృవీకరించింది. అయితే సున్నితమైన ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఉద్యోగులు డబ్బును తిరిగి చెల్లించకపోతే హోండా చట్టపరమైన మార్గంలో వెళ్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో ఆగ్రహాలు దీనిపై ఉద్యోగుల కుటుంబాల్లో అగ్రహాలువ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని అందరూ మేనేజ్ చేయలేరంటూ ఒక హోండా ఉద్యోగి భార్య వాపోయారు. తన భర్తకు వచ్చిన బోనస్‌లో 8 శాతం తిరిగి ఇవ్వాలంటే.. వందల డాలర్లు ఆమెపేర్కొన్నారు. అది మాకు కారు చెల్లింపు. అది మా తనఖాలో సగం, రెండు, మూడు వారాల విలువైన కిరాణా.. ఈ డబ్బు చాలా విలువైంది..చెల్లించాలంటే కష్టం మరొకరు వ్యాఖ్యానించారు. -
ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సంబరాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తాజా భేటీలో తీసుకున్న ఓ నిర్ణయం పట్ల సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు వాళ్లు. సచివాలయంలో 85 అదనపు పోస్టులను ఏపీ కేబినెట్ ఇవాళ్టి(బుధవారం) సమావేశంలో మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. ఈ క్రమంలో.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఇదీ చదవండి: వచ్చే ఏడాది విజయవాడ నుంచే హజ్ యాత్ర -
భోపాల్: కలెక్టర్ ఘటన మరవక ముందే.. అదనపు కలెక్టర్
-
Lockdown: కలెక్టర్ ఘటన మరవక ముందే.. అదనపు కలెక్టర్
భోపాల్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు, అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల అధికారులు లాక్డౌన్ ఉల్లంఘించిన ప్రజలపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సూరజ్‌పూర్‌లో లాక్డౌన్ ఉల్లంఘించిన ఓ వ్యక్తిపై కలెక్టర్ చేయి చేసుకున్న ఘటన మరవక ముందే అదే తరహాలో మరో ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి చెప్పుల షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై షాజాపూర్ అదనపు కలెక్టర్ మంజూషా విక్రంత్‌రాయ్ చేయి చేసుకున్నారు. ఆమె లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించేందుకు రోడ్డుపైకి వచ్చిన సమయంలో.. చెప్పుల షాపు తెరచి ఉంచిన యజమాని చెంప పగలగొట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదనపు కలెక్టర్ వ్యవహారంపై తమకు సమాచారం అందిందని రాష్ట్ర మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ తీరు సరిగా లేదని, అవసరమైతే ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ రణ్‌బీర్ శర్మ.. లాక్డౌన్ పరిస్థితులను సమీక్షించేందుకు రోడ్డుపైకి వచ్చిన సమయంలో.. రోడ్డుపై కనిపించిన ఓ వ్యక్తి చెంపపై కొట్టారు. ఆ యువకుడి మొబైల్ ఫోన్ సైతం నేలకేసి కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక అత్యుత్సాహం ప్రదర్శించిన రణ్‌బీర్ శర్మపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఘటనతో సూరజ్‌పూర్ కలెక్టర్ బాధ్యతల నుంచి ప్రభుత్వం ఆయన్ను తప్పించింది. ఆయన స్థానంలో మరొకరిని నూతన కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించిన సంగతి విదితమే. చదవండి: కలెక్టర్ చెంప దెబ్బ: ఐఏఎస్‌ల సంఘం సీరియస్! -
అడిషనల్ కలెక్టర్‌ను నిలదీసిన కూలీలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో కూలీలకు, అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. మహరాష్ట్ర నుండి వచ్చే కూలీలను నియంత్రణ చేయాలని.. అందులో భాగంగా కూలీలు రాకుండా రాకపోకలు నిలిపివేయాలని కూలీలు డిమాండ్ చేశారు. మహరాష్ట్ర నుండి వస్తున్న వందల మంది కూలీల రాకతో ఆదిలాబాద్‌లో కరోనా విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహరాష్ట్ర నుండి వచ్చే కూలీలను అడ్డుకుంటామని హమీ ఇవ్వాలంటూ కూలీలు.. అడిషనల్ కలెక్టర్‌ను నిలదీశారు. దీనిపై ఆయన కూలీలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేక వెనుదిరిగారు. చదవండి: సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ ఈ చెరువుల్లో నీరు యమ డేంజర్, అస్సలు తాకొద్దు -
చెక్ బౌన్స్ కేసుల సత్వర విచారణపై సుప్రీం దృష్టి
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులు కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో ఈ కేసుల సత్వర పరిష్కారంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ (ఎన్ఐ యాక్ట్) కేసులను సత్వరం పరిష్కరించడానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 35 లక్షల ఎన్ఐ యాక్ట్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పెండింగులో ఉన్న నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, ఆర్. రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలు ఇచ్చింది. 247వ అధికరణ కింద (అదనపు కోర్టుల ఏర్పాటుకు పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తున్న అధికరణం) ఎన్ఐ యాక్ట్ కేసుల సత్వర పరిష్కారానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై కేంద్రం అభిప్రాయాన్ని వచ్చే వారంలో తెలియజేయాలని ధర్మాసనం అడిషనల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీని ఆదేశించింది. చెక్‌బౌన్స్‌లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు గత ఏడాది విచారణకు చేపట్టింది. 2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య (కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసుల దీర్ఘకాలిక విచారణ అంశం) అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లుథ్రా, అడ్వొకేట్ కే. పరమేశ్వర్లు నియమితులయ్యారు. -
మారటోరియం వడ్డీ మాఫీ: విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: మారటోరియం సమయంలో రుణాల పై వడ్డీ మాఫీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం (అక్టోబర్, 5) దీనిపై వాదనలను విన్న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరు నెలల రుణ తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీని వదులుకోవాలని విజ్ఞప్తి చేసింది. వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బీఐకి, కేంద్రానికి ఒక వారం సమయం మంజూరు చేసింది.రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు క్రెడాయ్, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలని సుప్రీం కోరింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. అయితే గత నెల 10న దాఖలు చేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి అవసరమైన వివరాలను ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది.(మారటోరియం : భారీ ఊరట) కాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలో వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు కేంద్రం భారీ ఊరట లభించింది. కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపుపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన ఆరు నెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ మేరకు ఆర్థిక శాఖ అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
రైల్–బోట్.. ఇది రైల్వే రోబో
సాక్షి, హైదరాబాద్: రైల్వే ఆసుపత్రిలో రోబో ఆకట్టుకుంటోంది. సొంతంగా రైల్వే అధికారి ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో రూపొందించిన ఈ రోబో, కోవిడ్ బాధితులకు వైద్య సేవలు చేసే సమయంలో వైద్యులు, సిబ్బంది వారి దగ్గరకు వెళ్లాల్సిన అవసరాన్ని బాగా తగ్గించనుంది. దీనికి రైల్–బోట్ అనే పేరు పెట్టారు. అదనపు డివిజినల్ రైల్వే మేనేజర్ (హైదరాబాద్) హేమ్‌సింగ్ బనోత్‌కు రోబోటిక్ శాస్త్రంలో అవగాహన ఉంది. దీంతో ఆయన తన సిబ్బంది సహకారంతో ఈ రోబోను రూపొందించారు. రోగులకు మందులు, ఆహారం అందించటం, వారి శరీర ఉష్ణోగ్రత చూడటం, వారి వద్దకు వైద్య పరికరాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లటం.. తదితరాల్లో దీని ఉపయోగం ఉండనుంది. పాన్ అండ్ టిల్ట్ ఫంక్షన్స్, రియల్ టైం వీడియో అనుసంధానం ఉండటంతో, వైద్యులు, రోగులు దూరంగా ఉండే దీని ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ వివరాలు రికార్డు కూడా అవుతాయి. వారి శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్టు నమోదైతే అలారం మోగించి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఇది 80 కిలోల బరువును మోసుకెళ్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్, రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్ కంట్రోలర్‌తో దీన్ని ఆపరేట్ చేస్తారు. ప్రయోగాత్మకంగా లాలాగూడలోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ఆసుపత్రిలో దీనిని వినియోగిస్తున్నారు. రోబో పనితీరును దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పరిశీలించి, రూపొందించిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
జేఈఈలో ‘పేపర్’ గొడవ
దుండిగల్: ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కుమారుడి భవిష్యత్ అంధకారమైందని ఆరోపిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు జేఈఈ పరీక్ష కేంద్రం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వీరికి పరీక్ష రాసేందుకు వచ్చిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలపడంతో ఉద్రికత్త నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7, 8, 9 తేదీల్లో దేశ వ్యాప్తంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దుండిగల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థి బిక్కుమల్ల విష్ణుసాయి ఉదయం షిప్ట్‌లో పరీక్షకు హాజరయ్యాడు. ఆన్లైన్లో 3 గంటల పాటు జరిగిన ఈ పరీక్షలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. అయితే ప్రతి ప్రశ్నకు జవాబు రాబట్టేందుకు వీలుగా విద్యార్థులు రఫ్ పేపర్లను వినియోగిస్తారు. అయితే విష్ణుసాయి పరీక్ష కేంద్రంలో ముందుగా రెండు అడిషనల్ షీట్ లు తీసుకున్నాడు. అనంతరం అదనంగా అడిషనల్ షీట్ కావాలని కోరగా ఇన్విజిలేటర్ అందుకు నిరాకరించాడు. కేవలం నాలుగు పేపర్లను మాత్రమే ఇవ్వడంతో సదరు విద్యార్థి పరీక్ష సరిగా రాయలేక పోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వీరికి మద్దతు తెలపడంతో పరీక్షా కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడికి వచ్చిన కళాశాల ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అబ్జర్వర్ రాము మాట్లాడుతూ సిబ్బంది పొరపాటు కారణంగా తప్పిదం జరిగిందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ పంపించి మరోసారి విద్యార్థికి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అయినా తల్లిదండ్రులు శాంతించకపోవడంతో తమ ఇన్విజిలేటర్ తప్పిదం ఉందని అంగీకరిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ పంపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఐదేళ్లుగా కష్టపడుతున్నా.. జేఈఈ పరీక్ష కోసం ఐదేళ్లుగా కష్టపడుతున్నా. ఎంట్రన్స్ పరీక్షలో 75 ప్రశ్నలకు జవాబులు రాయాలంటే కనీసం 20 రఫ్ పేపర్లు అవసరముంటుంది. అయితే ఇన్విజిలేటర్ సార్‌ను ఎంత బతిమాలినా కేవలం నాలుగు పేపర్లే ఇవ్వడంతో పరీక్ష సరిగ్గా రాయలేకపోయాను. దయచేసి నేను మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలి.–విష్ణుసాయి, విద్యార్థి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది మా కుమారుడు విష్ణుసాయి టెన్త్‌లో 88 శాతం మార్కులు సాధించాడు. రెండు సార్లు ఒలంపియాడ్లో విన్నర్‌గా నిలిచాడు. అతడికి 8వ తరగతి నుంచి ఐఐటీ శిక్షణ ఇప్పిస్తున్నాం. ఎంతో కష్టపడి చదివి ఎంట్రన్స్‌లో పాస్ అవుతాడన్న నమ్మకం ఉంది. అయితే ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల మా కుమారుడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. –శ్రీకాంత్, విద్యార్థి తండ్రి -
కర్నూలు ఆర్డీఓగా హుసేన్‌సాహెబ్
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ)గా హుసేన్ సాహెబ్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమెహన్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. 40 రోజుల క్రితం హంద్రీనీవా యూనిట్–4 ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునను ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టకుండా దేశం నేతలు అడ్డంకులు సృష్టించారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే అభిప్రాయంతో ఆయన విధులు చేపట్టకుండా అడ్డుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందువల్ల కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణను పూర్తి అదనపు బాధ్యతలతో కర్నూలు ఆర్డీఓగా నియమించారు. అయితే ఆయన అనారోగ్య కారణలతో విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఎంఎల్సీ ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో పాలనాపరమైన ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న హుసేన్‌సాహెబ్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో ఆర్డీఓగా కలెక్టర్ నియమించారు. ఈ మేరకు ఆయన వెంటనే విధుల్లో చేరారు. -
అదనపు పరీక్షల నియంత్రణాధికారుల కొనసాగింపు
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని నలుగురు అదనపు పరీక్షల నియంత్రణాధికారులను కొనసాగిస్తూ కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. బెనర్జీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాన్ఫిడెన్షియల్ విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారి జి.రామేశ్వరం, దూరవిద్య అదనపు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ సీహెచ్.రాజేశం, డిగ్రీ విభాగం అదనపు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పి. మల్లారెడ్డి, పీజీ కోర్సుల విభాగం అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వి.రాంచంద్రంను కొనసాగిస్తూ అంటిల్æఫర్దర్ ఆర్డర్స్‌తో ఉత్తర్వులు జారీ చేసినట్లు బెనర్జీ తెలిపారు. ఆ నలుగురి పదవీ కాలం గత మంగళవారంతో ముగిసింది. దీంతో వారిని మళ్లీ కొనసాగిస్తూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న అప్రూవల్ మేరకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. -
‘హాజరు’ పేరుతో అదనపు బాదుడు
అటెండెన్స్ ఫీజుల బలవంతపు వసూలు చెల్లించలేకపోతోన్న విద్యార్థులు రశీదులైనా ఇవ్వని కళాశాల సిబ్బంది వెల్దుర్తి: వాళ్లంతా నిరుపేద విద్యార్థులు..ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు కట్టే స్థోమత లేక ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు..కళాశాలలో హాజరు శాతం తక్కువగా వుందంటూ పరీక్ష ఫీజులతోపాటు అదనంగా రూ. 530 వసూళ్లు చేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ కళాశాలలో లెక్చరర్లు చేసే ఈ అక్రమ వ సూళ్ల సంగతి ప్రిన్సిపాల్‌కు తెలియకపోవడం విశేషం. వివరాల్లోకెళితే..వెల్దుర్తిలో ఉన్న శ్రీ రాయరావు సరస్వతీ మె మోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి, ద్వితీయ సంవత్సరం తరగతుల్లో 419 మంది విద్యార్థులు చ దువుకుంటున్నారు. అయితే ఈ కళాశాలలో 60మందికి పరీక్షల ఫీజు రూ.370 తోపాటు హాజరు శాతం తక్కువ ఉన్నం దున అదనంగా రూ.530 అధ్యాపకులు బలవంతంగా వసూలు చేస్తున్నారని బా ధిత విద్యార్థులు వాపోయారు. అదనపు సొమ్ము చెల్లిస్తే కనీసం రశీదులు కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు తెలిపారు. కరువు కాలం ఉన్నందున అంత డబ్బు కట్టలేని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోయారు. ఫీజుతో పాటు అదనపు డబ్బు కడితేనే హాల్‌టికెట్లు ఇస్తామంటున్నారని, లేకుంటే ఇవ్వమంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ ఆదేశాలతోనే అదనపు రుసుం వసూలు అక్రమ వసూళ్ల విషయమై కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలును వివరణ కోరగా విద్యార్థులు నుండి అదనపు వసూళ్లు చేస్తున్నట్లు తన నోటీసులో లేదన్నారు. అనంతరం 22మంది సీఈసీ సెకండ్ ఇయర్ విద్యార్థుల నుండి అదనంగా రూ.530వసూళ్లు చేశామని, హాజరు శాతం తక్కువ ఉన్నందునే ఇలా వసూళ్లు చేశామని లెక్చరర్లు తెలిపారు. దీంతో ప్రిన్సిపాల్ నర్సింలు మాట్లాడుతూ 60నుండి 75శాతం హాజరు శాతం తక్కువ ఉన్న విద్యార్థుల నుండి పరీక్ష ఫీజుతో పాటు కండోనేషన్ ఫీజు కింద రూ.530 వసూళ్లు చేయాలనే ఆదేశం కమిషనర్ నుండి ఉన్నాయన్నారు. కానీ రిసిప్ట్లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తే అధ్యాపకులు నీళ్లు మింగుతున్నారు. మధ్యలో ప్రిన్సిపాల్ కల్పించుకొని వసూళ్లు చేసిన డబ్బును కళాశాల అకౌంట్లోకి మార్చడానికి డీడీలు తీసిన అనంతరం విద్యార్థులకు రసీదులు అందజేస్తామన్నారు. -
బల ప్రదర్శన
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ :సమైక్య ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు అనంతపురంలో మోహరించిన అదనపు పోలీసు బలగాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. బల ప్రదర్శనతో ప్రజలను భయాందోళనకు గురిచేయాలని పోలీసులు పన్నుతున్న కుట్రను ఎండగట్టేందుకు ప్రయత్నించారు. ఉద్యమం మరింత ఉధృతం కానుండటంతో పోలీసులు మరిన్ని అదనపు బలగాలను శనివారం రాత్రి నగరానికి రప్పించారు. ఆదివారం సాయంత్రం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో బల ప్రదర్శన (కవాతు) నిర్వహించారు. ఈ బలగాలు స్థానిక టవర్‌క్లాక్ వద్ద కవాతు ప్రారంభిస్తుండగా... సమైక్యాంధ్ర ఉద్యమనేతలు కొగటం విజయభాస్కర్‌రెడ్డి, నాగరాజుతో పాటు ఉద్యమకారులు అడ్డుపడ్డారు. పోలీసులు వారిని నియంత్రించే క్రమంలోపెద్దఎత్తున తోపులాట జరిగింది. అనంతరం సమైక్యవాదులను అరెస్టు చేసి.. వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. ‘ఎస్పీ గోబ్యాక్’ అంటూ సమైక్యవాదులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అదనపు బలగాలను తక్షణమే జిల్లా నుంచి పంపేయాలంటూ డిమాండ్ చేశారు. ఉద్యమం శాంతియుతంగా జరుగుతుండగా.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం సరైంది కాదన్నారు. ఇప్పటిదాకా గాంధేయ మార్గంలో ఉద్యమం కొనసాగుతోందని, పరోక్షంగా పోలీసులే కలుషితం చేసి సమైక్యవాదులను జైళ్లలో పెట్టాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పైగా విద్యార్థులను ఉద్యమ ప్రారంభంలోనే తరిమి కొట్టి భయభ్రాంతులకు గురి చేశారని గుర్తుచేశారు. కాగా... ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఎన్జీవో, విద్యార్థి జేఏసీలు, సమైక్యాంధ్రవాదులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ‘అనంత’ను ఆధీనంలోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుమారు 15 వేల మంది పోలీసులు విధుల్లో ఉండగా, మరో 13 వేల మందిని మోహరించారు. జిల్లాలో ఇంత మంది పోలీసులు అవసరమా అని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. నగరంలో కవాతు అనంతపురం నగర ప్రధాన రహదారుల గుండా పోలీసు అదనపు బలగాలు కవాతు నిర్వహించాయి. టవర్‌క్లాక్ సర్కిల్ నుంచి ప్రారంభమైన కవాతు సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, ఆర్టీసీ బస్టాండు, తాడిపత్రి బస్టాండు మీదుగా కొనసాగింది. ఈ కవాతులో వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్, త్రీటౌన్ సీఐ దేవానంద్, సీసీఎస్ సీఐ శ్రీనివాసులు, రూరల్ సీఐ గురునాథబాబు, ఆత్మకూరు సర్కిల్ సీఐ విజయకుమార్, ఎస్ఐలు రెడ్డప్ప, ధరణికిశోర్, జీటీ నాయుడు, జాకీర్ హుస్సేన్‌తో పాటు పలువురు పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.