అటెండెన్స్ ఫీజుల బలవంతపు వసూలు
చెల్లించలేకపోతోన్న విద్యార్థులు
రశీదులైనా ఇవ్వని కళాశాల సిబ్బంది
వెల్దుర్తి: వాళ్లంతా నిరుపేద విద్యార్థులు..ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు కట్టే స్థోమత లేక ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు..కళాశాలలో హాజరు శాతం తక్కువగా వుందంటూ పరీక్ష ఫీజులతోపాటు అదనంగా రూ. 530 వసూళ్లు చేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ కళాశాలలో లెక్చరర్‌లు చేసే ఈ అక్రమ వ సూళ్ల సంగతి ప్రిన్సిపాల్‌కు తెలియకపోవడం విశేషం. వివరాల్లోకెళితే..వెల్దుర్తిలో ఉన్న శ్రీ రాయరావు సరస్వతీ మె మోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి, ద్వితీయ సంవత్సరం తరగతుల్లో 419 మంది విద్యార్థులు చ దువుకుంటున్నారు. అయితే ఈ కళాశాలలో 60మందికి పరీక్షల ఫీజు రూ.370 తోపాటు హాజరు శాతం తక్కువ ఉన్నం దున అదనంగా రూ.530 అధ్యాపకులు బలవంతంగా వసూలు చేస్తున్నారని బా ధిత విద్యార్థులు వాపోయారు. అదనపు సొమ్ము చెల్లిస్తే కనీసం రశీదులు కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు తెలిపారు. కరువు కాలం ఉన్నందున అంత డబ్బు కట్టలేని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోయారు. ఫీజుతో పాటు అదనపు డబ్బు కడితేనే హాల్‌టికెట్లు ఇస్తామంటున్నారని, లేకుంటే ఇవ్వమంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
కమిషనర్ ఆదేశాలతోనే
అదనపు రుసుం వసూలు
అక్రమ వసూళ్ల విషయమై కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలును వివరణ కోరగా విద్యార్థులు నుండి అదనపు వసూళ్లు చేస్తున్నట్లు తన నోటీసులో లేదన్నారు. అనంతరం 22మంది సీఈసీ సెకండ్ ఇయర్ విద్యార్థుల నుండి అదనంగా రూ.530వసూళ్లు చేశామని, హాజరు శాతం తక్కువ ఉన్నందునే ఇలా వసూళ్లు చేశామని లెక్చరర్లు తెలిపారు. దీంతో ప్రిన్సిపాల్ నర్సింలు మాట్లాడుతూ 60నుండి 75శాతం హాజరు శాతం తక్కువ ఉన్న విద్యార్థుల నుండి పరీక్ష ఫీజుతో పాటు కండోనేషన్ ఫీజు కింద రూ.530 వసూళ్లు చేయాలనే ఆదేశం కమిషనర్ నుండి ఉన్నాయన్నారు. కానీ రిసిప్ట్‌లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తే అధ్యాపకులు నీళ్లు మింగుతున్నారు. మధ్యలో ప్రిన్సిపాల్ కల్పించుకొని వసూళ్లు చేసిన డబ్బును కళాశాల అకౌంట్‌లోకి మార్చడానికి డీడీలు తీసిన అనంతరం విద్యార్థులకు రసీదులు అందజేస్తామన్నారు.
‘హాజరు’ పేరుతో అదనపు బాదుడు
Published Mon, Nov 23 2015 11:44 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement