కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారధ్యంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్‌జోడో న్యాయ యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్ఫీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొనడం లేదని సమాచారం.
లోక్‌సభ ఎన్నికల సీట్ల కేటాయింపు విషయంలో ఒప్పందం కుదరకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో అఖిలేష్ పాల్గొంటారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానాన్నిఅఖిలేష్ అంగీకరించి, అమేథీ లేదా రాయ్ బరేలీలో జరిగే న్యాయ యాత్రలో పాల్గొంటానని స్వయంగా ప్రకటించారు.
రాహుల్ యాత్ర సోమవారం అమేథీలో, మంగళవారం రాయ్‌బరేలీలో ఉండనుంది. సోమవారం అఖిలేష్ అమేథీకి వెళ్లడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్‌బరేలీలో జరిగే న్యాయ యాత్రలో ఆయన పాల్గొనవచ్చని, అయితే దీనిపై స్పష్టత లేనందున ఎలాంటి సన్నాహాలు చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment