Bharat Jodo Nyay Yatra
-
జోడో పోయే.. డోజో వచ్చే
ఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్ జోడో న్యాయ యాత్ర చేసిన రాహుల్..త్వరలో భారత్ డోజో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు.ఈ సందర్భంగా..‘గత ఏడాది భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట వేల కిలోమీటర్లు ప్రయాణించా.ఆ యాత్రలో ఫిట్‌గా ఉండేందుకు ప్రతి రోజు సాయంత్రం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. యాత్రలో భాగంగా నేను బస చేసే ప్రాంతంలో యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్ని కలిశాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మార్షల్ ఆర్ట్స్‌ని యువతకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఎలాంటి హింస లేకుండానే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు. సమాజంలో అందరూ సేఫ్‌గా ఉండాలంటే ఇలాంటి టెక్నిక్స్ కచ్చితంగా నేర్చుకోవాలి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.During the Bharat Jodo Nyay Yatra, as we journeyed across thousands of kilometers, we had a daily routine of practicing jiu-jitsu every evening at our campsite. What began as a simple way to stay fit quickly evolved into a community activity, bringing together fellow yatris and… pic.twitter.com/Zvmw78ShDX— Rahul Gandhi (@RahulGandhi) August 29, 2024 -
ముగిసిన భారత్ జోడో న్యాయ యాత్ర
-
ఈవీఎం, ఈడీ, ఐటీ లేకుండా మోదీ ఎన్నికల్లో నెగ్గలేడు: రాహుల్
ముంబై/లఖ్‌నవూ: బీజేపీ పాలనలో దేశంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషం తదితరాలను ప్రజలకు చాటిచెప్పేందుకు విధిలేని పరిస్థితుల్లో భారత్ జోడో యాత్రలు చేపట్టాల్సి వచి్చందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. జాతుల హింసతో అట్టుడికిన మణిపూర్‌లో జనవరి 14న మొదలు పెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర 63 రోజులకు ఆదివారం ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా సెంట్రల్ ముంబైలోని అంబేడ్కర్ స్మారకం చైత్యభూమిని రాహుల్ సందర్శించారు. రాజ్యాంగ ప్రవేశికను చదివి నివాళులరి్పంచారు. అనంతరం స్థానిక శివాజీ పార్కులో విపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో మాట్లాడారు. మోదీ ఓ అసమర్థ నేత అంటూ దుయ్యబట్టారు. ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గడం ఆయన తరం కాదన్నారు. ‘‘మోదీ కేవలం అధికారం కోసం అర్రులు చాచే ముసుగు మనిషి. అవినీతిపై మోదీదే గుత్తాధిపత్యం. తనది 56 అంగుళాల ఛాతీ అని ఆయన చెప్పుకునే మాటలన్నీ అబద్ధాలే’’ అంటూ తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం వీవీప్యాట్లను కచ్చితంగా లెక్కించాలన్న తమ డిమాండ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీ గ్యారెంటీ సంపన్నుల కోసమైతే ఇండియా కూటమి హామీలు సామాన్యుని కోసమన్నారు. విపక్షాల బల ప్రదర్శనలో భాగంగా జోడో యాత్ర ముగింపులో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు శరద్ పవార్ (ఎన్సీపీ–శరద్), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు వీరిలో ఉన్నారు. ఇండియా కూటమిలో కీలక పక్షమైన సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం గైర్హాజరయ్యారు. అయితే, యాత్ర ను రాహుల్ విజయవంతంగా ముగించారని కొనియాడుతూ ఆయనకు లేఖ రాశారు. వచ్చేది ‘ఇండియా’ సర్కారే గాంధీ ముంబై నుంచే క్విట్ ఇండియా నినాదమిచ్చారని శరద్ పవార్ గుర్తు చేశారు. బీజేపీని అధికారం నుంచి దించేందుకు ఇండియా కూటమి కూడా ముంబైలో ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఇండియా కూటమేనని స్టాలిన్ అన్నారు. ఎన్నికల బాండ్లను బీజేపీ పాల్పడ్డ వైట్ కాలర్ నేరంగా అభివర్ణించారు. ప్రజలంతా ఒక్కటైనప్పుడే నియంతృత్వానికి తెర పడు తుందని ఉద్ధవ్ అన్నారు. ఈడీ, సీబీఐ సాయంతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందని తేజస్వి మండిపడ్డారు. తమ పోరు విద్వేష రాజకీయాలపైనే తప్ప మోదీపైనో, అమిత్ షాపైనో కాదన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదు అంతకుముందు ముంబైలో మహాత్మాగాంధీ నివసించిన మణిభవన్‌ను రాహు ల్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడం బీజేపీ తరం కాదన్నారు. ఈ విషయంలో పార్టీ ప్రకటనలు ఉత్తి అరుపులు మాత్రమేనన్నారు. ‘‘జ్ఞానం కేవలం ఒక్క వ్యక్తి సొత్తేనన్నది బీజేపీ, ఆరెస్సెస్ భావన. రైతులు, కారి్మకులు, నిరుద్యోగ యువతకు ఏమీ తెలియదన్నది వారి దురభిప్రాయం’’ అంటూ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలను కేంద్రీకృత పాలనే కావాలనే బీజేపీ, అది వికేంద్రీకృత తరహాలో సాగాలనే కాంగ్రెస్ భావజాలాల మధ్య పోరుగా అభివరి్ణంచారు. -
నేటితో ముగియనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
సాక్షి, ముంబై : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నేటితో ముంబైలో ముగియనుంది. మణిపూర్ నుంచి ప్రారంభమైన 6,700 కిలోమీటర్ల పాదయాత్రను ముంబైలో శివాజీ పార్క్ వద్ద రాహుల్ గాంధీ ముగింపు పలకనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశిస్తూ ప్రతిపక్ష కూటమి ఇండియాలోని కూటమి పార్టీల నేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య, శరద్ పవార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్‌లు పాల్గొననున్నారు. జనవరి 14న ప్రారంభమై జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా కొనసాగింది. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్రను నేటితో ముగుస్తుంది. -
ఎలక్టోరల్ బాండ్లు అంతర్జాతీయ రాకెట్: రాహుల్
థానే: బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం ముమ్మాటికీ అంతర్జాతీయ స్థాయి బలవంతపు వసూళ్ల రాకెట్ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయ పారీ్టలను చీల్చడానికి, రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడానికి ఈ పథకాన్ని వాడుకున్నారని మండిపడ్డారు. మహరాష్ట్రలోని జాంభాలీ నాకాలో శనివారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ప్రసంగించారు. మన దేశంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, నిరసన తెలిపినా ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ వంటివి వెంటనే దాడులకు దిగుతున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన పారీ్టలు రెండుగా చీలడానికి కారణం ఏమిటో చెప్పాలని బీజేపీని ప్రశ్నించారు. దేశ జనాభాలో 80 శాతం ఉన్న బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారీ్టలు, పేదలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకకు కేవలం సంపన్న పారిశ్రామికవేత్తలను, సినిమా నటులను మాత్రమే ఆహా్వనించారని, పేదలను పక్కనపెట్టారని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆదివాసీ మహిళ అయినందుకే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహా్వనించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్: జైరాం లోక్‌సభ ఎన్నికల ముందు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా తమపై బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్రైక్‌కు దిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. దాంతో పార్టీ ఆర్థికంగా శక్తిహీనంగా మారిందని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఇప్పుడు తమ వద్ద డబ్బు లేదని అన్నారు. బాండ్ల ముసుగులో బీజేపీ చట్టవిరుద్ధంగా నిధులు కొల్లగొట్టిందని ఆరోపించారు. -
ఎలక్టోరల్ బాండ్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్
సాక్షి, థానే : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలక్టోరల్ బాండ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని ఆరోపించారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల్ని శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను విభజించి, ప్రభుత్వాలను పడగొట్టేందుకే ఉపయోగించిందని’ విమర్శలు చేశారు. ‘రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల బాండ్లను (స్కీమ్) రూపొందించినట్లు ప్రధాని మోదీ గతంలో తెలిపారు. కానీ ఇది దేశంలోని కార్పొరేట్ కంపెనీల నుంచి డబ్బుల్ని దండుకునే స్కీంలా మారిందని అని అన్నారు. త్వరలోనే దీనిపై విచారణ జరుగుతుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఈడీ, సీబీఐలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలుగా మారాయని, ఏదో ఒక రోజు బీజేపీ ప్రభుత్వం స్థానభ్రంశం చెందుతుందని జోస్యం చెప్పారు. అలాంటి చర్యలకు శిక్ష పడుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటివి జరగవు. ఇది నా హామీ అని రాహుల్ గాంధీ వెల్లడించారు. -
‘స్టార్టప్ ఇండియా’ లోపభూయిష్టం
గోధ్రా(గుజరాత్): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచి్చన ‘స్టార్టప్ ఇండియా’ విధానం సరిగ్గా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విధానం ఫలితంగా దేశంలో ఒక్కటంటే ఒక్క స్టార్టప్ కూడా లేదన్నారు. ఉన్నవి కూడా విదేశీ సంస్థల నియంత్రణలోనే నడుస్తున్నాయన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర శుక్రవారం గుజరాత్‌లోని గోధ్రాకు చేరుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన సభలో రాహుల్ మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు రూ.5 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, కారి్మకులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జోడో యాత్ర గురువారం రాజస్తాన్ నుంచి దహోద్ వద్ద గుజరాత్లో ప్రవేశించింది. రాత్రి దాహోద్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ఝాలోడ్ పట్టణ సమీపంలోని కుంబోయి దామ్‌లో గిరిజనులకు ఆరాధ్యుడైన గోవింద్ గురుకు నివాళులర్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ మహిళా కార్యకర్తలు అందజేసిన భారీ కేక్‌ను తన ఎస్యూవీ పైనుంచే రాహుల్ కట్ చేశారు. గోధ్రాకు వస్తూ శివాలయంలో ఆయన పూజలు చేశారు. గోధ్రా నుంచి సాయంత్రం పావగఢ్‌కు చేరుకుని మా కొడియార్ ఆలయంలో పూజలు చేశారు. పంచ్‌మహల్ జిల్లా జంబుఘోడా గ్రామంలో రాత్రి బస చేశారు. -
రాహుల్ ‘యువ న్యాయ్’
జైపూర్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు నూతన హామీలను ప్రకటించారు. గురువారం భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్యప్రదేశ్‌లో పూర్తిచేసుకుని రాజస్థాన్‌లో అడుగుపెట్టిన సందర్భంగా బాంసవాడా పట్టణంలో ఏర్పాటుచేసిన సభలో రాహుల్ హామీల జల్లు కురిపించారు. ‘‘మేం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను మొట్టమొదట భర్తీచేస్తాం. డిగ్రీ, డిప్లొమా చేసి ఖాళీగా ఉన్న పాతికేళ్లలోపు యువతకు అప్రెంటిస్‌షిప్ కింద శిక్షణ ఇప్పించి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేలా చూస్తాం. అప్రెంటిస్ కాలంలో వారికి సంవత్సరానికి రూ.1 లక్ష స్టైపండ్ అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షా పేపర్ల లీకేజీ ఉదంతాలు పునరావృతంకాకుండా కఠిన చట్టం తీసుకొస్తాం. తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తాం. యువత ఏర్పాటుచేసే అంకుర సంస్థల తోడ్పాటు కోసం రూ.5,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటుచేస్తాం’’ అని రాహుల్ అన్నారు. యువతకు ఇచ్చిన ఈ ఐదు హామీలకు రాహుల్ ‘యువ న్యాయ్’గా అభివరి్ణంచారు. ‘‘ డ్రైవర్, గార్డ్, డెలివరీ బాయ్ ఉద్యోగాలు చేసే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కలి్పస్తూ రాజస్థాన్‌లో ఇప్పటికే చట్టం తెచ్చారు. ఇదే తరహా చట్టాన్ని దేశమంతటా అమలుచేస్తాం. ఔట్సోర్సింగ్ విధానానికి స్వస్తిపలికి ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్ష విధానంలో ప్రమాణాలను పటిష్టంచేస్తాం. లీకేజీలకు తావులేకుండా కఠిన చట్టం తెస్తాం’ అని అన్నారు. ‘‘ ఢిల్లీ చలో ఉద్యమబాటలో పయనిస్తున్న రైతాంగానికి మేలు చేకూర్చేలా పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. కులగణన చేపడతాం’’ అని రాహుల్ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల నుంచి న్యాయం కోరడం కూడా నేరమేనని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో మహిళల రేప్, ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ రాహుల్ విమర్శించారు. -
రాహుల్ గాంధీకి ఊహించని అనుభవం
సాక్షి, మధ్యప్రదేశ్: కాంగ్రెస్ అగ్రనేత,వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి ఊహించని అనుభవం ఎదురైంది. భారత్ జోడో న్యాయ బీజేపీ కార్యకర్తలు మోదీ.. మోదీ నినాదాలతో హోరెత్తించారు. బదులుగా రాహుల్ గాంధీ వారికి ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ ముందుకు సాగారు. మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌తో కలిసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం తన యాత్రను కొనసాగించే క్రమంలో తన వాహనంలో బయలు దేరిన రాహుల్ గాంధీని ఓ ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్తలు మోదీ-మోదీ అంటూ నినాదాలు చేస్తూ పలకరించారు. ఈ ఊహించని పరిణామంతో వెహికల్ దిగిన రాహుల్ గాంధీ నినాదాలు చేస్తున్న వారి వద్దకు వెళ్లారు. యోగ క్షేమాలు అడిగి మరీ కరచాలనం చేశారు. బదులుగా బీజేపీ కార్యకర్తలు బంగాళాదుంపలను అందించారు. అనంతరం రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ముందుకు సాగారు. MP Locals greeted Rahul Gandhi with Jai Shree Ram, Modi-Modi slogans and gave him potatoes for making Sona (🪙 Gold). pic.twitter.com/Ux0YJqRS7u — 💪🎭..Rai ji..💪🎭 (@Vinod_r108) March 5, 2024 ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ‘నఫ్రత్ కా బజార్’ (ద్వేషం అనే మార్కెట్)లో ‘మొహబ్బత్ కి దుకాణ్’ (ప్రేమ దుకాణం) తెరవడం ద్వారా ఇటువంటి సంఘటనలను ఎదుర్కోవడం సులభం అవుతుందని అన్నారు. -
‘జై శ్రీరాం’ అంటూనే ఆకలితో చావాలనుకుంటున్నారు: మోదీపై రాహుల్ ఫైర్
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ వైపు దేశంలో నిరుద్యోగం, ఉపాధి లేక ఆకలి చావులు పెరిగిపోతున్నాయని.. మరోవైపు ప్రధాని మోదీ మాత్రం ‘జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయాలని చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలతో 'జై శ్రీరాం' అని చెప్పిపిస్తూ.. వారు ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆరోపించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని సారంగ్‌పూర్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర యాత్రలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.. యాత్రలో భాగంగా రాహుల్‌కు ‘ మోదీ, మోదీ, జై శ్రీరాం’ అనే నినాదాలతో బీజేపీ కార్యకర్తలు వ్యంగ్యంగా ఆహ్వానం పలికారు. బీజేపీ శ్రేణుల చర్యపై స్పందించిన రాహుల్.. మోదీపై విమర్శలు గుప్పించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, ఉద్యోగాలు లేక యువత సోషల్ మీడియాలో రోజంతా రీల్స్ చూస్తూ గడుపుతున్నారని అన్నారు. ‘మీరు రోజంతా ఫోన్లు చూస్తూ.. జై శ్రీరామ్ అని నినాదాలు చేసి, ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారు’ అని ఆరోపించారు. చదవండి: రాజకీయాల్లోకి అభిజిత్ గంగోపాధ్యాయ.. త్వరలో ఆ పార్టీలోకి కేంద్ర ప్రభుత్వ అగ్నివీర్ పథకంపై రాహుల్ మాట్లాడుతూ.. గతంలో సాయుధ దళాలు యువతకు రెండు హామీలు ఇచ్చాయని, యువతకు పెన్షన్ ఇవ్వడంతోపాటు వారు మరణిస్తే సరైన గౌరవం పొందుతారని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అగ్నివీర్ పథకం కింద నలుగురిని తీసుకొని ముగ్గురిని వదిలేస్తారని.. ఆ ముగ్గురిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే ఉంటారని విమర్శించారు. పాకిస్తాన్‌తో పోలిస్తే భారతదేశంలో నిరుద్యోగం రెట్టింపుగా ఉందని రాహుల్ అన్నారు. ఆదివారం గ్వాలియర్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్య జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. భారత్‌లో నిరుద్యోగం 23 శాతంగా ఉంటే పాక్‌లో 12 శాతం ఉందన్నారు. బంగ్లాదేశ్, భూటాన్‌ల కంటే దేశంలో నిరుద్యోగ యువత సంఖ్య ఎక్కువగా ఉందని, భారతదేశ నిరుద్యోగిత రేటు గత 40 ఏళ్లలో ఇదే అత్యధికమని ఆయన పేర్కొన్నారు. Rahul Gandhi Ji and soldier in Madhya Pradesh Jitu Patwari resumed the Bharat Jodo Nyay Yatra from Sarangpur. pic.twitter.com/EkgGr89Dyx — Shantanu (@shaandelhite) March 5, 2024 -
భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేశ్
ఆగ్రా: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారథ్యంలో యూపీలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో సీట్ల పంపిణీపై రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆగ్రాలో రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ వారు ముందుకు సాగారు. భారీగా హాజరైన ఇరుపార్టీల కార్యకర్తలు వారికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ..రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం రైతుల శక్తిని చూసి భయపడే పరిస్థితికి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం గద్దెదిగి, ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తమ ప్రభుత్వం రైతులకు తగు గౌరవం ఇస్తుందని చెప్పారు. వెనుకబడిన కులాలు, దళితులు, మైనారిటీలకు బీజేపీ తగు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రి యాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొ న్నారు. అంతకుముందు నేతలు ఆగ్రాలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జోడో యాత్రలో అఖిలేశ్ పాల్గొనడంపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. -
అమాయకుల ఇళ్లపైకే బుల్డోజర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇళ్లను కూలి్చవేస్తున్నారని, ప్రభుత్వ నిర్వాకం వల్ల నేరగాళ్లు మాత్రం నిక్షేపంగా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆమె శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో తన సోదరుడు రాహుల్ గాంధీతోపాటు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రైతుల మొర ఆలకించే తీరిక పాలకులకు లేదా? అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులపైకి జీపులు నడిపించి చంపిన నాయకుల ఇళ్లపైకి, మహిళలను వేధించిన దుర్మార్గుల ఇళ్లపైకి, ప్రశ్నాపత్రాలను లీక్ చేసినవారి ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లడం లేదని ధ్వజత్తారు. అమాయకుల ఇళ్లు మాత్రమే బల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులు, రైతులకు అన్యాయం జరుగుతుండడం వల్లే యాత్రలో ‘న్యాయ్’ పదాన్ని చేర్చామన్నారు. ఆదివారం ఆగ్రాలో యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఆ పిల్లలు రీల్స్ చూడరు: రాహుల్ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఇక యువత రోజుకు 12 గంటలు మొబైల్ ఫోన్లు చూడక ఏం చేస్తారని రాహుల్ ప్రశ్నించారు. ఆయన శనివారం యూపీలోని సంభాల్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారని యువతను ప్రశ్నించగా 12 గంటలని బదులిచ్చారు. దాంతో రాహుల్ ఈ మేరకు స్పందించారు. సంపన్నులు, బడా వ్యాపారవేత్తల పిల్లలు ఫోన్లలో రీల్స్ చూడరని, రోజంతా డబ్బులు లెక్కపెట్టుకొనే పనిలోనే ఉంటారని అన్నారు. శనివారం యూపీలోని మొరాదాబాద్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్, ప్రియాంక -
భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్, ప్రియాంక!
కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ ఓపెన్ జీపులో యాత్రలో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు జనం తరలివచ్చారు. రాహుల్, ప్రియాంకలను స్వాగతిస్తూ జనం వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొన్నారు. అమ్రోహా, సంభాల్, బులంద్‌షహర్, అలీఘర్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ వరకు జరిగే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఆదివారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రా అనంతరం ఈ యాత్ర రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. మార్చి 26న ఈ యాత్రకు విరామం కల్పించనున్నారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 27, 28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు ధోల్పూర్ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ యాత్ర మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల మీదుగా సాగనుంది. -
Bharat Jodo Nyay Yatra: మోదీ రామరాజ్యంలో దళితులు, బీసీలకు దక్కని ఉద్యోగాలు
కాన్పూర్/ఉన్నావ్(యూపీ): జనాభాలో దాదాపు 90 శాతమున్న బీసీలు, దళితులు, మైనారీ్టలకు మోదీ ‘రామరాజ్యం’లో సరైన ఉద్యోగాలు దక్కలేదని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. భారత్‌జోడో న్యాయ్‌యాత్రలో భాగంగా బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కార్యకర్తలు, మద్దతుదారులనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ జనాభాలో 50 శాతం బీసీలు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనారిటీలు ఉన్నారు. మొత్తంగా దాదాపు 90 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరికి సరైన ఉద్యోగాలు దక్కనపుడు ఇదేమీ మోదీ రామరాజ్యం?’ అని ప్రశ్నించారు. ‘‘ కులం పేరిట దళితులు, బీసీలు వివక్షకు గురికావడంతో మీడియాలో, పెద్ద పరిశ్రమల్లో, ఉన్నతోద్యోగాల్లో వారికి సరైన ప్రాధాన్యత లేదు. అణగారిన వర్గాలు ఆకలికి అలమటించి మరణిస్తున్నారు. అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చూశారుగా. ఆరోజు విచ్చేసిన అతిథుల్లో వెనకబడివారు, దళితులు, గిరిజనులు ఎంతమంది?. గిరిజనురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దళితుడైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లకు ఆరోజు లోనికి అనుమతి లేదు. అందుకే వెనకబడిన వర్గాల సంక్షేమం, వారి ఆర్థిక స్థితిగతులు తెల్సుకునేందుకే కులగణన చేపట్టదలిచాం. ఇది దేశాభివృద్దిలో విప్లవాత్మకమైన ముందడుగు’’ అని రాహుల్ అన్నారు. ‘‘ అదానీ, అంబానీ, టాటా, బిర్లా.. ఇలా దేశంలో ఒక రెండు, మూడు శాతం మంది వ్యక్తుల వద్దే దేశ సంపదలో సింహభాగం పోగుబడింది. వీళ్లే నూతన భారతావనికి మహారాజులు’’ అని ఆరోపించారు. 2016లో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు, అగ్నివీర్ పథకంలపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘‘ కొన్నిసార్లు మీ ప్రశ్నాపత్రం లీక్ అవుతుంది. ఇంకొందరు ఉద్యోగాలు కోల్పోతారు. హఠాత్తుగా జీఎస్టీ అని కొత్త పన్నుల విధానం ఒకటి వస్తుంది. పెద్ద నోట్లను రద్దుచేసి ఆర్థికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తారు. తీరా సైన్యంలో అయినా చేరదామంటే అగి్నవీర్ యోజన పేరిట శాశ్వత నియామకాలకు చిల్లుచీటీ పాడుతారు’’ అని రాహుల్ విమర్శించారు. ఫిబ్రవరి 26– మార్చి 1 దాకా యాత్రకు బ్రేక్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 దాకా న్యాయ్‌యాత్రకు బ్రేక్‌పడనుంది. బ్రిటన్‌లో తాను చదువుకున్న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగం, ఢిల్లీలో పార్టీ కీలక సమావేశాల నేపథ్యంలో న్యాయ్‌యాత్రకు విరామం ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ చెప్పారు. నేడు, రేపు సైతం యాత్ర కొనసాగదు. ఫిబ్రవరి 24వ తేదీన మొరాదాబాద్‌లో యాత్ర మొదలవుతుంది. ఫిబ్రవరి 27, 28న కేంబ్రిడ్జ్‌లో రాహుల్ ప్రసంగిస్తారు. మార్చి రెండో తేదీన ధోల్పూర్లో యాత్ర పునఃప్రారంభమవుతుంది. మార్చి ఐదున ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయాన్ని దర్శిస్తారు. -
భారత్ జోడో న్యాయ యాత్రకు అఖిలేష్ దూరం?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారధ్యంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్‌జోడో న్యాయ యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్ఫీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొనడం లేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికల సీట్ల కేటాయింపు విషయంలో ఒప్పందం కుదరకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో అఖిలేష్ పాల్గొంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానాన్నిఅఖిలేష్ అంగీకరించి, అమేథీ లేదా రాయ్ బరేలీలో జరిగే న్యాయ యాత్రలో పాల్గొంటానని స్వయంగా ప్రకటించారు. రాహుల్ యాత్ర సోమవారం అమేథీలో, మంగళవారం రాయ్‌బరేలీలో ఉండనుంది. సోమవారం అఖిలేష్ అమేథీకి వెళ్లడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్‌బరేలీలో జరిగే న్యాయ యాత్రలో ఆయన పాల్గొనవచ్చని, అయితే దీనిపై స్పష్టత లేనందున ఎలాంటి సన్నాహాలు చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కులగణన.. దేశానికి ఎక్స్‌రే: రాహుల్
ప్రయాగరాజ్/వయనాడ్: దేశ జనాభాలో ఓబీసీలు, దళితులు, గిరిజనులు కలిపి 73% వరకు ఉన్నప్పటికీ వారు యజమానులుగా ఉన్న కంపెనీల్లో టాప్–200లో ఒక్కటి కూడా లేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. దేశానికి ఎక్స్ రే వంటి కులగణనతో ప్రతి ఒక్కటీ తేటతెల్లమవుతుందని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో స్వరాజ్‌భవన్ వద్ద జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ఎవరి జనాభా ఎంతో తెలియడానికి కులగణన ఆయుధం వంటిది. దేశ సంపదలో మీ వాటా ఎంతో తెలుసుకోవచ్చు. దేశంలోని 73 శాతం జనాభా చేతుల్లో ఎంత సంపద ఉందో తెలుస్తుంది. ఈ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కటీ వెల్లడవుతుంది’అని రాహుల్ పేర్కొన్నారు. బడా పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేసిన ప్రభుత్వం, రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయదని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలకుకోట్లాది రూపాయల రుణాలను క్షణాల్లోనే మంజూరు చేసే బ్యాంకులు, దళితులు, వెనుకబడిన కులాల వారిని మాత్రం దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కారు అంటే అర్థం నిరుద్యోగులకు డబుల్ దెబ్బ అని యూపీలోని బీజేపీ సర్కారునుద్దేశించి రాహుల్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. వయనాడ్‌లో పర్యటన.. రాహుల్ ఆదివారం ఉదయం కేరళలోని సొంత నియోజకవర్గం వయనాడ్‌లో పర్యటించారు. ఇటీవల ఏనుగుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటానని చెప్పారు. వారికి పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను కోరారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ -
కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరుకుంది. యూపీలో ఆయన పర్యటనకు శనివారం రెండో రోజు. రాహుల్ ఈ ప్రయాణం ప్రారంభించి 35 రోజులైంది. యూపీ చేరుకున్న రాహుల్ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారణాసిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ఈ ప్రయాణంలో ఎన్నడూ ద్వేషాన్ని చూడలేదని, యాత్రలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన వారు కూడా వెంట వచ్చారన్నారు. వారు తనతో చక్కగా మాట్లాడారన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే దేశం పట్ల ప్రకటించే నిజమైన భక్తి అని అన్నారు. ప్రస్తుతం దేశంలో ద్వేషం, భయాందోళనకర వాతావరణం నెలకొని ఉందన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి వారణాసితో విడదీయరాని అనుబంధం ఉంది. పండిట్ నెహ్రూ 1910 నుండి 1950 వరకు అనేకసార్లు కాశీని సందర్శించారు. ప్రధాని అయ్యాక కూడా వారణాసికి వచ్చారు. ఇందిరా గాంధీ కూడా వారణాసిలో రాజకీయ, మతపరమైన పర్యటనలు చేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన తండ్రి పండిట్ మోతీలాల్ నెహ్రూతో కలిసి 1910లో మొదటిసారి కాశీకి వచ్చారు. ఆ తర్వాత 1921లో కాశీ విద్యాపీఠం స్థాపనకు హాజరయ్యారు. ఆ తర్వాత నెహ్రూ 1942, 1946లోనూ కాశీని సందర్శించారు. స్వాతంత్య్రానంతరం 1950, 1952లో పండిట్ నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో కాశీకి వచ్చారు. 1980 మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ జరిపిన వారణాసి పర్యటన చరిత్రాత్మకంగా నిలిచిందని చెబుతుంటారు. ఆరోజున ఇందిర సభ 1979, డిసెబర్ 31న రాత్రి 8 గంటలకు జరిగాల్సి ఉండగా, ఆమె జనవరి 1980, జనవరి ఒకటిన ఉదయం 10 గంటలకు 14 గంటలు ఆలస్యంగా వచ్చారు. చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ జనం ఆమెను చూసేందుకు, ఆమె మాటల వినేందుకు ఎంతో ఆసక్తి చూపారు. #WATCH | Varanasi, UP: During the Bharat Jodo Nyay Yatra, Congress MP Rahul Gandhi says, "During the entire 'yatra' I never saw hatred. Even BJP and RSS people came in the yatra, and as soon as they came to us, they would speak to us nicely... This country strengthens only when… pic.twitter.com/GYCKQHQUZ7 — ANI (@ANI) February 17, 2024 -
Rahul Gandhi: అదానీ లబ్ధి కోసమే అగ్నివీర్: రాహుల్
న్యూఢిల్లీ/మొహానియా: పారిశ్రామికవేత్త అదానీకి ప్రయోజనం కలిగించేందుకే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అగ్నివీర్ పథకం తెచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ సరిహద్దులను కాపాడే జవాన్లకు వేతనాలివ్వడం మోదీకి ఇష్టం లేదన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం బిహార్‌లోని కైమూర్ జిల్లా మొహానియాలో ర్యాలీలో మాట్లాడారు. ‘‘సాధారణ సైనికుడి మాదిరిగా అగ్నివీర్‌కు వేతనం, పింఛను ఉండవు. క్యాంటిన్ సౌకర్యముండదు. విధి నిర్వహణలో మరణిస్తే అమరవీరుడి గుర్తింపూ ఇవ్వరు. రక్షణ బడ్జెట్ నుంచి సైనికులకు వేతనాలు, వసతులు కల్పించడం మోదీ సర్కారుకు ఇష్టం లేదు. బడ్జెట్‌ను అదానీకి లబ్ధి కలిగిలా ఖర్చు చేయాలనుకుంటోంది’’ అని ఆరోపించారు. బిహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు కూడా యాత్రలో పాల్గొన్నారు. ప్రియాంకా గాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో శుక్రవారం యాత్రలో పాల్గొనలేకపోయినట్టు పార్టీ ప్రకటించింది. -
ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర త్వరలో యూపీలో ప్రవేశించనుంది. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత మళ్లీ యాత్రలో పాల్గొంటానని ఎక్స్ వేదికగా ప్రియాంక వెల్లడించారు. ‘‘యూపీలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. కానీ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. కాస్త ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ యాత్రలో పాల్గొంటాను. ఈలోగా యూపీలోకి యాత్ర కోసం అడుగు పెడుతున్న అందరికి నా అభినందనలు. రాహుల్ గాంధీకి కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను’’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. I was really looking forward to receiving the BJNY in UP today but unfortunately, have ended up admitted to hospital. I will be there as soon as I am better! Meanwhile wishing all the yatris, my colleagues in UP who have worked hard towards making arrangements for the yatra and… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 16, 2024 ఇదీ చదవండి: కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ -
Rahul Gandhi: ప్రేమ మన డీఎన్ఏలోనే ఉంది
రాయ్‌గఢ్: మన దేశ డీఎన్ఏలోనే ప్రేమ ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రం దేశంలో విద్వేషం వ్యాప్తి చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆయన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో మొదలైంది. రాయ్‌గఢ్ ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘‘భారత్‌లో భిన్న మతాలు, భిన్న సంప్రదాయాల ప్రజలు పరస్పరం ప్రేమతో శాంతియుతంగా జీవిస్తున్నారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాల వల్ల ప్రతి ప్రాంతంలో విద్వేషం, హింస పెరిగిపో తున్నాయి. భాష ఆధారంగా కొందరు, రాష్ట్రాన్ని బట్టి ఇంకొందరు ఇతరులను ద్వేషిస్తామంటున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. విద్వేషం, హింసకు తావులేని హిందుస్తాన్‌ను భవిష్యత్ తరానికి అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. -
Rahul Gandhi: ప్రధాని మోదీ జన్మతః ఓబీసీ కాదు
ఝార్సుగూడ(ఒడిశా): ప్రధాని మోదీ జన్మతః ఇతర వెనుకబడిన వర్గం(ఓబీసీ)వ్యక్తి కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటూ ప్రజలను మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ఘాంచి కులంలో పుట్టారని, 2000 సంవత్సరంలో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చిందని వివరించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా గురువారం రాహుల్ గాంధీ ఒడిశాలోని ఝార్సుగూడలో జరిగిన సభలో మాట్లాడారు. గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యాక మోదీయే ఈ కులాన్ని ఓబీసీలో చేర్చారు. ఈ దృష్ట్యా, మోదీ పుట్టుకతోనే ఓబీసీకి చెందిన వ్యక్తి కారని పేర్కొన్నారు. అంతకుముందు, మోదీది తెలి కులమని పేర్కొన్న రాహుల్ ఆ తర్వాత తన ఉద్దేశం ఘాంచి కులమంటూ వివరణ ఇచ్చారు. దేశంలో సామాజిక న్యాయం సాధించకుండా ప్రధాని మోదీ కులగణనను ఎప్పటికీ చేపట్టలేరని రాహుల్ చెప్పారు. ఓబీసీలతో కరచాలనం చేయని మోదీ బిలియనీర్లను మాత్రం ఆలింగనం చేసుకుంటారని విమర్శించారు. ‘ఒడిశాలోని గిరిజనుల భూములను లాగేసుకునేందుకు కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలోని అధికార బీజేడీ, బీజేపీల మధ్య పీ, డీ తేడా మాత్రమే ఉంది. మిగతాదంతా సేమ్ టూ సేమ్. ఒకే నాణేనికి ఈ పారీ్టలు రెండు పార్శా్వలు’అని రాహుల్ పేర్కొన్నారు. ఒడిశాలో సుమారు 200 కిలోమీటర్ల మేర సాగిన జోడో యాత్ర గురువారం ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది. -
నేడు ఒడిశాకు రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర
మణిపూర్ నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ యాత్ర 24వ రోజు అంటే నేడు (మంగళవారం)ఒడిశాలోకి ప్రవేశించనుంది. జనవరి 14న ఈశాన్య భారతం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాలలోని ప్రజలను కలుస్తున్నారు. జార్ఖండ్ యాత్ర పూర్తయ్యాక కాంగ్రెస్ ఇప్పుడు ఒడిశా వైపు వెళ్లనుంది. మంగళవారం సుందర్‌గఢ్ జిల్లా నుంచి రాహుల్ ఒడిశాలో అడుగుపెట్టనున్నారు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ఒడిశా కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేశారు. సుందర్‌గఢ్ జిల్లాలోని పారిశ్రామిక పట్టణం బిరామిత్రపూర్‌లో ఒడిశా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలుకనున్నారు. రాహుల్ గాంధీ మంగళవారం మధ్యాహ్నం బిర్మిత్రాపూర్ చేరుకుంటారని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర బిజా బహల్ ప్రాంతంలో విరామం తీసుకోనుంది. బుధవారం రూర్కెలాలోని ఉదిత్‌నగర్ నుండి పాన్‌పోష్ వరకు 3.4 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. రాహుల్ పాన్‌పోష్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మరుసటి రోజు రాణిబంద్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. రాజ్గంగ్పూర్లో జరిగే ర్యాలీలో కూడా రాహుల్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 8న రాహుల్ గాంధీ జర్సుగూడ పాత బస్టాండ్ నుంచి యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం ర్యాలీలో ప్రసంగిస్తారు. జార్సుగూడలోని కనక్‌తోరా నుంచి యాత్ర మొదలై అనంతరం ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశిస్తుంది. -
గిరిజనుల తరఫున పోరాటం: రాహుల్
ధన్‌బాద్: గిరిజన ప్రజలకు నీరు, అడవి, భూమి(జల్–జంగిల్–జమీన్)పై హక్కుల ను, గిరిజన యువతకు ఉపాధిని కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం ఆయన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జరిగిన రోడ్ షోలో ప్రసంగించారు. రాష్ట్రంలో జోడో యాత్ర మూడో రోజుకు చేరుకుంది. జిల్లాలోని తుండిలో శనివారం రాత్రి బస చేసిన రాహుల్ ఆదివారం గోవింద్పూర్ నుంచి తిరిగి యాత్రను మొదలుపెట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం కాకుండా కాపాడటం, యువతకు గిరిజనులకు న్యాయం దక్కేలా చేయడమే యాత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆర్థిక అసమానతలు, నోట్లరద్దు, జీఎస్టీ, నిరుద్యోగం వంటి సమస్యలు దేశంలోని యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం యాత్ర తిరిగి కొనసాగి బొకారో జిల్లాలోకి ప్రవేశించింది. బొకారో వైపు సాగుతూ గోధార్ కాళి బస్తీ వద్ద ఆయన బొగ్గు గని కార్మికులు, వారి పిల్లలతో ముచ్చటించారు. మధ్యాహ్నానికి యాత్ర బొకారో చేరుకుంది. భోజనానంతరం జెనామోర్ నుంచి మొదలైన యాత్ర రామ్‌గఢ్ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని గోలా వద్ద జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. -
జార్ఖండ్ ప్రభుత్వంపై... బీజేపీ కుట్ర: రాహుల్
డియోహర్(జార్ఖండ్): జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శనివారం జార్ఖండ్‌లోని గొడ్డాలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం దేవగఢ్‌లో ప్రఖ్యాత బైద్యనాథ్ ఆలయంలో రుద్రాభిషేకం చేశారు. స్థానిక ర్యాలీలో మాట్లాడారు. ‘‘యువత ఉద్యోగాలు కోరుతుంటే ప్రధాని మోదీ మాత్రం దేశంలో నిరుద్యోగమనే వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారు. ఈ వ్యాధి సోకిన యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది’’ అని రాహుల్ అన్నారు. దేశంలో గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల ప్రజల సంఖ్యను కచ్చితంగా తేల్చేందుకు కులగణన అవసరం ఎంతో ఉందని ఆయన చెప్పారు. దేశంలో అన్యాయాలకు గురవుతున్న వారిలో ఈ వర్గాల ప్రజల సంఖ్య పెరుగుతూ పోతోందని తెలిపారు. -
జార్ఖండ్ సర్కార్‌ను కూల్చే కుట్ర: రాహుల్
పాకూర్(జార్ఖండ్): హేమంత్ సోరెన్‌ను అక్రమంగా జైలుకు పంపి జార్ఖండ్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ కుట్ర పన్నిందని, ప్రజాతీర్పుకు భంగం కల్గకుండా తాము అడ్డుకున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం జార్ఖండ్‌లోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టిన సందర్భంగా పాకూర్ జిల్లాలో కార్యకర్తలనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాతీర్పును బీజేపీ పరిహసించాలని చూసింది. మేం దానిని అడ్డుకున్నాం. ధనం, దర్యాప్తు సంస్థల అండతో బీజేపీ చెలరేగుతోంది’’అని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు తాను కట్టుబడిఉంటానన్నారు. ‘‘ అస్సాంలో యాత్రకు అడ్డుపడిన సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్రలో పార్టీ మారిన మిలింద్ దేవ్రా వంటి నేతలతో పార్టీకి పనిలేదు’’ అని రాహుల్ అన్నారు. నకిలీ రాహుల్ ఆచూకీ దొరికింది: హిమంత మరోవైపు, అస్సాంలో న్యాయ్‌యాత్ర వేళ బస్సులో రాహుల్ స్థానంలో కూర్చుని అభివాదం చేస్తున్న నకిలీ రాహుల్ ఆచూకీ తామ గుర్తించామని హిమంత చెప్పారు. ‘‘ అస్సాంలో మోదీ పర్యటన ముగిశాక పత్రికా సమావేశం ఏర్పాటుచేసి మరో రాహుల్ వివరాలు బహిర్గతం చేస్తా. జనానికి చేతులు ఊపుతూ, యాత్ర బస్సులో ఉన్నది రాహుల్ కాదు’’ అని హిమంత అన్నారు. -
రాహుల్ యాత్ర రాంగ్: పీకే కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా వాడీవేడిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ వల్ల ఉపయోగం లేదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ రాహుల్ యాత్రపై స్పందించారు. రాహుల్ గాంధీ యాత్ర తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయమని ఏ ఎన్నికల వ్యూహకర్త చెప్పారోనని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉండాల్సిన రాహుల్.. ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయటం ఒక చెత్త నిర్ణయమని, అసలు ఈ సమయంలో యాత్ర చేపట్టడం సరికాదన్నారు పీకే. పార్లమెంట్ ఎన్నికలకు సుమారు ఆరు నెలల ముందు ఇటువంటి యాత్ర నిర్వహించాల్సి ఉండేదన్నారు. యాత్ర కాకుండా.. బహిరంగ సభలు, అభ్యర్థుల ఎంపిక ఖరారు, భాగస్వామ్య పక్షాలు కలుపుకుపోవటం, ఎన్నికల కోసం వనరుల సేకరణ, రోజువారి సమస్యలకు పరిష్కారాలపై కసరత్తు చేయాల్సిందన్నారు. కానీ యాత్ర చేయటంలో లాజిక్ ఏం లేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. కానీ, యాత్ర చేయమని సలహా ఇచ్చింది ఎవరని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో నితీష్ కుమార్ వంటి కీలక నేతలు చేజారుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం ఈశాన్య భారతంలో యాత్రలో ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించటం కొంతమేరకు మంచిదే అయినప్పటికీ ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని వదలటం తెలివైన పని కాదని అన్నారు. రాహుల్ ఇటువంటి చెత్త సలహాలు ఎవరు ఇస్తున్నారో తనకు తెలియటం లేదని అన్నారు. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’.. మార్చి 20న ముంబైలో ముగియనుంది. ప్రస్తుతం యాత్ర పశ్చిమ బెంగాల్లో కొనసాగుతోంది. చదవండి: అలాంటి వాళ్లు కాంగ్రెస్ వీడాలనుకున్నా: రాహుల్ గాంధీ -
అలాంటి వాళ్లు కాంగ్రెస్ వీడాలనుకున్నా: రాహుల్ గాంధీ
కోల్‌కతా: కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేవారు తమ పార్టీలో నుంచి వెళ్లిపోయినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా పశ్చిమ బెంగాల్లో ‘డిజిటల్ మీడియా వారియర్స్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పతనం, ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. హిమంత, మిలింద్ దేవరా వంటి వ్యక్తులు కాంగ్రెస్‌కు విడిచిపెట్టాలకున్నానని తెలిపారు. వారు పార్టీ నుంచి వెళ్లిపోవటం వల్ల ఇబ్బంది ఏం లేదన్నారు. వారి పార్టీ మార్పు సరైందేనని తెలిపారు. హిమంత విచిత్రమైన రాజకీయనాయుడని.. అతని వంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు సరిపోడని అన్నారు. అతను ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనమని తెలిపారు. తాను రక్షించాలనుకుంటున్న విలువలకు అతని వ్యాఖ్యలు చాలా వ్యతిరేకమని చెప్పారు. ఇటీవల అస్సాం సీఎం హిమంత, రాహుల్ గాంధీ.. తీవ్రమైన విమర్శ, ప్రతివిమర్శలకు దిగిన విషయం తెలిసిందే. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ద్వారా అస్సాంలో అలజడి సృష్టించాలని చూశారని విమర్శించారు. దీంతో అత్యంత అవినీతిపరుడైన సీఎం.. హిమంత అని రాహుల్ గాంధీ మండిపడ్డ విషయం తెలిసిందే. ఇటీవల మహారాష్ట్రలో కీలక నేత అయిన మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేవలో చేరిన విషయం తెలిసిందే. ముంబై సౌత్ నియోజకవర్గానికి సంబంధించి.. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురై పార్టీ మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విలువలు లేని అటువంటి నేతలు వెళ్లిపోవటం అనేది ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా ఎటువంటి ప్రభావం పడదని రాహుల్ గాంధీ తెలిపారు. చదవండి: karnataka: కాంగ్రెస్‌పై సొంత పార్టీ నేత తీవ్ర విమర్శలు -
రాహుల్ గాంధీ కారు అద్దాలు ధ్వంసం
పాట్నా: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లో రెండోరోజు కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల అత్యుత్సాహంతో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బుధవారం కథిహార్‌లో ఈ ఘటన జరిగింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇటీవలి అక్కడి రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా ఆయనకు బ్రహ్మరథం పట్టారు అక్కడి ప్రజలు. ఇక ఇవాళ ఉదయం డీఎస్ కాలేజీ వద్ద ఆయన ర్యాలీ నిర్వహించగా.. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆయన కారు మీదకు ఎక్కి నినాదాలు చేసే యత్నం చేశారు. ఈ క్రమంలో కారు విండ్‌షీల్డ్ పగిలిపోయింది. దీంతో రాహుల్ భద్రతా సిబ్బంది వారిని వారించి కిందకు దించగా.. పగిలిన కారు అద్ధాలతోనే ఆయన ర్యాలీని ముందుకు సాగించారు. ఇదిలా ఉంటే.. మహాఘట్ బంధన్ కూటమి నుంచి నిష్క్రమించి తిరిగి బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. దీంతో రాహుల్ యాత్ర బీహార్‌లో ఎలా సాగుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే నిన్న రాహుల్ యాత్రకు అపూర్వ స్వాగతం దక్కిందని సీనియర్ నేత జైరామ్ రమేష్ సైతం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. -
మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ భారత జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం బిహార్‌లో సాగుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి బిహార్ సీఎం నితీష్ కుమార్ వైదోలిగన మరుసటి రోజే(సోమవారం) కిషన్‌గంజ్ నుంచి రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. మంగళవారం పూర్నియాలో రాహుల్ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగింస్తూ.. తొలిసారి నితీష్ కుమార్ ఎన్డీయే గూటికి చేరడంపై స్పందించారు. బిహార్‌లో సామాజిక న్యాయం అందించే బాధ్యత ఇండియా కూటమి తీసుకుందని.. ఇకపై బిహార్‌కు నితీష్ అవసరం లేదని అన్నారు. బీజేపీ ఉచ్చులో నితీష్ చిక్కకున్నారని మండిపడ్డారు. మహాఘట్ బంధన్ ఆధ్వర్యంలో ప్రజలకు మంచి చేస్తామని చెప్పారు. మోదీ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు రాహుల్. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారని పేర్కొన్నారు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయం నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ దేశంలో విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి కులగణన ఎంతో అవసరమన్న ఆయన భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: Satnam Singh Sandhu: రాజ్యసభకు సత్నామ్ సింగ్ సంధూ.. ఎవరీయన? ఇదిలా ఉండగా క్యాష్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తుకు హాజరైన నేపథ్యంలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్ సహా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అగ్రనేతలు నేడు పూర్నియాలో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ర్యాలీకి దూరంగా ఉన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మంగళవారం బీహార్‌లోని పూర్నియాలో రైతు సంఘం సభ్యులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓ ధాబాలో టీ తాగుతూ కొంతమంది బీహార్ నివాసితులతో మాట్లాడారు. ఆయన వెంట కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ కూడా ఉన్నారు. आज एक ढाबे पर कुछ बिहार निवासियों से चाय के दौरान कई बातें हुईं।#BharatJodoNyayYatra pic.twitter.com/Nsug8YrW2Q — Bharat Jodo Nyay Yatra (@bharatjodo) January 30, 2024 आज पूर्णिया में भारत जोड़ो न्याय यात्रा के दौरान @RahulGandhi ने स्थानीय किसानों के साथ काफ़ी देर तक बातचीत की। किसानों ने उन्हें अपने साथ हो रहे अन्याय से अवगत कराया। उन लोगों ने बताया कि वे बढ़ती इनपुट लागत, भूमि अधिग्रहण की ग़लत नीति और फसलों के लिए पर्याप्त MSP न मिलने से… pic.twitter.com/ptlK7ruBZZ — Jairam Ramesh (@Jairam_Ramesh) January 30, 2024 -
అన్యాయాలపై పోరులో ముందుండాలి
సిలిగురి: దేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి పశ్చిమబెంగాల్, బెంగాలీలు నాయకత్వం వహించాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం సిలిగురిలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. యాత్రకు లభిస్తున్న ఆదరణకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘స్వాతంత్య్ర పోరాట సమయంలో సైద్ధాంతిక పోరాటానికి నాయకత్వం వహించిన బెంగాల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అన్యాయాన్ని ఎదుర్కోవడం, ఐక్యతను పెంపొందించడం, విద్వేష వ్యాప్తిని అరికట్టడం బెంగాల్, బెంగాలీల కర్తవ్యం. ‘మీరు సందర్భానికి తగినట్లుగా స్పందించకుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు, ఇది ఏ ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు. బెంగాల్ ఈ పోరాటానికి నాయకత్వం వహించాలి’అని రాహుల్ ఉద్ఘాటించారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను, హింసను పెంచుతోంది. నిరుపేదలు, యువతకు బదులుగా కొందరు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తోంది’అని మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన టీఎంసీ లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం, ఆ పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీని సముదాయించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రయత్నాలు జరుగుతున్న వేళ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఎంసీ స్పందించింది. నిజమే, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముందుండి పోరాడిన చరిత్ర బెంగాలీలకు ఉంది. సీఎం మమతా బెనర్జీ సైతం ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ నాయకత్వం మాత్రం రాష్ట్రంలో కాషాయదళంతో అంటకాగుతోంది’అని టీఎంసీ నేత శంతను సేన్ ఆరోపించారు. న్యాయ్ యాత్ర సోమవారం ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లా నుంచి బిహార్‌లోకి ప్రవేశించనుంది. -
ఐక్యంగానే పోరాడతాం: రాహుల్
కూచ్ బెహార్(పశ్చిమ బెంగాల్): దేశవ్యాప్తంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి ఐక్యమత్యంగానే దేశవ్యాప్తంగా అన్యాయంపై పోరాటం కొనసాగిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. పశ్చిమబెంగాల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించిన వేళ రాహుల్ కూటమి ఐక్యతపై మరోసారి స్పష్టతనివ్వడం గమనార్హం. అస్సాంలో గువాహటి నగరంలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకోవడం, కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల ఘర్షణల నడుమ అస్సాంలో ఉద్రిక్తంగా కొనసాగిన యాత్ర గురువారం పశ్చిమబెంగాల్‌లోకి అడుగుపెట్టింది. బక్షీర్హాట్ గుండా రాష్ట్రంలోని కూచ్ బెహార్ జిల్లాలో రాహుల్ యాత్రను మొదలుపెట్టి అక్కడ మద్దతు దారులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘దేశంలో అన్యాయం రాజ్యమేలు తున్నందుకే యాత్రకు న్యాయ్ అనే పదం జతచేశాం’’ అని అన్నారు. మరోవైపు బెంగాల్లో యాత్రలో సీపీఎం, వామపక్ష పార్టీలు పాలుపంచుకునే అవకాశం ఉంది. బస్సులో ఉన్నది రాహుల్ కాదేమో: అస్సాం సీఎం హిమంత అస్సాంలో న్యాయ్ యాత్ర సందర్భంగా బస్సు లోపలి వైపు రాహుల్ సేదతీరుతూ ముందువైపు డూప్‌ను కూర్చోబెట్టి యాత్ర చుట్టేస్తు న్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ‘‘అస్సాంలో న్యాయ్ యాత్ర ప్రభావం శూన్యం. యాత్ర కొనసాగిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీనే విజయం సాధిస్తుంది. రాహుల్ ప్రచారం చేసిన చోటల్లా బీజేపీనే గెలుస్తుంది. ఆ కోణంలో చూస్తే బీజేపీకి రాహుల్ అవసరం ఎంతైనా ఉంది’’ అని వ్యంగ్యంగా మాట్లాడారు. కొన్ని చోట్ల రాహుల్ అస్సలు బస్సు దిగట్లేరని, బస్సులో ముందువైపు కనిపించేది రాహుల్ కాదని కొన్ని మీడియాకథనాలు వచ్చాయన్నారు. -
బెంగాల్లోకి అడుగుపెట్టిన రాహుల్ యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. అస్సాం నుంచి బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలోకి రాహుల్ అడుగుపెట్టారు. వయనాడ్ ఎంపీకి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో తాము ఒంటరిగా పోటి చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలు విఫలమయ్యాయని, దీంతో ఆ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని ఆమె స్పష్టం చేశారు. అంతేగాక రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి(పశ్చిమ బెంగాల్) వస్తున్న సమయంలో దీనిపై తమకు కనీస సమాచారం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో పోటీ సీట్ల పంపకంపై కాంగ్రెస్, టీఎంసీ మధ్య విభేదాలు నెలకొన్న వేళ రాహుల్ యాత్ర ఎలా సాగబోతుంది. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో యాత్ర ప్రారంభమైన సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి పోరాడుతుందని తెలిపారు. చదవండి: అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ దేశంలో అన్యాయం రాజ్యమేలుతోందని అందుకే తమ యాత్రకు ‘న్యాయ’ అనే పదాన్ని చేర్చినట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల మాటలు వినడానికి, వారికి అండగా ఉండేందుకు ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాలు పెంపొందిస్తుందని మండిపడ్డారు. హింస, అన్యాయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించారు. అందుకే ఇండియా కూటమి సమిష్టిగా అన్యాయంపై పోరాడబోతోందని తెలిపారు. జనవరి 14న ప్రారంభించిన రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర గురువారం 12వ రోజుకు చేరుకుంది. మణిపూర్, నాగాలాండ్, మేఘాలయా, అస్సాం రాష్ట్రంలో ఇప్పటి వరకు పర్యటించారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర తీవ్ర ఉద్రిక్తల నడుమ సాగుతోంది. మార్చి 20న ముంబైలో రాహుల్ యాత్రం ముగియనుంది. మొత్తం 15 రాష్ట్రాల గుండా 6,200 కి.మీ పర్యటించనున్నారు. -
యాత్ర రూట్ మార్చాం సార్! అడ్డంకులెక్కువ ఎక్కడున్నాయో అటు మార్చాం సార్!
-
అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ
భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అస్సాంలో రాహుల్‌పై నమోదైన క్రిమినల్ కేసును పోలీసులు సీఐడీకి బదిలీ చేశారు. జనవరి 23న గువాహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై రాహుల్ గాంధీపై అసోం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు కోసం సీఐడీకి బదిలీ చేసినట్లుగా ఆ రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ ట్విటర్ ద్వారా తెలిపారు. సమగ్రమైన, లోతైన విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా మంగళవారం మేఘాలయా నుంచి అస్సాం గువాహటిలోకి రాహుల్ ప్రవేశించగా.. సిటీలోకి ఆయన యాత్రకు అనుమతి లేదని అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లను దాటి దూసుకురావడంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో అస్సాంలో ఘర్షణలు సృష్టించినందుకు.. హింస, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడికి పురిగొల్పినందుకు వంటి ఆరోపణలతో రాహుల్, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై 9 కేసు నమోదు చేశారు. దీంతో రాహుల్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. గువాహటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత హెచ్చరించారు. దీనిపై రాహుల్ కౌంటర్ ఇస్తూ బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు రాహుల్ భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోనళ వ్యక్తం చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకేంద్రహోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేసును సీఐడీకి బదిలీ చేయడం ఆసక్తిగా మారింది. చదవండి: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -
పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్
బార్పేట(అస్సాం): అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. నాగాలాండ్ నుంచి అస్సాంలోని గువాహటిలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నపుడు జరిగిన ఘర్షణలకు రాహుల్ కారకుడంటూ హిమంత సర్కార్ కేసులు పెట్టడం తెల్సిందే. అస్సాంలో ఏడురోజుల యాత్ర బర్పెటా జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన తొలి బహిరంగ సభలో సీఎంపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ కేసులు పెట్టి నన్ను బయపెట్టొచ్చన్న ఐడియా హిమంతకు ఎందుకు వచి్చందో నాకైతే తెలీదు. మీరు(హిమంత, పోలీసులు) ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మరో పాతిక తప్పుడు కేసులు బనాయించండి. నేను అస్సలు భయపడను. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నన్ను భయపెట్టలేవు’’ అని అన్నారు. హిమంతను అతిపెద్ద అవినీతి సీఎంగా అభివరి్ణంచారు. ‘‘ మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆలోపు మీ భూమి కొట్టేస్తారు. మీరు వక్కపలుకులు నమిలినంత తేలిగ్గా ఆయన సుపారీ బిజినెస్ కానచ్చేస్తారు. మీ జేబులో డబ్బు నొక్కేస్తారు. ఏకంగా కజిరంగా నేషనల్ పార్క్ స్థలాలనే సీఎం ఆక్రమించారు. సీఎంతో జాగ్రత్త’ అని జనాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికలయ్యాక లోపలేస్తాం: సీఎం మంగళవారం నాటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత చెప్పారు. -
Assam Clash: సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ
గువాహటి: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర దూకుడుతో.. అస్సాం(అసోం) రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. తాజాగా రాహుల్ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. ఈ క్రమంలో మరోమారు సంచలన ఆరోపణలే చేశారాయన. అసోంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కీలక నేతలపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు హిమంత శర్మ అని బుధవారం ఉదయం రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యానించారు. అంతేకాదు అమిత్ షా గుప్పిట్లో శర్మ ఉండిపోయారని.. షానే ఆయన్ని వెనకుండి నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. ఇదీ చదవండి: రాహుల్‌కు ప్రమాదం పొంచి ఉంది.. షాకు ఖర్గే లేఖ బుధవారం ఉదయం బారాపేటలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ఆయన దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి. ఈ విషయాన్నే నేను అన్నట్లు ఆయనకు మీరు(మీడియాను ఉద్దేశించి..) తెలియజేయండి. అసోం ముఖ్యమంత్రి అమిత్ షా నియంత్రణలో ఉన్నారు. షాకు గనుక వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఆయన్ని పార్టీలో నుంచి గెంటేస్తారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా.. అనుకున్న మార్గంలోనే జోడో న్యాయ్ యాత్ర ముందుకు సాగుతుందని స్పస్టం చేశారాయన. -
తగ్గేదేలే.. రాహుల్ గాంధీపై కేసు నమోదు
గువాహటి: అస్సాం(అసోం)లో సాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర జాతీయ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. తాజాగా.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై అసోంలో పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వయంగా వెల్లడించారు. యాత్ర పేరుతో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారాయన. మంగళవారం తెల్లవారుజామున మేఘాలయా నుంచి తిరిగి అసోం గువాహటిలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే.. అసోంలో ఘర్షణలు సృష్టించినందుకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదు అయ్యిందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారాయన. ‘‘కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు హింసాత్మక చర్యలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసులపై దాడి చేయడం వంటి చర్యలను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర వ్యక్తులపై PDPP చట్టంలోని సెక్షన్ 120(B)143/147/188/283/353/332/333/427 IPC R/W సెక్షన్ 3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది’’ అని ఎక్స్ ఖాతాలో సీఎం శర్మ పేర్కొన్నారు. With reference to wanton acts of violence, provocation , damage to public property and assault on police personnel today by Cong members , a FIR has been registered against Rahul Gandhi, KC Venugopal , Kanhaiya Kumar and other individuals under section… — Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024 బారికేడ్లను బద్దలు కొట్టేందుకు "జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు" రాహుల్‌పై కేసు నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ముఖ్యమంత్రి ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ కేసు నమోదైంది. 'జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు మీ నాయకుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని నేను డీజీపీని ఆదేశించాను' అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ ట్విట్టర్ పోస్ట్‌కు సీఎం హిమంత శర్మ స్పందించడం గమనార్హం. These are not part of Assamese culture. We are a peaceful state. Such “naxalite tactics” are completely alien to our culture. I have instructed @DGPAssamPolice to register a case against your leader @RahulGandhi for provoking the crowd & use the footage you have posted on your… https://t.co/G84Qhjpd8h — Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024 మరోవైపు రాహుల్ గాంధీపై రాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేస్తారని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయనను అరెస్టు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం ప్రకటించారు. ఖానాపరా ప్రాంతంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఘటన తరువాత.. రాహుల్ గాంధీ సుమారు 3000 మంది వ్యక్తులు, 200 వాహనాలతో గువాహటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని సీఎం ఆరోపించారు. అడ్డుకుంటేనే మంచిది: రాహుల్ తాను కేసులకు భయపడనని, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలబడినా సత్యం కోసం పోరాడతానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర కు ఆటంకాలు ఏర్పడుతోన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తమకు పబ్లిసిటీ కల్పిస్తున్నందున.. యాత్రకు బీజేపీ ఇంకా ఇంకా అడ్డంకులు సృష్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. న్యాయ యాత్రను గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతోపాటు రాహుల్‌పై కేసు నమోదు చేయాలని సీఎం హిమంత బిశ్వ శర్మ పోలీసులను ఆదేశించిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో కన్యాకుమారి నుంచి యాత్ర మొదలుపెట్టిన సమయంలో.. ప్రజలపై దాని ప్రభావం లేదని భాజపా నేతలు వాదించారు. కానీ, జమ్మూ-కశ్మీర్ చేరేనాటికి పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఇప్పుడు మొదట్లోనే అడ్డుకోవాలనేది వారి ఆలోచన. కానీ, ఇలా చేయడం ద్వారా మాకే మేలు కలుగుతుంది. కాబట్టి.. యాత్రకు ఆటంకం కలిగించాలని నేనూ కోరుకుంటున్నా. తద్వారా దేశమంతా గమనిస్తుంది. అసోం సీఎం, కేంద్ర హోంమంత్రి చేస్తున్న పనుల వల్ల కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతోంది. రాష్ట్రంలో ‘జోడో యాత్ర’ ప్రధాన అంశంగా మారింది. ఈ విషయంలో సంతోషంగా ఉన్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: రాహుల్‌కు షాక్.. ఆలయంలోకి అనుమతి నిరాకరణ.. కారణం ఏంటంటే.. -
రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ను అస్సాం పోలీసులు అడ్డుకోవడంతో రాష్ట్ర రాజధాని గువాహటి ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రాహుల్ మంగళవారం ఉదయం గువాహటి సిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ ర్యాలీ గువాహటి రోడ్లపైకి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని కార్యకర్తలు దూసుకురావడంతో వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ అక్కడే ఉన్నారు. రూట్ చేంజ్ చేసుకోండి: సీఎం అంతకుముందు గువాహటి రోడ్లపై రాహుల్ యాత్రకు సీఎం హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వర్కింగ్ డే రోజు కావడంతో కీలక నగరమైన రహదారులపై యాత్రను అనుమతించడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిపింది. ఈ మార్గానికి బదులుగా ర్యాలీని దిగువ అస్సాం దిశగా జాతీయ రహదారి మార్గంలో చేపట్టాలని సూచించింది. నగరం చుట్టూ రింగ్ రోడ్డుపై ఉన్న 27వ నెంబరు జాతీయ రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లాలని కోరింది. చట్టాన్ని ఉల్లంఘించలేదు:రాహుల్ దీనిపై రాహుల్ ఘాటుగా స్పందించారు. గతంలో భజరంగ్ దళ్ ఇదే మార్గంలో నడిచిందని, అంతేగాక బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడ ఇదే రూట్లోర్యాలీ చేపట్టారని గుర్తు చేశారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదా అని ప్రవ్నించారు. అయితే పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటుకొని వచ్చామన్న రాహుల్.. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు. తామను బలహీనులుగా భావించవద్దని హెచ్చరించారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల శక్తికి నిదర్శనమన్నారు. రాహుల్‌పై కేసు నమోదుకు సీఎం ఆదేశం గువాహటి సరిహద్దుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కార్యకర్తల ప్రవర్తనపై అస్సాం సీఎం హిమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు గానూ కేసు ఫైల్ చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలనే సాక్ష్యాలుగా పరిగణించాలని చెప్పినట్లు తెలిపారు. #BigBreaking Assam Chief Minister Himanta Biswa Sarma is trying hard to cause trouble for Rahul Gandhi and the Bharat Jodo Nyay Yatra in Assam by using brute force. Himanta Biswa Sarma has crossed all limits by using his administration. Himanta sent Assam police to detain… pic.twitter.com/cYQmKLzhoA — Sohom Banerjee (@Sohom03) January 23, 2024 అస్సాం ప్రజలను ప్రభుత్వం అణచివేస్తోందని రాహుల్ ఆరోపించారు. మేఘాలయాలో విద్యార్ధులతో తన ఇంటరాక్ట్ను రద్దు చేశారని ప్రస్తావించారు. విద్యార్ధులు నన్ను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదన్న కాంగ్రెస్ నేత.. అయినప్పటికీ వారు తనను కలవడానికి బయటికి వచ్చినట్లు తెలిపారు. ఇకర అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ. మేర జనవరి 25 వరకు రాహుల్ యాత్ర కొనసాగనుంది. -
Bharat Jodo Nyay Yatra: ఆలయంలోకి రాహుల్ ప్రవేశం నిరాకరణ
నగావ్: అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో సోమవారం హైడ్రామా నడిచింది. నగావ్ జిల్లా బోర్డువాలోని శ్రీశ్రీ శంకర్ దేవ్ సాత్ర ఆలయంలోకి రాహుల్ ప్రవేశాన్ని అధికారులు నిరాకరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం స్థానిక ఆలయంలో పూజల తర్వాత రాహుల్ జోడో యాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం, పార్టీ నేతలతో కలిసి వస్తుండగా హైబొరాగావ్లో అధికారులు వారిని అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి దారి తీసే అన్ని రోడ్లను దిగ్బంధించారు. మీడియాను సైతం రానివ్వలేదు. నిరసనగా రాహుల్, కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడ బైటాయించారు. తనను ఎందుకు అడ్డుకున్నారో తెలపాలంటూ అధికారులను నిలదీశారు. ఎవరు, ఎప్పుడు ఆలయంలోకి వెళ్లాలో కూడా ఇప్పుడు ప్రధాని మోదీయే నిర్ణయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రతి ఒక్కరూ వెళ్లొచ్చు కానీ, తను వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ అడ్డుకోవడం వింతగా ఉందని మండిపడ్డారు. పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, బటద్రవ ఎమ్మెల్యే శిబమోని బోరా మాత్రమే ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి, వచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముందు ఆలయంలో ప్రవేశా నికి అనుమతివ్వడం లేదని శనివారం ఆలయ కమిటీ తెలిపింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తవడా నికి ముందు ఆలయంలోకి రావొద్దంటూ రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్లు సీఎం శర్మ చెప్పారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న శంకరదేవ ఆలయంలోకి రాహుల్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. జనవరి 11వ తేదీన రాహుల్‌కు అనుమతిచ్చిన ఆలయ అధికారులు, 20వ తేదీన మాత్రం మాటమార్చారని చెప్పారు. మోరిగావ్‌లో పాదయాత్రకు అనుమతి లేదు సంఘ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలు, సామరస్య వాతావరణానికి భంగం కలిగించే ప్రమాదం ఉన్నందున మోరిగావ్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించరాదని కాంగ్రెస్ నిర్వాహకులను కోరినట్లు జిల్లా కమిషనర్ దేవాశీష్ శర్మ తెలిపారు. బిహుతోలి పోలీస్ స్టేషన్ సమీపంలో ర్యాలీ, మోరిగావ్‌లోని శంకరదేవ చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ ముందుగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. మోరిగావ్ జిల్లా నుంచి గోల్సెపాకు చేరే వరకు రాహుల్ వాహన శ్రేణిని ఎక్కడా ఆపరాదని ఆయన కోరారు. స్థానిక యంత్రాంగం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాహుల్ వాహనం వీడి వెళ్లరాదని స్పష్టం చేశారు. మోరిగావ్ జిల్లా భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేసినట్లు వివరించారు. -
నేనేం నేరం చేశా: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి భారత్ జోడో న్యాయ్ యాత్రలో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు అసోం ముఖ్యమంత్రిపైనా రాహుల్ తీవ్ర అవినీతి విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆదివారం బీజేపీ శ్రేణుల నుంచి రాహుల్‌కు ప్రతిఘటన ఎదురైంది. ఇక తాజాగా.. ఆలయంలో రాహుల్ గాంధీకి దర్శనానికి అనుమతి నిరాకరించారు. సోమవారం ఉదయం బటాద్రవ థాన్(సత్రం) ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని.. అక్కడి అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. ‘‘మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేం నేరం చేశా? ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు?.. మేం సమస్యల్ని సృష్టించడానికి రాలేదు. కేవలం పూజలు చేసి వెళ్తాం. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏంటి? అంటూ అధికారులను నిలదీశారాయన. ఆ ఘటన తర్వాత నాగోవ్‌లో స్థానిక నేతలు, కార్యకర్తలతో బైఠాయింపు నిరసన చేపట్టారాయన. మరోవైపు.. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయిపోయాక మధ్యాహ్నాం 3.గంటల తర్వాతే ఆలయంలోకి రాహుల్ గాంధీని అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు కరాఖండిగా చెబుతున్నారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే ఇవాళ ప్రాణప్రతిష్ట వేళ అనుమతి ఉంటుందని ఆదివారమే ఒక స్పష్టమైన ప్రకటన చేసింది ఆలయ కమిటీ. బటాద్రవ థాన్ ఆలయం 15వ శతాబ్దపు సన్యాసి.. అసోం సంఘసంస్కర్త అయిన శ్రీమంత శంకర్దేవ్కు జన్మస్థలం. అయితే ఆలయ దర్శనం కోసం ఆదివారం దాకా నిర్వాహకులు రాహుల్ ఆలయ దర్శనానికి సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇప్పుడు నిరాకరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బటాద్రవ థాన్‌కు రాహుల్ గాంధీ వెళ్తున్న క్రమంలో.. ఆదివారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వయంగా ఒక ప్రకటన చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. జోడో యాత్ర మార్గాన్ని మార్చుకోవాలని.. ఇది అసోంకు ఎంతమాత్రం మంచిది కాదని.. రూట్ మార్చుకోవడం ద్వారా ఉద్రిక్తతలను నిలువరించాలని రాహుల్‌ని కోరారు. మరోవైపు అసోంలో.. ఆదివారం రాహుల్ గాంధీ జోడో యాత్ర బీజేపీ శ్రేణులు జరిపిన దాడి ఉద్దేశపూర్వకమైందని ఆరోపిస్తూ ఇవాళ సాయంత్రం దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. -
గాంధీలను మించిన అవినీతి పరులు ఎవరైనా ఉంటారా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అస్సాం సీఎ హిమంత బిస్వా శర్మ మధ్య మాటల యుద్ధం నడుసతోంది. రాహుల్ చేపట్టిన‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కూడా అస్సాం సర్కారే అని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలోనే ప్రజా ధనం ఎక్కువ లూటీ అవుతున్నదని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు.. ఇక్కడి ప్రజల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టుతున్నారని ఆరోపించారు. అస్సాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము పోరాటం చేస్తామన్నారు. తాజాగా రాహుల్ విమర్శలపై అస్సాం సీఎం స్పందించారు. అవినీతి సీఎం అంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు. గాంధీ కుటుంబం కంటే ఎక్కువ అవినీతి పరులు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఏ విమర్శలైనా అవి తనకు ఆశీర్వాదంగా భావిస్తానని తెలిపారు. ఇది తమను తాము అత్యంత శక్తివంతమైన వారిగా భావించే (గాంధీ కుటుంబం) వారితో పోరాడేందుకు శక్తినిస్తుందని తెలిపారు. అయితే తానే ఒక్కటి మాత్రమే అడగాలనుకుంటున్నాని.. గాంధీల కంటే అవినీతిపరులు ఎవరైనా ఉండగలరా అని ఎద్దేవా చేశారు. బోఫోర్స్ కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ స్కామ్, భోపాల్ గ్యాస్ ఘటన, 2G స్కామ్, బొగ్గు కుంభకోణం మొదలైనవి కాగా మణిపూర్‌లో ప్రారంభమైన రాహుల్ యాత్ర నాగాలాండ్ ఆ తరువాత అస్సాంలో సాగుతోంది. జనవరి 25 వరకు రాష్ట్రంలోనే పర్యటించనున్నారు. అస్సాంలో 833 కిలోమీటర్లు, 17 జిల్లాల మీదుగా ప్రయాణించనున్నారు. తరువాత మేఘాలయాలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్లో మార్పులు చేయడంతో పోలీసులు.. తాము ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి యాత్రను మళ్లించినట్లు అస్సాం పోలీసులు తెలిపారు. -
బీజేపీది ‘ఢిల్లీ’ పాలన: రాహుల్
నార్త్ లఖీంపూర్ (అసోం): దేశాన్ని ఢిల్లీ నుంచి మాత్రమే కేంద్రీకృత విధానంలో పాలించాలన్న భావజాలం బీజేపీ, ఆరెస్సెస్‌ల నరనరాన నిండిపోయిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు మాత్రం అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం లభించే స్థానిక స్వపరిపాలనే మూలమంత్రమని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శుక్రవారం అసోంలోని గోగాముఖ్ వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలతో సమ ప్రాధాన్యముందని చాటేందుకే యాత్రను మణిపూర్ నుంచి మొదలు పెట్టానని చెప్పారు. ‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రంలో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నా ప్రధాని మోదీకి అక్కడ పర్యటించే తీరిక లేదు’’ అన్నారు. -
భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు
దిస్పూర్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు అసోం పోలీసులు. అసోం ముఖ్యమంత్రిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన కొద్దిగంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. నిర్దేశించిన మార్గంలో కాకుండా.. మరో మార్గం గుండా గురువారం మధ్యాహ్నాం రాహుల్ యాత్ర సాగిందన్నది అసోం పోలీసుల అభియోగం. హఠాత్తుగా యాత్ర సాగే దారిని మార్చడం ద్వారా.. జనాలు ట్రాఫిక్ బారికేడ్లను బద్దలు కొట్టారు. అలాగే.. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి దాడికి పాల్పడ్డారని అసోం పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ మేరకు జోడో న్యాయ్ యాత్ర నిర్వాహకుడు కేబీ బైజూపైనా కేసు నమోదు అయ్యింది. అంతకు ముందు.. అసోం సీఎం హిమంత బిస్వా శర్మపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. శుక్రవారంతో భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆరో రోజుకి చేరింది. ఇవాళ అతిపెద్ద మంచి నీటి ద్వీపం మజూలీలో రాహుల్ యాత్ర సాగనుంది. జనవరి 25వ తేదీ దాకా రాహుల్ అసోంలోనే యాత్రలో పాల్గొంటారు. -
అస్సాం ప్రభుత్వం, సీఎం..
శివసాగర్/జోర్హాట్(అస్సాం): భారత్ జోడో న్యాయ్ యాత్రను అస్సాంలో మొదలుపెడుతూనే ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. నాగాలాండ్ బుధవారం ముగిసిన యాత్ర అస్సాంలో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శివసాగర్ జిల్లాలోని హాలోటింగ్ పట్టణంలో వందలాది మంది పార్టీ కార్యకర్తల సమక్షంలో రాహుల్ మాట్లాడారు. ‘‘ దేశంలో అత్యంత అవినీతిమయ ప్రభుత్వం ఉందంటే అది ఈ రాష్ట్ర సర్కారే. అతిపెద్ద అవినీతి సీఎం కూడా ఇక్కడే ఉన్నారు’’ అని ఆరోపించారు. జొర్హాట్ జిల్లాలోని దేబెరాపూర్‌లోని వీధి సమావేశంలోనూ రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ అస్సాంలోని బీజేపీ రాష్ట్ర సర్కార్ ఇక్కడి గిరిజనులు, తేయాకు కారి్మకులు, స్థానిక తెగలకు అన్యాయం చేస్తోంది. సంపదను కొల్లగొడుతూ విద్వేషాన్ని చిమ్ముతోంది. యాత్ర మొదలైన మణిపూర్‌లో జాతుల మధ్య వైరం కార్చిచ్చులా విస్తరించి నివురుగప్పిన నిప్పులా ఉంది. దానిని చల్లార్చేందుకు కనీసం ఒక్కసారైనా మోదీ మణిపూర్‌కు రాలేదు. ఇక నాగాలాండ్‌లో నాగాల సమస్యను పరిష్కరిస్తామని మోదీ సర్కార్ తొమ్మిదేళ్ల క్రితం ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ అది ఎంత వరకు సఫలమైందనేది మోదీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు’’ అని రాహుల్ ఆరోపించారు. -
Rahul Gandi: హాజరవడం కష్టమే
చిఫొబొజౌ(నాగాలాండ్): అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ఎన్నికల రంగులద్దుకుని ‘నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్–బీజేపీ’ ఫంక్షన్‌గా ముస్తాబవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం నాగాలాండ్‌లోకి అడుగుపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారం సైతం వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారుల నడుమ కొనసాగింది. యాత్రను ముందుండి నడిపిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం రాష్ట్ర రాజధాని కోహిమాలో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందిన ఆహా్వనాన్ని తమ పార్టీ అగ్రనేతలు సున్నితంగా తిరస్కరించడాన్ని ఆయన గట్టిగా సమరి్థంచారు. ‘‘ మందిరం ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పారీ్టల నేతలు ఎవరు వెళ్లినా నేను మనసారా స్వాగతిస్తా. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమం మొత్తం మోదీ, ఆర్ఎస్ఎస్ కేంద్రంగా తయారైంది. చక్కని వేడుకను ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయ వేడుకగా మార్చేశాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాం«దీ భావించి ఉంటారు. కాంగ్రెస్ పారీ్టకి అన్ని మతాలు, సంప్రదాయాలు సమానమే. 22న అయోధ్య జరిగే కార్యక్రమం.. రాజకీయ ఉత్సవంలా మారిందని స్వయంగా కొందరు హిందూ మత పెద్దలే బహిరంగంగా విమర్శించారు. ఇలా కొత్తరూపును సంతరించుకున్న ఈ కార్యక్రమానికి మేం వెళ్లడం కష్టం. అసాధ్యం కూడా’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ఇండియా కూటమి బలంగా ఉంది, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పారీ్టతో సీట్ల పంపకం విషయంలో నెలకొన్న విభేదాలు సమసి పోతాయి’’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. -
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత, వయినాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ కొనసాగుతోంది. నాగాలాండ్ రాజధాని కోహిమాలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ కార్యక్రమమని దుయ్యబట్టారు. బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), బీజేపీ జనవరి 22న జరిపే రామ మందిర ప్రారంభోత్సం పూర్తిగా నరేంద్ర మోదీ రాజకీయ కార్యక్రమమని మండిపడ్డారు. ఇది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాబట్టి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రామ మందిర కార్యక్రమానికి హాజరు కావటం లేదని ప్రకటించినట్లు గుర్తుచేశారు. తమకు అన్ని మతాలపై విశ్వాసం ఉందని, అన్ని మతాలను అంతే సమానంగా ఆచరిస్తామని పేర్కొన్నారు. హిందు మతాన్ని పాటిస్తూ ఉన్నత స్థానంలో మతాచార్యులు సైతం రామ మందిర ప్రారంభ ఉత్సవాన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ పనిగట్టుకొని రాజకీయం కోసమే రామ మందిర ప్రారంభోత్సవం నిర్వహించటం సరికాదన్నారు. అటువంటి రాజకీయ ప్రారంభోత్సవానికి హాజరుకావద్దని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా షర్మిల.. నియమించిన కాంగ్రెస్ హైకమాండ్ -
Bharat Jodo Nyay Yatra: అన్యాయాన్ని ప్రశ్నించేందుకే...
థౌబాల్/ఇంఫాల్: జాతుల ఘర్షణలతో అట్టుడికిపోతున్న కల్లోల మణిపూర్ రాష్ట్రానికి శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మణిపూర్‌లోని థౌబాల్ నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖోంగ్జామ్ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో రాష్ట్రంలో లక్షలాది మంది అమాయకులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కన్నీళ్లు తుడిచేందుకు, చేయూతనిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ దృష్టిలో మణిపూర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాకపోవచ్చని ఆక్షేపించారు. ‘‘మీ బాధను వారి బాధగా భావించడం లేదు. కానీ మీ దుఃఖాన్ని, మీకు తగిలిన గాయాలు, మీరెదుర్కొంటున్న విచారాన్ని మేం అర్థం చేసుకున్నాం’’ అని చెప్పారు. బాధితులు ఆప్యాయతను కోరుకుంటున్నారని రాహుల్ అన్నారు. ప్రజల ‘మన్ కీ బాత్’ వింటాం దేశంలో అన్యాయ కాలం కొనసాగుతున్నందు వల్లే న్యాయ యాత్ర చేపట్టాల్సి వచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను ఏకం చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశమని వివరించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, సామరస్యంతో కూడిన ‘న్యూ విజన్ ఆఫ్ ఇండియా’ను సాధించడం ధ్యేయమని స్పష్టం చేశారు. ‘‘ఈ యాత్రలో ప్రజల ‘మన్ కీ బాత్’ వింటాం. ప్రజలను నేరుగా కలుసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాం’’ అని వెల్లడించారు. బీజేపీ క్షుద్ర రాజకీయాల వల్ల మణిపూర్‌లో శాంతి, సామరస్యం కనుమరుగు అయ్యాయని రాహుల్ ద్వజమెత్తారు. సమాజంలో విద్వేషం, హింస, అరాచకత్వానికి స్థానం ఉండకూడదని చెప్పారు. దేశ సంపద కొందరి జేబుల్లోకి వెళ్తోందని రాహుల్ ఆరోపించారు. ఒకరిద్దరు వ్యాపారవేత్తలు మొత్తం ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం సాధిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వ్యాపారాల్లోకి వారు ప్రవేశిస్తున్నారని, ఫలితంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. దేశ జనాభాలో అధిక భాగం ఉన్న కింది కులాలు, దళితులు, గిరిజనులకు రాజకీయ వ్యవస్థలో, ప్రభుత్వ పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటినీ యాత్రలో లేవనెత్తుతామని తెలిపారు. రాహుల్ యాత్రలో బీఎస్పీ బహిష్కృత ఎంపీ డానిష్ అలీ ఇటీవల బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన లోక్‌సభ సభ్యుడు డానిష్ అలీ రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. రాహుల్ యాత్రపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఘర్షణలింకా ఆగలేదు. ఇలాంటప్పుడు యాత్ర పేరుతో పరిస్థితిని దిగజార్చడానికి వచ్చారా?’’ అంటూ మండిపడ్డారు. -
ప్రారంభమైన రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. మణిపూర్ ప్రజలు తమ ఆవశ్యకత, విలువను పోగొట్టుకున్నారు. ఇక్కడి ప్రజలు ఏం కోల్పోయారో తాము చూశామని తెలిపారు. #WATCH | Congress MP Rahul Gandhi kickstarts Bharat Jodo Nyay Yatra from Thoubal, Manipur. pic.twitter.com/6F8hLDgAqa — ANI (@ANI) January 14, 2024 మణిపూర్ ప్రజలు ఏం కోల్పోయారో వాటిని మళ్లీ అందిస్తామని హామీ ఇచ్చారు. మణిపూర్ ప్రజల బాధలు చూశామని.. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దు:ఖాన్ని తాము తొలగిస్తామని అన్నారు. ఇక్కడ ప్రజల్లో మునుపటిలా శాంతి, ప్రేమ, శ్రేయస్సును పునరుద్ధరిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. #WATCH | Thoubal, Manipur: Congress MP Rahul Gandhi says, " You (people) have lost what you have valued but we will find what you have valued once again and bring it back to you. We understand the pain the people of Manipur have been through. We understand the hurt, the loss and… pic.twitter.com/RQ0d1OZ5Pe — ANI (@ANI) January 14, 2024 న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను.. మార్చి 20 లేదా 21న ముంబైలో యాత్రను ముగించనున్నారు. చదవండి: ‘రాహుల్’ రాజకీయం.. కాంగ్రెస్‌ను వీడిన 11 మంది సీనియర్లు -
మణిపూర్ టు ముంబయి: మరికాసేపట్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం
ఇంఫాల్: ►మణిపూర్‌లోని తౌభాల్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. #WATCH | Delhi: Congress MP Rahul Gandhi arrives at Delhi airport. He will kick-start 'Bharat Jodo Nyaya Yatra' from Manipur's Thoubal today. The yatra will cover over 6,700 kilometres over 67 days, going through 110 districts. pic.twitter.com/GFPwwzfDAb — ANI (@ANI) January 14, 2024 ►అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సమానత్వాన్ని ఎలుగెత్తడమే ఈ యాత్ర ధ్యేయమని పేర్కొన్నారు. #WATCH | Delhi: On Rahul Gandhi's 'Bharat Jodo Nyaya Yatra', Congress General Secretary KC Venugopal says, "The purpose of this yatra is seeking justice for everybody. Social, economic and political justice in this country...Rahul Gandhi is starting the yatra from Manipur to… pic.twitter.com/5dzcQPFo2R — ANI (@ANI) January 14, 2024 ►కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు హాజరవడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు కీలక నాయకులు బయలుదేరారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి మణిపూర్‌కు వెళుతున్నారు. #WATCH | Telangana CM and Congress leader Revanth Reddy leaves for Manipur from Delhi airport to participate in the party's 'Bharat Jodo Nyaya Yatra' pic.twitter.com/55gVCzJ7JU — ANI (@ANI) January 14, 2024 ► కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను.. మార్చి 20 లేదా 21న ముంబయిలో యాత్రను ముగించనున్నారు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్రల్లో సాగనుంది. తన యాత్రలో ప్రధాని మోదీ వైఫల్యాలు, నిరుద్యోగం, ధరల పెంపు, సామాజిక న్యాయం అంశాలు ప్రస్తావించనున్నారు. అయితే, తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాగా గతంలో రాహుల్ భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500కి.మీ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇది వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌కు సరికొత్త జోష్‌ను అందించింది. ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం! -
నేటి నుంచి భారత్‌జోడో న్యాయ్‌యాత్ర ప్రారంభం...ఇంకా ఇతర అప్డేట్స్
-
రేపటి నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టబోయే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు(జనవరి 14వ తేదీ ఆదివారం) మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను.. మార్చి 20 లేదా 21న ముంబైలో యాత్రను ముగించనున్నారు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్రల్లో సాగనుంది. తన యాత్రలో ప్రధాని మోదీ వైఫల్యాలు, నిరుద్యోగం, ధరల పెంపు, సామాజిక న్యాయం అంశాలు ప్రస్తావించనున్నారు. అయితే, తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాగా గతంలో రాహుల్ భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500కి.మీ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇది వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌కు సరికొత్త జోష్‌ను అందించింది. చదవండి: ఇండియా కూటమి చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే..