న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టబోయే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు(జనవరి 14వ తేదీ ఆదివారం) మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను.. మార్చి 20 లేదా 21న ముంబైలో యాత్రను ముగించనున్నారు.
మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్రల్లో సాగనుంది. తన యాత్రలో ప్రధాని మోదీ వైఫల్యాలు, నిరుద్యోగం, ధరల పెంపు, సామాజిక న్యాయం అంశాలు ప్రస్తావించనున్నారు.
అయితే, తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
కాగా గతంలో రాహుల్ భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500కి.మీ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇది వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌కు సరికొత్త జోష్‌ను అందించింది.
చదవండి: ఇండియా కూటమి చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే..
Comments
Please login to add a commentAdd a comment