సాక్షి, ముంబై : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నేటితో ముంబైలో ముగియనుంది.
మణిపూర్ నుంచి ప్రారంభమైన 6,700 కిలోమీటర్ల పాదయాత్రను ముంబైలో శివాజీ పార్క్ వద్ద రాహుల్ గాంధీ ముగింపు పలకనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశిస్తూ ప్రతిపక్ష కూటమి ఇండియాలోని కూటమి పార్టీల నేతలు హాజరుకానున్నారు.
కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య, శరద్ పవార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్‌లు పాల్గొననున్నారు.
జనవరి 14న ప్రారంభమై
జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా కొనసాగింది. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్రను నేటితో ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment