సాక్షి, థానే : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలక్టోరల్ బాండ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని ఆరోపించారు.
‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల్ని శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను విభజించి, ప్రభుత్వాలను పడగొట్టేందుకే ఉపయోగించిందని’ విమర్శలు చేశారు.
‘రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల బాండ్లను (స్కీమ్) రూపొందించినట్లు ప్రధాని మోదీ గతంలో తెలిపారు. కానీ ఇది దేశంలోని కార్పొరేట్ కంపెనీల నుంచి డబ్బుల్ని దండుకునే స్కీంలా మారిందని అని అన్నారు. త్వరలోనే దీనిపై విచారణ జరుగుతుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.
ఈ సందర్భంగా ఈడీ, సీబీఐలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలుగా మారాయని, ఏదో ఒక రోజు బీజేపీ ప్రభుత్వం స్థానభ్రంశం చెందుతుందని జోస్యం చెప్పారు. అలాంటి చర్యలకు శిక్ష పడుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటివి జరగవు. ఇది నా హామీ అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment