Electoral Bonds
-
ఇది రేవంత్ టీం చేస్తున్న దుష్ప్రచారం: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. రేసుకు స్పాన్సర్షిప్ చేసిన గ్రీన్కో కంపెనీ నుంచి అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్(BRS)కు లబ్ధిచేకూరినట్లు తెలుస్తోంది. ఆ లావాదేవీలు చందాలు, ఎన్నికల బాండ్ల రూపంలో వెళ్లినట్లు సమాచారం.ఎన్నికల బాండ్ల రూపంలో గ్రీన్కో(Greenko), దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్కు మొత్తం రూ.49 కోట్లు ముట్టాయి. ఇందులో 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య 41 సార్లు రూ.కోటి చొప్పున ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అలాగే.. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఈ కొనుగోలు వ్యహారం నడిచినట్లు తేలింది. ఈ మేరకు ఈ విషయాన్ని తాజాగా ప్రభుత్వం బయటపెట్టింది. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేస్ కేసును అవినీతి కోణంలో తెలంగాణ ఏసీబీ, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.కేటీఆర్ స్పందనబీఆర్ఎస్కు గ్రీన్కో ఎన్నికల బాండ్ల అంశంపై కేటీఆర్ స్పందించారు. ‘‘గ్రీన్కో 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా-ఈ రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్కో బాండ్లు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసు వల్ల గ్రీన్కో నష్టపోయింది. అందుకే మరుసటి ఏడాది స్పాన్సర్షిప్ నుంచి నుంచి తప్పుకుంది. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?. ఇది రేవంత్ టీం చేస్తున్న దుష్ప్రచారం. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?. అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధం. ’’ అని అన్నారాయన. హైదరాబాద్‌లో ఫార్ములాఈ రేస్ నిర్వహణకు సంబంధించి.. యూకేకు చెందిన ఫార్ములా ఈఆపరేషన్స్ (FEO)కు సుమారు రూ.45.71 కోట్లను తెలంగాణ మున్సిపల్ శాఖ(MAUD) తరఫున హెచ్ఎండీఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ ఇటీవల ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్ ఆమోదం పొందకుండానే.. హెచ్ఎండీఏ ఛైర్మన్ అయిన ముఖ్యమంత్రికి ఫైల్ పంపకుండానే.. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్‌లోని ఎఫ్ఈవో ఖాతాకు బ్రిటన్ పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేసిన క్రమంలో ఆదాయపన్ను మినహాయించలేదని.. అందువల్ల ఆదాయపన్ను శాఖకు రూ.8.06 కోట్లను హెచ్ఎండీఏ చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనల వెనక ఏమైనా మతలబులున్నాయేమో తేల్చాలని కోరారు.ఈ ఘటనల్లో అప్పటి మంత్రి, ఎంఏయూడీ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజినీర్ల పాత్ర ఉండటంతో అవినీతి కోణంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. అలాగే.. విదేశీ సంస్థకు నిధుల బదిలీ వెనక ఫెమా ఉల్లంఘనలతో పాటు నిధుల అంతిమ లబ్ధిదారులెవరనే కోణంలో ఈడీ దర్యాప్తు ఆరంభించింది.ఇదీ చదవండి: ఫార్ములా ఈ రేస్.. ఇదో లొట్టపీసు కేసు! -
బీఆర్ఎస్కు విరాళాల వెల్లువ.. అగ్రస్థానంలో బీజేపీ
ఢిల్లీ : గడిచిన ఎన్నికల్లో స్థానిక పార్టీల్లో బీఆర్ఎస్కు ఊహించని విధంగా విరాళాలు అందాయి. విరాళాలు పొందే విషయంలో జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా..రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) తన వెబ్సైట్లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? అందులో వివరించింది. ఈసీ నివేదిక ప్రకారం.. 2023-24లో దాతలు బీజేపీకి రూ. 20,000 అంత కంటే ఎక్కువ మొత్తం దాదాపు రూ.2,244 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం 2022-23లో అందుకున్న మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ. బీఆర్ఎస్ రూ.580 కోట్లతో రెండవ స్థానంలో, కాంగ్రెస్ రూ.289 కోట్లతో మూడో స్థానంలో ఉంది. కాంగ్రెస్‌కు అంతకుముందు సంవత్సరం రూ.20,000 అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో రూ.79.9 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం కాంగ్రెస్ కంటే బీజేపీకి అందిన విరాళాలు 776.82 శాతం ఎక్కువ.ట్రస్ట్ (Satya Electoral Trust)లు బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ అత్యధిక విరాళాలు అందించాయని భారత ఎన్నికల సంఘం (eci) డేటా చెబుతోంది. అందులో బీజేపీ రూ.723 కోట్లు, కాంగ్రెస్ రూ. 156 కోట్లు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ విరాళంగా వచ్చాయి. ఇతర పార్టీలలో, ఆమ్ ఆద్మీ 2023-24లో రూ. 11.1 కోట్ల విలువైన విరాళాలు పొందింది. అంతకు ముందు ఏడాది ఆప్ రూ.37.1 కోట్లు అందుకుంది. 2023-24లో సీపీఎం విరాళాలు రూ. 6.1 కోట్ల నుండి రూ. 7.6 కోట్లను పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈసీ ఆయా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్ని వెల్లడించింది. -
నిర్మలకు ఊరట దర్యాప్తుపై హైకోర్టు స్టే
బెంగళూరు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట లభించింది. ఈడీని అడ్డం పెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారనే కేసులో నిర్మల, ఇతరులపై సాగుతున్న దర్యాప్తుపై కర్నాటక హైకోర్టు సోమవారం స్టే విధించింది. నిందితుల్లో ఒకరైన బీజేపీ నేత నళిన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎం.నాగప్రసన్న దర్యాప్తుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 22కు వాయిదా వేశారు. ఆదర్శ్ ఆర్ అయ్యర్ చేసిన ఫిర్యాదు మేరకు.. స్పెషల్ కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈడీ అధికారులపై శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయసంహిత సెక్షన్ 384 (బెదిరించి డబ్బు గుంజడం), 120బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 34 కింద వీరిపై కేసు నమోదైంది. -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట
బెంగళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కాస్త ఊరట లభించింది. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాతోపాటు మరికొందరిపై నమోదైన కేసు విచారణపై కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు తమపై తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ బీజేపీ నేత నళిన్ కుమార్ కటీల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం నాగప్రసన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.కాగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైన విషయం తెలిసిందే. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్పీ) నేత ఆదర్శ ఆర్.అయ్యర్ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. ఆ మేర కు తిలక్ నగర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు. -
కర్ణాటకలో నిర్మలపై కేసు
సాక్షి, బెంగళూరు: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్పీ) నేత ఆదర్శ ఆర్.అయ్యర్ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. ఆ మేర కు తిలక్ నగర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు.నిర్మల రాజీనామా చేయరా: సిద్ధుకేసు నేపథ్యంలో నిర్మలను కూడా బీజేపీ రాజీనామా కోరుతుందా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘ముడా’ కేసులో ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు
బెంగళూరు: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం రద్దైన ఎన్నికల బాండ్ల పేరిట మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సీతారామన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు చట్టసభల ప్రతినిధుల న్యాయస్థానం తిలక్‌నగర్ పోలీసులను ఆదేశించింది.కాగా పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మతా సీతారామన్ బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్షపరిషత్తుకు చెందిన ఆదర్శ్ గతంలో తిలక్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి సంతోశ్ గజానన ధర్మాసనం..నిర్మలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేశారు.కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెతోపాటు ఎఫ్ఐఆర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ నతేలు, నలీన్ కుమార్ కటీల్, బీఐ విజయేంద్ర పేర్లను కూడా చేర్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో ఒత్తిళ్లు పెంచి కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయలతో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఎలక్టోరల్ బాండ్లను జాతీయ, రాష్ట్ర స్థాయిలలోని బిజెపి నాయకులు నగదుగా మార్చుకున్నారని తెలిపారు.కాగా నగదు రూపంలో పార్టీలకు ఇచ్చే విరాళాలకు బదులుగా బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చే పథకాన్ని కేంద్రప్రభుత్వం 2018లో తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే,ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో ఈ బాండ్ల విధానాన్ని రద్దు చేసింది. ఇది ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది -
‘ఎలక్టోరల్ బాండ్’ పై పిటిషన్.. తిరస్కరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల (ఇబి) ఎలక్టోరల్ ఫైనాన్సింగ్‌పై న్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సిట్ ఏర్పాటు చేసేందుకు నిరాకరించింది. ఎలక్టోరల్ ఫైనాన్సింగ్ ద్వారా రాజకీయ పార్టీలు, పలు కార్పొరేట్ కంపెనీల మధ్య క్విడ్ ప్రోకో జరిగాయని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇదే అంశంపై సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాయి.ఈ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం..శుక్రవారం (ఆగస్ట్2న)విచారించింది. సిట్ ఏర్పాటుకు నిరాకరించింది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం కూడా తొందరపాటే అవుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. Supreme Court declines petitions seeking a probe by a Special Investigation Team (SIT) into the alleged instances of quid pro quo arrangements between corporates and political parties through Electoral Bonds donations.In February, the Supreme Court had struck down the Electoral… pic.twitter.com/0bnAC6TwIE— ANI (@ANI) August 2, 2024రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ)ను అనుసరించి.. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. అలాగే.. నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటు కాదంటూ ఏకగ్రీవ తీర్పును రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది. -
ఎన్నికల బాండ్లలో క్విడ్ ప్రో కో..? నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టులో శుక్రవారం(జులై 19) కీలక విచారణ జరగనుంది. ఎన్నికల బాండ్ల వెనుక జరిగిన వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.బడా కార్పొరేట్ కంపెనీల నుంచి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల బాండ్ల రూపంలో భారీగా నిధులు పొందాయని పిటిషనర్లు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా కంపెనీలను సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీల విచారణ నుంచి తప్పించడం లేదంటే పాలసీల్లో మార్పులు చేసి వాణిజ్యపరంగా వాటికి భారీ లబ్ధి చేకూర్చడం వంటి క్విడ్ ప్రో కో జరిగిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారనుంది. కాగా, ఇప్పటికే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. -
Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
న్యూఢిల్లీ: సన్నిహితులైన వ్యాపారవేత్తలతో ఉన్న లింకులపై ప్రశ్నలకు, ఎలక్టోరల్ బాండ్లను దురి్వనియోగం చేయడంపై సమాధానాలు చెప్పుకోలేరు కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో చర్చకు ముందుకు రావడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి దేశ రాజధానిలోని ఏడు లోక్‌సభ సీట్లలో కూటమిని గెలిపించాలని పిలుపిచ్చారు. ఆసక్తికరమైన విషయమేమింటే నేను ఆప్‌కు ఓటేస్తాను, కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు ఓటేస్తారని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ తన అనుకూల పాత్రికేయులకు ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ తనతో చర్చకు మాత్రం రారని, ఎందుకంటే తన ప్రశ్నలకు సమాధానమివ్వలేనని మోదీకి తెలుసన్నారు. అదానీ– అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ డబ్బు ముట్టిందని ప్రధాని ఆరోపిస్తారు.. కానీ దీనిపై దర్యాప్తునకు ఆదేశించే ధైర్యం మాత్రం చేయరు అని ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రధాని మోదీతో చర్చకు నేను సిద్ధమే. ఆయన రారని నాకు తెలుసు. ఆయన్ను నేనడిగే తొలి ప్రశ్న.. అదానీతో మీకున్న బంధుత్వమేమిటి? రెండో ప్రశ్న... బీజేపీకి అందిన ఎలక్టోరల్ బాండ్ల గురించి’ అని రాహుల్ వివరించారు. మోదీ, రాహుల్‌లు చర్చ చేయాలని ఇద్దరు మాజీ జడ్జిలు, మాజీ సంపాదకుడు ఎన్.రామ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈడీæ అధికారులు అలసిపోయే దాకా 55 గంటల పాటు వారు నన్ను ఇంటరాగేట్ చేసేలా బీజేపీ చేసింది. నా ఇంటిని (ఎంపీ క్వార్టర్‌ను) లాగేసుకున్నారు. నాకు మీ క్వార్టర్ అవసరం లేదని.. మొత్తం దేశమే నా ఇల్లని వారికి చెప్పానని రాహుల్ బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీలో చేరుతున్న వారిపై మాట్లాడుతూ.. తమకేమీ ఇబ్బంది లేదని, పిరికిపందలు తమకు అక్కర్లేదని చెప్పారు. సీబీఐ, ఈడీ దాడులను భయపడి లొంగిపోయే వారు తమకు అవసరం లేదన్నారు. -
ఎన్నికల బాండ్లు: రాహుల్‌గాంధీకి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్నికల బాండ్లపై నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల బాండ్లపై మాట్లాడారు. ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్టార్షన్(అక్రమ వసూళ్లు) స్కీమ్‌గా అభివర్ణించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి షా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల బాండ్ల స్కీమ్ అతిపెద్ద ఎక్స్టార్షన్ స్కీమ్ అయితే కాంగ్రెస్‌కూడా ఈ స్కీమ్ కింద అక్రమ వసూళ్లకు పాల్పడిందని షా ఆరోపించారు. తాము కూడా ఈ స్కీమ్ కింద వసూళ్లు చేశామని రాహుల్ ప్రజలకు చెప్పాలి. ఎంపీల సంఖ్య ప్రకారం చూస్తే ప్రతిపక్షాలే అత్యధికంగా ఎన్నికల బాండ్ల స్కీమ్‌లో లాభపడ్డాయన్నారు. ప్రతిపక్షాలకు తమను విమర్శించడానికి ఏమీ లేదని, ఇందుకే ప్రజలను కావాలని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్ కింద బీజేపీ అక్రమ వసూళ్లకు పాల్పడిందని, ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్ అని ఇటీవల రాహుల్‌గాంధీ విమర్శించారు. ఇదీ చదవండి.. నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో జీరో పోలింగ్ -
ఎన్నికల బాండ్ల రద్దు : ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల విధానం రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం రద్దు చేయడం పట్ల ప్రతి ఒక్కరు బాధపడతారన్నారు. తాజాగా జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ విషయమై స్పందించారు. ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు డబ్బు ఖర్చు చేస్తాయని, బ్లాక్‌మనీని అరికట్టేందుకు తన మనసులోకి వచ్చిన ఆలోచనే ఎలక్టోరల్ బాండ్లు అన్నారు. బ్లాక్‌మనీ నిర్మూలనకు ఇదే మార్గమని తాను ఎప్పుడూ చెప్పలేదని ప్రధాని గుర్తు చేశారు. ఈ పథకంతో బీజేపీకే ఎక్కువ నిధులు వచ్చాయన్నదానిపై ప్రధాని మండిపడ్డారు. బాండ్ల అంశంలో విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇదీ చదవండి.. దీదీ ఫైర్.. చాయ్‌కి బదులు అది తాగమంటారేమో -
ఎలక్టోరల్ బాండ్ల రద్దుపై మోదీ స్పందన.. ప్రతి ఒక్కరూ చింతిస్తారు!
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ప్రతి ఒక్కరూ చింతిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన మార్గం ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ పథకాన్ని తామ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. అయితే నల్లధనాన్ని నిర్మూలించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇదే సరైన మార్గం అని తాను ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు నగదు ఖర్చు చేస్తాయన్నారు. అంతేగాక ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకే భాజపాకే ఎక్కువ ప్రయోజనం చేకూరిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మోదీ ఘాటుగా స్పందించారు. బాండ్ల అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ పార్టీలకు వ్యక్తులు లేదా సంస్థలు గుప్త విరాళాలిచ్చే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల బాండ్లు ఎవరు కొనుగోలు చేశారు, రాజకీయ పార్టీలకు వాటి ద్వారా ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందించాలని ఎస్బీఐని సుప్రీం ఆదేశించింది. దీంతో ఎస్బీఐ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందించడంతో ఆ వివరాలను ఈసీ తన వెబ్సైట్లో ఉంచి బహిర్గతం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది. చదవండి: కుటుంబ ప్రయోజనాలే వారి లక్ష్యం.. విపక్షాలకు ప్రధాని మోదీ చురకలు -
SBI: ఆర్టీఐ కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వలేం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కింద బహిర్గతం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాకరించింది. ఇది వ్యక్తిగత సమాచారమని పేర్కొంది. సంబంధిత రికార్డులు ఎన్నికల సంఘం వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్టీఐ కింద ఈ వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేలి్చచెప్పింది. ఈ బాండ్లకు సంబంధించిన పూర్తి డేటాను డిజిటల్ రూపంలో ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కార్యకర్త లోకేశ్ బాత్రా మార్చి 13న దరఖాస్తు చేశారు. -
ఎలక్టోరల్ బాండ్ల గుట్టు రట్టు దొరికిన బ్లాక్ మని దొంగలు
-
ఎన్నికల బాండ్లు.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఎన్నికల బాండ్ల స్కీమ్ రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించేందుకు నిరాకరించారు. ఆర్బీఐ ద్వై మాసిక క్రెడిట్ పాలసీ నిర్ణయాన్ని వెల్లడించేందుకు శుక్రవారం(ఏప్రిల్ 5)గవర్నర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఎన్నికల బాండ్లపై గవర్నర్‌ను ప్రశ్నించగా ‘నో కామెంట్’ అని సమాధానమిచ్చారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇటీవల ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించింది. కంపెనీలు తమ నికర విలువ కంటే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయడం అనే అంశం మా పరిధిలోకి రాదు’అని దాస్ చెప్పారు. రాజకీయ పార్టీలకు వ్యక్తులు లేదా సంస్థలు గుప్త విరాళాలిచ్చే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల బాండ్లు ఎవరు కొనుగోలు చేశారు, రాజకీయ పార్టీలకు వాటి ద్వారా ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందించాలని ఎస్బీఐని సుప్రీం ఆదేశించింది. దీంతో ఎస్బీఐ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందించడంతో ఆ వివరాలను ఈసీ తన వెబ్సైట్లో ఉంచి బహిర్గతం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది. ఇదీ చదవండి.. బర్త్ సర్టిఫికెట్ కొత్త రూల్స్.. రూల్స్‌లో కీలక మార్పులు -
ఎన్నికల బాండ్లు: ‘ఆర్టీఐ’ కింద రిప్లైకి ‘ఎస్బీఐ’ నో
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల అమ్మకాల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) తెలపాలని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి ఒక పిటిషన్ దాఖలైంది. ఎస్ఓపీ వివరాలు ఇవ్వడానికి ఎస్బీఐ నిరాకరించింది. హక్కుల కార్యకర్త అంజలి భరద్వాజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాండ్ల విక్రయాలు, ఎన్‌క్యాష్ కోసం బ్యాంకు బ్రాంచ్‌లకు జారి చేసిన ఎస్ఓపీ అనేది తమ సంస్థ అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుందని ఎస్బీఐ పిటిషనర్‌కు సమాధానమిచ్చింది. వాణిజ్య, వ్యాపార రహస్యాలు వెల్లడించకుండా కమర్షియల్ కాన్ఫిడెన్స్ కింద ఆర్టీఐ చట్టంలో మినహాయింపులున్నాయని తెలిపింది. ఎస్బీఐ సమాధానంపై అంజలి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిందని, వీటికి సంబంధించిన అన్ని వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు. అయినా ఎస్బీఐ ఎస్ఓపీ వివరాలు దాచడం సరికాదన్నారు. కాగా, రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ప్రకటించిన విషయం తెలిసిందే. స్కీమ్‌ను ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందజేయాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది. దీంతో ఎస్బీఐ ఈసీకి వివరాలు అందించిన వెంటనే ఈసీ వాటిని తన వెబ్సైట్లో బహిర్గతం చేసింది. ఇదీ చదవండి.. వదలని చిక్కులు.. మహువా మొయిత్రాపై మరో కేసు -
అది ఎదురుదెబ్బ ఎలా అవుతుంది?: ప్రధాని మోదీ
ఢిల్లీ: ఎన్నికల బాండ్ల వ్యవస్థ ఉండడం వల్ల విరాళాలను ఎవరు, ఎవరికి ఇస్తున్నారో తెలిసే అవకాశం ఉందని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదని ప్రధాని నరేంద్రమోదీ అంటున్నారు. ఆదివారం ఒక తమిళ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఎన్నికల బాండ్ల రద్దు అంశంపై స్పందించారు. పంచెకట్టులో ప్రధాని మోదీ ఈ ఇంటర్వ్యూకి హాజరు కావడం విశేషం. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందన్న అభిప్రాయంపై ప్రధాని స్పందిస్తూ... ‘‘లోపం లేకుండా ఏ వ్యవస్థా ఉండదు. బాండ్ల విషయంలో ఎదురుదెబ్బ తిన్నామని చెప్పేలా మేం ఏం చేశామో చెప్పండి. వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి అనేది బాండ్ల వల్లే తెలుస్తోంది. 2014కి ముందు ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వచ్చాయో ఏ దర్యాప్తు సంస్థలు కూడా చెప్పలేవు.. .. అలాంటిది ఎన్నికల బాండ్ల పథకం ద్వారా విప్లవాత్మక మార్పు కోసం మేం ముందడుగు వేశాం. ఈ వ్యవహారంలో ఇప్పుడు గంతులేస్తూ గర్వపడుతున్నవారు(ఇండియా కూటమిని ఉద్దేశించి..) తర్వాత పశ్చాత్తాపపడతారు. నేను చేసే ప్రతి పనిలో రాజకీయాలను చూడకూడదు. నేను దేశం కోసం పనిచేస్తాను. ఓట్లే ప్రామాణికమైతే ఈశాన్య రాష్ట్రాలకు అన్ని పనులు చేసి ఉండకూడదు కదా. ఇతర ప్రధానులంతా కలిసి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లారో నేనొక్కడినే అంతకంటే ఎక్కువసార్లు వెళ్లాను.. .. నేను రాజకీయ నాయకుడినైనంత మాత్రాన ఎన్నికల్లో గెలుపుకోసమే పనిచేయాలనేం లేదు. తమిళనాడులో మాకు లభించే ఓట్లు డీఎంకేకు వ్యతిరేకమైనవి కాదు.. అవి బీజేపీకి అనుకూలమైనవి. తమిళ ఓటర్లు ఈసారి మాకు పట్టం కడతారు’’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. .. తమిళనాడులో అపారమైన సామర్థ్యం ఉంది, దానిని వృధా చేయకూడదు. వికసిత్ భారత్ అంటే దేశంలోని ప్రతి మూల అభివృద్ధి చెందాలి. తమిళనాడు కూడా ఇందుకు ఓ కేంద్రంగా మారుతుందని నేను భావిస్తున్నా. ఇక్కడి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అద్భుతంగా పని చేస్తున్నారు’’ అని ప్రధాని మోదీ కితాబిచ్చారు. అలాగే.. తమిళ భాషపై జరిగిన రాజకీయాలపై స్పందిస్తూ.. దాని వల్ల తమిళనాడుకే కాకుండా దేశానికి కూడా నష్టం వాటిల్లిందన్నారు. -
బాండ్లను డ్రాప్ బాక్స్‌లో పడేశారు..
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా వందల కోట్ల విరాళాలను అందుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ దాతలు ఎవరో తెలీయదని చెప్పొకొచి్చంది. ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టులను సంపాదించిన కంపెనీలే ఆయా అధికార పారీ్టలకు వందల కోట్ల ముడుపులను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ముట్టజెప్పాయన్న ఆరోపణల నడుమ తృణమూల్ కాంగ్రెస్ స్పందించడం విశేషం. టీఎంసీకొచి్చన బాండ్లపై పశ్చిమబెంగాల్లో సోమవారం ఒక పత్రికా సమావేశంలో ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ మాట్లాడారు. ‘‘ మా పారీ్టకి ఎవరు విరాళంగా ఇచ్చారో మాకు తెలీదు. ఎంత పెద్ద మొత్తాలను ఇచ్చిందీ తెలీదు. అసలు ఈ బాండ్ల పథకాన్ని తెచి్చందే బీజేపీ. రాజకీయ పారీ్టలకు నిర్వహణ వ్యయాలను ప్రభుత్వాలే భరించాలని 1990దశకం నుంచీ మమతా బెనర్జీ మొత్తుకుంటూనే ఉన్నారు. వేలకోట్ల నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట పడాలని ఆమె కాంక్షించారు. అయినా సరే ఎవరిమాటా వినకుండా బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తెచి్చంది. వేరే దారి లేక మేమూ ఆ పథకం నిబంధనలను పాటించాం. మాకు ఎన్ని బాండ్లు ఇచ్చారో, ఎవరిచ్చారో తెలీదు. సాధారణంగా పార్టీ ఆఫీస్ బయట ఒక డ్రాప్‌బాక్స్ ఉంటుంది. అందులోనే ఈ బాండ్లు ఎవరో పెట్టి వెళ్లారు. ఆ బాండ్లపై దాతల పేర్లు ఉండవు. కేవలం ఆల్ఫా–న్యూమరిక్ నంబర్ ఉంటుంది. దాత పేరు, వివరాలు బీజేపీకైతే తెలుస్తాయి. ఎందుకంటే వాళ్లే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సీబీఐ, ఈడీని తమ చెప్పుచేతల్లో ఉంచుకుని వాటి ద్వారా బెదిరించి మరీ విరాళాల వసూళ్ల పర్వాన్ని బీజేపీ యథేచ్ఛగా కొనసాగింది. బాండ్ల ద్వారా మేం అందుకున్న మొత్తాలను టీఎంసీ అధికారిక బ్యాంక్ ఖాతాల్లోనే జమచేశాం’’ అని కునాల్ ఘోష్ చెప్పారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎలక్టోరల్ బాండ్ల గణాంకాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్‌కు 10 మంది అతిపెద్ద విరాళాల దాతల నుంచే ఏకంగా రూ.1,198 కోట్లు వచ్చాయి. ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ సంస్థ ఒక్కటే టీఎంసీకి రూ.542 కోట్లు విరాళంగా ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచించిన కాలపరిమితిలో ఎస్బీఐ నుంచి దాదాపు 1,300 సంస్థలు/వ్యక్తులు రూ.12,000 కోట్లకుపైగా విలువైన బాండ్లను కొనుగోలుచేసి 23 రాజకీయపారీ్టలకు తమకు నచి్చన మొత్తాలను విడివిడిగా విరాళంగా ఇవ్వడం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ బాండ్ల వివరాలన్నింటినీ ఎన్నికల సంఘానికి అందజేసింది. -
బాండ్లు కాదు.. బీజేపీ బలవంతపు వసూళ్లు: అఖిలేశ్
కనౌజ్(యూపీ): ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్రంలోని అధికార బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మరోసారి విరచుకుపడ్డారు. బీజేపీ బాండ్ల రూపంలో బలవంతంగా డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. చందాల ముసుగులో వసూళ్ల దందాకు తెరతీసిందని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. బలవంతపు వసూళ్ల కోసం సీబీఐ, ఈడీ ఐటీ వంటి సంస్థలను బీజేపీ విచ్చలవిడిగా వాడుకుందని మండిపడ్డారు. కొందరు కాంట్రాక్టర్లపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ నుంచి ఒత్తిళ్లు పెరిగినప్పుడల్లా బీజేపీ ఖాతాలోకి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్లతో ఇప్పు డు బీజేపీ ప్రతిష్ట మసకబారిందని పేర్కొన్నారు. భిన్నమైన పార్టీ అని చెప్పుకొనే బీజేపీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించారని అఖిలేశ్ ఆక్షేపించారు. -
స్కిల్ కేసులో ఎన్నికల బాండ్లు కీలకం కానున్నాయా ?
-
బీజేపీ ఖాతాలోకే మద్యం ముడుపులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం తాలూకు ముడుపులు ఎన్నికల బాండ్ల రూపంలో మద్యం వ్యాపారుల నుంచి నేరుగా బీజేపీకే అందాయని ఆప్ నేతలు, ఢిల్లీ మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదంతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈడీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా ఆప్ నేతల నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ రూపాయి కూడా రికవరీ కాలేదు. మద్యం దుకాణాలు దక్కించుకున్న శరత్చంద్ర రెడ్డి వాగ్మూలం ఆధారంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. కేజ్రీవాల్‌ను తానెన్నడూ కలవలేదని, మాట్లాడలేదని, ఆప్‌తో ఏ సంబంధమూ లేదని విచారణలో చెప్పిన మర్నాడే శరత్‌ను ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌ను కలిసి మద్యం కుంభకోణంపై మాట్లాడానంటూ మాట మార్చగానే బెయిల్ పొందారు!’’ అని ఆరోపించారు. ‘‘శరత్ కంపెనీల ద్వారా బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.4.5 కోట్లు అందాయి. అరెస్టు అనంతరం బీజేపీకి ఆయన ఏకంగా మరో రూ.55 కోట్ల ఎన్నికల బాండ్లు ఇచ్చారు’’ అంటూ సంబంధిత వివరాలను మీడియాకు చూపించారు. -
Nitin Gadkari: విరాళాల్లేకుండా పార్టీలు మనలేవు
అహ్మదాబాద్: ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేశాక ఈ పథకంపై ప్రజాక్షేత్రంలో చర్చోపచర్చలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన మనసులో మాట చెప్పారు. ‘‘ అసలు విరాళాలు తీసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. సదుద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల పథకం తెచ్చాం. పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేయకుండా అందులోని లోటుపాట్లను సరిచేయాలని సూచనలు చేస్తే బాగుండేది. సూచనల మేరకు అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూర్చుని చర్చించుకునే అవకాశం దొరికేది. ఏకాభిప్రాయంతో సవరణలు చేసేవాళ్లం’ అని అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌లోని ‘గిఫ్ట్ సిటీ’లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. ‘గతంలో అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఇలాంటి పథకం ఒకటి ఉంటే మంచిదని చర్చ జరిగినప్పుడు నేను అందులో పాల్గొన్నా. వనరులు లేకుండా రాజకీయ పార్టీల మనుగడ అసాధ్యం. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే పార్టీలకు నిర్వహణ నిధులిస్తాయి. భారత్‌లో అలాంటి పద్ధతి లేదు. అందుకే పార్టీలకు ఆర్థిక అండగా నిలబడే ఇలాంటి పథకాలను రూపొందించుకున్నాం. నేరుగా పార్టీలకు విరాళాలు చేరేలా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. విరాళాల అందజేతకు ముందు, తర్వాత అధికారంలో ఉన్న పార్టీ మారిపోతే దాతలకు సమస్యలు వస్తాయి. అందుకే దాతల వివరాలు రహస్యంగా ఉండేలా పథకంలో నిబంధనలు పెట్టాం. ఏదైనా మీడియా సంస్థ తన ఒక కార్యక్రమానికి నిధులు అవసరమైతే స్పాన్సర్‌ను చూసుకుంటుంది. పార్టీ నిర్వహణ, కార్యకలాపాలకు నిధులు అవసరమే కదా’ అని గడ్కరీ ఉదహరించారు. ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే పార్టీలకు విరాళాలు పారదర్శకంగా వచ్చేలా చూశామన్నారు. -
బీజేపీ ఖాతాల్లోకే ‘లిక్కర్’ సొమ్ము: ‘ఆప్’ మంత్రులు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండేళ్లుగా వెతుకుతున్న కోట్ల రూపాయల సొమ్ము ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీ ఖాతాకే చేరిందని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) విమర్శించింది. ఈ మేరకు శనివారం(మార్చ్ 23)ఉదయం ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ‘రెండేళ్ల విచారణ తర్వాత కూడా స్కామ్‌లో డబ్బులెక్కడికి పోయాయనే ప్రశ్న మళ్లీ మళ్లీ తలెత్తుతోంది. ఇంత వరకు ఆప్ నేతల నుంచి స్కామ్‌కు సంబంధించి ఒక్క రూపాయిని కూడా రికవర్ చేయలేకపోయారు. లిక్కర్ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డిని గతంలో విచారించినపుడు కేజ్రీవాల్‌ను తాను ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని ఆయన చెప్పారు. అలా చెప్పిన మరుసటి రోజే శరత్‌చంద్రారెడ్డిని అరెస్టు చేశారు. అరెస్టయిన తర్వాత ఆయన స్టేట్మెంట్ మారిపోయింది. కేజ్రీవాల్‌ను కలిసి డబ్బులిచ్చాను అని చెప్పగానే శరత్‌చంద్రారెడ్డికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఆధారంగానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశామని ఈడీ చెబుతోంది’అని మంత్రులు మండిపడ్డారు. ఇదీ చదవండి.. 26న ఆప్ ప్రధాని ఇంటిని ముట్టడి -
ఎన్నికల బాండ్లలోనూ తిరకాసే!
ఎన్నికల బాండ్ల విషయంలో ఎల్లో మీడియా ఏడుపులు మాములుగా లేవు. అయితే.. ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపేణా భారీగానే డబ్బును మూటగట్టుకుంది. ఇక గుర్తింపులేని జనసేన కూడా ఈ విషయంలో ఏం తక్కువ తినలేదు. గురువారం సుప్రీంకోర్టుకు ఎస్బీఐ అందించిన ఎన్నికల బాండ్ల నంబర్ల ద్వారా ఏయే పార్టీకి ఎంత విరాళం అందిందో స్పష్టంగా వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి 2019 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ దాకా రూ.80 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలుగా వచ్చాయి. అయితే సరిగ్గా ఎన్నికల ముందర సీన్ మారింది. కేవలం అక్టోబర్ 2023 నుంచి ఫిబ్రవరి మధ్యలోనే రూ. 130 కోట్లను విరాళంగా టీడీపీ స్వీకరించింది. మొత్తంగా టీడీపీకి ఎన్నికల బాండ్ల రూపేణా వచ్చిన రూ. 212 కోట్లలో 55 శాతం ఫండింగ్.. అంటే సుమారు రూ. 118 కోట్లు కేవలం ఒక్క జనవరిలోనే అందడం గమనార్హం. టీడీపీకి ఎన్నికల బాండ్లు విరాళాలుగా సమర్పించిన వాళ్లలో.. షిరిడీ సాయి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూ.40 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ రూ.28 కోట్లతో రెండోస్థానంలో నిలిచాయి. యూపీ పవర్‌ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.20 కోట్లు, నాక్టో ఫార్మా లిమిటెడ్ రూ.14 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ రూ.13 కోట్లు.. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల లిమిటెడ్ రూ.10 కోట్లు ఎన్నికల బాండ్లు టీడీపీకి విరాళంగా ఇచ్చిన వాళ్లలో ఉన్నారు. ప్రముఖ విద్యాసంస్థ అయిన శ్రీ చైతన్య స్టూడెంట్‌ఫెసిలిటీ మేనేజ్మెంట్ తరఫున రూ. 5 కోట్లు ఇచ్చింది. ఇక జనసేన సంగతి భిన్నంగా ఉంది. సాధారణంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు వచ్చిన దాఖలాలు లేవు. అయితే.. బీజేపీ, టీడీపీ కూటమి భాగస్వామి, జనసేన మాత్రం ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించింది. పవన్ కల్యాణ్ పార్టీకే కాదు.. 2019-21 మధ్య గుర్తింపు లేని ఏ ఒక్క పార్టీకి కూడా విరాళాలు రాలేదు. కానీ, 2022 జనసేనకు రూ.22 కోట్లు, 2023లో మరో రెండు కోట్లు, 2024లో ఏకంగా 17 కోట్ల రూపాయలు.. మొత్తంగా 21 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయి. కొత్త పార్టీలు లేదంటే మునుపటి ఎన్నికల్లో తగినన్ని ఓట్లను సంపాదించని రాజకీయ పార్టీలను గుర్తింపు లేని పార్టీలుగా ఈసీ ప్రకటిస్తుంది. తద్వారా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్న గుర్తింపు లేని పార్టీగా జనసేన నిలవడం కొసమెరుపు. -
ఎన్నికల బాండ్లు.. వ్యక్తుల విరాళాల్లోనూ బీజేపీనే టాప్ !
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దశల వారిగా వెల్లడిస్తున్న ఎన్నికల బాండ్ల వివరాల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్బీఐ తాజాగా బాండ్ల నంబర్ల వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందజేసింది. ఈ వివరాలు అందిన వెంటనే ఈసీ వాటిని గురువారం తన వెబ్సైట్లో ఉంచింది. ఈ వివరాల ద్వారా ఆయా వ్యక్తులు, సంస్థలు ఏ పార్టీకి విరాళమిచ్చారనేది స్పష్టంగా తేలిపోయింది. వీటిలో సంస్థలు కాకుండా వ్యాపార రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు తమ వ్యక్తిగత హోదాలో ఇచ్చిన మొత్తం విరాళాలు రూ. 180.2 కోట్లు. ఏప్రిల్ 12,2019 నుంచి జనవరి11,2024 వరకు ఇచ్చిన ఈ విరాళాల్లో సింహభాగం 84.5 శాతం బీజేపీకే వెళ్లడం గమనార్హం. వ్యక్తిగత విరాళాల్లో రూ.152.2 కోట్లతో బీజేపీ మొదటిస్థానంలో, రూ.16.5 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్ రెండవ స్థానం, రూ.5 కోట్లతో ఈ జాబితాలో భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) మూడవ స్థానంలో నిలిచాయి. వ్యక్తిగతంగా బీజేపీకి రూ.35 కోట్ల విరాళమిచ్చి దాతల జాబితాల్లో ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ తొలి స్థానంలో నిలిచారు. రూ.25 కోట్ల విరాళంతో రిలయన్స్ టాప్‌ర్యాంకు ఉద్యోగి లక్ష్మీదాస్ వల్లభ్‌దాస్ మర్చంట్ రెండవ స్థానంలో నిలిచారు. కాగా, కార్పొరేట్ సంస్ణలు ఎన్నికల బాండ్ల ద్వారా ఇచ్చిన విరాళాల్లోనూ అత్యధికం బీజేపీకే వెళ్లిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. విరాళాల సమస్త వివరాలు బహిర్గతం -
Lok sabha elections 2024: విరాళాల సమస్త వివరాలు బహిర్గతం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) నుంచి ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నీ వాటి నంబర్లతో సహా పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘానికి చేరాయి. దీంతో ఆ సమస్త వివరాలను ఈసీ వెంటనే తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లతోసహా దాతలు, వాటిని అందుకున్న గ్రహీతల(రాజకీయ పార్టీలు) జాబితాను విడివిడిగా ఈసీ పొందుపరిచింది. ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లను బట్టి ఏ ఎలక్టోరల్ బాండ్ మొత్తాన్ని ఈ రాజకీయ పార్టీ విరాళంగా పొందిందో సులభంగా తెల్సుకోవచ్చు. సుప్రీంకోర్టు గత ఆదేశాల సమయంలో ఈ ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లు లేకుండానే బాండ్లు, వాటి గ్రహీతల జాబితాను ఈసీకి ఎస్బీఐ ఇచ్చింది. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తంచేసింది. సమస్త వివరాలను ఈసీకి ఇవ్వాలని ఆదేశించడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఎస్బీఐ గురువారం ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లతో కూడిన పూర్తి వివరాలను ఈసీకి అందజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. రిలయన్స్ సంబంధ సంస్థ నుంచి బీజేపీకి రూ.395 కోట్లు ఈసీ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సంబంధం ఉన్న క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బీజేపీకి రూ.395 కోట్ల విరాళాలు ఇచ్చింది. 2022లో శివసేన పార్టీకి రూ.25 కోట్ల విరాళాలు అందజేసింది. 2021–22, 2023–24కాలంలో బాండ్లు కొని విరాళంగా ఇచి్చన మూడో అతిపెద్ద దాతగా క్విక్ సప్లై చైన్ నిలిచింది. ఈకాలంలో ఈ సంస్థ రూ.410 కోట్ల బాండ్లను కొనుగోలుచేసింది. అత్యధికంగా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ రూ.1,368 కోట్ల బాండ్లను కొనుగోలుచేయడం తెల్సిందే. ఈ సంస్థ 2022 అక్టోబర్ వరకు మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీపార్టీకి రూ.540 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ సంస్థ నుంచి అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా టీఎంసీ నిలిచింది. ఫ్యూచర్ గేమింగ్ అండ్‌హోటల్ సర్వీసెస్ నుంచి బీజేపీ రూ.100 కోట్ల విరాళాలు పొందింది. ఈ సంస్థ కాంగ్రెస్‌కు రూ.50 కోట్ల విరాళం ఇచ్చింది. సిక్కిం క్రాంతికారీ మోర్చా సైతం ఈ సంస్థ నుంచి విరాళాలు స్వీకరించింది. తమిళనాడులోని డీఎంకేకు ఈ సంస్థ ఏకంగా రూ.509 కోట్ల విరాళాలు ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సంబంధం ఉన్న హానీవెల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సైతం రూ.30 కోట్ల బాండ్లను కొని మొత్తం బీజేపీకే విరాళంగా ఇచ్చింది. ఈసీకి ఇచ్చేశాం: ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నీ వాటి నంబర్లతో సహా ఎన్నికల సంఘానికి అందజేశామని ఎస్బీ ఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ దినేశ్‌కుమార్ ఖరా గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దాతలు ఇచ్చిన బాండ్లను నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల బ్యాంక్ ఖాతాల నెంబర్లు, కేవైసీ వివరాలను బయటపెట్టడం లేదని వెల్లడించారు. -
Lok sabha elections 2024: పార్టీని ఆర్థికంగా చిదిమేసే కుట్ర
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ సభలు, ర్యాలీలు, అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమాలకు ఎంతో ధనం అవసరమైన వేళ ప్రధాని మోదీ వ్యవస్థీకృతంగా కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా చిదిమేసేందుకు బరితెగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఢిల్లీలో పత్రికా సమావేశంలో సోనియా, పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీలు మాట్లాడారు. పార్టీలో ముగ్గురు అగ్రనేతలు ఒకేసారి మీడియాతో మాట్లాడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ప్రచారఖర్చులు, ప్రకటనలకు భారీ మొత్తంలో నగదు అవసరమైన వేళ తమ బ్యాంక్ ఖాతాలను అదునుచూసి స్తంభింపజేయడాన్ని నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ‘కాంగ్రెస్‌కు ప్రజలిచి్చన నగదు విరాళాలను బలవంతంగా లాగేసుకున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఓవైపు ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం, మరోవైపు ఖాతాల స్తంభనతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు. ఇవి నిజంగా అనూహ్యమైన తీవ్ర అవరోధాలు. ఇలా అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మా శక్తిమేరకు అద్భుతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నది సుస్పష్టం. ప్రధాన ప్రతిపక్షం ఆర్థికమూలాలపై దాడి చేశారు’ అని సోనియా ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఫ్రీజ్ చేస్తేనే ఆరోగ్యకర పోటీ సాధ్యం: ఖర్గే ‘డీఫ్రీజ్ చేయడమే ఎన్నికల్లో ఆరోగ్యకర పోటీకి బాటలుపరుస్తుంది. సాధారణ ప్రజానీకం కాంగ్రెస్‌కు విరాళంగా ఇచి్చన మొత్తాలను ఫ్రీజ్ చేసి, ఐటీ శాఖతో బలవంతంగా రూ.115.32 కోట్లు నగదు విత్‌డ్రా చేయించి మమ్మల్ని బీజేపీ లూటీ చేసింది. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన ఎన్నికలు అత్యావశ్యకమైన ఈ తరుణంలో రాజ్యాంగబద్ధ సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను డీఫ్రీజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని ఖర్గే కోరారు. ‘బీజేపీ అధికారంలో ఉంది. పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ తమ ఖాతాలను వేల కోట్ల రూపాయలతో నింపేసుకుంది. ఎన్నికల్లో దీటైన పోటీకి వీలు లేకుండా మా పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. అధికారంలో ఉన్న వారు ప్రత్యక్షంగాగానీ పరోక్షంగానీ రాజ్యాంగబద్ధ సంస్థలపై నియంత్రణ కల్గి ఉండొద్దు. వనరులపై గుత్తాధిపత్య ధోరణి అస్సలు మంచిది కాదు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి: రాహుల్ ‘ప్రధాన ప్రతిపక్షం అన్ని అకౌంట్లను ఫ్రీజ్చేయడం అంటే అది కాంగ్రెస్‌పై మాత్రమే ప్రభావం చూపదు దేశ ప్రజాస్వామ్యానికీ అది విఘాతమే. ఎన్నికల్లో పోటీచేసే సామర్థ్యాన్ని దెబ్బతీశారు. మేం ప్రచార కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం. ఫ్రీజ్ చేసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరపూరిత చర్యకు పాల్పడ్డారు. ఇలాంటి చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం అబద్ధమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలేవీ ఇక్కడ పని చేయట్లేవు’ అని రాహుల్ అన్నారు. ‘ఖాతాల స్తంభనతో కరెన్సీ కష్టాలు విపరీతంగా పెరిగాయి. మా నేతలు, అభ్యర్థులు విమానాల్లో దేశంలోని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లలేని పరిస్థితి. విమానం సంగతి పక్కనబెట్టండి. కనీసం రైలు టికెట్ కొనేందుకు కూడా కష్టపడుతున్నాం. 20 శాతం ఓటుబ్యాంక్ మాకున్నా రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి. అదునుచూసి ఎన్నికలకు రెండు నెలల ముందు మోదీ పన్నిన కుట్ర ఇది. ఇంత జరుగుతున్నా ఈసీ మౌనంవహించడం విచారకరం. ఈ విషయంలో ఈసీ ఇంతవరకు స్పందించలేదు’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఓటమి ఖాయం కావడంతో కావాలనే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తోందని బీజేపీ ప్రతివిమర్శ చేసింది. అసుర శక్తిపైనే పోరాటం: రాహుల్ విద్వేషం నిండిన ఆసుర(రాక్షస) శక్తిపై తమ పార్టీ పోరాటం సాగిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ‘శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం’ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్వేషం నిండిన అసుర శక్తిపైనే తమ పోరాటం అని రాహుల్ గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పష్టం చేశారు. అసుర శక్తిని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. -
ఎన్నికల బాండ్ల పూర్తి డేటాను వెల్లడించిన ఈసీ
ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తన అధికార వెబ్సైట్ (https://www.eci.gov.in/)లో పొందుపర్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన.. న్యూమరికల్ నంబర్లతో కూడిన బాండ్ల పూర్తి డేటాను ఈసీ గురువారం వెబ్సైట్ అప్లోడ్ చేసింది. ఈ డేటాలో ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంత ఫండ్స్ ఇచ్చాయి? బాండ్ల సీరియల్ నంబర్లు ఇందులో ఉన్నాయి. దాతల విక్రయ వివరాలు, నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలను వేర్వేరు డాక్యుమెంట్లలో పొదుపరిచింది. ఇవాళ ఎస్బీఐ.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ సమర్పించిన డేటాలో.. ఎలక్టోరల్ బాండ్లు కొన్నవారి పేర్లు. బాండ్ల నంబర్లు. బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల పేర్లు. రాజకీయ పార్టీ బ్యాంక్ ఖాతా నంబర్లో చివరి నాలుగు అంకెలు. ఏ పార్టీ ఎన్ని బాండ్లను నగదు రూపంలో మార్చుకున్న పూర్తి వివరాలు ఉన్నాయి. ఇక..‘బ్యాంక్ అకౌంట్ల భద్రత (సైబర్ సెక్యూరిటీ) విషయంలో రాజకీయ పార్టీల పూర్తి బ్యాంక్ ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బహిర్గతం చేయటంలేదు. ఎన్నికల బాండ్ల కొనుగోలుదారుల కేవైసీ వివరాలను సైతం భద్రతా కారణాల రీత్యా వెల్లడించటం సాధ్యం కాదు. అయితే రాజకీయ పార్టీలను గుర్తించేందుకు ఆ వివారాలు అవసరం లేదు’ అని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో ఎస్బీఐ పేర్కొంది. -
ఈసీ చేతికి ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారం
ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. న్యూమరికల్ నంబర్లతో కూడిన ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలను ఎస్బీఐ గురవారం ఈసీకి అందించింది. మార్చి 18న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి న్యూమరికల్ నంబర్లతో పూర్తి వివరాలను వెల్లడించాలని ఎల్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే రెండు సార్లు బాండ్ల వివరాలను ఈసీకి పంపిన ఎస్బీఐ.. న్యూమరికల్ నంబర్లతో కూడిన బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఎస్బీఐ ఎన్నికల సంఘానికి సమర్పించిన బాండ్ల పూర్తి వివరాల్లో.. ఎలక్టోరల్ బాండ్లు కొన్నవారి పేర్లు. బాండ్ల నంబర్లు. బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల పేర్లు. రాజకీయ పార్టీ బ్యాంక్ ఖాతా నంబర్లో చివరి నాలుగు అంకెలు. ఏ పార్టీ ఎన్ని బాండ్లను నగదు రూపంలో మార్చుకున్న పూర్తి వివరాలు ఉన్నాయి. ఇక..‘బ్యాంక్ అకౌంట్ల భద్రత (సైబర్ సెక్యూరిటీ) విషయంలో రాజకీయ పార్టీల పూర్తి బ్యాంక్ ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బహిర్గతం చేయటంలేదు. ఎన్నికల బాండ్ల కొనుగోలుదారుల కేవైసీ వివరాలను సైతం భద్రతా కారణాల రీత్యా వెల్లడించటం సాధ్యం కాదు. అయితే రాజకీయ పార్టీలను గుర్తించేందుకు ఆ వివారాలు అవసరం లేదు’ అని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో ఎస్బీఐ పేర్కొంది. అదేవిధంగా ఎస్బీఐ పూర్తి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అందించిన అనంతరం ఈసీ తన అధికారిక వెబ్సైట్ ఈ వివరాలను పొందుపర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. చదవండి: ‘ఫ్యాక్ట్ చెక్ యూనిట్’ నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే -
ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి?
-
ఎన్నికల బాండ్లు.. ఇన్ఫోసిస్ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందంటే..
ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇన్ఫ్రా, ఫార్మా కంపెనీలతోపాటు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వాటిలో ఐటీ కంపెనీలు ఉండడం విశేషం. తాజాగా ఎస్బీఐ విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాల ప్రకారం.. ఐటీ రంగంలో సియెంట్ కంపెనీ గరిష్ఠంగా రూ.10 కోట్లు విలువ చేసే బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఆ కంపెనీ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందో తెలియరాలేదు. తదుపరి స్థానంలో జెన్సర్ టెక్నాలజీస్ మే 2019లో రూ.3 కోట్లు విలువచేసే వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మూడో స్థానంలో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ 2018 కర్ణాటక ఎన్నికల ముందు దేవెగౌడకు చెందిన జనతాదళ్(సెక్యూలర్) పార్టీకి రూ.1 కోటి విరాళం ఇచ్చినట్లు తెలిసింది. రాజకీయ పార్టీలకు కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఎస్బీఐ ఇటీవల వివరాలు వెల్లడించింది. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులుండవు.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం కంపెనీల వారీగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వివరాలు.. ఫ్యుచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ రూ.1,368 కోట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ.966 కోట్లు క్విక్ సప్లైచెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.410 కోట్లు వేదాంత లిమిటెడ్ రూ.400 కోట్లు హల్దియా ఎనర్జీ రూ.377 కోట్లు భారతి గ్రూప్ రూ.247 కోట్లు ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.224 కోట్లు వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్సిమిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ రూ.195 కోట్లు మదన్‌లాల్ లిమిటెడ్ రూ.185 కోట్లు -
బాండ్ల నంబర్లేవి?
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. బాండ్లను కొనుగోలు చేసిన వారు, నిధులందుకున్న పారీ్టల వివరాలను బయట పెట్టే యునిక్ బాండ్ నంబర్లను ఎందుకు వెల్లడించలేదని బ్యాంకును నిలదీసింది. బాండ్ల వివరాలను ఒక్కటొక్కటిగా కాకుండా ఈ నెల 21 సాయంత్రానికల్లా పూర్తిస్థాయిలో ఈసీకి అందజేయాలని ఆదేశించింది. ‘‘యునిక్ బాండ్ నంబర్లతో పాటు బ్యాంకు దగ్గరున్న మొత్తం సమాచారాన్ని వెల్లడి చేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకూ తావులేదు’’ అని కుండబద్దలు కొట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్బీఐ అందజేసిన వివరాలన్నిటినీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. చైర్మన్, ఎండీ అఫిడవిట్ దాఖలు చేయాలి ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగవిరుద్ధమని, దాతలు, గ్రహీతల వివరాలను మార్చి 13వ తేదీ కల్లా వెల్లడించాలని ఎస్బీఐని ఆదేశిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివరాల వెల్లడికి గడువు కోరుతూ ఎస్బీఐ వేసిన పిటిషన్‌ను ఈ నెల 11న న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల అరకొర వివరాలను ఎన్నికల సంఘానికి అందజేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఎస్బీఐని సోమవారం సంజాయిషీ కోరింది. ‘‘21వ తేదీ సాయంత్రానికల్లా పూర్తి వివరాలు ఈసీకివ్వండి. ఎన్నికల బాండ్లకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారమతటినీ ఈసీకి అందించామని, ఇంతకుమించి ఎలాంటి సమాచారమూ లేదని పేర్కొంటూ ఎస్బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అఫిడవిట్ దాఖలు చేయాలి’’ అని స్పష్టం చేసింది. బాండ్ల వివరాలను వెల్లడించరాదన్న తమ పిటిషన్లపై సత్వరం విచారణ జరపాలన్న పరిశ్రమల సంఘాల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచి్చంది. ఎన్నికల బాండ్ల పథకం మొదలైన 2018 మార్చి నుంచి 2019 ఏప్రిల్ దాకా విక్రయించిన బాండ్ల వివరాలను బయట పెట్టాలన్న పిటిషన్‌నూ కొట్టేసింది. బాండ్ల వివరాలను వెల్లడించాలన్న తీర్పుపై సుమోటోగా సమీక్ష జరపాలంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిశ్ సి.అగర్వాలా రాసిన లేఖను కూడా బుట్టదాఖలు చేసింది. ఇవన్నీ ప్రచార స్టంట్లంటూ సీజేఐ మండిపడ్డారు. కామెంట్లకు మేమూ అతీతం కాదు! ఎన్నికల బాండ్ల తీర్పును సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తున్నారని, కేంద్రంపై అభ్యంతరకర కామెంట్లు పెడుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ వాదించారు. ప్రస్తుతం కోర్టులో ఉన్నవారే దీనిపై ఇంటర్వ్యూలిస్తూ కావాలనే సుప్రీంకోర్టుకు కూడా ఇబ్బందికర పరిస్థితి సృష్టిస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలతో సీజేఐ ఏకీభవించలేదు. ‘‘మా తీర్పులను ఎవరెలా వ్యాఖ్యానిస్తున్నారన్న దానితో మాకు సంబంధం లేదు. మా ఆదేశాలు అమలయ్యాయా లేదా అన్నదే మాకు ముఖ్యం. న్యాయమూర్తులుగా మేం రాజ్యాంగబద్ధంగా తీర్పులు వెల్లడిస్తాం. చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటాం. మీడియా, సోషల్ మీడియా కామెంట్లకు మేం కూడా అతీతమేమీ కాదు. కానీ వాటిని తట్టుకునే శక్తి మాకు, న్యాయవ్యవస్థకు ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
‘నాపై అరవొద్దు’.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను మార్చి 21లోగా అందించాలని ఎస్బీఐకు సుప్రీం డెడ్‌లైన్ విధించింది. ఎలక్టోరల్ బాండ్ల కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో నేడు సర్వోన్నత న్యాయస్థానంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటిలో సీనియర్ న్యాయవాది మాథ్యూస్ నెడుంపర, సీజేఐ మధ్య జరిగిన సంభాషణ ఒకటి. ఎలక్టోరల్ బాండ్ల కేసు అసలు న్యాయబద్దమైన సమస్య కాదని, ఇది విధానపరమైన అంశమని న్యాయవాది మాథ్యూస్ నెడుంపర పేర్కొన్నారు. దీనిలో కోర్టులు జోక్యం చేసుకోవడం సరైనది కాదని తెలిపారు. కావున ఈ కేసులో తీర్పుపై పునఃసమీక్ష చేయాలని కోరారు. నెడుంపర మాట్లాడుతుండగానే సీజేఐ మధ్యలో జోక్యం చేసుకొని మాట్లాడారు.. ‘మిస్టర్ నెడుంపర నేను ఈ దేశ పౌరుడిని.’ నాపై అరవొద్దు అంటూ గట్టిగా సమాధానమిచ్చారు. దీనిపై నెడుంపర స్పందిస్తూ.. ‘లేదు, లేదు, నేను చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతున్నాను’ అంటూ బదులిచ్చారు. సీజేఐ చంద్రచూడ్ కల్పించుకొని.. ఇది హైడ్ పార్క్ కార్నర్ మీటింగ్ కాదని అన్నారు. ‘మీరు కోర్టులో ఉన్నాను. మీరు ఒకవేళ పిటిషన్ వేయాలనుకుంటే ఫైల్ చేయండి. నేను చీఫ్ జస్టిస్‌గా నా నిర్ణయం తెలియజేశాను. మీ మాటలు వినాలనుకోవడం లేదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే పిటిషన్ దాఖలు చేయండి. ఇది కోర్టు నియమం. దాని ప్రకారం నడుచుకోండి’ అంటూ చీవాట్లు పెట్టారు. న్యాయవాది నెడుంపర మళ్లీ వాదిస్తుండగా జస్టిస్ బీఆర్ గవాయి జోక్యం చేసుకుని..మీరు న్యాయ నిర్వహణ ప్రక్రియను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ న్యాయవాది వెనక్కి తగ్గలేదు. ఆయన మాట్లాడుతుండగా.. ‘ఇక మీరు ఆపండి.. కోర్టు నియమాలు అనుసరించే వరకు మీ మాటలను మేము వినదల్చుకోలేదు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నెడుంపర స్పందిస్తూ.. తాము పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. చదవండి: కొరడా ఝులిపించిన కేంద్ర ఎన్నికల సంఘం కాగా నెడుంపర గతంలో ఎదుర్కొన్న కోర్టు ధిక్కార చర్యను కూడా ధర్మాసనం గుర్తు చేసింది. 2019లో నెడుంపరా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సమయంలో అతను ఇకపై సుప్రీంకోర్టు లేదా బాంబే హైకోర్టుకు చెందిన ఏ జడ్జిని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయనని హామీ ఇచ్చాడు. దీంతో న్యాయస్థానం అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే ఏడాది పాటు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధించింది. అయితే భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే మాత్రం సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. అదే విధంగా కేసు విచారణలో భాగంగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యకక్షుడు అదిశ్ అగర్వాల్ వాదనలు వినేందుకు కూడా కోర్టు నిరాకరించింది. ఎన్నికల బాండ్ల పథకం రద్దుకు సంబంధించిన తీర్పుపై సుమోటోగా సమీక్ష చేయాలని అదీశ్ అగర్వాల్ కోరడంతో చీఫ్ జస్టిస్ తీవ్రంగా స్పందించారు. ‘మీరు సీనియర్ న్యాయవాది మాత్రమే కాదు ఎస్సీబీఏ అధ్యక్షుడు. నా సుమోటో అధికారాలను ప్రశిస్తూ లేఖ రాశారు. ఇవన్నీ ప్రచారానికి సంబంధించిన అంశాలు.. మేము దీనిలో భాగం కాలేం.. నన్ను ఇంకేమీ మాట్లాడనివ్వద్దు.. ఇది అసహ్యంగా ఉంటుంది’ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎన్నికల బాండ్లు: ఎస్బీఐకి సుప్రీం డెడ్‌లైన్
సాక్షి, ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీం కోర్టు మరోసారి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కన్నెర్ర జేసింది. మార్చి 21 లోపు ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంతెంత నిధులు ఇచ్చిందో ఆల్ఫాన్యూమరిక్ సీరియల్ కోడ్‌తో సహా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. . ఎంపిక చేసిన సంస్థల వివరాలు మాత్రమే కాకుండా.. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారందరి మొత్తం వివరాల్ని బహిర్ఘతం చేయాలని స్పష్టం చేసింది. దీపాటు తమ వద్ద ఉన్న ఎలక్టోరల్ బాండ్ల అన్ని వివరాలను బ్యాంక్ బహిర్గతం చేసిందని, ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని సూచిస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖేరాను అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించింది. ‘‘బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్‌గా ఉండకూడదు. దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలి. దేన్నీ అణచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలను ఇవ్వాలని మేం తీర్పు చెప్పాం. ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యునిక్ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్బీఐ ఈసీకి ఇవ్వాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహాలకు ఇక తావులేదు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా ఎస్బీఐ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. ఎలక్టోరల్ బాండ్ల సీరియల్ కోడ్‌ను సైతం ఎస్బీఐ అందిస్తుందని కోర్టుకు తెలిపారు. ‘మేం ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి మా వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని అందిస్తాం. ఎలాంటి డేటాను ఎస్బీఐ తన వద్ద ఉంచుకోదు’ అని సాల్వే చెప్పారు. -
నల్లధనంపై నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయడం వల్ల నల్లధనానికి ద్వారాలు తెరుచుకున్నట్లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓ నేషనల్ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల అవసరం రాజకీయ పార్టీలకు ఎంత అవసరమో గుర్తు చేశారు. ‘రాజకీయ పార్టీలు నిధుల్ని సేకరించేందుకు అందుబాటులోకి తెచ్చిందే ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకం. భారత ఆర్థిక వ్యవస్థను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి’ అని గడ్కరీ అన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు నిర్ణయంపై తాను వ్యాఖ్యానించబోనన్న గడ్కరీ.. నిషేధంలోని లోపాల్ని ఎత్తి చూపారు. ఎలక్టోరల్ బాండ్లను నిషేధిస్తే నల్లధనం రూపంలోనే డబ్బు చేతులు మారుతుందని చెప్పారు. ‘ఎలక్టోరల్ బాండ్లను సంపన్నులు కొనుగోలు చేస్తారు. ఆ సంపన్నులు కాంట్రాక్టర్లు అవుతారు. వ్యాపారం లేదా పరిశ్రమల వృద్ది కోసం ఉపయోగిస్తారు. కాబట్టి దానికి (క్విడ్ ప్రోకో) లింక్ చేయడం సరికాదు అని సూచించారు. -
బాండ్లతో బీజేపీకి రూ.6,986 కోట్లు
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో అధికార బీజేపీ అత్యధికంగా లబ్ధి పొందినట్లు వెల్లడయ్యింది. కమలం పార్టికి ఈ బాండ్ల ద్వారా ఏకంగా రూ.6,986.5 కోట్లు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఎన్నికలబాండ్లపై పార్టిలు గత నవంబర్‌లో ఇచి్చన సమాచారాన్ని ఆదివారం తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచి్చంది. పశి్చమ బెంగాల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.1,397 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1,334 కోట్లు, భారత రాష్ట్ర సమితికి రూ.1,322 కోట్లు, బిజూ జనతాదళ్‌కు రూ.944.5 కోట్లు, డీఎంకేకు రూ.656.5 కోట్లు బాండ్ల రూపంలో అందినట్లు ఈసీ డేటాను బట్టి తెలుస్తోంది. బాండ్ల కొనుగోలుదార్లలో ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ సంస్థ అధినేత, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ అగ్రస్థానంలో నిలిచాడు. రూ.1,368 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాడు. ఇందులో 37 శాతానికిపైగా, అంటే రూ.509 కోట్లను డీఎంకేకు అందజేశాడు. డీఎంకేకు మేఘా ఇంజనీరింగ్ రూ.105 కోట్లు, ఇండియా సిమెంట్స్ రూ.14 కోట్లు, సన్ టీవీ నెట్వర్క్ రూ.100 కోట్లు సమరి్పంచుకున్నాయి. అన్నాడీఎంకేకు ఇండియా సిమెంట్స్ యాజమాన్యంలోని ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్; జేడీ(ఎస్)కు ఆదిత్య బిర్లా గ్రూప్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, మేఘా ఇంజనీరింగ్, ఎంబసీ గ్రూప్; ఆప్‌కు బజాజ్, కేఎంజెడ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్‌జేకే, బీజీ షిర్కే, టొరెంట్ ఫార్మా; జేడీ(యూ)కు భారతీ ఎయిర్టెల్, శ్రీ సిమెంట్స్; ఎన్సీపీకి నియోటియా ఫౌండేషన్, భారతీ ఎయిర్టెల్, సైరస్పూనావాలా, బజాజ్ ఫిన్సర్వ్, ఒబెరాయ్ రియాల్టీ తదితర సంస్థలు విరాళాలిచ్చాయి. బాండ్ల రూపంలో తమకు ఏయే సంస్థ/వ్యక్తుల నుంచి ఎంతెంత విరాళాలు వచ్చాయో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఈసీకి తెలియజేయలేదు. ఏడీఆర్ గణాంకాల ప్రకారం బీజేపీకి మొత్తం 7,700 కోట్ల విరాళాలు అందాయి. బాండ్ల ద్వారా తమకెలాంటి నిధులూ రాలేదని సీపీఎం, బీఎస్పీ, మజ్లిస్ ప్రకటించాయి. ఈసీ డేటా ప్రకారం బాండ్ల ద్వారా అత్యధిక నిధులు అందుకున్న పారీ్టలు పార్టీ నిధులు బీజేపీ రూ.6,986.5 కోట్లు టీఎంసీ రూ.1,397 కోట్లు కాంగ్రెస్ రూ.1,334 కోట్లు బీఆర్ఎస్ రూ.1,322 కోట్లు -
ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు!
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించటానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. ఆ సందర్భంలోనే – భారతీయ స్టేట్ బ్యాంకు ఇంతవరకు తాను కోనుగోలు చేసిన బాండ్ల వివరాలను నిర్ణీత గడువులోపు ఎన్నికల సంఘానికి వెల్లడించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించడంతో బ్యాంకు పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం, కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దాంతో భారతీయ స్టేట్ బ్యాంక్ కొంతమేరకైనా వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. అయితే, ప్రశ్నేమిటంటే... ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బ్యాంకు చేత ఇంతకాలంగా వివరాలు వెల్లడించనివ్వకుండా చేయిస్తున్నది ఎవరు అని! అయితే ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు! నా తొలి బ్యాంకు ఖాతా ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లోని భారతీయ స్టేట్ బ్యాంకు శాఖలో ఉండేది. నా పేరిట నాన్న దానిని తెరిచినప్పుడు నా వయసు 16 ఏళ్లు. మా పూర్వీకుల భూములను విక్రయించటం ద్వారా నా వాటాగా వచ్చిన మొత్తాన్ని జమ చేసేందుకు ఉద్దేశించిన ఖాతా అది. ఆ ఖాతాను ప్రతి నెలా వడ్డీ వచ్చేలా ఫిక్స్డ్ డిపాజిట్‌కు జత కలిపారు. ఆ వడ్డీ పెద్ద మొత్తమేమీ కాదు కానీ, నేనొక డబ్బు గల ఆసామినన్న భావన నాలో కలిగించింది. నాన్న సొంత ఖాతా గ్రిండ్లేస్ బ్యాంకులో ఉండేది. ఆ బ్యాంకు ఇప్పుడు ఉనికిలో లేదు. నాన్న నా కోసం ఆ రోజు ఎస్.బి.ఐ. బ్యాంకును ఎందుకు ఎంచుకున్నారో నాకు గుర్తులేదు కానీ, ఆ సంస్థ పట్ల ఆయన ఉన్నతమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారని అనుకుంటాను. డెబ్బయ్‌లలో బ్యాంకింగ్ చాలా భిన్నంగా ఉండేది. నగదు లావాదేవీల టెల్లర్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలు ఉండేవి. సొంత చెక్కులకు డబ్బు ఇవ్వడానికి కూడా వారి ఖాతాలను తనిఖీ చేసేవారు. అదంతా కూడా అమిత ప్రయాసతో కూడిన దుర్భరమైన తతంగంలా ఉండేది. ఆ దశలో అకస్మాత్తుగా ఎస్.బి.ఐ. మన ఖాతాలో సరిపడా నిధులు ఉన్నాయా, లేవా అన్నది కూడా నిర్ధారణ చేసుకోకుండానే సెల్ఫ్–చెక్కులను ఒక నిర్ణీత పరిమితి వరకు నగదుగా మార్చుకునే అవకాశం కల్పించిన మొదటి బ్యాంకుగా అవతరించింది. ఆ దెబ్బతో, అరగంట పట్టే పని... నిమిషాల్లో అయిపోవడం మొదలైంది. ఆఖరికి నాగర్వాలా నగదు కుంభకోణం కూడా ఎస్.బి.ఐ. దేదీప్యాన్ని చెక్కుచెదర్చలేక పోయింది. ఎగతాళిగా నవ్వినవారు లేకపోలేదు కానీ, బ్యాంకు నుంచి తమ ఖాతాలను ఉపసంహరించుకున్న వారు చాలా తక్కువ. అలాంటి కుంభకోణాలు ఊహించినవే. అయినా అవి నేరారోపణలు వచ్చేంతగా పరిగణన పొందనివి. ఆ రోజుల్లో మా అమ్మ 50 పైసలు, 1 రూపాయి నాణేలను పొదుపు చేసేవారు. ఒక పాత టప్పర్‌వేర్ బ్రెడ్ బాక్సులో వాటిని ఆమె భద్రంగా దాస్తూ ఉండేవారు. అలా కూడబెట్టిన ఆ అపురూపమైన నాణేలను ఎస్.బి.ఐ.కి తీసుకెళ్లి ఆమె ఖాతాలో జమ చేసి రావడం అనే బాధ్యత నాపై పడుతుండేది. కౌంటర్లో ఉండే టెల్లర్ ఆ నాణేలను తూకం వేసి చూసి, మా అమ్మలోని ఇలా పోగేసే గృహిణి నైజాన్ని ప్రశంసించేవారు. ‘‘మేరీ బీవీ భీ యహీ కర్తీ హై’’ (మా ఇంటావిడ కూడా ఇలాగే చేస్తుంటుంది) అనే అతడి మాట నాలోని టీనేజ్ బిడియాన్ని పోగొట్టేది. ఆయన అలా అనేవరకు కూడా నన్ను నేను మురికి నాణేలను సంచిలో మూట కట్టుకుని బ్యాంకుకు వెళ్లే వ్యాపారిలానే భావించుకున్నాను. స్టో లేదా కేంబ్రిడ్జి నుండి సెలవులకు వచ్చినప్పుడు పార్లమెంటు స్ట్రీట్ బ్రాంచి నిరంతరం నాకు పని కల్పించేది. నాకు మాత్రమే కాదు, ఇంట్లో అందరికి! ఎందుకు అని నన్నడక్కండి. అనుకోకుండా ఎందుకో వెళ్లేవాళ్లం. వెళ్లిన ప్రతిసారీ ఇలా వెళ్లి అలా వచ్చేయటం అన్నట్లుగా ఉండకపోయే వాళ్లం. కనుక, ఆ ప్రదేశంపై నాకు మక్కువ ఏర్పడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. తరచుగా ఏం జరిగేదంటే, గ్రౌండ్ ఫ్లోర్లో నా పని పూర్తి అయినప్పుడు పై అంతస్థులకు కూడా వెళ్లి, నా చిన్న మొత్తాల పొదుపుపై సలహాలు అడుగుతుండేవాడిని. 20 ఏళ్ల యువకుడిలోని ఆ అతిక్రమణను ఐదవ అంతస్థులోని మేనేజర్లు గొప్ప సంసిద్ధతతో క్షమించేసేవారు. నా ప్రశ్నల్ని వారు స్వాగతించారని కూడా నాకు గట్టిగా అనిపించేది. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసిన బ్యాంకు ఎప్పుడూ కూడా గత వారం ఎస్.బి.ఐ. వ్యవహరించిన విధంగా అయితే లేదు. సుప్రీంకోర్టు మందలింపుతో బహుశా ఆ బ్యాంకు సిబ్బంది ముడుచుకుపోయి ఉండొచ్చు. మనకున్న అత్యుత్తమ సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒకరైన మదన్ లోకూర్, ‘‘బ్యాంకుకు ఇది చెంపపెట్టు’’ అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తిగా ఆయన పని చేసిన ఇన్నేళ్లలోనూ ఇలా ఒక బ్యాంకు మందలింపునకు గురైన సంఘటనను ఆయన గుర్తు చేసుకోలేదు. గత సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి అడిగిన ఒక ప్రశ్న ఎస్.బి.ఐ.ని నెలల తరబడి, కాదంటే ఏళ్ల తరబడి వేధిస్తుందా అని నా ఆందోళన. ‘‘ఆదేశాలను పాటించటం మీకు కష్టంగా ఉందని మీరు చెబుతున్నారా?’’ అని ఆయన అడిగారు. ‘‘గత 26 రోజులలో మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఆ విషయంలో మీరు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎస్.బి.ఐ. నుంచి ఒక స్థాయి నిజాయితీని మేము ఆశిస్తున్నాం’’ అన్నారు. నా బ్యాంకు ఇంతగా తక్కువ కావటం – ఇప్పటికీ అది నా బ్యాంకులలో ఒకటి కావటం – నాకు బాధను కలిగిస్తోంది. ఎందుకు అలా అనిపిస్తోందని అడక్కండి. బహుశా ఇది అర్ధ శతాబ్దం పాటు సాగిన బాంధవ్య పరిణామం కావచ్చు. లేదా, నాకు అలా అనిపిస్తుండొచ్చు. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇది తప్ప వేరొక వివరణ నాకు తోచటం లేదు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే – సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఎస్.బి.ఐ. ఉద్దేశపూర్వకంగా తనకు అవసరమైన రీతిలో తప్పుగా అన్వయించుకోవటం ద్వారా, కోర్టు ఆదేశించిన ఒక సాధారణమైన పనిని కావాలనే క్లిష్టతరం చేసి, ఆ ఆదేశాన్ని పాటించలేకపోవటానికి తిరిగి ఆ సంక్లిష్టతనే ఒక నెపంగా చూపిందా అన్న అనుమానానికి ఆస్కారం కలగడం. ఒక గౌరవప్రదమైన బ్యాంకు నుంచి మీరు ఇలాంటిది ఊహించలేరు. దీర్ఘకాలంగా మీరు అనుబంధం కలిగి ఉన్న ఒక బ్యాంకు విషయంలో ఇలా జరిగినప్పుడు భ్రమలు తొలిగినట్లుగా అనిపిస్తుంది. ప్రభుత్వమే వెనుక ఉండి ఇలా జరిపించిందా? ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు. అయినప్పటికీ మీలోని లక్షల మందికి, ఆ లక్షల్లో ఎక్కువ మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు. కానీ ఈ ప్రశ్న అడగటం వెనుక ఉన్న వాస్తవం బాధను కలిగిస్తుంది. ఆ బాధ అందరికంటే ఎక్కువగా ఆ బ్యాంకు ఉన్నతాధికారులలో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పార్టీలకు రూ.వేల కోట్లు.. ఎవరీ 'లాటరీ కింగ్'?
'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్కి (Santiago Martin) చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ఎలక్టోరల్ బాండ్ల అగ్ర కొనుగోలుదారుగా ఉద్భవించింది. ఇందులో తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)కు అత్యధికంగా రూ.509 కోట్లు విరాళంగా ఇచ్చింది. రాజకీయ పార్టీలకు అనామక, అపరిమిత విరాళాలను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల విధానంలో డీఎంకే రూ. 656.5 కోట్ల విలువైన బాండ్లను పొందిందని ఎన్నికల కమిషన్ డేటా తాజాగా వెల్లడించింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్ట్ రద్దు చేసింది. ఫ్యూచర్ గేమింగ్ మొత్తం రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అందులో దాదాపు 37 శాతం డీఎంకేకి వెళ్లింది. మేఘా ఇంజినీరింగ్ (రూ. 105 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ. 14 కోట్లు), సన్ టీవీ (రూ. 100 కోట్లు) సంస్థల నుంచి కూడా డీఎంకేకి విరాళాలు ముట్టాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్లపై తాజా డేటాను బహిరంగపరిచింది. అంతకుముందు సీల్డ్ కవర్లలో ఈ డేటాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019కి ముందు కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ తేదీ తర్వాత ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘం గత వారం బహిరంగపరిచింది. డేటా ప్రకారం, 2018లో బాండ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక మొత్తంలో (రూ. 6,986.5 కోట్లు) బాండ్లను స్వీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ రెండవ అతిపెద్ద గ్రహీత (రూ. 1,397 కోట్లు) ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), బీఆర్ఎస్ (రూ. 1,322 కోట్లు), ఒడిశా అధికార పార్టీ బీజేడీ (రూ. 944.5) ఉన్నాయి. ఇక డీఎంకే ఆరో అతిపెద్ద గ్రహీతగా ఉంది. ఎవరీ శాంటియాగో మార్టిన్? శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ 2019 నుంచి 2024 మధ్య రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఎన్నికల సంఘం గురువారం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డేటా ప్రకారం.. తన తరువాతి స్థానంలో ఉన్న దాత కంటే 40 శాతం ఎక్కువగా ఈ సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. మార్టిన్ యుక్తవయసులో లాటరీ టిక్కెట్లను విక్రయిస్తూ లాటరీ-టు-రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మార్టిన్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రకారం.. ఆయన తన కుటుంబ పోషణ కోసం మయన్మార్‌లో యుక్తవయసులో కార్మికుడిగా పనిచేశాడు. 1980ల చివరలో భారతదేశానికి తిరిగి వచ్చి కోయంబత్తూరులో తన వ్యాపార ప్రస్తానాన్ని ప్రారంభించాడు. మార్టిన్ రెండు-అంకెల లాటరీ ఈ ప్రాంతంలో మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఇతర రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న భూటాన్, నేపాల్ దేశాలకు విస్తరించాడు. -
ఎలక్టోరల్ బాండ్ల కొత్త డేటా విడుదల.. ఏ పార్టీకి ఎంత?
ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం రెండో జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సమర్పించిన డేటాను మరోసారి అందుబాటులో ఉంచినట్లు ఆదివారం ఎన్నికల సంఘం వెల్లడించింది. సీల్డ్ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ పార్టీ అత్యధికంగా రూ.6,986.50 కోట్ల విరాళాలను పొందినట్లు తెలిపింది. కేవలం 2019-2020 మధ్య బీజేపీకి రూ.2,555 కోట్ల బాండ్లు అందినట్లు ఈసీ విడుదల చేసిన డేటా వెల్లడిస్తోంది. ఇక.. బీజేపీ పార్టీ తర్వాత అత్యధికంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి రూ.1,397కోట్ల విలువైన బాండ్లను విరాళాలుగా పొందినట్లు తెలిపింది. ఈసీ వెల్లడించిన డేటా ప్రకారం.. ఆయా పార్టీకు వచ్చిన విరాళాలు కాంగ్రెస్ పార్టీ- రూ.1334 కోట్లు బీఆర్ఎస్- రూ. 1322 కోట్లు బిజు జనతాదళ్- రూ.944 కోట్లు డీఎంకే - రూ. 656.5 కోట్లు (ఇందులో రూ. 509 కోట్లు లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ నుంచి వచ్చాయి) వైఎస్సార్సీపీ- రూ.442.8 కోట్లు టీడీపీ- రూ.182. 35 కోట్లు సమాజ్‌వాదీ పార్టీ- రూ. 14.5 కోట్లు అకాలీదళ్- రూ.7.26 కోట్లు ఏఐఏడీఎంకే- రూ.6.05 కోట్లు నేషనల్ కాన్ఫరెన్స్- రూ. 50 లక్షలు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సంఘానికి ఇచ్చిన సమాచారంలో ఎస్బీఐ పూర్తి సమాచారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు ఎందుకు లేవో చెప్పాలని మార్చి 15 నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలు వెల్లడించకపోవటంపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: ఒకే డ్రెస్ ఎన్ని రోజులేసుకుంటాం.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఎలక్టోరల్ బాండ్లు అంతర్జాతీయ రాకెట్: రాహుల్
థానే: బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం ముమ్మాటికీ అంతర్జాతీయ స్థాయి బలవంతపు వసూళ్ల రాకెట్ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయ పారీ్టలను చీల్చడానికి, రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడానికి ఈ పథకాన్ని వాడుకున్నారని మండిపడ్డారు. మహరాష్ట్రలోని జాంభాలీ నాకాలో శనివారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ప్రసంగించారు. మన దేశంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, నిరసన తెలిపినా ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ వంటివి వెంటనే దాడులకు దిగుతున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన పారీ్టలు రెండుగా చీలడానికి కారణం ఏమిటో చెప్పాలని బీజేపీని ప్రశ్నించారు. దేశ జనాభాలో 80 శాతం ఉన్న బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారీ్టలు, పేదలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకకు కేవలం సంపన్న పారిశ్రామికవేత్తలను, సినిమా నటులను మాత్రమే ఆహా్వనించారని, పేదలను పక్కనపెట్టారని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆదివాసీ మహిళ అయినందుకే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహా్వనించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్: జైరాం లోక్‌సభ ఎన్నికల ముందు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా తమపై బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్రైక్‌కు దిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. దాంతో పార్టీ ఆర్థికంగా శక్తిహీనంగా మారిందని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఇప్పుడు తమ వద్ద డబ్బు లేదని అన్నారు. బాండ్ల ముసుగులో బీజేపీ చట్టవిరుద్ధంగా నిధులు కొల్లగొట్టిందని ఆరోపించారు. -
మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన సిద్దరామయ్య
ప్రధానమంత్రి కర్ణాటకలోని కలబురగి నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలో ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమైన ఎలక్టోరల్ బాండ్ స్కామ్ గురించి ఎందుకు మీరు మౌనంగా ఉన్నారని సీఎం సిద్దరామయ్య.. నరేంద్ర మోదీని ప్రశ్నించారు. సిద్ద రామయ్య తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఇలా పేర్కొన్నారు. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెస్తానని, నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని నిర్మూలిస్తానని వాగ్దానం చేసి దశాబ్దకాలం అవుతోంది. అయితే ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ స్కామ్ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఎందుకు వెనుకాడుతుందని సిద్ధరామయ్య ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, పూర్తి సమాచారాన్ని అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎందుకు వెనుకాడుతోంది? ఎలక్టోరల్ బాండ్ల విక్రయం, కొనుగోలు చట్టబద్ధంగా జరిగి ఉంటే.. ఎస్బీఐ సమాచారాన్ని ఎందుకు దాచిపెడుతోంది? ఎస్బీఐపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారు? దీనిపైన నరేంద్ర మోదీ స్పందించాలని కోరారు. వ్యాపారుల నుంచి విరాళాలు రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ వ్యాపారులపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు, వారు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన తేదీలను పరిశీలిస్తే, ఇది స్పష్టమైన బ్లాక్మెయిల్ కేసుగా అనిపిస్తోందని సిద్ధరామయ్య అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన కంపెనీలు అందించే మౌలిక సదుపాయాలు, ఔషధాల నాణ్యతపై కూడా కర్ణాటక సీఎం అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్ వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. Welcome to Karnataka, Prime Minister @narendramodi. Please answer why is @BJP4India silent about the electoral bond scam - the biggest corruption scandal in the world? For a decade, you held power, promising to bring back black money from Swiss Bank, eliminate black money via… — Siddaramaiah (@siddaramaiah) March 16, 2024 -
‘మీ లెక్క తప్పు.. సరిచూసుకోండి’.. ఎన్నికల బాండ్లు.. కిరణ్ మజుందార్‌షా రిప్లై
ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్డు ఇటీవల స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దాంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అందులో చాలా కంపెనీలకు చెందిన యాజమాన్యాలు ఈ బాండ్లను కొనుగోలు చేశాయి. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఎలక్టోరల్ బాండ్‌కు సంబంధించి వివిధ సమాచారం వైరల్‌గా మారుతుంది. తాజాగా కిరణ్ మజుందార్‌షా ప్రాతినిధ్యం వహిస్తున్న బయోకాన్ కంపెనీ తరఫున నెలకు రూ.5 కోట్ల చొప్పున ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు ‘ఎస్.’ అనే ఎక్స్‌ఖాతాలో పోస్ట్‌లు వెలిశాయి. ఈ వ్యవహారం కర్ణాటక ఎన్నికల ముందే జరిగినట్లు అందులో తెలిపారు. వెంటనే దానికి షా ‘అది తప్పు. దయచేసి లెక్కలు సరిచేసుకోండి’ అంటూ బదులిచ్చారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కిరణ్షా రూ.6 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది. ‘ఇది వాస్తవానికి రూ.6 కోట్లు. మీరు ఆ మొత్తాన్ని ఇతర పద్ధతుల ద్వారా చెల్లించారని భావిస్తే, దయచేసి వాటి వివరాలు చెప్పండి’ అని మరో యూజర్ స్పందించారు. దాంతో తాను ఎల్లప్పుడూ పారదర్శకంగా ఉంటానని షా బదులిచ్చారు. మీరు సవరించినట్లు మొత్తం రూ.6కోట్లు బాండ్ల కొనుగోలు చేసినట్లు చెప్పారు. .@kiranshaw donate 5 crore a month before Karnataka elections. pic.twitter.com/Z2JiYfHzbx — S. (@Biryani_) March 14, 2024 బయోకాన్తోపాటు అనేక లిస్టెడ్, అన్‌లిస్టెడ్ హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు బాండ్ల పథకంలో పాల్గొన్నాయి. వీటిలో ప్రముఖ పారాసెటమాల్ బ్రాండ్ డోలో, అరబిందో ఫార్మా, మ్యాన్‌కైండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ హెల్త్‌కేర్, నాట్కో, సన్ ఫార్మా, టోరెంట్ ఫార్మా, పిరమల్ ఫార్మా, సిప్లా, గ్లెన్‌మార్క్, లుపిన్, ఇప్కా, అజంతా ఫార్మా ఉన్నాయి. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో హెటెరో డ్రగ్స్, హెటెరో ల్యాబ్స్, హెటెరో బయోఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, మైక్రో ల్యాబ్స్, యూఎస్వీ, భారత్ బయోటెక్, చిరోన్ బెహ్రింగ్, బయోలాజికల్ ఇ, యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంస్థలు విరాళాలు ఇచ్చాయి. ఇదీ చదవండి: ఫాలోవర్లు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా.. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే ‘కంపెనీల చట్టం’లో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. -
50కి పైగా కంపెనీలు..1600 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 50కి పైగా కంపెనీలు రూ.1,600 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు తేలింది. రూ.1,600 కోట్లలో మదన్‌లాల్ లిమిటెడ్,ఎంకేజీ ఎంటర్ప్రైజెస్, కెవెంటర్స్ ఫుడ్ పార్క్ వంటి సంస్థలు రూ. 600 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా, వాటిల్లో కెవెంటర్ గ్రూప్ భారీ మొత్తంలో బాండ్ల రూపంలో డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. కెవెంటర్ గ్రూప్ తర్వాత ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ హల్దియా ఎనర్జీ, ధరివాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ కంపెనీలు దాదాపు రూ.500 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఆయా పార్టీలకు విరాళం ఇచ్చాయి. ఈ కంపెనీలతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చాయి. వాటిల్లో ఐటీసీ, రుంగ్తా గ్రూప్, రష్మీ గ్రూప్, అంబుజా, శ్యామ్ స్టీల్, ఐఎఫ్బీ గ్రూప్, రిప్లే, శ్రీ సిమెంట్, ధున్సేరి గ్రూప్, ఉత్కర్ష్ గ్రూప్, స్టార్ సిమెంట్, డబ్ల్యూపీఐఎల్, టెగా ఇండస్ట్రీస్, అక్రోపోలిస్ మెయింటెనెన్స్, ఎస్కేపీ మర్చంట్స్, ఆస్టిన్ ప్లైవుడ్స్ ఉన్నాయి. ఇక, ఏప్రిల్ 12, 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 మధ్య కాలంలో సుమారు 1,260 కంపెనీలు, వ్యక్తులు సుమారు రూ.12,155.51 కోట్ల విలువైన 22,217 బాండ్లను కొనుగోలు చేసినట్లు ఎస్బీఐ డేటా చూపించింది. ఈ కాలంలో రూ.12,769.09 కోట్ల విలువైన 20,421 బాండ్లను 23 రాజకీయ పార్టీలు రీడీమ్ చేశాయి. బీజేపీ రీడమ్ చేసి రూ.6,061 కోట్లను పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవగా రూ.1,610 కోట్లను తృణమూల్ కాంగ్రెస్, రూ.1,422 కోట్లను కాంగ్రెస్ రీడమ్ చేసుకుంది. -
ఎలక్టోరల్ బాండ్లపై కాంగ్రెస్ విమర్శలు.. చట్టపరమైన చర్యలకు సీఎం ఆదేశం
సాక్షి, గౌహతి : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడిందంటూ సోషల్ మీడియా పోస్ట్‌లపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి విరాళం ఇచ్చిన సంస్థతో అస్సాం ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసిందని పేర్కొంటూ నాగోన్ కాంగ్రెస్ ఎంపీ బోర్డోలోయ్ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ అవినీతి ఏ స్థాయిలో ఉందో చూడండి అంటూ ఓ యాష్ ట్యాగ్‌ను జోడించారు. దీనిపై అస్సోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్ట్‌లు పెట్టిన కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమైనవి అంటూ కొట్టి పారేశారు. ‘అస్సాం ప్రభుత్వం ఎంఎస్ బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అస్సాం ప్రభుత్వానికి ఈ సంస్థతో ఎటువంటి వ్యాపార ఒప్పందాలు లేవు. ప్రగ్జ్యోతిష్‌పూర్ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పేర్కొన్న ఎంఓయు దాతృత్వ విరాళం మాత్రమేనని, దీని పనులు వేగంగా జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ప్రజలకు అంకితం చేస్తామని సీఎం బిస్వా శర్మ చెప్పారు. -
ఎన్నికల బాండ్ల స్కీమ్ ఉండాల్సింది.. అమిత్ షా
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల స్కీమ్ రద్దుపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. స్కీమ్‌ను పూర్తిగా రద్దు చేయకుండా ఉండాల్సిందని, మార్పులు చేస్తే బాగుండేదని అమిత్ షా అన్నారు. ఒక వార్తాసంస్థ ఇంటర్వ్యూలో మట్లాడుతూ అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే సమయంలో తాను సుప్రీంకోర్టు తీర్పును గౌవరవిస్తానని తెలిపారు. భారత రాజకీయాల్లో బ్లాక్ మనీ ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎన్నికల బాండ్ స్కీమ్‌ను తీసుకువచ్చినట్లు చెప్పారు. ‘ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం రూ.20 వేల కోట్ల రాజకీయ పార్టీల ఖాతాలకు చేరాయి. వీటిలో కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే బీజేపికి విరాళంగా వచ్చాయి. మిగిలిన డబ్బులు ప్రతిపక్షాలకు వెళ్లాయి. 303 ఎంపీ సీట్లకు రూ.6 వేల కోట్లు వస్తే 242 సీట్లకు ఏకంగా రూ.14 వేల కోట్లు వెళ్లాయి’అని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఎన్నికల కమిషన్ (ఈసీ)కి బాండ్ల వివరాలు అందజేసింది. ఈ వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఏయే కంపెనీలు బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలిచ్చాయి, ఏ పార్టీకి ఎంత సొమ్ము చేరిందనేది ఈ వివరాల్లో బహిర్గతమైంది. ఇదీ చదవండి.. చంద్రబాబుకు బుద్ధొచ్చింది.. అమిత్ షా -
ఎలక్టోరల్ బాండ్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్
సాక్షి, థానే : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలక్టోరల్ బాండ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని ఆరోపించారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల్ని శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను విభజించి, ప్రభుత్వాలను పడగొట్టేందుకే ఉపయోగించిందని’ విమర్శలు చేశారు. ‘రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల బాండ్లను (స్కీమ్) రూపొందించినట్లు ప్రధాని మోదీ గతంలో తెలిపారు. కానీ ఇది దేశంలోని కార్పొరేట్ కంపెనీల నుంచి డబ్బుల్ని దండుకునే స్కీంలా మారిందని అని అన్నారు. త్వరలోనే దీనిపై విచారణ జరుగుతుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఈడీ, సీబీఐలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలుగా మారాయని, ఏదో ఒక రోజు బీజేపీ ప్రభుత్వం స్థానభ్రంశం చెందుతుందని జోస్యం చెప్పారు. అలాంటి చర్యలకు శిక్ష పడుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటివి జరగవు. ఇది నా హామీ అని రాహుల్ గాంధీ వెల్లడించారు. -
ఎలక్టోరల్ బాండ్లు.. అతిపెద్ద కుంభకోణం
బెంగళూరు: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. దర్యాప్తు పూర్తయ్యేదాకా అధికార బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ వేల కోట్ల రూపాయలు నొక్కేసిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. నేను తినను, ఇతరులను తిననివ్వనంటూ ప్రగల్భాలు పలికిన మోదీ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు బీజేపీకి ఇంత సొమ్ము ఎందుకిచ్చారు? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు, అవినీతికి పాల్పడిన బడా వ్యక్తులు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి, బీజేపీకి సమరి్పంచుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శుక్రవారం ఆరోపించారు. దర్యాప్తు సంస్థల భయంతో బీజేపీకి లొంగిపోయారని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణంపై ప్రజాక్షేత్రంలో వెళ్లి పోరాటం సాగిస్తామని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల స్కామ్‌పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈ బాండ్ల వ్యవహారంలో క్విడ్ ప్రో కో చోటుచేసుకుందని, అవకతవకలు జరిగాయని అన్నారు. ఇదొక వసూళ్ల రాకెట్: రాహుల్ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద బలవంతపు వసూళ్ల రాకెట్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ పథకం కింద వసూలు చేసిన సొమ్మును వివిధ రాష్ట్రాల్లో పారీ్టలను చీల్చడానికి, ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ దుర్వినియోగం చేసిందని రాహుల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం మహారాష్ట్రలోని థానేలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ మినహా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన కాంట్రాక్టులకు, ఎలక్టోరల్ బాండ్లకు మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. -
ఎలక్టోరల్ బాండ్ల డేటాపై 'జైరాం రమేష్' కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాడాలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి 'జైరాం రమేష్' ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. దీనిపై ఎన్నికల సంఘం (EC) పంచుకున్న డేటా అసంపూర్ణమైనదని వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. కానీ ఓటర్ తన ఓటును సరిగ్గా వేసినట్లు తెలుసుకోవడానికి పోలింగ్ ప్రక్రియలో ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)ని ప్రవేశపెట్టాలని జైరాం రమేష్ అన్నారు. తమ పార్టీ గత సంవత్సరం నుంచి ఈసీతో అపాయింట్మెంట్ కోరుతూనే ఉందని, కానీ వారు ఇవ్వలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను కలవడానికి ఈసీ ఎందుకు, ఎవరికి భయపడుతోంది అని కేంద్ర మాజీ మంత్రి ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ప్రచురించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాలో.. ''ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారు, దర్యాప్తు సంస్థల బెదిరింపుల కారణంగా బాండ్లు కొనుగోలు చేసిన వారు, కాంట్రాక్టులు పొందడానికి లంచంగా బాండ్లను కొనుగోలు చేసిన వారు, షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసినవారు'' మాత్రమే నాలుగు కేటగిరీలుగా ఉన్నారని జైరాం రమేష్ పేర్కొన్నారు. స్వతంత్ర భారతావనిలో ఇదే అతిపెద్ద కుంభకోణమని, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని.. ప్రజాకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీ తమ అధికారిక వెబ్సైట్లో ఉంచిన ఒక రోజు తర్వాత జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
‘అన్నీ ఊహలు.. అవాస్తవాలే’.. ఎన్నికల బాండ్లపై నిర్మలమ్మ వ్యాఖ్యలు
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయా వివరాలను వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. దాంతో భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అయితే ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలిచ్చిన టాప్ 30 కంపెనీల్లో 15 కంపెనీలకుపైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ)వంటి సంస్థల దర్యాప్తు ఎదుర్కొన్నవే కావడం గమనార్హం. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రముఖ మీడియా సంస్థతో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విరాళాలకు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దాడులకు సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. ఈడీ కంపెనీలపై రైడ్ చేస్తేనే ఆత్మరక్షణ కోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశారనుకోవడం ఊహాగానమే అవుతుందన్నారు. బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఆయా సంస్థలపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ విరాళాలు మొత్తం భాజపాకే వెళ్లాయని చాలా మంది భావిస్తున్నారని, కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా జమైనట్లు తెలిపారు. ఎన్నికల బాండ్లకు సంబంధించి సమగ్ర సమాచారంతో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించించింది కదా అని ప్రస్తావించగా ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. తనకంటే ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్‌జైట్లీ మునుపటి కంటే మెరుగైనదిగా భావించి ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కొనుగోలు చేసిన బాండ్లు నేరుగా రాజకీయ పార్టీల ఖాతాల్లోనే పడుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ముందుకెళ్లాలన్నారు. ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లను భారీగా కొనుగోలు చేసిన కంపెనీలివే.. ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్నికల బాండ్ల విరాళాల్లో ఎక్కువ మొత్తం బీజేపీకి వెళ్లగా ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పార్టీలున్నాయి. -
ఎలక్టోరల్ బాండ్లపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఈడీ, సీబీఐ దాడులు జరిపిన సంస్థలే ఈ ఎలక్టోరియల్ బాండ్లను కొనుగోలు చేయడంపై ఆయా పార్టీలకు చెందిన నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఎలక్టోరల్ బాండ్‌పై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల ప్రధాన లబ్ధిదారుగా బీజేపీ ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ ద్వారా గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడం, నిధులను నేరుగా ఆయా పార్టీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా..గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కార్పొరేషన్ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అవి అధికార పార్టీ బీజేపీ అకౌంట్లలో జమవుతాయి. ఇలాంటివి గతంలో చాలానే జరిగాయి. ఎలక్టోరల్ బాండ్లలో డబ్బును కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు బదిలీ చేసిన కంపెనీలకు ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కంపెనీలపై ఇటీవల జరిగిన ఈడీ దాడులకు, ఆ తర్వాత బాండ్ల కొనుగోలుకు మధ్య సంబంధాన్ని సూచించారు. ప్రజలు ఇలాంటి వాటిని నిత్యం గమనిస్తూనే ఉన్నారు. ఈడీ దాడులు చేస్తుంది. కొన్ని గంటల తర్వాత, ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తారని మండిపడ్డారు. -
ఎన్నికల బాండ్లు.. ఆ కేసులున్న కంపెనీలే డోనర్లు..!
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్(ఈసీ) వెల్లడించిన ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ పార్టీలకు అత్యధిక మొత్తం విరాళాలిచ్చిన టాప్ 30 కంపెనీల్లో 15 కంపెనీలకుపైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ)వంటి సంస్థల దర్యాప్తు ఎదుర్కొన్నవే కావడం గమనార్హం. అయితే ఏజెన్సీల దర్యాప్తు ఒక్కో కంపెనీకి సంబంధించి ఒక్కో దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలపై కేవలం కేసులు ఫైల్‌కాగా, మరికొన్ని కంపెనీలపై దాడులు జరిగాయి. ఇంకా కొన్ని కంపెనీల ఆస్తులను ఈడీ ఏకంగా జప్తు చేసేదాకా వెళ్లింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ గురువారం బహిర్గతం చేసింది. ఈ విరాళాల్లో ఎక్కువ మొత్తం బీజేపీకి వెళ్లగా ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పార్టీలున్నాయి. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలందించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ స్కీమ్‌ను ఇప్పటికే రద్దు చేసింది. ఇదీ చదవండి.. ఎన్నికల బాండ్ల కేసు.. ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
ఎన్నికల బాండ్లను భారీగా కొనుగోలు చేసిన కంపెనీలివే..
ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్డు ఇటీవల స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే ‘కంపెనీల చట్టం’లో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దాంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అందులో చాలా కంపెనీలకు చెందిన యాజమాన్యాలు ఈ బాండ్లను కొనుగోలు చేశాయి. కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం అందులో ప్రధానంగా ఈ కింది కంపెనీలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: దేశంలోనే అత్యధిక ఎన్నికల బాండ్ల కొనుగోలు.. చుట్టూ వివాదాలు కంపెనీల వారీగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వివరాలు.. ఫ్యుచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ రూ.1,368 కోట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ.966 కోట్లు క్విక్ సప్లైచెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.410 కోట్లు వేదాంత లిమిటెడ్ రూ.400 కోట్లు హల్దియా ఎనర్జీ రూ.377 కోట్లు భారతి గ్రూప్ రూ.247 కోట్లు ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.224 కోట్లు వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్సిమిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ రూ.195 కోట్లు మదన్‌లాల్ లిమిటెడ్ రూ.185 కోట్లు -
దేశంలోనే అత్యధిక ఎన్నికల బాండ్ల కొనుగోలు.. చుట్టూ వివాదాలు
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అయితే ఈ డేటా వచ్చిన వెంటనే ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్’ పేరు మారుమోగింది. ఆ సంస్థ 2024 జనవరి వరకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువ చేసే ఎన్నికలబాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. భారీగా ఎన్నికలబాండ్లు కొనుగోలు చేసిన ఆ కంపెనీ యజమాని, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మయన్మార్‌లో సాదాసీదా కూలీగా జీవనం సాగించిన మార్టిన్ రూ.కోట్ల విరాళాలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగాడో ఈ కథనంలో తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచే లాటరీ వ్యాపారం భారత్‌లోనే పుట్టిన మార్టిన్ చిన్నతనంలో మయన్మార్‌లో చాలాకాలం పాటు కూలీగా జీవనం సాగించారు. తన 13వ ఏటా తిరిగి భారత్‌కు వచ్చి తమిళనాడులోని కోయంబత్తూరులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. తన వ్యాపారాన్ని తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు దేశం అంతటా విస్తరించారు. అనంతరం ఈశాన్య భారత్‌కు మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో వ్యాపారం ప్రారంభించారు. కొన్నాళ్లకు భూటాన్, నేపాల్‌లో కూడా తన బిజినెస్‌ను మొదలుపెట్టారు. తర్వాత స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్టైల్, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో లాటరీలు చట్టబద్ధమని తెలుసుకున్న మార్టిన్ ఆయా రాష్ట్రాల్లో సుమారు 1,000 మందిని నియమించుకుని వ్యాపారం సాగిస్తున్నారు. నాగాలాండ్, సిక్కింలో అయితే తన కంపెనీకి చెందిన 'డియర్ లాటరీ' సంస్థదే ఆధిపత్యం. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్ వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వరల్డ్ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం కూడా ఉంది. వివాదాలతో వెలుగులోకి.. సిక్కిం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2008లో రూ.4,500 కోట్లకు పైగా మోసానికి పాల్పడడంతో మార్టిన్ పేరు బయటకొచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మార్టిన్ కంపెనీలు బహుమతి పొందిన టికెట్లను పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి రూ.910 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2011లో అక్రమ లాటరీ వ్యాపారాలపై అణిచివేతలో భాగంగా తమిళనాడు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా తన కంపెనీలో సోదాలు నిర్వహించారు. 2013లో, కేరళ పోలీసులు రాష్ట్రంలో అక్రమ లాటరీ కార్యకలాపాలపై దర్యాప్తులో భాగంగా మార్టిన్ సంస్థలో దాడులు చేశారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీపై ఈడీ పలు మార్లు దాడులు చేసింది. దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఏంటీ ఎన్నికల బాండ్లు..? ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. -
ఎన్నికల బాండ్ల కేసు.. SBIపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ వివరాల వెల్లడి వ్యవహారం స్టేట్ బాండ్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)ని ఇప్పట్లో వదిలేలా లేదు. ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఇచ్చిన సమాచారంలో ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు ఎందుకు లేవో చెప్పాలని శుక్రవారం(మార్చ్ 15) ఉదయం ఎస్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించలేదని చీఫ్‌జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీకి ఎస్బీఐ ఇచ్చిన వివరాల్లో ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు వెల్లడించకపోవడం వల్ల ఏ కంపెనీ ఏ రోజు ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళమిచ్చిందనే నిర్ధిష్ట సమాచారం లేదు. బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ ( ఈసీ) గురువారం బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ వివరాల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల పూర్తిస్థాయి సమాచారం లేదని ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్ 2018 స్కీమ్‌ను రద్దు చేస్తూ బాండ్ల వివరాలు ఈసీకి అందజేయాలని సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. వివరాలందించేందుకు తమకు సమయం కావాలని ఎస్బీఐ సుప్రీంకోర్టును కోరగా సమయం ఎందుకని కోర్టు బ్యాంకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చ్ 15లోగా బాండ్ల వివరాలందించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఈసీకి ఎస్బీఐ బాండ్ల వివరాలందజేసింది. ఇదీ చదవండి.. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ -
సగం బాండ్ల నిధులు బీజేపీకే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకంతో అధికార బీజేపీకి అత్యధికంగా నిధులు సమకూరినట్లు వెల్లడయ్యింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరెవరు ఎంతెంత బాండ్లు కొన్నారు? ఏ పార్టీలకు ఎంతెంత వచ్చింది? అనే వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేసింది. ఈసీ ఈ జాబితాలను తమ వెబ్సైట్లో పెట్టి బహిరంగపరచింది. దీని ప్రకారం మొత్తంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ ఎన్నికల బాండ్ల రూపంలో రూ.12,999 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో అందాయి. దీన్లో 46.7 శాతం... అంటే దాదాపుగా సగం అధికార బీజేపీ ఖాతాలోకే వచ్చాయి. రూ.6,060 కోట్ల విలువైన బాండ్లు బీజేపీ ఖాతాలోకి రాగా... ఆ తరవాతి స్థానాల్లో రూ.1,609 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్, రూ.1,421 కోట్లతో కాంగ్రెస్ పార్టీ, రూ.1,214 కోట్లతో బీఆర్ఎస్, రూ.775 కోట్లతో బిజూ జనతా దళ్, రూ.639 కోట్లతో డీఎంకే వరుసగా నిలిచాయి. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు మేరకు గురువారం సాయంత్రం ఈసీ తమ అధికారిక వెబ్సైట్లో రెండు భాగాలుగా ఈ వివరాలను పొందుపరిచింది. మొదటి భాగంలో బాండ్లు కొనుగోలు చేసినవారి వివరాలు, వాటి విలువ, రెండో భాగంలో ఆయా బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు తేదీలతో సహా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ అనే సంస్థ అత్యధిక విలువైన బాండ్లు కొనుగోలు చేసి టాప్–1గా నిలిచింది. కోయంబత్తూరుకు చెందిన ఈ సంస్థ రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ రూ.966 కోట్లు, దాని అనుబంధ సంస్థ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు కలిపి మొత్తం రూ.1,186 కోట్ల విలువైన బాండ్లను కొని రెండో స్థానంలో నిలిచింది. రూ.వెయ్యి కోట్లను దాటి బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు ఈ రెండే కాగా... వందల కోట్ల మేర భారీగా బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, టోరెంట్ పవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, డీఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్, ఎక్సెల్ మైనింగ్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, లక్ష్మీ నివాస్ మిట్టల్, పీవీఆర్, సూలా వైన్స్, వెల్స్పన్, సన్ ఫార్మా తదితర ప్రఖ్యాత సంస్థలున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశోద హాస్పిటల్స్, నవయుగ ఇంజినీరింగ్, దివీస్ ల్యా»ొరేటరీస్, ఎన్సీసీ, నాట్కో ఫార్మా, అరబిందో ఫార్మా కూడా బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల్లో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018లో అమల్లోకి వచ్చింది. వ్యక్తులు, వ్యాపార/వాణిజ్య సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసి, రాజకీయ పార్టీలకు అందజేశాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా జారీ చేసిన బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎస్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల బాండ్ల డేటాను వెల్లడించిన ఈసీ
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. వివిధ రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను తమ అధికారిక వెబ్సైట్ https://www.eci.gov.in/లో పొందుపరిచింది. ఎవరు ఎన్ని బాండ్లు? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు ఇందులో ఉన్నాయి. రూ.891 విలువైన ఎలక్టోరల్ బాండ్లను మేఘా సంస్థ కొనుగోలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎస్బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15 సాయంత్రంలోగా వెబ్సైట్లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 763 పేజీలతో రెండు పార్ట్‌లుగా వెబ్‌సైబ్‌లో అందుబాటులో ఉంచింది. న్యాయస్థానం ఇచ్చిన గడువుకు ఒక రోజు ముందే డేటాను ప్రచురించింది. పార్ట్-1లో ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు; పార్ట్-2లో బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్న పార్టీల వివరాలతో పాటు తేదీ, మొత్తాలకు సంబంధించిన డేటాను ఉంచింది. కాగా దేశంలో రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరిన నిధుల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే.. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పారీ్టలకు విరాళం రూపంలో అందజేశారని వెల్లడించింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది. చదవండి: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకీ తలకు తీవ్రగాయం -
ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పారీ్టలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరిన నిధుల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పారీ్టలకు విరాళం రూపంలో అందజేశారని వెల్లడించింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది. నిబంధనల ప్రకారం.. జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నగదుగా మార్చుకోకపోవడం వల్ల మిగిలిపోయిన 187 బాండ్లకు సంబంధించిన డబ్బును ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ దినేశ్‌కుమార్ ఖరా బుధవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అందజేశామని అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రతి బాండ్‌ను కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదార్ల పేర్లు, బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్న తేదీ వంటి అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి డిజిటల్ రూపంలో అందజేశామని తెలిపారు. -
SBI: మొత్తం 22,217 ఎన్నికల బాండ్లు జారీ
ఢిల్లీ: ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎట్టకేలకు ఆ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. మంగళవారం సాయంత్రమే కోర్టు ఆదేశాల మేరకు వివరాలు ఇవ్వగా.. ఇవాళ సమ్మతి అఫిడవిట్(compliance affidavit) సమర్పించింది. అందులో.. ఈసీకి ఇచ్చిన పెన్ డ్రైవ్ వివరాలను అఫిడవిట్లో ప్రస్తావించింది. పెన్‌డ్రైవ్‌లో రెండు పీడీఎఫ్ ఫైల్స్ ఉన్నాయని.. వాటికి పాస్వర్డ్ ఉన్నాయని పేర్కొంది. అలాగే.. ఏప్రిల్ 2019 నుంచి.. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా(అంటే.. ఎన్నికల బాండ్లు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చేదాకా ) మొత్తం 22, 217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఈ మొత్తంలో రాజకీయ పార్టీలు 22, 030 బాండ్లను తీసుకున్నాయని తెలిపింది. అలాగే.. మిగిలిన 187 తాలుకా బాండ్ల నగదు ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు జమ అయినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఎన్నికల బాండ్ల పథకం కింద.. దాతలు తమ ఇష్టపూర్వకంగా విరాళాలను ఎస్బీఐ నుంచి ఎన్నికల బాండ్ల రూపేణా కొనుగోలు చేసి ఆయా పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ.. 15 రోజుల్లో గనుక పార్టీలు ఆ బాండ్లను స్వీకరించకపోతే ఆ డబ్బు ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు వెళ్తుంది. కానీ, ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రద్దు చేస్తూ ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: 26 రోజులేం చేశారు?.. ఎస్బీఐపై సుప్రీం కన్నెర్ర -
Electoral Bonds: సుప్రీం దెబ్బకు దిగొచ్చిన ఎస్బీఐ.. ఈసీ చేతికి డేటా
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎట్టకేలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దిగొచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ)కి ఎస్బీఐ సమర్పించింది. 2 రోజుల్లో ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఈసీ తమ వెబ్సైట్లో పెట్టనుంది. కాగా మార్చి 12 సాయంత్రం వరకు ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీకి సమర్పించాలని సుప్రీంకోర్టు ఎస్బీఐకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్బీఐ ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకు సమర్పించింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించడానికి జూన్ 30 వరకు గడువును పెంచాలని కోరుతూ ఎస్బీఐ చేసిన పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. మార్చి 12 పని వేళలు ముగిసేలోగా ఎన్నికల కమిషన్‌కు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. మార్చి 15 సాయంత్రం 5 గంటలలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అధికారిక వెబ్సైట్లో ప్రచురించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎస్బీఐ పిటిషన్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు హర్షించాయి. -
ఇన్ని రోజులు ఏం చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టిలు పొందిన విరాళాల వివరాలను మంగళవారం సాయంత్రంకల్లా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సమరి్పంచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. దీంతో మరింత గడువు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)కి న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ‘‘రాజకీయ పార్టిలు పొందిన విరాళాల సమగ్ర వివరాలను 12వ తేదీ పనిగంటలు ముగిసేలోగా ఈసీకి వెల్లడించాలి. తర్వాత అందరికీ బహిర్గతం చేయాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం ఎస్బీఐను ఆదేశించింది. మరోవైపు, మార్చి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలలకల్లా తమ అధికారిక వెబ్సైట్లో సమగ్ర వివరాలను పొందుపరచాలని ఈసీకి కోర్టు సూచించింది. బ్యాంక్‌కు ఆదేశాలు, గడువుకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఇచి్చన ఉత్తర్వుల ఉల్లంఘనకు బ్యాంక్ పాల్పడితే బ్యాంక్‌పై చర్చలు తీసుకునేందుకు వెనకాడబోమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ ఆ పద్దతిని రద్దుచేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగధర్మాసనం ఫిబ్రవరిలో చరిత్రాత్మక తీర్పునివ్వడం తెల్సిందే. 2019 ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఎస్బీఐ ద్వారా జరిగిన ఎలక్టోరల్ బాండ్ల అధికారిక కొనుగోలు, డిపాజిట్ లావాదేవీల వివరాలను మార్చి ఆరో తేదీలోపు ఈసీకి ఇవ్వాలని కోర్టు గతంలోనే ఆదేశించడం తెల్సిందే. దీంతోజూన్ 30వ తేదీకా గడువు పొడిగించాలని ఎస్బీఐ కోర్టును కోరడం, అలా గడవు కోరడాన్ని కోర్టు ధిక్కారణగా పరిగణించాలంటూ కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలవడం తెల్సిందే. ఎస్బీఐ తరఫున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే వాదించారు. ‘‘ బాండ్లను కొనుగోలు చేసిన వారు, డిపాజిట్ చేసుకున్న వారి వివరాలు వేర్వేరుగా ఉన్నాయి. వాటిని సరిపోల్చి నివేదించాల్సిఉంది. వేర్వేరు చోట ఉన్న బ్రాంచీల్లో నిక్షిప్తమైన డేటాను సరిపోల్చేందుకు చాలా సమయంపడుతుంది. అందుకే గడువు పెంచండి’ అని కోరారు. ‘‘ విరాళాల దాతలు, గ్రహీతల వివరాలను సరిపోల్చి మ్యాచింగ్ వివరాలని ఇవ్వాలని మేం అడగలేదు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్లుగా సీల్డ్ కవర్ లోంచి తీసి ఈసీకిస్తే చాలు’’ అని ఆదేశించింది. ‘‘ ఫిబ్రవరి 15న తీర్పు ఇచ్చాం. అంటే ఈ 26 రోజుల నుంచి ఏం చేసినట్లు? ఇంతకాలం మౌనంవహించి ఇప్పుడొచ్చి గడువు పెంచమంటారా? కోర్టు ఉత్తర్వులపై ఇంత నిర్లక్ష్యమా?’’ అని దుయ్యబట్టింది. స్వాగతించిన కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. భారీ కాంట్రాక్టులను సంపాదించేందుకు బీజేపీకి భారీగా విరాళాల విరాళాలిచ్చిన వారి వివరాలూ బయటికొచ్చేలా ఉత్తర్వులిస్తే బాగుండేదని పేర్కొంది. ‘‘స్విస్ ఖాతాల నుంచి కోట్ల నల్లధనం తెస్తామన్న వాళ్లే తమ సొంత ఖాతాల వివరాలు సుప్రీం కంటబడకుండా దాచేస్తున్నారు’’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. -
ఎలక్టోరల్ బాండ్‌పై సుప్రీం కీలక తీర్పు, జయఠాకూర్.. ఇంతకీ ఎవరీమె?
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. బాండ్లు కొన్నదెవరు? ఆ మొత్తాలు ఏ పార్టీకి వెళ్లాయన్న వివరాలను మార్చి 12 తేదీ (మంగళవారం)లోపు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టం చేసింది కూడా. ఈ వివరాలను బహిరంగ పరచాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్లలో ఒకరైన జయ ఠాకూర్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై సంతోషంగా ఉన్నట్లు సోమవారం తెలిపారు. ఇంతకీ ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు? ఎలక్టోరల్ బాండ్ అంటే? రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 6లోగా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని నాడు ఎస్బీఐని సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు అసహనం తాజాగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్బీఐ మరింత సమయం కోరడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేపటిలోగా విరాళాల వివరాల్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై పిటిషన్ జయఠాకూర్ స్పందించారు. జయ ఠాకూర్ ఎవరు? జాతీయ మీడియా కథనాల ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన జయ ఠాకూర్‌కు కాంగ్రెస్‌తో అనుబంధం ఉంది. ఆమె వృత్తి రీత్యా డాక్టర్. మరోవైపు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారు. పారదర్శకత లేదు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఎన్నికల నిధులలో పారదర్శకత తగ్గిపోయిందని జయ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.“డబ్బు విరాళాలు ఇస్తున్న వ్యక్తులు, వారి పేర్లు వెల్లడించడం లేదు. ఇది మన ప్రజాస్వామ్యానికి భవిష్యత్తులో సమస్యను సృష్టిస్తుందని నేను ఆ సమయంలో (2018) గ్రహించాను. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులే పెద్ద సమస్య’. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమని తాను అనుకోవడం లేదు. ఏ పార్టీ, ఏ కార్పొరేట్ గ్రూప్ నుండి నిధులు పొందుతుందో, వారు తప్పనిసరిగా కార్పొరేట్ గ్రూప్ పేరును బహిర్గతం చేయాలని నేను భావిస్తున్నాను అని ఆమె అన్నారు -
ఎన్నికల బాండ్ల ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన షేర్ ధర
ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం భారతీయ స్టేట్ బ్యాంకును ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ వివరాలు వెల్లడించేందుకు ఎస్బీఐ అదనపు సమయం కావాలని గతంలోనే సుప్రీం కోర్టును కోరింది. కానీ అందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో సదరు బ్యాంకు షేర్ల విక్రయాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం నుంచి ఎస్బీఐ షేర్ల అమ్మకాలు కోనసాగుతున్నాయి. జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో షేర్ ధర మధ్యాహ్నం 2:32 వరకు 2శాతం క్షీణించింది. సోమవారం ఉదయం రూ.788.5 ధరతో ప్రారంభమైన షేర్.. మధ్యాహ్నానికి రూ.16 కోల్పోయింది. ప్రస్తుతం రూ. 772 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇదీ చదవండి: మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఐటీ కేంద్రంలో ఊపందుకున్న డిమాండ్! ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడించేందుకు ఎస్బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బ్యాంకు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. మార్చి 12లోగా విరాళాల వివరాలు ఎన్నికల సంఘానికి వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. అలాగే ఆ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా వెల్లడించాలని ఈసీని ఆదేశించింది. -
SBIపై సుప్రీం కోర్టు కన్నెర్ర
ఢిల్లీ, సాక్షి: ఎలక్టోరల్ బాండ్స్ కేసులో.. భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసింది. బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు గడువు పొడిగింపు విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ.. మంగళవారానికి డెడ్‌లైన విధించింది. ఒకవేళ అలా సమర్పించని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే.. ఆ వివరాలను మార్చి 15వ తేదీ సాయంత్రం 5గం.లోగా వెబ్సైట్లో ఉంచాలని ఈసీని ఆదేశించింది. ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎన్నికల బాండ్లు చెల్లవని.. అవి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అలాగే.. ఇప్పటివరకు బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన దాతల వివరాలను మార్చి 13వ తేదీలోగా బహిర్గత పర్చాలని ఎస్బీఐ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే.. ఆ గడువును జూన్ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్బీఐ రిక్వెస్ట్ పిటిషన్ వేసింది. ఆలోపు ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. ఎన్నికలు ముగిశాకే.. బాండ్ల వివరాలను ఎస్బీఐ సమర్పిస్తాననడం వెనుక రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. మరోవైపు ఎన్నికల బాండ్ల విషయంలో ఎస్బీఐ గడువు పొడిగించాలని కోరడం కోర్టు ధిక్కారం కిందకే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ పిటిషన్ వేసింది. ఈ రెండు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ క్రమంలో ఎస్బీఐ వాదనలకు సుప్రీం గట్టిగానే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే .. కోర్టు ఆదేశాలను పాటించడానికి మాకు కొంత సమయం కావాలి. పూర్తి సమాచారాన్ని పునఃపరిశీలించుకునేందుకు ఆ గడువు(జూన్ 30వ తేదీ) కచ్చితంగా అవసరం. బ్యాంక్ కాబట్టి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనే కోరుకుంటున్నాం. చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్ .. దాతల వివరాలను సీల్డ్ కవర్లో ముంబై బ్రాంచ్ బ్యాంక్‌లో సమర్పించండి జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఆ సీల్డ్ కవర్‌ను మీరే తెరిచి సమాచారం అందించండి లాయర్ హరీష్ సాల్వే.. బాండ్లు ఎవరు కొన్నారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?.. ఇలా పూర్తి సమాచారం మా దగ్గర ఉంది. అలాగే వాటిని కొనుగోలు చేసిన వాళ్ల వివరాలు సైతం ఉన్నాయి. ఆ వివరాలను పునఃపరిశీలించుకోవడమే మిగిలి ఉంది. సీజేఐ చంద్రచూడ్.. ఈ విషయంలో ఎలాంటి ఎగస్ట్రా కసరత్తులు చేయనక్కర్లేదు. అలా చేయమని కూడా మేం చెప్పలేదు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించండి చాలూ. సీజేఐ చంద్రచూడ్.. తీర్పు ఇచ్చి చాలా రోజులే అయ్యింది.. గత 26 రోజులుగా ఏం చేశారు? అసలు ఇప్పటివరకు స్టేట్‌బ్యాంక్ తీసుకున్న చర్యల వివరాలు పిటిషన్ లో లేవు సీజేఐ చంద్రచూడ్.. ఇన్నిరోజులు బాండ్ల విషయంలో ఏం సరిపోల్చుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు? బాండ్ల వివరాలు వెల్లడించాలని తీర్పులోనే స్పష్టంగా చెప్పాం. హరీష్ సాల్వే.. ఈ విషయంలో మేం తప్పులు చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ అదే జరిగితే దాతలు కోర్టులకెక్కి దావాలు వేసే అవకాశం ఉంది. అలాగే.. మేం చేస్తున్న పద్ధతిలో ఎలాంటి సమాచారం బయటకు పొక్కే అవకాశం లేదు. సీజేఐ చంద్రచూడ్.. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనే మార్పులు చేయమని అడుగుతున్నారా?(ఎస్బీఐ అఫిడవిట్‌ను ప్రస్తావిస్తూ). ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. రేపు సాయంత్రం లోగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించండి. ఆ వివరాలను మార్చి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు తమ వెబ్సైట్లో ఈసీ ప్రచురించాల్సిందే. ఎన్నికల బాండ్ల విషయంలో ఎలాంటి పొడిగింపు లేదు. సీల్డ్ కవర్ తెరిచి వివరాలు సేకరించి ఈసీకి ఇస్తే చాలు. పొడిగింపు కోరుతూ మీరు వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం. కోర్టు తీర్పుపై హర్షం ఏడీఆర్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతించారు. ‘‘ఎస్బీఐ అభ్యర్థనను కోర్టు కొట్టేసింది. కోర్టు కోరిన వివరాలన్నీ తమ ఉన్నట్లు అఫిడవిట్లో ఎస్బీఐ పేర్కొంది. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా సమర్పించాల్సిందేనని.. గడువు పొడిగింపు ఉండదని బెంచ్ స్పష్టం చేసింది. క్రాస్ చెకింగ్ పేరుతో బ్యాంక్ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు. అలాంటివేం అక్కర్లేదని తేల్చి చెప్పింది. ఆ వివరాలను రేపు సాయంత్రం లోగా ఈసీకి ఇవ్వమని చెప్పింది’’ అని ప్రశాంత్ భూషణ్ మీడియాకు తెలిపారు. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల తీర్పుతో సుప్రీం కోర్టు రద్దు చేసేసింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధంగా తీర్పు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. బాండ్ల జారీని తక్షణమే ఆపేయాలంటూ ఎస్బీఐని ఆదేశించింది. అదే సమయంలో.. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను బహిర్గత పర్చాలని ఎస్బీఐ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. -
ఎలక్టోరల్ బాండ్లు: మోదీ సర్కారుపై ఖర్గే సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు గుప్త విరాళాలందించే ఎలక్టోరల్ బాండ్ల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన విరాళాల వివరాలు ఎన్నికల సంఘానికి(ఈసీ) అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చేస్తున్న జాప్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ జాతీయ అధ్యకక్షుడు మల్లిఖార్జున ఖర్గే మంగళవారం ఆరోపించారు. జాతీయ బ్యాంకును మోదీ ప్రభుత్వం రక్షణ కవచంలా వాడుకుంటోందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ టర్ము జూన్ 16తో ముగుస్తుందనగా ఎస్బీఐ జూన్ 30దాకా గడువు కోరడమేంటని ఖర్గే ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధికంగా అక్రమ లావాదేవీలు జరిపింది మోదీ బీజేపీయేనన్నారు. మార్చి 6వ తేదీకల్లా ఈసీకి బాండ్ల వివరాలందించాల్సిన ఎస్బీఐ డెడ్‌లైన్‌ను జూన్ 30 దాకా పొడిగించాలని తాజాగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలందించిన 44వేల434 కంపెనీలు, వ్యక్తుల వివరాలను సిద్ధం చేయడానికి 24 గంటల కంటే ఎస్బీఐకి ఎక్కువ సమయం పట్టదని నిపుణులు వాదిస్తుండటం గమనార్హం. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్టీల పేరు మీద విడుదల చేసే ఎలక్టోరల్ బాండ్లను కంపెనీలు, వ్యక్తులు కొనుక్కుంటే రాజకీయ పార్టీల ఖాతాల్లో ఆ నిధులు జమవుతాయి. ఎవరు బాండ్లు కొనుగోలు చేస్తారనేది రహస్యంగా ఉంచుతారు. అయితే ఈ స్కీమ్‌లో పారదర్శకత లేదని దాఖలైన పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని వాటి వివరాలను ఎన్నికల సంఘానికి వెంటనే అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఇదీ చదవండి.. లోక్‌సభ ఎన్నికలపై ఈసీ సంచలన ప్రెస్‌మీట్ -
సుప్రీంకోర్టు తలుపు తట్టిన SBI
సాక్షి, ఢిల్లీ: దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు ఆమధ్య సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల బాండ్ల విషయంలో విధించిన డెడ్‌లైన్‌ను పొడిగించాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికల బాండ్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై.. చర్చనీయాంశమైన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఆ సమయంలో.. ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువు ఇచ్చింది. ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్లపై వివరాలు అందిస్తే.. వాటిని వారం రోజుల్లో ఈసీ తన సైట్లో పొందుపర్చాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు విధించిన మూడు వారాల గడువు ప్రకారం.. మార్చి 6వ తేదీనే ఎస్బీఐ కేంద్ర ఎన్నికల సంఘానికి డాటా సమర్పించాల్సి ఉంది. అయితే ఇందుకు సమయం సరిపోదని.. జూన్ 30వ తేదీ దాకా గడువు ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది ఎస్బీఐ. ఇక ఎస్బీఐ పిటిషన్‌పై సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ స్పందించారు. లంచాలు, కాంట్రాక్టులు పొందిన వివరాలు బయటపడతాయన్న భయంతోనే ఎన్నికలు ముగిసే వరకు సమయం కోరుతున్నారంటూ ఆరోపించారు. ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే.. -
పారదర్శకత అవసరం!
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఫిబ్రవరి 15 చరిత్రాత్మక దినమని ప్రజాస్వామ్య ప్రియుల అభిప్రాయం. కేంద్రంలోని మోదీ సర్కార్ తెచ్చిన ఎన్నికల బాండ్ల పథకం (ఈబీఎస్) రాజ్యాంగ విరుద్ధమనీ, పారదర్శకత లోపించిన ఈ పథకం కింద వివిధ పార్టీలకు బాండ్ల రూపంలో నిధులిచ్చిన దాతల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ వెల్లడించాలనీ సుప్రీమ్ కోర్ట్ చరిత్రాత్మక తీర్పునివ్వడమే అందుకు కారణం. 2018 నుంచి రాజకీయ పార్టీలకు పాడి ఆవుగా మారిన ఈ పథకం రాజ్యాంగంలోని 19 (1)(ఎ) అధికరణాన్ని ఉల్లంఘిస్తోందనీ, దాతలకుండే గోప్యత హక్కు కన్నా పౌరుల సమాచార హక్కే ముఖ్యమనీ కోర్ట్ అభిప్రాయపడింది. బాండ్ల రూపంలో డబ్బులిచ్చిన దాతలు, అందుకున్న పార్టీలు, అందిన నిధులతో సహా మొత్తం వివరాల్ని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వెల్లడించాలన్న సుప్రీమ్ ఆదేశం పాలక వర్గాలకు దెబ్బే! గత ఆరేళ్ళుగా జనం దృష్టి పడకుండా తప్పించుకున్న వివరాలన్నీ ఇక ప్రజాక్షేత్రంలోకి వస్తాయి. అలాగే, కొన్నేళ్ళుగా అనుమాని స్తున్న కార్పొరేట్ల– రాజకీయపార్టీల క్విడ్ ప్రోకో బంధంపై ఎంతో కొంత బయటపడవచ్చు. ఈ పథక రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం కోర్ట్ తీర్పుపై ఇంకా మౌనముద్ర వీడలేదు. న్యాయశాఖ మంత్రి మాత్రం తీర్పును పరిశీలిస్తున్నా మనీ, సవాలు చేయదలిచినదీ లేనిదీ నిర్ణయిస్తామనీ వెల్లడించారు. నిజానికి, ఎన్నికల్లో లెక్క చూపని అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల బాండ్లను తెచ్చామన్నది పాలకుల వాదన. కోర్ట్ తీర్పుతో మళ్ళీ అదే ధన ప్రవాహ పరిస్థితి తలెత్తుతుందని వారి మాట. కానీ, ఏ కార్పొరేట్ సంస్థల నుంచి, ఏ పార్టీకి, ఎంత నిధులు బాండ్ల రూపంలో వస్తున్నాయో తెలియని గోప్యమైన ఎన్నికల బాండ్ల వ్యవస్థ వల్ల కూడా మరో రకంగా జరుగుతున్నది అదే! అంతా గోప్యమే గనక సంస్థలు స్వప్ర యోజనాలు ఆశించి బాండ్ల రూపంలో పార్టీకి నిధులు కట్టబెట్టడం, ప్రతిగా వాటి ప్రయోజనాలను పాలకులు నెరవేర్చడమన్నది అచ్చమైన ‘క్విడ్‌ప్రోకో’యే! వివరాలు వెల్లడించాలన్న కోర్ట్ తాజా ఆదేశంతో ఈ ‘నీ కిది... నాకది’ పందేరాలు బట్టబయలవుతాయి. ఈ తలనొప్పి ఎందుకని బాండ్ల బదులు నేరుగా డబ్బులిస్తే అడ్డుకోవడం అప్పుడైనా, ఇప్పుడైనా కష్టమే. అందుకే, కోర్ట్ తీర్పు సర్వ రోగ నివారిణి కాకున్నా, ఎన్నికల నిధుల్లో పారదర్శకతనే అంశంపై మరోసారి చర్చ రేపగలిగింది. లెక్క తీస్తే, 2017–18 నుంచి 2022–23 వరకు 12 వేల కోట్ల పైచిలుకు విలువైన ఎన్నికల బాండ్లు అమ్మకమయ్యాయి. చిత్రమేమిటంటే అందులో 55 శాతం, అంటే రూ. 6,564 కోట్ల మేర నిధులు అధికార బీజేపీకే దక్కాయి. ఈ అయిదేళ్ళలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు దక్కిన బాండ్లు 9.5 శాతమే. మరో మాటలో రూ. 1,135 కోట్లే. ఈ మొత్తం డబ్బులు ఎవరిచ్చారు, ఎంతిచ్చారన్నది దేవరహస్యం. ఆ గోప్యత చెల్లనేరదన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. ఆ ఆదేశాలను పాటిస్తామంటూ భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నిజానికి, ఎన్నికల బాండ్ల విషయంలో ఎన్నికల సంఘం (ఈసీ) సైతం రోజుకో రకం అభిప్రాయం వ్యక్తం చేసింది. మొదట్లో బాండ్లపై అభ్యంతరం చెబుతూ, ఇది వట్టి తిరోగమన చర్య అని పేర్కొంది. కారణాలేమో కానీ, తీరా సుప్రీమ్ ముందు తన మాట మార్చేసి, ఎన్నికల బాండ్లను సమర్థించింది. పథకాన్ని ఆపు చేయరాదని వాదించింది. ఇప్పుడేమో సుప్రీమ్ ఆదేశాల్ని పాటి స్తామంటోంది. వెరసి, బాండ్లపై ఈసీకి ఏపాటి నిర్దిష్టమైన అభిప్రాయముందో అర్థమైపోతోంది. చెల్లిస్తున్న వారి పేరేమీ లేకుండా ఏ సంస్థ అయినా వెయ్యి, పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల వంతున ఎంతైనా ఓ పార్టీకి ఇచ్చే వీలు ఈ బాండ్ల పథకం కల్పించింది. అందుకు తగ్గట్టే, అపరిమిత రాజకీయ విరాళాలకు వీలు కల్పిస్తూ, కంపెనీస్ యాక్ట్‌లోని 182వ సెక్షన్‌ను 2017లో ప్రభుత్వం సవరించింది. గతంలో రూ. 20 వేల పైన వచ్చే ప్రతి విరాళానికీ పార్టీలు రికార్డులు సమర్పించాలని ఆదాయపన్ను చట్టం. పాలకులు దాన్నీ మార్చేశారు. ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విరాళాల మొత్తం ఎంతన్నది చెబితే చాలంటూ ఎన్నికల బాండ్లకు మినహాయింపు కల్పించారు. ఈ సవరణల్ని సుప్రీమ్ తాజాగా కొట్టేసింది. గత మూడేళ్ళలో సదరు సంస్థకొచ్చిన సగటు నికర లాభంలో 7.5 శాతమే గరిష్ఠంగా ఇవ్వాలనే మునుపటి పరిమితిని మళ్ళీ తెచ్చింది. అపరిమిత కార్పొరేట్ ఫండింగ్ దోవలో డొల్ల కంపెనీలతో అక్రమ ధనాన్ని పార్టీలకు చేరవేయకుండా అడ్డుకట్ట వేసింది. గత 2019 లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ. 2,994 కోట్లని చెబుతున్నా, అసలు ఖర్చు 55 – 60 వేల కోట్లని అంచనా. అందుకే, ఎన్నికల బాండ్ల కథ గోప్యంగా సాగుతోందంటూ సుప్రీమ్ కొట్టేయడం సరైనదే! నిర్ద్వంద్వమైన, సమగ్రమైన ఆ తీర్పును స్వాగతించాల్సిందే! అంత మాత్రాన ఇకపై అంతా పారదర్శకత నెలకొంటుందనుకోలేం. అలాగే, సుప్రీమ్ మాట సర్కార్‌కు ఎదురుదెబ్బే అయినా, కావాలనుకుంటే భవిష్యత్తులో పార్లమెంట్లో చట్టం ద్వారా కొత్త రూపంలో బాండ్లకు పాలకులు తెర తీసినా ఆశ్చర్యం లేదు. అయితే, కోర్ట్ తన పని తాను సమర్థంగా చేసింది గనక, ఇప్పుడా తీర్పు స్ఫూర్తిని అందిపుచ్చుకొని, ఆచరణలో పెట్టాలి. చట్టబద్ధమైన ఎస్బీఐ, రాజ్యాంగబద్ధమైన ఈసీ అందులో ముందుండాలి. ఎన్నికల్లో అక్రమ ధనాన్ని అడ్డుకట్టాలంటే పాలకులు సైతం చిత్తశుద్ధి చూపాలి. పార్టీ విరాళాలిచ్చేందుకు వీలుగా సంస్థలు ప్రత్యేక ట్రస్టుల ఏర్పాటు లాంటి ఆలోచన చేయాలి. పారదర్శకత నెలకొల్పడం పెను సవాలే కానీ, ప్రజలు, పార్టీలు, బడా సంస్థలు... అందరూ త్రికరణశుద్ధిగా ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. సుప్రీమ్ తీర్పు ఆ దిశలో తొలి అడుగైతే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది! -
Income Tax Department: కాంగ్రెస్ ఖాతాల స్తంభన
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మోదీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేయడం కలకలం సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసులో ఐటీ రిటర్నుల్లో రూ.210 కోట్ల వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాటి రికవరీ కోసం ఆయా ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసినట్లు వార్తలొచ్చాయి. పార్టీ ప్రధాన ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కాంగ్రెస్ వేగంగా స్పందించింది. వెంటనే ఐటీ, ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ)ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్ కాస్త కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఆయా ఖాతాల్లో మొత్తంగా రూ.115 కోట్లు అలాగే నిల్వ ఉంచి మిగతాది మాత్రమే విత్‌డ్రా, ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చని సూచించింది. వెంటనే ఆయా ఖాతాలను డీ ఫ్రీజ్ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో సంబంధిత ఖాతాలన్నీ పునరుద్ధరించబడ్డాయి. ట్రిబ్యునల్ ఈ అంశంపై బుధవారం మరోసారి వాదనలు విననుంది. ఫ్రీజ్ చేసిన ఖాతాల్లో యూత్ కాంగ్రెస్ ఖాతాలూ ఉన్నాయి. ఖాతాల స్తంభనపై మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘ 2018–19 ఆర్థికంలో ఐటీ రిటర్నులను కాస్త ఆలస్యంగా సమరి్పంచాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతభత్యాలను పారీ్టకి విరాళాల రూపంలో ఇచ్చారు. అలాంటి కొన్ని మొత్తాలు ఐటీ రిటర్నుల్లో ప్రతిబింబించలేదు. అంతమాత్రానికే ప్రధానమైన తొమ్మిది ఖాతాలను స్తంభింపజేస్తారా?’ అని కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ మాట్లాడారు. ‘‘ ఖాతాల్లో ఉన్న మొత్తంలో రూ.115 కోట్లే అత్యంత ఎక్కువైనది. సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి మిగతా డబ్బు అస్సలు సరిపోదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల వేళ ఇలా ఖాతాలను ఫ్రీజ్ చేస్తే ఎన్నికల్లో పార్టీ భాగస్వామి కావడం చాలా కష్టం’’ అని మాకెన్ అన్నారు. భయపడకండి మోదీ జీ: రాహుల్ ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘ భయపడకండి మోదీ జీ! కాంగ్రెస్ ప్రజాశక్తికి కాంగ్రెస్ చిరునామా. నియంతృత్వం ముందు మోకరిల్లేది లేదు’’ అన్నారు. అధికార దాహంతో లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టాక ఇలాంటి ఆరోపణలకు కాంగ్రెస్ చాలా సమయం దొరుకుతుందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎద్దేవాచేశారు. -
ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు..!
ఎన్నికల బాండ్లు. పార్టిలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టికి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.10 వేలు, రూ.లక్ష, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ మొత్తం ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్‌కు వెళ్తుంది. బాండ్ల కొనుగోలుపై సంఖ్య పరిమితేమీ లేదు. ఒక్కరు ఎన్ని బాండ్లైనా కొనవచ్చు. పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచవచ్చు. బాండ్లపై వారి పేరు తదితర వివరాలేవీ ఉండవు. బ్యాంకు వాటిని ఎవరికీ వెల్లడించదు. పార్టీలు రూ.20 వేలకు మించిన నగదు విరాళాల వివరాలను విధిగా బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ బాండ్ల విషయంలో అలాంటి నిబంధనేదీ లేదు. ఎంత పెద్ద మొత్తం విరాళంగా అందినా వివరాలను ఈసీతో పాటు ఎవరికీ వెల్లడించాల్సిన పని లేదు. ఇది పారదర్శకతకు పాతరేయడమేనన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రధాన అభ్యంతరం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టిలన్నింటికీ బాండ్లు సేకరించే అవకాశమున్నా ఇది ప్రధానంగా అధికార పార్టిలకే బాగా ఉపయోగపడుతుందన్న వాదనలున్నాయి. ఎన్నికల బాండ్ల పథకం నిబంధనలు పౌరుల సమాచార హక్కు చట్టానికే విరుద్ధమని సుప్రీంకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇవీ అభ్యంతరాలు ► బాండ్ల కొనుగోలుదారులతో సహా అన్ని వివరాలూ గోప్యంగా ఉంటాయి. ఇది పారదర్శకతకు గొడ్డలిపెట్టు. ► భారీగా విరాళాలిచ్చే కార్పొరేట్ సంస్థలు సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక దాని నుంచి భారీగా అనుచిత లబ్ధి పొందే ఆస్కారం చాలావరకు ఉంటుంది. ఇది క్విడ్ ప్రొ కోకు దారి తీస్తుంది. ► పైగా ఈ బాండ్లతో అధికార పార్టిలకే అధిక ప్రయోజనం. దేశవ్యాప్తంగా అత్యధిక బాండ్లు వాటికే అందుతుండటమే ఇందుకు నిదర్శనం. ► మొత్తం ప్రక్రియలో ఎవరి పేరూ బయటికి రాదు గనుక వ్యక్తులకు, సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అధికార పార్టిలు ఇలా బాండ్ల ముసుగులో లంచాలు స్వీకరించే ఆస్కారం కూడా పుష్కలంగా ఉంది. ► పైగా ఈ నిధులను ఎన్నికల కోసమే వాడాలన్న నిబంధనేమీ లేదు. దాంతో వాటిని పార్టిలు తమ ఇష్టానికి ఖర్చు చేసుకోవచ్చు. ► దేనిపై వెచి్చంచాయన్న వివరాలు కూడా ఎవరికీ చెప్పాల్సిన అవకాశం లేదు. ► ఈ పథకం నల్లధనాన్ని మార్చుకునే పరికరంగా కూడా మారింది. ► దీనికి తోడు బాండ్ల కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం అధికార పార్టిలకు ఉంటుంది. ► తద్వారా సదరు వ్యక్తులను, కంపెనీలను వేధించే ప్రమాదమూ ఉంది. అత్యధిక వాటా బీజేపీదే ఎన్నికల బాండ్ల పథకం ద్వారా 2018 మార్చి నుంచి 2024 జనవరి దాకా రూ.16,518.11 కోట్ల విలువైన 28,030 బాండ్లు జారీ అయ్యాయి. వీటిలో పార్టిలన్నింటికీ కలిపి రూ.12,000 కోట్లకు పైగా విరాళాలందాయి. ఎన్నికల సంఘం, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) గణాంకాల ప్రకారం ఇందులో ఏకంగా సగానికి పైగా, అంటే 55 శాతం బీజేపీ వాటాయే కావడం విశేషం. బాండ్ల ద్వారా ఆ పార్టికి రూ.6,566 కోట్లు సమకూరాయి. బీజేపీ మొత్తం ఆదాయంలో సగానికి పైగా బాండ్ల రూపేణా సమకూరినదే. బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టికి రూ.1,123 కోట్లు రాగా ఇతర పార్టిలన్నింటికీ కలిపి రూ.5,289 కోట్లు అందాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Supreme Court of India: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగం కలి్పంచిన భావప్రకటన స్వేచ్ఛకు, సమాచార హక్కుకు విఘాతం కలిగిస్తోందంటూ కుండబద్దలు కొట్టింది. 2018లో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పారదర్శకత, నల్లధనం కట్టడి కోసమే పథకం తెచ్చామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఈ పథకం కింద ఇప్పటిదాకా కొనుగోలు చేసిన బాండ్ల మొత్తం, కొనుగోలుదారులు, స్వీకర్తల పేర్లు తదితరాల వివరాలన్నింటినీ వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ‘‘ఓటేసేందుకు పౌరులకు ఉన్న స్వేచ్ఛపై ఎలాంటి అవాంఛిత ఒత్తిళ్లూ ఉండరాదు. ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతేగాక ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత ప్రభుత్వాల ప్రజాస్వామిక స్ఫూర్తికి అత్యంత కీలకం. అందుకే రాజ్యాంగం కూడా స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యమిచి్చంది. కార్పొరేట్ల నుంచి పారీ్టలకందే ఆర్థిక విరాళాలకు రెండు కారణాలుంటాయి. తద్వారా తమ మద్దతును వ్యక్తీకరించడం. లేదా సదరు విరాళాలు క్విడ్ ప్రొ కో తరహావి కావడం. పరిమిత స్థాయిలో ఉండే వ్యక్తిగత విరాళాలను, అపరిమితమైన కార్పొరేట్ విరాళాలను ఒకే గాటన కట్టలేం. కార్పొరేట్ విరాళాలు స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు విఘాతంగా మారాయి. కనుక సంస్థలు, కంపెనీల నుంచి పార్టీలకు అందే భారీ విరాళాలకు కారణాలను గోప్యంగా ఉంచడాన్ని అనుమతించరాదు’’అని స్పష్టం చేసింది. కేవలం ఎన్నికలే ప్రజాస్వామ్యానికి ఆది, అంతం కావంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రెండు విడి తీర్పులు రాశారు. మోదీ సర్కారుకు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్న ఈ తీర్పుపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ హర్షం వెలిబుచ్చాయి. పలువురు మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్లు కూడా తీర్పును సమరి్థంచడం విశేషం. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. తనతో పాటు జస్టిస్ గవాయ్ తరఫున సీజేఐ 152 పేజీల తీర్పు, తనతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ మిశ్రాల తరఫున జస్టిస్ ఖన్నా 74 పేజీల తీర్పు వెలువరించారు. చాలా లోపాలున్నాయి... ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ తదితరులు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై ధర్మాసనం 2023 అక్టోబర్ నుంచి వాదనలు ఆలకిస్తూ వస్తోంది. ఈ పథకం రహస్య బ్యాలెట్ విధానం వంటిదేనని, విరాళాలిచ్చేవారి గోపనీయతను కాపాడుతుందని కేంద్రం చేసిన వాదన లోపభూయిష్టమని తాజా తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. బాండ్లను కొనుగోలు చేసేలా వ్యక్తులను, సంస్థలను ఈ పథకం ద్వారా ఒత్తిడి చేయవచ్చని పేర్కొంది. బాండ్‌పై దాత పేరుండదు గనుక అవి ఎవరి నుంచి వచ్చాయన్న ఆ విరాళాన్ని అందుకునే పారీ్టకి కూడా తెలిసే అవకాశం లేదన్న కేంద్రం వాదననూ తోసిపుచి్చంది. ‘‘ఈ పథకం లోపరహితం కాదు. విరాళాలు ఇచి్చందెవరో పార్టీలు తెలుసుకునేందుకు అవకాశం కలి్పంచే లోపాలెన్నో ఇందులో ఉన్నాయి’’అని స్పష్టం చేసింది. ‘‘పౌరులు రాజకీయ విశ్వాసాలు, అభిప్రాయాలు ఏర్పరచుకోవడం వారి రాజకీయ వ్యక్తీకరణలో తొలి దశ. అందుకే పౌరుల రాజకీయ విశ్వాసాలకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1)(ఎ) రక్షణ కలి్పస్తోంది. కానీ ఈ పథకం నిబంధనల ప్రకారం బాండ్ల కొనుగోలుదారుల వివరాలను ఓటర్లకు తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. ఇది కలి్పస్తున్న రాజ్యాంగం కలి్పస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమే’’అంటూ తప్పుబట్టింది. అంతేగాక కార్పొరేట్ సంస్థలు పార్టీలకు అపరిమితంగా విరాళాలు అందజేసేందుకు వీలు కలి్పంచేలా కంపెనీల చట్టంలోని నిబంధనను తొలగించడం ఆరి్టకల్ 14 ద్వారా రాజ్యాంగం కలి్పస్తున్న సమానత్వపు హక్కుకు విరుద్ధమని పేర్కొంది. ఎన్నికల బాండ్ల పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటిదాకా దీనికింద కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను మార్చి 6కల్లా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని బాండ్ల జారీ అ«దీకృత సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ప్రతి బాండ్ ముఖ విలువ, కొనుగోలు తేదీ, కొనుగోలుదారు పేరు, తద్వారా పారీ్టలవారీగా అందుకున్న విరాళాలు వంటి అన్ని వివరాలనూ పొందుపరచాలని పేర్కొంది. వాటన్నింటినీ మార్చి 13 కల్లా ఈసీ అధికారిక వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. ఇంకా నగదుగా మార్చుకోని బాండ్లను సంబంధిత పారీ్టలు తిరిగి ఎస్బీఐలో జమ చేయాలని, సదరు మొత్తాలను కొనుగోలుదారు ఖాతాకు బ్యాంకు జమ చేయాలని ఆదేశించింది. పార్టీలు బాండ్ల ద్వారా తమకందిన విరాళాల పూర్తి వివరాలను ఈసీకి సీల్డ్ కవర్లో సమరి్పంచాలని 2019 ఏప్రిల్ 12న ధర్మాసనం మధ్యంతర తీర్పు వెలువరించడం తెలిసిందే. గోప్యత కీలకం: సీజేఐ రాజకీయ పారీ్టకి అందే విరాళాల గురించిన సమాచారం ఓటరుకు తెలియడం తప్పనిసరని సీజేఐ తన తీర్పులో పేర్కొన్నారు. అప్పుడే ఓటు హక్కును ప్రభావవంతంగా వినియోగించుకోగలడన్నారు. ‘‘ఎన్నికల వ్యయంలో నల్లధనం కట్టడికి బాండ్లే ఏకైక మార్గం కాదు. దీనితో పోలిస్తే సమాచార హక్కు స్ఫూర్తికి గండి కొట్టని మెరుగైన ఇతర మార్గాలెన్నో ఉన్నాయి. అయితే అన్ని రాజకీయ విరాళాలనూ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలుగా చూడలేం. చట్టసభల్లో పెద్దగా ప్రాతినిధ్యం లేని పారీ్టలకు కూడా విరాళాలందుతున్నాయి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు, విధానాలను ప్రభావితం చేసేందుకు డబ్బు ఎంతో అవసరం. ఎన్నికల్లో ప్రజాస్వామికంగా పాల్గొనేందుకు కూడా డబ్బు కావాల్సిందే’’అన్నారు. అయితే, ‘‘వ్యక్తుల రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన సమాచారాన్ని అసమ్మతిని అణచివేసేందుకు ప్రభుత్వం రాజకీయంగా వాడుకునే ఆస్కారముంది. అంతేగాక సదరు వ్యక్తులకు ఉద్యోగావకాశాల వంటివాటిని నిరాకరించే ప్రమాదం కూడా ఉంది. అంతేగాక అవి మెజారిటీ అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండే పక్షంలో వారిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే పౌరులకు తమ రాజకీయ విశ్వాసాలను గోప్యంగా ఉంచుకునే హక్కు చాలా ముఖ్యం’’అని సీజేఐ అన్నారు. గోప్యత హక్కుకు రాజ్యంగపరమైన రక్షణ ఉంటుందంటూ 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచి్చన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘ఓటు ఎవరికేస్తున్నదీ గోప్యంగా ఉంచే హక్కు లేకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి. తమకు వ్యతిరేకంగా ఓటేసేవారి ఓట్లను తొలగించేందుకు వాడుకునే ప్రమాదమూ ఉంది. నియోజకవర్గాలను కూడా ఓటర్ల రాజకీయ మొగ్గుదల ఆధారంగా విభజించే ఆస్కారముంది. అప్పుడు ఎన్నికల వ్యవస్థకే అర్థం లేకుండా పోతుంది’’అని ఆందోళన వెలిబుచ్చారు. కాకపోతే ఈ గోప్యత హక్కును పారీ్టలకు అందే విరాళాలకు కూడా వర్తింపజేయవచ్చా అన్నదే ప్రశ్న అని సీజేఐ చెప్పారు. పారీ్టలకు ఆర్థిక విరాళాలకు కూడా రాజ్యంగపరమైన రక్షణ ఉందా అన్న అంశంపై విచారణ జరపాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. క్విడ్ ప్రొ కోకు ఆస్కారం పారీ్టలకు భారీగా ఆర్థిక విరాళాలిచ్చే వారి ఉద్దేశమేమిటన్నది బహిరంగ రహస్యమేనని సీజేఐ అన్నారు. సాధారణంగా కార్పొరేట్ విరాళాల ఉద్దేశం క్విడ్ ప్రొ కో ప్రయోజనాలేనన్న వాదనతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా విభేదించలేదని గుర్తు చేశారు. రాజకీయ సమానత్వానికి మన దేశంలో రాజ్యాంగ రక్షణ ఉన్నా ఆ విషయంలో ఇప్పటికీ అసమానత కొనసాగుతూనే ఉందని సీజేఐ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడంలో వ్యక్తుల సామర్థ్యంలో అసమానతలున్నాయి. ఆర్థిక అసమానతలే అందుకు కారణం. పారీ్టలకందే ఆర్థిక సాయాన్ని కూడా ఈ అసమానతలు నియంత్రిస్తున్నాయి. సంపన్నులకు పారీ్టలకు భారీ ఆర్థిక విరాళమిచ్చే సామర్థ్యముంటుంది. తద్వారా ప్రజాప్రతినిధులకు దగ్గరయ్యేందుకు, ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు కూడా అవకాశముంటుంది. ఇది వారికి కావాల్సిన లైసెన్సులివ్వడమో, వారికి అనుకూలమైన విధాన నిర్ణయాలు తీసుకోవడమో జరగే ఆస్కారముంది. ఇలా క్విడ్ ప్రొ కో జరిగే అవకాశముంది’’అన్నారు. రాజకీయ సమానత్వాన్ని పాటించే సమాజంలో పౌరులందరికీ రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసే విషయంలో సమానంగా గళమెత్తే అవకాశం చాలా కీలకమని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయడానికి జస్టిస్ ఖన్నా తన తీర్పులో పలు కారణాలను ఉటంకించారు. స్పందనలు ‘‘ఈ తీర్పు ద్వారా నల్లధన మారి్పడి వ్యవస్థను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేంద్రం ఇప్పటికైనా ఇలాంటి మతిలేని ఆలోచనలు కట్టిపెడుతుందని ఆశిస్తున్నా. ఎన్నికల బాండ్ల పథకం కింద 95 శాతం నిధులు ఒక్క బీజేపీకే అందాయి’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘‘మోదీ ప్రభుత్వ అవినీతి విధానాలకు ఇది మరో నిదర్శనం. ఎన్నికల బాండ్లను లంచాలు, కమిషన్లు తీసుకునే మార్గంగా బీజేపీ మార్చుకుంది. దీనికి సుప్రీంకోర్టు తెర దించింది’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ఎన్నికల బాండ్లు సదుద్దేశంతో తెచి్చన పథకం. విపక్షాలు దీన్ని అవసరంగా రాజకీయం చేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం’’ – బీజేపీ ‘‘తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తెచ్చేందుకు ఇదెంతగానో దోహదపడుతుంది’’ – ఆమ్ ఆద్మీ పార్టీ ‘‘పాలక పార్టీ లబ్ధి కోసం తీసుకొచి్చన అక్రమ పథకానికి సుప్రీంకోర్టు తీర్పు తెర దించింది’’ – సీపీఎం ‘‘తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల బాండ్లు అప్రజాస్వామికం, రాజ్యాంగవిరుద్ధం’’ – సీపీఐ (ఎంఎల్) ‘‘ఇది గత ఆరేడేళ్లలో వెలువడ్డ అత్యంత చరిత్రాత్మక తీర్పు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని ఈ తీర్పు పునరుద్ధరిస్తుంది. – కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ ‘‘తీర్పు స్వాగతించదగ్గదే. అయితే ఎన్నికల నిధుల వ్యవస్థ ప్రక్షాళనకు చేయాల్సింది చాలా ఉంది’’ – కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి. -
16,000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ విక్రయం.. ఏ పార్టీకి ఎన్ని నిధులు?
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కుకు ఉల్లంఘన అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రధాన రాజకీయ పార్టీలపై పెను ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని సర్వోన్నత న్యాయస్ధానం రద్దు చేయడం బీజేపీకి గట్టి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే 2016 నుంచి 2022 మధ్య ఈ స్కీమ్ కింద పార్టీలకు సమకూరిన విరాళాల్లో 60 శాతం పైగా కాషాయ పార్టీకే లభించాయి. 2017-18 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిని ప్రవేశ పెట్టారు. ఈ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అయితే.. ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి వివరాల్ని బ్యాంక్, రాజకీయ పార్టీలు గోప్యంగానే ఉంచుతాయి. చదవండి: లంచాలు, కమీషన్ల కోసమే ఎన్నికల బాండ్లు.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్ కాగా ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. 2016 నుంచి 2022 మధ్య రూ. 16,437. కోట్ల విలువైన 28,030 ఎలక్టోరల్ బాండ్లు ఎస్బీఐ విక్రయించింది. మొత్తం విరాళాల్లో బీజేపీకి 60 శాతం పైగా రూ. 10,122 కోట్లు సమకూరాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొత్తం విరాళాల్లో 10 శాతం రూ. 1547 కోట్ల విరాళాలను స్వీకరించింది. పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ 8 శాతంతో రూ. 823 కోట్ల విరాళాలను స్వీకరించింది. ఈ జాబితాలో 30 పార్టీలకు అందిన విరాళాలతో పోలిస్తే బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. ఇంకా ఈ జాబితాను పరిశీలిస్తే సీపీఎం రూ. 367 కోట్లు, ఎన్సీపీ రూ. 231 కోట్లు, బీఎస్పీ రూ. 85 కోట్లు, సీపీఐ రూ 13 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా సమీకరించాయి. 2017 నుంచి 2022 వరకు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పొందిన విరాళాల కంటే బీజేపీఐదు రెట్లు ఎక్కువ విరాళాలను పొందింది. -
లంచాలు, కమీషన్ల కోసమే ఎన్నికల బాండ్లు.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ, వాటిని నిలిపివేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయని మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ లంచం, కమీషన్లు స్వీకరించేందుకు సాధనంగా మార్చుకుందని విమర్శించారు. సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులతో నేడు దీనికి పరిష్కారం లభించిందని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పార్లమెంట్, రాజ్యాంగం తీసుకొచ్చి రెండు చట్టాలను ఉల్లంఘించినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు . సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నోట్ల కంటే ఓట్లకే ఎక్కువ శక్తి అనే వాస్తవాన్ని బలపరిచిందన్నారు. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. చదవండి: ‘రాజకీయ పార్టీల విరాళాల’ పిటిషన్.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు కాగా ఎన్నికల బాండ్ల జారీని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌కు చట్టబద్ధత ఉంటుందా లేదా అన్న పిటీషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడిచింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్దమని ఏకపక్షమని, పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని పేర్కొంది. రాజకీయ పార్టీలు, డోనర్ల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాటుకు దారితీయవచ్చని తెలిపింది. నల్లధనం సమస్యను పరిష్కరించేందుకు, దాతల గోప్యతను కాపాడటం అనే నిర్దేశిత లక్ష్యం ఈ పథకాన్ని సమర్థించలేదని పేర్కొంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని కోర్టు అభిప్రాయపడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే ఈ ఎన్నికల బాండ్ల జారీని ఆపివేయాలని, అలాగే బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలను భారత ఎన్నికల సంఘానికి అందజేయాలని సీజేఐ పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘం మార్చి 13లోగా తమ వెబ్సైట్లో ప్రచురించాలని చెప్పారు. -
ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
ఎన్నికల బాండ్ల స్కీమ్‌పై సంచలన తీర్పు
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ)ను అనుసరించి.. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. అలాగే.. నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటు కాదంటూ ఏకగ్రీవ తీర్పును రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది . ‘‘ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ స్కీమ్ ఒక్కటే మార్గం కాదు. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది క్విడ్ ప్రోకో కు దారి తీస్తుంది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదు. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుంది. రహస్య విరాళాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. అదే సమయంలో ఎలక్టోరల్ బాండ్స్‌ను వెంటనే నిలిపివేయాలని.. వాటిని అమ్మకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి ఇప్పటిదాకా జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మూడు వారాల్లో(మార్చి 6వ తేదీలోగా) కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐను సుప్రీం ఆదేశించింది. అలాగే పార్టీలకు వచ్చిన ఫండ్ ఎవరిచ్చారో తెలియ పర్చాల్సిన అవసరం ఉందని.. ఆ వివరాలను బహిర్గత పర్చాల్సిన అవసరమూ ఉందని.. ఎలక్టోరల్ బాండ్స్ ఏ రాజకీయ పార్టీకి ఎంత వచ్చాయన్న వివరాలు మార్చి 13వ తేదీ లోగా తన వెబ్సైట్లో పొందుపర్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. మరోవైపు.. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్న విరాళాలను వెనక్కి ఇచ్చేయాల్సిందేనని(ఇంకా ఎన్‌క్యాష్ అవ్వని బాండ్లను) రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం 15 రోజుల గడువు విధించింది. తీర్పుపై పిటిషనర్ల లాయర్ స్పందన ఎన్నికల బాండ్స్‌ను సుప్రీం కోర్టు ఆపేసింది పిటిషనర్ల వాదనతో పూర్తిస్థాయిలో కోర్టు ఏకీభవించింది ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీల చట్టాల్లో చేసిన సవరణలను కొట్టేసింది సమాచార చట్టం ఉల్లంఘన కింద సుప్రీం కోర్టు పరిగణించింది విరాళాలు ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది పిటిషనర్ల తరఫు వాదించిన సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ పిటిషన్ల నేపథ్యం.. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకుర్, సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని అక్టోబరు 10న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్(ఏడీఆర్ తరఫున) చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో కిందటి ఏడాది అక్టోబర్ 31న వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. నవంబర్ 2వ తేదీన తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కానిస్టిట్యూషన్ బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సీల్డ్ కవర్లో 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కూడా. ఏంటీ ఎన్నికల బాండ్లు..? ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్లు పోగు! పిటిషనర్ల వాదన ఇదే.. కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది అధికారప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలను కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోంది ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకూ సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయి విపక్ష పార్టీలకు స్వల్ప మొత్తంలోనే విరాళాలు వచ్చాయి ఈ మేరకు గణాంకాలతో సహా వివరించారు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కేంద్రం వాదన.. ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధనం ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు, 2.38 లక్షల డొల్ల కంపెనీలపై చర్యలు వంటివి కేంద్రం తీసుకుంది. స్వచ్ఛమైన డబ్బే రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం మరో ప్రయత్నం చేసింది ఒక దశలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ...‘‘అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయి. దీనికి కారణమేమిటి’’ అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి, దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని ఆయన సూచించారు. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ....‘అప్పుడు అసలు విరాళాలే రావ’ని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదని అందులో పేర్కొన్నారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయి గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోంది ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరు అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదు అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుంది ఇదీ చదవండి: 2023 డిసెంబర్ నాటికి రూ.15 వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం రాజకీయ అభ్యంతరాలు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్య ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీకి రూ.5,127.97 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. మిగతా అన్ని జాతీయ పార్టీలకు కలిసి కేవలం రూ.1,783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. దీని ప్రకారం ఎలక్టోరల్ బాండ్లతో అధికార పార్టీకి ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. -
సాధారణ ఎన్నికల్లో ఓటర్లు ఎంతమందంటే..!
ప్రజాప్రతినిధులను ఎన్నుకోని తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వివిధ స్థాయిల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు. ఈసారి దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌లోనే జరగనున్నాయి. అలాగే ఎన్నికల ముఖ్య అధికారి సాధారణ ఎన్నికల జరిగే అవకాశం ఉన్న తాత్కాలిక తేదీని కూడా జారీ చేశారు. ఆ తేదీకి అటు ఇటుగా పలు దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఈ సారి ఓటర్లు ఎంతమంది? వారిలో మహిళా ఓటర్లు ఎంతమందంటే..? ఈసారి దేశంలో జరగబోయే సాధారణ ఎన్నికల కోసం ప్రంపచంలోనే అత్యధిక మంది ఓటర్లు నమోదయ్యారని ఎన్నికల సంఘం పేర్కొంది. అందుకోసం ఇంటెన్సివ్ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పేరుతో జరిపిన సర్వేలో ఈ విషయంలో వెల్లడయ్యింది. అంతేగాదు జనవరి 1,2024ని అర్హత తేదీగా సూచిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/స్వయం ప్రతిపత్తి ప్రాంతాల వారిగా ఓటర్ల జాబితాలను కూడా ప్రచురించింది. అలాగే నియోజక వర్గాల విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్, అస్సాం వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా ఓటర్ల జాబితాల సవరణ పూర్తయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏకంగా 96.88 మంది అత్యధిక ఓటర్లు నమోదయ్యారు. ఈ ఓటర్ల జాబితాలో లింగ సమానత్వం హైలెట్‌గా నిలిచింది. ఈసారి కనివినీ ఎరుగని రీతీలో మహిళా ఓటర్ల నమోదులో పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది కొత్తగా 2.63 కోట్ల మంది ఓటర్లు నమోదవ్వగా, వారిలో మహిళా ఓటర్ల జాబితా ఏకంగా 1.41 కోట్ల మంది నమోదు చేసుకోవడం విశేషం. ఓటు హక్కు వినియోగంలో పురుష ఓటర్ల కంటే సుమారు 15% పెరిగింది. అంతేగాదు లింగ నిష్పత్తి 2019లో 940 ఉండగా అది కాస్తా 2024కి 948కి పెరిగడం విశేషం. అలాగే ఈసారి 2 కోట్ల మంది యువ ఓటర్లు నమోదు చేసుకున్నారు. దీంతోపాటుగా వికలాంగులకు కూడా ఓటింగ్‌లో అన్ని రకాల వెసులబాటు కల్పించడంతో వారి నమోదు కూడా కాస్త పెరిగింది. ఎన్నికల సంఘం అధికారుల చేత ఇంటింటికి సమగ్ర సర్వే చేయించి మరీ ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఆ జాబితాలో 1,65,76,654 మంది చనిపోయినవారు, డూప్లికేట్ ఓటర్లు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినవారు ఉన్నారు. ఇందులో 67,82,642 మంది చనిపోయిన ఓటర్లు, 75,11,128 మంది శాశ్వతంగా మారిన/గైర్హాజరైన ఓటర్లు ఉండగా, 22,05,685 నకిలీ ఓటర్లు ఉన్నారు. అలాగే ఈసారి ఓటర్లగా నమోదు చేసుకునే దరఖాస్తులు ఏకంగా 10.64 లక్షలకు పైగా వచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొది. .ఈ సారిగా ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకునేలా ముఖ్యంగా బలహీన గిరిజన వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇంత భారీ స్థాయిలో ఓటర్లు నమోదవ్వడం అనేది భారతదేశం స్థితిస్థాపకత, ప్రజలకు ప్రజాస్వామ్య విధానం పట్ల ఉన్న నిబద్ధతను నొక్కి చెబుతోంది. ఎన్నికల సంఘం దృష్టి సారించిన అంశాలు.. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్‌ను ఎక్కువ మంది ఓటర్లు నమోదయ్యేలా ఈ కింది అంశాలపై ప్రత్యేక దృష్టి సారించేలా అధికారులు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవేంటంటే.. పారదర్శకత స్వచ్ఛత లింగ నిష్పత్తి చేరిక పారదర్శకత చర్యలు వివిధ రాజకీయ పార్టీలతో తరచుగా జిల్లాఎన్నికల అధికారులు,ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు సాధారణ సమావేశం అవ్వడం. స్పెషల్ సమ్మరీ రివిజన్తో డేటా సేకరించడం. ఓటర్ల జాబితా కాపీలను రాజకీయ నాయకులతో కలిసి షేర్ చేసుకోవడం. వారి అభ్యంతరాలను నోటీసు చేయండం. గడవు ముగిసేలోపు చేయాల్సిన ధృవీకరణ, ఫీల్డ వెరిఫికేషన్ స్వచ్ఛత డూప్లికేట్/బహుళ ఎంట్రీల తొలగింపు. చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు. ఓటర్ల ఫోటోల్లో వ్యత్యాసాలను తొలగించడం అలాగే ఓటర్ల ఫోటోల చిత్ర నాణ్యతను మెరుగుపరచడం. అంతరాలు లేకుండా.. ఓటర్లు/జనాభా నిష్పత్తితో అంతరాలు తగ్గించడం లింగ నిష్పత్తి వయస్సు వారీగా జాబితా తీసుకోవడం (ప్రత్యేకంగా 18 నుంచి 19, 19 నుంచి 20 ఏళ్లు వారీగా ) చేరిక: దివ్యాంగులు సులభంగా ఓటు వేసేలా ఎన్నికల డేటాబేస్‌లో గుర్తింపు ముఖ్యంగా చదువుకున్న యువత నమోదుపై దృష్టిసారించేలా చేయటం మహిళా ఓటర్లను పెంచేలా డ్రైవ్‌లు అలాగే థర్డ్ జెండర్‌లో పెరుగుతున్న నమోదు కోసం కేంద్రీకృత వ్యూహం ముఖ్యంగ బలహీన గిరిజనలు నూటికి నూరు శాతం నమోదు చేసుకునేలా ప్రత్యేక ప్రయత్నాలు. ఇంతలా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భారీగా నమోదు రాజకీయ పార్టీలు, పౌరులు అందించిన సహకారం వల్లే సాధ్యమయ్యిందని ఎన్నికల కమిషన్ పేర్కోంది. అలాగే ఎలక్టోరల్ జాబితా సవరణ 2024లో ఇంకా ఎన్రోల్ చేయించుకోని అర్హులైన పౌరులు ఇప్పటికైనా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నామినేషన్ లోపు ఓటర్లు అప్డేట్ చేయించుకునే వెసులుబాటు ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. (చదవండి: 'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..!) -
దేశంలో ఎన్నికలే ఎన్నికలు!,ఎస్బీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్రం మంగళవారం నుంచి (2వ తేదీ) 30వ విడత ఎలక్టోరల్ బాండ్ల జారీకి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి ఆమోదం తెలిపింది. రాజకీయ నిధుల విషయంలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలకు ఇచ్చే ప్రత్యక్ష నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రూపొందించారు. 17వ లోక్‌సభ కాలపరిమితి ముగుస్తున్నందున ఈ ఏడాది మధ్యలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఎలక్టోరల్ బాండ్ల విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 30వ ఫేజ్ ఆఫ్ సేల్‌లో భాగంగా జనవరి 2 నుండి జనవరి 11వ తేదీ వరకూ తన 29 అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి, ఎన్‌క్యాష్ చేయడానికి ఎస్బీఐని అనుమతించడం జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2018 నుంచీ అమలు.. మొదటి బ్యాచ్ ఎలక్టోరల్ బాండ్ల విక్రయం మార్చి 2018లో జరిగింది. ఎలక్టోరల్ బాండ్లను అర్హత కలిగిన రాజకీయ పార్టీ తన అధీకృత బ్యాంకులో ఉన్న బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఎన్‌క్యాష్ చేసుకోగలుగుతుంది. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి ఎస్బీఐ మాత్రమే అధీకృత బ్యాంకు. బెంగళూరు, లక్నో, సిమ్లా, డెహ్రాడూన్, కోల్‌కతా, గౌహతి, చెన్నై, పాట్నా, న్యూఢిల్లీ, చండీగఢ్, శ్రీనగర్, గాంధీనగర్, భోపాల్, రాయ్‌పూర్ ముంబైలు అధీకృత ఎస్బీఐ శాఖల్లో కొన్ని. ఎలక్టోరల్ బాండ్లు జారీ చేసిన తేదీ నుండి 15 క్యాలెండర్ రోజుల వరకు చెల్లుబాటు అవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత బాండ్‌ను డిపాజిట్ చేసినట్లయితే, సంబంధిత రాజకీయ పార్టీకి ఆయా చెల్లింపులు జరగవు. అర్హత కలిగిన రాజకీయ పార్టీ నిర్దిష్ట కాలంలో తన ఖాతాలో జమ చేసిన ఎలక్టోరల్ బాండ్ అదే రోజు జమ అవుతుంది. గత లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 1 శాతం ఓట్లను పొందిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు పొందేందుకు అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
రూ.15 వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం
సాక్షి, న్యూఢిల్లీ: 2018 ఏడాది నుంచి ఇప్పటిదాకా రూ.15 వేల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను విక్రయించామని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) వెల్లడించింది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కింద ఒక ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎస్బీఐ ఈ విషయం చెప్పింది. ‘‘2018 ఏడాది నుంచి ఇప్పటిదాకా 29 దఫాలుగా ఎలక్టోరల్ బాండ్లను విక్రయించాం. వాటి మొత్తం విలువ రూ.15,956.30 కోట్లు. ఇందులో రూ.23.88 కోట్ల విలువైన 194 బాండ్లు ఏ రాజకీయ పార్టీ బ్యాంక్ ఖాతాలో జమకాని కారణంగా ఆ బాండ్ల మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్ఆర్ఎఫ్)కు బదిలీ చేశాం’’ అని బ్యాంక్ తెలిపింది. లోకేశ్ బాత్రా అనే మాజీ నావికా అధికారి ఆర్టీఐ చట్టం కింద అభ్యరి్థంచడంతో బ్యాంక్ పై విధంగా సమాధానమిచి్చంది. -
ఆ విరాళాల వివరాలు మాకివ్వండి: ఈసీ
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన విరాళాల వివరాలను నవంబర్ 15 సాయంత్రంలోగా అందించాలని పారీ్టలను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అందిన విరాళాల వివరాలను సీల్డ్ కవర్లో నివేదించాలని ఈసీని సర్వోన్నత న్యాయస్థానం ఈనెల రెండో తేదీన ఆదేశించిన నేపథ్యంలో ఈసీ పై విధంగా స్పందించింది. ‘‘ ఒక్కో ఎలక్టోరల్ బాండ్ విలువ ఎంత? ఆ బాండ్ విలువలో ఎంత మొత్తాన్ని మీ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు? మొత్తం ఎన్ని బాండ్లు మీకు వచ్చాయి? మొత్తం బాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాలు..’ ఇలా ప్రతీదీ సవివరంగా పేర్కొంటూ జాబితాను డబుల్ సీల్డ్ కవర్లో సమరి్పంచండి’’ అంటూ ఆయా పారీ్టల చీఫ్‌లకు ఈసీ లేఖలు పంపింది. -
విరాళాల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విరాళాలు అందుకునేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై వాదనలు గురువారం ముగిశాయి. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ‘ ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల సమగ్ర డేటాను సీల్డ్ కవర్లో మాకు రెండు వారాల్లోగా అందజేయండి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ధర్మాసనం ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. బాండ్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సీపీఐ(ఎం) నేత, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)లు విడివిడిగా పిటిషన్ల వేయడం తెల్సిందే. బాండ్లను విక్రయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విరాళాల దాతల వివరాలు అడగబోము. కానీ ఎన్ని బాండ్లు విక్రయించారు, ఎంత మొత్తం పార్టీల ఖాతాల్లో జమ అయిందనే వివరాలు ఇవ్వండి’ అని ఈసీకి కోర్టు సూచించింది. ‘పరస్పర సహకార’ ధోరణికి ఈ బాండ్ పనిముట్టుగా మారొద్దు: అధికార పార్టీ నుంచి ప్రయోజనం పొందే వారు.. అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారీగా విరాళాల ద్వారా లబ్ది చేకూర్చడం, ఆతర్వాత అధికార పార్టీ నుంచి వారు అదే స్థాయిలో లబ్ధిపొందటం వంటి ధోరణి ఉండొద్దు. లబ్దిదారులు, అధికారి పార్టీ మధ్య నీకిది నాకది(క్విడ్ ప్రో కో) తరహా విధానానికి ఎలక్టోరల్ బాండ్ అనేది పనిముట్టుగా మారకూడదు’ అని వాదోపవాదనల సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ దాత వివరాలు గ్రహీత పార్టీకి తెలుసు. తాను ఎవరికి విరాళమిచ్చేది ఇంకో పార్టీకి తెలియకూడదని దాత కోరుకుంటున్నాడు. విరాళాల బదిలీ వ్యవహారం దాతకు, ఆ రాజకీయ పార్టీకి ముందే తెలిసినప్పుడు ఈ వివరాలు సాధారణ పౌరుడికి మాత్రం తెలియాల్సిన పని లేదని కేంద్రం వాదించడంలో ఆంతర్యమేంటి?’ అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. -
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వండి: ఈసీకి సుప్రీం ఆదేశం
సాక్షి, ఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమీకరించే పథకం ద్వారా లంచాలను చట్టబద్ధం చేశామా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్‌లో అవకతవకలు, గోప్యతల విషయంలో దాఖలైన వాజ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కేసు విచారణ మంగళవారం మొదలు కాగా..మూడో రోజైన గురువారం కూడా కొనసాగింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పొందిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సీల్డ్ కవర్లో అందించాలని ఆదేశిస్తూ 2019 ఏప్రిల్ 12 నాడు సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశశాలను ప్రస్తావించింది. ఏప్రిల్ 2019 ఉత్తర్వులు ప్రకటించిన తేదీకే పరిమితం కాదని పేర్కొంది. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఏదైనా సందేహాలు ఉంటే సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సాగిన విచారణలో.. ఈసీఐ తన వద్ద తాజా వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అయితే ఏప్రిల్ 12, 2019న జారీ చేసిన మధ్యంతర ఆదేశాల ప్రకారం.. ఎన్నికల కమిషన్ 2023 సెప్టెంబర్ 30 వరకు వివిధ రాజకీయపార్టీలు ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా పొందిన విరాళాల వివరాలను తమ అందించాలని ఆదేశిస్తున్నట్లు బెంచ్ తెలిపింది అంతకుముందు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున తన వాదనలను కొనసాగిస్తూ... ‘‘నిర్ణయం మరీ ఏకపక్షమైంద కానంత వరకూ ప్రయోగాలు చేసే హక్కు చట్టసభలకు ఉంది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఏమైందన్నది ప్రశ్న. ఆ ధోరణలను బెంచ్ ముందు ఉంచాం’’ అని ధర్మాసనానికి వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయవాది కనూ అగర్వాల్ కల్పించుకుని మాట్లాడుతూ గతంలో రూ.20 వేల కంటే తక్కువ మొత్తం నిధులు చెల్లించే వారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండేది కాదని.. పార్టీలు ఈ అంశాన్ని అవకాశంగా మార్చుకుని అధికశాతం విరాళాలు ఈ మొత్తం కంటే తక్కువ ఉండేలా జాగ్రత్త పడ్డాయని, పథకాన్ని దుర్వినియోగం చేశాయని బెంచ్ దృష్టికి తీసుకు వచ్చారు. సోలిసిటర్ జనరల్ దీనికి ఉత్తరమిస్తూ... ప్రస్తుతం కొంచెం అనుమానాస్పదమైన రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న విరాళాలు తగ్గాయని, ఎలక్టోరల్ బాండ్లు పెరిగాయని తెలిపారు. ఈ దశలో జస్టిస్ ఖన్నా కలుగజేసుకుని మాట్లాడుతూ రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న ఎలక్టోరల్ బాండ్లు ఎంత మేరకు వచ్చాయో చూపాలని కోరారు. బాండ్లు ఎక్కువై ఉంటే ఆ విషయం దీని ద్వారా తెలుస్తుందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు నిరాకరించిన పార్టీ ఇప్పటికీ అంతకంటే తక్కువ మొత్తమున్న స్వచ్ఛంద విరాళాలను స్వీకరిస్తోందని సోలిసిటర్ జనరల్ తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు పెరిగితే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గుతాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించమన్న పార్టీ విషయంలో మాత్రమే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గడం లేదని తెలిపారు. అందుకే ఆ పార్టీ పాత పద్ధతి కోసం డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. అనంతరం.. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ఎలక్షన్ ఫండింగ్, పార్టీ ఫండింగ్, క్యాంపెయిన్ ఫండింగ్ ఇవన్నీ కాలిడోస్కోప్(రంగురంగుల చిత్రాలను ప్రదర్శించే గాజుగొట్టం) లాంటిది. ఇదంతా ఆసక్తికరమైన ప్రయోగాంశంమేనన్నారు. -
Electoral bonds case: పలు సమస్యలున్నాయి!
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లతో పలు సమస్యలున్నాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాలు పొందేందుకు పారీ్టలన్నింటికీ అవి సమానావకాశం కలి్పంచకపోతే వివక్షే అవుతుందని అభిప్రాయపడింది. ‘అంతేగాక ఈ పథకంలో అస్పష్టత కూడా దాగుంది. బాండ్లు కొనేవారి వివరాలు ఎవరికీ తెలియకుండా సంపూర్ణ గోప్యత పాటించడమూ వీలు కాదు. వారి వివరాలను సంబంధిత బ్యాంకు (ఎస్బీఐ), దర్యాప్తు సంస్థలు తెలుసుకునే వీలుంది’ అని అభిప్రాయపడింది. అంతేగాక విపక్షాల బాండ్లను కొనేవారిపై అధికార పక్షాలు ప్రతీకారానికి దిగకుండా ఎటువంటి రక్షణా లేదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఏ పార్టీ ఎంత పవిత్రమైనదో తేల్చడం మా ఉద్దేశం కాదు. ఎన్నికల బాండ్ల పథకానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్నదానిపై మాత్రమే విచారణ జరుపుతున్నాం’’ అని స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సీజేఐ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం రోజంతా విచారణ జరిపింది. ‘‘ఎన్నికల ప్రక్రియలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న ఈ పథకం ఉద్దేశం అభినందనీయమే. కానీ ఈ పథకంలో అతి పెద్ద సమాచార లోపముంది’’ అని అభిప్రాయపడింది. ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్నారు.