ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తన అధికార వెబ్‌సైట్ (https://www.eci.gov.in/)లో పొందుపర్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన.. న్యూమరికల్ నంబర్లతో కూడిన బాండ్ల పూర్తి డేటాను ఈసీ గురువారం వెబ్‌సైట్ అప్‌లోడ్ చేసింది. ఈ డేటాలో ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంత ఫండ్స్ ఇచ్చాయి? బాండ్ల సీరియల్ నంబర్లు ఇందులో ఉన్నాయి. దాతల విక్రయ వివరాలు, నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలను వేర్వేరు డాక్యుమెంట్లలో పొదుపరిచింది.
ఇవాళ ఎస్‌బీఐ.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ సమర్పించిన డేటాలో.. ఎలక్టోరల్ బాండ్లు కొన్నవారి పేర్లు. బాండ్ల నంబర్లు. బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల పేర్లు. రాజకీయ పార్టీ బ్యాంక్ ఖాతా నంబర్‌లో చివరి నాలుగు అంకెలు. ఏ పార్టీ ఎన్ని బాండ్లను నగదు రూపంలో మార్చుకున్న పూర్తి వివరాలు ఉన్నాయి.
ఇక..‘బ్యాంక్ అకౌంట్ల భద్రత (సైబర్ సెక్యూరిటీ) విషయంలో రాజకీయ పార్టీల పూర్తి బ్యాంక్ ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బహిర్గతం చేయటంలేదు. ఎన్నికల బాండ్ల కొనుగోలుదారుల కేవైసీ వివరాలను సైతం భద్రతా కారణాల రీత్యా వెల్లడించటం సాధ్యం కాదు. అయితే రాజకీయ పార్టీలను గుర్తించేందుకు ఆ వివారాలు అవసరం లేదు’ అని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఎస్‌బీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment