ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇన్‌ఫ్రా, ఫార్మా కంపెనీలతోపాటు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వాటిలో ఐటీ కంపెనీలు ఉండడం విశేషం.
తాజాగా ఎస్‌బీఐ విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాల ప్రకారం.. ఐటీ రంగంలో సియెంట్ కంపెనీ గరిష్ఠంగా రూ.10 కోట్లు విలువ చేసే బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఆ కంపెనీ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందో తెలియరాలేదు. తదుపరి స్థానంలో జెన్‌సర్ టెక్నాలజీస్ మే 2019లో రూ.3 కోట్లు విలువచేసే వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మూడో స్థానంలో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ 2018 కర్ణాటక ఎన్నికల ముందు దేవెగౌడకు చెందిన జనతాదళ్(సెక్యూలర్) పార్టీకి రూ.1 కోటి విరాళం ఇచ్చినట్లు తెలిసింది.
రాజకీయ పార్టీలకు కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఎస్‌బీఐ ఇటీవల వివరాలు వెల్లడించింది.
ఇదీ చదవండి: ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులుండవు.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం
కంపెనీల వారీగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వివరాలు..
- ఫ్యుచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ రూ.1,368 కోట్లు
- మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ.966 కోట్లు
- క్విక్ సప్లైచెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.410 కోట్లు
- వేదాంత లిమిటెడ్ రూ.400 కోట్లు
- హల్దియా ఎనర్జీ రూ.377 కోట్లు
- భారతి గ్రూప్ రూ.247 కోట్లు
- ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.224 కోట్లు
- వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్సిమిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు
- కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ రూ.195 కోట్లు
- మదన్‌లాల్ లిమిటెడ్ రూ.185 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment