Infosys
-
ఇన్ఫోసిస్ యూటర్న్..
ఉద్యోగుల తొలగింపులపై దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) దూకుడు తగ్గించింది. ఉద్యోగులు నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తన రాబోయే ఉద్యోగుల మదింపులను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయం సరికొత్త ఎత్తుగడ అని, ఇటీవలి తొలగింపుల (Layoff) నుండి దృష్టిని మరల్చడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఎంప్లాయీ వెల్ఫేర్ గ్రూప్ నాజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆరోపించింది.తొలగింపుల నేపథ్యంఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న 700 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ప్రధానంగా 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందిన ఫ్రెషర్స్ ఉన్నారు. వీరు ఇప్పటికే ఆన్‌బోర్డింగ్‌లో రెండు సంవత్సరాల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. అంతర్గత మదింపుల ఆధారంగా ఈ తొలగింపులు జరిగినట్లు సమాచారం. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సదరు ఉద్యోగులకు మూడు అవకాశాలు ఇచ్చినట్లు కంపెనీ చెబుతోంది. అయితే తొలగింపునకు గురైన ఉద్యోగులు దీనిని ఖండిస్తున్నారు. అసెస్ మెంట్ సిలబస్ ను మధ్యలోనే మార్చారని, ముందస్తు సమాచారం లేకుండానే చాలా మందికి తొలగింపు నోటీసులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.ఎన్ఐటీఈఎస్ స్పందన..ఇన్ఫోసిస్ చర్యలను విమర్శిస్తూ, తొలగింపులు కార్మిక హక్కుల ఉల్లంఘనగా ఎన్ఐటీఈఎస్ అభివర్ణించింది.. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, మదింపులను ఆలస్యం చేయాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తొలగింపులపై మరింత వివాదం కొనసాగకుండా కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు.ఇన్ఫోసిస్ సమర్థనఉద్యోగులకు అదనపు ప్రిపరేషన్ సమయాన్ని అందించడమే లక్ష్యంగా మదింపులను వాయిదా వేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. కంపెనీ తమ అన్ని కార్యకలాపాలలో సమ్మతి, పారదర్శకతను పాటించడంలో తమ నిబద్ధతను నొక్కి చెప్పింది. ఇన్ఫోసిస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ మాట్లాడుతూ.. కంపెనీ కార్మిక శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వారి విచారణలకు సహకరిస్తూ అవసరమైన సమాచారాన్ని అందిస్తోందని తెలిపారు.ఉద్యోగులపై ప్రభావం..మదింపులను నిరవధికంగా వాయిదా వేయడం చాలా మంది ఉద్యోగులను వారి భవిష్యత్తుపై మరింత అనిశ్చితికి గురిచేసింది. ఆయా అంశాల్లో నిపుణులతో అదనపు శిక్షణ, ఇతర సహకారం అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ఆందోళన తొలగడం లేదు. ఉద్యోగుల తొలగింపు, మదింపుల వాయిదాతో తలెత్తిన వివాదం భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. -
ఇన్ఫోసిస్‌లో 20,000 నియామకాలు!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్(Infosys) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికకు అనుగుణంగా సాగుతున్నట్టు వెల్లడించింది. కొత్తగా చేరిన వారికి ఉత్తమ కార్పొరేట్ శిక్షణ ఇవ్వనున్నట్టు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ తెలిపారు.ఇదిలాఉండగా, 300 మంద్రి ఫ్రెషర్లను తొలగించినట్టు కంపెనీ ఇటీవల వెల్లడించింది. ‘మైసూరు క్యాంపస్‌లో వీరికి ప్రాథమిక శిక్షణ పూర్తి అయింది. అంతర్గతంగా నిర్వహించిన మదింపు ప్రక్రియలో మెరుగైన పనితీరు కనబర్చలేదు. మూడు విడతలుగా అవకాశం ఇచ్చాం. అయినా ఉత్తీర్ణులు కాలేదు. దీంతో ఉద్వాసన పలకాల్సి వచ్చింది’ అని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఉద్యోగులను ఎటువంటి ఒత్తిడికి గురి చేయలేదని మాథ్యూ వివరించారు. మదింపు ప్రక్రియలో పనితీరు కనబర్చని ఫ్రెషర్ల తొలగింపు సాధారణమే. అయితే గతంలో ఇది 10 శాతానికి లోబడి ఉండేది. ఈ నెలలో ఇది ఏకంగా 30–40 శాతం ఉన్నట్టు సమాచారం. ఇదే వివాదానికి కేంద్ర బిందువైంది. ఇదీ చదవండి: భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం ఎంతంటే..అక్రమంగా, అనైతికంగా..ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్) వాదన మరోలా ఉంది. మైసూరు శిక్షణ కేంద్రం నుంచి 700 మందికిపైగా ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ తొలగించిందని ఆరోపిస్తోంది. అక్రమంగా, అనైతికంగా ఉద్యోగులను తొలగించారంటూ కార్మిక శాఖకు సైతం నైట్స్ ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో టెర్మినేషన్‌కు గురైన వారంతా 2022 హైరింగ్ బ్యాచ్‌కు చెందినవారు. రెండేళ్ల నిరీక్షణ తర్వాత 2024 సెప్టెంబర్‌లో జాబ్స్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ 2024లో అమలు చేసిన పరీక్షా విధానం కఠినంగా ఉంది. సిలబస్ ఎక్కువగా ఉండడం, శిక్షణ సమయం తక్కువ కావడంతో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయిందని నైట్స్ చెబుతోంది. స్వచ్ఛందంగా మానేస్తున్నట్టు ఉద్యోగులతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని, బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బందితో బెదిరింపులకు దిగారని కార్మిక శాఖకు ఇచ్చిన ఫిర్యాదులో నైట్స్ వెల్లడించింది. -
‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’
ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మధ్య న్యాయ పోరాటం తీవ్రంగా మారింది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. పోటీ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ గోప్యమైన డేటాను దుర్వినియోగం చేసిందని, బహిర్గతం చేయని ఒప్పందాలను (NDAs) ఉల్లంఘించిందని కాగ్నిజెంట్ ఆరోపించింది .కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య యూఎస్ కోర్టులో ఓ దావా నడుస్తోంది. తమ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని ఆరోపిస్తూ కాగ్నిజెంట్ కేసు దాఖలు చేసిందని మింట్ నివేదిక తెలిపింది. "నాన్ డిస్క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్స్ (NDAAs) ద్వారా ఇన్ఫోసిస్ తమ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది" అని 22 పేజీల కోర్టు ప్రతిస్పందనను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: టీసీఎస్ వీసా ఫ్రాడ్ చేసింది.. మాజీ ఉద్యోగుల ఆరోపణలు తమ ట్రైజెట్టో సమాచారాన్ని ఉపయోగించారా లేదా అన్నది ఆడిట్ చేయడానికి ఇన్ఫోసిస్ నిరాకరించిందని, ఇది తన తప్పును రుజువు చేస్తుందని కాగ్నిజెంట్ వాదిస్తోంది. ఈ చట్టపరమైన వివాదం 2024 ఆగస్టు నాటిది. కాగ్నిజెంట్ మొదట డల్లాస్ కోర్టులో ఈ ప్రకటన చేసింది. గత జనవరి 9న దాఖలు చేసిన కేసులో ఈ ఆరోపణను ఇన్ఫోసిస్ తిరస్కరించింది, కాగ్నిజెంట్‌కు సంబంధించిన హెల్త్ కేర్ సొల్యూషన్స్ బహిరంగంగానే ఉన్నాయని, అందులో వాణిజ్య రహస్యాలు ఏమున్నాయో వారే చూసుకోవాలని కాగ్నిజెంట్‌కు సూచించాలని కోర్టును ఇన్ఫోసిస్ కోరింది.ఇన్ఫోసిస్ ప్రతి దావాఇన్ఫోసిస్ తరువాత కాగ్నిజెంట్ పై ప్రతి దావా వేసింది. దాని సీఈవో రవి కుమార్ ఇన్ఫోసిస్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ సొంత హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ ఉత్పత్తిని విడుదల చేయడాన్ని కావాలని ఆలస్యం చేశారని, కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం చర్చలు జరిపారని ప్రత్యారోపణలు చేసింది. రవి కుమార్ 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను వీడారు. ఆ తర్వాత ఏడాది అంటే 2023 జనవరిలో కాగ్నిజెంట్‌లో సీఈవోగా చేరారు. రెండు కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సెస్ రంగ క్లయింట్ల నుంచే పొందుతోంది. కాగ్నిజెంట్‌కు కూడా తమ క్లయింట్లలో దాదాపు మూడోవంతు హెల్త్ కేర్ నుంచే ఉన్నారు. -
ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో కార్మిక శాఖ అధికారుల విచారణ
కర్ణాటక కార్మిక శాఖ అధికారులు బెంగళూరు, మైసూరులోని ఇన్ఫోసిస్(Infosys) క్యాంపస్‌లను సందర్శించారు. ఇటీవల కంపెనీ ఉద్యోగులను భారీగా తొలగించిందనే ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రెండున్నరేళ్ల క్రితం నియమితులైన సుమారు 700 మంది ట్రెయినీలను ఇన్ఫోసిస్ తొలగించిందని ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) ఆరోపించింది. అయితే, సంస్థ మూడుసార్లు నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలో సదరు ఉద్యోగులు ఉత్తీర్ణత సాధించలేదని ఇన్ఫోసిస్ తెలిపింది. దాంతో నిబంధనలకు అనుగుణంగానే వారు రాజీనామా చేసినట్లు చెప్పింది. ఈ ఉద్యోగుల సంఖ్య కూడా 350 మాత్రేమేనని కంపెనీ వాదిస్తోంది.ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, తదనుగుణంగా ఫిర్యాదుదారులకు వివరాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దాంతో ఇటీవల అధికారులు స్థానిక క్యాంపస్‌లను సందర్శించి విచారణ జరిపారు.స్నేహపూర్వక విధానాలు..కంపెనీపై వస్తోన్న ఆరోపణలకు ప్రతిస్పందనగా ఇన్ఫోసిస్ ఉద్యోగుల స్నేహపూర్వక విధానాలకు కట్టుబడి ఉందని నొక్కి చెప్పింది. నియామక ఒప్పందాలకు అనుగుణంగానే తొలగింపులు జరిగాయని కంపెనీ పేర్కొంది. ఉద్యోగులు కంపెనీకి అవసరమైన నైపుణ్యాలు, ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైతే కలిగే పరిణామాలపై స్పష్టమైన మార్గదర్శకాలున్నట్లు చెప్పింది. దానివల్లే కొందరికి లేఆఫ్స్ అనివార్యం అయ్యాయని స్పష్టం చేసింది. తమ ఉద్యోగుల నైపుణ్యాలు, పనితీరును నిర్ధారించడానికి ఈ చర్యలు ఎప్పటినుంచో అమల్లో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: శ్రీలంక పవర్ ప్రాజెక్టుల నుంచి అదానీ బయటకుస్పష్టత కోసం ఎదురుచూపులుఈ నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేయడం, ఇన్ఫోసిస్ అమలు చేస్తున్న చర్యలు కార్మిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం కర్ణాటక కార్మిక శాఖ దర్యాప్తు లక్ష్యం. దర్యాప్తు కొనసాగుతుండటంతో ఇన్ఫోసిస్ బాధిత ఉద్యోగులు ఈ విషయంపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ పరిశ్రమలో ఉద్యోగుల సంక్షేమం-కార్పొరేట్ విధానాలను సమతుల్యం చేయడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
టాప్ టెక్ కంపెనీ ఉద్యోగుల జీతాలు పెంపు.. ఎంతంటే..
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్(Infy) 2025 ఫిబ్రవరి చివరి నాటికి వేతన ఇంక్రిమెంట్ లెటర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఏప్రిల్ నుంచి కొత్త ఇంక్రిమెంట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే ఎంతశాతం వేతన పెంపు ఉంటుందో మాత్రం కంపెనీ తెలియజేయలేదు. కానీ, సగటు వేతన పెంపు 5% నుంచి 8% మధ్య ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు.ఇన్ఫోసిస్ సంస్థలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి వేతన పెంపు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. దశలవారీ వేతన సవరణలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. మొదటి దశను జనవరి 2025 నుంచి, రెండో దశను ఏప్రిల్ 2025 నుంచి పరిగణించనున్నారు. ఇంక్రిమెంట్లతోపాటు ఇన్ఫోసిస్ బ్యాచ్‌లవారీగా ప్రమోషన్ లెటర్స్ జారీ చేస్తున్నట్లు తెలిపింది. మొదటి బ్యాచ్ వారికి 2024 డిసెంబర్లో ప్రమోషన్స్ లెటర్స్ ఇచ్చినట్లు చెప్పింది. మరొక బ్యాచ్‌కు 2025 ఫిబ్రవరి చివరిలో లెటర్స్ పంపించబోతున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి క్యాన్సర్ చికిత్సవచ్చే ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక సేవలు పొందే కంపెనీల టెక్నాలజీ మూలధన వ్యయం పెరుగుతుందని పలు ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేతనాల పెంపు నిర్ణయం తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇన్ఫోసిస్ వేతన సవరణ చేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ జీతాలు పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు సానుకూల సంకేతం. అయితే, కంపెనీ ఇటీవల మైసూరు క్యాంపస్ నుంచి దాదాపు 700 మంది ఫ్రెషర్లను తొలగించడంపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ ఉద్యోగులకు ఆఫర్ లెటర్ ప్రకటించిన తర్వాత రెండేళ్లకు కొలువులోకి తీసుకున్నారు. కానీ ఆరు నెలల్లో వీరిని ఉద్యోగంలో నుంచి తొలగించారని వాదనలున్నాయి. ఈ వ్యవహారాన్ని ఐటీ ఉద్యోగుల సంఘం ఎన్ఐటీఈఎస్ అనైతిక చర్యగా అభివర్ణించింది. -
ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్.. ఈసారి అంచనాలు ఇవే..
ఓ వైపు ఉద్యోగుల తొలగింపు రేట్లు పెరుగుతున్నప్పటికీ భారతీయ ఐటీ పరిశ్రమ జీతాల పెంపు (Salary hike) విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) వంటి అగ్ర సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3 FY25) అధిక టర్నోవర్‌ను నివేదించాయి. అయినప్పటికీ ఈ ఏడాది జీతాల పెంపుదల 3% నుండి 6% స్థాయిలోనే ఉంటుందని హెచ్ఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇచ్చే శాలరీ హైక్ డిమాండ్ ఆధారిత పెరుగుదల కాదని, ప్రపంచ అనిశ్చితులకు అనుగుణంగా రంగాల వ్యాప్త సర్దుబాటు అని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు . ఈ సంవత్సరానికి ఐటీ ఉద్యోగుల తొలగింపు (అట్రిషన్) రేటు 12-13% వరకు ఉంటుందని అంచనా. కానీ జీతాల పెరుగుదల మాత్రం అంతంతమాత్రంగానే ఉండనుంది. అధిక పనితీరు కనబరిచేవారికి మాత్రం కాస్తంత మెరుగైన వేతన పెంపు లభించే అవకాశం ఉంది.ఏ కంపెనీలో ఏంటి పరిస్థితి?దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రైజల్ సైకిల్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికీ పద్ధతి ప్రకారం నిర్ధిష్ట కాల వ్యవధిలో అప్రైజల్ ప్రక్రియను అమలు చేస్తున్న అతి కొద్ది కంపెనీలలో టీసీఎల్ కూడా ఒకటి. 2025లో ఉద్యోగులకు సగటున 7-8 శాతం జీతాల పెంపును కంపెనీ ప్రకటించిందిఇక ఇన్ఫోసిస్ విషయానికొస్తే 2025 ఆర్థిక సంవత్సరానికి జీతాల పెంపుదల రెండు దశల్లో జరిగింది. జూనియర్ ఉద్యోగులు జనవరిలో వేతన పెంపు అందుకోగా మిగిలిన వారికి ఏప్రిల్‌లో జీతాల పెంపుదల అందుతుంది. దేశంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు జీతాల పెంపుదల 6-8 శాతం పరిధిలో ఉంటుందని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ ఇప్పటికే సంకేతాలిచ్చారు.మరోవైపు విప్రో, హెచ్‌సీఎల్‌టెక్.. ఈ రెండు కంపెనీలు అధిక అట్రిషన్ రేట్లను నివేదించాయి. అయినప్పటికీ వేతన పెంపుదలలో ఆలోచించి అడుగులు వేస్తున్నాయి. స్థిర పెంపుదల కంటే వేరియబుల్ పే సర్దుబాట్లపైనే ఇవి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఐటీ పరిశ్రమలో అప్రైజల్ సైకిల్ సాధారణంగా ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో ఉంటుంది. కానీ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు అప్రైజల్ సైకిల్‌ను ఏప్రిల్-జూన్ మధ్య కాలం నుండి క్యూ3 (సెప్టెంబర్-అక్టోబర్) కు వాయిదా వేశాయి. -
ఇన్ఫోసిస్‌లో 300 మంది ఫ్రెషర్ల తొలగింపు
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 300 మంద్రి ఫ్రెషర్లను తొలగించింది. మైసూరులోని క్యాంపస్‌లో వీరికి ప్రాథమిక శిక్షణ ఇవ్వగా, అంతర్గతంగా నిర్వహించిన మదింపు ప్రక్రియల్లో మెరుగైన పనితీరు చూపించలేకపోయినట్టు, మూడు విడతలు అవకాశం ఇచ్చినప్పటికీ ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. కానీ, వాస్తవానికి ఇలా తొలగించిన వారి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని ఐటీ ఉద్యోగుల సంఘం నైటెస్ తెలిపింది. కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖకు ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కంపెనీపై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై మీడియా సంస్థలు వివరణ కోరగా.. ‘‘ఇన్ఫోసిస్‌లో కఠినమైన నియామక ప్రక్రియను అనుసరిస్తాం. మైసూరు క్యాంపస్‌లో విస్తృతమైన ప్రాథమిక శిక్షణ అనంతరం అంతర్గత మదింపు ప్రక్రియల్లో ఫ్రెషర్లు (ఎలాంటి అనుభవం లేకుండా కొత్తగా ఉద్యోగ అవకాశాలు పొందిన వారు) విజయం సాధించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి ఒక్కరి మూడు విడతలుగా అవకాశం కల్పిస్తాం. అయినప్పటికీ విఫలమైతే వారు సంస్థతో కలసి కొనసాగలేరు. ఉద్యోగ కాంట్రాక్టులో ఈ నిబంధన కూడా ఉంటుంది. రెండు దశాబ్దాల నుంచి ఇదే ప్రక్రియ అమల్లో ఉంది. మా క్లయింట్ల అవసరాలను తీర్చే అత్యుత్తమ నైపుణ్యాలు ఉండేలా చూడడమే ఇందులోని ఉద్దేశ్యం’’అని ఇన్ఫోసిస్ సంస్థ వివరణ ఇచ్చింది. మూడు నెలల క్రితమే చేరిక తాజాగా తొలగింపునకు గురైన వారి సంఖ్య గణనీయంగా ఉంటుందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (నైటెస్) పేర్కొంది. వీరిని 2024 అక్టోబర్‌లో నియమించుకున్నట్టు తెలిపింది. ‘‘ఆఫర్ లెటర్లు అందుకున్న తర్వాత వీరంతా రెండేళ్లపాటు నిరీక్షించారు. నైటెస్, బాధిత అభ్యర్థులు కలసి చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాతే వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు’’అని ప్రకటించింది. -
ఇన్ఫోసిస్ లేఆఫ్స్: వందలాది ఫ్రెషర్స్ బయటకు
ఇప్పుడిప్పుడే ఐటీ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయని సంబరపడుతున్న వేళ 'ఇన్ఫోసిస్' (Infosys) మరోమారు లేఆఫ్స్ బాంబ్ పేల్చింది. ఒక్కసారిగా 700 మంది ఫ్రెషర్లను ఇంటికి పంపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా అన్యాయమని లేఆఫ్‌కు గురైన ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీలో చేర్చుకున్న ఫ్రెషర్లలో 700 మంది.. మూడు సార్లు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, ఈ కారణంగానే వారిని బయటకు పంపుతున్నట్లు సమాచారం. వీరందరూ కూడా కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్‌కు చెందిన వారని తెలుస్తోంది.కంపెనీలో ట్రైనింగ్ తీసుకునే ఫ్రెషర్స్ కచ్చితంగా.. సంస్థ నిర్వహించే అసెస్మెంట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే కంపనీలో కొనసాగలేరు. ఈ విషయాన్ని ఆఫర్ లేటర్లలో కూడా స్పష్టం చేశామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ విధానం ఇప్పుడు ప్రారంభించింది కాదు. గత రెండు దశాబ్దాలుగా కంపెనీ ఈ పద్దతిలోనే ఉద్యోగులను ఎంపిక చేస్తోందని పేర్కొంది.లేఆఫ్‌లకు ప్రభావితమైన ఉద్యోగులలో చాలామంది 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందినవారు. వీరందరూ కంపెనీ మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందారు. వీరి ఇంటర్వ్యూలో పూర్తయిన తరువాత ఆఫర్ లెటర్స్ ఇవ్వడానికి కూడా కంపెనీ చాలా సమయం తీసుకుందని గతంలోనే వెల్లడైంది. ఆ తరువాత ఆఫర్ లెటర్స్ అందిస్తూ.. సిస్టమ్ ఇంజనీర్ ఉద్యోగులకు రూ. 3.2 లక్షల నుంచి రూ. 3.7 లక్షల వరకు ప్యాకేజ్ ఉంటుందని హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: రీఛార్జ్ లేకుండానే.. ఫ్రీగా కాల్స్ మాట్లాడొచ్చు: సింపుల్ ట్రిక్ ఇదే..ఇన్ఫోసిస్ కంపెనీ ఒక్కసారిగా ఫ్రెషర్లను తొలగించడంతో.. బాధితులు కంటతడి పెట్టుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కంపెనీ తొలగించిన ఫ్రెషర్స్ 700 మందా? 400 మందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు వారి భవిష్యత్తు ఏమిటనేదే ప్రశ్న. అయితే కంపెనీ లేఆఫ్‌లను నాసెంట్ ఐటీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) విమర్శించింది. ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి.. ట్రైనింగ్ సమయంలోనే బయటకు పంపించడం అనేది సమంజసం కాదని పేర్కొంది. -
ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. నారాయణమూర్తి ఏమన్నారంటే..
ఉద్యోగ కోతలపై కృత్రిమ మేధ (ఏఐ), వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావం ఎలా ఉందో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి తన అభిప్రాయాలు పంచుకున్నారు. కృత్రిమ మేధ వల్ల కొంతమేరకు నిరుద్యోగం పెరుగుతోందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐ ప్రభావంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐను ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.కృత్రిమ మేధ-ఉద్యోగ నష్టాలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాస్తవానికి చాలా పనులను ఆటోమేట్ చేస్తోందని మూర్తి చెప్పారు. దాంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలిపారు. అయితే ఇది కొత్త అవకాశాలను సృష్టించడానికి, మానవ ఉత్పాదకతను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని అంగీకరించారు. 1970ల్లో కంప్యూటర్-ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సాధనాలను ప్రవేశపెట్టిన సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. కానీ ఈ సాధనాలు డెవలపర్లకు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి వీలు కల్పించాయన్నారు. ఉత్పాదకతను పెంచడానికి మానవులు, యంత్రాలు కలిసి పనిచేసే సహాయక సాంకేతికతగా కృత్రిమ మేధను పరిగణించాలని మూర్తి అన్నారు. అటానమస్ డ్రైవింగ్, ప్రమాదకర వాతావరణంలో యంత్రాలను ఆపరేట్ చేయడం, కచ్చితమైన పరికరాలతో రిమోట్ సర్జరీ వంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనకరంగా ఉంటుందని హైలైట్ చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా మానవులు మరింత సృజనాత్మక, సంక్లిష్టమైన పనులపై దృష్టి పెట్టవచ్చని చెప్పారు. ఇది ఉద్యోగుల నైపుణ్యాల పెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌లో బ్లాక్‌రాక్ కొత్తగా 1,200 ఉద్యోగాలుఏఐ ఇన్నోవేషన్‌లో భారత్ పాత్రకృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణలు చేయడంలో భారత్ సామర్థ్యంపై మూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన సాంకేతికతలను అవలంబించడమే కాకుండా ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి దోహదపడే స్థాయికి దేశం పురోగమించిందని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధను స్వీకరించి కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టాలని యువతను కోరారు. -
పసితనంతో మురిసిపోదాం
ఉల్లిపాయకు అన్ని పొరలు ఎలా వచ్చాయి? ఈ ప్రశ్న మీరు వేసుకున్నారా? సుధామూర్తి వేసుకున్నారు. దాని మీద కథ రాసి మనవరాళ్లకు వినిపించారు కూడా. ‘మీలో పసితనం ఉంటే మీ పిల్లల్లోని పసితనాన్ని కాపాడుతారు’ అంటున్నారు ఆమె.‘నా మానసిక వయసు 12 ఏళ్ల లోపే ఉంచుకుంటాను... అలా ఉంటే పిల్లల్లా ప్రతి చిన్నదానికి సంతోషపడతాం’ అన్నారామె. గురువారం మొదలైన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరై ఆమె పిల్లల గురించి తల్లిదండ్రులకు ఎన్నో పాఠాలు చెప్పారు. వినండి.‘టీచర్‌గా నేను పిల్లలకు 45 నిమిషాలు పాఠం చెప్తే అందులో పదిహేను నిమిషాలు ఆ పాఠానికి సంబంధించిన కథలు చెప్పేదాన్ని. లేదా ఆ సబ్జెక్ట్ చుట్టూ ఏవో కథలు చెప్పేదాన్ని. నా విద్యార్థులందరూ జీవితంలో చక్కగా సెటిల్ అయ్యారు. వారు కనిపించినప్పుడు మీకు జావా, పాస్కల్, సి ప్లస్ చెప్పాను... అవేమైనా జీవితంలో ఉపయోగపడ్డాయా అనడుగుతాను. లేదు టీచర్.. మీరు చెప్పిన కథలే ఉపయోగపడ్డాయి అంటారు. కథల వల్ల అంత ప్రభావితం అవుతారు పిల్లలు’ అన్నారు సుధా మూర్తి. జైపూర్‌లో మొదలైన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ తొలిరోజు ఆమె పాల్గొని ‘ది చైల్డ్ విత్ ఇన్’ అనే అంశం మీద మాట్లాడారు. ‘ప్రపంచ దేశాల్లో పిల్లల కథలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. కాని మన భారతదేశంలోనే అన్ని రకాల పిల్లల కథలు దొరుకుతాయి. కాని ఇప్పుడు పిల్లలకు కథలు చెప్పడం లేదు. అమ్మమ్మ, నానమ్మలు టీవీ సీరియళ్లతో తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో బిజీగా ఉంటున్నారు. నా చిన్నప్పుడు కరెంటు లేకపోవడం వల్ల, వేరే వినోద సాధనాలు లేకపోవడం వల్ల నా ఊహాశక్తి బాగా పెరిగింది. కృష్ణుడి కథలు వింటే ఆ కథ చుట్టూ ఎన్నో ఊహలు చేసేదాన్ని. ఇప్పుడు పిల్లల్ని సోషల్ మీడియా నుంచి తప్పించలేము. అది ఊహను చంపేస్తుంది. అయితే వారికి సోషల్ మీడియాతో గడిపే సమయానికి రేషన్ విధించి కథలు వినిపించాలి’ అన్నారామె.అక్షయపాత్ర బదులు కుకర్లండన్లో ఉండే తన మనుమరాలు అనుష్కకు ‘ద్రౌపది–అక్షయపాత్ర’ కథ చెప్తే ఆ చిన్నారి దానిని తన పద్ధతిలో తిరగేసి చెప్పడాన్ని నవ్వుల మధ్య వివరించారు సుధామూర్తి. ‘మా మనవరాలికి అక్షయపాత్ర కథ చెప్పాను. మరుసటి రోజు తిరిగి చెప్పమన్నాను. అయితే నా మనమరాలు తన పద్ధతిలో చె΄్తానంది. అక్షయపాత్ర బదులు ఇన్స్టాంట్ పాట్ (కుకర్)ను పెట్టింది. అయితే అమ్మమ్మ... మనం దానిని శుభ్రంగా కడక్కుండా వండితే డయారియా వస్తుంది మైండిట్ అని కూడా చెప్పింది’ అన్నారు సుధామూర్తి.‘అంటే పిల్లలకి కథ చెప్తే వాళ్లకు తెలిసిన పద్ధతిలో మార్చి తమ క్రియేటివిటీని జోడిస్తారు. పిల్లలకు చిన్న విషయాలు కథలుగా మార్చి సరదా పుట్టించాలి. ఉల్లిపాయకు అన్ని పొరలు ఎందుకుంటాయి, మామిడి తియ్యగా... మిర్చి కారంగా ఎందుకు ఉంటుంది... ఇలాంటి ప్రశ్నలు అడిగి వాటికి కథ అల్లి చెప్తే ఆనందిస్తారు. నాకు తెలిసి పిల్లలకు లావుగా ఉన్న పాత్రలు, పిసినారి పాత్రలు నచ్చుతాయి. పిసినారులకు శాస్తి జరిగితే చాలా సంతోషపడతారు’ అన్నారామె.కష్టమొస్తే ఆంజనేయుడు– సంజీవని‘పిల్లలు పాజిటివ్ కథలు ఇష్టపడతారు. చెడుకు చెడు జరగాల్సిందే. యుక్తి ఇష్టపడతారు. కుండలో రాళ్లు వేసే కాకి కథ సింధు నాగరికత నుంచి ఉంది. ఎందుకు ఆ కథను కాపాడుకున్నామో ఆలోచించాలి. నా వరకు నాకు కష్టమొస్తే స్ఫూర్తినిచ్చేది ఆంజనేయుడు– సంజీవని కథ. లక్ష్మణుడి కోసం సంజీవని తేవడానికి వెళతాడు ఆంజనేయుడు. అయితే ఆ మొక్క ఏదో కనిపెట్టలేడు. అంటే ప్రాబ్లమ్‌లో పడ్డాడు. అప్పుడు ఏం చేశాడు? తన శరీరాన్ని భారీగా పెంచి మొత్తం సంజీవని పర్వతాన్నే అరచేతిలో తీసుకొచ్చాడు. మనం కూడా అలా ఉండాలి.ప్రాబ్లం వస్తే మనం దాని కంటే పెద్దవాళ్లం అయ్యి తల దించి దాని వైపు చూడాలి. దానిని చిన్నగా చేయాలే తప్ప చిన్నగా అయిపోకూడదు. కథలు సమస్యలను ఇలా సులువు చేయమని చెబుతాయి. పిల్లలకు కథలతో ఆ శక్తి ఇవ్వాలి’ అన్నారు సుధామూర్తి.పసితనం కాపాడుకోండి‘మనందరం పసిపిల్లలు ఎవరు కనిపించినా దగ్గర తీస్తాం. నవ్వుతూ కబుర్లు చెబుతాం. మరి మనల్ని ఇప్పుడెందుకు ఎవరూ అంత ప్రేమగా పలకరించి ఇష్టపడరు? అంటే ఆ బాల్య స్వభావం, కల్మషం లేని పసితనం పెద్దయ్యేకొద్దీ్ద పోయిందని అర్థం. నేనైతే చిన్నప్పటి సుధగా ఉండటానికి ఊహల్లోకి వెళ్లిపోతాను. ఈ పెద్ద సుధకు లోకం బాగా అర్థమవుతుంది. చిన్నప్పటి సుధకైతే అందరూ అన్నీ ఇష్టమే. అలా ఉంటే మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది’ అని ముగించారామె.– సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి: ఎస్డీ శిబులాల్
డి.ఎస్.పవన్‌కుమార్, సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్: మారుతున్న పరిస్థితుల్లో ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మార్పులు సహజమని, వీటిని ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈఓ ఎస్డీ శిబులాల్ చెప్పారు. అవసరమైనప్పుడల్లా కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు, కెరీర్లో ముందుకు సాగేందుకు కృషి చేయాలని అన్నారు. ఇన్ఫోసిస్ లాంటి అగ్రశ్రేణి సంస్థ కూడా తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, పాతికేళ్లు సాధారణ ఐటీ సంస్థగానే ఉందని తెలిపారు. వ్యక్తులకైనా, సంస్థలకైనా సవాళ్లు సహజం అంటూ, వాటిని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యాన్నిసొంతం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత సహనం, ప్రణాళికలతో అడుగులు వేయాలని చెప్పారు. శిబులాల్ కుటుంబం ఫిలాంత్రఫిక్ ఇనిషియేటివ్స్ పేరుతో ఓ ఎన్జీఓను నెలకొల్పింది. ‘విద్యాధన్’ పేరుతో.. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం హైదరాబాద్‌కు వచి్చన శిబులాల్‌తో.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం వల్లే టాప్‌లోకి.. ఇన్ఫోసిస్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులకు గురైంది. ముఖ్యంగా క్లయింట్స్‌కు ఐటీ ఆవశ్యకతను వివరించడం, వారిని మెప్పించడం, వాటికి మా సంస్థ ద్వారా సేవలకు అంగీకరింపజేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పాతికేళ్ల సంస్థ చరిత్రలో దాదాపు 20 ఏళ్లు సాదాసీదా కంపెనీగానే ఉంది. కానీ అన్ని సవాళ్లను ఎదుర్కోగలిగే సమర్థవంతమైన బృందంగా పని చేయడం వల్ల ఇప్పుడు టాప్ కంపెనీగా గుర్తింపు పొందుతోంది ఇప్పుడు మనం చూస్తున్న ఇన్ఫోసిస్ ప్రస్థానాన్ని ఇన్ఫోసిస్ 2.0గా చెప్పొచ్చు. మార్పులు ఆహ్వానించాలి – ఒకే సంస్థలో ఉన్నా హోదా మారే కొద్దీ విధుల్లో మార్పులు, కొత్త సవాళ్లు, కొత్త అంశాలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత సహజం. దీన్ని నేటి యువత గుర్తించాలి. – ఇన్ఫోసిస్‌లో మూడేళ్లకోసారి నా హోదా మారేది. అలా మారినప్పుడల్లా ఆ హోదాకు తగినట్లుగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా కొత్త అంశాలు నేర్చుకున్నా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. నాట్ ఫర్ ఎవ్రిబడీ – ప్రస్తుతం దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్కృతి పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే నా ఉద్దేశంలో ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రిబడీ’. ఈ మాట ఎందుకు అంటున్నానంటే.. – సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే అత్యంత కీలకమైన లక్షణం సహనం. నేటి యువతలో అది లోపిస్తోంది. – చాలామంది ఇన్స్టంట్ ఫలితాలు ఆశిస్తున్నారు. అందుకే పలు వెంచర్స్.. ఫెయిల్యూర్ వెంచర్స్‌గా మారుతున్నాయి. – మా రోజుల్లో ఫండింగ్ సంస్థలు లేవు. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో ఏంజెల్ ఇన్వెస్టర్స్.. మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్‌ను అందించే స్టార్టప్స్‌కు ఫండింగ్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కానీ స్టార్టప్ ఔత్సాహికుల్లో సహనం ఉండట్లేదు. సరైన ప్రణాళిక ఉండట్లేదు. ఏఐతో కొత్త ఉద్యోగాలు: – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఏ మాత్రం సరికాదు. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పొందితే లక్షల ఉద్యోగాలు లభిస్తాయని గుర్తించాలి. – ఐటీలో నిరంతరం కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ అనేది దశాబ్దాలుగా జరుగుతోంది. ఉదాహరణకు కంప్యూటర్స్నే పరిగణనలోకి తీసుకుంటే మొదట్లో కంప్యూటర్స్ అంటే కేవలం డేటా సేకరణకే వినియోగించారు. తర్వాత అవి.. డేటా క్రియేషన్, డేటా ఇంటర్వెన్షన్ ఇలా ఎన్నో విభాగాలకు విస్తరించింది. – ఐటీలో కూడా కంప్యూటర్ ఆపరేషన్స్‌తో మొదలై.. ఇప్పుడు కోడింగ్, ప్రోగ్రామింగ్‌లు ఎంత ముఖ్యంగా మారాయో మనం చూస్తున్నాం. 4‘సీ’స్ సూత్రాన్ని పాటించాలి – నేటి తరం యువత కెరీర్లో ముందుకు సాగేందుకు 4సీ సూత్రాన్ని (కరేజ్, కేపబిలిటీ, కెపాసిటీ, కమిట్మెంట్) అమలు చేసుకోవాలి. – మానసికంగా ఈ లక్షణాలు ఉంటే వృత్తి పరంగా ఎలాంటి నైపుణ్యాలనైనా ఇట్టే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది. – దేశంలో కెరీర్ పరంగా ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ 80 శాతం మంది ఎంప్లాయర్స్ జాబ్ రెడీ స్కిల్స్ ఉన్న యువత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్కిల్స్‌ను సొంతం చేసుకుంటే.. ఉద్యోగ రేటు వృద్ధి చెందుతుంది. గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లిష్‌పై పట్టు ముఖ్యం – ప్రస్తుత విద్యా వ్యవస్థలో బేసిక్ సైన్సెస్‌ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. పాఠశాల స్థాయి నుంచే దీన్ని ఆచరణలో పెట్టాలి. ఫలితంగా విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెరిగి, భవిష్యత్తులో పరిశోధనలు, ఆవిష్కరణలకు దారి తీస్తుంది. – నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లోని ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, స్కిల్ ట్రైనింగ్ వంటి అంశాలు పరిశీలిస్తే.. ఈ విధానం మన యువతకు ఎంతో అవసరం అనేది అవగతం అవుతుంది. ఇంగ్లిష్ మీడియం అనేది గ్లోబల్ లాంగ్వేజ్. దానిపై పట్టు సాధించడం నేటి పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం. సైన్స్ అంటే ఇష్టం.. కానీ కంప్యూటర్స్లోకొచ్చా.. వాస్తవానికి నాకు బేసిక్ సైన్స్ అంటే ఇష్టం. మా నాన్న మాత్రం నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. అయినా నా ఇష్టాన్ని కాదనలేదు. కేరళ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేశా. వెంటనే అప్పటి బాంబే ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ విధులు మాత్రం కంప్యూటర్స్‌కు సంబంధించినవి. నా జీవితంలో నాకు ఏమైనా సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి అంటే నా తొలి ఉద్యోగంలోనే. వాటిని తట్టుకోవాలనే సంకల్పంతో, కంప్యూటర్ సైన్స్ భవిష్యత్తు ఆవశ్యకతను గుర్తించి అందులో పీజీ చదవడానికి సిద్ధమయ్యా. బోస్టన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. పత్ని కంప్యూటర్స్‌లో సిస్టమ్స్ ఇంజనీర్‌గా అడుగు పెట్టా. అక్కడే నారాయణమూర్తితో పరిచయం ఏర్పడడం, ఇన్ఫోసిస్ స్థాపనలో పాలుపంచుకోవడం జరిగింది. ఇలా కెరీర్ అవసరాలకు అనుగుణంగా తమను తాము మలచుకోవడం నేటి యువతకు ఎంతో ముఖ్యం. అప్పుడే ఉన్నత స్థానాలు, కోరుకున్న హోదాలు లభిస్తాయి. సంపాదనలో కొంత సమాజ సేవకు కేరళలో పుట్టి పెరిగిన నాకు.. చిన్నప్పటి నుంచి చదువు విషయంలో, ఇతర విషయాల్లో ఎందరో తోడ్పాటు అందించారు. అదే స్ఫూర్తితో మా సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు, అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలకు కేటాయించాలని భావించాం. అందుకే 1998లో శిబులాల్ ఫ్యామిలీ ఫిలాంత్రఫిక్ ఇనిషియేటివ్స్ (ఎస్ఎఫ్పీఐ) పేరుతో ప్రత్యేక సంస్థను నెలకొల్పి విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. విద్యార్థులకు తోడ్పాటునందిస్తే.. వారితోపాటు, దేశం కూడా వృద్ధి చెందుతున్న ఆలోచనతో విద్యా రంగాన్ని ఎంచుకున్నాం. ప్రస్తుతం పది వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. డ్రాప్ అవుట్స్‌ను తగ్గించమే ప్రధాన లక్ష్యం 11, 12 తరగతుల స్థాయిలో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడమే మా లక్ష్యం. 1990లలో భారత గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రులు..పదో తరగతి పూర్తయ్యాక మగ పిల్లలను పనికి తీసుకెళ్లాలని, ఆడ పిల్లలైతే పెళ్లి చేయాలనే ధోరణితో ఉండేవారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఉండరనే ఉద్దేశంతోనే ఎస్ఎఫ్పీఐని ప్రారంభించాం. 11, 12 తరగతుల విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తున్నాం. -
‘ఇన్ఫోసిస్ సేనాపతి’పై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(Indian Institute of Science)లో ఓ ప్రొఫెసర్ విషయంలో హనీట్రాప్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ పరిణామం చోటు చేసుకుంది.గతంలో.. సంచలన అభియోగాల మీద ప్రొఫెసర్‌గా పని చేసిన దుర్గప్పను ఐఐఎస్సీ(IISc) విధుల నుంచి తొలగించింది. అయితే.. సేనాపతి క్రిష్ గోపాలకృష్ణన్(Senapathy Kris Gopalakrishnan)తో పాటు మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం సహా మరికొందరు తనపై కుట్ర చేశారని, హనీట్రాప్ కేసులో ఇరికించారని దుర్గప్ప ఆరోపిస్తున్నారు. అంతేకాదు కులం పేరుతో తనను దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు..సోమవారం కోర్టును ఆశ్రయించారు. దీంతో.. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు 71వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. బెంగళూరు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ ఆరోపణలపై ఇటు గోపాలకృష్ణన్కానీ, అటు ఐఐఎస్ బోర్డుకానీ స్పందించలేదు. ప్రస్తుతం గోపాలకృష్ణన్ బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్నారు.1981, జులై 2వ తేదీన ఇన్ఫోసిస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నారాయణమూర్తితో పాటు సేనాపతి క్రిష్ గోపాలకృష్ణన్, మరో ఐదుగురు కలిసి ఈ కంపెనీని పుణే(మహారాష్ట్ర)లో తొలుత ప్రారంభించారు. -
ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్: కొత్తగా 17000 ఉద్యోగాలు
తెలంగాణాలో ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' (Infosys) మరింత విస్తరించనుంది. దీనికోసం కంపెనీ దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే పోచారం క్యాంపస్‌ను విస్తరించనున్నట్లు, తద్వారా 17,000 కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లు వెల్లడించింది.దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణ ఐటీ మినిష్టర్ శ్రీధర్ బాబుతో.. ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంఘ్‌రాజ్ భేటీ తరువాత ఈ ప్రకటన చేశారు. పోచారం క్యాంపస్ విస్తరణ ప్రణాళికలో భాగంగానే ఫేజ్ 1లో రూ. 750 కోట్ల పెట్టుబడితో.. కొత్త ఐటీ భవనాలను నిర్మించనున్నారు. ఇవి పూర్తి కావడానికి మరో రెండు - మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.తెలంగాణను ఐటీ రంగంలో అగ్రగామిగా చేయడానికి, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మా భాగస్వామ్యం సంతోషంగా ఉందని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంఘ్‌రాజ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ -
ఇన్ఫీలో మూర్తి కుటుంబం కంటే రెట్టింపు వాటా
ఇన్ఫోసిస్‌లో నారాయణమూర్తి కుటుంబానికి ఉన్న సమష్టి హోల్డింగ్స్ వారి శాశ్వత వారసత్వాన్ని, కంపెనీ పథంలో గణనీయమైన ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఆ కుటుంబానికి మొత్తంగా కంపెనీలో ఉన్న వాటా దాదాపు 4-5 శాతం మాత్రమే. ప్రపంచ ఐటీ రంగం భవిష్యత్తులో భారీగా దూసుకుపోతుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. కేవలం రిటైలర్లే కాకుండా ఇన్వెసింగ్ సంస్థలు చాలాకాలం నుంచే ఈ రంగంలో వాటా కొనుగోలు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్‌లో మూర్తి కుటుంబానికి ఉన్న వాటా కంటే కూడా రెట్టింపు వాటాను హోల్డ్ చేస్తున్న సంస్థలున్నాయి. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.మూర్తి కుటుంబం వాటాఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి కంపెనీలో గణనీయమైన వాటా ఉంది. తాజా నివేదికల ప్రకారం తన కుటుంబం మొత్తం హోల్డింగ్స్ సుమారు 4.02% ఉన్నాయి. నారాయణమూర్తికి 0.36%, ఆయన భార్య సుధామూర్తికి 0.93%, వారి పిల్లలు అక్షత మూర్తికి 1.05%, రోహన్ మూర్తికి 1.465% వాటా ఉంది. నారాయణమూర్తి మనవడు నాలుగేళ్ల ఏకగ్రహ్ మూర్తికి కూడా తన తాత ఇటీవల షేర్లను బహుమతిగా ఇవ్వడంతో 0.04% వాటా ఉంది.ఎల్ఐసీ వ్యూహాత్మక పెట్టుబడులువ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఇన్ఫోసిస్‌లో భారీగా పెట్టుబడి పెట్టింది. ఇన్ఫోసిస్‌లో ఏకంగా 9.531 శాతం వాటాను ఎల్ఐసీ హోల్డ్ చేస్తోంది. దీని విలువ సుమారు రూ.8,694 కోట్లు. ఈ పెట్టుబడి ద్వారా ఎల్ఐసీ భవిష్యత్తులో ఇన్ఫోసిస్ సామర్థ్యం పట్ల నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎల్ఐసీ ఇన్వెస్ట్మెంట్ వల్ల ప్రపంచ ఐటీ రంగంలో కంపెనీ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవితబీమాఇన్ఫోసిస్తో సహకారం..ఇన్ఫోసిస్‌తో ఎల్ఐసీ భాగస్వామ్యం కేవలం ఆర్థిక పెట్టుబడులకు పరిమితం కాలేదు. సంస్థ అందించే సేవల్లోనూ ఇరు కంపెనీల సహకారం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసుల్లో ఇన్ఫోసిస్ నైపుణ్యం ద్వారా ఎల్ఐసీ నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్) అనే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్పై ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేశాయి. ఈ సహకారం ఎల్ఐసీ కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు అంతరాయంలేని సర్వీసులు అందిస్తుందని భావిస్తున్నారు. -
అత్యంత విలువైన ఐటీ బ్రాండ్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దేశీ టెక్నాలజీ సంస్థలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా దిగ్గజాలు టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్(Infosys), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(HCL Tech), విప్రో(Wipro), టెక్ మహీంద్రా(Tech Mahindra) ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సర్వీసుల బ్రాండ్ల జాబితాలో ప్రముఖంగా చోటు దక్కించుకున్నాయి. 2025కి గాను టాప్ 25 సంస్థలతో బ్రాండ్ వేల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన నివేదికలో వరుసగా నాలుగో సంవత్సరంలోనూ టీసీఎస్ రెండో స్థానంలో, ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిల్చాయి. ఇందులో యాక్సెంచర్ వరుసగా ఏడో ఏడాది అగ్రస్థానంలో కొనసాగింది.టీసీఎస్ బ్రాండ్ విలువ 11 శాతం పెరిగి 21.3 బిలియన్ డాలర్లకు చేరగా, ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 15 శాతం పెరిగి 16.3 బిలియన్ డాలర్లకు చేరింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ సేవల బ్రాండుగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిల్చింది. కంపెనీ బ్రాండు విలువ 17 శాతం పెరిగి 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అటు విప్రో, టెక్ మహీంద్రా, హెక్సావేర్ మొదలైనవి కూడా లిస్టులో చోటు దక్కించుకున్నాయి. దేశాలపరంగా చూస్తే మొత్తం బ్రాండ్ వేల్యూలో 40 శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో 36 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రిలియనీర్లు వచ్చేస్తున్నారహో!కోలుకుంటున్న మార్కెట్ ..ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023 ఆఖర్లో, 2024 తొలినాళ్లలో కార్పొరేట్లు వ్యయాలను తగ్గించుకున్నాయని, అదే సమయంలో కృత్రిమ మేథ సంబంధిత సర్వీసులకు డిమాండ్ పెరిగిందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. అమెరికా మార్కెట్ క్రమంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారతీయ ఐటీ సంస్థలకు ప్రయోజనాలు చేకూరగలవని పేర్కొంది. 2025లో వడ్డీ రేట్లు తగ్గి, కార్పొరేట్లు ఖర్చు చేయడం పెరగడంతో పాటు కొత్త టెక్నాలజీలకు డిమాండ్ నెలకొనడం వల్ల ఐటీ సంస్థలు లబ్ధి పొందవచ్చని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. అత్యంత విలువైన బ్రాండ్లన్నీ కూడా మారుతున్న పరిశ్రమ ట్రెండ్స్‌కి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు, వ్యూహాత్మక ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నాయని వివరించింది. -
ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో.. ఇన్ఫోసిస్ (Infosys) మాజీ ఉద్యోగి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇందులో ఇన్ఫోసిస్ కంపెనీకి, ఇతర పెద్ద టెక్ సంస్థలకు.. పని సంస్కృతిలో, ఇతర విషయాలలో ఉన్న తేడాను వివరించారు. ఐటీ కార్పొరేట్ సంస్కృతి నిలువు దోపిడీ అంటూ అభివర్ణించాడు.న్యాయమైన పరిహారం అందేలా, కార్మిక విధానాలను సంస్కరించాలని చెబుతూ.. నా 9 సంవత్సరాల అనుభవం అనే శీర్షికతో, తన వ్యక్తిగత ప్రయాణంలో ముఖ్యమైన విషయాలను షేర్ చేశారు.నేను 2008లో ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 2017లో సంస్థను విడిచి మరో కంపెనీలో చేరాను. ఇన్ఫోసిస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నా జీతం రూ. 35,000 మాత్రమే. నేను ఇప్పుడు రూ. 1.7 లక్షలు సంపాదిస్తున్నాను. అంటే ఇన్ఫోసిస్ జీతానికి 400 శాతం ఎక్కువని చెప్పాడు.ఇన్ఫోసిస్‌లో.. ఉద్యోగి రవాణా కోసం నెలకు రూ. 3,200 చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుత కంపెనీలో అది పూర్తిగా ఉచితం. అంతే కాకుండా నేను ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో వెహికల్ పార్కింగ్ ఉచితం. అయితే ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల నుంచి వారి వాహనాల పార్కింగ్ కోసం కూడా డబ్బు వసూలు చేసిందని ఆయన ఆరోపించాడు.ప్రస్తుతం నేను పనిచేస్తున్న కంపెనీలో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ధర రూ. 15 నుంచి రూ. 20 మాత్రమే. కానీ ఇన్ఫోసిస్‌లో దీని విలువ రూ. 40.ఇన్ఫోసిస్ పురోగతి వ్యవస్థను అనుసరించింది. ఇందులో ఉద్యోగులకు పదోన్నట్లు ఉంటాయి. కానీ జీతాల పెరుగుదల లేదా బాధ్యతలలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుత సంస్థలో పదోన్నతులతో పాటు ఉద్యోగులకు నిజమైన బాధ్యతలను అందిస్తూ.. 15-25 శాతం జీతాల పెరుగుదల అందిస్తుంది.ఇన్ఫోసిస్‌లో 9 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా.. నేను సింగిల్ డిజిట్ వార్షిక పెంపుదల (Single-Digit Salary Hikes) అందుకున్నాను. ఈ కారణంగా నా జీతం రూ. 35000 వద్దనే ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తుంటే.. చాలా సమయం వృధా చేసినట్లు అర్థమవుతుందని అన్నాడు.ఇదీ చదవండి: మొన్న టీసీఎస్.. నేడు విప్రో: ఫ్రెషర్లకు పండగే..ఇన్ఫోసిస్.. ఉద్యోగుల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. కానీ తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాల గురించి తరచుగా మాట్లాడుతుందని ఆయన ఆరోపించారు. ఉద్యోగి శ్రామికశక్తికి మెరుగైన జీతాలు, సంక్షేమం ద్వారా ఉదారతను చూపించాలని వాదించాడు. ఉద్యోగ భద్రత అనేది ఒక అపోహ మాత్రమే. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ భద్రత (Job Security) ఎక్కువగా ఉందని ఆయన నొక్కి చెప్పారు.Infosys - My 9 years experience of 'unchained' slavery byu/GoatTop607 inbangalore -
ఇన్ఫీ మూర్తి కుటుంబ సంపదలో రూ.1900 కోట్లు ఆవిరి!
ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (NR Narayana Murthy) కుటుంబం సంపద ఒక్క రోజులో రూ.1900 కోట్లు ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో శుక్రవారం (జనవరి 17) నాడు ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 6 శాతం నష్టపోయి రూ. 1,812.70 వద్ద ముగిశాయి. ఈ భారీ తగ్గుదలతో మూర్తి కుటుంబం నెట్‌వర్త్‌లో దాదాపు రూ. 1,900 కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. అమ్మకాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.54 లక్షల కోట్లకు పడిపోయింది.4.02 శాతం వాటాసెప్టెంబర్ త్రైమాసికం నాటికి కంపెనీలో సమిష్టిగా 4.02 శాతం వాటాను నారాయణ మూర్తి కుటుంబం కలిగి ఉంది. ఇందులో మూర్తి 0.40 శాతం వాటాను కలిగి ఉండగా, ఆయన సతీమణి సుధా మూర్తికి 0.92 శాతం, వారి కుమారుడు రోహన్ మూర్తికి 1.62 శాతం వాటా ఉంది. ఇక వారి కుమార్తె, యూకే (UK) మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి 1.04 శాతం, నారాయణ మూర్తి మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తి 0.04 శాతం వాటాను కలిగి ఉన్నారు. శుక్రవారం నాటి క్షీణత తర్వాత కంపెనీలో మూర్తి కుటుంబం హోల్డింగ్‌ల విలువ రూ. 30,334 కోట్లుగా ఉంది. ఇది గురువారం నాటి రూ. 32,236 కోట్లతో పోలిస్తే గణనీయమైన నష్టాన్ని ప్రతిబింబిస్తోంది.లాభాలు బాగున్నా..ఇన్ఫోసిస్ బలమైన త్రైమాసిక ఆదాయాలను ప్రకటించిన తర్వాత మార్కెట్ కల్లోలం ఏర్పడింది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు అయిన ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 11 శాతం వృద్ధిని నమోదు చేసి మొత్తం రూ.6,806 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 8 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ తన ఆదాయ వృద్ధి అంచనాను 4.5-5 శాతానికి సవరించింది. ఇది దాని వ్యాపార పథంలో విశ్వాసాన్ని సూచిస్తోంది.ఇదీ చదవండి: విప్రో జూమ్.. టెక్ మహీంద్రా హైజంప్!బలమైన ఫండమెంటల్స్ ఉన్నప్పటికీ, స్టాక్ క్షీణత విస్తృత పరిశ్రమ సవాళ్లు, మార్కెట్ సెంటిమెంట్‌పై పెట్టుబడిదారుల ఆందోళనలను తెలియజేస్తోంది. 1,812.70గా ఉన్న స్టాక్ విలువ ఐటీ రంగంలో రానున్న ఎదురుగాలి గురించిన భయాందోళనలను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇన్ఫోసిస్‌లో మూర్తి కుటుంబానికి ఉన్న ముఖ్యమైన వాటా కంపెనీ వారసత్వంలో వారి కీలక పాత్రను తెలియజేస్తోంది. ఐటీ రంగంలోని కీలక పరిణామాలు, ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక వృద్ధి పథాన్ని అంచనా వేయడానికి డీల్ పైప్‌లైన్‌ను నిశితంగా పర్యవేక్షించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
ఇన్ఫోసిస్ జీతాల పెంపు.. ఎంత పెరుగుతాయంటే..
జీతాల పెంపు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇన్ఫోసిస్ (Infosys) కీలక విషయం తెలిపింది. దేశీయ ఐటీ సేవల దిగ్గజం (IT Company) భారత్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు 6-8 శాతం వార్షిక జీతాల పెంపును ఈ ఏడాది జనవరి నుండి ప్రారంభించనుంది. ఇది దాని ప్రణాళికాబద్ధమైన వేతన సవరణలలో మొదటి దశ. రెండవది వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది."భారత్‌లో కాంప్ (వార్షిక వేతనాల పెంపు) 6-8% ఉంటుందని ఆశిస్తున్నాం. విదేశీ కాంప్‌లు మునుపటి కాంప్ సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి" అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల (Q3FY25) వెల్లడి సందర్భంగా మీడియాతో అన్నారు.బెంగళూరుకు చెందిన ఈ ఐటీ కంపెనీలో ప్రపంచవ్యప్తంగా 3.23 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది. సాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ పరిశ్రమలో విస్తృత అనిశ్చితిని ఇది ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, ఆలస్యమైన క్లయింట్ బడ్జెట్లు, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితి నుండి ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.కాగా వేతన పెంపు ప్రభావం మార్జిన్లపై ఏ మాత్రం పడుతుందన్నది లెక్కించలేదని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం, 2026 మొదటి త్రైమాసికంలో "కొన్ని ఎదురుగాలులు" తప్పవని సంఘ్రాజ్కా పేర్కొన్నారు. మరోవైపు భారత్ వెలుపల ఉండే ఉద్యోగులకు కూడా జీతం పెంపు సింగిల్ డిజిట్‌లోనే మునుపటి వేతన సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి. ఇక అధిక పనితీరు కనబరిచేవారికి ఎలాగూ వేతన పెంపు కాస్త ఎక్కువగానే ఉంటుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ క్యూ3 ఫలితాలను ప్రకటించిన తర్వాత విశ్లేషకులతో మాట్లాడుతూ వెల్లడించారు.రూ.6,806 కోట్ల లాభంఏదేమైనా ఇన్ఫోసిస్ మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలను (Q3 Results) సాధించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,506 కోట్లతో పోలిస్తే ఇది 11.4 శాతం అధికం. అదే ఇంతకుముందు త్రైమాసికంలో (Q2FY25) నమోదు చేసిన రూ.6,106 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’ టెకీ పోస్ట్ వైరల్ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ. 41,764 కోట్లుగా ఉంది. ఇది గతేడాది క్యూ3తో వచ్చిన రూ. 38,821 కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మునుపటి త్రైమాసికంలో ఆర్జించిన (Q2FY25) రూ.40,986 కోట్లతో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరం మీద 6.1 శాతం, త్రైమాసికం మీద 1.7 శాతం పెరిగింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను కూడా సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5 నుంచి 5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
Infosys Q3 Results: ఇన్ఫోసిస్ అదుర్స్..
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) మూడో త్రైమాసిక ఫలితాలను (Q3 Results) వెల్లడించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,506 కోట్లతో పోలిస్తే ఇది 11.4 శాతం అధికం. అదే ఇంతకుముందు త్రైమాసికంలో (Q2FY25) నమోదు చేసిన రూ.6,106 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ.ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ. 41,764 కోట్లుగా ఉంది. ఇది గతేడాది క్యూ3తో వచ్చిన రూ. 38,821 కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మునుపటి త్రైమాసికంలో ఆర్జించిన (Q2FY25) రూ.40,986 కోట్లతో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరం మీద 6.1 శాతం, త్రైమాసికం మీద 1.7 శాతం పెరిగింది.త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను కూడా సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5 నుంచి 5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.సీఈవో ఏం చెప్పారంటే.."క్రమానుగతంగా బలహీనమైన త్రైమాసికంలో బలమైన రాబడి వృద్ధిని సాధించాం. మా విభిన్న డిజిటల్ ఆఫర్లు, మార్కెట్ పొజిషనింగ్, కీలక వ్యూహాత్మక కార్యక్రమాల విజయానికి ఇది స్పష్టమైన ప్రతిబింబం. సంస్థలో ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఉత్పాదక ఏఐపై దృష్టి సారిస్తున్నాం. ఇదే క్లయింట్లు పెరగడానికి కారణం” అని ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ అన్నారు.పెరిగిన క్లయింట్లుసెప్టెంబరు త్రైమాసికంలో 1,870గా ఉన్న క్లయింట్ల క్రియాశీలక సంఖ్య డిసెంబర్ త్రైమాసికంలో 1,876కి పెరిగిందని ఇన్ఫోసిస్ తెలిపింది. ఇక స్వచ్ఛంద అట్రిషన్ (ఉద్యోగుల సంఖ్యలో తరుగుదల) గత సెప్టెంబర్ త్రైమాసికంలో 12.9 శాతం ఉండగా ఈ త్రైమాసికంలో 13.7 శాతంగా ఉంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య సెప్టెంబర్‌లో 3,17,788 ఉండగా ఈ త్రైమాసికంలో 3,23,379గా కంపెనీ పేర్కొంది. వరుసగా రెండవ త్రైమాసికంలో హెడ్‌కౌంట్ పెరిగింది. క్రితం సంవత్సరం త్రైమాసికంలో ఇది 3,22,663. -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి నిజంగా అలా అన్నారా?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆ మధ్య పని గంటల మీద చేసిన వ్యాఖ్యలు.. ఎంత దుమారం రేపాయో తెలియంది కాదు. దానికి ఇప్పుడు కొనసాగింపుగా.. ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. అయితే.. తాజాగా ఇన్ఫోసిస్ మూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఇంతకు ముందు వారంలో 70 పనిగంటల(70 Hours) ఉండాల్సిందేనని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్ఫోసిస్ మూర్తి.. ఇప్పుడు యువతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత పరిమితంగా ఉంటే దేశానికి అంత మంచిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అప్పుడే జీవితంలో విజయం బాట పడతారు అంటూ ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. దీంతో ఆ వార్త ఆధారంగా నారాయణమూర్తి(Narayana Murthy)పై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఆయనకేమైందంటూ.. పలువురు విమర్శించడం, ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ చర్చ ఇలా నడుస్తుండగానే.. అసలు విషయం తెలిసింది. పీటీఐ ఫ్యాక్ట్ చెక్(PTI Fact Check)లో నెట్టింట్ హల్చల్ చేస్తున్న ఆ వార్త తాలుకా స్క్రీన్ షాట్ ఫేక్‌గా నిర్ధారణ అయ్యింది. అది డిజిటల్‌గా ఎడిట్ చేసిందని తేలింది. ఈ విషయాన్ని సదరు మీడియా సంస్థ కూడా తన సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది. -
‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’
దేశంలో టాప్ 2 ఐటీ కంపెనీలో ఉద్యోగం.. ఇంట్లో సంపాదించే వ్యక్తి తనొక్కడే.. చేతిలో మరో జాబ్ ఆఫర్ లేదు.. అయినా ఇన్ఫోసిస్‌లో (Infosys) చేస్తున్న ఉద్యోగాన్ని మానేశాడు పుణేకు చెందిన ఒక ఇంజనీర్ (Pune techie). ఇంత కఠిన నిర్ణయం తాను ఎందుకు తీసుకున్నాడు.. ఇన్ఫోసిస్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. జాబ్ వదులుకునేందుకు దారితీసిన కారణాలు ఏమిటి.. అన్నది ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో పంచుకోగా ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.మరో ఆఫర్ చేతిలో లేకుండానే ఇన్ఫోసిస్‌లో తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడో లింక్డ్ఇన్ పోస్ట్‌లో పంచుకున్నారు పుణేకు చెందిన భూపేంద్ర విశ్వకర్మ. తాను రాజీనామా చేయడానికి ఆరు కారణాలను పేర్కొన్నారు. నారాయణ మూర్తి స్థాపించిన టెక్ దిగ్గజంలోని వ్యవస్థాగత లోపాలను, అనేక మంది ఉద్యోగులు నిశ్శబ్దంగా భరించే సవాళ్లను వెలుగులోకి తెచ్చారు."నేను ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యవస్థాగత సమస్యలను ఎదుర్కొన్నాను. చివరికి చేతిలో ఎటువంటి ఆఫర్ లేకపోయినా నిష్క్రమించాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కార్పొరేట్ వర్క్‌ప్లేస్‌లలో చాలా ఎదుర్కొంటున్న ఈ సవాళ్ల గురించి నేను బహిరంగంగా మాట్లాడాలనుకుంటున్నాను" అని భూపేంద్ర తన పోస్ట్‌లో పేర్కొన్నారు.జాబ్ మానేయడానికి భూపేంద్ర పేర్కొన్న కారణాలు» ఆర్థిక వృద్ధి లేదు: జీతం పెంపు లేకుండా సిస్టమ్ ఇంజనీర్ నుండి సీనియర్ సిస్టమ్ ఇంజనీర్‌గా ప్రమోషన్ వచ్చింది. మూడేళ్లు కష్టపడి నిలకడగా పనిచేసినా భూపేంద్రకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం కనిపించలేదు.» అన్యాయమైన పనిభారం: భూపేంద్ర బృందాన్ని 50 నుండి 30 మంది సభ్యులకు కుదించబడినప్పుడు అదనపు పనిభారం మిగిలిన ఉద్యోగులపై పడింది. అయినా పరిహారం, గుర్తింపు లేవు. కేవలం పని ఒత్తిడి మాత్రం పెరిగింది.» అస్పష్టంగా కెరీర్ పురోగతి: నష్టం తెచ్చే పనిని అప్పగించారు. ఇందులో భూపేంద్ర ఎదుగుదలకు అవకాశం కనిపించలేదు. పరిమిత జీతాల పెంపుదల, అస్పష్టమైన కెరీర్ పురోగతి వృత్తిపరమైన డెడ్వెయిట్గా భావించేలా చేసింది.» టాక్సిక్ క్లయింట్ వాతావరణం: తక్షణ ప్రతిస్పందనల కోసం అవాస్తవిక క్లయింట్ అంచనాలు అధిక ఒత్తిడి వాతావరణాన్ని సృష్టించాయి. చిన్నపాటి సమస్యలపైనా పదేపదే ఒత్తిడి పెరగడం వల్ల ఉద్యోగి శ్రేయస్సును దెబ్బతీసే విషపూరితమైన పని సంస్కృతికి దారితీసింది.» గుర్తింపు లేకపోవడం: సహోద్యోగులు, సీనియర్ల నుండి ప్రశంసలు పొందినప్పటికీ, ఇది ప్రమోషన్లు, జీతం పెంపు, లేదా కెరీర్ పురోగతి రూపంలోకి మారలేదు. భూపేంద్ర తన కష్టానికి ప్రతిఫలం కాకుండా దోపిడీకి గురవుతున్నట్లు భావించారు.» ఆన్సైట్ అవకాశాల్లో ప్రాంతీయ పక్షపాతం: ఆన్సైట్ అవకాశాలు మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లేడే భాష ఆధారంగా ఇస్తున్నారు. నిర్దిష్ట భాషలు మాట్లాడే ఉద్యోగులు తనలాంటి హిందీ మాట్లాడే ఉద్యోగులను పక్కన పెట్టారని ఆరోపించారు.ఇదీ చదవండి: ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.. కలవరపెడుతున్న కంపెనీ ప్లాన్కంపెనీల్లో పని సంస్కృతి, పని ఒత్తిడి పెంచే కార్పొరేట్ అధిపతుల వ్యాఖ్యల నడుమ విస్తృత చర్చలు సాగుతున్న తరుణంలో తాజాగా భూపేంద్ర పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆన్లైన్లో మరింత చర్చకు దారితీసింది. ఈ పోస్ట్‌పై చాలా మంది యూజర్లు ప్రతిస్పందిస్తున్నారు. భూపేంద్రను సమర్థిస్తూ కొందరు, విభేదిస్తూ మరికొందరు కామెంట్లు పెట్టారు. -
ఐటీ ఉద్యోగులకు తీవ్ర నిరాశ.. టాప్ 2 కంపెనీ ఝలక్
దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) వార్షిక వేతనాల పెంపును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (Q4FY25)వాయిదా వేసింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది.అన్ని ఐటీ కంపెనీలదీ అదే దారిసాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం కావడం ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ సేవల రంగంలో విస్తృత అనిశ్చితిని ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, క్లయింట్ బడ్జెట్ల ఆలస్యం, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.ఇటాంటి వాతావరణంలో పోటీ కంపెనీలైన హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree), ఎల్&టీ (L&T) టెక్ సర్వీసెస్ కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు, లాభదాయకతను కొనసాగించడానికి రెండవ త్రైమాసికంలో జీతం ఇంక్రిమెంట్లను దాటవేశాయి.క్యూ4లో అక్టోబర్ 17న దశలవారీగా వేతనాల పెంపుదలకు ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అందులో కొంత భాగం జనవరిలో అమలులోకి వస్తుందని, మిగిలినది ఏప్రిల్‌లో అమలులోకి వస్తుందని క్యూ2 ఫలితాల తర్వాత విలేకరుల సమావేశంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు.లాభం మెరుగురెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం త్రైమాసికానికి 2.2 శాతం పెరిగి రూ. 6,506 కోట్లకు చేరుకుంది. తక్కువ ఆన్సైట్ ఖర్చులు, మెరుగైన వినియోగ రేట్లు, మెరుగైన కార్యాచరణ సామర్థ్యాల కారణంగా మార్జిన్లు 10 బేసిస్ పాయింట్ల మేర మెరుగయ్యాయి.వేతనాల్లో భారీ వ్యత్యాసంసాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్ భారీ ఆఫీస్!ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే. -
నారాయణ మూర్తి (ఇన్ఫోసిస్) రాయని డైరీ
కంపెనీలు వర్కర్ల మీద ఆధారపడి పనిచేయవు. ఇంఛార్జిల మీద వర్కర్లు ఆధారపడేలా చేసి చక్కటి ఫలితాలను సాధిస్తుంటాయి. ఎక్కడైనా చూడండి... ఇంఛార్జిలే, వర్కర్ల కన్నా ఎక్కువ కష్టపడి పని చేస్తుంటారు. వర్కర్లలో పని చేయనిదెవరో కనిపెట్టడానికి సెలవులు కూడా వాడుకోకుండా శ్రమిస్తూ ఉంటారు. అయితే అంత శ్రమ అవసరం లేదంటాన్నేను!దేనికైనా టెక్నిక్ ఉండాలి. పని చేయని వారెవరో వెతకటం మాని, పని చేస్తున్న వారెవరో నిఘా పెట్టి చూస్తే ఇంచార్జిల పనికి ప్రయోజనం చేకూరుతుంది, మరింత మెరుగైన ఫలితాలను తొలి త్రైమాసికంలోనే సాధించి యాజమాన్యానికి చూపించగలుగుతారు!సభాపర్వంలో ధర్మరాజుకు నారదుడు పని ఎలా చేయించుకోవాలో బోధిస్తుంటాడు. నేర్పరులనే సేవకులుగా పెట్టుకున్నావా? వారిలో పని చేస్తున్న వారిని గమనిస్తున్నావా? వారి పట్ల ఉదారంగా ఉంటున్నావా? అని అడుగుతాడు.పని చేయని వారిని కనిపెట్టటం వల్ల ఒరిగే ప్రయోజనం కన్నా, పని చేసే వారిని కనిపెట్టుకుని ఉండకపోవటం వల్ల జరిగే నష్టమే ఎక్కువని నారద ప్రబోధం.పని చేయని వారి వల్ల సంస్థలకు వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ల పని కూడా మీద వేసుకుని చేయగల పనివాళ్లు పక్కనే అందు బాటులో ఉంటారు. వారానికి 70 గంటలైనా సరే, వాళ్లు అలా పని చేసుకుంటూ పోగలరు... ఇంఛార్జిలు కనుక వాళ్లకు అందరిముందూ చిన్న కాంప్లిమెంట్ ఇవ్వగలిగితే.పని చేసే వాళ్లకు అందరిముందూ కాంప్లిమెంట్ ఇస్తే, పని చేయని వాళ్లు హర్ట్ అవుతారని చెప్పి, చాటుగా పిలిచి భుజం తట్టడం వల్ల ముందు తరాల సంస్థలకు మంచి ఇంఛార్జిలు తయారు అయితే అవొచ్చు. మంచి వర్కర్లు తయారుగా ఉండరు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేవారు మాత్రమే ఫైళ్లు పట్టుకుని ఇంటర్వ్యూలకొస్తారు.అనుపమ్ మిట్టల్ ట్వీట్ ఒకటి చూశాను. షాదీ డాట్ కామ్ ఫౌండర్ అతడు. ‘‘70 గంటల పనికి భయపడుతున్న వారంతా 2025లో రిలాక్స్డ్ గా ఉండొచ్చు. ఏఐ మన ఉద్యోగాలన్నిటినీ ఊడబెరుక్కోబోతోంది. హ్యాపీ న్యూ ఇయర్’’ అని విష్ చేశాడు. శాడిస్ట్. మిట్టల్ ఫౌండర్ అయిపోయాడు కానీ... గొప్ప ఇంచార్జి కావలసినవాడు.ఇంఛార్జి... ఫౌండర్లా ఉండాలి. ఇంకా చెప్పాలంటే గౌతమ్ అదానీలా ఉండాలి. ‘‘చేసే శక్తి, ఆసక్తి ఉన్న వాళ్లు... వద్దన్నా 70 గంటలు పని చేస్తారు. చేయనివ్వండి. ఒకటైతే నిజం. ఫ్యామిలీతో 8 గంటలు గడిపితే ఆ ఉక్కపోత భరించలేక జీవిత భాగస్వామి ఇంట్లోంచి పారిపోతుంది’’ అని పెద్దగా నవ్వుతారాయన.భార్యాభర్తలిద్దరూ వాళ్ల వాళ్ల ఆఫీస్‌లలో 70 గంటలు పని చేసి వస్తే ఇద్దరిలో ఎవరూ ఇల్లొదిలి పారిపోయే సమస్యే ఉండదు. అయితే వాళ్లు ఆఫీస్ వదిలి పారిపోకుండా ఇంచార్జిలు చూసుకోవాలి.మహా భారతంలో కర్ణుడు నాకు ఇష్టమైన క్యారెక్టర్. గొప్ప దాతృత్వం అతడిది. ఇంచార్జిలు కూడా ఎప్పుడైనా ఒకరోజు సెలవు ఇవ్వటానికి, హాఫ్ డే లీవు శాంక్షన్ చెయ్యటానికి కర్ణుడిలా గొప్ప దాతృత్వం ప్రదర్శిస్తే ఆఫీసంటే పడి చచ్చిపోని వర్కర్లు ఉంటారా?వర్కర్లు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ‘వర్క్’ అంటే ఆఫీసు మరియు ఇంచార్జి. ‘లైఫ్’ అంటే భార్య మరియు పిల్లలు. (ఉద్యోగినులకైతే భర్త మరియు పిల్లలు). వర్క్‌ను లైఫ్, లైఫ్‌ను వర్క్ వాటికవే బ్యాలెన్స్ చేసుకుంటాయి కనుక వర్కర్లు పని కట్టుకుని లైఫ్‌ని, వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకోనక్కర్లేదు. పనిలో మునిగి వుంటే చాలు.ఎండ్ ఆఫ్ ది డే... ఇంచార్జిలు కంపెనీకి మంచి ఫలితాలను సాధించి చూపేలా పని చేయటం వర్కర్ల కనీస బాధ్యత. -
చిరుత ఎంట్రీతో..ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ఆఫర్ ..!
న్యూ ఈయర్ సంబరాల వేళ కూడా ఆఫీన్ అంటే ప్చ్..! ఏంటిదీ అనే ఫీల్ వచ్చేస్తుంది. డిసెంబర్ 31తో ఈ ఏడాదికి ముగింపు పలికే కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పే సందడి టైంలో మనవాళ్లతో ఉంటే ఆ ఫీల్ వేరుకదూ..!. కానీ ఉద్యోగ బాధ్యతల రీత్యా వెళ్లాల్సిందే. కానీ చిరుత ఎంట్రీతో జాక్‌పాట్ లాంటి అవకాశం కొట్టేశారు టెక్కీ ట్రైనీ ఉద్యోగులు. ఎక్కడంటే..మైసూర్‌లోని ఇన్ఫోసిస్ క్యాంపస్ ఈ ఆఫర్‌ని ఇచ్చింది. డిసెంబర్ 31న ట్రైనీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేసేలా వర్క్ ఫ్రమ్ హోం(Work From Home)ని అమలు చేసింది. మైసూర్(Mysuru) ఇన్ఫోసిస్ క్యాపస్‌లో చిరుత(leopard) ప్రవేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది టెక్కంపెనీ. ఈ నేపథ్యంలోనే క్యాంపస్ లోపలికి ఎవరినీ అనుమతించవద్దని భద్రతా బృందాన్ని కూడా ఆదేశించినట్లు తెలిపింది. అలాగే తన కంపెనీ ట్రైనీ ఉద్యోగులను ఈ రోజు(డిసెంబర్ 31న) ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా కోరినట్లు పేర్కొంది టెక్ కంపెనీ. ఇదిలా ఉండగా, మంగళవారం ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లోకి చిరుత ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. దీంతో ఆ చిరుతను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ తెల్లవారుజామున 4 గంటలకే సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఫారెస్ట్ అధికారి ఐబీ ప్రభుగౌడ్ తెలిపారు. కాగా, ఇలా టెక్ కంపెనీ ఆవరణలో చిరుత ప్రవేశించడం తొలిసారి కాదు. గతంలో 2011లో ఇలానే చిరుత క్యాంపస్‌లోకి ప్రవేశించి కలకలం సృషించింది. (చదవండి: ట్రా'వెల్నెస్' టిప్స్..! ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..) -
కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలు
సమాజం నుంచి తీసుకోవడమే కాదు.. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే స్ఫూర్తితో పలు కార్పొరేట్ కంపెనీలు(Corporate Cos) సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో ప్రజలకు సాయమందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో వలంటీర్లు(Corporate volunteering)గా పాలుపంచుకునేలా ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం, పెయిడ్ లీవ్ ఇవ్వడమే కాకుండా తగు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరింత సమయం సైతం వెచ్చించేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న వాటిల్లో ఇన్ఫోసిస్, పీఅండ్‌జీ, క్యాప్‌జెమిని(Cap Gemini), స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్‌యూఎల్, నెట్‌యాప్ తదితర కంపెనీలు ఉన్నాయి.వివిధ కంపెనీలు నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో కొన్ని..ఇన్ఫోసిస్జీవవైవిధ్యానికి తోడ్పడేలా ప్రాంతీయంగా వృక్ష సంపదను పెంపొందించేందుకు కంపెనీ నడుం కట్టింది. ఉద్యోగులంతా కలిసి ఇటీవలే 2,00,000కు పైగా సీడ్‌బాల్స్‌ను తయారు చేశారు. వీటిని దేశవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో అడవుల పెంపకం ప్రాజెక్టుల్లో ఉపయోగించనున్నారు. ఇక ఇన్ఫీ(Infosys)కి చెందిన బీపీఎం విభాగం ప్రాజెక్ట్ జెనిసిస్ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇలా 78,000 మందికి పైగా విద్యార్థులకు తోడ్పాటు అందించింది. పీఅండ్జీఅంతగా విద్యా సేవలు అందని ప్రాంతాల్లోని బాలలకు చదువును అందుబాటులోకి తెచ్చే దిశగా శిక్షా ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. దీనితో దాదాపు యాభై లక్షల మందికి పైగా చిన్నారులు లబ్ధి పొందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.క్యాప్జెమినివిద్య, సస్టైనబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాల అభివృద్ధి మొదలైన కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. వీటిలో 90,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం 2,43,000 పైగా గంటల సమయం వెచ్చించారు. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాల కోసం వెచ్చించే సమయం వార్షికంగా 20 శాతం మేర పెరుగుతోందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులు మాక్ ఇంటర్వ్యూలు .. రెజ్యూమె బిల్డింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం, కెరియర్ విషయంలో మార్గనిర్దేశనం చేయడం మొదలైన మార్గాల్లో ఉద్యోగార్థులకు సహాయం చేస్తున్నారు. జాబ్ మార్కెట్‌కి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని, అవకాశాలను అందిపుచ్చుకునేలా వారికి తోడ్పాటు అందిస్తున్నారు.ఇదీ చదవండి: విల్మర్ నుంచి అదానీ ఔట్స్టాండర్డ్ చార్టర్డ్నైపుణ్యాలను బట్టి వివిధ సామాజిక సేవా ప్రాజెక్టుల్లో పాలుపంచుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయడం, కెరియర్‌పరంగా గైడెన్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. వాటిలో పాల్గొనే ఉద్యోగులకు మూడు రోజుల పాటు పెయిడ్ లీవ్ కూడా ఇస్తోంది. ఇలాంటి కార్యక్రమాలపై ఉద్యోగులంతా కలిసి మొత్తం 1,17,376 గంటల సమయాన్ని వెచ్చించారు. -
పని గంటలపై నారాయణమూర్తికి కౌంటర్
న్యూఢిల్లీ:ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్‌లో పనిదినాలు ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గిపోతుండడంపై మూర్తి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కార్తీ చిదంబరం ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ఎన్ని గంటలు ఎక్కువ పనిచేశామన్నది ముఖ్యం కాదని, ఎంత ప్రభావవంతంగా పనిచేశామన్నది ముఖ్యమన్నారు.‘ఎక్కువ సేపు పనిచేయడమనేది అర్థం లేనిది. ఎంత ఫోకస్‌తో పనిచేశామనేది మఖ్యం. జీవితంలో రోజువారి సమస్యలతో పోరాడే మనుషులకు వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. నిజానికి భారత్‌లో పనిదినాలను వారానికి నాలుగు రోజులకు తగ్గించాలి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే చాలు’అని కార్తీ చిదంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌గొగోయ్ కూడా నారాయణమూర్తి ఎక్కువ పనిగంటల విధానంతో విభేదించడం గమనార్హం. Working longer is meaningless, focus should be on efficiency. Daily life is as it is a struggle, battling inefficient & substandard infrastructure & amenities. Work life balance is most important for good social order & harmony. We should infact move to a 4 day working week. 12… https://t.co/EOOer6AgnK— Karti P Chidambaram (@KartiPC) December 22, 2024 ఇదీ చదవండి: హైదరాబాద్‌పై ఇన్ఫోసిస్ మూర్తి కీలక వ్యాఖ్యలు -
పేదరికం నుంచి బయటపడాలంటే
-
రూ.50 కోట్లతో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు.. ఎక్కడంటే..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి కొత్తగా రూ.50 కోట్లతో ఫ్లాట్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. బెంగళూరులో కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని పదహారో అంతస్తులో ఆయన ఫ్లాట్ కొనుగోలు చేశారు. సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ నాలుగు బెడ్రూమ్లను కలిగి ఉంది. దీనికి ఐదు కారు పార్కింగ్ స్థలాలున్నాయి. మూర్తి దీన్ని రూ.50 కోట్లతో కొనుగోలు చేయడంతో నగరంలోని అత్యంత ఖరీదైన ఫ్లాట్ల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ టవర్స్‌లో ఫ్లాట్ సొంతం చేసుకున్న ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి మూర్తి తాజాగా ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.బెంగళూరు నగరం మెయిన్ సిటీలో ఉన్న యూబీ సిటీ హౌస్ వద్ద కింగ్‌ఫిషర్ టవర్స్ 4.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో మూడు బ్లాకుల్లో 34 అంతస్తుల్లో 81 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కోటి సగటున 8,321 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్నాయి. గతంలో ఈ ప్రదేశంలో విజయ్ మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండేది. అందులో ఫ్లాట్లు నిర్మించారు. ఇందుకోసం 2010లో కింగ్‌ఫిషర్, ప్రెస్టీజ్ గ్రూప్ కలిసి పనిచేశాయి. ఇప్పటికే ప్రెస్టీజ్ గ్రూప్ ఆధ్వర్యంలోని 41 లగ్జరీ అపార్ట్మెంట్లను సంస్థ విక్రయించింది.ఇదీ చదవండి: విభిన్న ఖాతాలు.. మరెన్నో పరిమితులు!ఇప్పటికే నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ఆ టవర్స్‌లో 23 అంతస్తులో రూ.29 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షా, కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రానా జార్జ్, క్వెస్ట్ గ్లోబల్ సీఈఓ, ఛైర్మన్ అజిత్ప్రభు ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. -
గుడ్‌న్యూస్ చెప్పిన టెక్ దిగ్గజం: ఉద్యోగులకు 85 శాతం బోనస్
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎట్టకేలకు ఉద్యోగులకు పర్ఫామెన్స్ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హులైన వారికి 85 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఈమెయిల్స్ కూడా ఉద్యోగులకు పంపించింది. కాబట్టి నవంబర్ జీతంతో పాటు ఈ బోనస్ కూడా పొందనున్నారు. కంపెనీ తీసుకున్న నిర్ణయం.. డెలివరీ, సేల్స్ వర్టికల్లో జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ మెరుగైన లాభాలను పొందింది. ఈ నేపథ్యంలో సంస్థ తన ఉద్యోగులకు బోనస్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. బోనస్ అనేది కేటగిరి వారీగా చెల్లించే అవకాశం ఉంది. అయితే ఏ కేటగిరి ఉద్యోగులకు ఎంత శాతం బోనస్ ఇస్తుందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..సెప్టెంబరుతో ముగిసిన Q2FY25లో.. ఇన్ఫోసిస్ వరుసగా రెండవ త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం 4.7 శాతం పెరిగి రూ.6,506 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో రాబడి 5.1 శాతం పెరిగి రూ. 40,986 కోట్లకు చేరుకుంది. మొత్తం మీద ఈ ఆర్ధిక సంవత్సరంలో టెక్ దిగ్గజం మంచి వృద్ధిని నమోదు చేస్తోందని స్పష్టమవుతోంది. -
నారాయణ మూర్తిని మించిన సేనాపతి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తిని సంపద పరంగా అదే సంస్థకు చెందిన మరో సహవ్యవస్థాపకులు సేనాపతి గోపాలకృష్ణన్ మించిపోయారు. ఇటీవల వెలువడిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం భారత్‌లో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది కంటే 75 ఎక్కువ. వారి సామూహిక సంపద రూ.159 లక్షల కోట్లకు చేరింది. ఈ లిస్ట్‌లో ఈసారి నారాయణ మూర్తి(సందప రూ.36,600 కోట్లు)ని సేనాపతి గోపాలకృష్ణన్ అధిగమించారు. రూ.38,500 కోట్ల నికర సంపదతో ఈ ఘనత దక్కించుకున్నారు.ఇన్ఫోసిస్‌ను 1981లో నారాయణ మూర్తి, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరా, నందన్ నీలేకని, ఎస్డీ శిబులాల్, కే.దినేష్, సేనాపతి గోపాలకృష్ణన్ కలిసి స్థాపించారు. ఇది తరువాతి కాలంలో ఇన్ఫోసిస్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఐటీ సంస్థల్లో ఒకటిగా మారింది. 2023లో 18.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,51,762 కోట్లు ) ఆదాయాన్ని ఆర్జించింది.ఇదీ చదవండి: యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలుసేనాపతి గోపాలకృష్ణన్సేనాపతి గోపాలకృష్ణన్(69) ఇన్ఫోసిస్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతను 2007 నుంచి 2011 వరకు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కంపెనీ విస్తరణ, ఆవిష్కరణల్లో ఇన్ఫోసిస్‌ను ముందుండి నడిపించారు. గోపాలకృష్ణన్ 2011 నుండి 2014 వరకు సంస్థకు వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌లో తన కార్యకలాపాల నుంచి వైదొలిగిన తర్వాత గోపాలకృష్ణన్ కొత్త వ్యాపారాలపై దృష్టి సారించారు. అతను ప్రస్తుతం యాక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. యాక్సిలర్ వెంచర్స్ గుడ్‌హోమ్, కాగాజ్, ఎన్కాష్ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టింది. -
తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై మూర్తి వ్యాఖ్యలు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి గతంలో పని గంటలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. వాటిని వెనక్కి తీసుకోబోనని స్పష్టం చేశారు. అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.ప్రతి ఒక్కరూ వారంలో దాదాపు 70 గంటలపాటు పని చేయాలని నారాయణ మూర్తి గతంలో కామెంట్ చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా చర్చ జరిగింది. తన అభిప్రాయాన్ని మార్చుకున్నారా అని తాజాగా అడిగిన ప్రశ్నలకు మూర్తి స్పందించారు. ‘నన్ను క్షమించండి. నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నా తుదిశ్యాస వరకు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ వారంలో 100 గంటలపాటు పని చేస్తున్నారు. మనం కూడా కష్టపడి చేయడమే తనకు ఇచ్చే ప్రశంస. ఇది దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడంతో ఫలితం ఉండదు. వారంలో ఆరు రోజుల పని దినాలను ఐదు రోజులకు మార్చినప్పుడు తీవ్ర నిరాశ చెందాను. నా జీవితంలో చాలాకాలంపాటు రోజులో 14 గంటలు, వారంలో ఆరున్నర రోజులు పనిచేశాను. ఉదయం 6:30 గంటలకు కార్యాలయానికి చేరుకుని రాత్రి 8:40 గంటల వరకు పని చేసేవాడిని. కష్టపడి పనిచేసేతత్వం భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది’ అని అన్నారు.ఇదీ చదవండి: నెలలో 5.9 శాతం తగ్గిన ఇళ్ల ధరలు!ప్రపంచంలోనే అధికారికంగా వారంలో అధిక పని గంటలున్న దేశాలుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: 52.6 గంటలు(సరాసరి)గాంబియా: 50.8 గంటలుభూటాన్: 50.7 గంటలులెసోతో: 49.8 గంటలుకాంగో: 48.6 గంటలుఖతార్: 48 గంటలుఇండియా: 47.7 గంటలుమౌరిటానియా: 47.5 గంటలులైబీరియా: 47.2 గంటలుబంగ్లాదేశ్: 46.9 గంటలు -
పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య సుధామూర్తి నెట్‌ఫ్లిక్స్ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో స్టార్ గెస్ట్లుగా పాల్గొన్నారు. అందులో తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. నారాయణ మూర్తి తన 25వ వివాహ వార్షికోత్సవం రోజున సుధామూర్తికి శుభాకాంక్షలు తెలపడం మరిచిపోయానన్నారు.‘ఒకరోజు నేను ఆఫీస్‌కు బయలుదేరుతుండగా సుధ ఉదయం నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఏదైనా ప్రత్యేకత ఉందా? అని అడిగింది. ఏమీలేదు అని జవాబిచ్చాను. ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వస్తుండగా మళ్లీ ఈరోజు ప్రత్యేకతేంటో ఆలోచించారా? అని అడిగింది. ఏమీలేదని అదే సమాధానం చెప్పాను. నేను ఆ తర్వాతిరోజు ముంబయిలో ఒక సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి విమానం ఎక్కుతుండగా నా కూతురు అక్షత(బ్రిటన్ మాజీ ప్రధాని రిషీసునాక్ భార్య) నుంచి కాల్ వచ్చింది. ఏం చేస్తున్నారు? అని అడిగింది. ఫ్లైట్ ఎక్కుతున్నాను అని సమాధానం ఇచ్చాను. వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. వేరే విమానం ఎక్కి బెంగళూరు వెళ్లండని చెప్పింది. అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పండని తెలిపింది. మీరు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశానికి హాజరు అవ్వాల్సి ఉంది. వీలైతే మీరు ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకోండి. కానీ అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిందేనని పట్టుపట్టింది’ అని నారాయణమూర్తి చెప్పారు.ఇదీ చదవండి: మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?సుధామూర్తి నవ్వుతూ ‘అది మా 25వ వివాహ వార్షికోత్సవం. కొంత ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. నా భర్త ఆ విషయాన్ని మరిచిపోయేసరికి ఐదు-పది నిమిషాల పాటు కొంత బాధ అనిపించింది. కానీ ఆయన పనితీరు నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి ఇలాంటి విషయాలు అంతగా పట్టించుకోను. కానీ, ఈ విషయంలో నా కూతురు చాలా కలత చెందింది’ అని చెప్పారు. -
ఇన్ఫోసిస్ 20 వేలమంది ఫ్రెషర్స్‌కు ఛాన్స్
ముంబై: సాఫ్ట్వేర్ సేవల ఎగుమతుల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 6,506 కోట్లను తాకింది. 4.4 శాతం అధికంగా రూ. 8,649 కోట్ల నిర్వహణ లాభం(ఇబిట్) ఆర్జించింది. 21.1 శాతం ఇబిట్ మార్జిన్లు సాధించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి రూ. 40,986 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను తాజాగా మెరుగుపరచింది. 3.75–4.5 శాతం మధ్య వృద్ధి సాధించగలమని ప్రకటించింది. ఇంతక్రితం క్యూ1 ఫలితాల సమయంలోనూ ఆదాయ వృద్ధి అంచనాలను 1–3 శాతం నుంచి 3–4 శాతానికి పెంచిన విషయం విదితమే. వాటాదారులకు షేరుకి రూ. 21 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డ్ డేట్ ఈ నెల 29కాగా.. నవంబర్ 8కల్లా చెల్లించనుంది. డాలర్లలో ఆదాయం త్రైమాసికవారీగా 4 శాతం ఎగసి 4.89 బిలియన్లను అధిగమించింది. ఇతర విశేషాలు.. → మొత్తం 2.4 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. → ఆరు త్రైమాసికాలుగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తున్న ట్రెండ్‌కు క్యూ2లో చెక్ పడింది. నికరంగా 2,500 మందిని జత చేసుకుంది. → సెప్టెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 3,17,788 కు చేరుకుంది. → ఉద్యోగ వలసల రేటు 14.6% నుంచి 12.9 శాతానికి తగ్గింది. → ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. ఇప్పటికే తొలి అర్ధభాగంలో కొంత మందికి చోటిచి్చంది. డిమాండ్ జూమ్ అన్నివైపుల నుంచి సాఫ్ట్వేర్ సేవలకు డిమాండ్ బలపడటం మెరుగైన గైడెన్స్‌కు సహకరించింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమలో కీలకమైన ఫైనాన్షియల్ రంగ క్లయింట్ల నుంచి భారీ డీల్స్ పెరుగుతుండటం ప్రభావం చూపింది. కోబాల్ట్‌తో క్లౌడ్, టోపజ్తో జెన్ఏఐ ద్వారా కంపెనీ సామర్థ్యాలు మరింత బలపడ్డాయి. దీంతో క్లయింట్లు ఇన్ఫోసిస్‌తో జత కట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీషేరు బీఎస్ఈలో 3% బలపడి రూ. 1,975 వద్ద ముగిసింది. -
టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తనకు, దివంగత రతన్ టాటాకు మధ్య 2004లో జరిగిన ఆసక్తికరమైన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఇన్ఫోసిస్‌లో జంషెడ్జీ టాటా రూమ్‌ను ప్రారంభించేందుకు ఇన్ఫోసిస్ ఆహ్వానించినప్పుడు రతన్ టాటా ఆశ్చర్యపోయారని మూర్తి చెప్పారు.ఇన్ఫోసిస్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పోటీదారుగా ఉన్నప్పటికీ తనను ఎందుకు ఆహ్వానించారని రతన్ టాటా అడిగారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రతన్ టాటా టీసీఎస్ సంస్థకు నాయకత్వం వహించేశారు. టాటా సందేహానికి మూర్తి మర్యాదపూర్వకంగా బదులిస్తూ, జంషెడ్జీ టాటా కంపెనీలకు అతీతమైనవారని, గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌కు టాటా గ్రూప్‌ను పోటీదారుగా తాను ఎన్నడూ భావించలేదని, రతన్ టాటా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందున రూమ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించామని రతన్ టాటాకు చెప్పారు.ఇదీ చదవండి: రతన్ టాటా మళ్లీ బతికొస్తే..తర్వాత టాటా ఆహ్వానాన్ని మన్నించారని, ఈ కార్యక్రమం తనకు జ్ఞాపకంగా మారిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. రతన్ టాటాకు కాస్త సిగ్గుపడే స్వభావం ఉందని, దీంతో అప్పడు సుదీర్ఘ ప్రసంగం చేసే మూడ్‌లో లేరని చెప్పుకొచ్చారు. అయితే రతన్ టాటా పర్యటన తమ టీమ్‌పై చాలా ప్రభావం చూపిందని, ఇన్ఫోసిస్ సిబ్బందితో సమయం గడిపారని మూర్తి గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వినయం, దయ, దేశభక్తి ఉన్న గొప్ప వ్యక్తి అని నారాయణమూర్తి కొనియాడారు. -
మైక్రోసాఫ్ట్‌తో ఇన్ఫోసిస్ పార్టనర్షిప్ విస్తరణ
గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం విస్తరిస్తున్నట్లు దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రకటించింది. జనరేటివ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ అజూర్ల్లో గ్లోబల్ కస్టమర్ల దత్తత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.క్లౌడ్, ఏఐ వర్క్ లోడ్స్లో మైక్రోసాఫ్ట్ ఎంటర్ప్రైజెస్ కస్టమర్లకు వ్యూహాత్మ సరఫరాదారుగా మద్దతునిస్తామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఖర్చు తగ్గించడంతోపాటు చురుకుదనం, స్కేలబిలిటీని సాధించడంలో సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐతో ఐపీ సొల్యూషన్ల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది.ఇన్ఫోసిస్ టోపాజ్, ఇన్పోసిస్ కోబాల్ట్, ఇన్ఫోసిస్ ఆస్టర్ వంటి సొల్యూసన్స్ తో మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఏఐ ఆఫరింగ్స్ సమ్మిళితం చేస్తున్నారు. ఫైనాన్స్, హెల్త్ కేర్, సప్లయ్ చైన్, టెలీ కమ్యూనికేషన్స్ తదితర కీలక రంగాల కస్టమర్ల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వెల్లడించాయి. -
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఆఫర్ లెటర్ జారీలో మార్పులు
దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో పెద్ద సంస్కరణను ప్రకటించింది. ఈమెయిల్ల ద్వారా జాబ్ ఆఫర్ లెటర్ల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీలో కొత్తగా చేరేవారందరూ ఇకపై అప్లికేషన్ వివరాలను యాక్సెస్ చేయడానికి కంపెనీ అంతర్గత పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడాన్ని తప్పనిసరి చేసింది.నియామక ప్రక్రియలో మోసాలను అరికట్టడం, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో ఉద్యోగులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఇన్ఫోసిస్ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ చర్య ఫలితంగా అభ్యర్థులు ఆఫర్ లెటర్‌ను చూపి ఇతర కంపెనీలతో బేరసారాలు చేయడం కష్టతరమవుతుంది."ముఖ్యమైన నోటీసు-ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్, అనుబంధ పత్రాలు మా కెరీర్ సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇకపై అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను ఈమెయిల్‌లకు పంపబోము" కంపెనీ పోర్టల్‌లో పేర్కొంది.భారతీయ సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలో ఫ్రెషర్ల ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన పెరుగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ ఫైలింగ్‌ల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 24 లక్షల ఉద్యోగ దరఖాస్తులను అందుకుంది. వీటిలో 194,367 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 26,975 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. -
ఎల్ఐసీ రూపురేఖలు మార్చేపనిలో ఇన్ఫోసిస్
కాలంతో పాటు టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే దిగ్గజ కంపెనీలైన కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్'తో చేతులు కలిపింది.ఇన్ఫోసిస్ కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ అనే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చొరవకు నాయకత్వం వహించడానికి భారతదేశంలో అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీకు తన సహకారాన్ని ప్రకటించింది. కంపెనీ త్వరలోనే నెక్స్ట్‌జెన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడాన్ని ప్రారంభిస్తుంది. ఇది ఎల్ఐసీ కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు ఓమ్నిచానెల్ ఎంగేజ్మెంట్, డేటా ఆధారిత హైపర్ పర్సనలైజ్డ్ అనుభవాలను అందించడంపై దృష్టి పెడుతుంది.భారీ స్థాయి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లను అమలు చేయడంలో దాని విస్తృత అనుభవం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్.. ఇన్సూరెన్స్ రంగాలలో మరింత నైపుణ్యం పెంచుకోవడానికి ఎల్ఐసీ కంపెనీ ఇన్ఫోసిస్‌ను ఎంపిక చేసింది. కాబట్టి త్వరలోనే ఎల్ఐసీ రూపురేఖలు మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్), క్లౌడ్ నైపుణ్యాలను ఇన్ఫోసిస్ ఎల్ఐసీలో కూడా ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇది తప్పకుండా ఎల్ఐసీ అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.ఇన్ఫోసిస్ సహకారం.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరివర్తనను మరింత మెరుగుపరుస్తుందని.. కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులు అందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అనుభవాలను పొందవచ్చని ఎల్ఐసి సీఈఓ అండ్ ఎండీ సిద్దార్థ మొహంతి అన్నారు. -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంపదని దాటేసిన పార్ట్ నర్...
-
‘ ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’.. రంగంలోకి ప్రభుత్వం
ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విషయంలో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఈ సంగతేంటో చూడాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయానికి ప్రభుత్వం సూచనలను అందించింది. ఇన్ఫోసిస్ ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న వ్యవహారాన్ని పరిశీలించి తమకు, అభ్యర్థులకు అప్డేట్లను అందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర కార్మిక శాఖ కోరింది.ఇన్ఫోసిస్ 2022లో ఆఫర్ లెటర్ ఇచ్చిన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. ఆన్‌బోర్డింగ్ తేదీలలో సర్దుబాటు చేసినప్పటికీ, ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్లను గౌరవిస్తామని, అందిరినీ ఉద్యోగాల్లోకి చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ హామీ ఇచ్చారు. 2024 జూన్ నాటికి 315,000 మంది ఉద్యోగులతో ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ ఒక ప్రధానమైన శక్తిగా ఉంది.2,000 మంది గ్రాడ్యుయేట్లను ఇన్ఫోసిస్ ఆలస్యంగా ఆన్‌బోర్డింగ్ చేయడంపై ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల యూనియన్ అయిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) నుండి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖకు ఫిర్యాదు అందింది.ఈ వారం ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డ్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది గ్రాడ్యుయేట్లకు కన్ఫర్మేషన్ ఈమెయిల్‌లను పంపడం ప్రారంభించింది. మైసూర్లో చేరడానికి అక్టోబర్ 7ను షెడ్యూల్ తేదీగా పేర్కొంది. -
నేను మీలా అవ్వాలంటే?: ఇన్ఫీ నారాయణ మూర్తి సమాధానం
ఇన్ఫోసిస్ కంపెనీ గురించి తెలిసిన అందరికీ.. ఎన్ఆర్ నారాయణ మూర్తి గురించి కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రముఖ్ టెక్ దిగ్గజంగా ఎదిగారు అంటే, దాని వెనుక ఆయన అపారమైన కృషి, పట్టుదలే కారణం. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నేడు ప్రముఖుల జాబితాలో ఒకరుగా ఉన్న నారాయణమూర్తి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. సూచనలు, సలహాలు ఇస్తుంటారు.ఇటీవల నారాయణ మూర్తి టీచ్ ఫర్ ఇండియా లీడర్స్ వీక్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 12ఏళ్ల విద్యార్ధి ''నేను మీలా అవ్వాలంటే?.. ఏమి చేయాలి'' అని ప్రశ్నించారు. దానికి మూర్తి బదులిస్తూ.. ''మీరు నాలాగా మారడం నాకు ఇష్టం లేదు. దేశ శ్రేయస్సు కోసం మీరు నా కంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.మీ సొంత మార్గాన్ని ఏర్పరచుకోండి.. కొత్త విధానాలకు శ్రీకారం చుట్టండి. జీవితం అంటే ఒకరి అడుగుజాడల్లో నడవడం కాదని నారాయణ మూర్తి వెల్లడించారు. క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ.. మా నాన్న నాకు టైమ్‌టేబుల్ ద్వారా సమయాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించారు. అదే నన్ను స్టేట్ ఎస్ఎస్ఎల్సీ పరీక్షలో నాల్గవ ర్యాంక్ సాధించేలా చేసిందని వెల్లడించారు.ఇదీ చదవండి: 'అలాంటివేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రాప్యారిస్లో ఇంజనీర్‌గా ఉన్నప్పుడు, ఒక ప్రోగ్రామ్‌ను పరీక్షించే సమయంలో అనుకోకుండా మొత్తం కంప్యూటర్ సిస్టమ్ మెమరీని తొలగింతొలగించాను. సిస్టమ్‌ని పునరుద్ధరించడానికి అప్పటి మా బాస్ కోలిన్‌తో కలిసి 22 గంటలు పంచేసాను. కాబట్టి అనుకోను తప్పులు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఆయన అన్నారు. -
ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ నియామక పత్రాలు
న్యూఢిల్లీ: క్యాంపస్ నియామకాల్లో భాగంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 1,000 మందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసినట్టు సమాచారం. అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్ సెపె్టంబర్ చివర లేదా అక్టోబర్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. 2022 బ్యాచ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీరిలో ఉన్నారని ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) వెల్లడించింది. రెండేళ్లుగా వీరంతా నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. ‘మేము అప్రమత్తంగా ఉంటాం. ఇన్ఫోసిస్ ఈ నిబద్ధతను గౌరవించడంలో విఫలమైనా, చేరే తేదీని ఉల్లంఘించినా ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడానికి వెనుకాడము’ అని హెచ్చరించారు. 2022–23 రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేసినందుకు ఇన్ఫోసిస్‌పై కార్మి క, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఎన్ఐటీఈఎస్ గతంలో ఫిర్యాదు చేసింది. ఫ్రెషర్లకు ఇచి్చన ఆఫర్ లెటర్లను కంపెనీ గౌరవిస్తుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవలే స్పష్టం చేశా రు. ‘కొన్ని నియామక తేదీలను మార్చాం. అందరూ ఇన్ఫోసిస్‌లో చేరతారు. ఆ విధానంలో ఎటువంటి మార్పు లేదు’ అని వెల్లడించారు. -
శుభవార్త చెప్పిన సీఈఓ.. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సేఫ్
ఈ సంవత్సరం రెండు కొనుగోళ్ల తర్వాత, భారతదేశ రెండవ అతిపెద్ద ఐటీ సర్వీస్ కంపెనీ ఇన్ఫోసిస్ మరిన్ని సంస్థలను కైవసం చేసుకోవడానికి సన్నద్ధమవుతోంది. డేటా అనలిటిక్స్, ఎస్ఏఏఎస్ వంటి రంగాల్లో కొనుగోళ్లపై కంపెనీ ఆసక్తిగా చూపుతున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు.450 మిలియన్ యూరోల ప్రైస్-ట్యాగ్‌తో వచ్చిన స్కేల్ మ్యాచింగ్ ఇన్-టెక్కి సంబంధించి మరిన్ని కొనుగోళ్లు జరగవచ్చా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఖచ్చితంగా సాధ్యమవుతుందని పరేఖ్ అన్నారు. భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన సెమీకండక్టర్ డిజైన్ సేవల సంస్థ ఇన్ సెమీ టెక్నాలజీ సర్వీసెస్‌లో 100 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను రూ. 280 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఇన్ఫోసిస్ ఖచ్చితమైన ఒప్పందాన్ని ప్రకటించిందని వెల్లడించారు.ఏఐ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీ క్లయింట్ల నుంచి బలమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇన్ఫోసిస్ కూడా ఈ రంగంవైపు వేగంగా దూసుకెళ్తోంది. కంపెనీలు జెన్ఏఐ నుంచి ప్రయోజనాలను, ఫలితాలను వినియోగించుకోవాలని.. ఇది తప్పకుండా కంపెనీ పెరుగుదలకు దోహదపడుతుందని పరేఖ్ అభిప్రాయపడ్డారు.సమయం గడిచేకొద్దీ ఏఐ టెక్నాలజీ చాలా వేగవంతం అవుతుందని చెబుతూనే.. ఇది ఎంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతుందనేది తెలియాల్సి ఉందని పరేఖ్ అన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇన్ఫోసిస్ క్లయింట్ల కోసం 225 జనరేటివ్ AI ప్రోగ్రామ్‌లపై పనిచేస్తున్నట్లు.. దీనికోసం 2,50,000 మంది ఉద్యోగులకు ఈ రంగంలో టర్నింగ్ ఇస్తున్నట్లు కూడా వెల్లడించారు.ఏఐ ఉద్యోగులపైన ప్రభావం చూపుతుందని చాలామంది నిపుణులు వెల్లడించారు. చెప్పినట్లుగానే చాలా లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కానీ ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగించబోదని.. రిక్రూటింగ్ కూడా పెరుగుతూనే ఉంటుందని పరేఖ్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అయన స్పష్టం చేశారు. -
ఇన్ఫోసిస్‌కు షాక్.. కోర్టుకు వెళ్లిన కాగ్నిజెంట్
భారత ఐటీ సర్వీస్ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై యూఎస్‌కు చెందిన ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కోర్టుకు వెళ్లింది. తమ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని ఆరోపిస్తూ టెక్సాస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. గతంలో ఉద్యోగులను అక్రమంగా చేర్చుకుంటోందని కాగ్నిజెంట్‌కు ఇన్ఫోసిస్ లేఖాస్త్రం సంధించిన 8 నెలల తర్వాత కాగ్నిజెంట్ ఈ రూపంలో ఇన్ఫోసిస్‌కు షాకిచ్చింది.నివేదికల ప్రకారం.. తమ డేటాబేస్‌ల నుంచి ఇన్ఫోసిస్ చట్టవిరుద్ధంగా డేటాను సేకరించిందని, పోటీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి దాన్ని ఉపయోగించిందని కాగ్నిజెంట్ వ్యాజ్యంలో పేర్కొంది. అయితే కాగ్నిజెంట్ ఇంకా దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. “ఇన్ఫోసిస్‌కు దావా గురించి తెలిసింది. మేము ఆ ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నాం. విషయాన్ని కోర్టులో చూసుకుంటాం” అని ఇన్ఫోసిస్ ప్రతినిధి తెలిపారు.న్యూజెర్సీ ముఖ్య కేంద్రంగా ఉన్న కాగ్నిజెంట్.. ట్రైజెట్టో ఫేసెస్, క్యూఎన్ఎక్స్టీ సాఫ్ట్వేర్లను అందిస్తోంది. హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ కంపెనీలు వీటిని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడానికి ఉపయోగిస్తున్నాయి. ట్రైజెట్టో సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసి ఇన్ఫోసిస్ 'టెస్ట్ కేసెస్ ఫర్ ఫేసెట్స్'ను రూపొందించిందని, ట్రైజెట్టో డేటాను ఇన్ఫోసిస్ ఉత్పత్తికి రీప్యాక్ చేసిందని నివేదికలు పేర్కొన్నాయి.బెంగుళూరుకు చెందిన భారతీయ ఐటీ మేజర్ క్యూఎన్ఎక్స్టీ నుంచి రహస్యమైన ట్రైజెట్టో సమాచారం, వాణిజ్య రహస్యాలను సేకరించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని ఫిర్యాదులో కాగ్నిజెంట్ పేర్కొంది. ఇందు కోసం భారీ నష్టపరిహారాన్ని కాగ్నిజెంట్ కోరింది. అలాగే తమ వ్యాపార రహస్యాల దుర్వినియోగాన్ని ఆపాలని ఇన్ఫోసిస్‌ను ఆదేశించాలని అభ్యర్థించింది. -
''పదివేల అప్పుతో వేలకోట్ల సామ్రాజ్యం''.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
ఫ్రెషర్స్‌కు ఏటా రూ.9 లక్షలు వేతనం!
టెక్ కంపెనీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని తెలుసుకదా. తాజాగా ప్రముఖ సాఫ్ట్వేర్ సేవలందించే ఇన్ఫోసిస్ కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా ఈ ఏడాది ‘పవర్ ప్రోగ్రామ్’ విధానాన్ని అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కేటగిరీలో నియమించుకుంటున్న అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల వరకు వేతనం చెల్లిస్తామని పేర్కొంది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా రిక్రూట్ అయ్యే అభ్యర్థులు ‘పవర్ ప్రోగ్రామ్’ కిందకు వస్తారు. ఈ కేటగిరీలోని వారికి ఏటా రూ.9 లక్షల వరకు వేతనం ఉంటుంది. కంపెనీ అవసరాలకు తగిన ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాలున్నాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్ సామర్థ్యంపై అధిక నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలపై యువత నైపుణ్యం పెంచుకోవాలని చెప్పింది.ఇదీ చదవండి: రోబోల దండు వచ్చేస్తోంది..!ఇదిలాఉండగా, టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ విభాగం గ్లోబల్ హెడ్ గిరీష్ నందిమఠ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఏడాది సంస్థ రిక్రూట్మెంట్ విధానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నామని చెప్పారు. ‘ప్రైమ్’ కేటగిరీలో నియామకం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు వేతనం అందిస్తామన్నారు. -
ఇన్ఫీ జీఎస్టీ నోటీస్ వెనక్కి!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు జారీ చేసిన జీఎస్టీ ఎగవేత నోటీసుపై అధికారులు వెనక్కి తగ్గారు. రూ.32,403 కోట్ల జీఎస్టీ ఎగవేత విషయంలో కంపెనీకి జారీ చేసిన ప్రీ–షోకాజ్ నోటీసులను కర్నాటక రాష్ట్ర జీఎస్టీ అధికారులు ఉపసంహరించుకున్నారు. అయితే, దీనిపై జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, సరీ్వస్ ట్యాక్స్ ఎగవేతలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ)కి వివరణ ఇవ్వాలని కంపెనీకి సూచించారు. బీఎస్ఈకి వెల్లడించిన సమాచారంలో ఇన్ఫోసిస్ ఈ విషయాన్ని తెలిపింది. 2017 నుంచి ఐదేళ్ల పాటు విదేశీ బ్రాంచ్‌ల నుంచి అందుకున్న సర్వీసులకు గాను రూ. 32,403 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ పన్ను అధికారులు ఇనీ్ఫకి డిమాండ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. అయితే, ఇది కేవలం ప్రీ–షోకాజ్ నోటీసు మాత్రమేనని, అధికార యంత్రాంగం పేర్కొన్న వ్యయాలకు జీఎస్టీ వర్తించదని ఇన్ఫోసిస్ ఇప్పటికే స్పష్టం చేసింది.ఈ ఉదంతంపై ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ కూడా స్పందించింది. పన్ను అధికారులు ఐటీ పరిశ్రమ నిర్వహణ విధానాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొంది. కాగా, అంతర్జాతీయంగా భారీ వ్యాపార కార్యకలాపాలు గల కంపెనీలకు ఇలాంటి పన్ను నోటీసులను ఇచ్చే ముందు సరైన దర్యాప్తు, స్పష్టమైన రుజువులను సమరి్పంచాల్సి ఉంటుందని ఎస్కేఐ క్యాపిటల్ ఎండీ, సీఈఓ నరీందర్ వాధ్వా వ్యాఖ్యానించారు. -
పన్నుల విషయంలో అనిశ్చితి
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌కు రూ. 32,400 కోట్ల జీఎస్టీ ఎగవేత నోటీసులివ్వడంపై ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ స్పందించింది. ఐటీ పరిశ్రమ నిర్వహణ విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనడానికి తాజా పన్ను నోటీసుల ఉదంతమే నిదర్శనమని పేర్కొంది. పలు కంపెనీలు ఇలాంటి అనవసరమైన లిటిగేషన్లను, పన్నుల విషయంలో అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయని కూడా తెలిపింది. ‘పరిశ్రమ వ్యాప్తంగా ఇలాంటి సమస్య నెలకొంది. జీఎస్టీ కౌన్సిల్లో తీసుక్ను నిర్ణయాలు, సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తుంది. చట్టాలను అమలు చేసే యంత్రాంగాలు వీటిని పాటించాలి. దీనివల్ల నోటీసులతో అనిశి్చతికి దారితీయదు, అలాగే భారత్‌లో వ్యాపార సానుకూలతపై ప్రభావం చూపకుండా ఉంటుంది’ అని నాస్కామ్ పేర్కొంది. రివర్స్ చార్జ్ మెకానిజం (ఆర్సీఎం) ద్వారా జీఎస్టీని వర్తింపజేయడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోందని అభిప్రాయపడింది. ‘భారత ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాలు తమ విదేశీ శాఖలకు పంపే నిధులపై జీఎస్టీ అధికారులు పన్ను ఎగవేత నోటీసులు ఇస్తున్నారు. ఈ ఆర్సీఎం విషయంలో హెడ్ ఆఫీసు, విదేశీ బ్రాంచ్ మధ్య ఎలాంటి సేవల లావాదేవీలు జరగలేదు. ఇది బ్రాంచ్ నుంచి హెడ్ ఆఫీసు సేవలను పొందడం కిందికి రాదనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. ఇదేమీ కొత్త సమస్య కాదు. ఇప్పటికే పలు కేసుల్లో కోర్టులు ఐటీ పరిశ్రమకు అనుకూలంగా తీర్పులిచ్చాయి. ఓ పెద్ద ఐటీ కంపెనీకి ఇలాంటి కేసులోనే జారీ చేసిన జీఎస్టీ నోటీసుపై కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది’ అని నాస్కామ్ వివరించింది. దీనికి సంబంధించి స్పష్టతనిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేసింది. -
ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసు.. ఎందుకంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 32403 కోట్ల జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఎగవేతపై ప్రీ-షోకాజ్ నోటీసు అందుకుంది. బీఎస్ఈ ఫైలింగ్‌లో సంస్థ ఈ విషయం వెల్లడించింది.ఇన్ఫోసిస్ లిమిటెడ్.. విదేశీ బ్రాంచ్ ఆఫీస్‌ల కోసం చేసే ఖర్చుల వివరాలను వెల్లడించకలేదని, వాటికి జీఎస్టీ చెల్లించలేదని కర్ణాటక జీఎస్టీ అధికారులు ప్రీ-షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2017 జులై నుంచి 2022 మార్చి వరకు 32403 కోట్ల రూపాయలకు జీఎస్టీ చెల్లింపు చేయలేదనేది ఈ ప్రీ-షోకాజ్ నోటీసు సారాంశం.దీనిపైన ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. అటువంటి ఖర్చులపైన జీఎస్టీ వర్తించదని తాము విశ్వసిస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్, కస్టమ్స్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్టీ పరిధిలోకి రావని సంస్థ పేర్కొంది.ఇన్ఫోసిస్ ఎప్పటికప్పుడు జీఎస్టీ చెల్లిస్తూనే ఉందని, ఈ విషయంలో తాము కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధలనకు లోబడి పాటించాల్సిన అన్ని నిబంధవులను పాటిస్తున్నట్లు తెలిపింది.ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) చట్టం ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాలు కంపెనీ నుంచి విభిన్న సంస్థలుగా పరిగణించబడతాయని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి బ్రాంచ్ కార్యాలయాలు అందించే అన్ని సేవలను దిగుమతిగా పరిగణిస్తామని, తద్వారా జీఎస్టీ విధించడం జరుగుతుందని వెల్లడించారు. -
ఐటీ ఫ్రెషర్లకు పండగే.. క్యూ కట్టనున్న కంపెనీలు!
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో వంటి పెద్ద ఐటీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో భారత ఐటీ రంగం రిక్రూట్మెంట్ ప్రయత్నాలలో గణనీయమైన పునరుద్ధరణను పొందుతోంది. టాప్ కంపెనీలు మొత్తంగా 80,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయన్న వార్తలు ఐటీ ఫ్రెషర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ముందంజలో టీసీఎస్ ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ సంవత్సరం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ త్రైమాసికంలోనే 5,452 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరుకుంది.ఇన్ఫోసిస్ వ్యూహాత్మక నియామకందేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ నియామకం ఆన్-క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ మిశ్రమంగా ఉంటుంది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా హెడ్‌కౌంట్‌లో క్షీణతను నివేదించినప్పటికీ, ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ సంఘ్రాజ్కా భవిష్యత్ వృద్ధిపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.తాజా ప్రతిభపై హెచ్‌సీఎల్‌టెక్ దృష్టిఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8,080 మంది ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ఆర్థక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను హెచ్‌సీఎల్‌టెక్ ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్‌లో పోటీగా నిలవడానికి ఉత్పాదక ఏఐలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో సహా అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా తాజా ప్రతిభపై పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది.విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 నుంచి 12,000 మంది ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సంవత్సరం విరామం తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్కు తిరిగి రావడాన్ని సూచిస్తోంది. -
అందరూ భయపడుతుంటే.. ఇన్ఫోసిస్ మాత్రం ఓకే..
ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు కంపెనీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని గురించి అన్ని కంపెనీలు భయోందోళన చెందుతుంటే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాత్రం తమకు ఓకే అంటోంది.ప్రైవేట్ సంస్థల్లో స్థానిక నియామకాలకు రాష్ట్ర ప్రతిపాదిత రిజర్వేషన్లకు ప్రతిస్పందనగా కర్ణాటక ఏ కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను ప్రవేశపెట్టినా తమ కంపెనీ పాటిస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తామని పరేఖ్ స్పష్టం చేశారు. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు వచ్చినా మద్దతిస్తాం.పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించే కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు, 2024 ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఈ వారం ప్రారంభంలో ఆమోదించింది. ఏ పరిశ్రమ, కర్మాగారం లేదా ఇతర సంస్థలు అయినా మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 50 శాతం, నాన్ మేనేజ్ మెంట్ కేటగిరీల్లో 70 శాతం స్థానిక అభ్యర్థులను నియమించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది.ఈ బిల్లు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే వ్యాపార ప్రముఖులు, టెక్నాలజీ రంగ ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దీన్ని నిలిపివేశారు. ఈ ఆంక్షల వల్ల స్థానిక నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కొరత ఏర్పడితే కంపెనీలు తరలిపోతాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) హెచ్చరించింది.ఫోన్ పే సీఈఓ సమీర్ నిగమ్ ఈ ప్రతిపాదనను సోషల్ మీడియాలో ‘షేమ్’ అంటూ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపాదిత కోటాను 'ఫాసిస్టు', 'స్వల్పదృష్టి'గా అభివర్ణిస్తూ పరిశ్రమ పెద్దలు కూడా ఈ కోటాపై తీవ్రంగా స్పందించారు. ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీ మోహన్ దాస్ పాయ్ ఈ బిల్లును తిరోగమనంగా అభివర్ణించారు. బయోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా, అసోచామ్ కర్ణాటక కో-చైర్మన్ ఆర్కే మిశ్రా వ్యతిరేక స్వరం వినిపించారు. -
81,000 దాటిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ నాలుగోరోజూ కొనసాగింది. అధిక వెయిటేజీ టీసీఎస్(3%), ఇన్ఫోసిస్(2%), రిలయన్స్(1%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) చొప్పున రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు సెపె్టంబర్ నుంచి ప్రారంభం కావచ్చొనే అంచనాలూ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 81,343 వద్ద ముగిసింది. నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 24,801 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డులు కావడం విశేషం. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్ధమంతా బలహీనంగా ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ నుంచి మార్కెట్ లాభాల బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్ 806 పాయింట్లు బలపడి 81,523 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు ఎగసి 24,838 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. → ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పిస్తున్నాయి. సెపె్టంబర్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఈ రంగ షేర్లకు మరింత డిమాండ్ పెంచాయి. ఎల్టీఐఎం 3.50%, టీసీఎస్ 3%, విప్రో 2.50%, ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా 2% రాణించాయి. ఎంఫసీస్‌లు ఒకశాతం లాభపడ్డాయి. రూపాయి రికార్డ్ కనిష్టం @ 83.63 దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 5 పైసలు నీరసించి 83.63 వద్ద ముగిసింది. రూపాయి 83.57 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 83.66 వరకూ క్షీణించింది. -
ఇన్ఫోసిస్.. గుడ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 6,368 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5,945 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసిక(క్యూ4)వారీగా చూస్తే నికర లాభం రూ. 7,969 కోట్ల నుంచి 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం 3.6 శాతం మెరుగుపడి రూ. 39,315 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 37,933 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ప్రారంభించిననట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. మెరుగైన మార్జిన్లు, భారీ డీల్స్, రికార్డ్ నగదు ఆర్జనను సాధించినట్లు తెలియజేశారు. ఈ షేరు బీఎస్ఈలో 2% ఎగసి రూ. 1,759 వద్ద ముగిసింది. 3–4 శాతం వృద్ధి తాజా త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నిర్వహణ లాభ మార్జిన్లు 0.3 శాతం బలపడి 21.1 శాతంగా నమోదయ్యాయి. పూర్తి ఏడాదికి 20–22 శాతం మార్జిన్లు సాధించగలమని అంచనా వేస్తోంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన 3–4 శాతం వృద్ధిని సాధించగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. గతంలో విడుదల చేసిన 1–3 శాతం వృద్ధి అంచనాల (గైడెన్స్)ను ఎగువముఖంగా సవరించింది. ఇతర విశేషాలు → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 9,155 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించింది. ఇది 59 శాతం వృద్ధి. → ఈ ఏడాది సాధించగల వృద్ధి ఆధారంగా 15,000 నుంచి 20,000మంది వరకూ ఫ్రెషర్స్‌కు ఉపాధి కలి్పంచే వీలున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ ఎస్. తెలియజేశారు. → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.1 బిలియన్ డాలర్ల విలువైన 34 భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. ఇవి 78 శాతం అధికంకాగా.. వీటిలో కొత్త కాంట్రాక్టుల వాటా 58 శాతం. → ఉద్యోగుల సంఖ్య 6 శాతం తగ్గి 3,15,332కు పరిమితమైంది. గతేడాది క్యూ1లో మొత్తం సిబ్బంది సంఖ్య 3,36,294కాగా.. జనవరి–మార్చి(క్యూ4)లో 3,17,240గా నమోదైంది. → స్వచ్ఛంద ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.7 శాతంగా నమోదైంది. గత క్యూ1లో ఇది 17.3 శాతంకాగా.. క్యూ4లో 12.6 శాతంగా నమోదైంది. -
‘మూర్తి సార్.. మీ ఇన్ఫోసిస్ వాళ్లకు చెప్పండి’
ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి సున్నితమైన కౌంటర్ ఇచ్చారు ఓ చార్టెర్డ్ అకౌంటెంట్. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఐటీ శాఖ పోర్టల్‌లో సమస్యలు తలెత్తడం మీద దాన్ని అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌పై బెంగళూరుకు చెందిన సీఏ ఒకరు సోషల్ మీడియా వేదికగా అంతృప్తి వ్యక్తం చేశారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో బసు (@Basappamv) అనే సీఏ ఓ పోస్టు పెట్టారు. దేశాన్ని నిర్మించడానికి యువ నిపుణులు వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను హాస్యాస్పదంగా ప్రస్తావించారు. "నారాయణ మూర్తి సార్, మీ సలహా మేరకు, మేము పన్ను నిపుణులం వారానికి 70 గంటలకు పైగా పని చేయడం ప్రారంభించాం. ఆదాయపు పన్ను పోర్టల్‌ను సజావుగా నడపడానికి మీ ఇన్ఫోసిస్ బృందాన్ని వారానికి కనీసం ఒక గంట పని చేయమని అడగండి" అంటూ రాసుకొచ్చారు.ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కీలకమైన వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను సమాచార ప్రకటన (TIS) డౌన్లోడ్ చేయడంలో సమస్యలను పేర్కొంటూ చాలా మంది సీఏలు బసు మనోభావాలను ప్రతిధ్వనించారు. ట్యాక్స్‌ఆరామ్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్, భాగస్వామి మయాంక్ మొహంకా, "ఈ సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో సాధారణ జాప్యం జరుగుతోంది" అని పేర్కొన్నారు.మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలతో జరిగిన ఆలస్యం కారణంగా చాలా మంది క్లయింట్ల కోసం ఏఐఎస్, టీఐఎస్‌లను పొందడంలో చాలా మంది చార్టెర్డ్ అకౌంటెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పన్ను చెల్లింపుదారులను, సీఏలను ప్రభావితం చేస్తున్న పోర్టల్ సమస్యలపై అటు ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇటు ఇన్ఫోసిస్ గానీ స్పందించలేదు. -
30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనలేదు
-
‘48 వేలమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తాం..’
ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఐసీటీ అకాడమీ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి 48 వేలమంది విద్యార్థులకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ(సీఎస్ఆర్)లో భాగంగా నిర్వహించే ఈ శిక్షణకు రూ.33 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.ఈ సందర్భంగా కంపెనీ వర్గాలు మాట్లాడుతూ..‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్, తమిళనాడులోని ఐసీటీ స్వచ్ఛంద సంస్థతో కలిసి రానున్న మూడేళ్లలో 48 వేలమంది విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయనున్నాం. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రిటైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తాం. ఇందుకోసం రూ.33 కోట్లు కేటాయించాం. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులను అభ్యసించే విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాల పెంపునకు ఇది సహకరిస్తుంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: యూఏఈలోనూ యూపీఐ చెల్లింపులు!‘దేశంలోని 450కి పైగా కళాశాలల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు కేంద్రంగా పనిచేస్తుంది. విద్యార్థులకు కోర్ స్కిల్స్‌లో 80 గంటల శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్‌లో 20 గంటల శిక్షణ, సర్టిఫికేషన్ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్ సౌకర్యం, యూత్ ఎంపవర్మెంట్ సమ్మిట్లు, రియల్‌టైమ్ కోడింగ్ ప్రాక్టీస్ వంటివి ఏర్పాటు చేస్తాం. ‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్’, ‘ఇన్ఫోసిస్ ఫ్లాగ్షిప్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్’ను ఉపయోగించుకోవడం ద్వారా విద్యార్థులకు మరిన్ని నైపుణ్యాలు అందుబాటులోకి రానున్నాయి’ అని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రకటనలో పేర్కొంది. -
‘ఆడామగా సమానమే, కానీ పురుషుల్లో..’ సుధామూర్తి కీలక వ్యాఖ్యలు
ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి లింగ సమానత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితం అనే బండికి చక్రల్లాంటివారు. జీవన యానం సాఫీగా సాగాలంటే ఇద్దరూ ఉండాలి.. తన దృష్టిలో స్త్రీపురుషులిద్దరూ సమానమే కానీ, వేర్వేరు మార్గాల్లో అన్నారు.లింగ సమానత్వం అంటే ఏమిటో వివరిస్తూ ఒక వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. స్త్రీ, పురుషులు సైకిల్‌కి రెండు చక్రాల్లాంటివారు. వీరిలో ఎవరూ లేకపోయినా బండి ముందుకు సాగదు.. అని ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి మూర్తి పేర్కొన్నారు.In my view, men and women are equal but in different ways. They complement each other like two wheels of a bicycle; you can't move forward without the other. pic.twitter.com/MMShEOtg9Q— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 27, 2024మహిళలు పురుషులు ఇద్దరూ ఒకరికొకరు భిన్నం. ఇద్దరిలోనూ ప్లస్, మైనస్‌లు ఉంటాయి. అయితే పురుషులతో పోలిస్తే మహిళలకు చాలా భాష తెలుసు. మేనేజ్మెంట్లో వారు చాలా అద్భుతం. పుట్టుకతోనే వారు మంచి మేనేజర్లు. ప్రేమ, జాలి కరుణ ఎక్కువ. అమ్మ, నాన్న, తోబుట్టువులు, అత్తమామలు, వదినలు, పిల్లలు ఇలా సన్నిహిత బంధువులు అందరికీ చక్కటి ప్రేమను పంచుతారు. మరోవైపు పురుషులు మహిళలంత భావోద్వేగులు కాదు. కొంచెం భిన్నం. పురుషుల్లో మంచి ఐక్యూ ఉండివచ్చు కానీ,మంచి ఈక్యూ (ఎమోషనల్ కోషెంట్) ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. -
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. రూ.8 లక్షల బోనస్!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయిస్ ట్రాన్స్ఫర్ పాలసీ కింద ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ ప్రకటించింది. ముంబై-కర్ణాటక ప్రాంతంలోని టైర్-2 నగరమైన హుబ్బల్లిలో తన ఉనికిని పెంచుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.హుబ్బల్లిలోని క్యాంపస్‌కు కంపెనీ స్థానిక ఉద్యోగులను రప్పించడానికి ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ తమ ఉద్యోగులకు ఒక మెయిల్ కూడా పంపింది. అందులో ''భవిష్యత్తును నిర్మించడానికి మీలాంటి ప్రతిభ ఉన్నవారి కోసం వేచి ఉందని'' పేర్కొంది.ఇక ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ విషయానికి వస్తే.. లెవెల్ 3 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో రూ. 25,000 అందిస్తారు. ఆ తరువాత రెండు సంవత్సరాలలో.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ. 25000 అందిస్తారు. ఇలా మొత్తం 24 నెలల్లో రూ.1.25 లక్షలు లభిస్తాయి.లెవెల్ 4 ఉద్యోగులకు కంపెనీ ప్రారంభంలో రూ. 5000 అందిస్తుంది. ఆ తరువాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ. 50000 జమచేస్తుంది. ఇలా రెండు సంవత్సరాల్లో ఈ కేటగిరి ఉద్యోగులు మొత్తం రూ. 2.5 లక్షల బోనస్ పొందవచ్చు. ఉన్నత స్థాయి ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో రూ. 1.5 లక్షలు అందిస్తారు. వీరికి రెండు సంవత్సరాల్లో మొత్తం రూ. 8 లక్షలు అందిస్తారు.ఇన్ఫోసిస్ ఇప్పుడు ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ తీసుకురావడానికి ప్రధాన కారణం.. కర్ణాటక ప్రభుత్వంతో ఏర్పడిన కొన్ని విభేదాలే అని తెలుస్తోంది. కర్ణాటకలోని కొన్ని రాజకీయ పార్టీలు నుంచి సంస్థ మీద ఒత్తిడి పెరగటం మాత్రమే కాకుండా.. ఇన్ఫోసిస్ స్థానికులకు ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. కంపెనీకి ఉపాధి కల్పన కింద కేటాయించిన 58 ఎకరాల భూమిని కూడా వెన్నక్కి తీసుకోవడానికి ప్రయతిస్తున్నారు. ఈ కారణంగా ముంబై కర్ణాటక ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులను కంపెనీ హుబ్బళ్ళికి తరలించడానికి ఈ ఆఫర్ తీసుకువచ్చింది. -
మరో భారీ డీల్‌ను దక్కించుకున్న ఇన్ఫోసిస్
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పలు కొత్త ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. తాజాగా స్వీడన్ రిటైలర్ ఐకియా నుంచి 100 మిలియన్ డాలర్ల (రూ.850 కోట్లు) డీల్‌ను దక్కించుకుంది. హెచ్‌సీఎల్, క్యాప్ జెమినీ, డీఎక్స్‌సీ వంటి బడా కంపెనీలను దాటుకుని ఈ భారీ డీల్‌ను సొంతం చేసుకుంది.ఈ ఐదేళ్ల ఒప్పందం ప్రకారం.. ఇన్ఫోసిస్ 1,70,000 మంది ఉద్యోగులకు సర్వీస్ డెస్క్, సర్వీస్ నౌ ఆధారిత ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కన్జ్యూమర్, రిటైల్, లాజిస్టిక్స్ గ్లోబల్ హెడ్, ఈవీపీ కర్మేష్ వాస్వానీ ఈ డీల్‌కు నేతృత్వం వహించారు. గత ఏడాది ఐటీ దిగ్గజం డాన్స్కే బ్యాంక్ నుంచి 454 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకుంది.ఈ డీల్ కారణంగా చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, పోలాండ్, స్వీడన్, అమెరికా దేశాల్లో ఐకియాలో 350 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ ఉద్యోగులు ఇన్ఫోసిస్ కు మారనున్నారు. కోల్డ్ కాలింగ్, కొన్ని ప్రారంభ కనెక్షన్లతో ప్రారంభమై వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముగిసిన మూడేళ్ల సుదీర్ఘ, సంతృప్తికరమైన ప్రయాణం అని ఇన్ఫోసిస్ కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లో పేర్కొంది. -
వరల్డ్ టాప్ 100 బ్రాండ్లలో ఇండియన్ కంపెనీలు
ప్రపంచంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్లలో ఇండియా నుంచి నాలుగు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. దీనికి సంబంధించిన డేటాను బ్రాండ్జెడ్ మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్ట్‌లో ప్రముఖ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ బిజినెస్ కాంటార్ వెల్లడించింది.ప్రపంచంలోని అత్యంత విలువైన 100 కంపెనీల జాబితాలో టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) 46వ ర్యాంక్ పొందగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 47 ర్యాంక్ పొందింది. టెలికాం కంపెనీ ఎయిర్టెల్ కూడా ఈ జాబితాలో 73 ర్యాంక్ సొంతం చేసుకుంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 74 ర్యాంక్ కైవసం చేసుకుంది.ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ సంస్థ స్థానం పొందటం ఇది వరుసగా మూడోసారి. బిజినెస్-టు-బిజినెస్ టెక్నాలజీ బ్రాండ్‌గా ఇన్ఫోసిస్ 20వ ర్యాంక్ పొందింది.ఇండియాలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఇన్ఫోసిస్ టాప్ 6 శాతంలో ఉందని కాంటార్ బ్రాండ్జెడ్ డేటా వెల్లడించింది. రెండు మార్కెట్లలో ఇన్ఫోసిస్ విశ్వసనీయ భాగస్వామిగా దాని స్థానాన్ని సుస్థిరం చేయడం ద్వారా దాని వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉందని కాంటార్ బ్రాండ్జెడ్ అధిపతి మార్టిన్ గెరియేరియా అన్నారు.Infosys featured as a Top 100 global brand by Kantar! Thank you to every Infoscion, for making this happen for the 3rd consecutive year! https://t.co/MSaxBOIy1x#NavigateYourNext #KantarBrandzTop100 #InfyNews pic.twitter.com/zGe99AWfeI— Infosys (@Infosys) June 12, 2024 -
ఇన్ఫోసిస్‌లో రూ.కోటి పైగా జీతం.. ఈసారి ఎంత మందికంటే..?
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఏడాదికి రూ.కోటికి పైగా జీతం తీసుకునే వారి సంఖ్య ఈ ఏడాది తగ్గింది. కనీసం రూ.1.02 కోట్ల వార్షిక వేతనంతో ఇన్ఫోసిస్ లో ఉద్యోగుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం క్షీణించి 103కు పడిపోయిందని సీఎన్‌బీసీ-టీవి 18 గణాంకాలు చెబుతున్నాయి. ఈ 103 మంది ఉద్యోగులు మొత్తంగా ఏడాదికి రూ.176 కోట్ల స్థూల వేతనాన్ని అందుకున్నారు.ఈ టెక్ దిగ్గజంలో సుమారు 124 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .221 కోట్ల వేతనం పొందారు. రూ. కోటికి పైగా వేతనం పొందే ఉద్యోగుల సంఖ్య 2022 ఆర్థిక సంవత్సరంలో 100 మార్కును దాటగా, 2023 ఆర్థిక సంవత్సరంలో కూడా 124 మంది ఉద్యోగుల సంఖ్యతో అదే స్థాయిలో ఉంది. ఈ జాబితాలో భారత్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇందులో కంపెనీ టాప్ 10 ఉద్యోగులు తీసుకున్న వేతన పరిహారాన్ని చేర్చలేదు.(విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్)ఇన్ఫోసిస్‌కు ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లలో నర్సింహారావు మన్నెపల్లి, రిచర్డ్ లోబో, శ్వేతా అరోరా, విశాల్ సాల్వి తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ 103 మంది ఉద్యోగుల్లో మూడింట ఒక వంతు మంది 2000 సంవత్సరం కంటే ముందే ఇన్ఫోసిస్ లో చేరారు. వీరు ఏడాదికి సగటున రూ.1.7 కోట్ల వేతనం తీసుకున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కీ మేనేజిరియల్ పర్సనల్ సహా పురుష ఉద్యోగులందరి సగటు వేతనం రూ .11 లక్షలుగా ఉంది. అదే విధంగా మహిళా ఉద్యోగులు సగటున రూ .7 లక్షలు వార్షిక వేతనం పొందారు. కాగా ఏడాది మధ్యలో 34 మంది ఉద్యోగులను నియమించుకోగా వీరి సగటు వేతనం నెలకు 8.5 లక్షలు.2024 ఆర్థిక సంవత్సరంలో అధిక చెల్లింపులు అందుకున్న ఉద్యోగులలో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) పదవికి రాజీనామా చేసిన నీలాంజన్ రాయ్ రూ .10.7 కోట్ల వార్షిక వేతనంతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కొత్తగా నియమితులైన సీఎపఫ్‌వో జయేశ్ సంఘ్ రాజ్కా రూ.6.1 కోట్లు, దినేష్ ఆర్, సతీష్ హెచ్ సీలు వరుసగా రూ.4.6 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు వేతనం అందుకున్నారు. దినేష్, సతీష్ ఇద్దరూ ఇన్ఫోసిస్ లో ఈవీపీ అండ్ కో-హెడ్ ఆఫ్ డెలివరీగా నియమితులయ్యారు. -
ఇన్ఫోసిస్‌పై కంప్లైంట్.. ఆఫర్ లెటర్ ఇచ్చి రెండేళ్లయినా..
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మీద ఐటీ యూనియన్ ''నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్'' (NITES) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దాదాపు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్లకు సంబంధించిన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని ఆరోపించింది.ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో రెండేళ్లకు పైగా జాప్యం జరుగుతోంది. దీనివల్ల బాధిత ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీనిపై విచారణ జరిపించాలని యూనియన్ మంత్రిత్వ శాఖను కోరింది. దీనిపైన ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు.చాలా మంది ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై నమ్మకంతో ఇతర జాబ్ ఆఫర్లను తిరస్కరించారు. దీనివల్ల ఆదాయం లేకపోవడం మాత్రమే కాకుండా.. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ చేసుకుంటారనే విషయం మీద స్పష్టత లేకుండా ఉన్నారు. చాలామంది తమ కెరీర్ సాఫీగా ముందుకు సాగటానికి ఇన్ఫోసిస్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ఇన్ఫోసిస్ ఆలస్యం వల్ల ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారిందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డింగ్ ఆలస్యానికి.. కంపెనీ రిక్రూట్లకు జీతం చెల్లించాలని యూనియన్ కోరింది. ఆలస్యం కారణంగా ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించడానికి ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఐటీ యూనియన్ కోరింది.ఐటీ సంస్థల ఆన్‌బోర్డింగ్ ఆలస్యం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా టీసీఎస్ 200 రిక్రూట్ల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేసింది. ఈ కారణంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు అదే సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీనిపైన ఇన్ఫోసిస్ స్పందించాల్సి ఉంది. -
అది నమ్మక ద్రోహమే.. ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల కంప్లైంట్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఈ ఐటీ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని యూనియన్ ఆరోపించింది.దీర్ఘకాలిక జాప్యంతో ఆర్థిక ఇబ్బందులుఇన్ఫోసిస్లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్ జాప్యం కొనసాగుతోందని, దీంతో బాధితులు అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని యూనియన్ పేర్కొంది. ‘‘ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై ఆధారపడి చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారు. ఇప్పుడు ఆదాయంతోపాటు స్పష్టమైన ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు' అని ఎన్ఐటీఈఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్ చర్యలు తీవ్రమైన నమ్మక ద్రోహాన్ని సూచిస్తున్నాయని, కంపెనీ ద్వారా తమ కెరీర్లు సజావుగా ప్రారంభమవుతాయని యువ నిపుణులు విశ్వసించారని యూనియన్ వాదిస్తోంది.ప్రభుత్వ జోక్యానికి విజ్ఞప్తినియామకాలకు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఇన్ఫోసిస్ కు ఉందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఎన్ఐటీఈఎస్ కోరుతోంది. అనిశ్చితి వల్ల ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించాలని, జాప్యం జరిగిన కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. అంతేకాక, ఆన్‌బోర్డింగ్ ఇలాగే కొనసాగితే, సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కనుగొనడంలో నియామకాలకు ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఎన్ఐటీఈఎస్ కోరుతోంది.ఇలాంటి అంశాల్లో ఐటీ సంస్థలపై ఎన్ఐటీఈఎస్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. టీసీఎస్ 200 లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేసిందని ఎన్ఐటీఈఎస్ దాఖలు చేసిన ఫిర్యాదుపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత అక్టోబర్‌లో నోటీసులు జారీ చేసింది. కొత్త నియామకాల్లో జాప్యం దేశీయ ఐటీ సేవల పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తోంది. కంపెనీలు క్యాంపస్ నియామకాలను తగ్గించాయి. దీంతో యువ, తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యువ ఉద్యోగుల నిష్పత్తి టీసీఎస్‌లో ఐదేళ్ల కనిష్టానికి, ఇన్ఫోసిస్‌లో దశాబ్ద కనిష్ఠానికి పడిపోయాయి. -
టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’
ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని సంస్థ సీఈఓ సలీల్‌ఫరేఖ్ స్పష్టం చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జనరేటివ్‌ఏఐ వల్ల టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నప్పటికీ ఇకపై తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించబోమని తేల్చి చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థలో జనరేటివ్‌ఏఐతో సహా వివిధ టెక్నాలజీలను ఏకీకృతం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తొలగించే బదులు సాంకేతిక పురోగతి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు జనరేటివ్ ఏఐలో నియామకాలు కొనసాగిస్తాం. ఇతర కంపెనీల్లాగా ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన లేదు. సమీప భవిష్యత్తులో జనరేటివ్‌ఏఐ విభాగానికి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అప్పటివరకు కంపెనీలో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు తయారవుతారు. దాంతో ప్రపంచంలోని మరిన్ని పెద్ద సంస్థలకు సేవలందిస్తాం’ అన్నారు.ఇన్ఫోసిస్ ఇటీవల ఉద్యోగుల పనితీరుపై బోనస్ ప్రకటించింది. బ్యాండ్ సిక్స్, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులు జనవరి-మార్చి త్రైమాసిక పనితీరుపై బోనస్‌ను అందుకున్నారు. అయితే, బోనస్ రూపంలో ఇచ్చిన సగటు చెల్లింపులు మునుపటి త్రైమాసికంలోని 73 శాతంతో పోలిస్తే 60 శాతానికి పడిపోయాయి.టెక్ కంపెనీలు ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భవిష్యత్తు అంచనాలపై ఆశించిన వ్యాఖ్యలు చేయలేదు. వచ్చే ఒకటి-రెండు త్రైమాసికాల్లోనూ కంపెనీలకు పెద్దగా లాభాలు రావని తేల్చిచెప్పాయి. కొన్ని నివేదికల ప్రకారం..ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే టెక్ ఉద్యోగాల్లో కోత తప్పదని తెలిసింది. కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ ప్రకటిస్తున్న కంపెనీల్లో తిరిగి కొలువులు పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫోసిస్ మాత్రం ఇకపై ఉద్యోగులను తొలగించమని ప్రకటించడం నిరుద్యోగ టెకీలకు కొంత ఊరట కలిగించే అంశమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
హమ్మయ్య.. ఇన్ఫోసిస్‌లో ఆ ముప్పు లేదు!
టెక్ పరిశ్రమలో ఎటు చూసినా జనరేటివ్ ఏఐ ప్రభంజనం.. అంతటా లేఆఫ్‌ల భయంతో ఐటీ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అయితే ఇన్ఫోసిస్‌లో మాత్రం ఆ ముప్పు లేదంటున్నారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. జెన్ఏఐ కారణంగా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగా తాము ఉద్యోగాలను తగ్గించబోమని సీఎన్‌బీసీ-టీవీ18 ఇంటర్వ్యూలో చెప్పారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతితో ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగిస్తోందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "లేదు, మేము అలా చేయడం లేదు. నిజానికి ఇండస్ట్రీలో ఇతరులు అలా చేశారు. ఆ విధానం సరికాదని మేం చాలా స్పష్టంగా చెప్పాం' అని పేర్కొన్నారు. పెద్ద సంస్థలకు అన్ని సాంకేతికతలు కలిసి వస్తాయనేది తన అభిప్రాయమని ఆయన వివరించారు. వచ్చే కొన్నేళ్లలో కృత్రిమ మేధ (ఏఐ)లో నిపుణులుగా ఎదిగే వారు మరింత మంది తమతో చేరుతారని, ప్రపంచంలోని పెద్ద సంస్థలకు సేవలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో క్లయింట్ల పరంగా, ఉద్యోగుల సంఖ్య పరంగా మరింత విస్తరిస్తామని పరేఖ్ తెలిపారు.మరి నియామకాలు?లేఆఫ్‌ల విషయాన్ని పక్కన పెడితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో నియామకాల పరిస్థితి ఎలా ఉండనుంది అన్నదానిపై తన దృక్పథాన్ని పరేఖ్ తెలియజేశారు. ఆర్థిక వాతావరణం మెరుగుపడటం, డిజిటల్ పరివర్తనపై వ్యయం పెరగడం జరిగితే నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయని చెప్పారు. అయితే నియామకాలపై ఎటువంటి వార్షిక లక్ష్యం లేకపోయినా ఆర్థిక వాతావరణం ఆధారంగా నియామకాలు చేపడతామని వివరించారు. -
మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు!.. కానీ..
టెక్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి'. ప్రారంభం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. నేడు కోట్ల సంపదకు నాయకుడైన ఈయన ఎంతోమందికి ఆదరప్రాయం. ఖచ్చితమైన సిద్ధాంతాలను పాటించే మూర్తి.. తాను మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.నాయకుడిగా నేను మొదటి నేర్చుకున్న విషయం న్యాయమైన వ్యక్తిగా ఉండాలనుకోవడం. ప్రతి లావాదేవీలో న్యాయంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి నేను మంచి వ్యక్తిగా కాకూండా.. న్యాయమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని అన్నారు.1981లో ఎన్ఆర్ నారాయణ మూర్తి పూణేలో ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ.. ముందుకు సాగుతోంది. ఇప్పటికి కూడా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.ప్రతి విద్యార్ధి చదవాల్సిన పుస్తకంఇదిలా ఉండగా.. ఇటీవల ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దేశంలో ప్రతి విద్యార్ధి తప్పకుండా.. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని చదవాలని సూచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. -
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్‌లిస్ట్‌లో రిషి సునాక్ దంపతులు
ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్ యూరోలకు పెరిగింది. ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.ఇన్ఫోసిస్‌లో2023లో రిషి సునాక్ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్‌లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. కింగ్ చార్లెస్ సంపదఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని, 600 మిలియన్ యూరోల నుండి 610 మిలియన్ యూరోలకు పెరిగినట్లు సండే టైమ్స్ రిచ్ లిస్ట్ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్ చేసింది. తగ్గిపోతున్న బిలియనీర్లు2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .యూకేలోనూ భారతీయుల హవాబ్రిటన్లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్ యూరోల నుండి 37.2 బిలియన్ యూరోలకు పెరిగింది. -
వయస్సు 5 నెలలే.. కానీ ఇన్ఫోసిస్ ద్వారా 4.2 కోట్లు సంపాదించాడు
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మనువడు ఏకాగ్రహ్ రోహన్ కేవలం ఐదు నెలల వయస్సులో ఇన్ఫోసిస్ నుంచి రూ.4.2 కోట్లు దక్కించుకున్నాడు. నారాయణ మూర్తి గత నెలలో తన మనవడు ఏకాగ్రహ్ రోహన్‌కు రూ. 240 కోట్ల కంటే ఎక్కువ విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను (0.04% వాటా) రాసిచ్చారు. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ గురువారం క్యూ 4 ఫలిteతాలను ప్రకటించింది. క్యూ 4 ఫలితాలతో పాటు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 28 డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. దీంతో ఇన్ఫోసిస్‌లో తన పేరు మీద ఉన్న మొత్తం 15లక్షల షేర్ల ద్వారా డివిడెండ్ రూపంలో ఏకాగ్రహ్ రోహన్ ఇప్పుడు రూ.4.2 కోట్లు అర్జించాడు. నారాయణ్ మూర్తి, సుధా మూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు అక్షతా మూర్తి, కొడుకు రోహన్ మూర్తి. అక్షతా మూర్తి, 2009లో రిషి సునాక్(ప్రస్తుత బ్రిటన్ ప్రధాని)ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇక రోహన్ మూర్తికి 2011లో టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణుశ్రీనివాస్ కుమార్తె లక్ష్మితో వివాహం జరిగింది. ఈ జంట 2015లో విడిపోయారు. 2019లో అపర్ణ కృష్ణన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి సంతానమే ఏకాగ్రహ్. -
ఇన్ఫోసిస్ ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్ చేసింది. రూ. 7,969 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,128 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర(1 శాతం) వృద్ధితో రూ. 37,923 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,441 కోట్ల టర్నోవర్ నమోదైంది. తయారీ రంగ సేవలు నెమ్మదించగా.. 20.1 శాతం నిర్వహణ మార్జిన్లను అందుకుంది. క్యూ4లో 84.8 కోట్ల డాలర్ల ఫ్రీక్యాష్ ఫ్లో సాధించింది. గత 11 త్రైమాసికాలలోనే ఇది అత్యధికం. 1–3 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో ఇన్ఫోసిస్ ఆదాయంలో 1–3 శాతం వృద్ధిని అంచనా(గైడెన్స్) వేసింది. 20–22 శాతం నిర్వహణ లాభ మార్జిన్లను ఆశిస్తోంది. అయితే గతేడాది ప్రకటించిన 4–7 శాతం వృద్ధితో పోలిస్తే తాజాగా బలహీన గైడెన్స్‌ను వెలువరించింది. గతేడాది సాధించిన ఫలితాలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనాలు(గైడెన్స్) అధికమేనని సీఈవో పరేఖ్ పేర్కొన్నారు. విభాగాలవారీగా చూస్తే గతేడాదికంటే రానున్న 12 నెలల్లో ఫైనాన్షియల్ సరీ్వసుల్లో ఉత్తమ పనితీరు చూపేందుకు అవకాశమున్నట్లు తెలియజేశారు. విచక్షణా వ్యయాల తీరు, కన్సాలిడేషన్, వ్యయ నియంత్రణపై దృష్టి ద్వారా గైడెన్స్‌ను ప్రకటించినట్లు వెల్లడించారు. కాగా.. మార్చితో ముగిసిన గతేడాదికి 20.7 శాతం నిర్వహణ మార్జిన్లు సాధించింది. ఈ కాలంలో నికర లాభం 9% ఎగసి రూ. 26,233 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 4.7% బలపడి రూ. 1,53,670 కోట్లయ్యింది. 2022–23లో రూ. 24,095 కోట్ల నికర లాభం, రూ. 1,46,767 కోట్ల టర్నోవర్ నమోదైంది. వ్యూహాత్మక, నిర్వహణ సంబంధ నగదు అవసరాలను పరిగణించాక రానున్న ఐదేళ్ల కాలానికి పెట్టుబడుల కేటాయింపుల విధానాన్ని బోర్డు సమీక్షించడంతోపాటు, అనుమతించినట్లు సీఎఫ్‌వో జయే‹Ù.ఎస్ పేర్కొన్నారు. ఈ కాలంలో వాటాదారులకు వార్షికంగా డివిడెండ్‌ను పెంచడం ద్వారా 85 శాతం కేటాయింపుల(రిటర్నులు)కు వీలున్నట్లు అంచనా వేశారు. ఇతర విశేషాలు.. ► పూర్తి ఏడాది(2023–24)కి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 17.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్టులు(టీసీవీ) కుదుర్చుకుంది. వీటిలో 52 శాతం కొత్త ఆర్డర్లు. ► షేరుకి రూ. 28 తుది డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 8 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. ► పూర్తి ఏడాదిలో 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో 2001 తదుపరి మొత్తం ఉద్యోగుల సంఖ్య(7.5%) క్షీణించింది. 3,17,240కు పరిమితమైంది. 2022–23లో సిబ్బంది సంఖ్య 3,43,234గా నమోదైంది. ► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 12.6% గా నమోదైంది. రూ. 4,000 కోట్లతో.. జర్మనీ సంస్థ ఇన్‌టెక్‌లో 100 శాతం వాటాను పూర్తి నగదు చెల్లింపు ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇందుకు 45 కోట్ల యూరోలు(రూ. 4,000 కోట్లు) వెచి్చంచనుంది. ఈమొబిలిటీ, కనెక్టెడ్, అటానమస్ డ్రైవింగ్, ఈవీలు, ఆఫ్‌రోడ్ వాహనాల విభాగంలో కంపెనీ సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ కొనుగోలుతో జర్మన్ ఓఈఎం క్లయింట్లను పొందడంతోపాటు 2,200 మంది సుశిక్షిత సిబ్బందిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగానికల్లా డీల్ పూర్తికాగలదని అంచనా వేస్తోంది. డీల్స్‌లో రికార్డ్ గతేడాది భారీ డీల్స్‌లో కొత్త రికార్డు సాధించాం. ఇది కంపెనీపట్ల క్లయింట్లకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. జనరేటివ్ ఏఐలో సిబ్బంది సామర్థ్యాల విస్తరణ కొనసాగుతుంది. క్లయింట్ల ప్రోగ్రామ్‌లు, విభిన్న లాంగ్వేజీలపై పనిచేయడం, కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ వినిమయం తదితరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – సలీల్ పరేఖ్, ఎండీ, సీఈవో, ఇన్ఫోసిస్ లిమిటెడ్ -
భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు.. 23 ఏళ్లలో ఇదే మొదటిసారి!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 25,994 మంది ఉద్యోగులను తొలగించింది. 2001 తరువాత కంపెనీ ఒక సంవత్సర కాలంలో ఇంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. సుమారు 23 సంవత్సరాలలో కంపెనీ ఇంత మంది ఉద్యోగులను ఎప్పుడూ తొలగించలేదని తెలుస్తోంది.ప్రస్తుతం కంపెనీలో 3,17,240 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈ సంఖ్య 7 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే జనవరి నుంచి మార్చి వరకు కంపెనీ కేవలం 5,423 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది వరుసగా ఐదవ త్రైమాసికంలో కంపెనీ లాభాల తగ్గుదల వల్ల జరిగినట్లు తెలుస్తోంది. గత పన్నెండు నెలల ప్రాతిపదికన Q4 అట్రిషన్ రేటు 12.9 శాతం నుంచి 12.6 శాతానికి తగ్గిందని స్పష్టమవుతోంది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా గత వారం దాని Q4 ఫలితాలను వెల్లడించింది. ఇందులో కూడా ఉద్యోగుల సంఖ్య 13,249 మంది తగ్గినట్లు తెలిసింది. 2004 తరువాత ఇంతమంది తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జనవరి-మార్చి త్రైమాసికం నాటికి కంపెనీ 1,759 మంది ఉద్యోగులను తగ్గించింది.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వేలాది ఉద్యోగులు ఇంటికి!కరోనా మహమ్మారి దేశంలో అధిక సంఖ్యలో ప్రబలిన తరువాత ఐటీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఎంతోమంది ఉద్యోగులు తమ ఉద్యోగులను కోల్పోవాల్సి వచ్చింది. ఉన్నవారిని ఉద్యోగాల నుంచి తొలగించడం మాత్రమే కాకుండా.. కొత్త వారిని చేర్చుకోవడానికి కూడా సంస్థలు వెనుకడుగు వేసాయి.ఇక ఇన్ఫోసిస్ కంపెనీ క్యూ4 ఫలితాల విషయానికి వస్తే.. కంపెనీ 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించినట్లు తెలుస్తోంది. కంపెనీ లాభాలు అంతకు ముందు త్రైమాసికం కంటే 30 శాతం వృద్ధి చెంది రూ. 7969 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. -
మరోసారి ఇన్ఫోసిస్ దాతృత్వం.. రూ.33 కోట్లు విరాళం
బెంగళూరు: ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ దర్యాప్తు సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేసింది. బెంగళూరు సీఐడీ ప్రధాన కార్యాలయంలో సెంటర్ ఫర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (CCITR) సహకారాన్ని పునరుద్ధరించడానికి విప్రో ఫౌండేషన్ కర్ణాటకలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సీసీఐటీఆర్తో అనుబంధాన్ని మరో 4 ఏళ్లు కొనసాగించడం ద్వారా కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 33 కోట్లు మంజూరు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. డిజిటల్ ఫోరెన్సిక్స్,సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో శిక్షణ, పరిశోధన ద్వారా రాష్ట్ర పోలీసు దళం సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ సామర్థ్యాలను బలోపేతమవుతుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వెల్లడించింది. -
‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’
ఆకలి విలువ చాలామందికి తెలియదని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్.నారాయణమూర్తి అన్నారు. ‘ఆహార భద్రతలో సాధించిన విజయాలు: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు భారత్ ప్రయాణం’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో ఆయన మాట్లాడారు. ‘యాభై ఏళ్ల కిందట యూరప్ సరిహద్దు ప్రాంతమైన బల్గేరియా, యుగోస్లేవియా మధ్య ఉన్న నిచ్ అనే ప్రదేశంలో పనిచేస్తున్నపుడు దాదాపు 120 గంటలపాటు(5రోజులు) తిండిలేక ఆకలితో బాధపడ్డాను. మీలో ఎవరికీ ఆకలిబాధ తెలియదు. ఆకలితో అలమటించే పరిస్థితి భారత్‌లో ఎవరికీ రాకూడదు. అక్షయపాత్ర కార్యక్రమంతో నిస్సాహాయుల ఆకలితీర్చడం గొప్పవిషయం. భారత ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటోంది. దేశ పౌరులందరూ పేద పిల్లల భవిష్యత్తు కోసం తోచినంత సహాయం చేయాలి. ప్రభుత్వ ఆర్థిక విధానాలతో విదేశీ పెట్టుబడులు పెరిగి దేశం వృద్ధి సాధిస్తోంది. భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా దాదాపు 80 కోట్ల మందికి పైగా ప్రయోజనం కలుగుతోంది. పీఎం పోషన్(పోషణ్ శక్తి నిర్మాణ్) పథకంతో నేరుగా 11 కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం అందుతోంది’ అని మూర్తి అన్నారు. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే.. -
వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. మరో ఎత్తు వేసిన ఇన్ఫోసిస్!
దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి మరో ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ENG-IoT) ప్రాజెక్ట్‌లలో పనిచేసే ఉద్యోగులకు 'ఇన్-పర్సన్ కొల్లాబ్ వీక్స్'ని అమలు చేస్తోంది. తాము సమీక్షించిన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఈమెయిల్స్ ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ ఈమేరకు పేర్కొంది. వీటి ప్రకారం.. తమకు కేటాయించిన వారాల్లో ఉద్యోగులు వారి సంబంధిత క్యాంపస్‌లలో హాజరు కావాలి. ఆఫీస్ నుంచి పనిచేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి త్రైమాసికంలో ఉద్యోగులకు నిర్దిష్ట వారాలను నిర్దేశిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం, ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు లేదా త్రైమాసికానికి 30 రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలి. ఈ హైబ్రిడ్ వర్క్ అప్రోచ్ ద్వారా టీమ్ వర్క్, ఉత్పాదకతను పెంపొందించడం ఇన్ఫోసిస్ లక్ష్యం. బేస్ లొకేషన్లకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ వారాల్లో డెవలప్మెంట్ సెంటర్లకు తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని కంపెనీ కోరింది. కొల్లాబ్ వీక్స్‌లో పాల్గొనే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ణయించలేదని, ప్రతి త్రైమాసికానికి కనీసం ఆరు వారాలు ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానాన్ని ఈ త్రైమాసికం నుంచి అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్దేశిత వారాలలో ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగులకు వారికి అనువైన రోజులను ఎంచుకోవడంలో సౌలభ్యాన్ని కంపెనీ అందిస్తోంది. 10 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, క్యాంపస్ హాజరును పెంచాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. -
ఆదాయ వృద్ధిని పరిమితం చేసిన ఐటీ దిగ్గజం
అంతర్జాతీయ అనిశ్చితులు, కొత్త ప్రాజెక్టులు రాకపోవడం, బ్యాంకింగ్ వంటి ప్రధాన రంగాల్లోని సంస్థలు టెక్నాలజీ ఆధారిత సేవలపై చేసే ఖర్చును తగ్గించుకోవడంతో ఐటీ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఐటీ సంస్థల ఆదాయాలు, లాభాలు తగ్గుతాయని కొన్ని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కేంద్రంగా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ తన భవిష్యత్తు ఆదాయంలో వృద్ధి 1-3 శాతానికే పరిమితం కావొచ్చని పేర్కొంది. గతంలో ఈ అంచనా 2-5 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయ ఐటీ సంస్థల ఆదాయ వృద్ధిపైనా అనుమానాలు రేకెత్తాయి. ఫలితంగానే దేశీయ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో తదితర కంపెనీల షేర్లు ఇటీవల 1-3% నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3% తగ్గింది. టెక్నాలజీ సూచీలు నెల వ్యవధిలో 9% క్షీణించింది. యాక్సెంచర్ తన ఆదాయ అంచనాలను తక్కువకు సవరించడం వల్లే, స్వల్పకాలంలో దేశీయ ఐటీ షేర్లకు ఒత్తిడి ఎదురవుతోంది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగించే అమెరికా కంపెనీ తాజా నిర్ణయంతో దేశీయ ఐటీ కంపెనీల్లోనూ అదే ధోరణి ఉంటుందని మార్కెట్ భావిస్తున్నట్లు తెలిసింది. పలు రంగాల సంస్థలు అంతగా ముఖ్యం కాని స్వల్పకాలిక ప్రాజెక్టులను పక్కన పెడుతున్నాయని యాక్సెంచర్ తన ఆదాయ అంచనాల నివేదికలో పేర్కొంది. ఇలాంటి ప్రాజెక్టులను చేస్తున్న విప్రో, ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎంఫసిస్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకూ సమీప భవిష్యత్తులో ఇబ్బందులుండే అవకాశాలున్నాయని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. కంపెనీల విచక్షణ ఆధారిత పెట్టుబడి, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి పెరిగేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ఇదీ చదవండి: అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్ యాక్సెంచర్ సైతం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంపై ఆశాజనకంగానే ఉంది. ఫలితంగా దేశీయ ఐటీ సంస్థలకూ అప్పుడు కాస్త అనుకూల పరిస్థితులు నెలకొనచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
ఎన్నికల బాండ్లు.. ఇన్ఫోసిస్ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందంటే..
ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇన్ఫ్రా, ఫార్మా కంపెనీలతోపాటు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వాటిలో ఐటీ కంపెనీలు ఉండడం విశేషం. తాజాగా ఎస్బీఐ విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాల ప్రకారం.. ఐటీ రంగంలో సియెంట్ కంపెనీ గరిష్ఠంగా రూ.10 కోట్లు విలువ చేసే బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఆ కంపెనీ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందో తెలియరాలేదు. తదుపరి స్థానంలో జెన్సర్ టెక్నాలజీస్ మే 2019లో రూ.3 కోట్లు విలువచేసే వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మూడో స్థానంలో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ 2018 కర్ణాటక ఎన్నికల ముందు దేవెగౌడకు చెందిన జనతాదళ్(సెక్యూలర్) పార్టీకి రూ.1 కోటి విరాళం ఇచ్చినట్లు తెలిసింది. రాజకీయ పార్టీలకు కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఎస్బీఐ ఇటీవల వివరాలు వెల్లడించింది. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులుండవు.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం కంపెనీల వారీగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వివరాలు.. ఫ్యుచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ రూ.1,368 కోట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ.966 కోట్లు క్విక్ సప్లైచెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.410 కోట్లు వేదాంత లిమిటెడ్ రూ.400 కోట్లు హల్దియా ఎనర్జీ రూ.377 కోట్లు భారతి గ్రూప్ రూ.247 కోట్లు ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.224 కోట్లు వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్సిమిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ రూ.195 కోట్లు మదన్‌లాల్ లిమిటెడ్ రూ.185 కోట్లు -
మనవడిపై ప్రేమ.. 4 నెలల బిడ్డకు రూ.240 కోట్ల గిఫ్ట్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. కేవలం పదివేల రూపాయలతో వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు. భారతదేశంలోని మిలియనీర్ల జాబితాలో ఒకరైన నారాయణ మూర్తి తన మనవడికి ఏకంగా కోట్ల రూపాయల షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల 'ఏకాగ్రహ్ రోహన్ మూర్తి' (Ekagrah Rohan Murty)కి ఏకంగా రూ. 240 కోట్ల విలువైన షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. దీంతో ఏకాగ్రహ్ ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో 1500000 షేర్స్ లేదా 0.04 శాతం వాటా కలిగి ఉన్నట్లు సమాచారం. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ 2023 నవంబర్ 10న బెంగళూరులో మగబిడ్డకు జన్మనిచ్చారు. నారాయణ మూర్తి, సుధా మూర్తికి ఇప్పటికే కృష్ణ సునక్, అనౌష్క సునక్ అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వీరిరువురూ యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, అక్షతా మూర్తి కుమార్తెలు. ఏకాగ్ర పేరు మహాభారతంలోని అర్జున్ పాత్ర నుంచి ప్రేరణ పొందింది. సంస్కృత పదమైన 'ఏకాగ్రహ్'కు అచంచలమైన దృష్టి, సంకల్పం అని అర్థం. -
International Womens Day 2024: రాజ్యసభకు సుధామూర్తి
సాక్షి, న్యూఢిల్లీ/బనశంకరి: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమెను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రాజ్యసభకు నామినేట్ చేయడం తనకు డబుల్ సర్ప్రైజ్ అని సుధామూర్తి పేర్కొన్నారు. తాను ఏనాడూ పదవులు ఆశించలేదని చెప్పారు. రాష్ట్రపతి తనను పెద్దల సభకు నామినేట్ చేయడానికి గల కారణం తెలియదని అన్నారు. ఉన్నత చట్టసభకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇది తనకు కొత్త బాధ్యత అని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యురాలిగా తన వంతు సేవలు అందిస్తానని వివరించారు. ప్రధాని మోదీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న సుధామూర్తి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుధామూర్తిని రాష్ట్రపతిద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రంగాల్లో ఎన్నెన్నో సేవలు అందించిన సుధామూర్తి చట్టసభలోకి అడుగు పెడుతుండడం నారీశక్తికి నిదర్శనమని మోదీ ఉద్ఘాటించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. టెల్కోలో తొలి మహిళా ఇంజనీర్ డాక్టర్ సుధామూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావిలో జని్మంచారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ ఆర్‌హెచ్ కులకరి్ణ, విమలా కులకరి్ణ. సుధామూర్తి హుబ్లీలోని బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కంప్యూటర్స్‌లో ఎంఈ చేశారు. టాటా ఇంజినీరింగ్ లోకోమోటివ్ కంపెనీ(టెల్కో)లో ఉద్యోగంలో చేరారు. దేశంలోనే అతి పెద్దవాహన తయారీ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్‌గా గుర్తింపు పొందారు. 1970 ఫిబ్రవరి 10న నారాయణమూర్తితో వివాహం జరిగింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీకి సుధామూర్తి సహ వ్యవస్థాపకురాలు. సంస్థ ప్రారంభించే సమయంలో రూ.10వేలు తన భర్తకు ఇచ్చి ప్రోత్సహించారు. సేవా కార్యక్రమాలు.. పురస్కారాలు 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను సుధామూర్తి ప్రారంభించారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో పలు పుస్తకాలు రాశారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వరద బాధితుల కోసం 2,300 ఇళ్లు నిర్మించారు. పాఠశాలల్లో 70 వేల గ్రంథాల యాలు నిర్మించారు. భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ,, 2023లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి చింతామణి అత్తిమబ్బే అవార్డు స్వీకరించారు. సాహిత్యంలో ఆమె చేసిన సేవకుగానూ ఆర్కే నారాయణ సాహిత్య పురస్కారం, శ్రీరా జా–లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. భర్త నారాయణమూర్తి (2014)తో సమానంగా 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ద్వారా తాను అందుకున్న మొత్తాన్ని టోరంటో విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. నాన్ఫిక్షన్ విభాగంలో క్రాస్‌వర్డ్ బుక్ అ వార్డు, ఐఐటీ–కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు అక్షతామూర్తి, రోహన్‌మూర్తి సంతానం. అక్షతామూర్తి భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి. వీరిది ప్రేమ వివాహం. రాజ్య సుధ – ప్రత్యేక కథనం ఫ్యామిలీలో.. -
Infosys Sudha Murty: రాజ్య సుధ
సాటి మనుషుల కోసం పని చేయడం సామాజిక సేవ ద్వారా పరిస్థితులను మెరుగుపరచడం యువతకు స్ఫూర్తిగా నిలవడం.. రచయితగా ఎదగడం ఇన్ఫోసిస్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం సుధామూర్తిని నేడు రాజ్యసభకు చేర్చాయి. ఉమెన్స్ డే రోజు ఆమెను రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి జీవన విశేషాలు. ► తొలి పాఠాలు సుధామూర్తి బాల్యం హుబ్లీలో గడిచింది. తండ్రి కులకర్ణి డాక్టర్. ఆయన రోజూ టీ సేవించేవాడు. ఒకరోజు పాలు రాలేదు. తండ్రి టీ తాగక వేరే ఏ పనీ మొదలుపెట్టలేక కూచుని ఉన్నాడు. ‘ఏంటి నాన్నా?’ అని అడిగింది సుధామూర్తి. ‘ఉదయాన్నే టీకి నేను అలవాటు పడ్డానమ్మా. ఇవాళ టీ తాగక తలనొప్పి వచ్చింది. నువ్వు మాత్రం దేనికీ అతిగా అలవాటు పడకు.. కాఫీ, టీలకైనా సరే’ అన్నాడు. సుధామూర్తి ఆ పాఠాన్ని గుర్తు పెట్టుకుంది. ఇవాళ ఆమెకు డెబ్బై నాలుగు ఏళ్లు. నేటికీ ఉదయాన్నే లేచి టీగానీ కాఫీ గాని తాగి ఎరగదు. సుధామూర్తి హుబ్లీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే షిగావ్‌లో పుట్టింది. అక్కడ ఆమె అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. తాతయ్య స్కూల్ టీచర్. ఆయన తనకంటే వయసులో ఎంత చిన్నవారినైనా ‘మీరు’ అని బహువచనం వాడేవారు. ‘నీ కంటే చిన్న కదా తాతయ్య’ అని సుధామూర్తి అంటే ‘లోపలి ఆత్మ పెద్దదే కదమ్మా’ అనేవారు. ఎదుటివారిని గౌరవించడం అలా నేర్చుకుందామె. తాతయ్య ఆమెకు మూడు జీవన పాఠాలు నేర్పారు. 1.సింపుల్‌గా జీవించు 2.జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండు 3. పుస్తకాలు చదువు. ఇవి సుధామూర్తి నేటికీ పాటిస్తూనే ఉంది. అమ్మమ్మ ‘ఆకలితో ఉన్నవారిని గమనించు’ అని చెప్పింది. వాళ్ల ఇంటికి రోజూ ఒక భిక్షకుడు వస్తే ఇంట్లో మంచి బియ్యం నిండుకుని ముతకబియ్యం ఉన్నా అమ్మమ్మ మంచి బియ్యమే భిక్షకుడికి వేసేది. ‘ముతక బియ్యం మనం తినొచ్చులే’ అనేది. ఇదీ సుధామూర్తికి తొలి పాఠమే. ఇక అమ్మ విమల నేర్పిన పాఠం– ‘ఎంతో అవసరమైతే తప్ప డబ్బు ఖర్చు పెట్టకు’ అని. అంతే కాదు నీకు బాల్యంలో మంచి అలవాట్లు ఉంటే అవే కాపాడతాయి అని కూడా ఆమె అనేది. ఉదయాన్నే లేచి కాగితం మీద 10 సార్లు ‘దేవుడికి నమస్కారం’ అని రాయించేదామె. నేటికీ సుధా మూర్తి ఆ అలవాటును మానలేదు. ఇక స్కూల్ టీచరు రాఘవేంద్రయ్య... ‘నీకు లెక్కలు భలే వస్తున్నాయి. లెక్కల్ని వదలకు. పైకొస్తావ్‘ అన్నాడు. ఆమె ఆనాటి నుంచి లెక్కల్నే రెక్కలుగా చేసుకుంది. ► కుతూహలమే గురువు చిన్నప్పుడు సుధామూర్తికి ప్రతిదీ కుతూహలమే. వీధుల్లో కొట్లాటలు అవుతుంటే అక్కడకు పరిగెత్తి వెళ్లి నిలబడేది. వినోదం కోసం కాదు. కారణం ఏమై ఉంటుందా అని. చిన్న ఊళ్లో ప్రతి ఇల్లూ అందరికీ పరిచయమే. అందరి జీవితాలనూ ఆమె పరిశీలిస్తూ ఉండేది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగితే ఆమె తప్పని సరిగా ఒక స్టీలు క్యారేజీ తీసుకుని బయలుదేరేది. విందులో ఏ పదార్థాలు బాగున్నాయో ఏ పదార్థాలు బాగలేవో మొత్తం రుచి చూసి వస్తూ వస్తూ బాగున్న వాటిని క్యారేజీలో అడిగి తెచ్చుకునేది. కాలేజీ రోజుల వరకూ కూడా పెళ్ళిళ్లకు క్యారేజీ తీసుకోకుండా సుధామూర్తి వెళ్లేది కాదు. ‘ఎందుకో నాకు గిన్నెల క్యారేజీ అంటే నేటికీ ఇష్టం’ అంటుందామె. ► మసాలా దోసె పార్టీ లెక్కలు బాగా నేర్చుకున్న సుధా హుబ్లీలోని బి.వి.బి. కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇక ఆ రోజు నుంచి ఊళ్లోని పెద్ద మనుషులంతా ఆమె తండ్రి దగ్గరకు వచ్చి వాపోవడమే. ‘అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నావ్. పెళ్లెవరు చేసుకుంటారు’ అని బెంగపడటమే. తండ్రి కూడా ఒక దశలో తప్పు చేశానా అనుకున్నాడు. కాని సుధామూర్తి మొదటి సంవత్సరానికి ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. తండ్రికి సంతోషం కలిగింది. ‘ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నావ్ కదా... పద మసాలా దోసె పార్టీ చేసుకుందాం’ అని తీసుకెళ్లాడు. ప్రతి సంవత్సరం ఆమె ఫస్ట్‌క్లాస్ తెచ్చుకోవడం.. తండ్రి తీసుకెళ్లి మసాలా దోసె తినిపించడం. ఆ తండ్రీ కూతుళ్ల జీవితంలో పార్టీ చేసుకోవడం అంటే అదే. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ‘కాని ఆ పార్టీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అపురూపం అనిపించేది’ అంటుందామె. ► చరిత్ర మార్చిన కార్డు ముక్క 1974లో టాటా వారి ‘టెల్కో’ సంస్థలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు పడ్డాయి. పేపర్లో ఆ యాడ్ చూసింది సుధామూర్తి. అర్హతలు అన్నీ ఆమెకు ఉన్నాయి. కాని యాడ్ కింద ‘స్త్రీలు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఉంది. అప్పుడు సుధామూర్తికి ఆగ్రహం వచ్చింది. రోషం కలిగింది. జె.ఆర్.డి.టాటాకు ఒక కార్డు గీకి పడేసింది. ‘దేశంలో ఉన్న ఇంతమంది స్త్రీలకు పని చేసే హక్కు లేకపోతే వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు?’ అని ప్రశ్న. ఆ కార్డు జె.ఆర్.డి. టాటాకు చేరింది. ఆ వెంటనే ఆమెకు ఇంటర్వ్యూకు పిలుపు, ఆపై ఉద్యోగం వచ్చాయి. పూణెలో సుధామూర్తి తొలి ఉద్యోగం చేసింది. ఆమె రాసిన లేఖను టాటా సంస్థ నేటికీ భద్రపరిచి ఉంచింది. 1974లో టెల్కోలో సుధామూర్తి ఒక్కతే మహిళా ఉద్యోగి. దాదాపు 50 ఏళ్ల తర్వాత సుధామూర్తి పూణెలో ఆ సంస్థను సందర్శిస్తే (ఇప్పుడు టాటా మోటార్స్) 900 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ‘నేను అక్కడ నిలబడి మా తండ్రిని తలుచుకుని ఉద్వేగంతో కన్నీరు కార్చాను. ఎవరు భయపెట్టినా నన్ను ఆయన చదివించాడు. నా వల్ల ఇవాళ ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు అని’ అందామె. ► జీవితం అంతులేని పోరాటం ‘జీవితం అంటే అంతులేని పోరాటం. ఎవరికీ ఏ వయసులో ఉన్నా కన్సెషన్ ఉండదు. పోరాటం చేయాలి. ఓడిపోయినా పోరాట అనుభవం మిగులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. క్షమిస్తే మంచిది. మర్చిపోతే ఇంకా మేలు. కాని ముందుకు సాగడమే అన్నింటికన్నా ఉత్తమమైనది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని మెరిపిస్తాయి. ప్యాషన్‌తో పని చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. ఒక మనిషిని పైకి తెచ్చేది డబ్బు కాదు ప్యాషన్. నమ్మిన పనిని విలువలతో ఆచరిస్తే ఎవరైనా పైకి రావాల్సిందే’ అంటుందామె. ► రాజ్యసభ సభ్యురాలు ‘ఇది ఊహించలేదు. రాష్ట్రపతి నన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీని గురించి నేను కూచుని ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ఏం చేయగలనో అంతా చేయాలి. ఇప్పుడు నేను భారత ప్రభుత్వ సేవకురాలిని’ అని కొత్త బాధ్యతకు సిద్ధమవుతోంది సుధామూర్తి. ఇల్లాలే శక్తి నారాయణ మూర్తితో వివాహం అయ్యాక ఇన్ఫోసిస్ సంస్థను ఆయన స్థాపించాలనుకున్నప్పుడు 10 వేల రూపాయలు పెట్టుబడి తనే ఇచ్చింది సుధామూర్తి. అయితే ఆమెను ఇన్ఫోసిస్‌కు బయటి వ్యక్తిగానే ఉండటం మంచిదని సూచించాడు నారాయణమూర్తి. ఆమె కొంచెం బాధపడింది. ఎప్పటికైనా ఇన్ఫోసిస్ సంస్థలో చేరతాననే భావించింది. అదే సమయంలో చాలా కాలం పాటు పిల్లల కోసం గృహిణిగా ఉండిపోయింది. ‘సంవత్సరంలో 200 రోజులు ప్రయాణాల్లో ఉండేవాడు నారాయణమూర్తి. ఆ రోజుల్లో ఫోన్ లేదు. కారు లేదు. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కదాన్నే వెళ్లాలి. సంస్థ ఆర్థిక కష్టాలు.. ఇంటి కష్టాలు.. అన్నీ తట్టుకుని నారాయణమూర్తికి వెన్నుదన్ను అందించాను. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్ అయ్యాను. ఆ ఫౌండేషన్‌తో వేలాది మంది జీవితాల్లో వెలుగు తెచ్చే వీలు నాకు కలిగింది. ఈ సంతృప్తి ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా పని చేసి ఉంటే నాకు దక్కేది కాదు’ అంటుందామె. -
అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం
ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్, సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ నిర్ణయం వెలువడడం విశేషం. సుధామూర్తి సంఘ సేవకురాలిగా అందరికీ సుపరిచితం. ఈమె గొప్ప రచయిత్రి. కంప్యూటర్ ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సుధామూర్తి పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్దికి సహకరిస్తున్నారు. కర్ణాటకలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్యను చేరేలా తోడ్పడుతున్నారు. ఆమె గతంలో కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిసింది. ఆమె నవలే సీరియల్‌గా.. సుధామూర్తి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ‘ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ ప్రారంభించారు. ఆమె కాల్పనిక రచనలు కూడా రాస్తారు. ఆమె రచించిన కన్నడ నవల ‘డాలర్ సొసే’ ఇంగ్లిష్‌లో డాలర్ బహుగా ట్రాన్స్‌లేట్ చేశారు. తర్వాత ఆ నవల 2001లో ‘జీ టీవీ’లో సీరియల్‌్‌గా ప్రసారం చేశారు. భూరి విరాళాలు.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుధామూర్తి ఐఐటీ కాన్పూర్‌లోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఉండే హెచ్.ఆర్.కాదిం దివాన్ బిల్డింగ్ హౌసింగ్ ఏర్పాటుకు, నారాయణరావ్ మెల్గిరి స్మారక న్యాయ కళాశాలకు భూరి విరాళాలను అందజేశారు. కర్ణాటకలోని బి.వి.బి.టెక్నికల్ కాలేజీలో ఎలక్టికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్) నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించారు. పోరాడితే దక్కిన ఉద్యోగం.. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆటో పరిశ్రమలో పేరొందిన టెల్కో కంపెనీలో మహిళా ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. అంతా ఈజీగా ఈ ఉద్యోగం రాలేదు. అప్పటికి ఈ సంస్థలో కేవలం పురుషులకే స్థానం కల్పించేవారు. దాన్ని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి పోస్టుకార్డు రాశారు. దానికి స్పందించిన ఆయన తనకు ఇంటర్వ్యూ నిర్వహించారు. అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించారు. ఆ సంస్థకు పుణె బ్రాంచిలో పనిచేస్తున్నపుడే ఆవిడకు నారాయణ మూర్తితో పరిచయం ఏర్పడి తర్వాత వివాహం చేసుకున్నారు. అందుకున్న పురస్కారాలు.. మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగా పలు సేవలు అందిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్‌కు క్యాపిటలిస్ట్‌గా ఉన్న కెటారామన్ వెంచర్స్ సంస్థలకు పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నారు. 2004 - సామాజిక సేవకుగాను శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం 2006 - భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం. (సామాజిక సేవ, దాతృత్వం, విద్యా రంగం) దేశంలో న్యాయ విద్య , ఉపకారవేతనాల అందజేతకు ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డేతో కలిసి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. సాహితీ సేవ, ఆమె రచనలకు ఆర్.కె.నారాయణన్ పురస్కారం అందుకున్నారు. 2011లో కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అట్ఠిమబ్బే (Attimabbe) అవార్డు అందుకున్నారు. 2023 -పద్మ భూషణ్ అవార్డు 2023 - గ్లోబల్ ఇండియన్ అవార్డు. ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’ ప్రముఖ రచనలు మదర్ ఐ నెవెర్ న్యూ మేజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ వైస్ అండ్ అదర్ వైస్ మేజిక్ డ్రమ్ అండ్ ఆదర్ ఫేవరేట్ స్టోరీస్ 3000 స్టిచెస్: ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రార్డినరీ లైవ్స్ గ్రాండ్ మాస్ బాగ్ ఆఫ్ స్టోరీస్ -
Sudha Murty: ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా రిటైరయ్యేదాన్ని..
దేశంలో అత్యంత గుర్తింపు పొందిన దంపతుల్లో ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధా మూర్తి ఒకరు. దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషితో నారాయణమూర్తి ప్రసిద్ధి చెందితే రచయిత్రిగా, సేవా కార్యక్రమాలతో ఆయన సతీమణి సుధా మూర్తి గుర్తింపు పొందారు. అయితే భర్త కంపెనీ కోసం ఎంతో కష్టపడిన ఆమె కంపెనీలో మాత్రం భాగం కాలేకపోయారు. దానికి తన భర్త పెట్టిన షరతే కారణమంటున్నారు సుధా మూర్తి. అనేక దశాబ్దాల సహచర్యం ఉన్న ఈ దంపతులు తమ జీవిత విశేషాల గురించి పలు సందర్భాల్లో పంచుకుంటుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుధా మూర్తి తన భర్తతో సాన్నిహిత్యాన్ని, తమ వైవాహిక బంధం గురించి వెల్లడించారు.తమ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను కంపెనీ (ఇన్ఫోసిస్)లో చేరలేకపోవడమే జీవితంలో నాకు అత్యంత కష్టతరమైన విషయం. నేను ఎందుకు చేరలేకపోయానంటే.. కంపెనీ భార్యాభర్తల కంపెనీ కాకూడదని ఆయన షరతు పెట్టారు. ఆ కష్టతరమైన సమయం నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. నేను ఎంతగానో ప్రేమించిన కంపెనీ, దాని కోసం చాలా పనిచేశాను. కానీ అందులో భాగం కాలేకపోయాను" అన్నారు సుధామూర్తి. అయినప్పటికీ తాను జీవితంలో సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు. ‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పటికి నేను బహుశా ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసి ఉండేదాన్ని. కానీ నేను నా పనితో చాలా మంది జీవితాలను స్పృశించగలిగాను. బహుశా ఇది దేవుడి నిర్ణయం. నాకు మాత్రమే సాధ్యమైంది" అన్నారు. నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన ఇన్ఫోసిస్. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు. -
కుండ బద్దలు కొట్టిన ఇన్ఫోసిస్ ఎగ్జిక్యుటివ్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది. 2022లో ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీని (ChatGPT)ని పరిచయం చేసినప్పటి నుండి జనరేటివ్ ఏఐ (generative AI) పట్ల ఆసక్తి కొత్త శిఖరాలకు చేరుకుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, వారి దైనందిన జీవితంలో వారికి సహాయపడుతుందని కొంతమంది భావిస్తుండగా, ఇది మానవ ఉద్యోగాలను తీసివేస్తుందని మరొక వర్గం అంటోంది. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు కఠోర విషయం చెప్పారు. జెనరేటివ్ ఏఐ.. సంస్థల్లో హెడ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. మరో మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయి. ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్! బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. జనరేటివ్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీల వల్ల భవిష్యత్తులో కంపెనీలకు తక్కువ మంది ఉద్యోగులు అవసరమవుతారు. ఈ మార్పు వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో క్రమంగా జరుగుతుందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కో-హెడ్ (డెలివరీ) సతీష్ హెచ్‌సీ అన్నారు. కంపెనీలు ఉత్పాదక ఏఐ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించినందున అవి మరింత సమర్థవంతంగా మారతాయని, సాంప్రదాయిక ఉద్యోగాల కోసం వారికి ఎక్కువ మంది అవసరం ఉండదని ఆయన వివరించారు. రాయిటర్స్‌కి మరో ఇంటర్వ్యూలోనూ ఈ ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇదే విషయాన్నే వెల్లడించారు. తమ కంపెనీ "ఏఐ ఫస్ట్" గా మారుతోందని చెప్పారు. "మొదట్లో ఇన్ఫోసిస్ డిజిటల్ ఫస్ట్ కాదు. దీనికి మాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు డిజిటల్‌కు ఎలా అలవాటు పడ్డామో అలాగే ఏఐకి కూడా మెరుగ్గా అలవాటు పడుతున్నాం. ఏఐ ఫస్ట్ అవుతున్నామని భావిస్తున్నాం" అని ఆయన పేర్కన్నారు.