చిరుత ఎంట్రీతో..ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం ఆఫర్‌ ..! | Leopard Spotted Infosys Mysuru Campus Asked Employees To Work From Home | Sakshi
Sakshi News home page

చిరుత ఎంట్రీతో..ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం ఆఫర్‌ ..!

Published Tue, Dec 31 2024 3:00 PM | Last Updated on Wed, Jan 1 2025 8:17 AM

Leopard Spotted Infosys Mysuru Campus Asked Employees To Work From Home

న్యూ ఈయర్‌ సంబరాల వేళ కూడా ఆఫీన్‌ అంటే ప్చ్‌..! ఏంటిదీ అనే ఫీల్‌ వచ్చేస్తుంది. డిసెంబర్‌ 31తో ఈ ఏడాదికి ముగింపు పలికే కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పే సందడి టైంలో మనవాళ్లతో ఉంటే ఆ ఫీల్‌ వేరుకదూ..!. కానీ ఉద్యోగ బాధ్యతల రీత్యా వెళ్లాల్సిందే. కానీ చిరుత ఎంట్రీతో జాక్‌పాట్‌ లాంటి అవకాశం కొట్టేశారు టెక్కీ ట్రైనీ ఉద్యోగులు. ఎక్కడంటే..

మైసూర్‌లోని ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌ ఈ ఆఫర్‌ని ఇచ్చింది. డిసెంబర్‌ 31న ట్రైనీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేసేలా వర్క్‌ ఫ్రమ్‌ హోం(Work From Home)ని అమలు చేసింది. మైసూర్‌(Mysuru) ఇన్ఫోసిస్‌ క్యాపస్‌లో చిరుత(leopard) ప్రవేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది టెక్‌కంపెనీ. ఈ నేపథ్యంలోనే క్యాంపస్‌ లోపలికి ఎవరినీ అనుమతించవద్దని భద్రతా బృందాన్ని కూడా ఆదేశించినట్లు తెలిపింది. అలాగే తన కంపెనీ ట్రైనీ ఉద్యోగులను ఈ రోజు(డిసెంబర్‌ 31న) ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా కోరినట్లు పేర్కొంది టెక్‌ కంపెనీ. 

ఇదిలా ఉండగా, మంగళవారం ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లోకి చిరుత ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. దీంతో ఆ చిరుతను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ తెల్లవారుజామున 4 గంటలకే సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఫారెస్ట్‌ అధికారి ఐబీ ప్రభుగౌడ్ తెలిపారు. కాగా, ఇలా టెక్‌ కంపెనీ ఆవరణలో చిరుత ప్రవేశించడం తొలిసారి కాదు. గతంలో 2011లో ఇలానే చిరుత క్యాంపస్‌లోకి ప్రవేశించి కలకలం సృషించింది.  

(చదవండి: ట్రా'వెల్‌నెస్‌' టిప్స్‌..! ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement