mysure
-
MUDA scam: సిద్ధూ మెడకు ‘ముడా’ ఉచ్చు
సాక్షి, బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదం చివరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. ఖరీదైన భూములు భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ శనివారం అనుమతి ఇచ్చినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. దీంతో సిద్ధూపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టే అవకాశముంది. ‘‘ నాకు అందిన పిటిషన్ ప్రకారం భూకేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలున్నాయి. మీపై విచారణకు ఎందుకు ఆదేశించకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సీఎంకు గత నెల 26న షోకాజ్ నోటీసు ఇచ్చా. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంలో హేతుబద్ధత లేదు. కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. హడావిడిగా మాజీ ఐఏఎస్ వెంకటాచ లపతి ఆధ్వర్యంలో విచారణ కమిటీ, హైకోర్టు విశ్రాంత జడ్జి పీఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయడం చూస్తుంటే ఇందులో భారీ అవకతవకలు జరిగినట్లు భావించవచ్చు’’ అని గవర్నర్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. అయితే గవర్నర్ ఉత్తర్వులను రద్దుచేయాలంటూ సిద్ధరా యమ్య హైకోర్టును ఆశ్రయిస్తే ఆ కేసు విచారణ సందర్భంగా తమ వాదనలు సైతం వినాలంటూ ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ శనివారం కర్ణాటక హైకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలుచేశారు. 21వ తేదీన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులోనూ కేసు వేస్తానని టీజే అబ్రహాం చెప్పారు.తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్యతనపై దర్యాప్తునకు గవర్నర్ ఆదేశించడాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై స్పందించారు. ‘‘గవర్నర్ కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారు. చట్టవ్యతిరేక ఉత్తర్వులిచ్చి రాజ్యాంగబద్ధ పదవిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్తర్వులపై చట్టప్రకారం పోరాడతా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారు. కేంద్రం, బీజేపీ, జేడీ(ఎస్) ఇందులో కీలక పాత్రధారులు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు నాకు ఉంది. నేను రాజీనామా చేయాల్సినంత తప్పేమీ చేయలేదు. మైనింగ్ లైసెన్స్‌ల కుంభకోణంలో జేడీఎస్ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై లోకాయుక్త దర్యాప్తునకు కోరితే ఆయనపై విచారణకు ఆదేశించలేదుగానీ నాపై ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించారు. ఫిర్యాదులున్నా బీజేపీ మాజీ కేంద్ర మంత్రులు శశికళ జోళె, మురుగేశ్ నీలాని, జనార్ధన్ రెడ్డిలపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలివ్వలేదు?’’ అని సీఎం అన్నారు.విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీవిచారణను ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యకు సీ ఎంగా కొనసాగే అర్హత లేదని, రాజీనామా చేయా లని రాష్ట్రంలో విపక్ష బీజేపీ డిమాండ్చేసింది. ఆయ న దిగిపోతేనే దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ‘‘కాంగ్రెస్ వంచనకు, కుటుంబ రాజకీయాలకు ఈ స్కామ్ మరో మచ్చుతునక. దళితులకు అండగా ఉంటామనే సీఎం స్వయంగా దళితుల భూములను లాక్కున్నారు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దాదాపు రూ.4,000–5,000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీయేతర ప్రభుత్వాలను వేధిస్తున్నారు: ఖర్గేప్రతిపక్షాలపాలిత రాష్ట్రాలను మోదీ సర్కార్ నియమించిన గవర్నర్లు తీవ్రంగా వేధిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ ఏకంగా సీఎం మీదనే విచారణకు ఆదేశించేంత తప్పు ఏం జరిగింది?. ఏ కారణాలు చెప్పి దర్యాప్తునకు అనుమతి ఇచ్చారు?. పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు ఇలా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు.ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు. అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దారుణం: 12 ఏళ్లుగా ఆమెకు ఇల్లే జైలు
బెంగళూరు: శాస్త్రసాంకేతికతతో మనిషి అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న కాలం మనదని చెబుతాం. స్త్రీలు సగర్వంగా తిరిగగలిగే సమాజంలో ఉన్నామని అనుకుంటాం. కానీ కర్ణాటకలో జరిగిన ఓ ఘటనను చూస్తే అవన్నీ ప్రసంగాలకే పరిమితమవుతున్నాయా? అని ప్రశ్నించుకోకతప్పదు! కర్ణాటకాలో ఓ మహిళకు పుష్కరకాలంగా ఇల్లే కారాగారంగా మారింది. కర్ణాటకాలోని మైసూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్లుగా ఓ అనుమానపు భర్త తన భార్యను ఇంట్లోనే బంధించాడు. భర్త పనికి వెళ్లే ముందు తనను ఇంట్లో ఉంచి తాళం వేసుకుని వెళతాడని మహిళ(32) పోలీసులకు తెలిపింది. మరుగుదొడ్డి కోసం ఇంట్లో చిన్న బాక్స్‌ను ఉపయోగించానని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు పాఠశాల నుంచి వచ్చినా భర్త ఇంటికి వచ్చేవరకు లోపలికి అనుమతి ఉండదని తెలిపింది. కిటికీ నుంచే పిల్లలకు భోజనం అందిస్తానని కన్నీరు పెట్టుకుంది. ‘‘నాకు పెళ్లయి 12 ఏళ్లైంది.. నన్ను ఎప్పుడూ ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టేవాడు. ఆ ప్రాంతంలో ఆయన్ని ఎవరూ ప్రశ్నించరు. నా పిల్లలు స్కూల్‌కి వెళతారు. కానీ నా భర్త పని నుంచి వచ్చే వరకు బయటే ఉంటారు. నేను వారికి కిటికీలోంచి ఆహారం ఇస్తాను. నా తల్లిదండ్రుల ఇంటికి ఎప్పుడు వెళ్లానో కూడా సరిగా గుర్తులేదు." అని పోలీసులకు మహిళ తెలిపింది. అయితే.. భర్తపై కేసు పెట్టడానికి మాత్రం బాధిత మహిళ ఇష్టపడలేదు. తన తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉంటానని పోలీసులకు తెలిపింది. అక్కడి నుంచే వివాహ సమస్యలను పరిష్కరించుకుంటానని పేర్కొంది. భర్తకు బాధిత మహిళ మూడో భార్య. గత మూడు వారాలుగా ఆమె ఇంట్లోనే ఉండటం గమనించామని పోలీసులు తెలిపారు. ఆమె కదలికలపై పూర్తి నిషేధం ఉంచినట్లు గుర్తించామని వెల్లడించారు. పనికి వెళ్లే ముందు ఆమెను ఇంట్లో ఉంచే తాళం వేయడం తాము గమనించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెను రక్షించామని, తల్లిదండ్రుల వద్దకే మహిళ వెళ్లడానికి ఇష్టపడినట్లు తెలిపారు. భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆరు చోట్ల బాంబులు పెట్టాం.. ముంబైకి బాంబు బెదిరింపు కాల్ -
security breach: ‘దేశద్రోహిని కాదో.. అవునో.. వాళ్లే చెబుతారు’
మైసూర్: పార్లమెంట్లో చోటు చేసుకున్న అలజడి ఘటనలోని నిందితులు మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి పార్లమెంట్ సందర్శన పాసులు పొందిన విషయం తెలిసిదే. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా ప్రతిపక్షాలు.. బీజేపీ ఎంపీ ప్రతాప్‌ను సస్పెండ్ చేయాలని నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు కర్ణాటకలో ఏకంగా అతనిపై దేశద్రోహి ముద్రవేసి పోస్టర్లు కూడా అంటించారు. అయితే ఆ పోస్టర్లపై మొదటిసారి ఎంపీ ప్రతాప్ సింహ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను ఏంటో నా నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలుసు. దాన్ని బట్టి ప్రజలు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు ఇస్తారు’ అని అన్నారు. ‘దేవతా చాముండేశ్వరీ, కావేరీ మాత, 20 ఏళ్ల నుంచి నా వ్యాసాలు చదివే ప్రజలకు తాను ఏంటో తెలుసు. గత 20 ఏళ్ల నుంచి సేవ చేస్తున్న మైసూరు, కొడుగు ప్రాంత ప్రజలు.. నేను దోశద్రోహినో లేదా దేశభక్తుడినో తేల్చుతారు. అదే విషయాన్ని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం స్పష్టంగా చూపిస్తారు. నేను దోశద్రోహినో.. దేశ భక్తుడనో ప్రజలు తీర్పు ఇస్తారు’ అని ఎంపీ ప్రతాప్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై నిరసనగా ఏర్పాటు చేసిన పోస్టర్లను మైసూరు పోలీసులు తొలిగించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఘటన అనంతరం ప్రతాప్ సింహ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి నిందితులల్లో ఒకరైన సాగర్ శర్ తండ్రిది తన నియోజవర్గమైన మైసూర్ అని తెలియజేశారు. కొత్త పార్లమెంట్ సందర్శించడానికి పాస్ ఇవ్వాల్సిందిగా తన కార్యాలయంలో సాగర్ శర్మ తండ్రి విజ్ఞప్తి చేశారని పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: 2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరించిన టాప్-10 జడ్జ్మెంట్స్ -
Karnataka Assembly Elections 2023: పాత మైసూరు.. కొత్తపోరు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు సంపూర్ణ మెజార్టీ సాధించలేదు. ఎన్నికలకు ముందు, తర్వాత పెట్టుకొన్న పొత్తులు, స్వతంత్రులపై వల, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం వంటి వాటితో ప్రభుత్వాలు నడిపింది. దీనికి ప్రధాన కారణం వొక్కలిగ ప్రాబల్య ప్రాంతమైన పాత మైసూరులో పాగా వెయ్యలేకపోవడమే.ఈ సారి ఎన్నికల్లోనైనా పాత మైసూరులో పట్టు బిగించి సంపూర్ణ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ విపక్షాలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడడంతో ఈ ప్రాంతం కొత్త పోరాటాలకు వేదికగా మారింది. కాంగ్రెస్‌కు కలిసొస్తుందా..? ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండే పాత మైసూరు ప్రాంతం జేడీ (ఎస్) వచ్చాక క్రమంగా పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ ప్రాంత రాజకీయాలను శాసిస్తున్న వొక్కలిగ సామాజిక వర్గీయులు మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను తమకు తండ్రిలా భావిస్తారు. గత ఎన్నికల్లో కూడా ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో 66 స్థానాలకు గాను 30 సీట్లు చేజిక్కించుకొని జేడీ(ఎస్) ముందు వరసలో ఉంది. తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కింగ్ మేకర్‌గా ఒక పార్టీ చక్రం తిప్పి అధికార అందలాన్ని అందుకుంటుందని పాత మైసూర్లో వొక్కలిగలు తమ పొలిటికల్ పవర్ చూపించారు. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో పాత మైసూరు, బెంగళూరు అర్బన్ కలిపి 89 స్థానాలు ఉన్నాయి. 1983 సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభ వెలిగిపోయింది. జనతాపార్టీ మూలస్థంభాల్లో ఒకరైన మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత సాధించారు. 1999లో దేవెగౌడ జనతా పార్టీ నుంచి బయటకి వచ్చి జేడీ(సెక్యులర్–ఎస్) స్థాపించిన తర్వాత పోటీ పడలేక క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. వొక్కలిగ సామాజిక వర్గీయులు రాజకీయ ప్రయోగాల్ని కూడా ఇష్టపడరు. 2005 సంవత్సరంలో అప్పట్లో జేడీ(ఎస్) నాయకుడిగా ఉన్న కురుబ వర్గానికి చెందిన నాయకుడు సిద్దరామయ్య మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులతో ‘‘అహిందా’’ అనే కొత్త సామాజిక సమీకరణకు తెరతీశారు. వొక్కలిగ ఓట్లను దూరం చేసుకోవడం ఇష్టం లేని జేడీ(ఎస్) ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తే కాంగ్రెస్‌లో చేరారు. 2018లో సిద్దరామయ్య తన సొంత నియోజకవర్గమైన చాముండేశ్వరిలో వొక్కలిగ ఓట్లు పడకపోవడంతో ఓటమి పాలయ్యారు. 66 స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు వస్తే 2018 నాటికి ఆరు స్థానాలు కోల్పోయి 20 స్థానాలకు పరిమితమైంది. దీంతో వ్యూహాలు మార్చుకొని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు డి.కె. శివకుమార్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. జేడీ(ఎస్) నుంచి ఎస్. శ్రీనివాస్, శ్రీనివాస గౌడ, శివలింగ గౌడ గత నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో ప్రధాన నాయకులు శివకుమార్, సిద్దరామయ్యలు ఈ ప్రాంతానికి చెందినవారే కావడం పార్టీకి కలిసొచ్చేఅంశం. ఉప ఎన్నికల గెలుపుతో పెరుగుతున్న బీజేపీ పట్టు పాత మైసూరు ప్రాంతానికి చెందిన బలమైన నాయకుల్ని ఆపరేషన్ కమల్ పేరుతో తమ వైపు లాక్కొని బీజేపీ పట్టు పెంచుకుంటోంది. డి. సుధాకర్, కె.సి.నారాయణ గౌడ, హెచ్‌టీ సోమశేఖర్, బైరఠి బసవరాజ్, వి. గోపాలయ్య వంటి వారు బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. యడ్డియూరప్ప నేతృత్వంలో పార్టీ ఫిరాయించిన 15 మంది నాయకుల్లో 12 మంది బీజేపీ టికెట్‌పై ఉప ఎన్నికల్లో నెగ్గారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా వొక్కలిగ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహరచన మొదలు పెట్టింది. అందులో భాగంగానే ముస్లింలకున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలిగ, లింగాయత్‌లకు రెండేసి శాతం చొప్పున కట్టబెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు ఈ ప్రాంతంలోనే అధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. వొక్కలిగ ఆత్మనినాదం పేరుతో ఆ సామాజిక వర్గం నాయకుడు కెంపె గౌడ కంచు విగ్రహాన్ని బెంగుళూరు విమానాశ్రయం సమీపంలో మోదీ ఆవిష్కరించారు. ముస్లిం పాలకుడు టిప్పు సుల్తాన్‌ను చంపిన వొక్కలిగ సైనికులైన ఉరిగౌడ, నంజెగౌడలను హీరోలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో వొక్కలిగల మద్దతు లభించే అవకాశాలున్నాయి. పట్టు నిలుపుకునే వ్యూహంలో జేడీ (ఎస్) రెండు దశాబ్దాలుగా పాత మైసూరులో పట్టు కొనసాగిస్తూ వస్తున్న జేడీ(ఎస్) దానిని నిలుపుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. వొక్కలిగలు తమకు పెద్ద దిక్కుగా భావించే దేవగౌడ వృద్ధాప్యంతో, అనారోగ్య సమస్యలతో ప్రచారానికి రాలేకపోతున్నారు. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి అంతా తానై పార్టీ భారాన్ని మోస్తున్నప్పటికీ కుటుంబ పార్టీ ముద్ర, వలసలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తుమకూరు స్థానం నుంచి స్వయంగా ఓటమిపాలైన దేవెగౌడ ఇంటికే పరిమితమయ్యారు. కులపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఎన్నికల్లో తమకి అనుకూలంగా మార్చుకోవడంలో తలపండిన దేవెగౌడ పార్టీ ఎన్నికల ప్రచారం పంచరత్న సభకి వీల్‌చైర్‌లో రావడంతో జనం పోటెత్తారు. వొక్కలిగలో వివిధ ఉపకులాల్లో కూడా దేవెగౌడకు ఆదరణ ఎక్కువగా ఉంది. కన్నడ ఆత్మగౌరవ నినాదంతో జాతీయ పార్టీలను అక్కున చేర్చుకోవద్దంటూ ప్రచారం చేస్తున్న జేడీ(ఎస్) ఈ సారి ఎన్నికల్లో కూడా పాత మైసూరులో 25 నుంచి 35 స్థానాలు గెలుచుకొని సత్తా చాటుతుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వొక్కలిగ సంఘ్ మైసూరు ప్రాంతంలో పట్టు సాధించాలంటే వొక్కలిగల మనసు గెలుచుకోవడం మినహా మార్గం లేదు. రాష్ట్రంలో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15%జనాభా ఉన్న వొక్కలిగ ఓట్లు ఇప్పటివరకు జేడీ(ఎస్), కాంగ్రెస్ పంచుకుంటూ ఉన్నాయి.1906 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా వొక్కలిగ సంఘ్‌ను ఏర్పాటు చేశారు. మాండ్యలో ఉన్న ఒకే ఒక్క వొక్కలిగ మఠం (ఆదిచుంచనగిరి మఠ్) సామాజిక వర్గాన్ని ఒకటి చేసింది. బాగా చదువుకోవడం మొదలు పెట్టిన వారు క్రమక్రమంగా కర్ణాటకలో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగారు. అసెంబ్లీలో నాలుగో వంతు మంది ప్రజాప్రతినిధులు వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. 2018 ఎన్నికలు జేడీ(ఎస్) 30 కాంగ్రెస్ 20 బీజేపీ 15 బీఎస్పీ 1 2013 ఎన్నికలు జేడీ (ఎస్) 26 కాంగ్రెస్ 26 బీజేపీ 8 ఇతరులు 6 పాత మైసూర్ రామనగరం, మాండ్య, మైసూరు, చామరాజ్నగర్, కొడగు, కోలార్, తుమకూరు, బెంగళూరు రూరల్, హసన్, కోలార్, చిక్కబళ్లాపూర్ ప్రాబల్య కులం: వొక్కలిగ (రాష్ట్ర జనాభాలో 15%) అసెంబ్లీ సీట్లు – 66 – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యవసాయ అధికారి వంచన.. పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి
సాక్షి, బెంగళూరు: మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచన చేసిన వ్యవసాయ శాఖ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన మైసూరు జిల్లా పిరియా పట్టణ తాలూకా బెట్టదపుర సమీపంలో చోటుచేసుకుంది. ఇక్కడి రైతు సమాచార కేంద్రంలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న వికాస్‌పై కేసు నమోదు చేశారు. 2019లో పిరియా పట్టణ వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేసే మహిళతో వికాస్ పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నట్లు నటించి లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్బం దాల్చగా అబార్షన్ చేయించాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితురాలు పోలీసుల ఎదుట వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: జీన్స్ వేసుకోవద్దన్నాడని... భర్తనే కడతేర్చిన మహిళ -
అమ్మవారి తాళిబొట్టు చోరీ.. తప్పు తెలుసుకున్న దొంగలు!
మైసూరు: అమ్మవారి తాళిబొట్టును చోరీ చేసుకుని వెళ్లిన దొంగలు తప్పు తెలుసుకుని తిరిగి ఆలయానికి వచ్చి కొంత నగదు, అమ్మవారి నగ అక్కడ పెట్టి వెళ్లిన వైనం మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని ఉప్పినహళ్ళి గ్రామంలో ఉన్న దుర్గాంబ అమ్మవారి దేవాలయంలొ చోటు చేసుకుంది. గతనెల 24న గ్రామంలోని దుర్గాంబ ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అమ్మవారి తాళిబొట్టును ఎత్తుకెళ్లారు. అంతలోనే తప్పు తెలుసుకుని దొంగలు భక్తుల తరహాలో గుడికి వచ్చి దొంగిలించిన నగ, కొంత నగదు కానుకగా పెట్టి వెళ్లిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..) -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని స్నేహితుడినే..
శివమొగ్గ: సొరబకు చెందిన లేఖప్ప (28) అనే వ్యక్తిని కృష్ణప్ప (30) హత్య చేశాడు. మన్మనే గ్రామానికి చెందిన లేఖప్ప సొరబకు వచ్చి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లేఖప్ప ఫోన్ కాల్స్ ఆధారంగా అతని స్నేహితుడు అయిన కృష్ణప్పను అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపినట్లు చెప్పాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పట్టణానికి పిలిపించి హత్య చేసి శవాన్ని పొలాల్లో పడేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, శివమొగ్గ దగ్గర గురుపురలో గౌడప్ప (35) అనే ప్రైవేటు ఉద్యోగి బైక్‌పై వెళ్తుండగా గూడ్స్ వ్యాన్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు. వరకట్న వేధింపులు, మరో అబల బలి మైసూరు: వరకట్న వేధింపులకు మరో అబల బలైన సంఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హిమ్మావు గ్రామంలో చోటు చేçసుకుంది. గ్రామానికి చెందిన ఉమేష్, బేబి (29)కి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అప్పుడప్పుడు దంపతుల మధ్య కట్నం విషయంగా గొడవలు జరిగేవి. ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున బేబి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డబ్బు కోసం వేధించడం వల్లనే బేబి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..) -
మైసూరు అత్యాచార ఘటన: కీలక విషయాలు వెలుగులోకి
సాక్షి, బెంగళూరు: మైసూరులో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసు దర్యాప్తులో పురోగతి కనిపించింది. ఈ కేసుకు సంబంధించి అయిదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. ఆరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టయిన అయిదుగురు తమిళనాడులోని తరుప్పూర్ జిల్లాకు చెందిన అరటిపండ్లు విక్రయించే కూలీలుగా పోలీసులు గుర్తించారు. అయితే వారిలో ఒకరు 17 ఏళ్ల బాలనేరస్తుడని అనుమానిస్తున్నారు. తమిళనాడులోని సత్యమంగళలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో వ్యక్తిని కర్ణాటకలోని చామరాజనగర్‌లో పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన నలుగురు నిందితుల్లో ముగ్గురు నేర చరిత్ర కలిగి ఉన్నారు. చదవండి: మైసూరు ఘటన: వీడియోలు తీసి.. 3 లక్షలు డిమాండ్ కాగా మైసూరు నగరం చాముండి కొండ సమీపంలో ఈనెల 24న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు ప్రత్యేక బృందాలు ఈ కేసును వివిధ కోణాల్లో విచారిస్తున్నాయి. తొలుత ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారని వార్తలు వచ్చాయి. వీరంతా మైసూరులో ఇంజినీరింగ్ చదువుతున్నారని, వీరిలో ముగ్గురు తమిళనాడు, ఒకరు కేరళకు చెందిన వారని దర్యాప్తులో వెలుగు చూసినట్లు ప్రచారం జరిగింది. అయితే తరువాత వారికి ఈ నేరంతో సంబంధం లేనట్లు తేలింది. -
విద్యార్థులను అడ్డుకున్న స్టోర్ సిబ్బంది
సాక్షి, బెంగళూరు : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశంలో లాక్డౌన్ విధించి అత్యవసర సేవలు మినహా మిగతా సేవలపై ఆంక్షల్ని విధించిన విషయం తెలిసిందే. దీంతో నిత్యావసరాల సరుకుల కోసం సూపర్ మార్కెట్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో జాతి వివక్షతను చూపుతూ ఈశాన్య భారత్ నుంచి వచ్చిన విద్యార్థులను సూపర్ మార్కెట్లోకి అనుమతించని ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కోవిడ్ 19 పేరుతో ప్రజలను హింసించే వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అన్ని రాష్ట్రాలను కోరినప్పటికీ ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. (ఆ రెండు రాష్ట్రాల్లో 200 దాటిన కరోనా కేసులు) వివరాల ప్రకారం.. నాగాలాండ్‌కు చెందిన కొంతమంది విద్యార్థులు కర్ణాటకలో నివసిస్తున్నారు. ఇటీవల వీరు మైసూర్‌లోని సూపర్ మార్కెట్‌కు వెళ్లగా అక్కడ వారిని స్టోర్ సిబ్బంది అడ్డుకున్నారు. షాప్‌లోకి అనుమతించం అంటూ వారితో వాదించారు. దీంతో తమపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఈశాన్య ప్రాంత విద్యార్థులు అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను డాలీ కికాన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఈశాన్య భారతదేశం నుంచి వలస వచ్చిన వారిని కర్ణాటక వాసులు ఆహారం కొనడానికి అనుమతించడం లేదు. సిగ్గుచేటు. భారత్‌లో జాత్యహంకారం రోజువారీ వ్యవహారం’ అంటూ ట్విటర్ వేదకగా తన ఆవేదన వ్యక్తం చేశారు. (ఏప్రిల్ 14 వరకూ శ్రీవారి దర్శనం బంద్) కాగా ఈ ఘటన తమ దృష్టికి వచ్చిన వెంటనే కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. స్టోర్ మేనేజర్‌తోపాటు ఇతర సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు కమిషనర్ చంద్రగుప్తా తెలిపారు. లాక్డౌన్ కాలంలో ప్రజలు, దుకాణ యజమానులు, సిబ్బంది ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. అలాగే ఇలాంటి సంక్షోభ సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. ఇక విషయంపై స్పందించిన బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు ఆదివారం ట్వీట్ చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన మా సోదరులను కొంతమంది తప్పుదారి పట్టించి, కోవిడ్-19 పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా తప్పుదారి పట్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన సోదర, సోదరీమణులు ఇక్కడ సురక్షితంగా ఉన్నారు. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే సమీప పోలీస్టేషన్లో సంప్రదించండి లేదా నన్ను నేరుగా కలవండి’ అంటూ వారికి అండగా నిలిచారు. -
మైసూరులో దారుణం, యువతిపై గ్యాంగ్ రేప్
సాక్షి, మైసూరు: ఓ ప్రేమ జంటపై నలుగురు యువకులు దాడిచేసి.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బుధవారం రాత్రి పర్యాటక నగరం మైసూరులో జరిగింది. మైసూరు జిల్లాలోని హెచ్డీ.కోటె హ్యాండ్ పోస్ట్ ప్రాంతానికి చెందిన శివసిద్ధు, అతని ప్రియురాలు కలిసి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో మైసూరు సమీపంలో ఉన్న లింగాంబుధి చెరువు రింగ్ రోడ్డు వద్ద మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నలుగురు యువకులు వచ్చి వారిపై దాడి చేశారు. శివసిద్ధు కాళ్ల మీద పెద్ద బండరాయి వెయ్యడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం వారు యువతిపై మూకుమ్మడిగా అత్యాచారం చేసి పరారయ్యారు. కొంతసేపటికి శివసిద్ధు తేరుకుని యువతిని తీసుకుని మైసూరులోని చెలువాంబ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్నారు. యువకుడికి కాలితో పాటు తలకూ గాయాలయ్యాయి. యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. ఎనిమిది పోలీస్ బృందాల ఏర్పాటు విషయం తెలుసుకున్న మైసూరు జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం బాధితులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గురువారం మీడియాతో మాట్లాడుతూ జయపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని.. దుండగుల కోసం 8 పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వివరించారు. -
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని జానకి
మైసూరు : ప్రఖ్యాత గాయని, గాన కోకిల ఎస్ జానకి (81) ఆసుపత్రిలో చేరారు. మైసూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బంధువుల ఇంట్లో ఉండగా కాలుజారి పడిపోవడంతో ఆమె కుడి కాలికి ఫ్రాక్చర్ అయిందట. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
వీరుడి చుట్టూ.. వివాదాల గుట్టు
సాక్షి, బెంగళూరు : మైసూర్ పులిగా పిలవబడే టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై కర్ణాటకలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. జేడీఎస్ చీఫ్, కర్ణాటక సీఎం కుమారస్వామి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నవంబర్ 10న రాష్ట్ర వ్యాప్తంగా టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని ముస్లింలను ఆకట్టుకునేందుకే జేడీఎస్-కాంగ్రెస్ టిప్పు ఉత్సవాలను నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ కొత్తనాటకానికి తెరలేపిందని అన్నారు. టిప్పు పాలనలో హిందూవులను చిత్రహింసలకు గురిచేశారని, ఆయనను యాంటీ హిందూపాలకుడిగా బీజేపీ వర్ణించింది. యడ్యూరప్ప వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఖండించారు. 18వ శతాబ్దంలో బ్రిటీష్ వారిని ఎదురించిన గొప్ప పోరాడయోధుడు టిప్పుసుల్తానని, అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాలను జరుపుకోవడంలో తప్పేమీ లేదని వివరించారు. పోరాటయోధులను బీజేపీ ఎప్పుడూ గౌరవించలేదని.. టిప్పుపై రాజకీయం ఆరోపణలు చేయడం సమంజసం కాదని శివకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలనే ఏజెండాతో బీజేపీ ఈ ఆరోపణలకు దిగిందని అన్నారు. టిప్పు ఉత్సవాలను నిర్వహించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గతంలో అభినందిచినట్లు ఆయన గుర్తుచేశారు. గతంలో కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా టిప్పుపై వివాదం రేగింది. ప్రతి ఏడాది టిప్పు జయంతి, వర్థింతి వేడుకల సమయంలో రాజకీయంగా దుమారంరేగడం కన్నడలో సాధారణంగా మారిపోయింది. కాగా బ్రిటిష్ హయాంలో మైసూర్ పాలకుడిగా ఉన్న టిప్పు సుల్తాన్ వారితో వీరోచితంగా పోరాడి 1799 మే 4న 49 ఏళ్ల వయస్సులో వీరమరణం పొందారు. ముఖ్యంగా యుద్దంలో అనుసరించాల్సిన వ్యూహాలను రచించడంతో టిప్పును దిట్టగా చరిత్రకారులు వర్ణిస్తారు. ఆధునిక చరిత్రలో యుద్దంలో తొలిసారిగా రాకెట్లను ఉపయోగించిన ఘనత టిప్పు సుల్తాన్‌కే దక్కుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయం తెలిసిందే. -
టిప్పుపై పాక్ ప్రశంసలు.. కర్ణాటకలో ఆజ్యం!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు మరింత ఉధృతం కానుంది. ఇటీవల టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వివాదం రేపగా, తాజాగా పాక్ ట్వీట్‌తో కన్నడ రాజకీయం మరింత వేడెక్కింది. టిప్పు సుల్తాన్‌ను ‘టైగర్ ఆఫ్ మైసూర్’గా అభివర్ణిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం ట్వీట్ చేసింది. టిప్పు సుల్తాన్ 218 వర్థంతి సందర్భంగా ‘టిప్పు సుల్తాన్ టైగర్ ఆఫ్ మైసూర్... ముస్లిం మైసూర్ పాలకుడు ప్రతిభావంతమైన చారిత్రాత్మక వ్యక్తి టిప్పు సుల్తాన్ (బాద్షా నసీబుద్దౌలా సుల్తాన్ ఫతే అలీ బహాదూర్ సాహెబ్)’ గా పాకిస్తాన్ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధిచేకూర్చడం కోసమే పాకిస్తాన్ ఈ విధంగా ట్వీట్ చేసిందని ఆరోపించింది. బ్రిటిష్ సామ్రాజాన్ని టిప్పు సుల్తాన్ దైర్యంగా ఎదుర్కొని, వీరోచితమైన పోరాటం చేశాడని చరిత్రాకారుల అభిప్రాయం. స్వాతంత్య్ర పోరాటంలో టిప్పు సుల్తాన్ కృషి ఎంతో ఉందని చరిత్రకారులు చెప్తుంటారు. కాగా టిప్పు సుల్తాన్ పోరాటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. చరిత్రకారుల సమాచారం ప్రకారం టిప్పు సుల్తాన్ 1750, నవంబర్ 20న మైసూర్లో జన్మించి, 1799 మే 4న బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి 49 ఏళ్ల వయస్సులో వీరమరణం పొందారని చెప్తున్నారు. పాకిస్తాన్‌కి టిప్పు సుల్తాన్‌కి ఎలాంటి సంబంధం లేదని, ఎన్నికల్లో ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయడానికే పాకిస్తాన్ ఈ చర్యకు తెగబడిందని బీజేపీ ఆరోపిస్తోంది. టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను ప్రతిఏటా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2015లో ప్రకటించిన తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్దమే జరిగింది. సిద్దరామయ్య నిర్ణయం పట్ల బీజేపీతో సహా పలుసంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. టిప్పు జయంతోత్సవాల్లో ఎవ్వరూ పాల్గొనవద్దని, మంగుళూరులో కాథలిక్కులను దారుణంగా చంపిన ఉగ్రవాదిగా బీజేపీ టిప్పును వర్ణించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించి ముస్లింలను ఆకర్షించాలని భావిస్తోందని విమర్శించిన విషయం తెలిసిందే. -
నన్ను ప్రేమించు లేకపోతే..
మైసూరు: ప్రేమించాలంటూ యువకుడు వేధింపులు తాళలేక ఆత్మహత్య కు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. దక్షిణ గ్రామీణ పోలీసుల కథనం మేరకు... మైసూరు తాలూకాలోని రమ్మనహళ్లి గ్రామానికి చెందిన రజని(16)పీయూసీ చదువుతుండేది. అదే కాలేజీకి చెందిన ఇంటి పక్కనే ఉంటున్న దొడ్డస్వామి అనే యువకుడు తనను ప్రేమించాలంటూ బాలికను వేధించేవాడు. తనకు ఇష్టం లేదని తిరస్కరించినా వెంటపడి వేధించేవాడు. ప్రేమించకపోతే తనతో కలసి దిగిన ఫోటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానని బెదిరంచేవాడు. దీంతో మనస్థాపం చెందిన రజనీ ఆరు నెలల క్రితం ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తల్లితండ్రులు రజనీని కే.ఆర్.ఆసుపత్రికి తరలించగా కోమాలోకి వెళ్లింది. ఈక్రమంలో రజనీ బుధవారం మృతి చెందింది. ఇదిలా ఉండగా ఘటనపై దొడ్డస్వామిని పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చి అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. -
ప్రేమ వేధింపులకు బాలిక బలి
సాక్షి, మైసూరు: ప్రేమించాలంటూ యువకుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. దక్షిణ గ్రామీణ పోలీసుల కథనం మేరకు... మైసూరు తాలూకాలోని రమ్మనహళ్లి గ్రామానికి చెందిన రజని(16) పీయూసీ చదువుతుండేది. అదే కాలేజీకి చెందిన ఇంటి పక్కనే ఉంటున్న దొడ్డస్వామి అనే యువకుడు తనను ప్రేమించాలంటూ బాలికను వేధించేవాడు. తనకు ఇష్టం లేదని తిరస్కరించినా వెంటపడి సతాయించేవాడు. ప్రేమించకపోతే తనతో కలసి దిగిన ఫోటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానని బెదిరిచేవాడు. దీంతో మనస్థాపం చెందిన రజనీ ఆరు నెలల క్రితం ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తల్లితండ్రులు రజనిని కే.ఆర్.ఆసుపత్రికి తరలించగా కోమాలోకి వెళ్లింది. ఈక్రమంలో రజనీ బుధవారం మృతి చెందింది. ఇదిలా ఉండగా ఘటనపై దొడ్డస్వామిని పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చి అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. -
మైసూరు ప్యాలెస్‌కు డేంజర్
సాక్షి, మైసూరు: దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మైసూరు ప్యాలెస్ కూడా ఉగ్ర ముప్పు పొంచిఉంది. దసరా ఉత్సవాలలోనే కాకుండా ప్రతిరోజూ దేశవిదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. దాంతో ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో మైసూరు ప్యాలెస్ ఉందని నిఘా సంస్థలు పేర్కొనడంతో మైసూర్ ప్యాలెస్‌కు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా భధ్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీస్‌శాఖ, అగ్నిమాపకశాఖలకు కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్యాలెస్ ఆవరణలో ఇకపై 24 గంటల పాటు భధ్రతా బలగాల పహారాతో పాటు ప్యాలెస్ ఆవరణలోనే అగ్నిమాపక వాహనాలు, సిబ్బందికి కార్యాలయం, బస ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్ డీ.రందీప్ రెండు శాఖలకు ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లోనున్న ఎన్ఐఏ అధికారులు మూడుసార్లు మైసూరు ప్యాలెస్‌లో భధ్రతా ఏర్పాట్లు పరిశీలించి ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరింత భధ్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. అంతేకాకుండా ప్రైవేటు భధ్రతా సిబ్బందితో పాటు ప్రస్తుతమున్న సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలు అమర్చాలని చెప్పారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండడానికి ప్యాలెస్ ఆవరణలోనే అగ్నిమాపక వాహనాలు, కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ సూచించారు. ఎన్ఐఏ అధికారుల సూచనల ప్రకారం అదనపు భధ్రతా సిబ్బంది, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అగ్నిమాపక వాహనాలు, కార్యాలయం, సిబ్బందిని మాత్రం ఇంతవరకూ ఏర్పాటు చేయలేకపోయారు. గత సంఘటనల దృష్ట్యా... సుమారు నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించిన మైసూరు ప్యాలెస్‌లో రెండు శతాబ్దాల క్రితం జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ప్యాలెస్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. అనంతరం అదేస్థలంలో ప్రస్తుతమున్న ప్యాలెస్‌ను నిర్మించారు. ప్రస్తుతమున్న అంబావిలాస్ ప్యాలెస్‌లో అరుదైన, ఎంతో విలువైన చెట్లతో స్తంభాలను ఏర్పాటు చేసారు. కోట్లాది రూపాయల విలువ చేసే బంగారుపూతతో ఈ స్తంభాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇలా ప్యాలెస్‌లో ప్రతీ వస్తువు, స్తంభాలు తదితర వస్తువులన్నింటినీ అరుదైన వృక్షాల దుంగలతో నిర్మించారు. అంతేకాకుండా ప్యాలెస్‌లో కోట్ల విలువ చేసే తైలవర్ణ చిత్రలేఖనాలు, వంశపారంపర్య, చార్రితాత్మక కట్టడాలు, విగ్రహాలు ఉన్నాయి. దీంతో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా లేదా ఉగ్రవాదుల దాడి నుంచి ప్యాలెస్‌ను రక్షించడానికి వీలుగా ప్యాలెస్ ఆవరణలో అగ్నిమాపక వాహనాలు, కార్యాలయంతో పాటు సిబ్బందికి కూడా అక్కడే బస ఏర్పాటు చేయాలంటూ ఎన్ఐఏ సూచించింది. వీటితో పాటు 72 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్యాలెస్ చుట్టుపక్కల వందల సంవత్సరాల కాలం నాటి దేవాలయాలు, మ్యూజియంతో పాటు రాజ వంశానికి చెందిన అశ్వాలు, ఏనుగులు, ఒంటెలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్యాలెస్ వెనుకభాగంలోనే రాజ వంశస్థులు కూడా తరతరాలుగా నివాసం ఉంటుండడంతో ప్యాలెస్‌లో భధ్రతను కట్టుదిట్టం చేయాలంటూ ఎన్ఐఏ సూచించింది. దీంతో బెంగళూరు నగరంలోని విధానసౌధ, ఎం.ఎస్.రామయ్య బిల్డింగ్, హైకోర్టు, రాజ్‌భవన్ తదితర కట్టడాల ఆవరణలో ఏర్పాటు చేసిన విధంగానే ప్యాలెస్ ఆవరణలో కూడా అగ్నిమాపక కేంద్రం, వాహనాలు, సిబ్బందిని నియమించాలంటూ రాష్ట్ర అగ్నిమాపక దళం డీజీపీ, పోలీసుశాఖ డీజీపీలను ఆదేశించారు. -
రామదాసుపై పోటీ చేస్తా
మైసూరు : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఎస్.ఏ.రామదాస్‌పై వచ్చే శాసన సభ ఎన్నికల్లో మైసూరు నగరంలో ఉన్న కే.ఆర్.నగర నియోజకవర్గం నుంచి తాను కూడా పోటీ చేస్తానని ప్రేమకుమారి తెలిపారు. గతంలో ఆమె మాజీ మంత్రి రామదాసు ప్రియురాలిగా వార్తల్లోకి ఎక్కారు. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే ఉండటంతో ఇప్పటికే కే.ఆర్. నగర నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన మాజీ మంత్రి రామదాసు తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. ఇటీవలె నియోజకవర్గంలో చెత్త సమస్యపై ఆయన నిరాహార దీక్ష కూడా చేశారు. ఎన్నికల కోసం రామదాసు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ప్రస్తుతం తెరపైకి వచ్చిన ప్రేమకుమారి మరోసారి రామదాస్‌కు షాక్ ఇచ్చారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీ నుంచి అయినా లేదా స్వతంత్ర అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి కచ్చితంగా నిలబడతానని చెప్పారు. నటుడు ఉపేంద్ర పార్టీ లేదా అనుపమా శైనె పార్టీ నుంచి పోటీ చేయడానికి యత్నిస్తున్నానని చెప్పారు. -
కోరలు చాస్తున్న డెంగీ
► 15 రోజుల వ్యవధిలో 20 మంది మృత్యువాత ► డెంగీతో విలవిల్లాడుతున్న రాచనగరి ► జిల్లా వ్యాప్తంగా 71 కేసుల నమోదు ► ఒక్క మైసూరులోనే 45 మైసూరు: దేశంలో స్వచ్ఛమైన నగరాల జాబితాలో రెండుసార్లు మొదటిస్థానంలో నిలిచిన మైసూరు నగరం ప్రస్తుతం డెంగీ మహమ్మారితో వణుకుతోంది. మైసూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా డెంగీ తదితర విష జ్వరాలతో విలవిల్లాడుతున్నాయి. మైసూరు నగరంతో పాటు నంజనగూడు, పిరియాపట్టణ ప్రాంతాల్లో గత 15 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులతో పాటు 20 మందికి పైగా డెంగీ బారిన పడి మృత్యువాత పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 71 డెంగీ కేసులు నమోదవగా అందులో మైసూరు నగరంలోనే 45 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన నగర పాలికె డెంగీ అపరిశుభ్రత తాండవిస్తున్న ప్రాంతాల్లో ఫాగింగ్ తదితర నివారణ చర్యలను ముమ్మరం చేసింది. డెంగీ నివారణకు పాలికె నివారణ చర్యలు ముమ్మరం చేసినా ప్రజలు మాత్రం ఇళ్లతో పాటు పరిసరాలను స్వచ్ఛంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో డెంగీ జ్వరాన్ని వ్యాపింప చేసే ఈజిప్ట్ ఈడీస్ దోమల వృద్ధిని అడ్డుకోవడం కష్టసాధ్యమవుతోంది. ఇళ్లల్లోని నీటితొట్లు, ట్యాంకులను ఎప్పటికప్పడు శుభ్రం చేయకపోవడం ఒక కారణం కాగా నగర వ్యాప్తంగా ఉన్న పార్కులు, పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్‌ప్లేట్లను ఎక్కడపడితే అక్కడే పారేస్తుండటంతో ప్రతిరోజు నగరంలో 450 టన్నుల చెత్త వెలువడుతోంది. అందులో 250 టన్నుల చెత్తను మాత్రమే సంస్కరణ చేస్తున్న పాలికె మిగిలిన 200 టన్నుల చెత్తను అలానే వదిలేస్తుండటంతో డెంగీని వ్యాపింపచేసే దోమలు రాజ్యమేలుతున్నాయి. ఇక నగరంతో పాటు నగర శివార్లలో ఉన్న మొత్తం 48 చెరువులు చెత్త, వ్యర్థాలు కలవడం కూడా ఈజిప్ట్ ఈడీస్ దోమల వృద్ధికి కారణమవుతున్నాయి. ఈ పరిణామాలకు తోడు తొలకరి వర్షాలు కూడా ప్రారంభమవడంతో వాతావరణం చల్లగా మారడంతో డెంగీ దోమలు మరింత విజృంభించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. మొక్కలు పెంచడం ద్వారా దోమలకు చెక్... డెంగ్యూ జ్వరాన్ని వ్యాపింప చేసే ఈజిప్ట్ ఈడీస్ దోమలను లెమన్బ్లామ్, మారీగోల్డ్, కాట్నిప్, సిత్రోనెల్లా గ్రాస్, బిసిల్, రోజ్మేరి, థేమి, యూకలిప్టస్, ల్యావెండర్, పెప్పర్మింట్, గార్లిక్, టీట్రీ, గెరానియ్మ్,లెంటాన,లెమన్‌గ్రాస్ మొక్కలు పెంచడం ద్వారా దోమలను నివారించవచ్చు. చేపల ద్వారా కూడా దోమలకు చెక్.... మురికినీరు,గుంతలు, నీటితొట్లతో పాటు మంచినీటిలో కూడా ఈజిప్ట్ ఈడీస్ దోమలకు సంతానోత్పత్తి వృద్ధి చేసే సామర్థ్యం ఉండడంతో పాలికె ఫాగింగ్ ద్వారా దోమలను నివారిస్తోంది. అయితే ఫాగింగ్ వల్ల దోమలు మాత్రమే నాశనమవుతున్నా గుడ్లుపై మాత్రం ఫాగింగ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండడంతో డెంగీ దోమల నిర్మూలన అసాధ్యమవుతోంది. అయితే గప్పి రకం చేపలను పెంచడం ద్వారా ఈజిప్ట్ ఈడీస్ దోమల నిర్మూలన సాధ్యమవుతుందని తేలడంతో నీటితొట్లు, నిల్వనీటిలో గప్పి చేపలను పెంచాలంటూ ఆరోగ్యశాఖ ప్రజలకు సూచిస్తోంది. –డీ.రందీప్,జిల్లా కలెక్టర్ ‘ఈ ఏడాది జవనరి నుంచి మే వరకు జిల్లా వ్యాప్తంగా 459 మందికి డెంగ్యూ పరీక్షలను నిర్వహించగా 71 మందికి డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయింది.దీంతో డెంగ్యూ జ్వరం మరింత విజృంభించకుండా జిల్లా ఆరోగ్యశాఖ,గ్రా.పం.సభ్యులు.స్వయం సేవా సంఘాల కార్యకర్తలు డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు’. –ఎస్.చిదంబర, సాంక్రమిక రోగాల నియంత్రణాధికారి.