ప్రేమకుమారి, ఎస్.ఎ.రామదాసు
మైసూరు : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఎస్.ఏ.రామదాస్‌పై వచ్చే శాసన సభ ఎన్నికల్లో మైసూరు నగరంలో ఉన్న కే.ఆర్.నగర నియోజకవర్గం నుంచి తాను కూడా పోటీ చేస్తానని ప్రేమకుమారి తెలిపారు. గతంలో ఆమె మాజీ మంత్రి రామదాసు ప్రియురాలిగా వార్తల్లోకి ఎక్కారు. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే ఉండటంతో ఇప్పటికే కే.ఆర్. నగర నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన మాజీ మంత్రి రామదాసు తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు.
ఇటీవలె నియోజకవర్గంలో చెత్త సమస్యపై ఆయన నిరాహార దీక్ష కూడా చేశారు. ఎన్నికల కోసం రామదాసు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ప్రస్తుతం తెరపైకి వచ్చిన ప్రేమకుమారి మరోసారి రామదాస్‌కు షాక్ ఇచ్చారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీ నుంచి అయినా లేదా స్వతంత్ర అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి కచ్చితంగా నిలబడతానని చెప్పారు. నటుడు ఉపేంద్ర పార్టీ లేదా అనుపమా శైనె పార్టీ నుంచి పోటీ చేయడానికి యత్నిస్తున్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment