karnataka assembly elections 2018
-
‘కర్ణాటక’ కోసం రూ.122 కోట్లు
న్యూఢిల్లీ: 2018, మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రూ.122.68 కోట్లు ఖర్చు పెట్టినట్లు బీజేపీ తెలిపింది. ఇందులో రూ.84 కోట్లను ప్రచారం కోసం(బల్క్ ఎస్సెమ్మెస్‌లు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్, వెబ్సైట్, ఇతర సామగ్రి) కోసమే ఖర్చుపెట్టినట్లు వెల్లడించింది. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలకు మరో రూ.16 కోట్లు వెచ్చించామని పేర్కొంది. గతేడాది జరిగిన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ.14.18 కోట్లు ఖర్చుపెట్టామని ఎన్నికల సంఘానికి(ఈసీ) సమర్పించిన నివేదికలో బీజేపీ తెలిపింది. వీటిలో మేఘాలయలో రూ.3.8 కోట్లు, త్రిపురలో రూ.6.96 కోట్లు, నాగాలాండ్‌లో రూ.3.36 కోట్లు వ్యయమైనట్లు పేర్కొంది. విరాళాల్లో బీజేపీనే టాప్.. రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి రాజకీయ పార్టీలకు మొత్తం రూ.469.89 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకే రూ.437.04 కోట్లు దక్కినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ తెలిపింది. కాంగ్రెస్ కేవలం రూ.26.25 కోట్లను అందుకున్నట్లు పేర్కొంది. బీజేపీ విరాళం.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీల మొత్తం విరాళానికి 12 రెట్లు అధికమని పేర్కొంది. జాతీయ పార్టీలల విరాళాల్లో 90 శాతం కార్పొరేట్ సంస్థలు, మిగిలిన 10 శాతాన్ని వ్యక్తులు ఇచ్చారని ఏడీఆర్ చెప్పింది. -
కాంగ్రెస్‌దే జయనగర
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి 2,889 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరుసగా గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడినుంచి గెలిచింది. జూన్ 11న ఎన్నిక జరగగా బుధవారం నువ్వా–నేనా అన్నట్లుగా సాగిన లెక్కింపులో చివరకు సౌమ్యారెడ్డి పైచేయి సాధించారు. ఈమెకు 54,457 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్‌కు 51,568 ఓట్లు వచ్చాయి. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. సౌమ్యారెడ్డి యువ నాయకురాలిగా జయనగరలో సుపరిచితం. సేవా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. మే 12న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్ జరగాల్సి ఉండగా.. అయితే బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ పోలింగ్‌కు రెండ్రోజుల ముందు గుండెపోటుతో మరణించారు. దీంతో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. విజయకుమార్ సోదరుడు ప్రహ్లాద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా, ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి జేడీఎస్ మద్దతు తెలిపింది. అసెంబ్లీలో తండ్రీ కూతుళ్లు సౌమ్య తండ్రి రామలింగారెడ్డి గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తండ్రీకూతుళ్లు ఎమ్మెల్యేలుగా ఉండటం కన్నడ చరిత్రలో ఇదే తొలిసారి. గత నెల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 సీట్లు స్థానాలు దక్కించుకోవడం తెలిసిందే. ఈ గెలుపుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 80కి పెరిగినా, ఇటీవల జమఖండి ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో 79కి తగ్గింది. జయనగరలో సానుభూతి గట్టెక్కిస్తుందని బీజేపీ ఎంతగానో ఆశలు పెట్టుకుంది. అయితే ముఖ్య నాయకుల సహాయ నిరాకరణ బీజేపీ ఓటమికి కారణమైంది. -
జయనగరలో బీజేపీకి షాక్
బెంగళూరు : జయనగర అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ( బీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్య రెడ్డి 2,889 ఓట్ల వెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 54,457 ఓట్లు నమోదవ్వగా.. బీజేపీకి 51,568 ఓట్లు వచ్చాయి. తాజా గెలుపుతో కాంగ్రెస్ బలం 80కి చేరింది. జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ అకస్మిక మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్ ఈ స్థానానికి జూన్ 11న( సోమవారం) ఎన్నికలు నిర్వహించగా 55శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలో బీజేపీ తరపున విజయ్ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి పోటీ పడ్డారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్ మద్దతు ప్రకటించడం.. కాంగ్రెస్ విజయానికి కలిసొచ్చింది. జయనగర్ ఫలితాలు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కౌంటింగ్ సెంటర్ బయట డ్యాన్స్‌లు చేస్తూ ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. -
ఎమ్మెల్యేలకు యడ్డి ఆఫర్?
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు మంత్రి పదవి ఆశ చూపించి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపు విడుదల చేసింది. కొచ్చికి వెళ్లవద్దని, తనపై నమ్మకం లేదా అంటూ యడ్యూరప్ప అందులో మాట్లాడారు. బీజేపీకి మద్దతిస్తే తనకొచ్చే లాభం ఏమిటని పాటిల్ ప్రశ్నిస్తూ, తనతో పాటు మరో ముగ్గురు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వారిని కూడా తీసుకు రమ్మని యడ్యూరప్ప కోరారు. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే మంత్రి పదవి ఇస్తానని, ఒక్కసారి కొచ్చికి వెళితే తిరిగి రావడం కుదరదని యడ్యూరప్ప చెబుతారు. మంత్రి పదవితో పాటు ఏ సహాయం కావాలన్నా చేసి పెడతామని హామీ ఇచ్చారు. యడ్యురప్ప కుమారుడు విజయేంద్ర కూడా తమ ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు డబ్బు, మంత్రి పదవి ఆశ చూపించారని కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు విజయేంద్ర మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపులను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. -
బీజేపీపై ఘాటు విమర్శలు చేసిన రాహుల్ గాంధీ
-
కర్ణాటక: ఇక రంగంలోకి నాన్నను దింపుతా!
సాక్షి, బెంగళూరు : బీజేపీకి సాధారణ మెజారిటీ లేకపోయినప్పటికీ.. ఆ పార్టీ నేత యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడంపై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. బీజేపీపై పోరాటానికి సీనియర్ రాజకీయ నేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను రంగంలోకి దింపుతున్నాయి. ఇదే విషయాన్ని జేడీఎస్ నేత, దేవెగౌడ తనయుడు కుమారస్వామి వెల్లడించారు. ‘ఈ పోరాటానికి నాయకత్వం వహించి.. అన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడాల్సిందిగా మా నాన్న (హెచ్డీ దేవెగౌడ)ను కోరుతాను. బీజేపీ ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తీరును ఆయన అందరి దృష్టికి తీసుకెళతారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు మనమంతా కలిసి సాగాల్సిన అవసరముంది’ అని కుమారస్వామి గురువారం విలేకరులతో అన్నారు. బీజేపీ సాధారణ మెజారిటీ సాధించినప్పటికీ.. యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చి.. గవర్నర్ వజుభాయ్ వాలా అసంబద్ధంగా ప్రవర్తించారని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని జేడీఎస్ నేత కుమారస్వామి మండిపడ్డారు. బీజేపీ ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తమ తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు. ‘మా ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనే ప్రస్తుతం మేం దృష్టిపెట్టాం. బీజేపీ, ఆ పార్టీ మంత్రులు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో ప్రజలు గమనించాలి. బీజేపీకి మెజారిటీ లేదు. అయినా గవర్నర్ ఇలా ఎందుకు ప్రవర్తించారు? ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు’ అని కుమారస్వామి అన్నారు. సీఎంగా యడ్యూరప్ప ప్రమాణాన్ని వ్యతిరేకిస్తూ.. కర్ణాటక విధానసౌధ ఎదుట కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనలో జేడీఎస్ కురువృద్ధ నేత దేవెగౌడ కూడా పాల్గొన్నారు. బీజేపీ విధానాలను నిరసిస్తూ ఆయన నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు. -
అప్పుడు మోదీ తరహాలోనే.. ఇప్పుడు యెడ్డీ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి యడ్యూరప్ప విధానసౌధకు వచ్చారు. ఈ సందర్భంగా విధానసౌధలోకి అడుగుపెట్టే సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. విధానసౌధ మెట్లను చేతులతో తాకి.. ప్రమాణం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత 2014 మేలో పార్లమెంటులో అడుగుపెట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఇదే తరహాలో పార్లమెంటు మెట్లకు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటును దేవాలయంగా అభివర్ణిస్తూ.. పార్లమెంటు మెట్లను ఆయన మొక్కారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా విధానసౌధను ‘ప్రజాస్వామ్య దేవాలయం’గా అభివర్ణిస్తూ.. సభ మెట్లను మొక్కారు. -
దేశం విచారంలో మునిగిపోయింది!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తగినంత మెజారిటీ లేకపోయినా.. గవర్నర్ సాయంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారని మండిపడుతోంది. తాజాగా యెడ్డీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. బూటకమైన విజయంపై బీజేపీ సంబరాలు చేసుకుంటుండగా.. దేశంలో విచారంలో మునిగిపోయిందని అన్నారు. ‘బీజేపీ తగినంత సంఖ్యాబలం లేకపోయినా.. అసంబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటోంది. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. ఈ రోజు ఉదయం తమ బూటకమైన విజయంపై బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. కానీ దేశం ప్రజాస్వామ్యం ఓడిపోయినందుకు విచారంలో మునిగిపోయింది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. The BJP’s irrational insistence that it will form a Govt. in Karnataka, even though it clearly doesn’t have the numbers, is to make a mockery of our Constitution. This morning, while the BJP celebrates its hollow victory, India will mourn the defeat of democracy. — Rahul Gandhi (@RahulGandhi) May 17, 2018 యెడ్డీ ప్రమాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌తోపాటు మాజీ సీఎం సిద్దరామయ్య ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రస్తుతం యడ్యూరప్ప ప్రమాణ స్వీకార అంశం సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉందని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, ఈ విషయాన్నితాము ప్రజల్లోకి తీసుకెళుతామని ఆయన అన్నారు. -
లైవ్ అప్డేట్స్: పోలీసు ఉన్నతాధికారుల బదిలీ
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప నేడు (గురువారం) ప్రమాణం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ఉదయం 9 గంటలకు ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో లైన్‌క్లియర్ అయిన సంగతి తెలిసిందే. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.. కర్ణాటక రాజకీయ పరిణామాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇవి.. పోలీసు ఉన్నతాధికారుల బదిలీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే బీఎస్ యడ్యూరప్ప పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా అమర్‌కుమార్ పాండేను నియమించారు. ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఐజీగా సందీప్ పాటిల్‌ను నియమించారు. గోవాకు కర్ణాటక సెగ కర్ణాటక రాజకీయ సంక్షోభం సెగ గోవాను తాకింది. గోవా రాజ్‌భవన్ ముందు తమ ఎమ్మెల్యేలతో రేపు పరేడ్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టులో కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్ న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్‌ను ఎమ్మెల్యేగా నామినేట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్ దాఖలు చేసింది. బలపరీక్ష పూర్తయ్యేంత వరకు నియామకం చేయకుండా చూడాలని కోరింది. టచ్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేలు.. పని అయిపోతోంది! అసెంబ్లీ వేదికగా జరిగే బలనిరూపణలో బీజేపీ నెగ్గి తీరుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బీ శ్రీరాములు బలపరీక్షపై స్పందించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, పని అయిపోతుందని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతు కోరిన కుమారస్వామి మమతా బెనర్జీ, కేసీఆర్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్‌లు కేంద్రానికి వ్యతిరేకంగా రావాలంటూ పిలుపు బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలి రేపు లేదా ఎల్లుండే బలపరీక్ష..: యడ్యూరప్ప అసెంబ్లీలో బలం నిరూపించుకుంటా.. రేపు లేదా ఎల్లుండి బలపరీక్ష ఉండొచ్చు కన్నడ ప్రజల ఆశీస్సులతోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశా నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు కాంగ్రెస్, జేడీఎస్‌లు అనైతికంగా అధికారంలోకి రావాలనుకున్నాయి: యడ్యూరప్ప కర్ణాటకలో రూ.56వేల కోట్ల రైతు రుణాలు రద్దు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యడ్యూరప్ప రుణాల రద్దు ఫైలుపై తొలి సంతకం మళ్లీ రిసార్ట్‌కి చేరిన రాజకీయాలు విధాన సౌధలో ముగిసిన కాంగ్రెస్-జేడీఎస్ ధర్నా ధర్నాలో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తిరిగి రిసార్ట్‌కు చేరుకున్న కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు రాంజెఠ్మలానీ బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ.. యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో.. సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఇంప్లీడ్‌కు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సరైన బెంచ్ ముందు ప్రస్తావించాలని ధర్మాసనం సూచించింది. యడ్యూరప్ప ప్రమాణానికి సుప్రీంకోర్టు ఇప్పటికే లైన్ క్లియర్ చేసింది. వ్యక్తిగత హోదాలో గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. యెడ్డీ ప్రమాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌తోపాటు మాజీ సీఎం సిద్దరామయ్య ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. యెడ్డీకి వ్యతిరేకంగా ప్రజాకోర్టుకు వెళుతాం: సిద్దూ ప్రస్తుతం యడ్యూరప్ప ప్రమాణ స్వీకార అంశం సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉంది. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. మేం ప్రజల్లోకి వెళ్లి ఈ విషయాన్ని చాటుతాం: మాజీ సీఎం సిద్దరామయ్య రాజ్‌భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణం రాజ్‌భవన్‌కు చేరుకున్న యడ్యూరప్ప.. మరికాసేపట్లో 23వ సీఎంగా ప్రమాణస్వీకారం ‘వందేమాతరం, మోదీ.. మోదీ’ అంటూ రాజ్‌భవన్ ఎదుట బీజేపీ కార్యకర్తలు నినాదాలు.. రాజ్‌భవన్ బయలుదేరిన యడ్యూరప్ప.. మరికాసేపట్లో సీఎంగా ప్రమాణం Bengaluru: BS Yeddyurappa leaves for Raj Bhavan, to take oath as Karnataka Chief Minister shortly. pic.twitter.com/gfX5kXi698 — ANI (@ANI) 17 May 2018 రాజ్‌భవన్‌లో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేశారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరు అయ్యారు. Bengaluru: Swearing-in ceremony of BS Yeddyurappa as the Chief Minister of Karnataka to begin shortly; Union Ministers JP Nadda, Dharmendra Pradhan and Prakash Javadekar present at Raj Bhavan #Karnataka pic.twitter.com/yV3BEj8wNL — ANI (@ANI) 17 May 2018 -
బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోంది
-
కాంగ్రెస్-జేడీఎస్ వెనుక ప్రియాంక గాంధీ
సాక్షి, బెంగుళూరు : కర్ణాటకలో భారతీయ జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ), జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్)లు చేతులు కలపడం వెనుక ప్రియాంక గాంధీ వాద్రా హస్తం ఉన్నట్లు రిపోర్టులు వెలువడుతున్నాయి. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేయాలని ప్రియాంక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పారనేది సదరు రిపోర్టు సారాంశం. కర్ణాటక ఎన్నికలకు ముందు జేడీఎస్‌తో జట్టు కట్టేందుకు రాహుల్ ససేమీరా అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో జేడీఎస్ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని కూడా ఆయన ఆరోపించారు. ఎన్నికల ఫలితాల అనంతరం సోనియా ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన గులాం నబీ ఆజాద్ దేవే గౌడ, కుమారస్వామిలకు కాంగ్రెస్ ఆఫర్‌ను చెప్పి, ఒప్పించడంలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా కుమారస్వామి అభ్యర్థిత్వాన్ని బలపర్చుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడంతో ఒక్కసారిగా కన్నడనాట రాజకీయాలు వేడెక్కాయి. అయితే, 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తులకు సై అంటే పార్టీలన్నీ ప్రధానమంత్రిగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుంటాయా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనంతరం సోనియా గాంధీ తిరిగి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని రిపోర్టులో ఉంది. -
వందకోట్లు.. మంత్రి పదవి.. సంచలన వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో సాగుతున్న ప్రలోభాల పర్వంపై జేడీఎస్ అధినేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 100 కోట్లు, కేబినెట్ మంత్రి పదవి ఆఫర్ చేస్తుందని ఆయన తెలిపారు. బుధవారం బెంగళూరులోని ఓ హోటల్లో జరిగిన జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘ఆపరేషన్ కమల్’ విజయవంతమైందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. బీజేపీ తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేను లాక్కుంటే.. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కుంటామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేల బేరసారాలకు తెరతీసేలా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సూచించారు. ఉత్తరాదిలో విజయవంతంగా సాగిన బీజేపీ అశ్వమేధ యాగానికి కర్ణాటకలో ఫుల్స్టాప్ పడిందని, కర్ణాటక ఫలితాలు బీజేపీ అశ్వమేధ యాగాన్ని అడ్డుకున్నాయని కుమారస్వామి వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రసక్తే లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. జేడీఎస్‌లో చీలిక వస్తుందని తప్పుడు ప్రచారం చేశారని, తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రచారం వల్ల బీజేపీకి 104 స్థానాలు రాలేదని, సెక్యూలర్ ఓట్లు చీలడం వల్లే ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చాయని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మోదీ, బీజేపీ గెలుపు కాదని అన్నారు. బీజేపీ అధికారం కోసం వెంపర్లాడుతోందని, ప్రధాని మోదీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆయన స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీని చీల్చాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. అధికార బలంతో ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని, ఐటీ దాడులు చేయిస్తూ.. వారిని ఆందోళనకు గురిచేయాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు. మరికాసేపట్లో ఆయన రాష్ట్ర గవర్నర్‌ను కలువనున్నారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయనకు ఇచ్చి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు. బీజేపీతో టచ్‌లో ఉన్నారని భావిస్తున్న దేవెగౌడ కొడుకు రేవణ్ణ కూడా జేడీఎస్ శాసనసభాపక్ష భేటీలో పాల్గొనడం గమనార్హం. జేడీఎస్‌లో ఎలాంటి చీలిక లేదని, పార్టీ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నామని రేవణ్ణ తెలిపారు. ఇక ఈ భేటీకి ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు మాత్రం హాజరుకాలేదు. -
ఇదీ బీజేపీ ప్రణాళిక!
కర్ణాటకలో గత ఎన్నికల్లో 40 సీట్లలో గెలిచిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గరకు రావటానికి చాలా కష్టపడింది. కాంగ్రెస్ అహిందా వ్యూహానికి దీటుగా ఓటర్లను తమవైపునకు ఆకర్షించటంలో బీజేపీ, ఆరెస్సెస్ పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాయి. సాంస్కృతిక జాతీయవాదం పేరుతో దాదాపు వేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు రాష్ట్రంలోని 56వేల పోలింగ్ కేంద్రాల బాధ్యతలను తీసుకున్నారు. వీరంతా తమకు అనుకూలంగా ఉండే పోలింగ్‌బూత్‌కు ఓటర్లను రప్పించే బాధ్యతను తీసుకోవటం బీజేపీ సీట్ల సంఖ్య పెరగటానికి కారణమైంది. కర్ణాటక కాకుండా బయట రాష్ట్రాలనుంచి కూడా దాదాపు 50వేల మంది స్వయం సేవకులు కర్ణాటకలో పనిచేశారు. మోదీ దూకుడు: రాష్ట్రవ్యాప్తంగా మోదీ ఎన్నికల ర్యాలీలు 15వరకుంటాయని మొదట నిర్ణయించారు. ప్రధాని ప్రచారం దూకుడుగా సాగటం, ప్రజల్లో స్పందనను గమనించిన పార్టీ ముఖ్య నేతలు ఈ ర్యాలీల సంఖ్యను 21కి పెంచారు. బీజేపీ అభద్రతాభావానికి గురై ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు అనుకున్నారు. అయితే, మోదీ రెండు రాత్రులు బెంగుళూలో బసచేసి అదనంగా 6ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడం బీజేపీకి పోలింగ్‌కు రెండు రోజులు ముందు మంచి ఊపునిచ్చింది. ప్రధాని ర్యాలీలు చివరి క్షణం వరకూ ఎటూ తేల్చుకోని ఓటర్లను బీజేపీ వైపు మళ్లించాయి. అప్పటి వరకూ కాంగ్రెస్‌కే మొగ్గు ఉందని అంచనావేసిన మీడియా కూడా మోదీ సభలు, ప్రసంగాలతో బీజేపీ విజయావకాశాలూ పెరిగాయని చెప్పింది. ర్యాలీలు జరిపి ప్రాంతాల ప్రముఖులు, సాంఘిక, ధార్మిక నేతల మాటను ప్రధాని ఉటంకిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. లింగాయత్ ధర్మ స్థాపకుడైన బసవన్న ప్రవచనాలతో కన్నడ ప్రజలకు దగ్గరయ్యారు. మోదీ+షా+ఆరెస్సెస్= బీజేపీ నాలుగేళ్లుగా బీజేపీ దేశవ్యాప్త విస్తరణ రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు, సిద్ధాంతపరమైన భావజాలాన్ని, మద్దతును అందించే ఆరెస్సెస్ వెన్నుదన్ను, ఎన్నికల సందర్భంగా అనుసరించే పకడ్బందీ ప్రచారవ్యూహాలు, ప్రధాన నరేంద్ర మోదీ సమ్మోహనశక్తి, అమిత్‌షా వ్యూహాలలు వెరసి బీజేపీ సర్వశక్తిమంతంగా తయారైంది. నాలుగేళ్లుగా సానుకూల పురోగతి 2014కు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటకీ.. ఆ తర్వాతి కాలంలో తన పట్టును దేశవ్యాప్తంగా పెంచుకుంది. 2014 మే తర్వాత 20 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో, దాదాపు పాతికేళ్ల పాటు సీపీఎంకు కంచుకోటగా ఉన్న త్రిపురలోనూ బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. హరియాణా, మహారాష్ట్ర (శివసేనతో కలిసి), జార్ఖండ్‌లలో మొదటిసారిగా బీజేపీ అధికారం చేపట్టింది. జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా మారింది. ఢిల్లీలో ఓడినా.. బిహార్‌లో కాస్త ఆలస్యంగానైనా నితీశ్‌తో కూటమికట్టింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్లలో బీజేపీ అధికారాన్ని సాధించింది. -
మారుమోగుతున్న మోదీ నామస్మరణ
-
సిద్ధూ సర్కార్‌కు కౌంట్‌డౌన్ : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూర్ : సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలక కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఆయన కోరారు. తాను సుపరిపాలన అందచేస్తానని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. షికార్పూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. కాగా సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, అందుకే పోలింగ్ శాతం పెరుగుతోందని బీజేపీ సీనియర్ నేత సదానందగౌడ అన్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారన్నారు. యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మే 15న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. -
‘కాబోయే కర్ణాటక ముఖ్యమంత్రి ఆయనే’
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆయన గురువారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాదామిలో భారీ రోడ్డు షోలో ప్రసంగించారు. సీఎం చాముండేశ్వరీలో ఎప్పుడో ఓడిపోతాననే భయంతో బాదామిలో పోటీ చేశారు. చాముండేశ్వరీలోనే కాదు, బాదామిలో బీజేపీ రోడ్డు షోకు పెద్ద సంఖ్యలో జనం వచ్చిన తీరు చూస్తుంటే అక్కడ,ఇక్కడ రెండింటిలోను సీఎం సిద్ధరామయ్యకు ఓటమి తథ్యం అని అమిత్‌షా జోస్యం చెప్పారు. రెండు నియోజకవర్గాల్లో సీఎం ఓటమి చెందడంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్‌పార్టీని జనం తిరస్కరిచండంతో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందన్నారు. తాను నెల రోజులుపైగా కర్ణాటకలో అన్ని జిల్లాలో పర్యటించానని ప్రతి జిల్లాలో మంచి బీజేపీకి జనం నీరాజాలు పలికారని, చివరి రోజు సీఎం పోటీ చేస్తున్న బాదామి రోడ్డు షోలో పాల్గొంటే ఇక్కడ జనం చేస్తుంటే సీఎం ఓటమి ఖాయమని తేలిపోయింది,తమ పార్టీ అభ్యర్థి శ్రీరాములు భారీ మెజార్టీతో గెలుపొందుతారనే విశ్వాసం ఏర్పడిందన్నారు. సీఎం సిద్ధరామయ్య మరో నాలుగు రోజులు మాత్రమే సీఎం కుర్చీలో ఉంటారని,ఆ తర్వాత తమ పార్టీ నేత, యాడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు. యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేంద్రం నుంచి కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని,దేశంలోనే కర్ణాటకను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లుతామన్నారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి జనం బుద్ధి చెప్పాలని పిలపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ సీఎంలు యడ్యూరప్ప, జగదీష్‌శెట్టర్, బీజేపీ అభ్యర్థి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ..స్వాతంత్ర్య భారతదేశంలో అత్యంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఘాటుగా విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు కర్ణాటకలోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలను తగ్గించిందని పేర్కొన్నారు. కానీ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను నిలువరించడంలో విఫలమైందన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. కర్ణాటక అభివృద్ధి, రాజధాని బెంగుళూరుపై ఆధారపడి ఉందని, కానీ బెంగుళూరుకు సిద్ధరామయ్య సర్కార్ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. -
మోదీ రాకతో బీజేపీ వైపు మొగ్గు
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : నడి వేసవి ఎండలను కర్ణాటక ఎన్నికలు మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు తమ దిగ్గజ నేతలను ప్రచార రంగంలోకి దింపాయి. వారంతా ఏ ప్రాంతాన్నీ వదలకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, ఆ పార్టీ చీఫ్ అమిత్ షా, సీఎం అభ్యర్థి యడ్యూరప్ప.. కాంగ్రెస్ తరఫున పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రచార బాధ్యతలు నిర్వరిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా తాజాగా ప్రచార రంగంలోకి దిగారు. అ యితే, మోదీ ప్రచారం ప్రారంభించడానికి ముందు.. ప్రచారం ప్రారంభించిన తరువాత రాష్ట్రంలో పరిస్థితులు మారినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మోదీ రంగంలోకి దిగకముందు కాంగ్రెస్‌కు కాస్త అనుకూలంగా కనిపించిన వాతావరణం, మోదీ సుడిగాలి పర్యటనలతో బీజేపీ దిశగా మారిందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత వెల్లడైన పలు సర్వేలు కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించలేకపోయినా.. అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే, పరిస్థితి ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉందని, ఆ పార్టీనే అత్యధిక స్థానాల్లో విజయం సాధించవచ్చని పేర్కొంటున్నారు. మోదీ హవా: నెల క్రితం కొన్ని ఏజెన్సీలు సర్వేలు నిర్వహించాయి. ఇవన్నీ దాదాపు ఒకే రకమైన ఫలితాల్ని అంచనావేశాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో హంగ్ తప్పదని స్పష్టం చేశాయి. రాష్ట్రంలో 41 శాతం ఓటర్లు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తే, బీజేపీ పక్షాన 33 శాతం, జేడీఎస్ వైపు 23 శాతం, తక్కిన 3 శాతం మంది ఇతరుల వైపు నిలిచినట్లు లెక్కలు చూపాయి. కాంగ్రెస్ 95–100, బీజేపీ 75–85, జేడీఎస్ 35–41 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తేల్చాయి. అయితే, వారం రోజుల క్రితం మోదీ తన రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 13 ప్రచార సభల్లో పాల్గొన్నారు. మరో 8 ర్యాలీల్లో పాల్గొననున్నారు. పాల్గొన్న ప్రతీ సభలోను కాంగ్రెస్‌పై, ఆ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై.. తనదైన శైలిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. వక్కలిగ ఓట్ల కోసం జేడీఎస్ అధినేత దేవెగౌడపై ప్రశంసలు గుప్పించారు. మోదీ ప్రసంగాలకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.అలాగే, ఇప్పటికే అమిత్ షా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి వ్యూహాలను సిద్ధం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రసంగాల్లో మోదీపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. మోదీ తాజా ప్రచార సభల అనంతరం రాష్ట్రంలో మొగ్గు బీజేపీ వైపు కనిపిస్తోందని, బీజేపీ స్థాయిలో కాంగ్రెస్ ఆకట్టుకోలేకపోతోందని భావిస్తున్నారు. మోదీ సంధిస్తున్న విమర్శనాస్త్రాలకు రాహుల్ దీటుగా స్పందించలేక పోతున్నారంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ కంటే సిద్ధరామయ్యే ‘స్టార్ క్యాంపెయినర్’ అని కొందరు కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. 2014 ఎన్నికల్లో.. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారాన్ని దక్కించుకుంది. అయితే, 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారానికి మోదీ వచ్చారు. ఏడాది క్రితం కాంగ్రెస్‌కు పట్టం కట్టిన కన్నడ ఓటర్లు 2014లో 28 ఎంపీ స్థానాల్లో 17 స్థానాల్లో బీజేపీని గెలిపించారు. కాంగ్రెస్ 9, జేడీఎస్ 2 సీట్లు మాత్రమే గెలిచాయి. దక్షిణాదిలో బీజేపీ గెలిచిన 21 స్థానాల్లో.. 17 కర్ణాటకలోవే. -
మోదీ గొప్ప మాటకారి
విజయపుర/సాక్షి, బళ్లారి/బెంగళూరు: ప్రధాని మోదీ గొప్ప నటుడిలా మాట్లాడతారనీ, కానీ ఒట్టి మాటలతో దేశం కడుపు నిండదని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ మంచి వక్తేననీ, మాటలతో ప్రజల కడుపు నిండేలా ఉంటే మోదీ మరిన్ని ప్రసంగాలు చేయాలని తాను కోరుకునేదానినని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటకలోని విజయపుర జిల్లా బబలేశ్వర్లో ఆమె మాట్లాడుతూ ‘మోదీకి కాంగ్రెస్ ముక్త భారత్ అనే భూతం పట్టుకుంది. నాలుగేళ్లుగా ఆయన ప్రధాని పదవిలో ఉంటూ ఎక్కడికి వెళ్లినా అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన సాధించిందేమిటంటే మా ప్రభుత్వం చేసిన మంచిని చెరిపేయడం. ఉత్తుత్తి మాటలు ప్రజలకు మేలు చేస్తాయా? పేదరిక నిర్మూలన జరుగుతుందా? యువతకు ఉద్యోగాలు వస్తాయా? ఎందుకూ పనికిరాని మాటలను మాట్లాడుతూ దేశ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న మోదీకి కర్ణాటక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పండి’ అని సోనియా నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్‌నే కాదు.. మోదీ తన ముందు నిలబడిన ఎవరినీ సహించలేరు. ఆయన ఎక్కడికెళితే అక్కడ తప్పులు, అబద్ధాలు మాట్లాడటాన్ని చూసి దేశం విస్తుపోతోంది. చరిత్రను వక్రీకరిస్తారు. స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం గొప్పగొప్ప స్వాతంత్య్ర సమరయోధులను పావులుగా వాడుకుంటారు. ఇప్పటి సమస్యల గురించి మోదీ మాట్లాడరు. ఎన్నికల్లో ఆయన చేసిన వాగ్దానాల గురించి నోరెత్తరు. అన్నీ అనవసర విషయాలనే ప్రస్తావిస్తారు. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి వాడాల్సిన భాషేనా అసలు అది’ అని సోనియా తీవ్రస్థాయిలో మోదీపై విరుచుకుపడ్డారు. -
కాంగ్రెస్ ఓటమి ఖాయం!
సాక్షి, బళ్లారి: రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సిద్ధపడిన కాంగ్రెస్ పార్టీ అందుకు ఇప్పటికే సాకులు వెతకడం ప్రారంభించిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ సమాజాన్ని విడదీసి కుల విషాన్ని వ్యాపింపజేయాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను కన్నడ ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించి గుణపాఠం చెప్పడం తథ్యమని పేర్కొన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు లేని మంత్రి ఒక్కరూ లేరని విమర్శించారు. ఉత్తర కర్ణాటకలో లింగాయత్‌ల ప్రాబల్యం అధికంగా ఉన్న విజయపుర జిల్లాలోని సారవద్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న అంచనాలు, సర్వేలను కొట్టిపారేశారు. లింగాయత్‌లకు చేరువ కావడానికి తన ప్రసంగంలో పలుమార్లు వారి ఆరాధ్య దైవం, సంఘ సంస్కర్త బసవేశ్వరుడి పేరును ప్రస్తావించారు. కొడుకు వల్ల కాలేదు.. అందుకే తల్లితో ప్రచారం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నడిపించడంలో అధ్యక్షుడు రాహుల్ సమర్థతపై సొంత పార్టీలోనే అనుమానాలున్నాయని మోదీ పేర్కొన్నారు. ‘ఓ కాంగ్రెస్ నాయకుడి ఇంటర్వ్యూ చూశాను. కొడుకు(రాహుల్) వల్ల కర్ణాటకలో తాము గెలవలేమని వారు భావిస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థులు కనీసం డిపాజిట్ కాపాడుకోవడానికైనా తల్లి(సోనియా)తో ప్రచారం చేయిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో అవినీతి మరకలు లేని ఒక్క మంత్రి పేరైనా చెప్పాలని సీఎం సిద్దరామయ్యకు సవాలు విసిరారు. బసవేశ్వరుడి గడ్డపై అలా జరగదు.. విభజించు, పాలించు విధానమే కాంగ్రెస్ అభిమతమని, సోదరుల్లా ఉన్న ప్రజల మధ్య కొట్లాట పెట్టడమే ఆ పార్టీ లక్ష్యమని మోదీ మండిపడ్డారు. బసవేశ్వరుడు పుట్టిన ఈ గడ్డపై అలా జరగకుండా ప్రజలు అడ్డుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రతి ఒక్కరితో కలసి సాగాలని బసవేశ్వరుడు బోధించారు. కానీ కాంగ్రెస్ కులాలు, మతాల ప్రాతిపదికన చీలికలు తెస్తోంది. అదే వాళ్ల గేమ్ ప్లాన్. అయితే బసవేశ్వరుడు పుట్టిన ఈ నేల కులం పేరిట చీలిపోదని కాంగ్రెస్ నాయకులకు తెలియడం లేదు. కాంగ్రెస్‌ను గద్దె దించి కుల విషం వ్యాపించకుండా ప్రజలు అడ్డుకుంటారు’ అని లింగాయత్‌లకు మైనారిటీ కల్పిస్తూ తెచ్చిన ప్రతిపాదనను పరోక్షంగా తప్పుపట్టారు. -
ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం
సాక్షి, బెంగళూరు/పావగడ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధిస్తే ప్రధాని అయ్యేందుకు సిద్ధమని ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన మనసులో మాటను బయటపెట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అవుతారా? అని ప్రశ్నించగా.. ‘కాంగ్రెస్ సాధించే ఫలితాలపై అది ఆధారపడి ఉంటుంది.. ఒకవేళ అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిస్తే ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని చెప్పారు. తొమ్మిది నెలల వ్యవధిలో దేశ ప్రధాని కావాలన్న ఆకాంక్షను రెండోసారి రాహుల్ వెలిబుచ్చారు. గత సెప్టెంబర్‌లో అమెరికా పర్యటనలో భాగంగా బెర్కెలీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఉండేందుకు తాను సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ అధికారంలోకి రావడం ఖాయమని.. ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత బీజేపీకి మరోసారి అధికారం దక్కనివ్వదని రాహుల్ చెప్పారు. మోదీ మరోసారి ప్రధాని కాలేరని పూర్తి నమ్మకంతో ఉన్నానని పేర్కొన్నారు. ‘బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కన్నడనాట కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను బీజేపీ ప్రోత్సహిస్తోంది. జైలుకెళ్లి వచ్చిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. గాలి జనార్దన్‌రెడ్డి వర్గానికి 8 సీట్లు ఇవ్వడం దిగజారుడుతనానికి నిదర్శనం. ఉద్యోగ కల్పన ఎందుకు జరగడం లేదో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భూస్థాపితం కావడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశాం. యూపీలో వచ్చే ఏడాది బీజేపీ 10 స్థానాలకే పరిమితమవుతుంది’ అని చెప్పారు. ఓటమి భయంతోనే ప్రధాని మోదీ, అమిత్‌షా, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటకలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: రాహుల్ పావగడ పట్టణ సమీపంలో బాలాజీ మిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లా డుతూ.. ‘మోసం చేయకూడదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’ అన్న బసవణ్ణ సిద్ధాంతాలను ఐదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తు.చ. తప్పకుండా పాటించిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, ఎంపీ చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌ను ముంగేరీలాల్తో పోల్చిన ప్రధాన్ రాహుల్‌ను ఒకప్పటి దూరదర్శన్ సీరియల్లోని ప్రధాన పాత్రధారి ముంగేరీలాల్తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పోల్చారు. ‘పగటి కలలు కనకుండా ముంగేరీలాల్ను ఎవరైనా ఆపగలరా’ అంటూ పరోక్షంగా విమర్శించారు. ‘ముంగేరీలాల్ కే హసీన్ సప్నే’ సీరియల్లోని ఈ పాత్ర రోజువారీ ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు పగటికలలు కంటూ ఆనందించేవాడు. రాహుల్ పెద్ద పెద్ద కలలు కంటున్నారని, మొదట కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ఎద్దేవా చేశారు. -
కర్ణాటక ఎన్నికలు.. పాక్ కుట్ర!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాకిస్థాన్ రంగంలోకి దిగిందనే అనుమానాలను బీజేపీ వ్యక్తం చేస్తోంది. టిప్పు సుల్తాన్ 218 వర్ధంతి సందర్భంగా పాక్ గవర్నమెంట్ అఫీషియల్ ట్వీటర్ అకౌంట్లో శుక్రవారం రెండు పోస్టులు వెలిశాయి. టిప్పు అరివీర భయంకరుడని పేర్కొంటూ పాక్ వాటిల్లో ప్రశంసలు గుప్పించింది. దీంతో కుట్రకు తెరలేచిందని బీజేపీ ఆరోపిస్తోంది. ‘టిప్పు సుల్తాన్ అంతులేని జ్ఞాన సంపద ఉన్న వ్యక్తి. పులినే తన అధికర చిహ్నంగా చేసుకున్న ధైర్యశాలి. మైసూర్ టైగర్. బ్రిటీష్ సైన్యం ఎదుర్కొన్న అతి గొప్ప శత్రు సారధుల్లో ఆయన ఒకరు. మైనార్టీలను టిప్పు దయతో చూసేవారు. ఫ్రెంచ్ వారికి చర్చి నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారు. నక్కలాగా వందేళ్లు బతకటం కంటే.. సింహంలా ఒక్కరోజు బతికినా చాలని చాటిచెప్పిన వ్యక్తి. బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణను అడ్డుకునేందుకు సంధించబడ్డ చివరి బాణం’ అంటూ ప్రశంసలు గుప్పించింది. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని కూడా ట్వీటర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది కుట్రే: బీజేపీ.. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తోంది. ‘1947 ఆగష్టు 14 నుంచి తమ చరిత్ర మొదలైనట్లు పాకిస్థాన్ చెప్పుకుంటుంది. అలాంటిది ఉన్న పళంగా ఇంత ప్రేమ కురిపించటం ఏంటి? అన్నింటికి మించి భారతీయ చారిత్రక వారసత్వాన్ని పాక్ ఏనాడూ గుర్తు చేసుకోలేదు. కర్ణాటక ముస్లిం ఓటర్లను ప్రభావితం ఈ పని చేసిందనిపిస్తోంది’ అని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెబుతున్నారు. కాగా, టిప్పు జయంతి ఉత్సవాల విషయంలో కాంగ్రెస్ పార్టీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సిద్ధరామయ్య ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహించింది. Revisiting an important & influential historical figure, Tiger of Mysore - Tipu Sultan on his death anniversary. Right from his early years, he was trained in the art of warfare & had a fascination for learning. #TipuSultan pic.twitter.com/Izts0HKdgD — Govt of Pakistan (@pid_gov) 4 May 2018 -
‘కర్ణాటకలో తెలుగు ఓట్లు మావే’
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకుగానూ కర్ణాటక ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావులు స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారి ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడుతాయని మధుయాష్కీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి తీరుతుందని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తారన్నారు. 2019లో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో జరగనున్న ఎన్నికలపై కర్ణాటక ఫలితాలు ప్రభావం చూపుతాయని, ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకమని పేర్కొన్నారు. 'కర్ణాటక రాష్ట్ర జనాభా దాదాపు ఆరు కోట్లు, వీరిలో తెలుగు ప్రజలు కోటికి పైగా ఉన్నారు. తెలుగువారి ఓట్లు మా పార్టీకి కలిసొచ్చే అంశం, వారు కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని' పేర్కొన్నారు. 2004, 2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మధుయాష్కీ ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ విధానాల చాలా నష్టపోయారు: మురళీధర్ రావు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఎన్నికలపై స్పందిస్తూ... కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీపై నమ్ముతారని, వారి ఓట్లు తమ పార్టీకే వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ కన్నడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయింది. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా విస్మరించారు. కాంగ్రెస్ విధానాల వల్ల కన్నడ ప్రజలు చాలా నష్టపోయారు. వారి చర్యల వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తిగా నష్టపోయింది’ అని వివరించారు. -
కర్నాటక ఎన్నికలపై తెలుగు ఓటర్ల ప్రభావం
-
ఓటమి భయం.. బీజేపీ గుండెల్లో రైళ్లు..??
సాక్షి, బెంగళూరు : దక్షిణాదిలో ఇంకో దఫా పాగా వేసేందుకు తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తప్పదేమోననే భయం గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. బీజేపీ మిత్ర పక్షమైన ఆరెస్సెస్ నిర్వహించిన సర్వేలో బీజేపీకి 70 సీట్లకు మించి రావాని తేల్చిచెప్పడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మిగతా సర్వేలు కూడా దాదాపు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. ఆరెస్సెస్ సర్వే బహిర్గత విషయాన్ని బీజేపీ ఖండించినా..లోలోపల మాత్రం చాలా మదనపడుతోంది. ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగానే మోదీ ఎన్నికల పర్యటన షెడ్యూల్లో మార్పులు చేశారు. మొదటగా మే 1 నుంచి ఐదు రోజుల పాటు 15 ర్యాలీల్లో పాల్గొనాలకున్న మోదీ, తన పర్యటనను మరో నాలుగు జిల్లాలకు పెంచి మొత్తం 21 ర్యాలీల్లో పాలు పంచుకోనున్నారు. హంగ్ ఏర్పడే అవకాశాలు ఉండటంతో జేడీఎస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను బీజేపీ మొదలెట్టేసింది. అందుకే ఉడిపిలో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. దేవగౌడపై ప్రశంసల జల్లు కురిపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జేడీఎస్‌ను బీజేపీకి తోక పార్టీ అని విమర్శించినా స్పందించలేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో నేతల మధ్య మాటల యుద్ధాలు బాగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాను వేదిక చేసుకుని ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. మోదీ చరిష్మా, అమిత్‌షా వ్యూహం కర్ణాటక ఎన్నికల్లో ఫలిస్తాయో లేదో వేచి చూడాలి మరి. ఈ నెల 12న ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. మే 15 ఓట్ల లెక్కింపు జరగనుంది. -
కాంగ్రెస్‌వి హత్యారాజకీయాలు
సంతెమారనహళ్లి/ఉడుపి/చిక్కోడి: కర్ణాటక ఎన్నికల వాతావరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం మరింత వేడెక్కిస్తోంది. ఎన్నికలు మరో పదిరోజులు మిగిలున్న నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు ప్రారంభించిన మోదీ.. మొదటిరోజే కాంగ్రెస్‌పై తీవ్ర ఎదురుదాడి చేశారు. చామరాజనగర, ఉడుపి, బెళగావి జిల్లాల్లో ఏర్పాటుచేసిన మూడు బహిరంగ సభల్లో.. సీఎం సిద్దరామయ్యతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 15 నిమిషాలపాటు సిద్దరామయ్య సర్కారు ప్రజలకు ఏం చేసిందో అనర్గళంగా మాట్లాడాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. అప్పుడే కన్నడ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షుడి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. సిద్దరామయ్య హయాంలో కన్నడనాట హత్యారాజకీయాలు పెరిగాయని విమర్శించారు. ఓటమి భయంతోనే సీఎం చివరి నిమిషంలో రెండోచోట పోటీకి సిద్ధమయ్యారన్నారు. నచ్చిన భాషలో మాట్లాడండి చూద్దాం..! కన్నడ ప్రజలకు సిద్దరామయ్య సర్కారు చేసిన పనులను సొంతగా ఓ 15 నిమిషాలసేపు ఏ భాషలోనైనా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పాలని మోదీ సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిందీ, ఇంగ్లీష్లోనైనా లేదంటే తన తల్లి మాతృభాషలోనైనా సరే (సోనియా ఇటలీ మూలాలను ప్రస్తావిస్తూ) 15 నిమిషాలసేపు కర్ణాటకలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను పేపర్‌మీద రాసుకుని కాకుండా సొంతంగా చెప్పాలని సవాల్ చేస్తున్నా. దీని ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలు మీ మాటల్లో ఎంత సత్తా ఉందో అర్థం చేసుకుంటారు’ అని చామరాజనగర జిల్లా సంతెమారనహల్లిలోని ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు. తనను పార్లమెంటులో 15 నిమిషాలపాటు మాట్లాడనిస్తే ప్రధాని తన సీట్లో కూర్చోకుండా చేస్తానని రాహుల్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన 15 నిమిషాలు మాట్లాడటమే గొప్ప విషయం. ఆయన మాట్లాడేది వింటే ఎవరూ కూర్చోలేరు. రాహుల్.. మీముందు నేను కూర్చోలేను. మీరు చాలా గొప్పవాళ్లు (నామ్‌దార్), నేనో పనివాడిని (కామ్దార్) మాత్రమే’ అని మోదీ పేర్కొన్నారు. దేశం గర్వపడే ఇంజనీర్ విశ్వేశ్వరయ్య పేరును కూడా రాహుల్ సరిగా పలకలేరని ఎద్దేవా చేశారు. ఐదుసార్లు విశ్వేశ్వరయ్య పేరు పలకాలన్నారు. ప్రశ్నిస్తే చంపేస్తారా? అభివృద్ధితోపాటు హిందుత్వ కార్డునూ మోదీ ప్రయోగించారు. సిద్దరామయ్య ప్రభుత్వ హయాంలో దాదాపు 25 మంది బీజేపీ కార్యకర్తలు కన్నడ రాష్ట్రంలో హత్యలకు గురయ్యారని ఉడుపి సభలో పేర్కొన్నారు. జిహాదీ శక్తులే బీజేపీ కార్యకర్తలను చంపేశాయని.. వారికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందని ఆయన విమర్శించారు. ‘వారు (బీజేపీ కార్యకర్తలు) చేసిన నేరమేంటి? మీ ఆలోచలను వ్యతిరేకించటమే పాపమా? కన్నడ ప్రజలకోసం వారి గొంతుక వినిపించారు. మేం వ్యాపారానుకూల వాతావరణాన్ని నిర్మిస్తే.. మీరు హత్యలు చేసేందుకు అనుకూల వాతావరణాన్ని నిర్మించారు’ అని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ తీవ్రవాద ఆలోచనలున్న పార్టీని కర్ణాటకతోపాటు దేశం నుంచి పారద్రోలాలన్నారు. ఈ వ్యాఖ్యలకు ప్రజల నుంచి ‘అవును, పారదోలాల్సిందే’ అని భారీ స్పందన కనిపించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ సూచించారని గుర్తుచేసిన మోదీ.. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి గాంధీ చివరి కలను నిజం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అట్కానా.. లట్కానా.. భట్కానా..! కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ తర్వాత కూడా పేదలు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగానే నిలిచారని.. తమ ప్రభుత్వం వచ్చాకే పేదలకు అకౌంట్లు ఇచ్చామని సంతెమారనహల్లి సభలో మోదీ పేర్కొన్నారు. ‘అప్పట్లో పేదలకు అకౌంట్లు ఉండేవి కాదు. అసలు వారికి బ్యాంకుల గురించి ఆలోచనే లేదు. ప్రధాన ఆర్థిక వ్యవస్థనుంచి వారు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కొందరు వ్యక్తులు కలిసి బ్యాంకులను దోపిడీ చేశారు. కానీ యువత, రైతులు,పేదలకు మాత్రం రుణాలివ్వలేదు’ అని మోదీ విమర్శించారు. ఇసుక మాఫియాకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఉడుపిలో పలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ సర్కారు కావాలనే నిలిపివేసిందని మోదీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవటం (అట్కానా), ఎటూ తేల్చకుండా ఉంచటం (లట్కానా), వాస్తవాలను తప్పుదారి పట్టించటం (భట్కానా) కాంగ్రెస్‌కు అలవాటైందన్నారు. విభజించి పాలిస్తున్నారు ‘చేప నీటి బయట ఎలా బతకలేదో.. కాంగ్రెస్ కూడా అధికారం లేకుండా ఉండలేదు. విభజన రాజకీయాలు చేసైనా అధికారాన్ని నిలుపుకోవాలనుకుంటోంది’ అని బెళగావి జిల్లా చిక్కోడిలో జరిగిన సభలో మోదీ విమర్శించారు. సిద్దరామయ్య ప్రభుత్వం లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పిస్తూ ప్రతిపాదనలు పంపటంపై మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ సోదరుల మధ్యన, ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టిస్తోంది. కులవాదాన్ని ప్రోత్సహించటం ద్వారా ఉన్నత, పేద వర్గాల మధ్య అగాధాన్ని పెంచుతోంది. అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. బీజేపీ రిజర్వేషన్లను తీసివేస్తుందని దుష్ప్రచారం చేస్తోంది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఈ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పనులు జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. ‘2+1’ ఫార్ములాపై.. కుటుంబ రాజకీయాలపై మోదీ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య రెండు సీట్లనుంచి పోటీచేయటంతోపాటు.. ఒక స్థానం నుంచి తన కుమారుడిని పోటీలోకి దించటాన్ని 2+1 ఫార్ములాగా పోల్చారు. సిద్దరామయ్యను ‘కాంగ్రెస్ కుటుంబ రాజకీయాల’ కన్నడ వర్షన్‌గా పేర్కొన్నారు. చాముండీశ్వరిలో ఓడిపోతానని తెలియటంతోనే సిద్దరామయ్య పట్టుబట్టి బాదామి నుంచీ నామినేషన్ వేశారన్నారు. ఈ విమర్శలను సిద్దరామయ్య తిప్పికొట్టారు. కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు మోదీయే ‘2+1’ విధానంతో ముందుకెళ్తున్నారన్నారు. ‘ఓడిపోతామనే భయంతో.. ఇద్దరు రెడ్లు (గాలి సోదరులు ఇద్దరిని బరిలో దించటం), ఒక యెడ్డీ (సీఎం యడ్యూరప్ప)లను (2రెడ్డి+1యెడ్డీ) ఫార్ములా సాయం తీసుకుంటున్నారు’ అని విమర్శించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ కూడా రెండుచోట్లనుంచి పోటీచేసిన విషయాన్ని మరిచిపోయినట్లున్నారన్నారు. దేవెగౌడపై ప్రశంసలు మాజీ ప్రధాని, జేడీఎస్ సుప్రీం దేవేగౌడపై మోదీ ప్రశంసల వర్షం కురిపించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. జేడీఎస్‌కు పట్టున్న మైసూరు ప్రాంతంలో జరిగిన ప్రచారంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘15–20 రోజుల క్రితం రాహుల్ గాంధీ ఓ సభలో దేవేగౌడపై విమర్శలు చేశారని విన్నాను. అత్యంత సీనియర్ నేత, గౌరవనీయుడు అయిన దేవెగౌడ అంటే నాకు గౌరవం. ఆయన్ను విమర్శించటమేనా మీ సంస్కృతి? ఇది మీ అహంకారానికి నిదర్శనం. మీ జీవితం (కాంగ్రెస్ చీఫ్‌గా) ఇప్పుడే మొదలైంది. కానీ దేవెగౌడ.. దేశంలోని గొప్ప రాజకీయ నేతల్లో ఒకరు. మీరు ఆయన్ను అవమానించారు’ అని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడే ఇలా మాట్లాడితే మున్ముందు మరెన్ని విమర్శలు చేస్తారోనని.. ఇలాంటి అహంకార నేతతో ప్రజాస్వామ్యానికి ప్రమాదమేనని ప్రధాని అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మద్దతు రాదని.. జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉందని పలు సర్వేలు పేర్కొన్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
ఒక రాష్ట్రం.. అనేక ప్రపంచాలు..!
దక్షిణాదికి రాజమార్గమని భారతీయ జనతా పార్టీ.. ఐదేళ్ల పాలనకు ఇంకోసారి పొడిగింపు కావాలని కాంగ్రెస్.. చేజారిన అధికారాన్ని కింగ్‌మేకర్ రూపంలోనైనా సాధించాలని జేడీఎస్.. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రం ఇదీ..! పోలింగ్ రోజు(మే12) సమీపించేకొద్దీ.. పోరు ఉత్కంఠభరితమవుతూండగా ఓటరు నాడి పట్టడం మాత్రం ఎవరి తరమూ కావడంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఎన్నికలు.. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ నినాదం ‘ఒకరాష్ట్రం.. అనేక ప్రపంచాలు’ అనే చందంగా ఉందంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆరు భిన్న ప్రపంచాలైన కర్ణాటకలో ఏ పార్టీ అదృష్టం ఎలా ఉందో? బ్రిటిష్ పాలనా కాలంలో బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నిజాం పాలనలోని కన్నడ ప్రాంతాలు, కొడగు, పాత మైసూరు ప్రాంతాలను కలిపి కర్ణాటక రాష్ట్రం ఏర్పాటైందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తాన్ని బొంబాయి, కోస్తా, హైదరాబాద్, పాత మైసూరు, మధ్య కర్ణాటక, బెంగళూరు అర్బన్ అనే ఆరు ప్రాంతాలుగా విభజించి చూడటం ఆనవాయితీ. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో సీట్లవారీగా చూస్తే పాత మైసూరు, బొంబాయి కర్ణాటక పెద్ద ప్రాంతాలు. కోస్తాలో బీజేపీ ఆధిక్యం నిలిచేనా? కర్ణాటక సముద్ర తీర ప్రాంతాన్ని కరావళి అంటారు. ఉడుపి, ఉత్తర, దక్షిణ కన్నడ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం 30 ఏళ్లుగా హిందుత్వ ప్రయోగశాలగా మారిందన్నది విశ్లేషకుల అంచనా. హిందూ, ముస్లిం, క్రైస్తవ జనాభా దాదాపు సమానంగా ఉన్న కరావళిలో మత ఘర్షణలు, ఉద్రిక్తతలు ఎక్కువే. ఫలితంగా కాషాయ పక్షం వేగంగా వేళ్లూనుకుంది. ఈ కారణంగానే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఘనవిజయం సాధించింది. అయితే అంతకు ఏడాది ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చతికిలపడింది. యడ్యూరప్ప, బి.శ్రీరాములు వంటివారు బీజేపీ నుంచి వేరు పడి సొంత పార్టీలు పెట్టుకోవడం ఇందుకు కారణం. అప్పట్లో ఈ ప్రాంతంలోని మొత్తం 19 స్థానాల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకుంది. యడ్యూరప్ప, శ్రీరాములు వంటివారిప్పుడు మళ్లీ పార్టీలో చేరిపోవడం.. ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసే కేంద్రమంత్రి అనంత్కుమార్హెగ్డే, మాజీ మంత్రి శోభా కరండ్లాజే, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తదితరుల సాయంతో ఈ ప్రాంతంలో మళ్లీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. కాంగ్రెస్ పాలనలో సంఘ్ కార్యకర్తలు 24 మంది హత్యకు గురయ్యారనే విషయాన్ని చర్చకు తెస్తూ హిందువుల ఓట్లు సాధించేందుకు అమిత్‌షా తదితరులు ప్రయత్నిస్తున్నారు. బొంబాయి కర్ణాటకలో గెలుపెవరిది? లింగాయతుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న బొంబాయి కర్ణాటక ప్రాంతంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఈ ప్రాంతం బీజేపీ కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతలు సొంత కుంపటి పెట్టుకోవడంతో నష్టపోయింది. మొత్తం 50 స్థానాలున్న ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 31 స్థానాలు సాధించగా బీజేపీ 13 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈసారి అంతేస్థాయిలో సీట్లు గెలుపొందేందుకు కాంగ్రెస్ లింగాయతులను ప్రత్యేక మతంగా గుర్తించాలన్న డిమాండ్‌కు ఓకే చెప్పింది. అయితే లింగాయతుల్లోని ఒకవర్గం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఆర్థిక వెనుకబాటు, కరువు, రైతు ఆత్మహత్యలు, మహాదాయి నదీ జలాల వివాదం, నిరుద్యోగం, చెరకు ధర వంటివి ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలని అంచనా. ఇవే సమస్యల పరిష్కారానికి కర్ణాటక రైతు సంఘం వందలాది మంది రైతులతో ఆదివారం రాష్ట్రపతిని కలిసేందుకు వెళుతుండటం ఇక్కడ ప్రస్తావనార్హం. కేంద్ర సర్కారు ఇప్పటి వరకూ సరిగా స్పందించకపోవడం వల్ల కలిగే నష్టమెంతన్నది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కంటే బీజేపీ రెండు మూడు సీట్లు ఎక్కువే సాధిస్తుందన్నది సర్వేల సారాంశం. హైదరాబాద్ కర్ణాటక పయనం ఎటు? రాష్ట్రంలో మరో వెనుకబడిన ప్రాంతం హైదరాబాద్ కర్ణాటక. కాంగ్రెస్‌కు కొద్దోగొప్పో ఆశలు కల్పిస్తున్న ప్రాంతమిదే. 2012లో యూపీఏ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రాజ్యాంగంలోని 371–జే ద్వారా ప్రత్యేక హోదా కల్పించడం దీనికి కారణం. దీని వల్ల ఎవరికి ఎంత ప్రయోజనం కలిగిందన్నది చర్చనీయాంశమే అయినా గతంకంటే తాము మెరుగైన స్థితిలో ఉంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య. 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని మొత్తం 40 స్థానాల్లో కాంగ్రెస్‌కు 23, బీజేపీకి ఐదు సీట్లు దక్కాయి. జేడీఎస్‌కు ఐదు సీట్లు లభించాయి. కేజీపీ మూడు స్థానాల్లో గెలిచింది. లింగాయతులు చెప్పుకో దగ్గసంఖ్యలో ఉన్న హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందో. మధ్య కర్ణాటక మొగ్గు ఎటు? చిత్రదుర్గ, దావణగెరె, చికమగళూరు, శివమొగ్గ జిల్లాలున్న మధ్య కర్ణాటకలో లింగాయతుల ప్రభావం కూడా ఉంది. 2008లో బీజేపీ అధికారం చేపట్టేందుకు ఆ పార్టీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప సొంత జిల్లా శివమొగ్గతో కూడిన మధ్య కర్ణాటక కీలకపాత్ర పోషించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 13 సీట్లు దక్కించుకున్నాయి. గత ఎన్నికల్లో యడ్యూరప్ప సొంతంగా పార్టీపెట్టుకోవడంతో కాంగ్రెస్ తన సీట్ల సంఖ్యను 15కు పెంచుకుంది. బీజేపీ మూడింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జేడీఎస్ ఆరు చోట్ల విజయం సాధించింది. లింగాయతులకు ప్రత్యేక గుర్తింపు ప్రభావం ఎంతన్నది స్పష్టంగా తెలియడంలేదు. చిత్రదుర్గలో అనేక హిందూ వర్గాల మఠాలున్నాయి. వీటి ప్రభావం ఓటర్లపై ఉంటుందనే అభిప్రాయంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నుంచి అమిత్‌షా వరకూ మఠాధిపతులను కలవడానికి ’క్యూ’ కడుతున్నారు. జేడీఎస్ అడ్డా.. పాత మైసూరు! పూర్వపు మైసూరు సంస్థానమైన ఈ ప్రాంతంలో మైసూరు, కొడగు, మండ్య, హాసన్, చామరాజనగర, తుమకూరు, చిక్కబళ్లాపుర, కోలారు, బెంగళూరు గ్రామీణ తదితర జిల్లాలున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ, అతడి సామాజిక వర్గమైన ఒక్కళిగల ప్రాబల్యం ఎక్కువ. కాంగ్రెస్‌కు దళితులు, బీసీలు, అల్పసంఖ్య వర్గాల్లో పలుకుబడి ఎక్కువ. ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్యే. ఇక్కడ బీజేపీకి బలం అంతంతే. మొత్తం 61 స్థానాలకుగానూ 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 27, జేడీఎస్ 25 సీట్లు దక్కించుకున్నాయి. బీజేపీ నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది. మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి సహా దేవెగౌడ కుటుంబ సభ్యులు జేడీఎస్ తరఫున ఈ ప్రాంతం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఒక్కళిగ వర్గానికి చెందిన మాజీ సీఎం ఎస్ఎం కృష్ట కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి చేరడంతో ఈసారి జేడీఎస్ ప్రభావాన్ని తగ్గించగలమని బీజేపీ భావిస్తోంది. అయితే తన అనుచరులకు సీట్లు దక్క లేదన్న కారణంతో ఎస్ఎం కృష్ణ అంత చురుకుగా పనిచేయడం లేదని వినిపిస్తోంది. ఇదే ప్రాంతంలోని చాముండేశ్వరి స్థానం నుంచి సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. అత్యంత సంపన్న అభ్యర్థిగా వార్తలకెక్కిన కాంగ్రెస్ మంత్రి(ఒక్కళిగ నేత) డీకే శివకుమార్ కూడా ఈ ప్రాంతంలోని కనకపుర నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే ఆయన సీఎం అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. బీజేపీకి బలం.. బెంగళూరు అర్బన్ రాష్ట్ర రాజధాని బెంగళూరు కొన్నేళ్లుగా బీజేపీకి బలమైన కేంద్రంగా మారింది. అందుకే అవినీతి ఆరోపణలు, పరిపాలన లోపాలు వంటి అనేక అననుకూల పరిస్థితుల్లో కూడా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 28 సీట్లకుగానూ 12 స్థానాలు సాధించగలిగింది. కాంగ్రెస్ 13 సీట్లు కైవసం చేసుకుంది. ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు, కలుషితమౌతున్న సరస్సులు, నానాటికి తీసికట్టుగా మారుతున్న రోడ్లు, వానాకాలంలో వరదలు, క్షీణిస్తున్న శాంతి భద్రతలు వంటి అనేక విషయాలు సిద్దరామయ్య సర్కార్‌కు సవాల్‌గా మారాయి. పేదలు, మైనారిటీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా క్యాంటీన్ వంటి అనేక ’భాగ్యా’ పథకాలు, ఇతర సంక్షేమ చర్యల ద్వారా కాంగ్రెస్ బెంగళూరులో గట్టెక్కగలనని భావిస్తోంది. హిందీ వ్యతిరేకత, కన్నడ ఆత్మగౌరవం వంటి ప్రచారాంశాలతో మంచి ఫలితాలు సాధించడానికి సిద్దరామయ్య కృషి చేస్తున్నారు. బీటీఎం లేఅవుట్ నుంచి కాంగ్రెస్ హోంమంత్రి ఆర్.రామలింగారెడ్డి, ఆయన కూతురు సౌమ్యారెడ్డి జయనగర నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై బెంగళూరు మాజీ మేయర్ జి.పద్మావతి, బీజేపీ సీనియర్ నేత సురేష్‌కుమార్‌తో రాజాజీనగర్(ఎస్సీ)లో తలపడుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ మేయర్ ఆర్.సంపత్‌రాజ్ సీవీరామన్నగర్(ఎస్సీ) నుంచి పోటీకి దిగారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తెలుగు నేత కట్టా సుబ్రమణ్యంనాయుడు శివాజీనగర్ నుంచి బీజేపీ టికెట్‌పై మరోసారి పోటీ చేస్తున్నారు. -
రాహుల్ గాంధీకి మోదీ ఫోన్
బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం రాహుల్ గాంధీ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రాహుల్ ఓ విమానంలో బయలుదేరారు. ఉదయం 10.45 గంటలకు విమానంలోని ఆటోపైలెట్ మోడ్ ఒక్కసారిగా ఆగింది. దీంతో విమానం ఒక్కసారిగా గాల్లో పక్కకు ఒరిగిపోయి వేగంగా కిందకు జారిపోయింది. వెంటనే స్పందించిన పైలెట్ విమానాన్ని మాన్యువల్ మోడ్‌లోకి తీసుకొచ్చి హుబ్బలి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదం అనంతరం రాహుల్‌కు మొట్టమొదటగా ఫోన్ చేసింది ప్రధాని నరేంద్ర మోదీనేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తీరు, రాహుల్ బాగోగుల గురించి ఆరా తీశారని సమాచారం. రాహుల్‌కు జరిగిన ప్రమాద విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోలేదనడానికి ప్రధాని స్వయంగా రాహుల్‌కు ఫోన్ చేయడమే నిదర్శనమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏవియేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. రాహుల్‌కు ఎస్పీజీ కమాండోస్‌తో హై లెవల్ సెక్యూరిటీ కల్పిస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ ఘటన వెనుక కుట్ర దాగిఉండొచ్చని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై రాహుల్ అనుచరుడు కౌశల్ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కర్ణాటక డీజీపీ నీల్మణి ఎన్.రాజుకు లేఖ రాశారు. -
‘దిగుమతి నేతలే దిక్కయ్యారు’
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లను బీజేపీ ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో బీజేపీకి నాయకులే లేరని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప కేవలం డమ్మీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఉత్తరాది నుంచి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లను ప్రచార పర్వంలో దింపడం ద్వారా రాష్ట్రంలో నాయకులు లేరని బీజేపీ అంగీకరించిందని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ప్రధాని వస్తూ పోతుంటారని, రాష్ట్రంలో మాత్రం తనకు, యడ్యూరప్పకు మధ్య యుద్ధం నడుస్తోందని అన్నారు. మే 12న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో కమలనాథులకూ తెలిసిపోయిందని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. అయితే సిద్ధూ వ్యాఖ్యలకు బీజేపీ దీటుగా బదులిచ్చింది. ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రేఖలు గీయడం సరికాదని హితవు పలికింది. పార్టీ భాగస్వాములే తిరస్కరిస్తుండటంతో సిద్దరామయ్య నైరాశ్యంలో ఉన్నారని వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ట ఉందని పేర్కొంది. -
‘మేం ఓటర్లను ప్రభావితం చేయం’
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌ల అంశం ప్రధానంగా తెరపైకి రావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లింగాయత్‌ల ఓట్లకు గాలం వేస్తున్నాయి. లింగాయత్‌లలో మంచి పట్టున్న సిద్ధగంగ మఠానికి నేతల తాకిడి తీవ్రమైంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే మఠాధిపతి శివకుమార స్వామిని కలిశారు. వీరశైవ లింగాయత్‌ల విశ్వాసాలను ప్రతిబింబించే సామాజిక కట్టుబాట్లను అనుసరించే ఆథ్యాత్మిక, మత గురువుగా 11 ఏళ్ల శివకుమార స్వామికి లింగాయత్‌లలో మంచి పేరుంది. దీంతో ప్రధాన పార్టీల నేతలంతా సిద్ధగంగ మఠం బాట పట్టారు. సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కట్టబెట్టి వారిని ప్రసన్నం చేసుకోవడంలో ముందుండగా, బీజేపీ అదే వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో లింగాయత్‌ల ఓట్లు తమకేనన్న ధీమాలో ఉంది. మరోవైపు తాము ఓటర్లను ప్రభావితం చేయబోమని, రాజకీయ నేతల భవిష్యత్ కార్యక్రమాలు ఫలించాలని వారిని మఠం దీవించడం వరకే పరిమితమవుతుందని సిద్ధగంగ మఠం జూనియర్ స్వామీజీ సిద్ధలింగ స్వామి స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంలో కర్ణాటకలో మఠాలు ఎందుకు కీలకంగా మారతాయన్న ప్రశ్నలకు ఆయన బదులిస్తూ తమకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, మత.ఆథ్యాత్మిక పరంగా రాజకీయ నేతలకు మఠాలు ఆశీస్సులు అందిస్తాయని చెప్పుకొచ్చారు. తాము ఓటింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తామని, తాము ఎన్నడూ ఏ పార్టీ పక్షాన నిలవబోమని స్పష్టం చేశారు. దేశ పౌరులుగా తాము విధిగా ఓటు వేయాలని, ప్రజలు ముందుకొచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలని మాత్రమే పిలుపు ఇస్తామని చెప్పారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని మఠాలు కోరబోవని..ప్రభుత్వాలు మాత్రం ఉదాత్త లక్ష్యంతో పనిచేసే మఠాలకు చేయూత ఇస్తున్నాయని అన్నారు. -
జేడిఎస్లో చేరిన కన్నడ నటి పూజా గాంధీ
-
‘బెంగుళూరులో అన్ని సీట్లు బీజేపీవే’
సాక్షి, బెంగుళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల బెంగుళూరు పర్యటన ముగిసింది. వివిధ రంగాల వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో గురువారం సాయంత్రం సమావేశమైన అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ‘మిషన్ 150’ విజయం సాధించాలి.. అంతకుముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు బీజేపీ ముఖ్యనేతలు, నిపుణులు, కార్యకర్తలతో షా విడివిడిగా భేటి అయ్యారు. కర్ణాటకలో బీజేపీ ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉందనే విషయంపై చర్చించారు. గతంలో కంటే సీట్ల సంఖ్య పెంచుకోవడంపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు గెలుపొందడమే లక్ష్యంగా పనిచేయాలనీ.. ‘మిషన్ 150’ విజయవంతమవ్వాలని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బెంగుళూరులోని 28 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ విజయం సాధించేలా పనిచేయాలని నేతలకు తెలియజెప్పారు. అలాగే, బెల్గావీలోని 18 అసెంబ్లీ స్థానాల్లో 15 గెలుపొందేలా ప్రణాళికలు రచించాలన్నారు. బెంగుళూరు నగరంలో పార్టీకి కింది స్థాయిలో మంచి కార్యవర్గం ఉందనీ.. అక్కడ ఉన్న అన్ని సీట్లని గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
మంత్రి పదవి హామీ ఇస్తేనే పోటీ : అంబరీష్
సాక్షి, కర్ణాటక(శివాజీనగర): మండ్య కాంగ్రెస్ అభ్యర్థి అంబరీష్ నేతలకు చుక్కలు చూపుతున్నారు. టికెట్ ప్రకటించినా ‘బీ ఫారం’ అందుకోని ఈయన పలు షరతులతో నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బీ ఫారం తీసుకోవాలంటే మండ్య జిల్లా ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను అప్పగించాలని, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలనే తదితర షరత్తులు విధించటంతో కాంగ్రెస్ నేతలకు దిక్కుతోచడం లేదు. ఈ క్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్, ముఖ్యమంత్రి సిద్ధారామయ్యల సూచన మేరకు బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి కేజే జార్జ్ బుధవారం అంబరీష్‌ను కలిసి బీఫారం తీసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. శుక్రవారం రాష్ట్ర ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ అంబరీష్‌ను కలిసి చర్చలు జరుపనున్నారు. అంబరీష్ డిమాండ్లను ఆమోదిస్తారో లేదో అనేది కుతూహలంగా మారింది. ఇదిలా ఉండగా అంబరీష్ ఇంటికి బీ ఫారం పంపుతామని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్ తెలిపారు. మరో వైపు నాయకులు, కార్యకర్తలు అంబరీష్‌ను కలిసి నియోజకవర్గానికి రావాలని, మీ వెంట మేం ఉంటామని, నామినేషన్ దాఖలు చేయాలని ఒత్తిడి చేశారు. -
బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కర్ణాటకలో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. బాబ్రీ మసీదు కోరుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, రామ మందిరం కోరుకున్న వాళ్లు బీజేపీకి ఓట్లేసి గెలిపించాలన్నారు. దీంతో ఎన్నికల ప్రచారం పూర్తిగా మత ప్రచారంలా మారిపోయిందంటూ రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని బెళగావి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నేత సంజయ్ పాటిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 'నా పేరు సంజయ్ పాటిల్. నేను హిందువును. మనది హిందూదేశం. బీజేపీని గెలిపిస్తే రామ మందిరం నిర్మిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి హెబ్బాలికర్ రామ మందిరం నిర్మిస్తామని హామీ ఇస్తారు. కానీ వారిని గెలిపిస్తే కచ్చితంగా బాబ్రీ మసీదు నిర్మిస్తారు. మసీదు కోరుకునేవాళ్లు కాంగ్రెస్‌కు, రామ మందిరం కావాలనుకుంటే బీజేపీకి మద్దతు తెలపాలని' బహిరంగ సభలో సంజయ్ పాటిల్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలోనూ సంజయ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోటార్‌సైకిల్ ర్యాలీ సరిగ్గా చేయడం లేదని చెప్పిన పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించి విమర్శల పాలైన విషయం తెలిసిందే. రోడ్లు, నీళ్లు అంటూ అభివృద్ధి, పథకాల గురించి మాట్లాడకుండా బీజేపీ నేత సంజల్ పాటిల్ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. -
కాంగ్రెస్ లిస్ట్‌పై సిద్దరామయ్య ముద్ర!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం కాంగ్రెస్ ప్రకటించిన 218 అభ్యర్థుల జాబితా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పలుకుబడి, శక్తిసామర్ధ్యాలకు అద్దంపడుతోంది. మొదట రెండు సీట్ల నుంచి పోటీచేయాలనుకున్న ముఖ్యమంత్రికి ఒక్క చాముండేశ్వరి స్థానం నుంచే పోరుకు అవకాశం కల్పించినా అత్యధిక సంఖ్యలో తన అనుచరులకు ఆయన టికెట్లు సాధించారు. జేడీఎస్, బీజేపీ, ఓ చిన్న పార్టీ నుంచి ఫిరాయించిన పదిమందికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చేలా అధిష్టానాన్ని ఆయన ఒప్పించగలిగారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 112 మందికి మళ్లీ పోటీచేసే అవకాశం లభించగా, కేవలం పది మందికే టికెట్ నిరాకరించారు. టికెట్లు దక్కని కాంగ్రెస్ నేతలు అప్పుడే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. సీఎంతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కీలక మంత్రి డీకే శివకుమార్, పీసీసీ నేత జి.పరమేశ్వర కూడా తమ మద్దతుదారులకు కాంగ్రెస్ జాబితాలో తగినన్ని సీట్లు సంపాదించారు. కిందటిసారి పది మంది మహిళలకు కాంగ్రెస్ టికెట్ల లభించగా ఈసారి వారికి రికార్డు సంఖ్యలో 15 సీట్లు దక్కాయి. మొత్తం 224 సీట్లలో దాదాపు వంద నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ణయించే బలమైన సామాజికవర్గమైన లింగాయతులకు ఎప్పటిలా పెద్ద సంఖ్యలో స్థానం కల్పించారు. నలుగురు నేతల కుటుంబసభ్యులకు టికెట్లు కిందటేడాది పంజాబ్ ఎన్నికల్లో అనుసరించిన ‘ఒక కుటుంబానికి ఒక టికెట్’ అనే సూత్రానికి కర్ణాటకలో కనీసం నాలుగు చోట్ల మినహాయింపు ఇచ్చి నేతల కుటుంబసభ్యులకు పోటీచేసే అవకాశం కల్పించారు. సిద్దరామయ్య కొడుకు యతీంద్రకు వరుణ టికెట్ లభించింది. రాష్ట్ర హోం మంత్రి ఆర్. రామలింగారెడ్డి(పాత సీటు బీటీఎం లేఅవుట్ నుంచి) కుమార్తె సౌమ్యారెడ్డికి బెంగళూరు నగరంలోని జయనగర్ టికెట్ కేటాయించారు. న్యాయశాఖా మంత్రి టీబీ జయచంద్ర, ఆయన కొడుకు సంతోష్‌కు వరుసగా సీరా, సికనాయకనహళ్లి(తుమకూరు జిల్లా) నుంచి పోటీచేస్తారు. గృహనిర్మాణ మంత్రి ఎం.కృష్ణప్ప(గోవిందరాజనగర్) కుమారుడు ప్రియాకృష్ణకు కూడా విజయ్‌నగర్ సీటు కేటాయించారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ కేహెచ్ మునియప్ప కూతురు రూపా శశిధర్‌కు కోలార్ నుంచి పోటీచేసే అవశం ఇచ్చారు. ఇంకా మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, ఐటీ మంత్రి ప్రియాంక్‌కు మళ్లీ గుల్బర్గా జిల్లా చిత్తాపూర్ టికెట్ కేటాయించారు. కిందటేడాది మరణించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖమరుల్ ఇస్లాం, మహదేవ ప్రసాద్ భార్యలకు వారి భర్తల సీట్ల నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. కొన్ని నెలల క్రితం మరణించిన ఎమ్మెల్యే రుద్రేశ్ గౌడ కూతురు కీర్తనకు కూడా కాంగ్రెస్ టికెట్ (బేలూరు) ఇచ్చారు. లింగాయతులకు 40, ముస్లింలకు 15 ప్రత్యేక మతంగా గుర్తింపు కోసం పోరాడి సాధించిన బలమైన సామాజికవర్గం లింగాయతులకు 40, ఒక్కళిగలకు దాదాపు 25, ముస్లింలకు 15, ఐదుగురు బ్రాహ్మణ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్లు లభించాయి. బీసీలకు 50కు పైగా సీట్లు, స్వల్ప జనాభా ఉన్న అగ్రకులాలు కొడవ, బంట్, వైశ్యులకు ఐదు టికెట్లు కేటాయించారు. ఒక జైన సభ్యునితోపాటు ఇద్దరు ప్రస్తుత క్రైస్తవ ఎమ్మెల్యేలకు కూడా మళ్లీ పోటీచేసే అవకాశం దక్కింది. షెడ్యూల్డ్ కులాలలోని దళిత వర్గాలు రెండింటికీ సమాన ప్రాధాన్యం కల్పించారు. ఏడుగురు జేడీఎస్ ఫిరాయింపుదారులకు అవకాశం! కాంగ్రెస్‌లో చేరిన ఏడుగురు జేడీఎస్ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ కర్ణాటక మక్కల్ పక్షపై కిందటి ఎన్నికల్లో గెలిచిన వివాదాస్పద వ్యాపారి అశోక్ ఖేనీ(బీదర్ దక్షిణ)కు కూడా కాంగ్రెస్ టికెట్లు లభించాయి. బళ్లారి ప్రాంతంలో ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలైన వివాదాస్పద వ్యాపారులు ఆనంద్ సింగ్, బి.నాగేంద్ర కాంగ్రెస్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బీజేపీ మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప 2013లో స్థాపించిన కేజేపీ టికెట్‌పై గతంలోగెలిచిన బీఆర్ పాటిల్‌కు కూడా హస్తం గుర్తుపై పోటీచేసే అవకాశం లభించింది. బీజేపీ కొత్త అభ్యర్థులపై కాంగ్రెస్ హేమీహేమీలు కోస్తా జిల్లా దక్షిణ కన్నడలోని ఏడు స్థానాల్లో బీజేపీ చాలా వరకు ఎన్నికల రాజకీయాలకు కొత్త అయిన అభ్యర్థులే కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులతో తలపడాల్పిన పరిస్థితి. కాంగ్రెస్ ఏడుగురు సిటింగ్ సభ్యులందరికీ మళ్లీ సీట్లిచ్చింది. జిల్లాలోని 8 స్థానాల్లో ఏడింటిని కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఏడుగురిలో ఇద్దరు బి.రామనాథ్రాయ్(బంట్వాల్), యూటీ ఖాదర్(మంగళూరు), అభయచంద్ర జైన్(మూడబిద్రి) ఒకటి రెండు సందర్భాల్లో మంత్రులుగా పనిచేసినవారే. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఖాదర్ ఓటమి ఎరగని నేత. జైన్ ఈసారి పోటీకి సుముఖుంగా లేకున్నా మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చారు. మతవిద్వేషాలు తలెత్తే ఈ జిల్లాలో ఆరెసెస్‌కు గట్టి పునాదులున్నప్పటికీ, బీజేపీకి పేరున్న నేతలు లేని కారణంగా ఏడు సీట్లకు అందరూ కొత్తవారే పోటీపపడాల్సిన పరిస్థితి. మొదటి 72 మంది జాబితాలో ఈ ఏడు సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు. బెంగళూరు మేయర్‌కు టికెట్ బెంగళూరు కాంగ్రెస్ మేయర్ ఆర్.సంపత్‌రాజ్‌కు నగరంలోని సీవీ రామన్ నగర ఎస్సీ రిజర్వ్డ్ సీటు కేటాయించారు. ఆయనకు ముందు మేయర్‌గా పనిచేసిన పద్మావతికి దక్షిణ బెంగళూరులోని రాజాజీ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం కల్పించారు. ఆమెపై ఇక్కడ బీజేపీ సీనియర్ నేత ఎస్.సురేష్ కుమార్ పోటీకి దిగుతున్నారు. నగరంలోని సంపన్న ప్రాంతం జయనగర్‌లో హోం మంత్రి కూతురు సౌమ్యారెడ్డికి కాంగ్రెస్ టికెట్ లభించగా, బీజేపీ అభ్యర్థిత్వం బీఎన్ విజయ్‌కుమార్‌కు దక్కింది. బళ్లారి సిటీలో సోమశేఖర్‌రెడ్డిపై అనిల్ హెచ్ లాడ్ పోటీ బళ్లారి సిటీ కాంగ్రెస్ టికెట్ మైనింగ్ వ్యాపారి అనిల్ హెచ్ లాడ్‌కు దక్కగా, ఆయనపై పోటీకి గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు జి.సోమశేఖర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తారు. సోమవారం బీజేపీ ప్రకటించిన రెండో జాబితా(82)లో సోమశేఖర్ అభ్యర్థిత్వంవెల్లడించారు. గాలి కుటుంబానికి సన్నిహితుడైన సన్నా ఫకీరప్పకు బళ్లారి(ఎస్టీ) టికెట్ కేటాయించగా, ఆయనపై కాంగ్రెస్ తరఫున బి.నాగేంద్ర పోటీచేస్తారు. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాంగ్రెస్‌వి ఓటు బ్యాంక్ రాజకీయాలు
దొడ్డబళ్లాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఏనాడూ గౌరవించని కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఆయన ఫొటో చూపించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ముఖ్య మంత్రి బీఎస్ యడ్యూరప్ప విమర్శించారు. పట్టణంలోని భగత్‌సింగ్ క్రీడా మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకపోగా ఎన్నికల్లో ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. తాను 50 మంది పౌర కార్మికులను ఇంటికి పిలిచి సన్మానించానన్నారు. దేశానికి రైతు, చేనేత కార్మికుడు రెండు కళ్లలాంటివారన్నారు. సీఎం సిద్ధరామయయ్యకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇండియా టుడే ఎన్నికల సర్వే ఫలితాలను పట్టించుకోనవసరం లేదని అన్నారు. మొళకాల్మూరు బీజేపీ అభ్యర్థి శ్రీరాములు మాట్లాడుతూ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయితే చేనేత కార్మికుల అన్ని రుణాలనూ మాఫీ చేస్తారన్నారు. ఇదే సందర్భం గా చలనచిత్ర నిర్మాత, జేడీఎస్ సీనియర్ నాయకుడు సారథి సత్యప్రకాశ్ వందలాదిమంది మద్దతుదారులతో కలిసి యడ్యూరప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ పుట్టస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ముందే ప్రచారం.. అపచారం
పార్టీ అభ్యర్థిగా ప్రకటించలేదు, టికెట్ కేటాయించనూ లేదు, అయినా తానే ఫలానా పార్టీ అభ్యర్థిని అని ప్రచారం చేసుకోవడం ఈ రోజుల్లో మామూలు విషయమే. రాష్ట్రంలో ఇప్పుడు అనేకచోట్ల జరుగుతోంది కూడా. అయితే ఇది తప్పని సీఈవో సంజీవ్‌కుమార్ ప్రకటించారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. శివాజీనగర: రాష్ట్ర విధానసభ ఎన్నికల్లో పోటీ చేసేవారు నామినేషన్ దాఖలు చేయకముందే అభ్యర్థినని ప్రచారం చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సంజీవ్‌కుమార్ స్పష్టంచేశారు. శనివారం ఆయన బెంగళూరు ప్రెస్‌క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొని మాట్లాడారు. నామినేషన్ దాఖలు చేయకముందే పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేయటానికి వీలు లేదు, అయితే ఈ విషయంలో ఫిర్యాదులు తమ దృష్టికి రాలేదని, వస్తే అలాంటివారిపై చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఆశావహులు నామినేషన్లకు ముందే తమంతట తామే ఫలానా పార్టీ అభ్యర్థులమని ప్రకటించుకుని ప్రచారం చేయరాదన్నారు. నామినేషన్ సమర్పించాక, అభ్యర్థిగా ఎన్నికల కమిషన్ పరిగణించిన తరువాతనే ఎన్నికల ప్రచారం చేపట్టాలని తెలిపారు. సీఈఓ ఇంకా ఏమేం చెప్పారంటే... ♦ ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు, కార్లలో ఎన్నికల కమిషన్‌ను కళ్లుగప్పి నగదును రవాణా చేయకుండా కట్టుదిట్టమైన తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశాం. అక్రమాలపై ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకొంటారు. ♦ రాజకీయ విందుల్లో తాము స్వాధీనం చేసుకున్న ఆహారాన్ని పారవేయకుండా అనాథ ఆశ్రమం, నిరాశ్రయులకు పంపిణీ చేస్తాం. ♦ 2 చోట్ల పోటీ చేయవచ్చు ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో పోటీచేయవచ్చు. ఇందుకు ఈసీ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. రెండు చోట్ల పోటీని నిరోధించే చట్టం ఏదీ లేదు. ♦ 2013లో జరిగిన విధానసభా ఎన్నికలకంటే ఈసారి ఎన్నికలను సక్రమంగా జరిగేందుకు పాటుపడుతున్నాం. ♦ ప్రస్తుతం 4.96 కోట్ల ఓటర్లు ఉన్నారు. కొత్తగా మరో 8,5000 మంది ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఓటర్ల సంఖ్య 5 కోట్లకు చేరుతుంది. ♦ ఓటర్ల కోసం 58 వేలు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసి 3 లక్షల 56 వేల మంది ఎన్నికల సిబ్బందిని నియమిస్తున్నాం. అటవీ ప్రాంతాలు, ఆదివాసీల ప్రాంతాల్లోనూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయగలిగేలా చూస్తాం. ఓటర్లను అధికారులు, రాజకీయ నాయకులు, పోకిరీలు ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకొంటాం. ♦ తీర్థహళ్ళి చెక్‌పోస్ట్‌లో రూ.3 కోట్ల 45 లక్షల అక్రమ సొమ్మును పట్టుకున్నాం, రెండు రోజుల తరువాత ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తెప్పించుకున్నట్లు ఆధారాలు సమర్పించగా వాపసు ఇచ్చేశాం. ♦ ఎన్నికల్లో అభ్యర్థులు పత్రికలు, టీవీ చానెళ్లలో ప్రచారం చేసుకోవాలంటే ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పొందాలి. ఒకవేళ అభ్యర్థులు నిర్లక్ష్యం చేస్తే ప్రచురించబడిన ప్రకటనలను పరిశీలించేందుకు ఓ కమిటీ ఉంటుందని, అన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకొంటారు. దీనిపై మీడియాకు, నాయకులకు అగాహన కల్పించాం. -
ఆ సర్వేలో నిజం లేదు
సాక్షి, బళ్లారి: ఓటమి భయంతోనే సీఎం సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని, ఐదు సంవత్సరాలు సీఎంగా పని చేసిన వ్యక్తిగా ఆయనే గెలవలేని పరిస్థితి ఉంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చని బీజేపీ శాసనసభా పక్ష నేత, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విమర్శించారు. ఆయన శనివారం హుబ్లీలో విలేకరులతో మాట్లాడారు. ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో పస లేదు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు పేర్కొనడంలో నిజం లేదు అని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సర్వేలు అబద్ధమని తేలిపోయినట్లు చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ స్వతంత్రంగా అధికారంలోకి వస్తారని సర్వేలు చెప్పలేదని, అదే మాదిరిగా ఈసారి కూడా యడ్యూరప్ప కర్ణాటకలో సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలు అనంతరం సిద్దూ ఇంటికే పరిమితం అవుతారని, కాంగ్రెస్ ఎన్ని సర్వశక్తులు ఒడ్డినా తాము ఒంటరిగా 150 సీట్లతో గద్దెనెక్కుతామని జోస్యం చెప్పారు. శ్రీరాములే పోటీ చేసి గెలుస్తారు మొళకాల్మూరు ఎమ్మెల్యేగా తిప్పేస్వామి గెలుపొందారంటే అది శ్రీరాములు ఆశీస్సులే, గత శాసనసభ ఎన్నికల్లో బీఎస్‌ఆర్‌సీపీ తరుపున తిప్పేస్వామికి శ్రీరాములు టికెట్ ఇవ్వడంతో పాటు గెలుపునకు కృషి చేయడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారన్నది మరువకూడదని శెట్టర్ హితవు పలికారు. శ్రీరాములుపై తిప్పేస్వామి తిరుగుబాటు చేయించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించి వ్యవహరించారని, ఎట్టి పరిస్థితుల్లోను మొళకాల్మూరు నుంచి శ్రీరాములే పోటీ చేస్తారని, ఆయనే భారీ మెజార్టీతో గెలుపొందుతారన్నారు. తిప్పేస్వామి రాజకీయ సమీకరణలు నిజం కావన్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటమో లేదా మరేదైనా నిర్ణయం తీసుకోవడంలో తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే అనవసర గొడవలకు దిగితే జనమే బుద్ధి చెబుతారన్నారు. శ్రీరాములుకు మొళకాల్మూరులో గెలిచే శక్తి ఉందన్నారు. ఆయన అక్కడే కాకుండా రాష్ట్రంగా పలు జిల్లాల్లో ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తారని చెప్పారు. -
కమల దళం.. త్రిముఖ వ్యూహం
దక్షిణాదిలో ఇంకో దఫా పాగా వేసేందుకు తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీ వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందుకోసం బహుముఖ వ్యూహాలు రచిస్తోంది. గెలుపు గుర్రాలకు సీట్లు ఇస్తూ.. హిందుత్వ అజెండాను అమలు చేస్తూ.. కులసమీకరణలకూ ప్రాధాన్యం తగ్గకుండా చూస్తోంది. గత ఆదివారం విడుదల చేసిన అభ్యర్థుల తొలిజాబితాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మొత్తం 224 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 72 నియోజకవర్గాల అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లింగాయతులను ప్రత్యేక మతంగా గుర్తించాలని కేంద్రానికి సిఫారసు చేయడంతో ఆ వర్గం ఓట్లు దూరమవుతాయన్న ఆందోళన బీజేపీలో కనిపించడం లేదు. తొలి జాబితాలోని నియోజకవర్గాల్లో లింగాయతులు, వీరశైవుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నవి చాలా ఉన్నప్పటికీ ఆయా వర్గాల వారికి మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. లింగాయత వర్గానికి చెందిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా నిలబెట్టాం కాబట్టి ఆ వర్గాలు తమకు అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తోంది. ఫిరాయింపుదార్లకూ టికెట్లు! ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టాలనే లక్ష్యంతో కచ్చితంగా గెలవగలరు అనుకునే నేతలకే టికెట్లు కేటాయిస్తోంది. ఇందుకోసం అవతలి పార్టీల నేతలను తమవైపు తిప్పేసుకునేందుకూ వెనుకాడటం లేదు. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి పలువురు నేతలను తమవైపు తిప్పుకున్న కాషాయ దళం తన తొలి జాబితాలో పదిమంది ఫిరాయింపు నేతలకు టికెట్లు కేటాయించడం గమనార్హం. కలబుర్గి జిల్లా అఫ్జల్‌పురా సీటును రెండు వారాల క్రితమే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన మాలికయ్య గుత్తేదారుకు ఇవ్వడంపై స్థానిక నేతలు నిరసన వ్యక్తం చేసినా పార్టీ నాయకత్వం ఖాతరు చేయలేదు. 2013 ఎన్నికల్లో బీజేపీ నుంచి వైదొలిగి సొంత పార్టీలు పెట్టుకుని పోటీచేసిన యడ్యూరప్ప(కర్ణాటక జనతా పక్ష–కేజేపీ), బి.శ్రీరాములు(బీఎస్ఆర్ కాంగ్రెస్) తర్వాత తమ పార్టీలను మాతృ సంస్థలో విలీనం చేశారు. ఫలితంగా వీరి అనుచరులకూ ఈసారి బీజేపీ తన తొలిజాబితాలో స్థానం కల్పించింది. బెళగావి జిల్లా కుదాచీ స్థానం నుంచి పి.రాజీవ్, ఇదే జిల్లాలోని బైలహొంగళ నియోజకవర్గం నుంచి విశ్వనాథప్ప పాటి ల్కు సీట్లు దక్కాయి. వీరు గత ఎన్నికల్లో యడ్యూరప్ప, శ్రీరాములు పార్టీల తరఫున బరిలోకి దిగారు. ‘హిందుత్వ’ఆయుధం.. హిందుత్వను ఆయుధంగా బీజేపీ ఎప్పటిలానే వాడుకుంటోంది. తామే నిజమైన హిందువులనేలా వ్యవహరిస్తోంది. నెల క్రితం సిద్ధరామయ్య చేపల కూర తిని దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల మంజునాథ స్వామిని సందర్శించారని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జావరి కోడి మాంసం తిని కొప్పళ జిల్లా కనకగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లారని యడ్యూరప్ప ట్వీటర్లో విమర్శించారు. రాహుల్‌ను ‘ఎలక్షన్ హిందూ’గా ఆయన అభివర్ణించారు. ‘కాంగ్రెస్ పదేపదే ఎందుకు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోంది? అందరినీ సమంగా చూస్తే అది సామ్యవాదం. మీది మజావాదం?’ అంటూ బీఎత్తిపొడిచారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచా రం నాటి నుంచి హిందూ గుడులు–గోపురాలు దర్శించడం రాహుల్‌కు అలవాటుగా మారిన నేపథ్యంలో ఆయన నిజమైన హిందువు కాదని చెప్పడానికి ‘ఎన్నికల హిందువు’గా బీజేపీ చూపిస్తోంది. రంగంలోకి ఆరెస్సెస్.. మరోవైపు కాషాయ కుటుంబ పెద్ద ఆరెస్సెస్ కూడా బీజేపీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తోంది. మొదటిసారి ఎన్నికల కేంద్రాల(బూత్‌లు) వారీగా తమను అభిమానించే ఓటర్లను రప్పించి కమలానికి ఓట్లేసేలా చేసే బాధ్యతను ఆరెస్సెస్ తన భుజాలపై వేసుకుంది. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేక సర్కారుగా ‘సంఘ్’పరివార్ సంస్థలు చూడటమే దీనికి కారణం. ‘వాస్తవానికి చాలా మంది కర్ణాటక కాంగ్రెస్ నేతలకు మేం వ్యతిరేకం కాదు. వారంతా మంచి హిందువులే. ఆరెస్సెస్‌ను వారు దూషించరు. వ్యక్తిగతంగా మాకు వారిపై కోపం లేదు. కానీ, సిద్ధరామయ్య భిన్నమైన నేత. ఆయన కమ్యూనిస్టులా వ్యవహరిస్తారు. సంఘ్‌పై ఆయన విధానాలతో ఆగ్రహంగా ఉన్నాం. ఆయనను సైద్ధాంతికంగా, వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తాం. అందుకే, కర్ణాటకలో యడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీకి సాయపడాలని ఆరెస్సెస్ నిర్ణయించింది’ అని సంఘ్ నేత ఒకరు వెల్లడించారు. కుల సమీకరణలపైనా దృష్టి బలమైన లింగాయత్ నేత యడ్యూరప్ప ఉండగా మితిమీరిన కుల సమీకరణలకు పోకుండా అన్ని సామాజికవర్గాల ఓట్లు సాధించి తప్పకుండా అధికారంలోకి రావాలని బీజేపీ ఎన్నికల ఎత్తుగడలు రూపొందించింది. పూర్తి కాలం పదవిలో కొనసాగడం వల్ల కన్నడ ప్రజల్లో పాలకపక్షంపై వ్యతిరేకత ఉందనీ, దీన్ని ఉపయోగించుకుంటే విజయం తథ్యమని భావిస్తోంది. సిద్ధరామయ్య మాదిరిగానే కురబ(బీసీ) వర్గానికి చెందిన కేఎస్ ఈశ్వరప్ప శాసనమండలిలో ప్రతిపక్ష(బీజేపీ) నేత. భవిష్యత్తులో ఈశ్వరప్ప సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశమున్న కారణంగా ఆయనను శివమొగ్గ జిల్లాలో పోటీకి దింపుతోంది. దళితులు చెప్పుకోదగ్గ సంఖ్యలో కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు మొగ్గుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఎస్సీలు 18 శాతం ఉండగా, ఎస్టీలు 7 శాతమని అంచనా. ఈ రెండు వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎస్టీ వర్గానికి(వాల్మీకి బోయ) చెందిన బళ్లారి ఎంపీ బి.శ్రీరాములును ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించాలని బీజేపీ యోచిస్తోంది. ఈ ప్రకటనతో 25 శాతం ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో అనేక మందిని తమ వైపు తిప్పుకోవచ్చని యడ్యూరప్ప భావిస్తున్నారు. -
కర్ణాటక ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ నివాసంలో శనివారం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ భేటీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కీలక నేతలు హాజరయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల కారణంగా ఆ పార్టీ అభ్యర్థుల జాబితా ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన ప్రకారం 180మంది అభ్యర్థులతో తొలి జాబితాను శుక్రవారం విడుదల చేయాల్సి ఉంది. అయితే, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్షతన రెండుసార్లు సమావేశమైనప్పటికీ అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదని, శనివారం మరోసారి భేటీ కానున్నామని సీఎం సిద్దరామయ్య ఇప్పటికే తెలిపారు. పార్టీ సీనియర్ నేతలంతా ఎవరికి వారు సొంత జాబితా తయారుచేసుకొని రావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన జేడీఎస్, బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. సీఎం సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర, కొందరు సీనియర్ మంత్రుల కుటుంబసభ్యులకు టికెట్లు ఇస్తుండటంపైనా కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గమంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
కేసీఆర్ పథకాలు అద్భుతం: దేవెగౌడ
-
మాది ప్రజల ఫ్రంట్
సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఘోరంగా విఫలమయ్యాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తమ ఫ్రంట్ చిల్లర రాజకీయాల కోసం కాదని స్పష్టంచేశారు. జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎజెండాతో ముందుకు పోతున్నామని, తమది తృతీయ ఫ్రంట్ కాదని, ప్రజలు, రైతుల ఫ్రంట్ అని పేర్కొన్నారు. దేశాన్ని, రైతులను, నిరుపేదలను, మహిళలను కాపాడటమే తమ అంతిమ లక్ష్యమన్నారు. 2019 ఎన్నికలకు ముందే రైతుల కోసం ఎజెండా తయారు చేస్తామని, జాతి ప్రయోజనాల కోసమే ఫ్రంట్ ఏర్పడుతుందని చెప్పారు. ‘‘బీజేపీ, కాంగ్రెస్ ట్రాప్‌లో ఉన్న పార్టీలన్నీ బయటకు రావాలి. దేశాన్ని, భారతమాతను కాపాడాలి. రైతులు, నిరుపేదలు, మహిళలు, న్యాయం కోరుకుంటున్న వారిని రక్షించాలి’’అని పిలుపునిచ్చారు. దేశంలో గుణాత్మక మార్పు కోసమే ఫ్రంట్ ఉద్యమిస్తుందని, దేశాభివృద్ధి కోసం ఏ పార్టీ అయినా తమతో కలిసిరావొచ్చని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు జేడీఎస్‌కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. జేడీఎస్ నేతలు ఆహ్వానిస్తే తాను కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ వివరించారు. కేసీఆర్ కృషిని దేవెగౌడ అభినందించారు. ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన సీఎం.. దేవెగౌడను ఆయన నివాసంలో కలుసుకున్నారు. దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు. సమావేశం అనంతరం దేవెగౌడ ఇంట్లోనే మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్ వెంట ఎంపీలు బి.వినోద్ కుమార్, జె.సంతోష్ కుమార్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, టీఎస్ ఎండీసీ చైర్మన్ సుభాష్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ భేటీలో ఉన్నారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. నీళ్ల కోసం కొట్టుకుంటే చోద్యం చూస్తున్నారా? తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు నిర్వహించిన భారీ సభలో దేవెగౌడ స్వయంగా పాల్గొన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. ‘‘స్వాతంత్య్రం అనంతరం ఆరేళ్లు మినహా కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయి. వారి లోపభూయిష్టమైన విధానాల వల్లే దేశం సమస్యలను ఎదుర్కొంటోంది. 70 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశంలో సమస్యలను పరిష్కరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. తమిళనాడు, కర్ణాటక మధ్య ఉన్న కావేరి జల వివాదాన్ని కేంద్రం ఎందుకు పరిష్కరించడం లేదు. జల వివాదాలను పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాల మధ్య కేంద్రం యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది’’అని ఆరోపించారు. దేశంలో 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని, ప్రతి ఎకరానికి సరిపడేంత సాగునీటిని అందించినా దాదాపు 30 వేల టీఎంసీల మిగులు ఉంటుందని చెప్పారు. కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి 2004లో బ్రిజేష్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తే.. 14 ఏళ్లు గడిచినప్పటికీ ట్రిబ్యునల్ పరిష్కరించలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నీళ్ల కోసం రాష్ట్రాలు కొట్టుకుంటుంటే ఢిల్లీలోని కేంద్ర పాలకులు చోద్యం చూస్తున్నారు. ఆరు నెలల్లో, కనీసం ఏడాదిలో తీర్పు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఆదేశించలేదా? ఇదంతా కాంగ్రెస్, బీజీపీ ప్రభుత్వాల అసమర్థత. వైఫల్యమే’’అని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, రైతుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయన్నారు. కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు మద్దతు పలకాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ పథకాలు భేష్: దేవెగౌడ దేశానికి స్వాతంత్య్రం తర్వాత 70 ఏళ్లుగా సమస్యలు అలాగే ఉన్నాయని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై తనతో, కుమారస్వామితో కేసీఆర్ చర్చలు జరిపారని వెల్లడించారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీల్లో మిత్రపక్షాలుగా ఉన్న స్థానిక పార్టీలన్నీ తృతీయ కూటమిలో చేరాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రజాధనాన్ని దోచుకోవడం, అధికారం కోసం అడ్డదారులు తొక్కడం తప్ప ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి పట్టదని విమర్శించారు. తృతీయ కూటమికి తమ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన పథకాలు చాలా బాగున్నా యని దేవెగౌడ కితాబిచ్చారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గర్భిణుల ఆరోగ్యం కోసం వినూత్న పథకం తీసుకొచ్చారని కొనియాడారు. రైతుల కోసం తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా పథకం అమలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వారివి విభజన రాజకీయాలు: ప్రకాశ్‌రాజ్ సినీనటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు మతం, కులం, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయంటూ ఆరోపించారు. వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికల్లో ప్రజలు ఓట్ల ద్వారా రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా దేశానికి కేంద్రం చేసేందేమీ లేదని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఎవరికి మద్దతిస్తే న్యాయం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. దేశంలో మార్పు కోరుకునే ప్రజలంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ సమయంలోనే మద్దతు తెలంగాణ ఉద్యమ సమయంలో మద్దతు ఇవ్వడంతో పాటు వరంగల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో దేవెగౌడ పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచినందుకు దేవెగౌడకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పెట్టుబడి సాయం పథకం ప్రకటించిన సందర్భంగా కేసీఆర్ కు దేవెగౌడ ఫోన్ చేసి అభినందించారు. హైదరాబాద్‌కు వస్తానని చెప్పారు. అయితే తానే బెంగుళూరుకు వచ్చి కలిసి ఆశీర్వాదం తీసుకుంటానని నాడు కేసీఆర్ చెప్పారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సమాజం, పేదలు, అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్న ప్రకాశ్‌రాజ్ రియల్ హీరో అని ప్రశంసించారు. -
కర్ణాటకలోని తెలుగువారంతా ఆ పార్టీకే ఓటేయండి
-
ప్రకాశ్ రాజ్ మంచి స్నేహితుడు: కేసీఆర్
సాక్షి, బెంగళూర్ : సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తనకు మంచి స్నేహితుడని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నాం కేసీఆర్.. దేవెగౌడతో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ విలేఖరి ప్రకాశ్ రాజ్ ఎందుకొచ్చారంటూ ప్రశ్నించాడు. ఇంతలో కేసీఆర్ జోక్యం చేసుకుని... ‘ ప్రకాశ్ రాజ్ కర్ణాటకకు చెందిన వ్యక్తి. సమాజం, పేదలు, అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్నారు. ఆయనో హీరో. అన్నింటికి మించి నాకు మంచి స్నేహితుడు. ఆయన చేస్తున్న పోరాటానికి నా అభినందనలు’ అని కేసీఆర్ తెలిపారు. ఎవరు మోసం చేశారో గుర్తించండి ఎవరు హామీ ఇచ్చి మోసం చేశారో-ఎవరు న్యాయం చేశారో తెలుసుకోవాలని కర్ణాటక ప్రజలకు నటుడు ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కేసీఆర్-దెవెగౌడ భేటీలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఏపార్టీ ద్వారా న్యాయం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. దేశంలో ప్రస్తుత పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలోనే మార్పు కోరుకునే ప్రజలంతా కలిసి ముందుకు రావాలి. అందులో భాగమే ఫెడరల్ ఫ్రంట్. పార్టీలన్నీ బీజేపీ-కాంగ్రెస్ ట్రాప్ నుంచి బయటపడాలి’ అని ప్రకాశ్ రాజ్ తెలిపారు. -
కర్ణాటకలోని తెలుగువారంతా ఆ పార్టీకే ఓటేయండి
సాక్షి, బెంగళూరు: మరికొద్ది రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీకి మద్దతు తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ఫెడరల్ ఫ్రంట్ వ్యూహ చర్చల్లో భాగంగా శుక్రవారం బెంగళూరుకు వెళ్లిన ఆయన.. మాజీ ప్రధాని, జేడీఎస్ కురువృద్ధుడు హెచ్డీ దేవేగౌడను కలుసుకున్నారు. గౌడతో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలతోపాటు కర్ణాటక-తెలంగాణల మధ్య నెలకొన్న సమస్యలపైనా కేసీఆర్ చర్చించారు. ఈ భేటీలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి గౌడ, సీఎం వెంట సినీనటుడు ప్రకాశ్ రాజ్, పలువురు టీఆర్ఎస్ ముఖ్యులు పాల్గొన్నారు. పెద్దాయన హామీ ఇచ్చారు: దేవేగౌడతో భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ దేశ ప్రజల కోసమే బీజేపీ, కాంగ్రేసేతర ఫ్రంట్‌గా మేం ఏర్పడుతున్నాం. 70 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో మౌళికమైన మార్పులు రాలేదు. 70 టీఎంసీల నీరు వృధాగా పోతున్నా, 40 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నాం. పాలకుల అసమర్థత వల్లే రాష్ట్రాల మధ్య జలయుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. రైతులు, సామాన్యుల మేలు కోసమే ఫ్రంట్‌ను ఏర్పాటుచేస్తున్నాం. దానికి తన ఆశీస్సులు ఉంటాయని దేవేగౌడ గారు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు మద్దతిచ్చి ఓటేయాలని కోరుతున్నా’’ అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఆలోచనలో న్యాయముంది: ‘‘స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తైనా దేశం చాలా సమస్యలను జయించలేకపోయిందన్న మాట వాస్తవం. కీలకమైన అంశాల ప్రాతిపతికన జాతీయ స్థాయిలో ఫ్రంట్ అవసరం. కేసీఆర్ ప్రయత్నాలకు మేం అండగా ఉంటాం. ఆయన కార్యాచరణ బాగుంది. మున్ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుని కలిసి నడవాలనుకుంటున్నాం’’ అని దేవేగౌడ మీడియాతో చెప్పారు. -
నేడు బెంగళూరుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం బెంగళూరుకు వెళుతున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడతో, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో రాజ కీయ పరిస్థితులు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై అంశాలపై వారితో చర్చించనున్నట్టు సమాచారం. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బెంగళూరు బయలుదేరనున్నారు. ఆయనతోపాటు పలువురు పార్టీ నేతలు వెళ్లనున్నారు. దేవెగౌడ, కుమారస్వామిలతో భేటీ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. వేచి చూడాలనుకున్నా.. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలతో జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కోల్‌కతాకు వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ సమావేశమయ్యారు. తాజాగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. ఫ్రంట్ కార్యాచరణపై కొంత వేచి చూడాలని తొలుత కేసీఆర్ భావించారు. కానీ ఈ వ్యూహాన్ని మార్చుకున్నారని, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించడం ద్వారా ఫెడరల్ ఫ్రంట్‌కు బలాన్ని చేకూర్చవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్(ఎస్) ప్రధానంగా పోటీ పడుతున్నాయి. దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్)కు మద్దతును ప్రకటించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ బెంగళూరు పర్యటన పెట్టుకున్నారని తెలుస్తోంది. కర్ణాటక పర్యటన అనంతరం కేసీఆర్ ఒడిశా పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ది దూరదృష్టి సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలపై ఆయనకు స్పష్టత ఉంది’’అని యోగగురు బాబా రాందేవ్ ప్రశంసించారు. ఆర్థికరంగంపై కూడా కేసీఆర్ ఆలోచనల్లో పూర్తి స్పష్టత ఉందని ప్రశంసిస్తూ గురువారం ట్వీట్ చేశారు. అంతకు ముందు గురువారం ప్రగతిభవన్‌లో సీఎంతో బాబారాందేవ్ భేటీ అయ్యా రు. ఆయనకు ముఖ్యమంత్రి ఘనస్వాగతం పలికారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. -
అది నకిలీ జాబితా..
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై సమాలోచనలు సాగుతుండగానే సోషల్ మీడియాలో తొలి జాబితా విడుదల కావడం పార్టీలో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వచ్చిన జాబితా నకిలీదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రాథమిక జాబితాతో హైకమాండ్‌తో స్క్రీనింగ్ కమిటీ మంగళవారం తుదివిడత చర్చలు జరిపినా కేంద్ర ఎన్నికల కమిటీ గ్రీన్‌సిగ్నల్ లభించక ముందే తొలి జాబితా వెల్లడి కావడం పట్ల పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. తొలి జాబితా విడుదలైందన్న వార్తలతో అయోమయానికి గురైన పార్టీ శ్రేణులకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత జాబితాను ఏఐసీసీ ప్రకటించిందని అభ్యర్ధుల పేర్లతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జాబితా నకిలీదని చెప్పారు. ఈ జాబితాను ఏఐసీసీ విడుదల చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశమైన అనంతరమే జాబితా విడుదలవుతుందని, ఇప్పటి వరకూ సీఈసీ భేటీ కాలేదని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధుల ఖరారుకు సంబంధించి డీసీసీలు, పరిశీలకులు, రాష్ట్ర కమిటీ సిఫార్సులను వడపోసి గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు తమ కుటుంబ సభ్యులకు టికెట్లు కోరడం వివాదాస్పదమైంది. -
కొత్తగా పార్టీలోకి వచ్చినోళ్లకూ బీజేపీ టికెట్లు
బెంగళూరు: కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు దగ్గరికొస్తున్న తరుణంలో ఇటీవలే ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన అనేక మందికి ఆ పార్టీ టికెట్లు కేటాయించింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా 72 మంది అభ్యర్థుల జాబితాను తొలి విడతగా బీజేపీ ఆదివారం విడుదలచేయడం తెల్సిందే. వీరిలో 11 మంది ఇతర పార్టీల నుంచి ఇటీవల బీజేపీలోకొచ్చినవారే. వీరిలో చాలా మంది శాసనసభ సభ్యులే. కొంత మంది గతంలో మంత్రులుగా చేశారు. బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాలో పేర్లున్నవారిలో దాదాపు అందరూ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారే. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప షికారిపుర నుంచి పోటీ చేయనున్నారు. 72 మంది అభ్యర్థుల్లో మహిళలు ముగ్గురే ఉన్నారు. -
రాహుల్ సెల్ఫీలపై బీజేపీ సెటైర్లు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బెంగళూర్ మెట్రోలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సెల్ఫీలపై బీజేపీ చురకలు వేసింది. ‘మెట్రో టికెట్ కౌంటర్ వద్ద సెల్ఫీలు తీసుకోవడం...సంపన్నుల బిడ్డలే సామాన్యుల జీవితాలతో ఇలా ఆడుకుంటా’రని కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసింది. జనాశీర్వాద్ యాత్రలో భాగంగా రాహుల్ ఆదివారం బెంగళూర్‌లో ప్రచార సభలతో హోరెత్తించారు. బెంగళూర్ మెట్రో స్టేషన్లో ప్రయాణీకులతో ముచ్చటించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ప్రయాణీకులతో సెల్ఫీలు దిగారు. బీజేపీపాలిత రాష్ట్రాలతో పోలిస్తే కాంగ్రెస్ పాలిత కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం తక్కువ నిధులను కేటాయిస్తోందని ఆరోపించారు. వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీలు భారీస్ధాయిలో ప్రచారం చేపట్టాయి. -
మోదీకి సవాల్ విసిరిన రాహుల్
సాక్షి, బెంగళూరు : ప్రతిపక్షాలు గట్టిగా పోరాడితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం తేలిక అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఓడించితీరుతామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్‌పార్టీ (బీఎస్పీ)లు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే ఉత్తరప్రదేశ్, మరికొన్ని ప్రభావిత రాష్ట్రాల్లో బీజేపీ రూపురేఖలు లేకుండా చేయొచ్చునని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రధాని మోదీకి సైతం తెలుసునని చెప్పిన రాహుల్.. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో తమదే విజయమన్నారు. తాజాగా బిహార్, తమిళనాడు సహా మరిన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తే బీజేపీకి ప్రజలు ఓట్లేసే ప్రసక్తే ఉండదన్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఏకమై పోటీచేస్తే ప్రధాని మోదీకి వారణాసిలో బరిలోకి దిగే దమ్ముందా అని రాహుల్ సవాల్ విసిరారు. బీజేపీకి వ్యతిరేక పవనాలు కర్ణాటక నుంచే మొదలవుతాయని, అన్ని రాష్ట్రాల్లో ఇదే గాలి వీస్తుందని రాహుల్ జోస్యం చెప్పారు. -
ఏమో.. ప్రధానినీ కావచ్చేమో : నటుడు
శివాజీనగర: విధానసభ ఎన్నికల్లో బెంగళూరు రాజరాజేశ్వరి నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సినీ నటుడు హుచ్చ వెంకట్ తెలిపారు. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వినూత్న నటన ప్రదర్శిస్తూ ఆయన సినీ అభిమానులకు సుపరిచితమే. శనివారం ప్రెస్‌క్లబ్‌లో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే మునిరత్నం అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అందుచేత ఈసారి కాంగ్రెస్‌పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వదన్నారు. అలాగే జేడీఎస్ సైతం మునిరత్నంకు టికెట్ ఇవ్వటానికి నిరాకరిస్తోందని, ఒకవేళ టికెట్ ఇస్తే ముందు ఏర్పడే బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కళంకం ఏర్పడుతుందని ఇవ్వదని జోస్యం చెప్పారు. ఇప్పటికే కుక్కర్ల రాజకీయం ఆరంభమైందని, అంతేకాకుండా చీరలు, మద్యం అమ్మకాలు అధికమయ్యాయని తెలిపారు. ఇకపై స్థలాలు అమ్ముతారు, విధానసౌధను సైతం అమ్మటానికి వెనుకాడని నాయకులకు ఎన్నికల్లో అవకాశం కల్పించరాదని పిలుపునిచ్చారు. మునిరత్నం ఎమ్మెల్యేగా కాకముందు ఉన్న బ్యాంకు బ్యాలెన్స్, ప్రస్తుతమున్న బ్యాంకు బ్యాలెన్స్‌పై లోకాయుక్త తనిఖీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. వినూత్న రీతిలో ప్రచారం చేపడతా త్వరలోనే ఎమ్మెల్యే నామినేషన్ వేసిన తరువాత వినూత్నంగా ప్రచారం చేపడతానన్నారు. నరేంద్ర మోదీ, బరాక్ ఒబామా సైతం చేపట్టని ప్రచారాన్ని చేపట్టాలని ప్లాన్ చేసుకున్నానని మీడియాకు చెప్పారు. తనది కుక్కర్ల పార్టీ కాదని, ఎన్నికల్లో గెలిపిస్తే తనకు వచ్చే జీతం తీసుకొంటూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తానన్నారు. -
రేపే కాషాయ జాబితా?
సాక్షి, బెంగళూరు: ప్రధాన ప్రతిపక్షం లిస్టు తయారీలో తలమునకలైంది. గతానుభవాల దృష్ట్యా ఈసారి జాగ్రత్తగా అడుగులేస్తోంది. అభ్యర్థుల తుది జాబితాలో తమకు చోటు దక్కుతుందో లేదోనని మథనపడుతూ గతనెల రోజులుగా బీజేపీ నేతలు చూస్తున్న ఎదురుచూపులకు ఎట్టకేలకు సోమవారం లోపు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి ప్రజాదరణ కలిగిఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. అదేవిధంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు, గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన నేతలకు కూడా టికెట్లు ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవడంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇలా ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల తుదిజాబితాపై శనివారం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప,రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధర్‌రావుల నేతృత్వంలో నగరశివార్లలోని ఓ రెసార్ట్‌లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇద్దరు కంటే ఎక్కువ ఆశావహులున్న నియోజకవర్గాల్లో టికెట్లు ఎవరికి ఇవ్వాలో, టికెట్లు దక్కని నేతలను ఎలా బుజ్జగించాలనే విషయాలతో పాటు తీవ్రమైన పోటీ ఉండే, ముఖ్యమైన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. టికెట్లు దక్కలేదని ఎవరూ అల్లరి చేయరాదని, వారికి తగిన అవకాశం కల్పిస్తామని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు, రేపు ఢిల్లీలో మథనం 16 రకాల కేటగిరీల్లో సమీక్షలు నిర్వహించి రూపొందించిన అభ్యర్థుల జాబితాతో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్రమంత్రి అనంతకుమార్లు నేడు (ఆదివారం)ఢిల్లీకి చేరుకోనున్నారు. నెలరోజుల పాటు ముమ్మర కసరత్తులు చేసి సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాపై పార్టీ సీనియర్ నేతలతో పాటు స్క్రీనింగ్ కమిటీతో చర్చించిన అనంతరం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వంద మంది అభ్యర్థులతో మొదటి జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు విజయం బీజేపీదేనన్న నమ్మకం ఉన్న మరో 40 నియోజకవర్గాలకు కూడా అదేరోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు మరింత లోతుగా విశ్లేషణలు,సమీక్షలు నిర్వహించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడానికి బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం నగరానికి చేరుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ లిస్టుపై కసరత్తుకు నాయకత్వం వహించారు. -
ఆ పథకాలు ఏవీ?
చిక్కబళ్లాపురం: కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఏకమై బీజేపీని ఓడించాలని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం నగరంలోని సర్‌ఎం విశ్వేశ్వరయ్య క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పేది ఒకటి చేసేది మరొకటని అన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలను జమ చేస్తామన్నారు, చేశారా? అని ప్రశ్నించారు. మేక్ఇన్ఇండియా, స్టార్టప్ ఇండియా, సిటప్ ఇండియా ఇవన్నీ ఏమైనట్టు అని అన్నారు. ‘నీరవ్‌మోదీ వంటివారు రూ.30 వేల కోట్లను దోచుకొని పరారయ్యారు, వారి గురించి మాట్లాడరేం. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం అంటే యడ్యూరప్పదే అంటారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల కన్నా కర్ణాటక ఎంతో అభివృద్ధి చెందింది అని వారే చెబుతారు. నోట్లను రద్దు చేసి పేదలను బ్యాంకుల ముందు నిలబెడతారు’ అని మండిపడ్డారు. ‘మోదీ అంబేడ్కర్ ఫోటో ముందు నిలబడి నమస్కారం చేస్తారు, అయితే దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తారు’ అన్నారు. సీఎం సిద్ధరామయ్య ప్రసంగిస్తూ మోదీ తప్పుడు హామీలనిస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టారన్నారు. ఎత్తినహోళె పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు బీజేపీ నేతలు దళితులను నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు వారింటికి వెళ్లి హోటల్ నుంచి తెప్పించిన భోజనాలను ఆరగిస్తారు, సిగ్గు చేటు అని విమర్శించారు. కాగా, కోలారు, ముళబాగిలు, కేజీఎఫ్లలోనూ రాహుల్‌గాంధీ సభల్లో పాల్గొని ప్రసంగించారు. -
మాజీ సీఎం ఇంటిని సందర్శించిన రాహుల్ గాంధీ
కేజీఎఫ్: ఎన్నికల ప్రచారం కోసం జిల్లా పర్యటనకు వచ్చిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాలూకాలోని క్యాసంబళ్లి గ్రామంలో ఉన్న రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి కేసి రెడ్డి నివాసాన్ని సందర్శించారు. ఇదే సమయంలో స్థానిక నాయకులు 1951లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా క్యాసంబళ్లి గ్రామంలోని కేసి రెడ్డి నివాసంలో ఓ రాత్రి గడిపిన విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకు వెళ్లారు., జవహర్లాల్ నెహ్రూ విశ్రమించిన గదిని కేసి రెడ్డి కుటుంబీకులు రాహుల్‌గాంధీకి చూపించారు. కేసి రెడ్డి నివాసం చూసిన రాహుల్ గాంధీ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసి రెడ్డి కుటుంబంతోపాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. -
మోది ఓ అబద్దాల కోరు
కోలారు: ప్రధానమంత్రి నరేంద్రమోది ఓ అబద్దాల కోరు అని ప్రధాని వల్ల దేశ అభివృద్ధి ఎంతమాత్రం సాధ్యం కాదని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ నరేంద్రమోదిపై నిప్పులు చెరిగారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని బంగారుపేట సర్కల్ నుంచి టవర్ క్లాక్వరకు రోడ్‌షో నిర్వహించిన అనంతరం క్లాక్‌టవర్ వద్ద ప్రజల నుద్దేశించి మాట్లాడారు. నోట్ల రద్దు దళితులు మరియు ఆదివాసీలపై జరిపిన దౌర్జన్యం, హత్యలు, రైతుల సమస్యలపై కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రశ్నలకు మోహం చాటేసిన ప్రధాని లోక్‌సభలోకి అడుగుపెట్టలేదన్నారు. ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలన్నారు. అయితే కాంగ్రెస్ సత్యం మార్గంలో వెళుతోందన్నారు. నరేంద్ర మోది మన్‌కీ బాత్‌కి ,రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మనసులో మాటకి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజల కిచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చిందన్నారు. ఈ సందర్భంగా సిఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జి కేసి వేణుగోపాల్, కేపిసిసి అధ్యక్షుడు పరమేశ్వర్, ఎఐసిసి కార్యదర్శి మధు యాక్షిగౌడ, ప్రచార సమితి అధ్యక్షుడు డీకే శివకుమార్, లోక్‌సభ సభ్యుడు కేహెచ్ మునియప్ప, జిల్లా ఇంఛార్జి మంత్రి కేఆర్ రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
చామరాజపేటేలో చమక్కు
కేజీఎఫ్: ప్రధాని నరేంద్రమోది, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై నిప్పులు చెరిగారు. శనివారం నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొని బీజేపీని దుమ్మెత్తి పోశారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోది ఎన్నికల ముందు ప్రజల కిచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. ప్రతి పౌరుడి ఖాతాలోకి 15 లక్షలు వేస్తానని లేని పోని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.దేశంలో 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నిరుద్యోగులకు ఆశలు కల్పించి వారి ఆశలను అడియాశలు చేశారని ఆరోపించారు. అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతుల అప్పులను మాఫీ చేయడంలో పూర్తిగా నిర్ల„ýక్ష్యం వహించారన్నారు. బ్యాంకులను మోసం చేసిన వారు కళ్లెదురుగా విదేశాలకు పారిపోతుంటే చూస్తూ ఉన్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి మొక్కే నరేంద్రమోది దళితులపై దౌర్జన్యాలను అరికట్టలేక పోతున్నారని అన్నారు. బీజేపీ నాయకులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు ఇది వారి మానసిక స్థితిని తెలియ జేస్తోందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు దళితుల ఇంట్లో టిఫిన్ చేస్తున్నామని తెలిపి హోటల్ నుంచి తెప్పించుకుని తింటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్రంలో మంత్రులు మీయూష్‌గోయల్ తదితరులు అవినీతి ఊబిలో చిక్కుకున్నారన్నారు. రైతుల 8 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడం ద్వారా రైతు పక్షపాతి అని నిరూపించుకుంద,ని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి తీసుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా సిఎం సిద్దరామయ్య, కేపిసిసి అధ్యక్షుడు పరమేశ్వర్, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి కేసి వేణుగోపాల్, కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలీ, మల్లిఖార్జున ఖర్గే,డీ కే శివకుమర్, లోక్‌సభసభ్యుడు రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
మోదీ, అమిత్‌షాలకు ఓటమి భయం : రాహుల్
కేజీఎఫ్: ప్రధాని నరేంద్రమోది, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై నిప్పులు చెరిగారు. శనివారం నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొని బీజేపీని దుమ్మెత్తి పోశారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోది ఎన్నికల ముందు ప్రజల కిచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. ప్రతి పౌరుడి ఖాతాలోకి 15 లక్షలు వేస్తానని లేని పోని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.దేశంలో 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నిరుద్యోగులకు ఆశలు కల్పించి వారి ఆశలను అడియాశలు చేశారని ఆరోపించారు. అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతుల అప్పులను మాఫీ చేయడంలో పూర్తిగా నిర్ల„ýక్ష్యం వహించారన్నారు. బ్యాంకులను మోసం చేసిన వారు కళ్లెదురుగా విదేశాలకు పారిపోతుంటే చూస్తూ ఉన్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి మొక్కే నరేంద్రమోది దళితులపై దౌర్జన్యాలను అరికట్టలేక పోతున్నారని అన్నారు. బీజేపీ నాయకులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు ఇది వారి మానసిక స్థితిని తెలియ జేస్తోందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు దళితుల ఇంట్లో టిఫిన్ చేస్తున్నామని తెలిపి హోటల్ నుంచి తెప్పించుకుని తింటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్రంలో మంత్రులు మీయూష్‌గోయల్ తదితరులు అవినీతి ఊబిలో చిక్కుకున్నారన్నారు. రైతుల 8 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడం ద్వారా రైతు పక్షపాతి అని నిరూపించుకుంద,ని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి తీసుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా సిఎం సిద్దరామయ్య, కేపిసిసి అధ్యక్షుడు పరమేశ్వర్, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి కేసి వేణుగోపాల్, కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలీ, మల్లిఖార్జున ఖర్గే,డీ కే శివకుమర్, లోక్‌సభసభ్యుడు రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
బయలుసీమలో ఆధిపత్యం ఎవరిదో ?
బొమ్మనహళ్లి : మధ్య కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో ఈసారి ఏ పార్టీని విజయం వరిస్తుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ జిల్లాల్లోని అధిక భాగాన్ని బయలు సీమగా పరిగణిస్తారు. దావణగెరె, చిత్రదుర్గ, తుమకూరు, చిక్కబళ్లాపురం, కోలారు, రామనగర, బెంగళూరు గ్రామీణ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో తొలి నుంచీ కాంగ్రెస్‌దే ఆధిపత్యం. దావణగెరె, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల్లో మాత్రమే బీజేపీ, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీ ఉనికి నామమాత్రమే కనుక కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య అక్కడ ముఖాముఖి పోటీలు అనివార్యమవుతున్నాయి. మొత్తం 44 స్థానాలున్న ఈ ప్రాంతంలో అధికార కాంగ్రెస్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకత, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి లాంటి అంశాలు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు వీరశైవ–లింగాయతకు ప్రత్యేక మత హోదా కల్పించాలన్న సిఫార్సు కూడా ఆ పార్టీ పుట్టి ముంచేట్లు ఉన్నాయి. ముఖ్యంగా దావణగెరె, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల్లో వీరశైవ–లింగాయత్‌లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఈ జిల్లాల్లో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా పరిగణించే ఎస్సీ, ఎస్టీలు ఈ జిల్లాల్లో చెప్పుకోదగిన సంఖ్యలో ఉండడం ఆ పార్టీకి లాభించే అంశం. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నందున, ఎక్కువ నియోజక వర్గాల్లో కొత్త ముఖాలను పరిచయం చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. గత శాసన సభ ఎన్నికల్లో జేడీఎస్ ఇక్కడ గణనీయమైన ఫలితాలను సాధించింది. తుమకూరు జిల్లాలోని మొత్తం 11 స్థానాలకు గాను ఆరింటిని తన ఖాతాలో వేసుకుంది. ఇదే జిల్లాలోని కొరటగెరె నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేపీసీసీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర అనూహ్యంగా జేడీఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అలాగే కోలారు జిల్లాలోని మాలూరులో బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఎస్ఎన్. కృష్ణయ్య శెట్టి సైతం జేడీఎస్ అభ్యర్థి చేతిలో పరాభవం చెందారు. ఈ జిల్లాల్లోని అనేక నియోజకవర్గాలకు జేడీఎస్ ఇదివరకే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీకి 2013 ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్ణాటక జనతా పార్టీ పేరిట వేరు కుంపటి పెట్టుకోవడమే దీనికి ప్రధాన కారణం. ఈసారి ఈ ప్రాంతంలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. 2007లో ఏర్పడిన చిక్కబళ్లాపురం జిల్లాలో ఆ పార్టీ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు నియోజక వర్గం నుంచి బళ్లారి ఎంపీ బీ. శ్రీరాములును పోటీ చేయించడం ద్వారా ఎస్టీ ఓట్లను పార్టీ వైపునకు సంఘటిత పరచాలని బీజేపీ యోచిస్తోంది. ఇంకా రామనగర జిల్లాలో సీపీ.యోగీశ్వర్ (చన్నపట్టణ), బెంగళూరు గ్రామీణ జిల్లాలో బీఎన్. బచ్చేగౌడ (హొసకోటె), కోలారు జిల్లాలో కృష్ణయ్య శెట్టి లాంటి సీనియర్ నాయకుల నేతృత్వంలో పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకునే దిశగా పావులు కదుపుతోంది. 2013 ఎన్నికల్లో బెంగళూరు గ్రామీణ జిల్లాలో కాంగ్రెస్, జేడీఎస్‌లు రెండేసి స్థానాలను, కోలారు జిల్లాలో కాంగ్రెస్ మూడు, జేడీఎస్, ఇండిపెండెంట్ చెరొకటి, చిక్కబళ్లాపురం జిల్లాలో కాంగ్రెస్, జేడీఎస్‌లు రెండేసి, ఇండిపెండెంట్ ఒక చోట, రామనగర జిల్లాలో జేడీఎస్ రెండు చోట్ల, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు చెరో స్థానంలో, తుమకూరు జిల్లాలో కాంగ్రెస్ నాలుగు, జేడీఎస్ ఆరు, బీజేపీ ఒక స్థానంలో, చిత్రదుర్గ జిల్లాలో కాంగ్రెస్ నాలుగు, బీజేపీ, బీఎస్ఆర్ కాంగ్రెస్‌లు చెరో స్థానంలో, దావణగెరె జిల్లాలో కాంగ్రెస్ ఏడు, జేడీఎస్ ఒక చోట గెలుపొందాయి. -
డేగకన్ను
బొమ్మనహళ్లి/ బనశంకరి: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరుతో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఈసీ డేగ కన్ను వేసింది. తమ తనిఖీ బృందాలు ముమ్మరంగా దాడులు జరిపి అక్రమ వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈవో) సంజీవ్‌కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం విధానసౌధలో తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1,156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 1,255 స్థిర తనిఖీ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని, కోడ్ ఉల్లంఘనలను అరికడుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 12,537 గోడల పైన రాసిన రాతలను, 17,693 వాల్ పోస్టర్లను,7,711 ఫ్లెక్సి బ్యానర్లను తొలగించడం జరిగిందన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1.63 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 30 వేల విలువ చేసే 198 దోసె తవ్వలు, 2 లక్షలవిలువైన వంటపాత్రలు కూడా పట్టుకున్నామన్నారు. 18 కేసులను నమోదు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 131 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా 3054 లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 1807 మంది నేరచరితులపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మీద 90 వేల పైన ఆయుధాలను వశపరచుకున్నారు. కాగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో నాయకుల ముఖాలకు ముసుగులు వేస్తున్నారు. బెంగళూరులో కెంపేగౌడ విగ్రహాలు శనివారం ఉదయం నుంచి ముసుగులతో దర్శనమిచ్చాయి. చెక్‌పోస్టులు, కేంద్ర బలగాలు: సీపీ ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు నగర వ్యాప్తంగా 400కు పైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు అన్నివైపులా భారీ భద్రత కల్పించినట్లు నగర పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర పరిధిలోని 28 నియోజకవర్గాల్లో భద్రత కోసం సుమారు 45 కంపెనీల కేంద్ర రిజర్వు బలగాలను తరలించామన్నారు. ఇప్పటికే 15 కంపెనీల బలగాలు నగరానికి చేరుకున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఏసీపీ నోడల్ అధికారిగా నియమించామని, ఆరు సంచార బృందాలను నియమించి అందులో రెవెన్యూ, పోలీస్ శాఖకు చెందిన అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. ప్రతి నియోజకవర్గానికి మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. నగర సరిహద్దులో 20 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడక్కడ పోలీస్ అధికారులు తాత్కాలిక చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 400కు పైగా పరిశీలనా బృందాలు ఎన్నికల్లో అక్రమాలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులను తీవ్రంగా పరిగణిస్తామని సునీల్‌కుమార్ తెలిపారు. రాహుల్‌గాంధీ పర్యటన సందర్బంగా బెంగళూరు నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా శుక్రవారం లభించిన రూ. కోటిన్నర నగదు ఏ పార్టీ తెలియదని, విచారణ చేస్తున్నామని తెలిపారు. -
అక్కడ పోటీ చేస్తే సీఎం గెలుపు అసాధ్యం?
యశవంతపుర : చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తే గెలవటం అసాధ్యమంటూ ఇంటెలిజెన్స్ విభాగం పేరుతోనున్న ఓ పత్రం వైరల్ కావడం సంచలనం రేగింది. అయితే ఇది నకలీ నివేదిక అని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఈ నివేదికపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీఐజీకి సూచించినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కాగా, అలాంటి నివేదిక ఏదీ ఇంటెలిజెన్స్ వర్గాలు తమ కార్యాలయానికి ఇవ్వలేదని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. తమ విభాగం కన్నడలో మాత్రమే ఇస్తుందని, అయితే నివేదిక ఆంగ్లంలో ఉన్నందున అది నకిలీదని నిఘా అధికారులు ఖండించారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి (వరుణ), బసవకల్యాణ, గంగావతి, శివాజీనగర నియోజకవర్గంలో పోటీ చేస్తే ఏలా ఉంటుందనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు గోప్యంగా నివేదిక చేయించారు. నాలుగు చోట్ల కూడా ఓడిపోతారంటూ నివేదిక శుక్రవారం రాత్రి నుండి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ నివేదికపై జేడీఎస్ నేత కుమారస్వామి సీఎం సిద్ధరామయ్యపై పలు ఆరోపణలు చేశారు. అయన హుబ్లీలో విలేకర్లతో మాట్లాడారు. తను ఎక్కడ నుండి పోటీ చేయాలో సర్వే చేయించి అధికారం దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు కుమార ఆరోపించారు. నేడు ప్యాలెస్ మైదానంలో రాహుల్ సభ సాక్షి, బెంగళూరు: ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో కాంగ్రెస్ భారీ బహిరంగ నిర్వహించనుంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొ ంటారు. ఇటీవల జరిగిన ప్రధాని మోదీ సభకు దీటుగా జనాన్ని తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమయ్యారు. ఇందుకోసం మూడు వేలకు పైగా కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులను కేటాయించినట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు జ్ఞానభారతి ఆడిటోరియంలో జరిగే సమావేశానికి హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా నగరంలోని ప్యాలెస్ మైదానం చేరుకుని సభలో పాల్గొంటారు. -
జీవితంలో అమిత్ షా చెప్పిన ఒకే ఒక్క నిజం..
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్ష బీజేపీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల దాడిని తీవ్రం చేశారు. ఎట్టకేలకు ఎన్నికల నేపథ్యంలోనైనా బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షా తన జీవితంలో ఒక్కసారే నిజాన్ని చెప్పారన్నారు. బీజేపీ నేత, మాజీ సీఎం యాడ్యూరప్ప ప్రభుత్వమే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వమని అమిత్ షా చెప్పడమే ఆ నిజమంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కోలార్‌లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆరెస్సెస్‌లపై విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ సిద్ధాంతాలను, ఆరెస్సెస్ భావజాలాన్ని ఓడించి బీజేపీని ఇంటికి సాగనంపుతుందన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోతుందని ప్రధాని మోదీకి కూడా తెలుసునని.. అందులో ఆయనలో భయం కనిపిస్తుందన్నారు. ఆపై ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ మంత్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ బీజేపీ అలా చేయాలనుకుంటే ముందుగా కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాల్సి ఉంటుందని ఘూటు వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ యుద్దం కాదని, కర్ణాటక ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న పోరాటమని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను అభివర్ణించారు. హెచ్ఏఎల్ నుంచి రాఫెల్ ఒప్పందాన్ని దూరం చేసి బెంగళూరుకు వచ్చే వేలాది ఉద్యోగాలను ఇక్కడి నిరుద్యోగులకు ప్రధాని మోదీ దూరం చేశారని రాహుల్ విమర్శించారు. -
వారసులొస్తున్నారు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వారసుల జోరు కనిపిస్తోంది. అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు ఈ సారి తమ వారసుల్ని రంగంలోకి దించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లకు ఈ నెల 24 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీ (ఎస్)లు టిక్కెట్ల పంపిణీపై భారీగా కసరత్తు చేస్తున్నాయి. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు తమ పిల్లల రాజకీయ భవిష్యత్‌కు బాటలు వెయ్యడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. వారికి టిక్కెట్లు ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కుమారుల మధ్య పోటీకి సై ? ఎంతోమంది వారసులు ఈ సారి బెర్త్‌లు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్నప్పటికీ అందరి దృష్టి ఇప్పుడు మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గంపైనే పడింది. ఈ నియోజకవర్గంలో అమీతుమీ తేల్చుకోవడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గం నుంచే కుమారుడ్ని రంగంలోకి దించడానికి సిద్దరామయ్య సర్వం సిద్ధం చేశారు. తన కుమారుడు పోటీ చేయడానికి వీలుగానే సిద్దరామయ్య ఈ సారి వరుణకు బదులుగా దాని పక్కనే ఉన్న చాముండేశ్వరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీజేపీ కూడా వరుణ నియోజకవర్గంలో యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను పోటీకి దింపాలని భావిస్తోంది. విజయేంద్ర అయితేనే యతీంద్రకు గట్టి పోటీ ఇవ్వగలడని అంచనాకి వచ్చింది. అంతే కాక వరుణ నియోజకవర్గంలో లింగాయత్‌ల జనాభా ఎక్కువ. విజయేంద్ర కూడా లింగాయత్ వర్గానికి చెందిన వాడు కావడంతో అతనిని బరిలోకి దింపితేనే పోటీ రసవత్తరంగా ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే విజయేంద్ర వరుణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే విజయేంద్రకు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వంశం పేరు చెప్పుకొని బీజేపీ నుంచి ఎవరూ టిక్కెట్ ఆశించలేరంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు పార్టీ కేడర్ ఆహ్వానం మేరకే తాను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజాసమస్యల్ని తెలుసుకుంటున్నానని విజేయంద్ర అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వ్యూహాలను కూడా రూపొందిస్తున్నట్టు చెప్పారు . మొత్తానికి వరుణ నియోజకవర్గంలో కుమారుల మధ్య పోటీ ఉంటుందా లేదా అన్న సస్సెన్స్‌కు మరి కొద్ది రోజుల్లోనే తెరపడనుంది. టిక్కెట్ రేసులో మరికొందరు వారసులు పార్టీలకతీతంగా చాలా మంది నాయకులు తమ వారసుల్ని తీసుకువచ్చే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, సీనియర్ నేతలు ఎందరో తమ పిల్లలకు టిక్కెట్ ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. కర్ణాటక హోం మంత్రి ఆర్.రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం బెంగుళూరు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా ఉన్న సౌమ్య టిక్కెట్ కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. న్యాయశాఖమంత్రి టీబీ జయచంద్ర కుమారుడు సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెఎన్ రాజన్న కుమారుడు రాజేంద్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన మార్గరెట్ ఆల్వా కుమారుడు నివేదిత్ ఆల్వాలు టిక్కెట్ల రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత పోటీ లేకపోయినా బీజేపీ నేతలు కూడా వారసుల్ని తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.బీజేపీ నేతపరిమళ నాగప్ప తన కుమారుడు ప్రీతమ్‌కు హనూర్ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల బరిలో కుటుంబానికి కుటుంబం మరోవైపు జేడీ (ఎస్)లో వారసులకు కొదవే లేదు. జేడీ (ఎస్) జాతీయ అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, మనవలు కూడా ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి ఆయన సోదరుడు హెచ్డీ రేవణ్ణలు మాత్రమే కాదు వారి భార్యలు అనిత కుమారస్వామి, భవానీ రేవణ్ణలు కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. రేవణ్ణ తన కుమారుడు ప్రజ్వల్‌ను కూడా ఈ సారి ఎన్నికల బరిలో దించుతూ ఉండడంతో, కుమారస్వామి కూడా తన కుమారుడు, నటుడైన నిఖిల్‌ను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. వాస్తవానికి నిఖిల్‌కు రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేకపోయినా బలవంతంగా ఒప్పించి తీసుకువస్తున్నట్టు పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి మంచి పట్టు ఉన్న పాత మైసూరు నుంచే నిఖిల్‌ను ఎన్నికల బరిలోకి దించాలని కుమారస్వామి యోచిస్తున్నారు..మొత్తంగా చూస్తే ఈ సారి ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఎక్కడ చూసినా వారసుల సందడే కనిపిస్తోంది. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీ సభలో కుర్చీలు విసరండి: జిగ్నేశ్
బొమ్మనహళ్లి: ప్రధాని మోదీ పాల్గొనే కర్ణాటక ఎన్నికల ప్రచార సభల్లో కుర్చీలు విసిరి గొడవలు సృష్టించాలని దళిత ఉద్యమ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే నినాదంతో కర్ణాటకలోని చిత్రదుర్గలో శుక్రవారం దళిత సంఘాలు నిర్వహించిన సమావేశంలో మేవానీ మాట్లాడారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. లక్షలాది మందిని నిరుద్యోగులుగా మారుస్తున్నారని విమర్శించారు. ప్రధాని ఎన్నికల ప్రచారానికి వస్తే ఈ విషయంపై కుర్చీలు విసిరి నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు చేయడం చూస్తుంటే దళితులను అణచివేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. -
కన్నడ బరిలో వారసుల సందడి!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అగ్రనేతలు తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 24 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్)లు టిక్కెట్ల పంపిణీపై కసరత్తును తీవ్రతరం చేశాయి. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు తమ పిల్లల రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేయడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. సిద్ధరామయ్య కొడుకు X యడ్యూరప్ప కొడుకు ? మైసూర్ జిల్లాలోని వరుణ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ఇక్కడి నుంచే పోటీచేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తన కుమారుడికి మార్గం సుగమం చేయడానికే సిద్దరామయ్య ఈ సారి వరుణకు బదులుగా, పొరుగునే ఉన్న చాముండేశ్వరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ కూడా వరుణ నియోజకవర్గంలో యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను పోటీకి దింపాలని భావిస్తోంది. విజయేంద్ర అయితేనే యతీంద్రకు గట్టి పోటీ ఇవ్వగలడని భావిస్తోంది. పైగా ఆ నియోజకవర్గంలో లింగాయత్‌ల జనాభా ఎక్కువ. ఇప్పటికే విజయేంద్ర వరుణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయేంద్రకు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వంశం పేరు చెప్పుకొని బీజేపీ నుంచి ఎవరూ టికెట్ ఆశించలేరంటూ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావు వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. టిక్కెట్లకు పోటాపోటీ.. మంత్రులు, సీనియర్ నేతలు ఎందరో తమ పిల్లలకు టిక్కెట్ ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. హోం మంత్రి ఆర్.రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం సౌమ్య బెంగుళూరు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. న్యాయశాఖమంత్రి టీబీ జయచంద్ర కుమారుడు సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెఎన్ రాజన్న కుమారుడు రాజేంద్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన మార్గరెట్ ఆల్వా కుమారుడు నివేదిత్ ఆల్వాలు టిక్కెట్ల రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత పోటీ లేకపోయినా బీజేపీ నేతలు కూడా వారసుల్ని తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ నేత పరిమళ నాగప్ప తన కుమారుడు ప్రీతమ్‌కు హనూర్ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జేడీ(ఎస్) నుంచి దేవెగౌడ కుటుంబమంతా! జేడీ (ఎస్)లో వారసులకు కొదవే లేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డి దేవెగౌడ కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, మనవలు ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దేవెగౌడ కొడుకు హెచ్డీ కుమారస్వామి, ఆయన సోదరుడు హెచ్డీ రేవణ్ణలు మాత్రమే కాదు వారి భార్యలు అనిత కుమారస్వామి, భవానీ కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. రేవణ్ణ తన కొడుకు ప్రజ్వల్‌ను ఈసారి ఎన్నికల బరిలో దించబోతుండడంతో, కుమారస్వామి తన కుమారుడు, నటుడైన నిఖిల్‌ను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఎక్కడ చూసినా వారసుల సందడే కనిపించబోతుంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కుమారన్న ‘కింగ్ మేకర్’ అవుతారా?
హర్దనహళ్ళి దొడ్డెగౌడ కుమారస్వామి.... అభిమానులు, జేడీ(ఎస్) కార్యకర్తలు అభిమానంగా పిలుచుకునే కుమారన్న... సిద్దరామయ్యకు కంటిలో నలుసుగా మారబోతున్నారా? కర్ణాటకలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్ ఆశలకు గండికొట్టబోతున్నారా? కుమారస్వామి బహిరంగ సభలకు భారీ సంఖ్యలో హాజరవుతున్న ప్రజల్ని చూస్తుంటే కర్ణాటక ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తాయని అనిపిస్తోంది. రెండు నెలల క్రితం వరకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ... జేడీ(ఎస్) ని పెద్దగా లెక్కలోకి వేసుకోలేదు. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న కుమారస్వామి బహిరంగ సభలకు, ర్యాలీలకు ప్రజలు భారీసంఖ్యలో హాజరవుతున్నారు. వాస్తవానికి రాహుల్‌గాంధీ, అమిత్‌షాల మీటింగ్‌ల కన్నా ఎక్కువ సంఖ్యలోనే. కుమారస్వామి వెంట చెప్పుకోదగ్గ పేరున్న నాయకులు లేరు. అలాగే కాంగ్రెస్, బీజేపీలకున్న హంగూ ఆర్బాటం కూడా లేదు. కాని భారీగా హాజరవుతున్న ప్రజలు కుమారస్వామిలో, జేడీ(ఎస్) నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలలాగే జేడి(ఎస్)కి కూడా అత్యంత కీలకమైనవి. 2006లో కాంగ్రెస్ – జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకల నేపధ్యంలో బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన కుమారస్వామి 20 నెలలపాటు అధికారాన్ని చెలాయించారు. కర్ణాటక చరిత్రలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 2008 ఎన్నికల్లో అధికారం కోల్పోయాక కర్ణాటకలో పునర్వైభవం కోసం జేడీ(ఎస్), కుమారస్వామి తీవ్రంగానే కృషి చేస్తున్నారు. ఈ సారి గెలవకపోతే కర్ణాటకలో జేడీ(ఎస్) ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే భయం కుమారస్వామిలో ఉంది. పాత మైసూరు ప్రాంతంలో జేడీ(ఎస్)కి మంచిపట్టు ఉంది. కనీసం 75 అసెంబ్లీ సీట్లలో జేడీ(ఎస్) కాంగ్రెస్‌కి గట్టిపోటీ ఇస్తోంది. మైసూర్, హాసన్, మాండ్య, తుమకూరు జిల్లాలతో పాటు బెంగళూరు శివారు ప్రాంతాల్లో జేడీ(ఎస్) ప్రభావం గట్టిగానే కనపడుతోంది. అనూహ్యంగా బలం పుంజుకుంటున్న జేడీ(ఎస్) కాంగ్రెస్‌ని కొంత కలవరానికి గురిచేస్తోంది. ఆరు నెలలక్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న కుమారస్వామి తొందరగానే కోలుకున్నారు. అనారోగ్య ఛాయలేమి కనపడకుండా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారీ సంఖ్యలో హాజరవుతున్న ప్రజల ఓట్లను రాబట్టుకోగలిగితే ఎన్నికల ఫలితాల తర్వాత కుమారస్వామి ‘కింగ్ మేకర్’ అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కాంగ్రెస్ కాని, బీజేపీ గానీ స్వంతంగా అధికారాన్ని చేజిక్కుంచుకోగలిగితే జేడీ(ఎస్) ఉనికి ప్రశార్థకమవుతుంది. ఈ నేపధ్యంలోనే ‘హంగ్ అసెంబ్లీ’ వస్తే కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చనేది జేడీ(ఎస్) ఆశ. జేడీ(ఎస్)ని బీజేపీ ‘బీటీమ్’ గా సిద్దరామయ్య ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనేది కాంగ్రెస్ ఆరోపణ. బీజేపీ మాత్రం జేడీ(ఎస్) వీలైనన్ని కాంగ్రెస్ సీట్లను తగ్గించగలిగితే కర్ణాటకలో గెలవొచ్చనే వ్యూహంలో ఉంది. ఎవరికో ‘బీటీమ్’ గా ఉండాలని కాదు... ఎన్నికల్లో మేమే గెలవబోతున్నామని కుమారస్వామి బహిరంగ సభల్లో చెబుతున్నారు. సిద్దరామయ్య, యెడ్యూరప్పల కన్నా తన పాపులారిటీ ఎక్కువని కుమారస్వామి నమ్మకం. ఇక కాంగ్రెస్ పార్టీ తన దాడిని ఎక్కువగా బీజేపీపైనే కేంద్రీకరించాలని ఆ పార్టీ నాయకుల ఆలోచన. కుమారస్వామిపై దాడి ఉదృతం చేస్తే అది జేడీ(ఎస్)కే మేలు చే స్తుందని వారి భయం. ఎవరి వ్యూహాలు వారివి. కర్ణాటక ప్రజలు మే 12 ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే... – ఎస్ గోపీనాథ్‌రెడ్డి -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు : ఈ రెండే కీలకం..
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌లు, దళితుల అంశాలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. మే 12న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు ప్రధాన వర్గాలకు సంబంధించిన అంశాలు పెనుప్రభావం చూపనున్నాయి. లింగాయత్‌లకు మైనారిటీ హోదాను మత నేతలు ఆమోదించరని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై సుప్రీం తీర్పు నేపథ్యంలో దళిత సంఘాల ఆందోళన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ఈ రెండు అంశాలపై తాజా పరిణామాలతో దళితులు, లింగాయత్‌ల మద్దతు కాంగ్రెస్‌కు లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా..వీటిపై ప్రజలకు ఎవరు దీటుగా వివరించగలరో వారికి అనుకూలంగా ఆయా వర్గాల మద్దతు అందివస్తుందని మరికొందరు సామాజిక విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. లింగాయత్‌లలో ఉన్న 99 ఉప కులాలతో కూడిన వారంతా నూతన మతంగా ఆవిర్భవించడానికి బీజేపీ మద్దతు ఇవ్వదని వీరశైవ లింగాయత్ మఠాలకు చెందిన 100 మందికి పైగా మత నేతలతో ఇటీవల సమావేశమైన సందర్భంగా అమిత్ షా స్పష్టం చేశారు. లింగాయత్‌లకు మైనారిటీ హోదాను ఎవరు కోరారని ఆయన ప్రశ్నించారు. అయితే బీజేపీకి మద్దతు ఇస్తూ లింగాయత్‌లను ప్రత్యేక మతంగా పరిగణించాలని కోరేవారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు దృష్టిసారిస్తారని ప్రముఖ సామాజిక విశ్లేషకులు, రచయిత చంద్రశేఖర్ పాటిల్ పేర్కొన్నారు. అయితే లింగాయత్‌ల మద్దతు తమకే ఉంటుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. లింగాయత్‌లకు మైనారిటీ హోదా కట్టబెడుతూ సీఎం సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపిస్తోంది. కర్ణాటక సీఎం అభ్యర్ధిగా లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పను బీజేపీ ప్రకటించడంతో వారి మద్దతు తమ పార్టీకే ఉంటుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులపై దళిత సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. సుప్రీం ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్ధానం దిగిరాకపోవడంపై దళిత సంఘాల ఆగ్రహం నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిణామం బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
సంక్షేమ ‘భాగ్యం’ చేతికందేనా?
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ కర్ణాటకలో రాజకీయ వేడి రాజుకుంటోంది. దక్షిణాదిలో గతంలో సొంతంగా అధికారంలోకి వచ్చిన ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో మరోసారి గెలుపుకోసం బీజేపీ తహతహలాడుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకొని దేశవ్యాప్తంగా 2019 సార్వత్రిక ఎన్నికల కోసం నైతిక స్థైర్యాన్ని పెంచుకునే వ్యూహరచనలో నిమగ్నమై ఉంది. ఈ నేపథ్యంలో కన్నడ ఓటరు నాడి ఎలా ఉంది? సిద్దరామయ్య ప్రభుత్వంపై ప్రజాభిప్రాయమేంటి? అయిదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ పార్టీని విజయతీరాలకు చేరుస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)తో కలసి ‘దక్ష’ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 2017 డిసెంబర్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు నిర్వహించిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. సంక్షేమ పథకాలపై ప్రజల మాటేంటి? సంక్షేమ పథకాలనగానే గుర్తొచ్చే పేర్లు.. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జయలలితలే. అయితే ఇదే బాటలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా ప్రజలను ఆకట్టుకునేలా ‘భాగ్య’ పేరుతో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వీటికి ప్రజల్లో మంచి ఆదరణ ఉండటంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరోసారి పట్టం గట్టేందుకు అవకాశం ఉందని ఏడీఆర్–దీక్ష సర్వే పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ప్రారంభించిన ‘అన్న భాగ్య’ (దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికే కిలో బియ్యం అందించే పథకం)కు ఈ సర్వేలో భారీ సానుకూలత వ్యక్తమైంది. ఇది అద్భుతమైనదని 79 శాతం మంది కితాబిచ్చారు. పాఠశాలలనుంచి ఆడపిల్లల డ్రాపవుట్స్‌ను తగ్గించేందుకు వారికి ఉచితంగా సైకిళ్లను ఇచ్చే ‘సైకిల్ భాగ్య’ పథకం పట్ల కూడా 66% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వాన నీటిని సంరక్షించి సమర్థవంతంగా వినియోగించడం ద్వారా వ్యవసాయ దిగుబడుల్ని పెంచే ‘కృషి భాగ్య’ బాగుందని 58% మంది రైతులు చెప్పారు. నిరుపేదలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించే ‘అనిల్ భాగ్య’ భేష్ అని 66 శాతం మంది అన్నారు. వెనుకబడిన, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన నవదంపతులకు 50 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇచ్చే ‘షాదీ భాగ్య’ పథకంపై కూడా 45 శాతం మంది సంతృప్తి ప్రకటించారు. తమిళనాడు ‘అమ్మ క్యాంటీన్’ల స్ఫూర్తితో గతేడాది ఆగస్టులో ఇందిర క్యాంటీన్ల పథకం మాత్రం ఆశించినంతగా ప్రజాదరణ పొందలేదని ఈ సర్వేలో తేలింది. 36 శాతం మంది ఇందిర క్యాంటీన్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తే 31 శాతం మందే ఈ పథకం బాగుందన్నారు. పదికి 7 మార్కులు ఈ సర్వేలో సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుపై అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా ఆయన పనితీరుకు 10కి 7 మార్కులు వేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు తేడాల్లేకుండా అత్యధికులు వివిధ రంగాల్లో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పాఠశాలల నిర్వహణ (7.85), విద్యుత్ సరఫరా (7.83), ప్రజా రవాణా (7.61), అవినీతి నిర్మూలన (6.77) సబ్సిడీ ధరలకే నిత్యావసర వస్తువుల పంపిణీ (7.35), ఉద్యోగ అవకాశాల కల్పన (6.70) వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందన్నారు. అయితే, ఈ ‘భాగ్య’ పథకాలు సిద్ధరామయ్యకు మరోసారి ‘భాగ్యా’న్నిస్తాయో లేదో చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి ఉండాల్సిందే. సిద్దరామయ్య సంక్షేమ పథకాలు అన్నభాగ్య కృషి భాగ్య సైకిల్ భాగ్య అనిల్ భాగ్య షాదీ భాగ్య క్షీర భాగ్య వసతి భాగ్య ఆరోగ్య భాగ్య ఇందిరా క్యాంటీన్లు – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీ.. ఎవరి మాటా వినరు!
సాక్షి, బళ్లారి/దావణగెరె: ‘ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారు. విపక్షాలను పట్టించుకోవడం లేదు.. ప్రజల కష్టాలను తెలుసుకోవడం లేదు.. తన అభిప్రా యాలను మాత్రం జనంపై రుద్ది ఇబ్బంది పెడుతున్నారు’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఆయన బుధవారం కర్ణాటకలోని దావణగెరెలో పర్యటిం చారు. నోట్ల రద్దుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నరకయాతన పడ్డారన్నారు. జీఎస్టీ నుంచి నిత్యావసర వస్తువులను మినహాయించాలని కోరినా పట్టించుకోలేద న్నారు. లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ అభిమతం కాదని, ఆ సంఘ ప్రముఖులు, స్వామీజీలు కోరుతున్నందునే ఆ మేరకు చర్యలు చేపట్టామని చెప్పారు. అనంతరం ఆయన లింగాయత్ లకు చెందిన ప్రముఖ సిద్ధగంగ మఠాన్ని సందర్శించి శివకుమార స్వామి(111) ఆశీస్సులు అందుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ ఆజమాయిషీ నుంచి ప్రభుత్వ వ్యవస్థలకు విముక్తి కల్పిస్తామన్నారు. -
బీజేపీ ఆఫీసుల్లో అంబేద్కర్ ఫొటోలున్నాయా?
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నలో పని చేస్తోన్న మోదీ ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్టును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. విద్వేషం, లాఠీలు, తూటాలు, తప్పుడు వాగ్ధానాలతో దేశాన్ని నడిపించలేరని అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం శివమొగ్గలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘దళితులను, గిరిజనులను ఈ బీజేపీ సర్కార్ దారుణంగా మోసం చేస్తున్నది. దేశంలోని ఎస్సీ, ఎస్టీలందరికీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తున్నదో.. అంతకు రెట్టింపు నిధులను కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాలకు ఖర్చుచేస్తున్నది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. బీజేపీకి దళితులంటే ఎంత ప్రేమ ఉందో’ అని రాహుల్ అన్నారు. పరీక్షా పత్రాల నుంచి డోక్లాం సమస్య దాకా అన్నింటా మోదీ వైఫల్యం చెందారని, యడ్యూరప్ప లాంటి అవినీతిపరులను పక్కనే ఉంచుకొని మోదీ నీతివచనాలు వల్లిస్తారని కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా చేశారు. ఖర్గే ఫైర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్టులో మార్పులు, భారత్ బంధ్ నేపథ్యంలో తలెత్తిన హింస తదితర అంశాలపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి ఉందా? బీజేపీ పార్టీ కార్యాలయాల్లో అంబేద్కర్ బొమ్మకూడా కనబడదు. అలాంటి వీళ్లు దళితులను ఉద్ధరించడానికే చట్టాల్లో మార్పులు చేశామంటే నమ్మాలా?’ అని ఖర్గే ఫైర్ అయ్యారు. -
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణపై దృష్టి..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విధానం, సిద్ధాంతం లేకుండా బీజేపీపై కుట్రలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూటములు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి కుట్రలను పార్టీ శ్రేణులు అడ్డుకోవాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన గ్రేటర్ బీజేపీ పోలింగ్ బూత్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో యుద్ధ సైనికుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ సూచించారు. ‘హైదరాబాద్‌లో ప్రతి కార్యకర్త పార్టీ కోసం శ్రమించాలి. ఉట్టి కట్టలేని ఆయన స్వర్గానికి నిచ్చెన వేసినట్లు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తాడట. ప్రజలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి పెడుతుంది. దేశవ్యాప్తంగా జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా కూటములు కుట్రలు చేస్తున్నాయి. వాటిని అడ్డుకుని బీజేపీని గెలిపించాలి. నరేంద్ర మోదీ గాలి దేశమంతా ఒకే విధంగా ఉంది. తెలంగాణలో పార్టీ గెలవకపోతే తప్పు మనదిగానే జాతీయ పార్టీ భావిస్తుంది. ఇక కాగ్ నివేదిక ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉంది. కాగ్ నివేదిక వచ్చిన నాటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేతలు ఎవరూ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ప్రజల సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. ఇదే నినాదంతో గ్రేటర్లో కార్యకర్తలు ప్రజలలోకి వెళ్లాలి. ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ప్రతి డివిజన్లో నిర్వహించాలి’ అని పేర్కొన్నారు. -
కర్ణాటకలో మారుతున్న సమీకరణలు
సాక్షి, బెంగళూరు : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తూనే మరోవైపు కీలక నేతలతో పాటు, సినిమా నటులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. తాజాగా కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం ఆయన జేడీఎస్ రాష్ట్ర అధ్యకుడు హెచ్.డి కుమార స్వామితో సమావేశమయ్యారు. దీంతో సుదీప్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని సుదీప్ ఖండించారు. కుమారస్వామిని తాను మర్యాదపూర్వకంగానే కలిశానని పేర్కొన్నారు. కాగా రాజకీయ విషయాల పైనే రెండు గంటలపాటు సుదీప్తో చర్చించామని జేడిఎస్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. గతంలో జేడీఎస్ అధి నేత దేవగౌడ సుదీప్‌ని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. మరో వైపు బీజేపీకి చెందిన మాజీ మంత్రి హరతాళ్ హాలప్ప కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మరో బీజేపీ మాజీ మంత్రి కూడా హస్తం అందుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మాజీ బీజేపీ మంత్రి బీఎస్ అనంద్ సింగ్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇలా అన్ని పార్టీల నుంచి వలసలు, కొత్త వాళ్లు రాజకీయాల్లోకి రావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెతిస్తున్నాయి. -
ఇన్నాళ్లూ బీజేపీ నేతలు నిద్రపోయారా?
బెంగళూరు: ‘ఐదేళ్లుగా బీజేపీ నిద్రపోయిందా? గత 15 అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిధులపై లెక్కలు చూపిన సమయంలో వారు నిద్రపోయారా? ప్రజలను మోసం చేయడం మానండి. పదేపదే అబద్ధం చెబితే నిజం కాబోదు..’అంటూ బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. కేంద్రం నుంచి అందిన దాదాపు రూ.2,19,506 కోట్ల నిధులకు లెక్కలు చెప్పాలని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. గత ఐదేళ్లలో కేంద్రం నుంచి అందిన నిధుల్లో ప్రతి రూపాయికీ అసెంబ్లీలో లెక్క చూపామని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ విషయం బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత జగదీష్ షెట్టర్‌కు కూడా తెలుసునని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అమలు కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించిందని ఆరోపించారు. -
నిధుల్లో ఉత్తర– దక్షిణ తేడా లేదు
మైసూరు: కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులో తాము ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలను వేర్వేరుగా చూడటం లేదనీ, కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందనడం అవివేకమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ‘కర్ణాటకలో సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకథలు చెప్పి, బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీని సమాధి చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు’ అని అన్నారు. కర్ణాటకలో వచ్చే నెలలో జరగనున్న శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా షా మైసూరులో శుక్ర, శనివారాల్లో పర్యటించారు. కాంగ్రెస్ అధిష్టానానికి కావాల్సినంత డబ్బిచ్చే ఏటీఎంలా కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తోందనీ, అవినీతి సర్కారును గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సర్కారు రైతుల రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు బ్యాంకులకు ఒక్క రూపాయీ విడుదల చేయలేదనీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తుండగా కర్ణాటకలో ఎందుకు సాధ్యం కావట్లేదని షా ప్రశ్నించారు. ఒంటరిగానే కర్ణాటకలో పోరాటం కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అమిత్ షా చెప్పారు. దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్‌తో పాటు ఏ ఇతర పార్టీతోనూ మైత్రికి సిద్ధంగా లేమని స్పష్టంచేశారు. దేశంలో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోందని, కర్ణాటకలోనూ గెలిచి దక్షిణాదిలో బీజేపీ సత్తా చాటుతుందన్నారు. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే లింగాయత్ ఓట్ల కోసం వారికి ప్రత్యేక మతం హోదాను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిందని అమిత్ షా విమర్శించారు. మాజీ మంత్రి గాలిజనార్ధనరెడ్డికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అమిత్ షా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
కర్ణాటక ఎన్నికలు; బీజేపీకి మరో షాక్
హుబ్లీ: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘ప్రధాని మోదీ దేశాన్ని సర్వనాశనం చేశారు..’ అని అమిత్ షా ప్రసంగాన్ని తప్పుగా అనువదించిన ఎంపీ ప్రహ్లాద్ జోషి గుర్తున్నారు కదా, నోరుజారి అభాసుపాలైన ఆ కీలక నేత.. ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి కొత్త తలనొప్పులు కొనితెచ్చుకున్నారు. విద్వేషం: హుబ్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్వాడ ఎంపీ అయిన ప్రహ్లాద్ జోషి శుక్రవారం సదార్సోఫా గ్రామంలో పర్యటించారు. ‘‘ఇది ఊరు కాదు, మినీ పాకిస్తాన్లా ఉంది. ఇక్కడి మసీదుల్లో అక్రమంగా ఆయుధాలను దాచి ఉంచారు’’ అని ఎంపీ అనడంతో అక్కడున్నవారు షాకయ్యారు. ఇటీవలే మరణించిన ఓ బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సదార్సోఫా ముస్లిం మత పెద్దలు కసభాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఎంపీ ప్రహ్లాద్ జోషిపై ఐపీసీ153, 298 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. వరుస షాక్‌లు: ‘యడ్యూరప్ప అవినీతిలో నంబర్ వన్’ అని అమిత్ షా నోరుజారడం మొదలు.. ‘మోదీ దేశాన్ని నాశనం చేశాడ’నే తప్పుడు అనువాదం, షా ప్రసంగిస్తున్నవేళ యడ్డీ కునుకు తీయడం, ఇప్పుడు ఏకంగా బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషిపై కేసు నమోదు కావడం.. ఇలా బీజేపీ కర్ణాటక ఎన్నికల ప్రచార పర్వంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
అమిత్ షా స్పీచ్.. కునుకు తీసిన యెడ్డీ
సాక్షి, బెంగళూరు : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో వరుసగా అపశృతులు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు మరో అవమానం తోడైంది. ఆయన ప్రసంగిస్తున్న వేళ బీజేపీ నేత, మాజీ సీఎం యాడ్యురప్ప హాయిగా కునుకు తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా మైసూర్ రోడ్‌లోని రాజేంద్ర కళామందిర్లో బీజేపీ నిర్వహించిన సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో షా ఆవేశపూరితంగా ప్రసంగిస్తుంటే యెడ్డీ మాత్రం హాయిగా నిద్రపోయారు. అది గమనించిన షా.. పదే పదే యెడ్డీని చూస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయినప్పటికీ తోటి నేతలవెరూ యెడ్డీని కదిలించే ప్రయత్నం చేయలేదు. ఇక ఈ వీడియో తమకు చిక్కటంతో కాంగ్రెస్ పార్టీ.. సోషల్ మీడియాలో వీడియోను ట్రోల్ చేస్తోంది. మరోవైపు జాతీయ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. బీజేపీలోకి వలసలు మరో పక్క ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా జేడీఎస్ ఎమ్మెల్యే మల్లికార్జున ఖుబా బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరో జేడీఎస్ నేత సందేశ్ స్వామి బీజేపీలోకి చేరిపోయారు. మూడుసార్లు కౌన్సిలర్‌గా పని చేసిన సందేశ్.. టికెట్ దక్కకపోవటంతో ఆ అసంతృప్తితో పార్టీ మారిపోయారు. ఇక మొన్నీమధ్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాలికయ్యా వెంకయ్య గుత్తేదార్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. -
కునుకు తీసిన యెడ్డీ.. వైరల్ వీడియో!
-
ఆ పెద్ద మనిషి అబద్ధపు వాగ్దానాలను నమ్మరు..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ చీఫ్ అమిత్ షా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మధ్య వాగ్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మైసూరులో పర్యటిస్తున్న అమిత్ షా మాట్లాడుతూ.. ‘మే నెలలో సిద్ధరామయ్య, జేడీఎస్‌లకు గట్టి షాక్ తగులుతుందం’టూ వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా గుజరాత్లో రాజ్‌పుత్ వర్గీయులు దళిత యువకుడు ప్రదీప్ రాథోడ్‌ను హత్య చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సిద్ధరామయ్య ట్విటర్ వేదికగా బీజేపీ చీఫ్‌పై విమర్శలు గుప్పించారు. ‘సొంత రాష్ట్రంలోనే దళితుల పట్ల అమానుష చర్యలు జరుగుతాయి. కానీ ఆ రాష్ట్రానికి చెందిన పెద్దమనిషి మరో రాష్ట్రానికి వచ్చి దళితులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వం. వారి సంక్షేమం కోసం అన్ని చర్యలు చేపడతాం అంటూ అబద్ధపు వాగ్దానాలు చేస్తారు. ఈ విషయం గురించి ఎవరైనా మాట్లాడితే వారిని కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడే అవివేకులు అంటూ ముద్ర వేస్తారు. కానీ కన్నడిగులు ఆ పెద్ద మనిషి అబద్ధపు వాగ్దానాలను నమ్మరు’ అంటూ ట్వీట్ చేశారు. Shocking inhumanity towards Dalits in Gujarat! Yet, a certain Gujarati gentleman comes here with a bag full of #Jumlas & promises heaven to Dalits. If they question him, they are branded as Cong goons. Kannadigas will not make the mistake of trusting this #ShahOfLies. https://t.co/QQvmpO2fok — Siddaramaiah (@siddaramaiah) 31 March 2018 కాగా మరణించిన బీజేపీ కార్యకర్త కుటుంబానికి పార్టీ తరపున రూ. 5 లక్షలు ఇస్తున్నామని చెప్పిన అమిత్ షా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండు రావు ఆరోపించారు. ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన బీజేపీ.. అమిత్ షా ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. -
కమలం వికసిస్తుందా... హస్తం పిడికిలి బిగిస్తుందా...
వేసవికాలం ఎండలకు సమాంతరంగా కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ బలగాలను మోహరిస్తున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉపఎన్నికల్లో దెబ్బతిన్న (సాక్షి ప్రత్యేకం) బీజీపీకి కర్నాటక ఎన్నికల్లో పాగా వేయడం తక్షణ అవసరం. అలాగే నరేంద్రమోడికి వ్యతిరేకంగా భావ సారూప్యత ఉన్నా లేకున్నా శత్రువు శత్రువులని కూడగట్టుకొని బీజేపీని చావుదెబ్బకొట్టి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడం రాహుల్ గాంధీకి తక్షణ కర్తవ్యం. ఎన్నికలు కర్ణాటక విధానసౌధ కోసం అయినా.... నమో, రాగాలకు ఇవి 2019 ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకమైనవే.. గణాంకాలు ఏమి చెప్పినా, కుల సమీకరణాలు ఎలా ఉన్నా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా లేవు. గత అసెంబ్లీ ఎన్నికలకు (2013) ముందు కర్ణాటక జనతాపక్ష పార్టీ ఏర్పాటు చేసి 9.8 శాతం ఓట్లు 6 సీట్లు సాధించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి సొంతగూటికికి చేరి బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన అదృష్టాన్ని, పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 75 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విమర్శలు దాడి మొదలు పెట్టేసారు. ఫిబ్రవరి 4న జరిగిన బెంగుళూరు సభలో ప్రధాని నరేంద్రమోడి సిద్ద రామయ్య ప్రభుత్వ అవినీతిని ఉద్దేశించి ‘‘10 శాతం ప్రభుత్వం’’ గా చిత్రీకరించారు. కర్ణాటకలో రాజకీయ హింస కాదు... రాజకీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని దాడికి దిగారు. గత అయిదు సంవత్సరాల్లో 23 మంది బీజేపీ నాయకుల హత్యలు జరిగాయనేది ఆ పార్టీ ఆరోపణ. అదే సమయంలో గౌరీలంకేశ్ హత్యపై ప్రధాని మౌనం ఇబ్బంది కలిగించే అంశమే. ఫిబ్రవరి 4కి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఎన్నికల్లో బీజీపీ చావుదెబ్బతినడం ఆ పార్టీ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ని ప్రచారస్త్రంగా వినియోగించుకోవాలన్న ఎత్తుగడ విషయంలో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. (సాక్షి ప్రత్యేకం) యోగీ ముందు ఉత్తరప్రదేశ్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని సిద్దరామయ్య విమర్శల దాడి మొదలుపెట్టారు. బీజీపీ (2008–2013) హయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. అవినీతి ఆరోపణలు, కుమ్ములాటలు మత ఉద్రిక్తతలు ఆ పార్టీని చావు దెబ్బ తీసాయి. 2013 ఎన్నికల్లో అధికారం కోల్పోయి 40 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవెగౌడ పార్టీ బీజీఎస్ తో సమానంగా సీట్లు గెలుచుకున్నప్పటికి ఆ పార్టీ కన్నా తక్కువశాతం ఓట్లతో మూడోస్థానంతో సరిపెట్టుకొంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న సిద్దరామయ్య బలమైన నాయకుడిగా నిలదొక్కుకున్నారు. అయితే శాంతిభద్రతలు, అవినీతి ఆరోపణలు, రైతుల ఆత్మహత్యలు (ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి) సిద్ధరామయ్యకు ఇబ్బందికరమైన అంశాలు. బీజీపీ ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకొంటున్నాయి. (సాక్షి ప్రత్యేకం) ఇక 1985 తర్వాత ఏ పార్టీ కూడా కర్ణాటకలో రెండవసారి అధికారంలోకి రాలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయలేదు. దళితులు, వెనకబడిన తరగతులు, కురబలు, ముస్లింల ఓట్లపై కాంగ్రెస్ ఆధారపడుతూ వస్తోంది. లింగాయత్‌లు, బ్రాహ్మణులు బీజేపీ అండగా ఉంటోండగా మరో బలమైన పార్టీ జేడీఎస్ వక్కళిగల ఓటుబ్యాంక్‌పై నమ్మకాన్ని పెట్టుకున్నాయి. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మంట్ల వారీగా పరిశీలిస్తే బీజేపీ 132 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 77 సీట్లలో మెజారిటీ సాధించగా, జీజీఎస్ 15 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటి మోడీ హవా వేరు. (సాక్షి ప్రత్యేకం) గత సంవత్సర కాలంలో 10 రాష్రాల్లో ఎన్నికలు జరగగా బీజేపీ , బీజేపీ మిత్ర పక్షాలు తొమ్మిందింటిలో పాగా వేశాయి. పంజాబ్ మినహా.. దేశంలో 21 రాష్ట్రాల్లో కాషాయం జెండా రెపరెపలాడుతోంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో లింగాయత్‌లకు ప్రత్యేక మతహోదా కల్పిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర జనాభాలో 17% లింగాయత్‌లు ఇప్పటివరకు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. నాలుగు దశాబ్ధాల్లో ఐదు సంవత్సరాల పూర్తి కాలం పనిచేసిన మొట్టమొదటి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. ఈ ఐదు సంవత్సరాల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు సిద్ధరామయ్య. మంత్రులపైన అవినీతి ఆరోపణలు కాంగ్రెస్‌కు సిద్ధరామయ్యకు కొంచెం చికాకు కలిగించే అంశాలే. సిద్దరామయ్య చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, కన్నడిగుల ఆత్మగౌరవ నినాదంతో తలపెట్టిన ‘ప్రత్యేక జండా’ ఉద్యమం వెనుకబడిన కులాలు, దళితులు, ముస్లింల మద్దతు కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశాలు. (సాక్షి ప్రత్యేకం) ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయలేమి, కాంగ్రెస్ సంస్కృతిలో భాగమైన గ్రూపులు. కాంగ్రెస్‌కు ప్రతిబంధకాలుగా కనపడుతున్నాయి. పది సంవత్సరాల క్రితం వింధ్య పర్వతాలకు ఈవల మొదటిసారిగా పాగా వేసిన బీజేపి బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పని ముఖ్యమంత్రిని చేసింది. తర్వాత జరిగిన వివిధ పరిణామాల వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారి 2013లో పీఠం కోల్పోయింది. యడ్యూరప్ప తప్ప మరో బలమైన నాయకుడిని తయారు చే సుకోలేకపోయిన బీజీపి ఈ సారి కూడా యడ్యూరప్పని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తోంది. (సాక్షి ప్రత్యేకం) అలాగే బీజీపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చాణక్యం, ప్రధానమంత్రి మోడీ ఆకర్షణలో గట్టెక్కాలని బీజీపి ఆరాటం. అంతర్గత కుమ్ములాటలు కూడా అధిగమించడం బీజీపికి తక్షణ అవసరం. మూడో ప్రధానమైన పార్టీ జేడీఎస్ తండ్రీకొడుకుల పార్టీ ముద్ర నుండి బయటపడలేక పోయింది. అసంఘటితరంగ కార్మికుల్లో కుమారస్వామికి మంచిపేరే ఉంది. బీఎస్సీ, వామపక్ష పార్టీలతో పొత్తు కొంత వరకు కలిసి వచ్చే అంశం. అటు రాహుల్ గాంధీ, ఇటు అమిత్‌షా సర్వశక్తులూ ధారపోసి కర్ణాటకలో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ తర్వాత హస్తం చేతుల్లో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బతిన్న బీజేపీకి కర్ణాటకలో షాక్ ఇచ్చి 2019 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవాలనేది కాంగ్రెస్ వ్యూహం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టాలనేది బీజేపీ ప్రతివ్యూహం. (సాక్షి ప్రత్యేకం) కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ గెలుపు రాహుల్ గాంధీ ఖాతాలోకి వెళుతుంది. తద్వారా జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ శక్తుల పునరేకీకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ తన మాటను చెల్లించుకునే అవకాశం దొరుకుతుంది. ఓడిపోతే... ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ ... షా... మోడీల నినాదానికి ప్రజల మద్దతు దొరికినట్టు అవుతుంది. ఎన్నికలు మే 12న ... ఫలితాలు మే 15న ... నడివేసవిలో కమలం వికసిస్తుందా... హస్తం పిడికిలి బిగిస్తుందా... ఎస్ . గోపీనాథ్‌రెడ్డి -
అవును.. తప్పు చేశా: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : నోరు జారి అడ్డంగా బుక్కైన భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. తన వ్యాఖ్యలపై స్పందించారు. యెడ్డీ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా పేర్కొనటం తన పొరపాటే అని షా పేర్కొన్నారు. శుక్రవారం ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ... ‘సిద్ధరామయ్య ప్రభుత్వం అనబోయి పొరపాటున యాడ్యురప్ప అని నేను అన్నాను. అవును.. నేను తప్పు చేశా. కానీ, కర్ణాటక ప్రజలు మాత్రం తప్పు చెయ్యబోరు. బీజేపీకి పట్టం కట్టి కాంగ్రెస్ అవినీతి పాలనకు చరమ గీతం పాడతారు’ అని చెప్పారు. కాగా, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ షా పొరపాటున యెడ్డీ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా పేర్కొనటం.. వెంటనే సవరించుకుని ఆయన సిద్ధరామయ్య అని చెప్పటం తెలిసిందే. అయినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఆ వీడియోను వైరల్ చేసి షాను ట్రోల్ చేసి పడేసింది. ఇక దేవనగరి జిల్లాలో బహిరంగ సభలో అనువాదకుడి మూలంగా మరోసారి షా మళ్లీ పప్పులో కాలేశారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరుగనున్నాయి. మే 15న ఫలితాలు వెవడనున్నాయి. -
అమిత్ షా.. మళ్లీ పప్పులో కాలు!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాక్షాత్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్న కార్యక్రమాల్లోనే అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులు, పేదలకు ఆయన చేసిందేమి లేదు..’’ అంటూ అమిత్ షా ప్రసంగాన్ని పొరపాటుగా అనువదించడం సంచలనం రేపింది. ఇప్పటికే ‘యడ్యూరప్ప సర్కార్ అవినీతిలో నంబర్‌వన్’ అని నాలుక కరుచుకున్న షా.. పరోక్షంగా మళ్లీ పప్పులో కాలేసినట్లైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో వైరల్ అయింది. అసలేం జరిగిందంటే..: ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవనగరి జిల్లాలో బీజేపీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. హిందీలో సాగిన షా ప్రసంగాన్ని.. ధర్వాడ ఎంపీ ప్రహ్లాద్ జోషి కన్నడలోకి అనువాదం చేశారు. సిద్ధరామయ్య రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని, యడ్యూరప్పను సీఎం చేస్తే ఇద్దరూ(మోదీ-యడ్డీ) కలిసి రాష్ట్రాన్ని నంబంర్ వన్‌గా నిలబెడతారని అమిత్ షా పేర్కొన్నారు. అయితే ఆయన మాటలను కన్నడలోకి అనువదించిన ప్రహ్లాద్ మాత్రం.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులు, పేదలకు ఆయన చేసిందేమి లేదు. యడ్యూరప్పను సీఎంగా గెలిపిస్తే పీఎం మోదీ సహకారంతో కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా తయారుచేస్తారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ తప్పుడు అనువాదాన్ని విన్న ప్రజలు, బీజేపీ నేతలు ఒక్కసారిగా విస్తుపోయారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తప్పు అనువాదకుడిదే అయినా అమిత్ షా టాప్ లీడర్ కావడంతో ‘మళ్లీ పప్పులో కాలేశారు’ అంటూ కామెంట్లు మొదలయ్యాయి. మొన్న అమిత్ షా తడబాటు, తర్వాత అనువాదకుడి పొరపాటు ప్రత్యర్థులకు అనుకోని అస్త్రాలుగా మారాయి. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరుగనున్నాయి. మే 15న ఫలితాలు వెవడనున్నాయి. తాము అధికారంలో ఉన్న ఒకేఒక పెద్ద రాష్ట్రం కర్ణాటక కావడంతో తిరిగి పట్టునిలుపుకునేందుకు కాంగ్రెస్ విశ్వపయత్నం చేస్తోంది. అందుకు ఏమాత్రం తక్కువకాకుండా బీజేపీ పావులు కదుపుతోంది. -
అమిత్ షా.. మళ్లీ పప్పులో కాలు!