
మైసూర్‌లో జరిగిన ర్యాలీలో సీఎం సిద్దరామయ్యకు 750 కిలోల ఆపిల్ పండ్లతో చేసిన హారాన్ని బహూకరిస్తున్న మద్దతుదారులు
బెంగళూరు: ‘ఐదేళ్లుగా బీజేపీ నిద్రపోయిందా? గత 15 అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిధులపై లెక్కలు చూపిన సమయంలో వారు నిద్రపోయారా? ప్రజలను మోసం చేయడం మానండి. పదేపదే అబద్ధం చెబితే నిజం కాబోదు..’అంటూ బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు.
కేంద్రం నుంచి అందిన దాదాపు రూ.2,19,506 కోట్ల నిధులకు లెక్కలు చెప్పాలని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. గత ఐదేళ్లలో కేంద్రం నుంచి అందిన నిధుల్లో ప్రతి రూపాయికీ అసెంబ్లీలో లెక్క చూపామని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ విషయం బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత జగదీష్ షెట్టర్‌కు కూడా తెలుసునని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అమలు కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment