Assembly meetings
-
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సర్వే ఇది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ పూర్తయిందని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 4న ఈ సర్వే నివేదికను రాష్ట్ర కేబినెట్‌కు అందిస్తామని, ఆ రోజున ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ అయి నివేదికపై చర్చిస్తుందని వెల్లడించారు. అదే రోజున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీలో నివేదికపై చర్చిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే’పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌తోపాటు కో–చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు ఆదివారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.దేశంలో ఎక్కడా లేనంత కచ్చితంగా..రాష్ట్ర ప్రభుత్వం యాభై రోజుల్లోనే 96.9 శాతం కచ్చితత్వంతో సమగ్ర సర్వే నిర్వహించి రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా ఇంతటి కచ్చితత్వంతో సర్వే జరగలేదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి న హామీ మేరకు ఈ సర్వే చేపట్టామని తెలిపారు. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వేకు సంబంధించి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి తదితరులు ఆదివారం మంత్రివర్గ ఉపసంఘానికి సర్వే నివేదిక సమర్పించారని వెల్లడించారు.సంక్షేమ కార్యక్రమాల కోసంరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ సర్వే వివరాలను వినియోగించుకుంటామని తెలిపారు. ఇది కేవలం డేటా సేకరణ ప్రక్రియ మాత్రమే కాదని, సామాజిక న్యాయ విప్లవమని వ్యాఖ్యానించారు. సర్వేపై తప్పుడు ప్రచారాలు, హైకోర్టులో పిల్లు వేయడం వంటి సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో సర్వే సమగ్రంగా కొనసాగిందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేలా అధికార యంత్రాంగం వివిధ కార్యక్రమాలు నిర్వహించి.. సర్వేను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న ప్రతి అధికారి, సిబ్బందికి మంత్రివర్గ ఉపసంఘం అభినందనలు తెలుపుతోందన్నారు. రాష్ట్ర చరిత్రలో మైలురాయిసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాష్ట్ర చరిత్రలో మైలురాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రదర్శిస్తూ సర్వేలో పాలు పంచుకున్నారని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సర్వేను అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారం చేశారని, వాటిని ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఈ సర్వే సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంలో నిబద్ధతతో కూడిన ప్రయత్నమని మంత్రి దామోదర రాజనర్సింహ అభివర్ణించారు. ఇలాంటి సర్వేలు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రణాళిక శాఖ ము ఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.రేపు అసెంబ్లీ సమావేశంసాక్షి, హైదరాబాద్: ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కానుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశాల మేరకు ఈ భేటీ జరుగుతోందని పేర్కొంటూ.. శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఆదివారం బులెటిన్ విడుదల చేశారు. -
అసెంబ్లీలో రేవంత్ సర్కార్‌ను నిలదీస్తాం: కేటీఆర్
సాక్షి, సిద్ధిపేట: రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్ట్ ఇచ్చామన్నారు. రైతులపై దాడి చేస్తూ భూములు లాక్కుంటూ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.‘‘మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అత్యంత మూర్ఖంగా, అనాలోచితంగా చరిత్ర గురించి తెలియకుండా ఏర్పాటు చేస్తున్న విగ్రహం గురించి పోట్లాడతాం. మోసాలు, అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తాం. రాష్ట్ర ప్రజల గొంతుకై తెలంగాణ సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం. అరకొరగా రుణమాఫీ చేశారు. కొనుగోలు కేంద్రాలు సరిగా నడపలేని పరిస్థితి. విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మరోసారి మోసం చేస్తోంది ’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.రేపటి నుంచి (సోమవారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ శాసనసభా పక్ష భేటీ జరిగింది. ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు సోమవారం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. -
డ్రైవర్ లేని కారులా ‘జీరో అవర్’
సాక్షి, అమరావతి: ‘జీరో అవర్.. డ్రైవర్‌లేని కారులా ఉంది.. సభ్యులు ప్రస్తావించే సమస్యలు ఎవరు రాసుకుంటున్నారో... ఎవరు చర్యలు తీసుకుంటున్నారో తెలియడం లేదు..’ అని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌ను ఉద్దేశించి రవికుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చను వేడెక్కించాయి. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ నిండు సభలో అసత్యాలు మాట్లాడొద్దని రవికుమార్‌కు హితవు పలికారు. కొండవీటి వాగుపై బ్రిడ్జి కట్టాలి అమరావతికి కొండవీటి వాగు పెద్ద సమస్యగా మారింది. 2014–19 మధ్య దీనిపై బ్రిడ్జి మంజూరు చేశారు. కానీ కట్టలేదు. ఈ వాగు పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. తక్షణమే బ్రిడ్జి కట్టాలి. అలాగే కోటేరు వాగుపై కూడా బ్రిడ్జి నిరి్మంచేలా చర్యలు చేపట్టాలి. – తెనాలి శ్రావణ్‌కుమార్, తాడికొండ ఎమ్మెల్యే ఏపీఎస్పీ పోలీసులకు పదోన్నతుల్లేవ్ ఏపీఎస్పీ పోలీసులు ఏళ్ల తరబడి పదోన్నతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సివిల్ పోలీసులుగా కన్వర్షన్ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి కన్వర్షన్ అయినా ఇవ్వండి... లేకుంటే పదోన్నతులు, ఇంక్రిమెంట్లయినా ఇప్పించండి. – పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యే, విశాఖ ఉత్తరం తుంగభద్ర 33 గేట్లు మార్చాలి 75 ఏళ్ల చరిత్రగల తుంగభద్ర ఈ ఏడాది నీటితో కళకళలాడుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుంగభద్ర డ్యాం 33 గేట్లు మార్చాలని సిఫారసు చేసింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చును ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు భరించాలి. – కాలవ శ్రీనివాసులు, రాయదుర్గం ఎమ్మెల్యే లో వోల్టేజీ సమస్య పరిష్కరించండి విద్యుత్ లో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తగిన చర్యలు తీసుకుని లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలి. – పూసపాటి అదితి, ఎమ్మెల్యే, విజయనగరం -
AP: 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11నుంచి జరగనున్నాయి. 11న ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశమవుతాయని శాసన వ్యవహారాల కార్యదర్శి సోమవారం రెండు నోటిఫికేషన్లు జారీ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటినా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. 2024–25 సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టింది.జూన్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పొడిగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. దాని గడువు నవంబర్‌తో ముగుస్తుండటంతో అనివార్యంగా ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో మిగతా నాలుగు నెలలే మిగిలి ఉండటంతో ఆ కాలానికే పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. -
రేపు ఉభయసభల్లో వార్షిక బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్నాయి. 25న శాసనసభ, శాసనమండలిలో 2024.25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శాసనసభ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం వాయిదా పడింది. ఆ తర్వాత స్పీకర్ చాంబర్లో జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్‌కుమార్, రామచంద్రునాయక్ హాజరయ్యారు. విపక్షం నుంచి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ అసెంబ్లీలో తాము చర్చించదలిచిన అంశాల జాబితాను అందజేశాయి. పక్షంరోజులు సభ నిర్వహించాలని బీఆర్ఎస్, కనీసం 18 రోజులు సమావేశాలు జరగాలని బీజేపీ కోరాయి. అయితే గతంలో బడ్జెట్ జరిగిన సమావేశాల తీరుతెన్నులను వివరిస్తూ ఈ నెల 31 వరకు సభ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసినా, ఈ నెల 31 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రోజూవారీ ఎజెండాపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ కోరాయి. అయితే ఎజెండాపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని ప్రభుత్వ పక్షం ప్రకటించింది. మొదట తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై తీర్మానం బీఏసీలో నిర్ణయించిన మేరకు బుధవారం ఉద యం 10 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై చర్చించి కేంద్రానికి తీర్మానం పంపుతారు. అనంతరం రుణమాపీ అంశంపైనా స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముంది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాల బస్సుల ఫిట్నెస్, గ్రామపంచాయతీలుగా తండాలు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి డి.శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల 26న అసెంబ్లీకి విరామం ప్రకటించి.. తిరిగి 27న బడ్జెట్‌పై చర్చ ప్రారంభమవుతుంది. 28న సమావేశాలకు విరామం ప్రకటించి తిరిగి 29 నుంచి 31వ తేదీ వరకు మూడు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ కొనసాగుతుంది. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడుతుంది. కాగా శాసనమండలిలోనూ మంగళవారం చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన మండలి బీఏసీ సమావేశం జరిగింది. -
ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నందుకు చింతిస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: ‘అత్యంత చిన్న వయసులోనే జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా ఎన్నికవ్వడం... ఆ తర్వాత కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలిచివేసింది. ఆమె మరణం నేపథ్యంలో అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నందుకు చింతిస్తున్నాను’అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2024–25 వార్షిక బడ్జెట్‌కు సంబంధించి ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో భాగంగా సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్ జి.ప్రసాద్‌కుమార్ సూచించగా...సీఎం రేవంత్‌రెడ్డి లాస్య నందిత సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నుంచి ఐదుసార్లు గెలుపొందిన సాయన్న తనకు అత్యంత సన్నిహితుడన్నారు. అనారోగ్య కారణాలతో గతేడాది ఆయన మరణించగా... ఆయన వారసురాలిగా లాస్య కంటోన్మెంట్ నుంచి గెలుపొందారని, గత ఫిబ్రవరి 23న జరిగిన ప్రమాదంలో ఆమె మరణించడం బాధాకరమని చెప్పారు. సాయన్న, లాస్య నందిత ఇద్దరూ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి, కంటోన్మెంట్ ప్రజల కోసం ఎంతో కృషి చేశారన్నారు. లాస్య కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్ లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో మరణించడం పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి.సాయన్న అజాతశత్రువన్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్, సాయన్న మంచి మిత్రులని, వారిద్దరూ కలిసి వచ్చి లాస్య నందితకు కార్పొరేటర్‌గా అవకాశం కల్పించాలని కేసీఆర్‌ను కోరగా, వెంటనే ఆమెకు టికెట్ ఇచ్చారన్నారు. ఎన్నికల్లో విజయపథంలో ముందుగా సాగిన లాస్య నందితను విధి వెంటాడిందన్నారు. నల్లగొండలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశ అనంతరం ఒక ప్రమాదం ముంచుకొచి్చందని, అక్కడ్నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన ఆమె... కొన్నాళ్లకు ఇంట్లో లిఫ్ట్ ప్రమాదం బారిన పడ్డారని, రెండింటి నుంచి బయటపడినా, ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకోలేక పోయిందని చెప్పారు. » రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ లాస్య నందిత కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. » రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురైనట్టు తెలియగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వెంటనే వారి ఇంటిని చేరుకున్నానని, అక్కడి పరిస్థితిని సమీక్షించి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలు చేపట్టామన్నారు. » బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పారు»ఎమ్మెల్యేలు బలాల, కూనంనేని సాంబశివరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సునీతాలక్ష్మారెడ్డి, రాజ్ ఠాకూర్, ముఠా గోపాల్, శ్రీగణేశ్, పాయల్ శంకర్, కేపీ.వివేకానంద, రాజశేఖర్‌రెడ్డి తదితరులు లాస్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. » లాస్య మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. -
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. తొలిరోజు మంగళవారం ఉదయం స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటించనుంది. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెడతారు.అలాగే ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా నివాళులరి్పంచనుంది. అనంతరం సభను 24వ తేదీ ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తారు. తర్వాత స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో సభ ఎజెండా, సమావేశాలు ఎన్ని రోజులు జరిగేదీ ఖరారు చేయనున్నారు. 24న రైతు రుణమాఫీ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముందని సమాచారం.ఇక 25న శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 2024–25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. 26న సమావేశాలకు విరామం ప్రకటిస్తారు. 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ ప్రారంభం అవుతుంది. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో మళ్లీ విరామం అనంతరం, ఈ నెల 30 నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో స్కిల్స్ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. 25న మంత్రివర్గ భేటీ: అసెంబ్లీలో ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మీటింగ్ హాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇప్పటివరకు రెండు విడతలుగత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తొలి విడత సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు, రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17 తేదీల నడుమ 8 రోజుల పాటు జరిగాయి. తొలి విడత సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరిగింది. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించింది. ఇక ఫిబ్రవరిలో జరిగిన రెండో విడత సమావేశాల్లో 2024– 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు సాగునీటి వనరులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. -
23 నుంచి అసెంబ్లీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు మరుసటి రోజు 24న ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 23న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు మొదటి వారం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తొలిరోజు సభ.. దివంగత ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేల మరణంపై సంతాపం ప్రకటించిన తర్వాత వాయిదా పడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన విషయం తెలిసిందే. ఈ నెల 24న శాసనసభ, శాసన మండలి వేర్వేరుగా సమావేశమై సాధారణ బిజినెస్‌ను చేపట్టే అవకాశం ఉంది. అలాగే 25న ఉభయ సభల్లో రాష్ట్ర వార్షిక (2024–25) బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. 26న అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించి 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ చేపడతారు. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో సభకు మరోసారి విరామం ప్రకటించి తిరిగి ఈ నెల 30 నుంచి సమావేశాలు కొనసాగించే అవకాశముంది. అయితే సభ ఎజెండా, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఈ నెల 23న స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయిస్తారు. గత ఏడాది డిసెంబర్లో తొలిసారిరాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. కాగా తొలి విడత అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు జరిగాయి. ఇక రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17వ తేదీ నడుమ 8 రోజుల పాటు జరిగాయి. తొలి విడత సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తదితర అంశాలు చోటుచేసున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించింది. ఫిబ్రవరిలో జరిగిన రెండో విడత సమావేశాల్లో 2024– 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు సాగునీటి వనరులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అనర్హత కోసం బీఆర్ఎస్ పట్టు!పార్టీ మారిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ వేదికగా పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మూడో శాసనసభ ఇప్పటివరకు రెండు విడతల్లో సమావేశం కాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భేటీకి దూరంగా ఉన్నారు. అయితే వచ్చే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యే అవకాశముంది. బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు ఈసారి సమావేశాల సందర్భంగా అధికార పార్టీతో జట్టు కట్టడం ఆసక్తికరంగా మారనుంది. -
22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, విజయవాడ: ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. శ్వేత ప్రతాలపైనా చర్చించనున్నారు. ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. -
జాబ్ కేలండర్‌కు చట్టబద్ధత: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ కేలండర్‌కు చట్టబద్ధత కల్పించి, అసెంబ్లీలో జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏటా మార్చి 31వ తేదీనాటికి ఖాళీ పోస్టుల వివరాలు తెప్పించుకుంటామని.. జూన్‌లో నోటిఫికేషన్లు ఇచ్చి, డిసెంబర్ 9వ తేదీ నాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. పదేళ్లుగా నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారని.. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయా లంటూ కోచింగ్ సెంటర్ల యజమానులు, రాజకీయ నేతలు అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. శనివారం జేఎన్టీయూలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులతో ‘ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత’ అన్న అంశంపై సీఎం రేవంత్ ముఖాముఖి చర్చించారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయా లని కొందరు అంటున్నారు. పరీక్షలతో ఏమాత్రం సంబంధం లేనివారు దీక్షలు చేయడం వింత. ఇటీవల దీక్ష చేసిన ముగ్గురూ ఏ పరీక్ష కూడా రాయడం లేదు. ఒకరేమో కోచింగ్ సెంటర్ యజమాని. మరొ కరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పదవీ ఇవ్వలేదని ప్రభుత్వాన్ని గిల్లడమే పనిగా పెట్టుకున్నారు. గాందీలో దీక్ష చేసిన వ్యక్తి నాయకుడిగా ఎదగడానికి ఓ రాజకీయ నేత అండతో ఆందోళన చేశారు. గ్రూప్–1లో 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఎవరైనా కోర్టుకు వెళ్తే పరీక్షలు ఆగిపోతాయి. అందుకే నోటిఫికేషన్లో ఉన్న మేరకే పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ఉంటుంది. నిరుద్యోగుల కర్మాగారాలు కావొద్దు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా ఇంజనీరింగ్ కాలేజీలు మారకూడదు. ప్రపంచంతోనే పోటీపడేలా ఇంజనీరింగ్ విద్యను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. నైపుణ్యం లేకుండా, కేవలం ఇంజనీరింగ్ పట్టాలిస్తే వారికి ఉద్యోగాలు రావు. తాత్కాలిక ఉద్యోగ, ఉపాధి మార్గాల కోసం కంప్యూటర్ కోర్సులను కాలేజీలు కావాలనుకోవడం సరికాదు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి కోర్సులను కనుమరుగు చేస్తే దేశానికే ప్రమాదం. ‘ఫీజు’ ఎప్పటికప్పుడు ఇస్తాం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాలేజీలు ఏమాత్రం దిగులు పడొద్దు. బకాయిలన్నీ వన్ టైం సెటిల్మెంట్గా ఇచ్చే యోచన చేస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచి్చన ఈ పథకాన్ని మరింత విజయవంతంగా నడిపిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఏ ఏడాదికా ఏడాదిలో ఇచ్చేందుకు ప్రయత్నించాలని నిర్ణయించాం. సంక్షేమంపైనే దృష్టి పెట్టడం వల్ల కొన్నేళ్లుగా రాష్ట్రం ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. లోపాలను గుర్తించాలి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా సాంకేతిక విద్య ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే నైపుణ్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. నైపుణ్యాభివృద్ధికి అవసరమైన కార్యాచరణ చేసే స్వేచ్ఛనిస్తున్నాం. విద్యలో ఉన్న లోపాలను గుర్తించి, మార్పు దిశగా అడుగులు వేసేలా చేస్తాం. ఈ దిశగా ముందుకొచ్చే సంస్థలకు చేయూతనిస్తాం. ఫార్మా రంగంలో పరిశోధనను ఎన్నో ఏళ్లుగా ప్రోత్సహించబట్టే కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ కేంద్రమైంది. సాఫ్ట్వేర్ రంగంలోనూ ప్రతి పది మందిలో ఒకరు తెలుగు వాళ్లే ఉన్నారు. వచ్చే 20 ఏళ్లలో ఎంతో మంది సీఈవోలు ఉండబోతున్నారు. ఐటీఐల సిలబస్‌లో మార్పు దశాబ్దాల నాటి సిలబస్‌తో నడుస్తున్న ఐటీఐలకు ఉజ్వల భవిష్యత్ తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం. రాష్ట్రంలోని 65 ఐటీఐలను టాటా సంస్థ తోడ్పాటుతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మారుస్తున్నాం. ఈ పైలట్ ప్రాజెక్టు ఊహించని విధంగా అత్యాధునిక టెక్నాలజీని సొంతం చేసుకుంది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలున్నా.. తగిన స్కిల్స్ లేకపోవడం వల్ల నిరుద్యోగం కనిపిస్తోంది. ఆఖరికి నిర్మాణ రంగంలోనూ ఇతర రాష్ట్రాల వాళ్లే ఉంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. స్కిల్ పెంపుతోనే ఇది సాధ్యం.ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో లీడ్ పార్టనర్‌గా తెలంగాణ ఉండాలన్నది మా లక్ష్యం’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. కాలేజీలకు సామాజిక కోణం అవసరం: శ్రీధర్‌బాబు ప్రైవేటు కాలేజీలు సామాజిక కోణంలో విద్యా వ్యవస్థ మార్పు కోసం కృషి చేయాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. పరిశ్రమల అవసరాలు, పరిశోధన, అభివృద్ధి దిశగా కొత్త కోర్సులను రూపొందించేందుకు ప్రయత్నాలు జరగాలన్నారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్‌ను సెప్టెంబర్‌లో నిర్వహిస్తున్నామని.. తర్వాత 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. 2030 నాటికి ఐటీలో బెంగళూరును అధిగమించడమే తమ లక్ష్యమని చెప్పారు. -
మాకు ఆ గౌరవం ఏదీ? ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తాము అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నా అధికారులు కనీసంప్రొటోకాల్ పాటించడం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న సందర్భాల్లో ప్రొటోకాల్ నిబంధనల మేరకు తమను గౌరవించడం లేదన్నారు. శాసనసభ ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ అంశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల జాబితాను వివరించారు. అనంతరం డీజీపీ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతోనూ చైర్మన్, స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో ప్రొటోకాల్ అంశంపై వీరిద్దరు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. తమను గౌరవించాల్సిన తీరుపై కిందిస్థాయి అధికారులకు అర్థమయ్యే రీతిలో సందేశాలు, సంకేతాలివ్వాలని గుత్తా, గడ్డం ప్రసాద్ చెప్పారు. చైర్మన్, స్పీకర్ అభ్యంతరాలు ఇవే.. తాము జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో కనీసం ఆర్డీఓ లేదా తహసీల్దార్ స్థాయి అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం చెప్పాల్సిన ఉన్నా ఎవరూ రావడం లేదు. తమ పర్యటనలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ప్రొటోకాల్ విభాగం జిల్లా అధికారులకు పంపించడం లేదు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారం ఇస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో బదిలీలపై వచ్చే అధికారులు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలవాలనే ఆనవాయితీని పాటించడం లేదు. దీంతో ఏ అధికారి ఏ స్థానంలో పనిచేస్తున్నారో కనీస సమాచారం కూడా ఉండట్లేదు. జాతీయ పండుగలైన పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర సందర్భాల్లో తాము జాతీయ పతాకాన్ని ఏ జిల్లాలో ఎగురవేయాలో చివరి నిమిషం వరకు చెప్పడం లేదు. ⇒ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో కనీసం ఎస్ఐ స్థాయి అధికారి బందోబస్తు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీనికి వాహనాల కొరత, మంత్రుల వెంట వెళ్లడం తదితర కారణాలను సాకుగా చూపుతున్నారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో సినిమా తారలు, ఇతరులను కూర్చోబెడుతూ మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ వెళ్లిన సందర్భంలో అధికారిక ఏర్పాట్లేవీ చేయడం లేదు. అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు వెళ్లినపుడు భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదు. 25 లేదా 26న రాష్ట్ర బడ్జెట్? రాష్ట్ర అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ ఈనెల 23న ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర బడ్జెట్ ఈనెల 25 లేదా 26న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభ, మండలి లెజిస్లేచర్ సెక్రటేరియట్లో పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యులు, విప్ రామచంద్రు నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు . -
21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తొలుత 19వ తేదీ అనుకున్నా, ఆ తర్వాత 24 నుంచి నిర్వహించాలని యోచించింది. ఎక్కువ మంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడం, పలు ఇతర కారణాలతో 21 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 2 రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. మొదటిరోజు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, రెండవ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని చెబుతున్నారు. -
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, అమరావతి: ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 22వ తేదీ తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. తొలుత ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టు సమాచారం. అయితే మంత్రులందరూ పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించకపోవడంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణను వాయిదా వేసినట్టు ప్రచారం నడుస్తోంది. 24వ తేదీ నుంచి ఐదురోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ లీగల్ సెల్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు గత ఐదేళ్లలో టీడీపీ లీగల్ విభాగం అనేక పోరాటాలు చేసిందని, లాయర్లు చేసిన కృషి ప్రశంసనీయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ లీగల్ సెల్ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా లీగల్ సెల్ కార్యకర్తలకు అండగా నిలిచిందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే తప్ప అధికారులు కాదని, ఈ క్రమంలో కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
Delhi Excise Policy Scam Case: 12 తర్వాత వర్చువల్‌గా హాజరవుతా: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా ఎనిమిదోసారి పంపిన సమన్లకు కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదు. మార్చి 4వ తేదీన తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున సోమవారం విచారణకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. ఈడీ తనకు సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమే అయినా ఈనెల 12వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వర్చువల్‌గా హాజరయ్యేందుకు చట్టం హక్కు కలి్పంచింది. అందుకు ఈడీ అధికారులు అనుమతిస్తారని భావిస్తున్నా. ఈడీ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నేను డిమాండ్ చేయలేదు. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చేసినా అభ్యంతరం లేదు’అని కేజ్రీవాల్ అన్నారు. అయితే, కేజ్రీవాల్ పంపిన సమాధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే, కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా విచారించేందుకు సిద్ధంగా లేని ఈడీ..తొమ్మిదో విడత సమన్లు పంపే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించడం.. కేజ్రీవాల్ వినతి మేరకు మార్చి 16న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించడం తెలిసిందే. బీజేపీ ‘మోదీ కా పరివార్’ ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కేవలం కేంద్ర మంత్రులే మోదీ కుటుంబమన్నారు. -
‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా..
ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గంలో ప్రాజెక్టులు, మారుమూల గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణాల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ తెలిపారు. నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుప్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో పలు రోడ్ల పనులు మధ్యంతరంగా నిలిచి పనులు ముందుకు సాగడంలేదని పేర్కొన్నారు. దీంతోని యోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నియోజకవర్గలో నూతనంగా మరో 20 చెరువుల మంజూరు కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. సాగునీరు, రోడ్ల సౌకర్యాల ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి చదవండి: తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్ తమిళిసై ప్రసంగం ఇదే.. -
చర్చకు తేవాల్సిన అంశాలెన్నో..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా అంశాలు అసెంబ్లీలో చర్చకు రావాలని జిల్లావాసులు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టుపక్కల ఔటర్ రింగు రోడ్డు పనులకు 2017 అక్టోబర్‌లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూరల్ జిల్లాలోని టెక్స్టైల్ పార్కు స్థలంలోనే శిలాఫలకం వేశారు. నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర పెండింగ్ పడింది. వరంగల్ మహా నగరాన్ని అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముంపు బెడద 15 ఏళ్లుగా ఉంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉండగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందినవారే. వరంగల్ నగరాభివృద్ధితో పాటు వరంగల్, వరంగల్ పశ్చిమతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల శివారు గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మడికొండలో మూడు నక్షత్రాల హోటల్‌తో స హా, హైదరాబాద్‌లోని హైటెక్స్ తరహాలో అంతర్జాతీయ సమావేశ, వాణిజ్య ప్రదర్శనల కేంద్రం (వైటెక్స్) నిర్మించేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీన్ని పీపీపీ మోడ్‌లో నిర్మించి నిర్వహించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పారి శ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉంది. నిధులిస్తేనే ఇవన్నీ జరిగేది. జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు కొత్త జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పాలనపరంగా ఇంకా కుదుటపడేందుకు వసతులు కల్పించాలి. ఉమ్మడి వరంగల్‌లో పలు ప్రాజెక్టులు, పథకాలపై స్పష్టత ఇచ్చేలా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్‌లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్న ఎన్నో ఏళ్ల కల నెరవేరడం లేదు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు 700 ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది. మరో 200 నుంచి 400 ఎకరాల భూసేకరణ అవసరమని, గత ప్ర భుత్వం సేకరించి ఇస్తామన్నా సాధ్యం కాలేదు. ఇదివరకే మట్టి నమూనా పరీక్షలు కూడా నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు రెండేళ్లుగా భూకేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు వరంగల్లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. మెట్రో నియో రైలు ప్రాజెక్టుకు కాకతీయ పట్ట ణాభివృద్ధి సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి మూడేళ్ల కిందట ప్రభుత్వానికి సమర్పించింది. రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారైన నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది. కాకతీయ మెగా జౌళి పార్కులో పరిశ్రమల ఏర్పాటు, సౌకర్యాల కల్పనకు గత ప్రభుత్వం రూ.574 కోట్లను మంజూరు చేసి రూ.174 కోట్లు విడుదల చేసింది. ఆమేరకు పలు మౌలిక వసతులు కల్పించగా.. మరో రూ.400 కోట్లు రావాల్సి ఉంది. పార్కులో కొన్ని ప్రాంతాల్లో రహదారులను నిర్మించి, విద్యుత్ సరఫరా కోసం ఉపకేంద్రాన్ని నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా 12 ఎంఎల్డీ సామర్థ్యం గల వ్యవస్థను ఇంకా నిర్మించుకోవాల్సి ఉంది. మొత్తం 1200 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన నిధులు, అన్ని రకాల వసతులు తీర్చుదిద్దుకుంటే మరికొన్ని వస్త్ర పరిశ్రమలు వచ్చే వీలుంది. భూపాలపల్లికి ఎస్సారెస్పీ, దేవాదుల నుంచి సాగునీటి పంపిణీని మెరుగుపర్చాలి. చిన్నకాళేశ్వరం పూర్తి చేయాలి. ములుగు జిల్లాలో ములు గు, ఏటూరునాగారంలో బస్సు డిపోల ఏర్పా టు, గోదావరి తీర ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యల కోసం కరకట్టల నిర్మాణం చేపట్టాలంటే పెద్దమొత్తంలో బడ్జెట్లో నిధులు రాబట్టాలి. ఇవి చదవండి: ‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా.. -
అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎమ్మెల్యేలు తమ పబ్లిసిటీకి ఉపయోగించుకునే క్రమంలో హైడ్రామా సృష్టించారు. సోమవారం సమావేశాలు ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యులు నిరసన పేరుతో హడావుడి మొదలెట్టారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శనగా వచ్చారు. ఒక్కసారిగా అసెంబ్లీ గేట్లు తోసుకుంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వారిని ఆపేందుకు ప్రయత్నించారు. టీడీపీ సభ్యులు బారికేడ్లను నెట్టివేసి అసెంబ్లీ లోపలికి వెళ్లారు. పోలీసులను తిడుతూ కావాలనే రాద్ధాంతం సృష్టించి అక్కడే అనుకూల మీడియాతో మాట్లాడారు. అవసరం లేకున్నా ఫొటోలు, వీడియోల కోసం పోలీసులతో వాగ్వాదానికి దిగి, నెట్టుకుంటూ గందరగోళం సృష్టించారు. రాజ్యాంగ వ్యవస్థకు అవమానం ఇకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం వేదికగా రాజ్యాంగ వ్యవస్థను టీడీపీ అవమానించింది. సభా సంప్రదాయాలను అపహాస్యం చేసింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ఉపక్రమించారు. తొలుత కొద్ది నిముషాల పాటు గవర్నర్ ప్రసంగం సాఫీగా సాగింది. అనంతరం ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ ప్రసంగానికి సమాంతరంగా పదే పదే రన్నింగ్ కామెంట్రీతో ఆటంకం కలిగించారు. టీడీపీ సభ్యుల్లో ముఖ్యంగా బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు తమ స్థానాల్లో కూర్చునే ప్రసంగ అంశాలపై కామెంట్లు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభలో ప్రతిపక్ష సభ్యుల తీరును అధికార పక్షం సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత రంగాల్లో ప్రభుత్వం చేపట్టి సంస్కరణలు, ఆయా వర్గాలకు జరిగిన మేలుపై గణాంకాలతో సహా గవర్నర్ తన ప్రసంగంలో వివరిస్తుండగా టీడీపీ సభ్యులు అంతరాయం కలిగించే యత్నం ఎక్కువగా చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన సామాజిక భద్రత–సున్నితత్వం నుంచి సుస్థిరత దిశగా పరివర్తన.. అనే అంశంపై గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నినాదాలు చేశారు. తమ స్థానాల్లో నిలబడి.. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవంటూ ఆరోపించారు. అసత్యాల ప్రసంగాన్ని వినలేమంటూ వాకౌట్ చేశారు. ఈ క్రమంలో ఓ వైపు ప్రసంగం కొనసాగుతుండగానే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ సభ్యులను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్థసత్యాలమయమని.. ఈ సందర్భంగా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి తదితరులు విమర్శించారు. ఎన్నికల ముందు గవర్నర్ ద్వారా ప్రజల్ని మోసగించడానికి సీఎం జగన్ మరోసారి ప్రయత్నించారని విమర్శించారు. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచలేదన్నారు. 98 శాతం హామీలు నెరవేర్చాను, 175 స్థానాల్లో గెలిపించండి.. అనే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని సీఎం నెరవేర్చ లేదని చెప్పారు. గవర్నర్ కూడా నీళ్లు నములుతూ, చెప్పలేక చెప్పలేక దగ్గుతూ అబద్ధాలు చెప్పారన్నారు. -
రేవంత్ X అక్బర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగ శ్వేతపత్రంపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా మొదలైన ఈ రగడ గంటకుపైగా కొనసాగింది. దీంతో సభలోని కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ సభ్యులు వాదోపవాదాలకు దిగారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో స్పీకర్ పోడియం వద్దకు అక్బరుద్దీన్ సహా ఎంఐఎం సభ్యులు దూసుకెళ్లారు. ఎంఐఎం సభ్యులతోపాటు బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పోడియం వద్దకు వెళ్లి సభాపతితో వాదనకు దిగారు. దీంతో సభ అదుపుతప్పింది. బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలతో వాదన మొదలు.. : విద్యుత్ రంగ శ్వేతపత్రంపై చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ హయాంలో పాతబస్తీలో రూ. 25 వేల కోట్ల అభివృద్ధి జరిగింది. 2014తో పోలిస్తే విద్యుదుత్పత్తి భారీగా పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో జెన్కో ఆస్తులు రూ. 12,783 కోట్ల నుంచి రూ. 40,454 కోట్లకు పెరిగాయి. పాతబస్తీలో ఇంకా 5 వేల స్తంభాలు, కొత్త కండక్టర్ (తీగ), ట్రాన్స్పార్మర్ల ఏర్పాటుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని కోరారు. దీనిపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ అక్బరుద్దీన్ గత పదేళ్ల కాలంలో ఆ పనులేవీ చేయించుకోలేకపోగా ఇప్పుడు ప్రశ్నించడం ఏమిటంటూ నిలదీశారు. దీనిపై అక్బరుద్దీన్ ఘాటుగా ప్రతిస్పందించారు. సీనియర్‌ను అయిన తనను మొదటిసారి సభకు వచ్చిన సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారని... పెద్దలు మాట్లాడుకుంటుండగా చిన్న పిల్లాడిలా మాట్లాడొద్దని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి జోక్యం... అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలి. సభలో ప్రస్తుతం 57 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ దళితుడు. ఆయన మాట్లాడితే ఆగ్రహం వ్యక్తం చేయాలా? అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌ను చేశాం. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం నేత మాత్రమే. ఆయన్ను మేం ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదు. చాంద్రాయణగుట్టలో హిందువులు కూడా ఆయనకు ఓటు వేశారు. మాకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడాలేదు. బీఆర్ఎస్ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా? గత ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతుంటే వినేందుకు మేం సిద్ధంగా లేము. తెలంగాణ ప్రజలు మీ మిత్రపక్షం బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ తరఫున ఎంఐఎం ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోంది? మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు‘అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మా ముస్లిం నేతలను ఓడించారు.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ కలసి పనిచేశాయి. నిజామాబాద్ అర్బన్‌లో షబ్బీర్ అలీని, జూబ్లీహిల్స్‌లో అజాహరుద్దీన్‌ను ఓడించేందుకు కేసీఆర్‌తో కలసి మజ్లిస్ పనిచేసింది. అదే మజ్లిస్ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో ఎందుకు పోటీ చేయలేదు? కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా చేసింది. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అక్బరుద్దీన్.. కేసీఆర్‌కు మిత్రుడు కావొచ్చు. మోదీకి మద్దతివ్వవచ్చు.. అది వాళ్లిష్టం. మజ్లిస్, బీఆర్ఎస్ మిత్రపక్షాలు అని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. మజ్లిస్ పార్టీ కేసీఆర్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ నాయకుడు కాదు. మజ్లిస్ పార్టీకి మాత్రమే నాయకుడు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. విద్యుత్ బకాయిలు రాబడతారా? ‘విద్యుత్ మొండి బకాయిల్లో సిద్దిపేట 61.37 శాతం, గజ్వేల్ 50.29 శాతం, హైదరాబాద్ సౌత్ 43 శాతంతో టాప్‌లో ఉన్నాయి. కేసీఆర్, హరీశ్‌రావు, అక్బరుద్దీన్ బాధ్యత తీసుకొని విద్యుత్ బకాయిలను క్లియర్ చేస్తారా?’అని రేవంత్ ప్రశ్నించారు. ఈ బిల్లులు వసూలు చేస్తే బకాయిల నుంచి బయటపడతామన్నారు. పాతబస్తీలో విద్యుత్ బకాయిల చెల్లింపులు జరిపే బాధ్యత తనదని అక్బరుద్దీన్ చెప్పడం లేదని రేవంత్ విమర్శలు గుప్పించారు. రేవంత్ మాట్లాడుతుండగా మజ్లిస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైఎస్సాఆర్ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు... రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ‘మేము ఎవరికీ భయపడం. కిరణ్‌కుమార్‌రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదు. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్, ఎంఐఎం కలసి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాయి. వైఎస్సార్ నిజమైన జెంటిల్మాన్... గొప్ప నాయకుడు. కాంగ్రెస్‌కు చెందిన అప్పటి ఢిల్లీ నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మా నాన్నను కలిశారు. ఆ తర్వాతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చారు. కాంగ్రెస్, ఎంఐఎం కలసే అప్పడు ఎన్నికలను ఎదుర్కొన్నాయి’అని పేర్కొన్నారు. సీఎంకు చాలెంజ్.. షబ్బీర్ అలీని ఓడించేందుకు ప్రయత్నించామని రేవంత్ ఆరోపించారు. మేము నిజామాబాద్ అర్బన్‌లో పోటీ చేయలేదు. షబ్బీర్ అలీ ఓటమితో మాకేం సంబంధం? జూబ్లీహిల్స్‌లో మాకు కార్పొరేటర్ ఉన్నారు. బలమైన అభ్యర్థిని నిలిపాం. అంబేడ్కర్ వంటి మహానేతను కూడా ఓడించిన ఘనత కాంగ్రెస్‌దే. మమ్మల్ని బీజేపీ బీ–టీం అంటున్నారు. మేము బతికి ఉన్నంత వరకు బీజేపీతో కలసి పనిచేయం. సీఎం రేవంత్‌కు చాలెంజ్’అంటూ కామెంట్స్ చేశారు. ఏబీవీపీ, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఉన్నారని... అన్నిచోట్లా సీఎంకు అనుభవం ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ సభానాయకుడిని కించపర్చేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. స్పీకర్ కూడా జోక్యం చేసుకొని సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మధ్యలో మాట్లాడవద్దన్నారు. ఈ దశలో మరోసారి జోక్యం చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ‘నాదెండ్ల భాస్కర్‌రావు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ హయాం వరకు ఎంఐఎం ఎవరెవరితో దోస్తీ చేసిందో అందరికీ తెలుసు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం’అని పేర్కొన్నారు. దీనికి అక్బరుద్దీన్ బదులిస్తూ ‘మేము ఎవరితో కలసి పనిచేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపక్వతగా మాట్లాడటం లేదు’అని అన్నారు. -
రెండ్రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం మొట్టమొదటి మంత్రివర్గం సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని, అసలు ఆట ఇప్పుడుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అప్పగించారనే పాత చింతకాయ పచ్చడినే శుక్రవారం జరిగే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాల్లో గవర్నర్ నోటితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిస్తుందని ఎద్దేవా చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల పద్దులపై గతంలో కాంగ్రెస్ హయాంలో ఏనాడూ చర్చ జరగలేదని, తాము మాత్రం పద్దులపై ప్రతీ ఏటా శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కాగ్ నివేదికలను ఇచ్చామన్నారు. ప్రతీ ఏడాది తమ ప్రభుత్వం ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ శ్వేతపత్రం లాంటిదేనని, ప్రతీ అసెంబ్లీ సమావేశంలో అప్పుల వివరాలు సమర్పించామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ నేతలు చదవకపోతే ఏం చేస్తామన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి హామీలు అనేకం ఉన్నాయి. పాలకుర్తిలోనూ నిరుద్యోగం ఉండటమేంటి, ఉద్యోగాల మేళా పెడతాం అని అక్కడి ఎమ్మెల్యే అంటున్నారు.. వేచి చూద్దాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష
అమరావతి: అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రత, వసతుల ఏర్పాట్లపై 'విప్'లతో చర్చించారు. ఈ నెల 21వ తేదీ నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలపై చర్చ జరగాలనే అంశాలపై చర్చించారు. చీఫ్ విప్‌లు ముదునూరి నాగరాజ వర ప్రసాద రాజు, జంగా కృష్ణమూర్తి, కాపు రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. సమావేశాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. సమావేశాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను ఫలవంతం చేయాలని, అభివృద్ధిపై చర్చించాలని చెప్పారు. వ్యక్తిగత విమర్శలకు స్థానం కాదని విపక్ష నేతలకు సూచించారు. ఇదీ చదవండి: నేడు ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం.. లైవ్ అప్డేట్స్ -
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో ముందుగా కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. సుమారు నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశముంది. బీఏసీ భేటీలో విపక్షాల నుంచి వచ్చే సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా అవసరమైతే సమావేశాల తేదీలను పొడిగించొచ్చు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే మండలి సమావేశాల్లో తొలిరోజు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో మండలి నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. చివరి సమావేశాలని... తెలంగాణ రెండో శాసనసభకు ఇవి చివరి సమావేశాలుగా భావిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా తమ ఎజెండా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉచితవిద్యుత్, ధరణి వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ ద్వారా విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని అధికార బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశ్నోత్తరాలతో పాటు ఇతర చర్చల సందర్భంగా ప్రస్తావించేలా అధికార పక్షం కసరత్తు చేస్తోంది. మరోవైపు విపక్ష పార్టీలు కూడా డబుల్ బెడ్రూమ్లు, ధరణి లోపాలు, ఇటీవల వరదల మూలంగా సంభవించిన నష్టం తదితరాలపై చర్చకు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. 4 కీలక బిల్లులు ప్రస్తుత సమావేశంలో 4 కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి. ఇందులో గతంలో అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్ తిరస్కరించిన మూడు బిల్లులు కూడా ఉన్నాయి. వీటిని ఉభయసభలు మరోమారు చర్చించి ఆమోదిస్తాయి. 1. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బిల్లు రూపంలో సభలో చర్చించి ఆమోదిస్తారు. 2. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యు లేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్‌అన్యూయేషన్) చట్టసవరణ బిల్లు–2022 3. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు–2022 4. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022 -
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే కాంగ్రెస్ ఎజెండా
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యమసాధన ఆకాంక్షలు నెరవేరని తీరును ఎండగట్టాలని అనుకుంటోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని సభ దృష్టికి తేవడం ద్వారా వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు వివరించేలా అసెంబ్లీలో గళమెత్తాలని నిర్ణయించింది. దీంతో పాటు సీఎల్పినేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర అనుభవాలు, ప్రజలు ఏకరువు పెట్టిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరుగుతోందని, ముఖ్యంగా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల నిర్వహణలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం కారణంగానే తాజా వరదనష్టం జరిగిందని, ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు ప్రభుత్వ ఎత్తుగడల లోపమే కారణమనే అంశాలను ఫోకస్ చేయాలని నిర్ణయించింది. కాగా, ఈ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజుల పాటు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకుగాను గురువారం కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఇక, ఈ అసెంబ్లీ గడువు తీరేలోపు ఇవే చివరి సమావేశాలనే చర్చ జరుగుతోంది. 2018 జరిగిన ఎన్నికల్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్‌పార్టీ చివరి సమావేశాల నాటికి తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయి ఐదుగురికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం. -
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం.. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Updates: ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీ శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అక్క చెల్లెమ్మల పక్షపాత బడ్జెట్ గా ఏపీ సీఎం జగన్ చెప్పారు. రైతన్నల పక్షపాత బడ్జెట్, గ్రామ స్వరాజ్ బడ్జెట్‌గా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ క్యాలండర్ ను విడుదల చేసి దాని ప్రకారంగా నిధులను విడుదల చేస్తుందని సీఎం జగన్ వివరించారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మావి అక్కా చెల్లెమ్మల, రైతన్నల పక్షపాత బడ్జెట్లు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రతి బడ్జెట్లో నిధులు రైతన్నల పక్షపాత బడ్జెట్ గ్రామ స్వరాజ్య బడ్జెట్ ఏ నెలలో ఏ సంక్షేమ కార్యక్రమం చేస్తామో క్యాలెండర్ ద్వారా తెలియజేస్తున్నాం సంక్షేమ క్యాలెండర్ ద్వారా అన్ని పథకాలు అమలు చేస్తున్నాం: సీఎం జగన్ ఏప్రిల్‌లో జగనన్న వసతి దీవెన అందిస్తాం వైఎస్సార్ ఆసరా రేపట్నుంచి మొదలవుతుంది ఏప్రిల్ 5 వరకూ వైఎస్సార్ ఆసరా కార్యక్రమం మేలో వైఎస్సార్ భరోసా, రైతు కిసాన్ కార్యక్రమం మేలో జగనన్న విద్యా దీవెన, కల్యాణమస్తు మొదటి ఇన్స్టాల్మెంట్లు, వైఎస్సార్ మత్యకార భరోసా జూన్‌లో జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ లా నేస్తం తొలి విడత కార్యక్రమాలు జూలైలో జగనన్న విదేశీ విద్యా దీవెన తొలి విడత జూలైలో వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రోత్సహకాలు, జగనన్న తోడు తొలి విడత కార్యక్రమం, వైఎస్సార్ సున్నా వడ్డీ(ఎస్‌హెచ్‌జీ) కార్యక్రమం జూలైలో వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా రెండో విడత ఆగస్టులో జగనన్న విద్యా దీవెన రెండో విడత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత అక్టోబర్‌లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ అక్టోబర్‌లో జగనన్న వసతి దీవెన నవంబర్‌లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా మూడో విడత నవంబర్‌లో జగనన్న విద్యా దీవెన మూడో విడత డిసెంబర్లో జగనన్న విదేశీ విద్యా దీవెన రెండో విడత డిసెంబర్లో జగనన్న చేదోడు జనవరిలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ జనవరిలో వైఎస్సార్ ఆసరా జనవరిలో జగనన్న తోడు రెండో విడత జనవరిలో వైఎస్సార్ లా నేస్తం రెండో విడత జనవరిలో పెన్షన్ పెంపు(రూ. 3,000) ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన నాల్గో విడత ఫిబ్రవరిలో కల్యాణ మస్తు, షాదీ తోఫా నాల్గో విడత ఫిబ్రవరిలో ఈబీసీ నేస్తం మార్చిలో జగనన్న వసతి దీవెన రెండో విడత మార్చిలో ఎంఎస్ఎంఈ ప్రోత్సహకాలు సీఎం జగన్ ప్రసంగం మొదటిసారిగా షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్‌పై ఐటీ సోదాలు జరిగాయి నవంబర్, 2019లో మనోజ్‌పై ఐటీ సోదాలు జరిగాయి ఆ తర్వాత చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై ఐటీ దాడులు చేసింది చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్‌తో కలిసి డీల్ చర్చించారు బోగస్ కంపెనీలతో నిధులు మళ్లించారు ఎల్ అండ్ టీ నుంచి కూడా డబ్బులు ఇప్పించేందుకు మనోజ్ ప్రయత్నించారు అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో భారీ అవినీతి: సీఎం జగన్ మనోజ్ దుబాయిలో సీబీఎన్‌కు రూ. 1514 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు కూడా దీంట్లో భాగస్వామి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగం ►చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక ఇచ్చింది ►కోట్లలో అవినీతి జరిగింది ►దాదాపు రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగింది ►కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు ఐటీ శాఖ చెప్పింది ►ప్రజా ధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు ►సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి అవకాశంగా మార్చుకున్నారు ►ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది ►చంద్రబాబు అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి ►మనోజ్ వాసుదేవ్ 2019లో చంద్రబాబుని కలిశారు ►మనోజ్ వాసుదేవ్ షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి ►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు ►బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు ►ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు ►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు ►బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు ►ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు ►అసెంబ్లీ సచివాలయం, హైకోర్టు నిర్మాణాల షాపూర్ జీ పల్లోంజి చేపట్టింది ►ఈ సంస్థకు రూ. 8 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు ►బోగస్ కంపెనీలు, వోచర్లతో నిధులు మళ్లించారు ►చివరిగా ఈ డబ్బులన్నీ చంద్రబాబుకు చేరాయి ►మొత్తం చంద్రబాబు, టీడీపీ రూ. 143 కోట్లు అందాయి ►స్కిల్ స్కామ్‌లో రూ. 372 కోట్లు చంద్రబాబు కొట్టేశారు ►కేబినెట్ ఆమోదానికి, ఎంవోయూకు సంబంధం ఉండదు ►అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత 03:17PM అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం ►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం ►దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం ►అసెంబ్లీలో ఆమోదించిన ఆ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం ►పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు ►ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశాం ►రాయలసీమ జిల్లాల్లో ఆ కులాలు ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ తెలుసుకుంది.. ప్రభుత్వానికి నివేదిక అందించింది ►కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తీర్మానం ►ఉమ్మడి ఏపీలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో తీర్మానం జరిగింది ►మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నాం ►ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండదు ►గిట్టనివారు ఓట్ల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు ►ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు ►నా ప్రభుత్వంలో వాళ్లకు అన్యాయం జరగదు ►గిరిజనులు, ఆదివాసీలకు ఈ తీర్మానాలతో ఇబ్బంది ఉండదు Time: 03:10 PM ►దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలోకి చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం ► బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం ►తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి మేరుగు నాగార్జున ►అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు: మేరుగు నాగార్జున ►లబ్ధిదారుల ఇంటి వద్దకే సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం ►మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ ఫలాలు ►గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. ►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీలో చేర్చాలన్న తీర్మానానికి సభ ఆమోదం Time: 02:00 PM ►విద్యా దీవెన పథకం పేదలు చదువు కోవడానికి ఏర్పాటు చేశాం: మంత్రి నాగార్జున ►పేదల కుటుంబాల స్థితిగతుల ఆధారంగా ఫీజు రీయింబర్స్మెంట్ ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు కులాలకు చెందిన పేద విద్యార్థులకు ఈ పథకం ►వసతి దీవెన ద్వారా కూడా విద్యార్థుల ఖర్చులకు హాస్టల్ ఫీజు చెల్లింపు ►మత్స్యకార భరోసా కింద రూ.10వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ: మంత్రి అప్పలరాజు ►వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు సాయం ►హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణకు చర్యలు: మంత్రి కొట్టు సత్యనారాయణ ►ఈ ఏడాది 2900 దేవాలయాలను నిర్మిస్తాం ►ఈ ఏడాది దూపదీప నైవేద్యాల కోసం నిధులు కేటాయించాం Time: 10:31 AM ►ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ధర్మాన ప్రసాదరావు ►పేదల ఇళ్ల కోసం భూముల్ని కొనుగోలు చేశాం Time: 9:50 AM ►సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ►31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయం. ►జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కూడా గొప్ప విషయం ►31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర: మంత్రి జోగి రమేష్. ►జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలు. ►త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయి. Time: 9:30 AM ►అసెంబ్లీ సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌లైన్‌ను టీడీపీ సభ్యులు క్రాస్ చేశారు. స్పీకర్ పదేపదే హెచ్చరించినా పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ దగ్గరకు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. దీంతో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ►టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం జగన్‌దన్నారు. ►తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ►బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీల జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి మేరుగ నాగార్జున తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. -
ఆరు పద్దులకు ఆమోదం
సాక్షి, అమరావతి: శాసనసభ సమావేశాల సందర్భంగా ఆరు బడ్జెట్ పద్దులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. గురువారం సభలో వ్యవసాయ–సహకార, పశు సంవర్థక–మత్స్య, పౌర సరఫరాలు, ప్రణాళిక–శాసన వ్యవహారాలు, గవర్నర్, కేబినెట్, జీఏడీ నిర్వహణ, సమాచార, ప్రజా సంబంధాలకు చెందిన పద్దులను ప్రవేశపెట్టారు. వీటిపై చర్చించిన అనంతరం మంత్రులు సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం రైతులకు అండగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా ఖరీఫ్‌కు ముందస్తుగా సాగునీరు, వైఎస్సార్ రైతు భరోసాతో పెట్టుబడి సాయం అందించడం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అందిస్తున్నామన్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లభించని పంటలను ఎమ్మెస్పీకి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. టీడీపీ హయాంలో ఆక్వా జోన్ పరిధిలో 2.56 లక్షల ఎకరాలు, నాన్ ఆక్వా జోన్లో 1.90 లక్షల ఎకరాలు భూమి ఉందని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆక్వా జోన్లోకి 4.20 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌కు సంబంధించి టీడీపీ సర్కారు రూ.309 కోట్ల రీయింబర్స్ పెండింగ్‌లో పెట్టగా, తమ ప్రభుత్వం వచ్చాక యూనిట్ రూ.1.50 చొప్పున సబ్సిడీ విద్యుత్ ఇస్తూనే పాత బకాయిలతో కలిపి రూ.2,687 కోట్లు ఖర్చు చేశామన్నారు. పాడి రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరు గేదె పాలపై రూ.20 లబ్ధి చేకూరుస్తున్నట్టు చెప్పారు. అమూల్ రేట్లు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ డెయిరీలు రేట్లు పెంచాల్సి వచి్చందని, ఆ మేరకు రైతులకు రూ.2,300 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల బిల్లుకు సభ ఆమోదం సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఏపీ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల బిల్లు–2023కు గురువారం శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి సురేశ్ తెలిపారు. సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు ప్రజలకు గ్రామ, వార్డు స్థాయిల్లోనే అందుతున్నాయన్నారు. ఇక సచివాలయాల బిల్లుతో పాటు మరో ఆరు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సభ ఆమోదం పొందిన ఆరు బిల్లులు ♦ ఏపీ ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ఎస్టీ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ పబ్లిక్ సర్విసెస్ డెలివరీ గ్యారంటీ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ మున్సిపల్ లాస్ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ మున్సిపల్ లాస్ (రెండో సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (సవరణ) బిల్లు–2023 -
నేను రాను.. మీరు వెళ్లండి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో టీడీపీ పునరాలోచనలో పడింది. సమావేశాలకు హాజరైతేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడారనే కారణాన్ని చూపించి చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. సీఎం అయితేనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. మీడియా సమావేశం పెట్టి బోరున విలపించి అందరిలోనూ నవ్వుల పాలయ్యారు. అప్పట్లో ఆయనతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలను బహిష్కరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత సమావేశాల్లో చంద్రబాబు చేసిన శపథం, హడావుడి నేపథ్యంలో ఈ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే విషయంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని తెగేసి చెప్పి నానా హడావుడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక చేతులెత్తేయడం, ఏడవడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు తీరును తప్పు పట్టారు. దీంతో తాను అసెంబ్లీకి రానని, ఎమ్మెల్యేలు వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం గతంలో శపథం చేసిన కారణంగా వెళ్లకపోతేనే బాగుంటుందని చెబుతున్నారు. ఏ మొఖం పెట్టుకుని వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి నిరసనలు తెలపాలని సూచిస్తున్నారు. కనీసం గవర్నర్ ప్రసంగం వరకైనా ఉండాలని, లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఉండి తర్వాత నిరసన తెలిపి వచ్చినా బాగుంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఈ అంశంపై పలువురు నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తాను వెళ్లకుండా పార్టీ ఎమ్మెల్యేలను పంపించాలని బాబు భావిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులతో జూమ్‌లో మాట్లాడిన చంద్రబాబు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సాయమందిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. విద్యార్థులతో రెండో రోజూ శనివారం ఆయన జూమ్ కాల్లో మాట్లాడారు. విద్యార్థులకు సహాయం చేసేందుకు ఉక్రెయిన్, పోలండ్, హంగేరీలలో స్థిరపడిన తెలుగువారు (ఎన్నారైలు)ని చంద్రబాబు సంప్రదించారు. విద్యార్థులకు అవసరమైన డబ్బు, ఆహారం, హోటల్ ఖర్చులు అందించాలని వారిని కోరారు. ఆ ఖర్చును టీడీపీ నుంచి తిరిగి చెల్లిస్తామని తెలిపారు. పరిస్థితి క్లిష్టంగానే ఉందని, ఎవరూ వారి ప్రాంతాల నుంచి బయటకు రావద్దన్న ఇండియన్ ఎంబసీ సూచనలను పాటించాలని చెప్పారు. -
స్పీకర్‌దే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశానికి ముగ్గురు సభ్యులున్న బీజేపీని పిలవాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఏసీ సమావేశానికి హాజరు కావాలనుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీహాల్లో శుక్రవారం మీడియాతో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పుకుంటామని సీఎం కేసీఆర్ బీఏసీ భేటీలో వెల్లడించారన్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లో హరితహారం, దళితబంధు, ఐటీ, పరిశ్రమలు వంటి పది అంశాలను చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 12 అంశాలపై చర్చకు కాంగ్రెస్ ప్రతిపాదనలు ఈ సమావేశాల్లోనే నాలుగైదు బిల్లులతో పాటు రెండు ఆర్డినెన్స్‌లు కూడా సభ ముందుకు వస్తా యని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 12 అంశాలపై చర్చించాలని ప్రతిపాదనలు ఇచ్చిందని, హైదరాబాద్ ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై చర్చించాలని ఎంఐఎం పార్టీ కోరిందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం కానిస్టిట్యూషన్ క్లబ్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్పై ఈటల రాజేందర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అని, ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించిన సర్వేలో బీజేపీ కంటే టీఆర్ఎస్ పార్టీ 15% ఎక్కువ ఓట్లు సాధిస్తుందని వెల్లడైనట్లు మంత్రి తెలిపారు. -
అసెంబ్లీ సమావేశాలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత జాతీయ గీతాలాపన చేసి సమావేశాలను మొదలుపెట్టారు. సుమారు పావుగంట పాటు జరిగిన తొలిరోజు కార్యక్రమాల్లో.. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలు, నివేదికలను సమర్పించారు. తర్వాత ఇటీవలికాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పించారు. అనంతరం సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండు ఆర్డినెన్సులు.. తెలంగాణ హౌజింగ్ బోర్డు ఆర్డినెన్స్ (2021)ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆర్డినెన్స్ 2021ని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శాసనసభకు సమర్పించారు. ఇక రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మూడో వార్షిక నివేదికను తలసాని శ్రీనివాస్ యాదవ్, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు సంబంధించిన వార్షిక నివేదికలను మంత్రి జగదీశ్‌రెడ్డి; టూరిజం అభివృద్ధి సంస్థ తొలి వార్షిక నివేదికను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్; తెలంగాణ సమగ్ర శిక్షణా కార్యక్రమం వార్షిక నివేదికను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభకు అందజేశారు. తొమ్మిది మందికి నివాళి ఇటీవల మరణించిన తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పిస్తూ శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి (భద్రాచలం), అజ్మీరా చందూలాల్ (ములుగు), కేతిరి సాయిరెడ్డి (హుజూరాబాద్), కుంజా భిక్షం (బూర్గంపాడు), మేనేని సత్యనారాయణరావు (కరీంనగర్), మాచర్ల జగన్నాథం (వర్ధన్నపేట), బుగ్గారపు సీతారామయ్య (బూర్గంపాడు), చేకూరి కాశయ్య (కొత్తగూడెం/పాల్వంచ) మృతిపట్ల సంతాపం ప్రకటించింది. శాసనసభ్యులుగా వారి రాజకీయ ప్రస్థానం, సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నివాళి అనంతరం సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇద్దరు కొత్త సభ్యులతో మండలి శుక్రవారం ఉదయం 11 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి సభకు పరిచయం చేశారు. మండలి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా నారదాసు లక్ష్మణరావు, సయ్యద్ అమీనుల్ జాఫ్రీలను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల మరణించిన ఉమ్మడి ఏపీ మాజీ ఎమ్మెల్సీలు పి.లింబారెడ్డి, టి.లక్ష్మారెడ్డి, హెచ్ఏ రెహ్మాన్, ఆర్.ముత్యంరెడ్డిలకు నివాళిగా మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. తర్వాత రెండు ఆర్డినెన్సులు, పలు నివేదికలను మండలి ముందు ఉంచినట్టు చైర్మన్ ప్రకటించారు. సోమవారం ఉదయానికి సభను వాయిదా వేశారు. -
‘అందుకు భయపడే చంద్రబాబు కొత్త డ్రామా’
సాక్షి, విజయవాడ: అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నామని చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనాకు భయపడి హైదరాబాద్ నుంచి రావటం ఇష్టంలేక డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఒక్కపూట జరిగినా ప్రతిపక్ష నేతగా ఉపయోగించుకోవాలని ఆయన హితవు పలికారు. ‘‘రఘరామను అరెస్ట్ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెట్టారు. రఘురామను తాబేదారుగా మార్చుకుని ప్రభుత్వంపై కుట్ర పన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేస్తున్నారని’’ ఎమ్మెల్యే జోగి రమేష్ నిప్పులు చెరిగారు. చదవండి: రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం: సజ్జల ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు -
ఎజెండాకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశా లను ఒక్కోరోజు చొప్పున మాత్రమే నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం శాసనసభ, బుధ వారం శాసనమండలి భేటీ జరగనుంది. భేటీ ఒకరోజు మాత్రమే కాబట్టి ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లాంటి అంశాల జోలికి వెళ్లకుండా ఎజెండాను మాత్రమే చేపట్టే అవకాశం ఉంది. సమావేశాల ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో శాసనసభ, మండలి సమావేశ మందిరాల్లో సీటింగ్ ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత నెల 6 నుంచి 16వ తేదీ వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల తరహాలోనే సభ్యుల మధ్య భౌతికదూరం ఉండేలా సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణంతో పాటు, సభ లోపల కూడా పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయించా లని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహా చార్యులను ఆదేశించారు. ఏర్పాటు చేయా ల్సిన బందోబస్తుపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్లతో ఫోన్ ద్వారా సమీక్షించారు. అవసరమైన సమాచా రంతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఫోన్లో సూచించారు. ఎజెండా అంశాలే... మంగళవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమై నేరుగా ఎజెండాపై చర్చిస్తుంది. శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో నాలా, రిజిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ 1955 చట్టాలను సవరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఈ మూడు చట్టాలకు సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు. వీటిపై చర్చించి ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్ వాయిదా వేస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే మండలి... శాసనసభ ఆమోదించిన బిల్లులను చర్చించి ఆమోదించిన తర్వాత వాయిదా పడనుంది. అనుమానితులకు కరోనా పరీక్షలు ఉభయ సభల ప్రాంగణాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమ య్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు కరోనా లక్షణాలు న్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయిం చుకోవాలని మండలి చైర్మన్ గుత్తా, శాసన సభ స్పీకర్ పోచారం సూచించారు. సభలో ప్రవేశపెట్టే బిల్లులివే... ►వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు చేస్తారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నాలా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూమార్పిడి సులభతరం చేయాలనే సవరణ కూడా చేస్తారు. ►రెవెన్యూ చట్టంలోని సవరణలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చట్టానికి కూడా స్వల్ప సవరణ చేస్తారు. ►జీహెచ్ఎంసీ చట్టం – 1955కు సవరణ చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పాల కమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతి నిధ్యానికి చట్టబద్ధత కల్పిస్తారు. వార్డు కమిటీల పనివిధానం, వార్డుల రిజర్వేషన్ రొటేషన్‌ను రెండు పర్యాయాలకు మారుస్తూ చట్ట సవరణ చేస్తారు. -
జాతీయ స్థాయిలో పార్టీపై కేసీఆర్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. కొత్త రాజకీయ పార్టీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని కొట్టిపారేశారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై భవిష్యత్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రగతి భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్సీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం సీఎం మాట్లాడారు. (10న రెవెన్యూ చట్టంపై ప్రకటన) దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఏ ఒక్కరూ ఆశామాషీగా తీసుకోవద్దని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సభ్యులకు హితబోధ చేశారు. అన్ని అంశాలపై సభలో చర్చిద్దామన్నారు. పూర్తి సమాచారంతో అందరూ మాట్లాడాలని సూచించారు. రెవిన్యూ చట్టంతో రాష్ట్ర రూపురేఖలు మారతాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సీఎం నివాళి అర్పించారు. ఆయన మృతితో దుబ్బాకలో ఉప ఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. పార్టీ అభ్యర్థి ఎంపికపై కొంత ఉత్కంఠ ఉన్నా.. సోలిపేట కుటుంబంలోనే ఒకరికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత సమావేశమైన కేబినెట్ కొత్త రెవెన్యూ చట్టం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం సభ్యులతో చర్చించనున్నారు. -
విద్యుత్ ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత
సాక్షి, అమరావతి: విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. విద్యుత్‌పై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చే పరిస్థితిలో ఉందని, పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిజనిజాలపై పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలుపై గత ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్‌పై ఒక కమిటీ వేసిందని.. ఆ నివేదిక రాగానే అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. పద్ధతి ప్రకారం జరగాలంటే సమయం పడుతుందని వివరించారు. పవన్ విద్యుత్, సౌర విద్యుత్ వాడకం మంచిదేనని.. పెట్రోలు,డీజీల్ నిల్వలు వాడకం మంచిది కాదన్నారు. పీపీఏల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. కేబినెట్ సబ్‌కమిటీ పర్యవేక్షిస్తుంటే.. టీడీపీకి ఆతృత ఎందుకని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఏ దోపిడీ చేసినా మేం ఊరుకుంటే వాళ్లకు సంతోషమని, వాస్తవాలు చెబితే టీడీపీ పట్టించుకోదని విమర్శించారు. 2014-15లో డిస్కమ్‌ల నష్టాలు రూ.9వేల కోట్లు అని, 2018-19లో ఆ నష్టాలు రూ.29 వేల కోట్లకు చేరాయన్నారు. గత ఐదేళ్లలో డిస్కమ్‌లను రూ.20 వేల కోట్ల నష్టాల్లో పడేశారన్నారు. ఎక్కువ రేట్లకు ఇచ్చిన వాటిపై మరోసారి ఆలోచించాలని కోరితే గొడవ చేస్తున్నారన్నారు. అవినీతి జరిగితే చర్యలు తీసుకోమని కేంద్రం కూడా చెప్పిందని వివరించారు. విద్యుత్ కోసం రైతులు ఇబ్బందులు పడకూడదనే సీఎం జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని బుగ్గన పేర్కొన్నారు. -
‘వాటిపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు’
సాక్షి, అమరావతి: ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదని మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారని.. ఈ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చి పుచ్చుకోవడం టీడీపీకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదన్నారు. పార్టీలే కాదు, బీ ఫారాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారన్నారు. 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ ఒక్కరేనని తెలిపారు. ఢిల్లీ, గుంటూరులో దీక్షలు చేశారని, ధర్నాలు, యువభేరీ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. పార్టీ ఎంపీల చేత కూడా వైఎస్ జగన్ రాజీనామాలు కూడా చేయించారన్నారు. వైఎస్సార్సీసీ ఎంపీలు కన్నా.. టీడీపీ ఎంపీలు అప్పట్లో ఎక్కువ మంది ఉన్నారని, కాని చీమ కుట్టినట్టుకూడా వారికి అప్పుడు లేదన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే బెటరని అప్పట్లో బల్ల గుద్దినట్టు చంద్రబాబు చెప్పారన్నారు. అప్పట్లో ఆర్థిక మంత్రికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచుకున్న చరిత్ర వారిదని.. ఇప్పుడు అదే వ్యక్తులు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. అలా చేయకపోతే కేంద్రం ఆలోచించేంది.. ఆరోజు నుంచి నేటి వరకూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా కావాలంటూ మడమ తిప్పకుండా మాట్లాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత రాత్రికి రాత్రి యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసి, ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా సరిపెట్టుకుంటారన్న ఒక మైండ్‌సెట్‌ని క్రియేట్ చేసింది చంద్రబాబేనన్నారు. అలా చేయకపోతే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఉండేదన్నారు. ‘షీలా బీడే కమిటీ ఈ జనవరితో అయిపోయింది. వాళ్లు 89 రికమెండేషన్లు ఇస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక 68 రికమెండేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. మేం అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఏ అభ్యంతరాలు పెట్టకుండా 68 సిఫార్సులకు సానుకూలత తెలిపింది. కాని ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది. రాజకీయం చేసింది. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన తర్వాత పారిపోయి ఈ రాష్ట్రానికి వచ్చేశారు. హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని అయితే... కట్టుబట్టలతో పారిపోయి వచ్చారని’ కన్నబాబు దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు బాధపడే పరిస్థితి ఏర్పడిందని.. చేసిందంతా చేసి ఇవాళ నీతి కథలు, పిట్ట కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు నాడు అలా..నేడు ఇలా... టీడీపీకి ప్రత్యేక హోదాపైన, విభజన హామీలపైన మాట్లాడే హక్కులేదని.. ఐదేళ్ల పాటు ఏమీ చేయకపోగా, ఆరునెలల్లో ఏదో జరిగిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే ఫలితం ఉండేదని, కాని అలా చేయకుండా మోదీ అన్యాయం చేశారని ఎన్నికల ముందు మాట్లాడి, ఇప్పుడు మళ్లీ మోదీతో జతకట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించి మళ్లీ ఇక్కడ మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో వారికే తెలియాలి.. ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి, ఆస్తుల పంపిణీ గురించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ ఇచ్చిన భవనాల్లో ఏదీ కూడా విభజన చట్టంలోని పరిధిలోనిది కాదని.. విభజన చట్టంలో భవనాల్లోని ఒక్క గదిని కూడా అప్పగించలేదని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా... విభజన చట్టంలోని భవనాలను ఆక్రమిస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. అక్కడ సచివాలయంలో భవనాలు ఎందుకు వృథాగా పడి ఉన్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం అభివృద్ది చేసిన దాన్ని కూడా విడిచిపెట్టారని.. ఇప్పుడు అక్కడ ఉండకపోయినా, బూజు పట్టినా.. కరెంటు బిల్లుల రూపేణా కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్లపాటు వాళ్లు చేసిన నిర్వాకానికి మరో ఐదేళ్ల పాటు కష్టపడితే తప్ప తీరని విధంగా సమస్యలు సృష్టించారన్నారు. మనకు కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం ఆక్యుపై చేసినా.. అడగలేకపోయారని.. కారణం ఓటుకు నోటు కేసులో అప్పటి ముఖ్యమంత్రికి ఉన్న బలహీనత అని తెలిపారు. ఢిల్లీతో సంబంధాల విషయంలో ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో టీడీపీ వాళ్లకే తెలియాలని ఎద్దేవా చేశారు. -
పకడ్బందీ వ్యూహంతో అధికారపక్షం
సాక్షి, అమరావతి : నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలను ఎదుర్కోవడానికి అధికార వైఎస్సార్సీపీ పకడ్బందీ వ్యూహంతో సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఆరు నెలల పాలనను పూర్తి చేసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. ఎన్నికలకు ముందు జగన్ చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రలో, ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే యత్నంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సఫలీకృతం అయింది. ఆరు నెలల్లో ప్రజలకు ఎంతో చేశామన్న ధీమా, సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో అధికార పక్షం ముందుకు కదులుతోంది. శీతాకాల సమావేశాలు మొదలు కావడానికి కొద్ది రోజుల ముందు నుంచే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కసరత్తు మొదలు పెట్టారు. ఉభయ సభల్లో చర్చకు రానున్న, తాము ప్రస్తావించనున్న అంశాలపై వారు కూలంకషంగా చర్చించారు. టీడీపీ లేవనెత్తే అనవసర వివాదాలు, సభను పక్క దోవ పట్టించే విధంగా సభలో ప్రస్తావించే అంశాలను తిప్పి కొట్టడానికి సిద్ధమయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఇవ్వాలనే చట్టాన్ని చాలా వరకు ఆచరణలో అమలు చేసి చూపించారు. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ సొమ్మును ఆదా చేయడం అనేది ముమ్మాటికీ ఘనతే. ఈ అంశం చర్చకు వచ్చినపుడు ప్రతిపక్షం ఏవైనా అవాంతరాలు సృష్టిస్తే సరైన సమాధానాలతో వాటిని ఎదుర్కొనేందుకు అధికారపక్షం సిద్ధమవుతోంది. ప్రకృతి వల్ల ఉత్పన్నమైన ఇసుక కొరతను విజయవంతంగా నివారించడం, మద్యం వినియోగాన్ని రాష్ట్రంలో గణనీయంగా తగ్గించడం, చరిత్రాత్మకమైన రీతిలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు, అమరావతి రాజధాని రైతుల సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు, తదితర అంశాలన్నింటిపై చర్చకు అధికార పక్షం సిద్ధంగా ఉంది. ప్రజల కోసమే అసెంబ్లీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో అధికార పక్షం ఉందని, ప్రతిపక్షం బాధ్యతగా సభలో చర్చకు తెచ్చే ఏ అంశానికైనా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అలా కాకుండా వ్యక్తిగత అజెండాతో సభను తప్పు దోవ పట్టించే విధంగా వ్యవహరిస్తే అధికారపక్షం చూస్తూ ఊరుకోబోదన్నారు. అసెంబ్లీ ఉన్నది ప్రజల సమస్యలను చర్చించి పరిష్కరించడం కోసమేనన్నది అందరూ గుర్తించాలన్నారు. -
మైక్ కట్ చేస్తే రోడ్ల మీదకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం నిర్ణయించింది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, తాగు, సాగు నీరు, నిరుద్యోగం, యూరియా కొరత, రైతుబంధు, విష జ్వరాలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం తదితరాలపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇక్కడి గోల్కొండ హోటల్లో సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, వీరయ్య, సీతక్కలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జెట్టి కుసుమకుమార్ తదితరులు హాజరయ్యారు. రైతుబంధు సైతం అందలేదని, రుణమాఫీ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న అంశంపై చర్చించిన నేతలు దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీలో మాట్లాడటానికి కోరినంత సమయం ఇవ్వకున్నా, మైక్ కట్ చేసి తమగొంతు నొక్కాలని ప్రయత్నించినా రోడ్లెక్కి ఆందోళన కొనసాగించాలనే అభిప్రాయానికి వచ్చారు. ముఖ్యంగా రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్నా.. ప్రభుత్వం స్పందించిన తీరు బాగాలేదని, రైతుల మరణాన్ని కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించిందనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. భేటీ అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సంగారెడ్డి తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 15న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. -
అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజా దర్బార్
సాక్షి, అమరావతి: త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతోపాటు ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు వచ్చే ప్రజల కోసం ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉండడంతో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశాయి. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్‌ను నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. శాసనసభ సమావేశాల తర్వాత ప్రజా దర్బార్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. జూలై 1వ తేదీ నుంచి ప్రజాదర్బార్ జరుగుతుందని మీడియాలో ప్రచారం సాగుతోందని, అది సరికాదని మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైతే ముఖ్యమంత్రి ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకే అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుందని, ఈలోగా ప్రజలను కలుసుకుని, విజ్ఞప్తులు స్వీకరించడం కష్టం అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి వచ్చే ప్రజల కోసం మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉందని, అవన్నీ పూర్తయ్యాక ప్రజా దర్బార్ ప్రారంభిస్తారని తెలిపారు. -
మొదట వైఎస్ జగన్ ప్రమాణం.. తరువాత చంద్రబాబు
సాక్షి, అమరావతి: తొలి క్యాబినెట్ సమావేశంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాశమంత ఎత్తుకి ఎదిగారని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోను అమలు చేసే విధంగా తొలి క్యాబినెట్ సమావేశంలోనే చర్యలు తీసుకోవడం గర్వకారణన్నారు. మంగళవారం అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభవుమతాయని వెల్లడించారు. తొలుత సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని, అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తారని తెలిపారు. గురువారం స్పీకర్ ఎన్నిక ఉంటుందని, 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని చెప్పారు. సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత స్పీకర్, ప్రభుత్వంలా కాకుండా హుందాగా నిర్వహిస్తామన్నారు. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు ఛాంబర్ కూడా ఇవ్వకుండా హేళన చేశారని, తమ ప్రభుత్వంలో అందరికీ సరైన ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. -
12 నుంచి అసెంబ్లీ
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి నూతన శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన 175 మంది, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుంది. కాగా సమావేశాలు ప్రారంభానికి ముందే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. ఇప్పటికే ఆయన ఈ నెల 8వ తేదీ ఉదయం తొలుత సచివాలయంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే రోజున మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సచివాలయంలో జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందుగా 7వ తేదీన వైఎస్సార్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోందో వివరిస్తూ ఆ మరుసటి రోజున జరిగే విస్తరణపై ఎమ్మెల్యేలను మానసికంగా జగన్ సిద్ధం చేస్తారని పార్టీ వర్గాల సమాచారంగా ఉంది. 10న తొలి మంత్రివర్గ సమావేశం కొత్త మంత్రులతో ఏర్పడబోయే మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన జరుగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ తొలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వ పరంగా ప్రజలకు చేయాల్సిన దిశానిర్దేశం వంటి అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా వారికి ఇచ్చిన హామీల అమలుకు జగన్ ప్రభుత్వం ఎలా కట్టుబడి ఉందనే విషయంపై ఒక స్పష్టతను ఇస్తారని తెలుస్తోంది. -
వాళ్లపై వేటు వేసి మాట్లాడండి మిస్టర్ స్పీకర్!
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు.. గవర్నర్ నరసింహన్‌తో పచ్చి అబద్దాలు చెప్పించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేసినవి ఏమైనా ఉంటే అవి అవినీతి, మోసం, దగా, అన్యాయం మాత్రమేనని ధ్వజమెత్తారు. జపాన్, సింగపూర్ కంటే ఎక్కువ అభివృద్ధి సాధిస్తే రాష్ట్రంలో ఇంకా మూడొంతుల మంది ఎందుకు పేదరికంలో మగ్గిపోతున్నారని ప్రశ్నించారు. అసత్యాలతో కరపత్రాన్ని రాయించి గవర్నర్‌తో చదివించడం ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య మూలసూత్రాలపై ఏమాత్రం నమ్మకం లేని చంద్రబాబు.. గవర్నర్‌తో ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పిన ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అనే మాటను చెప్పించడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలు చేసి వారిలో నలుగుర్ని మంత్రులుగా చేసి కొనసాగిస్తున్న అసెంబ్లీని దయ్యాల కొంప అనుకోవాల్సిందేనా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ చక్కగా డ్రామా నడిపిస్తున్నారని, పదే పదే ఫోన్లు చేసి ప్రతిపక్షాన్ని ఆహ్వానిస్తున్నానని డ్రామాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధంగా కొనుగోలు చేసిన 23 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే అదే గంటలో అసెంబ్లీకి వస్తామని స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలకు బుధవారం ఆమోదం తెలిపిన స్పీకర్‌కు ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు లేఖలు ఇస్తే పట్టించుకోలేదన్నారు. స్పీకర్ తన పోస్టుకు విలువ ఇవ్వకుండా పార్టీ కండువా వేసుకుని పార్టీ మీటింగ్స్‌లో మాట్లాడుతూ.. సీఎంను పొగడ్తలతో ముంచెత్తుతున్నారన్నారు. నాలుగేళ్లు ఎన్డీఏలో కొనసాగిన చంద్రబాబుకు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పుకుంటున్న అభివృద్ధి రేటు పచ్చి అబద్దమన్నారు. ఉత్పత్తి రంగంలో దేశవ్యాప్తంగా 16.7 శాతం అభివృద్ధి ఉంటే ఏపీలో 9.66 శాతం ఉందని చెప్పారని, అంత వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్వీస్ సెక్టార్లో 44 శాతం అభివృద్ధి ఎలా సాధించిందో చంద్రబాబుకే తెలియాలని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగంలో కూడా ఆహార ఉత్పత్తులు గతంలో కంటే కూడా బాగా తగ్గాయన్నారు. వ్యవసాయాన్ని సర్వ నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. తన చుట్టూ ఉన్న ప్రజల అభివృద్ధి కోరుకోవాలని కానీ, ఎక్కడో నక్షత్రాల్లో అభివృద్ధి అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో విఫలమై.. ఇప్పుడు 2050 విజన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిరహితంగా ఏపీ పాలన ఉందని చెప్పించడం సిగ్గుచేటు అన్నారు. ఈ ఐదేళ్లలో బడ్జెట్ కేటాయింపుల కంటే ఎక్కువగా దోపిడీ చేశారన్నారు. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా....?
సాక్షి, అమరావతి : ఈ నెల చివరన జరగాల్సి ఉన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడినట్టు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు చివరి అసెంబ్లీ సమావేశాలు జనవరి 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పెన్షన్ల పంపిణీ, కొత్త పథకాల ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు మరో నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4నుంచి 11వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. -
30 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికలకు ముందు చివరి అసెంబ్లీ సమావేశాలు 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 5వ తేదీన పూర్తి స్థాయి ఓటాన్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టే ఎత్తుగడలో భాగంగా పూర్తి స్థాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూ.రెండు లక్షల కోట్లకు పైగా అంచనాలతో రూపొందించనున్నారు. పలు రంగాలకు రూ.వేల కోట్లు కేటాయించినట్లు ప్రచారం చేసుకోవడమే ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు. అయితే పూర్తిస్థాయి బడ్జెట్లోనే ఏప్రిల్, మే నెలలకు ఓటాన్ బడ్జెట్‌కూ అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఆయా రంగాలకు భారీ మొత్తంలో కేటాయించామనే ప్రచారం చేసుకునేలా బడ్జెట్ రూపకల్పన చేయాలని నిర్ణయించింది. -
అసెంబ్లీ భేటీ, భద్రతపై మండలి చైర్మన్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాలు, భద్రతా ఏర్పాట్లపై మండలి చైర్మన్ స్వామిగౌడ్ నేతృత్వంలోని బృందం సోమవారం సమీక్షించింది. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర కమిషనర్ అంజనీకుమార్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నతాధికారులు, ట్రాఫిక్, ఫైర్ విభాగాల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు అసెంబ్లీ, మండలి ప్రాంగణాలను పరిశీలించి సీఎం, వీఐపీల అలైంటింగ్ పాయింట్లు, వాటి భద్రత, అసెంబ్లీ లోపల, బయట ఎంత మంది సిబ్బందిని భద్రతలో నిమగ్నం చేయాలన్న దానిపై చర్చించారు. అదే విధంగా ట్రాఫిక్సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. -
సీఎల్పీ నేతగా ఎన్నికయ్యేదెవరో?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఈ నెల 16 లేదా 17న జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రారంభానికి ముందే సీఎల్పీ సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నా.. 17న అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులుగా ప్రమాణం చేసిన అనంతరమే సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఈ సమావేశానికి అధిష్టానం దూతగా కేరళకు చెందిన లోక్‌సభ సభ్యు డు, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ 15న రాత్రి హైదరాబాద్ రానున్నారు. ఈయన సమక్షంలో పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక జరగనుంది. దీంతో సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా పనిచేసిన మల్లు భట్టి విక్రమార్క, మాజీ మం త్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సబి తా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, లోక్‌సభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవమున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నా యి. వీరిలో ఉత్తమ్, భట్టిలను సీఎల్పీ నేతగా నియమించే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎల్పీ రేసులో రాజగోపాల్‌రెడ్డి, శ్రీధర్‌బాబుల పేర్లూ వినిపిస్తున్నాయి. రాజగోపాల్‌రెడ్డి పేరును అధిష్టానం తీవ్రంగానే పరి శీలిస్తోందని, ఇందుకు తగినట్టు గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకునే పనిలో రాజగోపాల్‌రెడ్డి కొంత చురుకుగానే ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ విప్ గా, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవమున్న శ్రీధర్‌బాబు కూడా రేసు లో ముందున్నట్టు తెలుస్తోంది. సీఎల్పీ నేతగా మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటే సబితా ఇంద్రారెడ్డిని నియమించే అవకాశాలున్నాయి. మొత్తంగా సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటా రనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
సీఎం దుబాయ్ టూర్‌పై కొనసాగుతున్న అస్పష్టత
-
టూర్ ఉన్నట్టా? లేనట్టా..?
సాక్షి, హైదరాబాద్:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దుబాయ్ పర్యటన విషయంలో అస్పష్టత కొనసాగుతోంది. ఈనెల 6 నుంచి 13వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన దుబాయ్ పర్యటన లేనట్టేనని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేయాల్సి ఉండటంతో సమయాభావం ఏర్పడుతుందని, దీంతో ఆయన దుబాయ్‌కి వెళ్లకపోవచ్చని అంటున్నారు. దీనిపై సీఎం కార్యాలయ వర్గాలు మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. మరోవైపు అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు కావడంతో కనీసం ఒక్కరోజయినా వెళ్లి ఆ సదస్సులో పాల్గొనే ఆలోచన కూడా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అన్ని అనుమతులు, ఉత్తర్వులు వచ్చాయి వాస్తవానికి, ఈనెలలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని కేసీఆర్‌కు గత ఏడాదిలోనే ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆ సదస్సుకు హాజరుకావాలని నిర్ణయించుకున్న కేసీఆర్ తన పర్యటనకు అవసరమైన దౌత్యపరమైన అనుమతులు కూడా తీసుకున్నారు. దుబాయ్, అబుదాబిల్లోని పారిశ్రామికవేత్తలతో భేటీతో పాటు దుబాయ్‌లోని తెలంగాణ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై భారత రాయబార కార్యాలయ అధికారులతో చర్చించాలని నిర్ణయించుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌లకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ, అసెంబ్లీ సమావేశాల సమయంలోనే మంత్రివర్గ విస్తరణకు కూడా అవకాశం ఉండటంతో మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవా లన్న దానిపై తగిన కసరత్తు చేయాల్సి ఉన్నందున కేసీఆర్ దుబాయ్ వెళ్లకపోవచ్చని ప్రగతిభవన్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఆఖరి నిమిషంలో వెళ్లాలని నిర్ణయించుకుంటే గనుక షెడ్యూల్ ప్రకారం కాకుండా కనీసం ఒక్కరోజు వెళ్లిరావచ్చని తెలుస్తోంది. మొత్తంమీద కేసీఆర్ దుబాయ్ పర్యటనపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రెండో రోజు వర్షాకాల సమావేశాలు ప్రారంభం
అమరావతి: ఏపీ అసెంబ్లీలో రెండో రోజు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణతో పాటు మరో 8 మంది మాజీ శాసనసభ సభ్యులకు ఉభయసభలు సంతాపం తెలపనున్నాయి. డ్వాక్రా రుణాల మాఫీ, రాష్ట్రంలో భూముల పునఃపరిష్కార సర్వే, భాషా పండితుల పదవులస్థాయి పెంపు, చెరుకు రైతులకు విత్తనంపై సబ్బిడీ, పేదలకు ఇళ్లపట్టాలు, అంగన్వాడీ ఆయాల అర్హతలు, ఖాళీగా ఉన్న పదవుల భర్తీ, బనగానపల్లె నియోజకవర్గంలో రాళ్ల పేల్చివేత కార్యకలాపాలు, గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకం, రాష్ట్రంలో పడిపోతున్న విద్య నాణ్యత, నీటిపారుదల రంగం వంటి అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు రానున్నాయి. అలాగే విశాఖపట్నం జిల్లాలో దివీస్ ఫార్మా వల్ల కాలుష్యం, ఎన్టీఆర్ విద్యోన్నతి, నిరుద్యోగ భృతి, న్యాయవాదుల సంక్షేమం, ఉపాధి కల్పనా కేంద్రాలు, మహిళలపై దురాగతాలు, ఎంజీఎన్ఆర్ఈజీ నిధులు, అనంతపురం జిల్లాలో ఎంజీఎన్ఆర్ఈజీ అవినీతి, కాకినాడలో హార్వర్డ్ పార్క్, పెండెకల్లులో పీహెచ్సీ, రాజధాని నగర అభివృద్ధి వంటి అంశాలు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు రానున్నాయి. -
ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండానే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. తమ పార్టీ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయనందుకు నిరసనగా గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి వెఎస్సార్సీపీ సభ్యులు సభకు హాజరుకాని విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అన్హరత వేటు వేస్తే.. ఆ వెంటనే అసెంబ్లీకి హాజరవుతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుధవారం ప్రకటించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోనందున గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రెండోసారి ప్రధాన ప్రతిపక్షం లేకండానే ప్రభుత్వం ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనుంది. ఉదయం 8.30 గంటలకు బీఏసీ భేటీ గురువారం ఉదయం 9.15 గంటలకు శాసన సభ సమావేశాలు, 9.45 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకు ముందు ఉదయం 8.30 గంటలకు శాసనసభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశమై ఎప్పటి వరకు సమావేశాలు నిర్వహించాలో నిర్ణయించనుంది. మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి మృతికి గురువారం ఉభయ సభల్లో నివాళులు అర్పించనున్నారు. మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మృతి పట్ల శుక్రవారం నివాళులు అర్పిస్తారు. పటిష్ట బందోబస్తు అసెంబ్లీకి వచ్చే ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు, భద్రతా సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాని స్పీకర్ కోడెల స్పష్టం చేశారు. అసెంబ్లీ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, గట్టి నిఘా పెట్టాలని సూచించారు. విజిటర్స్ గ్యాలరీపైనా కన్నేసి ఉంచాలన్నారు. విజిటర్లకు ఇచ్చే పాస్‌లను క్షుణ్నంగా పరిశీలించాకే లోపలికి అనుమతించాలని స్పీకర్ ఆదేశించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలేవీ? అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్ కలిసి బుధవారం బందోబస్తు ఏర్పాట్లు, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ.. ఇవే చివరి పూర్తిస్థాయి అసెంబ్లీ సమావేశాలు కావొచ్చని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రులు ఇచ్చిన సమాధానాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలకు తావివ్వరాదని అధికారులకు సూచించారు. అత్యధికంగా రెవెన్యూ, విద్య, వైద్యం, ఆరోగ్యం, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, పురపాలక శాఖల్లో ప్రశ్నలకు సమాధానాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మండలి చైర్మన్ ఫరూక్ మాట్లాడుతూ.. ఇంతవరకూ జరిగిన 11 సెషన్లకుగాను 792 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉందన్నారు. -
వారిపై వేటేయండి.. నేటి నుంచే సభకు వస్తాం
సాక్షి, అమరావతి: తమ పార్టీ నుంచి అధికార అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను శాసనసభా సభ్యత్వాల నుంచి తక్షణం అనర్హులుగా ప్రకటిస్తే తాము గురువారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు హాజరవుతామని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ఈ మేరకు వారు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య దేవాలయంలో ఉంటున్న దొంగ సొత్తు లాంటి వారని, వారిని ఈరోజే బయట పడేయాలని కోరారు. ఫిరాయింపుదారుల అనర్హత మాట ఎత్తని స్పీకర్ తమను మాత్రం శాసనసభా సమావేశాలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్ అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష అణచివేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్‌ను మీ(చంద్రబాబు) చెప్పు చేతల్లో ఉంచుకుని, సొంత పార్టీ కార్యకర్తగా వాడుకుంటున్నందున ఈ లేఖను మీకు రాయాల్సి వస్తోందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ పూర్తి పాఠం... ‘‘అసెంబ్లీ సమావేశాలకు మా పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన విజ్ఞాపన నేపథ్యంలో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను అధికార పక్షం సీట్లలో కూర్చోబెట్టి సభను నడుపుతున్న స్పీకరు గారు, వారిని ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి కాపాడుతున్న స్పీకరు గారు ప్రజాస్వామ్య ధర్మపన్నాలు వల్లించడం చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం. గురువారం నుంచి మీరు నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు మేం హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజే ఫిరాయింపు మంత్రులు నలుగురిని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు 22 మందిని తక్షణం పదవుల నుంచి తొలగించండి. ప్రజాస్వామ్య దేవాలయంలో ఉన్న మీ దొంగసొత్తును ఈరోజే బయటపడేయండి. ఇదే విషయాన్ని 2017 అక్టోబరులో శాసనసభ సమావేశాల సందర్భంగా చెప్పాం. మరోసారీ చెపుతున్నాం. ఈరోజే వారిని తొలగించండి. రేపటి నుంచి సమావేశాలకు తప్పక హాజరవుతాం. భారత ప్రజాస్వామ్యానికి మన పార్లమెంట్ ప్రతీక అయితే... రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రతినిధులతో ఉన్న అసెంబ్లీ రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్యానికి దేవాలయం. అటువంటి ప్రజాస్వామ్య దేవాలయాన్ని దయ్యాల కొంపగా మార్చి, మా శాసనసభ్యుల్లో 22 మందిని విడతలవారీగా కొనుగోలు చేసి, పార్టీ మార్చి మీ అధికార పక్షం సీట్లలో కూర్చోబెట్టుకుని, వారిలో నలుగురితో మంత్రులుగా ప్రమాణం చేయించి, వారితో మమ్మల్ని తిట్టించడానికి సిద్ధమైన మీరు నడుపుతున్న సభను ఏ ప్రమాణాల్లో అయినా ఎవరైనా శాసనసభ అంటారా? మీరు సభలో చేస్తున్నది ప్రజాస్వామ్య దేవత మీద అఘాయిత్యం కాదా? అలవాటుపడిన హంతకుడికి రానురానూ తాను చేసే హత్యలు మామూలు విషయంగా మారిపోతాయన్నట్టు ఏకంగా మీ మామ నుంచే ముఖ్యమంత్రి పదవి, పార్టీ, పార్టీ అధ్యక్ష పదవి, పార్టీ గుర్తు, ఎన్నికల గుర్తు, ట్రస్టు వంటివన్నీ లాక్కుని, ఆయన కుటంబాన్ని ముక్కలు చేసి ముఖ్యమంత్రి అయిన మీ ముందు... పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన చట్టాలూ, ప్రజాస్వామ్య సూత్రాలూ, రాజ్యాంగ నియమాలూ మాట్లాడటం దయ్యాల ముందు వేదాలు వల్లించడం లాంటిదే. ఒక పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు ఆ తరవాత తన పార్టీకి కాకుండా వేరే పార్టీకి విధేయత చూపినట్టు ఆధారాలున్న మరుక్షణం అటువంటి శాసనసభ్యుడిని అనర్హుడిగా చేయాలని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం(రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్) స్పష్టం చేస్తోంది. ఈ అధికారాన్ని రాజ్యాంగం శాసన సభాపతి చేతిలో పెట్టింది. ఫిరాయించిన వారి శాసన సభ్యత్వాన్ని తక్షణం రద్దు చేయడానికి తన చేతిలోకి వచ్చిన ఈ అధికారాన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే వ్యవహరిస్తున్న కోడెల శివప్రసాదరావు గారు, ఫిరాయింపుదార్ల సభ్యత్వాలు రద్దు చేయకుండా మీ తరఫున అడ్డుపడేందుకు తనకున్న అధికారాన్ని మార్చుకుని శాసన సభ గౌరవాన్ని, రాజ్యాంగాన్ని పాతిపెడుతుంటే... మేం అలాంటి సభకు రాలేమని స్పష్టం చేశాం. 2016 ఫిబ్రవరి నుంచి 2017 మార్చి వరకు విడతలవారీగా 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల్ని తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయింపజేశారు. ఒక్కొక్కరికీ రూ.30 కోట్ల వరకు లంచంగా ఇచ్చి మరీ ఈ కొనుగోళ్లకు పాల్పడ్డారు. ఆ శాసన సభ్యుల డిస్క్వాలిఫికేషన్కు ఎప్పటికప్పుడు మా పార్టీ తరఫున స్పీకరుకు నివేదించాం. 2017 మార్చి 27న ఒకసారి, 2017 నవంబరు 8న మరోసారీ స్పీకరుకు డిస్క్వాలిఫికేషన్ వేటు వేయండని విజ్ఞప్తి చేశాం. మీరు ఆడమన్నట్టు ఆడటానికి, మీ కనుసైగల్ని ఆదేశాలుగా తీసుకునేందుకు అలవాటుపడిన స్పీకరు గారు చట్టం, రాజ్యాంగం కంటే మీ పట్ల విధేయతను గొప్పదిగా భావించటం వల్లే ఈ రోజుకీ ఆ 22 మందిమీదా అనర్హత వేటు పడలేదు. అంతేకాకుండా, శాసనసభ జాబితాలో వారిని మా పార్టీ సభ్యులుగా చూపుతూ మరోవంక అధికార పక్షం బెంచీల్లో కూర్చోబెట్టే దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు. శాసనసభ పవిత్రతను మంటగలపడంలో మీ కౌరవ పటాలంలో ఎవరు తక్కువ తిన్నారు గనక? రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవిలో ఉంటూ కూడా మీ ఫొటోలకు పాలాభిషేకాలు– మీకు పాదాభిషేకాలూ చేస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కూడా దక్కదనుకునే అర్భకులు, ఎన్టీఆర్ వెన్నుపోటులో మీ పార్ట్నర్ అయిన పన్నుపోటు శాఖ మంత్రిగారు, నిలువు మార్గంలో లోపలికి ప్రవేశించలేడని నిర్ణయించుకుని అడ్డదారిలో మీరు సభలోకి నెట్టిన మీ పుత్రరత్నం గారు, వీరికి తోడు మా పార్టీలో గెలిచి మీ మంత్రి మండలిలో చేరిన దుష్ట చతుష్టయం, వీరందరూ చాలరన్నట్టు– వారివారి శాఖల్లో కాక, కేకల్లో బూతుల్లో మీరు శిక్షణ ఇచ్చి పంపిన పటాలం... వీరందరికీ తమరి అమోఘమైన నాయకత్వం! శాసనసభను ఇంతగా గబ్బు పట్టించిన వారు ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో మరొకరున్నారా చంద్రబాబు గారూ? గుంటూరులో మీరు ఇటీవల పెట్టిన ‘నారా హమారా’ సభలో నిండా ముప్పయ్యేళ్ళు లేని 10 మంది ముస్లిం యువకులు లేచి, అయ్యా... 2014 ఎన్నికల్లో మీ వాగ్దానాల సంగతేమిటని ప్రశ్నిస్తే సమాధానం నోటితో చెప్పటం చేతగాని మీరు, శాసనసభలో నిజాయతీగా ప్రజల తరఫున సంధిస్తున్న మా ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని ఎవరు అనుకుంటారు? గత నాలుగేళ్ళలో శాసన సభలో మీరు ఏనాడు ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారు? మేం నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం... ఉంటాం. మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబరు నుంచి నేటి వరకు 2,900 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉంటూ, ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? కమీషన్ పద్ధతిలో భూ కేటాయింపుల కోసం కేబినెట్ మీటింగులు, లంచాల కోసం సెక్రెటేరియట్‌లో సిట్టింగులు, మనీలాండరింగ్ కోసం విదేశీ పర్యటనలు... ఇదే కదా మీ పరిపాలన? ఇవన్నీ అందరికీ తెలిసినా మీ మాజీ పార్ట్నర్లు, కాబోయే పార్ట్నర్లతో మేం శాసనసభనుంచి పారిపోయాం అని మమ్మల్ని విమర్శిస్తూ మీ స్క్రిప్టును వారితో పలికిస్తున్నారు. ఆ నలుగురు మంత్రులను, 22 మంది ఎమ్మెల్యేలను వెంటనే తొలగించండి. చట్టసభలోనే చట్టానికి విలువలేనప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారు? స్పీకరే రాజ్యాంగ భక్షకుడిగా పార్టీ ఫిరాయింపులకు కొమ్ముగాస్తుంటే ఇంకెక్కడి శాసన సభ? కళ్లెదురుగా కనిపిస్తున్నా, స్పీకర్ ఏళ్ల తరబడి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటి? ఇది పరమ దుర్మార్గం, ఇది అప్రజాస్వామికం అని ఉద్యమించాల్సిన పక్షాల్ని, ఎల్లో మీడియాని మీ బిస్కెట్లకు అలవాటు చేసి వారిని మా మీదకు ఉసిగొల్పుతున్నారు. ప్రజల సమస్యల మీద చర్చించే ధైర్యం గానీ, సత్తా గానీ ఉంటే వెంటనే ఆ నలుగురు మంత్రుల్ని, 22 మంది ఎమ్మెల్యేల్ని డిస్క్వాలిఫై చేయండి. చేసిన దుర్మార్గానికి లెంపలు వేసుకుని ప్రజలను క్షమాపణ అడగండి. ఇవేవీ చేతగావనుకుంటే, మీ ఎల్లో మీడియా, మీ మాజీ–తాజా పార్ట్నర్ల అండదండలతో, మీ పుత్రరత్నం ఆకాంక్షలకు అనుగుణంగా మీ దుశ్శాసన సభను మీకు నచ్చినట్టుగా నడుపుకోండి. రాష్ట్రంలో ఉన్న మేధావులు, ఆలోచనపరులు, బాధ్యతగల ప్రతి ఒక్కరూ మేం రాసిన ఈ ఉత్తరంలోని అంశాలమీద ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు -
వచ్చే నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, అమరావతి: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వచ్చే నెల ఆరో తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. వారం నుంచి పదిరోజులపాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. తాత్కాలిక సచివాలయంలో మంగళవారం జరిగిన శాఖాధికారులు, విభాగాధిపతుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపారు. వాస్తవానికి ఈ నెలలోనే సమావేశాలు నిర్వహించాలని భావించినా పలు కారణాల వల్ల సాధ్యం కాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం కనీసం ఆరు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకూ సమావేశాలు జరిగాయి. ఆరు నెలలు కావస్తుండడంతో మళ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇన్నాళ్లూ బీజేపీ నేతలు నిద్రపోయారా?
బెంగళూరు: ‘ఐదేళ్లుగా బీజేపీ నిద్రపోయిందా? గత 15 అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిధులపై లెక్కలు చూపిన సమయంలో వారు నిద్రపోయారా? ప్రజలను మోసం చేయడం మానండి. పదేపదే అబద్ధం చెబితే నిజం కాబోదు..’అంటూ బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. కేంద్రం నుంచి అందిన దాదాపు రూ.2,19,506 కోట్ల నిధులకు లెక్కలు చెప్పాలని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. గత ఐదేళ్లలో కేంద్రం నుంచి అందిన నిధుల్లో ప్రతి రూపాయికీ అసెంబ్లీలో లెక్క చూపామని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ విషయం బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత జగదీష్ షెట్టర్‌కు కూడా తెలుసునని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అమలు కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించిందని ఆరోపించారు. -
మనం దేశానికే ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని, కొత్త రాష్ట్రమైనా దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు శాతంగా ఉన్న తెలంగాణ ప్రాంత స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 2016–17 నాటికి 8.6 శాతానికి పెరిగిందని.. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువని తెలిపారు. సోమవారం రాష్ట్ర శాసనమండలి, శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజున గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. శాసనసభ సమావేశాలు నిర్మాణాత్మకంగా జరుగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇరవై నిమిషాల పాటు ఇంగ్లిష్‌లో మాట్లాడిన ఆయన.. చివరిలో కొద్దిసేపు తెలుగులో మాట్లాడి, ‘ఓం సర్వే భవంతు సుఖినాః.. సర్వే సంతు నిరామయః’అనే శ్లోకంతో ప్రసంగాన్ని ముగించారు. గవర్నర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. బంగారు తెలంగాణ దిశగా.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టాం. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాం. ఉత్తమ పారిశ్రామిక విధానంతో.. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం. టీఎస్ ఐపాస్‌తో కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. ఈ విధానంతో రాష్ట్రానికి 1.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ కేం ద్రంగా మారింది. టీ–హబ్‌తో స్టార్టప్‌లను ప్రో త్సహిస్తున్నాం. టీహబ్–2ను ప్రారంభిస్తాం. ప్రభుత్వ వైద్యానికి చేయూత కేసీఆర్ కిట్ పథకానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇది అమల్లోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు 33 శాతం నుంచి 49 శాతానికి పెరిగాయి. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమా న్ని ప్రారంభించాం. నాణ్యమైన విద్య అందించేందుకు 517 గురుకులాలు ప్రారంభించాం. ఎస్టీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నాం. రహదారుల అభివృద్ధికి చర్యలు ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. జాతీయ రహదారులను జిల్లా, మండల రహదారులతో అనుసంధానం చేస్తు న్నాం. గతేడాది హైదరాబాద్ మెట్రోరైల్ కూడా ప్రారంభమైంది. పీపీపీ పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు తొలిదశలో 30 కిలోమీటర్ల మార్గం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తెలుగు భాషను, సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తెలుగు ప్రపంచ మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం తెలుగు భాష, సాహిత్యాన్ని చాటింది. 8 వేల మంది ప్రతినిధులు సభలకు హాజరయ్యారు. ప్రభుత్వం బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించే దిశగా చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది. ఉభయ సభల్లో చర్చలు మన ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని ఆశిస్తున్నా..’’ రైతుల సంక్షేమానికి చర్యలు రాష్ట్రంలో అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అందువల్లే ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోంది. 23 లక్షల పంపుసెట్లకు నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. త్వరలో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతమైంది. ఈ రికార్డుల సమాచారంతో త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నాం. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం విజయవంతంగా సాగుతోంది. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నాం. గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. విద్యుత్ రంగంలో ప్రగతి సాధించాం. పరిశ్రమలకు పవర్ హాలిడేలను ఎత్తివేశాం. సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే ముందున్నాం. -
మరో 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు మరో మూడు రోజుల పాటు నిర్వహించ నున్నట్లు మంత్రి కాల్వ∙శ్రీనివాసులు వెల్లడించారు. శాసనసభాపతి కోడెల శివ ప్రసాదరావు అధ్యక్షతన శాసనసభలోను, మండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్ అధ్యక్ష తన శాసన మండలిలోను మంగళవారం జరిగిన బీఏసీ సమావేశం నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ నెల 29, 30 తేదీల్లోను, వచ్చే నెల 2న సభలో చర్చించాల్సిన అంశాలను నిర్ణయించినట్టు వివరించారు. -
సొంత డబ్బాతో తొలిరోజు సరి!
-
సొంత డబ్బాతో తొలిరోజు సరి!
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఆప్రజాస్వామిక తీరును నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరుకాని నేపథ్యంలో.. శుక్రవారం నుంచి ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనేదీ లేకుండానే ముగిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ చేయాలని.. యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాలని, పార్టీ ఫిరాయించిన వారిని తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. సమస్యలను పరిష్కరించి ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వాటిని విస్మరించి ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించింది. సమావేశాల తొలి రోజున ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలుకొని చివరి వరకు ప్రభుత్వానికి వత్తాసుగానే తప్ప ప్రజలకు మేలు చేసే ఏ విధమైన చర్చ లేకుండాపోయింది. అనేక అక్రమాలకు ఆలవాలంగా మారి దాదాపు రూ.353 కోట్ల మేర అవినీతి జరిగిందని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుబట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై వచ్చిన ప్రశ్నను స్వల్పకాలిక చర్చగా మార్చి ప్రభుత్వానికి కితాబులిచ్చే దిశగా ప్రసంగాలు కొనసాగాయి. ప్రధాన ప్రతిపక్షం లేక సభ వెలవెల రాష్ట్రంలో తొలిసారిగా ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొలిరోజునే వెలవెలబోయాయి. అధికారపక్ష సభ్యుల్లోనూ ఈ తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఇవేం సమావేశాలంటూ పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. ‘‘ప్రధాన ప్రతిపక్షం హాజరై ప్రజాసమస్యలు ప్రస్తావించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానిపై చర్చ జరిగి సభలో ఒక హుందాతనం ఏర్పడేది. ఈసారి అలాంటి పరిస్థితి లేనందున సమావేశాలు చప్పచప్పగా అనిపిస్తున్నాయి. ఏదో మా డప్పు మేము కొట్టుకోవడానికే తప్ప ఇవేవీ ప్రజాసమస్యల పరిష్కారానికి పనికి వచ్చేవిగా కనిపించడం లేదు’’ అని సీనియర్ శాసనసభ్యులు కొందరు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకుండా సాగిన సభ కళ లేకుండాపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. విపక్షం లేకపోయినా సీఎం దిశానిర్దేశం ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ ప్రకటన చేసినప్పటికీ.. వ్యూహ కమిటీ సమావేశమంటూ సభ ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హడావుడి చేశారు. ప్రతిపక్షం హాజరయ్యేలా ప్రయత్నించి సభను సజావుగా నిర్వహించాల్సిన ఆయన ఆ బాధ్యతను పట్టించుకోకుండా ప్రతిపక్షంగా మనమే వ్యవహరిద్దామంటూ సమావేశంలో టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేయడం విశేషం. ఆ తరువాత మంత్రులను నిలదీయండంటూ తన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారని బయటకు లీకులిప్పించారు. అయితే.. సభలో మాత్రం అలాంటి సన్నివేశాలు ఏ దశలోనూ కనిపించలేదు. సభ ప్రారంభానికి ముందు సభా వ్యవహారాల కమిటీ సమావేశం మొక్కుబడిగా ముగిసింది. ఇందులో వైఎస్సార్సీపీపై విమర్శలకే అధికారపక్ష నేతలు ఎక్కువ సమయం కేటాయించారని సమాచారం. ప్రజా సమస్యల ప్రస్తావన ఏదీ? ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో శుక్రవారం ప్రారంభమైన సభ.. ప్రభుత్వానికి, అధినేత చంద్రబాబునాయుడికి జేజేలు పలకడమే తప్ప ఏ సమయంలోనూ ప్రజాసమస్యల ప్రస్తావన కనిపించలేదు. మొదటి ప్రశ్నగా పట్టిసీమ ప్రాజెక్టుపై దాదాపు అరగంటసేపు చర్చ సాగించారు. ఈ పథకంలో జరిగిన అవినీతి అక్రమాల సంగతిని ప్రస్తావనకు లేకుండా కేవలం నదుల అనుసంధానం చేసిన అపర భగీరధుడిగా చంద్రబాబును కీర్తించే చర్చగా మార్చేశారు. దీనిపై మరింత లోతుగా మాట్లాడాల్సి ఉందని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు ప్రతిపాదించగా మంత్రి యనమల రామకృష్ణుడు స్వల్పకాలిక చర్చను చేపట్టాలని సూచించారు. దీంతో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తరువాత పట్టిసీమపై స్వల్పకాలిక చర్చను దాదాపు రెండు గంటలపాటు కొనసాగించారు. పట్టిసీమను చేపట్టిన చంద్రబాబును అభినందిస్తూ ప్రత్యేక తీర్మానం చేయాలని బీజేపీ ప్రతిపాదించడం విశేషం. అంబేద్కర్ స్మృతివనం, అమృత్ పథకం అమలు, ఎన్టీఆర్ పట్టణ గృహనిర్మాణ పథకం, చంద్రన్న బీమా, గిరిజన గ్రామాలకు రవాణా సదుపాయాలు, గ్రామ పంచాయతీలకు భవనాలు అనే అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. -
సభ ఎన్నాళ్లు?: ఎమ్మెల్యే అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఈ సభ ఎన్ని రోజులు జరుగుతుందో ఎవరికీ తెలియదు. 15రోజులా.. 20 రోజులా లేక 25 రోజులా? ఎన్నిరోజులో తెలియకుండానే సభ నిర్వహ ణేంటి? బిల్లులు ఎప్పుడు ప్రవేశపెడతారు?’’అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ నిలదీశారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఒక చిన్న ప్రశ్నకు అధికార పక్షం సుదీర్ఘంగా మాట్లాడుతూపోతే ప్రశ్నలు ఇచ్చిన తాము ఏం కావాలని ప్రశ్నించారు. సభలో ప్రతిపక్షాలకు ఒక రూలు, అధికార పక్షానికి మరో రూలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్రభుత్వ వ్యూహమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సభ నిర్వహణపై బీఏసీని పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు సమ్మతించిన సభాపతి బీఏసీని పిలుస్తానని హామీ ఇచ్చారు. ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం: ఈటల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సభలో ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమైన ప్రశ్నలుండగా సమయం మించిపోతే ‘డీమ్డ్ టు బీ ఆన్సర్డ్’అంటూ వదిలేయడం తగదని, వాటిని వాయిదా వేసి తర్వాత అవకాశం కల్పించాలన్నారు. మేడారం జాతరను కుంభమేళ తరహాలో కేంద్రం జాతీయ పండుగగా గుర్తించేలా సిఫార్సు చేయాలంటూ పలువురు సభ్యులు చేసిన సూచనపై ఈటల స్పందిస్తూ మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. గిరిజన దేవాలయాలకు పూజారులుగా పనిచేసే వారికి వేతనాలు ఇవ్వాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి కోరగా ఈ అంశం సీఎం దృష్టిలో ఉందన్నారు. -
సభ ఎన్నిరోజులో ఎవరికీ తెలియదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయో ఎవరికీ తెలియదని బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక సంప్రదాయాలు, శాసనసభ వ్యవహారాల సలహా సంఘం అంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని విమర్శించారు. ఒక్కసభా నాయకునికి మాత్రమే సభను ఎన్నిరోజులు నడుపుతారో తెలిసినట్టుందన్నారు. ముఖ్యమైన అంశాలను చర్చించకుండా అధికారపార్టీ సభ్యులు సభను ఏకపక్షంగా నడిపించుకుంటున్నారని అన్నారు. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఫసల్ బీమా యోజనను అమలు చేయడంలేదని, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలేదని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. -
27 నుంచి తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, మండలి శీతాకాల సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈ నెల 27 నుంచి సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపింది. 26న బీఏసీ సమావేశం నిర్వహించి, ఎన్ని రోజులు సభ జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో వ్యూహ కమిటీ భేటీ అయింది. నెలరోజుల పాటు సమావేశాలు నిర్వహించేలా ప్రతిపాదించాలని.. 15 నుంచి 20 రోజుల పాటు పనిదినాలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసేలా కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వం తరఫున ఈ ప్రతిపాదనను అసెంబ్లీ కార్యదర్శికి పంపించాలని సూచించారు. శాసనసభ ఎన్ని రోజులు జరిగితే.. అన్ని రోజులు మండలి కూడా జరపాలని అన్నారు. శాసనసభలో చర్చ జరిగిన ప్రతి అంశంపైనా మండలిలోనూ చర్చ జరగాలన్నారు. అన్ని అంశాలపై చర్చ ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలపై కూలంకషంగా చర్చ జరగాలని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలి. సభ్యులు లేవనెత్తే ప్రతి అంశంపై జవాబు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధం. ప్రజలకు అన్ని విషయాలను అసెంబ్లీ ద్వారా వివరించాలి. దీనికోసం మంత్రులు సిద్ధం కావాలి. ప్రతిపక్ష సభ్యులు ఏ అంశంపై ఏ ప్రశ్నలు వేసినా ప్రభుత్వం నుంచి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా అమలు చేయని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వాటి గురించి వివరించాలి. సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలి. విలువైన సూచనలు స్వీకరించాలి. అంతిమంగా అసెంబ్లీ నుంచి ప్రజలకు కావాల్సిన సమాచారం పోవాలి. ఎన్ని రోజులు సభ నిర్వహించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నెల రోజుల పాటు సభ నిర్వహించాలని అధికార పక్షం నుంచి కోరదాం. ప్రతిపక్ష సభ్యులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నిర్వహించడానికి అభ్యంతరం లేదు. సభ హుందాగా నడవాలి. ప్రతీ అంశంపై చర్చ జరగాలి..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక మాతృభాష పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇంటర్ వరకు కచ్చితంగా తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలన్న నిబంధనతో మాతృభాష పరిరక్షణ జరగడంతో పాటు అనేక మంది తెలుగు పండిట్లకు ఉద్యోగావకాశం కూడా లభిస్తుందన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించనున్నట్లు వెల్లడించారు. స్పష్టమైన తీర్మానాలు చేయాలి ప్రస్తుత సమావేశాలు చాలా ముఖ్యమై నవిగా భావించాలని, ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై మంత్రులు స్పష్టమైన ప్రకటనలు చేయాలని కేసీఆర్ సూచించారు. వివిధ అంశాలపై సభ్యులందరూ మాట్లాడేలా కూలంకషంగా చర్చ జరగాలని, కొన్ని బిల్లు లను ఆమోదించుకోవాలని చెప్పారు. ఇక అసెంబ్లీలో గతంలో అనేక అంశాలపై తీర్మా నాలు చేసి కేంద్రానికి పంపినా.. అక్కడి నుంచి స్పందన రాలేదన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్, హైకోర్టు విభజన, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, ఉపాధి హామీ పనులను వ్యవసాయంతో అనుసంధానం చేయడం, తెలంగాణలో ఎయిమ్స్ స్థాపన తదితర అంశాలపై కేంద్రాన్ని కోరుతూ మరోసారి అసెంబ్లీ గట్టిగా కోరాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఈ మేరకు మరోసారి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని, ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. కాగా సమావేశాలకు సంబం ధించి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. -
వచ్చే నెల ప్రథమార్ధంలో అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన తరువాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా అయితే బడ్జెట్ సమావేశాల అనంతరం వర్షాకాల సమావేశాలు, ఆ తరువాత శీతాకాల సమావేశాలు ఉంటాయి. అయితే జీఎస్టీ కోసం ఈ ఏడాది మే 16న ఒక రోజు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. దీంతో నవంబర్ 16కు ఆరునెలల గడువు ముగిసిపోతుందనే సాంకేతిక అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ఆలోగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున నవంబర్ తొలి వారం లేదా రెండో వారంలో చట్టసభను సమావేశపరచాలనే అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చారు. నవంబర్ తొలివారంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నందున అసెంబ్లీ సమావేశాలకు వచ్చే చాన్స్ లేదని సర్కార్ భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ సమస్యనైనా ఆధారాలతో సహా ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తుండటం ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడటం లేదని, ఆయన లేని సమయంలో సమావేశాలు నిర్వహిస్తే తమ పని మరింత సులువు అవుతుందని అధికారపక్షం భావిస్తోందని, ఈ విధానం మంచిదికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వాధినేత అవినీతిని ప్రతిపక్ష నేత ఎండగడతారనే భయం ప్రభుత్వ పెద్దల్లో ఉందని, అవకాశం ఉన్నంత వరకు అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చేయడమే ‘ముఖ్య’నేతకు అలవాటని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్, లండన్, అమెరికా పర్యటనలకు వెళ్తున్నారు. అనంతరం స్పీకర్‌తో కలసి ఇన్చార్జి అసెంబ్లీ కార్యదర్శి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశాల కోసం విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. -
గతంకంటే భిన్నంగా సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ మధుసూదనాచారి సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు గతం కంటే ఎంతో భిన్నంగా జరుగుతున్నాయని శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అన్నారు. కొత్త రాష్ట్రమైనా కేవలం మూడేళ్లలో ఎన్నో రంగాల్లో అభివృద్ధిలో పురోగమిస్తోందని, మూడేళ్లుగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాల తీరు సంతృప్తికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా కమిటీ (ఎంఏసీ) తొలి సమావేశం సోమవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో జరిగింది.శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంఏసీ చైర్మన్ వి.సూరజ్‌కుమార్, కమిటీ సభ్యులు, శాసనసభ కార్యదర్శి రాజసదారాం ఇందులో పాల్గొన్నారు. మీడియా లాంజ్‌లో ఏర్పాట్లు, అసెంబ్లీ గ్యాలరీ పాసులు, సీట్ల కేటాయింపు, పార్కింగ్, శాసనసభ వార్తలను కవర్ చేసే మీడియా ప్రతినిధులకు ఓరియంటేషన్ తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను ప్రజలంతా చూస్తున్నారని, ఈ నేపథ్యంలోనే సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి మీడియా కమిటీ సహకారంతో ముందుకు సాగుదామని స్పీకర్ అన్నారు. తరచూ ఇలాంటి సమావేశాల ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చని స్వామిగౌడ్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. -
సస్పెన్షన్ రద్దు!
♦ ఏడుగురు డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత ♦ ధన్యవాదాలు తెలిపిన స్టాలిన్ ♦ అధికార, ప్రతిపక్షాలు చెట్టాపట్టాల్ ♦ వాకౌట్ లేకుండానే ముగిసిన సమావేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్షం ఆగ్రహం, అధికార పక్షం నిగ్రహం లేదా వాగ్యుద్ధాలు వాకౌట్లో సాగుతున్న అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ రద్దు, ప్ర«ధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం, వివిధ అంశాలపై చర్చలతో శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగి ముచ్చట గొలిపాయి. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత స్పీకర్ ధనపాల్ మాట్లాడుతూ అసెంబ్లీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు తన ప్రకటనను వెలిబుచ్చుతారని అన్నారు. ఆ తరువాత సంఘం అధ్యక్షుడు, ఉప సభాపతి పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ, డీఎంకే సభ్యులు ఎస్ అంబేద్కుమార్ (వందవాశి), కేఎస్. మస్తాన్(సెంజి),కేఎస్.రవిచంద్రన్(ఎగ్మూరు), సురేష్ రాజన్ (నాగర్‌కోవిల్), కె.కార్తికేయన్ (రిషివందయం), పి. మురగన్ (వేప్పనగల్లి) కేకే. సెల్వం (ఆయిరమ్ విళక్కు)ల క్రమశిక్షణ ఉల్లంఘన నివేదికను కమిటి తరఫున అసెంబ్లీకి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నివేదికను ఈ రోజే చర్చకు పెట్టాలని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత, మంత్రి సెంగోట్టయ్యన్ తీర్మానాన్ని ప్రతిపాదించగానే అసెంబ్లీ అభీష్టానికి వదిలేయగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమయంలో స్పీకర్ ధనపాల్ మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన సదరు ఏడుగురు డీఎంకే ఎమ్మెల్యేలు సభా హక్కులను ఉల్లంఘించారని, అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. వీరిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ తనకు సమర్పించిన ఉత్తరం ఆధారంగా ఆరునెలలపాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. సస్పెండ్ కారణంగా ఈ ఆరునెలల కాలంలో ఎమ్మెల్యేల వేతనం, ఇతర ఆదాయాలు పొందలేరని క్రమశిక్షణ సంఘం ఆరోజు ప్రకటించిందని అన్నారు. అయితే సదరు ఏడుగురు ఎమ్మెల్యేలు తనవద్దకు వచ్చి పశ్చాత్తాపపడ్డారని, ఇకపై అలా నడుచుకోమని విన్నవించుకున్నారని స్పీకర్ తెలిపారు. వారిని శిక్షించాలని అసెంబ్లీ కోరినా మన్నించి సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నానని ప్రకటించారు. ఆసియా ఖండంలోనే తమిళనాడు ఆరోగ్యకరమైన రాష్ట్రంగా విరజిల్లాలని ఆశిస్తున్నట్లు స్పీకర్ పేర్కొనారు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు ఎయిమ్స్ వైద్యశాల ఏ జిల్లాలో స్థాపిస్తారని స్టాలిన్ అడిగిన ప్రశ్నకు వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ బదులిస్తూ, అన్ని జిల్లా ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో నెలకొల్పాలని కోరుతున్నారు, అయితే ఈ విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున గతనెల 24వ తేదీన ఉత్తరం రాశామని చెప్పారు. ఏదేమైనా రాష్ట్రానికి ఎయిమ్స్ వైద్యశాలను సాధించి తీరుతామని హామీ ఇచ్చారు. స్టాలిన్‌తో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ: రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌ను పెరోల్‌పై విడుదల చేసే అంశంలో మద్దతు కోరుతూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ప్రజాప్రతినిధులను కలిసేందుకు పేరరివాళన్ తల్లి అర్బుతామ్మాళ్ శుకవారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పెరోల్‌పై కలిసి చర్చించుకోవడం మరో విశేషం. -
సమీక్షలకు శ్రీకారం
► సీఎం బిజీ ►మంత్రులతో చర్చ ► అసెంబ్లీకి సన్నద్ధం అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని శాఖల వారీగా సమీక్షలకు సీఎం పళనిస్వామి సిద్ధం అయ్యా రు. సోమవారం పర్యాటక, దేవాదాయ, ప్రజా పనుల శాఖ మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాలు జూన్ ఏడు లేదా ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం డీఎంకేను ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో పాలకులు నిమగ్నం అయ్యారు. శాఖల వారీగా కేటాయింపులు, పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరించి పనిలో పడ్డారు. ఉదయం సచివాలయంకు దాదాపుగా అందరూ మంత్రులు హాజరయ్యారు. వారి వారి శాఖల్లో సమీక్షలతో బిజీ అయ్యారు. ఆయా శాఖల్లోని వ్యవహారాల మీద సీఎం పళనిస్వామి సైతం దృష్టి సారించారు. ఇందులో భాగంగా రోజుకు రెండు మూడు శాఖలు చొప్పున సమీక్షించేందుకు నిర్ణయించారు. ఆ దిశగా దేవాదాయ, పర్యాటక, ప్రజా పనుల శాఖల్లో సాగుతున్న పనులు, నిధులు, వ్యయాలు, పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఆయా శాఖల మంత్రుల సమక్షంలో కార్యదర్శులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఆయా శాఖల మీద చర్చ సాగే సమయంలో ప్రతిపక్షాల్ని ఎదుర్కొనే విధంగా అన్ని సమాధానాలు, అన్ని వివరాలు లెక్కలతో సహా ముందు ఉంచుకుని తిప్పికొట్టే ప్రసంగాలు సాగించాలని ఈ సందర్భంగా సీఎం ఆయా శాఖల మంత్రులకు సూచించే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సీఎం పళని స్వామిని కలిసి వినతి పత్రం సమర్పించడం గమనార్హం. సీఎంతో భేటీ: పళని స్వామి సర్కారుకు వ్యతిరేకంగా పన్నెండు మంది ఎమ్మెల్యే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మాజీ మంత్రులు పళనియప్పన్, సెంథిల్ బాలాజీ, తోపు వెంకటాచలం కూడా ఉన్నారు. వీరితో పాటుగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉదయం సచివాలయం వచ్చారు. సమీక్షలో బిజీగా ఉన్న సీఎంను కలిసేందుకు యత్నించారు. సమీక్ష ముగిసినానంతరం వీరికి అనుమతి లభించిందని చెప్పవచ్చు. సీఎంతో ఈ ఎనిమిది మంది గంట పాటుగా సమావేశం అయ్యారు. నియోజకవర్గాల్లోని సమస్యలు, కూవత్తూరు క్యాంపులో తమకు ఇచ్చిన హామీల అమలు నినాదంతో ఓ చిట్టాను సీఎంకు అందజేసి వెళ్లినట్టు సమాచారం. దీంతో సీనియర్ మంత్రులు సెంగోట్టయన్, తంగమణి, జయకుమార్, ఎస్పీ వేలుమణిలను తన ఛాంబర్‌కు సీఎం పిలిపించుకుని ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాలకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు తమకు ఇచ్చిన జాబితాను పరిశీలించి, వాటి అమలు మీద తగు నిర్ణయం తీసుకునే పనిలో సీఎం నిమగ్నమైనట్టు తెలిసింది. అమ్మ ప్రభుత్వానికి నేటితో ఏడాది : పాలన మీద పట్టు బిగించే విధంగా , ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే రీతిలో పళని సర్కారు సిద్ధం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారంతో అమ్మ ప్రభుత్వం మళ్లీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కానున్నడం గమనార్హం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అమ్మ జయలలితకు మళ్లీ పట్టం కట్టారు. మే 23వ తేది వరుసగా రెండో సారి సీఎం పగ్గాలు జయలలిత చేపట్టారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో విషాదాలు, ఎన్నో ఘటనలు సాగినా, ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అమ్మ జయలలిత మరణంతో పన్నీరు సీఎం కావడం, ఆయన్ను పదవి నుంచి దించి చిన్నమ్మ శశికళ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేపట్టి, చివరకు అక్రమాస్తుల కేసు రూపంలో కటకటాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక, పళని తన నేతృత్వంలో అమ్మ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నా, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు అంతంత మాత్రమే. ఢిల్లీకి సీఎం : ముఖ్యమంత్రి పళణిస్వామి మంగళవారం ఢిల్లీ బయలుదేరనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో బుధవారం భేటి కానున్నారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధానితో రెండు రోజుల క్రితం భేటి అయిన నేపథ్యంలో హఠాత్తుగా సీఎం ఢిల్లీ పర్యటన సాగునుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల నుంచి స్పీకర్ తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తన సస్పెన్షన్ శాసనసభ వ్యవహారాలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, సహజ న్యాయసూత్రాలను కాలరాస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ సమయంలోనూ మంత్రివర్గ విస్తరణ!
విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చునని విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఇష్టాగోష్టిగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చుననే వార్తలు వస్తున్నాయి కదా అని విలే కరులు ప్రస్తావించగా ‘మంత్రివర్గ విస్తరణ, మార్పు చేర్పులు అనేవి పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలోనివి. దానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడా, అయిపోయిన తర్వాతనా అనేది ఎందుకు? ముఖ్యమంత్రి అనుకుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉండొచ్చు’ అని వ్యాఖ్యానించారు. -
ప్రజా సమస్యలే ప్రధానాస్త్రం
►అసెంబ్లీలో జిల్లా ఎమ్మెల్యేల పోరాటం ►బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలన్న పెద్దిరెడ్డి ►ప్రభుత్వ భూముల ఆక్రమణపై చెవిరెడ్డి ధ్వజం ►డ్వాక్రా రుణాల మాఫీపై నినదించిన రోజా తిరుపతి: అసెంబ్లీ సమావేశాల్లో జిల్లా శాసనసభ్యుల వాణి ఊపందుకుంది. ప్రజా సమస్యలే ప్రధానాస్త్రంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికల హామీలను గాలికొదిలి రాష్ట్ర ప్రజలను అధికార పార్టీ మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాకు చెందిన పుంగనూరు, చంద్రగిరి, నగరి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్కే రోజా తమదైన శైలిలో ప్రజా సమస్యలను, సంక్షేమ పథకాల అమల్లో సర్కారు వైఫల్యాలపై వ్యూహాత్మకంగా ధ్వజమెత్తు తున్నారు. తిరుపతి రూరల్ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ధ్వజమెత్తిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను ఎత్తిచూపారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుడగ జంగాల సమస్యలను లేవనెత్తారు. ప్రభుత్వంపై రోజా ఫైర్ గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో నగరి ఎమ్మెల్యే రోజా ప్రభుత్వం తీరుపై భగ్గుమన్నారు. డ్వాక్రా మహిళల రుణ మాఫీ, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు లోపించిన రక్షణ, గోరుముద్దల పథకం అమల్లో లోపాలను ప్రస్తావించారు. 80 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.14,200 కోట్ల రుణ మాఫీ చేయాల్సి ఉంటే, బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. జిల్లాకు చెందిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, పీలేరు, మదనపల్లి ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డిలు సమయం దొరికినప్పుడు, సందర్భం వచ్చినపుడు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, ప్రజల అవసరాలను గుర్తు చేస్తున్నారు. -
ఎండలో నిలబడి రేవంత్ నిరసన
అన్యాయంగా సభనుంచి సస్పెండ్ చేశారని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల నుంచి బహిష్కరణకు గురైన టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎ.రేవంత్‌రెడ్డి, సండ్రవెంకటవీరయ్య సోమవారం అసెంబ్లీ ప్రధానద్వారం ఎదురుగా, మండు టెండలో నిలబడి నిరసన తెలియజేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంతో పాటు, అసెంబ్లీ జరిగిన సమయం అంతా వారు ఎండలోనే నిలబడ్డారు. మరో టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కూడా అసెంబ్లీ లోపలికి వెళ్లలేదు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో సభ పూర్తిగా ఆయన ఆధీనం లోనే ఉంటుందని, ఆ సమయంలో ఏం జరిగినా స్పీకర్‌కు సస్పెండ్ చేసే అధికారం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు అధికారంలేకున్నా, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారనే సాకుతో తమను సస్పెండ్ చేయడం ద్వారా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
2019నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం
-
విపక్షాలను ఎలా ఎదుర్కొందాం?
‘అసెంబ్లీ’ వ్యూహంపై నేడు సీఎం అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ భేటీ హైదరాబాద్: ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమవుతోంది. శుక్ర వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై ఇం దులో చర్చించనున్నారు. ఇటీవల ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, బీజేపీ సైతం ప్రభుత్వ విధానాలపై ఒంటి కాలిపై లేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ జనావేదన పేరున సదస్సులు నిర్వహిస్తోంది. మరోవైపు టీడీపీ సైతం పాదయాత్రలతో జనంలోకి వెళ్లింది. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అసెంబ్లీ వేదికగా కూడా విపక్షాలు విమర్శలకు దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తమ సభ్యులు ఎలా వ్యవహరించాలనే దానిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచనలు చేస్తారని చెబుతున్నారు. నామినేటెడ్, సంస్థాగత అంశాలపైనా.. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత అంశాలపైనా భేటీలో చర్చించే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే.. ఏప్రిల్‌లో జరగాల్సిన పార్టీ 16వ ప్లీనరీపై సీఎం దృష్టి పెడతారని సమాచారం. అలాగే ఏడుగురు ఎమ్మెల్యేలకు మొదట పార్లమెంటరీ కార్యదర్శులుగా అవకాశం ఇచ్చినా.. కోర్టు తీర్పుతో వారు మాజీలయ్యారు. ఇలాంటి వారినీ, పదవులపై ఆశలు పెట్టుకున్న వారందరినీ పరిగణలోకి తీసుకుని ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. -
కొత్త..కొత్తగా...!
⇒ నవ్యాంధ్రలో తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ⇒ తరలివచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ⇒ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం ⇒ దారి పొడవునా హారతులు పట్టి తిలకం దిద్దిన మహిళలు ⇒ అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ శ్రేణుల ఓవర్‌యాక్షన్ ⇒ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల బస్సుకు అడ్డుగా నిలిచి నినాదాలు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలి అసెంబ్లీ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో సోమవారం మొట్టమొదటగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నోచుకున్నాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు విచ్చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్థానికులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యేలతో కలిసి వెలగపూడిలోని అసెంబ్లీ భవనానికి చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు ప్రకాశం బ్యారేజి, ఉండవల్లి సెంటర్, పెనుమాక, యర్రబాలెం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం శివారు ప్రాంతానికి చేరుకున్నారు. పెనుమాకలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు జగన్మోహన్రెడ్డికి హారతులు పట్టి తిలకం దిద్ది స్వాగతం పలికారు. యర్రబాలెం, కృష్ణాయపాలెంలోనూ స్థానికులు స్వాగతం పలికారు. మందడం శివారు ప్రాంతం నుంచి సచివాలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన రహదారి మీదుగా వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళుతున్నారని తెలుసుకున్న వెంకటపాలెం గ్రామస్తులు రహదారి వద్దకు చేరుకున్నారు. తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర హెనీ క్రిస్టినా ఆధ్వర్యంలో తుళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు బత్తుల కిషోర్ స్వాగతం పలికారు. వారందరికీ వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఇదిలావుండగా, వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు. అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ నేతల ఓవర్ యాక్షన్.. రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు కావటంతో ప్రభుత్వ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దారిపొడవునా పోలీసులను మోహరింపజేసింది. ముందుగానే అసెంబ్లీ గేట్ వద్దకు చేరుకున్న అధికారపార్టీ నేతలు హడావుడి చేయటం కనిపించింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు కలిసి ప్రత్యేక బస్సులో అసెంబ్లీ గేటు వద్దకు చేరుకోగా, వాహనానికి అడ్డుగా నిలిచిన టీడీపీ శ్రేణులు లోకేష్‌బాబుకు అనుకూల నినాదాలు చేశారు. బస్సుకు దారి వదలాలని పోలీసులు, అక్కడున్న నేతలు చెప్పినా పట్టించుకోకుండా నినాదాలు చేస్తూ కనిపించారు. టీడీపీ శ్రేణుల ఓవర్యాక్షన్ను గమనించిన ఇరుపార్టీ నాయకులు ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కొంత సమయంపాటు ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం నడిచింది. ఆ తరువాత వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే విజయవాడ నుంచి జెండాలు చేతపట్టుకుని వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ నాయకుడు వస్తున్నారని తెలుసుకుని చూడటానికి వచ్చామని ఎంతచెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఆసక్తిగా మారిన అసెంబ్లీ సమావేశాలు... ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటిసారిగా వెలగపూడిలో ప్రారంభం కావటంపై కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఆసక్తి చూపారు. అసెంబ్లీని, సమావేశాలను తిలకించటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో విజయవాడ, గుంటూరు ప్రధాన మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉండవల్లి, వెంకటపాలెం, మందడం, మల్కాపురం గ్రామాల మీదుగా వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ నేతలు భారీ ఎత్తున వాహనాల్లో తరలిరావడం కనిపించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావటంతో వెలగపూడి, మందడం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని హోటళ్లు కిటకిటలాడాయి. ఇదిలాఉంటే భారీగా తరలివచ్చిన వారికి ప్రభుత్వ యంత్రాంగం భోజన ఏర్పాట్లలో విఫలమైంది. ఎర్రటి ఎండలో సందర్శకులు తాగు నీరు కూడా లభించక ఇబ్బందులు పడ్డారు. కొందరు సృహతప్పి పడిపోవటం కనిపించింది. -
అసెంబ్లీ సమావేశాల పొడిగింపు కుదరదు
చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు సాక్షి, అమరావతి: మార్చి నెలాఖరులోగా బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సమావేశాలను పొడిగించలేమని ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడారు. బీఏసీ సమావేశం నిర్ణయానికి విరుద్దంగా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ ప్రసంగం బాగుందని చెప్పారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయోజనాలను గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం మరోసారి చాటిచెప్పిందన్నారు. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, ఎ.నాగేశ్వర్‌రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, కేఏ నాయుడు, కాగిత వెంకట్రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మాట్లాడారు. -
మరో కార్యాచరణకు జేఏసీ సిద్ధం
27న యువజన సంఘాలతో సమావేశం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం మరోసారి కార్యాచరణ ప్రకటించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన ముఖ్యనేతలు రాష్ట్ర కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. నిరుద్యోగ నిరసన ర్యాలీని ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో మరోసారి భారీ కార్యాచరణకు సిద్ధం కావాలని నిర్ణయించారు. దీనికోసం ఈ నెల 27న విద్యార్థి, యువజన సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. సుధీర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో సదస్సులను నిర్వహించనున్నారు. మార్చి 1న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జేఏసీ సమావేశం కానుంది. 4న నిర్మల్ జిల్లా కేంద్రంలో, 5న కరీంనగర్లో, 11న హన్మకొండలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ కె.రఘు, నేతలు ఎన్.ప్రహ్లాద్, ఇటిక్యాల పురుషోత్తం, వెంకటరెడ్డి, భైరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలు: భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలపై చర్చించకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఏకపక్షంగా నడిపిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మండిప డ్డారు. శనివారం గాంధీభవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఆపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్’ అన్నట్టుగా సమావేశాలు జరిగాయన్నారు. టీఆర్ఎస్ గొప్పలను చెప్పుకోవ డానికి తప్ప ప్రజా సమస్యలను చర్చించలేదన్నారు. 94 గంటలపాటు సమావేశాలు జరిగితే 50 గంటలపాటు టీఆర్ఎస్ వాళ్లే మాట్లాడారన్నారు. రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ వంటి పథకాలపై తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిం దని అన్నారు. జీహెచ్ఎంసీలో అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానమే ఇవ్వలేదన్నారు. -
'దేశంలోనే కేసీఆర్ వంటి సీఎం లేరు'
హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ, మండళ్ల శీతాకాల సమావేశాలు జరిగిన తీరు చారిత్రాత్మకమని, అన్ని వర్గాలకు ఊరటనిచ్చేలా సభలు జరిగాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. ఒంటరి మహిళలకు జీవన భృతి కోసం పథకం ప్రకటించడం అభినందనీయమని, బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉభయ సభల వేదికగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, సలీంలు విలేకరులతో మాట్లాడారు. కుల వృత్తులను కాపాడేందుకు సీఎం ఉభయ సభల్లో చేసిన ప్రకటనలు వెనుకబడిన వర్గాల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చాయని చెప్పారు. మైనారిటీలకు పెద్ద మొత్తంలో పథకాలు ప్రకటించిన కేసీఆర్ వంటి సీఎం దేశంలో మరొకరు లేరన్నారు. కొద్దిగా ఆలస్యమైనా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే పట్టుదలతో సీఎం ఉన్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అసెంబ్లీ జరిగిన తీరుపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, కేసీఆర్ కుటుంబం కనుసన్నల్లో అసెంబ్లీ నడిచిందన్న రేవంత్ ఆరోపణలు అర్థరహితమన్నారు. -
సాగు ప్రాజెక్టులపై సమీక్ష
కేబినెట్ భేటీలో చర్చించనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిస్థాయి సమీక్షకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, చేపడుతున్న ప్రాజెక్టులపై క్షుణ్ణంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు ప్రాజెక్టులవారీగా జరిగిన పనులు, చేసిన ఖర్చు, అవసరమైన నిధులు, అందించిన ఆయకట్టు, మిగిలిన లక్ష్యాలపై నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ అంశంపై నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ మంగళవారం ఈఎన్సీ మురళీధర్, విజయ్‌ప్రకాశ్‌లతోపాటు ఇతర అధికారులతో మూడు గంటలపాటు సమీక్షించారు. ఈ ఏడాది పెద్ద, మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టుల కింద కలిపి మొత్తంగా 30 లక్షల ఆయకట్టుకు నీరందేలా ప్రణాళికలు సాగుతున్నా ఇంకా కొన్ని ప్రాజెక్టుల పనులు పట్టాలెక్కిల్సి ఉంది. ఇందులో తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల, దేవాదుల రెండో దశ, ఇందిరమ్మ వరద కాల్వ, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వంటివి ఉన్నాయి. వీటికితోడు నిర్మాణంలో ఉన్న 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో ధరల పెరుగుదలకు అనుగుణంగా అదనపు చెల్లింపులు (ఎస్కలేషన్) చేసేందుకు ప్రభుత్వం జీవో–146 తెచ్చినా పనులు ఆశించినట్లుగా జరగట్లేదు. ఏడాది కాలంలో 78 ప్యాకేజీల్లో కేవలం 13 శాతం పనులే జరిగాయి. గతేడాది బడ్జెట్లో రూ. 25 వేల కోట్లు కేటాయించినా వివిధ కారణాలతో రూ. 9,500 కోట్ల ఖర్చు మాత్రమే జరిగింది. ఈ అంశాలన్నింటిపై సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. -
రెండువారాల్లో డీసీసీలకు అధ్యక్షులు!
అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల్లో అభిప్రాయ సేకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాలకు పార్టీ కొత్త సారథుల ఎంపిక ప్రక్రియను రెండు వారాల్లోగా పూర్తిచేయాలని పీసీసీ భావిస్తోంది. దీనికనుగుణంగా ఇప్పటికే స్థూలంగా అభిప్రాయ సేకరణను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పూర్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరో సారి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణను పూర్తిచేయనున్నారు. పాత జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినవారు ఆసక్తి చూపిస్తే ముందు వారికే అవకాశం ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది. కాగా, రంగారెడ్డి డీసీసీ పదవి కి క్యామ మల్లేశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షు నిగా ఉన్న దానం నాగేందర్ జిల్లాల పునర్వి భజనకు ముందుగానే తమ పదవులకు రాజీనామా చేశారు. మొత్తం 31 జిల్లాలు ఏర్పా టైన నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై టీపీసీసీ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత పార్టీ కార్యక్ర మాల విషయంలోనూ కొంత అయోమయం ఏర్పడింది. పాత జిల్లాల పరిధిలో ఉన్న కొన్ని మండలాలు, గ్రామాలు మరో జిల్లా పరిధి లోకి కూడా చేరాయి. మారిన మండలాల్లో పార్టీ కార్యక్రమాలను ఎవరిద్వారా పర్యవేక్షిం చాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా డీసీసీలకు అధ్యక్షుడి ఎంపిక పూర్తిచేయాలని పార్టీ భావిస్తోంది. సామాజిక సమీకరణాలు, సమర్థత, పార్టీకి కేటాయించే సమయం, ఆ జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలకు ఆమోదయోగ్యం వంటి వాటి పై అభిప్రాయ సేకరణ జరుపుతోంది. రెండు వారాల్లోగా కసరత్తు పూర్తిచేసి, అధిష్టానవర్గం నుంచి ఆమోదం పొందాలని యోచిస్తోంది. పలువురి అనాసక్తి: పార్టీకోసం పూర్తి కాలం పనిచేయగలిగే నాయకులనే డీసీసీ అధ్యక్షులు గా పరిశీలించాలన్నది ఏఐసీసీ మార్గదర్శనం. పార్టీ అధికారంలోకి వస్తే డీసీసీ అధ్యక్షు లుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని భావిస్తోంది. అయితే డీసీసీ అధ్యక్షులకు పార్టీ టికెట్లు లేవనడంతో ప్రజాక్షేత్రంలో పోటీచేయాలనుకున్న నేతలు డీసీసీ అధ్యక్షుడిగా చేయడానికి నిరాసక్తత చూపుతున్నారు. -
ఫిబ్రవరిలో శాసనసభ శీతాకాల సమావేశాలు!
స్పీకర్ కోడెల శివప్రసాదరావు సాక్షి, అమరావతి: జనవరి నెలాఖరు లోపు అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తయితే వచ్చేనెల మొదటి వారంలో శీతాకాల సమావేశాలు, మూడోవారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. వెలగపూడిలోని అసెంబ్లీ భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఒకవేళ ఈ నెలాఖరులోపు భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోతే శీతాకాల, బడ్జెట్ సమావేశాలను వచ్చేనెలాఖరులో ఒకేసారి జరుపుతామని చెప్పారు. -
18 దాకా అసెంబ్లీ సమావేశాలు!
11న బీఏసీ భేటీలో అధికారిక ప్రకటన? సాక్షి, హైదరాబాద్: శాసన సభ, శాసన మండలి సమావేశాలను మరికొద్ది రోజులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. గతనెల 16న మొదలైన ఉభయ సభల సమావేశాలు ఈ నెల 11వ తేదీ దాకా జరగనున్నాయి. మరోసారి సమావేశాలను పొడిగించేందుకు 11వ తేదీన బీఏసీ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. అధికార పార్టీ సభ్యుల నుంచి తెలిసిన సమాచారం మేరకు ఈ నెల 18వ తేదీ వరకు సమావేశాలను పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 11న జరగనున్న బీఏసీ భేటీలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దీనిపై అనధికారికంగా చెప్పారని సమాచారం. ఈ నెల 12న కూడా సభ జరిపి, 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి సెలవులు తీసుకుని తిరిగి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సభ నిర్వహించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే శీతాకాల సమావేశాలను మొత్తంగా 23 రోజుల పాటు జరిపినట్లు అవుతుంది. పొడిగింపు వెనుక వ్యూహం!: రాష్ట్రంలో చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుపై సమగ్ర చర్చ జరగాలని, వాస్తవాలు ప్రజలకు వివరించాలని అధికార పక్షం భావిస్తోంది. ఈ కారణంగానే దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలపై లఘు చర్చలను చేపడుతోందని అంటున్నారు. ఓ వైపు విపక్షాలు కోరిన అంశాలపై చర్చ జరుపుతూనే అధికార పక్షంగా తమ పాలన తీరును అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాన్ని అధికారపక్షం అనుసరిస్తోందని చెబుతున్నారు. సమావేశాలు మొదలు కావడానికి ముందు, ఆ తర్వాత జరిగిన టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరిగింది. ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసుకుందామన్న వ్యూహంతోనే సమావేశాల తేదీలను పొడిగిస్తున్నారని విపక్ష సభ్యులు అభిప్రాయపడుతున్నారు. సమావేశాల తేదీల పొడిగింపుపై ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడితే.. రాష్ట్రాభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని, అందుకే సమావేశాలు వద్దంటున్నారని ఎదురుదాడి చేసే ప్లాన్‌లో కూడా అధికార పార్టీ ఉందని విశ్లేషిస్తున్నారు. -
జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో ‘అసెంబ్లీ’
స్పీకర్ కోడెల శివప్రసాదరావు కారంపూడి: జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న మాజీ ఎమ్మెల్యే కొర్రపాటి వెంకట సుబ్బారావును బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరుగుతాయని తెలిపారు. తాత్కాలిక సచివాలయంలో 10–15 సంవత్సరాలు సమావేశాలు జరిగే అవకాశం ఉందన్నారు. -
విపక్షాలు పూర్తిగా విఫలం -మంత్రి హరీశ్‌రావు
విపక్షాలు ఎలాంటి వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నాయి హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. విపక్షాలు ఒక వ్యూహమంటూ లేకుండానే వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో తమదే పూర్తిగా పైచేయి అయిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి సమర్థంగా చెప్పుకుంటున్నామని ఆయన వివరించారు. గతంలో తాము కూడా ప్రతిపక్షంలో ఉన్నామని, ప్రస్తుత ప్రతిపక్షాలకు భిన్నంగా ఒక వ్యూహంతో వ్యవహరించేవారమని గుర్తు చేశారు. అన్ని అంశాలపై మాట్లాడాలనుకుని ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు వారి దగ్గర ఏ అంశమూ లేదని అన్నారు. సహజంగా ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒకటీ రెండు అంశాలను తీసుకుని పూర్తి స్థాయిలో వాటివెంటే పడుతూ ప్రభుత్వానికి చికాకు కలిగిస్తాయని, కానీ ఇప్పుడు విపక్షాలు ఎలాంటి వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. సిద్దిపేట నగదు రహితానికి ‘ఆధార్ పే’ సిద్దిపేటను నగదు రహిత లావాదేవీలకు మార్చేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న నేపథ్యంలో బ్యాంకు ప్రతినిధులు కొందరు మంత్రి హరీశ్‌రావును అసెంబ్లీలోని ఆయన చాంబర్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తీసుకువచ్చిన కొత్త ‘ఆధార్ పే మర్చంట్ డివైజ్’ను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సిద్దిపేటలో అన్ని రకాల లావాదేవీలకు ‘ఆధార్ పే’యంత్రాలను అమర్చేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. తగినన్ని మెషిన్లను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకు అధికారులు గతంలో రూ.10వేలు వెచ్చించి కొనుగోలు చేసిన మైక్రో ఏటీఎంల స్థానే రూ. 1800 విలువ చేసే ఆధార్ ఆధారిత మర్చంట్ ఫింగర్ ప్రింట్ మిషన్ పనితీరునూ మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ మర్చంట్ మిషన్‌ను రూ.వెయ్యికే ఇవ్వాలని మంత్రి బ్యాంకర్లను కోరారు. 5 వేల మర్చంట్ మిషన్లలకు మంత్రి వెంటనే ఆర్డర్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు తన ఆధార్ నంబర్‌ను బ్యాంకు అకౌంట్‌తో స్వయంగా లింక్ చేసుకున్నారు. -
టీడీపీకి మాట్లాడే హక్కు లేదు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాలరాజు సాక్షి, హైదరాబాద్: బషీర్‌బాగ్ లో రైతులను పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిన టీడీపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాలరాజు మండి పడ్డారు. ఆ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో వారిద్దరూ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును దేశమంతా ప్రశంసిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కన్నా చంద్రబాబు యావే రేవంత్ రెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. రేవంత్ తెలంగాణ అసెంబ్లీలో బాబు భజన చేస్తామంటే ఎలా ఒçప్పుకుంటామని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణకు రేవంత్ ద్రోహం చేస్తున్నాడని వారు దుయ్యబట్టారు. -
ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా నోరు జారొద్దు: కేసీఆర్
-
మనమే మాట్లాడాలి!
టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ • ప్రతిపక్షాలకు ఎజెండాయే లేదు • సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం • మంత్రులు సహా అంతా సభలో హుందాగా ఉండాలి • ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా నోరు జారొద్దు • అధికారపక్ష సభ్యుల హాజరు నూరుశాతం ఉండాల్సిందే సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి చేపట్టిన కార్య క్రమాలను అసెంబ్లీ సమావేశాలు వేదికగా ప్రజలకు వివరిద్దామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలకు ఎజెండానే లేదని, అందువల్ల మనమే మాట్లా డాలని, సమయాన్ని సద్వినియోగం చేసు కోవాలని స్పష్టం చేశారు. గురువారం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. ‘‘సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలకు ఎజెండానే లేదు. ఏం మాట్లాడినా మనమే మాట్లాడాలి. బీఏసీ సమావేశానికే విపక్షాలు నాలుగైదు అంశాల పాయింట్లు రాసుకుని వచ్చాయి. అత్యధిక సభ్యులం మనమే ఉన్నాం. మన సమయం మనం వినియోగించుకుందాం. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఏం చేశామో ప్రజలకు వివరిద్దాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ విషయంలో నిక్కచ్చిగా ఉందామని, నిర్ణీత గడువులోగా సమాధానాలు చెప్పాలని మంత్రులకు సూచించారు. ముఖ్యంగా సభ్యులు అడిగిన ప్రశ్నల పరిధిలోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదనపు సమాచారం ఇస్తూ, విషయం నుంచి ఎందుకు పక్కకు పోతున్నారని కూడా ప్రశ్నించారని తెలిసింది. మంత్రులు, ఇతర సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ నోటి దురుసుకు పోవద్దని, సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. అందరూ రావాల్సిందే.. ఈ సమావేశాలు కీలకమైనవని, పార్టీ సభ్యుల హాజరు నూటికి నూరుశాతం ఉండాల్సిందే నని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సమావేశం ముగిసే వరకూ ఉండాలని, తప్పని పరిస్థితి అయితే, ఆయా జిల్లాల మంత్రులకు సమాచారం ఇవ్వాలని సూచిం చారు. ‘‘మంత్రులు కంట్రోల్లో ఉండాలి. ప్రశ్నలకు గణాంకాలు సహా సంతృప్తికర సమాధానాలివ్వాలి. ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇద్దాం. ఎక్కువ రోజులు సభ జరపాలని విపక్షాలు కోరుతున్నాయి. అవసరమైతే సమావేశాలను పొడిగిద్దాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. నోట్ల రద్దుపై నేనే మాట్లాడతా.. నోట్ల రద్దు రాష్ట్ర పరిధిలో తీసుకున్న నిర్ణయం కాదని, అది మన అంశమే కాదని.. విపక్షాలు కోరినందున చర్చకు పెడుతున్నామని సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఆ అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడొద్దని, తానే మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఇక తొలిరోజు మండలిలో విద్యుత్ పరిస్థితిపై మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడతారని, రెండో రోజు మండలిలో నోట్లరద్దు అంశంపై తాను మాట్లాడతానని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించామని, అయితే అదే సమయంలో ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రధాని దృష్టికి తీసుకువెళుతున్నామని తెలిపారు. నోట్ల రద్దుతో మనకూ నష్టం జరిగిందని, ఆదాయం పడిపోయిందని చెప్పారు. ఎక్సైజ్ ఆదాయం మాత్రం పెరిగిందన్నారు. ‘నాగం’ బండారం బయటపెట్టండి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల్లే వంటూ చెన్నైలోని ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ’ నుంచి బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి స్టే తీసుకువచ్చిన అంశంపై భేటీలో చర్చ జరిగింది. దీనిపై ఎవరూ భయపడొద్దని, ప్రాజెక్టు ఎక్కడికి పోదని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే మహబూబ్‌నగర్ ప్రజలకు వాస్తవాలు వివరించాలని, నాగం బండారం బయట పెట్టాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ ప్రెస్మీట్లు పెట్టి నాగం ఆ జిల్లాకు అన్యాయం చేయాలని చూస్తున్న విషయాన్ని బయటపెట్టాలని చెప్పారు.