బడ్జెట్ సమావేశాల నుంచి స్పీకర్ తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల నుంచి స్పీకర్ తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తన సస్పెన్షన్ శాసనసభ వ్యవహారాలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, సహజ న్యాయసూత్రాలను కాలరాస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.