తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు | Telangana Assembly sessions: both houses will last for four days | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

Published Thu, Aug 3 2023 3:54 AM | Last Updated on Thu, Aug 3 2023 11:09 AM

Telangana Assembly sessions: both houses will last for four days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ, శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో ముందుగా కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్‌ అధ్యక్షతన జరిగే బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు.

సుమారు నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశముంది. బీఏసీ భేటీలో విపక్షాల నుంచి వచ్చే సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా అవసరమైతే సమావేశాల తేదీలను పొడిగించొచ్చు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే మండలి సమావేశాల్లో తొలిరోజు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో మండలి నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. 

చివరి సమావేశాలని... 
తెలంగాణ రెండో శాసనసభకు ఇవి చివరి సమావేశాలుగా భావిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా తమ ఎజెండా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉచితవిద్యుత్, ధరణి వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ ద్వారా విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని అధికార బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మరోవైపు తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశ్నోత్తరాలతో పాటు ఇతర చర్చల సందర్భంగా ప్రస్తావించేలా అధికార పక్షం కసరత్తు చేస్తోంది.

మరోవైపు విపక్ష పార్టీలు కూడా డబుల్‌ బెడ్‌రూమ్‌లు, ధరణి లోపాలు, ఇటీవల వరదల మూలంగా సంభవించిన నష్టం తదితరాలపై చర్చకు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.   

4 కీలక బిల్లులు 
ప్రస్తుత సమావేశంలో 4 కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి. ఇందులో గతంలో అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్‌ తిరస్కరించిన మూడు బిల్లులు కూడా ఉన్నాయి. వీటిని ఉభయసభలు మరోమారు చర్చించి ఆమోదిస్తాయి. 
1. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని బిల్లు రూపంలో సభలో చర్చించి ఆమోదిస్తారు. 
2. తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (రెగ్యు
లేషన్‌ ఆఫ్‌ ఏజ్‌ ఆఫ్‌ సూపర్‌అన్యూయేషన్‌) చట్టసవరణ బిల్లు–2022 
3. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు–2022  
4. తెలంగాణ మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు–2022   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement