Legislative Council Meetings
-
వలంటీర్ వ్యవస్థకి చంద్రబాబు ప్రభుత్వం షాక్
-
AP: నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనుంది. అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. అంతకుముందు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించడానికి ఏడో తేదీ ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. -
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో ముందుగా కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. సుమారు నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశముంది. బీఏసీ భేటీలో విపక్షాల నుంచి వచ్చే సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా అవసరమైతే సమావేశాల తేదీలను పొడిగించొచ్చు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే మండలి సమావేశాల్లో తొలిరోజు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో మండలి నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. చివరి సమావేశాలని... తెలంగాణ రెండో శాసనసభకు ఇవి చివరి సమావేశాలుగా భావిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా తమ ఎజెండా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉచితవిద్యుత్, ధరణి వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ ద్వారా విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని అధికార బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశ్నోత్తరాలతో పాటు ఇతర చర్చల సందర్భంగా ప్రస్తావించేలా అధికార పక్షం కసరత్తు చేస్తోంది. మరోవైపు విపక్ష పార్టీలు కూడా డబుల్ బెడ్రూమ్లు, ధరణి లోపాలు, ఇటీవల వరదల మూలంగా సంభవించిన నష్టం తదితరాలపై చర్చకు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. 4 కీలక బిల్లులు ప్రస్తుత సమావేశంలో 4 కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి. ఇందులో గతంలో అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్ తిరస్కరించిన మూడు బిల్లులు కూడా ఉన్నాయి. వీటిని ఉభయసభలు మరోమారు చర్చించి ఆమోదిస్తాయి. 1. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బిల్లు రూపంలో సభలో చర్చించి ఆమోదిస్తారు. 2. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యు లేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్‌అన్యూయేషన్) చట్టసవరణ బిల్లు–2022 3. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు–2022 4. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022 -
అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ సమ్మతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఈ నెల 3న మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమవుతాయి. ఉభయ సభల సమావేశాలకు సంబంధించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పక్షాన అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు సోమవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. 3న ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు 4న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 6న ఉభయసభల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ నెల 14వరకు సమావేశాలు జరిగే అవకాశముండగా, 3న జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పూర్తి స్పష్టత రానుంది. ఫిబ్రవరి 3 నుంచే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని గత నెల 21న అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో హైకోర్టు సాక్షిగా సోమవారం రాజీ కుదిరిన విషయం తెలిసిందే. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 (1) ప్రకారం ఏటా తొలిసారిగా జరిగే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించాలనే నిబంధన ఉండటంతో గత నెల 21న జారీ చేసిన నోటిఫికేషన్ స్థానంలో మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే గత సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాలను ప్రొరోగ్ చేసిన తర్వాతే తాజా నోటిఫికేషన్ జారీ చేశారా అనే అంశంపై స్పష్టత లోపించింది. మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక? ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశమున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్‌తోపాటు ప్రభుత్వ చీఫ్ విప్, మరో రెండు విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుత సమావేశాల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. మరోవైపు గత రెండు సమావేశాల్లో బీజేపీ శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయగా, ప్రస్తుత సమావేశాల్లో వారికి అవకాశం దక్కుతుందా లేదా అనే కోణంలో చర్చ జరుగుతోంది. కాగా మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సభలోకి అడుగుపెట్టనున్నారు. గవర్నర్ ప్రసంగంపై ఉత్కంఠ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనుండటంతో ఆమె ప్రసంగ పాఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం తొమ్మిదేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన విజయాలకు అద్దం పట్టేలా రూపొందిస్తున్నట్లు తెలిసింది. -
రెండో రోజూ మండలిలో టీడీపీ రచ్చ
సాక్షి, అమరావతి: శాసన మండలి సమావేశాలను తెలుగుదేశం పార్టీ సభ్యులు రెండో రోజు మంగళవారమూ అడ్డుకున్నారు. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చ పేరుతో రచ్చ చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వ వివరణ తర్వాత అభ్యంతరాలుంటే మాట్లాడాలని మంత్రులు చెప్పినా వినకుండా వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ నినాదాలతో సభను సాగనివ్వలేదు. మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం వివరణ ఇచ్చాక, మంత్రి వివరణను పరిగణనలోకి తీసుకోరని, మండలిలోనూ సీఎంతోనే వివరణ ఇప్పించాలని అన్నారు. యనమల తీరును తప్పుబట్టిన వైఎస్సార్సీపీ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండలిలో సంబంధిత మంత్రి స్టేట్మెంట్ వద్దనడం సరికాదని, చైర్మన్ చెప్పిన తర్వాత కూడా మంత్రి వివరణ ఇవ్వకుండా అడ్డుకోవడం చైర్‌ను అవమానించడమేనని అన్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన యనమల సభలో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విషయాన్నే తన వివరణగా ఇచ్చానని, రెండూ ఒక్కటేనని, టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మండలిలోనూ ప్రభుత్వం తరపున అధికారిక వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని నాని ప్రకటించారు. వివరణను వినేందుకు టీడీపీ సభ్యులు సిద్ధంగా లేకపోగా చర్చ పేరుతో రచ్చ చేయడాన్ని బట్టే వారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతోందన్నారు. టీడీపీ తీరుపై మంత్రులు బొత్స, కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన పీడీఎఫ్, బీజేపీ సభ్యులు ఒకే అంశంపై 2 రోజులుగా టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని పీడీఎఫ్, బీజేపీ ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఎన్నో అంశాలపై చర్చించాలని సభకు వస్తామని, ఇలా చేయడం సరికాదని, తమకు మాట్లాడే అవకాశం లేకుండా హక్కులను హరిస్తే ఎలా అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠాపు బాలసుబ్రçహ్మణ్యం ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ఎమ్మెల్సీలు మాధవ్, నారాయణరెడ్డి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ కత్తి నర్శింహారెడ్డి మాట్లాడుతూ సభలో తమకు మాట్లాడే అవకాశం లేకుండా చేయడం సరికాదన్నారు. మండలిలో ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు రాకుండా టీడీపీ సమయం వృథా చేసిందని చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. -
AP" 25 వరకు అసెంబ్లీ
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించాలని శాసన సభ బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) నిర్ణయించింది. సోమవారం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన అసెంబ్లీ మీటింగ్ హాలులో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 12 రోజులు సభ నిర్వహించాలని నిర్ణయించారు. సభ షెడ్యూల్ ఇలా ఉంది.. ► 8వ తేదీన దివంగత రాష్ట్ర మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా ► 9వ తేదీన గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా అసెంబ్లీకి సెలవు ► 10వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, చర్చ ► 11న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు ► 12, 13 శని, ఆదివారాలు సెలవు ► 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ ► 16, 17 తేదీల్లో బడ్జెట్ డిమాండ్లపై చర్చ ► 18న హోలీ, 19, 20 శని, ఆదివారాలు సెలవు ► 21 నుంచి 24వ తేదీ వరకు బడ్జెట్ డిమాండ్లపై చర్చ ► 25న ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది శాసన మండలి సమావేశాలు కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అధ్యక్షతన జరిగిన శాసన మండలి బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
Andhra Pradesh: ఈ నెల 7 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022–23 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అదే రోజున శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాల మేరకు శాసనసభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు బుధవారం జారీ చేశారు. ఈ నెల 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. శాసనసభలో 2022–23 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ నెల 11న ప్రవేశపెట్టనున్నారు. -
20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: ఈ నెల 20వ తేదీ ఉ.11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. అలాగే, 21వ తేదీ ఉ.10 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. హైపవర్ కమిటీ కూడా తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. -
17 వరకు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలను ఏడు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ (సభా వ్యవహారాల సలహా కమిటీ) సమావేశాల్లో నిర్ణయించారు. సోమవారం ప్రారంభమైన ఉభయ సభల సమావేశాలు ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 14, 15వ తేదీల్లో సభా కార్యక్రమాలకు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్, మండలి చైర్మన్ ఎం.ఏ.షరీఫ్ అధ్యక్షతన బీఏసీ సోమవారం విడివిడిగా సమావేశమైంది. శాసనసభ బీఏసీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మంత్రులు పి.అనిల్‌కుమార్ యాదవ్, కె.కన్నబాబు, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డితోపాటు టీడీపీ నుంచి ఉపనేత కె.అచ్చెన్నాయుడు హాజరయ్యారు. శాసనమండలి బీఏసీకి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, బీజేపీ ఎమ్మెల్సీ పి.మాధవ్, పీడీఎఫ్ తరపున బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. సదా సిద్ధం: గడికోట వైఎస్సార్సీపీ తరపున 20 అంశాలను సభలో చర్చ కోసం ప్రతిపాదించినట్లు సమావేశం అనంతరం గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాకు తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, రైతు భరోసా – రైతు సమస్యలు, అవినీతి రహిత పాలన, రివర్స్ టెండరింగ్, విద్యుత్ పీపీఏలు, ఆర్టీసీ విలీనం, గృహ నిర్మాణం, విభజన హామీలు, పోలవరం, రాజధాని అంశాలు, మద్యం పాలసీ, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించాలని కోరుతున్నామన్నారు. ప్రజా ప్రాధాన్యం కలిగిన ఏ అంశాన్నైనా సరైన విధానంలో ప్రస్తావిస్తే చర్చకు అధికారపక్షం సిద్ధమేనని, దేనికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఆర్థిక సంఘం సభ్యులు 18వతేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నందున సమావేశాలను 17 వరకే కుదించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కాగా టీడీపీ తరపున సమావేశాలను 15 రోజుల పాటు జరపాలని సూచించారు. మండలిలో 6 అంశాలపై ఏకాభిప్రాయం శాసన మండలి సమావేశాల్లో ఇసుక కొరత, రాజధాని సంబంధిత అంశాలు, పోలవరం, మద్యం పాలసీ, శాంతి భద్రతలు, మాతృభాష – ఆంగ్లంలో విద్యాబోధనపై చర్చించాలని ఏకాభిప్రాయం కుదిరింది. వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాలకు ముందే చేపట్టాలన్న యనమల సూచనతో ఉమ్మారెడ్డి విబేధించారు. ప్రశ్నోత్తరాల తరువాతే వాయిదా తీర్మానాలు చేపట్టాలనే విధానం గతంలో టీడీపీ నెలకొల్పిన పద్ధతేనని బీఏసీ దృష్టికి తెచ్చారు. అచ్చెన్నకు జగన్ పరామర్శ శాసనసభ బీఏసీ సమావేశానికి హాజరైన టీడీపీ నేత అచ్చెన్నాయుడును అజెండా ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఇటీవల అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ‘ఇప్పుడెలా ఉన్నారు? అంతా బాగుంది కదా?’ అని సీఎం వాకబు చేశారు. ప్రమాదం జరిగిన తీరును అచ్చెన్న వివరిస్తూ చిన్న గాయమేనని, నయమైందని తెలిపారు. -
27 నుంచి మండలి సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి సమావేశాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాల నిర్వహణపై శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుందని.. సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సమాచారమిచ్చారు. శాసనసభ రద్దయిన నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు చివరిసారిగా మార్చి 29న జరిగాయి. ఆరునెలల్లోపు కచ్చితంగా సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ షెడ్యూల్ ఖరారైంది. 27న స్పష్టత..: శాసనసభ రద్దయి.. శాసనమండలి సమావేశాలు మాత్రం జరుగుతుండటం అరుదైన అంశంగా చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని సీనియర్ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. శాసన మండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈ నెల 27న స్పష్టత రానుంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న మండలి సమావేశాల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. ప్రచారానికి వారం విరామం... మండలి సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మరో వారం వాయిదా పడనున్నాయి. సెప్టెంబర్ 7న హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలు ప్రచారాన్ని ప్రారంభించారు. 50 రోజుల్లో వంద బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి ముందుగా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచార బహిరంగసభల నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 25 తర్వాత వరుసగా సభలను నిర్వహించాలనుకున్నారు. మండలి సమావేశాలున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార షెడ్యూల్ మరో వారం వాయిదా పడనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. -
సాక్షర కో ఆర్డినేటర్లకు జీతాల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన శాసనమండలి పిటిషన్ల కమిటీ బుధవారం సమావేశమైంది. శాసనమండలి సమావేశాల్లో మండలి సభ్యులు వివిధ సమస్యలపై ఇచ్చిన పిటిషన్లు, వాటి పరిష్కార పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. మండలి సభ్యులు వివిధ అంశాలపై ఇచ్చిన నాలుగు పిటిషన్లపై చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాక్షర భారత్ కో ఆర్డినేటర్ల (సమన్వయకర్తల)కు చెల్లించాల్సిన జీతాలపై చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ఇచ్చిన పిటిషన్‌పై ఈ సమావేశంలో చర్చించారు. 2017 అక్టోబర్ నుంచి మార్చి 2018 వరకు పెండింగ్‌లో ఉన్న జీతాలను త్వరలోనే చెల్లించనున్నట్టు అధికారులు కమిటీకి తెలిపారు. సాక్షర భారత్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చినప్పటికీ ఇప్పుడున్న వారినే మున్ముందు కూడా కోఆర్డినేటర్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు. మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి కూడా మండల, జిల్లా పరిషత్ స్కూళ్ల మధ్యా హ్న భోజన పథకం సిబ్బంది తరహాలో వేత నాలు ఇవ్వాలని పాతూరి ఇచ్చిన పిటిషన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు. శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లో శిథిలావస్థలో ఉన్న జిల్లాపరిషత్ స్కూల్ భవనాన్ని కూల్చివేసి అక్కడే కొత్తభవనాన్ని నిర్మించాలన్న పిటిషన్‌పై అధికారులు సానుకూలంగా స్పందించారు. దేవరయాంజాల్‌లో పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయన్నారు. యూజీసీ కింద వేతనాలు పొందే అధ్యాపకులకు రాష్ట్రంలో ఏడో వేతన సవరణ సంఘం సిఫారసుల కనుగుణంగా 2016 నుంచి జీతాలు చెల్లించాలన్న పిటిషన్‌పై కూడా తగిన కసరత్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. -
ఏపీ అసెంబ్లీ, మండలి భేటీపై గవర్నర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలకు సంబంధించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రకటన జారీ చేశారు. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఉదయం 9 గంటలకు, శాసన మండలి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఈ నెల 23 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.