జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో ‘అసెంబ్లీ’ | At the end of January or February, "Assembly" | Sakshi
Sakshi News home page

జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో ‘అసెంబ్లీ’

Published Thu, Dec 29 2016 1:59 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో ‘అసెంబ్లీ’ - Sakshi

జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో ‘అసెంబ్లీ’

స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు

కారంపూడి: జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న మాజీ ఎమ్మెల్యే కొర్రపాటి వెంకట సుబ్బారావును బుధవారం ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరుగుతాయని తెలిపారు. తాత్కాలిక సచివాలయంలో 10–15 సంవత్సరాలు సమావేశాలు జరిగే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement