kodela siva prasada rao
-
బాబు ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
మాజీ స్పీకర్, దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆ నెపాన్ని మొత్తం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన యత్నం ఇంతా, అంతా కాదు. ఎన్నడూ లేనిది హైదరాబాద్ నుంచి నరసరావుపేట వరకు ఆయన శవయాత్ర కూడా చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు. తీరా సీన్ కట్ చేస్తే, గత మూడేళ్లుగా కోడెల కుటుంబాన్ని చంద్రబాబు అసలు పట్టించుకోలేదట. ఇది వేరే ఎవరో చెబితే నమ్మొచ్చో, లేదో అన్న సందేహం ఉండేది. స్వయంగా కోడెల కుమారుడు శివరామ్ చెబుతున్నారు. ఐదు నిమిషాల టైమ్ ఇవ్వలేదట.. రాజమండ్రి మహానాడులో ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తే పార్టీతో కలిసి భోజనం చేయవచ్చని ఆఫర్ ఇచ్చిన పార్టీ అధిష్టానం కోడెల కుటుంబానికి ఐదు నిమిషాల టైమ్ ఇవ్వలేదట. కోడెలను స్మరించుకోకపోవడం సరికదా! ఆయన భార్యకు, కొడుకుకు కనీస గౌరవం దక్కలేదట. పుండుమీద కారం చల్లినట్లు కొత్తగా టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ టిక్కెట్ ప్రకటించారన్నది ఆయన ఆవేదన. ఈయనే కాదు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పార్టీపై అసంతృప్తితో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నంద్యాల, ఆళ్లగడ్డలలో టీడీపీ వర్గాలు రచ్చ రచ్చ మరో వైపు నంద్యాల, ఆళ్లగడ్డలలో టీడీపీ వర్గాలు రచ్చకెక్కి నడి రోడ్డు మీదే కొట్టుకున్నాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఆందోళన కలిగించేవే. వీటిలో సత్తెనపల్లి రాజకీయం మాత్రం చంద్రబాబు తన సహజమైన యూజ్ అండ్ త్రో విధానాన్ని అవలంభించినట్లుగా ఉంది. కోడెల స్పీకర్‌గా ఉన్నప్పుడు చేసిన చర్యలపై నిర్దిష్ట ఆరోపణలు వచ్చాయి. వాటిపై ప్రభుత్వం కేసులు పెట్టింది. దాంతో టీడీపీ నాయకత్వం కోడెలను ఎలా వదలించుకోవాలా అన్న ఆలోచనలో పడింది. ఆ తరుణంలో చంద్రబాబు పల్నాడు పర్యటనకు వెళితే కోడెలను కనీసం రమ్మని కూడా పిలవలేదు. దాంతో ఆయన కలత చెందారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తదుపరి ఆయన అనారోగ్యానికి గురై గుంటూరు ఆస్పత్రిలో ఉన్నారు. కోడెలను పరామర్శించాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబును కోరినా వెళ్లలేదని అంటారు. ఫలితంగా కోడెల తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కారణం ఏమైనా కోడెల హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుడు ఆయన ఏమైనా లేఖ రాశారా ?లేదా? అన్నది తెలియకుండా జాగ్రత్తపడ్డారు. శవయాత్రకు ప్లాన్.. కోడెల చనిపోగానే చంద్రబాబు రంగంలోకి దూకి శవయాత్రకు ప్లాన్ చేశారు. దాని వెంట ఆయన స్వయంగా వెళ్లారు. ఆయా చోట్ల కాని, స్మశానంలో కాని ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. అందులో ఎంత వాస్తవం ఉందన్నది పక్కనపెడితే కోడెల మరణాన్ని రాజకీయంగా కాష్ చేసుకోవడానికి చంద్రబాబు యత్నించిన విషయం అందరికి అర్దం అయింది. ఆ తర్వాత కోడెల కుమారుడు శివరామ్ సత్తెనపల్లి లో రాజకీయాలు చేయడం ఆరంభించారు. కాని అందుకు మాత్రం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఫలితంగా ఆ నియోజకవర్గంలో రెండు,మూడు గ్రూపులు తయారయ్యి గొడవలు పడసాగాయి. ఆ విషయం శివరామ్‌తో చెప్పించారట.. ఈ క్రమంలో సడన్‌గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు అక్కడ అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో హతాశుడైన శివరామ్ తీవ్రంగా స్పందించారు. అప్పుడు కాని కొన్ని అసలు విషయాలు బయటపెట్టలేదు. కోడెల మరణించినప్పుడు హడావుడి చేయడం తప్పించి, తదుపరి ఆయన కుటుంబ సభ్యులను పట్టించుకోలేదని ఇప్పుడు వెల్లడైంది. చివరికి ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు జరపవద్దని శివరామ్‌తో చెప్పించారట. కోడెల టీడీపీ నేతగా ఉన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌లో ఉండేవారు. వారిద్దరి మధ్య రాజకీయ విమర్శలు సాగుతుండేవి. నమ్ముకున్న కుటుంబాన్ని నట్టేట ముంచేశారు.. కోడెలపై కన్నా కేసులు పెట్టించారని కూడా శివరామ్ ఆరోపిస్తున్నారు. కోడెలతో గొడవలేమో కాని, చంద్రబాబుపై కన్నా తీవ్ర విమర్శలే.. కాదు.. కాదు.. దూషణలే చేసేశారు. తనను హత్య చేయించడానికి చంద్రబాబు యత్నించారని కూడా కన్నా ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబును పట్టుకుని వాడెవడు, వీడెవడు అంటూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా వీరిద్దరి మధ్య ఎక్కడ రాజీకుదిరిందో కాని కన్నా సడన్‌గా టీడీపీలోకి జంప్ చేయడం, ఆయనకు సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చేయడం, ఇంతకాలం తనను నమ్ముకున్న కోడెల కుటుంబాన్ని నట్టేట ముంచేయడం జరిగాయన్నమాట. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో.. శివరామ్‌తో పాటు మరికొందరు సత్తెనపల్లి టీడీపీ నేతలకు కూడా కన్నాను అభ్యర్ధి చేయడంపై జీర్ణించుకోలేకపోయినా,వారు పెద్దగా స్పందించినట్లు కనిపించలేదు. చంద్రబాబు ఎందుకు శివరామ్‌ను బలి చేయడానికి వెనుకాడలేదన్న చర్చ సహజంగానే వస్తుంది. శివరామ్ సత్తెనపల్లిలో గెలవలేడన్న అభిప్రాయానికి వచ్చి ఉండాలి. లేదా శివరామ్‌కు సత్తెనపల్లిలో మంచి పేరు లేదన్న భావన అయినా కావాలి. లేదూ కోడెల వల్ల అప్పట్లో పార్టీకి నష్టం కలిగిందని అనుకుని ఉండవచ్చు. కాకపోతే కోడెల చనిపోయినప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో ఆయన మృతిని వాడుకున్నారన్నమాట. చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే! నిజానికి కన్నాపై చంద్రబాబు కూడా గతంలో చాలా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కొన్నిసార్లు అసెంబ్లీలో తిట్టుకున్నంత పనిచేశారు. అయినా రాజకీయం మారింది. ఇద్దరూ తమ తిట్లను తూచ్ అనుకున్నారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరన్నదానికి ఇదొక ఉదాహరణ కూడా కావచ్చు. కన్నా నిజానికి జనసేన పార్టీలో చేరవచ్చని అంతా అనుకున్నారు. ఆ మేరకు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో చర్చలు కూడా జరిగాయి. కన్నా కాపు సామాజికవర్గంలో కొంత గుర్తింపు పొందిన సీనియర్ నేత కనుక ఆయన జనసేనలో చేరితే ఆ పార్టీ పరిస్థితి మెరుగు అయితే పొత్తు సమయంలో ఎక్కువ సీట్లు అడుగుతారని చంద్రబాబు ఊహించి ఉండవచ్చు. అందుకే కన్నా జనసేనలోకి వెళ్లకుండా టీడీపీలోకి లాగేసింది.. అందుకే కన్నా జనసేనలోకి వెళ్లకుండా టీడీపీలోకి లాగేసి జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఒక దెబ్బేశారన్నమాట. అయినా పవన్ పెద్దగా పీల్ అవరు కాబట్టి ఆయన చంద్రబాబు చొక్కా పట్టుకుని వెళుతున్నారు. ఇదే సమయంలో మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. గతంలో పొత్తు లేనప్పుడు పవన్‌ను ఉద్దేశించి తోక కట్ చేస్తానని చంద్రబాబు అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. పవన్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా, ఆయన సీఎం పదవి డిమాండ్ చేయకుండా తోక కట్ చేయగలిగారని అనుకోవాలి. ఇక కన్నాకు సత్తెనపల్లిలో టీడీపీ గ్రూపులు సహకరిస్తాయా?లేదా?అన్నది సంశయమే. టీడీపీకి గుండెలో రాయి పడినట్లే.. ఇప్పటికే శివరామ్ తాను సత్తెనపల్లిలో పోటీచేస్తానని అంటున్నారు. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీలో దిగితే కన్నా కష్టాలు తప్పకపోవచ్చు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ ఏ పిట్టల దొరకు టిక్కెట్ ఇస్తే ఏమిటి అని వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబు నాయుడును ఇబ్బందిలో పెట్టారు. ఉన్న ముగ్గురు లోక్ సభ సభ్యులలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అంటీ,అంటనట్లు ఉంటున్నారు. కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలతో అభివృద్ది విషయంలో కలిసి పనిచేస్తానని చెబుతున్నారు. ఇదే సందర్భంలో టీడీపీ పిట్టలదొరకు ఎంపీ టిక్కెట్ ఇవ్వబోతోందని తేల్చేశారు. నానీ సోదరుడు చిన్నీకి టిక్కెట్ ఇవ్వవచ్చని వార్తలు వస్తున్న తరుణంలో నాని తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారన్నమాట. అవసరమైతే స్వతంత్రంగా పోటీచేస్తానని నాని సంకేతం ఇవ్వడం టీడీపీకి గుండెలో రాయి పడినట్లే అవుతుంది. చదవండి: కేసీఆర్‌కు ఆ భయం పట్టుకుందా?.. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది..! కాగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఇటీవల టీడీపీలోని మరో గ్రూపు సుబ్బారెడ్డి అనుచరులపై దాడి చేసి జైలుకు వెళ్లివచ్చారు. భర్తతో కలిసి ఆమె చేస్తున్న చర్యలతో పార్టీ పరువు పోతోందని కార్యకర్తలు చెబుతున్నారు. ఆమెకు పార్టీ నోటీసు ఇచ్చింది. అసలే నంద్యాల, కర్నూలు జిల్లాలలో పార్టీ బాగా బలహీనంగా ఉందనుకుంటుంటే, ఈ గొడవలతో మరింత అప్రతిష్టపాలవుతోంది. మరో వైపు చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫౌండేషన్ల పేరుతో కొందరు వ్యక్తులు రాజకీయాలు చేస్తుంటే వారికి టీడీపీ టిక్కెట్లు ఇస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు వైసీపీలో జరిగి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి ఆ పార్టీ పని అయిపోయిందని విపరీత ప్రచారం చేసేవి. టిడిపిలో ఈ పరిణామాలపై మాత్రం అవి కిమ్మనకుండా మూసుకుని ఉండడం కూడా గమనించదగ్గ అంశమే. మహానాడుతో టీడీపీకి ఊపు వచ్చిందని ప్రచారం చేయాలని అనుకున్న టీడీపీకి, చంద్రబాబుకు ఈ పరిణామాలు జీర్ణం కానివే. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
టీడీపీలో ముసలం.. కోడెల కుమారుడు శివరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో ముసలం పుట్టింది. నియోజకవర్గ ఇంచార్ద్ నియామకం టీడీపీలో కాక రేపుతోంది. అనుచరులతో కోడెల కుమారుడు శివరాం సమావేశమయ్యారు. టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న కోడెల శివరాం.. పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఇన్‌ఛార్జ్‌గా కన్నా పేరు ప్రకటనపై తమకు సమాచారం లేదని కోడెల శివరాం మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కన్నా అరాచకాలను కోడెల అడ్డుకున్నారని, టీడీపీని అవమానించిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘లాలుచి రాజకీయాలు మాకు తెలియదు. తెలుగుదేశం పార్టీని కోడెల బతికించారు. కొంత మంది నాయకులు మాపై కుట్రలు చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం మమ్మల్ని పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధిష్టానం సత్తెనపల్లిని టార్గెట్ చేసింది’’ అంటూ శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీకి షాకిచ్చిన కొట్టే వెంకట్రావు దంపతులు -
కోడెల ఆత్మహత్య తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతోంది?
పచ్చ పార్టీలో పల్నాటి యుద్ధం జరుగుతోందా? ఆ పార్టీ మాజీ స్పీకర్ నియోజకవర్గం పేరు చెబితే చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయెందుకు? ఆ నియోజకవర్గంలో చంద్రబాబునే పట్టించుకోని నాయకులెవరు? రెండు వర్గాలకు తోడు ఇప్పుడు మూడో కృష్ణుడు తోడయ్యాడా? ఇంతకీ సత్తెనపల్లి టీడీపీలో ఏం జరుగుతోంది? పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు మీద వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అంబటి రాంబాబు ఘన విజయం సాధించారు. కోడెల ఆత్మహత్య తర్వాత చంద్రబాబు ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జిని ప్రకటించలేదు. దీంతో కోడెల కొడుకు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు మధ్య తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రతి కార్యక్రమంలోనూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్టుకుంటున్నారు కోడెల, వైవీ వర్గీయులు. సాక్షాత్తూ చంద్రబాబు చెప్పినా ఎవరూ వినని పరిస్థితి ఏర్పడింది. పార్టీ నాయకత్వంతో సంబంధం లేకుండా ఎవరి వర్గాలతో వారు కమిటీలు కూడా వేసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ఒక దూతను నియమించారు. కానీ వచ్చిన చంద్రబాబు దూత ఈ ఇద్దరి టార్చర్ తట్టుకోలేక దండం పెట్టి పారిపోయారు. సత్తెనపల్లిలో పార్టీని గాడిలో పెడదామని చాలాసార్లు ప్రయత్నించిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చివరికు ఆయన కూడా చేతులెత్తేశారు. పార్టీ అధినేత చంద్రబాబు మాటకే విలువ ఇవ్వకపోగా.. రెండు వర్గాలు ప్రతి విషయంలోనూ గొడవలు పడుతూ పార్టీని రోడ్డున పడేశారు. పార్టీ నాయకత్వం ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ లోనే విడి విడిగా రెండు వర్గాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సత్తెనపల్లి పార్టీని ఎలా దారికి తేవాలో అర్థంకాని పరిస్థితుల్లో.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కన్నా కూడా ఇప్పుడు సత్తెనపల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కన్నా తరచూ వెళ్ళి..పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అటు కోడెల శివరాం, ఇటు వైవీ ఆంజనేయులు వర్గీయులకు మింగుడు పడడం లేదు. నాలుగేళ్ల నుంచి పార్టీకోసం కష్టపడుతున్నాం.. ఇప్పుడు కన్నా వచ్చి ఫోజులు కొడితే ఊరుకునేది లేదంటూ బహిరంగంగానే ప్రకటనలిస్తున్నారు. అదే సమయంలో రెండు వర్గాలు ఎక్కడా తగ్గడంలేదు. టికెట్ నేనే తెచ్చుకుంటా.. ఇక్కడ పోటీ చేసేది కూడా నేనే అని కోడెల శివరాం తేల్చిచెబుతున్నారు. మరోవైపు వైవీ ఆంజనేయులు అయితే పార్టీ నాయకత్వం తనకు హామీ ఇచ్చిందని చెబుతున్నారు. రెండు వర్గాలనే దారికి తెచ్చుకోవాలని చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణను తెచ్చుకుని మరో కొరివి నెత్తిన పెట్టుకున్నారు. మూడో కృష్ణుడు కన్నా రెండు పాత వర్గాలను దెబ్బ తీయడానికి తన వర్గం కేడర్‌తో వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రిని కన్నా అవమానించారంటూ కోడెల శివరాం కొత్త రాగం అందుకున్నారు. మరోవైపు వైవీ ఆంజనేయులు కూడా కన్నాను దెబ్బ తీసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఎన్ఆర్ఐ ఈ మూడు ముక్కలాట వ్యవహారంతో చంద్రబాబు పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. కోడెల శివరాం మాత్రం.. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏం చెయ్యాలో అది చేసి చూపిస్తానంటూ నాయకత్వానికే వార్నింగ్ లు ఇస్తున్నారు. సత్తెనపల్లిలో పోటీ చేసేది మనమే అంటూ కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులకు సంకేతాలిస్తున్నారు. చంద్రబాబు స్వయంగానే ఈ విషయాన్ని చెబుతారంటూ సత్తెనపల్లిలో ప్రచారం చేయించుకుంటున్నారు. రెండు వర్గాలకు తోడుగా మరో వర్గాన్ని తెచ్చి పెట్టుకున్న చంద్రబాబు.. పల్నాటి యుద్ధాన్ని ఎలా దారికి తెచ్చుకుంటారో చూడాలి. మొత్తం మీద సత్తెనపల్లి నియోజకవర్గం చంద్రబాబుకు బీపీ పెంచుతోందని అక్కడి పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..! -
కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణం
-
‘కోడెల మరణానికి చంద్రబాబే ప్రధాన కారణం’
సాక్షి, పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబుకి మంత్రి అంబటి రాంబాబు పొలిటికల్ పంచ్ ఇచ్చారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్ ప్లాప్ అయిందని కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఒక రాజకీయ సైకో అంటూ సీరియస్ అయ్యారు. కాగా, మంత్రి అంబటి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ. చంద్రబాబు సభకు జనం నుంచి స్పందన కరువైంది. చంద్రబాబు ఒక ముసలి సైకో. అధికారం లేకుండా ఉండలేని సైకో చంద్రబాబు. ఆయన ఒక్క నిజమైనా చెప్పారా.. అన్నీ అబద్ధాలే. చంద్రబాబును మించిన సైకో ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. రెక్కల కష్టంలో పార్టీని నిలబెట్టిన జగన్ అనర్హులా?. చంద్రబాబు, నారా లోకేష్ మాత్రమే అర్హులా? అన్ని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు.. నువ్వు పేదల్ని ధనవంతుల్ని చేశావా?. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణం. కోడెల ఉరివేసుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబే.. ఆయన కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. బాబు.. ఎక్కడ పుట్టారు.. ఎక్కడ పెరిగారు?. సత్తెనపల్లి వచ్చి నాపై విమర్శలా?. చంద్రాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైంది. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. చంద్రబాబు తప్పిదం వల్ల రూ.2వేల కోట్లు నష్టం జరిగింది’ అని అన్నారు. ఇది కూడా చదవండి: తండ్రీకొడుకులకు సెల్ఫీల పిచ్చి -
తెలుగుతమ్ముళ్ల కుమ్ములాట
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గురువారం పార్టీ సంస్థాగత కమిటీ సమావేశం సందర్భంగా మరోసారి నియోజకవర్గంలో నాయకుల వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. మాటలు పెరిగి కుర్చీలతో దాడులు చేసుకున్నారు. గతంలో ఇక్కడ పోటీచేసి ఓటమిపాలైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యానంతరం పార్టీ అధిష్టానం ఎవరికీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి అప్పగించలేదు. దీంతో నియోజకవర్గంలో ఒకే సామాజికవర్గానికి చెందిన కోడెల శివరాం, మాజీ శాసనసభ్యుడు వై.వి.ఆంజనేయులు, తెలుగుయువత నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు (అబ్బూరి మల్లి) ఎవరికివారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం పార్టీ సంస్థాగత కమిటీ విషయంలో సత్తెనపల్లిలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొండెపి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి, పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ హాజరయ్యారు. అప్పటికే మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, మన్నెం శివనాగమల్లేశ్వరరావు తదితరులు కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో ఉన్నారు. కోడెల శివరాం తన వర్గంతో ర్యాలీగా ఎన్టీఆర్ భవన్ వద్దకు వచ్చి ఇన్చార్జిని నియమించకుండా సంస్థాగత కమిటీ నియామకాలు ఏమిటని ప్రశ్నించారు. స్థానికులుకాని వారి సలహాలు అవసరం లేదంటూ నినదించారు. ఈ క్రమంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది. పరస్పరం కుర్చీలతో కొట్టుకున్నారు. సమావేశానికి వచ్చిన పరిశీలకులు ఇన్చార్జి నియామక విషయం అధిష్టానం చూసుకుంటుందని, ప్రస్తుతం సంస్థాగత కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. అయినా గొడవ ఆగకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, ముఖ్య నాయకులు బయటకు వచ్చారు. తెలుగుతమ్ముళ్ల గొడవను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై శివరాం వర్గీయులు దురుసుగా ప్రవర్తించడమేగాక సెల్ఫోన్లు లాక్కున్నారు. దీంతో సమావేశాన్ని కవర్ చేయకుండా మీడియా ప్రతినిధులు బాయ్‌కాట్ చేశారు. -
కోడెలది చంద్రబాబు చేసిన హత్యే
సత్తెనపల్లి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ముమ్మాటికీ చంద్రబాబు చేసిన హత్యేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను అంబటి తీవ్రంగా ఖండించారు. అభ్యంతరకరంగా, అమానవీయంగా సీఎంను, మంత్రులను దూషించడం సమంజసం కాదన్నారు. అవాకులు, చవాకులు పేలితే ప్రజలు నాలుక తెగ్గోస్తారని హెచ్చరించారు. అయ్యన్న తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా ఆయనకు పిచ్చెక్కిందని చంద్రబాబు ప్రకటించాలని కోరారు. చదవండి: జోగి రమేష్‌పై టీడీపీ దాడి కోడెల ఆత్మహత్యకు నెల ముందు బలవన్మరణానికి ప్రయత్నించి.. ఆయన అల్లుడి వైద్యశాలలో చికిత్స పొందితే పరామర్శించడానికి కూడా చంద్రబాబు రాలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా పార్టీ నుంచి కోడెలను బయటకు సాగనంపాలని చూడటంతో కోడెల తీవ్ర మనస్తాపం చెందారన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. ఈ వాస్తవం సత్తెనపల్లి చుట్టుపక్కల వారందరికీ తెలుసన్నారు. అయ్యన్న ఇది గమనించాలని కోరారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను దుర్భాషలాడుతూ మాట్లాడటం అయ్యన్నలాంటి సీనియర్లకు పద్ధతి కాదని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాయపాటి పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు. -
కోడెల శివరాం కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు: టీడీపీ నేత
సాక్షి, గుంటూరు: కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం గత ఐదేళ్లలో కష్టపడి పని చేసిన పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని టీడీపీ నేత పమిడి బాలకృష్ణ సంచలన వ్యాఖలు చేశారు. నకరికల్లు మండలం కల్లకుంటలో రేపు(గురువారం) కోడెల విగ్రహావిష్కరణకు వచ్చే చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా జోక్యం చేసుకోవాలన్నారు. తమ దగ్గర నుంచి కోడెల శివరాం రూ.32 లక్షలు తీసుకున్నారని మండిపడ్డారు. ఆ డబ్బులు తిరిగి మాకు చంద్రబాబునాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. 30ఏళ్ల నుంచి పార్టీకి ఎంతో ఖర్చు పెట్టి అంకితభావంతో పని చేశామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో నీరు-చెట్టు పనులు చేస్తున్న తమని కోడెల శివరాం బాగా ఇబ్బంది పెట్టారని చెప్పారు. కోడెల శివరాం వల్ల తాము బాగా నష్టపోయామని, తమచేత ఖాళీ పేపర్ల పైన సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారు. పార్టీకి నష్టం చేసిన కోడెల శివరాం మళ్లీ పార్టీలో యాక్టివ్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కోడెల శివరాం ధన దాహం వల్ల నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు నష్టపోయారని బాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ నేత పమిడి బాలకృష్ణ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
‘ఇంతకీ కోడెల శివప్రసాద్ సెల్‌ఫోన్ ఏమైనట్టు..’
సాక్షి, గుంటూరు: కోడెల జయంతిని పురస్కరించుకుని అతని ఆత్మహత్యను వైఎస్సార్సీపీ మీదకు నెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చూస్తున్నారని ట్విట్టర్ వేదికగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి.. అనేక పదవులు నిర్వహించిన అరుదైన నాయకుడు కోడెల శివప్రసాద్‌రావు అని అన్నారు. ఓటమి చెందిన తర్వాత కోడెల పట్ల బాబు దుర్మార్గ వైఖరే ఆత్మహత్యకు కారణమన్నారు. వెన్నుపోటు పొడవడం, దండేసి పొగడటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ‘ఇంతకీ కోడెల శివప్రసాద్ సెల్‌ఫోన్ ఏమైనట్టు! ఫార్మాట్ చేయకుండా బయటపెట్టగలరా’ అని ప్రశ్నిస్తూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. (‘నాకు రిప్లై ఇచ్చారహో..’) ఇంతకీ కోడెల సెల్ ఫోన్ ఏమైనట్టు!! ఫార్మట్ చేయకుండా బయట పెట్టగలరా? @ncbn @GVDKrishnamohan — Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) May 2, 2020 ఆరు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి అనేక పదవులు నిర్వహించిన అరుదైన నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్(1/2) — Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) May 2, 2020 ఈ రోజు కోడెల జయంతిని పురస్కరించుకుని అతని ఆత్మహత్యను వైసీపీ మీదకు నెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు.ఓటమి చెందిన తరువాత కోడెల పట్ల బాబు దుర్మార్గ వైఖరే ఆత్మహత్యకు కారణం అనేది జగమెరిగిన సత్యం. వెన్నుపోటు పొడవడం దండేసి పొగడటం బాబు గారికి వెన్నతో పెట్టిన విద్య(2/2)@ncbn — Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) May 2, 2020 -
‘కోడెల పోస్టుమార్టం నివేదిక అందలేదు’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించిన కేసులో పోస్టుమార్టం నివేదిక ఇంకా అందలేదని బంజారాహిల్స్ ఏసీపీ, ఈ కేసు విచారణ అధికారి కేఎస్ రావు తెలిపారు. గత సెప్టెంబర్ 16వ తేదీన కోడెల హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోడెల కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటికే విచారించి ఆయన సెల్‌ఫోన్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతి చెందిన రోజు ఘటనా స్థలంలో సేకరించిన కొన్ని వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని కేఎస్ రావు తెలిపారు. దీనిపై నివేదిక వచ్చాక ఈ కేసులో పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. -
కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గురువారం కోర్టులో లొంగిపోయారు. ఉద్యోగాల పేరుతో రూ. లక్షలు దండుకుని అమాయకపు ప్రజలను మోసం చేసిన కేసుకు సంబంధించి ఆమె కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆమెకు రెండు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. ప్రతి ఆదివారం వన్‌టౌన్, టూటౌన్ స్టేషన్లలో సంతకం చేయాలని.. 1వ అదనపు జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు విజయలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయలక్ష్మి పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆమెపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. -
పోలీసుల అదుపులో కోడెల బినామీ!
సాక్షి, నరసరావుపేట: కేట్యాక్స్ కేసుల్లో కీలక పాత్రధారి గుత్తా నాగప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. గత టీడీపీ పాలనలో కోడెల కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించి సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడటంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావటంతో పరారయ్యాడు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారుడు శివరాంలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్ నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారాక తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివరాం, ప్రసాద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శివరాం కబ్జా చేసిన ఆస్తులను ప్రసాద్ పేరిట రాయించినట్లు తెలిసింది. భూ కబ్జా కేసులో టీడీపీ నేత పోతినేని అరెస్టు మంగళగిరి: భూకబ్జా కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి పోతినేని శ్రీనివాసరావును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని లక్ష్మీనరసింహపురం కాలనీలో బీసీలకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిని పోతినేని శ్రీనివాసరావు కబ్జా చేయడంతో పాటు రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. భూ యజమాని పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం అంతా పోతినేనికి అండగా నిలవడంతో భూయజమానినిబెదిరించి ఆ భూమిని ఆక్రమించుకుని భూమికి ఫెన్సింగ్ వేసి నిర్మాణం చేపట్టాడు. అయితే పోతినేని శ్రీనివాసరావు భూ కబ్జాపై భూయజమానురాలు కుంచాల మంగేశ్వరి మళ్లీ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
సత్తేనపల్లి ఇన్చార్జి నియామకంపై మల్లగుల్లాలు !
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. కోడెల చివరి రోజుల్లో ఆయన్ను పట్టించుకోని టీడీపీ నాయకులు అనంతరం శవరాజకీయాలకు దిగి నానాయాగీ చేశారు. కోడెల మరణంతో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పదవి ఖాళీ అయింది. ఈ పదవిని కోడెల తనయుడు శివరామకృష్ణకు ఇచ్చి రాజకీయంగా సానుభూతి సంపాదించుకోవాలని చంద్రబాబు యోచించినట్టు తెలిసింది. గత ఐదేళ్లలో తమను వేధించిన శివరామ్‌కే ఇన్చార్జి పదవిని ఇస్తామంటే ఒప్పుకునేది లేదని కోడెల వ్యతిరేకవర్గం తేల్చి చెప్పినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందే కోడెల శివప్రసాదరావుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వొద్దని సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం నాయకులు రోడ్లపై నిరసనలు చేపట్టారు. ఎన్నికల అనంతరం కోడెల కుటుంబంపై కే–ట్యాక్స్ కేసులు వరుసగా నమోదవుతూ పార్టీ పరువు బజారున పడుతుండటంతో అప్పట్లో కోడెల వ్యతిరేక వర్గం నాయకులు పార్టీ ఇన్చార్జిగా కోడెలను తొలగించాలని డిమాండ్ చేశారు. 200 వాహనాలతో సత్తెనపల్లి నుంచి ర్యాలీగా గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కోడెలను పార్టీ నుంచి పోమ్మనలేక పొగబెట్టాలని భావించిన చంద్రబాబు రాయపాటి రంగబాబును రంగంలోకి దించాడు. కోడెల వ్యతిరేక వర్గంతో రంగబాబు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. రంగబాబే నియోజకవర్గ పార్టీ ఇన్చార్జని కోడెల వ్యతిరేకవర్గం నాయకులు ప్రచారం చేశారు. కోడెల మరణంతో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి తానేనని శివరామ్ సైతం సన్నిహితులతో చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నట్టు ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి... రాజకీయంగా సానుభూతి సంపాదించడం కోసం కోడెల శివరామ్‌ను నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమిస్తే క్యాడర్ పార్టీ మారే అవకాశం ఉంది. క్యాడర్ డిమాండ్‌ను శిరసా వహిస్తూ వేరే వ్యక్తిని నియమిస్తే కోడెల కుటుంబంపై చంద్రబాబు నకిలీ ప్రేమ బయటపడుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక సతమతవుతున్నారని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకులు అంటున్నారు. మరో వైపు ఇన్చార్జి పదవి కోసం రాయపాటి రంగబాబు, టీడీపీ అనుబంధ సంస్థ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బూరి మల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో సత్తెనపల్లి టిక్కెట్ ఆశించి భంగపడినవారిలో అబ్బూరి మల్లీ కూడా ఒకడు. శివరామ్‌కు ఇన్చార్జి బాధ్యతలు దక్కకుండా కోడెల వ్యతిరేక వర్గాన్ని ఈ ఇద్దరూ లీడ్ చేస్తున్నట్టు సమాచారం. కోడెల మరణించినప్పుడు ఆయన కుటుంబంపై వల్లమాలిన ప్రేమాభిమానాలు ఒలకబోసిన జిల్లా టీడీపీ నాయకులు సైతం శివరామ్‌ను ఇన్చార్జిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. -
మంగళగిరి కోర్టుకు హజరైన కోడెల శివరాం
-
మంగళగిరి కోర్టుకు కోడెల శివరాం
సాక్షి, గుంటూరు : టీడీపీ దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం బుధవారం మంగళగిరి కోర్టు ఎదుట లొంగిపోయారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను దాచిపెట్టిన కేసులో హైకోర్టు ఆదేశాలతో ఆయన నేడు మంగళగిరి కోర్టు ముందు హాజరయ్యారు. దీనిపై శివరాం లాయర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. ‘శివరాంకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. అందుకు సంబంధించిన షూరిటీలను ఆయన మంగళగిరి కోర్టుకు అందజేశారు. ప్రతి శుక్రవారం ఆయన తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకం పెట్టాల్సి ఉంద’ని తెలిపారు. తన తండ్రి కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా వ్యవహరించిన కాలంలో కొనుగోలు చేసిన ఫర్నీచర్.. శివరాంకు చెందిన షోరూమ్‌లో లభించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి శివరాంపై సెక్షన్ 409, 411 ల కింద కేసు నమోదైంది. -
కోడెల ఆత్మహత్యకు కారకుడు చంద్రబాబే
సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : దివంగత మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు కోడెల కుమారుడు, కుమార్తె కారణమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడి గుంటూరులోని తన అల్లుడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుంటూరులోనే ఉన్న చంద్రబాబు కనీసం పరామర్శించక పోగా, దగ్గరుండాల్సిన ఆయన కుమారుడు కెన్యాలో ఉన్నాడని, కుమార్తె, భార్య హైదరాబాద్‌కే పరిమితమయ్యారన్నారు. దీంతో అన్ని విధాలుగా తాను ఏకాకినయ్యానని భావించిన కోడెల విరక్తితో హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఇది ప్రభుత్వ హత్య అంటూ పదే పదే టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన కోడెల సంతాప సభలో మాజీ సీఎం చంద్రబాబు తమ ప్రభుత్వంపైన, సీఎం జగన్మోహనరెడ్డిపైన, తనపైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంతాప సభను టీడీపీ నాయకులు రాజకీయ వేదికగా మార్చుకున్నారే కాని నిజంగా కోడెలకు నివాళులు అర్పించలేదన్నారు. రూ.లక్ష ఇస్తాం, ఫర్నిచర్ ఇస్తావా? కోడెల తీసుకొచ్చిన ఫర్నిచర్ కేవలం రూ.లక్ష విలువే నంటూ చంద్రబాబు పదే పదే చెబుతున్నారని, దీనిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఈ ఫర్నిచర్‌కు తాము రూ.లక్ష ఇస్తామని తీసుకొచ్చి ఇవ్వలగలరా అని ప్రశ్నించారు. దీనిలో 14 కుర్చీలతో గల బిజినెస్ టేబుల్ రూ.65 లక్షలని, ఇవి ఇతరదేశాలకు చెందిన ఫర్నిచర్ అని, గతంలో పనిచేసిన స్పీకర్లు తెప్పించారన్నారు. మొత్తం ఫర్నిచర్ విలువ రూ.1.5 కోట్ల విలువ ఉంటుందన్నారు. వాస్తవాలు బయటకు రావాలి కోడెల అసలు ఎందుకు చనిపోయాడో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడితే ఆ వ్యక్తి దగ్గర 21 రోజుల పాటు కుటుంబ సభ్యులు ఉండాలనే నిబంధన ప్రతి డాక్టర్‌కు తెలుసు అన్నారు. ఈ విషయం డాక్టర్లు అయిన కోడెల కుమారుడు, కుమార్తెకు కూడా తెలియంది కాదన్నారు. ఆయన వెంట ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంచటం ఎంతవరకు సమంజసం అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఈ కేసుల్లో ఎవరినీ అరెస్టు చేయవద్దని స్వయంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆరోజు 9.45 గంటలకు ఆత్మహత్య చేసుకుంటే పోలీసులకు 10.30కు సమాచారం ఇచ్చారన్నారు. చివరిసారిగా తన కుమార్తెకు దండం పెట్టి పైన ఉన్న తన గదికి వెళ్లారన్నారు. గదిలోకి పోయిన కోడెల ఏం చేస్తున్నాడనేది కూడా వారు పరిశీలించలేదన్నారు. తన మిత్రులకు ఫోన్ చేసి తాను చివరిసారిగా మాట్లాడుతున్నానని చెప్పారన్నారు. తమపై పెట్టిన కేసుల్లో బాధితులకు రూ.6,7 కోట్లు డబ్బులు ఇచ్చేద్దామని కుమారుడు, కుమార్తెకు చెప్పినా వారు వినలేదన్నారు. వీటన్నింటిపై విచారణ తప్పకుండా జరగాలన్నారు. చంద్రబాబు తమపై వ్యాఖ్యానించిన ‘‘పనికిమాలిన ఎమ్మెల్యే’’, ‘‘గెలిచారో.. లేదో’’ అన్న మాటలపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కూడా తీసుకొస్తామని చెప్పారు. ఈనెల 3వతేదీన అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ఇస్తామన్నారు. నిజంగా కోడెల కుటుంబంపై ప్రేమ ఉంటే కుమారుడు, కుమార్తెకు నరసరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కోడెల చావును శవరాజకీయం చేయటం మానుకోవాలని చంద్రబాబును కోరారు. చీకటి రాజకీయాలు చంద్రబాబుకే ఎరుక ముఖ్యమంత్రి నేరస్తుడైతే ఇలాగే ఉంటుందని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, జగన్మోహనరెడ్డి నేరస్తుడని ఏ కోర్టు అయినా ముద్ర వేసిందా అని ప్రశ్నించారు. ఆయనపై ఉన్న కేసులు విచారణ జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు లాగా కేసులకు భయపడి చీకట్లో చిదంబరాన్ని కలవటం, తన పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపించి వారి కాళ్లు పట్టుకునే పనులు జగన్ చేయలేదన్నారు. ధైర్యంగా కేసులు ఎదుర్కొం టున్నారన్నారు. -
‘సంతాప సభను.. బాబు రాజకీయ సభగా మార్చారు’
సాక్షి, గుంటూరు: కోడెల శివప్రసాదరావు సంతాప సభను రాజకీయ సభగా మార్చిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆత్మహత్యకు చంద్రబాబు, కోడెల పిల్లలే కారణమంటూ ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల ఆసుపత్రిలో ఉన్నప్పుడు చంద్రబాబు వెళ్లి పలకరించలేదని గుర్తుచేశారు. ఒకవేళ పలకరించి ఉంటే చనిపోయేవారు కాదని వ్యాఖ్యానించారు. కోడెల కుటుంబంపై ప్రేమ ఉంటే ఆయన కూతురు, కొడుక్కి నియోజకవర్గ ఇంఛార్జ్ పదవులను ఇవ్వాల్సింది కదా? ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నించారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు చులకన చేసి మాట్లాడుతున్నారని, ఆయనకు వయస్సు పెరిగేకొద్దీ చాదస్తం ఎక్కువైందని దుయ్యబట్టారు. ఇప్పటివరకు చంద్రబాబు చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను ప్రివిలైజేషన్ కమిటీకి తీసుకెళ్తామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
లొంగిపోయిన కోడెల శివరాం
సాక్షి, గుంటూరు : టీడీపీ దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయారు. కోడెల పదవిలో ఉండగా కే ట్యాక్స్ పేరిట శివరాం కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదు కేసుల విషయమై తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోడెల శివరాం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన హైకోర్టు.. శివరాంను కింది కోర్టులో లొంగిపోవాల్సింగా సూచించింది. ఈ క్రమంలో కోడెల శివరాం ఈరోజు నరసరావుపేట ఫస్ట్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. కాగా కే ట్యాక్స్ పేరిట భారీ ఎత్తున ప్రజలు కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేయడం, సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత, పార్టీ అధిష్టానం సైతం తనను పట్టించుకోకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. -
కోడెలను బలిపీఠం ఎక్కించిందెవరు?
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు పిరికివాడు కాదు. ఇంట్లో బాంబులు పేలిన నాడే భయపడలేదు. సీబీఐ కేసును ఎదుర్కొన్న మనిషి. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? సత్తెనపల్లి నియోజకవర్గంలో కే ట్యాక్స్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. పరిస్థితులు తారుమారై చుట్టుముట్టిన వేళ తన అధినాయకుడు చంద్రబాబు ఆపన్నహస్తం కోసం ఎదురుచూసి, మానసికంగా అలసిపోయి కోడెల ఈ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు జరిగిన పరిణామాలు రూఢీ పరుస్తున్నాయి. ఆయనకు అవమానాలు, కేసులు కొత్తేమీ కాదు. కానీ నమ్ముకున్న చంద్రబాబు ద్రోహంతోనే ఆయన గుండె పగిలింది. ఆత్మహత్యలకు మానసిక నిపుణులు ఎన్నో కారణాలు చెబుతున్నారు. పరిస్థితులతో ఇమడలేకపోవడం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదురయ్యే సంఘట నలు, మూర్తిమత్వలోపాలు, జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడటం, కొన్ని సంఘటనలు జరుగుతాయని ఊహించుకుని భయపడటం, అవగాహన లోపం, ఆర్థిక ఇబ్బందులు, ఘర్షణలు, సామాజిక అంశాలు కూడా ఒక్కోసారి ఆత్మహత్యకు కారణమవుతాయట. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు వీటికి అతీతుడు కాలేకపోయారు. పరిస్థితులు ఒక్కసారిగా చిక్కుముళ్లుగా పడి ఉరితాళ్లై చుట్టుముట్టినప్పుడు చావును వెతుక్కున్నారు. అట్లాగని కోడెల పిరికివాడు కాదు. ఇంట్లో బాంబులు పేలిన నాడే భయపడలేదు. సీబీఐ కేసును ఎదుర్కొన్న మనిషి. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఫ్యాక్షన్ రాజకీయాలతో పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న, వ్యక్తిగత, కుల, రాజకీయ, వృత్తి అస్తిత్వంతో తన ఉనికిని నిలబెట్టుకుంటున్న క్రియాశీలక నేత. అటు వంటి నాయకుని మరణానికి ఎవరు బాధ్యులు? అతను ఎంత మనోవేదన అనుభవించి ఉంటే ఆత్మహత్యకు పాల్పడ్డాడో అర్థం అవు తుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కోడెల మరణం దేశ రాజకీయాల్లో నిజంగానే ఒక కేస్ స్టడీగా తీసుకొని పరిశోధన చేయాల్సిన అంశమే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా పరమైన దూకుడు పెంచారు. అవినీతి రహిత రాష్ట్రాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు పోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల దాహంతో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, అధిక ధరలకు అప్పగించి ఖజానాను దోచేశారని, రివర్స్ టెండర్ల ప్రక్రియకు వెళ్తామని చెప్పి.. చేసి చూపించారు. ఇది నిరూపితమైంది కూడా. అట్లాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో కే ట్యాక్స్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఫర్నీచర్‌ను సొంతానికి వాడుకున్నట్టుగా కోడెలపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. అతను, అతని కుటుంబంపై మొత్తం ఇరవై మూడు కేసులు నమోదు అయినట్టు సమాచారం. ఈ వ్యవహారం ఆయనను మానసికంగా కుంగదీసే ఉంటుంది. పరిస్థితులు తారుమారై చుట్టుముట్టిన వేళ తన అధినాయకుడు చంద్రబాబు ఆపన్నహస్తం కోసం ఎదురుచూసి, మానసికంగా అలసిపోయి కోడెల ఈ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు జరిగిన పరిణామాలు రూఢీ పరుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని తప్పు పట్టలేం. ఇందులో దాగి ఉన్న రాజకీయ కోణాన్ని కూడా విస్మరించలేం. ఎట్లా అయితేనేమి కోడెల చట్టబద్దంగా బోనులో ఇరుక్కున్నారు.ఇటువంటి సమయంలో అండగా నిలవా ల్సింది చంద్రబాబే. మంచో చెడో పార్టీ పెద్దగా చంద్రబాబు కోడెల భుజం తట్టి ‘నేనున్నాను’ అని భరోసా ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ చంద్రబాబు ఆ పని చేయలేదు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న చంద్రబాబు చుట్టూ అవినీతి ఆరోపణలు, నోటుకు కోట్లు తదితర కేసులు ముసురుకుంటున్నాయి. ఈ కేసుల నుంచి ఆయనను రక్షించటంతో పాటు మరణం అంచున ఉన్న టీడీపీకి జీవ గంజి పోయటానికి ఎవరో ఒకరు బలిపీఠం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆ బలిపీఠం తానే ఎక్కుతానని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వాగ్దానం చేశారు. ‘తాను ఆత్మహత్య చేసుకొని చంద్రబాబును రక్షించుకుంటా’ అని శపథం చేశారు. ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్య చేసుకోవడం యాదృచ్ఛి కమే. ఆత్మహత్యను వైద్య పరిభాషలో ‘క్రైఫర్ హెల్ప్’గా పరిగణిస్తా రట. ఏదైనా సహాయం కోసం అర్థించినపుడు ఎవరూ సహాయం అందజేయకపోతే చివరి పరిష్కారంగా ఆత్మహత్యను ఎంచుకోవడం జరుగుతుంది. కోడెలకు సరిగ్గా ఇదే అనుభవం ఎదురయ్యింది. ఆయ నకు అవమానాలు, కేసులు కొత్తేమీ కాదు. కానీ నమ్ముకున్న చంద్రబాబు ద్రోహంతోనే ఆయన గుండె పగిలింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఒక సారి నాదెండ్ల భాస్కర్‌రావు, మరోసారి పిల్లనిచ్చిన సొంత అల్లుడు చంద్రబాబు నాయుడు చేతుల్లో వంచనకు గురి అయ్యారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ టెక్సాస్‌లో గుండెకు బైపాస్ శస్త్రచికిత్స చేయించుకొని తిరిగి వచ్చేసరికి నాదెండ్ల భాస్కర్‌రావు గద్దె మీద కూర్చొని నేనే సీఎం అన్నాడు. అప్పుడు ఎంతో గుండె నిబ్బరాన్ని, రాజకీయ పరిణతిని చూపించిన ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఫలితంగా సెప్టెంబర్ 16న భాస్కర్‌రావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. తిరిగి రామారావు ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1995 ఆగస్టులో చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచినప్పుడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి నిలబడిన ఎన్టీఆర్ తనవాడు అనుకున్న, సొంత అల్లుడు చేసిన ఘాతుకానికి తట్టుకోలేకపోయారు. నలుగురికి చెప్పుకోలేక లోలోపల మదనపడి గుండె పగిలి మరణించారు. తాజాగా కోడెల పరిస్థితి కూడా ఇదే. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి అతనేమీ అనుకూలతను ఆశించి ఉండరు. కానీ అనుకూల వర్గం నుంచి ఒక బలమైన రక్షణ కవచాన్ని కోరుకుంటారు. అసెంబ్లీ ఫర్నిచర్ ను సొంతానికి వాడుకున్నాడనే అవమాన భారమే కోడెల ఉసురు తీసిందని టీడీపీ నేతల ఆరోపణ. కానీ ఆయన గతంలో ఇంతకన్నా దారుణమైన అవమానాలను అనుభవించారు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో తుఫాన్ వచ్చినప్పుడు బాధితుల కోసమని బియ్యం సేకరించి వాటిని అమ్ముకున్నా రనే ఆరోపణలు కోడెలపై వచ్చాయి. ఇటువంటి అమానవీయ ఆరో పణలు ధైర్యంగా ఎదుర్కొన్న కోడెలకు అసెంబ్లీ ఫర్నిచర్ ఆరోపణ ఒక లెక్కా. ఇరవై రోజుల క్రితం మాత్రలు మింగి తొలిసారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మొదటి ఆత్మహత్య ప్రయత్నం సంద ర్భంలోనే అధినేతగా చంద్రబాబు నేరుగా కోడెల ఇంటికి వెళ్లి ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి, మూడు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయనలో అభద్రతా భావాన్ని పెంచారు. సంక్లిష్ట సమయంలో అండగా నిలవాల్సిన చంద్రబాబు చేసిన నమ్మకద్రోహమే కోడెల మనసు విరిచి ‘అసహజ’ నిర్ణయానికి దారితీసింది. కోడెల మరణాన్ని, అంతిమ యాత్రను కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ యాత్రగా మలిచారు. కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు భోరున విలపిస్తుండగా, కొందరు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు జిందాబాద్ అని నినాదాలు చేస్తుంటే చంద్రబాబు విక్టరీ సింబల్ చూపిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రలో నడవటం అత్యంత జుగుప్సాకరంగా అనిపించింది. దేశంలో అంతరిస్తున్న రాజకీయ విలువలకు కోడెల ఆసహజ మరణం ఒక కేస్ స్టడీ కావాలి. అధికార పీఠంపై యావ తప్ప ఒక లక్ష్యం, సిద్ధాంతం లేని వ్యక్తి నాయకత్వం ఎంత ప్రమాదకరమో భావితరం తెలుసుకోవాలి. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ శాసనసభ అంచనాలు, పద్దులు కమిటీ చైర్మన్ ‘ 94403 80141 -
అయ్యన్న పాత్రుడి బూతు పురాణం
సాక్షి, విశాఖ : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వం, మంత్రులు, ఐపీఎస్ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయడానికి వీల్లేని భాష ఉపయోగించారు. జగన్మోహన్రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. పెన్షన్ పెంపు తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. పోలీసులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని, పాత కేసులు బయటికి తీస్తున్నారని ఆరోపించారు. కేసులకు ఎవరూ భయపడబోరని అన్నారు. పనికిమాలిన పల్నాడు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కోడెల శివప్రసాదరావుపై వేధించి కేసు పెట్టించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వేధింపులకు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మంత్రి బొత్స నీతిమంతుడు, పతివ్రతలాగా మాట్లాడుతున్నాడని, వోక్స్ వ్యాగన్ కంపెనీ వెళ్లిపోవడానికి ఆయనే కారణమని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మూసివేసిన అన్న క్యాంటీన్లను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
కోడెలను కాటేసిందెవరు?
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందించడం దొంగే.. దొంగ, దొంగ అని అరిచిన చందంగా ఉంది. నాలుగయిదు నెలల క్రితమే.. అంటే, చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చివరి రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ అడుగుపెట్టడానికి అనుమతించబోమంటూ జీవో తెచ్చారు. అంతకుముందే చంద్రబాబు పలుమార్లు గవ ర్నర్ వ్యవస్థ మీద తనకు ఏమాత్రం నమ్మకం లేదని బహి రంగంగానే వ్యాఖ్యానించారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య అందర్నీ కలచివేసింది. కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రాగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కోడెల కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ప్రతి రాజకీయనాయకుడి మీద పలురకాల ఒత్తిళ్లు ఉంటాయి. కోడెల కూడా తన రాజకీయ జీవితంలో అనేక కష్టాలు, ఒత్తిళ్లతోనే ముందుకు సాగారు. కానీ, 2014 నుంచి కోడెలకు సొంత పార్టీ నుంచే కష్టాలు ఎదురయ్యాయి. 2014 ఎన్నికల్లో నరసరావుపేట టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. చివరి క్షణంలో కోడెలను సత్తెనపల్లి పంపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. స్వల్ప మెజార్టీతో గెలిచిన కోడెలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. స్పీకర్ పదవి ఉన్నతమైనదే. కానీ రాజకీయంగా క్రియాశీలకమైనది కాదు కనుక దానిని నిర్వహించడానికి కోడెల ఆసక్తి చూపలేదన్న వార్తలొచ్చాయి. చివరకు అయిష్టంగానే స్పీకర్ పదవి చేపట్టారు. స్పీకర్‌గా ఉండి ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇవన్నీ తమ నాయకుడు చంద్రబాబు మెప్పుపొందడానికి చేసినట్లుగానే కన్పించాయి. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే డాక్టర్ కోడెల కుటుంబం బాధితులందరూ బయటకొచ్చారు. సొంత పార్టీ వారే ఆయన మీద ఫిర్యాదులు పెట్టారు. వాటి ఆధారంగానే పోలీసులు కేసులు నమోదు చేశారు. నిజానికి, కోడెల పట్ల గౌరవంతో పోలీసు యంత్రాంగం వ్యవహరించింది. కక్షసాధింపు చేయాలనుకొంటే ఆయనను విచారణకు పిలిపించేవారు. కోడెల కుటుంబంపై పెట్టిన కేసులపై యాగీ చేస్తున్న చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ముద్రగడ పద్మనాభం మొదలుకొని ఎంతోమందిని రాజకీయంగా వేధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడిన విద్యార్థులపై కూడా కేసులు పెట్టి వేధించిన విషయాన్ని చంద్రబాబు మర్చిపోయినట్లు ఉన్నారు. నిజానికి, కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం బాబు అనుచితవైఖరే. 2014లో అధికారంలోకి రాగానే కెటాక్స్ పేరుతో నరసరావుపేటలో కోడెల కుమార్తె, సత్తెనపల్లిలో ఆయన కుమారుడు దందాలకు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువె త్తాయి. వారి బాధితుల్లో సొంత పార్టీకి చెందిన వ్యక్తులూ ఉన్నారు. కానీ, కుటుంబ సభ్యుల్ని కట్టడి చేయమని చంద్రబాబు కోడెలకు చెప్పలేకపోయారు. కారణం వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ఫైల్ స్పీకర్‌గా ఉన్న కోడెల వద్ద ఉన్నది. ఎన్నికల ఫలితాల తర్వాత గుంటూరు జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నరసరావుపేటలో కోడెలకు వ్యతిరేకంగా తెలుగుదేశంలోని ఒక వర్గం గుంటూరులోని టీడీపీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. పొమ్మనకుండా పొగబెట్టి కోడెలను పార్టీ నుంచి సాగనంప డానికి చంద్రబాబే కోడెల వ్యతిరేక వర్గంతో.. పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేయించారని పార్టీలో చర్చ సాగింది. గుంటూరులోని పార్టీ కార్యాలయానికి కోడెల వెళ్ళినపుడు ఆయనతో చంద్రబాబు అంటీముట్టనట్లుగా వ్యవహరించారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక పెయిడ్ ఆర్టిస్ట్‌లతో చంద్రబాబు చేయించిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి కోడెలను రావొద్దంటూ కబురు చేశారన్న వార్త మీడియాకు లీక్ చేశారు. కోడెల కుమారుడి ఆఫీస్‌లో అసెంబ్లీ ఫర్నిచర్ దొరికిన అంశంలో సీనియర్ నేతతో పార్టీ కార్యాలయంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించి ‘కోడెల ఫర్నిచర్‌ను తరలించడం వల్ల పార్టీకి అప్రదిష్ట కలిగింది’ అని మాట్లాడించారు. చంద్రబాబు చౌకబారు రాజకీయాన్ని కోడెల తట్టుకోలేకపోయారు. చంద్రబాబు కావాలనే తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, తనను వదిలించుకోవడానికే జూనియర్ నేతలతో విమర్శలు చేయిస్తున్నారని గ్రహించి అవమానపడ్డారు. దాంతో కోడెల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో కుటుంబ సభ్యులు స్పందించి ఆసుపత్రిలో చేర్పించడంతో ఆయనకు అప్పుడు ప్రాణాపాయం తప్పింది. పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో గుండె నొప్పితో కోడెల ఆసుపత్రిలో చేరారంటూ పార్టీ నేతలతో చెప్పించారు. ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా, సుదీర్ఘ కాలం మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్‌గా పనిచేసిన కోడెల ఆత్మ హత్యాయత్నం చేశారని తెలిసి కూడా చంద్రబాబు ఆయనను పరామర్శించలేదు. పైగా డాక్టర్ కోడెలకు ఉన్న ఆసుపత్రి గుంటూరు నగరంలోనే ఉంది. గుంటూరులోనే ఉన్న పార్టీ కార్యాలయానికి చంద్రబాబు రోజూ వెళుతుంటారు. కానీ, ఐదు నిమిషాల సమయాన్ని కోడెలను పరామర్శించడానికి కేటాయించలేకపోయారు. అధికారం కోల్పోయాక, మాజీ స్పీకర్‌గా మిగిలిన కోడెలతో అక్కర తీరిపోయిందని చంద్రబాబు భావించి నందునే ఆయనంతట ఆయనే పార్టీ నుంచి నిష్క్రమించే పరిస్థితుల్ని చంద్రబాబు సృష్టించారన్నది తేటతెల్లం. అయితే, కోడెల ఆత్మహత్య అంశాన్ని అధికార పక్షం మీద ఆయుధంగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు చకచకా పావులు కదిపారు. అంతకు ఒకరోజు ముందు ఆయన కుమార్తె మీడియా ముందుకొచ్చి స్వయంగా ‘జరిగిందేదో జరిగింది. మమ్మల్ని వదిలివేయండి. రాజకీయం చేయకండి’ అని వేడుకొన్నారు. తరువాత ఎవరి ప్రోద్భలంతో వెంటనే మాట మార్చారో ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. కోడెల బీజేపీలో చేరడానికి సంప్రదింపులు జరిపారని ఆ పార్టీ నేతలు బయట పెట్టడంతో.. చంద్రబాబు ప్లాన్ బెడిసి కొట్టింది. ‘యూజ్ అండ్ త్రో’ పాలసీకి తాజాగా బలైపోయిన కోడెల ఆత్మకు శాంతి లేకుండా ఆయన ఆత్మహత్యను రాజకీయంగా మలుచుకోవాలనుకుంటున్న చంద్రబాబుది శవరాజకీయమే! వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆయన నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి సామాజిక సమానత్వం పునాదులపై ప్రభుత్వం ఏర్పాటు కావడం సహించలేని చంద్రబాబు విధ్వంసకర రాజకీయం వికృతరూపం దాల్చింది. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ, అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
కోడెల మృతిపై పిల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న పిల్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్లో ప్రజాప్రయోజనం ఏముందని పిటిషనర్ అనిల్‌కుమార్‌ను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దర్యాప్తు జరుగుతుండగా జోక్యం చేసుకోలేమని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కోడెల కుటుంబ సభ్యులు వాంగ్మూలం తీసుకోవాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో పిల్ వేసిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 16న బంజారాహిల్స్‌లో తాను నివాసం ఉంటున్న ఇంట్లో కోడెల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
కోడెల కాల్‌డేటానే కీలకం!
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ప్రధానంగా ఫోన్‌కాల్ డేటాపై దృష్టి సారించారు. సూసైడ్ నోట్ కూడా లభించకపోవడంతో పోలీసులు సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నారు. కీలక ఆధారంగా మారిన ఆయన సెల్‌ఫోన్ అదృశ్యం కావడంతో కాల్‌డేటాను హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ పోలీసులు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. కోడెల ఆత్మహత్యకు ముందు గంట వ్యవధిలో 10–12 మందితో మాట్లాడినట్టు గుర్తించారు. చని పోవడానికి ముందు గంట వ్యవధిలో చేసిన ఫోన్‌కాల్స్‌లో కచ్చితంగా ఎవరో ఒకరికి తన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి కోడెల చెప్పి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడెలతో ఫోన్లో మాట్లాడిన వారిని పోలీసులు వ్యక్తిగతంగా పిలిచి ఆరా తీస్తున్నట్టు తెలిసింది. మరోవైపు బంజారాహిల్స్‌లోని కోడెల నివాసం వద్ద పోలీసులు సెక్యూరిటీని అప్రమత్తం చేసి ఎవరైనా అక్కడికి వస్తే సమాచారం ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. కోడెల కుమారుడు శివరామ్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే విచారించిన కుటుంబ సభ్యులతోపాటు మరికొందరిని కూడా మరోసారి విచారించే అవకాశం ఉంది. మేనల్లుడి ఫిర్యాదుపైనా విచారణ.. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న రోజు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదుపై కూడా బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు శివరామ్, కుటుంబీకుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు సాయిబాబు అరోపించిన సంగతి తెలిసిందే. కోడెల మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని గుంటూరు జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోడెల మరణానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు కారణమని అనిల్‌కుమార్ ఆరోపించారు. -
ఫర్నీచర్‌పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు
‘అందరికీ ఇచి్చనట్లే క్యాంపు కార్యాలయం కోసం అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫర్నీచర్ ఇచ్చారు. వాటిని ఆయన తన కార్యాలయంలో వాడుకున్నారు. తన పదవి ముగిసిన తర్వాత ఆ ఫర్నీచర్‌ను తీసుకెళ్లాలని అసెంబ్లీ కార్యదర్శికి రెండు లేఖలు రాశారు. వాటిని పక్కనపడేసి ఫర్నీచర్ దొంగతనం చేశారని కేసు పెట్టడం ఏమిటి? రెండు లక్షలు విలువచేసే ఫర్నీచర్ కోసం అంత సీనియర్ నేతపై కేసు పెడతారా?’.. – రెండ్రోజులుగా చంద్రబాబు మీడియా సమావేశాల్లో వల్లెవేస్తున్న మాటలివి. హైదరాబాద్ నుంచి అమరావతికి ఏపీ అసెంబ్లీని తరలించేటప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఫర్నీచర్‌ను భద్రత కోసం మా ఇంటికి తీసుకెళ్లాం. అమరావతిలో నిరి్మంచిన అసెంబ్లీలో కొత్త ఫరి్నచర్ ఏర్పాటుచేశామని సీఆర్డీఏ అధికారులు చెప్పడంతో అక్కడ ఆ ఫర్నిచర్‌కు భద్రత ఉండదని మా ఇంటికి తీసుకెళ్లాం. నా టర్మ్ పూర్తయ్యాక దాన్ని తీసుకెళ్లాలని లేకపోతే దాని విలువ ఎంతో చెబితే చెల్లిస్తానని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశాను. – ఆగస్టు 20న నరసరావుపేటలో మీడియాతో కోడెల శివప్రసాదరావు సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫరి్నచర్‌ను తన ఇళ్లు, కార్యాలయాలకు తరలించిన విషయాన్ని చంద్రబాబు పూర్తిగా వక్రీకరిస్తూ పచ్చి అబద్ధాలు చెబుతుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ అసెంబ్లీ నుంచి కోడెల తన ఇళ్లు, కార్యాలయాలకు తరలించిన ఫరి్నచర్ అసెంబ్లీకి సంబంధించినది కాగా.. చంద్రబాబు దాన్ని కోడెల క్యాంపు కార్యాలయం ఫర్నీచర్‌గా చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసెంబ్లీలో వినియోగించే ఫర్నీచర్, స్పీకర్ క్యాంపు కార్యాలయం కోసం వినియోగించే ఫర్నీచర్‌కు మధ్య తేడాను ప్రజలు గమనించలేరనే భావనతో ఆయన పూర్తిగా పక్కదారి పట్టించేలా మాట్లాడుతుండడంపై టీడీపీ నాయకుల్లోనే అసహనం కనిపిస్తోంది. గత నెలలో ఈ ఫర్నిచర్ గురించి కోడెల స్వయంగా మీడియా సమావేశం పెట్టి వెలగపూడి అసెంబ్లీలో భద్రత ఉండదని తన ఇంటికి తీసుకెళ్లినట్లు స్పష్టంచేసినప్పటికీ చంద్రబాబు వితండవాదం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి నాలుగేళ్ల క్రితం ఈ ఫరి్నచర్‌ను తరలించిన కోడెల దాన్ని గుంటూరులోని తన కుమారుడి హీరో షోరూంలో వినియోగించారు. స్పీకర్‌గా కోడెల పదవీకాలం పూర్తయిన తర్వాత కొత్తగా బాధ్యతలు చేపట్టిన అసెంబ్లీ కార్యదర్శి ఫర్నీచర్ గురించి వివరాలు సేకరిస్తున్న సమయంలో హైదరాబాద్ అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్ మాయమైన విషయం బయటపడింది. దీనిపై అసెంబ్లీలో అంతర్గతంగా విచారణ జరుగుతున్న విషయం తెలిసి కోడెల హడావుడిగా మీడియా సమావేశం పెట్టి అది తన వద్ద ఉందని తెలిపారు. ఆగస్టు 27న అసెంబ్లీకి కార్యదర్శికి ఒక లేఖ పాత తేదీతో పంపించి ముందే తాను ఇచి్చనట్లు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఈ విషయంపై గుంటూరు జిల్లా పోలీసులు, అసెంబ్లీ యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ జరిపింది. ఏపీ అసెంబ్లీని అమరావతికి మార్చిన సమయంలో అక్కడి ఫర్నీచర్‌ను కోడెల సత్తెనపల్లి, నర్సరావుపేటలోని తన ఇళ్లు, వ్యాపార సంస్థలకు తరలించారు. ఇందుకు అప్పటి అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్ సహకరించినట్టు తేలడంతో ఇటీవలే ఆయన్ని ఆ పోస్టు నుంచి తప్పించారు. మాయమైన ఫర్నీచర్ ఇదే.. బర్మా టేకుతో చేయించిన నిజాం కాలం నాటి టేబుళ్లు, డిజైనర్ కురీ్చలు, సోఫాలు తరలించారు. నెమలి ఆకారంలోని 14 సందర్శకుల కురీ్చలు, ఒక సెంటర్ టేబుల్, ఐదు కురీ్చలు, 27 ప్లాస్టిక్ కురీ్చలు, సభ్యుల లాంజిలోని 80 తెల్ల కురీ్చలు, స్పీకర్ యాంటి రూమ్‌లోని మూడు కుర్చీలు, మూడు సింగిల్ సీటర్ సోఫాలు, ఒక త్రీ సీటర్ సోఫా, పది చెక్క కుర్చీలు, రెండు స్లి్పట్ ఏసీలు, ఎగ్జిక్యూటివ్ కురీ్చలు, సందర్శకుల కురీ్చలు, బీఏసీ మీటింగ్ హాలులోని టేబుల్, ఎగ్జిక్యూటివ్, సాధారణ కురీ్చలు, డైనింగ్ హాలులోని టేబుల్, కురీ్చలు, కప్బోర్డు తదితర వస్తువులు తరలించారు. ఇవికాక.. స్పీకర్ ఛాంబర్, ఇతర ప్రదేశాల్లో ఉన్న ఫరి్నచర్, టవర్ ఏసీలు, కంప్యూటరు సైతం మాయమయ్యాయి. ఇవన్నీ కోడెల క్యాంపు కార్యాలయం కోసం వాడినవని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. వీటి విలువ కూడా తక్కువ చేసి చూపిస్తుండడం గమనార్హం. -
చంద్రబాబులో బాధ, భావోద్వేగం కనిపించలేదు..
సాక్షి, అమరావతి: ‘సాధారణంగా సహచరులు చనిపోయినప్పుడు భావోద్వేగాలు సహజం. అయితే చంద్రబాబు నాయుడులో అలాంటి భావోద్వేగాలు కనిపించలేదు. పార్టీ సీనియర్ నేత చనిపోయిన బాధ చంద్రబాబులో కనిపించడం లేదు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై ఆయన దుష్ప్రచారం చేస్తున్నారు. కోడెల చనిపోయిన బాధ చంద్రబాబులో కనిపించడం లేదు. రాజకీయ లబ్ధి కోసం కోడెల మృతిని వాడుకుంటూ.... మైలేజ్ కోసం చంద్రబాబు తాపత్రాయపడుతున్నారు. కోడెల అంత్యక్రియల్లో చంద్రబాబు తీరు ఎన్నికల ఊరేగింపులా ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దానికి చంద్రబాబే కారణం.. ‘కోడెలది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పే సమయంలో నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. పార్టీ మనిషి చనిపోతే మిగతా నాయకుల్లో బాధ, భావోద్వేగం కనిపిస్తుంది. ఆ బాధ చంద్రబాబులో కనిపించడం లేదు. కోడెల మరణంతో చంద్రబాబు రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నం చేశారు. గతంలో కోడెల ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పుడే చంద్రబాబు పోరాటం చేసి ఉంటే కోడెల బతికేవారు. కోడెలలో చెడు కోణాన్ని చెప్పుకోవాల్సిన దుస్థితి తీసుకు వచ్చింది చంద్రబాబే. ఇక కోడెల విషయంలో చంద్రబాబు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమన్నారు. గవర్నర్‌ను కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఫిర్యాదు చేశారు. చదవండి: బాబు..ఏ ముఖం పెట్టుకొని గవర్నర్‌ను కలుస్తారు మరి చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తే తప్పేంటి. కోడెల కుటుంబసభ్యుల మీద కేసులు నమోదు చేశారు కానీ విచారణ చేయలేదు. కోడెల తీసుకు వెళ్లింది లక్ష రూపాయల ఫర్నిచర్ కాదు...కొత్త అసెంబ్లీలో ఫర్నిచర్ కాదు. హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్న పురాతనమైన ఫర్నిచర్ తీసుకువెళ్లారు. కోట్ల రూపాయల విలువ చేసే 114 వస్తువులను కోడెల తీసుకువెళ్లారు. ఈ విషయంలో చంద్రబాబు తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారు. పారదర్శకంగా సచివాలయ పరీక్షలు.. లక్షా 27వేల గ్రామ సచివాలయం ఉద్యోగాలకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నాపత్రం ఎక్కడా లీక్ అవలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుబట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహింపచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నాపత్రం అమ్ముకున్నారంటూ చంద్రబాబు, నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారికి ప్రథమ ర్యాంక్‌లు వచ్చాయి. పేపర్ లీకయితే అప్పుడే ఎందుకు రాయలేదు. కావాలనే ఒక పిచ్చి పత్రిక తప్పుడు రాతలు రాస్తోంది. ఆ పిచ్చి పత్రిక రాతలు ఎవరు నమ్మొద్దు’ అని అంబటి సూచించారు. -
‘కోడెలను కొడుకే హత్య చేశాడు’
సాక్షి, హైదరాబాద్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, దీంతో చంద్రబాబుకు సంబంధం ఉందని గుంటూరు జిల్లాకు చెందిన బొర్రుగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తి ఆరోపించారు. కోడెల మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్ సీఐని ప్రతివాదులుగా చేర్చారు. కోడెల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, కుట్ర కోణం దాగుందని పిటిషనర్ ఆరోపించారు. కోడెల శివప్రసాదరావు అభిమానిగా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పిల్ వేసినట్టు అనిల్‌కుమార్ మీడియాకు తెలిపారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని అన్నారు. రాజకీయ నాయకులపై కేసులు సహజమని, దానికే భయపడిపోయి ఆయన ఆత్మహత్య చేసుకుంటారని తాము భావించడం లేదన్నారు. కోడెలది కచ్చితంగా రాజకీయ హత్యేనని, దీన్ని క్యాష్ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. కోడెల మృతి వెనుక ఆయన కుమారుడు శివరామ్ హస్తం ఉందని వంద శాతం నమ్ముతున్నట్టు తెలిపారు. అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న చేసిన శివరామ్ కేసుల నుంచి తప్పించడం కోసం తండ్రిని హత్య చేయించివుంటాడన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కోడెల మరణం వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టును అభ్యర్థించినట్టు చెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. (చదవండి: శివరామ్ విచారణకు రంగం సిద్ధం) -
‘కోడెల అంతిమ యాత్రలో చంద్రబాబు నటన’
సాక్షి, కిర్లంపూడి: చంద్రబాబు, కోడెల అంతిమ యాత్రలో బాగానే నటించారు.. కానీ ఓ వ్యక్తి మీద నిజంగానే ప్రేమ ఉంటే.. యాత్రకు వచ్చిన వారికి నమస్కారం చేస్తారు.. లేదా మౌనంగా ఉంటారు.. కానీ రెండు వేళ్లు చూపడం ఏం సంస్కారం అని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ నటన అంతా రాజకీయ లబ్ది కోసం కాదా అని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోడెలను పిలిపించుకుని.. మీ కుమారుడి వల్ల చెడ్డపేరు వస్తోంది.. అదుపులో పెట్టుకొండి అని వార్నింగ్ ఇవ్వడం.. అందుకు కోడెల మీ పుత్రరత్నం వజ్రమా అని కోడెల చంద్రబాబును ప్రశ్నించడం నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందంటూ బాధపడుతున్నారు.. కానీ దానికి ఆజ్యం పోసిందే చంద్రబాబే కదా అన్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 30 మందిని బలి తీసుకున్నారని ఆరోపించారు. తనపై కేసులు పెట్టడానికి వీలు లేకుండా ఏకంగా పోలీసుల చేతే సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయించిన ఘనత చంద్రబాబుదే అంటూ ధ్వజమెత్తారు. తమ జాతి ఉద్యమానికి.. తమపై అక్రమ కేసులు పెట్టించి.. ఈ రోజు వారంతా కోర్టుల చుట్టూ తిరగడానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది అణాగారిని వర్గాలకు వెలుతురు ఇవ్వడం కోసమే కానీ అణచివేయమని కాదంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అరాచక పాలనలో చంద్రబాబు సామన్య ప్రజలకు బతికే అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలకు రాక్షస పాలన చూపించిన బాబు నేడు ప్రజల కోసమే బతుకున్నాను అంటూ దొంగ మాటలు చెబుతూ.. ఇంకా ఎంత కాలం బట్టలు తడిచిపోయేలా కన్నీరు కారుస్తూ నటిస్తారని ముద్రగడ ప్రశ్నించారు. -
ఏ ముఖం పెట్టుకుని గవర్నర్‌ను కలిశావ్ : బొత్స
సాక్షి, అమరావతి : గవర్నర్ వ్యవస్థ పనికిమాలిందని గతంలో విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని గవర్నర్‌ను కలిశారో చెప్పాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్లో సానుభూతి పొందాలనే వైఖరి హేయమైందని అన్నారు. కోడెల అంతిమ సంస్కారాలు కూడా అధికారిక లాంఛనాలతో జరగకుండా చేసి ఆయనపై ఉన్న అక్కసును చంద్రబాబు బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సీబీఐ రాష్ట్రానికి రావద్దని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు కోడెల కేసులో సీబీఐ విచారణ కోరడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేంద్రం చెప్పుచేతుల్లో సీబీఐ ఉందని అప్పుడు విమర్శించిన చంద్రబాబుకు.. ఇప్పుడూ కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉందని తెలియదా అని మండిపడ్డారు. అసలు కోడెల వాడిన ఫోన్ ఏమైందో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. నువ్వు కాదా క్షోభ పెట్టింది? కోడెల మృతి చుట్టూ ఉన్న అనుమానాలను చంద్రబాబే నివృత్తి చేయాలని బొత్స డిమాండ్ చేశారు. గత మూడు నెలల్లో ఎన్నిసార్లు, ఏ అంశంపైనా కోడెలను చంద్రబాబు కలిశారన్ని బయటపెట్టాలన్నారు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా కోడెలను క్షోభ పెట్టింది చంద్రబాబే అన్నారు. బీజేపీలో చేరేందుకు కోడెల ఎందుకు ప్రయత్నించారన్నారు. టీడీపీలో గౌరవం లేదని, అందుకే బీజేపీలో చేరాలని కోడెల భావించినట్లు బీజేపీ నేతలే చెప్పారని బొత్స వివరించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగితే అప్పటి గవర్నర్ నరసింహన్ వైఎస్ జగన్ యోగక్షేమాలను ఫోన్ ద్వారా తెలుసుకున్నపుడు.. చంద్రబాబు మాట్లాడిన భాష, తీరును బొత్స గుర్తుచేశారు. అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే ఇంకొకలా వ్యవహరించడమేనా 40 ఏళ్ల అనుభవం అంటే.. అని చంద్రబాబును ప్రశ్నించారు. కోడెల మృతిపై గవర్నర్‌కు సమర్పించిన వినతిలో ఎక్కడా సీబీఐ విచారణకు డిమాండ్ చేయకుండా, ప్రెస్మీట్లలో మాత్రమే సీబీఐ విచారణ కోరడంలో ఉద్దేశమేంటన్నారు. చంద్రబాబు పాలనలో ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగబద్ధంగా పనిచేసిందా అని ప్రశ్నించారు. కేసులతో ప్రభుత్వానికి సంబంధమేంటి? సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం బాధితులు ముందుకు వచ్చి కేసులు పెడితే ప్రభుత్వానికి సంబంధమేంటని బొత్స ప్రశ్నించారు. ఆ కేసులను చంద్రబాబు, లోకేశ్, ఇతర నాయకులు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. సాక్షి పేపరు, సాక్షి టీవీ వల్లే గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు చేసిన అరాచకాలకు, దౌర్జన్యాలు ప్రజలకు తెలిశాయని, ఎల్లో మీడియాను మొత్తం చెప్పుచేతుల్లో పెట్టుకొని తమ పార్టీపై దుష్ప్రచారం చేశారని వివరించారు. ఇప్పుడు చట్టాల గురించి చంద్రబాబు చెబుతుంటే విడ్డూరంగా ఉందని, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని ఛిన్నాభిన్నం చేసిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు. సెల్‌ఫోన్ ఏమైంది? కోడెల సెల్‌ఫోన్ పోయిందని పుకార్లు వస్తున్నాయని, చంద్రబాబు దాని గురించి ఎందుకు అడగడం లేదని బొత్స ప్రశ్నించారు. ఆత్మకూరులో రెండు కుటుంబాల సమస్యను రాజకీయం చేశారని, పెయిడ్ ఆర్టిస్టులతో క్యాంపులు రన్ చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అనవసరంగా చంద్రబాబు చాలెంజ్‌లు చేసి, పరుష పదజాలంతో మాట్లాడితే ఎవరూ భయపడరని, ఆయన అధికారంలో ఉన్నప్పుడే ధైర్యంగా ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. -
కోడెల మృతికి బాబే కారణం: తలసాని
సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతికి చంద్రబాబు నాయుడే కారణం. ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టింది చంద్రబాబే. మరణానికి ముందు వారంరోజులు ఆసుపత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేదు. పార్టీ మీటింగ్‌లకు దూరం పెట్టడంతోపాటు, పార్టీ నుంచి వెలివేసినట్లు వ్యవహరించారు. కోడెల సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు చొరవ చూపలేదు. చివరకు ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ విషయాలన్నింటినీ మరుగున పడేసి.. నెపం జగన్ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. ‘ఫరీ్నచర్ విషయంలో కోడెల మీద వచ్చిన ఆరోపణలపై పార్టీ అధినేతగా చంద్రబాబు ఏనాడూ స్పందించలేదు. కోడెల అంతిమ యాత్రలో దండాలు పెడుతూ చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నాలు చేశారు’అని తలసాని వ్యాఖ్యానించారు. -
‘కోడెల బీజేపీలోకి చేరాలని ఎందుకు అనుకున్నారు?’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోడెల చనిపోయారన్న కనీస సానుభూతి లేకుండా రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. ‘పార్టీలో పనిచేసే వారికి గౌరవం లేదని కోడెల బాధపడింది నిజమా కాదా? ఆయనను చంద్రబాబు ఎందుకు దూరం పెట్టారు? కోడెల బీజేపీలో చేరాలని ఎందుకు ప్రయత్నించారు? సొంత పార్టీ నేతలే ఆయనపై ఎందుకు ఫిర్యాదు చేశారు? కోడెల సెల్‌ఫోన్ మాయంపై బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?’అంటూ మంత్రి ప్రశ్నించారు. అంతేకాకుండా కోడెల మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని బాబు అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో సీబీఐ రాకూడదన్న చంద్రబాబు ఇప్పుడు కోడెల మరణంపై సీబీఐ దర్యాప్తునకు ఎలా డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా గవర్నర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరికీ గుర్తున్నాయని అన్నారు. కేంద్రానికి గవర్నర్ ఏజెంట్ అని చంద్రబాబు విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి విమర్శలు చేసిన బాబు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని గవర్నర్ దగ్గరికి వెళ్లారని ప్రశ్నించారు. ఇదేనా ఆయన 40 ఏళ్ల అనుభవం అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. కాగా కోడెల శివప్రసాదరావు మృతిపై విచారణ జరిపించాలంటూ చంద్రబాబు ఇవాళ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’ అందుకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు -
కోడెల ధైర్యవంతుడు.. అలాంటి నేత..
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు చాలా ధైర్యవంతుడని, అలాంటి నేత ఆత్మహత్యకు పాల్పడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కోడెల మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల మృతిపై రాజకీయాలు చేయటం సరికాదన్నారు. రాజధాని, హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్‌దే నిర్ణయమని, కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. గతంలో రాయలసీమలోని ఒక్కోజిల్లాకు కేంద్రం రూ.50కోట్లు ఇచ్చిందన్నారు. ఆ నిధులను చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కేంద్ర నిధులకు లెక్కచెప్పమంటే చంద్రబాబు స్పందించలేదన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అన్నారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్ సినిమా చూపించారంటూ ఎద్దేవా చేశారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. -
చంద్రబాబు.. వీటికి సమాధానం చెప్పు
సాక్షి, అమరావతి : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై విచారణ జరిపించాలని కోరడానికి గవర్నర్‌ను కలవాలన్న టీడీపీ నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మూడు నెలలుగా తన దగ్గరకు రానివ్వకుండా చంద్రబాబు నాయుడు కోడెలను మానసిక క్షోభకు గురిచేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే కనీసం పరామర్శకు వెళ్లని చంద్రబాబు ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హంతకుడే హత్య జరిగిందని యాగీ చేసినట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు గవర్నర్ దగ్గరకు వెళ్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఈ ప్రశ్నలు అడిగితే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారంటూ ఎమ్మెల్యేలు అంబటి, గోపిరెడ్డి 20 ప్రశ్నలను సంధిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబుకు అంబటి, గోపిరెడ్డి సంధించిన ప్రశ్నలు : 1. గత మూడునెలలుగా మీరు కోడెలను దగ్గరకు రానిచ్చారా? 2. కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు విని ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారా? 3. అసెంబ్లీ నుంచి కోడెల కోట్ల రూపాయల ఫర్నిచర్ తరలించడం మీకు తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందా? 4. కోడెల ఫర్నిచర్ వ్యవహారంలో, ఆయన అరాచకాలకు గురై తట్టుకోలేక ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తే మీరు ఎందుకు నోరెత్తలేదు? 5. గత ఐదేళ్లుగా కోడెల కొడుకు, కూతురు కే ట్యాక్స్ వసూలు చేశారా? లేదా? 6. గత ఐదేళ్లుగా కోడెలకు చెందిన ఫార్మా డీల్స్ మీకు తెలిసే జరిగాయా? తెలియకుండా జరిగాయా? 7. గత ఐదేళ్లుగా కోడెల అవినీతి సామ్రాజ్యానికి మీరు వెన్నుదన్నుగా ఉన్నారా? లేదా? 8. ఇటు సత్తెనపల్లిలోనూ, అటు నర్సరావుపేటలోనూ భూ కబ్జాల మీద మీరు విచారణ ఎందుకు చేయించలేదు? 9. కోడెల తాను చనిపోకముందు మీకు ఫోన్ చేసి.. అయ్యా.. ప్రస్తుత ప్రభుత్వం వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, మీకు ఎప్పుడైనా చెప్పారా? చెప్తే మీరెందుకు స్పందించలేదు? ఎందుకు మాట్లాడలేదు? 10. కోడెల తన మరణానికి ఈ ప్రభుత్వ వేధింపులు కారణమని వాంగ్మూలం ఎప్పుడైనా ఇచ్చారా? 11. కోడెల చనిపోతూ తన మరణానికి కారణాలు ఇవి, అని ఎక్కడైనా పేర్కొన్నారా? 12. చంద్రబాబుగారూ.. ఒక మనిషి తీవ్ర అవమానానికి గురైతే ఎన్టీఆర్ మాదిరిగా తల్లడిల్లి పోతాడా? లేదా? ఈ విషయం మీకు పాతికేళ్ల క్రితమే తెలుసు కదా? 13. వేధింపులు అంటే ఎలా ఉంటాయో, వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో మీరే ప్రపంచానికి చెప్పారు కదా? మీరు మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మీ సొంతమామని ముఖ్యమంత్రి పీఠం నుంచి కిందికి లాగినప్పుడు ఆయన వేదన గురించి ఏ రోజైనా ఆలోచించారా? ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని ఎన్నికలు అయిన ఏడాదికి లాక్కుని ఎన్టీఆర్ మరణానికి మీరు కారకులయ్యారని సాక్షాత్తూ ఆయన భార్యే ఇవ్వాల్టికీ సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ కూడా మీ గురించి ఇదే విషయాన్ని చెప్పారు. కాని, ఏనాడూ మీరు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు లేదు? 14. కోడెల శివప్రసాద్ గారిది హత్యా? లేక ఆత్మహత్యా? కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి? చంద్రబాబు పాత్ర ఏమిటి? అనే అంశాలమీద సీబీఐ విచారణ జరిపించమంటారా? 15. కోడెల శివప్రసాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సత్తెనపల్లి, నర్సరావుపేటల్లో చేసిన అరాచకాలమీద సీబీఐ విచారణ జరపమంటారా? 16. అసలు సీబీఐని ఈ రాష్ట్రంలోకే రానివ్వమంటూ మీరు ప్రతిజ్ఞచేసి, జనరల్ పర్మిషన్ను ఉపసంహరించుకుంటూ జీవోలు కూడా జారీచేశారు కదా? మరి మీకు సీబీఐమీద నమ్మకం ఎప్పుడు కుదిరింది? 17. శాంతి భద్రతల విషయంలో జోక్యం చేసుకోవడానికి గవర్నర్ ఎవరని.. ఆయనకు ఏ హక్కు ఉందని జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినప్పుడు మాట్లాడిన మీరు.. అసలు గవర్నర్ వ్యవస్థ నే రద్దు చేయమని చెప్పిన మీరు.. ఈరోజు ఏ మొహం పెట్టుకొని గవర్నర్ దగ్గరకు వెళుతున్నారు? 18. బీజేపీ నేతలు రఘురాం సహా మరికొందరు చెప్పిన దాని ప్రకారం మీరు చేసిన అవమానాల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం కోడెలే స్వయంగా చెప్పారు. మరి సీబీఐ విచారణ అంటూ జరిగితే ఏ1 గా హాజరుకావాల్సింది మీరే చంద్రబాబు గారు. అందుకు మీరు సిద్ధమా? 19. చివరకు నిన్న కోడెల శవాన్ని అడ్డుపెట్టుకుని నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆస్పత్రిపై దాడిచేయడానికి మీరే పురిగొల్పారు. మరీ దిగజారిపోయి మూడురోజులపాటు శవం పక్కనే ఉండి మీ పార్టీని బతికించుకునేందుకు సిగ్గుమాలిన రాజకీయం చేయలేదా? 20. బహుశా నిజాలు బయటకు రావన్న నమ్మకంతోనే మీరు ఈ కార్యక్రమాలన్నింటికీ పూనుకున్నారు. కాబట్టి కోడెల శివప్రసాదరావు అరాచకాలమీద, అతని కుటుంబ సభ్యుల అరాచకాలమీద, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితుల మీద మొత్తంగా మీ పాత్రమీద సీబీఐ విచారణ కోరండని మేమే చంద్రబాబుకు సలహా ఇస్తున్నాం. -
శివరామ్ విచారణకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయన ఆత్మహత్యకు కుటుంబ వివాదాలు ఏమైనా కారణమా? అనే కోణంలోనూ విషయ సేకరణపై పోలీసులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కోడెల తనయుడు శివరామ్‌ను త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. కోడెల కొన్ని రోజుల కిందట కూడా తన స్వస్థలంలో ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు ఆ విషయం దాచి గుండెపోటుగా చిత్రీకరించడంపైన తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు, కుటుంబీకుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తమకు అందిందని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని కోడెల ఆత్మహత్య కేసుతో కలిపి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు. బసవతారకం ఆస్పత్రి వైద్యురాలికి చివరి కాల్.. హైదరాబాద్‌లో కోడెల ఉరి వేసుకున్న గదిని పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆయన కొన్నేళ్లుగా వినియోగిస్తున్న మందులను వైద్య నిపుణులతో పరీక్ష చేయించాలని నిర్ణయించారు. అదే సమయంలో కోడెల పర్సనల్ మొబైల్ సెల్‌ఫోన్ ఎక్కడుంది? దాన్ని దాచాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆత్మహత్యకు ముందు ఆ ఫోన్‌తో ఆయన ఎవరితో మాట్లాడారు? ఫోన్ దొరికితే గుట్టు రట్టవుతుందని ఎవరైనా భయపడుతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కాల్‌డేటా రికార్డర్ యాప్ (సీడీఆర్ఏ)తో కాల్‌లిస్ట్‌ను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యురాలికి ఫోన్ చేసి 24 నిమిషాలు మాట్లాడినట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవడానికి ఆ డాక్టరును విచారించాలని నిర్ణయించారు. కేబుల్ వైరుతో ఉరి.. పోస్టుమార్టం నివేదిక కోడెల శివప్రసాదరావు మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ఆ నివేదికను బుధవారం పోలీసులకు అందించారు. మెడకు కేబుల్ వైరు బిగించుకోవడం ద్వారానే మరణం సంభవించిందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కోడెల గొంతు భాగంలో ఎనిమిది అంగుళాల పొడవుతో మచ్చ ఉందని తెలిపారు. ముందుగా తన పంచెను చింపి తాడుగా చేసుకుని ఉరి వేసుకోవాలని కోడెల ప్రయత్నించారని, అది సాధ్యం కాకపోవడంతో గదిలో ఉన్న కేబుల్ వైరుతో ఉరి వేసుకున్నారని తెలిపారు. 12 మందిని విచారించాం: బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్‌రావు కోడెల ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా కుటుంబీకులు, గన్‌మెన్, డ్రైవర్ తదితరులతో కలిపి మొత్తం 12 మంది వాంగ్మూలాలు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన కుమారుడు, ఇతర కుటుంబీకులు, సన్నిహితులతోపాటు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని చెప్పారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కొడుకు శివరామ్ స్టేట్మెంట్ కీలకం కానుందని పేర్కొన్నారు. కోడెల ఫోన్లోని కాల్‌డేటా ఆరా తీస్తున్నామన్నారు. ముగిసిన కోడెల అంత్యక్రియలు నరసరావుపేట/నరసరావుపేటటౌన్: అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు టీడీపీ కార్యకర్తలు కన్నీటి వీడ్కోలు పలికారు. నరసరావుపేట కోటలోని కోడెల నివాసం నుంచి స్వర్గపురి వరకు సాగిన కోడెల అంతిమయాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, లోకేష్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు పాల్గొన్నారు. కోడెల భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం కోటలో ఉంచారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో చంద్రబాబు వచ్చి నివాళులర్పించి అంతియాత్ర ప్రారంభించారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శామ్యూల్ కోడెల కుటుంబ సభ్యులకు వివరించగా.. వారు నిరాకరించారు. కోడెల చితికి శాస్త్రోక్తంగా ఆయన కుమారుడు శివరామకృష్ణ నిప్పంటించి అంతిమ సంస్కారం నిర్వహించారు. కోడెల అంతిమయాత్రలో ప్రతిపక్షనేత చంద్రబాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత.. కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం అంతిమయాత్ర సాగనీయకుండా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం మీదుగా తీసుకెళ్లాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో పోలీసులు అడ్డు చెప్పారు. అంతిమయాత్ర మల్లమ్మసెంటర్కు చేరిన అనంతరం తిరిగి ఉచ్చయ్య,పెంటయ్య వీధి గుండా స్వర్గపురికి వెళ్లాల్సి ఉంది. అయితే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లమ్మ సెంటర్ నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటివైపు మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి , డీఎస్పీ వీరారెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని ముందస్తు రూట్ మ్యాప్ ప్రకారం వాహనాన్ని మళ్లించారు. సంబంధిత కథనాలు.. ‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’ బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు ఒక మరణం.. అనేక అనుమానాలు కోడెల మృతికి చంద్రబాబే కారణం గ్రూపులు కట్టి వేధించారు.. -
చంద్రబాబులాంటి స్వార్థనేత మరెవరూ ఉండరు..
సాక్షి, గుంటూరు : ప్రపంచంలో చంద్రబాబు నాయుడు లాంటి స్వార్థనేత మరెవరు ఉండరని మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అవసరానికి వాడుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని వ్యాఖ్యానించారు. కోడెల మృతదేహంతో రాజకీయం చేయాలని చూశారని పిన్నెల్లి విమర్శించారు. బతికున్నప్పుడు పట్టించుకోకుండా చనిపోయాక చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
ముగిసిన కోడెల అంత్యక్రియలు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. గుంటురు జిల్లా నరసరావుపేటలో స్వర్గపురిలో కోడెల చితికి ఆయన కుమారుడు శివరామ్ నిప్పంటించారు. కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు తరలివచ్చారు. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు హాజరయ్యారు. హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ నుంచి కోడెల భౌతికాయాన్ని నిన్న రోడ్డు మార్గంలో గుంటూరుకు తరలించిన విషయం తెలిసిందే. నేతల నివాళి అనంతరం భౌతిక కాయాన్ని సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటకు తరలించారు. -
కోడెల కాల్ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ
సాక్షి, హైదరాబాద్/అమరావతి : టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై దర్యాప్తు కొనసాగుతోందని బంజారాహిల్స్ ఏసీపీ కే.శ్రీనివాసరావు వెల్లడించారు. అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 12 మందిని విచారించామని చెప్పారు. కోడెల కుంటుంబ సభ్యుల స్టేట్మెంట్లను రికార్డు చేశామని తెలిపారు. కోడెల భౌతిక కాయానికి సంబంధించి పోస్టుమార్టం పూర్తి నివేదిక ఇంకా అందలేదని పేర్కొన్నారు. కోడెల ఫోన్లోని కాల్‌డేటా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. సీడీఆర్ఏ కాల్ లిస్టు రిపోర్టును పరిశీలిస్తున్నామన్నారు. ఇక సోషల్ మీడియాలో కోడెల కాల్ డేటాపై వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. కోడెల కుమారుడు శివరామ్‌ను త్వరలోనే విచారిస్తామని ఏసీపీ స్పష్టం చేశారు. (చదవండి : ఒక మరణం.. అనేక అనుమానాలు) మొబైల్ ఇంకా దొరకలేదు.. కోడెల శివప్రసాదరావు మృతి కేసులో కీలకం కానున్న ఆయన మొబైల్ ఇంకా దొరకలేదని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. విచారణ కొనసాగుతోందని అన్నారు. ‘సత్తెనపల్లిలో కోడెల మేనల్లుడు కంచేటి సాయి ఇచ్చిన ఫిర్యాదు ఫ్యాక్స్ ద్వారా అందింది. న్యాయనిపుణుల సలహా తీసుకొని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు రికార్డు చేశాం. కోడెల కుమారుడు శివరాంతో పాటు కోడెల సన్నిహితులు మరికొంతమందిని విచారించాల్సి ఉంది. కోడెల కాల్ డేటాపై ఆరా తీస్తున్నాం. ఆయన ఎవరెవరితో మాట్లాడారు అనేది తెలిస్తే కేసులో పురోగతి లభిస్తుంది. కోడెల పోస్టుమార్టం రిపోర్టు, కాల్ డేటా, ఎఫ్ఎస్సెల్ రిపోర్ట్ అందాల్సి ఉంది’అన్నారు. (చదవండి : కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు) -
‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’
సాక్షి, విజయవాడ: టీడీపీలో కోడెల శివప్రసాదరావును చంద్రబాబు నాయుడు తీవ్ర అవమానాలకు గురిచేశారని బీజేపీ అధికార ప్రతినిధి కేవీ లక్ష్మీపతి రాజా ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల బీజేపీలోకి రావాలనుకున్న మాట వాస్తవమని స్పష్టం చేశారు. టీడీపీలో చంద్రబాబు అవమానాలకు గురిచేస్తున్నారని బీజేపీ నేతలతో కోడెల చెప్పారని, తనను కలవడానికి కనీసం చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన చెందినట్టు వెల్లడించారు. అమిత్ షాను కలిసేందుకు ఏర్పాటు చేయాలని కోడెల బీజేపీ నాయకులను కోరారని, కోడెల బీజేపీలో చేరికపై పార్టీలో చర్చ కూడా జరిగిందన్నారు. కోడెల చనిపోయిన తర్వాత చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని, గతంలో కోడెల ఆత్మహత్య ప్రయత్నం చేస్తే చంద్రబాబు కనీసం పరమర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదంలో కోడెలను వర్ల రామయ్యతో చంద్రబాబు తిట్టించారని ఆరోపించారు. శవ రాజకీయాలతో కోడెల ప్రతిష్ఠను మరింత దిగజార్చవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. కోడెల శివప్రసాదరావు ఉదంతాన్ని చూసైనా మిగిలిన టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వదలి బయటకు రావాలని లక్ష్మీపతి రాజా అన్నారు. కోడెల మరణంపై అనుమానాలు: రఘురామ్ టీడీపీలో కోడెల శివప్రసాదరావు అభద్రతా భావానికి గురయ్యారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురామ్ పేర్కొన్నారు. కష్టకాలంలో కోడెలకు చంద్రబాబు అండగా నిలబడలేదని, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆయనను వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. జీవితాంతం పార్టీ కోసం కష్టపడితే తనను చంద్రబాబు కాపాడలేదని కోడెల అన్నట్టు వెల్లడించారు. కోడెల మరణంపై అనేక అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధిత కథనాలు.. బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు ఒక మరణం.. అనేక అనుమానాలు కోడెల మృతికి చంద్రబాబే కారణం గ్రూపులు కట్టి వేధించారు.. -
అందుకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు
సాక్షి, అమరావతి : నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలువలేదన్న నిస్పృహతోనే కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తను కొనుగోలు చేసిన 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయకుండా కోడెలను వాడుకుని వదిలేశారని విమర్శించారు. కోడెల మరణాన్ని చంద్రబాబు రాజకీయం చేసి ఆయనకు ఆత్మశాంతి లేకుండా వేధిస్తున్నారని అన్నారు. చదవండి : కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు -
కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పీ రఘురాం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బీజేపీలో చేరాలనుకున్నారని.. దీనికి సంబంధించి ఆయన అమిత్ షాను కూడా కలవాలనుకున్నారని రఘురామ్ వెల్లడించారు. చంద్రబాబు తన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. నిజాయితీ గల వారికి పార్టీలో విలువ లేదని తనతో నెల రోజుల క్రితం ఫోన్లో మాట్లాడినప్పుడు కోడెల చెప్పారని రఘురాం తెలిపారు. ఈ విషయమై ‘సాక్షి’ టీవీతో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. నెలరోజుల క్రితం నాకు ఫోన్ చేశారు ‘నెల రోజుల క్రితం కోడెల శివప్రసాదరావు నాకు ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. అమిత్ షాని కలువాలని నాతో చెప్పారు. దీంతో హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాను. సమయం చూసుకొని ఢిల్లీకి వచ్చి బీజేపీ పెద్దలతో కలుస్తాననని ఆయన చెప్పారు. అందుకు నేను సరే సర్ అని చెప్పాను. కోడెల సుదీర్ఘంగా రాజకీయ అనుభవం గల వ్యక్తి. పల్నాటి రాజకీయాల్లో పెద్దమనిషి, పల్నాటి పులిగా పేరొందిన వ్యక్తి. డాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు సేవలందించారు. ఆయనను కోల్పోవడం ప్రజలకు బాధ కలిగించింది. మృతిని రాజకీయం చేయరాదు కోడెల మృతిని రాజకీయం చేయరాదు. పల్నాటి పులిగా పేరొందిన వ్యక్తి ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. వారం రోజుల కిందట బీజేపీలో నా కంటే సీనియర్ నాయకుడితో ఆయన టచ్‌లో ఉన్నారు. టీడీపీ అధినాయకత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును కోడెల జీర్ణించుకోలేకపోయారు. సన్ స్ట్రోక్ కూడా ఇబ్బంది పెట్టింది. రూపాయి ఆశించకుండా వైద్యం చేసిన వ్యక్తి.. తన పిల్లల మీద, తన మీద ఆరోపణలు రావడంతో బాధపడ్డారు. ఈ కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు అండగా నిలబడలేదు. కష్టసమయంలో పార్టీ తనను ప్రొటెక్ట్ చేయలేదన్న ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది. ఆయన పార్థీవదేహం ఉండగానే ఆయన మృతి పట్ల రాజకీయాలు చేయడం మంచి విషయం కాదు. చంద్రబాబు పట్టించుకోలేదు రాజకీయాల్లో కేసులు కొత్తకాదు. చిదంబరం, లాలూ, జయలలిత లాంటి వ్యక్తులు కేసులు ఎదుర్కొన్నారు. కేసులు పెట్టినంతమాత్రాన కోడెల భయపడతారని నేను అనుకోవడం లేదు. కష్ట సమయంలో పార్టీ నన్ను ఒంటరివాడిని చేసింది.. మద్దతు ఇవ్వలేదన్న ఆవేదన కోడెల మాటల్లో కనిపించింది. అందుకే బీజేపీలో చేరాలని అనుకున్నారేమో.. ఆరోపణలు వచ్చిన కష్టసమయంలో అండగా నిలబడకుండా చంద్రబాబు, అధినాయకత్వం తనను నిర్లక్ష్యం చేసిందని, పట్టించుకోలేదని ఆయన భావించారు. పార్టీ నేతలు కూడా తనపై విమర్శలు చేయడం ఆయనను బాధించింది. కోడెల విషయమై నేను చేసిన ట్వీట్ చూసి ఓ సీనియర్ జర్నలిస్టు కూడా నాతో మాట్లాడారు. మీరు చెప్పిన విషయం వాస్తవమేనని, పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని కోడెల తనతో బాధపడినట్టు ఆ జర్నలిస్టు చెప్పారు. పార్టీ అధినాయకత్వం తీరుతో ఆయన అభద్రతాభావానికి లోనయ్యారు. నిజాయితీపరులకు టీడీపీలో స్థానం లేదని కోడెల చెప్పారు. పార్టీ తనను ఏ విధంగానూ ప్రొటెక్ట్ చేయలేదని కోడెల అన్నారు. ఆయన మృతిపై దర్యాప్తు జరపాలి కోడెల పార్థీవదేహం ఉండగానే రాజకీయంగా రచ్చ చేయడం సరికాదు. ఇరురాష్ట్ర ప్రభుత్వాలు కోడెల మృతిపై సమగ్రమైన విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. కోడెల పర్సనల్ సెల్‌ఫోన్ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్టీ తీరుతో ఒంటరి భావనకు లోనైన కోడెల ఒక నెల కిందట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని, ఆస్పత్రిలో కూడా జాయిన్ అయ్యారని గతంలో కథనాలు వచ్చాయి. కోడెల మృతి విషయంలో అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరముంది. -
బాబువల్లే కోడెలకు క్షోభ
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆయన కుటుంబీకులు, టీడీపీ నేతలు, చంద్రబాబేనని సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచమైన ఎత్తుగడలతో శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కోడెలను చంద్రబాబు పదే పదే అవమానించారని, టీడీపీ నేత వర్ల రామయ్యతో ఆరోపణలు చేయించారని చెప్పారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా చంద్రబాబును కలుసుకోవడానికి అవకాశమే ఇవ్వలేదన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారని ప్రచారం కూడా చేయించారని విమర్శించారు. కోడెల ఆత్మహత్యకు కారణం కేసులు కానే కాదని, చంద్రబాబు తీరుతోనే మానసిక క్షోభకు గురయ్యారని తెలిపారు. శివప్రసాదరావు తమకు రాజకీయ ప్రత్యర్థే తప్ప వ్యక్తిగత ప్రత్యర్థి ఎంత మాత్రం కాదని, ఆయన చనిపోవాలని కోరుకునే మనస్తత్వం తమది కాదని అంబటి స్పష్టం చేశారు. పరామర్శించని చంద్రబాబు ఆగస్టు 23వ తేదీనే కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఆయన అల్లుడు లక్ష్మీ సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రిలో చేర్పించారని అంబటి తెలిపారు. అయితే దానిని బయటకు రానీయకుండా ఆయన బంధువులు, కుటుంబీకులు గుండె పోటు అని మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించారన్నారు. అప్పట్లో ఆస్పత్రికి అనేక మంది టీడీపీ వారు వెళ్లి పరామర్శించారని, అక్కడకు కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి నాలుగు సార్లు వచ్చి వెళ్లిన చంద్రబాబు.. కనీసం పరామర్శ చేయలేదని అంబటి దుయ్యబట్టారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మరో మాజీ మంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లి ‘మీరొకసారి పరామర్శించండి’ అని చంద్రబాబుకు సలహా ఇస్తే ‘నేను రాను’ అని తెగేసి చెప్పారన్నారు. కోడెలపై ఇటీవల వచ్చిన 19 కేసుల్లో ఎక్కువగా టీడీపీ వారు పెట్టినవేనని అంబటి తెలిపారు. -
గ్రూపులు కట్టి వేధించారు..
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి మాజీ సీఎం చంద్రబాబు వైఖరే కారణమని, పది రోజులుగా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వేధించారని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆరోపించారు. చివరికి హైదరాబాద్‌లో కలుద్దామని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయించి మానసిక క్షోభకు గురి చేశాడన్నారు. సోమవారమైనా అపాయింట్మెంట్ ఇస్తాడని ఉదయం 9.30 గంటల వరకు ఆయన వేచి చూశారని, అయితే హైదరాబాద్ నుంచి చంద్రబాబు విజయవాడ బయలుదేరాడని తెలుసుకున్న తర్వాత కోడెల ఉరివేసుకొని చనిపోయాడని చెప్పారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కోడెల మృతిపై శవ రాజకీయాలు చేయొద్దని చంద్రబాబును హెచ్చరించారు. కోడెల మరణంలో చంద్రబాబు పాత్రపై విచారణ చేసి ఆయన్ను ఏ1 ముద్దాయిగా చేర్చాలని, ఆయన కాల్‌డేటాను పరిశీలించి చంద్రబాబును కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించాడో బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కోడెలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. చంద్రబాబువి మొసలికన్నీరు.. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చినా చంద్రబాబు మాట విని కోడెల వారిపై అనర్హత వేటు వేయకుండా సహకరించారని కొడాలి నాని గుర్తు చేశారు. కోడెల కుమారుడిని పెట్టుకొని లోకేష్ కమీషన్లు తీసుకొని వాటాలు పంచుకున్నారన్నారు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులతో కోడెలపై విమర్శలు చేయించారని, సత్తెనపల్లిలో ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు తయారు చేశారని చెప్పారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మూడు రోజుల కిందట గుంటూరులో చంద్రబాబు సమావేశం నిర్వహించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆయన నమ్ముకున్న కుటుంబ సభ్యులు, పార్టీ, పార్టీ అధ్యక్షుడు వదిలించుకోవాలని చేసిన ప్రయత్నాలకు ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. -
కోడెల మృతికి చంద్రబాబే కారణం
సాక్షి, అమరావతి: బతికున్నప్పుడు హింసించడం, చనిపోయాక శవరాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని, అలాంటి నీచ రాజకీయాలు చేయడం వైఎస్సార్సీపీకి చేతకాదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి చంద్రబాబే పరోక్ష కారణమని ఆయన దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కోడెల మృతి బాధాకరమని, వైఎస్సార్సీపీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. కోడెల మరణవార్త విన్నవెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు అందరూ సంతాపం వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు మాత్రం ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర చేస్తున్నాడన్నారు. అంత సానుభూతి ఉన్నవ్యక్తే అయితే ఇటీవల కోడెల తీవ్ర అనారోగ్యానికి గురైతే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. శవం పక్కన నిలబడి రాజకీయమా? కోడెల శివప్రసాద్ మృతి చెందిన తరువాత శవం పక్కన నిలబడి శవరాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రెస్మీట్లు పెడుతూ అధికార పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కోడెలను మూడు నెలల నుంచి ఒక్కరోజు అయినా పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లలేదన్నారు. ఇబ్బందులు ఏమిటని అడగలేదన్నారు. పైగా కోడెలను అవమానించే రీతిలో సత్తెనపల్లి, నరసారావుపేటలో ఆయన వ్యతిరేక గ్రూపును ప్రోత్సహించి పార్టీ కార్యక్రమాలు మీరే చేపట్టండి అని వారికి ఆదేశాలు ఇవ్వడంతోనే కోడెల మానసికంగా కుంగిపోయారని తెలిపారు. కోడెల మృతికి ఒకపక్క ఆయన కొడుకు బాధ్యుడు అయితే.. పరోక్షంగా చంద్రబాబు కారణమన్నారు. కోడెల ఆయన కుమారుడు, కూతురు వల్లే చనిపోయాడని టీడీపీ నేతలే అంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కోడెల విషయమే కాదు.. ఏ అంశంలోనూ తప్పు లేకుండా ఎవరిపై కేసులు పెట్టేందుకు వైఎస్సార్సీపీ ఒప్పుకోదన్నారు. -
నేడు కోడెల అంత్యక్రియలు
సాక్షి, గుంటూరు/అమరావతి: శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో నరసరావుపేటలో నిర్వహించనున్నారు. కోడెల సోమవారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన భౌతికాయాన్ని మంగళవారం రోడ్డు మార్గంలో గుంటూరు తరలించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో అభిమానులు, టీడీపీ కార్యకర్తల సందర్శనార్థం కోడెల భౌతికకాయాన్ని ఉంచారు. మాజీ స్పీకర్‌కు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ, చినరాజప్ప, జవహర్‌తోపాటు పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. కోడెల తనయుడు కోడెల శివరామ్‌ను నాయకులు పరామర్శించారు. అనంతరం భౌతిక కాయాన్ని సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటలోని కోడెల నివాసానికి తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా కోడెల అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. బుధవారం కోడెల అంత్యక్రియల నేపథ్యంలో నరసరావుపేటలో అమలులో ఉన్న 144వ సెక్షన్లో మినహాయింపు ఇస్తున్నట్టు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ప్రకటించారు. -
ఒక మరణం.. అనేక అనుమానాలు
సాక్షి, అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన మరణాన్ని సైతం మభ్యపెట్టేందుకు సొంత మనుషులే ఎందుకు తాపత్రయపడుతున్నారు? ఆయన ఉరి వేసుకుని చనిపోతే గుండెపోటు అని.. ప్రమాదకర ఇంజక్షన్లు చేసుకున్నారంటూ మీడియాకు పరస్పర విరుద్ధమైన లీకులు ఎందుకిచ్చారు? కొనఊపిరితో ఉన్న ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? పైగా దూరంగా ఉన్న బవసతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లినట్లు?.. నేర స్థలంలో ఆధారాలు ఎందుకు చెరిగిపోయాయి?.. కోడెల వాడుతున్న సెల్‌ఫోన్ ఏమైపోయింది?.. ఆత్మహత్యకు ముందు 24 నిమిషాలపాటు ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడారు?.. ఇవీ కోడెల ఆత్మహత్యపై ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. కానీ, ఆయన ఆత్మహత్యను ఏ కోణంలో చూసినా.. కోడెల కుమారుడు, కుమార్తె చర్యలు, వాడుకుని కష్టకాలంలో వదిలేసిన సొంత పార్టీ వ్యవహారశైలి వైపే అందరి వేళ్లూ చూపిస్తున్నాయి. కోడెల మృతిచెందిన రోజున అసలేం జరిగింది అనే కోణంలో తెలంగాణ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ముందుగా కుటుంబ సభ్యుల తీరుపైనే అనుమానం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లిలో గడిచిన ఐదేళ్లలో కొడుకు శివరామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మి చేసిన వ్యవహారాలు తన పరువు తీశాయని ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్టు ప్రచారం జరుగుతోంది. పలు అంశాలపై కుమారుడు, కుమార్తెతో ఆయనకు తరచూ వాగ్వాదం జరిగేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న తనను పార్టీకి చెందిన కీలక నేతలు ఎవరూ పట్టించుకోకపోగా, పలకరింపే కరువైనట్లు ఆయన తన ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది? కోడెల ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ప్రధానంగా దృష్టిసారించారు. ఇప్పటికే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉ.9.30 గంటల వరకూ కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? కుటుంబ సభ్యులతో ఏదైనా వాగ్వాదం జరిగిందా? అనేది కీలకంగా మారింది. అలాగే, కొద్దిరోజుల క్రితం గుండెపోటు వచ్చిందని కోడెలను నరసరావుపేటలోని తన అల్లుడు ఆసుపత్రికి తరలించారు. నిజానికి ఆయన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఉరి వేసుకుని చనిపోతే మళ్లీ అదే గుండెపోటు కథను ఎందుకు నడిపించారు.. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో అన్న దానిపై వారు దృష్టిపెట్టారు. క్లూస్ టీం కోణమేంటి? కోడెల ఆత్మహత్య అనంతరం ఆయనను తొలుత బసవతారకం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాతే క్లూస్ టీం ఘటన స్థలాన్ని సందర్శించింది. కానీ, అప్పటికే నేరస్థలంలో కీలక ఆధారాలు లభించలేదని క్లూస్ బృందం చెబుతున్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు ఉపయోగించిన తాడు (గుడ్డతో చేసింది) ఘటన స్థలంలో కాకుండా వేరేచోట సేకరించినట్లు సమాచారం. ఉరి వేసుకున్నట్లుగా చెబుతున్న ఫ్యాన్ భాగం వంగి ఉంది. అయితే.. నేలభాగం, ఫ్యాను ఎత్తుని పోల్చిన క్లూస్ బృందం ఈ విషయంలో అనుమానం వ్యక్తంచేస్తోంది. కోడెల మంచం మీద నుంచి ఫ్యానుకు తాడు బిగించుకున్నారా? అదే నిజమైతే ఫ్యాన్ ఇంకా ఎక్కువగా వంగి ఉండాలని అంటున్నారు. అలాకాకుండా ఏదైనా స్టూల్ లేదా కుర్చి వేసుకున్నారా? అని సందేహిస్తున్నారు. కానీ, దీనికి బలం చేకూర్చే ఆనవాళ్లేమీ అక్కడ కన్పించలేదని క్లూస్ అధికారులు అంటున్నారు. ఇక కోడెల గదిలో ఎలాంటి లేఖ కన్పించలేదు. ఏదేమైనా ఫోరెన్సిక్ లేబొరేటరీ పరీక్షల ఆధారంగానే కోడెల మృతిపై నెలకొన్న సందేహాలు నివృత్తి అయ్యే వీలుందని దర్యాప్తు వర్గాలు అంటున్నాయి. కోడెల మృతదేహాన్ని ఆయన కుటుంబీకులు మంగళవారం ఉదయం స్వస్థలానికి తరలించారు. అలాగే, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నుల్ని ఆరా తీశారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ పరిశీలించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. ఆధారాలేమయ్యాయి? కోడెలది ఆత్మహత్యేనని శవపరీక్షలో ప్రాథమికంగా నిర్థారించినా, భిన్న కోణాల్లో వస్తున్న అనుమానాలపైనే దర్యాప్తు బృందాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరమే వాస్తవ పరిస్థితిపై పూర్తి అవగాహనకు రావడం సాధ్యమని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. క్లూస్ టీం వెళ్లే సమయానికే నేరస్థలం పూర్తిగా చెరిగిపోవడాన్ని గమనించిన అధికారులు కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించలేకపోయారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, క్లూస్ టీం.. శవ కాఠిన్యత విషయంలోనూ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి ఆయన మృతిపై కచ్చితమైన సమయాన్ని రికార్డు చేయడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని అధికారులు అంటున్నారు. ఆ ద్రవాలు ఏమిటి? భౌతిక ఆధారాలను బట్టి పోస్టుమార్టం వైద్యుడు ఆత్మహత్య అనే నిర్థారణకు వస్తారు. కానీ, విస్రా (కాలేయం, పేగులు, గుండె, మూత్ర పిండాలు)ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కచ్చితమైన ఆధారాలు లభిస్తాయి. విస్రాను ఫోరెన్సిక్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) టాక్సికాలజీ (విష పదార్థాల పరీక్ష) విభాగం పరిశీలించాల్సి ఉంటుంది. పోస్టుమార్టం చేసి, విస్రాను సేకరించిన వైద్యులు అల్పహారంతో పాటు, కొన్ని ద్రవాలు ఉన్నట్లు గుర్తించారని సమాచారం. దీన్నిబట్టి కోడెల అంతకుముందు ఏదైనా ద్రవ పదార్థం తీసుకున్నారా? తీసుకుంటే అదేంటి? అదేమైనా విషపూరితమైనదా? ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యుల మధ్యే ఉన్నందున దాన్నెలా తీసుకున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కోడెల ఫోన్ ఎక్కడ? కోడెల ఆత్మహత్యకు దారితీసిన కీలక ఆధారాలు తెలుసుకోవడంలో పోలీసులకు అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా సెల్‌ఫోన్ మిస్సింగ్ వ్యవహారం జఠిలంగా మారింది. చనిపోవడానికి ముందు ఎవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారు? అన్నది తేలడానికి కోడెల సెల్‌ఫోన్ ఒక్కటే ఆధారం. కానీ, అదిప్పుడు కనిపించడంలేదు. కుటుంబ సభ్యుల వద్ద ఉండి ఉంటుందని.. అంత్యక్రియల కార్యక్రమం పూర్తయ్యాక స్వాధీనం చేసుకుంటామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు.. కోడెల కాల్‌డేటాను దర్యాప్తు అధికారులు వెలికితీస్తున్నారు. చనిపోవడానికి ముందు ఆయన 24 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడినట్లు నిర్ధారణ అయ్యింది. అది ఎవరితో అనేది తెలియాల్సి ఉందన్నారు. వాట్సాప్ అకౌంట్ విశ్లేషణకూ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోడెల చివరిసారిగా సోమవారం ఉ.6.51 గంటలకు వాట్సాప్‌ను చూసినట్లు.. అలాగే, ట్రూకాలర్‌ను ఆదివారం చూసినట్లు అధికారులు గుర్తించారు. ఆవేశంలోనే ఆత్మహత్య? సాధారణంగా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే కారణాలను వివరిస్తూ సూసైడ్ నోట్ రాస్తారని.. కానీ, కోడెల ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అంటే అప్పటికప్పుడు మాట్లాడిన ఫోన్‌కాల్ కారణంగానో, కుటుంబ సభ్యుల వివాదంతోనో ఆవేశంగా ఆయన ఆత్మహత్య నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ఆ అధికారి విశ్లేషించారు. -
కోడెల మృతి.. రఘురామ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఢిల్లీలో ఆ పార్టీ కో–ఆర్డినేటర్ పురిఘళ్ల రఘురామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తనకు ఎటువంటి విలువ ఇవ్వకపోవడం పట్ల కోడెల తీవ్ర మనోవేదనకు గురయ్యారని, నెలరోజుల క్రితం ఆయన తనకు ఫోన్ చేసి మనసులోని ఆవేదనను తనతో పంచుకున్నారని, ఇంతలోనే ఆయన ఇలా మృతి చెందడం ఎంతో బాధ కలిగిస్తోందని రఘురాం అన్నారు. కోడెల మృతిపై రఘురామ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తనతో మాట్లాడిన సందర్భంగా మాజీ స్పీకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని, నిజాయితీతో పనిచేసే నాయకులకు టీడీపీలో విలువలేదని చెప్పారని బీజేపీ నేత తెలిపారు. పార్టీలో తనను పూర్తిగా ఒంటరిని చేయడం మానసిక క్షోభను కలిగిస్తోందని ఆయన చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరుతానని కోడెల అంటూ.. అమిత్ షాను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారని రఘురామ్ వివరించారు. అయితే అమిత్ షాను కలువకుండానే కోడెల మృతి చెందడం దురదృష్టకరమన్నారు. మాజీ స్పీకర్ మృతిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సమగ్ర దర్యాప్తు చేయించాలని పురిఘళ్ల డిమాండ్ చేశారు. -
కోడెల మృతి వెనుక మిస్టరీ ఉంది...
సాక్షి, తాడేపల్లి: పార్టీ సీనియర్ నేత మరణిస్తే టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కోడెల శివప్రసాదరావు మృతి వెనక మిస్టరీ ఉంది. ఆయన మృతికి కుటుంబసభ్యులు, టీడీపీనే కారణం. కోడెలపై కేసులు పెట్టింది టీడీపీ నేతలే. మేం కాదు. పల్నాటి పులి అనే వ్యక్తి ఎందుకు ఉరేసుకున్నాడు?. చంద్రబాబు తీరువల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల రాజకీయ వారసుల్ని ప్రకటించాలి కోడెల ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎందుకొచ్చాయి. గతంలో ఆయన ఆస్పత్రిలో ఉంటే చంద్రబాబు ఒక్కసారి కూడా పరామర్శించలేదు. అంతేకాదు.. కోడెలపై సొంత పార్టీ నేత వర్ల రామయ్యతో ఆరోపణలు చేయించారు. సత్తెనపల్లిలో కోడెలను అవమానించింది చంద్రబాబే. ఎన్నిసార్లు ప్రయత్నించినా కోడెలకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. త్వరలోనే కోడెలను సస్పెండ్ చేయబోతున్నామని.. చంద్రబాబు ప్రచారం చేయించారు. బాబుకు ప్రేమ ఉంటే కోడెల రాజకీయ వారసులను ప్రకటించాలి. సత్తెనపల్లి నుంచి కూతుర్ని, నర్సరావుపేట నుంచి కొడుకుని రాజకీయ వారసులుగా ప్రకటించండి. కోడెల అంత పిరికివారు కాదు.. కోడెల మరణాన్ని వైఎస్సార్ సీపీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారు. కోడెల మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. రాజకీయ ప్రత్యర్థి చనిపోవాలని ఎవరు అనుకోరు. పెద్ద పెద్ద కేసులను ఎదుర్కొన్న వ్యక్తి ఆయన. ఎన్నో సంక్షోభాలను కోడెల చూశారు. గతంలో సీబీఐ విచారణ జరిగినా భయపడలేదు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. కోడెల ఎందుకు ఉరి వేసుకున్నాడో ప్రజల్లో చర్చ జరగాలి. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. కోడెల మరణానికి కారణం మొదటిది ఆయన కుటుంబ సభ్యులు, రెండోది తెలుగుదేశం పార్టీనే. కోడెలకు టీడీపీ వాళ్లు ఒక్కరైనా అండగా నిలిచారా?. కోడెలను ఎందుకు పరామర్శించలేదు గతంలో ఆయన ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పుడు గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. కోడెల ఆత్మహత్యాయత్నం చేస్తే నాలుగుసార్లు గుంటూరు వచ్చిన చంద్రబాబు కనీసం కోడెలను పరామర్శించలేదు. సత్తెనపల్లిలో ఆయనను దారుణంగా అవమానించారు. చంద్రబాబు ఎవరినైనా వాడుకొని వదిలేస్తారు. కోడెల పార్థివ దేహం పక్కన పెట్టుకుని వైఎస్సార్ సీపీపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకు శవ రాజకీయాలు చేయడం అలవాటుగా మారింది. ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబు కాదా?. హరికృష్ణ మానసిక క్షోభకు ఆయన కారణం కాదా?. గతంలో ఎమ్మెల్యే రోజా మీద, మా మీద ఎన్నో కేసులు చంద్రబాబు పెట్టారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని రన్‌వే మీదే అడ్డుకున్నారు. కోడెల మరణంపై విచారణ జరిగినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.’ అని ఎమ్మెల్యే అంబటి స్పష్టం చేశారు. చదవండి: కోడెల ఫోన్ నుంచి ఆ టైమ్‌లో చివరి కాల్.. కోడెల కాల్‌డేటాపై విచారణ జరపాలి అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిపై బాబు రాజకీయం! కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
‘చంద్రబాబు వల్లే కోడెల మృతి’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు పెట్టిన అవమానాలతోనే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణించారని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎక్కడా ఉద్దేశ్యపూర్వకంగా కోడెలపై కేసులు పెట్టలేదన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా కోడెలకు చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నామన్నారు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులు కోడెలను దూషించడం వెనుక చంద్రబాబు పాత్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సొంత మామ ఎన్టీఆర్, రంగా లాంటి వ్యక్తుల మరణం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని అందరికి తెలిసిన విషయమేనని రోజా విమర్శించారు. చదవండి : కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల ఫోన్ నుంచి ఆ టైమ్‌లో చివరి కాల్..
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు గత కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించారు. కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డ వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8:30కి కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా కోడెల ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరి నుంచి ఆయనకు కాల్స్ వచ్చాయనేదానిపై దృష్టి సారించారు. కోడెల నివాసంలో వేలిముద్రలను క్లూస్ టీమ్ సేకరించింది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసులో పురోగతి వచ్చేఅవకాశముందని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ లిఖితపూర్వకంగా నమోదు చేశామని, అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కోడెల పర్సనల్ మొబైల్ మిస్సింగ్ కోడెల శివప్రసాదరావు వ్యక్తిగత మొబైల్ కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల కూతురు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల చివరగా 24 నిమిషాలు ఫోన్ మాట్లాడినట్లు కాల్‌డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం 5 గంటలకు కోడెల సెల్‌ఫోన్ స్విచాఫ్ అయినట్లు కనుగొన్నారు. ఫోన్‌ను ఎవరైనా దొంగిలించారా, దాచిపెట్టారా అనేది దర్యాప్తులో తేలనుంది. కాగా, కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి గుంటూరు జిల్లా నరసరావుపేటలో రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆదేశించారు. కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి ఈ మధ్యాహ్నం గుంటూరుకు తీసుకొచ్చారు. మరోవైపు కోడెల కుమారుడు శివరామ్ విదేశాల నుంచి గుంటూరు చేరుకున్నారు. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కొడుకే వేధించాడు: కోడెల బంధువు కోడెల మృతిపై బాబు రాజకీయం! ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు -
కోడెల మృతి బాధాకరం: ధర్మాన కృష్ణదాస్
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి బాధాకరమని ఏపీ ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కోడెల మృతిపై ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంగళవారం ధర్మాన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీకే చెందిన నేత మృతిని ఇలా రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. కోడెల మరణంపై చంద్రబాబు రాజకీయం చేయడం తగదని అభిప్రాయపడ్డారు. కుటుంబంలో నెలకొన్న భేదాభిప్రాయాల కారణంగానే కోడెల బలవన్మరణం పొందారని స్వయానా అతని మేనల్లుడే పోలీసులకు ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా ధర్మాన పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించిందని, కొద్ది రోజుల్లో వాస్తవాలు వెలువడతాయని ఆయన తెలిపారు. -
అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆదేశాలిచ్చారు. కాగా, కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు తరలిస్తున్నారు. కార్యకర్తల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఈ మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఉంచనున్నారు. రేపు (బుధవారం) నరసరావుపేటలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సోమవారం హైదరాబాద్‌లో అనుమానాస్పదరీతిలో కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కొడుకే వేధించాడు: కోడెల బంధువు కోడెల మృతిపై బాబు రాజకీయం! ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు -
కోడెల కాల్‌డేటాపై విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్షసారింపు చర్యలకు పాల్పడట్లేదని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి చంద్రబాబు నాయుడే పరోక్ష కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. పదిరోజుల పాటు చంద్రబాబు కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నామన్నారు. నిన్న ఉదయం 9 గంటల వరకు కూడా చంద్రబాబతో భేటీకి కోడెల ప్రయత్నించారని, దానికి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని మంత్రి పేర్కొన్నారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ప్రభుత్వం కేసులు పెడితే పోరాడే తత్వం కలిగిన వ్యక్తిఅని వ్యాఖ్యానించారు. కోడెలను ప్రభుత్వం వేధించిందంటూ చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఫర్నిచర్, బిల్డర్లు కేసు కానీ ప్రభుత్వం పెట్టింది కాదని.. అసెంబ్లీ ఫర్నిచర్ తన ఇంట్లో ఉందని శివప్రసాద్ అంగీకరించినట్లు మంత్రి గుర్తుచేశారు. పల్నాడు పులి.. మరి ఎందుకు అడ్డుకున్నారు? మంగళవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మట్లాడారు. ‘ఏ కేసులోను ప్రభుత్వం కోడెలకు, ఆయన కొడుకు, కుతుర్లకు ఎలాంటి నోటీస్‌లు ఇవ్వలేదు. ఆయన్ని చంద్రబాబే వదిలించుకునేలా వ్యవహరించారు. కోడెలను పార్టీలో దూరం పెట్టి అవమానించారు. అసెంబ్లీ ఫర్నిచర్ కేసులో వర్ల రామయ్యతో విమర్శలు చేయించారు. అందుకే కోడెల లాంటి వ్యక్తి అలాంటి చర్యకు పాల్పడ్డారు. 1999 లో బాంబుల కేసు విచారణ చేసి అవమానించింది చంద్రబాబు కాదా..? 2014 లో కోడెల పుట్టిన నరసరవు పేట సీటు కాదని సత్తెనపల్లి పంపి అవమానించింది చంద్రబాబు కాదా..? తరువాత మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించలేదా.? పల్నాడు పులి అని ఈరోజు చెప్తున్న చంద్రబాబు. మరి కోడెలను పల్నాడు రాకుండా ఎందుకు అడ్డకున్నారు. కోడెల కాల్‌డేటాను విచారించాలి కోడెలకు వ్యతిరేకంగా సత్తెనపల్లి లో వర్గాన్ని తయారు చేసింది ఎవరు..? ఇప్పుడు కోడెల మృతదేహం వద్ద కూర్చుని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎన్టీఆర్‌ని కూడా ఇలానే క్షోభకు గురి చేసి చంపించి తరువాత శవం వద్ద మొసలి కన్నీరు కార్చారు. కోడెలను ప్రభుత్వం వేధిస్తోందంటూ.. ఈ 3 నెలల్లో ఎప్పుడయినా చంద్రబాబు మాట్లాడారా..? ఆయనకు మద్దతుగా ఎవ్వరిని మాట్లాడనివ్వ లేదు. చంద్రబాబు కోడెలను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి వేధించారు. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్‌డేటాను విచారించాలి. ఇందులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలి’ అని అన్నారు. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెలకు బాబు అపాయింట్మెంట్ ఎందుకివ్వలేదు
-
‘టీడీపీలోనే కోడెలకు అవమానాలు’
సాక్షి, అమరావతి: టీడీపీలో ఎదురైన అనేక అవమానాలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర మనోవేదనకు గురయ్యారని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గత రెండు నెలలుగా కోడెల అనారోగ్యంతో బాధపడుతున్నా.. చంద్రబాబు కనీసం పరామర్శించలేదని గుర్తుచేశారు. ఛలో ఆత్మకూరుకు కోడెల వస్తానంటే టీడీపీ నేతలు ఆయన్ని ఆడ్డుకున్నారని, వర్గ రామయ్య కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నేతల అవమానాలు భరించలేకే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ.. శవ రాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల మరణం చాలా బాధాకరమన్న ఆయన.. చంద్రబాబు వేధింపుల కారణంగానే కోడెల మృతి చెందారని ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు చేస్తోందని.. ఓ వర్గాన్ని మాత్రమే చంద్రబాబు పోత్రహిస్తూ కోడెలను అవమానానికి గురిచేశారని పేర్కొన్నారు. కోడెలపై ప్రభుత్వం కేసులు పెట్టలేదని, కేవలం బాధితులు మాత్రమే పెట్టారని ఆయన స్పష్టం చేశారు. ‘ఎన్నికల అనంతరం కోడెల అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలల్లో కనీసం ఒక్కసారి కూడా చంద్రబాబు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయలేదు. బతికున్నప్పుడు మనుషులను వేధించడం చంద్రబాబుకు బాగా తెలుసు. చనిపోయిన తరువాత శవ రాజకీయాలను చేయడం ఆయనకు ఎంతో సులువు. ఎన్టీఆర్, హరికృష్ణ మరణం సమయంలో ఇలాంటివి చూశాం. కోడెల మృతికి పరోక్షంగా చంద్రబాబే కారణం. ఆయన పెట్టిన మానసిక వేధింపుల కారణంగానే కోడెల మరణించారు. ఉరేసుకున్నారని, గుండెపోటు వచ్చిందని అయన మరణంపై టీడీపీ నేతలే అనేక వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించిన తొలి వ్యక్తి చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్షన్ విపరీతంగా పెరిగింది. ఎన్నో హత్యలు చేయించారు. చెరుకుపాటి నారాయణరావును హత్య చేసింది టీడీపీ కాదా?. కోడెల మరణం పట్ల వైఎస్సార్సీపీ తరఫున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
శవరాజకీయాలు చేయటం బాబుకు అలవాటు
-
కోడెల ఆత్మహత్య
-
అన్నీ అనుమానాలే!
-
ఆది నుంచి వివాదాలే!
సాక్షి, గుంటూరు: టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2వ తేదీన సంజీవయ్య, లక్మీనర్సమ్మ దంపతులకు జన్మించారు. కోడెల భార్య శశికళ గృహిణి. వీరికి విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ సంతానం. కోడెల తోబుట్టువులు చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోవడం డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. కోడెల ప్రముఖ వైద్యుడిగా నరసరావుపేట ప్రాంతంలో పేరుపొందారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఆది నుంచి వివాదాలతోనే సాగింది.1999 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరసరావుపేటలోని కోడెల నివాసంలో బాంబులు పేలి నలుగురు మృత్యువాత పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. కోడెల హోంమంత్రిగా ఉన్న సమయంలోనే విజయవాడలో వంగవీటి మోహనరంగా దారుణ హత్య జరిగింది. ఈ కారణంగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. స్థానికంగా ఆదరణ, పట్టు కోల్పోవడం, రెండు సార్లు ఓటమి పాలవడంతో 2014ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నియోజకవర్గానికి వలస వెళ్లారు. అక్కడి నుంచి గెలుపొంది ఏపీ తొలి శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. -
కోడెల మృతిపై బాబు రాజకీయం!
సాక్షి, అమరావతి: ‘కే ట్యాక్స్’పై సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో బాధితుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడం, అసెంబ్లీ నుంచి ఫర్నిచర్ తరలించిన విషయాన్ని స్వయంగా కోడెల అంగీకరించడం, ఇతర అవినీతి వ్యవహారాలన్నీ నిజమేనని తేలడంతో ఇన్నాళ్లూ నోరు మెదపని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు రాజకీయ వేధింపుల వల్లే కోడెల మృతి చెందినట్లు ఆరోపణలకు దిగటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మూడు నెలలుగా కోడెల అవినీతి వ్యవహారాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా చంద్రబాబు, టీడీపీ నేతలు ఏరోజూ స్పందించే ప్రయత్నం చేయలేదు. కానీ కోడెల మృతి చెందగానే వెంటనే రంగంలోకి దిగి రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయడంపై అంతా విస్తుపోతున్నారు. గుండెపోటుకు గురైనా పరామర్శించని వైనం.. వాస్తవానికి కోడెలను కానీ ఆయన కుమారుడుని కానీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఇన్ని కేసులున్నా కనీసం విచారణకు సైతం పోలీసులు పిలవలేదు. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులే కోడెల ట్యాక్స్‌పై కేసులు పెట్టడం, అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపుతోపాటు కోడెల కుమారుడు, కుమార్తె స్కాములు భారీగా బయటపడ్డాయి. ఇవన్నీ నిజమేనని తెలియడంతో చంద్రబాబు ఇన్నాళ్లూ నోరు మెదపకుండా మిన్నకుండిపోయారు. నెల రోజుల క్రితం కోడెల గుండెపోటుకు గురైనా చంద్రబాబు కనీసం పరామర్శించలేదు. కోడెలతో ఫోన్లో మాట్లాడేందుకు సైతం ఇష్టపడలేదు. సత్తెనపల్లి నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇన్చార్జిని నియమించేందుకు కూడా కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కోడెల అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో చంద్రబాబు రూటు మార్చేశారు. వేధింపులంటూ చనిపోయాక రాజకీయాలు కోడెల అవినీతి నిజమేనని స్పష్టమవడంతో ఆయన్ను పక్కన పెట్టిన చంద్రబాబు చనిపోయాక రాజకీయాలు చేయడం చర్చనీయాంశమైంది. కోడెల కుటుంబం అరాచకాలకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడమే తప్ప ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు వ్యవహారంలో హైకోర్టులోనే వాస్తవాలు బహిర్గతమవగా కోడెల స్వయంగా తాను వాటిని ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఎవరూ కోడెలకు మద్దతుగా మాట్లాడే సాహసం చేయలేదు. కానీ ఆయన మృతి చెందిన తర్వాత ఉన్నట్టుండి రాజకీయ వేధింపులని గగ్గోలు పెడుతుండడం గమనార్హం. నిజంగా కోడెలపై రాజకీయ వేధింపులుంటే ఈపాటికి చంద్రబాబు చేసే రచ్చను ఊహించలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునే చంద్రబాబు ఇటీవల గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఒక కుటుంబం మధ్య జరిగిన గొడవపై జాతీయ స్థాయిలో హడావుడి చేసిన విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబు కోడెల ఉదంతంలో ఇన్నాళ్లూ గప్‌చుప్‌గా ఉండడానికి ఆయన అవినీతి నిజమేనని తేలడమే కారణం. మృతిపై పలు అనుమానాలు.. కోడెల కుటుంబంలో కలహాలు కూడా చంద్రబాబు దృష్టికి ఎప్పుడో వెళ్లాయి. ఆయన కుమారుడు, కుమార్తె అవినీతి వ్యవహారాలపై చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడే చాలామంది ఫిర్యాదులు చేశారు. కోడెల కుమారుడి వ్యవహార శైలి బాగోలేదని స్వయంగా చంద్రబాబు పలుసార్లు అంతర్గత సమావేశాల్లో హెచ్చరించారు. ఇప్పుడు కోడెల మృతికి ఆయన కుమారుడే కారణమని ఆయన మేనల్లుడు సాయి అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మృతి చెందిన తర్వాత కోడెలను బసవతారకం ఆస్పత్రికి తరలించడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ కప్పిపుచ్చి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. కోడెల అవినీతి వ్యవహారాలు, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలపై మాట్లాడలేక చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు కొడుకే వేధించాడు: కోడెల బంధువు -
కొడుకే వేధించాడు: కోడెల బంధువు
సత్తెనపల్లి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు చెబుతున్న తరుణంలో ఆయన కుమారుడు కోడెల శివరామే తీవ్రంగా వేధించాడని మృతుని సమీప బంధువు కంచేటి సాయిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోడెల శివరామ్ నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు నా కొడుకు నుంచే నాకు ప్రాణహాని ఉంది’ అని గత నెలలో శివప్రసాదరావు తనతో ఫోన్లో పలుమార్లు ఆందోన వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ విషయం తనతో వ్యక్తిగతంగా కూడా చెప్పారన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. కోడెల మృతిని టీడీపీ నేతలు రాజకీయం చేస్తూ.. వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్న నేపథ్యంలో సాయిబాబు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను గుంటూరు జిల్లా క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన వాడినని, వ్యాపార రీత్యా గుంటూరులో నివసిస్తున్నానని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో మరణించిన కోడెల శివప్రసాదరావు తనకు మేనమామ కుమారుడన్నారు. ఆగస్టు నెలలో శివప్రసాదరాడు సెల్ నంబర్ 9848005923 నుంచి తన నంబర్ 6305322989కు పలుమార్లు ఫోన్లు చేసి కుమారుడు కోడెల శివరామ్ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పాడన్నారు. కోడెల మృతికి ఆయన కుమారుడే కారణమంటూ.. పోలీసులకు కోడెల బంధువు కంచేటి సాయిబాబు ఇచ్చిన ఫిర్యాదు కుమారుడి బారి నుంచి కాపాడాలని కోరారు ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని శివప్రసాదరావు తనతో ఆవేదన పంచుకున్నాడని సాయిబాబు చెప్పారు. తనతో నాలుగు సార్లు వ్యక్తిగతంగా కూడా కోడెల అదే విషయం చెప్పారని వివరించారు. తన కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతని బారి నుంచి తనను కాపాడాలని కోరారన్నారు. దీంతో తాను శివరామ్‌కు పలుమార్లు ఫోన్ చేసి శివప్రసాదరావును ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించానన్నారు. శివరామ్‌ను కలిసి మాట్లాడదామని ప్రయత్నిస్తే.. అతను కుదరదని చెప్పాడన్నారు. ఇప్పుడు కోడెల మృతి విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కోడెల మృతిపై తనకు అనుమానం ఉందన్నారు. అతని కుమారుడే చంపి లేదా చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి యత్నిస్తున్నాడని చెప్పారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ జరిపించి, ఆయన మరణానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కోడెల మృతిపై బాబు రాజకీయం! ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు -
మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు(72) సోమవారం హైదరాబాద్‌లో అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. బంజారాహిల్స్ రోడ్ నెం.7లో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే కోడెల శవమై కనిపించారు. ఆయన ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతుండగా హైదరాబాద్ పోలీసులు మాత్రం దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావ్ నేతృత్వంలోని బృందాలు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. అలసటగా ఉందంటూ గడియ పెట్టుకుని.. జూబ్లీహిల్స్‌లోని ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో అద్దెకు ఉండే కోడెల శివప్రసాదరావు కొన్నాళ్ల క్రితమే రోడ్ నెం.7లోని నివాసానికి మారారు. ఇరాన్ కాన్సులేట్ సమీపంలోని మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ ఇంటి పక్కన ఆయన బంధువుకు చెందిన డూప్లెక్స్ ఇంట్లో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం గుండెపోటుకు గురైన శివప్రసాదరావు వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే బంజారాహిల్స్‌లోని అద్దె ఇంటికి మారారు. సోమవారం ఉదయం నిద్ర లేచిన అనంతరం దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మితో కలసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం అలసటగా ఉందంటూ మొదటి అంతస్తులో ఉన్న పడక గదిలోకి వెళ్లి లోపల నుంచి తలుపు గడియ పెట్టుకున్నారు. 108 సిబ్బంది వివరాలు కోరటంతో ఫోన్ కట్ చేసి... తన తల్లిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమైన విజయలక్ష్మి ఆ విషయం చెప్పేందుకు మొదటి అంతస్తులోని కోడెల గది వద్దకు ఉదయం 10.20 గంటల సమయంలో వెళ్లారు. ఎంతసేపటికీ స్పందన లేకపోవడంతో పక్కనే ఉన్న కిటికీ నుంచి చూశారు. తన తండ్రి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో గేటు వద్ద ఉన్న గన్‌మెన్ ఆదాం, డ్రైవర్ ప్రసాద్‌లను పిలిచారు. అదే సమయంలో అక్కడ ఉన్న మరో ముగ్గురు కూడా వారితో పాటు మొదటి అంతస్తులోకి వెళ్లారు. వరండా ద్వారా గది వెనుక వైపు ఉన్న కిటికీ సమీపంలోకి చేరుకుని గ్రిల్స్ పక్కకు జరపడం ద్వారా లోపలకు ప్రవేశించి తలుపు తీశారు. డ్రైవర్ ప్రసాద్ ‘108’కు కాల్ చేయగా కొన్ని వివరాలు కోరడంతో ఫోన్ కట్ చేసి బసవతారం కేన్సర్ ఆస్పత్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అనంతరం తమ కారులోనే కోడెలను బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తరలించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో పలు పరీక్షలు... అపస్మారక స్థితిలో ఉన్న కోడెలను 11.35 గంటలకు ఆస్పత్రికి తీసుకురాగా తాము పలు పరీక్షలు జరిపినట్లు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ చెప్పారు. సుమారు గంట పాటు ఆయనకు వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, 12.39 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని మెడికల్ బులెటెన్‌లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ ఆర్వి.ప్రభాకర్‌రావు తెలిపారు. కోడెల భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మధ్యాహ్నం 2.50 గంటలకు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. కోడెల భార్య, కుమార్తె, డ్రైవర్, గన్‌మెన్ నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పలువురు ప్రముఖుల నివాళులు బసవతారకం ఆస్పత్రి ఎంఐసీలో ఉన్న కోడెల పార్థివదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, నాగం జనార్ధన్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఆరెకపూడి గాంధీ, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు కోడెల భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. తాడుతోనా.. కేబుల్ వైరుతోనా? తన తండ్రి ధోవతిని చింపి తాడుగా చేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు విజయలక్ష్మి పోలీసులకు తెలిపారు. దాదాపు నాలుగైదు ముడులతో ఉన్న తాడు అక్కడ లభించిందని, అయితే కేబుల్ వైరుతో ఉరి వేసుకున్నట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఘటన అనంతరం కోడెల నివాసానికి చేరుకున్న క్లూస్ టీమ్ పలు ఆధారాలు సేకరించింది. ఆయన ఉరి వేసుకున్న ఫ్యాన్ ఒంగిపోవడాన్ని గుర్తించింది. -
సీనియర్ నేత మరణించాడనే బాధ కూడ టీడీపీ నేతలకు లేదు
-
పోస్ట్‌మార్టం నివేదిక వస్తే నిజాలు తెలుస్తాయి: టీఎస్ రావు
-
ఇది నమ్మలేని నిజం
-
కోడెల మృతిపై బంధువుల అనుమానం
-
‘టీడీపీ నేతలవి బురద రాజకీయాలు’
సాక్షి, విజయవాడ : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి విషయంలో ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. విజయవాడలో సోమవారం జరిగిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు సిగ్గులేకుండా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, బుద్ది లేకుండా ప్రభుత్వ హత్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోడెల మరణానికి ఆయన కుటుంబ సభ్యులే కారణమని ఆయన బంధువులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలవి బురద రాజకీయాలని, ప్రభుత్వం కోడెలపై ఎలాంటి తప్పుడు కేసులు పెట్టలేదని అన్నారు. స్థానిక ప్రజలే ఆయనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని, కోడెలను ప్రభుత్వం ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే వైఎస్సార్సీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు కూడా టీడీపీ నేతల విమర్శలను ఖండించారు. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీపై బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని అన్నారు. టీడీపీ సీనియర్ నేత మరణించాడనే బాధ కూడ నేతలకు లేదన్నారు. అయిన కోడెల మరణానికి కుటుంబ సభ్యలే కారణమని ఆయన మేనల్లుడు సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాక కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. టీడీపీ నేతలవి శవ రాజకీయాలని, విచారణలో అన్ని విషయాలు బయట పడతాయన్నారు. కోడెల మరణం బాధకరమని మంత్రి పేర్కొన్నారు. -
కోడెల మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు మంగళవారం నర్సరావుపేటలో జరగనున్నాయి. మరోవైపు కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తియింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియను పోలీసులు వీడియో రికార్డు చేశారు. అలాగే కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించగా, ఆయన చెవుల దగ్గర నుంచి గొంతు మీదగా ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్‌కు కోడెల భౌతికకాయం పోస్ట్‌మార్టం అనంతరం భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. టీడీపీ నేతలు ట్రస్ట్ భవన్ చేరుకుని, కోడెలకు నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ రాత్రి అక్కడే ఉంచి, రేపు (మంగళవారం) ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్‌లో కోడెల పార్దీవదేహంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకష్ రోడ్డు మార్గంలో బయల్దేరనున్నారు. సూర్యాపేట, విజయవాడ మీదగా మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సందర్శకుల కోసం కొద్దిసేపు ఉంచి, అనంతరం నర్సరావుపేట తీసుకు వెళతారు. మరోవైపు కోడెల అనుమానాస్పద మృతిపై బంజారాహిల్స్ ఏపీసీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. సిట్ బృందం కోడెల నివాసంలో తనిఖీలు నిర్వహించి, ప్రత్యక్ష సాక్షులు, సెక్యూరిటీ, డ్రైవర్‌ను ప్రశ్నించారు. క్లూస్ టీమ్ కూడా పలు ఆధారాలను సేకరించింది. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ఆయన సమీప బంధువు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఈ హత్య చేశాడని ఆరోపించారు. ఈ మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. శివారామ్ తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్ తనతో అనేకసార్లు చెప్పినట్లు సాయి తెలిపారు. ఆయనకు ఆత్మహత్య చేసుకునే అవసరం, బాధలేదని శివరామే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.. ‘గత ఆగస్టులో కోడెల శివప్రసాద్ నాకు పలుమార్లు ఫోన్ చేశారు. తన కమారుడైన శివరాం తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన ఆస్తులను శివరామ్ పేరుమీదకు మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని తన ఆవేదనను నాతో పంచుకున్నారు. శివరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని నన్ను వేడుకున్నారు. తరువాత నేనే స్వయంగా శివరామ్‌కు ఫోన్ చేసి తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని అనేక సార్లు హెచ్చరించాను. ఈరోజు ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శివప్రసాద్‌ను శివరామే హత్య చేశాడు. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. కాగా మాజీ స్పీకర్ కోడెల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుండెపోటు మృతి చెందితే.. అపోలో, కేర్ హాస్పిటల్‌కు తీసుకువెళ్తారు. కానీ బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఎందుకు తీసుకెళ్లారంటూ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పలువురు మాత్రం ఆయన ఉరేసుకుని మృతిచెందారంటూ చెబుతున్నారు. శవపరీక్షల నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించగా.. మరిన్ని విషయాలు రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తాయని అధికారులు తెలిపారు. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!
-
కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రజలకు, పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి ఆకస్మిక మరణం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. కోడెల మరణం పార్టీకి తీరని లోటన్న బాలకృష్ణ... కోడెలను బతికించడానికి వైద్యులు ఎంతో ప్రయత్నించారని.. కానీ ఫలితం దక్కలేదని వాపోయారు. క్యాన్సర్ చికిత్స అభివృద్ధికి కోడెల ఎంతో కృషి చేశారని బాలయ్య గుర్తు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే కోడెల మరణం వెనక ఉన్న అసలు నిజాలు తెలుస్తాయన్నారు బాలకృష్ణ. నివేదిక వస్తే నిజాలు తెలుస్తాయి: టీఎస్ రావు సోమవారం ఉదయం 11.37గంటలకు కోడెలను ఆస్పత్రికి తీసుకువచ్చారని బసవతారకం మెడికల్ డైరెక్టర్ టీఎస్ రావు తెలిపారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని.. పల్స్ కూడా పడిపోయిందన్నారు. కోడెలను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేశామన్నారు. మధ్యాహ్నం 12.39గంటలకు కోడెల మరణించినట్లు ధృవీకరించామన్నారు. అప్పుడే ఆయన ఆత్మహత్య చేసుకున్న ఆనవాలు గుర్తించామని.. దాంతో పోస్ట్‌మార్టం నిమిత్తం కోడెల మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిచామని టీఎస్ రావు పేర్కొన్నారు. చదవండి: కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? -
మూడు బృందాలతో దర్యాప్తు: సీపీ అంజనీకుమార్
-
కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోడెల మరణం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. కోడెల మరణంపై క్షణక్షణం అనేక వార్తలు మారుతూ వస్తున్నాయని, ఆయన మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని సందేహం వ్యక్తం చేశారు. ఈ టీవీ న్యూస్ ఛానల్లో గుండెపోటు అని వార్తలు వచ్చాయని, తరువాత అదే టీవీలో ప్రమాదకర ఇంజెక్షన్ అని వార్తలు వచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు టీడీపీకి సంబందించిన ఛానల్స్‌లో మాత్రం గుండెపోటుతో చనిపోయాడని వార్తలు వచ్చాయని తెలిపారు. కోడెల మరణంపై సాక్ష్యాలు తారుమారు కాకుండా తెలంగాణ ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన కోరారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కోడెల మరణంపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ‘గుండెపోటు మృతి చెందితే.. అపోలో లేదా కేర్ హాస్పిటల్‌కు తీసుకువెళ్తారు.. కానీ బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఎందుకు తీసుకెళ్లారు? కోడెల మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నాయకులు ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఉరి వేసుకున్నారు అని అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయ చేస్తున్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. ఉరి వేసుకున్నారా?.. కటుంబ కలహాల వలన జరిగిందా? అనే విషయాలపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వం కోడెల మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. స్థానికంగా ఉన్న ప్రజలు, నేతలు కేసులు పెట్టారు. ఆయన వలన ఇబ్బంది పడిన వారే కేసులు పెట్టారు. మాకు శవ రాజకీయాలు చేయడం తెలియదు. టీడీపీ నేతలు కోడెల మరణాన్ని రాజకీయం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. చదవండి: కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి
-
‘మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ‘కోడెల మెడపై గాట్టు ఉన్నాయి కాబట్టి.. ఉరేసుకున్నారని డాక్టర్ల అభిప్రాయం. అక్కడ ఇంట్లో చూసిన విషయాలను బట్టి ఆ విధంగా తెలుస్తోంది’ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏది ఏమైనప్పటికి ఆయన ఇక లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి వైద్యులు ఎంత శ్రమించినప్పటికి ఆయనను కాపాడలేకపోయారని, ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే ఆయన మరణించారని చెప్పారు. శవపరీక్షల నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారని, మరిన్ని విషయాలు రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తాయని అన్నారు. చదవండి: కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి
-
కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. కోడెల మృతిపై అనేక సందేహాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కోడెల మృతిపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆయన కోరారు. పోలీసుల విచారణలో వాస్తవాలు నిగ్గుతేల్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం దిగ్భ్రాంతి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం సంతాపం వ్యక్తం చేశారు. -
కోడెల మృతి పట్ల గండికోట శ్రీకాంత్ రెడ్డి దిగ్భ్రాంతి
-
కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు
-
కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?
-
కోడెల మృతిని రాజకీయం చేయవద్దు: గడికోట
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ప్రభుత్వ చీఫ్‌విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దురదృష్టకరమని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడోద్దన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం సరికాదని, వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని సూచించారు. సీనియర్ నేత చనిపోయారు అనే బాధలేకుండా టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కాగా కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కేసు నమోదు చేసుకుని, మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. చదవండి: కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల మృతిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామన్నారు. అయితే కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, పోస్ట్‌మార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కోడెల కుమార్తె ఆయన గదిలోకి వెళ్లి చూడటంతో విషయం తెలిసిందని, ఘటనా స్థలంలో ముగ్గురు ఉన్నట్లుగా తెలిసిందని డీసీపీ పేర్కొన్నారు. కోడెల మృతి బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోందని తెలిపారు. కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా కోడెల మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆయన నివాసంలో ఆధారాలను సేకరిస్తోంది. అలాగే కోడెల గదిలో ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మూడు బృందాలతో దర్యాప్తు: సీపీ అంజనీకుమార్ కోడెల మృతిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ‘అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. మూడు బృందాలతో దర్యాప్తు జరుపుతున్నాం. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్టు తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుంది. అలాగే కోడెల నివాసంలో ఆధారాల సేకరణ నిమిత్తం అక్కడకు చేరుకుని క్లూస్ టీమ్, టెక్నికల్ టీమ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నివేదిక అనంతరం మృతిపై వివరాలు వెల్లడిస్తాం. బంజారాహిల్స్ పోలీసులు’ అని సీపీ పేర్కొన్నారు. చదవండి: కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అర్ధంతర మృతి.. ఆ తర్వాత తెరపైకి వచ్చిన పలు కథనాలు, వదంతులతో అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారా? లేక మరేదైనా కారణముందా?.. ప్రస్తుతం అందరినీ తొలస్తున్న ప్రశ్నలివే. కోడెల శివప్రసాదరావు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఉరి వేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. లేదు, డాక్టర్ అయిన కోడెల ప్రమాదకరమైన ఇంజెక్షన్ చేసుకొని.. ఆత్మహత్య చేసుకున్నారని మరో కథనం ప్రచారంలోకి వచ్చింది. అసలు ఆదివారం రాత్రి కోడెల ఇంట్లో ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. రెండ్రోజుల కిందటే కోడెల హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చారని సన్నిహితులు చెప్తున్నారు. కొడుకు శివరాం పిలువడం వల్లే ఆయన హైదరాబాద్ వచ్చారని అంటున్నారు. కోడెలకు, ఆయన తనయుడికి మధ్య మనస్పర్థలు ఉన్నాయని ప్రచారమూ సాగుతోంది. అయితే ఆయన కుమారుడు శివరాం విదేశీ పర్యటనలో ఉన్నారని, రేపు ఉదయం ఆయన హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. కోడెల పిరికివారు కాదు.. రెండు రోజులుగా కోడెలకు-ఆయన కొడుకుకు మధ్య గొడవ జరిగిందని, తండ్రి కోడెలపై కొడుకు చేయి చేసుకున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కోడెల ఆత్మహత్య చేసుకొని ఉంటారు అని చెప్తున్నారు. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం కోడెలది ఆత్మహత్య కాకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకుడు, వృత్తిరీత్యా వైద్యుడు అయిన కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు అంటున్నారు. కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు! కోడెల ఆకస్మిక మృతి వ్యవహారంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? లేక గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారా? అన్నది ఒక ప్రశ్న కాగా.. ఆదివారం రాత్రి కోడెలను బసవతారకం ఆస్పత్రిలో చేర్పించిందెవరు? అనేది మరో ప్రశ్న. అంతేకాకుండా కోడెల కోడుకు బసవతారకం ఆస్పత్రికి రాలేదని తెలుస్తోంది. తండ్రి విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో ఉన్నా కొడుకు ఎందుకు రాలేదు? ప్రస్తుతం కోడెల కొడుకు ఎక్కడ ఉన్నాడు? తండ్రి మృతి విషయం అతనికి తెలుసా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు కోడెలను అత్యవసరంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్చడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల నివాసం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి సమీపంలో ఉంది. అయినా నిమ్స్ ఆస్పత్రిలో కాకుండా బసవతారకం ఆస్పత్రికి ఆయనను ఎందుకు తరలించారో తెలియాల్సి ఉంది. మొత్తానికి కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? లేక గుండెపోటుతో మృతి చెందారా? అన్నది పోస్టుమార్టం నివేదికతో వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. అయితే పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణ అయింది. -
కోడెల మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. Chief Minister Sri YS Jagan Mohan Reddy expressed grief over the death of former Andhra Pradesh Assembly Speaker Sri Kodela Siva Prasada Rao and conveyed his condolences to the bereaved family members. — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 16, 2019 (చదవండి : కోడెల శివప్రసాదరావు కన్నుమూత) కేసీఆర్ సంతాపం.. కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు. శివప్రసాదరావు మృతి విచారకరం: ఉప రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి విచారకరమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోడెల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. -
కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. కోడెల అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఉదయం 11.15 గంటలకు ఆయనను డ్రైవర్, గన్‌మెన్ బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు చికిత్స పొందుతూ కోడెల మృతి చెందారు. కోడెల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలది ఆత్మహత్యనా? అనారోగ్యం కారణంగా మృతిచెందారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బసవతారకం ఆస్పత్రి నుంచి కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. చదవండి: సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
సుదీర్ఘ రాజకీయ జీవితం..
-
సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!
సాక్షి, హైదరాబాద్: నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించి.. పలుసార్లు మంత్రిగా, నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా సేవలు అందించిన ఆయన.. ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కోడెల ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయన.. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమి ఎదురైనా.. 2014లో సత్తెనపల్లి నియోజకవర్గానికి మారి.. మరోసారి గెలుపొందారు. ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో పలు శాఖలు నిర్వహించిన ఆయన.. నవ్యాంధ్ర తొలి శాసనసభాపతిగా ఎన్నికై.. ఐదేళ్లు సేవలు అందించారు. ఆయన జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే.. గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన.. విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివాడు. చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదం నుంచే డాక్టర్ కావాలని నిర్ణయించుకున్న ఆయన.. తాత ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించారు. కర్నూలు వైద్య కళాశాలలో చేరి.. రెండున్నరేళ్ళ తర్వాత తిరిగి గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వారణాసిలో ఎం.ఎస్ చదివారు. నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టిన ఆయన.. అనతికాలంలోనే మంచి డాక్టర్‌గా స్థానికంగా పేరు తెచ్చుకున్నారు. అలా పల్నాడులో అంచెలంచెలుగా ఎదిగి.. ప్రముఖ సర్జన్‌గా కీర్తిగడించిన డాక్టర్ కోడెలను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించారు. ఆయన పిలుపుమేరకు 1983లో టీడీపీలో చేరిన కోడెల మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లోనూ నర్సరావుపేట నుంచి ఆయన వరుస విజయాలు సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి పోటీచేసిన కోడెల మరోసారి విజయం సాధించారు. అనంతరం నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి.. ఐదేళ్లపాటు సేవలు అందించారు. కోడెలకు భార్య శశికళ, ముగ్గురు పిల్లలు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ) ఉన్నారు. -
మాజీ స్పీకర్ కోడెల మృతి
-
కోడెల శివప్రసాదరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం కన్నుమూశారు. కోడెల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. ఆయన 1947, మే 2న గుంటూరులోని కండ్లకుంట గ్రామంలో జన్మించారు. కోడెలకు భార్య, ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కూతురు డాక్టర్ విజయలక్ష్మీ ఉన్నారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రికి తరలించారని తొలుత వార్తలు రావడం గమనార్హం. కొడుకు శివరాంతో గొడవ కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారనే కథనాలు వెలువడుతున్నాయి. వృత్తిరిత్యా డాక్టర్ అయిన కోడెల 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన కోడెల.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. కోడెల ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, ఎన్టీఆర్ హయాంలో కేబినెట్ మంత్రిగా, హోంమంత్రిగా సేవలందించారు. కోడెల అనుమానాస్పద మృతి కారణంగా గుంటూరు జిల్లా నరసారావుపేట డివిజన్లో 144 సెక్షన్ విధించారు. ముందుజాగ్రత్తగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి : సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!) కేసీఆర్ సంతాపం.. కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు. ఉపరాష్ట్రపతి విచారం.. కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’అని ట్విటర్లో పేర్కొన్నారు. -
పల్నాడులో టీడీపీ నీచ రాజకీయాలు!
సాక్షి, అమరావతి, గుంటూరు : నిన్నటి వరకూ అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, కే–ట్యాక్సులతో అట్టుడికిన పల్నాడు ప్రాంతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రశాంతంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రపూరితంగా ప్రశాంత పల్నాడులో చిచ్చుపెట్టే చర్యలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు వారికి వంతపాడుతూ నీచ రాజకీయాలకు తెరదీశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జి.వి.ఆంజనేయులు పల్నాడులో సాగించిన ఫ్యాక్షన్ రాజకీయాలను విస్మరించి, ఇప్పుడు ఏదో జరిగిపోతోందంటూ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ దిగజారుడు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. యరపతి నేని శ్రీనివాసరావు, కోడెల కుటుంబం పాల్పడిన అక్రమాలు, దౌర్జన్యాలతో నష్టపోయిన బాధితులతో గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఆత్మకూరు వెళ్లేందుకు నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మిని మంగళవారం కలిసి వినతిపత్రాలు అందజేశారు. ‘‘ సత్తెనపల్లిలో గొడుగుల సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన 17 ఎకరాల పొలాన్ని కోడెల కుమారుడు లాగేసుకున్నాడు. కోళ్లఫారాన్ని ఆక్రమించి అక్కడ ఉన్న కోళ్లు తిన్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతనిని ఊరు విడిచిపెట్టి వెళ్లాని కోడెల శివరామ్ బెదించాడు. అప్పుడు మేము వెళ్లి సుబ్బారావును సత్తెనపల్లి రావాలని పిలిస్తే అతను భయపడి రాలేదు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఇక్కడకు వచ్చి పొలాన్ని తీసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాడ’ని’ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో ఓ హోటల్లో చంద్రబాబు దొంగ నాటకాలపై మంత్రి మోపిదేవి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చించారు. టీడీపీ పాలనలో బాధితులను తీసుకుని ఆత్మకూరు వెళ్ళాలని నిర్ణయించారు. గుంటూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు బయల్దేరేలా కార్యచరణ రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రితో కలిసి ఆయన మాట్లాడారు. సత్తెనపల్లిలో అచ్చయ్య అనే వ్యక్తి నుంచి స్కూల్ బిల్డింగ్ పర్మిషన్ కోసం కోడెల కుటుంబం రూ. 20 లక్షలు వసూలు చేసిందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి రూ. 10 లక్షలు ఇచ్చారని తెలిపారు. అక్రమ మైనింగ్‌పై ప్రశ్నిస్తే మాజీ ఎమ్మెల్సీ టీజీవీ.కృష్ణారెడ్డిపై కేసులు బనాయించారని, గురువాచారిని చిత్రహింసలు పెట్టారని గుర్తు చేశారు. ఇలా అరాచకపాలన సాగించారు. అందుకే భాదితులతో కలిసి ఆత్మకూరు వెళుతున్నామని, వీరందరికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని, కోడెల బాధితులకు డబ్బులు ఇప్పించాలని కోరారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, దుర్గి, గురజాల ప్రాంతాల్లోని బాధితులంతా గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వస్తారని, వారందరితో కలిసి ఆత్మకూరుకు వెళతామని తెలిపారు. యరపతినేని, కోడెల, పుల్లారావు, జీవీ ఆంజనేయులు చాలా ఆరాచకాలకు అంతు లేదన్నారు. బాబు పెయిడ్ ఆర్టిస్టులతో రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన రాజకీయ హత్యలను మంత్రి మోపిదేవి వెంకటరమణరావు సాక్ష్యాలతో వివరించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను కలిసి ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, కిలారి వెంకటరోశయ్య, షేక్ ముస్తఫా, మేరుగ నాగార్జున, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్ సీపీ నేతలు కావటి మనోహర్‌నాయుడు, డైమండ్‌బాబు, పానుగంటి చైతన్య, టీడీపీ బాధితుడు గొడుగుల సుబ్బారావు, అచ్చయ్య పాల్గొన్నారు. రాజకీయాల కోసం పల్నాడులో చిచ్చుపెట్టొద్దు పల్నాడు ప్రజలు అభివృద్ధి, శాంతి గురించి ఆలోచిస్తున్నారని, రాజకీయాల కోసం చిచ్చుపెట్టొద్దని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు హితవు పలికారు. వరికపూడిసెల, గురజాలలో వైద్యశాల, నరసరావుపేటలో జేఎన్టీయూ కాలేజీ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఐదేళ్లల్లో బాబు దొంగ దీక్షలు, దొంగ హామీలతో కాలం గడిపారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిసే 23 సీట్లతో పక్కన పెట్టారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా, అంబటి రాంబాబులపై దాడి చేస్తే అప్పుడు న్యాయం ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టి వేధించారని, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపై దాడి చేయించారని తెలిపారు. – శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ, నరసరావుపేట టీడీపీ పాలనలో గ్రామాలు విడిచి వెళ్లారు తెలుగుదేశం పాలనలో అనేక మంది గ్రామాలు విడిచి, గుంటూరులో కూలీలుగా మారారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తిరిగి గ్రామాలను వచ్చారని తెలిపారు. బొల్లాపల్లిలో ఇద్దరు అన్నదమ్ములను చంపారని గుర్తు చేశారు. తన ఫ్యాక్టరీ మూయించి, తనను జీపులో ఎక్కించారని, 72 ఏళ్ల మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిపై రేప్ కేసు పెట్టించారని, ఇవన్నీ దారుణాలు కావా అని ప్రశ్నించారు. – బొల్లా బ్రహ్మనాయుడు , వినుకొండ ఎమ్మెల్యే కోడెల, యరపతినేనిని తీసుకురావాలి టీడీపీ ఐదేళ్ల పాలనలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఛలో ఆత్మకూరుకు తాము తెలుగుదేశం పార్టీ బాధితులతో కలిసి వస్తామని, చంద్రబాబు మాత్రం కోడెల కుటుంబం, యరపతినేనిని తీసుకొస్తే చాలని పేర్కొన్నారు. ఐదేళ్లల్లో ఏం జరిగిందో, మూడు నెలల్లో ఏం జరిగిందో చర్చిద్దామని బాబుకు సవాల్ విసిరారు. – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే -
‘మల్టీ’ అక్రమం!
కోడెల శివరామకృష్ణ మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఆది నుంచి అంతా అక్రమమే. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించలేదు. స్థలం ఇదరు వ్యక్తుల పేరుతో ఉంది. కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఒకరి పేరుతో అనుమతులు ఇచ్చేశారు. ఒక్క రూపాయి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించ లేదు. డెవలప్మెంట్ చార్జీలు అస్సలే కట్టలేదు.. అయినా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చేసింది. రోడ్డు నిర్మాణం కోసం ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మించేశారు. ఒక్క అధికారి కూడా ప్రశ్నించలేదు. సాక్షి, గుంటూరు : గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణ ఇండో అమెరికన్ సూపర్ స్పెషాలిటీస్ లిమిటెడ్ పేరుతో టీడీపీ ప్రభుత్వ హయాంలో మల్టీ ప్లెక్స్‌ను నిర్మిం చారు. అయితే నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్ విధించిన ఏ ఒక్క నిబంధనను పాటించకుండా ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. పన్నుల ఎగవేత వ్యవహారాన్ని పక్కన బెడితే ఏకంగా మల్టీఫ్లెక్స్‌లో సెట్‌బ్యాక్ కోసం వదిలేసిన స్థలంలో అక్రమంగా మరో వ్యాపార సముదాయాన్ని నిర్మించడం విశేషం. మంటరాజుకుంటే ఎలా? నిబంధనల ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రాణ నష్టం జరుగకుండా అగ్నిమాపక శకటాలు కాంప్లెక్స్ చుట్టూ తిరిగేలా సెట్‌బ్యాక్‌ను వదలాల్సి ఉంది. కోడెల కుమారుడి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణ సమయంలో కార్పొరేషన్ అనుమతులు పొందడం కోసం సెట్‌బ్యాక్స్ స్థలాన్ని చూపించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొంది కాంప్లెక్స్ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కాంప్లెక్సుకు పన్నులు సైతం వేసేశారు. ఇదంతా పూర్తయిన వెంటనే సెట్‌బ్యాక్‌కు వదిలిన స్థలంలో కేఎస్పీ ఫుడ్ వరల్డ్ పేరుతో అడ్డగోలుగా 15 షాపులను నిర్మించి వివిధ రకాల ఆహార వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాల వారు ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు, చిన్న నిర్మాణం చేపడితేనే అనుమతులు లేవంటూ హడావుడి చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు కోడెల కుమారుడు గతంలో పట్టపగలు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయం. పార్కింగ్ పేరుతో.. కోడెల కుమారుడి మల్టీప్లెక్స్‌లో పార్కింగ్ ఫీజు అధికంగా వసూలు చేస్తుండటంతో కాంప్లెక్సులోని సినిమా హాళ్లకు, షాపింగ్‌కు వచ్చే ప్రజలు కాంప్లెక్సుకు ఎదురుగా ఉన్న రోడ్డుపైనే వాహనాలు నిలిపివేసి వెళుతున్నారు. ద్విచక్రవాహనానికి రూ.20, కారుకి రూ.50 వసూలు చేస్తున్నారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
కొంపముంచిన కోడెల.. పల్నాడులో పతనం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడు అల్లకల్లోలం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే టీడీపీ నేతలు డ్రామాలకు దిగుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గురజాలలోని అక్రమ మైనింగ్ వ్యవహరాన్ని సీబీఐకి బదిలీ చేయడంతో చంద్రబాబు, అండ్ కో లొసుగులు బయటకు వస్తాయనే భయంపట్టుకుందని స్థానిక నేతల సమాచారం. గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు అనేక అక్రమాలకు పాల్పడి.. ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన టీడీపీ నేతలపై తాజా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణను రాజకీయ వేధింపులుగా చూపించే ప్రయత్నం చేయడం కోసం.. వైఎస్సార్సీపీ నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ కొందరు టీడీపీ నేతలు అసత్య ప్రచారానికి దిగుతున్నారు. బిగుసుకుంటున్న అక్రమ మైనింగ్ ఉచ్చు.. మరోవైపు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంపై కూడా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అక్రమ మైనింగ్ వ్యవహరాన్ని సీబీఐకి బదిలీ చేసింది. బ్యాంకు ఖాతాల్లో భారీగా జరిగిన అక్రమ ఆర్థిక లావాదేవీల చిట్టాలు ఒక్కొక్కటీ బయటపడతుండటంతో టీడీపీ నేతల్లో అలజడి మొదలైంది. వీటి వెనుక ఉన్న నేతల పునాదులు కదులుతున్నాయి. ఇదిలావుండగా.. ఐదేళ్ల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామని, ఆ కష్టాలు పగవారికి కూడా రాకూడదు అంటూ యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట ఇటీవల తమ గోడు వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో యరపతినేని, ఆయన అనుచరుల వేధింపులకు గురైన బాధితుల కష్టాలు, బాధలు విన్న హోం మంత్రి వారికి భరోసా ఇచ్చారు. వారిపై నమోదు అయిన కేసులపై పునఃవిచారణ చేపడతామని మంత్రి వాగ్ధానం చేశారు. దీంతో పల్నాడులోని టీడీపీ నేతలు భయాందోళకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ దాడుల పేరిట చంద్రబాబు కొత్త డ్రామాలకు దిగుతున్నారు. కొంపముంచిన కోడెల.. మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బాగోతం అసెంబ్లీ ఫర్నీచర్ దోపిడీ రూపంలో గుంటూరు జిల్లాలో టీడీపీ పరువు రోడ్డుపాలైంది. జిల్లాలో వ్యాప్తంగా పార్టీ పూర్తిగా పతానావస్థకు చేరడంతో పచ్చ పార్టీల నేతలు అనేక దుశ్చర్యలకు పాల్పడుతూ.. ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి దిగుతున్నారు. తమ అనుకూల మీడియా సహాయంతో ప్రభుత్వ కార్యక్రమాలను మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుండగా గత ఐదేళ్లకాలంలో అభివృద్ధికి నోచుకోని పల్నాడు ప్రాంతంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలో గురజాలలో మెడికల్ కాలేజీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పల్నాడులో తాగునీటి వసతి కోసం ప్రభుత్వం బృహత్ ప్రణాళికలను రచిస్తోంది. త్వరలోనే వీటిని అమలు చేయనుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వరికెశలపూడి ప్రాజెక్టుకు ముందడుగులు పడుతోన్న విషయం తెలిసిందే. -
కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ధర్నా
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోడెల కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు నిరసన గళం వినిపిస్తున్నారు. కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా సత్తెనపల్లి తహశీల్దారు కార్యాలయం ఎదుట ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు స్వీపర్లు సోమవారం ధర్నా చేపట్టారు. కోడెల బినామీలైన విజయలక్ష్మి సహా, శ్రీనివాసరావు, సురేంద్రలు తమ పీఎఫ్ సోమ్మును కాజేశారని స్వీపర్లు ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -
అవినీతిలో ‘సీనియర్’
ఏఎన్‌యూ, కాజ (మంగళగిరి)/సాక్షి, అమరావతి: ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు మరో అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) అకౌంట్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జవ్వాది శ్రీనివాసరావుపై ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం అతని కార్యాలయం, నివాసం, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 బృందాలు సోదాలు నిర్వహించాయి. బహిరంగ మార్కెట్లో రూ. 30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాజ, ఆరేపల్లి ముప్పాళ్ల, అన్నవరం, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు, నర్సరావుపేట, అమరావతి పట్టణాల్లో తనిఖీలు చేశారు. శ్రీనివాసరావు పేరుతో జీ ప్లస్ 2, జీ ప్లస్ 1 భవనాలు, పలు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, ఏడు ఇళ్ల స్థలాలు, 7.56 ఎకరాల వ్యవసాయ భూమి, ఆయన భార్య సుజాత పేరుతో రెండు భవనాలు, 5.94 ఎకరాల వ్యవసాయ భూమి, కుమారుడు వెంకటకృష్ణ పేరుతో ఆరు ఇళ్ల స్థలాలు, 5.19 ఎకరాల వ్యవసాయ భూమి, కుమార్తె నందిని పేరుతో రెండు ఇళ్ల స్థలాలు, 6.90 ఎకరాల వ్యవసాయ భూమి, కోడలు మానస పేరుతో ఇంటి స్థలం గుర్తించారు. సోదాల్లో రూ. 29 లక్షల నగదు, రూ. 26.23 లక్షల బ్యాంకు నిల్వ, రూ. 12 లక్షల విలువైన బంగారం ఆభరణాలు, రూ. 47,600 విలువైన వెండి ఆభరణాలు, రూ. 4.50 లక్షల విలువైన సామగ్రి, రూ. 3.65 లక్షల ప్రామిసరీ నోట్లు దొరికాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 3.50 కోట్లు ఉంటుందని ఏసీబీ డీజీ విశ్వజిత్ తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ రూ. 30 కోట్లకుపైగా ఉండవచ్చని తెలిసింది. తనిఖీలు నిర్వహించిన అనంతరం శ్రీనివాసరావును అరెస్ట్ చేసి గుంటూరు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ వలలో రెండోసారి.. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న శ్రీనివాసరావు ఏసీబీ కేసులో ఇరుక్కోవడం ఇది రెండోసారి. 14 ఏళ్ల కిందట అతను యూనివర్సిటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ అయ్యాడు. అయినా తన తీరు మార్చుకోలేదు. టీడీపీ హయాంలో మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ అండతో అతను అక్రమాస్తులు కూడబెట్టారని స్థానికులు చెబుతున్నారు. విశ్రాంత ఉద్యోగి ఇంటిపై ఏసీబీ సోదాలు వర్సిటీలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఎం.మల్లేశ్వరరావు అనే ఉద్యోగి నివాసంలోనూ ఏసీబీ దాడులు చేసినట్లు సమాచారం. గుంటూరులోని జేకేసీ కళాశాల ప్రాంతంలో ఉన్న ఇతని నివాసంలో శుక్రవారం మూడు గంటలకుపైగా తనిఖీలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఏసీబీ కేసులో సస్పెండ్ అయిన శ్రీనివాసరావు తిరిగి విధుల్లో చేరేందుకు మల్లేశ్వరరావు సహకరించారని సమాచారం. దీంతో వీళ్లిద్దరి మధ్య సంబంధాలపై అధికారులు విచారిస్తున్నారు. -
పల్నాడులో టీడీపీ నేతల అరాచకాలు
-
క్యాంపస్ కోడెల అధికార దుర్వినియోగం
సాక్షి, ఏఎన్‌యూ(గుంటూరు) : గౌరవ ప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన బంధువుగా చెప్పుకునే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు యూనివర్సిటీలో అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడ్డారనే అంశం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు రాష్ట్రంలో చక్రం తిప్పారు. కే–ట్యాక్స్‌ల పేరుతో అమాయక జనాన్ని పట్టిపీడించారు. పశువుల గడ్డి నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ వరకూ దేన్ని వదలకుండా దోచేశారు. అన్న కుటుంబం రాష్ట్రంలో దోచేస్తోంది. నేనెందుకు ఊరికే ఉండాలి అనుకున్నాడే ఏమో మరి ఏఎన్‌యూలోని లైబ్రేరియన్ కోడెల వెంకట్రావు. అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. విలువలు, సిద్ధాంతాల్లో సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన యూనివర్సిటీని సొంత సామ్రాజ్యంలా మార్చుకుని పలు అక్రమాలకు తెరతీశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా.. యూనివర్సిటీలో లైబ్రేరియన్ అయిన కోడెల వెంకట్రావు కోడెల శివప్రసాదరావుకు వరుసకు తమ్ముడు. ఈయన యూనివర్సిటీలో పలు అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇందుకు యూనివర్సిటీ అధికారులు, టీడీపీ ప్రభుత్వం, మాజీ స్పీకర్ కోడెల నుంచి పూర్తి సహకారం అందిందని పలువురు ఆరోపిస్తున్నారు. లైబ్రేరియన్ల డిజిగ్నేషన్స్ను ప్రొఫెసర్‌గా మార్చుతూ రీ డిజిగ్నేషన్స్ కల్పించాలనే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోడెలకు ప్రొఫెసర్‌గా రీ డిజిగ్నేషన్ కల్పిస్తూ 2011లో అప్పటి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాని ఆయన వేతనం, సర్వీస్ కండీషన్స్‌లో ఎలాంటి మార్పు ఉండదని అందులో పేర్కొన్నారు. కాని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2016లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ పాలకమండలి(ఈసీ)లో యూనివర్సిటీ టీచర్ల కోటాలో కోడెలను సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. టీచర్ కాని వ్యక్తిని టీచర్ల కోటాలో ఈసీ మెంబర్‌గా నియమించడంపై అప్పట్లో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డాక్టర్ కోడెల వెంకటరావు అధ్యాపకుడా కాదా అనే అంశంపై ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతుంటే మూడున్నరేళ్ల కిందట ఆయనకు అధ్యాపకుడి కోటాలో ఈసీ సభ్యత్వం ఇవ్వడం, అప్పటి యూనివర్సిటీ పాలకులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. ఈ అంశం అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగానే మిగిలింది. ఎప్పుడో మూసేసిన లైబ్రరీ సైన్స్ విభాగాన్ని తాను ఈసీ మెంబర్‌గా నియమితుడైన తర్వాత 2017లో మరలా ప్రారంభించేందుకు పాలకమండలిలో ఆమోదింపజేసుకున్నాడు. తాను అధ్యాపకుడిని అనిపించుకునేందుకే ఆయన లైబ్రరీ సైన్స్ విభాగాన్ని ప్రారంభించాడనే విమర్శలూ ఉన్నాయి. సెల్ఫ్ డిక్లేర్డ్ హెడ్‌గా.. పాలకమండలి సభ్యుడిగా చక్రం తిప్పి ఎంఎల్ఐఎస్సీ విభాగానికి అనుమతి తెచ్చుకున్న డాక్టర్ కోడెల వెంకటరావు ఆ విభాగానికి మూడేళ్లకు పైగా సెల్ఫ్ డిక్లేర్డ్ హెడ్(స్వయం ప్రకటిత విభాగాధిపతి)గా చక్రం తిప్పాడు. ఏ విభాగంలోనైనా రెగ్యులర్ అధ్యాపకుడు మాత్రమే ఆ విభాగానికి అధిపతిగా వ్యవహరించే నిబంధనలు ఉన్నాయి. కాని లైబ్రేరియన్న్డాక్టర్ కోడెల ఎంఎల్ఐఎస్సీ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ(అతిథి అధ్యాపకుడు)గా పనిచేస్తూ రెమ్యునరేషన్ తీసుకుంటూ అదే విభాగానికి హెడ్‌గా వ్యవహరించడం ఆయన అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రెగ్యులర్ అధ్యాపకులు లేని విభాగానికి సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను విభాగాధిపతిగా నియమించాల్సిన ఉన్నతాధికారులు ఏ విధమైన ఉత్తర్వులు లేకుండానే ఆ విభాగాన్ని పాలించుకోమన్నట్లు అప్పజెప్పారు. దీంతో ఎంఎల్ఐఎస్సీలో అతిథి అధ్యాపకుల నియామకంలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలూ ఉన్నాయి. నేటికీ అదే తీరు.. అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోడెల వెంకట్రావు చేసిన అధికార దుర్వినియోగానికి టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం అండదండలు అందించిందని, యూనివర్సిటీ ఉన్నతాధికారులు మాత్రం నేటికీ ఆయనకు పూర్తి సహకారం అందిస్తూనే ఉన్నారని విమర్శలూ ఉన్నాయి. కేవలం ప్రొఫెసర్ హోదా మాత్రమే ఉన్న ఈయనకు సర్వీస్ విషయాల్లో ఎలాంటి మార్పు ఉండదని, నిబంధనల్లో ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడం, రీ డిజిగ్నేషన్స్ తర్వాత కూడా అధ్యాపకేతర ఉద్యోగులు తీసుకునే సరెండర్ లీవ్స్‌ను ఎన్‌క్యాష్ మెంట్ చేసుకోవడం వంటివి జరిగినా న్యాయస్థానాల్లో వాటిని యూనివర్సిటీ బలంగా చూపడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. కోడెల అక్రమాలు, అధికార దుర్వినియోగంపై ఇప్పటికే కొందరు లోకాయుక్తను ఆశ్రయించగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందాయి. రానున్న రోజుల్లో దీనిపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దీనిపై డాక్టర్ కోడెల వెంకటరావును వివరణ కోరగా నేను దీనిపై స్పందించనని స్పష్టం చేశారు. -
ఇప్పుడు ‘సేఫ్’ కాదని..
సాక్షి, నరసరావుపేట(గుంటూరు): కోడెల కుటుంబానికి ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే, ఇచ్చిన సొమ్ము తిరిగి రాబట్టుకోవాలంటే కాళ్లావేళ్లా పడాల్సిందే.. వాళ్ల బెదిరింపులకు లొంగి ఉండాల్సిందే.. అలా కాదని ప్రశ్నిస్తే అక్రమ కేసుల్లో జైలుకు వెళతారు. లేదంటే భౌతిక దాడులకు గురవుతారు. ఇదంతా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అధికారం అండతో కోడెల కుటుంబం సాగించిన దందా. అయితే ఇప్పుడు రోజులు మారాయి. పరిస్థితి పూర్తిగా అడ్డం తిరిగింది. అధికార అహంకారంతో నెత్తికెక్కిన కళ్లు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఏదైనా గేటు అవతల ఉండి మాట్లాడమని గద్దించిన నోళ్లు మూతబడ్డాయి. రాజీకి రండంటూ బాధితులను వేడుకుంటున్నాయి. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మి వ్యవహారంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అక్రమాలు, దందాలకు పాల్పడ్డారు. ఆనాడు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో ప్రభుత్వం మారిన తర్వాత కేట్యాక్స్ బాధితులంతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కోడెల కుటుంబంపై క్రిమినల్ కేసులు నమోదవటంతో కోడెల శివరామ్, పూనాటి విజయలక్ష్మి పరారయ్యారు. వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కేసుల్లో ఉన్న తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం సైతం బెయిల్‌ను నిరాకరించింది. దీంతో బాధితుల వద్ద నొక్కేసిన సొమ్మును వెనక్కి ఇచ్చి రాజీలు చేసుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ ఫర్నిచర్ అక్రమ తరలింపు వ్యవహారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడెల కుటుంబం నవ్వులపాలైంది. చివరకు ఆ పార్టీ నాయకులు, సొంత సామాజికవర్గం సైతం చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. మరో వైపు పోలీసులు కూడా అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో సర్జికల్ వ్యాపారికి ఇవ్వాల్సిన నగదుకు ఎగనామం పెట్టిన కోడెల కుమార్తె తాజాగా ఆ వ్యాపారిని పిలిచి మరీ నగదు చెల్లించడం గమనార్హం. తిన్నది కక్కించారు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన చల్లా రవీంద్రరెడ్డి ఆ గ్రామంలో వెంకటేశ్వర సర్జికల్ కాటన్ పేరిట దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సర్జికల్ కాటన్‌ను కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన సేఫ్ కంపెనీకి సరఫరా చేశారు. అందుకుగాను సుమారు రూ.15 లక్షలు రవీంద్రరెడ్డికి కోడెల కుమార్తె కంపెనీ నుంచి రావాల్సి ఉంది. నగదు కోసం పలుమార్లు ఆమెను కలిసి అడగ్గా బెదిరింపులకు పాల్పడడంతో బాధితుడు మూడు రోజుల క్రితం గుంటూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం సైతం కేట్యాక్స్ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తుండటంతో మరో దారి లేక ఆయనకు ఇవ్వాల్సిన నగదుకు సంబంధించి విజయలక్ష్మి సంతకం చేసిన రూ.14.40 లక్షల రూపాయల విలువైన రెండు చెక్కులను శుక్రవారం సేఫ్ కంపెనీ మేనేజర్ అందజేశారు. తండ్రి బాటలోనే తనయ అక్రమాలు చేయటం, వాటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిదిద్దుకోవటంలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది అందె వేసిన చేయిగా చెప్పుకుంటారు. అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం బయట పడగానే.. తీసుకున్న ఫర్నిచర్‌కు డబ్బులు చెల్లిస్తానని బుకాయించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ఆయన కుమార్తె విజయలక్ష్మి వెంకటేశ్వర సర్జికల్ కాటన్ యజమాని రవీంద్రరెడ్డికి ఇవ్వాల్సిన డబ్బులు ముట్టచెప్పి కేసు మాఫీకి యత్నించడం గమనార్హం. -
రెండు వర్గాలుగా చీలిపోయిన టీడీపీ!
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లిలోని టీడీపీ నాయకుల్లో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుచరులు ఒక వర్గంగా, రాయపాటి రంగబాబు అనుచరులు మరో వర్గంగా చీలిపోయి ఆందోళనలు చేపడుతున్నారు. రంగబాబు ఆధ్వర్యంలోని వర్గం అన్నా క్యాంటీన్ వద్ద ధర్నాకి దిగిన కాసేపటికి.. కోడెల వర్గం ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల మధ్య కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. కాగా కే ట్యాక్స్ పేరిట కోడెల కుటుంబం చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివప్రసాదరావు సహా ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మిపై పలు కేసులు నమోదైన విషయం విదితమే. -
కేట్యాక్స్ ఖాతాలో రిజిస్ట్రార్ కార్యాలయం
సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ ధనదాహానికి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యాయి. కాంట్రాక్టర్ నుంచి వచ్చే కమీషన్ల కోసం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని ముంపు ప్రాంతం అయిన వాగు పోరంబోకు స్థలంలో నిర్మించారు. ఎటువంటి అనుమతులు లేకున్నా అప్పటి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా అధికారులు నిబంధనలను కాలరాశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందన్న సాకు చూపి నిర్మాణ పనులు పూర్తి కాక ముందే భవనాన్ని ప్రారంభించారు. కోట్ల రూపాయలతో నిర్మించిన రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని నేడు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వివాదాల కేంద్రం.. నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ శాశ్వత భవనం మొదటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రస్తుతం ప్రకాష్ నగర్‌లోని అద్దె భవనంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అయితే శాశ్వత భవనంలో రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మించాలన్న ఉద్దేశంతో పట్టణ శివారు స్టేడియం వెనుక భాగంలో భవన నిర్మాణానికి నాలుగేళ్ల కిందట స్థలాన్ని కేటాయించారు. వాగు పోరంబోకు స్థలంలో సుమారు రూ.3 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించారు. వాస్తవానికి ప్రభుత్వ వాగులు, చెరువులు, కుంటలు తదితర వాటిలో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టరాదని దేశ ఉన్నత న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒక వేళ నిర్మించాలంటే ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అనుమతి తీసుకొని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించాలి. ప్రభుత్వం ప్రత్యేక మైన జీవో ద్వారా అనుమతులు ఇవ్వాల్సి ఉంది. దీంతో పాటు ఒక శాఖ నుంచి మరో శాఖకు భూమి బదలాయిస్తున్నట్లు ఉత్తర్వులు అందించాలి. దీనికి సంబంధించి మార్కెట్ విలువను అవసరాల కోసం భూమి తీసుకున్న శాఖ చెల్లించాలి. అదే విధంగా పట్టణ పరిధిలో భూమి ఉన్న కారణంగా భవన నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు అవసరం. అయితే అవేమి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవన విషయంలో చోటు చేసుకోలేదు. అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది జగమెరిగిన సత్యం. కేవలం మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు డాక్టర్ శివరామ్ అవినీతి ముందు నిబంధనలు అన్నీ నలిగిపోయాయి. పొంచి ఉన్న ముప్పు.. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ముంపు ప్రాంతం కావటంతో పక్కనే ఉన్న వాగు పొంగి నూతనంగా నిర్మించిన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నీటమునిగే ప్రమాదం ఉంది. గతంలో కురిసిన భారీ వర్షాలకు కార్యాలయ పరిసరాలు నీట మునిగి ఆ ప్రభావం రెండు మూడు రోజుల వరకు ఉండేది. దీంతో పాటు నిత్యం కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఉన్న కారణంగా పట్టణ శివారు ఏర్పాటు చేసిన కార్యాలయంతో ప్రజల సొమ్ముకు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ముందస్తు అనుమతులు లేకుండా ముంపు ప్రాంతంలో నిర్మించినందున పర్యావరణ పరిరక్షణ శాఖ ఏ క్షణంలోనైనా కార్యాలయాన్ని కూల్చివేసే అవకాశం లేకపోలేదు. స్వలాభం కోసం కార్యాలయ నిర్మాణం.. రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మించిన కాంట్రాక్టర్ నుంచి కోడెల శివరామ్ కమీషన్ రూపంలో రూ.50 లక్షల వరకు కే ట్యాక్స్ వసూలు చేసినట్లు సమాచారం. కేవలం తన కమీషన్ కోసం ముంపు ప్రాంతం కార్యాలయాన్ని ఏర్పాటు చేయించాడు. అప్పటి అధికారులు కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేసినా బెదిరించి నిర్మాణ పనులు చేయించినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లకు సుదూర ప్రాంతంలో నిర్మించిన రిజిస్ట్రార్ కార్యాలయానికి క్రయ, విక్రయదారులు సేవల కోసం వెళ్లాలంటే ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంది. పట్టణ నడిబొడ్డున అనేక ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణం చేపట్టలేదు. నూతన రిజిస్ట్రార్ కార్యాలయానికి సమీపంలో కోడెల శివరామ్‌కు చెందిన వందలాది ఎకరాల భూములు ఉన్న కారణంగా వాటి విలువను పెంచుకోవాలన్న ఉద్దేశంతో ముంపు ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు విమర్శలు లేకపోలేదు. మార్పుకు అనేక చిక్కులు.. ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నిర్మాణం పూర్తి అయిన నూతన భవనంలోకి మార్చాలంటే అనేక చిక్కులు తలెత్తుతున్నట్లు సమాచారం. భూమిని రిజిస్ట్రేషన్ శాఖకు బదలాయిస్తున్నట్లు గత టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో పాటు భవన నిర్మాణానికి మున్సిపల్ శాఖ అనుమతులు తీసుకోలేదు. ముఖ్యంగా లోతట్టు వాగు పోరంబోకు భూమికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రత్యేక జీవో విడుదల కాలేదు. ఈ సమస్యల కారణంగా కార్యాలయ మార్పులో జాప్యం చోటు చేసుకుంటున్నట్లు ఉద్యోగ వర్గాల ద్వారా తెలియవచ్చింది. అయితే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కోడెల శివరామ్ పుణ్యామా అంటూ కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అయ్యిందని పలువురు చర్చించుకుంటున్నారు. -
కోడెల అక్రమ నిర్మాణంపై చర్యలు
సాక్షి, గుంటూరు: అధికారం అండతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. శివరామ్ తన షోరూమ్‌లో టీఆర్ లేకుండా బైక్‌ల విక్రయించి ప్రభుత్వానికి రూ.లక్షల్లో టోకరా వేశాడు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్‌ను షోరూమ్‌లో ఉపయోగించుకున్నాడు. కే–ట్యాక్స్‌లు, ఉద్యోగాల పేరుతో అనేక మంది నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారాలన్నింటిలో ఇప్పటికే శివరామ్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. ఈయనగారి అక్రమాలు నరసరావుపేట, సత్తెనపల్లిలోనే కాకుండా రాష్ట్రం మొత్తం విస్తరించిన విషయం తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గుంటూరు నగరంలో అక్రమంగా జీ ప్లస్–2 భవంతి నిర్మాణం చేపట్టారు. ఈ భవన నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఈ నెల 20న ‘సాక్షి’ దినపత్రికలో ‘యథేచ్ఛగా అక్రమ నిర్మాణం!’ శీర్షికతో కథనం ప్రచురితం అయింది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కోడెల శివరామ్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలకు దిగారు. గుంటూరు నగరంలోని భాగ్యనగర్ కాలనీ ఎనిమిదో లైన్‌కు శివారులోని ఎక్స్టెన్షన్ ఏరియాలో సర్వే నెంబర్ 281/ఏ, 296/ఏ లలో 997 గజాలు, 291/ఏ, 296/డీ లలో 1019 గజాల స్థలం కోడెల శివరామ్‌కు ఉంది. ఈ స్థలంలో సుమారు ఎనిమిది నెలల క్రితం శివరామ్ జీ ప్లస్–2 భవనం నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో తన తండ్రి స్పీకర్ కావడంతో భవనం నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. స్పీకర్ తనయుడి భవంతి కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం చూసీచూడనట్టు వదిలేశారు. నోటీసు జారీ... అక్రమ కట్టడం వ్యవహారంపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం వచ్చింది. కోడెల కుమారుడి అక్రమ నిర్మాణానికి నోటీసు జారీ చేశారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనానికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 452(1), 428, 461(1), ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చట్టం 2014 115(1)(2), 116(1) కింద అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అక్రమ కట్టడంపై వివరణ ఇవ్వాలని కోరారు. బీపీఎస్ దరఖాస్తు తిరస్కరణ.. అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించేందుకు కోడెల శివరామ్ ప్రయత్నించారు. ఏ విధంగా ఆ భవనం బీపీఎస్ కిందకు వస్తుందో సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో బీపీఎస్ దరఖాస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు తిరస్కరించారు. కోడెల శివరామ్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం 2018 సెప్టెంబర్ 3వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసేందుకు సర్వే చేయడం కోసం కార్పొరేషన్ రెవెన్యూ విభాగం సిబ్బంది అంతకు ముందు వరకూ ఆ స్థలం వ్యవసాయ భూమి కింద ఉండేది. కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయడానికి ఆ స్థలం పరిశీలించేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో వెళ్లగా అక్కడ భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. కోడెల శివరామ్ మాత్రం గత ఏడాది ఆగస్టు నెలకు ముందే భవన నిర్మాణం ప్రారంభం అయిందని ఆగస్టు నెలాఖరికి శ్లాబ్ పూర్తయిందని బీపీఎస్‌కు దరఖాస్తు చేశారు. అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తారనే భయంతో భవనాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. టౌన్ ప్లానింగ్‌లోని కొందరు అధికారులు సైతం ఆయనకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడంతో టౌన్ ప్లానింగ్ అధికారులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు సమాచారం. కోడెల కుమారుడితో అంటకాగి అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడం కోసం ఏ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. -
కదులుతున్న ‘కే ట్యాక్స్’ డొంక
సాక్షి, తిరుపతి : తిరుపతి రుయా ఆస్పత్రి వేదికగా ‘కే’ట్యాక్స్ మూలాలు వెలుగు చూశాయి. మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం బినామీ పేర్లతో రుయా ఆసుపత్రిలో ల్యాబ్ నిర్వహణ బాగోతం ఆదివారం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇదే విషయంపై అన్ని మీడియాల్లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాబ్ నిర్వహణ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. దీంతో కోడెల తనయుడికి సహకరించిన రుయా అధికారుల బాగోతం ఎక్కడ బయటపడుతుందో అనే ఆందోళన అధికారుల్లో స్పష్టమవుతోంది. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా ఇప్పటికే ల్యాబ్ నిర్వహణను రుయానే నిర్వహించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్ట్‌ను రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు ల్యాబ్ పేరుతో జరిగిన దోపిడీ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఎక్కువ పరీక్షల సంఖ్యను చూపి, అధిక రేట్లతో రుయా నుంచి కోట్లు పిండుకున్నారు. ఇదిలా ఉండగా, ఆగస్టు 15వ తేదీన సెలవు రోజు, అయితే అదేరోజు రూ.1.5లక్షలకు బిల్లు పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణ రోజులకన్నా సెలువు రోజు ఆ స్థాయిలో పరీక్షలు జరిగాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయట ల్యాబ్‌ల కన్నా కొన్ని పరీక్షల ధరలు ఎక్కువ చూపి దండుకున్నట్లు తెలుస్తోంది. ఇలా కే ట్యాక్స్ డొంక లాగితే అక్రమ దందా ఒక్కొక్కటే వెలుగు చూస్తోంది. 2014 నుంచి ల్యాబ్ ద్వారా చెల్లింపులపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఏమేరకు అక్రమాలు జరిగాయో తేటతెల్లమవుతుంది. ఇందుకు సహకరించిన వారెవరనే విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. సంబంధిత అధికారుల్లో మొదలైన అలజడి.. రాయలసీమకే పెద్దాసుపత్రిగా ఉన్న రుయాస్పత్రిలో అత్యాధునిక ల్యాబ్ నిర్వహణ పరికరాలు న్నాయి. అవసరమైన ప్రొఫెసర్లు, పీజీలు, టెక్నీషియనున్నారు. ల్యాబ్ నిర్వహణకు అవసరమయ్యే అన్ని సదుపాయాలున్నా అప్పటి టీడీపీ నేతల ఒత్తిడితో ల్యాబ్ నిర్వహణపై చేతులెత్తేశారు. కోడెల తనయుడు రుయా ల్యాబ్‌పై దృష్టి సారించారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యూహాత్మకంగా సెంట్రల్ ల్యాబ్ నిర్వహణను చేజిక్కించుకున్నారు. ఇక అప్పటి నుంచి ల్యాబ్ నిర్వహిస్తూ నెలకు రూ. 30–40 లక్షల వరకు దండుకున్నారు. ఇలా ఏడాదికి 4కోట్లకు పైగా, ఐదేళ్లలో 22కోట్లకు పైగా కోడెల బినామీకి చేరింది. రుయానే ఈ ల్యాబ్ నిర్వహించి ఉంటే రూ.1.80 కోట్లు, ఐదేళ్లకు రూ.9కోట్లతో నాణ్య మైన వైద్యపరీక్షలను రోగులకు అందించి ఉండవచ్చు. ఇలా ల్యాబ్‌తో పాటు ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్, మందుల పంపిణీలోనూ భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. లోతైన విచారణ దిశగా చర్యలు తిరుపతిలో కోడెల అక్రమాల బాగోతం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనం రేపుతోంది. 2014 నుంచి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్లీనికల్ ల్యాబ్ పేరుతో రుయా సెంట్రల్ ల్యాబ్ నిర్వహిస్తున్నారు. నెలకు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు రుయా నిధులకు గండికొట్టారు. రుయాలో అత్యాధునిక ల్యాబ్ పరికరాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి బయట వ్యక్తులకు అప్పగించడంపై పైస్థాయి అధికారులు దృష్టి సారించారు. దీనికి కారకులెవరు? సహకరించిన అధికారులెవరు? అనే విషయాలపై విచారణ చేపట్టనున్నారు. అలానే రోజువారీ పరీక్షలు, వాటికి చెల్లించిన మొత్తంపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించనున్నట్లు ఓ అధికారి ద్వారా తెలుస్తోంది. ల్యాబ్ నిర్వహణపై ఇప్పుడే కొత్తకోణాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో రోజువారీ పరీక్షల డేటాను వెలికి తీసి, ఒక్కో పరీక్షకు ఏమేరకు చెల్లింపులు చేశారనే లోతైన విచారణ దిశగా చర్యలకు దిగనున్నారు. ఇది చదవండి : చేసిన పాపాలే వెంటాడుతున్నాయి!! -
ప్లాస్టిక్ కుర్చీలను వదల్లేదు..
-
కోడెల.. ఇంత కక్కుర్తా?
శాసన సభ మాజీ స్పీకర్ కోడెల కుటుంబం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తోపుడుబండిపై ఆధారపడిన చిరువ్యాపారి నుంచి బడా కాంట్రాక్టర్ వరకు కే–ట్యాక్స్ వసూలు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకుంది. పేదల ఆకలి తీర్చాల్సిన అన్న క్యాంటీన్ భోజనాలను కోడెల కుమార్తెకు చెందిన సేఫ్ కంపెనీ కార్మికులకు విక్రయించి సొమ్ముచేసుకుంది. చివరికి మూగజీవాల ఆకలి తీర్చాల్సిన గడ్డినీ వదల్లేదు. ఇప్పుడు అసెంబ్లీ ఫర్నిచర్‌ను అక్రమంగా తరలించి కుమారుడి షోరూమ్‌లో వాడుకున్నారు. రూ.లక్షల విలువచేసే డైనింగ్ టేబుల్ నుంచి నాలుగైదు వందల రూపాయల విలువ కూడా చేయని ప్లాస్టిక్ కుర్చీ వరకూ వదలకుండా అక్రమంగా తరలించుకున్నారు. అసెంబ్లీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశాక, ఫర్నిచర్ అప్పగిస్తానంటూ కోర్టును ఆశ్రయించిన కోడెల శివప్రసాద్ తీరును చూసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. సాక్షి, గుంటూరు: శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబ సభ్యుల కక్కుర్తిని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. కోడెల కుటుంబం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పేదల నుంచి బడా కాంట్రాక్టర్ వరకూ ప్రతి ఒక్కరి నుంచి కే–ట్యాక్స్ రూపంలో రూ.కోట్లు దోచుకున్నారు. ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. కోడెల కుటుంబం అక్రమాలు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజవకర్గాలను దాటి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్‌ను అక్రమంగా తన కుమారుడి షోరూమ్‌కు తరలించిన విషయం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంలో తుళ్లూరు పోలీసులు కోడెల శివప్రసారావుపై సెక్షన్ ఐపీసీ సెక్షన్ 409, ఆయన కుమారుడు శివరామకృష్ణ (శివరామ్)పై 414 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గుంటూరు నగరంలోని శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌లోని అసెంబ్లీ ఫర్నిచర్‌ను సీజ్ చేశారు. అసెంబ్లీ అధికారుల అనుమతి మేరకే పాత అసెంబ్లీలో ఫర్నిచర్‌కు భద్రత దృష్ట్యా తన కార్యాలయాలకు తరలించానని కోడెల బుకాయిస్తూ వచ్చారు. అయితే కోడెల కుమారుడి షోరూమ్‌లో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ అనధికారికంగా తరలించారని అధికారులు నిగ్గు తేల్చారు. ప్లాస్టిక్ కుర్చీలను వదల్లేదు.. అప్పనంగా వస్తున్నాయనే ఉద్దేశంతో రూ.70 లక్షల ఖరీదైన డైనింగ్ టేబుల్ నుంచి వందల రూపాయల విలువసేజే ప్లాస్టిక్ కుర్చీలను కూడా వదలకుండా కుమారుడి షోరూమ్‌కు కోడెల తరలించారు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల శివరామ్ దర్జాగా షోరూమ్‌లో రెండేళ్లు వినియోగించుకున్నారు. ఆఖరికి అసెంబ్లీ నుంచి తెచ్చిన పెన్నూ పేపర్లు కూడా శివరామ్ షోరూమ్‌లో వినియోగించారని అక్కడ పనిచేసిన ఉద్యోగులే చెబుతున్నారు. ప్లాస్టిక్ కుర్చీలను వదలకుండా షోరూమ్‌లో తెచ్చిపెట్టుకున్న కోడెల కక్కుర్తిని తలుచుకుని వారి సిబ్బందే నవ్వుకుంటున్నారు. గతంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి అన్నా క్యాంటీన్లో పేదల ఆకలి తీర్చాల్సిన భోజనాన్ని తన సేఫ్ కంపెనీకి తరలించి అక్కడ పనిచేసే కార్మికులకు విక్రయించి నవ్వులపాలైన విషయం తెలిసిందే. పశువులకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గడ్డిలోనూ ఆమె అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాలను మర్చిపోకముందే అసెంబ్లీలోని ప్లాస్టిక్ కుర్చీలను కూడా వదలకుండా తెచ్చుకున్నారన్న విషయం తెలిసి జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. రాబోయే రోజుల్లో కోడెల కుటుంబం కక్కుర్తి వ్యవహారాలు ఇంకెన్ని వెలుగు చూస్తాయోనని చర్చించుకుంటున్నారు. అధికారులు ఇంకా కోడెల కార్యాలయాలు, నివాసాల్లోని అసెంబ్లీ ఫర్నిచర్‌ను సీజ్ చేయలేదు. కొంత ఫర్నిచర్ గుంటూరులోని కోడెల కుమార్తె నివాసంలోనూ ఉందని వారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. -
కోడెల స్కాంపై విచారణ జరపాలి: పురంధేశ్వరి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫర్నిచర్ స్కాంపై విచారణ చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు తన ఇంటికి మళ్లించి అప్రతిష్టపాలైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన పురంధేశ్వరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి పక్కదారి పట్టిన ఫర్నిచర్ విషయంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. అందుకు కారణమైన దోషులు ఎవరైనా సరే.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చాం.. అని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. -
కోడెల కుమార్తెపై కేసు నమోదు
నరసరావుపేట టౌన్: మాజీ స్పీకర్ కోడెల వరప్రసాదరావు కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మిపై సోమవారం మరో కేసు నమోదైంది. తమ నుంచి సర్జికల్ కాటన్ కొనుగోలు చేసి రూ.15 లక్షలను ఎగ్గొట్టారంటూ ఖమ్మం జిల్లా కొత్తూరు కు చెందిన చల్లా రవీంద్రరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రవీంద్రరెడ్డి డాక్టర్ పూనాటి విజయలక్ష్మికి చెందిన సేఫ్ ఫార్ములేషన్ లిమిటెడ్ కంపెనీకి నాలుగేళ్లుగా సర్జికల్ కాటన్ విక్రయిస్తున్నారు. గడచిన ఏడాది ఆ కంపెనీకి రూ.36 లక్షల విలువైన కాటన్ సరఫరా చేయగా.. రూ.21 లక్షలను తిరిగి చెల్లించారు. మిగిలిన రూ.15 లక్షల కోసం రవీంద్రరెడ్డి విజయలక్ష్మి వద్దకు వెళ్లగా ఆమె అసభ్య పదజాలంతో దూషించారు. తనను తన్ని తరిమేయాలని కంపెనీ జనరల్ మేనేజర్ రామకృష్ణ, మరో ఉద్యోగి నాగేశ్వరరావును ఆదేశించటంతో వారు తనపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విజయలక్ష్మి, మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. -
హైకోర్టును ఆశ్రయించిన కోడెల
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన ఇంటికి తరలించుకున్న వ్యవహారంలో కేసుల నుంచి బయటపడేందుకు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నానా తిప్పలు పడుతున్నారు. ఇందులో భాగంగా హైకోర్టును ఆశ్రయించారు. ఫర్నిచర్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఇచ్చేస్తానని, వాటిని తీసుకెళ్లేలా అసెంబ్లీ అధికారులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ ఫర్నిచర్ తీసుకెళ్లకపోతే, వాటి వ్యయాన్ని చెల్లిస్తానంటూ ఆయన కోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యంపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ షోరూమ్‌లో ఉన్న శాసన సభ ఫర్నిచర్‌ను అధికారులు సోమవారం స్వాధీనం చేసుకుని వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. 2017లో అనుమతులు లేకుండా వెలగపూడి, హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్‌ను గుంటూరులో ఉన్న తన కుమారుడికి చెందిన గౌతమ్ షోరూమ్‌కు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తరలించిన విషయం విదితమే. ఎటువంటి అనుమతులూ లేకుండా అసెంబ్లీ ఫర్నిచర్‌ను గౌతమ్ షోరూమ్‌కు తరలించిన కోడెల శివప్రసాదరావు, ఆ ఫర్నిచర్‌ను వినియోగిస్తున్న అతని కుమారుడు శివరామ్‌పై అసెంబ్లీ సెక్షన్ అధికారి ఈ శ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఈ ఫర్నిచర్‌ను సోమవారం రాత్రి రెండు లారీల్లో వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. -
చేసిన పాపాలే వెంటాడుతున్నాయి!!
సాక్షి, గుంటూరు: ఆ సీనియర్ నాయకుడిని చేసిన పాపాలే వెంటాడుతున్నాయి. అన్ని విధాలుగా ఉచ్చు బిగుస్తున్నాయి. ఆయన వల్ల పార్టీ పరువే కాదు.. కుటుంబపరువూ పోయింది. ఇలాంటి నాయకుడిని పార్టీ నుంచి గెంటేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన చేసిన పాపాలు ఏంటి? గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెల శివప్రసాదరావుది ఒక చరిత్ర. రాజకీయాల్లోకి రాకముందు ఒక మంచి డాక్టరుగా పేరు పొందారు. కానీ ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో కావాల్సినంత చెడ్డపేరు తెచ్చుకున్నారు. తీవ్రమైన అత్యాశ, పదవీకాంక్ష కోడెలను రాజకీయంగా భ్రష్టు పట్టించాయి. కోడెల ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికయ్యాక 1983 నుంచి 85 వరకూ బాగానే సాగింది. ఆ తర్వాతే రాజకీయంగా ఎదగటం కోసం అనేక అడ్డదారులు తొక్కారు. విపరీతమైన పదవీ కాంక్ష కోడెలను పక్కదారి పట్టేలా చేసిందన్నది ఆయన అనుచరులే మాట. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లల్లోనే తుపాను బాధితులకు సాయంగా అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ఏకంగా తన ఇంట్లో దాచుకున్న ఆ బియ్యాన్ని అప్పట్లో కమ్యూనిస్టులు వెలుగులోకి తెచ్చారు. తుఫాను బియ్యం దోచుకున్న దొంగ అని అప్పట్లో చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఇతరుల ఆస్తులు బలవంతంగా లాగేసుకోవటం దగ్గర్నుంచి విలువైన స్థలాలు కబ్జాలు చేయటం, కమీషన్లు దండుకోవటం ఇలా ఎన్నో చేశారు. 1999 ఎన్నికల సమయంలో ఏకంగా ఆయన సొంత ఇంట్లోనే బాంబులు పేలి నలుగురు ముఖ్య అనుచరులు చనిపోయారు. మరెంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కోడెల సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. హోంమంత్రిగా ఉన్న సమయంలోనే విజయవాడలో వంగవీటి రంగా హత్య జరగటం, అందులో కోడెల పాత్ర ఉందన్న అరోపణలు వచ్చాయి. గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించటంతోపాటు ఎన్టీయార్ కుటుంబానికి కూడా కోడెల చాలా దగ్గర. ఈ కారణంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనను ఏమీ చేయలేకపోయారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కొంతకాలం వరకూ కోడెలే ఛైర్మన్ గా ఉన్నారు. ఆదే సమయంలో అక్కడ అక్రమాలు జరగడంతో ఆయన ఆ పదవిని వదలాల్సి వచ్చింది. ఇక గుంటూరు రాజకీయాల్లో శివప్రసాదరావు ఏం చెప్తే అదే జరిగేది. అలాంటి రాజకీయాలు చేయటం వల్ల అధినేత చంద్రబాబు కూడా ఆయనను పల్లెత్తి మాట అనలేదు. కొంతకాలంగా కోడెలకు, చంద్రబాబుకు పొసగటంలేదన్న వార్తలున్నాయి. అయినా తనకున్న పలుకుబడితో 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి సీటు సంపాదించి గెలిచారు. ఒక పత్రికాధిపతి రికమెండేషన్‌తో అసెంబ్లీకి స్పీకర్‌గా కూడా పనిచేశారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ కోడెల వైఖరిలో మార్పు రాలేదు. పైగా ఆయనే కాకుండా ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కూడా రంగంలోకి దిగారు. వారు సత్తెనపల్లి, నరసరావుపేటలో చక్రం తిప్పారు. ఎమ్మార్వో ఆఫీసులో ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే కోడెల మనుషులకు ఐదు వందల రూపాయలు లంచం ఇవ్వాలి. ఆ తరువాతే సర్టిఫికెట్ తెచ్చు్ఓవడానికి వీలయ్యేది. ఈ లంచావతారాలను తట్టుకోలేక బిల్డర్లు పనులు ఆపేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. కే టాక్స్ పేరుతో వందల కోట్ల రూపాయలు ప్రజల ముక్కుపిండి వసూలు చేశారు. చివరికి ప్రభుత్వ ఆస్తిని సైతం చోరీ చేసే స్థాయికి దిగజారారు. అసెంబ్లీలో ఉండాల్సిన కోట్ల విలువైన ఫర్నీచర్‌ను నేరుగా తన ఇంటిలో దాచిపెట్టుకున్నారు కోడెల శివప్రసాద్. తాజాగా చోరీ వ్యవహారం బయట పడటంతో అధినేత చంద్రబాబుకు మంచి అవకాశం దొరికింది. దాంతో కోడెలను పార్టీ నుంచి పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంపై పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు. కోడెల చేసింది తప్పేనన్నారు. చంద్రబాబు కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేశారు. కోడెల తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవచ్చంటూ సూచించారు. అంటే కోడెలను బయటకు పంపించేందుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. త్వరలోనే కోడెల వ్యవహారంపై ఒక కమిటీ ద్వారా విచారణ జరిపించి, వెంటనే షోకాజు నోటీసులు ఇవ్వటం, దానిపై కోడెల స్పందించిన తీరు నచ్చలేదన్న కారణంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. మొత్తమ్మీద కోడెలకు పచ్చ పార్టీలో నూకలు చెల్లిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఈ సంకట స్థితి నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి. -
కోడెల కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ను అతని తనయుడికి చెందిన షోరూమ్‌లో గుర్తించిన ఘటన మరువక ముందే మరో దోపిడి బయటపడింది. సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గతంలో అదృశ్యమైన ల్యాప్‌టాప్‌లు వెలుగులోకి వచ్చాయి. నాడు కోడెల దోపిడికి మాయమైన 29 ల్యాప్‌ట్యాపులు అనూహ్యాంగా ఆర్డీఏ ఆఫీసులో ప్రత్యక్షమయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ శివరామ్.. ప్రభుత్వ కార్యాలయంలోని విలువైన వస్తువులను అనుచరులకు విచ్చలవిడిగా పంచిపెట్టారు. ఈ సందర్భంలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోని విలువైన ల్యాప్‌టాప్‌లను తన అభిమానులకు ధారాదత్తం చేశాడు. తాజాగా వాటిపై కేసు నమోదు కావడంతో తప్పించుకునేందుకు రాత్రికిరాత్రే కొత్త ల్యాప్‌టాప్‌లు కొని వాటి స్థానంలో పెట్టారు. కాగా కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్‌చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్(ఇన్ఫ్రాస్ట్రక్చర్)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్ఎస్పీ బంగ్లాలో భద్రపరిచారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎన్ఎస్పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు. 2018లో కోడెల శివరామ్.. ల్యాప్‌టాప్‌లను, ప్రింటర్‌ను తమ వారికి అందించాలని అజేష్‌చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కోడెల కుమారుడు శివరామ్ అధికార బలంతో కాజేశారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ఆదేశాల మేరకు బాజీబాబు 16న సత్తెనపల్లి వచ్చి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారి ఆదేశాల మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
తిరుపతిలోనూ ‘కే’ ట్యాక్స్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ పాలనలో గుంటూరు జిల్లా నర్సరావుపేట, సత్తెనపల్లె ప్రాంతాల్లో విధించిన ‘కే’ ట్యాక్స్ వ్యవహారం చిత్తూరు జిల్లా తిరుపతి వరకూ పాకింది. గడిచిన ఐదేళ్లుగా రుయా ఆస్పత్రి కేంద్రంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం బినామీ ద్వారా ప్రతినెలా రూ.40 లక్షల దాకా కొల్లగొడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌ల నిర్వహణను అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడాల్ సంస్థకు అప్పగించింది. తిరుపతి, గుంటూరు ఆస్పత్రుల్లో మాత్రం ‘లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్ ల్యాబ్’కు అప్పగించారు. కోడెల శివరాం బినామీ మనోజ్‌కు చెందినదే ఈ లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్ ల్యాబ్. తిరుపతి రుయా ఆస్పత్రిలో రూ.4 కోట్లకు పైగా విలువైన అత్యాధునిక పరికరాలున్నాయి. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన నిపుణులు ఉన్నారు. అయినప్పటికీ అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఒత్తిడి మేరకు రుయా ఆస్పత్రిలో ల్యాబ్ నిర్వహణను లక్ష్మీ వెంకటేశ్వర క్లినికల్ ల్యాబ్‌కు కట్టబెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్ఐవీ టెస్టు చేయడానికి రూ.150 తీసుకుంటారు. కానీ, లక్ష్మీవెంకటేశ్వర సంస్థ రూ.850 వసూలు చేస్తోంది. రూ.80తో చేసే థైరాయిడ్ టెస్టుకు ఏకంగా రూ.350 దండుకుంటోంది. వైద్య పరీక్షల పేరిట ప్రతినెలా రోగుల నుంచి రూ.40 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్షలను రుయా ఆస్పత్రి నిపుణులు సొంతంగా నిర్వహిస్తే కేవలం రూ.15 లక్షలే ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్ ల్యాబ్ ప్రతినెలా రూ.25 లక్షలు అధికంగా పిండుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కన గత ఐదేళ్లలో రూ.15 కోట్లు అదనంగా గుంజుకున్నట్లు తెలుస్తోంది. వైద్య పరికరాల సరఫరాలోనూ.. మెడికల్ సర్జికల్ పరికరాలను సరఫరా చేసే కాంట్రాక్టును సైతం కోడెల శివరాంకు చెందిన జయకృష్ణ, సాయికృష్ణ మెడికల్ ఏజెన్సీ దక్కించుకుంది. నిబంధనల ప్రకారం.. ఇలాంటి కాంట్రాక్టును స్థానికంగా ఉన్న ఏజెన్సీకే అప్పగించాలి. టీడీపీ సర్కారు హయాంలో కోడెల తనయుడి ఏజెన్సీకి కట్టబెట్టారు. పైగా ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్ అప్లోడ్ టెండర్‌ను తక్కువ ధర కోట్ చేసిన ఏజెన్సీని కాదనీ, ఎక్కువ ధర కోట్ చేసిన బ్లూఫ్లాంట్ ఏజెన్సీకి కోడెల ఒత్తిడి మేరకు అప్పగించారు. దీన్ని కోడెల శివరాం బినామీ మనోజ్ నిర్వహిస్తున్నాడు. ‘కే’ ట్యాక్స్‌ను తిరుపతిలో అధికారికంగానే వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
గడ్డినీ తినేశారు..
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యుల అక్రమాల చిట్టాలో పశువులు తినే గడ్డీ చేరిపోయింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో ఆయన కుమార్తె కాజేసిన చిల్లర వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోడెల శివప్రసాద్ కుమార్తెకు ఔషధాల తయారీ కంపెనీతోపాటు సాయికృప అనే ఓ సంస్థ ఉంది. కరవు కాలంలో పశువులకు సైలేజీ (మాగుడు) గడ్డి పంపిణీ చేయడం ఈ కంపెనీ ఉద్దేశాలలో ఒకటి. పచ్చి గడ్డిని కోసి శుద్ధి చేసి కార్బోహైడ్రేట్లను సేంద్రియ ఆమ్లాలుగా మార్పు చేసి పోషక విలువలకు ఎటువంటి నష్టం లేకుండా తిరిగి మేతగా ఉపయోగిస్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ సంస్థ సైలేజీ గడ్డి పంపిణీకి పశు సంవర్థక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట, నకరికల్లు, రొంపిచర్ల తదితర ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాలకు గడ్డి సరఫరా చేసే బాధ్యత స్వీకరించి నిధులు కాజేసేందుకు పథక రచన చేసింది. భారీ ఇండెంట్‌తో ఖజానాకు చిల్లు నిబంధల ప్రకారం ఒక్కో గ్రామంలో 5 ఎకరాల్లో సైలేజీ గడ్డి పెంపకానికి తొలుత అనుమతి ఇచ్చినా, ఆ తర్వాత ఈ నిబంధనను మార్చేస్తూ పశు సంవర్థక శాఖ డైరెక్టర్ సోమశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ గడ్డి పెంపకానికి ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు పశు సంవర్థక శాఖ ఎకరానికి రూ.10 వేలు కౌలు ఇస్తుంది. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కూడా రూ.11 నుంచి 12 వేల వరకు కరవు పనుల కింద ఇచ్చేది. పంపిణీ కంపెనీలు సైలేజీ యంత్రం ద్వారా 50 కిలోల నుంచి గరిష్టంగా 400 కిలోల వరకు గాలి చొరబడడానికి వీలు లేకుండా గడ్డిని చుట్ట చుట్టి మోపు (బేల్స్)గా తయారు చేస్తాయి. ఈ గడ్డికి కిలో రూ.6.80 చొప్పున (రవాణా, లోడింగ్, అన్లోడింగ్ కలుపుకుంటే కేజీ రూ.9 నుంచి రూ.11 వరకు) ప్రభుత్వం పశు సంవర్థక శాఖతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీలకు ఇస్తుంది. ఇందులో లబ్ధిదారుడు భరించాల్సింది కిలో గడ్డికి రూ.2 మాత్రమే. ఈ నేపథ్యంలో అప్పట్లో గుంటూరు జిల్లా జేడీ రజనీ కుమార్, డైరెక్టర్ సోమశేఖర రావు సత్తెనపల్లి నియోజకవర్గానికి 200 టన్నులతో ఇండెంట్ ప్రారంభించి 500, 1000, 1500 టన్నులకు పెంచి కోడెల కుమార్తె కంపెనీ సాయికృపకు ఇచ్చారు. ఒక్క 2017–18లోనే ఈ సంస్థ 20 వేల టన్నుల గడ్డిని రైతులకు పంపిణీ చేసినట్టు లెక్కలు చూపి కోట్లాది రూపాయలు కాజేసినట్టు తేలింది. తమకింకా 2,800 టన్నులకు బిల్లులు రావాల్సి ఉందని పశు సంవర్థక శాఖకు లేఖ రాయడం విజిలెన్స్ విభాగం దృష్టికి రావడంతో విషయం బయటకు పొక్కింది. లబ్ధిదారు నుంచి కిలో గడ్డికి రూ.2 చొప్పున వసూలు చేయాల్సిన మొత్తాన్ని కోడెల ఆయా గ్రామాల్లోని అనుచరులతో కట్టించి.. ఆ గడ్డి రవాణా, లోడింగ్, అన్లోడింగ్ కూడా వారే చేసినట్లు రాతకోతలు పూర్తి చేసే వారని సమాచారం. -
మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెలపై ఐపీసీ 409 సెక్షన్ కింద, తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్‌పై ఐపీసీ 414 సెక్షన్ కింద కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల తన ఇంటికి మళ్లించిన వ్యవహారం బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో భద్రత లేక తన క్యాంపు కార్యాలయాల్లో ఆ ఫర్నిచర్‌ను భద్రపరిచానని కోడెల చెప్పడం, అది ఆయన కుమారుడు శివరామ్‌కు చెందిన షోరూంలో కూడా వినియోగిస్తున్న తరుణంలో శుక్రవారం అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్‌లో రూ.కోట్ల అసెంబ్లీ ఫర్నిచర్ ఉందని తనిఖీల్లో గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఉంచి, వినియోగిస్తున్న కోడెల, శివరామ్‌లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మాజీ స్పీకర్ కోడెలకు అస్వస్థత
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. గుంటూరులోని కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
కోడెల తనయుడి షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ను అతని తనయుడికి చెందిన షోరూమ్‌లో గుర్తించారు. అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీ కె.రాజ్‌కుమార్, తహసీల్దార్ తాతా మోహన్‌రావు తదితరులు శుక్రవారం గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్‌లో తనిఖీలు నిర్వహించారు. మొదటి అంతస్తులో 10 బర్మా టేకు కుర్చీలను, రెండు, మూడో అంతస్తుల్లో యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న 22 కుర్చీలు, నాలుగు సోఫాలు, డైనింగ్ టేబుల్, టీపాయ్, దర్బార్ కుర్చీ, కంప్యూటర్లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించారు. 22 యూరప్ కుర్చీలు, డైనింగ్ టేబుల్ విలువ రూ.65 లక్షలు పైమాటేనని తెలుస్తోంది. అసెంబ్లీ అధికారుల బృందం వస్తున్నట్టు తెలియడంతో కోడెల తనయుడు శివరామ్ రవాణా శాఖ అధికారుల అధీనంలో ఉన్న తన షోరూమ్ తాళాలను తీసుకోలేదు. షోరూమ్ తాళాలను అప్పగించేందుకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉదయం నుంచీ ఫోన్ చేస్తున్నా మేనేజర్ అందుబాటులోకి రాలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేనేజర్ తాళాలు తీసుకుని షోరూమ్ తెరిచారు. పైఅంతస్తుల్లోకి అధికారులు తనిఖీకి వెళ్లే సమయంలో కోడెల తన లాయర్‌ను పంపి అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీ చేయడానికి వచ్చారంటూ సుమారు గంటపాటు కోడెల తరఫు న్యాయవాది టి.చిరంజీవి అధికారుల్ని అడ్డుకుని వాదనకు దిగారు. ఎట్టకేలకు పైఅంతస్తుల్లో తనిఖీ చేసిన అధికారులు పాత అసెంబ్లీ ఫర్నిచర్ మొత్తం అక్కడ ఉందని చెప్పారు. ఇదిలావుంటే.. సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయంలో రెండు కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారని పుకారు పుట్టించారు. నిన్న మొన్నటి వరకు కోడెల కార్యాలయంలో పనిచేసిన మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆకురాతి మల్లికార్జునరావు (అర్జునుడు) వాటిని దొంగిలించాడని కట్టుకథ అల్లారు. చోరీ జరిగినట్లు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. శుక్రవారం ఉదయం కోడెల కార్యాలయం వెనుక ఎవరో ఓ కంప్యూటర్ పడేశారని అదే వ్యక్తి పట్టుకొచ్చాడు. చోరీకి గురైనట్టు చెబుతున్న కంప్యూటర్ల లో కోడెల కే–ట్యాక్స్ వ్యవహారాలు, ఇతర బాగోతాలకు సంబంధించిన డేటా ఉందనే ప్రచారం సాగుతోంది. 30 ల్యాప్‌టాప్‌లు పట్టుకెళ్లారు! ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదుచేశారు. గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్‌చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్(ఇన్ఫ్రాస్ట్రక్చర్)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్ఎస్పీ బంగ్లాలో భద్రపరిచారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎన్ఎస్పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు. 2018లో కోడెల శివరామ్.. ల్యాప్‌టాప్‌లను, ప్రింటర్‌ను తమ వారికి అందించాలని అజేష్‌చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కోడెల కుమారుడు శివరామ్ అధికార బలంతో కాజేశారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ఆదేశాల మేరకు బాజీబాబు 16న సత్తెనపల్లి వచ్చి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారి ఆదేశాల మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడెలకు అస్వస్థత టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను గుంటూరు నగరం మూడు వంతెనల రోడ్డులోని శనక్కాయల ఫ్యాక్టరీ పక్కన ఉన్న కోడెల కుమార్తె విజయలక్ష్మీకి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
కోడెలది గజదొంగల కుటుంబం
సాక్షి, అమరావతి : టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం గజదొంగల కుటుంబంగా తయారైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోడెల పెద్ద గజదొంగ అని, కోడెల కుమారుడు, కుమార్తె పోలీసు కేసుల్లో ఉండి పారిపోయారని ఆరోపించారు. అటువంటి కోడెల ఇంట్లో దొంగతనం జరిగితే తానే చేయించానని దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చిన్న దొంగతనం డ్రామాను కోడెల తెరపైకి తెచ్చారన్నారు. ఇప్పటికైనా స్పీకర్‌గా ఉండి అనేక అన్యాయాలు చేశానని కోడెల ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారన్నారు. కోడెల దొరికిన దొంగ అని చంద్రబాబు దొరకని దొంగ అని దుయ్యబట్టారు. కోడెల పేర్కొంటున్న అర్జున్ మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి అని, అతడు తమ కార్యాలయం ఉద్యోగి కానేకాదన్నారు. కోడెల ఇంట్లో కంప్యూటర్లను దొంగిలించడానికి అర్జున్ను తానే పంపానని ఆరోపించడం దారుణమన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్లు సత్తెనపల్లిలో శిక్షణ కోసం కంప్యూటర్లు తెచ్చిపెట్టారన్నారు. వాటిలో కోడెల కుమారుడు, కుమార్తె 30 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారన్నారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేయాలని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీకి లేఖ రాశానని చెప్పారు. రెండు రోజుల క్రితం ఎండీ అక్కడకు వచ్చి కంప్యూటర్ల కోసం చూస్తే అవిలేవన్నారు. ఈ విషయం ఆ దొంగల ముఠాకు తెలిశాక రాత్రికి రాత్రే 29 కంప్యూటర్లు ప్రత్యక్షమయ్యాయన్నారు. కంప్యూటర్లు దొరికాయి కాబట్టి కేసును మూసివేయాలన్నది కోడెల ఉద్దేశమన్నారు. కంప్యూటర్ల కుంభకోణం బయటకు వస్తుందని తెలిసి కోడెల దీన్ని రచించారని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆయన ఇంట్లో దొంగతనాన్ని సృష్టించారని ఆరోపించారు. అదేవిధంగా అసెంబ్లీ సిబ్బంది వెళ్లి హీరో హోండా షోరూమ్‌ను తనిఖీ చేస్తే అక్కడ అసెంబ్లీ ఫర్నిచర్ అంతా కనిపించిందన్నారు. కోడెల దొంగిలించిన సొత్తును తిరిగి ఇచ్చేసినంత మాత్రాన కేసులు మాఫీ కావన్నారు. శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. -
గౌతమ్ షోరూమ్ వద్ద హైడ్రామా, సీన్లోకి కోడెల లాయర్!
సాక్షి, గుంటూరు : కోడెల శివరాం బైక్ షోరూమ్ వద్ద శుక్రవారం హైడ్రామా నెలకొంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన లాయర్‌తో కలిసి కొత్త డ్రామాలకు తెరతీశారు. బైక్ షోరూమ్ నుంచి అసెంబ్లీ అధికారులు ఫర్నీచర్‌ను రికవరీ చేసుకుంటున్న క్రమంలో వారిని అడ్డుకునే యత్నం జరిగింది. ఏ హోదాతో తనిఖీలు చేస్తారంటూ కోడెల లాయర్ అసెంబ్లీ అధికారులను ప్రశ్నించారు. షోరూమ్ ప్రైవేటు ప్రాపర్టీ అంటూ వితండవాదం చేశారు. అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలున్నాయని అసిస్టెంట్ సెక్రటరీ రాజ్‌స్పష్టం చేయడంతో రికవరీ కొనసాగింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సోదాల్లో అసెంబ్లీకి చెందిన పలు విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు. అదంతా యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత విలువైన విదేశీ ఫర్నీచర్‌గా తెలిసింది. వాటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. 32 కుర్చీలు, 4 సోఫాలు, 3 టేబుళ్లు, ఒక టీపాయ్, ఒక దర్బార్ ఛైర్, డైనింగ్ టేబుల్, గుర్తించి.. తహసీల్దార్ మోహనరావు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. డైనింగ్ టేబుల్, 22 కుర్చీలు విలువే రూ.65 లక్షలు ఉంటుందని సమాచారం. ఇక తాళాలు లేవనే కారణంతో రెండో ఫ్లోర్, నాలుగో ఫ్లోర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించలేదు. వారెంట్ లేకుండా తనిఖీలు చేస్తే కోర్టుకు వెళ్తామంటూ బెదిరింపులకు దిగారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను దొంగచాటుగా తన ఇంటికి తరలించుకున్న కోడెల శివప్రసాదరావు తన తప్పును అంగీకరించిన సంగతి తెలిసిందే. భద్రత లేదనే అసెంబ్లీ వస్తువుల్ని తన ఇంటికి తెచ్చుకున్నానని వివరణనిచ్చారు. వాటన్నింటినీ తిరిగి ఇచ్చేస్తాననీ.. లేదంటే విలువెంతో చెబితే చెల్లిస్తానని చెప్పుకొచ్చారు. ఇక కోడెల క్యాంప్ ఆఫీస్‌లో తనిఖీలు చేయాల్సి ఉంది. ఫర్నీచర్ రికవరీ నిమిత్తం తన నివాసం, వ్యాపార స్థలాల్లో అసెంబ్లీ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేసుకోవచ్చని నిన్న వెల్లడించిన కొడెల శుక్రవారం మాటమార్చడం గమనార్హం. -
కోడెల అడ్డంగా దొరికిపోయిన దొంగ..
సాక్షి, తాడేపల్లి: మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆరోపణలను ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. తానేదో కుట్ర చేసినట్లు అవాస్తవాలు మాట్లాడటం సరికాదని, కోడెలే పెద్ద గజదొంగ అని ఆయన విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. కోడెల ఇంట్లో దొంగతనం జరిగితే తానే చేయించానని దుష్ర్పచారం జరుగుతుందని... పెద్ద దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు చిన్న దొంగతనం డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. కోడెల చెబుతున్న అర్జున్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆరా తీస్తే అతడు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా తేలిందన్నారు. చోరీ చేసిన సొత్తును తిరిగి ఇచ్చినంత మాత్రాన నేరం కాకుండా పోదని, కోడెల శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఎవరు దొంగలో తేలిపోతారని హెచ్చరించారు. కోడెల శివప్రసాద్ దొరికిపోయిన దొంగ అన్నారు. తాను చిత్తశుద్ధితో ఉన్నానని, దొంగతనాలు చేయించడానికి సిద్ధంగా లేనని పేర్కొన్నారు. కోడెలకు సంబంధించిన హీరో హోండా షోరూమ్‌ను ఆ కంపెనీ సీజ్ చేసిందని, అక్కడ అసెంబ్లీ ఫర్నీచర్ ఉందని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. షోరూమ్ తన క్యాంపు ఆఫీస్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఫర్నిచర్ దొంగతనం చేసి కోడెల కార్యాలయంలో దాచుకున్నారని, అసెంబ్లీకి సంబంధించిన 30 కంప్యూటర్లు కోడెల శివప్రసాదరావు కొడుకు, కూతురు కలిసి అమ్ముకున్నారన్న ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై స్కిల్ డెవలప్మెంట్ అధికారికి ఈ నెల 9వ తేదీన ఫిర్యాదు చేశానని చెప్పారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని లేఖ రాసినట్లు చెప్పారు. దొంగతనం కోడెల ప్రమేయంతోనే జరిగిందన్నారు. తానేదో కుట్ర చేసి దొంగతనం చేయించినట్లు దుష్ర్పచారం జరుగుతుందన్నారు. ఇది ఒక కంప్యూటర్ కొత్త కుంభకోణమని అభివర్ణించారు. కోడెల సరికొత్త డ్రామా... కాగా సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో కంప్యూటర్ల చోరీతో డ్రామా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కోడెల ఇంట్లో చోరికి గురైనట్టుగా చెబుతున్న కంప్యూటర్లు ప్రభుత్వానివి. విద్యార్థుల శిక్షణకు ఉపయోగించాల్సిన వీటిని సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి గతంలో తన ఇంటికి తెప్పించుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి కంప్యూటర్లు మాయమైన విషయాన్ని ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల విచారణ వేగవంతం కావడంతో చోరీ నాటకానికి కోడెల తెర తీశారు. శుక్రవారం ఉదయం స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది కోడెల నివాసం నుంచి కంప్యూటర్లను తీసుకెళ్లారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ అధికారి... ఎమ్మెల్యే అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లి పోయిన కంప్యూటర్లు దొరికాయని చెప్పగా.... ‘నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరెందుకు కంపూటర్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును రికవరీ చేయాల్సింది పోలీసులు కదా’ అని అంబటి ప్రశ్నించగా సదరు అధికారి జవాబు చెప్పలేకపోయారు. దీంతో ఇదంతా కోడెల శివప్రసాదరావు ఆడించిన నాటకమని పక్కాగా తేలిపోయింది. -
‘వరదల్లోనూ చంద్రబాబు హైటెక్ వ్యవహారం’
సాక్షి, అమరావతి: వరదలపై మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను జన వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కృష్ణానదికి సంభవించిన వరదలు ప్రకృతి వైపరీత్యం వల్ల కాదని.. ప్రభుత్వ వైపరీత్యమే అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను మంత్రి అనిల్ కుమార్ దీటుగా తిప్పికొట్టారు. ‘చంద్రబాబు ఇవాళ పెట్టిన ప్రెస్‌మీట్ చూశాను. ఒకటైనా నిజం చెప్తారేమోనని ఆశించాం. కొన్ని ప్రాంతాల్లో వరద వల్ల ఇబ్బండి పడిన ప్రజల గురించి మాట్లాడతారని అనుకున్నాం. కానీ, ఆయన మాట్లాడిన అంశాలు ఏంటంటే... రిజర్వాయర్‌లో కట్టుకున్న తన ఇల్లు ఎలా మునిగిపోయిందనేది. ఆ ఇంటి మునకకు డ్రోన్‌తో చూపించే ప్రయత్నం ఎందుకు చేశారనేది. ప్రకాశం బ్యారేజీకి అంత వరద ఎలా వచ్చిందన్నది. తాను రాజధానిగా చెప్పిన పల్లపు ప్రాంతంలోకి నీరు ఎలా చేరిందనేది. ఇది ప్రకృతి విపత్తు కాదు, మానవ విపత్తు అంటూ మాట్లాడారు. చింత చచ్చిన పులుపు చావలేదనేది సామెత. చివరకు వరదల్లో కూడా హైటెక్ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు. మైకేల్ జాక్సన్ మైకు... పవర్ పోయిన పవర్ పాయింట్ ప్రజంటేషన్... ఇదీ చంద్రబాబు ప్రెస్‌మీట్. రాయలసీమలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని కడప జిల్లా ఎడిషన్‌లో ఈనాడు ఒక పూర్తి పేజీలో వార్త రాసింది. మరోవంక బాబుగారు మాత్రం సీమకు నీళ్లు తరలించడం లేదంటారు. ఇవన్నీ చూస్తుంటే ...అందరికీ అర్థమయ్యేది ఏంటంటే... తన అయిదేళ్ల పాలనలో ఒక్క సంవత్సంలో కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచిందల, ప్రకాశం బ్యారేజీ కాని నిండలేదని, తాను కరువు నాయకుడునని ప్రజలకు బాగా అర్థం అయ్యిందని చంద్రబాబు బాధపడుతున్నారు. దేవుడి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ రెండు నెలల్లోనే ప్రకృతి సహకరించి ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిగా నింపడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కరువుతో అల్లాడుతున్న సీమకు శ్రీశైలం నుంచి తరలిస్తున్న నీళ్లే ప్రాణాధారంగా మారుతుండటాన్ని బాబు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది పంటల పండబోతున్నాయన్న సూచనలు కనపడేసరికి బాబుకు ఎంతో బాధగా ఉన్నట్లుంది. వరదలు మేన్ మేడ్ అంటున్న బాబు, కరువు తన మేడ్ అని ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. వరదలు మేం సృష్టించామంటున్న బాబుగారు, కరువును తానే సృష్టించారేమో. ఎంతసేపు మాట్లాడినా నా ఇల్లు ముంచేయడానికే అంటున్న బాబు వాస్తవానికి అయిదేళ్ల పాలనతో తన కొంప, తన పార్టీ, తనను నమ్ముకున్న కార్యకర్తల కొంప ఏప్రిల్‌లోనే ముంచేశారు. ఎడారి నడుమ ఇల్లు కట్టుకుని నీళ్లు ఇవ్వలేదని ఎవరన్నా ఏడిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో...రిజర్వాయర్ మధ్య ఇల్లు కట్టుకుని తన ఇల్లు ముంచేశారని ఎవరన్నా ఏడిస్తే అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. ఇన్ని మాట్లాడిన మీరు కోడెల శివప్రసాదరావు ఏకంగా స్పీకర్‌గా తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేసి కొన్ని కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్‌ని ఎత్తుకుపోయాడన్నది ఇంత బహిరంగంగా కనిపిస్తున్నా దాని గురించి ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటే...దీని అర్థం ఏంటి? ఆ దొంగతనానికి మీ ఆశీస్సులు ఉన్నాయనే కదా? మీ దొంగల ముఠా వ్యవహారాన్ని బయటపడకుండా విషయాన్ని పక్కదారి పట్టించే భాగంగా వరదలపై మీరు ప్రెస్‌మీట్ పెట్టారని అందరికీ అర్థం అవుతుంది. చంద్రబాబు ప్రెస్మీట్లో ప్రజలెందుకు తనని ఓడించారన్న ఆలోచన లేదు. 13 జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా తన ఓటమికి కారణాలేంటో అన్న సమీక్ష లేదు. ఐదేళ్లపాటు ప్రతి ఒక్క విషయంలోనూ అబద్ధాలు చెప్పి, పార్టీని నిలువునా ముంచానన్న బాధలేదు. కాబట్టి చంద్రబాబుగారిని ఒక్కటే అడగదలచుకున్నా.. ఇప్పటికైనా నిజాలు చెప్పడం ప్రారంభించండి. మీ శేష జీవితంలో మీరేదో కొద్దిగా మారానని చెప్పుకునే ప్రయత్నం చేయండి’ అని హితవు పలికారు. -
మరోసారి బట్టబయలైన కోడెల పన్నాగం
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుడు, శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. శాసనసభలోని వస్తువులను గంపగుత్తగా సొంతానికి వాడుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన విద్యార్థుల కంప్యూటర్లనూ వదల్లేదని తాజాగా వెల్లడైంది. సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో కంప్యూటర్ల చోరీతో ఈ డ్రామా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ కంప్యూటర్లను ఇంట్లో పెట్టుకుని సొంతానికి వాడుకున్నట్టు తేలింది. అసలు కథ ఇదీ... కోడెల ఇంట్లో చోరికి గురైనట్టుగా చెబుతున్న కంప్యూటర్లు ప్రభుత్వానివి. విద్యార్థుల శిక్షణకు ఉపయోగించాల్సిన వీటిని సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి గతంలో తన ఇంటికి తెప్పించుకున్నారు కోడెల. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి కంప్యూటర్లు మాయమైన విషయాన్ని ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసుల విచారణ వేగవంతం కావడంతో చోరీ నాటకానికి కోడెల తెర తీశారు. ఈ రోజు ఉదయం స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది కోడెల నివాసం నుంచి కంప్యూటర్లను తీసుకెళ్లారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎమ్మెల్యే అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లి అప్పుడు పోయిన కంప్యూటర్లు దొరికాయని చెప్పారు. ‘నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరెందుకు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును రికవరీ చేయాల్సింది పోలీసులు కదా’ అని అంబటి ప్రశ్నించగా సదరు అధికారి జవాబు చెప్పలేకపోయారు. దీంతో ఇదంతా కోడెల శివప్రసాదరావు ఆడించిన నాటకమని అర్ధమైంది. అసెంబ్లీ ఫర్నీచర్‌నే కాదు విద్యార్థుల కంప్యూటర్లను సొంతానికి వాడుకున్న కోడెలపై స్థానికులు మండిపడుతున్నారు. (చదవండి: ‘కే’ మాయ) -
కోడెల కక్కుర్తి కేసు; మరో ట్విస్ట్
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్‌మన్ తెలిపారు. కరెంటు పనిచేయాలంటూ రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని చెప్పారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నట్టు కోడెల శివప్రసాదరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల నివాసంలోని ఫర్నీచర్‌ను పరిశీలించేందుకు నేడు అసెంబ్లీ అధికారులు రాబోతున్న సమయంలో దొంగతనం జరగడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కంప్యూటర్లల్లో నిక్షిప్తమైన కీలక సమాచారాన్ని మాయం చేసేందుకే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారన్న ఊహాగానాలు రేగుతున్నాయి. దుండగులు పడేసిన కంప్యూటర్ మానిటర్‌ను సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే సమాచారం నిక్షిప్తమైవుండే సీపీలను దుండగులు ఎత్తుకెళ్లడం చూస్తుంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టుగా ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ నుంచి విలువైన వస్తువులను సత్తెనపల్లిలోని తన ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టు కోడెల ఇప్పటికే ఒప్పుకున్నారు. ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని, లేకుంటే ఆ ఫర్నీచర్ ధర ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానంటూ వితండ వాదనకు దిగారు. కోడెల కక్కుర్తిపై ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టారు. (చదవండి: ‘కే’ మాయ) -
కోడెల కక్కుర్తికి చీఫ్ మార్షల్‌పై వేటు
సాక్షి, అమరావతి : శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కక్కుర్తి అసెంబ్లీ చీఫ్ మార్షల్‌పై వేటుకు దారి తీసింది. అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి తరలించుకున్న సంగతి తెలిసిందే. తీరా ఈ విషయం గుప్పుమనడంతో పోలీసు ఫిర్యాదు వరకు వెళ్లింది. దీంతో తాను ఆ ఫర్నీచర్ ఇచ్చేస్తానని అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు రాసినట్టు కోడెల తప్పించుకునే మార్గాలు వెతికారు. అత్యంత భద్రత కలిగిన గౌరవప్రదమైన అసెంబ్లీ నుంచి ఫర్నీచర్‌ను కోడెల ఎలా తీసుకెళ్లారనే దానిపై పోలీసులు విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ చీఫ్ మార్షల్ వేలూరు గణేష్‌బాబు విధి నిర్వహణలో వైఫల్యం వెలుగు చూసింది. పోలీసులు ఆయన్ను గురువారం విచారించారు. కోడెల, అసెంబ్లీ అధికారుల ఆదేశాల మేరకు తాను సహకరించానని గణేష్‌బాబు అంగీకరించినట్టు సమాచారం. తానే దగ్గరుండి కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్‌ను తరలించేలా వాహనాల్లోకి ఎక్కించినట్టు ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై చీఫ్ మార్షల్ నుంచి అంగీకార పత్రాన్ని రాతపూర్వకంగా తీసుకున్న పోలీసు అధికారులు క్రమశిక్షణ వేటు వేశారు. ఆక్టోపస్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్న గణేష్‌బాబు డిప్యుటేషన్‌పై అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఆయన్ను చీఫ్ మార్షల్ విధుల నుంచి తప్పించి పాత పోస్టింగ్‌కు వెళ్లాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి కోడెల ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో పోలీసు అధికారిపై వేటు పడటంతో అందుకు సహకరించిన మిగిలిన అధికారుల్లోనూ కలవరపాటు మొదలైంది. -
కోడెల పాపం.. నీడలా
సుబ్బన్న: ఏంది రామన్నా ఈ విడ్డూరం.. కుర్చీలు, సోఫాలు ఎత్తుకురావడమేందన్నా.. ఇదంతా నిజమేనంటావా.. రామన్న: నువ్వు మాట్లాడేది మన నాయకుడు కోడెల శివప్రసాద్ గురించేనా ? సుబ్బన్న: అవును రామన్నా.. ఆయన గురించే.. రెండు, మూడు రోజులుగా ఒకటే వార్తలు ఏవో సామాను ఎత్తుకొచ్చాడంట. రామన్న: అవునురా.. నిజమే.. అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నిచర్ సామగ్రి ఇంటికేసుకొచ్చాడు.. ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా.. సుబ్బన్న: ఆ సామానోదే ఇక్కడ మన ఊళ్లో కూడా దొరుకుతాయి కదా.. ఇదేం పాడు బుద్ధన్నా. రామన్న: ఏం చెప్పమంటావురా.. ఆయన మన నాయకుడు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది.. ఐదేళ్లు స్పీకర్‌గా వెలగబెట్టినప్పుడు ఆయన కొడుకు, కూతురు అడ్డగోలు అక్రమాలు, అవినీతి, వసూళ్లు, దందాలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడ్డారు. వాళ్లను తండ్రిగా మందలించాల్సిందిపోయి అధికారంతో కోడెల కొమ్ముకాశారు. చివరకు ఆయన ధనదాహంతో స్పీకర్ పదవికే మచ్చ తెచ్చారు. సుబ్బన్న: అవునన్నో.. వాళ్ల అక్రమాలు కేసుల రూపంలో గుట్టలు పగులుతున్నాయి. ఇన్నాళ్లకు ఆ కుటుంబం పాపం పండింది. ఇక కోడెల ఇంటి ఛాయలికి కూడా వెళ్లేది లేదన్నా.. ఏమంటావ్.. రామన్న: నువ్వు ఇప్పుడంటున్నావ్.. మనోళ్లంతా ఆయనకు గుడ్ బై చెప్పి చాలా రోజులైంది. కేట్యాక్స్ బాధితుల కన్నీళ్లే వాళ్లకు శాపంగా మారాయి. చివరికి వాళ్ల పాపాలే నీడలా వెంటాడుతున్నాయి. సాక్షి, గుంటూరు : అధికారం అడ్డంపెట్టుకొని కోడెల కుటుంబం చేసిన పాపాల పుట్ట పగులుతోంది. ప్రభుత్వం మారిన నెలల వ్యవధిలోనే రోజుకొక అవినీతి బాగోతం బయటపడుతోంది. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లుగా కోడెల కుటుంబం కూడా వారిని నమ్ముకున్నోళ్లను సైతం దోచుకున్నారు. అధికార బలంతో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. గత ఐదేళ్లలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల చేష్టలతో విసిగి వేసారిన ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇప్పటికే కే–ట్యాక్స్ వసూలు చేసిన కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి ఊరు విడిచి పరారయ్యారు. కోడెల శివప్రసాద్ మాత్రం పక్కనుండే నేతలు సైతం దూరమవడంతో ఏకాకిగా మారారు. సీనియర్ రాజకీయ నేత అయిన కోడెల శివప్రసాదరావు రాష్ట్రంలో అనేక పదవులు చేపట్టారు. తొలి నుంచి అధికారం అండతో దౌర్జన్యాలకు పాల్పడుతూ వచ్చారు. గత ఐదేళ్లలో ఇవి శృతి మించాయి. స్పీకర్ పదవిలో ఉంటున్నప్పటికీ అక్రమాలకు పాల్పడుతూ ఆ పదవికే కళంకం తెచ్చారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొన్న కుమారుడు కోడెల శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందినకాడికి దోచుకున్నారు. కోడెల కుటుంబం దోపిడీకి బలైన వారిలో అధిక శాతం టీడీపీ వారే కావడం గమనార్హం. ప్రభుత్వం మారిన తర్వాత కే ట్యాక్స్ బాధితులంతా పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కారు. ఉద్యోగాల పేరిట మోసాలు, భూకబ్జాలు, ల్యాండ్ కన్వర్షన్ అనుమతుల విషయంలో బలవంతపు వసూళ్లన్నీ బహిర్గతమయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతోసహా అతని కుమారుడు, కుమార్తె వారి అనుచరులపై 19 కేసుల వరకు నమోదయ్యాయి. దీంతో శివరామ్, విజయలక్ష్మిలు వారి అనుచరులతో అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కేసుల్లో ఉన్న తీవ్రత దృష్ట్యా కోర్టు సైతం నిందితులకు బెయిల్ నిరాకరించింది. కే ట్యాక్స్ కేసుల వ్యవహారం మరువక ముందే కోడెల శివరామ్ తన ద్విచక్రవాహన గౌతం షోరూంలో వాహనాల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల పన్నును ఎగ్గొట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు సచివాలయం మార్పు సమయంలో మాజీ స్పీకర్ కోడెల విలువైన సామగ్రిని అక్రమంగా తరలించుకు వెళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఛీకొడుతున్న ప్రజానీకం.. ఒకప్పుడు కోడెలను ఆధిరించిన ప్రజలే ప్రస్తుతం ఛీకొడుతున్నారు. సేవ్ సత్తెనపల్లి, క్విట్ కోడెల అంటూ సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ప్రజానీకం సాక్షాత్తు చంద్రబాబు ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో సత్తెనపల్లిలో మొఖం చాటేసిన కోడెల గత కొన్ని రోజులుగా నరసరావుపేటకు వచ్చి పోతున్నారు. కే ట్యాక్స్ బాధితులు ఆగ్రహంగా ఉండటంతో కోడెల రాకపోకలను వారి అనుచరులు గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలో గతంలో తన ఎన్సీవీ కేబుల్‌ను శివరామ్ దౌర్జన్యంగా ఆక్రమించి కే ఛానల్‌గా మార్చుకున్న వైనంపై ఆ కేబుల్ ఎండీ లాం కోటేశ్వరరావు సోమవారం మాజీ స్పీకర్ కోడెల ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న కోడెల బయటకు వచ్చేందుకు సాహసించలేదు. తన అనుచరులకు ఫోన్ చేసి పిలిచినా ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో పార్టీ నాయకులను, పోలీస్ అధికారులను ప్రాధేయపడినట్లు సమాచారం. ఒక్కరూ తోడు లేరు కోడెల కుటుంబం చేసిన (కేట్యాక్స్) బలవంతపు వసూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపై ఉక్కుపాదం మోపుతుండటంతో ధైర్యంగా ముందుకొస్తున్నారు. అయితే ఇదంతా తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తున్నారని కోడెల రాజకీయంగా సానుభూతి పొందేందుకు హై కమాండ్ వద్ద ప్రయత్నం చేసి భంగపడ్డారు. కోడెల కుటుంబంపై నమోదవుతున్న కేసుల వ్యవహారంలో ఖండన ఇచ్చేందుకు చంద్రబాబు సైతం వెనకాడారు. ఇక జిల్లా టీడీపీ నాయకులైతే ఈ విషయంలో నోరు తెరవడానికి భయపడుతున్నారు. దీంతో ఒకప్పుడు రాజకీయంగా గిట్టని వారిని కూడా కలిసి తనకు సహకరించాల్సిందిగా కోడెల ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. కేసుల విషయంలో తెలుగుదేశం అధిష్టానం స్పందించకపోవటంతో చివరకు బీజేపీలోకి చేరేందుకు కోడెల ప్రయత్నాలు చేసి భంగపాటుకు గురైనట్లు సమాచారం. తాజాగా కోడెల బాధితుడు లాం కోటేశ్వరరావు తనకు జరిగిన నష్టంపై చేసిన ఆందోళనను సైతం ఎమ్మెల్యే గోపిరెడ్డిపై నెపం నెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కోడెల ప్రయత్నించారు. దీనిని సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. చివరికి కోడెల ఏకాకిగా మారారు. -
అందుకే బాబు సైలెంట్ అయ్యారేమో!?
సాక్షి, అమరావతి : అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశారని మండిపడ్డారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కావడంపై శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ విషయంపై ట్విటర్లో స్పందించిన విజయసాయిరెడ్డి కోడెలపై విమర్శలు గుప్పించారు. కోడెల, ఆయన దూడలను ఇప్పటికైనా టీడీపీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం ఉందా అని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. చదవండి : చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..! పాపం చంద్రబాబు..! తమ పార్టీ నేతలంతా పోలోమని బీజేపీలో చేరుతున్నా కిక్కురమనలేని దయనీయ స్థితి చంద్రబాబు గారిది అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘అమిత్ షా గారికి కోపం వస్తుందేమోనని వణికి పోతున్నాడు. పార్టీ వదిలి వెళ్తున్న వారినీ నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. అవినీతి కేసులు తిరగ తోడతారనే భయం వల్ల సైలెంటైనట్టున్నాడు అని ఆయన ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు వరద బాధితులను పరామర్శించడంపై స్పందించిన విజయసాయిరెడ్డి...‘ నారా వారంటే వరుణిడికే కాదు వరదలకూ భయమే. ముంపు ప్రాంతాలను పర్యటిస్తామని సార్ ప్రకటించిన వెంటనే వరద నిలిచి పోయింది. అన్ని డ్యాముల గేట్లు మూతపడ్డాయి. ఇంతకూ ఈయన పరామర్శించేదెవరినో? మీ ఇల్లే మునిగి పోయిందట. ఇక మాకేం ధైర్యం చెబ్తారయ్యా అని బాధితులంతా ఈయననే ఓదార్చేట్టున్నారు’ అని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
‘ఆ పూజారి కొబ్బరి చిప్పల్ని కూడా వదల్లేదు’
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని ఫర్నీచర్, కంప్యూటర్లు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం అంబటి మీడియాతో మాట్లాడుతూ... ‘అసెంబ్లీని దేవాలయంగా భావిస్తా. అక్కడ పూజారిగా మాత్రమే ఉన్నానంటున్న కోడెల చివరికి కొబ్బరి చిప్పలను కూడా ఎత్తుకుపోయారు. తన కుమారుడు, కుమార్తెను పూజారులుగా నియమించారు. వస్తువుల్ని దొంగిలించి దొరికిపోయిన తర్వాత.. వాటిని తిరిగి ఇచ్చేస్తున్నామంటున్నారు. కోడెల కుమారుడు, కుమార్తె ఇప్పటికే రాష్ట్రం విడిచి పారిపోయారని వార్తలొస్తున్నాయి’ అని పేర్కొన్నారు. రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్ని తప్పుగా చిత్రీకరించారని అంబటి మండిపడ్డారు. ‘రాజధానిని అమరావతిలో కట్టొద్దని శివరామకృష్ణన్ చెప్పిన విషయాన్ని మాత్రమే బొత్స ప్రస్తావించారు. అంతేగాని రాజదానిని మార్చుతారని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆ రెండు పత్రికలు వాటి ఇష్టమొచ్చినట్లు రాసుకున్నాయి. అమరావతి, పోలవరంపై చేస్తున్న ప్రచారాలను నమ్మొద్దు. రాజధాని, పోలవరం, అన్న క్యాంటీన్లలో టీడీపీ నేతలు వేల కోట్ల రూపాయలు కాజేశారు’అని అంబటి విమర్శలు గుప్పించారు. -
‘కే’ మాయ
సాక్షి, అమరావతి : కంచే చేను మేస్తే.. అన్న సామెత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అతికినట్లు సరిపోతుంది. ఆయన స్పీకర్‌గా ఉన్నప్పుడు సర్కారు సొమ్ముకు కాపలాదారుగా ఉండాల్సింది పోయి అందినకాడికి సామగ్రిని ఇంటికి తరలించేయడం వెలుగు చూడటంతో ఔరా.. కోడెలా.. మజాకా.. అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా అసెంబ్లీలో భద్రత లేనందుకే ఇంటికి తెచ్చుకున్నానని దబాయించడం చూసి విస్తుపోతున్నారు. ‘కే ట్యాక్స్’ పేరుతో ఐదేళ్లపాటు సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల ప్రజల్ని పీడించిన ఈయన గారి కుటుంబ గాథలు రోజుకొకటి వెలుగు చూసిన తరుణంలో తాజాగా ఈ చిలక్కొట్టుడు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ అసెంబ్లీని 2017 మార్చిలో హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చారు. ఆ సమయంలో స్పీకర్ చాంబర్, పేషీకి సంబంధించిన ఫర్నీచర్‌ను మాత్రం సత్తెనపల్లి, నర్సరావుపేటలోని కోడెల ఇంటికి తరలించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్‌గా ఉన్న సమయంలో తన చాంబర్, పేషీ కోసం మలేషియా నుంచి ప్రత్యేకంగా ఫర్నీచర్‌ను కొనుగోలు చేయించారు. వీటిని 2017లో అమరావతికి తరలించాల్సి ఉండగా కోడెల మాత్రం తన ఇంటికి చేరవేశారు. ఫర్నీచర్‌తోపాటు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని సైతం తన నివాసానికి చేర్చడం గమనార్హం. ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఎన్ని తరలించాలనే లెక్కాపత్రం లేకుండా ఇష్టానుసారం వ్యవహరించి కొన్నింటిని స్క్రాప్ కింద విక్రయించేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అసెంబ్లీ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు విషయాలు బయటపడ్డాయి. సీసీ కెమేరాలు ఆపివేసి.. హైదరాబాద్ నుంచి అమరావతి అసెంబ్లీకి తెచ్చిన ఫర్నీచర్‌ను గదుల్లో ఉంచగా అనంతరం వాటిని సైతం కోడెల తన ఇంటికి లారీల్లో తరలించారు. ఈ వ్యవహారానికి అసెంబ్లీ చీఫ్ మార్షల్ సహకరించి సీసీ కెమెరాలను ఆపి వేసినట్లు సమాచారం. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు కూడా కంప్యూటర్లు, కొంత ఫర్నీచర్‌ను కోడెల మనుషులు భారీగా తరలించారు. కోడెల వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఉద్యోగి ఇందులో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. బాగున్న వాటిని తన ఇంటికి పంపాలని కోడెల ఆదేశించడం, ఆ ఉద్యోగి లారీలు తెప్పించి లోడ్ చేయించడం, చీఫ్ మార్షల్ అందుకు సహకరించడం అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ అధికారులు, సిబ్బంది ఇదంతా చూసినా ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. కొనసాగుతున్న విచారణ.. అసెంబ్లీ కాలపరిమితి ముగిసిన తరువాత నూతన స్పీకర్ కార్యాలయానికి ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్ సహా అన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అసెంబ్లీ అధికారులు సరిచూసుకుని నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చిన తర్వాతే సిబ్బందిని రిలీవ్ చేస్తారు. కానీ లెక్కలు తేలకుండానే కోడెల సిబ్బందికి ఎన్ఓసీలిచ్చి రిలీవ్ చేయడంతోపాటు భారీ ఎత్తున ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు మాయమైనట్లు స్పష్టమైంది. దీనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు డీఎస్పీ వై.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తీసుకెళ్లడం నిజమే: కోడెల నరసరావుపేట: పాత అసెంబ్లీ హాలు స్పీకర్ కార్యాలయంలోని ఫర్నిచర్‌కు భద్రత లేనందున తన దగ్గర ఉంచుకున్న మాట నిజమేనని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంగీకరించారు. వాటిని తీసుకెళ్లాలని లేదా విలువ కడితే నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటికే లేఖలు రాశానని చెప్పారు. నరసరావుపేటలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు, సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయాల్లో ఆ ఫర్నిచర్‌ను ఉంచామన్నారు. ఎన్నికల అనంతరం తనపై కేసులు నమోదు కావటంతో ఆలస్యమైందన్నారు. తాను వినియోగించుకున్న కంప్యూటర్లు, ఫర్నిచర్‌కు లెక్క చెప్పాలని కోరడంతో అసెంబ్లీ కార్యదర్శికి రెండు ఉత్తరాలు రాసినట్లు చెప్పారు. తాను వాడుకున్న ఫర్నిచర్‌కు విలువ కడితే డబ్బులు చెల్లిస్తానని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి మరోసారి లేఖ రాస్తానని తెలిపారు. ఇందులో తాను దుర్వినియోగం చేసిందేమీ లేదన్నారు. భద్రత లేని కారణంగా వాటిని తన వద్ద ఉంచుకున్న మాట నిజం అని స్పష్టంగా చెబుతున్నానన్నారు. -
నరసరావుపేట పరువు తీసేశారు...
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి తరలించడం సిగ్గు చేటు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ...‘ కోడెల వ్యవహారం కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోపెట్టినట్లు ఉంది. ఏకంగా అసెంబ్లీ ఫర్నీచర్‌ను దోచుకున్న ఘనుడు. అసెంబ్లీ ఫర్నిచర్ ప్రజల ఆస్తి, దాన్ని ఎలా తీసుకువెళతారు?. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచమైన పనులు చేశారు. అవసరం అయితే మేం చందాలు వేసుకొని కొనిస్తాం. కోడెల.. నరసరావుపేట నియోజకవర్గం పరువు తీసేశారు. చదవండి: చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..! నరసరావుపేట వాసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. కోడెల వల్ల నరసరావుపేట ఎమ్మెల్యేగా నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. ఇప్పటికే కే ట్యాక్స్ పేరుతో దారుణమైన అక్రమాలకు పాల్పడ్డారు. కోడెల కుమారుడు వెయ్యి బైక్‌లకు ట్యాక్స్ కట్టకుండా రిజిస్టర్ చేయడంతో అసలు విషయం బయటకి వచ్చింది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు లేఖ రాసినట్లు బుకాయిస్తున్నారు. తప్పుడు తేదీలతో హడావుడిగా లేఖ రాశారు. వందల ఏళ్ల నాటి వారసత్వ సంపదను షోరూంలో పెట్టుకున్నారు. అసెంబ్లీలో ఇంకా ఘోరమైన దోపిడీలకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే మందులు కూడా అమ్ముకున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఐ ఫోన్లు కూడా అమ్ముకున్నారు. అన్న క్యాంటీన్లలో భోజనాలు తన ఫార్మా కంపెనీ వర్కర్లకు అమ్ముకున్నారు. విచారణలో అన్నీ బయటకు వస్తాయి. అవినీతికి పాల్పడ్డ కోడెలపై చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ?. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపుపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. చదవండి: కోడెల ఒప్పుకుంటే.. తప్పు ఒప్పవుతుందా? -
కోడెల ఒప్పుకుంటే.. తప్పు ఒప్పవుతుందా?
అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్‌గా పని చేసిన కోడెల శివ ప్రసాదరావు అసెంబ్లీలో ఫర్నీచర్‌ని ఇంటికి తీసుకెళ్లడం చాలా దారుణమని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఇప్పుడు దీనిపై విచారణ జరుగుతుంది కాబట్టే ఆ ఫర్నీచర్‌ని తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారని, ఒకవేళ విచారణ లేకపోతే దాని ఊసే ఉండేది కాదన్నారు. అసెంబ్లీలో భద్రత లేని కారణంగానే ఇంటికి తీసుకెళ్లానని కోడెల చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో లేని భద్రత ఆయన ఇంట్లో ఉంటుందా?, ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. విచారణలో ఆయన తప్పు చేశానని ఒప్పుకుంటే, తప్పు ఒప్పు అవుతుందా అని కన్నబాబు నిలదీశారు. ఇదే పనిని ఒక సామాన్యుడు చేస్తే ఏమంటారు.. దొంగతనమో, చేతివాటమనో అనేవారని ఎద్దేవా చేశారు. ఫర్నీచర్‌ను ఇంటికి తీసుకెళ్లడంపై కోడెలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వరదల కారణంగా పంటలు నష్టపోయిన చోట మళ్లీ పంటలు వేసుకునేలా ప్రోత్సాహిస్తామన్నారు. పంటలు పోయిన రైతులకు వంద శాతం సబ్బిడీపై విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నారని, దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మినుములు, పెసల విత్తనాలు కూడా సబ్బిడీపై ఇస్తామన్నారు. రాయలసీమకు కృష్ణ నీటిని తరలించామని, కళ్లకు కనిపిస్తున్నా దేవినేని ఉమ, మిగతా టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారని, వరదపై బురద రాజకీయాలు చేశారని కన్నబాబు మండిపడ్డారు. డ్రోన్ కోసం నానా రాద్దాంతం చేస్తున్నారని, అసలు ఈ రాష్ట్రంలో డ్రోన్ కార్పోరేషన్ ఏర్పాటు చేసింది బాబు కాదా? అని ప్రశ్నించారు. గతంలో గోదావరి పుష్కరాల్లో డ్రోన్ వాడలేదా..?, ప్రభుత్వం వరద వలన ఎవ్వరికి నష్టం లేకుండా చర్యలు తీసుకునేందుకు డ్రోన్ వినియోగించిందన్నారు. -
‘ప్రపంచంలో ఇలాంటి స్పీకర్ మరొకరు ఉండరు’
సాక్షి, గుంటూరు : అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఫర్నీచర్‌ను తానే తీసుకున్నట్టు శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఒప్పుకున్నారు. ఎవరైనా వస్తే ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేస్తా.. లేకపోతే విలువ ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానని చెప్తున్నారు. ఇక కోడెల వ్యవహారంపై నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. కోడెల లాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలతో ప్రజల్ని పీల్చి పిప్పిచేసిన కోడెల.. చివరికి దొంగతనానికి పాల్పడటం దారుణమని అన్నారు. (చదవండి : చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల శివప్రసాద్..!) కొట్టేసిన ఫర్నీచర్‌ని గుంటూరులోని గౌతమ్ హోండా షోరూమ్‌లో పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారులు నిలదీయడంతో చేసిన తప్పును ఒప్పుకున్నారని, ప్రపంచంలో కోడెల లాంటి స్పీకర్ మరొకరు ఉండరని ఎద్దేవా చేశారు. నరసరావుపేట పరువు పోతుందనే ఉద్దేశంతో ఇంకా కొన్ని విషయాలు బయటపెట్టడం లేదని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కోడెలకు డబ్బులు కావాలంటే తామంతా చందాలు వేసుకుని ఇస్తామని హితవు పలికారు. రాష్ట్రం విడిపోవడంతో అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్, కంప్యూటర్లు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించారు. ఈ క్రమంలో కొంత ఫర్నీచర్ మాయమైంది. అప్పుడు కోడెల శివప్రసాదరావు ఏపీ స్పీకర్‌గా ఉండటంతో ఆయనపై ఆరోపణలొచ్చాయి. -
చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..!
సాక్షి, గుంటూరు : అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఫర్నీచర్ మాయమవడంపై శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు వివరణ ఇచ్చారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నది వాస్తవమేనని అంగీకరించారు. సత్తెనపల్లిలోని తన ఇళ్లల్లో వాటిని తెచ్చి పెట్టుకున్నట్టు ఒప్పుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి అమరావతికి ఫర్నీచర్, కంప్యూటర్లు తరలించే క్రమంలో కొంత ఫర్నిచర్ కనిపించకుండా పోయింది. దీనిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. అసెంబ్లీకి చెందిన విలువైన వస్తువులు ఎవరికీ చెప్పకుండా కోడెల తన ఇంటికి తరలించడంపై అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. అయితే, కోడెల ఆ నోటీసులకు స్పందించలేదు. పైగా తాను రాసిన లేఖలు అధికారులకు చేరకపోయి ఉండవచ్చంటూ వింత వాదన తెరపైకి తెచ్చారు. ఎవరైనా వస్తే ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేస్తానని, లేకుంటే ఆ ఫర్నిచర్ విలువ ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానని చెప్తున్నారు. -
‘కోడెల’ దోపిడీపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : అధికారం అడ్డంపెట్టుకొని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అతని తనయుడు శివరామ్ చేసిన దోపిడీపై చర్యలు తీసుకోవాలని పమిడిపాడు గ్రామ మాజీ సర్పంచ్ లాం కోటేశ్వరరావు సోమవారం కోడెల ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను ఎండీగా ఉన్న ఎన్సీవీ కార్యాలయాన్ని కోడెల శివరామ్, అతని అనుచరులు గతంలో ధ్వంసం చేసి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం కలిగించారన్నారు. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోక పోగా తమపైనే తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కోడెల కుటుంబం చేసిన అరాచకాలు, దోపిడీ ప్రజలకు తెలియజేసేందుకే ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గాన్ని, వ్యాపారులను వదలకుండా కేట్యాక్స్ వసూలు చేశారన్నారు. భవన నిర్మాణాలు మొదలపెట్టిన తర్వాత అధికారులచే పనులు నిలిపివేసి యజమానుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్నారు. కమ్మ హాస్టల్ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు ఇచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ కళాశాలను అక్రమంగా అద్దెకు ఇచ్చి ప్రతి నెలా లక్షలాది రూపాయలు కోడెల శివరామ్ మెక్కాడన్నారు. చివరకు అన్న క్యాంటీన్ భోజనాలను సైతం కోడెల కుమార్తెకు చెందిన సేఫ్ కంపెనీలో పనిచేసే కార్మికులకు అమ్మి సొమ్ము చేసుకున్నారన్నారు. సొంత సామాజిక వర్గం కూడా చీదరించుకొనేలా కప్పం కట్టించుకొని, చివరకు కోడెల కుటుంబంతో సహా ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. మొదట కోడెల శివరామ్ కట్ చేయించిన కేబుల్ వైర్లను టాక్టర్‌లో తీసుకొచ్చిన లాం కోటేశ్వరరావు మాజీ స్పీకర్ ఇంటి ప్రాంగణంలో వాహనాన్ని అడ్డుగా నిలిపాడు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్ఐ వెంకట్రావు సిబ్బందితో వెళ్లి నచ్చచెప్పటంతో ఆందోళనను విరమించారు. -
కోడెల ఇంటి ముందు కేబుల్ ఆపరేటర్ ధర్నా
సాక్షి, గుంటూరు : టీడీపీ నేత, శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అక్రమాలకు బలైన ఓ కేబుల్ ఆపరేటర్ వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కబ్జాలు, అవినీతి, అక్రమాలతో తమ కులానికే చెడ్డపేరు తెచ్చారంటూ కోటేశ్వరరావు అనే వ్యక్తి కోడెల కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. ఎన్సీవీ పేరుతో నరసరావుపేటలో కోటేశ్వరరావు కేబుల్ నిర్వహిస్తుండేవాడు. కోడెల తనయుడు శివరామకృష్ణ కేబుల్ వైర్లు కత్తిరించి ఎన్‌సీవీని కబ్జా చేశాడు. దీంతో ఎన్సీవీ కేబుల్ వైర్లు కోడెల ఇంటి ముందు పడేసి సోమవారం ఆందోళనకు దిగారు. ఊరు వదిలి పారిపోయే పరిస్థితికి వచ్చారంటూ శివరామకృష్ణపై విమర్శలు చేశారు. కమ్మ హాస్టల్ నిర్మాణంలోనూ భారీగా అక్రమాలు చేశారని ధ్వజమెత్తారు. ఇదిలాఉండగా.. టీఆర్ లేకుండా సుమారు 800 బైక్‌లు విక్రయించిన వ్యవహారంలో కోడెల శివరామకృష్ణపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. (చదవండి : కోడెల కుమారుడిపై కేసు) -
కోడెల కుమారుడిపై కేసు
సాక్షి, గుంటూరు: బైక్‌ల విక్రయాల్లో భారీ కుంభకోణానికి పాల్పడిన శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణపై పోలీసు కేసు నమోదు అయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.80 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించిన రవాణా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చుట్టుగుంట సెంటర్లో కోడెల శివరామ్‌కు గౌతమ్ హీరో బైక్ షోరూమ్ ఉంది. దీనికి అనుబంధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా 50కుపైగా సబ్ డీలర్లు ఉన్నారు. గత కొన్ని రోజులుగా శివరామ్ షోరూమ్‌లో టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్) లేకుండా బైక్‌లు డెలివరీ చేస్తున్నారు. దీనిపై గత ఏడాదే రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే కోడెల తనయుడి షోరూమ్ కావడంతో గత ప్రభుత్వ హయాంలోను అధికారులు గౌతమ్ షోరూమ్ జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల మళ్లీ ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ కమిషనర్ విచారణ చేయించారు. గత ఏడాది కాలంలో టీఆర్ లేకుండా 1,025 బైక్‌లు విక్రయించినట్లు విచారణలో గుర్తించారు. టీఆర్, లైఫ్ ట్యాక్స్, శాశ్వత రిజిస్ట్రేషన్ తదితర ఫీజుల కింద ఒక్కో బైక్‌కు సగటున రూ.8వేల చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేసిన శివరామ్ ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా నొక్కేశారు. కేసు నమోదు.. విచారణ అనంతరం గుంటూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ మీరాప్రసాద్ గౌతమ్ హీరో షోరూమ్ యజమాని శివరామ్‌పై నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 1,025 బైక్‌లు టీఆర్ లేకుండా విక్రయించి 1989 కేంద్ర మోటర్ వాహన చట్టం నిబంధన 42ను కోడెల శివరామ్ అతిక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కోడెల శివరామ్‌పై ఐపీసీ 406, 409, 420, 468, 471 సెక్షన్ల కింద శనివారం కేసు నమోదు చేశారు. -
కోడెల తనయుడు శివరామకృష్ణకు బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, గుంటూరు: టీఆర్ లేకుండా సుమారు 800 బైక్‌లు విక్రయించిన వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణకు ఉచ్చు బిగుస్తోంది. రవాణా శాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీఆర్ లేకుండా బైక్‌లు విక్రయించిన 138 మంది వాహనదారుల నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్లో కోడెల శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌లో బైక్‌ల విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్) లేకుండా 800 బైక్‌లను కోడెల శివరామ్ విక్రయించాడు. ఈ వ్యవహారంలో ఇటీవల గౌతమ్ షోరూమ్‌ను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. టీఆర్, లైఫ్ ట్యాక్స్‌ల పేరుతో వినియోగదారుల నుంచి ఒక్కో బైక్‌కు రూ.8–10 వేల వరకూ కోడెల శివరామ్ వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేశాడు. రూ.కోటి మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడు. వాహనదారుల నుంచి స్టేట్మెంట్లు.. గౌతమ్ షోరూమ్ నుంచి టీఆర్ లేకుండా డెలివరీ చేసిన బైక్‌ల వివరాలను ఇన్వాయిస్లోని చిరునామాల ఆధారంగా గుర్తించారు. రవాణా శాఖ అధికారులు స్వయంగా బైక్‌లు కొనుగోలు చేసిన ఇళ్లకు వెళ్లి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 138 మంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఇప్పటి వరకూ రవాణా శాఖ అధికారులకు స్టేట్మెంట్లు ఇచ్చిన వినియోగదారులందరూ బైక్ కొనుగోలు సమయంలో తమకు టీఆర్ ఇవ్వలేదని, లైఫ్ ట్యాక్స్, టీఆర్ ఫీజుల పేరుతో రూ. 8–10 వేల వరకూ వసూలు చేశారని చెప్పినట్టు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి స్టేట్మెంట్ సేకరించిన అధికారులు స్టేట్మెంట్లను రవాణా శాఖ కమిషనర్‌కు నివేధించారు. విచారణ రెండు రోజుల్లో కొలిక్కి రానుంది. విచారణ అనంతరం శివరామ్‌పై క్రిమినల్ కేసులు నమోదుచేస్తారు. బైక్‌లు స్వాధీనం చేసుకున్న ఫైనాన్స్ కంపెనీలు.. టీఆర్ లేకుండా గౌతమ్ షోరూమ్ యాజమాన్యం 800 బైక్‌లు విక్రయించింది. వీటిలో చాలా వరకూ బైక్‌లను వినియోగదారులు ఫైనాన్స్ రూపంలో కొనుగోలు చేశారు. టీఆర్ జనరేట్ కాకపోవడంతో వినియోగదారులు కిస్తీ (ఇన్స్టాల్మెంట్స్) చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్ కంపెనీలు బైక్‌లను స్వాధీనం చేసుకున్నాయి. టీఆర్ జనరేట్ కాకపోవడంతో ఆ బైక్‌లు రిజిస్ట్రేషన్ అవ్వక వేరొకరికి బైక్‌లు విక్రయించడానికి వీల్లేక ఫైనాన్స్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రికవరీ చేసిన బైక్‌లన్నింటినీ ఫైనాన్స్ కంపెనీలు తమ గోడౌన్స్‌లో ఉంచుకున్నాయి. టీఆర్ లేని వాహనాలను నడపడం నేరం తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) లేని వాహనాలను నడపడం నేరం. రవాణా శాఖ అధికారులు తనిఖీల్లో టీఆర్ లేనట్టు గుర్తిస్తే ఎంవీఐ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి భారీ అపరాద రుసుం విధించి వాహనం సీజ్ చేస్తారు. అదే విధంగా టీఆర్ లేని వాహనం ఢీ కొని ఎవరైన గాయాలపాలైన, మృతి చెందిన వాహనదారునిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. దురదృష్టవశాత్తు వాహనదారుడు మృతి చెందితే ఇన్సూరెన్స్ వంటి ఇతర స్కీమ్‌లు వర్తించవు. గౌతమ్ షోరూమ్ నుంచి టీఆర్ లేకుండా బైక్‌లు విక్రయించినవారు బైక్‌లను రోడ్డుపై తిప్పడానికి వీల్లేదు. – మీరా ప్రసాద్, డీటీసీ గుంటూరు -
కోడెల శివప్రసాదరావుకు అధికారులు షాక్
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు కే ట్యాక్స్ వసూళ్లపై కేసులు, మరోవైపు సొంత పార్టీ నుంచే అసమ్మతి ఎగసిపడుతోంది. తాజాగా కోడెలకు అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన కుమారుడు శివరామ్‌కు చెందిన గౌతమ్ హోండా షోరూమ్‌ను సీజ్ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అయిదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఇక కోడెల బినామీ యర్రంశెట్టి మోటార్స్‌లో కూడా టాక్సులు చెల్లించకుండా 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారం. దీంతో నరసరావుపేట, గుంటూరులోని రెండు షోరూమ్‌లను అధికారులు సీజ్ చేశారు. -
టీడీపీలో వేరుకుంపట్లు
సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే సత్తెనపల్లి టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. అప్పట్లోనే కోడెల మాకొద్దంటూ స్థానిక నేతలు రోడ్డెక్కారు. ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు కోడెలకు టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో కోడెల ఘోర పరాజయం పాలవడం.. కే ట్యాక్స్ బాధితులు పోలీసుస్టేషన్ మెట్లెక్కడంతో పార్టీ పరువు బజారున పడింది. ఇక కోడెల ఇన్చార్జిగా వద్దంటూ అసమ్మతి నేతలు అధినేత బాబును మళ్లీ కలిశారు. ఇదే సమయంలో రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు ప్రవేశం చేయడంతో సత్తెనపల్లిలో టీడీపీ రెండు ముక్కలైంది. ఇప్పుడు కోడెల వర్సెస్ రాయపాటి వర్గాల మధ్యపోరు సాగుతోంది. సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లా టీడీపీ పరిస్థితి అయోమయంగా మారింది. ఇంటి పోరుతో ఆ పార్టీ సీనియర్, ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. సత్తెనపల్లి టీడీపీలో కుమ్ములాటలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. నరసరావుపేట మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలోకి రంగప్రవేశం చేశారు. ఆయన కోడెల అసమ్మతి వర్గానికి అండగా నిలిచినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రంగబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇప్పించడం కోసం రాయపాటి సాంబశివరావు ప్రయత్నాలు చేశారన్న విషయం తెలిసిందే. కోడెల అసమ్మతి నాయకులు సైతం ఆయనవైపే అప్పట్లో మొగ్గు చూపారు. అయితే అధినేత చంద్రబాబు మాత్రం కోడెల శివప్రసాదరావుకే ఆ టికెట్ కట్టబెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో కోడెల ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ఐదేళ్లలో కోడెల కుటుంబం అక్రమాలు, అరాచకాలతో విసిగి వేసారిన సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కోడెలను నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తొలగించాలని బుధవారం రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును కలిసి కోరారు. క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి.. కార్యాలయం ఆవరణలో నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. బయట ఆందోళన జరుగుతున్న సమయంలో కోడెల సైతం కార్యాలయంలోనే ఉన్నారు. కొత్త ఇన్చార్జిని నియమించాలని కోడెల వ్యతిరేక వర్గ నాయకులు డిమాండ్ చేస్తున్న తరుణంలో రాయపాటి రంగబాబు పేరు తెరపైకి వచ్చింది. అసమ్మతి నాయకులతో భేటీ.. సత్తెనపల్లి పట్టణంలోని పాత నియోజకవర్గ టీడీపీ కార్యాలయంగలో రాయపాటి రంబాబు గురువారం కోడెల అసమ్మతి నేతలతో సమావేశం నిర్వహించారు. మరో వైపు తన మద్దతుదారులతో సొంత పార్టీ కార్యాలయంలో కోడెల సమావేశమయ్యారు. ప్రస్తుత ఈ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. కోడెలను పార్టీ ఇన్చార్జిగా తొలగించాలని అధినేతకు ఫిర్యాదులు అందిన వెంటనే రంగబాబు రావడం.. కోడెల వ్యతిరేకవర్గ నాయకులతో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు పథకం ప్రకారం రంగబాబే కోడెల అసమ్మతి నేతల వెనకుండి ఆందోళనలు చేయించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల మద్దతుదారులు సైతం రంగబాబే ఇదంతా చేయిస్తున్నారని కోపంతో ఊగిపోతున్నట్టు తెలుస్తోంది. ఎటువెళ్లాలో తెలియని పరిస్థితి.. రాయపాటి, కోడెల ఇలా రెండు వర్గాలుగా సత్తెనపల్లి టీడీపీ చీలిపోవడంతో ఎటువెళ్లాలో తేల్చుకోలేని స్థితిలో ఆ పార్టీకి చెందిన తటస్థ శ్రేణులు ఉన్నాయి. మరో వైపు కొత్త ఇన్చార్జిని నియమించాలని చంద్రబాబును కోరినా సీరియస్‌గా తీసుకోకపోవడంపై కోడెల అసమ్మతి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
సత్తెనపల్లి టీడీపీలో ముసలం.. తెరపైకి రాయపాటి
గుంటూరు : సత్తెనపల్లి టీడీపీలో ముసలం రాజుకుంది. మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా సత్తెనపల్లి టీడీపీ అసమ్మతి నేతలు ఏకతాటిపైకి వస్తున్నారు. ఈ క్రమంలోనే కోడెల అసమ్మతి నేతలతో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు సమావేశమయ్యారు. కోడెల వ్యతిరేకులను ఏకతాటి మీదకు తెచ్చి.. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు రాయపాటి రంగారావు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన అనుచరులతో కోడెల శివప్రసాదరావు అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీకి చెందిన రెండు కార్యాలయాల్లో వీరి సమావేశాలు జరిగాయి. కోడెలను సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా తొలగించేందుకు అసమ్మతి నేతలు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలు బుధవారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిసి.. కోడెలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెరపైకి రాయపాటి రంగారావు రావడం.. ఆయన కోడెల అసమ్మతి వర్గంతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి కోడెల పంచాయతీ.. ‘డోంట్ వర్రీ’ అన్న బాబు! -
క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి
సత్తెనపల్లి: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై సొంతపార్టీ టీడీపీలోనే అసమ్మతి ఎగసిపడింది. కోడెల కుటుంబం గత ఐదేళ్లపాటు సాగించిన అరాచకాలపై గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలే గొంతెత్తారు. ఆయన కుటుంబం అరాచకాలపై విసిగి వేసారిపోయామని, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా కొత్త వ్యక్తిని నియమించాలంటూ గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆందోళనకు దిగారు. ముప్పాళ్ళ మాజీ ఎంపీపీ గోగినేని కోటేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు తదితరుల నాయకత్వంలో అసమ్మతి వర్గీయులు బుధవారం తొలుత సత్తెనపల్లి పట్టణంలోని పాతబస్టాండ్‌లో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద కోడెలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం 200 మందికిపైగా అసమ్మతి నాయకులు, కార్యకర్తలు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లారు. క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. నూతన ఇన్చార్జిని నియమించేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆ సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు కోడెల శివప్రసాదరావు సైతం రాష్ట్ర కార్యాలయంలోనే ఉండడం గమనార్హం. తర్వాత చంద్రబాబు కార్యాలయం నుంచి వెళ్లిపోయే సమయంలో కాన్వాయ్ వద్ద అసమ్మతి నాయకులు ఆయన్ను కలవగా.. ‘నాకు అన్నీ తెలుసు. నేను చూసుకుంటా’ అంటూ వెళ్లిపోయారు. -
కోడెల పంచాయతీ.. ‘డోంట్ వర్రీ’ అన్న బాబు!
సాక్షి, గుంటూరు : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అక్రమాల పంచాయితీ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. కోడెలను సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా తొలగించాలంటూ టీడీపీ స్థానిక నేతలు తాజాగా చంద్రబాబును కలిశారు. సత్తెనపల్లి స్థానిక టీడీపీ నేతలు బుధవారం చంద్రబాబునాయుడిని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కోడెలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్గా తొలగించాలని వారు చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో పార్టీ కార్యాలయం ఎదుట కూడా టీడీపీ శ్రేణులు కోడెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అంతకుముందు కోడెల శివప్రసాదరావు స్వయంగా చంద్రబాబును కలిసి తన వాదన వినిపించారు. ఇటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అటు కోడెల వాదనలు వేర్వేరుగా చంద్రబాబు విన్నారు. కోడెలకు వ్యతిరేకంగా స్థానిక నేతలు, కార్యకర్తల వాదనను విన్న చంద్రబాబు.. ‘యూ డోంట్ వర్రీ.. నేను చూసుకుంటా’ అని వారితో చెప్పి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కోడెల శివప్రసాద్‌ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గాన్ని పదేళ్లు వెనక్కు నెట్టారని, కే–ట్యాక్స్‌ల పేరుతో సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా దోచుకున్నారని, ఇక ఆ కుటుంబ పెత్తనం మేం భరించలేమని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వారు తీసుకెళ్లారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ నియోజకవర్గ నాయకులు చంద్రబాబును కలవడం ఇదే తొలిసారి. కే–ట్యాక్స్ కారణంగా నియోజకవర్గంలో పార్టీ పరువుపోయిందని, కోడెల నాయకత్వంతో పని చేయలేమని టీడీపీ నేతలు అధినేత వద్ద గోడు వెళ్లబోసుకున్నట్టు తెలుస్తోంది. -
కోడెలకు టీడీపీ నేతల ఝలక్
కోడెల శివప్రసాద్‌ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గాన్ని పదేళ్లు వెనక్కు నెట్టారు. కే–ట్యాక్స్‌ల పేరుతో సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా దోచుకున్నారు. ఇక చాలు. ఆ కుటుంబ పెత్తనం మేం భరించలేమ’ని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ నియోజకవర్గ నాయకులు చంద్రబాబును కలవడం ఇదే తొలిసారి. కే–ట్యాక్స్ కారణంగా నియోజకవర్గంలో పార్టీ పరువుపోయిందని, కోడెల నాయకత్వంతో పని చేయలేమని చెప్పబోతున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. సాక్షి, గుంటూరు: గత ఎన్నికల్లో సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కోడెల ప్రసాదరావు గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన కుమారుడు, కుమార్తె కే–ట్యాక్స్‌ల పేరుతో నియోజకవర్గంలోని ప్రజలతోపాటు, సొంత పార్టీ నాయకులను సైతం దోచుకున్నారని ఆ పార్టీ నాయకులే బాహాటంగా ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో మాజీ స్పీకర్ కోడెల శిప్రసాదరావుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వద్దని ఆ పార్టీ నాయకులు నిరసనలు, ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. కోడెలకు టికెట్ ఇవ్వద్దని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అధినేత ఆయనకే సీటు కట్టబెట్టారు. ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. ఐదేళ్ల పాలనలో కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెలు కే–ట్యాక్స్‌ల పేరుతో దోచుకున్నారని బాధితులు పోలీస్స్టేషన్లకు క్యూ కట్టారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల కుటుంబంపై 18 కేసులు నమోదయ్యాయి. లేటుగా.. లేటెస్టుగా.. తాజాగా మరో కోడెల కే–ట్యాక్స్ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న కే–ట్యాక్స్‌కు సంబంధించిన వివరాలు ఇలా.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సత్తెనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణం పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈ భవన నిర్మాణ కాంట్రాక్టు కోసం ప్రస్తుత టీడీపీ జిల్లా కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు ప్రయత్నించారు. కోడెల వాగ్దానం ఇవ్వడంతో శంకుస్థాపనకు రూ.లక్షలు ఖర్చుపెట్టి శిలాఫలకం తదితర ఏర్పాట్లు చేశారు. అయితే పనులు కట్టబెట్టడానికి రూ.5 లక్షలు కావాలని కోడెల శివప్రసాద్ డిమాండ్ చేశారు, ఆ డబ్బును ఇవ్వకవడంతో శంకుస్థాపన వాయిదా వేయించారు. దీంతో కోమటినేని శ్రీనివాసరావు తీవ్రంగా నష్టపోయారు. ఈ కే–ట్యాక్స్ వ్యవహారాన్ని శ్రీనివాసరావు ఇటీవల వాట్సప్‌లో తన సన్నిహితులకు పంపారు. సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షుడుగా కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన శ్రీనివాసరావునే డబ్బులు డిమాండ్ చేశారన్న విషయం బయటికి రావడం జిల్లా టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాన్ని సైతం నేడు కోడెల వ్యతిరేక వర్గ నాయకులు అధినేత దష్టికి తీసుకువెళ్లనున్నారు. కొత్త ఇన్చార్జులు కావాలి సత్తెనపల్లిలో టీడీపీ ఘోర పరాజయానికి కోడెల కుటుంబం అరాచకాలే కారణమని, రాజ్యాంగబద్ధ పదవికి కలంకం తీసుకొచ్చారని సత్తెనపల్లి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక మీదట నియోజకవర్గ ఇన్చార్జిగా కోడెల కొనసాగితే పార్టీకి మరింత నష్టం చేకూరే అవకాశముందని బాహాటంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును కోరనున్నట్లు సమాచారం. బాబును కలవకుండా అడ్డుకునే ప్రయత్నాలు కోడెలకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో పాత నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని పునఃప్రారంభించిన అసమ్మతి నాయకులు నేడు పార్టీ అధినేతను కలిసేందుకు వెళ్తుండటంతో వారిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 20 వాహనాల్లో ర్యాలీగా బయల్దేరి సుమారు 200 మంది కోడెల వ్యతిరేక వర్గ నాయకులు చంద్రబాబును కలిసేందుకు కార్యచరణ రూపొందించుకున్నారు. అయితే తమను అడ్డుకునేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నించినా చంద్రబాబును కలుస్తామని వారు చెబుతున్నారు. వీరికి సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారు. -
నరసరావు పేటలో కోడెల ఇష్టారాజ్యంగా వ్యవహరించారు
-
కోడెల శిష్యుడు కోర్టులో లొంగుబాటు
సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : గుంటూరు జిల్లా, నరసరావుపేటలో స్టేడియం కమిటీ అభివృద్ధి పేరుతో లక్షలాది రూపాయలు గోల్మాల్ చేసిన శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అనుంగు శిష్యుడు, స్టేడియం కమిటీ మాజీ ఇన్చార్జి మందాడి రవి సోమవారం కోర్టులో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియం కమిటీ చైర్మన్‌గా వాస్తవానికి ఆర్డీవో వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ, కోడెల అండదండలతో మందాడి రవి అన్నీ తానై అక్రమ వ్యవహారాలను చక్కబెట్టాడు. స్టేడియంలో ఏ కార్యక్రమం చేపట్టినా అనధికారికంగా కే–ట్యాక్స్ వసూలు చేసేవాడు. గడచిన ఐదేళ్లలో స్టేడియం అభివృద్ధి ముసుగులో లక్షలాది రూపాయలను కోడెల కుమారుడు శివరామ్ కమిటీ ఇన్చార్జి రవిని అడ్డం పెట్టుకుని దండుకున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వం మారగానే అప్రమత్తమైన నిందితులు ఎక్కడా ఏ ఆధారం దొరకకుండా సాక్ష్యాలను తారుమారు చేశారు. రాత్రికి రాత్రే తాళాలు పగులగొట్టి రికార్డులను అపహరించుకు పోయారు. దీంతో స్టేడియంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని స్పోర్ట్స్ అథారిటీ అధికారులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రూ.22 లక్షల దుర్వినియోగం.. స్టేడియంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు గత నాలుగేళ్లలో రూ.22 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీంతో పాటు స్టేడియంలో ఉండాల్సిన విలువైన పైపులు, ఇతర సామగ్రి మందాడి రవి అపహరించుకెళ్లి అమ్ముకున్నట్లు తేలింది. ఈ మేరకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ కొల్లా రాజేంద్రరెడ్డి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చీటింగ్, చోరీ కేసులు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న రవి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే న్యాయస్థానంలో చుక్కెదురు కావడంతో కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం. నిందితుడిని నరసరావుపేట సబ్‌జైలుకు తరలించారు. నేడు సీఎం జగన్‌కు మద్దతుగా మాదిగల ర్యాలీ నెహ్రూనగర్(గుంటూరు): మాదిగల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి మద్దతుగా గుంటూరులోని నగరంపాలెం నుంచి అసెంబ్లీ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించనున్నట్లు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ తెలిపారు. నగరంపాలెంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అసెంబ్లీ వరకు చేపట్టిన పాదయాత్రకు వ్యతిరేకంగా ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో నోటాకి ఓటు వేయమని చెప్పిన కృష్ణమాదిగకు.. వైఎస్ జగన్‌ను ప్రశ్నించే హక్కులేదన్నారు. సమావేశంలో మాదిగ మహాసేన నాయకులు ప్రభాకర్, సుబ్బారావు, గోపి, బుజ్జి, రమేష్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మాదిగల అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేసూ మంగళవారం మంగళగిరి నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నమాదిగ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
అయోమయ స్థితిలో కోడెల కుటుంబం
సాక్షి, గుంటూరు: నాడు కప్పం కట్టాల్సిందే అని గద్దించిన నోర్లు నేడు మూగబోయాయి.. ఓ వైపు అంతటా చుక్కెదురు.. మరోవైపు సొంతపార్టీలో, ఉన్న ఊర్లో అంతటా విముఖత.. వెరసి శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం పరిస్థితి అయోమయంగా మారింది. ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు కుమారుడు శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కే–ట్యాక్స్ పేరుతో తోపుడు బండిపై వ్యాపారం చేసుకునే వ్యక్తి నుంచి బడా కాంట్రాక్టర్ వరకూ ప్రతి ఒక్కరి నుంచి పన్నులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. వారి వసూళ్ల గురించి నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ కోడెల శివప్రసాద్‌రావుపై రెండు, శివరామ్‌పై 9, విజయలక్ష్మిపై 7 కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. కోడెల శివరామ్ బెయిల్ పిటిషన్ హైకోర్టు ముందు ఉంది. తమ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారందరూ వరుసగా పోలీస్‌లను ఆశ్రయిస్తుండటం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్ కేసులు నమోదవుతుండటంతో కోడెల కుటుంబానికి అరెస్ట్‌ల భయం పట్టుకుంది. కోర్టులు సైతం ముందస్తు బెయిల్ మంజూరుకు నిరాకరిస్తుండటంతో వారు రాజీకి సిద్ధమవుతున్నారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాం రాజీకి రావాలంటూ రాయబారాలు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గంలో నమోదైన ఓ కేసులో బాధితునికి రూ.35లక్షల మేర డబ్బు వెనక్కు ఇచ్చి రాజీ ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ఇదే తరహాలో తక్కిన బాధితుల వద్దకు రాయబారులను పంపి రాజీకి రావాలని, కావాలంటే నష్టపోయిన దానికి రెట్టింపు మొత్తాన్ని చెల్లిస్తామని కూడా బతిమాలుతున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకూ కోడెల కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, చీటింగ్ సహా 18 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న కోడెల, ఆయన కుమారుడు, కుమార్తె, అనుచరులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తెకు హైకోర్టులో చుక్కెదురు అయింది. ముందస్తు బెయిల్ కోసం కోడెల కుమార్తె విజయలక్ష్మి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. గుంటూరు జిల్లా నరసరావుపేట టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో నమోదైన నాలుగు కేసులు అక్రమమంటూ, వాటిని కొట్టేయాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి డీవీవీ సోమయాజులు ముందస్తు బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చారు. కాగా కే ట్యాక్స్ పేరుతో కోడెల కుమారుడు, కుమార్తె భూ దందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, కే ట్యాక్స్ వసూలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
టీడీపీ నేతలు ‘గడ్డి’ని కూడా వదల్లేదు..
సాక్షి, అమరావతి: పశువుల మందుల సరఫరాలో అక్రమాలపై పశు సంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ... ’టీడీపీ నేతలు దేనిని వదలకుండా అవినీతికి పాల్పడ్డారు. పశువులకు సరఫరా చేసే గడ్డిని కూడా వదలకుండా దోచుకున్నారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు పశువుల మందులు, గడ్డిలోనూ అవినీతికి పాల్పడటం సిగ్గుచేటు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామ్ కంపెనీల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. అయిదు కంపెనీల కోసం అక్రమంగా టెండర్ల నిబంధనలు మార్చేసి అవినీతికి పాల్పడ్డారు. రూ.4.5కోట్ల వరకూ వాళ్లకి చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని ఆదేశించాను. అయిదేళ్లలో జరిగిన అవినీతిని వెలికి తీస్తాం. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా టెండర్లు పిలుస్తాం.’ అని తెలిపారు. -
కే ట్యాక్స్‌పై అసెంబ్లీలో చర్చిస్తాం
నరసరావుపేట రూరల్: ‘కోడెల ట్యాక్స్’ (కే టాక్స్)పై రాష్ట్ర అసెంబ్లీలో చర్చించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అవినీతి, అక్రమాలపై శాసనసభలో చర్చిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడెల కుటుంబం అవినీతిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 19 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఈ అక్రమాలపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తన కుటుంబంపై కక్ష సాధింపులో భాగంగా కేసులు నమోదు చేస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకంటే, కే టాక్స్ బాధితులందరూ తెలుగు దేశం పార్టీకి చెందిన వారేనని గుర్తు చేశారు. కళ్ల ముందు కనిపిస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకుంటూ వైఎస్సార్సీపీపై అభాండాలు వేయడాన్ని మానుకోవాలని కోడెలకు హితవు పలికారు. కోడెల అక్రమాలన్నింటిపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. అలాగే పట్టణంలోని ట్రాఫిక్ ఆంక్షలపై టీడీపీ నేతలు విమర్శించడం తగదని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే మార్పులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రజా సంక్షేమ బడ్జెట్ అని ఎమ్మెల్యే గోపిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రంగాలకు కేటాయింపులు జరిపారన్నారు. -
కోడెల కుటుంబం మరో అరాచకం
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అరాచకాలు రోజుకు ఓ చోటు బయటపడుతున్నాయి. ఆయన కుటుంబం మీద పోలీస్ స్టేషన్లలో కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కోడెల కుమారుడు శివరామ్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. ఏడు లక్షలు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కోడెల ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా కోడెల శివరామ్ తిరిగి ఇవ్వటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. -
‘కోడెల కాటు’ బాధితులెందరో!
సాక్షి, గుంటూరు: ప్రతి పనికీ ఓ రేటు కట్టి కే–ట్యాక్స్ పేరుతో ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. అధికారం అండతో ఆ కుటుంబం సాగించిన దుర్మార్గాలు, దౌర్జన్యాలను ఎదురించే పరిస్థితి లేక అప్పట్లో వారంతా మిన్నకుండిపోయారు. వారిలో కొందరు ఇన్నాళ్లకు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తాము మోసపోయిన విషయాన్ని ధైర్యంగా చెప్పకోలేని బాధితులు ఇంకా అనేకమంది ఉన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి చేతిలో దోపిడీకి గురైన పలువురు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. కోడెల కుమారుడు, కుమార్తె ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేశారని కొందరు, అపార్టుమెంట్ నిర్మాణాల సమయంలో బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఇంకొందరు బిల్డర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 18 కేసులు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెపై ఇప్పటివరకూ 18 కేసులు నమోదయ్యాయి. విద్యుత్ సబ్‌స్టేషన్, రైల్వే, మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తమ నుంచి సొమ్ములు తీసుకున్నారని నిరుద్యోగులు, తమ పొలాలు, భూములను కబ్జా చేశారని రైతులు, భూ యజమానులు, తమ నుంచి కే–ట్యాక్స్‌లు వసూలు చేశారని బిల్డర్లు, మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థల యజమానులు కోడెల కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేశారు. కోడెల కుమారుడి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు అనుమతివ్వాలంటూ నరసరావుపేటకు చెందిన కేబుల్ ఆపరేటర్ ఎనుగంటి వెంకట కృష్ణారావు పోలీసులను ఆశ్రయించారంటే ఆ కుటుంబం అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసి కోడెల కుటుంబం అరాచకాలపై విచారణ జరిపిస్తే మరికొందరు బాధితులు బయటకు వస్తారని చెబుతున్నారు. సత్తెనపల్లిలో నమోదైన ఓ కేసులో బాధితుడి నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేసి రాజీ చేసుకోగా.. ఇంకా 17 కేసులు ఆ కుటుంబంపై ఉన్నాయి. -
కోడెల కుమార్తెపై ఉన్న కేసుల వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: భూ దందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, కే ట్యాక్స్ వసూలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై నమోదైన 15 కేసుల వివరాలను లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. విజయలక్ష్మి అరెస్టుపై సోమవారం తగిన నిర్ణయం వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం పేర్కొన్నారు. ఓ భూమి కొనుగోలు వివాదంలో గుంటూరు పోలీసులు తనపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టేయడంతో పాటు తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సోమయాజులు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ..ఎప్పుడో 2014లో ఘటన జరిగిందంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు. ఎవరి వద్ద నుంచో ఆస్తి కొనుగోలు చేస్తే, ఆ ఆస్తికి ఫిర్యాదుకూ సంబంధం లేకపోయినా పిటిషనర్‌పై ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పిటిషనర్‌ను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. -
రూ.కోట్లు మింగిన కోడెల కుటుంబం
సాక్షి, అమరావతి: ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే దానికి తగిన యంత్రాలు అవసరమని ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. కానీ, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరాం యంత్రాలే లేకుండా కంపెనీని సృష్టించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.కోట్ల విలువైన ఆర్డర్లు పొందారు. ఈ అవినీతి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రుల్లో చికిత్సలకు ఉపయోగించే కాటన్, బ్యాండేజీలను తయారు చేసే కంపెనీ స్థాపించామంటూ నకిలీ డాక్యుమెంట్లతో లైసెన్సులు పొందారు. ఇందుకు అధికార బలాన్ని వాడుకున్నారు. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన నాసిరకం కాటన్, బ్యాండేజీని ప్రభుత్వానికి సరఫరా చేసి, ఖజానా నుంచి భారీగా నిధులు మింగేశారు. స్మాల్ స్కేల్ యూనిట్ల(ఎస్ఎస్ఐ) పేరుతో రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థకు (ఏపీఎంఎస్ఐడీసీ) దరఖాస్తు చేసి, అధికార బలంతో ఆర్డర్లు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు నడుపుకుంటూ నాణ్యమైన కాటన్, బ్యాండేజీలు తయారు చేసే వారి నోట్లో మట్టి కొట్టారు. ‘సేఫ్’ యాజమాన్యానికి నోటీసులు ఔషధ నియంత్రణ అధికారులు రెండు రోజుల క్రితం కోడెల శివప్రసాదరావు కుటుంబానికి చెందిన ‘సేఫ్’ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఒక భవనం ఉంది గానీ అందులో ఎలాంటి యంత్రాలు లేవని నిర్ధారించారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కోడెల కంపెనీ ఏం చేసిందంటే.. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు నుంచి నాసిరకం కాటన్, బ్యాండేజీలను తీసుకొచ్చింది. వాటిని తామే తయారు చేశామంటూ ‘సేఫ్’ కంపెనీ పేరిట లేబుళ్లు వేసి, ప్రభుత్వానికి అంటగట్టింది. తమకు కంపెనీ ఉన్నట్లు కోడెల కుటుంబం డ్రగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. లేని కంపెనీకి లైసెన్సు ఎలా ఇచ్చారో అప్పటి అధికారులే చెప్పాలి. ఔషధ నియంత్రణ అధికారులు ఇచ్చిన నివేదికతో ‘సేఫ్’ కంపెనీని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ జాబితా నుంచి తొలగించినట్టు ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు తెలిపారు. ఆ కంపెనీకి ఇకపై ఆర్డర్లు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ‘సేఫ్’ యాజమాన్యానికి ఇప్పటికే ఔషధ నియంత్రణ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. గడ్డిలోనూ దిగమింగారు ఆరోగ్య శాఖలోనే కాదు పశు సంవర్థక శాఖలోనూ కోడెల తన కంపెనీ పేరుతో భారీగా దాణా కుంభకోణానికి పాల్పడ్డారు. ఎండు గడ్డి సరఫరా చేస్తామంటూ పశు సంవర్ధక శాఖ నుంచి ఆర్డర్ దక్కించుకున్నారు. కానీ, సరఫరా చేయకుండానే రూ.కోట్లు కొల్లగొట్టారు. డైరెక్టర్ స్థాయి అధికారులతో కుమ్మక్కై, పశువుల దాణా తినేశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఓ లారీ గడ్డి సరఫరా చేశామంటూ లారీ నెంబరు ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఆ లారీకి తగిలించిన నెంబరు ఓ ద్విచక్ర వాహనానిదిగా ఆర్టీఏ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఫలానా రైతులకు గడ్డి సరఫరా చేశామంటూ వారి ఆధార్ నెంబర్లను కోడెల కంపెనీ సమర్పించింది. వాస్తవానికి వారెవరూ గడ్డిని తీసుకోలేదు. ఆధార్ డేటా నుంచి కొన్ని నెంబర్లు సేకరించి, ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. పశువులకు కోడెల కంపెనీ సరఫరా చేసిన మందులు కూడా నాసిరకమైనవే. ఆ మందుల నాణ్యతను నిర్ధారించకుండా ఔషధ నియంత్రణ అధికారులను బెదిరించారు. పశు సంవర్థక శాఖలో కొందరు అధికారులు కోడెలకు సహకరించి, రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడెల, అతని కుమారుడిపై టీడీపీ నేత కేసు నరసరావుపేట : మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారుడు శివరామ్‌పై మరో కేసు నమోదైంది. తనను అపహరించటంతో పాటు బెదిరించి కాంట్రాక్ట్‌లో పర్సంటేజ్, అక్రమ వసూళ్లకు వీరిద్దరూ పాల్పడ్డారని టీడీపీ నాయకుడు, కాంట్రాక్టర్ వడ్లమూడి శివరామయ్య శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన వడ్లమూడి శివరామయ్య కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. ఆర్డబ్ల్యూఎస్ చెరువు మరమ్మతులకు సంబంధించి 2016లో రూ.30 లక్షల కాంట్రాక్ట్ పనిని దక్కించుకున్నాడు. విషయం తెలుసుకున్న కోడెల శివరామ్ పిలిచి బెదిరించటంతో చేయాల్సిన పనిలో పది శాతం రూ.3 లక్షలు పర్సంటేజ్ (కే ట్యాక్స్) చెల్లించాడు. ఇది సరిపోలేదంటూ ఇంకా చెల్లించాలని కోడెల శివరామ్ నుంచి పిలుపు వచ్చింది. శివరామయ్య వెళ్లకపోవటంతో శివరామ్ అనుచరులు గుత్తా నాగప్రసాద్, బద్దుల రాములు బలవంతంగా కారులో గుంటూరు హీరో షోరూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ బెదిరించి తాను అనారోగ్యంతో కాంట్రాక్ట్ పనులు చేయట్లేదంటూ సంతకాలు పెట్టించారని బాధితుడు తెలిపాడు. కాంట్రాక్ట్‌ను 6 నెలలపాటు బ్లాక్‌లిస్టులో చేర్చి కాంట్రాక్ట్‌ను బద్దుల రాములు దక్కించుకున్నాడని, దీంతో రూ.3 లక్షల నష్టం జరిగిందని శివరామయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పాటు మంచినీటి సరఫరా కాంట్రాక్ట్‌కు సంబంధించి మరో రూ.2 లక్షలు కోడెల శివరామ్ బెదిరించి తీసుకున్నాడని తెలిపారు. ఈ వ్యవహారంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిసి చెప్పగా, నేనే అలా చేయమన్నానని కుమారుడికి వత్తాసు పలికాడన్నారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిలాలుద్దీన్ తెలిపారు. -
కోడెల శివరామ్‌పై టీడీపీ నేత ఫిర్యాదు
సాక్షి, గుంటూరు : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడి అక్రమాలపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఓ కాంట్రాక్టు విషయంలో కోడెల శివరామ్ తనను మోసం చేశారంటూ టీడీపీ నేత శివరామయ్య పోలీసులను ఆశ్రయించారు. ఏడు లక్షల రూపాయలు ఇస్తేనే పని చేయనిస్తానని తనను బెదిరించారని, ఆ తర్వాత డబ్బు తీసుకుని కూడా కాంట్రాక్టును రద్దు చేయించారని ఆరోపించారు. ఈ మేరకు శివరామ్‌తో పాటుగా ఆయన అనుచరులపై కూడా నరసారావుపేట వన్‌టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. కాగా ‘కే ట్యాక్స్’ పేరిట తమను వేధించారంటూ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఇప్పటికే పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామ్ అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. -
బాబోయ్ కోడెల...మాకొద్దు!
సాక్షి, గుంటూరు : బాబోయ్ కోడెల కుటుంబం.. ఎవరిని కదిలించినా.. ఎవరిని పలకరించినా ఇదే మాట.. అధికారంలో ఉండగా అవినీతే పరమావధిగా చెలరేగిన కోడెల కుమారుడు, కుమార్తె పేరు చెబితే చాలు.. తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి బడా కాంట్రాక్టర్ల వరకు కన్నీటి పర్యంతమవుతున్నారు. వారి దోపిడీని అడ్డుకునే శక్తి లేక అడిగినంత ఇచ్చుకున్నారు. అధికారం మారాక వారంతా తిరగబడి కేసులు పెడుతున్నారు. మరో వైపు కోడెల కుటుంబం వెంట తాము ఉండబోమంటూ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వేరు కుంపటి పెడుతున్నారు. ఇటు నరసరావుపేట, అటు సత్తెనపల్లిలో కోడెల పేరు చెబితేనే సొంత పార్టీ నాయకులతోపాటు ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తోపుడు బండి నిర్వాహకుడి నుంచి బడా కాంట్రాక్టర్ వరకూ ప్రతి ఒక్కరి వద్ద కే ట్యాక్స్ పేరుతో అడ్డగోలుగా డబ్బు వసూలు చేశారు. దోచుకోవడంలో తన, మన అన్న తేడాలు చూడలేదు. దీంతో అణచివేతకు గురైన వారందరూ నేడు తిరగబడుతున్నారు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కేసులు పెడుతున్నారు. ఫలితంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం పరిస్థితి దారుణంగా తయారైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. సొంత పార్టీ నుంచి ఎవ్వరు అండగా నిలవని దుస్థితి. తాజాగా సొంత పార్టీ నేతలు కొందరు కోడెలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సార్వత్రిక ఎన్నికల్లోనే.. సార్వత్రిక ఎన్నికల్లోనే కోడెల శివప్రసాద్‌రావుకు వ్యతిరేకంగా ఆ పార్టీ అసమ్మతి నేతలు తిరుగుబాటు చేశారు. కుక్కకైనా మద్దతిస్తాం కాని కోడెలకు మాత్రం ఇవ్వబోమని రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయితే ఆ సమయంలో పార్టీ పెద్దలు కలుగజేసుకుని క్యాడర్‌కు సర్దిచెప్పి కోడెల శివప్రసాదరావును బరిలో నిలిపారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో కోడెల సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. కోడెల ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆ కుటుంబం నుంచి వేధింపులకు గురైన వారందరూ ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్న వారిలో టీడీపీకి చెందిన వారు కూడా ఉండటంతో ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. దూరమవుతున్న కేడర్.. తాజాగా నరసరావుపేట, సత్తెనపల్లిలో నియోజకవర్గాల్లో కోడెల వద్దకు ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. సత్తెనపల్లిలో అయితే ఏకంగా కోడెల అసమ్మతి నేతలు పాత టీడీపీ నియోజకవర్గ కార్యాలయం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. సత్తెనపల్లి పాత బస్టాండ్ సెంటర్లో టీడీపీ నియోజకవర్గ కార్యాలయం చాలా ఏళ్ల కిందట నిర్మించారు. అయితే అది వాస్తు ప్రకారం బాగోలేదని 2014 ఎన్నికలకు ముందు నాగార్జున నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో పార్టీ కార్యకలాపాలు కోడెల నిర్వహించారు. ఆ ఎన్నికల అనంతరం రఘురామ్ నగర్‌లోని తన క్యాంప్ కార్యాలయం నుంచి పార్టీ కార్యకలాపాలు కొనసాగించారు. అయితే తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని కోడెల అసమ్మతి వర్గ టీడీపీ నాయకులు పాత బస్టాండ్ సెంటర్లోని పాత టీడీపీ కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రఘురామ్ నగర్లో కోడెల నిర్వహించి పార్టీ నాయకుల సమావేశానికి కూడా వీళ్లేవ్వరు వెళ్లలేదు. నరసరావుపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆది నుంచి కోడెల అనుచరులుగా ఉన్న చాలా మంది ప్రస్తుతం ఆయన నాయకత్వాన్ని వద్దనుకుంటున్నారు. కనీసం ఆయన నివాసం వైపు కూడా చాలా మంది నాయకులు తొంగి చూడటం లేదని తెలుస్తోంది. పెద్దలకు ఫిర్యాదులు.. అధికారం అండతో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో సొంత పార్టీ వారిని సైతం కోడెల కుటుంబం పీక్కుతిందని బాధితులు టీడీపీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం. ఇటీవల నిర్వహించిన టీడీపీ జిల్లా ముఖ్యనాయకుల సమావేశంలో సైతం కోడెలపై పలువురు నేతలు ఫిర్యాదు చేశారని, ఆ కుటుంబం ఆగడాల వల్లే ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఘోర పరాజయం పాలైందని నాయకులు మండిపడ్డారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కోడెల చేసిన పాపాలే పండాయని, అధికారం అండతో విర్రవీగే నాయకులందరికీ కోడెల శివప్రసాద్ ఎదుర్కొంటున్న పరాభవం ఓ ఉదాహరణగా ఉండిపోతుందని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. -
టీడీపీలో లుకలుకలు!
సాక్షి, సత్తెనపల్లి(గుంటూరు) : టీడీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి, పార్టీ నాయకులు, కార్యకర్తలను గౌరవించకుండా కుటుంబ సభ్యులతో దోపిడీ పాలన సాగించారనే విమర్శలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన సార్వత్రిక సమరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి, అత్యధిక మెజార్టీతో విజయం అందించగా, టీడీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలకు గెలుపు, ఓటములు సహజం. అయితే పల్నాడు ముఖ ద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ టీడీపీ పద్ధతి ప్రకారం ఐదేళ్లుగా పతనమవుతూ వస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కోడెల శివప్రసాదరావు స్వల్ప మెజార్టీతో విజయం సాధించి అత్యున్నతమైన స్పీకర్ పదవిని పొందగలిగారు. ఆ పదవిలో ఆయన మంచి పనులు చేసి ఉంటే మరొకరికి నియోజకవర్గంలో అవకాశం ఉండేది కాదనేది పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కాకుండా కుటుంబ పాలన, అవినీతి, ప్రతి పనికి వసూళ్లు చేపట్టడంతో టీడీపీని 25 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా నైరాశ్యంలో మునిగిన పార్టీ కేడర్‌లో తిరిగి ఉత్తేజాన్ని నింపడం కోసం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ సమావేశంలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, స్థానిక సంస్థలలో పోటీ తదితర వాటిపై చర్చిస్తామని తెలిపారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ నాయకుల్లో ఎప్పటి నుంచో ఉన్న లుకలుకలు బహిర్గతం అయ్యాయి. సమావేశమైన అసమ్మతి వర్గం కోడెల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అసమ్మతి వర్గ నాయకులు గురువారం సమావేశం అయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని కోడెల నాయకత్వాన్ని వ్యతిరేకించారు. శుక్రవారం నిర్వహించే టీడీపీ విస్తృత స్థాయి సమావేశం కోడెల కార్యాలయంలో ఏర్పాటు చేయడాన్ని స్థానిక టీడీపీ నాయకులు విభేదిస్తున్నారు. కోడెల జరిపే సమావేశానికి హాజరు కావద్దంటూ నాయకులు తీర్మానించారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని పాత బస్టాండ్‌లోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో కోడెలకు నియోజకవర్గంలోని ఓటర్లతో గాని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో గాని సరైన సత్సంబంధాలు లేవనేది తేటతెల్లమైంది. బలం, బలగం ఉన్నా వాటిని నడిపించే సరైన నాయకుడు లేరని, ఇది టీడీపీకి ప్రధాన లోపంగా భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, గత ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు పడిన ఇబ్బందులుఅన్నింటిని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించి నియోజకవర్గ బాధ్యతలను పార్టీకోసం శ్రమించేవారికి అప్పగించేలాచూడాలని కోరనున్నారు. టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు ఏర్పాటు చేసినసమావేశంతో టీడీపీలోని లుకలుకలపై నియోజకవర్గం అంతటా చర్చ నడుస్తుంది.