
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫర్నిచర్ స్కాంపై విచారణ చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు తన ఇంటికి మళ్లించి అప్రతిష్టపాలైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన పురంధేశ్వరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి పక్కదారి పట్టిన ఫర్నిచర్ విషయంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. అందుకు కారణమైన దోషులు ఎవరైనా సరే.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చాం.. అని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment