సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమిలో పార్టీ నేతల చేరికల విషయంలో రాజకీయ లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ చేరికలను ప్రోత్సహిస్తుంటే.. మరో పార్టీ నేత మాత్రం చేరికలు వద్దంటూ సూచనలు చేస్తున్నారు. దీంతో, కూటమిలో కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ మొదలైంది.
తాజాగా ఓ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) మాట్లాడుతూ.. ఏపీలో(Andhra Pradesh) కూటమి పార్టీల్లో మనకు కావాల్సినంత మంది నేతలు ఉన్నారు. పార్టీలు మారే నేతలు నేతలు మనకు అవసరం లేదు. ఇతరులు ఎవరు వచ్చినా.. కూటమి పార్టీల్లో చేర్చుకోవద్దు అంటూ కామెంట్స్ చేశారు. అయితే, అయ్యన్న ఇలా వ్యాఖ్యలు చేసి 48 గంటలైనా గడవక ముందే బీజేపీలోకి ఒక నేత చేరడం చిచ్చు రేపినట్టు తెలుస్తోంది. దీంతో, కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారింది.
ఇక, అయ్యన్న మాటలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Daggubati Purandeswari) పట్టించుకోలేదు. అయ్యన్న సూచనను పరిగణలోకి ఆమె పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్.. బీజేపీలో చేరికకు రంగం సిద్దమైనట్టు సమాచారం. నేడో, రేపో.. పురందేశ్వరి సమక్షంలో ఆనంద్ బీజేపీలో చేరుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. విశాఖ డైరీ అవినీతిపై ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతుండటంతో ట్విస్ట్ చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment