
గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన రూలింగ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని.. అలాంటిది ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.
తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయి. ఇంతమంది శాసన సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తాం అని ఎక్కడా రూల్ లేదు. ఢిల్లీలో మూడు స్థానాలు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది.
గతంలో చంద్రబాబు(Chandrababu) అనే ఇదే వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చాం. టీడీపీ నుంచి ఐదుగురు పక్కన కూర్చున్నా.. ఇంకా పది మందిని మన పార్టీలోకి లాగుదామని మా వాళ్లు చెబితే నేనే వద్దన్నా. అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి.. నేను వింటానని చంద్రబాబుకి చెప్పా. ఇదే ఆయనకు, నాకు ఉన్న తేడా.
ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం. ప్రధాన ప్రతిపక్షం మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు?. ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకూడదు.. ఐదే నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేస్తామంటే అంటే ఎలా?. లీడర్ ఆఫ్ ద హౌజ్‌కు ఎంతసేపు మైక్ ఇస్తారో.. ప్రతిపక్ష నేతకు కూడా అంతే టైం ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు కాబట్టే మీ ద్వారా(మీడియా) ఇలా సుదీర్ఘ సమయం తీసుకుని మోసాలను ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి వచ్చింది.

మీరే అధికారంలో ఉండి..మీరే ప్రతిపక్షం పాత్ర పోషిస్తారా?. రెండు పక్కలా నేనే కొడతానంటే ఎలా?. ఇదేమైనా డబుల్ యాక్షనా.. ఇదేమన్నా సినిమానా? అని జగన్ అన్నారు.
జనసేన ఉండగా.. వైఎస్సార్‌సీపీకి ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘‘ఆయన జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’’ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment