A1 బాబు, A2 పురందేశ్వరి, A3 పవన్‌!! | Vizag Steel Plant Row: Bizarre Flexi Trouble For AP Alliance Govt, Flexi Image Goes Viral | Sakshi
Sakshi News home page

A1 బాబు, A2 పురందేశ్వరి, A3 పవన్‌.. ముగ్గురు మోసగాళ్లు!!

Published Tue, Sep 24 2024 7:09 AM | Last Updated on Tue, Sep 24 2024 10:15 AM

Vizag Steel Plant Row: Bizarre Flexi Trouble For AP Alliance Govt

విశాఖపట్నం, సాక్షి:  స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ప్లాంట్‌ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమవుతోందన్న విమర్శలు ఉధృతమవుతున్నాయి. కార్మిక సంఘాలు, కార్మికులు, ప్లాంట్‌ పరిరక్షణ కమిటీలతో పాటు వైఎస్సార్‌సీపీ సైతం రాజకీయంగానూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తోంది. ఈ క్రమంలో..

నగరంలో వెలిసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ1గా, బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరిని ఏ2గా, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను ఏ3గా పేర్కొంటూ గురుద్వార జంక్షన్‌లో ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది జనజాగరణ సమితి. 

ప్లాంట్‌ను అమ్మేస్తున్న ఈ ముగ్గురు మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని సింహాద్రి అప్పన్నను వేడుకుంటున్నట్లుగా ఆ ఫ్లెక్సీలో రాసి ఉం. దారిపోయే కొందరు బాటసారులు వాటిని ఫొటోలు తీస్తూ కపించారు. ఇక  ఫ్లెక్సీపై సమాచారం అందుకున్న పోలీసులు.. వాటిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారు. 

ముగ్గురు మోసగాళ్లు 
‘‘కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతుందని గట్టి నమ్మకంతో కార్మికులు, రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ 70% శాతం మూతపడేలా కావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కార్మికులను పొమ్మనలేక బలవంతంగా పొగ పెడుతున్నారు. పైగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే.. 

.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ప్రజలకు సెంటిమెంట్ లేదు. అని అనవసరంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టవద్దని తిరుగులేని మెజార్టీ వల్ల వచ్చిన అహంకారంతో మాట్లాడారు. దీనితో కార్మికులు 1320 రోజుల నుండి చేస్తున్న పోరాటం గంగలో పోసినట్లయింది. 32 మంది ప్రాణ త్యాగాలు వృధా అయిపోయాయి. తెలుగోడి ఆత్మగౌరవం మంట కలిసిపోయింది. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్లు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాచలం అప్పన్న స్వామి నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వ నాయకులను కఠినంగా శిక్షించాలని కార్మికులు, రాష్ట్ర ప్రజలు వేడుకోవాలి. పవన్ హీరోగా చంద్రబాబు, పురందేశ్వరి సహాయ నటులుగా ముగ్గురు మోసగాళ్లు అనే కొత్త సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది’’ అని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఒక ప్రకటన విడుదల చేశారు. 

	స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తున్న A1, A 2, A 3

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement