సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న పిల్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌లో ప్రజాప్రయోజనం ఏముందని పిటిషనర్ అనిల్‌కుమార్‌ను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దర్యాప్తు జరుగుతుండగా జోక్యం చేసుకోలేమని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
మరోవైపు కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కోడెల కుటుంబ సభ్యులు వాంగ్మూలం తీసుకోవాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో పిల్ వేసిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 16న బంజారాహిల్స్‌లో తాను నివాసం ఉంటున్న ఇంట్లో కోడెల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment