సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం నిలుపుదలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య కోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ లక్ష్మయ్య పిల్ వేశారు.
పిల్‌లో.. ప్రభుత్వ పథకాలు అన్ని అమలు అవుతున్నప్పుడు కేవలం దళిత బంధును మాత్రమే ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని, కనుక దళిత బంధు పథకాన్ని యధావిధిగా అమలయ్యేలా చూడాలని పిటిషనర్ పేర్కొన్నారు.
చదవండి: వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే కొడుకు, ట్రైనీ ఐఏఎస్ నిర్వాకం..
Comments
Please login to add a commentAdd a comment