huzurabad
-
కౌశిక్‌రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కరీంనగర్,సాక్షి: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధర్నా చేపట్టారు. కౌశిక్‌రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండోవిడత దళితబంధు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా ఉద్రిక్తంగా మారింది. -
డ్రగ్స్ కేసులో ఇరికించే కుట్ర.. కేటీఆరే అసలు టార్గెట్!
-
హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 చిరు వ్యాపారుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అరటి పండ్ల బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వాహనాలు, ఇతర దుఖాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదం..షార్ట్ సర్క్యూట్ వల్లేనని తెలుస్తోంది. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ లో వింత శబ్దాలు
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
కరీంనగర్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలిచారు. నిన్న(మంగళవారం) జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకునేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బైఠాయించారు. జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు.. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం 221, 126 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డిపై నమోదు అయంది. బీఎన్ఎస్ యాక్టు కింద కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం. కౌశిక్ రెడ్డి కేసుపై కేటీఆర్ ఆగ్రహంహుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసినట్లు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడేది లేదన్న కేటీఆర్ తేల్చిచెప్పారు. -
Telangana: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు
సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుతున్నారు. తాజాగా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు అడ్డంగా దొరికిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు. హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చార్జిమెమో అందించారు. అయితే శాఖా పరమైన కేసు కొట్టివేయడం కోసం డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ. 10,000 అందించగ.. మంగళవారం మరో రూ. 20000 రూపాయలు లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే విధంగా.. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు సోమశేఖర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆధ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్‌లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం -
ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్‌ను ఢీకొట్టడంతో..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హుజూరాబాద్ మండలంలో ఓ లారీ.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెతో సహా మరో యువతి మృతిచెందింది. దీంతో, కుటుంబం సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం బోర్నపల్లి మూలమలుపు వద్ద మొరం లోడ్‌తో వస్తున్న లారీ.. బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న మొరం బైక్‌పై వెళ్లున్న వారిపై పడింది. మట్టిలో వారు ముగ్గురు కూరుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం, జేసీబీ సాయంతో వారి మృతదేహాలను బయటకు తీశారు. ఇక, ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు ఉన్నారు. మృతి చెందిన వారిని విజయ్, సింధుజ, వర్షలుగా గుర్తించారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కాగా, బోర్నవల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఈటలకు మల్కాజ్గిరి ఫిక్స్!.. బీజేపీ నేతలతో కీలక భేటీ?
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మల్కాజ్గిరి ఎంపీ టికెట్‌ను ఈటల రాజేందర్‌కు కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో, ఆయన పోటీ ఆసక్తికరంగా మారనుంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలో ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మల్కాజ్గిరి స్థానం ఈటలకు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. దీంతో, ఈటల శామీర్‌పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ మేరకు మెసేజ్‌లు వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
రెండు చోట్లా ఓటమి.. మున్ముందు మరింత కఠిన పరీక్ష తప్పదా?
ఎప్పుడు ఎన్నిక జరిగినా అక్కడ ఆయనదే గెలుపు. నియోజకవర్గం మారినా ఇప్పటికి ఏడుసార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2021 ఉప ఎన్నికలో ఓడిపోతారనే ప్రచారం సాగింది. గులాబీ బాస్‌ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెప్పించారు. పార్టీ మారారు. కాని కారు దెబ్బకు ఢీలా పడతారని అందరూ భావించారు. అయితే అర్జునుడిలా పద్మవ్యూహాన్ని ఛేదించి విజయుడిగా నిలిచారు. తాజా ఎన్నికల్లో మాత్రం అభిమన్యుడిలా ఓడిపోయారు. ఇంతకీ ఆయన ఎవరో? ఆయన కథేంటో చూద్దాం. ఈటల రాజేందర్.. తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ పరిచయమైన పేరు. అప్పటి సీఎం కేసీఆర్ ను ఎదిరించి గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చినా..తన పంథాకు భిన్నమైన కమలం పార్టీ నీడకు చేరారు. ఆ పార్టీలో చేరాక తన సొంత జిల్లాకు చెందిన నాటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ తో పొసగకున్నా...తాజా ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ తో పాటు.. సవాల్ విసిరి మరీ గజ్వేల్ లో కేసీఆర్ పై బరిలోకి దిగి, రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. అటు కమలాపూర్ నియోజకవర్గం నుంచి..ఇటు హుజూరాబాద్ నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచిన విజేతగా తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ ను వీడి బయటకు వచ్చాక జరిగిన 2021 ఉపఎన్నిక యావత్ దేశం దృష్టినీ ఆకర్షించింది. అప్పుడు ఈటలపై అధికార బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఈటల ఓటమి కోసం గులాబీ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. నాటి ఉపఎన్నికలో అభిమన్యుడిని చుట్టుముట్టినట్టు చుట్టుముట్టింది. కానీ, ఈటల మాత్రం తన ఏడో విజయాన్నందుకున్నారు. దాంతో ఈటల క్రేజ్ కమలం పార్టీలో మరింతగా పెరిగింది. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. అదే పరిస్థితి ఈటల విషయంలో ఎనిమిదో ఎన్నికలో జరిగింది. ఇంతకాలం ఎదురులేని మనిషిగా నిల్చిన ఈటల.. తాజా ఎన్నికల్లో తనపైన ఎవ్వరూ అంత ఫోకస్ చేయకపోయినా తాను నమ్ముకున్న హుజూరాబాద్ లో ఓటమి పాలయ్యారు. అక్కడి ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. 2018 ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలైన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా.. ఈసారి ఎన్నికల్లో గెలిపించి పట్టం కట్టారు. ఈటలను ఓడగొడుతానని సవాల్ విసిరిన కౌశిక్‌కు.. సెంటిమెంట్ రాజకీయాలు కూడా ఈసారి కలిసివచ్చాయనే టాక్ ఎలాగూ ఉంది. అటు గజ్వేల్ లో తొడగొట్టి గులాబీ పార్టీ బాస్ కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు వెళ్లి అక్కడా ఈటల భంగపడ్డారు. తాను ప్రచారంలో లేని లోటును పూడ్చేందుకు హుజూరాబాద్‌లో తన సతీమణి జమునను ప్రచారంలోకి దింపారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఈటలకు ఓటమి తప్పలేదు. ఈటల వచ్చాక బీజేపీలో జరుగుతున్న మార్పులపై ఓ పెద్ద చర్చే జరుగుతున్న క్రమంలో...బీజేపీని అంటిపెట్టుకుని ఉన్న సంప్రదాయవాదుల్లో కొంత వ్యతిరేకత కూడా అంతర్లీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈటల గెలిస్తే ఆయనకు కొంత ప్లస్సయ్యేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఈటల రీగెయిన్ కావడానికి తన శైలిని కొంచెం మార్చుకోవాల్సి ఉందని.. ఆచితూచి అడుగులు వేస్తేనే రాజకీయాల్లో ఇప్పటివరకూ తనకున్న ప్రత్యేకతను కాపాడుకోగలుగుతారనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ చెంతనే ఎక్కువ కాలం రాజకీయాలు చేసిన ఈటల రాజేందర్లో కొంతమేర ఉన్న అహంకార పోకడలు ఆయనకు మైనస్‌గా మారాయనే వారూ ఉన్నారు. గతంలో హుజూరాబాద్ లోనే ఉంటూ హైదరాబాద్ మంత్రిగా కాకుండా.. హుజూరాబాద్ మంత్రిగా పేరు పడ్డ ఈటల.. ఈమధ్య హుజూరాబాద్‌కు దూరమవ్వడం కూడా ఆయనలో వస్తున్న తేడాను ఇక్కడి ఓటర్లు పసిగట్టారనే టాక్ కూడా నడుస్తోంది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపక్షంలో ఉన్న ఈటల చేసేదెంత?.. అధికారపక్షంలో ఉన్నవారైతే అయ్యే అభివృద్ధి ఎంత అనే లెక్కలతో పాటు...ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ కు ఈసారి పెద్దఎత్తున ఓట్లు పోలవ్వడం..కౌశిక్ రెడ్డిపై వెల్లువెత్తిన సానుభూతి కూడా కలిసి.. ఈటల ఓటమికి ఆయన నమ్ముకున్న హుజూరాబాద్‌లోనే బీజం పడింది. రెండు నియోజకవర్గాల్లో ఓటమి ఈటల రాజకీయ జీవితాన్ని కొంత సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థిగా వొడితెల ప్రణవ్ లీడర్‌గా ఎదుగుతున్న క్రమంలో.. ఇప్పటికే విజయంతో ఊపుమీదున్న కౌశిక్ రెడ్డితో.. మున్ముందు ఫైట్ కూడా ఈటలకు మరింత టఫ్‌గానే ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. చదవండి: AP: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా? -
హుజురాబాద్ బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ
-
హుజూరాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం: కౌశిక్ రెడ్డి
-
హుజురాబాద్‌లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్‌రావు
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. హుజురాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల గెలిచిన నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించాడు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3వేల రూపాయలు అందిస్తాం. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతాం. గ్యాస్ సిలిండర్‌ను కేవలం రూ. 400కు అందిస్తాం. కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షలు ఇస్తాం. ఇదీ చదవండి..సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?: రేవంత్ సవాల్ హుజురాబాద్‌లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పాడు. డీకేకు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారు. దొంగ రాత్రి కరెంటు వస్తుంది. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరు నెలలు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడారు. రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా.. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నాం అన్నాడు. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళ తో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది’ అని హరీశ్ రావు హెచ్చరించారు. ఇదీ చూడండి.. మిషన్ తెలంగాణ -
బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: మంత్రి కేటీఆర్
-
ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా మూడోసారి బీఆర్ఎస్దే అధికారం: హరీశ్‌రావు
-
TS Election 2023: ఈ నియోజకవర్గానికి.. ఇప్పటివరకు 17సార్లు..!
సాక్షి, కరీంనగర్, పెద్దపల్లి: 'ఉద్యమాలకు కేంద్ర బిందువైన హుజూరాబాద్ 1957లో (ఎస్సీ రిజర్వ్) నియోజకవర్గంగా ఏర్పడి మూడేళ్లకే జనరల్ స్థానంగా మారింది. ఇందులో హుజూరాబాద్, భీమదేవరపల్లి తాలూకాలుగా ఉండేవి. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు ఉప ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగుసార్లు, టీడీపీ, స్వతంత్రులు మూడుసార్లు చొప్పున, ఇక బీఆర్ఎస్ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించింది. 2021లో వచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. ఇక్కడి నుంచి గెలిచిన ఇనుగాల పెద్దిరెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంత్రులుగా పని చేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గకేంద్రంతోపాటు ఆ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట(కొత్తగా ఏర్పడిన మండలం), హుజూరాబాద్ (మొత్తం ఐదు మండలాలు)తో కలిపి ముఖచిత్రంగా మారింది. ఇక కమలాపూర్ నియోజకవర్గం పూర్తిగా కనుమరుగైంది.' ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఇలా.. 1957లో ఏర్పడిన హుజూరాబాద్‌కు ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఈ నియోజకవర్గంలో ఉన్న సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హుస్నాబాద్ నియోజకవర్గంలో.. కమలాపూర్ నియోజకవర్గ కేంద్రంతోపాటు జమ్మికుంట, వీణవంక మండలాలను హుజూరాబాద్‌లో కలిపారు. అప్పటివరకు ఉన్న శంకరపట్నం, మానకొండూర్ మండలాలను విడదీసి కొత్తగా ఏర్పడిన మానకొండూర్ నియోజకవర్గంలో కలిపారు. హుజూరాబాద్ నుంచి 1957లో ఇద్దరు స్వతంత్రులే బరిలో దిగగా.. పోలుసాని నర్సింగరావును గెలిపించారు. 1962లో గాడిపల్లి రాములు (కాంగ్రెస్), 1967లో తిరిగి పోలుసాని నరసింగరావు (కాంగ్రెస్), 1972లో వొడితెల రాజేశ్వరరావు (కాంగ్రెస్), 1978లో దుగ్గిరాల వెంకట్రావు (కాంగ్రెస్), 1983లో కొత్త రాజిరెడ్డి (స్వతంత్ర), 1985లో దుగ్గిరాల వెంకట్రావు (టీడీపీ), 1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరి సాయిరెడ్డి విజయం సాధించారు. ఇక 1994, 1999లో వరుసగా ఇనుగాల పెద్దిరెడ్డి (టీడీపీ) గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఆదరించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ లక్ష్మీకాంతారావు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. పునర్విభజన అనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈటల ఘన విజయం సాధించారు. 2014, 2018లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్ని కల్లోనూ ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సా ధించారు. 2004వరకు జమ్మికుంటలో నామినేషన్ వేసే ఇక్కడి అభ్యర్థులు.. 2009 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనే వేస్తున్నారు. నియోజకవర్గ ప్రత్యేకతలు.. నియోజకవర్గం వ్యవసాయ ఆధారితం. ఎస్సారెస్పీ నుంచి ప్రవహించే కాకతీయకాలువ ద్వారా ఈ ని యోజకవర్గంలోని నా లుగు మండలాల్లో 59 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. జమ్మికుంటలోని పత్తిమార్కెట్ ఉత్తర తెలంగాణలోనే అతి పెద్దదిగా పేరుగాంచింది. సీడ్ ఉత్పత్తిలోనూ హుజూరాబాద్ దేశంలోనే పేరుగాంచింది. జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు వ్యవసాయంలో సూచనలు చేస్తూ కొత్త వంగడాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. జమ్మికుంట, ఉప్పల్, బిజిగిర్షరీఫ్లో ఉన్న రైల్వేస్టేషన్ ద్వారా ప్రయాణికులకు రవాణా సులువవుతోంది. మొత్తం ఓటర్లు 2,44,514 హుజూరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 106 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు ఉండగా, మొత్తం 305 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2,44,514 మంది ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 1,19,676 మంది పురుషులు, 1,24,833 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. -
ఈటల హుజూరాబాద్ బరిలో ఉంటారా? ఉండరా?
-
ప్రాణాలకు తెగించి కరెంట్ ఇచ్చిన లైన్‌మ్యాన్
-
ఈటల రాజేందర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మానకొండూరు వద్ద ఈటల కాన్వాయ్‌లోని ఒక కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. ఈటల రాజేందర్ ఆదివారం హుజురాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో మానకొండూరు మంలంలోని లలితాపూర్ వద్ద గొర్రెల మంద అడ్డుగా వచ్చింది. దీంతో, ఈటల కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ సందర్భంగా ఈటల కాన్వాయ్‌లోని మిగతా కార్లు ఒక్కదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో సిబ్బంది, నేతలు ఊపిరిపీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: TS/AP: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. -
కేసీఆర్ పొలిటికల్ దాడి.. ఈటల రూటు మార్చేశారా?
ఈటల రాజేందర్ రూట్ మార్చేశారా?.. గతంలో మంత్రిగా ఉన్నపుడు హుజూరాబాద్‌కే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అటువైపు రావడమే మానేశారా?. గులాబీ బాస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించే క్రమంలో రూట్ మార్చారా? తనపైనే ఫోకస్ చేస్తూ.. పదవులు కట్టబెడుతున్న తరుణంలో.. తానెక్కడి నుంచి బరిలోకి దిగుతారనే విషయంలో కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచే బరిలో ఉంటారా? ప్లేస్ మార్చుతారా? ఈటల ఆలోచన ఏంటి? అనేది హాట్ టాపిక్‌గా మారింది. గులాబీ బాస్ కేబినెట్లో మంత్రిగా ఉన్నపుడు ఈటల రాజేందర్ ఎప్పుడూ తన నియోజకవర్గమైన హుజూరాబాద్‌లోనే కనిపించేవారు. కేసీఆర్‌ను ధిక్కరించి బయటకొచ్చాక కూడా నియోజకవర్గానికి ఎన్నడూ దూరంగా లేరు. అయితే, గత ఉప ఎన్నికలో తనను టార్గెట్ చేస్తూ గులాబీ దళం చేసిన ముప్పేట దాడితో ఈటల ఉక్కిరిబిక్కిరి అయింది వాస్తవం. గులాబీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాత్రం ఈటలనే వరించింది. ఈ పరిణామం గులాబీ దళపతిని మరింత అసహనానికి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ ప్రాంతం నుంచి నలుగురికి రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవులు కట్టబెట్టారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి.. విప్‌గా క్యాబినెట్ హోదా కల్పించడమ కాకుండా.. హుజూరాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. జరుగుతున్న పరిణమాలన్నీ ఇప్పుడు ఈటలలో మధనానికి కారణమయ్యాయా అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. తెలంగాణ అంతటా ఈటల పర్యటన.. కేసీఆర్ వ్యూహ రచన గురించి బాగా తెలిసినవాళ్లలో ఈటల రాజేందర్ కూడా ఒకరు. ఈ క్రమంలో గులాబీబాస్ వ్యూహాలకు ప్రతివ్యూహంగా ఈటల అడుగులు వేస్తున్నారా..? అందుకే తరచూ పర్యటిస్తూ ఉండే సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారా..? బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ హోదాను ఆసరా చేసుకుని.. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ.. రాబోయే ఎన్నికల నాటికి తన ఛరిష్మాను ఇంకా పెంచుకోవడంతో పాటు.. తానెక్కడ నిలబడ్డా గెలవగలిగే అనుకూల పరిస్థితులను సృష్టించుకుంటున్నారా?. ఈక్రమంలో ఏ నియోజకవర్గం అయితే తనకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలు వేసుకుంటున్నారా అని చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా పర్యటిస్తున్న ఈటల ఎప్పుడూ లేనివిధంగా తన నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటంతో.. అసలు వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తారా? మరో నియోజకవర్గం ఎంచుకుంటారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్లాన్ మార్చనున్న ఈటల? ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచే మళ్లీ బరిలోకి దిగొచ్చూ, లేకపోవచ్చు.. ఎన్నికలనాటికి రాజకీయ సమీకరణాల ఆధారంగా పరిస్థితులు మారిపోతాయి. కానీ, తననే ఫోకస్ చేస్తూ తనను ఎలాగైనా ఓడించాలన్న కసితో ఉన్న గులాబీబాస్నే ఒకింత కన్ఫ్యూజ్ చేసే క్రమంలోనే ఈటల అడుగులెటువైపో తెలియకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. తన చిరకాల ప్రత్యర్థిలా మారిన గులాబీ బాస్ కేసీఆర్ మీద లేదంటే జిల్లాలో ప్రధాన ప్రత్యర్థిగా తయారైన మంత్రి గంగుల కమలాకర్ మీద గానీ ఈటల బరిలోకి దిగే అవకాశాలున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఈ ఫొటో గుర్తుందా? -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈటలకు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై ప్లస్ భద్రత కల్పించింది. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. ఈ మేరకు ఈటలకు భద్రత పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈటలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించనుంది. కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ చేసి ఎమ్మెల్యే భద్రతపై సీనియర్ ఐపీఎస్‌తో వెరిఫై చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి గురువారం డీసీసీ సందీప్ రావు చేరుకొని ఆయన భద్రత అంశంపై చర్చించారు. అనంతరం ఎమ్మెలయే భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్‌కు నివేదిక ఇచ్చారు. అయితే ఈటలకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో తాజాగా ప్రభుత్వమే వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: కేటీఆర్‌కు నిరసన సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన మంత్రి -
ఈటల నివాసానికి పోలీసులు.. భద్రతపై చర్చ
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి డీసీసీ సందీప్ రావు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఈటల భద్రత అంశంపై ఆయనతో సమావేశమై అరగంట పాటు చర్చించారు. అనంతరం, ఈటల ఇంటి నుంచి డీసీపీ వెళ్లిపోయారు. ఇక, వీరి భేటి నేపథ్యంలో ఈటల భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్‌కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ చెప్పిన అంశాలను డీజీపీ వివరిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈటల ఇంటి పరిసరాలను అధికారులు నిన్న(బుధవారం) పరిశీలించారు. అయితే, ఈటల భద్రతను సమీక్షించాలని మంత్రి కేటీఆర్.. డీజీపీని ఆదేశించారు. దీంతో, రాజేందర్ భద్రత పెంపుపై డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. మరోవైపు.. తన హత్యకు కుట్ర జరుగుతోందని, ప్రాణహాని ఉందని ఈటల ఇప్పటికే తెలిపారు. ఈ క్రమంలో ఈటలకు కేంద్రం వై కేటగిరి భద్రత పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇది కూడా చదవండి: ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్ -
ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆయన భార్య జమున సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జమున.. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నాడని ఆమె తెలిపారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్‌రెడ్డి చెలరేగిపోతున్నాడు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్‌పై ఈటల జమున మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దీంతో, ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ చేశారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్‌తో వెరిఫై చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌కు భద్రత పెంపుపై డీజీపీ అంజనీ కుమార్ సమీక్ష చేయనున్నారు. దీంతో, సీనియర్ ఐపీఎస్ కాసేపట్లో ఈటల ఇంటికి వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ఈటల జమున కామెంట్స్‌పై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి స్పందించారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. హత్యా రాజకీయాలను ఈటల కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. ఎక్కడ హుజురాబాద్‌లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటల రాజేందర్‌ను ఓడించేందుకని స్పష్టం చేశారు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు -
ఈటల రాజేందర్ హత్యకు కుట్ర... స్పందించిన కౌశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. ఈటల రాజేందర్‌వి హత్యా రాజకీయాలని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. హత్యా రాజకీయాలను ఆయనక కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. 2014లో బాల్‌రాజ్ అనే వ్యక్తిని ఈటల రాజేందర్ హత్య చేయించారని ఆరోపించారు. ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్‌ను థర్డ్ డిగ్రీ పెట్టించి వేధిస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. 2018 మర్రిపల్లిగూడెంలో ఈటల తనను చంపించే ప్రయత్నం చేశారని అన్నారు. ఎక్కడ హుజురాబాద్‌లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు. చదవండి: అంతా తెలుసు.. టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్ ‘నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటెల రాజేందర్‌ను ఓడించేందుకు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుంది. బీసీలపై గౌరవం ఉంటే ఎందుకు ముదిరాజ్ కోడల్ని, అల్లున్ని తెచ్చుకోలేదు. కోళ్లఫామ్ పెట్టుకున్న వ్యాపారులు దివాళ తీస్తంటే ఈటల రాజేందర్ మాత్రం వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన పెంచే కోళ్లు ఏమైనా బంగారు గుడ్లు పెడుతున్నాయా? ఈటల రాజేందర్ కాస్త ఇవాళ చీటర్ రాజేందర్‌గా మారారు. రోడ్డు పొడిగింపు కోసం అమర వీరుల స్థూపాన్ని తొలగించేందుకు తీర్మానం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన అమరుల స్తూపం శిలాఫలకంపై ఈటల రాజేందర్ పేరు ఉంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈటల లేడు’ అని పేర్కొన్నారు. కాగా ఈటల రాజేందర్ సతీమణి జమున తన భర్తను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిఇసందే. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నారని జమున వ్యాఖ్యానించారు -
ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
మానకొండూర్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. అతడు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు ద్విచక్రవాహనదారుడిని ఢీ కొని, అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. బెలూన్స్ ఓపెన్‌కావడంతో కౌశిక్‌రెడ్డి, గన్మెన్లు, డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మానకొండూర్ మండలం శంషాబాద్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తనకారులో సోమవారం ఉదయం కరీంనగర్ నుంచి హుజూరాబాద్ బయల్దేరా డు. మానకొండూర్ మండలం శంషాబాద్ చేరుకోగానే అదే గ్రామానికి చెందిన బూస సంపత్ ద్విచక్రవాహనంతో రోడ్డు దాటుతుండగా కౌశిక్‌రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు అతడిని ఢీకొట్టింది. కారు డ్రైవర్ అప్రమత్తమై కుడివైపు తిప్పగా.. రోడ్డు కిందకు దిగింది. రెండు చెట్లను ఢీకొట్టబోతుండగా డ్రైవర్ తప్పించడంతో చిన్నపాటి కందకంలో దిగింది. కారు ముందుభాగం దెబ్బతింది. ప్రమాదసమయంలో కౌశిక్‌రెడ్డి ముందుసీట్లో కూర్చుకున్నాడు. బెలూన్స్ ఓపెన్‌కావడంతో కారులోని వారికి ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనదారుడికి గాయాలు కాగా.. కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కౌశిక్‌రెడ్డి మరోకారులో హుజూరాబాద్ వెళ్లిపోయారు. కాగా.. కౌశిక్‌రెడ్డి డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా కా రు నడపడంతో తనతండ్రి ప్రమాదానికి గురయ్యాడని సంపత్ కొడుకు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజ్‌కుమార్ వివరించారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. దారిలో షాకిచ్చిన వధువు ఫ్యామిలీ
సాక్షి, హుజురాబాద్: ప్రేమపెళ్లి చేసుకున్న ఓ నవ వధువు సినీఫక్కీలో కిడ్నాప్‌కు గురైంది. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. కొండగట్టులో ప్రేమ పెళ్లి చేసుకుని హన్మకొండ వైపుగా కొత్త జంట వెళుతోంది. కారును అడ్డగించిన 15 మంది.. వరుడిపై దాడి చేసి, వధువును తీసుకెళ్లారు. వధూవరులిద్దరు హన్మకొండకు చెందినవారు. కొంతకాలంగా ప్రేమించుకున్న వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెళ్లికూతురు బంధువులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమక్షంలోకి వధువును తీసుకురానున్నట్లు సమాచారం. -
అన్న ప్రభుత్వ ఉద్యోగి, తమ్ముడు సాఫ్ట్వేర్.. ఊహించని రోడ్డు ప్రమాదంలో
సాక్షి, హన్మకొడ: హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం ఇద్దరు అన్నదమ్ముల్ని పొట్టన పెట్టుకుంది. హసన్‌పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి శివరాం, హరికృష్ణగా గుర్తించారు. వివరాలు.. హుజూరాబాద్ కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మనోహర్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివరామకృష్ణ (25), చిన్న కుమారుడు హరికృష్ణ (23). శివరామకృష్ణ రైల్వే శాఖలో ఉద్యోగానికి ఎంపికై మౌలాలీ (సికింద్రాబాద్)లో శిక్షణ పొందుతున్నాడు. హరికృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఇటీవల పెద్దకుమారుడు శివరామకృష్ణకు పోస్టల్ శాఖలో మరో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం చెప్పడం కోసం ఆదివారం స్వగ్రామం కందుగులకు వచ్చాడు. తిరిగి సోమవారం డ్యూటీకి వెళ్లాలని ఉదయం 4.30 గంటలకు ఇంటి నుంచి తమ్ముడితో కలిసి స్కూటీపై హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద 5.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణ, హరికృష్ణ తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ఈటలను మళ్లీ టార్గెట్ చేసిన కేసీఆర్.. హుజూరాబాద్‌లో ఏం జరుగుతోంది?
ఈటల రాజేందర్. ఒకప్పుడు గులాబీ పార్టీలో సంచలనం. బాస్ మీదే తిరుగుబాటు చేసిన ఈటల కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. సవాల్ చేసి హుజూరాబాద్‌లో కమలం గుర్తు మీద గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా తుత్తునియలు చేశారు. కానీ ఇప్పుడు మరోసారి గులాబీ బాస్‌కు టార్గెట్ అయ్యారు. అసలు హుజూరాబాద్‌లో ఏం జరుగుతోంది? తెలంగాణ ఉద్యమంలో తొలినుంచీ కేసీఆర్ వెంట ఉన్న ఈటల రాజేందర్.. అనేక రాజకీయ పరిణామాల తర్వాత కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. కాషాయ కండువా కప్పుకుని ఉప ఎన్నికలలో తన సీటును కాపాడుకున్నారు. హుజూరాబాద్‌లో ఈటలను ఓడించడానికి గులాబీ బాస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ ఉప ఎన్నికలోనే దళిత బంధు వంటి ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. బీజేపీలో కూడా అంతర్గత కలహాలతో ఈటల ఇబ్బంది పడుతున్నారన్న ప్రచారం ఇటీవల జరుగుతోంది. ఈటల తిరిగి బీఆర్ఎస్ బాట పడతారా అన్న చర్చకు దారితీసింది. ఈటల మాత్రం కాషాయ పార్టీలోనే ఉండేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో తనకు దక్కాల్సిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడంలేదనే ఓ భావన ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం బాగుండదనుకున్నారో... ఏమో మొత్తానికి ఈటల బీఆర్ఎస్ కవ్వింపులకైతే పడిపోలేదు. పైగా బీజేపీ నెక్స్ట్ రాష్ట్రాధ్యక్షుల లిస్ట్‌లో ఈటల పేరు కూడా వినిపిస్తుండటంతో.. మరోసారి గులాబీ బాస్ ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంపైనా.. మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్పైనా ఫోకస్ చేసినట్టుగా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టడంతో పాటు.. దళితబంధు వంటి పథకాలతో బీఆర్ఎస్ అక్కడి జనం మనసుని.. ముఖ్యంగా దళితుల ఓట్లనీ తనవైపు తిప్పుకునేలా ప్లాన్ చేసింది. ఎన్నికల్లో విజయం రాజేందర్‌నే వరించింది. కొంతకాలం పాటు అటువైపు పెద్దగా దృష్టి పెట్టని గులాబీ బాస్ ఇప్పుడీ నియోజకవర్గంపై మళ్లీ ప్రధానంగా ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి కారెక్కిన కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రోత్సహించడంతో పాటు.. ఉప ఎన్నికలో ఈటలపై పోటచేసి ఓటమిపాలైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పదవిచ్చారు. హైదరాబాద్‌లో అంబేడ్కర్ అతి పెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకుని.. దానికి ముందు హుజూరాబాద్‌కి అంబేడ్కర్ ముని మనవడైన ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్ ను ప్రత్యేక చాపర్ లో పంపించారు. హుజూరాబాద్‌లో అమలవుతున్న దళితబంధు పథకాన్ని.. లబ్దిదారులు ఆయనకు వివరించేలా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ని కూడా అరేంజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. ఈటల పైనా.. ఆయన నియోజకవర్గంపైనా గులాబీ బాస్ ఎప్పుడూ ఓ కన్నేసే ఉంచుతున్నారనిపిస్తోంది. ఈటల రాజేందర్‌పైన ఎప్పుడూ విరుచుకుపడే కౌషిక్ రెడ్డి.. తన నియోజకవర్గానికి సంబంధం లేకున్నా తన చిరకాల ప్రత్యర్థిలా ఈటలను భావించే మంత్రి గంగుల కమలాకర్ కే ఈ బాధ్యతలను అప్పజెప్పడం వెనుకా గులాబీబాస్ ఆలోచనలు ఏంటన్నది ఇప్పుడో పెద్ద చర్చ. మరి ఇంతగా ఫోకస్ అవుతూ.. ఓ ముఖ్యమంత్రి చూపునే తనవైపు తిప్పుకునేలా చేయడం ఒకవైపు ఈటెలకున్న స్టామినాను చెబుతుంటే... ఇంకోవైపు ఇంతగా ఫోకస్ అవుతూ తానే లక్ష్యంగా జరుగుతున్న ఒత్తిడిని ఈటెల ఏవిధంగా ఎదుర్కొంటారోనన్న ఆసక్తీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. -
కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాలేదు
హుజూరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, సకల జనులు కలసికట్టుగా పోరాడితేనే తెలంగాణ స్వప్నం సాకారమైందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెలంగాణ బచావో సభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మిలియన్ మార్చ్ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో æమార్చి 10న తెలంగాణ బచావో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో వచ్చే సూచనల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారు, తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వారు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం తేటతెల్లం చేస్తోందని తెలిపారు. కుంభకోణంలో తమ వాటా కోసం ఓ కుటుంబం ప్రయత్నించిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడేందుకు ధరణి పోర్టల్ రూపొందించారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పింది ఏంటి? ఇప్పుడు చేసేదేంటి? అని కోదండరాం ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముక్కర రాజు, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ నర్సింగ్, ప్రధాన కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పూర్తిగా బంద్ కాలేదు : ఈటల
-
హుజూరాబాద్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. చేతులు కలిపిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా వ్యవహారం చల్లబడిందో లేదో మళ్లీ హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గం పంచాయితీ తెరపైకి వచ్చింది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గురువారం ఏకంగా కలెక్టరేట్ ఏవో నారాయణకు ఫిర్యాదు ప్రతులను అందజేశారు. హుజూరాబాద్ నుంచి నేరుగా బీఆర్ఎస్కు చెందిన 22 మంది, బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం వద్దకు చేరుకొని చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం విషయంలో ఏకతాటిపై ఉండాలని ప్రతిజ్ఞ చేసిన అనంతరం కరీంనగర్‌కు చేరుకొని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో హుజూరాబాద్ అవిశ్వాస వ్యవహారం అధికార బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదే బాటలో జమ్మికుంట పాలకవర్గంలో కూడా అవిశ్వాస ముసలం పుట్టినట్లు సమాచారం. గతనెల 31వ తేదీన జమ్మికుంటలో భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అగ్రనేతలంతా బీజేపీ విధానాలపై దుమ్మెత్తిపోసిన రెండురోజులకే అదే పార్టీ నేతలతో కలిసి అవిశ్వాసానికి వెళ్లడం గమనార్హం. ఏకపక్ష నిర్ణయాల వల్లే... హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక భర్త గందె శ్రీనివాస్ వ్యవహార శైలి వల్లే అవిశ్వాసం వరకు అసమ్మతి రగడ రాజుకుందనే ప్రచారం మెండుగా ఉంది. గతంలో శ్రీనివాస్ వ్యవహారంపై అప్పటి మంత్రి ఈటల రాజేందర్, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌కు, మరికొంత మంది పార్టీ ముఖ్యనేతలకు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పులేకపోవడం వల్లే అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల విషయంలో తోటి కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా, బినావీులతో కాంట్రాక్టు పనులు చేయిస్తూ మెజార్టీ కౌన్సిలర్ల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, అధికారులను భయబ్రాంతులకు గురి చేయడం వల్లే ఈ నిర్ణయానికి మెజార్టీ సభ్యులు తోడైనట్లు తెలిసింది. పాలకవర్గంలో 30 మంది సభ్యులుండగా ఒకరు మృతి చెందారు. 25 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చైర్‌పర్సన్‌కు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే మద్దతుగా మిగిలారు. ఎమ్మెల్సీ వద్దకు పంచాయితీ.. 25 మంది కౌన్సిలర్లు గురువారం సాయంత్రం హుజూరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని కలిసి విషయాన్ని వివరించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు నడుచుకోవాలని, సమస్యను పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు తావివ్వద్దని ఎమ్మెల్సీ వారికి సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా తాము వ్యవహరించమని, మెజార్టీ సభ్యుల మనోభావాలను గుర్తించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని మొరపెట్టుకున్నట్లు వినికిడి. దీంతో ఈ విషయాన్ని ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. హుజూరాబాద్ తరహాలోనే జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గంలో కూడా ముసలం పుట్టినట్లు సమాచారం. వరుస పరిణామాలతో అధికార పార్టీలో గందరగోళం నెలకొంది. - గత పాలకవర్గంలోనూ ఇదే తరహాలో అర్ధంతరంగా అవిశ్వాసం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలో 2018 ఆగస్టులో అప్పుడు చైర్మన్‌గా ఉన్న విజయ్‌కుమార్‌తో రాజీనామా చేయించారు. అనంతరం ఆ స్థానంలో మందా ఉమాదేవి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఆమె 10 నెలలపాటు పదవిలో కొనసాగారు. ఆ తరువాత ప్రత్యేకాధికారుల పాలన సాగింది. అనంతరం 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగ్గా.. జనవరి 27న గందె రాధిక నేతృత్వంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో రాష్ట్రాల అవిశ్వాసాలకు తెరలేవగా.. ఆ మంటలు ఇక్కడ కూడా అంటుకున్నాయి. చైర్పర్సన్ రేసులో ముగ్గురు..! బీఆర్ఎస్–బీజేపీ కౌన్సెలర్లు అవిశ్వాస తీర్మానం ఇవ్వగా.. అన్నీ అనుకూలిస్తే అవిశ్వాసం విజయవంతమైతే చైర్పర్సన్ స్థానానికి ముగ్గురు పోటీలో ఉన్నారు. మందా ఉమాదేవి, దండ శోభ, వైస్ చైర్పర్సన్ కొల్లిపాక నిర్మల రేసులో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కానుంది. -
జమ్మికుంట సభలో హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
కరీంనగర్: జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హుజురాబాద్‌లో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ విశ్వాసం కల్పించారని చెప్పి పరోక్షంగా ఆయనే అభ్యర్థి అని ప్రకటించారు. ఎన్నికలు వచ్చే వరకూ ప్రజల్లోనే ఉండాలని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు బీఆర్ఎస్ జెండా మారలేదు, ఎజెండా మారలేదు, అదే డీఎన్ఏ అని కేటీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో మళ్లీ పొరపాటు జరగొద్దన్నారు. అందరికీ భరోసా ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? మోసం చేసే పార్టీలు కావాలా? రైతన్నలారా ఆలోచించండి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రానికి, దేశానికి ఏ పార్టీ అరిష్టమో ఆలోచించండి అన్నారు. మోదీ ఎవరికి దేవుడు? 'మోదీ ఎవరికి దేవుడు? ఎవనికి దేవుడు? రూ.400 సిలిండర్‌ను రూ1,200 చేసిన మోదీ దేవుడా? 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా యువతకు మోసం చేసిన మోదీ దేవుడా? పెట్రోల్ ధరలు పెంచారు. మోదీ రూ.100 లక్షల కోట్లు అప్పు చేయలేదా? దమ్ముంటే చెప్పు ఈటల రాజేందర్. చేనేతపై ఏ ప్రధాని వేయని పన్ను మోదీ వేశారు. పద్మశాలీలు ఆలోచించాలి. బండి సంజయ్ దమ్ముంటే కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకు రావాలి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. '14 నెలల కిందట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారు. ఇది చేస్తాం అది చేస్తాం అమిత్ షాను తీసుకొస్తాం అని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఒక్క రూపాయి వచ్చిందా? మాటలు కోటలు దాటాయి. చేతలు గడప కూడా దాటలేదు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని ఈటల అన్నారు. బాధ అనిపించింది. అసలు ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్‌కు పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు కాదా? 33 మంది పోటీ పడితే ఈటలకు టికెట్ ఇవ్వలేదా?' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌ని కరీంనగర్ నుంచి ఎందుకు గెలిపించాని కేటీఆర్ ప్రశ్నించారు. మసీదులు తవ్వడం కాదు, దమ్ముంటే కాలువలు తవ్వుదాం రా.. అని సవాల్ విసిరారు. మాట్లాడితే పాకిస్తాన్, హిందూస్తాన్ అంటారని ధ్వజమెత్తారు. బండి సంజయ్‌కు గుజరాతీల చెప్పులు మోసే సోకు ఉండొచ్చని ఎద్దేవా చేశారు. 14 నెలల్లో ఈటల, బండి హుజూరాబాద్‌కు చిల్లిగవ్వ కూడా తేలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. చదవండి: పట్టించుకోని కేసీఆర్ సర్కార్.. తీర్థం ఇచ్చేందుకు సిద్ధమైన కమలం పార్టీ -
Karimnagar: ఉమక్క, రమేశ్ బావ క్షమించండి.. కంటతడి పెట్టిస్తోన్న లేఖ
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ పట్టణం సాయిబాబా గుడి సమీపంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటననాలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి కాలనీవాసులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికే చెందిన జంగిలి రాజు (30) స్థానిక సాయిబాబా గుడి సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ స్థానిక ఓ వైన్‌షాపులో కూలీగా పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో అతడి తల్లి మృతిచెందింది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. రాజు ఉండే ఇంటి పరిసరాల నుంచి సోమవారం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇంటి తలుపులు తెరిచి చూడగా రాజు కుళ్లిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. ఆయన చుట్టూ రక్తం ఉండడం.. శరీరం నుంచి ద్రవాలు వెలువడడంతో ముఖమంతా ఏర్పడకుండా మారిపోయింది. అతడి సెల్‌ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ అయి ఉంది. బంధువులకు సమాచారం అందించగా.. వారం నుంచి అతడి సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తోందని తెలిపారు. అయితే రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? మరేదైనా కారణమా..? అనే విషయం విచారణ చేసిన తర్వాతే తెలిసే అవకాశం ఉందని పో లీసులు చెబుతున్నారు. గది లోపలి నుంచి తలుపులకు తాళం వేసి ఉండడంతో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. ఆర్డర్ ఆలస్యమైందని, ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి సూసైడ్ నోట్లో ముగ్గురి పేర్లు.. రాజు మృతదేహం వద్ద సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన చావుకు చిన్నమ్మ అనసూర్య, శ్రీధర్, శివ కారణమని రాసి ఉంది. తన అమ్మ చనిపోయిన తర్వాత అక్క, బావ చేరదీశారని, అయితే పై ముగ్గురితో మానసికంగా ఇబ్బందిపడ్డానని, అనసూర్య, ఆమె కొడుకులు తనను కొడుతున్నారని, వారివల్లనే జీవితంపై విరక్తి కలిగిందని, అందుకే ఇంజక్షన్ తీసుకుంటున్నానని రాసి ఉంది. తన చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని కూడా ఆ ఉత్తరంలో కోరాడు. ఉమక్క, రమేశ్‌బావ క్షమించండి.. ‘ఉమక్క నన్ను క్షమించు’ అంటూ రాజు రాసిన లేఖ కంటతడి పెట్టించింది. ‘ఉమక్క భయం వేస్తుంది. నాకు చావాలని లేదు. నన్ను జంగిలి అనసూర్య, శివ, శ్రీధర్ తిడుతూ కొడుతున్నారు. వాళ్ల వల్లే చనిపోతున్నా. ఇంజక్షన్ వేసుకున్నాక ఎలా ఉంటుందో నాకు తెల్వది. ఆ ఇంజక్షన్ వేసుకున్న తర్వాత చస్తే నా బాడీ కుళ్లిపోయి వాసన వచ్చేవరకు ఎవరూ రారేమో. బహుశా మీరు కూడా చూసే అవకాశం ఉండదేమో. ఎందుకంటే అంతగా నా బాడీ కుళ్లి పోయి ఉంటుంది. కనుక నన్ను క్షమించండి’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. లేఖలోని విషయాలపైనా పో లీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ప్రియుడి ఇల్లును దగ్ధం చేసిన ప్రియురాలి బంధువులు
-
కరీంనగర్లో దారుణం.. లవ్ మ్యారేజ్ చేసుకున్నారని..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఇందిరానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంతో ప్రియుడి ఇంటిని ప్రియురాలి తరపు బంధువులు దగ్ధం చేశారు. అయితే తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని తమకు రక్షణ కల్పించాలని ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఘటనలో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చదవండి: (ఎయిమ్స్‌లో సీటు సాధించాలనే కోరిక.. ఆ ఒత్తిడితోనే..) -
హుజురాబాద్‌లో గన్ కలకలం.. నాకేం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత: ఈటల షాకింగ్ కామెంట్స్
సాక్షి, హుజురాబాద్: బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఓ నాయకుడి వద్ద గన్ కనిపించడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బహిరంగ కార్యక్రమంలో ఇలా గన్‌తో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. అయితే, దీనికి సంబంధించిన వీడియోపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో గన్ లైసెన్స్‌లు విచ్చలవిడిగా ఇస్తున్నారు. నాకు, నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. మా రక్తం బొట్టు చిందినా సీఎందే పూర్తి బాధ్యత. ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదు. నాపై నయిమ్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినప్పుడే భయపడలేదన్నారు. ఇక, గన్ లైసెన్స్‌లపై కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో సీపీ మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో హుజురాబాద్‌లో కేవలం ఇద్దరికి మాత్రమే గన్ లెసెన్స్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఒక్కరూ కూడా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తున చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇక, గన్‌తో కనిపించిన నేతను సైతం పోలీసులు స్టేషన్‌కు పిలిపించుకుని మరోసారి ఇలా జరిగితే లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. -
వాసాలమర్రిలో వడివడి.. హుజూరాబాద్‌లో తడబడి..
హుజూరాబాద్ నుండి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దళితబంధు.. తెలంగాణ దళితుల సంక్షేమం, అభివృద్ధిలో ఓ విప్లవం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో ఉపాధి మార్గాన్ని చూపే ఓ కొత్త వెలుగు. ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ దళితుల స్థితిగతులను మార్చేందుకు వాసాలమర్రిలో పురుడుపోసుకున్న ఈ పథకం హుజూర్బాద్లో విస్తరించి ఏడాదిని పూర్తి చేసు కుంటోంది. అయితే లక్ష్యాలు, నిబంధనలు ఒక్కటే అయినా, యాదాద్రి జిల్లా వాసాలమర్రి లబ్ధిదారుల్లో వెలుగులు నింపుతున్న ఈ పథకం..హుజూరాబాద్‌లో మాత్రం తడబడుతోంది. తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు, సరైన యూనిట్ల ఎంపిక, అధికారుల పర్యవేక్షణ, మెరుగైన అమలు తీరు వాసాలమర్రి దళితులను విజయపథంలో నడిపిస్తుంటే..యూనిట్ల ఎంపికలో అవగాహన లోపం, సరైన మార్గదర్శకత్వ లేమి కారణంగా హుజూరాబాద్‌లో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రత్యేక సర్వే.. పకడ్బందీగా అమలు వాసాలమర్రిలో స్థానిక మార్కెట్ పరిస్థితి, లబ్ధిదారుల అభిరుచులు, వారి సాంకేతిక సామర్థ్యాల పరిశీలన అనంతరం యూనిట్లను మంజూరు చేశారు. ఆపై వారు నిలదొ క్కుకునేందుకు ప్రత్యేక శిక్షణ, పరిశీలనతో ముందుకు వెళ్తుండటంతో ఇక్కడ సక్సెస్ రేటు ఊహించినదానికంటే అధికంగా ఉంది. మెజారిటీ లబ్ధిదారుల పరిస్థితి ప్రభుత్వం ఆశించిన విధంగా మెరుగుపడుతోంది. స్థానిక అవసరాల మేరకు యూనిట్లు ‘వాసాలమర్రిలో తొలుత ప్రత్యేకంగా సర్వే చేసి స్థానిక పరిస్థితులు, అవసరాలను గుర్తించాం. ఇదే సమయంలో లబ్ధిదారుల్లో సామర్థ్యాన్ని పరిశీలించి వారు కోరుకున్నవి కాకుండా అక్కడ అవసరం ఉన్న యూనిట్లు పెట్టించాం. 75 మందికి 19 రకాల పనులు అప్పగించి చేయూతనిస్తున్నాం. మెజారిటీ లబ్ధిదారుల ఆర్థికస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది..’ అని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ చెప్పారు. ఇక్కడ కోరుకున్న వారికి కోరుకున్నట్టుగా..! హుజూరాబాద్‌లో 15,710 కుటుంబాలకు దళితబంధు అందజేయాలన్న లక్ష్యంతో ఇప్పటికి 12,007 మందికి అందజేశారు. అయితే ఇక్కడ స్థానిక పరిస్థితులు, లబ్ధిదారుల సామర్ధ్యం, మార్కెట్లో డిమాండ్ – సప్లయితో సంబంధం లేకుండా యూనిట్ల పంపిణీ సాగుతోంది. దీంతో లబ్ధిదారుల్లో తమకు రూ.10 లక్షల సహాయం అందుతుందన్న సంతోషం ఉన్నా, ఆశించిన ఆదాయం రావటం లేదన్న అసంతృప్తి వెంటాడుతోంది. హుజూరాబాద్ మండలం చిల్పూరులో 324 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేస్తే అందులో 142 యూనిట్లు వాహనాలే కావటం విశేషం. ఇక ఎక్కువ సంఖ్యలో బర్రెలు తీసుకున్నవారూ సంతృప్తిగా లేరు. హరియాణాæ నుండి తెచ్చిన బర్రెలు ఆశించిన విధంగా పాలు ఇవ్వకపోగా, అనారోగ్యం పాలవున్న తీరు లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. లబ్ధిదారుల అవగాహన లోపం, సరైన చర్యలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాసాలమర్రిలో ‘లక్ష్మీ’ కటాక్షం దళితబంధు పథకంతో తన పేరు నిజంగా సార్ధకమైందని అంటోంది..వాసాలమర్రికి చెందిన చెన్నూరి లక్ష్మి. నలుగురు పిల్లల తల్లయిన లక్ష్మి గతంలో అద్దెకు తీసుకున్న ఆటోలో భర్తతో కలిసి ఊరూరూ తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసేది. కానీ వచ్చిన లాభంలో 75 శాతం ఆటో అద్దెకే పోయేది. ఈ నేపథ్యంలో దళితబంధు కింద లక్ష్మి ఆటో ట్రాలీ తీసుకుంది. కూరగాయలు కొని అమ్మితే లాభం ఉండదని భావించింది. తనకున్న భూమిలో బోరు వేసి తాను కూడా కాయగూరల సాగు మొదలుపెట్టింది. ఇప్పటికే నలుగురు కూతుళ్లలో ఇద్దరి వివాహాలు చేయగా, బీటెక్, ఎంబీఏ చదువుతున్న ఇంకో ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న కుమార్తె మానసతో కలిసి లక్ష్మి చుట్టుపక్కల పల్లెలకు ఆటోలో వెళ్లి వస్తూ వ్యాపారం చేస్తోంది. సొంత ఆటో, వ్యవసాయ పంటలతో ప్రస్తుతం లక్ష్మిఆదాయం నెలకు రూ.50 వేల వరకు చేరింది. ఇక దీపం వత్తులు చేస్తున్న బొల్లారం లావణ్య, పేపర్ గ్లాస్లు తయారు చేసి విక్రయిస్తున్న బొల్లారం రేఖలు చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు. తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నారు. ఈ తరహా మార్పు వాసాలమర్రిలోని 80 శాతం లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. వరినాటు మెషీన్ తీసుకున్నాం కానీ.. గతంలో కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లం. దళితబంధులో మా చిన్నాన్న అయిలయ్యతో కలిసి వరి నాటు వేసే మెషీన్ తీసుకున్నం. ఇప్పటివరకు 80 ఎకరాల్లో నాట్లు వేసినం. గంటకు ఎకరం వరకు నాటు వేస్తుంది. అయితే ఆ యంత్రాన్ని నడపడం మాకు రాకపోవడంతో బాపట్ల నుంచి డ్రైవర్, టెక్నీషియన్లను తీసుకొచ్చాం. వచ్చిన ఆదాయంలో అత్యధికం డ్రైవర్, టెక్నీషియన్‌తో పాటు డీజిల్‌కే పోయింది. మాకు సరిపడా మిగిలే పరిస్థితి ఉంటే బాగుంటుంది. –పాంకుంట అనిల్, ధర్మరాజుపల్లి (హుజూరాబాద్) కేసీఆర్‌కు రుణపడి ఉంటాం మాకు ఎకరన్నర పొలం ఉంది. మా ఆయన వ్యవసాయం చేస్తోంటే నేను ఊళ్లోనే కూలి పనికి పోయి బతికేది. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. దళితబంధులో నెల క్రితం 4 బర్రెలు వచ్చినై. రెండు బర్లు పాలిస్తున్నై. 15 రోజులకు రూ.6 వేల వరకు వచ్చినయి. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. అయితే పాల దిగుబడి ఊహించినట్టుగా లేదు. – పుల్ల సరోజని, చెల్పూరు (హుజూరాబాద్) అడ్డా మీద పెట్టనివ్వలేదు.. రెండు నెలల క్రితం మాకు మా నాన్న పేరుమీద ఆటో ట్రాలీ ఇచ్చారు. ఊరిలో సరిపడా గిరాకీ దొరకటం లేదు. జమ్మికుంట అటో అడ్డాకు పోతే.. సభ్యత్వం కోసం 7 వేలు కట్టమన్నారు. అంతమొత్తం లేక ఆటో ఊరిలోనే పెట్టా. ఇక్కడ గిరాకీ దొరికితే పోతున్న. – గోపీచంద్, చెల్పూరు (హుజూరాబాద్) చేయి విడువని వ్యవస్థ కావాలి దళితబంధు అనేది సంక్షేమ రంగంలోనే అత్యద్భుతం. అయితే యూనిట్ ఎంపిక, నిర్వహణ, భవిష్యత్తులో వచ్చే సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అవసరం. ఇది ప్రభుత్వంతో పాటు దళిత ప్రజాస్వామిక సంఘాల బాధ్యత. వచ్చే ఐదేళ్ల పాటు లబ్ధిదారులకు అన్నివిధాలా సహాయకారిగా ఉండేలా చేయి విడువని వ్యవస్థ ఏర్పాటు చేస్తేనే పథకం లక్ష్యం నెరవేరుతుంది. – మల్లేపల్లి లక్ష్మయ్య, చైర్మన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అన్నివిధాలా అండగా ఉండాలి రాష్ట్రంలో 19 లక్షల దళిత కుటుంబాలున్నాయి. రూ.3,100 కోట్లతో 29 వేల మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ పథకంతో దళితుల జీవితాల్లో మార్పులు రావాలంటే ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన పలు చర్యలను నిపుణులు సూచిస్తున్నారు. ►యూనిట్ల మంజూరుతోనే సరి పెట్టుకోకుండా లబ్ధిదారులకు అన్నివిధాలా అండగా నిలవాలి. అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ►లబ్ధిదారులు స్థానిక పరిస్థితులు, వారి సామర్థ్యానికి అనుగుణంగా యూనిట్లు ఎంపిక చేసుకునేలా చూడాలి. యూనిట్ల పంపిణీ కంటే ముందుగానే వాటిపై పూర్తి అవగాహన కల్పించాలి. అవసరమైన సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. మార్కెట్ మెలకువలు కూడా వివరించాలి. ►దళితబంధు లబ్ధిదారుల పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించి యూనిట్లు లాభాల బాట పట్టేలా మిగతా విభాగాలతో సమన్వయం చేయాలి. ►ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి, లోపాలు సరిదిద్దడంతో పాటు లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ►ప్రభుత్వ విభాగాల్లో ప్రైవేటు వాహనాల వినియోగం స్థానే.. దళితబంధు యూనిట్లకు ప్రాధాన్యవ్వాలి. ►జిల్లా స్థాయిలో గ్రీవెన్స్‌సెల్ పెట్టి వచ్చే ఫిర్యాదులపై తక్షణ పరిష్కారం చూపాలి. -
హుజూరాబాద్‌లో ఉద్రిక్తత: టీఆర్ఎస్-బీజేపీ బాహాబాహీ!
హుజూరాబాద్(కరీంగనగర్ జిల్లా): టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. హుజురాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఫ్లెక్సీల అంశానికి సంబంధించి గురువారం సాయంత్రం ప్రాంతంలో టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తలు బహిరంగ చర్చ సవాళ్లతో హంగామా సృష్టించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. -
చర్చకు రమ్మంటే ముఖం చాటేస్తున్న ఈటల: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్: ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కోరితే సమాధానం చెప్ప కుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నా రని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. బుధవారం హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరినా ఈటల స్పందించకపోవడం తన తప్పును అంగీకరించినట్లేనని స్పష్టం చేశారు. 5న హుజూ రాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద నియోజకవర్గ ప్రజల మధ్యే అభివృద్ధిపై చర్చ పెట్టుకుందామన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక పాల్గొన్నారు. -
Women's Day 2022: రూ. 20తో మొదలై.. ఇప్పుడు కోటికి పైగా నిధులతో..
పొదుపు.. ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. ఒక్కో నీటి చుక్క సముద్రమైనట్టు.. సంపాదించే దాంట్లో ఎంతో కొంత కూడబెడుతూ ఉంటే... ఒకానొక నాడు పెద్ద మొత్తం చేతికి వస్తుంది. అత్యవసర సమయంలో మనల్ని ఆదుకుంటుంది. ఇక పొదుపు మంత్రం పాటించడంలో మహిళలు ముందుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గృహిణులు ‘ఇంటి పెద్ద’ ఇచ్చే మొత్తం నుంచే కుటుంబ సభ్యులందరి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగినులకైతే నెలవారీ ఆదాయం ఉంటుంది కాబట్టి వారితో పోలిస్తే పెద్దగా సమస్యలు ఎదురుకాకపోవచ్చు. ఇదంతా సగటు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన స్త్రీల గురించే! అన్ని ఖర్చులు పోనూ కొంతమొత్తాన్ని పొదుపు చేసి అవసరాలకు వాడుకోవడం సహజం. అయితే, వ్యక్తిగత పొదుపు కంటే కూడా సామూహిక పొదుపు ఎల్లప్పుడూ అదనపు మేలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాలు ఇందుకు చక్కని ఉదాహరణ. అవసరమైన సమయంలో తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చి ఆదుకుంటాయి. అలాంటి వాటిలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామం కూడా ఒకటి. ఎలాంటి ఆటంకాలు, అవకతవకలు లేకుండా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ గ్రామానికి చెందిన ఝాన్సీ మహిళా సంఘం. ఇటీవలే సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకుంది. తమ చేత, తమ కోసం ఏర్పడ్డ ఈ సంఘాన్ని ఆదర్శ సంఘంగా తీర్చిదిద్దిన ఘనత మహిళా శక్తిదే. ముఖ్యంగా వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్న బొక్కల పుష్పలీల ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగడం ఓ రికార్డు అనే చెప్పాలి. ఆమెకు చేదోడువాదోడుగా నిలిచే పాలవర్గ సభ్యులు.. అన్నిటికీ మించి తీసుకున్న అప్పును సరైన సమయంలో చెల్లిస్తున్న సభ్యుల సహకారం వల్లే ఈ సంఘం నిర్వహణ విజయవంతంగా కొనసాగుతోంది. 20 రూపాయల(మొదటి సభ్యత్వం)తో మొదలై నేటికి కోటికి పైగా నిధులు సమకూర్చుకుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరి గురించి ప్రత్యేక కథనం. అలా మొదలైంది.. 1997 ఏప్రిల్‌లో 100 మంది సభ్యులతో ఝాన్సీ మహిళా సంఘం ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సంఘంలో 750 మంది సభ్యులు, 58 మంది మార్గనిర్దేశకులు ఉన్నారు. పాలనా విభాగంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు(డైరెక్టర్లు) ఉంటారు. మొదట్లో ఒక్కో సభ్యురాలు 20 రూపాయలు పొదుపు కట్టేవారు. 600 రూపాయలు జమ అయిన తర్వాత 1800 రూపాయలు అప్పుగా పొందవచ్చు. నెలకు కొంత అసలు, వడ్డీ కలిపి కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు 50 రూపాయల మేర పొదుపు చేస్తున్నారు. తొలినాళ్లలో వడ్డీ వందకు రూ. 2. అయితే, నిధులు సమకూరిన కొద్దీ వడ్డీని తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం 75 పైసలుగా ఉంది. ఒక సభ్యురాలికి నియమిత పొదుపును బట్టి గరిష్టంగా 70 వేల రూపాయల వరకు అప్పు ఇస్తారు. క్రమం తప్పకుండా చెల్లించే వారికి ప్రత్యేక అప్పు కింద మరో 40 వేలు ఇస్తారు. కాబట్టి ఏవైనా అవసరాలు ఉన్నవారు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా తమ సంఘం నుంచే తక్కువ వడ్డీకి అప్పు పొందవచ్చు. సభ్యులకు సంఘం ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చెల్లిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేసుకునే వెసలుబాటు ఉంటుంది. గరిష్టంగా లక్ష వరకు ఎఫ్డీ చేసుకోవచ్చు. 8 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. 9 శాతం వడ్డీ చెల్లిస్తారు. మొదట్లో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు కానీ.. నేను వరంగల్ సహకార సంఘానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమానికి వెళ్లినపుడు మా గ్రామంలో కూడా ఇలాంటి సంఘం ఉంటే ఎంతో బాగుంటుంది అనిపించింది. అందుకే ఊరికి తిరిగి రాగానే కొంత మంది మహిళలను కలిసి నా ఆలోచనను పంచుకున్నాను. అందరం కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి తీర్మానం చేసుకున్నాం. ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాం. అప్పట్లో రోజూవారీ కూలీ 20 రూపాయలు. అందుకే ఒక్కరోజు వేతనాన్ని పొదుపు మలచుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్లాము. అలా నెలరోజుల్లో 100 మంది సభ్యులుగా చేరారు. తర్వాత కొన్ని వ్యతిరేక గళాలు వినిపించినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాం. దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడి దాకా చేరుకున్నాం. కోటికి పైగా నిధులు సమకూరాయి. లెక్కలు చూసేందుకు గణకులు ఉంటారు. ప్రతి ఏడాది ఆడిట్ చేయిస్తాం. ఏడాదికోసారి మహాసభ పెట్టి లెక్కలన్నీ అందరికీ వినిపిస్తాం. మాకంటూ సొంత భవనం ఉంది. 25 ఏళ్లుగా నేను అధ్యక్షురాలిగా ఉన్నాను. ఈ ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు చవిచూశాను. అలాంటి సమయంలో నా భర్త ఎల్లారెడ్డి అందించిన ప్రోత్సాహం మరువలేనిది. -బొక్కల పుష్పలీల, ఝాన్సీ మహిళా సంఘం అధ్యక్షురాలు. అకౌంటెంట్‌గా పనిచేస్తున్నా సంఘంలో సభ్యురాలిని. 2001 నుంచి ఇక్కడ గణకులుగా పనిచేస్తున్నా. ఉదయం 9 గంటలకు ఆఫీసు తెరుస్తాను. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ్యులు వచ్చి పొదుపు జమ, అప్పు, వడ్డీ చెల్లిస్తూ ఉంటారు. మొదట్లో నా జీతం 300 రూపాయలు. ఇప్పుడు నెలకు 9600. అధ్యక్షులు, పాలకవర్గ సభ్యుల సూచన మేరకు నా విధి నిర్వర్తిస్తాను. మంచి సంఘంగా మాకు గుర్తింపు ఉంది. -బిజ్జిగిరి తిరుమల, గణకులు నేను సైతం.. సంఘం గురించి వినగానే నేను కూడా అందులో సభ్యురాలినైతే బాగుంటుందని భావించా. రూ. 20 కట్టి సభ్యత్వం తీసుకున్నా. నాతో పాటు నలుగురిని చేర్పించా. ఒక్కో గ్రూపులో ఐదుగురు సభ్యులు ఉంటారు. కుటుంబానికి అవసరం వచ్చిన ప్రతిసారి సంఘం నుంచి అప్పు తీసుకోవడం.. సరైన సమయంలో చెల్లించడం జరుగుతోంది. కొంత డబ్బు ఫిక్స్డ్ కూడా చేసుకున్నా. దానిపై లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికీ మూడుసార్లు డైరెక్టర్‌గా ఎన్నికయ్యాను. ఏడాదిపాటు ఉపాధ్యక్షురాలిగా పనిచేశాను. సాధారణ నెలవారీ సమావేశాలకు పన్నెండు మంది డైరెక్టర్లు హాజరవుతారు. ఐదో తేదీ నుంచి 30 వరకు అప్పు కట్టే వీలుంటుంది. మొండి బకాయిలు ఉంటే ఇంటికి వసూలుకు వెళ్తాం. -వై. రత్నమాల, డైరెక్టర్ అప్పు పుట్టని పరిస్థితుల్లో ఆపద్భాందవిగా పొలంలో చల్లేందుకు ఎరువులు కొనేందుకు అప్పు పుట్టని పరిస్థితుల్లో సంఘం నన్ను ఆదుకుంది. అవసరం ఉన్నపుడు అప్పు తీసుకోవడం, తర్వాత చెల్లించడం పరిపాటిగా మారింది. నిజంగా పాలిట సంఘం ఆపద్భాందవి అనే చెప్తాను. ఇంత పెద్ద కుటుంబంలో సభ్యురాలిని కావడం సంతోషంగా ఉంది. -శ్రీరాముల ఆగమ్మ, పాలకవర్గ సభ్యురాలు నన్ను సంఘమే ఆదుకుంది సొంత వ్యవసాయ భూమి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఉపాధి నిమిత్తం మా కుటుంబం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 10 ఏళ్ల పాటు అక్కడే ఉండి గ్రామానికి తిరిగి వచ్చాం. తిరిగి వ్యవసాయం మొదలుపెట్టాం. అప్పటికే నేను సంఘంలో సభ్యత్వం తీసుకున్నా. చిన్న చిన్న అవసరాలకు, పెట్టుబడికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అప్పు తీసుకునేదాన్ని. డైరెక్టర్‌గా పనిచేశాను. క్రమశిక్షణ కలిగిన సంఘంగా పేరు తెచ్చుకున్న సంస్థలో భాగం కావడం సంతోషంగా ఉంది. - నర్ర రజిత, సభ్యురాలు -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
తెలంగాణ హుజూరాబాద్ అయితది
సంస్థాన్ నారాయణపురం: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఫలితం వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో ఐదు నిరుపేద కుటుంబాలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన ఇళ్ల గృహ ప్రవేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కేసీఆర్ సర్వే చేయిస్తే.. రాజగోపాల్‌రెడ్డికి ప్రజల్లో మంచి పేరుందని తేలిందని, అందుకే మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని మునుగోడు నియోజకవర్గంలో తిప్పుతున్నాడన్నారు. రోడ్ల అభివృద్ధికి నిధులు తీసుకునిరా.. ఇళ్లులేని వారికి ఇళ్లు ఇప్పించు.. పింఛన్లు లేని వారి ఫింఛన్లు ఇప్పించు.. రేషన్ కార్డులు ఇవ్వు అని ఆయన మంత్రిని డిమాండ్ చేశారు. అవి నెరవేరిస్తే మంత్రిని గౌరవిస్తాం,. సన్మానం చేస్తామన్నారు. అభివృద్ధికి రూపాయి తీసుకురాకున్నా.. కల్యాణలక్ష్మి చెక్కులు, రేషన్ కార్డులు ఇచ్చేందుకు మంత్రి రావాలా? అని ఆయన ప్రశ్నించారు. -
ఉద్యమ బిడ్డను.. భూమి, ఆకాశం ఒక్కటి చేస్తా: ఈటల
హుజూరాబాద్: ‘పేదవారికి నష్టం జరిగితే ఊరుకునేది లేదు. ఈటల అమాయకుడే కావొచ్చు. కానీ, ఉద్యమ బిడ్డ అని మర్చిపోవద్దు. భూమి ఆకాశం ఒకటి చేస్తా’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్, సింగాపూర్‌లో కూర్చొని హరీశ్ రావు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ‘ఒడ్డు ఎక్కేదాక ఓడ మల్లన్న, ఒడ్డు ఎక్కిన తరువాత బోడ మల్లన్న’ అన్నట్లు కేసీఆర్ పనితీరు ఉందన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు అనగానే సీఎంకు దళితులు గుర్తుకొచ్చారని, హుజూరాబాద్‌లో 21 వేల దళిత కుటుంబాలకు, రూ.21 వేల కోట్లు కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేసి, రాత్రికి రాత్రి పాస్‌బుక్‌లు ఇచ్చి దళితుల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. దళితబంధు రూ.10 లక్షల మీద కలెక్టర్, బ్యాంక్‌ల పెత్తనం వద్దని, అన్ని కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలకు విము ఖత ఉందని తెలిపారు. ‘ఇకనైనా దిగిరా.. ప్రజలకు విశ్వా సం కల్పించు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఇదే మా భాష అని తెలంగాణను కించపరచకు’ అని హితవు పలికారు. -
పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పైనా పోటీకి సిద్ధం..
సాక్షి, హైదరాబాద్: పార్టీ నాయకత్వం ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పైనా పోటీ చేసేందుకు సిద్ధమని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. బీజేపీలో తాను మనస్ఫూర్తిగానే కొనసాగుతున్నానని, పార్టీ లు మారే సంస్కృతి తనది కాదని స్పష్టం చేశారు. అన్ని రకాలుగా ఆలోచించుకున్న తర్వాతే తాను బీజేపీలో చేరినట్టు తెలిపారు. టీఆర్ఎస్ను కూడా తాను వీడలేదని, వాళ్లే వెళ్లగొట్టారని స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు సమన్వయకర్తగా గురువారం జరిగిన ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఈటల బదులిచ్చారు. ‘‘టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంగా మారింది. అందులోని అంశాలేవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఎవరూ సంతోషంగా లేరు. ఆ పార్టీలో తమకు భవిష్యత్ లేదని చాలా మంది భావిస్తున్నారు. మంత్రిగా నేను ప్రగతిభవన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు లేకుండానే విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా అవకాశమివ్వలేదు. చాలా సందర్భాల్లో నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఎన్నో రూపాల్లో అవమానించారు. కేబినెట్ మంత్రిగా కాదు... కనీసం మనిషిగా గుర్తించలేదు. నాకే కాదు గతంలో నాయిని నర్సింహారెడ్డి, మహమూద్ అలీ, తదితరులకు కూడా ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి. తన ముని మనమడు వరకు అధికారంలో ఉండాలంటే తెలంగాణ చైతన్యాన్ని చంపేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఇంకా ఎవరితోనూ విభేదాలు లేవు. అందరం కలిసి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం’’అని ఈటల అన్నారు. తనలాంటివారికి, వందల ఎకరాలున్న వారికి కూడా రైతుబంధు ఇవ్వడం ఏమిటని ఈటల ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు, ఇతర అంశాలపై ముందుచూపు లేకుండా, తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. -
ఆశ పోయింది.. శ్వాస ఆగింది..కొనుగోలు కేంద్రంలోనే ఆగిన రైతు గుండె
హుజూరాబాద్/జమ్మికుంట: ధాన్యంరాశి వద్ద ఇరవై రోజులుగా పడిగాపులు కాసినా, కొనే నాథుడులేడనే ఆవేదనతో అన్నదాత కన్ను మూశా డు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య (59)కు 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు 20 రోజుల క్రితం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ధాన్యం తేమగా ఉందని అధికారులు కొర్రీ పెట్టడంతో ఐలయ్య అక్కడే ధాన్యం ఆరబోసి 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళ వారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై వడ్ల రాశిపైనే కుప్పకూలి విగతజీవిగా మారాడు. ఆయనకు భార్య లక్ష్మి, కూతురు నిత్య ఉన్నారు. కొనుగోలులో జాప్యం చేయడం వల్లే ఐలయ్య మృతి చెందాడని, మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు డిమాండ్ చేశారు. వడ్లు తెచ్చి 20 రోజులైతాంది వడ్లను కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులైతాంది. తేమ ఉందని ఆరబెట్టాలని సార్లు చెప్పిన్లు. అప్పటిసంది కేంద్రంలోనే రోజూ ధాన్యం ఎండబెడుతున్నం. ఈ రోజు నా భర్త భోజనం చేసి, వడ్లను బస్తాలలో నింపేందుకు పోయిండు. కొద్దిసేపటికే చనిపోయిండని చెప్పిన్లు. నాకు దిక్కెవరు. ప్రభుత్వం ఆదుకోవాలె. – లక్ష్మి, మృతుడి భార్య టోకెన్ ఇచ్చాం ఐలయ్య వారం క్రితం కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. ఆరబెట్టిన తర్వాత ఈ టోకెన్ జారీ చేశాం. ఈరోజు గన్నీ తీసుకొని నింపుతుండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో చనిపోయాడని తెలిసింది. – తిరుపతి, పీఏసీఎస్ సెంటర్ ఇన్చార్జి ఐలయ్యది ఆకస్మిక మరణం: అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఐలయ్య ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపే సమయంలో గుండెపోటుతో మృతి చెందారని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 4న 10–10 రకానికి చెందిన దాదాపు 50 బస్తాల ధాన్యాన్ని తీసుకురాగా, 6న టోకెన్ జారీచేశామని పేర్కొన్నారు. ఐలయ్య మృతిపై జిల్లా సహకార అధికారి కార్యాలయం సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రసూనతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు. -
‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్నా’
జమ్మికుంట(హుజూరాబాద్): నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగు నెలల కిందట భర్త ఆత్మహత్య చేసుకుంటే.. నేడు అతని జ్ఞాపకాలు మరువలేక భార్య ఉరేసుకుంది. నిరుద్యోగి షబ్బీర్ కుటుంబాన్ని విధి వెక్కిరించడాన్ని తల్చుకుంటూ జమ్మికుంట వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సీఐ రాంచందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్, జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన రేష్మ(26) 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన షబ్బీర్ అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో చేరాడు. చదవండి: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి, భార్యతో కలిసి జమ్మికుంట వచ్చాడు. స్థానిక హౌజింగ్‌బోర్డు కాలనీలో గది అద్దెకు తీసుకున్నారు. కానీ ఇక్కడా అతనికి పని దొరకలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే సన్నద్ధం అవుదామనుకుంటే రాలేదు. ప్రైవేటు ఉద్యోగాలకు ప్రయత్నించినా దొరకలేదు. గది అద్దె చెల్లించేందుకు, భార్యను పోషించుకునేందుకు డబ్బు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సూసైడ్ నోట్ రాసి, ఈ ఏడాది ఆగస్టు 1న జమ్మికుంట రైల్వేస్టేషన్లో రైలు కింద పడి, ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందినప్పటి నుంచీ రేష్మ అంబేద్కర్ కాలనీలోని తల్లిగారింట్లో ఉంటోంది. చదవండి: ప్రముఖ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యం, ఏకే రావు మృతదేహం లభ్యం ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. సీఐ రాంచందర్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ సూసైడ్ నోట్ లభించింది. ‘అమ్మానాన్న.. నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్న.. షబ్బీర్ జ్ఞాపకాలు ప్రతీ క్షణం గుర్తుకు వస్తున్నాయి. ఇలా క్షణక్షణం చస్తూ బతకడం నా వల్ల కావట్లేదమ్మా.. అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నాను.. చింటు, పప్పుగా అమ్మను, నాన్నను జాగ్రత్తగా చూసుకోండి.. నన్ను క్షమించండి’ అని అందులో రాసిందని సీఐ పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు గోపీచంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఈటల రాజేందర్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు
నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె ఎప్పుడు, ఎవరి మీద కామెంట్స్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకు చేస్తుందో కూడా తెలియదు. తాజాగా ఈ పంజాబీ బ్యూటీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలుపోటముల గురించి తాజాగా పూనమ్ స్పందించింది. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) గురునానక్ జయంతి సందర్భంగా ఈటలను ప్రత్యేకంగా కలిసి ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన గుర్తును కానుకగా ఇచ్చింది పూనమ్. అంతేకాకుండా ఆయనతో కలిసి శాంతి కపోతమైనా పావురాన్ని ఎగుర వేసింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ధర్మ యుద్ధం ఎప్పుడూ గెలుస్తుందంని కామెంట్ చేసింది. అలాగే రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపించిందని పూనమ్ కౌర్ అభిప్రాయపడింది. మొత్తానికి పూనమ్ కౌర్ ఇలా కనిపించడంతో నెటిజన్లకు కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. పూనమ్ కౌర్ కొంపదీసి బీజేపీలో చేరుతుందా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
ఢిల్లీకి తాకిన హుజురాబాద్ సెగ
-
హుజూరాబాద్ జోష్; బీజేపీలో విందు రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో నేతల విందు రాజకీయాలు జోరందుకుంటున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుతో జోరు మీదున్న నాయకులు తమ పార్టీలోని నాయకులతో కలిసి విందులు చేసుకుంటున్నారు. కొన్ని నెలలుగా అలుపెరగకుండా వివిధ కార్యక్రవలు, ఆందోళనలు, నిరసనల్లో పాల్గొన్న వారు సేదతీరే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక, ధాన్యం కొనుగోళ్లు, దళితబంధు అమలు, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పోటాపోటీ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, శ్రేణులు నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈనెల 16న నిరుద్యోగ మిలియన్ మార్చ్, 21 నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను మొదలుపెట్టాలని భావించారు. అయితే శాసనమండలిలో స్థానికసంస్థల ప్రతినిధులు, తదితర సీట్లకు ఏర్పడనున్న ఖాళీల భర్తీకి ఈసీ ఎన్నికల షెడ్యల్ విడుదలతో ఈ కార్యక్రమాల నిర్వహణపై పార్టీ పునరాలోచనలో పడింది. ఇదిలా ఉండగా శనివారం రాత్రి నగర శివార్లలోని తమ వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విందునిచ్చారు. ఈ విందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యులు, రాష్ట్ర పార్టీ పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు హాజరయ్యారు. నాయకులకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి బాటలోనే మరికొందరు ముఖ్యనేతలు కూడా విందులిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సవచారం. ఇదిలా ఉంటే.. బీజేపీలో ముఖ్యనేతల మధ్య ఏర్పడిన అంతరాలు, అసంతృప్తులను దూరం చేసుకునేందుకు ఒక రహస్య ప్రదేశంలో శనివారం సమావేశమవుతున్నట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం జరగడం విందు రాజకీయాలకు కొసమెరుపుగా చెప్పొచ్చు. ముఖ్యనేతల మధ్య ఏదైనా రహస్యభేటీ ఉంటే పరిమితంగా ఐదారు మంది కలుసుకుంటారే తప్ప రాష్ట్ర పార్టీ నాయకులంతా ఒక చోట చేరరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలంటూ ఓ బీజేపీ నేత ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. అయితే శనివారం ఒక ముఖ్య నేత ఇంట్లో జరిగిన సమావేశానికి రాష్ట్ర నేతలు హాజరైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో కొందరు నాయకుల మధ్య ఏర్పడిన అంతరాలు, అసంతృప్తులపై చర్చించారని కొందరు చెబుతున్నా అది ధ్రువీకరణ కాలేదు. -
హుజురాబాద్ ఓటమిపై ఏఐసీసీ సమీక్ష
-
హుజురాబాద్ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్
-
ఒక ఎలక్షన్ వస్తది.. పీకుతది అది ఇష్యూనే కాదు
-
మ్యాగజైన్ స్టోరీ 04 November 2021
-
నా విజయం ప్రజలకు అంకితం
హుజూరాబాద్: అధికార పార్టీ బెదిరింపులను లెక్క చేయకుండా తనకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు తన విజయాన్ని అంకితమిస్తున్నట్లు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీరదన్నారు. నియోజకవర్గ ప్రజలంతా కలిసికట్టుగా ఉండి కేసీఆర్ చెంప చెళ్లుమనిపించారని చెప్పారు. బుధవారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. చరిత్రలో ఇలాంటి ప్రలోభాల ఎన్నిక ఇప్పటివరకు జరగలేదని ఈటల అన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా, నియోజకవర్గ ప్రజలు గుండెను చీల్చి, తమ ఆత్మను ఆవిష్కరించి తనను గెలిపించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. కులాల పరంగా చీలిక తెచ్చినా, అధికార పార్టీ నేతలందరూ బెదిరింపులకు పాల్పడినా, ప్రజలు తనను తమ గుండెల్లో పెట్టుకుని భారీ విజయాన్ని అందించారని తెలిపారు. తనను టీఆర్ఎస్ బయటకు పంపాక బీజేపీ అక్కున చేర్చుకుందని, కేంద్రమంత్రి అమిత్‌షా సంపూర్ణ సహకారం అందించారని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మద్దతుగా నిలిచారని తెలిపారు. ఓయూ, కేయూకు చెందిన వారితో పాటు ఎందరో విద్యార్థులు సహకరించారని, సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కుయుక్తులను చీల్చి చెండాడారని వివరించారు. పోలీసులే డబ్బుల పంపిణీ చేయించారని, హుజూరాబాద్ ప్రజలను అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. కుట్రదారుడు కుట్రలలోనే నాశనం అయిపోతాడన్నారు. రెండు గుంటల భూమి ఉన్న వ్యక్తి రూ.400 కోట్ల డబ్బు ఎలా ఖర్చుపెట్టాడని ప్రశ్నించారు. 2వ తేదీనే నాకు దీపావళి దేశవ్యాప్తంగా ఈ నెల 4న దీపావళి జరుపుకొంటుంటే.. తాను రెండో తేదీనే జరుపుకున్నట్లు ఈటల పేర్కొన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ ఓట్లు సాధించానని చెప్పారు. ఇది కేసీఆర్ అహంకారంపై ప్రజల విజయంగా అభివర్ణించారు. దళితబంధు కింద రూ.10 లక్షలు పదిసార్లు ఇచ్చినా తనను మర్చిపోబోమని దళితులు అండగా నిలిచారన్నారు. విలేకరుల సమావేశానంతరం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈటల వెంట మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఉన్నారు. ఈటలపై కేసు నమోదు కరీంనగర్ క్రైం: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ త్రీటౌన్ సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన ఈటల రాజేందర్, తన అనుచరులు ఊరేగింపుగా కోర్టుప్రాంతం వద్దకు వచ్చారు. ఎన్నికల నియమావళితో పాటు పలు నిబంధనలు ఉల్లంఘించడంతో ఈటల, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాంగ్రెస్ లో కాక రేపుతున్న హుజురాబాద్ ఫలితం
-
కుట్రలు, ప్రలోభాలను హుజురాబాద్ ప్రజలు తిప్పికొట్టారు
-
కేసీఆర్ కు హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెప్పారు
-
ఆటలో అరటి పండులా మారిన తెలంగాణ కాంగ్రెస్
-
హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు షాక్
-
హుజూరా‘బాద్’షా ఈటలే...
-
సొంత ఇలాకాలో తిరుగులేదని నిరూపించిన ఈటల
-
TRS అబద్దాలు ప్రజలు అర్ధం చేసుకున్నారు
-
Dalit Bandhu: కేసీఆర్‌కు షాకిచ్చిన శాలపల్లి ఓటర్లు.. ఈటలకే మద్ధతు
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం హుజురాబాద్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు. దళిత బంధును తమకు భారీ విజయాన్ని కట్టబెడుతుందని భావించిన కారు పార్టీకి ఎన్నికల ఫలితాల్లో ప్రతికూల పరిస్థితే ఎదురైంది. ఒక్క 8వ రౌండ్, 11వ రౌండ్ మినహా మిగతా అన్నింటిలోనూ బీజేపీ అభ్యర్థి ఈటలకే ఓటర్లు మద్దతు పలికారు. దళిత బంధుతో గెలుపు తమదేనని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేయగా.. అంచనాలకు విరుద్ధంగా ఓటర్లను ఈ పథకం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోని ఓటర్లు టీఆర్ఎస్కు బిగ్ షాకిచ్చారు. శాలపల్లిలో టీఆర్ఎస్పై బీజేపీ 129 ఓట్లు ఆధిక్యత సాధించింది. మొత్తం గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు పడగా, టీఆర్ఎస్కు 182 ఓట్లు పడ్డాయి. దీంతో టీఆర్ఎస్ ప్రయోగించిన దళితబంధు అస్త్రం ఈ ఎన్నికల్లో ఫలించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 22 రౌండ్ల ఫలితాలకు గాను మెజార్టీ రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. 20 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 2 రౌండ్లలో మాత్రమే ఆధిక్యం సాధించారు. ఫలితంగా ఈటల 24వేల పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. చదవండి: హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతోంది: బండి సంజయ్ -
హుజూరాబాద్ ఉప ఎన్నిక: పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ఆధిక్యం
-
Telangana: రాష్ట్రంలో 3 కోట్ల మంది ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మూడు కోట్లు దాటింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2022లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా సోమవారం ప్రచురించారు. ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,03,56,665 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,52,57,690 మంది పురుషులు, 1,50,97,292 మంది మహిళలు, 1,683 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 13,965 మంది పురుషులు, 538 మంది మహిళలు కలిపి మొత్తం 14,503 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. 5,01,836 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లున్నారు. ఈ నెల 30 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2022 జనవరి 1 అర్హత తేదీగా ఆ నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 20 నాటికి పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 6న హుజూరాబాద్ ముసాయిదా జాబితా.. రాష్ట్రంలో 116 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, 115 నియోజకవర్గాల ముసాయిదా జాబితాలు మాత్రమే ప్రకటించారు. ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ స్థానానికి సంబంధించిన ముసాయిదా జాబితాను ఈ నెల 6న ప్రకటించనున్నారు. డిసెంబర్ 6 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించి డిసెంబర్ 27లోగా పరిష్కరించనున్నారు. 115 అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి హుజూరాబాద్ స్థానం తుది ఓటర్ల జాబితాను వచ్చే జనవరి 5న ప్రకటిస్తారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
-
హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్
సాక్షి, కరీంనగర్: పోలింగ్ 95.11 శాతమేంటీ అనుకుంటున్నారా.. మీరు చదివేది నిజమండి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓ పోలింగ్ బూత్‌లో నమోదైన ఓటింగ్ శాతమిది. జిల్లా ఎన్నికల చరిత్రలో హుజూరాబాద్ ప్రత్యేకత చాటుతుండగా ఉప ఎన్నికలో.. అత్యధికంగా ధర్మరాజుపల్లిలో 95.11 శాతం (పోలింగ్ బూత్ 72లో) నమోదైంది. ఇక్కడ 1,002 ఓటర్లకు గాను 953 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా జమ్మికుంట 67.13 శాతం(పోలింగ్ బూత్ 170), పోలింగ్ బూత్ 172), హుజూరాబాద్‌లోని పోలింగ్ కేంద్రం 40లో 69.10 శాతం ఓటింగ్ నమోదవగా మిగతా అన్ని పోలింగ్ బూత్‌ల్లో 80శాతం దాటడం ఆహ్వానించదగ్గ పరిణామం. చదవండి: Huzurabad Bypoll: బెట్టింగ్ 50 కోట్లు! ఆ 30 గ్రామాలు.. 90 శాతంపైనే ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో పోలింగ్ 90శాతం దాటడం శుభపరిణామం. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఓటుపై మమకారం చాటారు. మల్యాల పోలింగ్ బూత్ 235లో 93.57శాతం నమోదవగా, 1,011 మంది ఓటర్లకు గాను 946 మంది ఓటేశారు. గునిపర్తి 282 పోలింగ్ కేంద్రంలో 93.41శాతం నమోదవగా 607కు 567 మంది ఓటు వేశారు. నేరెళ్ల (284)లో 92.96 శాతం నమోదవగా 582కు 541 మంది ఓటు వేశారు. చదవండి: Huzurabad Bypoll: ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ సిరిసేడులో 92.94 శాతం, చిన్నకోమట్పల్లి (223)లో 92.81 శాతం, హుజూరాబాద్(27)లో 92.70 శాతం, దేశ్రాజ్పల్లి (302)లో 92.51 శాతం, టేకుర్తి (222)లో 92.31 శాతం, గంగారాం(125)లో 91.92 శాతం, మల్లన్నపల్లి(119)లో 91.87 శాతం, సీతంపేటలో 91.86 శాతం, నాగంపేట, కందుగులలో 91.68 శాతం, వంతడ్పుల 91.61 శాతం, శాయంపేట 91.41 శాతం, నాగారం 91.32 శాతం, వంగపల్లి, పంగిడిపల్లి, కనగర్తి, భీంపల్లి, వెంకటేశ్వర్లపల్లి, అంబాల, వంతడ్పుల, గూడూరు, కేశవపూర్, గండ్రపల్లి, బేతిగల్, బొంతుపల్లి, దమ్మక్కపేట గ్రామాల్లో 90 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. -
కేసీఆర్ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారు
హుజూరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజావిశ్వాసం కోల్పోయారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గెలవలేక నీచమైన పనులు చేస్తున్నారని ఆరోపించారు. ధర్మాన్ని కాపాడుకునేందుకు హుజూరాబాద్ ప్రజలు చేసిన సాహసం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. హుజూరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఆర్నెల్లుగా అధికార పార్టీ ఆగడాలను నిలువరించడంలో కలెక్టర్, సీపీలు ఉదాసీనంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ దళితబంధు జీవో ఇవ్వడం పెద్ద ఉల్లంఘన అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇక్కడే తిష్టవేసి ఓటువేయకుంటే దళితబంధు, పెన్షన్ రాదని ప్రజలను బెదిరించారని, కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అధికారపార్టీ ఖూనీ చేసిందని, డబ్బు, మద్యం వాహనాలను పోలీసు ఎస్కార్ట్ పెట్టి మరీ తరలించిందని, డబ్బులు పంచేవారికి పోలీసులు బందోబస్తు కల్పించారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారన్నారు. బస్సుల్లో తరలిస్తున్న ఈవీఎంలను మార్చినట్టు వార్తలు వస్తున్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ధర్మానిదే అంతిమ విజయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, నాయకులు సంపత్‌రావు ఉన్నారు. -
వీవీ ప్యాట్ల అంశంపై సమగ్ర వివరణకు సీఈవో ఆదేశం
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వీవీ ప్యాట్లు తారుమారయ్యాయని బీజేపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఈవో శశాంక్ గోయల్ ఎన్నికల అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. వీవీ ప్యాట్ల అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కలెక్టర్, వీఆర్వోలకు ఆదేశాలు జారీచేశారు. రేపు (సోమవారం) అన్ని పార్టీల నేతలతో సీఈవో శశాంక్ గోయల్ భేటీకానున్నారు. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బు పంచారు: ఈటల -
కొన్నిచోట్ల డబ్బుల పంపిణీపై ఫిర్యాదులు వచ్చాయి: శశాంక్ గోయల్
-
హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ (ఫోటోలు)
-
Huzurabad Bypoll: కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు
-
ఇల్లంతకుంట మండలం మల్లాల గ్రామంలో ఉద్రిక్తత
-
ఓటేసిన ఈటల దంపతులు
-
కొనసాగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్
-
Huzurabad Bypoll: రేపు ఉపఎన్నికకు పోలింగ్
-
ఓటరు ఎటువైపు?.. కీలకంగా చివరి 24 గంటలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా ఒక్క రోజే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల తీర్పు ఎటువైపు ఉం టుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. శనివారం ఉద యం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండటంతో.. ప్రధాన పార్టీలు ఓటర్లకు గాలం వేసేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. కీలక నేతలు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లినా కూడా ఫోన్ల ద్వారా స్థానిక నేతలతో పూర్తిస్థాయిలో టచ్‌లో ఉంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ఉన్న కాస్త సమయాన్ని ఎలా ‘సద్వినియోగం’ చేసుకోవాలనే దానిపై ఆదేశాలు, సూచనలు ఇస్తున్నారు. ఏ మాత్రం పరిస్థితి చేయి దాటిపోకుండా అభ్యర్థులు, వారి అనుచరులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో డబ్బు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీ భారీ ఎత్తున కొనసాగుతోందని స్థానికులు చెప్తున్నారు. (చదవండి: Jagtial Crime News: ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య?) అంచనాలకు అందకుండా.. ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో మాత్రం పరిస్థితి అంచనాలకు అందడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు నువ్వా, నేనా అన్నట్టుగా వ్యవహరించాయని.. పోలింగ్ మొదలైతేగానీ ఎవరి ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది స్పష్టంగా తెలిసే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఓటర్లలో చాలా వరకు గుంభనంగా వ్యవహరిస్తున్నారని ప్రధాన పార్టీల స్థానిక నేతలు చెప్తున్నారు. ఎవరినైనా పలకరిస్తే.. ఇప్పుడే ఏమీ చెప్పలేం అంటున్నారని, పోలింగ్ నాడే నిర్ణయించుకుంటామని చెప్తున్నారని పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఈటల రాజేందర్.. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈటలను ఓడించి, తమ అభ్యర్థిని గెలిపించుకుని ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలతో వ్యవహరిస్తోంది. మరోవైపు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడం, రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అన్నట్టుగా శ్రమిస్తున్నాయి. భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందంటూ ప్రచారం జరుగుతుండటంతో ఎన్నికల సంఘం కూడా స్పందించింది. గట్టిగా నిఘా పెట్టాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, పోలీసు సిబ్బందిని ఆదేశించింది. (చదవండి: బద్వేలు బరిలో లోపాయికారీ పొత్తులు!) ప్రలోభాల ‘వార్’! డబ్బులు, మద్యం పంపిణీకి సంబంధించి వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా యాప్స్‌లో విపరీతంగా పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఒకపార్టీ ఓటుకు రూ.6 వేలు, ప్రతిగా మరోపార్టీ రూ.10 వేలు పంచుతున్నట్టుగా వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా తమకు డబ్బులు రావడం లేదంటూ పలు గ్రామాల్లో జనం ఆందోళనలు చేయడం మరింత ఆసక్తిగా మారింది. బుధవారం హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో రెండు, మూడు చోట్ల కొందరు నిరసనలు తెలిపారు. గురువారం కూడా హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో, రెండు మున్సిపాలిటీల పరిధిలోని పలుప్రాంతాల్లో కొందరు గుమిగూడి తమకు డబ్బులు రాలేదంటూ ధర్నాలు చేశారు. స్థానిక నేతలు తమకు పంచాల్సిన డబ్బును నొక్కేస్తున్నారని కొందరు ఆరోపణలు చేయడం, తమకు ఇవ్వడం లేదని నిలదీయడం వంటి ఘటనలు జరిగాయి. జోరుగా బెట్టింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొనగా.. దీనిని సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్ దందాలు మొదలైనట్టు సమాచారం. శనివారం ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోంది? పోలింగ్ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా? ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? అన్న దానిపై విస్తృతంగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతమున్న అంచనాల మేరకు పోటాపోటీ నెలకొనే అవకాశం ఉందని.. అందువల్ల ప్రధాన పార్టీల మధ్య సమాన స్థాయిలో పందేలు నమోదవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. శనివారం పోలింగ్ సరళిని బట్టి బెట్టింగ్ ఊపందుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఎవరి ధీమా వారిదే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు తమదంటే తమదని టీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాంగ్రెస్ గణనీయంగా ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున అన్నీతానే ప్రచారాన్ని ఉరకలెత్తించిన మంత్రి హరీశ్‌రావు.. ఏడున్నరేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తరహాలోనే హుజూరాబాద్‌లోనూ బీజేపీ ఊపు ఉంటుందని, గెలిచేది తామేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమాగా చెప్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ అధికార దుర్వినియోగానికి, ప్రలోభాలకు దిగాయని.. ప్రజలు తమ కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. (చదవండి: ఎవరిని మభ్య పెట్టడానికి దీక్ష?) -
హుజురాబాద్: ఓటర్లను కొనుగోలు చేస్తున్న పార్టీలు
-
హుజురాబాద్ లో గందరగోళం
-
దళిత బంధుపై దాఖలైన 4 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
-
దళిత బంధుపై దాఖలైన 4 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: దళిత బంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈసీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ దళితబంధును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: హుజురాబాద్:అసలీ పోలింగ్ కేంద్రమేంటి? ఎవరెవరి పాత్ర ఎంత? ఓటు వేయడమెలా? అలాగే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కలిపి విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. గురువారం నాలుగు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: 2 రోజులు..రూ.3 కోట్ల కిక్కు -
హుజూరాబాద్‌కు సంజయ్ చేసిందేంటి?
హుజూరాబాద్: ఎంపీగా హుజూరాబాద్ నియోజకవర్గానికి బండి సంజయ్ చేసిందేమీ లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బుధవారం హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్తామని.. ప్రజలకు మీరేం చేశారో చెప్పే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. గడిచిన ఏడేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడమే బీజేపీ చేసిన అభివృద్ధా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీగా వ్యవహరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు. మరో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేమని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసిందని, బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై మంత్రి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బండి సంజయ్ టీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, దళిత బంధుపై బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.