![Chief Electoral Officer Shashank Goyal Video Conference Over Huzurabad Bypoll Issue - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/31/shashank-goyal.jpg.webp?itok=yaNDVlls)
శశాంక్ గోయల్ (ఫైల్)
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వీవీ ప్యాట్లు తారుమారయ్యాయని బీజేపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఈవో శశాంక్ గోయల్ ఎన్నికల అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
వీవీ ప్యాట్‌ల అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కలెక్టర్, వీఆర్వోలకు ఆదేశాలు జారీచేశారు. రేపు (సోమవారం) అన్ని పార్టీల నేతలతో సీఈవో శశాంక్ గోయల్ భేటీకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment