ఈటల రాజేందర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం | Etela Rajender Convoy Met With Road Accident In Karimnagar | Sakshi
Sakshi News home page

ఈటల రాజేందర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Published Sun, Sep 3 2023 9:01 PM | Last Updated on Sun, Sep 3 2023 9:01 PM

Etela Rajender Convoy Met With Road Accident In Karimnagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మానకొండూరు వద్ద ఈటల కాన్వాయ్‌లోని ఒక కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

వివరాల ప్రకారం.. ఈటల రాజేందర్‌ ఆదివారం హుజురాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో మానకొండూరు మంలంలోని లలితాపూర్‌ వద్ద గొర్రెల మంద అడ్డుగా వచ్చింది. దీంతో, ఈటల కారు డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ సందర్భంగా ఈటల కాన్వాయ్‌లోని మిగతా కార్లు ఒక్కదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో సిబ్బంది, నేతలు ఊపిరిపీల్చుకున్నారు. 

ఇది కూడా చదవండి:  TS/AP: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement