convay
-
ఈటల రాజేందర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మానకొండూరు వద్ద ఈటల కాన్వాయ్‌లోని ఒక కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. ఈటల రాజేందర్ ఆదివారం హుజురాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో మానకొండూరు మంలంలోని లలితాపూర్ వద్ద గొర్రెల మంద అడ్డుగా వచ్చింది. దీంతో, ఈటల కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ సందర్భంగా ఈటల కాన్వాయ్‌లోని మిగతా కార్లు ఒక్కదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో సిబ్బంది, నేతలు ఊపిరిపీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: TS/AP: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. -
ఇదేనా మీకు నేర్పింది? రిక్షా బోల్తాపడినా ఆగని కలెక్టర్ కాన్వాయ్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంతలమయం, వర్షపు నీటితో కూడిన రోడ్డుపై జిల్లా మెజిస్ట్రేట్ కాన్వాయ్ వెళ్తుండగా.. దానికి ఆటోరిక్షా(ఈ-రిక్షా) సైడ్ ఇవ్వబోయింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని ప్రయాణికులందరు బురద నీటిలో పడిపోయారు. ఇంత జరిగినా కన్వాయ్‌లో వెళ్తున్న అధికారులు, సిబ్బంది మాత్రం ఏమీ పట్టనట్టు అలాగే వెళ్లిపోయారు. కనీసం వాహనం దిగి ఎవరికైనా ఏమన్నా అయిందా అని కూడా చూడలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు ఒకరు ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణలో నేర్పింది ఇదేనా? సామాన్యులను పట్టించుకోరా అని మండిపడ్డారు. సామాన్యులు నడిరోడ్డుపై కిందపడినా పట్టించుకోని అధికారులు, ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పని కోసం వెళ్తే వాళ్లను అసలు పట్టించుకుంటారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. Ignore the common people....Is this what civil servants being taught at their training academy after qualifying India's toughest exam ? #IAS #IPS #Sitapur #CivilServices @ChiefSecyUP pic.twitter.com/MHZYP22cxM — Anand Tripathi (@dranandtripathi) October 11, 2022 ఉత్తర్‌ప్రదేశ్‌లో నవంబర్ 15నాటికి గుంతల రోడ్లు ఉండొద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. మెరుగైన రోడ్లు ప్రజల హక్కు అని ఉన్నతస్థాయి సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. చదవండి: అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు -
సీఎం కేసీఆర్ కొత్త కాన్వాయ్‌కు ‘ఏపీ బుల్లెట్ ప్రూఫ్’ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భద్రతా చర్యల్లో భాగంగా నూతన వాహన శ్రేణిని ఏర్పాటు చేసేందుకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో నూతన వాహన శ్రేణికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు 8 తెలుపు రంగు టయోటా ల్యాండ్ క్రూజర్ల వాహనశ్రేణిని బుల్లెట్ ప్రూఫ్‌తో సిద్ధం చేసేందుకు విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెంలో ఉన్న సంబంధిత సంస్థ తయారీ కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. అలాగే రెండు బస్సులను సైతం బుల్లెట్ ప్రూఫ్‌తో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వాహనాలన్నింటినీ రెండు రోజుల కిందట ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించి అక్కడి నుంచి వీరపనేని గూడానికి చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో వాహనాలకు బుల్లెట్‌ప్రూఫ్ తయారీ ఏర్పాట్లకు సంబంధించి దేశంలోని పోలీస్ శాఖలన్నీ జార్ఖండ్‌కు తరలించి అక్కడ తయారు చేయించేవి. ( ఫైల్ ఫోటో ) అయితే సంబంధిత కంపెనీ ఏపీలో వీరపనేని గూడెంలో ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రక్రియ సులభతరమైనట్లు తెలిసింది. దీనివల్ల ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన వీవీఐపీలకు ఏపీలోనే బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు తయారుచేసి ఇస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. మరో వారంలో సీఎం కేసీఆర్‌కు నూతన బుల్లెట్‌ప్రూఫ్ వాహనశ్రేణి అందుబాటులోకి వస్తుందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇది కూడా చదవండి: తండ్రీకొడుకులు స్వేచ్ఛగా తిరగలేరిక! -
మంత్రి కేఈటీఆర్ కు చేదు అనుభవం.. పోలీసుల ముందే..!!
-
మంత్రుల కాన్వాయ్ ను అడ్డుకున్న బీజే వైఎం కార్యకర్తలు
-
రోడ్డు ప్రమాదం,కాన్వాయ్ ఆపిన మంత్రి
-
కేసీఆర్‌కు ఢిల్లీలో కొత్త కాన్వాయ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో నాలుగు కొత్త టయోటా ఫార్చునర్ కార్లను కొనుగోలు చేసింది. వీటిని శాశ్వతంగా ఢిల్లీలోనే ఉంచి ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా వినియోగిస్తారు. సంస్థ ప్రతినిధులు కార్ల తాళాలను మంగళవారం ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా అదనపు కార్ల ఏర్పాటు విషయమై రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ గవర్నర్ ఆఫీసు నుంచి అనుమతి పొందింది. -
ఉపరాష్ట్రపతి కాన్వాయ్కి అపశృతి
సాక్షి, కృష్ణా : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాన్వాయ్ వెళ్తుండగా అపశృతి చోటుచేసుకుంది. విజయవాడలోని చైతన్య స్కూల్ వద్ద బైక్ రోడ్డు దాడుతుండగా కాన్వాయ్‌లోని చివరి వాహనం బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తులకు స్వల్పగాయాలు అయ్యాయి. వెంకయ్య నాయుడు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి స్వర్ణ భారతి ట్రస్ట్‌కు వెళ్తుండగా బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా రేపు విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అర్కిటెక్చర్ భవనాన్ని ప్రారంభించుటకు వెంకయ్య నాయుడు విజయవాడకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి కార్యక్రమంలో అధికార పార్టీ నేతల మధ్య ప్రోటోకాల్ రగడ మోదలైంది. భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో ఎంపీ కేశినేని నాని, స్థానిక ప్రజా ప్రతినిధుల పేర్లు లేకపోవడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు యాక్సిడెంట్లో గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం అలహబాద్‌లో ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో వాహనాలు ఒకదాంతో మరొకటి ఢీకొట్టాయి. ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. Cars in Union Minister Anupriya Patel's convoy collided with each other in #Allahabad, Minister sustained minor injuries (File pic) pic.twitter.com/eEYHOF6D73 — ANI UP (@ANINewsUP) December 31, 2017 -
కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ, కానిస్టేబుల్ కి గాయాలు
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్‌లో సోమవారం ప్రమాదవశాత్తు రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ గాయపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కుంచనపల్లి వద్ద చోటుచేసుకుంది. కాగా ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం వైఎస్ జగన్ ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన విషయం తెలిసిందే. ఆయన విమానంలో గన్నవరం చేరుకుని ...అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు, అనంతరం ప్రకాశం జిల్లా చేరుకోనున్నారు.