
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో నాలుగు కొత్త టయోటా ఫార్చునర్ కార్లను కొనుగోలు చేసింది. వీటిని శాశ్వతంగా ఢిల్లీలోనే ఉంచి ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా వినియోగిస్తారు. సంస్థ ప్రతినిధులు కార్ల తాళాలను మంగళవారం ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా అదనపు కార్ల ఏర్పాటు విషయమై రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ గవర్నర్ ఆఫీసు నుంచి అనుమతి పొందింది.