( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భద్రతా చర్యల్లో భాగంగా నూతన వాహన శ్రేణిని ఏర్పాటు చేసేందుకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో నూతన వాహన శ్రేణికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ మేరకు 8 తెలుపు రంగు టయోటా ల్యాండ్ క్రూజర్ల వాహనశ్రేణిని బుల్లెట్ ప్రూఫ్‌తో సిద్ధం చేసేందుకు విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెంలో ఉన్న సంబంధిత సంస్థ తయారీ కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. అలాగే రెండు బస్సులను సైతం బుల్లెట్ ప్రూఫ్‌తో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వాహనాలన్నింటినీ రెండు రోజుల కిందట ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించి అక్కడి నుంచి వీరపనేని గూడానికి చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో వాహనాలకు బుల్లెట్‌ప్రూఫ్ తయారీ ఏర్పాట్లకు సంబంధించి దేశంలోని పోలీస్ శాఖలన్నీ జార్ఖండ్‌కు తరలించి అక్కడ తయారు చేయించేవి.
( ఫైల్ ఫోటో )
అయితే సంబంధిత కంపెనీ ఏపీలో వీరపనేని గూడెంలో ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రక్రియ సులభతరమైనట్లు తెలిసింది. దీనివల్ల ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన వీవీఐపీలకు ఏపీలోనే బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు తయారుచేసి ఇస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. మరో వారంలో సీఎం కేసీఆర్‌కు నూతన బుల్లెట్‌ప్రూఫ్ వాహనశ్రేణి అందుబాటులోకి వస్తుందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: తండ్రీకొడుకులు స్వేచ్ఛగా తిరగలేరిక!
Comments
Please login to add a commentAdd a comment