విజయవాడలో భారీ వర్షం..(వీడియో) | Heavy Rain Fall In Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో భారీ వర్షం..(వీడియో)

Published Sun, May 4 2025 9:48 AM | Last Updated on Sun, May 4 2025 1:27 PM

Heavy Rain Fall In Vijayawada

సాక్షి, విజయవాడ: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా ఆదివారం ఉదయం నుంచి విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది.  

ఆదివారం ఉదయం నుంచే నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల రేకుల షెడ్లపై రేకులు ఎగిరిపోయాయి. 

భారీ వర్షం నేపథ్యంలో దుర్గ గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసి వేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కనకదుర్గా నగర్ మార్గం మీదుగా అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు దుర్గ గుడి ఈవో విజ్ఞప్తి చేశారు.
 

 

మరోవైపు.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఏకధాటిగా కురుస్తోంది. అకాల వర్షాల కారణంగా జిల్లాలో వరి, అరటితో పాటు పలు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement