
ఉపరాష్ట్రపతి కార్యక్రమంలో అధికార పార్టీ నేతల మధ్య ప్రోటోకాల్ రగడ మోదలైంది
సాక్షి, కృష్ణా : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాన్వాయ్ వెళ్తుండగా అపశృతి చోటుచేసుకుంది. విజయవాడలోని చైతన్య స్కూల్ వద్ద బైక్ రోడ్డు దాడుతుండగా కాన్వాయ్‌లోని చివరి వాహనం బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తులకు స్వల్పగాయాలు అయ్యాయి. వెంకయ్య నాయుడు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి స్వర్ణ భారతి ట్రస్ట్‌కు వెళ్తుండగా బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా రేపు విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అర్కిటెక్చర్ భవనాన్ని ప్రారంభించుటకు వెంకయ్య నాయుడు విజయవాడకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి కార్యక్రమంలో అధికార పార్టీ నేతల మధ్య ప్రోటోకాల్ రగడ మోదలైంది. భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో ఎంపీ కేశినేని నాని, స్థానిక ప్రజా ప్రతినిధుల పేర్లు లేకపోవడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.