( ఫైల్ ఫోటో )
సాక్షి,న్యూఢిల్లీ: సోమవారం రాజ్యసభలో వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. వివిధ పార్టీలకు చెందిన నేతలు వీడ్కోలు ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం పార్లమెంటు సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందుగానే నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. మొహర్రం , రక్షాబంధన్ సెలవుల నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఉదయం సెషన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం, మధ్యాహ్నం తర్వాత రెండు బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. అనంతరం సభను ఛైర్మన్ నిరవధికంగా వాయిదా వేయనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12 వరకు జరగాల్సి ఉంది. కానీ సెలవుల వల్ల ముందే ముగించే సూచనలు కన్పిస్తున్నాయి.
చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ?
Comments
Please login to add a commentAdd a comment