పార్లమెంటును సాగనివ్వండి: వెంకయ్య | Venkaiah Naidu compares Narendra Modi with Kamaraj | Sakshi
Sakshi News home page

పార్లమెంటును సాగనివ్వండి: వెంకయ్య

Published Thu, Jul 16 2015 12:41 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

పార్లమెంటును సాగనివ్వండి: వెంకయ్య - Sakshi

పార్లమెంటును సాగనివ్వండి: వెంకయ్య

మధురై: పార్లమెంటును స్తంభింపజేయవద్దని, ముఖ్యబిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం విపక్షాలకు విజ్ఞప్తి చేసింది. ఏ అంశంపై చర్చకైనా తాము సిద్ధమని ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపులే సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విరుధునగర్‌లో కె.కామరాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళుతూ బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడా రు.

ఏ చర్చకైనా తాము సిద్ధమని, అందువల్ల ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేసే ప్రయత్నాలు చేయవద్దని వెంకయ్య కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement