farewell
-
జొకోవిచ్పై ‘ఆఖరి సవాల్’ గెలిచి...
బ్యూనస్ఎయిర్స్ (అర్జెంటీనా): శక్తివంతమైన సర్వీస్‌లకు పెట్టింది పేరు... బుల్లెట్లా దూసుకుపోయే ఫోర్‌హ్యాండ్ షాట్లు... ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తన వైపునకు తిప్పుకోగల సమర్థుడు... 97 కేజీల బరువు... 6 అడుగుల 6 అంగుళాల ఆజానుబాహుడు... అతనే అర్జెంటీనా వెటరన్ టెన్నిస్ స్టార్ యువాన్ మార్టిన్ డెల్ పొట్రో. ఎంతో సత్తా ఉన్నా గాయాల కారణంగా కెరీర్‌ను కొనసాగించలేక ఎట్టకేలకు ఆటకు టాటా చెప్పేశాడు. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో చివరి మ్యాచ్‌లో టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్పై గెలిచి డెల్ పొట్రో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మాజీ ప్రపంచ మూడో ర్యాంకర్ డెల్ పొట్రో 6–4, 7–5తో వరుస సెట్లలో సెర్బియా దిగ్గజంపై గెలిచాడు. ‘ది లాస్ట్ చాలెంజ్’ (ఆఖరి సవాల్) పేరిట జరిగిన ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు అర్జెంటీనా మహిళా టెన్నిస్ స్టార్ గాబ్రియేలా సబటినితోపాటు పలువురు సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు విచ్చేశారు. దీంతో వీడ్కోలుకు వేదికైన పార్కే రోకా స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతిమ సమరంలో విజయానంతరం అభిమానులు, ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య డెల్ పొట్రో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కోర్టులో నెట్‌ను ముద్దాడాడు. చెమర్చిన కళ్లతో వున్న అర్జెంటీనా స్టార్‌ను అనునయిస్తూ జొకోవిచ్ అభినందించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘యువాన్‌ను ప్రేమించని వారంటూ ఉండరు. అందరు అభిమానించే ఆటగాడు అతను. అతని జీవితంలో అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే అది అతని వ్యక్తిత్వమే’ అని 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్ల విజేత, ఆల్‌టైమ్ గ్రేటెస్ట్లలో ఒకడైన సెర్బియన్ సూపర్‌స్టార్ డెల్ పొట్రోను ఆకాశానికెత్తాడు. 2009లో జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)లను వరుసగా సెమీఫైనల్, ఫైనల్లో ఓడించిన డెల్‌పొట్రో తన కెరీర్లోనే ఏకైక గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. కానీ గాయాలు అతన్ని కుదురుగా ఆడనివ్వలేకపోవడంతో కెరీర్ అసాంతం ఫిట్నెస్ సమస్యలతోనే సతమతమయ్యాడు. అతను చివరిసారిగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ ఆడాడు. ఓవరాల్‌గా 22 టైటిళ్లను గెలుచుకున్నాడు. 36 ఏళ్ల డెల్ పొట్రో కెరీర్లో రెండు ఒలింపిక్ పతకాలు కూడా ఉన్నాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన డెల్ పొట్రో 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2016లో పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ‘డేవిస్ కప్’ టైటిల్ అర్జెంటీనాకు దక్కడంలో డెల్ పొట్రో కీలకపాత్ర పోషించాడు.మిగతా గ్రాండ్‌స్లామ్ టోర్నీల విషయానికొస్తే... రెండుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో (2009, 2012)... రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో (2009, 2018) క్వార్టర్ ఫైనల్ వరకు చేరాడు. వింబుల్డన్ టోర్నీలో (2013) ఒకసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 3 డెల్ పొట్రో సాధించిన కెరీర్ బెస్ట్ ర్యాంక్. 2018లో అత్యుత్తమంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. 439 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్లో డెల్ పొట్రో గెలిచిన మ్యాచ్‌లు.174 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్లో డెల్ పొట్రో ఓడిన మ్యాచ్‌లు.4418 డెల్ పొట్రో తన కెరీర్లో సంధించిన ఏస్‌లు.2,58,96,046 డాలర్లు (రూ. 219 కోట్లు) డెల్ పొట్రో కెరీర్లో సాధించిన మొత్తం ప్రైజ్‌మనీ -
Amit Shah: 23న హేమంత్ అండ్ కంపెనీకి వీడ్కోలే
దుమ్రీ: జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అండ్ కంపెనీకి ఈ నెల 23న బీజేపీ వీడ్కోలు పలకడం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. జార్ఖండ్‌లోకి అక్రమ చొరబాట్లను హేమంత్ ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆరోపించారు. చొరబాటుదార్లు ఇక్కడి గిరిజనుల బిడ్డలను వివాహాలు చేసుకున్నారని, వారి భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి చొరబాటుదార్లను బయటకు తరిమికొడతామని, భూములను వెనక్కి తీసుకొని గిరిజనులకు అందజేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఒక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గురువారం జార్ఖండ్‌లోని దుమ్రీలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను దోచుకుందని మండిపడ్డారు. జనం సొమ్మును కొట్టగొట్టిన హేమంత్ అండ్ కంపెనీకి వీడ్కోలు తప్పదని స్పష్టంచేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో హేమంత్ సోరెన్ జట్టుకట్టారని విమర్శించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కావాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని అమిత్ షా కోరారు. జమ్మూకశీ్మర్‌లో ఇండియాలో అంతర్భాగమని, ఆరి్టకల్ 370ని మళ్లీ తీసుకొచ్చేసత్తా ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు అప్పగించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని, రాహుల్ బాబా నా లుగో తరం కూడా ఆ పని చేయలేదని అన్నారు. చట్టంలో సవరణ తీసుకొస్తాం రాహుల్ గాందీని రాజకీయాల్లో ప్రవేశపెట్టేందుకు ఆయన మాతృమూర్తి సోనియా గాంధీ ఇప్పటిదాకా 20 సార్లు ప్రయతి్నంచారని అమిత్ షా చెప్పారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, రాహుల్ గాంధీ విమానం ల్యాండ్ కాలేదని అన్నారు. 21వ ప్రయత్నంలో జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ విమానం కుప్పకూలడం తథ్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో వక్ఫ్ బోర్డు హిందూ ప్రాచీన దేవాలయాల భూములను ఆక్రమించిందని ఆరోపించారు. వ్యవసాయ భూములను కూడా కబ్జా చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి కబ్జాలను అడ్డుకోవడానికి చట్టంలో సవరణ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగనుంది. -
3 నిమిషాలు మించి హత్తుకోకండి
వెల్లింగ్టన్: తమను విడిచి విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టుల్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు గుంపులుగా వచ్చి వీడ్కోలు చెబుతుండటం మనం చూసే ఉంటాం. ఇలా ఒక్కో ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పే వారి సంఖ్య పెరుగుతుండటం, వచీ్చపోయే ద్వారాల వద్ద రద్దీ ఎక్కువవడంతో న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ‘‘మీ ఆప్తులకు హత్తుకుని వీడ్కోలు పలకాలంటే గరిష్టంగా మూడు నిమిషాలే హగ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ సమయం మనసారా వీడ్కోలు పలకాలంటే కారు పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోండి’అని ఒక పెద్ద బోర్డ్ తగిలించింది. తమ నిర్ణయాన్ని ఎయిర్పోర్ట్ సీఈఓ డేనియర్ బోనో సమర్థించుకున్నారు. ‘‘విరహవేదన కావొచ్చు ఇంకేమైనా కావొచ్చు. ఆప్తులు దూరమవుతుంటే కౌగిలించుకుంటే ఆ బాధ కాస్తయినా తీరుతుంది. అందుకే కౌగిలించుకుంటే కేవలం 20 సెకన్లలోనే ప్రేమ హార్మోన్ ‘ఆక్సిటాసిన్’విడుదలవుతుంది. బాధ తగ్గుతుంది. అంతమాత్రాన దారిలో అడ్డుగా ఉండి అదేపనిగా హత్తుకుంటే ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. డ్రాప్ జోన్ల వద్ద అడ్డుగా ఉండటం సబబు కాదు’అని ఆయన వాదించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమ వారికి ప్రశాంతంగా కాస్తంత ఎక్కువ సమయం వీడ్కోలు చెప్పడం కూడా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందా? అని కొందరు విమర్శలకు దిగారు. ఎయిర్పోర్ట్ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు. ‘‘మిగతా దేశాల్లో కారులో లగేజీ దింపి హత్తుకుని, ఏడ్చి సాగనంపితే ఆ కొద్ది సమయానికే ‘కిస్ అండ్ ఫ్లై’చార్జీల కింద చాలా నగదు వసూలుచేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఎంతో మంచిది. తొలి 15 నిమిషాలు పార్కింగ్ ఉచితం’’అని ఒక ప్రయాణికుడు మెచ్చుకున్నాడు. ప్రయాణికుల వెంట వచ్చే వారిని తగ్గించేందుకు చాలా దేశాల ఎయిర్‌పోర్ట్‌లు ఆ కొద్దిసేపు కారు ఆపినందుకు కూడా చార్జీలు వసూలుచేస్తుండం గమనార్హం. బ్రిటన్‌లోని ఎస్సెక్స్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఇందుకు 15 నిమిషాలకు దాదాపు రూ.768 వసూలుచేస్తోంది. -
కుమార్తెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికిన ఎడిటర్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఓ తండ్రి తన కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించాక, ఆమెను హెలికాప్టర్లో అత్తవారింటికి పంపారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని పట్టి తహసీల్ ఉపాధ్యాయపూర్ గ్రామానికి చెందిన కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివకు అత్యంత ఘనంగా వివాహం జరిపించారు. అనంతరం ఆమెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికారు. సుల్తాన్‌పూర్‌లోని శంకర్‌గఢ్‌కు చెందిన సత్యప్రకాష్ పాండే కుమారుడు సతీష్ పాండేతో శివకు వివాహం జరిగింది. ప్రతాప్‌గఢ్‌లోని రాణి రామ్ ప్రియా గార్డెన్లో వీరి వివాహ వేడుక జరిగింది. అనంతరం కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివను తన స్వగ్రామం ఉపాధ్యాయపూర్ నుండి హెలికాప్టర్లో అత్త వారింటికి పంపించారు. హెలికాప్టర్లో వధూవరులు కూర్చున్నారు. ఆ సమయంలో వీరిని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ముంబై నుండి ప్రచురితమయ్యే ‘అభ్యుదయ వాత్సల్యం’ పత్రికకు కృపాశంకర్ తివారీ చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు అలోక్ రంజన్ తివారీ ఎటర్నల్ కార్పొరేట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ. -
Australian cricketer: వన్డేలకు వార్నర్ గుడ్‌బై
ఆ్రస్టేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ వన్డే ఫార్మాట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్యాటింగ్‌లో మెరుపులు, నోటితో తూటాలు పేల్చే అతను పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. అతని ఖాతాలో సెంచరీలున్నట్లే కెరీర్లో సస్పెన్షన్లు, బాల్ టాంపరింగ్ మరకలూ ఉన్నాయి. ఇప్పుడా ఆట, దూకుడు ఇక మీదట టి20లకే పరిమితం కానున్నాయి. సిడ్నీ: డేవిడ్ వార్నర్ అంటే విజయవంతమైన ఓపెనరే కాదు... వివాదాస్పద క్రికెటర్ కూడా! బ్యాట్‌తో బాదడం ఎంత బాగా తెలుసో... ‘సై అంటే సై’ అని నోటికి పని చెప్పడం కూడా తెలిసినోడు. విధ్వంసకర బ్యాటర్‌గా ఎలా గుర్తుండిపోతాడో అంతే స్థాయిలో తెంపరితనం ఉన్న వ్యక్తిగానూ ముద్ర వేసుకున్నాడు. ఇక మన తెలుగు ప్రేక్షకులకైతే సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఇప్పుడు లేడు)తో బాగా కనెక్టయ్యాడు. తెలుగు హీరోల మేనరిజాన్ని, పాటలకు నప్పే స్టెప్పులతో సోషల్ మీడియాలో వినోదం పంచిన ఈ ఆస్ట్రేలియన్ తాజాగా వన్డే క్రికెట్‌కు సైతం వీడ్కోలు పలికేశాడు. పాకిస్తాన్‌తో స్వదేశంలో ఆఖరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న వేళ వన్డేలపై నిర్ణయాన్ని ప్రకటించాడు. సిడ్నీలో 3 నుంచి జరిగే మూడో టెస్టు అనంతరం అతను కేవలం అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్లోనే కొనసాగుతాడు. సోమవారం మీడియా సమావేశంలో 37 ఏళ్ల వార్నర్ మాట్లాడుతూ ‘భారత్‌లో జరిగిన ప్రపంచకప్ సమయంలోనే రిటైర్మెంట్ గురించి చెప్పాను. విశ్వవిజేత జట్టు సభ్యుడిగా ఎంతో సంతృప్తికరమైన వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నాను. దీనివల్ల నేను ఫ్రాంచైజీ టి20 లీగ్‌ను మరింత శ్రద్దపెట్టి ఆడేందుకు వీలవుతుంది. ఈ ఫార్మాట్లో అంతర్జాతీయ కెరీర్‌నూ కొనసాగిస్తాను. అయితే 2025లో చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఫామ్‌లో ఉంటే, జట్టుకు అవసరమనిపిస్తే అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు. సఫారీతో అరంగేట్రం దక్షిణాఫ్రికాతో 2009 జనవరిలో జరిగిన టి20 మ్యాచ్‌తో 22 ఏళ్ల వార్నర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే నెల అదే ప్రత్యర్థితోనే తొలి వన్డే కూడా ఆడాడు. 15 ఏళ్ల కెరీర్లో 99 టి20 మ్యాచ్‌ల్లో 2894 పరుగులు చేశాడు. ఒక సెంచరీతోపాటు 24 ఫిఫ్టీలు అతని ఖాతాలో ఉన్నాయి. 161 వన్డేలాడిన వార్నర్ 45.30 సగటుతో 6932 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధసెంచరీలున్నాయి. 111 టెస్టుల్లో 44.58 సగటుతో 8695 పరుగులు చేశాడు. 26 శతకాలు, 36 అర్ధశతకాలు బాదాడు. ఇవీ విజయాలు ► మరకలు పక్కనబెట్టి కేవలం క్రికెట్‌నే పరిగణిస్తే మాత్రం వార్నర్ పరిపూర్ణ సాఫల్య క్రికెటర్ అని చెప్పొచ్చు. ఆ్రస్టేలియా సాధించిన 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లలో అతను కీలకపాత్ర పోషించాడు. 2021 టి20 వరల్డ్‌కప్ విజయంలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్íÙప్ విజేత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ఇవీ వివాదాలు ► 2013 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో జో రూట్ తో వాగ్వాదానికి దిగడంతో క్రికెట్ ఆ్రస్టేలియా అతనిపై రెండు టెస్టుల నిషేధం విధించింది. దీంతో అతను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్ని ఆడలేకపోయాడు. ► కేప్‌టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వార్నర్ కెరీర్‌కే మాయని మచ్చ. దీంతో అతనితో పాటు, స్మిత్ (అప్పటి కెపె్టన్) ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. ఇవి చాలవన్నట్లు అదుపులేని నోటి దురుసుతనంతో జీవితకాలం సారథ్యం చేపట్టకుండా శిక్షకు గురయ్యాడు. -
ఠాక్రేకు టీపీసీసీ వీడ్కోలు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న మున్షీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించిన నేపథ్యంలో మాణిక్ రావ్ ఠాక్రే తన సొంత రాష్ట్రా నికి వెళ్లిపోయారు. గోవా ఇన్ చార్జిగా నియమితులైన ఆయన కు ఆదివారం ఎమ్మెల్యే క్వార్ట ర్స్‌లో పలువురు టీపీసీసీ నేత లు కలిసి అభినందనలు తెలి పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షులు హర్కర వేణు గోపాల్, అంజన్‌కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసీసీ సభ్యుడు ఎం.ఎ.ఫహీం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు భూపతిరెడ్డి నర్సారెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆయనను కలిసి వీడ్కోలు పలికారు. ఠాక్రేకు టీపీసీసీ పక్షాన జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలోనే మహారాష్ట్ర కు వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త ఇన్చార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీ త్వర లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. -
జస్టిస్ సుమలత, జస్టిస్ సుదీర్‌కుమార్‌కు హైకోర్టు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: బదిలీపై ఇతర రాష్ట్ర హైకోర్టుల కు వెళ్తున్న జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ ముమ్మినేని సుదీర్‌కుమార్‌లకు హైకోర్టు ఘనంగా వీ డ్కోలు పలికింది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఫస్ట్ కోర్టు హాల్లో భేటీ అయిన ఫుల్ కో ర్టు వారిద్దరిని సన్మానించింది. జస్టిస్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ సుదీర్‌కుమార్‌ను మ ద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం గత వారం ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. న్యా యాన్ని అందించడంతోపాటు వారిచి్చన పలు తీ ర్పులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరా ధే ప్రశంసించారు. తీర్పుల వివరాలను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చదివి వినిపించారు. అనంతరం హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) బదిలీ అయిన న్యాయమూర్తులను ఘనంగా స న్మానించింది. ఈ సందర్భంగా జస్టిస్ సుమలత మాట్లా డుతూ.. కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయి కి చేరానన్నారు. యువ న్యాయవాదులు కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని సూ చించారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఇబ్బంది పడబోనని.. వెళ్లిన చోట మన తెలంగాణ ప్రతిభను చాటేలా విధులు నిర్వహిస్తానని చెప్పారు. ‘బార్’తో కలసి పనిచేస్తానని తాను ప్రమాణం చేసే సందర్భంలోనే చెప్పానని, అలాగే న్యాయవాదుల విజ్ఞప్తులను అనుమతిస్తూ, వీలైనంత వరకు అనుకూలంగా పనిచేశానని జస్టిస్ సు«దీర్‌కుమార్ అన్నారు. అయితే ‘బార్’తో కలసి పనిచేశానా.. లేదా అన్నది న్యాయవాదులు చెప్పాలన్నారు. -
ఏనుగు పదవీ విరమణ...ఘనంగా వీడ్కోలు
-
ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్‌కు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చైర్మన్‌గా పదవీకాలం ముగియటంతో ఆ పదవి నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తప్పుకున్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు బాజిరెడ్డి ఆ పదవిలో కొనసాగుతారని ఆర్టీసీ వర్గాలు భావించాయి. కానీ, పదవీకాలం ముగిసినా ప్రభుత్వం నుంచి పొడగింపు ఆదేశాలు వెలువడలేదు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో ఆశాభంగం కలిగిన సిట్టింగ్‌లను బుజ్జగించేందుకు ఆర్టీసీ చైర్మన్ పదవి లాంటి వాటిని వారికి అప్పగించవచ్చని, అందుకే బాజిరెడ్డికి కొనసాగింపు అవకాశం ఇవ్వలేదన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇక్కడి బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో బాజిరెడ్డికి వీడ్కోలు సమావేశం జరిగింది. బాజిరెడ్డి దంపతులను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. రెండేళ్ల పదవీకాలంలో, ఆర్టీసీ అభ్యున్నతికి బాజిరెడ్డి ఎంతో కృషి చేశారంటూ అధికారులు కితాబిచ్చారు. ‘‘రెండేళ్లపాటు ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేయటం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీని బాగు చేసేందుకు ఎండీ సజ్జనార్‌తో కలిసి కృషి చేయడం జీవితంలో మరవలేను. నేను చైర్మన్‌గా ఉన్న సమయంలోనే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం నాకు ఎంతో సంతోషం కలిగించింది’’అని బాజిరెడ్డి పేర్కొన్నారు. -
తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి చెందిన వాసం శెట్టి రవితేజ పోలీసు విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ, అందరి మన్ననలు అందుకుంటున్నారు. గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఎస్పీగా పనిచేసిన రవితేజ ఇటీవలే గాంధీనగర్‌కు బదిలీ అయ్యారు. పోలీసు అధికారి రవితేజకు జునాగఢ్ వాసులు ఎంతో భిన్నంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమం పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుండి ప్రారంభమైంది. ముందుగా పూలతో అలంకరించిన కారులో అధికారి రవితేజను కూర్చోబెట్టారు. పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుండి పోలీసు కాన్వాయ్ జునాగఢ్ వీధుల గుండా ముందుకు సాగింది. ఈ సమయంలో జునాగఢ్ ప్రజలు పోలీసు సూపరింటెండెంట్‌కు రహదారి మార్గంలో అపూర్వరీతిలో వీడ్కోలు పలికారు. 2015 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రవితేజ జునాగఢ్ ఎస్పీగా మూడేళ్లు సేవలు అందించారు. 2019లో జునాగఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. తాజాగా జునాగఢ్ నుంచి గుజరాత్‌లోని గాంధీనగర్ ఎస్పీగా బదిలీ అయ్యారు. గాంధీనగర్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఆయనపై స్థానికులు పూలవర్షం కురిపిస్తూ, అపూర్వ స్వాగతం పలికారు. రవితేజ పోలీసు విభాగంలో అందించిన సేవలకు గుర్తుగా అప్పటి డిప్యూటీ సీఎం నవీన్ పటేల్ చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి గుజరాత్లో ఇంతటి పేరుప్రఖ్యాతులు సంపాదించడంపై కోనసీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘ఆరోపణలతో పెరుగుతున్న ఆదరణ’.. ట్రంప్ మరో వింత వ్యాఖ్యానం! -
జస్టిస్ కన్నెగంటి లలితకు ఘనంగా వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కన్నెగంటి లలితకు ఫుల్‌కోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. దాదాపు 7 వేల కేసుల్లో ఆమె తీర్పులు వెలువరించారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మొదటి కోర్టు హాల్లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. జస్టిస్ లలిత ఇచ్చిన పలు తీర్పులను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చదివి వినిపించారు. మోటార్ వెహికిల్ కేసులలో సత్వర న్యాయంతోనే బాధితులకు న్యాయం జరుగుతుందని, ఏళ్ల తర్వాత వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా అది ప్రయోజనం చేకూర్చదని జస్టిస్ లలిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి కేసులలో న్యాయం త్వరగా అందించేలా కృషి చేయాలన్నారు. తనకు సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ లలిత కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..: అనంతరం హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ లలితకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సీజే జస్టిస్ అలోక్ అరాధే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ పల్లె నాగేశ్వర్రావు, ఏజీ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్‌గౌడ్, అసోసియేషన్ వైస్ చైర్మన్ కల్యాణ్‌రావు, కార్యదర్శులు పులి దేవేందర్, ప్రదీప్‌రెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్, పూర్ణశ్రీ, శారద తదితరులు పాల్గొన్నారు. -
ఫేర్వెల్ పార్టీలో హడలెత్తించిన బాలిక.. శవపేటికలో నుంచి లేచి..
చాలామంది చిన్నారులు స్కూల్ ఫేర్వెల్ పార్టీకి అందమైన వస్త్రధారణతో వస్తుంటారు. అయితే 16 ఏళ్ల అబీ రికెట్స్ తమ స్కూల్ ఫేర్వెల్ కార్యక్రమానికి విచిత్ర రీతిలో సిద్ధమై వచ్చింది. తన క్లాస్‌మేట్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు ఒక షో-స్టాపింగ్ స్టంట్‌కు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఆమె ఒక శవపేటికతో పాటు అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. స్కూల్ ఫేర్వెల్ పార్టీ రోజున ఆమె నలుపురంగు దుస్తులు ధరించింది. తరువాత ఆరడుగుల శవపేటికలో పడుకుంది. చేతులను క్రాస్‌చేసి పెట్టుకుంది. అప్పుడు ఆమెతో పాటు వచ్చిన అంత్యక్రియల నిర్వహణ సిబ్బంది ఆ శవ పేటికను రెడ్ కార్పెట్‌పై ఉంచారు. ఇంతలో ఆమె ఎంతో నాటకీయంగా తన కళ్లను తెరిచింది. అక్కడున్నవారంతా ఆమెను చూసి కేకలు పెట్టారు. చుట్టుపక్కలవారు కేకలు పెడుతూ.. ఈ ఘటన గురించి అబీ వివరిస్తూ..‘అప్పుడు నన్ను చూసి చుట్టుపక్కల ఉన్నవారంతా ఆందోళనగా కేకలు పెట్టారని, అసలు విషయం గ్రహించి చప్పట్లు కొట్టారన్నారు. మా ఉపాధ్యాయులు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని’ అన్నారని ఆమె తెలిపింది. అబీ అంత్యక్రియల ‘షో’లో ఆమె తండ్రి, సోదరుడు కూడా ఆమెకు సహకరించారు. వారు అంత్యక్రియల నిర్వాహకుల పాత్ర పోషించారు. ఈ విధంగా అందరినీ భయపెట్టేందుకు అబీ రెండు గంటల పాటు అలంకరణ చేసుకుంది. కుమార్తె షో అద్భుతమంటూ.. తాము శవవాహనం అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నించామని, అయితే ఇలాంటి షో కోసం ఎవరూ వాహనం ఇవ్వబోమని చెప్పారని అబీ తెలిపింది. దీంతో తమ ఇంటిలోని వారే తన షో కోసం అన్ని ఏర్పాట్ల చేశారని చెప్పింది. ఈ సందర్భంగా అబీ తండ్రి మాట్లాడుతూ తమ కుమార్తె చేసిన షో విషయంలో తాము ఎంతో గర్విస్తున్నామన్నారు. ఇది కలకాలం నిలిచిపోతుందన్నారు. ఇది కూడా చదవండి: గొంతులో ఇరుక్కున్న లెగ్ పీస్.. వైద్యుని వింత సలహాకు కంగుతిన్న మహిళ..! -
'అచ్చం నాలాగే.. రాయుడుకు ఆ అలవాటు లేదు'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ అనంతరం సీఎస్కే స్టార్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా సీఎస్కేలో అంబటి రాయుడు కీలకపాత్ర పోషించాడు. గతంలో సీఎస్కే టైటిల్స్ సాధించడంలోనూ రాయుడు పాత్ర కీలకం. కాగా తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌లోనూ రాయుడు తన ఇంపాక్ట్ చూపించాడు. వర్షంతో 15 ఓవర్లలో 171 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేయడంతో సీఎస్కే బ్యాటర్స్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. ఈ క్రమంలో రాయుడు ఐదో స్థానంలో వచ్చి 8 బంతుల్లో రెండో సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 పరుగుల దనాధన్ ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. అయితే రాయుడు మెరుపు ఇన్నింగ్స్ సీఎస్కే లక్ష్యాన్ని కరిగించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అంబటి రాయుడుపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడుతో తన అనుబంధాన్ని ధోని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ''మైదానంలో ఉన్నప్పుడు 100 శాతం శ్రమించడం రాయుడు లక్షణం. మేమిద్దరం ఒకప్పుడు ఇండియా ‘ఎ’ తరఫున కలిసి ఆడాం. అటు పేస్‌ను, ఇటు స్పిన్‌ను సమర్థంగా ఆడగల నైపుణ్యం అతని సొంతం. అతను జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయగలడని నేను ఎప్పుడైనా నమ్మేవాడిని. నాలాగే రాయుడుకు కూడా ఎక్కువగా ఫోన్ వాడే అలవాటు లేదు'' అని ధోని అన్నాడు. కాగా 2010లో ముంబై ఇండియన్స్ తరఫున.. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌కు మారాడు. ముంబై ట్రోఫీ గెలిచిన మూడు సందర్భాల్లో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రాయుడు.. మొత్తంగా ఆరో టైటిల్‌తో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు. కాగా 37 ఏళ్ల అంబటి రాయుడు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 203 మ్యాచ్‌లాడి 4348 పరుగులు సాధించాడు. ఆరుసార్లు.. విజేతగా నిలిచిన జట్లలో భాగమై ట్రోఫీలను ముద్దాడాడు. అదే విధంగా ఆటగాడిగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా! -
సానియా మీర్జా ఫేర్‌వెల్‌లో సందడి చేసిన మహేశ్ దంపతులు
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (మార్చి 5) హైదరాబాద్‌లో జరిగిన ఫేర్వెల్ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ఫేర్వెల్ పార్టీకి హాజరయ్యారు. ఇద్దరూ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక సానియాతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇన్నాళ్ల నీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సానియా మీర్జా కుటుంబంతో మహేశ్‌బాబు, నమ్రతకు మంచి అనుబంధం ఉంది. గతంలోనూ పలు ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో వీళ్లు సందడి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) What a journey!! So so proud of you! 🤗 @MirzaSania pic.twitter.com/qyWAIUs0XB — Mahesh Babu (@urstrulyMahesh) March 5, 2023 -
సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్.. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
కంటతడి పెట్టిన సానియా మీర్జా
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ (మార్చి 5) జరిగిన ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొంది. సింగిల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన సానియా.. తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టింది. ఈ సందర్భంగా సానియా కొడుకు అమ్మ గ్రేట్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేయడంతో స్టేడియం మొత్తం హర్షద్వానాలు మార్మోగింది. అనంతరం సానియా మిక్సడ్ డబుల్స్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రోహన్ బోపన్నతో జతకట్టనున్న సానియా.. ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీతో తలపడనుంది. సానియా ఆడే చివరి మ్యాచ్ చూసేందుకు క్రీడారంగానికి చెందిన వారితో పాటు టాలీవుడ్, బాలీవుడ్, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, సీతారమం ఫేమ్ దుల్కర్ సల్మాన్ ఈ ఈవెంట్లొ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇవాళ సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగే రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఏ ఆర్ రెహమాన్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌తో తోపాటు మరికొందరు స్పోర్ట్స్, సినిమా స్టార్స్ హాజరుకానున్నారని సమాచారం. కాగా, సానియా తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43 WTA టైటిల్స్, ఏసియన్ గేమ్స్ లో 8 పతకాలు, కామన్వెల్త్ గేమ్స్ లో 2 మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ హైదరాబాదీ క్వీన్ డబుల్స్ లో 91 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగింది. భారత టెన్నిస్‌కు సేవలందించినందకు గాను సానియాకు అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న తోపాటు అర్జున, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులు లభించాయి. సానియా ప్రస్తుతం మహిళల ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తుంది. -
అభిమానుల కోసమే.. హైదరాబాద్‌లో ఫేర్వెల్ మ్యాచ్
మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన సానియా చివరగా దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఆడింది. ఆ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిపోయిన సానియా కెరీర్‌కు వీడ్కోలు పలికింది. అయితే సానియా మీర్జా పుట్టింది ముంబైలో అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌లోనే కెరీర్‌ను ప్రారంభించిన సానియా దేశం తరపున మహిళల టెన్నిస్‌లో అత్యున్నత శిఖరానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తాను పెరిగిన హైదరాబాద్‌లో సానియా చివరి మ్యాచ్ ఆడాలని భావించింది. అందుకే రేపు హైదరాబాద్‌లో ఫేర్వెల్ మ్యాచ్ ఆడనున్నట్లు సానియా మీర్జా మీడియా సమావేశంలో తెలిపింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సానియా మీడియాతో మాట్లాడుతూ.. ''అభిమానుల కోసం రేపు చివరి మ్యాచ్ ఆడుతున్నా. విశేషం ఏంటంటే.. 20 ఏళ్ల క్రితం నేను ఎక్కడ టెన్నిస్ సాధన చేశానో అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడునున్నా. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబం, స్నేహితులు వస్తున్నారు. కెరీర్లో చివరి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నా. విజయంతో కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నా'' అని సానియా వెల్లడించింది. అంతేకాదు తన కుమారుడు, కుటుంబంతో సమయం కేటాయిస్తానని ఈ టెన్నిస్ దిగ్గజం చెప్పుకొచ్చింది. ఇక ఎల్బీ స్టేడియంలో రేపు సానియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. సానియా, రోహన్ బోపన్న టీమ్స్ తలపడనున్నాయి. డబుల్స్‌లో సానియా – బోపన్న జోడీ ఇవాన్ డోడిగ్ – మ్యాటెక్ సాండ్స్ జంటను ఢీ కొట్టనుంది. సానియా చివరి సారి ఆడనున్న ఈ రెండు మ్యాచ్‌లు చూసేందుకు చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తరలి రానున్నారు. తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ సాధించింది. 91 వారాలు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’... ‘అర్జున అవార్డు’... పౌర పురస్కారాలు ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’ అందుకుంది. వచ్చే నెలలో సానియా మీర్జా కొత్త పాత్రలో కనిపించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సానియా ‘మెంటార్’గా వ్యవహరించనుంది. చదవండి: WPL 2023: మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా.. రిఫరీపై ఆటగాళ్ల మూకుమ్మడి దాడి -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు (ఫొటోలు)
-
గన్నవరం ఎయిర్ పోర్టులో గవర్నర్ కు సీఎం జగన్ వీడ్కోలు
-
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఉదయం.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసుల గౌరవ వందనం గవర్నర్ స్వీకరించారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ అయిన బిశ్వభూషణ్.. మూడున్నరేళ్ల పాటు ఏపీ గవర్నర్‌గా కొనసాగారు. వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, గవర్నర్ ముఖ్యకార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. కాగా, హరిచందన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్.. గవర్నర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం సంతోషదాయకమని బిశ్వభూషణ్ ప్రశంసించారు. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను అందిస్తుండటం నిజంగా అబ్బురమన్నారు. వీటిపై మేం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అన్ని నిధులు ఎలా సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను అడిగితే అంతా దేవుడి ఆశీర్వాదమని వినమ్రంగా బదులిచ్చారు. చిత్తశుద్ధితో పథకాలను ఆయన విజయవంతంగా అమలు చేస్తున్నారని గవర్నర్ అన్నారు. నేడు రాష్ట్రానికి నూతన గవర్నర్.. నేడు రాష్ట్రానికి నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రానున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో నూతన గవర్నర్‌కు సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ఎల్లుండి ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్ధుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: సంక్షేమ సర్కారు ఆదర్శ పాలన -
గవర్నర్ కు ఆత్మీయ వీడ్కోలు
-
Sania Mirza: 'వండర్ ఉమన్'.. సానియాకు సలాం! ముక్కుసూటి జవాబులతో..
సానియా మీర్జా అంటే మూడు డబుల్స్ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 43 డబుల్స్ ట్రోఫీలు, 91 వారాలు వరల్డ్ నంబర్‌వన్ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 20 ఏళ్ల పాటు టెన్నిస్ సర్క్యూట్లో ప్రొఫెషనల్‌గా కొనసాగడం మాత్రమేనా? వీటన్నింటికి సమాధానం ‘కాదు’ మాత్రమే! మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో అడుగు పెట్టడమే అరుదుగా అనిపించిన సమయంలో సానియా టెన్నిస్‌ను ఎంచుకొని కొత్త బాటను వేసింది. తన ఆటను, తన సామర్థ్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె టెన్నిస్‌కే పరిమితం కాదు. భారత క్రీడలకే ఆమె ఒక ‘వండర్ ఉమన్’. ఎన్నో ఏళ్లుగా మహిళల క్రీడలకు సంబంధించి ఉన్న మూసను సానియా బద్దలు కొట్టింది. ఆటతోనే కాకుండా అవసరమైతే మాటతోనూ తలపడింది. తన స్థాయి ప్లేయర్‌ను ఒక ‘ఎర’గా వేశారంటూ పురుషాధిక్య సమాజపు నైజాన్ని నేరుగా ప్రశంసించింది. తన ఆటలో సంధించిన ఏస్‌ల తరహాలోనే మాటల్లో కూడా అంతే పదును చూపించింది. ఎలాంటి టెన్నిస్ నేపథ్యం లేని నగరం నుంచి, సాంప్రదాయ కట్టుబాట్లతో కూడిన తన సొంత నేపథ్యం నుంచి వచ్చి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింగిల్స్‌లో 27 వరకు, డబుల్స్‌లో నంబర్‌వన్ వరకు సానియా ఎదగగలిగింది. ఒక స్టార్‌గా, దిగ్గజంగా ఆటపై సానియా ముద్ర అసమానం. శ్రమించే తత్వం, పట్టుదలతో ఆమె సాధించిన ఘనతలు స్ఫూర్తిదాయకం. టెన్నిస్‌లో ఉచ్ఛస్థితికి చేరుతున్న సమయంలో వెంట నడిచి వచ్చిన వివాదాలను ఆమె లెక్క చేయలేదు. చాలా మందిలా కన్నీళ్లు పెట్టుకొని కుప్పకూలిపోలేదు... మొండిగా నిలబడింది. అంతే వేగంగా వాటికి తగిన రీతిలో జవాబిచ్చింది. ఎవరి కోసమో తాను మారలేదు, తాను అనుకున్నట్లు ఆడింది, ఆటను ఆస్వాదించింది, అద్భుతాలు చేసింది. సానియాకు పెద్ద సంఖ్యలో వీరాభిమానులున్నారు. వేర్వేరు కారణాలతో ఆమెను ద్వేషించే వారూ ఉన్నారు. కానీ అవునన్నా, కాదన్నా ఏ రూపంలోనైనా ఆమె గుర్తింపును మాత్రం ఎవరూ కాదనలేరు. దశాబ్ద కాలానికి పైగా భారత క్రీడల్లో ‘సానియా మానియా’ అన్ని చోట్లా కనిపించింది, వినిపించింది. ఆమె ఏం చేసినా అది వార్తగా నిలిచింది. భారత టెన్నిస్ చరిత్రలో కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే సింగిల్స్‌లో టాప్–200 వరకు రాగలిగారు. అందులో నలుగురు కనీసం వందో ర్యాంక్‌కు చేరువగా కూడా రాలేదు. అలా చూస్తే సానియా సాధించిన 27వ ర్యాంక్ విలువేమిటో అర్థమవుతుంది. దీంతో పాటు డబుల్స్‌లో శిఖరాన నిలిచి శాసించిన సానియా మీర్జా ఉజ్వల టెన్నిస్‌కు తెర పడింది. –సాక్షి క్రీడా విభాగం అందని ఒలింపిక్ పతకం సానియా కెరీర్లో ఎన్నో ఘనతలు ఉన్నా... ప్రతిష్టాత్మక ఒలింపిక్ పతకాన్ని మాత్రం ఆమె సొంతం చేసుకోలేకపోయింది. 2008, 2012, 2016, 2020ల్లో నాలుగు ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నా ఆమెకు అది లోటుగా ఉండిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానం సాధించడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో పాటు కామన్వెల్త్ క్రీడల్లో ఒక రజతం, ఒక కాంస్యం ఆమె గెలుచుకుంది. పురుషాహంకారాన్ని ప్రశ్నిస్తూ... కెరీర్ ఆరంభంలో వచ్చిన కీర్తికనకాదులతో పాటు పలు వివాదాలు సానియాతో నడిచొచ్చాయి. జాతీయ జెండాను అవమానించినట్లు వార్తలు, స్కర్ట్‌లపై ‘ఫత్వా’లు జారీ, మసీదులో షూటింగ్, కొన్ని అసందర్భ వ్యాఖ్యలు, ఆ తర్వాత పాకిస్తానీ అయిన షోయబ్ మలిక్‌తో వివాహం... ఇలాంటివన్నీ ఆమెను ఒక వివాదాస్పదురాలిగా చిత్రీకరించాయి. వీటి వల్ల ఆమె చాలా సందర్భాల్లో ‘నెగెటివ్’ వార్తల్లో నిలిచింది. వాటిపై వివరణలు ఇచ్చుకునేందుకు ఆమె చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే తర్వాతి రోజుల్లో తాను మరింత పరిణతి చెందానని, ఇలాంటివి పట్టించుకోవడం మానేశానని ఆమె చెప్పుకుంది. నిజంగా కూడా ఆపై కెరీర్ కీలక దశలో ఆమె తన ఆటతో మినహా మరే అంశంతోనూ ‘వార్త’గా మారలేదు. అయితే 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా రేగిన వివాదం సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం సానియా వ్యక్తిత్వం గురించి చెబుతాయి. పురుషుల డబుల్స్‌లో లియాండర్ పేస్‌తో కలిసి బరిలోకి దిగేందుకు మహేశ్ భూపతి, రోహన్ బోపన్న నిరాకరించగా... విష్ణువర్ధన్‌ను ‘ఐటా’ ఎంపిక చేసింది. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా తనతో కలిసి ఆడతానని హామీ ఇస్తేనే విష్ణుతో కలిసి బరిలోకి దిగుతానని పేస్ షరతు పెట్టాడు. ఈ విషయం తర్వాత తెలుసుకున్న సానియా దీనిని ‘పురుషా హంకారం’గా పేర్కొంది. పేస్ కోసం తనను ‘ఎర’గా వేశారంటూ విరుచుకుపడింది. వేర్వేరు సందర్భాల్లో కూడా ముక్కుసూటి జవాబులతో ఘాటుగా సమాధానాలు ఇవ్వడం సానియా శైలి. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత కూడా ఇంకా ‘జీవితంలో స్థిరపడలేదేంటి’ అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై... ‘నేను వరల్డ్‌నంబర్ కావడంకంటే తల్లిగా మారలేదేంటని మీరు అడుగుతున్నట్లున్నారు. నేనే కాదు ప్రతీ మహిళకు ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతా యి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే తప్ప స్థిరపడినట్లు కాదా. నేను ఎన్ని గ్రాండ్‌స్లామ్ గెలిచినా వాటికి విలువ లేనట్లుంది’ అని తీవ్రంగా జవాబిచ్చింది. సానియా... ఓటమితో ముగింపు తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ చివరి టోరీ్నలో భారత స్టార్ సానియా మీర్జాకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన దుబాయ్ ఓపెన్ టోర్నీ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా (భారత్)–మాడిసన్ కీస్ (అమెరికా) జోడీ 4–6, 0–6తో వెరోనిక కుదెర్మెతోవా– సమ్సనోవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–కీస్ జోడీ తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో ఓడిన సానియా–కీస్లకు 7,900 డాలర్ల (రూ. 6 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. వ్యక్తిగతం... 1986 నవంబర్ 15న సానియా మీర్జా ముంబైలో పుట్టింది. 2010లో పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మలిక్‌ను వివాహం చేసుకున్న సానియాకు నాలుగేళ్ల కుమారుడు ఇజ్హాన్ ఉన్నాడు. ‘ఏస్ అగైనెస్ట్ ఆడ్స్’ పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీ వచ్చింది. కెరీర్లో ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సానియా జీవితాన్ని సినిమాగా తీయాలని ప్రతిపాదనలు వచ్చినా అవి ఫలించలేదు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు కలిసి ‘మీర్జా మలిక్ షో’ అనే చాట్ షోను సమర్పిస్తున్నారు. ఇది పాకిస్తాన్‌లోని ‘ఉర్దూ ఫ్లిక్స్’ ఓటీటీలో ప్రసారమవుతోంది. భారత ప్రభుత్వం ద్వారా అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఆమె అందుకుంది. ఆ ఆరు గ్రాండ్‌స్లామ్‌లు... మహిళల డబుల్స్: వింబుల్డన్ (2015), యూఎస్ ఓపెన్ (2015), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2016; అన్నీ మార్టినా హింగిస్‌తో). మిక్స్డ్ డబుల్స్: ఆ్రస్టేలియన్ ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012; ఈ రెండూ మహేశ్ భూపతితో); యూఎస్ ఓపెన్ (2014; బ్రూనో సోరెస్‌తో). కెరీర్ రికార్డ్ సింగిల్స్: విజయాలు 271, పరాజయాలు 161 డబుల్స్: విజయాలు 536, పరాజయాలు 248 కెరీర్ ప్రైజ్‌మనీ: 72 లక్షల 65 వేల 246 డాలర్లు (రూ. 60 కోట్ల 20 లక్షలు) 1 భారత్ నుంచి డబ్ల్యూటీఏ టైటిల్ (సింగిల్స్, డబుల్స్) గెలిచిన, గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో నాలుగో రౌండ్‌కు చేరిన, వరల్డ్ ర్యాంకింగ్ టాప్–50లో నిలిచిన, మహిళల గ్రాండ్‌స్లామ్ గెలిచిన, డబ్ల్యూటీఏ ఫైనల్స్ గెలిచిన, వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన తొలి భారత ప్లేయర్ సానియా మీర్జా. పట్టుదలతో పైపైకి... సానియా మీర్జాకు 11 ఏళ్ల వయసు... హైదరాబాద్‌లోని ఒక కోర్టులో ఆమె సాధన కొనసాగుతోంది... అప్పటికి ఆమె రాకెట్ పట్టుకొని ఐదేళ్లవుతోంది. అయితే ఆమె కెరీర్‌పై తండ్రి ఇమ్రాన్ మీర్జాకు ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. సానియా ఏమాత్రం ఆడగలదు, అసలు పోటీ ప్రపంచంలో నిలబడగలదా, భవిష్యత్తు ఉంటుందా అనే సందిగ్ధత... అప్పటికే సన్నిహితులు కొందరు ‘మన అమ్మాయికి ఇలాంటి చిన్న స్కర్ట్‌లతో టెన్నిస్ అవసరమా’ అంటూ మాటలు విసురుతూనే ఉన్నారు. మరో మిత్రుడు వచ్చి ‘ఏంటి సానియాను మార్టినా హింగిస్‌ను చేద్దామనుకుంటున్నావా’ అంటూ వ్యంగ్య వ్యాఖ్య ఒకటి చేసి వెళ్లిపోయాడు. 16 ఏళ్ళ వయసుకే సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ గెలిచి హింగిస్ సంచలనం సృష్టించిన రోజులవి. అలాంటి మాటలతో ఒక దశలో ఇమ్రాన్‌లో ఆందోళన పెరిగింది. కానీ దానిని బయట పడనీయలేదు. తర్వాతి రోజుల్లో మార్టినా హింగిస్‌తోనే జత కట్టి వరల్డ్ నంబర్‌వన్ జోడీగా నిలవడంతో పాటు 14 డబుల్స్ టైటిల్స్ కలిసి సాధించడం విశేషం. సహజసిద్ధమైన ప్రతిభకు తోడు కష్టపడే గుణం, పట్టుదల, పోరాటతత్వం, ఓటమిని అంగీకరించని నైజం వెరసి సానియాను అగ్ర స్థానానికి చేర్చాయి. కెరీర్ ఆరంభంలో విమానాలకు పెద్దగా ఖర్చు పెట్టలేని స్థితిలో దేశవ్యాప్తంగాటోర్నీ లు ఆడేందుకు ఆ కుటుంబం ఒక పాత కారును ఉపయోగించింది. అప్పుడు రోడ్డు ద్వారా ప్రయాణించిన దూరం ఎన్ని కిలోమీటర్లో కానీ... ఈ సుదీర్ఘ టెన్నిస్ ప్రయాణం మాత్రం వెలకట్టలేని విధంగా భారత క్రీడా చరిత్రలో నిలిచిపోయింది. జూనియర్ వింబుల్డన్ విజేతగా... ఆటలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత హైదరాబాద్‌లో చిన్నటోర్నీ లు మొదలు జాతీయ స్థాయిలో కూడా వేర్వేరు నగరాల్లో జరిగే పోటీల్లో సానియా పోటీ పడింది. వెంటనే విజయాలు రాకపోయినా ఆమె ఆటలో ప్రత్యేకత ఉందని, దూకుడు కనిపిస్తోందని మాత్రం భారత టెన్నిస్ వర్గాల్లో చర్చ మొదలైంది. 13 ఏళ్ల వయసులో జాతీయ అండర్–14, అండర్–16 టైటిల్స్ గెలవడంతో సానియాకు అసలైన గుర్తింపు లభించింది. జూనియర్ స్థాయిలో ఆమె 10 సింగిల్స్, 13 డబుల్స్ టైటిల్స్ నెగ్గింది. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోయేందుకు ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. 2003 వింబుల్డన్టోర్నీ లో జూనియర్ బాలికల డబుల్స్‌లో రష్యాకు చెందిన అలీసా క్లెబనోవాతో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో ఆమె భారత టెన్నిస్‌లో కొత్త తారగా అందరి దృష్టిలో పడింది. సొంతగడ్డపై... సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2003లో తన సొంత నగరంలో జరిగిన హైదరాబాద్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్‌గా బరిలోకి దిగింది. అక్కడ తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైనా రెండేళ్ల తర్వాత ఇదే వేదికపై ఆమె తనకు కావాల్సిన ఫలితాన్ని అందుకుంది. ఇదే హైదరాబాద్ ఓపెన్‌లో విజేతగా నిలిచి సింగిల్స్‌లో డబ్ల్యూటీఏ తొలి టైటిల్ సొంతం చేసుకుంది. సానియా కెరీర్లో ఇదే ఏకైక సింగిల్స్ ట్రోఫీ. ఆపై మరో నాలుగు టోర్నీ ల్లో ఫైనల్ చేరినా, ఆమె రన్నరప్ స్థానానికే పరిమితమైంది. 27వ ర్యాంక్‌కు... 2005లో యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్ వరకు చేరడంతో ‘డబ్ల్యూటీఏ న్యూ కమర్’గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సింగిల్స్‌లో కొంత కాలం సానియా జోరు కొనసాగింది. టైటిల్స్ లేకపోయినా పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులపై సాధించిన కొన్ని సంచలన విజయాలు ఆమె సత్తాను చూపించాయి. ముఖ్యంగా హార్డ్ కోర్టుల్లో ప్రదర్శనతో ఆమె ర్యాంక్ మెరుగవుతూ వచ్చింది. ఎట్టకేలకు 2007 ఆగస్టులో సానియా సింగిల్స్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది. ఇది ఆమె సింగిల్స్ కెరీర్లో అత్యుత్తమ దశ. అయితే ఆ తర్వాత దీనిని నిలబెట్టుకోవడంలో ఆమె విఫలమైంది. వరుస పరాజయాలు, మణికట్టు గాయాలు ఆమె సింగిల్స్ ఆటకు ప్రతిబంధకంగా మారాయి. దాంతో సింగిల్స్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పి డబుల్స్పైనే దృష్టి పెట్టాలని సానియా నిర్ణయించుకుంది. ఆమె తీసుకున్న ఈ కీలక నిర్ణయం భవిష్యత్తులో ఆమె కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది. డబుల్స్ స్టార్‌గా... సొంతగడ్డపై హైదరాబాద్ ఓపెన్లోనే లీజెల్ హ్యూబర్ కలిసి డబుల్స్‌లోనూ తొలి టైటిల్ (2004) సాధించిన సానియా సింగిల్స్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత వరుస విజయాలు అందుకుంది. మహిళల డబుల్స్‌లో 82 మందితో జత కట్టిన సానియా 17 మంది వేర్వేరు భాగస్వాములతో కలిసి ఏకంగా 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలవగలిగింది. వీరందరిలోనూ 70వ భాగస్వామి అయిన మార్టినా హింగిస్‌తో ఆమె అద్భుత ఫలితాలు సాధించింది. ఒక దశలో ఈ జోడీ ఓటమి అనేదే లేకుండా సాగింది. 2015–16 మధ్య కాలంలో వీరిద్దరు వరుసగా 41 మ్యాచ్‌లలో గెలుపొందడం పెద్ద విశేషం. గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్‌లో 14 మందితో ఆమె జోడీగా బరిలోకి దిగింది. ఇదే క్రమంలో 2015 ఏప్రిల్‌లో సానియా మొదటిసారి వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ‘వరల్డ్ నంబర్‌వన్’ స్థానానికి చేరింది. అమ్మగా మారాక... హింగిస్‌తో కలిసి గెలిచిన 14 టైటిల్స్‌ను పక్కన పెట్టినా... ఇతర భాగస్వాములతో కలిసి సానియా ఖాతాలో 29 ట్రోఫీలు ఉన్నాయి. అయినా సరే సానియా–హింగిస్ జోడీ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. అగ్గికి కి వాయువు తోడైనట్లుగా సానియా అద్భుత ఫోర్‌హ్యాండ్, హింగిస్ బ్యాక్ హ్యాండ్ కలిసి ప్రత్యర్థులను పడగొట్టాయి. అయితే కారణాలేమైనా హింగిస్‌తో విడిపోయిన తర్వాత సానియాకు సంతృప్తికర ఫలితాలు రాలేదు. ఆ తర్వాత 4టోర్నీ ల్లోనే ఆమె విజేతగా నిలిచింది. 2018 ఆరంభంలో గాయాలతో కొన్నిటోర్నీ లకు దూరమైన సానియా అదే ఏడాది చివర్లో కొడుకు పుట్టడంతో టెన్నిస్‌కు నిరవధిక విరామం ఇచ్చింది. అయితే ఏడాదిన్నర తర్వాత మళ్లీ పూర్తి ఫిట్‌గా మారి పునరాగమనం చేసిన అనంతరం మరో రెండు టైటిల్స్ గెలవడం విశేషం. చివరకు ఈ ఏడాది జనవరిలో తన రిటైర్మెంట్ గురించి సానియా ప్రకటన చేసింది. దుబాయ్ ఓపెన్ తన ప్రొఫెషనల్ కెరీర్లో చివరి టోర్నమెంట్ అని ప్రకటించింది. -
ఏపీ నాకు రెండో ఇల్లు.. సీఎం జగన్‌ను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నా: గవర్నర్ బిశ్వభూషణ్
-
గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు: సీఎం జగన్
-
98 ఏళ్ల వృద్ధ ఖైదీకి..ఘనంగా జైలు సిబ్బంది వీడ్కోలు
జైలు నుంచి విడుదలైన ఖైదీలకు ఘనంగా వీడ్కోలు పలకడం చాలా అరుదు. ఒకవేళ మంచి సత్ప్రవర్తన కారణంగానో లేక ఏదైన మంచి పనులు చేసినట్లయితే గనుక వారిని మంచిగా సన్మానించి విడుదల చేయడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇలా ఒక ఖైదీకి జైలు సూపరింటెండెంటే ఏకంగా స్వయంగా కారు వద్దకు తీసుకువెళ్లి ఘనంగా పంపిచడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే..98 ఏళ్ల రామ్ సూరత్ అనే వృద్ధ ఖైదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు ఐపీసీ సెక్షన్ 452, 323, 352 కింద దోషిగా నిర్థారించి 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ మేరకు జైలు శిక్ష అనంతర విడుదలైన రామ్ సూరత్‌ని తీసుకుని వెళ్లేందుకు అతని కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. దీంతో జైలు సూపరింటెండెంట్ శశికాంత్ మిశ్రా పుత్రావత్ ఘనంగా వీడ్కోలు పలుకుతూ..స్వయంగా ఆయనే ఆ వృద్ధ ఖైదీ వెంట వచ్చి కారు ఇచ్చి మరీ అతని ఇంటికి పంపించారు. వాస్తవాని సూరత్ ఆగస్టు8న విడుదల కావాల్సి ఉంది. కానీ మే 20, 2022న కోవిడ్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో 90 రోజులపాటు పెరోల్‌పై ఉన్నారు. అందుకు సంబంధించిన ఘటనను ఉత్తరప్రదేశ్ డీజీ ప్రిజన్స్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు 98 ఏళ్ల వృద్ధుడిని జైలులో ఉంచడం మానవత్వం అని ఫైర్ అవుతుండగా, మరికొందరూ మాటలు రావడం లేదు ఎంత ఘనంగా పంపిచారంటూ జైలు సిబ్బందిపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. परहित सरिस धर्म नहीं भाई . 98 वर्षीय श्री रामसूरत जी की रिहाई पर लेने कोई नहीं आया . अधीक्षक जिला जेल अयोध्या श्री शशिकांत मिश्र पुत्रवत अपनी गाड़ी से घर भेजते हुए . @rashtrapatibhvn @narendramodi @myogiadityanath @dharmindia51 pic.twitter.com/qesldPhwBB — DG PRISONS U.P (@DgPrisons) January 8, 2023 (చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య)