జర్మనీ ఫుట్‌బాల్ కెప్టెన్ ష్వాన్‌స్టీగర్ వీడ్కోలు
బెర్లిన్: రెండేళ్ల క్రితం జర్మనీ ఫుట్‌బాల్ జట్టు విశ్వవిజేతగా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన స్టార్ ఫుట్‌బాలర్ బాస్టియన్ ష్వాన్‌స్టీగర్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 31 ఏళ్ల ష్వాన్‌స్టీగర్ నాయకత్వంలో జర్మనీ జట్టు ఈ నెలలో జరిగిన యూరో చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో నిష్ర్కమించింది. ఇటీవలే సెర్బియా టెన్నిస్ స్టార్ అనా ఇవనోవిచ్‌ను పెళ్లాడిన ఈ మాంచెస్టర్ యునెటైడ్ క్లబ్ ఆటగాడు తన కెరీర్‌లో జర్మనీ తరఫున 120 మ్యాచ్‌లు ఆడి 24 గోల్స్ చేశాడు. 2014 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడైన ష్వాన్‌స్టీగర్ 2006, 2010 ప్రపంచకప్‌లలో కూడా పాల్గొన్నాడు.