హామిల్టన్: న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రాస్ టేలర్‌కు ఆ జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. టేలర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిన మూడో వన్డేలో కివీస్ 115 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఫలితంగా సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ యంగ్ (112 బంతుల్లో 120; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్టిన్ గప్టిల్ (123 బంతుల్లో 106; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. రాస్ టేలర్ తన చివరి ఇన్నింగ్స్‌లో 16 బంతుల్లో 1 సిక్స్‌తో 14 పరుగులు సాధించాడు. అనంతరం నెదర్లాండ్స్ 42.3 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. స్టెఫాన్ మైబర్గ్ (43 బంతుల్లో 64; 13 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, మ్యాట్ హెన్రీకి 4 వికెట్లు దక్కాయి.
రాస్ టేలర్ వన్డే రికార్డు: 236 వన్డేల్లో 47.55 సగటుతో టేలర్ 8607 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు ఉండగా...అత్యుత్తమ స్కోరు 181 నాటౌట్.
Comments
Please login to add a commentAdd a comment