New Zealand cricket
-
ఒక్కొక్కరికి రూ. 1 కోటీ 30 లక్షలు!
ప్రపంచ క్రికెట్లో టాప్-3 అయిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పోలిస్తే న్యూజిలాండ్ క్రికెటర్లకు సాధారణంగా ఆట ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. ఎవరో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా ఇతర ఆదాయంపై ఆధారపడేవారే. ఇక ఒక్కసారి రిటైర్ అయితే నేరుగా ఏదైనా ఉద్యోగంలో చేరిపోతే తప్ప పని నడవదు. ఇక ఆ దేశపు మహిళా క్రికెటర్ల పరిస్థితి మరీ ఇబ్బందికరం.పురుష టీమ్ సభ్యులతో పోలిస్తే వీరికి దక్కేది చాలా తక్కువ మొత్తం. మహిళా క్రికెటర్లంతా ఆటపై ఇష్టం, ఆసక్తితో కొనసాగడమే. ఇలాంటి సమయంలో టీ20 వరల్డ్ కప్ విజయం ద్వారా వచ్చిన మొత్తం వారికి కాస్త ఊరటను అందించింది! విజేతగా నిలవడంతో కివీస్ మహిళల టీమ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో ఐసీసీ రూ. 23 లక్షల 40 వేల డాలర్లు అందించింది. ఈ మొత్తాన్ని జట్టులో 15 మందికి సమంగా పంచారు.ఫలితంగా ఒక్కొక్కరికి 2 లక్షల 56 వేల న్యూజిలాండ్ డాలర్లు (సుమారు రూ.1 కోటీ 30 లక్షలు) లభించాయి. వరల్డ్ కప్‌కు ముందు వరుసగా 10 టీ20లు ఓడి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు చివరకు చాంపియన్‌గా నిలిచింది. దాంతో ఆర్థికపరంగా కూడా జట్టులోని సభ్యులకు వెసులుబాటు దక్కడం ఈ టీమ్ గెలుపులో మరో సానుకూలాంశం! చదవండి: ‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు.. తండ్రిలాంటి వాడినంటూ..’ -
రచిన్ రవీంద్రకు బంపరాఫర్
న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్రకు బంపరాఫర్ దక్కింది. కివీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో తొలిసారి అతడు చోటు దక్కించుకున్నాడు.గత ఏడాది కాలంగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న రచిన్‌కు బోర్డు ఈ మేరకు సముచిత స్థానం కల్పించింది. 2024- 25 ఏడాదికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రతిపాదిత జాబితాలోని 20 మంది ఆటగాళ్లలో 24 ఏళ్ల రచిన్‌కు చోటు ఇచ్చింది.బెంగళూరు మూలాలుభారత్లోని బెంగళూరు మూలాలు ఉన్న రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. గతేడాది కివీస్ తరఫున అతడు 578 పరుగులు సాధించాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ఆట తీరుతో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.అంతేకాదు.. ఈ ఏడాది మార్చిలో.. ప్రతిష్టాత్మక సర్ రిచర్డ్ హాడ్లీ మెడల్ అందుకున్నాడు. తద్వారా ఈ మెడల్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడుతూ తాజాగా సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు.ఈ సందర్భంగా రచిన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నానని.. ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బ్లాక్‌క్యాప్స్ తరఫున ఆడటం తనకు దక్కిన గొప్ప గౌరవమని.. ఇప్పుడిలా కాంట్రాక్టు దక్కించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. రూ. 1.8 కోట్లుకాగా రచిన్ రవీంద్రతో పాటు బెన్ సియర్స్, విల్ ఓ రూర్కే, జాకోబ్ డఫీలు కూడా తొలిసారి న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు సంపాదించారు.న్యూజిలాండ్ తరఫున ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడిన రచిన్ రవీంద్ర 519 పరుగులు చేశాడు. ఇక 25 వన్డేలు ఆడిన అతడి ఖాతాలో 820 పరుగులు ఉన్నాయి. ఇందులో మూడు సెంచరీలు. కాగా ఐపీఎల్లో రచిన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది వేలంలో రూ. 1.8 కోట్లకు అతడు అమ్ముడుపోయాడు.ఇక 23 టీ20 ఆడిన రచిన్ 231 పరుగులు చేయగలిగాడు. అదే విధంగా.. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో వరుసగా 10, 18, 13 వికెట్లు పడగొట్టాడు. కాగా సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది సంబంధిత క్రికెట్ బోర్డు, క్రికెటర్ల మధ్య కుదిరే వార్షిక ఒప్పందం. అందుకు అనుగుణంగానే ప్లేయర్ల పారితోషికం, సదుపాయాలు ఉంటాయి.న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2024- 25గానూ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటన.. వినూత్న ప్రయోగం
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 29) ప్రకటించారు. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించనున్నాడు. గాయపడిన ఆడమ్ మిల్నే స్థానంలో మ్యాట్ హెన్రీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్‌లతో కలిసి హెన్రీ కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. బొటనవేలి గాయంతో బాధపడుతున్న డెవాన్ కాన్వేను సైతం న్యూజిలాండ్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో మరో వికెట్‌కీపర్ బ్యాటర్ ఫిన్ అలెన్‌కు స్థానం లభించినప్పటికీ.. వరల్డ్‌కప్‌లో కాన్వేనే కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వికెట్‌కీపర్ బ్యాటర్లైన టిమ్ సీఫర్ట్, టామ్ బ్లండెల్‌లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు లభించలేదు. ఇటీవల పాక్‌తో సిరీస్‌ను (టీ20) డ్రా చేసుకున్న జట్టుకు సారధి అయిన మైఖేల్ బ్రేస్‌వెల్ కూడా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోటాలో ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఐష్ సోధి, మిచెల్ సాంట్నార్.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్ వ్యవహరించనున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మూడు శతకాలతో విజృంభించిన రచిన్ తొలిసారి టీ20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా లూక్ రాంచీ, బౌలింగ్ కోచ్‌గా జేకబ్ ఓరమ్, అసిస్టెంట్ కోచ్‌గా జేమ్స్ ఫోస్టర్ వ్యవహరించనున్నారు. హెడ్ కోచ్‌గా గ్యారీ స్టెడ్ కొనసాగనున్నాడు. వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు మే 23న బయల్దేరనుంది. జూన్ 7న న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ (ఆఫ్ఘనిస్తాన్) ఆడనుంది.న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ [ట్రావెలింగ్ రిజర్వ్-బెన్ సియర్స్ ]Join special guests Matilda and Angus at the squad announcement for the upcoming @t20worldcup in the West Indies and USA. #T20WorldCup pic.twitter.com/6lZbAsFlD5— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్న్యూజిలాండ్ క్రికెట్ తమ టీ20 వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. సెలక్టర్లు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిథులు కాకుండా ఇద్దరు చిన్నారులు జట్టు సభ్యుల పేర్లను వెల్లడించారు. న్యూజిలాండ్ క్రికెట్ మటిల్డా, ఆంగస్ అనే ఇద్దరు చిన్నారులకు చీఫ్ గెస్ట్లుగా ఆహ్వానించింది. The team's kit for the 2024 @T20WorldCup 🏏Available at the NZC store from tomorrow. #T20WorldCup pic.twitter.com/T4Okjs2JIx— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 న్యూజిలాండ్ క్రికెట్ చేసిన ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. వరల్డ్‌కప్ జట్టు ప్రకటన సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ తమ వరల్డ్‌కప్ జెర్సీని కూడా రివీల్ చేసింది. మెగా టోర్నీలో న్యూజిలాండ్ క్రికెటర్లు తాము రెగ్యులర్‌గా ధరించే బ్లాక్ కిట్ కాకుండా వేరే కలర్లో ఉండే కిట్లను ధరించనున్నారు. -
ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం.. మొయిన్ అలీ బాటలోనే..!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ 2023 కోసం న్యూజిలాండ్ జట్టులో చేరేందుకు అంగీకరించాడు. గతేడాది ఆగస్ట్‌లో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న బౌల్ట్.. బోర్డు విజ్ఞప్తి మేరకుతో మళ్లీ కివీస్ తరఫున బరిలోకి దిగేందుకు ఓకే చెప్పాడు. న్యూజిలాండ్ ప్రజలు బోల్ట్‌ను వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులోకి తీసుకోవాలని బోర్డుపై ఒత్తిడి తేవడంతో NZC ఈ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ బోర్డు 20 మంది ఆటగాళ్లకు 2023-24 సీజన్ సెంట్రల్ కాంట్రక్ట్ ఇచ్చిన రోజే (జూన్ 8) ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా, బౌల్ట్.. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొనేందుకు, అలాగే కుటుంబంతో గడిపేందుకు గతేడాది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బౌల్ట్.. 2023 వరల్డ్‌కప్‌లో కూడా న్యూజిలాండ్ జట్టులో భాగం కావాలని ఆ దేశ ప్రజలు కోరుకున్నారు. చివరి రెండు వరల్డ్‌కప్‌లలో న్యూజిలాండ్ ఫైనల్స్‌కు చేరడంలో బౌల్ట్ కీలకపాత్ర పోషించాడు. 2015లో ఆసీస్ మిచెల్ స్టార్క్‌తో పాటు లీడింగ్ వికెట్ టేకర్‌గా (22).. 2019లో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) నిలిచాడు. ఓవరాల్‌గా బౌల్ట్ వరల్డ్‌కప్‌లలో 21.79 సగటున 39 వికెట్లు పడగొట్టి, ఆ దేశం తరఫున మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 7) ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సైతం తన దేశ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్ ప్రకటించాక కూడా టెస్ట్‌ల్లో ఆడేందుకు ఒప్పుకున్నాడు. ఈసీబీ మొయిన్ అలీని యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. దీంతో మొయిన్ దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మొయిన్ 2021లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం -
సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న మరో న్యూజిలాండ్ ఆటగాడు! ఇకపై
New Zealand Cricket- Martin Guptill: గతంలో.. స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. ఆల్‌రౌండర్ కొలిన్ డీ గ్రాండ్‌హోం.. తాజాగా స్టార్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్.. న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు. గప్టిల్ అభ్యర్థన మేరకు అతడిని రిలీజ్ చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బుధవారం ప్రకటన చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 జట్టుకు గప్టిల్ ఎంపికైనప్పటికీ ఆస్ట్రేలియా గడ్డ మీద ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీ20 ఫార్మాట్లో మెరుగైన రికార్డు ఉన్న గప్టిల్‌ను కాదని ఫిన్ అలెన్‌ను ఓపెనర్‌గా ఆడించింది యాజమాన్యం. ఇక ఈ టోర్నీలో కివీస్ సెమీస్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన గప్టిల్.. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. చర్చించిన తర్వాతే ఈ నేపథ్యంలో అతడి నిర్ణయాన్ని గౌరవిస్తూ బోర్డు ఈ స్టార్ బ్యాటర్‌ను రిలీజ్ చేసింది. ‘‘అనేక చర్చల అనంతరం గప్టిల్ అభ్యర్థన మేరకు అతడిని రిలీజ్ చేసేందుకు బోర్డు అంగీకరించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. గప్టిల్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నా.. జాతీయ జట్టు సెలక్షన్ సమయంలో అతడి పేరును పరిగణనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా ఎన్‌జెడ్‌సీ స్పష్టం చేస్తోంది. దేశవాళీ క్రికెట్ జట్టు ఎంపిక సమయంలోనూ అతడికి ప్రాధాన్యం ఉంటుంది’’ అని తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ విషయంపై స్పందించిన 36 ఏళ్ల గప్టిల్.. ‘‘దేశం తరఫున ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. బ్లాక్‌క్యాప్స్‌కు ఆడే సమయంలో నాకు సహరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నా అవసరాల మేరకు ఇతర ఆప్షన్లు చూసుకోవాల్సి ఉంది. ఇతర అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అద్భుత రికార్డులు అలాగే కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికీ నేను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాను’’ అని పేర్కొన్నాడు. కాగా కివీస్ తరఫున టీ20లలో 122 మ్యాచ్‌లు ఆడి 3531 పరుగులు చేశాడు గప్టిల్. ఈ ఫార్మాట్లో న్యూజిలాండ్ టాప్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. గుడ్ బై చెప్పినట్లే! అదే విధంగా 47 టెస్టుల్లో 2586, 198 వన్డేల్లో 7346 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 18 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్న ఈ స్టార్ బ్యాటర్.. టీ20లలో రెండె సెంచరీలు, 20 అర్ధ శతకాలు సాధించాడు. కాగా న్యూజిలాండ్ క్రికెట్ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ లేదా డొమెస్టిక్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లను మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకునే వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో గప్టిల్ అనధికారికంగా ఎన్జెడ్సీకి గుడ్‌బై చెప్పినట్లే! చదవండి: Cristiano Ronaldo: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను! -
న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్.. వైదొలిగిన స్టార్ బౌలర్
న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆ దేశ సెంట్రల్ కాంట్రక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) బుధవారం ధృవీకరించింది. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకు బౌల్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌జెడ్‌సీ వెల్లడించింది. బౌల్ట్ నిర్ణయంతో జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటికీ, జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకుంటామని (అతని సమ్మతం మేరకు) ఎన్‌జెడ్‌సీ పేర్కొంది. బౌల్ట్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకునే అవకాశం ఉందని తెలిపింది. తమ దేశ స్టార్ బౌలర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం బాధాకరమని, అతని భవిష్యత్తు మరింత బాగుండాలని విష్ చేసింది. ఇప్పటివరకు అతను జట్టుకు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, న్యూజిలాండ్ క్రికెట్ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ లేదా డొమెస్టిక్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లను మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకుంటారు. బౌల్ట్ తాజాగా నిర్ణయంతో అతను అనధికారికంగా న్యూజిలాండ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనట్లే అవుతుంది. 33 ఏళ్ల బౌల్ట్ 2011లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ సహకారాన్నందించాడు. అతని జట్టులో ఉండగా కివీస్ అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ జట్టుగా కొనసాగింది. కివీస్ తరఫున 78 టెస్ట్‌లు, 93 వన్డేలు, 44 టీ20 ఆడిన బౌల్ట్.. మొత్తం 548 వికెట్లు (టెస్ట్‌ల్లో 317, వన్డేల్లో 169, టీ20ల్లో 62) పడగొట్టాడు. చదవండి: మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు -
8 ఏళ్ల తర్వాత విండీస్ టూర్‌కు న్యూజిలాండ్.. కేన్ మామ వచ్చేశాడు..!
వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఇక గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ సిరీస్‌తో తిరిగి బరిలోకి దిగబోతున్నాడు. అదే విధంగా సీనియర్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక 2014 తర్వాత కివీస్ కరేబియన్ పర్యటనకు వెళ్లనుంది. విండీస్ పర్యటనలో భాగంగా కివీస్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 10న జమైకా వేదికగా జరగనున్న తొలి టీ20తో న్యూజిలాండ్ టూర్ ప్రారంభం కానుంది. కాగా ఇటీవల ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన కివీస్ తమ సీనియర్ ఆటగాళ్లు లేకుండానే వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ వన్డే, టీ20 జట్టు కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్, సోధీ ,టిమ్ సౌథీ చదవండి: Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్ సేనకు భారీ షాక్! ఆలస్యంగా వెలుగులోకి.. -
Ross Taylor: రాస్‌టేలర్ వీడ్కోలు
హామిల్టన్: న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రాస్ టేలర్‌కు ఆ జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. టేలర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిన మూడో వన్డేలో కివీస్ 115 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఫలితంగా సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ యంగ్ (112 బంతుల్లో 120; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్టిన్ గప్టిల్ (123 బంతుల్లో 106; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. రాస్ టేలర్ తన చివరి ఇన్నింగ్స్‌లో 16 బంతుల్లో 1 సిక్స్‌తో 14 పరుగులు సాధించాడు. అనంతరం నెదర్లాండ్స్ 42.3 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. స్టెఫాన్ మైబర్గ్ (43 బంతుల్లో 64; 13 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, మ్యాట్ హెన్రీకి 4 వికెట్లు దక్కాయి. రాస్ టేలర్ వన్డే రికార్డు: 236 వన్డేల్లో 47.55 సగటుతో టేలర్ 8607 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు ఉండగా...అత్యుత్తమ స్కోరు 181 నాటౌట్. -
మ్యాచ్‌కు ముందు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.. భయంతో వణికిపోయాం
Everything changed.. NZC Defends Decision To Abort Pak Tour: పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డే(సెప్టెంబర్ 17)కు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత పాక్‌లోనే రెండు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపిన 34 మంది సభ్యుల న్యూజిలాండ్ బృందం ఆదివారం వేకువజామున దుబాయ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ మాట్లాడుతూ.. అత్యంత భయానక పరిస్థితుల నుంచి బయటపడ్డామని తెలిపాడు. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు తమ దేశ సెక్యూరిటీ విభాగం హెచ్చరిక మేరకు తాము అలర్ట్ అయ్యామని, ఆ సమయంలో పరిస్థితులంతా ఒక్కసారిగా మారిపోయాయని, న్యూజిలాండ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే తప్పనిసరి పరిస్థితుల్లో పర్యటన రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించాడు. పాక్ క్రికెట్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసినా.. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నాడు. తమ బృంద సభ్యులు 24 గంటల పాటు దుబాయ్‌లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటారని, అనంతరం 21 మంది వారం వ్యవధిలో స్వదేశానికి తిరిగి వెళ్తారని, మిగిలిన సభ్యులు టీ20 ప్రపంచకప్ బృందంతో కలుస్తారని తెలిపారు. ఇదిలా ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయంపై పాక్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సెక్యూరిటీ హెచ్చరిక లేదు.. ఏదీ లేదు.. అదంతా వట్టి డ్రామా.. హామీ ఇచ్చినా సిరీస్‌ను రద్దు చేసుకోవడం దారుణమని షాహిద్ అఫ్రిది మండిపడగా.. "పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది" అంటూ ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డాడు. మరోవైపు సిరీస్ రద్దుపై న్యూజిలాండ్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం పాక్ పర్యటనపై పునరాలోచన చేస్తామని ప్రకటించిన విషయం విధితమే. కాగా, పాక్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉండింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉండింది. చదవండి: గంటల వ్యవధిలో పాక్ క్రికెట్‌కు మరో షాక్.. ? -
విజేత టీమిండియానే: పనేసర్
లండన్: భారత్,న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌పై భారీ అంచనాలు మొదలయ్యాయి. పలువురు టీమిండియానే విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది న్యూజిలాండ్‌దే కప్ అని అభిప్రాయపడుతున్నారు. కాగా, టెస్ట్ ఛాంపియన్షిప్ లోనూ, ఆ తర్వాత జరగనున్న తమ జట్టుతో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లోనూ టీమిండియా తిరుగులేని విజయం సాధిస్తుందని ఇంగ్లండ్ మాజీ వెటరన్ స్పిన్నర్ మాంటే పనేసర్ జోస్యం చెప్పాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. ఇంగ్లండ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ ఇప్పటికే యూకే కు చేరుకుందని ,జూన్ మొదటి వారంలో భారత జట్టు వచ్చి చేరుతుందని తెలిపాడు. ఇటీవల మార్చిలో భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్ ఆడలేకపోవడం తమను ఎప్పుడూ వెంటాడుతున్న ప్రధాన సమస్య అని పనేసర్ అభిప్రాయపడ్డాడు. ఆగస్టులో ఇంగ్లండ్ పిచ్‌ల నుంచి టర్న్ లభిస్తుంటుంది. అదే జరిగితే ఇంగ్లండ్ ని ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తుంది.ఇంగ్లండ్ టాప్ ఆర్డర్లో కెప్టెన్ జో రూట్ మినహా ఎవరూ స్పిన్ని సమర్థంగా ఎదుర్కోలేరు.ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ గ్రీన్ పిచ్‌పై జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ టీమిండియానే ఫేవరెట్ అని పనేసర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాని దాని సొంతగడ్డపైనే ఈ ఏడాది ఆరంభంలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌లో ఓడించిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ని 3-1తో చిత్తుగా ఓడించేసింది..ఆ ఉత్సాహంలో ఉన్న భారత్ జట్టు తప్పక విజయం సాధిస్తుందని పనేసర్ అభిప్రాయ పడ్డాడు. (చదవండి:నెటిజన్లను ఆకర్షిస్తున్న సంజన డాన్స్ వీడియో) -
ప్రసిధ్ కృష్ణ ‘పాజిటివ్’
ముంబై: ఐపీఎల్ టి20 టోర్నీ వాయిదా పడిన తర్వాత మరో ఇద్దరు క్రికెటర్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ ఇద్దరూ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బృందంలోని సభ్యులే. పేస్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ, న్యూజిలాండ్‌కు చెందిన వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్‌లకు కరోనా సోకినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘రెండు నెగెటివ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఇతర భారత క్రికెటర్లలాగే ప్రసిధ్ కూడా మే 3న బబుల్ వీడాడు. అయితే స్వస్థలం బెంగళూరు చేరిన తర్వాత అతని రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. న్యూజిలాండ్‌కు చెందిన సీఫెర్ట్‌కు కూడా కరోనా రావడంతో అతను తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక విమానంలో స్వదేశం వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బయలుదేరే ముందు అతనికి చేసిన రెండు పరీక్షల్లో కూడా కరోనా ‘పాజిటివ్’ వచ్చింది. దాంతో సీఫెర్ట్ అహ్మదాబాద్‌లోనే ఆగిపోయాడు. సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తరహాలోనే మెరుగైన చికిత్స కోసం సీఫెర్ట్‌ను కూడా చెన్నైకి తరలించనున్నారు. ఐసోలేషన్, ఆపై టెస్టులు నెగెటివ్‌గా వస్తేనే అతను న్యూజిలాండ్ పయనమవుతాడు. సీఫెర్ట్ ఆరోగ్యం గురించి తమకు పూర్తి సమాచారం ఉందని... బీసీసీఐతో పాటు అతను కోలుకునేందుకు తమవైపు నుంచి కూడా అన్ని రకాల సహకారం అందిస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ వ్యాఖ్యానించారు. ప్రసిధ్‌కు సాధ్యమేనా... ఇంగ్లండ్ పర్యటనకు సెలక్టర్లు ప్రకటించిన నలుగురు రిజర్వ్ ఆటగాళ్లలో ప్రసిధ్ కృష్ణ ఒకడు. టీమిండియా బృందం ఈ నెల 25న ప్రత్యేక బయో బబుల్‌లోకి ప్రవేశిస్తుంది. ఆలోగా అతను నెగెటివ్‌గా తేలాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్ వెళ్లాల్సిన భారత క్రికెటర్లంతా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుంటే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవిషీల్డ్‌ను తీసుకుంటే అది ఇంగ్లండ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి రెండో డోసు అక్కడా తీసుకోవచ్చనేది ఆలోచన. అయితే ప్రసిధ్ ఈ నెల 18 లేదా 20 వరకు నెగెటివ్‌గా తేలినా... వైద్య సూచనల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్‌కు కనీసం నాలుగు వారాల విరామం అవసరం. మరి ప్రసిధ్ విషయంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి. -
#మీటూ ఎఫెక్ట్: న్యూజిలాండ్ క్రికెటర్స్ హ్యాండ్ బుక్‌లో..
వెల్లింగ్టన్ : పని ప్రదేశాల్లో ఎదురయ్యే వేధింపులపై ప్రపంచవ్యాప్తంగా #మీటూ పేరిట మహిళలు తమ గళం విప్పుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆటగాళ్లకు లైంగిక సంబంధాల ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమం చేపట్టింది. ఆటగాళ్ల హ్యాండ్‌బుక్‌లో లైంగిక సంబంధాల ప్రాముఖ్యతను వివరిస్తూ మొత్తం 9 కీలక అంశాలను పొందుపరిచింది. గత ఏడేళ్లుగా ఆటగాళ్లకు ఈ బుక్‌ను అందజేస్తున్న అసోషియేషన్.. తొలి సారి అందులో ‘గుడ్ డిసిషన్ మేకింగ్’ క్యాప్షన్‌తో లైంగిక సంబంధాల అంశాన్ని ప్రస్తావించింది. ‘జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో లైంగిక సంబంధాల విషయాల్లో ఇది చాలా అవసరం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా లైంగిక సమ్మతి కీలకం’ అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. లైంగిక సంబంధాలకు ఒప్పించే క్రమంలో వారికి పూర్తిగా స్వేచ్చనియాలని, వారికిష్టం లేదంటే.. వదిలేయాలని, ఈ విషయంలో వారిపై ఒత్తిడి చేయవద్దని, వారి నిర్ణయాన్ని గౌరవించాలనే 9 కీలక అంశాలను సూచించారు. ఫ్రొఫెషనల్ క్రికెటర్స్ బాధ్యతలు, ప్రాధాన్యతల గురించి అవగాహన కల్పించేందుకే ఈ అంశాన్ని పొందుపరుస్తూ ఈ పుస్తకాన్ని అప్డేట్ చేసామని అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ హెత్ మిల్స్ తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆటగాళ్లకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే అన్ని రకాల విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. -
సిక్సర్ వయా బౌలర్ హెడ్!
ఆక్లాండ్: క్రికెట్లో ఇకపై బౌలర్లు కూడా హెల్మెట్ పెట్టుకొని బంతులు వేయాల్సిన సమయం వచ్చిందేమో! న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో జరిగిన తాజా సంఘటన అలాంటి ఆందోళనకు కారణంగా మారింది. బ్యాట్స్‌మన్ ఆడిన బంతి నేరుగా బౌలర్ తలకు తగిలి ఆ తర్వాత సిక్సర్‌గా మారిన అనూహ్య ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఫోర్డ్ వన్డే ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్, కాంటర్బరీ జట్ల మధ్య జరిగిన మూడో ప్రిలిమినరీ ఫైనల్లో ఇది జరిగింది. ఆక్లాండ్ బ్యాట్స్‌మన్ జీత్ రావల్ క్రీజ్‌లో ఉన్న సమయంలో కాంటర్బరీ కెప్టెన్ ఆండ్రూ ఎలిస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. మూడో బంతిని భారీ సిక్సర్ బాదిన రావల్, తర్వాతి బంతిని లాఫ్టెడ్ డ్రైవ్ ఆడాడు. అది నేరుగా బౌలర్ తల ముందు భాగంలో తగిలి బౌండరీ దాటింది. అంపైర్ దానిని ముందు ఫోర్‌గా ప్రకటించినా... ఆ తర్వాత అది సిక్స్‌గా తేలింది! ఆ వెంటనే ఎలిస్ ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షల కోసం మైదానం వీడాడు. ప్రమాదం లేదని తేలడంతో తిరిగొచ్చి ఆ తర్వాత మరో ఆరు ఓవర్లు బౌల్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లో 25 బంతులు ఎదుర్కొని 14 పరుగులు కూడా చేశాడు. ఎలిస్‌కు పెద్ద ప్రమాదం జరగకపోవడంతో బ్యాట్స్‌మన్ రావల్ ఊపిరి పీల్చుకున్నాడు. ‘ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతను మ్యాచ్‌లో కొనసాగడం నా బెంగ తీర్చింది. అయితే ఇలాంటి గాయం తగిలిన సందర్భాల్లో కాస్త ఆలస్యంగా తలకు సంబంధించిన సమస్యలు బయటపడతాయి. అయితే అది కూడా జరగకూడదని ప్రార్థిస్తున్నా’ అని అతను చెప్పాడు. జీత్ రావల్ 149 పరుగుల సహాయంతో ఈ మ్యాచ్‌లో ఆక్లాండ్ 107 పరుగుల తేడాతో కాంటర్బరీపై విజయం సాధించింది. -
ఇలాంటి సిక్స్ ఎప్పుడూ చూసుండరు!
సాక్షి, స్పోర్ట్స్ : ఇప్పటివరకు సిక్స్‌లంటే గాల్లో నుంచి బౌండరీ అవతల పడటం చూశాం. స్టేడియం బయట పడ్డ సిక్స్‌లను కూడా చూశాం. కానీ న్యూజిలాండ్ దేశవాళి క్రికెట్లో నమోదైన ఓ సిక్సు మాత్రం ఇంత వరకు ఎవరు చూసుండరు. ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్-క్యాంటెర్బరీల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో గమ్మత్తైన ఓ సిక్సు నమోదైంది. ఇన్నింగ్స్ 19 ఓవర్లో ఆక్లాండ్ బ్యాట్స్‌మన్ జీత్రావెల్ కొట్టిన ఈ సిక్సు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. క్యాంటెర్బరీ కెప్టెన్ ఆండ్రూ ఎల్లిస్ ఈ ఓవర్ వేయగా ఆక్లాండ్ బ్యాట్స్‌మన్ జీత్రావెల్ స్టేట్‌గా షాట్ ఆడాడు. అయితే బంతి నేరుగా ఎల్లిస్ తలకు బలంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా మైదానంలోని ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఎల్లిస్‌కు గాయమైందో ఏమో అని కంగారు పడ్డారు. అతనికి ఎలాంటి గాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆ బంతి అతని తలకు తగిలి నేరుగా బౌండరీ అవతల పడింది. తొలుత అంపైర్ ఫోర్ ఇవ్వగా రిప్లేలో సిక్స్ అని తేలడంతో అందరు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయింది. రావెల్ అద్భుత సెంచరీ సాధించడంతో ఈ మ్యాచ్‌లో ఆక్లాండ్ గెలుపోందింది. మ్యాచ్ అనంతరం రావెల్ మాట్లాడుతూ.. ‘ఆండ్రూ ఎల్లిస్ గాయపడ్డాడని చాలా కంగారు పడ్డా. నా వల్ల అతనికి గాయమైందో ఏమోనని ఆందోళన చెందా. కానీ అతనికేం కాలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నా. ఇలాంటి అనుభవం ఎవరికి ఎదురుకాలేదనుకుంటా’ అని పేర్కొన్నాడు. గాయపడ్డ ఆండ్రూ ఎల్లీస్.. కంగారుపడుతున్న జీత్రావెల్ -
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మృతి
అక్లాండ్: న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1965లో క్రికెట్లో అరంగేట్రం చేసిన బెవాన్ తన 13 ఏళ్ల కెరీర్లో మొత్తం 61 టెస్టులు ఆడారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని ఇష్టపడే బెవాన్ 32.22 సగటుతో 3,448 పరుగులు చేశారు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. 17 టెస్టులకు సారథ్య బాధ్యతలు వహించిన బెవాన్ ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ ఆడిన తొలి అంతర్జాతీయ వన్డేకు బెవాన్ నాయకత్వం వహించారు.11 వన్డేల్లో 56.33 సగటుతో ఐదు అర్ధ సెంచరీలు, ఓ సెంచరీ నమోదు చేశారు. న్యూజిలాండ్ తరపున పది ఇన్నింగ్స్‌లలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ సగటు కావడం విశేషం. బెవాన్ మృతితో న్యూజిలాండ్ అభిమానులు, ఆటగాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు. -
మెకల్లమ్ ఫిక్సర్ కాదు
న్యూజిలాండ్ క్రికెట్ స్పష్టీకరణ వెల్లింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై కివీస్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్‌పై ఐసీసీ విచారణ జరుగుతుందనే కథనాలను న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జడ్‌సీ) బోర్డు ఖండించింది. 2008లో మెకల్లమ్‌ను ఓ ఫిక్సర్ సంప్రదించినప్పటికీ ఆ ఆఫర్‌ను అతను తిరస్కరించాడని తెలిపింది. ఈ వ్యవహారంపై బ్రిటిష్ పత్రిక డెయిలీ మెయిల్లో కథనం ప్రచురితమైంది. ‘మెకల్లమ్ ఐసీసీ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని అవినీతి వ్యతిరేక యూనిట్ బ్రిటిష్ మీడియాకు లీక్ చేయడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఐసీసీ పరిశోధన కింద మాత్రం మెకల్లమ్ లేడని స్పష్టం చేస్తున్నాం. నిజానికి తన నిజాయితీని వారు అప్పుడే ప్రశంసించారు. అవినీతిని ఎదుర్కోవడంలో మా కెప్టెన్‌పై వంద శాతం నమ్మకముంది’ అని ఎన్‌జడ్‌సీ తమ ప్రకటనలో వెల్లడించింది. ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభానికి ముందు 2008లో ప్రపంచ ప్రఖ్యాత మాజీ క్రికెటర్ ఒకరు మెకల్లమ్‌తో మ్యాచ్ ఫిక్స్ చేయించేందుకు ప్రయత్నించాడని డెయిలీ మెయిల్ పేర్కొంది. ఆ తర్వాత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా మాజీ క్రికెటర్ కలిశాడని చెప్పింది. పేలవంగా ఆడితే లక్షా 80 వేల డాలర్లు ఇస్తానని, అంతర్జాతీయ క్రికెట్లో పెద్ద ఆటగాళ్లంతా ఫిక్సింగ్ చేస్తున్నారని ఆ ఆటగాడు మెకల్లమ్‌తో చెప్పినట్లు ఆ పత్రిక కథనంలో పేర్కొంది.