New Zealand Announce 15 Member Squad For Limited Overs Tour Of WI, Details Inside - Sakshi
Sakshi News home page

NZ Vs WI: 8 ఏళ్ల తర్వాత విండీస్‌ టూర్‌కు న్యూజిలాండ్‌.. కేన్‌ మామ వచ్చేశాడు..!

Published Mon, Jul 25 2022 12:15 PM | Last Updated on Mon, Jul 25 2022 1:12 PM

New Zealand announce limited overs squad to take on West Indies - Sakshi

వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రకటించింది. ఇక గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు  దూరంగా ఉన్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఈ సిరీస్‌తో తిరిగి బరిలోకి దిగబోతున్నాడు. అదే విధంగా సీనియర్‌ బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు.

ఇక 2014 తర్వాత కివీస్ కరేబియన్ పర్యటనకు వెళ్లనుంది. విండీస్‌ పర్యటనలో భాగంగా కివీస్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 10న జమైకా వేదికగా జరగనున్న తొలి టీ20తో న్యూజిలాండ్‌ టూర్‌ ప్రారంభం కానుంది. కాగా ఇటీవల ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన కివీస్ తమ సీనియర్ ఆటగాళ్లు లేకుండానే వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 

న్యూజిలాండ్ వన్డే, టీ20 జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్‌, సోధీ ,టిమ్ సౌథీ
చదవండి: Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్‌ సేనకు భారీ షాక్‌! ఆలస్యంగా వెలుగులోకి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement