westindies
-
భారత బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 358 పరుగులు
వడోదర వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు జూలు విదిల్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మన అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగారు.విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన(Smriti Mandhana), ప్రతికా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటర్లు తమపని తాము చేసుకుపోయారు.భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్(103 బంతుల్లో 115, 16 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. ప్రతికా రావల్(76), రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు. హర్లీన్ డియోల్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక విండీస్ బౌలర్లలో డొటిన్, ఫ్లెచర్, జేమ్స్, జోషఫ్ తలా వికెట్ సాధించారు. కాగా వన్డేల్లో భారత మహిళ జట్టు 358 పరుగులు చేయడం ఇది రెండో సారి. అదనంగా మరో పరుగు చేసి ఉంటే భారత్‌కు అత్యధిక వన్డే స్కోర్‌ను నెలకొల్పేది. గతంలో 2017లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.చదవండి: WI vs PAK: వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడికి చోటు -
తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్..
ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 201 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘనవిజయం సాధించింది. 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆఖరి వికెట్ షోర్ఫుల్ ఇస్లాం రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది.వెస్టిండీస్ బౌలర్లలో పేసర్లు కీమర్ రోచ్, జైడన్ సీల్స్ తలా మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బ తీశారు. వీరిద్దరితో పాటు అల్జారీ జోషఫ్ రెండు, షమీర్ జోషఫ్ ఒక్క వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మెహద హసన్ మిరాజ్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 450/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.విండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ (115) అజేయ శతకంతో మెరవగా.. మికైల్ లూయిస్ (97), అలిక్ అథనాజ్ (90) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ మూడు, తస్కిన్ అహ్మద్, మెహది హసన్ తలో 2, తైజుల్ ఇస్లాం ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌ను 269-9తో ముగించింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం జోడించి వెస్టిండీస్ బంగ్లాదేశ్ ముందు 334 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ లక్ష్యాన్ని చేధించడంలో బంగ్లా చతికలపడింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 8న సెయింట్ కిట్స్ వేదికగా ప్రారంభం కానుంది. -
SL vs WI: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లపై వేటు!
వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు లంక స్టార్ ప్లేయర్లు దాసున్ షనక, దుష్మంత చమీరా దూరమయ్యారు. ఈ ఏడాది జూలైలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వీరిద్దరూ భాగమయ్యారు. గత సిరీస్‌లో ఈ సీనియర్ ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలోనే వారిని సెలక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏడాది తర్వాత మిడిలార్డర్ బ్యాటర్ భనుక రాజపాక్సకు లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు.ఈ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ అసలంక సారథ్యం వహించనున్నాడు. ఆక్టోబర్ 13 నుంచి దంబుల్లా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం విండీస్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.శ్రీలంక టీ20 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండిమాల్, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, జెఫ్రీ వాండర్స్, చైమీ వాండర్సే మతీషా పతిరానా, బినూర ఫెర్నాండో, అసిత ఫెర్నాండో. -
చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీ20 వరల్డ్‌కప్-2024లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. గ్రూపు-ఎ నుంచి సెమీస్ బెర్త్ ఖారారు చేసుకుంది.ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కైల్ మైర్స్(35) పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షమ్సీ 3 వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్, మార్క్రమ్, రబాడ తలా వికెట్ సాధించారు. అనంతరం 136 పరుగుల లక్ష్యంతో దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ప్రోటీస్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 123 పరుగులకు కుదించారు. అనంతరం 7 వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో దక్షిణాఫ్రికా తమ లక్ష్యాన్ని చేధించింది. ప్రోటీస్ బ్యాటర్లలో స్టబ్స్(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 3 వికెట్లు పడగొట్టారు.దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సౌతాఫ్రికా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20 వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ఈ ఏడాది మెగా టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన దక్షిణాప్రికా ఏడింటా గెలుపొందింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. 2009 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తాజా మ్యాచ్‌తో లంక రికార్డును ప్రోటీస్ బ్రేక్ చేసింది. -
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు రిచీ బెరింగ్టన్ సారథ్యం వహించనున్నాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న మైఖేల్ జోన్స్, పేసర్ బ్రాడ్ వీల్ తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. ఈ మెగా టోర్నీలో స్కాట్లాండ్ గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఒమన్, నమీబియాలతో పాటు ఉంది. స్కాట్లాండ్ జట్టు మే 26న ఈ పొట్టి వరల్డ్‌కప్ కోసం కరేబియన్ దీవులకు పయనం కానుంది. స్కాటిష్ జట్టు ట్రినిడాడ్‌లో ఆఫ్ఘనిస్తాన్, ఉగాండాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ప్రధాన టోర్నీలో స్కాట్లాండ్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 4 ఇంగ్లండ్‌తో తలపడనుంది.స్కాట్లాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టురిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఒలి హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ టియర్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్. -
విండీస్ క్రికెటర్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు థామస్‌పై ఐసీసీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. శ్రీలంక క్రికెట్ (SLC), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) అవినీతి నిరోధక నిబంధనలను థామస్ ఉల్లంఘించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. థామస్ కూడా తన నేరాన్ని అంగీకరించినట్లు ఐసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. లంక ప్రీమియిర్ లీగ్ 2021లో ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో గతేడాది థామస్‌పై ఐసీసీ తాత్కాలికంగా సస్సెన్షన్ వేటు వేసింది. అదే విధంగా యూఏఈ, కరీబియన్ లీగ్‌లో బుకీలు కలిసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు నేరం రుజువు కావడంతో ఐదేళ్ల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా అతడిపై ఐసీసీ బ్యాన్ విధించింది. ఇక విండీస్ తరఫున డెవాన్ ఒక టెస్ట్, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్‌లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్‌లు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో బౌలింగ్ సైతం చేసిన థామస్.. ఫార్మాట్‌కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు. -
శభాష్ షామర్.. సెక్యూరిటీ గార్డు టూ 'గబ్బా' హీరో
దాదాపు రెండేళ్ల క్రితం అతను బతుకుతెరువు కోసం ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే క్రికెట్‌పై పిచ్చి ఈ ఉద్యోగంలో నిలవనీయడం లేదు. ఇలాగే సాగితే తన జీవితం సెక్యూరిటీకే అంకితం అయిపోతుందని అతను భయపడ్డాడు. ఏదో సాహసం చేయాల్సిందేనని భావించాడు. కానీ ఒక్కసారిగా ఇంటి కష్టాలు కళ్ల ముందు నిలిచాయి. అయితే అతడి కలను నెరవేర్చేందుకు కుటుంబం అండగా నిలుస్తూ ధైర్యాన్ని నిపించింది. దాంతో దేనికైనా సిద్ధమే అంటూ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెడుతూ తన సాధన కొనసాగించాడు. రెండేళ్ల తర్వాత చూస్తే ప్రతిష్ఠాత్మక బ్రిస్బేన్ మైదానంలో ఆస్ట్రేలియా బ్యాటర్లను తన బౌలింగ్‌లో ఒక ఆటాడించాడు. తమకు ఘనమైన రికార్డు ఉన్న గాబా మైదానంలో ఆసీస్ ఆటగాళ్లు అతని బౌలింగ్ ముందు తలవంచారు. వేగవంతమైన బంతులతో చెలరేగిపోతుంటే జవాబు ఇవ్వలేక బ్యాట్లు ఎత్తేశారు. ఫలితంగా వెస్టిండీస్‌కు చిరస్మరణీయ విజయం. 24 ఏళ్ల ఆ బౌలర్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఎక్కడో గయానా అడవుల్లో పుట్టి పెరిగి ఈ స్థాయికి వచ్చిన ఆ కుర్రాడే పేస్ బౌలర్ షామర్ జోసెఫ్. అతని నేపథ్యం, ఆపై ఎదిగిన తీరు అసమానం, స్ఫూర్తిదాయకం. జనవరి 17, 2024...అంతర్జాతీయ క్రికెట్లో షామర్ జోసెఫ్ అరంగేట్రం చేసిన రోజు. అడిలైడ్ మైదానంలో తీవ్ర ఒత్తిడిలో తన మొదటి ఓవర్ వేసేందుకు అతను తన బౌలింగ్ రనప్ మొదలు పెట్టాడు. ఎదురుగా బ్యాటింగ్ చేస్తున్నది టెస్టు క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన స్టీవ్ స్మిత్. గుడ్ లెంగ్త్‌లో ఆఫ్‌స్టంప్‌పై పడిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన స్మిత్ దానిని నియంత్రించలేక మూడో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. అంతే... ఒక్కసారిగా విండీస్ శిబిరంలో సంబరాలు. టెస్టుల్లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసిన అత్యంత అరుదైన ఆటగాళ్ల జాబితాలో షామర్ చేరాడు. ఈ క్షణాన్ని ఫోటో ఫ్రేమ్ చేసిన తన ఇంట్లో పెట్టుకుంటానని అతను ప్రకటించాడు. అయితే ఆ ఆనందం అంతటితో ఆగిపోలేదు. మరో 11 రోజుల తర్వాత అది రెట్టింపైంది. 216 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 113 పరుగులకు 2 వికెట్లతో పటిష్ఠ స్థితిలో నిలిచిన దశలో షామర్ స్పెల్ కంగారూలను కుప్పకూల్చింది. విరామం లేకుండా బౌలింగ్ చేసిన అతను 7 వికెట్లతో ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిక్యం కనబర్చాడు. ఎప్పుడో షామర్ పుట్టక ముందే 27 ఏళ్ల క్రితం ఆసీస్‌ను వారి సొంతగడ్డపై విండీస్ ఆఖరిసారిగా ఓడించింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ఒక గెలుపు. ఇన్నాళ్లుగా ఒక విజయం కోసం ఎదురు చూస్తూ వచ్చిన నాటి దిగ్గజాలు బ్రియాన్ లారా, కార్ల్ హూపర్ కన్నీళ్లపర్యంతమవగా షామర్ వారి ముందు ఒక అద్భుతం చేసి చూపించాడు. సాధారణంగా తమను ఓడించిన ప్రత్యర్థులపై కసితో ఆమడ దూరం ఉండి ఆగ్రహాన్ని ప్రదర్శించే ఆసీస్ ఆటగాళ్లు కూడా బీరు గ్లాసులతో వేడుకల్లో జత కలిశారు. ఎందుకంటే ఈ విజయం విలువేమిటో అందరికీ తెలియడమే కాదు, షామర్ జోసెఫ్ గురించి తెలుసుకున్న తర్వాత వారందరూ మనస్ఫూర్తిగా అభినందించారు. కట్టెలు కొట్టడంతో మొదలై... గయానా దేశంలో న్యూ ఆమ్స్టర్డామ్ ఒక చిన్న పట్టణం. దాదాపు 20 వేల జనాభా ఉంటుంది. బెర్బిస్ నదీ తీరంలో ఈ పట్టణం ఉంటుంది. బెర్బిస్ ఉప నది కాంజే ద్వారా అక్కడి నుంచి దాదాపు 225 కిలో మీటర్లు పడవలో రెండు రోజుల పాటు ప్రయాణిస్తే, బరాకారా అనే చిన్న ఊరు వస్తుంది. జనాభా దాదాపు 400 మంది. ఇటీవలి వరకు అక్కడ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ అనే పేరు కూడా తెలీదు. ఊర్లో అందరికీ ఒకటే వృత్తి.. అడవిలోకి వెళ్లి చెట్లు కొట్టడం, వాటిని దుంగలుగా కట్టకట్టి కాంజే నది ద్వారానే న్యూ ఆమ్స్టర్డామ్ వరకు చేర్చి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం. షామర్ కుటుంబం కూడా అదే పనిలో ఉంది. ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్ల కుటుంబంలో అతను ఒకడు. అలాగే జీవితం సాగిపోతున్న సమయంలో అనూహ్యం జరిగింది. అడవిలో పని చేస్తున్న క్రమంలో ఒక పెద్ద జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. అర క్షణం తేడాతో షామర్ చావునుంచి తప్పించుకున్నాడు. దాంతో ఈ పనిని మానేయాలని అతను వెంటనే నిర్ణయించుకున్నాడు. అయితే ఉపాధి కోసం న్యూ ఆమ్స్టర్డామ్కే వెళ్లిపోయాడు. ముందు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో లేబర్‌గా పని చేశాడు. అక్కడ ఇబ్బందులు రావడంతో ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా చేరాడు. అప్పటికే క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్న షామర్ టేప్ బాల్‌తో బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు. అయితే వరుసగా 12 గంటల బ్యాంక్ ఉద్యోగం, అలసట కారణంగా ఆదివారాలు కూడా ఆడే అవకాశం లేకపోయేది. దాంతో ఒక గందరగోళ స్థితిలోకి వచ్చేశాడు. ఇలాంటి సమయంలో కుటుంబం మద్దతుగా నిలిచి ప్రోత్సహించింది. ‘నువ్వు ఇష్టపడే చోట కష్టపడు’ అంటూ ఒక ప్రయత్నం చేయమని, మిగతావారంతా కుటుంబ బాధ్యతలు తీసుకుంటామని అండగా నిలిచారు. దాంతో షామర్‌కు స్వేచ్ఛ దొరికినట్లయింది. అండగా అందరూ... టేప్ బాల్, రబ్బర్ బాల్, ప్లాస్టిక్ బాల్, నిమ్మకాయలు, జామకాయలు.. ఇలా అన్నింటిలోనూ షామర్‌కు క్రికెట్ బంతే కనిపించింది. బౌలింగ్‌ను ఇష్టపడిన అతను వీటన్నంటితో ఆడుతూనే వచ్చాడు. టీవీల్లో, పోస్టర్లలో కనిపించే నాటి దిగ్గజాలు ఆంబ్రోస్, వాల్ష్లపై మొదటినుంచీ అభిమానాన్ని పెంచుకొని వారినే అనుకరించే ప్రయత్నం చేశాడు. కష్టపడేవారికే అదృష్టం కూడా అండగా నిలుస్తుందనేది వాస్తవం. షామర్ విషయంలోనూ అది నిజమైంది. వేర్వేరు దశల్లో ఎంతోమంది షామర్‌కు సహాయం చేయడంతో అతను ముందంజ వేయగలిగాడు. ఉద్యోగం వదిలేసిన తర్వాత పూర్తిస్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టి అవకాశం దొరికిన చోటల్లా తనలోని సహజమైన బౌలింగ్ ప్రతిభను షామర్ ప్రదర్శించాడు. ఒక రోజు విండీస్ ఆల్‌రౌండర్ రొమారియా షెఫర్డ్ దృష్టి అతనిపై పడింది. ఇతనిలో ప్రత్యేక ప్రతిభ ఉందని గుర్తించిన షెఫర్డ్ తనకు సన్నిహితులైన అందరి వద్ద షామర్ గురించి చెబుతూ వచ్చాడు. అదే అతనికి వరుసగా అవకాశాలు కల్పించింది. గయానా కోచ్ ఎసన్ క్రాన్డన్, మాజీ కెప్టెన్ లియాన్ జాన్సన్, గయానా సీపీఎల్ జట్టు ప్రతిభాన్వేషి ప్రసన్న అగోరమ్...ఇలా అందరూ షామర్‌కు అండగా నిలిచేవారే. ముఖ్యంగా తనకు తల్లీ, తండ్రి లాంటివాడు అని షామర్ చెప్పుకున్న ప్రసన్న కారణంగానే తొలిసారి పెద్ద స్థాయిలో అతనికి క్రికెట్ టోర్నీ అవకాశం దక్కింది. ముందుగా డివిజన్ స్థాయి క్రికెట్లో బరిలోకి దిగి సత్తా చాటడంతో ఆ తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి చాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. తన పదునైన పేస్ బౌలింగ్‌ను మాత్రమే నమ్ముతున్న షామర్‌కు మరో సిఫారసు అవసరం లేకుండా పోయింది. సీపీఎల్‌లో చెలరేగడంతో గయానా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అవకాశం దక్కింది. ఏడాది తిరిగేలోగా వెస్టిండీస్ సీనియర్ జట్టులోకి ఎంపిక కావడం అతని పురోగతిని చూపిస్తోంది. ప్రతికూల పరిస్థితిని జయించి... షామర్ను హీరోగా మార్చిన బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్ చేయగలగడమే అనూహ్యం. అంతకు ముందు రోజు బ్యాటింగ్ చేస్తుండగా స్టార్క్ వేసిన యార్కర్‌కు అతని కాలి వేలికి తీవ్ర గాయమైంది. దాంతో మ్యాచ్ బరిలోకి దిగడమే సందేహంగా మారింది. అందుకే జట్టుతో పాటు మైదానంలోకి టీమ్ డ్రెస్‌తో కాకుండా క్యాజువల్‌గా వచ్చేశాడు. అయితే డాక్టర్ నొప్పి నివారణ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత మళ్లీ ఆడాలనే ఆలోచన కలిగింది. తన జట్టును ఓటమి నుంచి రక్షించేందుకు ఏదైనా చేయగలననే నమ్మకంతో అతను బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. ఏం జరిగినా ఆఖరి వికెట్ పడే వరకు నేను బౌలింగ్ ఆపను అంటూ కెప్టెన్ బ్రాత్వైట్కు చెప్పాడు. దాంతో హడావిడిగా సహాయక సిబ్బంది డ్రెస్ కోసం హోటల్ గదికి పరుగెత్తగా సహచరుడు జాకరీ మెకస్కీ జెర్సీని తీసుకున్న షామర్ నంబర్‌పై స్టికర్ అంటించి అంపైర్ అనుమతితో బరిలోకి దిగాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లు ముగిశాయి. చక్కగా ఆడుతున్న జట్టు విజయం దిశగా వెళుతోంది. 29వ ఓవర్‌తో షామర్ తన బౌలింగ్‌ను మొదలు పెట్టాడు. అంతే...కెప్టెన్‌కు మాట ఇచ్చినట్లుగా వరుసగా 11.5 ఓవర్లు వేసి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఒకటి, రెండు, మూడు.. ఇలా మొదలై చివరకు ఏడో వికెట్‌కు విండీస్‌ను గెలిపించి విజయనాదం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. టెస్టు క్రికెటర్‌గా షామర్ ఆట ఇప్పుడే మొదలైంది. రాగానే సంచలనం సృష్టించినా, ఆటగాడిగా ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అవరోధాలను దాటి, గాయాలను అధిగమించి పెద్ద కెరీర్ నిర్మించుకోవడం అంత సులువు కాదు. పైగా విండీస్‌లాంటి బలహీనమైన జట్టు తరఫున ఎప్పుడూ అద్భుతాలు సాధ్యం కావు. అయితే షామర్లో ప్రతిభను చూస్తే అతను ఈ ఒక్క ఘనతకే పరిమితం కాడనేది అంచనా. అన్నింటినీ మించి ఫలితాలను పక్కన పెడితే అతను ప్రస్తుతం సగర్వంగా నిలిచేందుకు సాగించిన ప్రస్థానం మాత్రం ఆటల్లో ఎదగాలనుకునే అందరికీ ప్రేరణ ఇస్తుందనేది మాత్రం వాస్తవం. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
వెస్టిండీస్ క్రికెటర్ ఊచ కోత.. కేవలం 26 బంతుల్లోనే!
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో షార్జా వారియర్స్ తొలి విజయం నమోదు చేసింది. సోమవారం దుబాయ్ వేదికగా దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో షార్జా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దుబాయ్ బ్యాటర్లలో సామ్ బిల్లింగ్స్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సికిందర్ రజా 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. షార్జా వారియర్స్ బౌలర్లలో డానియల్ సామ్స్ 3 వికెట్లు పడగొట్టగా.. తీక్షణ, క్రిస్ వోక్స్ తలా రెండు వికెట్లు సాధించారు. చార్లెస్ ఊచకోత.. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా వారియర్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షార్జా బ్యాటర్లలో విండీస్ ఓపెనర్ జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు బసిల్ హమిద్(24) ఆఖరిలో బౌండరీలు వర్షం కురిపించి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. చదవండి: AUS vs WI: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్వెల్.. -
వెస్టిండీస్ పై ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం
-
భారత క్రికెట్‌కు అహంకారం ఎక్కువైంది.. అందుకే ఇలా: వెస్టిండీస్ లెజెండ్
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి పాలైన భారత జట్టుపై వెస్టిండీస్ లెజెండ్ సర్ ఆండీ రాబర్ట్స్ ఘూటు వాఖ్యలు చేశాడు. అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే భారత జట్టు ఓడిపోయిందని అతడు విమర్శించాడు. కాగా లండన్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 209 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ జాబితాలో ఆండీ రాబర్ట్స్ కూడా చేరాడు. "భారత క్రికెట్‌కు అహంకారం ఎక్కవైంది. అందువల్ల ప్రపంచక్రికెట్లో మిగితా జట్లను తక్కువగా అంచనా వేస్తున్నారు. ఏదో ఒక్క కుప్పకూలిపోతారు అని నాకు తెలుసు. అందుకే భారత జట్టుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. టెస్ట్ క్రికెట్, పరిమిత ఓవర్ల క్రికెట్లో తమ లోపాలపై దృష్టి పెట్టాలి. తమ తీరును మార్చుకుని ముందుకు వెళ్లాలి. టీ20 క్రికెట్‌ను నేను పెద్దగా లెక్కలోని తీసుకోను. అందులో బ్యాట్ కు, బంతికి మధ్య సరైన పోటీనే లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ తమ బ్యాటింగ్ బలాన్ని ప్రదర్శిస్తుందని నేను ఊహించాను. అజింక్య రహానే పోరాటం మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. రహానే తన చేతికి గాయమైనప్పటికీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. శుబ్‌మన్ గిల్ కొన్ని షాట్లు మంచిగా ఆడాడు. కానీ అతడు లెగ్ స్టంప్‌పై నిలుచుని తన వికెట్‌ను కోల్పోయాడు. విరాట్ కోహ్లి కూడా అంతే. మిచెల్ స్టార్క్ వేసిన బంతికి కోహ్లి దగ్గర సమాధానమే లేకపోయింది. భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ విదేశాల్లో మాత్రం రాణించలేకపోతున్నారు" అని మిడ్డే ఫ్రమ్ ఆంటిగ్వాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్స్ పేర్కొన్నాడు. కాగా వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. చదవండి: Ashes 2023: సరికొత్త వార్నర్‌ను చూస్తాం.. అతడికి చుక్కలు చూపిస్తాడు: ఆసీస్ కెప్టెన్ -
పాకిస్తాన్ అల్రౌండర్ అరుదైన ఘనత.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా
పాకిస్తాన్ మహిళల జట్టు స్టార్ నిధా ధార్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిధాదార్ రికార్డులకెక్కింది. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ పడగొట్టిన నిధా.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు 130 మ్యాచ్‌లు ఆడిన ఆమె 126 వికెట్లు పడగొట్టింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ అనీషా మహ్మద్(125) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మహ్మద్ రికార్డును నిధా ధార్ బ్రేక్ చేసింది. ఇక టీ20 ప్రపంచకప్‌ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 114 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజాయం పాలైంది. చదవండి: T20 WC 2023: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలో తొలి జట్టుగా! -
వరల్డ్ కప్‌లో తుస్సుమనిపించాడు.. అక్కడ మాత్రం విధ్వంసం సృష్టిస్తున్నాడు!
అబుదాబి టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ మరో సారి విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్‌కు పూరన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా నార్తర్న్ వారియర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పూరన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 32 బంతులు ఎదుర్కొన్న పూరన్ 10 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 80 పరుగులు సాధించాడు. పూరన్ సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 10 ఓవర్లలో గ్లాడియేటర్స్ మూడు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అతడితో పాటు కోహ్లర్-కాడ్మోర్(32) పరుగులతో రాణించాడు. అనంతరం 139 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులకే పరిమితమైంది. వారియర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ఆడమ్ లైత్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన పూరన్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పూరన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో వెస్టిండీస్‌కు సారథ్యం వహించిన పూరన్.. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన పూరన్ కేవలం 25 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మెగా టోర్నీలో వెస్టిండీస్.. స్కాట్లాండ్, ఐర్లాండ్ వంటి పసికూన చేతిలో ఓడి క్వాలిఫియర్ రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ పూరన్ విండీస్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. The Gladiators captain is named Player of the Match for his outstanding innings 💪 8️⃣0️⃣ runs 3️⃣2️⃣ balls 2️⃣5️⃣0️⃣ strike rate @nicholas_47 🤝 #AbuDhabiT10 #InAbuDhabi #CricketsFastestFormat pic.twitter.com/lYIgKUTqwa — T10 League (@T10League) November 25, 2022 చదవండి: IND vs NZ: భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డే కష్టమే! -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చందర్‌పాల్, ఎడ్వర్డ్స్, ఖాదిర్
సిడ్నీ: వెస్టిండీస్ దిగ్గజం చందర్‌పాల్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ చార్లట్ ఎడ్వర్డ్స్, పాకిస్తాన్ దివంగత స్పిన్ లెజెండ్ అబ్దుల్ ఖాదిర్‌లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చారు. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ సందర్భంగా ముగ్గురు క్రికెటర్లకు ఐసీసీ పురస్కారాలు అందజేశారు. 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో చందర్ పాల్ అన్ని ఫార్మాట్లలో కలిపి 20,988 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు, 125 అర్ధసెంచరీలున్నాయి. ఇంగ్లండ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఎడ్వర్డ్స్‌కు ప్రత్యేక స్థానముంది. ఆమె సారథ్యంలోనే ఇంగ్లండ్ వన్డే, టి20 ఫార్మాట్లలో ప్రపంచకప్‌లు సాధించింది. పాక్ దిగ్గజ లెగ్ స్పిన్నర్ ఖాదిర్ 63 వయస్సులో (2019) కన్నుమూశారు. టెస్టు క్రికెటర్లలో అలనాటి గ్రేటెస్ట్ స్పిన్నర్‌గా వెలుగొందారు. 67 మ్యాచుల్లోనే 236 వికెట్లు తీసిన ఘనత ఆయనది. 1987లో ఇంగ్లండ్‌పై 56 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు. ఖాదిర్ తరఫున అతని కుమారుడు ఉస్మాన్ పురస్కారాన్ని అందుకున్నారు. చదవండి: Team India: ఐపీఎల్ బ్యాన్ చేస్తేనే దారిలోకి వస్తారా! -
టీ-20 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్
-
టీ20 మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన కరేబియన్ ఆటగాడు
-
ఉత్కంఠపోరులో విండీస్‌పై ఆసీస్ విజయం
క్వీన్స్‌ల్యాండ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి వరకు ఉత్కంత భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ వేడ్ తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరమ్వగా.. వేడ్, స్టార్క్ తమ జట్టు విజయాన్ని లాంఛనం చేశారు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, వేడ్ ఇన్నింగ్స్‌ను చక్క దిద్దారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 69 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం ఫించ్ ఔటైనప్పటికీ.. వేడ్ మాత్రం ఆచితూచి ఆడూతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫించ్ 52 బంతుల్లో 58 పరుగులు చేయగా.. వేడ్ 29 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. కాగా విండీస్ బౌలర్లలో కాట్రెల్, జోషఫ్ తలా రెండు వికెట్లు సాధించగా.. హోల్డర్, కారియా, స్మిత్ చెరో వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో కైల్ మైయర్స్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్ చెరో రెండు వికెట్లు సాధించారు. చదవండి: Womens Asia Cup 2022: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం -
'మురళీధరన్, నరైన్ కాదు.. ప్రపంచ క్రికెట్లో నేనే బెస్ట్ స్పిన్నర్'
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఫీల్డ్‌లో గానీ ఆఫ్‌ధి ఫీల్డ్‌లో గానీ ఎంతో ఉత్సహంగా ఉంటాడో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో సారి గేల్ తన ఫన్నీ కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం యూనివర్స్ బాస్ కరీబియన్ దీవులలో జరగబోయే సరికొత్త టోర్నీ 'సిక్స్టీ' లీగ్‌కు సిద్దమవుతున్నాడు. ఈ టోర్నీ టీ10 ఫార్మాట్లో జరగనుంది. ఈ లీగ్ బుధవారం(ఆగస్టు 24) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనివర్స్ బాస్ సరదా వాఖ్యలు చేశాడు. మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పేట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నా అని ఈ సందర్భంగా గేల్ తెలిపాడు. ఈ టోర్నీలో బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా రాణించాలని అనుకుంటున్నట్లు గేల్ వెల్లడించాడు. అదే విధంగా ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు తనే అత్యత్తుమ స్పిన్నర్ అని గేల్ ఫన్నీ కామెంట్లు చేశాడు. "నా బౌలింగ్ సహజమైనది. నేను కచ్చితంగా ఈ టోర్నీలో బౌలింగ్ చేస్తాను. మీకు తెలుసా..? ప్రపంచ క్రికెట్లో నేనే ఇప్పటి వరకు గ్రేట్ స్పిన్నర్‌ని. ముత్తయ్య మురళీధరన్ కూడా నాలా బౌలింగ్ చేయలేకపోయాడు. అతని కంటే నేను తక్కువ ఎకనామీతో బౌలింగ్ చేశాను. అదేవిధంగా సునీల్ నరైన్ కూడా నా దగ్గరకు రాలేడు" అని సరదాగా గేల్ వాఖ్యనించాడు. "మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పెట్టేందుకు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నాను. గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉండడంతో ఇది నా అరంగేట్ర మ్యాచ్‌గా భావిస్తున్నాను. ఈ టోర్నీతో మళ్లీ నా రిథమ్‌ను తిరిగి పొందుతాను. ఈ టోర్నీ నన్ను మరికొంత కాలం క్రికెట్ ఆడేలా సహాయపడుతుందని" యూనివర్స్ బాస్ పేర్కొన్నాడు. కాగా గేల్ చివరగా టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. -
తొలి సారి కెప్టెన్‌గా షిమ్రాన్ హెట్‌మైర్.. ఏ జట్టుకంటే..?
సీపీఎల్-2022 సీజన్‌కు గానూ గయానా అమెజాన్ వారియర్స్ కెప్టెన్‌గా విండీస్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్ ఎంపికయ్యాడు. నికోలస్ పూరన్ స్థానంలో గయానా సారథిగా హెట్‌మైర్ నియమితుడయ్యాడు . ఈ ఏడాది సీజన్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున నికోలస్ పూరన్ ఆడనుండడంతో గయానా మేనేజేమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. హెట్‌మైర్ 2016లో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అగేంట్రం చేసినప్పటి నుంచి అమెజాన్ వారియర్స్ జట్టలోనే కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు పూరన్, షోయబ్ మాలిక్, క్రిస్ గ్రీన్ కెప్టెన్సీలో గయానాకు ప్రాతినిధ్యం వహించాడు. "2013 సీజన్ తర్వాత మా తొలి కెప్టెన్‌గా షిమ్రాన్ హెట్‌మైర్ నియమితుడైనందుకు మేము సంతోషిస్తున్నాము. గత కొన్ని సీజన్ల నుంచి హెట్‌మైర్ మా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అతడు నాయకత్వం వహించడానికి ఇదే సరైన సమయం" అని అమెజాన్ వారియర్స్ చైర్మన్ బాబీ రామ్‌రూప్ పేర్కొన్నారు. ఇక సీపీఎల్‌లో ఇప్పటివరకు 47 మ్యాచ్‌లు ఆడిన హెట్‌మైర్ 1149 పరుగులు సాధించాడు. కాగా కరీబీయన్ ప్రీమియర్ లీగ్ ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో జమైకా తల్లావాస్, సెయింట్ కిట్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: ENG vs SA: పాపం ప్రోటీస్ కెప్టెన్.. దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుంది! -
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన విండీస్! యువ స్పిన్నర్ ఎంట్రీ
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌తో వెస్టిండీస్ యువ స్పిన్నర్ కెవిన్ సింక్లెయిర్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటి వరకు టీ20ల్లో విండీస్ తరపున 6 మ్యాచ్‌లు ఆడిన సింక్లెయిర్.. 8.33తో ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా తన లిస్ట్-ఏ కెరీర్లో 16 మ్యాచ్‌లు ఆడిన సింక్లెయిర్ 18 వికెట్లు సాధించాడు. మరో వైపు రోస్టన్ ఛేజ్ గాయం కారణంగా ఈ సీరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో విండీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనుంది. మూడు వన్డేలు కూడా కింగ్స్టన్ ఓవల్ వేదికగానే జరగనున్నాయి. కాగా ప్రస్తుతం విండీస్.. కివీస్‌తో టీ20 సిరీస్‌లో తలపడుతోంది. కింగ్స్టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్ 1-0తో అధిక్యంలో ఉంది. కాగా స్వదేశంలో భారత్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను విండీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కివీస్‌తో వన్డే సిరీస్‌కు విండీస్ జట్టు నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లైర్. చదవండి: Asia Cup 2022: 'ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వద్దు.. అతడినే రోహిత్ జోడిగా పంపండి' -
హెట్‌మైర్ అద్భుత విన్యాసం.. క్యాచ్ ఆఫ్‌ది సీజన్!
కింగ్స్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్ సంచలన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కళ్లు చెదిరే రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టి ప్రత్యర్థి బ్యాటర్‌ను షాక్‌కు గురిచేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన ఒడియన్ స్మిత్ బౌలింగ్‌లో మూడో బంతిని మార్టిన్ గుప్టిల్ భారీ షాట్ ఆడాడు. అయితే అది సిక్స్ వెళ్తుందన్న క్రమంలో.. పాయింట్ దశలో ఫీల్డింగ్ చేస్తున్న హైట్‌మైర్ పరుగెత్తుకుంటూ సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు విండీస్ వికెట్ కీపర్ డెవాన్ థామస్ కూడా అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. గుప్టిల్ ఔటైన తర్వాతి బంతికే కాన్వే ఇచ్చిన క్యాచ్‌ను థామస్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. What a catch from @SHetmyer! A display of brilliant athleticism to get @Martyguptill's wicket. Watch all the action from the New Zealand tour of West Indies LIVE, only on #FanCode 👉https://t.co/6aagmd7vyt@windiescricket @BLACKCAPS#WIvNZ pic.twitter.com/oAmqHi8sy0 — FanCode (@FanCode) August 11, 2022 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కివీస్‌పై 13 పరుగుల తేడాతో విండీస్ పరాజాయం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. విలియమ్సన్(47),డెవాన్ కాన్వే(43) పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో స్మిత్ మూడు వికెట్లు, హోల్డర్, మోకాయ్ తలా వికెట్ సాధించారు. ఇక 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, సౌథీ, సోధి తలా వికెట్ సాధించారు. కాగా విండీస్ బ్యాటర్లో ఓపెనర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలచాడు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 ఆగస్టు 13న జరగనుంది. #DevonConway caught behind and what a spectacular piece of wicket keeping it was! Watch all the action from the New Zealand tour of West Indies LIVE, only on #FanCode 👉https://t.co/6aagmd7vyt@windiescricket @BLACKCAPS#WIvNZ pic.twitter.com/WWDC2GpuRP — FanCode (@FanCode) August 11, 2022 చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. ప్రాక్టీస్ షురూ చేసిన కింగ్ కోహ్లి! -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్లు.. ఇదే తొలి సారి!
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా స్పిన్నర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత స్పిన్నర్లు ఏకంగా 10కి 10 వికెట్లు పడగొట్టారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థి జట్టు మొత్తం 10 వికెట్లు స్పిన్నర్లు తీయడం ఇదే తొలి సారి. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు సాధించగా.. రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..ఫ్లోరిడా వేదికగా ఐదో టీ20లో విండీస్‌పై భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 188 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(40 బంతుల్లో 64 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపక్ హుడా 38 పరుగులు చేసి రాణించాడు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ భారత స్పిన్నర్ల ధాటికి 100 పరుగులకే కుప్ప కూలింది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు జట్టును భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
ఒబెడ్ మెకాయ్ ఇరగదీశాడు.. కానీ ఆ రికార్డు ఇప్పటికీ దీపక్ చహర్‌దే!
సెయింట్స్ కిట్స్ వేదికగా సోమవారం భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మెకాయ్ తన టీ20 కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ కోటాలో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలో మెకాయ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ ఘనతను నాలుగురు బౌలర్లు అందుకున్నారు. అజంతా మెండిస్ రెండు సార్లు ఆరు వికెట్ల ఫీట్‌ను నమోదు చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దీపక్ చహర్(6/7, బంగ్లాదేశ్‌పై), అజంతా మెండిస్(6/8, జింబాబ్వేపై), అజంతా మెండిస్ (6/16, ఆస్ట్రేలియాపై), యజ్వేంద్ర చహల్(6/25, ఇంగ్లండ్‌పై ), ఆస్టన్ ఆగర్(6/30, న్యూజిలాండ్‌పై) ఉన్నారు. అయితే అత్యంత తక్కువ పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టిన రికార్డు మాత్రం భారత పేసర్ దీపక్ చహర్ పేరిట ఉంది. చహర్ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చాహర్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక జింబాబ్వేపై 8 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టిన శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: Asia Cup 2022 Schedule: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
8 ఏళ్ల తర్వాత విండీస్ టూర్‌కు న్యూజిలాండ్.. కేన్ మామ వచ్చేశాడు..!
వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఇక గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ సిరీస్‌తో తిరిగి బరిలోకి దిగబోతున్నాడు. అదే విధంగా సీనియర్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక 2014 తర్వాత కివీస్ కరేబియన్ పర్యటనకు వెళ్లనుంది. విండీస్ పర్యటనలో భాగంగా కివీస్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 10న జమైకా వేదికగా జరగనున్న తొలి టీ20తో న్యూజిలాండ్ టూర్ ప్రారంభం కానుంది. కాగా ఇటీవల ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన కివీస్ తమ సీనియర్ ఆటగాళ్లు లేకుండానే వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ వన్డే, టీ20 జట్టు కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్, సోధీ ,టిమ్ సౌథీ చదవండి: Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్ సేనకు భారీ షాక్! ఆలస్యంగా వెలుగులోకి.. -
వెస్టిండీస్‌తో తొలి టీ20.. తీవ్ర అస్వస్థతకు గురైన బంగ్లా ఆటగాళ్లు..!
వెస్టిండీస్‌తో తొలి టీ20కు ముందు బంగ్లాదేశ్ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. సెయింట్ లూసియా నుంచి డొమినికాకు ఐదు గంటలు పాటు సముద్ర మార్గం గుండా ప్రయాణం చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే బంగ్లా ఆటగాళ్లలో చాలా మంది ఇప్పటి వరకు సముద్ర ప్రయాణం చేయలేదు. దీంతో ఫెర్రీ(వ్యాపార నౌక) బయలుదేరగానే చాల మంది ఆటగాళ్లు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. వీరిలో ముఖ్యంగా షోరీఫుల్ ఇస్లాం, నఫీస్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు "ఫెర్రీ సముద్రం మధ్యలోకి చేరుకోగానే అలలు మొదలయ్యాయి. ఇది పెద్ద ఫెర్రీ కాదు కాబట్టి, అలలు కారణంగా ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఫెర్రీ విపరీతంగా ఊగింది. ఫలితంగా, క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారని" బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో పేర్కొంది. "నేను చాలా దేశాలు తిరిగాను. కానీ సముద్ర మార్గం గుండా ప్రయాణించడం ఇదే తొలి సారి. మాలో ఎవరికీ ఇటువంటి ప్రయాణాలు అలవాటు లేదు. ఆ సమయంలో మేము ఆట గురించి మర్చిపోయాం.ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలి అనుకున్నాము. ఇది నా జీవితంలో అత్యంత చెత్త పర్యటన" అని బంగ్లాదేశ్ క్రికెటర్ ఒకరు పేర్కొన్నారు. ఇక ఇరు జట్లు మధ్య తొలి టీ20 డొమినికా వేదికగా శనివారం జరగనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో ఓటమి చెందిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్‌నైనా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. చదవండి: Rishabh Pant Century: పంత్ సెంచరీ... సాధారణంగా ద్రవిడ్ ఇలా రియాక్ట్ అవ్వడు! వైరల్ వీడియో! -
బంగ్లాదేశ్‌పై విండీస్ ఘన విజయం.. సిరీస్ కైవసం..!
సెయింట్ లూసియా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 13 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 2.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా చేధించింది. ఓవర్‌నైట్ స్కోరు 132/6తో నాలుగో రోజు ఆటను మొదలు పెట్టిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులకు ఆలౌటైంది. కేవలం 13 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించగలగింది. బంగ్లా బ్యాటర్లలో నూరుల్ హసన్ (60) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక విండీస్ బౌలర్లలో రోచ్, జోషఫ్, ఫిలిఫ్ తలా మూడు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కైల్ మైయర్స్(146) సెంచరీతో చెలరేగాడు. బంగ్లా బౌలర్లలో ఖలీద్ అహ్మద్ 5 వికెట్లు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కైల్ మైయర్స్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. చదవండి: Ind Vs Eng 5th Test: "టీమిండియా ఓపెనర్‌గా గిల్ వద్దు.. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి" Kyle Mayers takes the #MastercardPricelessMoment of the match with his stunning century!🔥 #WIvBAN pic.twitter.com/8C3EAYUzbR — Windies Cricket (@windiescricket) June 27, 2022 -
వెస్టిండీస్ కెప్టెన్‌గా హేలీ మాథ్యూస్..
వెస్టిండీస్ మహిళల జట్టు కెప్టెన్‌గా స్థాఫనీ టేలర్ శకం ముగిసింది. ఆమె స్థానంలో సారథిగా ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్‌ను క్రికెట్ వెస్టిండీస్ నిమించింది. 2012లో వెస్టిండీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన టేలర్ దాదాపు 10 ఏళ్ల పాటు సారథిగా సేవలు అందించింది. టేలర్ సారథ్యంలో 55 టీ20లు, 62 వన్డేల్లో తలపడిన విండీస్.. వరుసగా 29, 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆమె కెప్టెన్సీలో 2016 టీ20 ప్రపంచకప్‌ను విండీస్ కైవసం చేసుకుంది. ఇక మాథ్యూస్ గత కొన్నేళ్లుగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంది. మాథ్యూస్ ఇప్పటివరకు వెస్టిండీస్‌కు 69 వన్డేలు,61 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించింది. "వెస్టిండీస్ మహిళల జట్టుకు కెప్టెన్‌గా అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. జట్టును విజయ పథంలో నడిపించడానికి నా వంతు కృషిచేస్తాను. అదే విధంగా గత ఎనిమిదేళ్లగా టేలర్ సారథ్యంలో ఆడినందుకు గర్వపడుతున్నాను. నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడంలో టేలర్ కీలక పాత్ర పోషించందని" మాథ్యూస్ పేర్కొంది. చదవండి: India Tour Of West Indies 2022: సర్కారు వారి ఛానల్లో టీమిండియా మ్యాచ్‌లు -
బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
నార్త్ సౌండ్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 84 పరుగుల విజయలక్ష్యాన్ని వెస్టిండీస్ 22 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 49/3తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ మరో వికెట్ కోల్పోకుండా విజయానికి అవసరమైన పరుగులను సాధించింది. జాన్ క్యాంప్‌బెల్ (58 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, బ్లాక్‌వుడ్ (26 నాటౌట్; 2 ఫోర్లు) రాణించాడు. మ్యాచ్ మొత్తంలో ఏడు వికెట్లు తీసిన విండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..! -
ఇంగ్లండ్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్న జో రూట్!
వెస్టిండీస్ పర్యటన అనంతరం ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు జో రూట్ హింట్ ఇచ్చాడు. సిరీస్‌లో అఖరి టెస్టులో వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్ తలపడతోంది. తొలి రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగియడంతో చివరి మ్యాచ్‌లో సత్తా చాటాలని ఇరు జట్లు బావిస్తోన్నాయి. ఈ క్రమంలో విలేకేరుల సమావేశంలో మాట్లాడిన జో రూట్ కీలక వాఖ్యలు చేశాడు. "ఇటువంటి సమయంలో జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు నేనే సరైన వ్యక్తినని భావిస్తున్నాను. కానీ, మాకు ప్రస్తుతం ప్రధాన కోచ్ లేడు. ప్రధాన కోచ్ వచ్చి భిన్నంగా ఆలోచిస్తే, కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. నేను ఇంగ్లండ్ జట్టుకు పెద్ద అభిమానిని. మా జట్టు ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా ఉండాలి అని ఎప్పడూ కోరుకుంటాను. కాబట్టి మేనేజెమెంట్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి నేను కట్టుబడి ఉంటాను. ఇప్పటి వరకు జట్టును అత్యుత్తమ స్థితిలో ఉంచడానికి నా వంతు నేను కృషి చేశాను. కెప్టెన్‌గానే కాకుండా జట్టు సభ్యడిగా కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను" అని రూట్ పేర్కొన్నాడు. ఇక వెటరన్ బ్యాటర్ అలిస్టర్ కుక్ రాజీనామా చేసిన తర్వాత 2017లో జో రూట్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రూట్ ఇప్పటి వరకు 63 టెస్టులకు సారథ్యం వహించాడు. అయితే ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి తర్వాత రూట్‌పై విమర్శలు వెల్లు వెత్తాయి. అంతే కాకుండా వెంటనే ఇంగ్లండ్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని మాజీలు డిమాండ్ చేశారు. మరో వైపు యాషెస్ సిరీస్‌లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవి నుంచి క్రిస్ సిల్వర్ వుడ్ తప్పుకున్నాడు. అప్పటి నుంచి రూట్ కూడా కెప్టెన్సీ తప్పుకుంటాడని వార్తలు వినిసిస్తున్నాయి. అయితే తాజాగా రూట్ చేసిన వాఖ్యలు ఆ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. చదవండి: భారత అభిమానులకు గుడ్ న్యూస్.. మూడు వన్డేలు, ఐదు టీ20లు.. ఏ జట్టుతో అంటే! -
పాకిస్తాన్ సంచలన విజయం.. పదమూడేళ్ల తర్వాత తొలిసారి!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. హామిల్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. కాగా 2009 తర్వాత పాకిస్తాన్ తొలిసారి ప్రపంచకప్‌లో విజయం సాధించింది. ఇక వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెండీస్.. పాకిస్తాన్ స్పిన్నర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగుల మాత్రమే చేయగల్గింది. పాక్ స్పిన్నర్ నిదా దార్ కేవలం 10 పరుగుల మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ డాటిన్(27) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇక 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాక్ బ్యాటర్లలో మునీబా అలీ(37), కెప్టెన్ మహారూప్(20)పరుగులతో రాణించారు. చదవండి: IPL 2022: 'ఢిల్లీ జట్టు చాలా వీక్.. ఓపెనర్‌గా న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు' -
పక్షిలా గాల్లోకి ఎగిరి.. సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫీల్డర్ డియాండ్రా డాటిన్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన షామిలియా కన్నెల్ బౌలింగ్‌లో.. లారెన్ విన్ఫీల్డ్ హిల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడింది. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న డాటిన్ జంప్ చేస్తూ సింగిల్ హ్యండ్ క్యాచ్ అందుకుంది. దీంతో ఒక్క సారిగా బ్యాటర్‌తో పాటు, తోటి ఫీల్డర్లు షాక్‌కు గురయ్యారు. ఇక 16 పరుగులు చేసిన విన్ఫీల్డ్ నిరాశతో పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ప్రస్తుతం డాటిన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఒక్క క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. విన్ఫీల్డ్ ఔటయ్యాక ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను విండీస్ మట్టికరిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డియాండ్రా డాటిన్(31),హేలే మాథ్యూస్(45), కాంప్‌బెల్(66) పరుగులతో రాణించారు. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 218 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టామీ బీమౌంట్(46), ఎక్లెటన్ (33), క్రాస్ (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IPL 2022- RCB New Captain: అప్డేట్ ఇచ్చిన కోహ్లి.. వావ్ మళ్లీ భయ్యానే కెప్టెన్! Diving Deandra Dottin takes a screamer in West Indies' 7 run win over England at the World Cup.@abcsport #CWC22 #ENGvWI vision: Fox Sports pic.twitter.com/GFL4yctvtZ — Duncan Huntsdale (@duncs_h) March 9, 2022 -
వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన
రంగియోరా (న్యూజిలాండ్): వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో ప్రాక్టీస్ పోరులో భారత జట్టు 81 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. ఓపెనర్ స్మృతి మంధాన (67 బంతుల్లో 66; 7 ఫోర్లు), దీప్తి శర్మ (64 బంతుల్లో 51; 1 ఫోర్) అర్ధ సెంచరీలు చేశారు. యస్తిక భాటియా (42; 5 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (30; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. దీంతో మొదట భారత్ 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. తర్వాత విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. -
స్పిన్నర్‌గా మారిన పొలార్డ్.. ముంబై ఇండియన్స్‌కు ఇక.. వీడియో వైరల్
వెస్టిండీస్ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ సరికొత్త అవతారం ఎత్తాడు. సాదారణంగా మీడియం పేస్ బౌలింగ్ చేసే పొలార్డ్.. తొలి సారి స్పిన్నర్‌గా మారాడు. ట్రినిడాడ్ టీ10 బ్లాస్ట్‌లో భాగంగా స్కార్లెట్ ఐబిస్ స్కార్చర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోకా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ అందరనీ ఆశ్చర్య పరిచాడు. సోకా కింగ్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన పొలార్డ్ స్పిన్ బౌలింగ్ చేయడమే కాకుండా.. బ్యాటర్ లియోనార్డో జూలియన్‌ను క్లీన్ బౌల్డ్ కూడా చేశాడు.ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన పొలార్డ్ 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కాగా పొలార్డ్ బౌలింగ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మంబైకు కొత్త స్పిన్నర్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సోకా కింగ్స్ నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. అయితే వర్షం కారణంగా టార్గెట్‌ను 8 ఓవర్లకు 122 పరుగులకు కుదించారు. ఇక 122 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కార్చర్స్ మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులకు మాత్రమే పరిమితమైంది. అయితే స్కార్చర్స్ కెప్టెన్ పొలార్డ్ మాత్రం కేవలం 8 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌కు పొలార్డ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. Kieron Pollard bowling off-spin in the Trinidad T10 Blast.pic.twitter.com/rN0mq04II8 — Johns. (@CricCrazyJohns) February 28, 2022 -
టీమిండియాపై అదరగొట్టాడు.. వేలంలో జాక్ పాట్!
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌కి ఐపీఎల్-2022 మెగా వేలంలో భారీ ధర దక్కింది. స్మిత్ కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ రూ. 6కోట్లకు కొనుగోలు చేసింది. కాగా భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో స్మిత్ అద్భుతంగా రాణించాడు. టీమిండియాతో రెండు వన్డేలు ఆడిన స్మిత్ 60 పరుగలతో పాటు, మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2021లో కూడా స్మిత్ రాణించాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా స్మిత్ నిలిచాడు. స్మిత్ బ్యాట్‌తోను, బాల్‌తోను విద్వంసం సృష్టించగలడు. అందుకే పంజాబ్ అతడిని పోటీ పడి మరి దక్కించుకుంది. ఇక రెండో రోజు వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు భారీ ధర దక్కింది. వేలంలో లివింగ్‌స్టోన్‌ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. చదవండి: IPL 2022 Mega Auction: టీమిండియా కెప్టెన్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ధర ఎంతంటే! -
యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం.. 8 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లపై వేటు!
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభావం పొందిన ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టెస్టులకు 16 మంది సభ్యలుతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. అయితే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు మందు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. యాషెస్ సిరీస్‌లో పాల్గొన్న ఎనిమిది మంది ఆటగాళ్లపై సెలెక్షన్ ప్యానల్ వేటు వేసింది. జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, హసీబ్ హమీద్ . డేవిడ్ మలన్ సహ మరికొంత మంది ఆటగాళ్లపై వేటు పడింది. అలెక్స్ లీస్,మాథ్యూ ఫిషర్ వంటి యువ ఆటగాళ్లు ఇంగ్లండ్ తరుపున టెస్టుల్లో అరంగట్రేం చేయనున్నారు. ఇక ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్- వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మార్చి 8న ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జొనాథన్ బెయిర్‌స్టో, జాక్ క్రాలీ, మాథ్యూ ఫిషర్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, సాకిబ్ మహమూద్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పార్కిన్సన్, ఒల్లీ పోప్, బెన్ స్టీక్ రాబిన్సన్ , క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా! -
మనదే యువ ప్రపంచం
కరోనా కారణంగా కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా... మెగా ఈవెంట్ ప్రారంభమయ్యాక జట్టులోని ఆరుగురు కరోనా బారిన పడటం... అదృష్టంకొద్దీ మ్యాచ్‌లో ఆడేందుకు 11 మంది అందుబాటులో ఉండటం... ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో పోరాటం... వెరసి అండర్–19 వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో యువ భారత్ ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోర్నమెంట్‌ను అజేయంగా ముగించి సగర్వంగా స్వదేశానికి పయనమైంది. టోర్నీ మొత్తంలో ఏ ఒక్కరిపైనో భారత్ సంపూర్ణంగా ఆధారపడలేదు. అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్, షేక్ రషీద్, యశ్ ధుల్, నిశాంత్, రాజ్ బావా, విక్కీ ఒస్త్వాల్, రవి కుమార్... ఇలా ప్రతి సభ్యుడూ తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. తమ కెరీర్లో చిరస్మరణీయ ఘట్టాలను లిఖించుకున్నారు. న్యూఢిల్లీ: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన యువ భారత్ జట్టు అండర్–19 ప్రపంచకప్‌లో తమదైన ముద్ర వేసింది. ఏకంగా ఐదోసారి జగజ్జేతగా నిలిచి తమ పట్టు నిలబెట్టుకుంది. ఇప్పటివరకు 14 సార్లు అండర్–19 ప్రపంచకప్ జరగ్గా... యువ భారత్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, మూడుసార్లు రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆంటిగ్వాలో శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్ బౌలర్లు రాజ్ బావా (5/31), రవి కుమార్ (4/34) అదరగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు), నిశాంత్ సింధు (54 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. రాజ్ బావా (54 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ దినేశ్ (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన రాజ్ బావా ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు అందుకున్నాడు. టోర్నీ మొత్తంలో 506 పరుగులు చేసి, 7 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవల్డ్ బ్రెవిస్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు. బీసీసీఐ అభినందన... అన్ని విభాగాల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి విజేతగా అవతరించిన యువ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ప్రశంసల వర్షం కురిపించారు. రికార్డుస్థాయిలో ఐదోసారి ఈ మెగా ఈవెంట్లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 40 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. కోచ్, ఇతర సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేయనున్నారు. ‘అన్ని విభాగాల్లో మన కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తమ శిబిరంలో కరోనా కలకలం రేపినా అందుబాటులో ఉన్న వారితో ముందుకు దూసుకెళ్లారు. హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ నిరంతరం కుర్రాళ్లలో ఉత్సాహం నింపారు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. సత్కారం... ఇంగ్లండ్‌పై ఫైనల్లో విజయం తర్వాత యువ భారత జట్టు అంటిగ్వా నుంచి గయానాలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి వెళ్లింది. భారత హై కమిషనర్ కేజే శ్రీనివాస భారత జట్టును సన్మానించారు. ఆ తర్వాత టీమిండియా గయానా నుంచి ఆదివారం సాయంత్రం స్వదేశానికి పయనమైంది. అమ్‌స్టర్‌డామ్ మీదుగా బెంగళూరు చేరుకోనున్న భారత జట్టు సభ్యులు అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ సీనియర్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అహ్మదాబాద్ చేరుకున్నాక బీసీసీఐ అధికారికంగా యువ జట్టును సత్కరించి రివార్డులు అందజేయనుంది. ప్రధాని శుభాకాంక్షలు ప్రపంచకప్ నెగ్గిన భారత అండర్–19 జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. యువ జట్టు తమ ప్రదర్శనతో భారత భవిష్యత్ క్రికెట్ సురక్షితంగా ఉందని చాటి చెప్పిందని ఆయన అన్నారు. ‘యువ క్రికెటర్లను చూసి గర్వపడుతున్నాను. అండర్–19 ప్రపంచకప్ సాధించినందుకు అభినందనలు. అత్యున్నతస్థాయి టోర్నీలో ఆద్యంతం వారు నిలకడగా రాణించి భారత క్రికెట్ భవితకు ఢోకా లేదని నిరూపించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. యువ జట్టు విజయం వెనుక బీసీసీఐ పాత్ర కూడా ఉంది. కొన్నేళ్లుగా అండర్–16, అండర్–19, అండర్–23 స్థాయిలో భారీ సంఖ్యలో మ్యాచ్‌లు, టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా కాస్త ఇబ్బంది ఎదురైన మాట నిజమే. ఈ నేపథ్యంలో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకున్నా భారత యువ జట్టు ఈసారి ప్రపంచకప్‌ను సాధించడం గొప్ప ఘనతగా భావించాలి. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. –వీవీఎస్ లక్ష్మణ్, ఎన్సీఏ హెడ్ -
విండీస్‌తో భారత్ తొలి పోరు.. రోహిత్ వచ్చేశాడు!
అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ ‘సహస్ర’ సమరానికి సై అంటోంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేడు జరుగనుంది. కొత్త నాయకుడు రోహిత్ శర్మ తనకు లభించిన ఈ వెయ్యో వన్డేలో గెలిచి... తన సారథ్యానికి విజయబాట వేసుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురైన చేదు అనుభవాన్ని ఈ విజయంతో తుడిచి పెట్టాలని టీమిండియా సహచరులు పట్టుదలతో ఉన్నారు. అహ్మదాబాద్: దక్షిణాఫ్రికా గడ్డపై క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టును స్వదేశంలో కోవిడ్ చుట్టుముట్టింది. అయినా సరే సొంతగడ్డ అనుకూలతలతో, కొత్తగా రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా 1000వ వన్డే పోరాటానికి సిద్ధమైంది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన హోరాహోరీ టి20 సిరీస్‌లో విజయం సాధించిన ఉత్సాహంతో వెస్టిండీస్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో శుభారంభం చేయాలని కరీబియన్ జట్టు తహతహలాడుతోంది. ఇరు జట్లను అనుభవజ్ఞుల కొరత వేధిస్తోంది. వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్, కరోనాతో ధావన్, శ్రేయస్, రుతురాజ్, సైనీలు దూరమవగా... మయాంక్ అగర్వాల్ క్వారంటైన్ పూర్తి కాలేదు. దీంతో భారత్ ఓపెనింగ్‌కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఇషాన్ కిషన్. కెప్టెన్ రోహిత్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. చాన్నాళ్ల తర్వాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు బరిలోకి దిగే అవకాశం రాగా... గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ తుది బెర్త్ కోసం దీపక్ హుడాతో పోటీపడనున్నాడు. ఇద్దరు ఆల్‌రౌండర్లు కావడంతో ఒకరికే ఛాన్సుంది. మరోవైపు విండీస్ జట్టుకు గాయంతో హెట్‌మైర్, కోవిడ్‌తో ఎవిన్ లూయిస్ దూరమయ్యారు. దీంతో కొత్త కుర్రాళ్లు ఒడియన్ స్మిత్, రొమరియో షెఫర్డ్, బ్రాండన్ కింగ్‌లతో భారత్‌తో సమరానికి సిద్ధమైంది. 999:ఇప్పటివరకు భారత్ 999 వన్డేలు ఆడింది. 518 మ్యాచ్‌ల్లో గెలిచింది. 431 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 9 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. 41 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. స్వదేశంలో భారత్ 345 వన్డేలు ఆడింది. ఇందులో 202 విజయాలు, 131 పరాజయాలు ఉన్నాయి. 3 మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. 9 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. విదేశాల్లో భారత్ 654 వన్డేలు ఆడింది. ఇందులో 316 విజయాలు, 300 పరాజయాలు ఉన్నాయి. 6 మ్యాచ్‌లు ‘టై’కాగా, 32 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. 1974: భారత్ తమ తొలి వన్డేను 1974 జూలై 13న లీడ్స్‌లో ఇంగ్లండ్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్లతో ఓడింది. వన్డేల్లో భారత్ తొలి విజయాన్ని 1975 ప్రపంచకప్‌లో ఈస్ట్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో అందుకుంది. 19:భారత్ ఇప్పటి వరకు మొత్తం 19 దేశాలతో వన్డే మ్యాచ్‌లు ఆడింది. శ్రీలంకతో అత్యధికంగా 162 మ్యాచ్‌లను భారత్ ఆడింది. ఆ తర్వాతి వరుసలో ఆస్ట్రేలియా (143), వెస్టిండీస్ (133), పాకిస్తాన్ (132), న్యూజిలాండ్ (110), ఇంగ్లండ్ (103), దక్షిణాఫ్రికా (87), జింబాబ్వే (63), బంగ్లాదేశ్ (36), కెన్యా (13), అఫ్గానిస్తాన్ (3), ఐర్లాండ్ (3), యూఏఈ (3), నెదర్లాండ్స్ (2), హాంకాంగ్ (2), బెర్ముడా (1), ఈస్ట్ ఆఫ్రికా (1), నమీబియా (1), స్కాట్లాండ్ (1) ఉన్నాయి. 418: వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోరు. 2011 డిసెంబర్ 8న ఇండోర్ లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 418 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (219) డబుల్ సెంచరీ సాధించాడు. 26: వన్డేల్లో భారత జట్టుకు 26 మంది కెప్టెన్‌గా వ్యవహరించారు. ధోని అత్యధికంగా 200 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. ఆ తర్వాతి వరుసలో అజహరుద్దీన్ (174), గంగూలీ (146), కోహ్లి (95), ద్రవిడ్ (79), కపిల్ దేవ్ (74), సచిన్ (73), గావస్కర్ (37), వెంగ్‌సర్కార్ (18), అజయ్ జడేజా (13), శ్రీకాంత్ (13), రైనా (12), సెహ్వాగ్ (12), రవిశాస్త్రి (11), రోహిత్ శర్మ (10), వెంకట్రాఘవన్ (7), గంభీర్ (6), బేడీ (4), ధావన్ (3), కేఎల్ రాహుల్ (3), రహానే (3), వాడేకర్ (2), అమర్నాథ్ (1), కిర్మాణీ (1), విశ్వనాథ్ (1), కుంబ్లే (1) ఉన్నారు. 54: వన్డేల్లో భారత్ అత్యల్ప స్కోరు. 2000 అక్టోబర్ 29న షార్జాలో శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ 26.3 ఓవర్లలో 54 పరుగులకు ఆలౌటైంది. -
షారుక్ ఖాన్, సాయి కిషోర్‌లకి బంపర్ ఆఫర్.. ఏకంగా టీమిండియాకు!
స్వదేశలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే వన్డే ,టీ20 సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే వెస్టిండీస్‌తో జరగనున్న వైట్-బాల్ సిరీస్ కోసం తమిళనాడు స్టార్ ఆటగాళ్లు షారుక్ ఖాన్ , సాయి కిషోర్‌లను టీమిండియా బ్యాకప్‌గా బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హాజారే టర్నమెంట్లో వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. భారత్- విండీస్ సిరీస్ సమయంలో ఏ ఆటగాడైనా కరోనా బారినా పడితే వీరిద్దరూ జట్టులోకి రానున్నారు. కాగా రెండేళ్లలో అనేక సిరీస్‌ల మధ్యలో చాలా మంది ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరినీ రిజర్వ్ ప్లేయర్లుగా బీసీసీఐ ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా చదవండి: బంతిని చూడకుండానే భారీ సిక్సర్... అంత కాన్ఫిడెన్స్ ఏంటి రషీద్ భయ్యా! -
బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా.. ప్రతీకారం తీర్చుకుంటుందా?
వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న అండర్–19 క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో యువ భారత్ జట్టు తలపడనుంది. కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, సిద్ధార్థ్æ, ఆరాధ్య యాదవ్, మానవ్ కోలుకోవడంతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. అయితే తాత్కాలిక కెప్టెన్ నిశాంత్‌కు కరోనా సోకడంతో అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. సాయంత్రం గం. 6:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. కరోనా బారిన పడిన స్టార్ ఆటగాడు -
అయ్యో పాపం విండీస్.. ఆఖరి ఓవర్లో 28 పరుగులు.. అయినా!
బార్బడోస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠ బరిత పోరులో ఇంగ్లండ్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. విజయానికి ఆఖరి ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా విండీస్ 28 పరుగులు సాధించి ఓటమి పాలైంది. విండీస్ ఆటగాడు అకేల్ హోస్సేన్.. షాకిబ్ మహమూద్ వేసిన అఖరి ఓవర్లో ఏకంగా 28 పరుగులు రాబాట్టాడు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాసన్ రాయ్(45), మోయిన్ అలీ(31), టామ్ బాంటన్(25) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, ఫాబియన్ ఆలీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు సాధించింది. విండీస్ బ్యాటర్లలో రొమారియో షెపర్డ్(44), అకేల్ హోస్సేన్(44) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ మూడు వికెట్లు పడగొట్టగా,ఆదిల్ రషీద్ రెండు వికెట్లు సాధించాడు. కాగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్1-1తో సమమైంది. చదవండి: SA vs IND: రాహుల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు.. తొలి భారత కెప్టెన్‌గా.. -
హోల్డర్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. విండీస్ ఘన విజయం
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్, కింగ్ కీలక పాత్ర పోషించారు. 104 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఒకే ఒక వికెట్ కోల్పోయి చేధించింది. విండీస్ బ్యాటర్లలో కింగ్(52), షాయ్ హోప్(20) పరుగులతో రాణించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 103 పరులకే కుప్పకూలింది. ఆరంభం నుంచే విండీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ విలవిలాడింది. కేవలం 41 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో రషీద్(22),జోర్డాన్(28) పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైనా సాధించ గల్గింది. కాగా హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోర్డాన్(28), రషీద్(22) టాప్ స్కోరర్లగా నిలిచారు. కాగా యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లైంది. -
జెమీమా, శిఖాలపై వేటు.. కెప్టెన్‌గా మిథాలీ రాజ్
ముంబై: భారత మహిళల క్రికెట్ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్ వరుసగా మూడో వన్డే వరల్డ్ కప్‌లో జట్టుకు సారథ్యం వహించనుంది. మిథాలీ నాయకత్వంలో వచ్చే ప్రపంచకప్ బరిలోకి దిగే 15 మంది సభ్యుల భారత జట్టును సెలక్టర్లు గురువారం ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. 2017లో మిథాలీ కెప్టెన్సీలోనే ఆడిన టీమ్ హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 9 పరుగులతో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మార్చి 4నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్ వేదికగా వరల్డ్ కప్ జరుగుతుంది. మార్చి 6న తౌరంగాలో జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. అంతకు ముందు టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. పేలవ ఫామ్ కారణంగానే... గత కొంత కాలంగా భారత జట్టులో రెగ్యులర్ సభ్యులుగా ఉన్న బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్, పేసర్ శిఖా పాండేలకు జట్టులో చోటు దక్కలేదు. గత ఏడాది ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో జెమీమా ఒక్కసారి కూడా రెండంకెల స్కోరు చేయకపోగా, శిఖా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. టి20ల్లో ఆకట్టుకున్న మేఘనా సింగ్, రేణుకా సింగ్‌లను తొలిసారి వన్డే టీమ్‌లోకి ఎంపిక చేశారు. గత ప్రపంచకప్‌లో ఆడిన పూనమ్ రౌత్‌కు కూడా ఈ సారి స్థానం లభించలేదు. 2021 చాలెంజర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆంధ్ర ప్లేయర్ సబ్బినేని మేఘనను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు వన్డేలు ఆడని మేఘన 6 టి20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. జట్టు వివరాలు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), తానియా భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్, జులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్. స్టాండ్‌బై: సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రన్ బహదూర్. చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్.. -
వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం.. సిరీస్ ఇక కష్టమే!
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో మరోసారి కరోనా కలకలం రేపింది. ఆ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు, ఇద్దరు కోచింగ్ స్టాప్ కరోనా బారిన పడినట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. "మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది" అని వెస్టిండీస్ క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. ఆ జట్టు వికెట్ కీపర్ షాయ్ హోప్,జస్టిన్ గ్రీవ్స్, అకేల్ హోసేన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. కాగా అంతకుముందు రోస్టన్ చేజ్, కైల్ మేయర్స్,షెల్డన్ కాట్రెల్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అతిథ్య పాకిస్తాన్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా అఖరి టీ20 గురువారం(డిసెంబర్16)న జరగనుంది. అయితే కొవిడ్ కేసులు నమోదు కావడంతో ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతే కాకుండా త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌పై ఈ ప్రభావం ఉండనుంది. ఇక ఆటగాళ్లు బయోబబుల్‌లో ఉన్నప్పటికీ కేసులు నమోదు కావడం అందరనీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చదవండి: కోహ్లికే కాదు.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. కపిల్‌దేవ్ సంచలన వాఖ్యలు -
ఆస్ట్రేలియా మ్యాచ్‌తో కెరీర్ ముగించిన విండీస్ దిగ్గజాలు
-
SA Vs WI: పెను ప్రమాదం తప్పించకున్న పాక్ అంపైర్ .. వీడియో వైరల్
Umpire Aleem Dar: టీ20 ప్రపంచకప్2021 సూపర్-12 రౌండ్లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్‌కు పెను ప్రమాదం తప్పింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన ప్రిటోరియాస్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్ బౌలర్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అంపైర్ అలీమ్ దార్ వైపు వేగంగా దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన అతడు తప్పించుకుని కింద పడిపోయాడు. అయితే బంతి నేరుగా లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ దుసాన్ చేతికి వెళ్లింది. వెంటనే అతడు రనౌట్‌కు ప్రయత్నించి చాలా వేగంగా బౌలర్ ఎండ్‌వైపు త్రో చేశాడు. దీంతో అలీమ్ దార్ మరోసారి బంతి నుంచి తప్పించుకున్నాడు. అలీమ్ దార్‌కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆటగాళ్లంతా ఊపిరి పీల్చకున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: Pak Vs NZ: కంగ్రాట్స్ న్యూజిలాండ్... పాకిస్తాన్ సేఫ్.. కానీ మా జట్టు మాత్రం డేంజర్: అక్తర్ Aleem Dar 🥶 pic.twitter.com/33nwLghf71 — Abdul Hadi 🇵🇰 (@Abdul_Hadi_1) October 26, 2021 -
విండీస్‌దే వన్డే సిరీస్
నార్త్‌సౌండ్: శ్రీలంకతో రెండో వన్డేలో వెస్టిండీస్ ఐదు వికెట్లతో నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 49.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎవిన్ లూయిస్ (103; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. షై హోప్ (84; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 192 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక విండీస్ బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. పూరన్ (35 నాటౌట్; 4 ఫోర్లు) మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విండీస్ జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది. గుణతిలక (96; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), చండీమల్ (71; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. -
వయసు పైబడినా వన్నె తగ్గలేదు..
రాయ్‌పూర్: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడిచినా.. దిగ్గజ ఆటగాళ్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా మొన్న బంగ్లా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (80 నాటౌట్; 35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. నిన్న విండీస్ ఆల్ టైమ్ గ్రేట్ బ్రియాన్ లారా (49 బంతుల్లో 8 ఫోర్లతో 53 నాటౌట్), శ్రీలంక దిగ్గజ ఆటగాడు ఉపుల్ తరంగ(35 బంతుల్లో 8 ఫోర్లుతో 53 నాటౌట్)లు సత్తా చాటాడు. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్.. విండీస్ లెజెండ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా(53 నాటౌట్), డ్వేన్ స్మిత్ (27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) రాణించారు. శ్రీలంక బౌలర్లలో తిలకరత్నే దిల్షాన్, చింతక జయసింఘే చెరో వికెట్ తీశారు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్.. ఉపుల్ తరంగా(53 నాటౌట్) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తరంగాకు తోడుగా తిలకరత్నే దిల్షాన్(37 బంతుల్లో 8 ఫోర్లతో 47) రాణించాడు. విండీస్ బౌలర్లలో టినో బెస్ట్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ర్యాన్ ఆస్టిన్ ఓ వికెట్ పడగొట్టారు. కీలక ఇన్నింగ్స్ అడిన తరంగాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఆదివారం జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెజెండ్స్‌తో, బంగ్లా దిగ్గజాలు తలపడనున్నారు. -
శ్రీలంక-వెస్టిండీస్ టీ-ట్వంటీలో హైడ్రామా
-
ఇంగ్లండ్ పైచేయి...
మాంచెస్టర్: సాధారణంగా చప్పగా సాగిపోయే టెస్టు మ్యాచ్ ఇక్కడ రెండోరోజు మాత్రం వేగంగా మారిపోయింది. కష్టాలు సెషన్ల వారీగా జట్టు నుంచి జట్టుకు బదిలీ అయ్యాయి. అయితే ఓవరాల్‌గా నిర్ణాయక మూడో టెస్టులో రెండో రోజు ఆటను ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు శాసించింది. తొలి సెషన్లో తమ పేస్ పదునుతో దడదడలాడించిన వెస్టిండీస్ తర్వాత సెషన్ నుంచి కష్టాల్లో పడింది. ఆట ముగిసే సమయానికి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. వెలుతురులేమితో ఆటను ముగించే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు విండీస్ మరో 232 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్ టెయిలెండర్ స్టువర్ట్ బ్రాడ్ (45 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ కష్టాలతో... ఓవర్‌నైట్ స్కోరు 258/4తో శనివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పోప్ (150 బంతుల్లో 91; 11 ఫోర్లు), సెంచరీ చేస్తాడనుకుంటే ఒక్క పరుగైనా చేయకుండానే పాత స్కోరుకే ఔటయ్యాడు. బట్లర్ (142 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా క్రితంరోజు స్కోరుకు 11 మాత్రమే జత చేశాడు. ఇద్దరినీ గాబ్రియెల్ పెవిలియన్ పంపాడు. తర్వాత కీమర్ రోచ్... వోక్స్ (1), ఆర్చర్ (3)లను ఔట్ చేశాడు. వరుస నాలుగు ఓవర్లలోనూ 4 వికెట్లు పడిపోవడంతో ఇంగ్లండ్ 280/8 స్కోరుతో కష్టాల్లో పడింది. ఒకదశలో 300 పరుగుల్లోపే తొలి ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది. కానీ బ్రాడ్ మెరిపించడంతో టెస్టు కాసేపు వన్డేలా మారింది. ఈ టెయిలెండర్ దూకుడు పెరగడంతో జట్టు స్కోరు కూడా పెరిగింది. బ్రాడ్ 33 బంతుల్లో అర్ధసెంచరీ (8 ఫోర్లు, 1 సిక్స్) ఇంగ్లండ్ టెస్టు చరిత్రలో వేగవంతమై మూడో అర్ధసెంచరీగా నిలిచింది. డామ్ బెస్ (18 నాటౌట్; 1 ఫోర్)తో తొమ్మిదో వికెట్‌కు జతచేసిన 76 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను పటిష్టం చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 111.5 ఓవర్లలో 369 పరుగుల వద్ద ఆలౌటైంది. రోచ్ 4, గాబ్రియెల్, చేజ్ చెరో 2 వికెట్లు తీశారు. వోక్స్‌ను ఔట్ చేయడంతో కీమర్ రోచ్ 200 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. విండీస్ విలవిల... తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్‌ను బ్రాడ్ బంతితోనూ దెబ్బ తీశాడు. తన మొదటి ఓవర్లోనే క్రెయిగ్ బ్రాత్‌వైట్ (1)ను పడేశాడు. కాసేపయ్యాక మరో ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (32)ను ఆర్చర్ ఔట్ చేయగా... షై హోప్ (17) అండర్సన్ స్వింగ్‌కు కంగుతిన్నాడు. టీ విరామంలోపే ఈ మూడు వికెట్లు పడటం కరీబియన్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీసింది. అప్పుడు విండీస్ స్కోరు 58/3. ఆఖరి సెషన్లోనూ ఇంగ్లండ్ బౌలర్ల హవానే కొనసాగడంతో వెస్టిండీస్ విలవిలలాడింది. బ్రూక్స్ (4)ను అనుభవజ్ఞుడైన అండర్సన్ బుట్టలో పడేయగా... చేజ్ (9)ను బ్రాడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 73 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. కాసేపు పోరాడిన బ్లాక్‌వుడ్ (26; 3 ఫోర్లు)... విండీస్ స్కోరు కష్టంగా 100 పరుగులు దాటాక వోక్స్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఆట నిలిచే సమయానికి కెప్టెన్ హోల్డర్ (24 బ్యాటింగ్; 4 ఫోర్లు), డౌరిచ్ (10 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్ ఫాలోఆన్ తప్పించుకోవాలంటే మరో 33 పరుగులు చేయాలి. టెస్టు క్రికెట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న తొమ్మిదో వెస్టిండీస్ బౌలర్‌గా కీమర్ రోచ్ గుర్తింపు పొందాడు. గతంలో విండీస్ తరఫున కొట్నీ వాల్‡్ష, ఆంబ్రోస్, మార్షల్, లాన్స్ గిబ్స్, గార్నర్, హోల్డింగ్, గ్యారీ సోబర్స్, ఆండీ రాబర్ట్స్ ఈ ఘనత సాధించారు. -
వరుణుడే ఆడుకున్నాడు
వెస్టిండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్ రౌండ్ ద వికెట్‌గా వచ్చి తొలి బంతిని వేయగా ఇంగ్లండ్ ఎడంచేతి వాటం ఓపెనర్ రోరీ బర్న్స్ దానిని సమర్థంగా డిఫెన్స్ ఆడాడు... దాదాపు నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఇలా మళ్లీ మొదలైంది. ప్రేక్షకుల చప్పట్లు, ఉత్సాహపు హోరు ఏమీ కనిపించకుండా ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తమ ఆటను మొదలు పెట్టేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత వచ్చిన క్రికెట్‌ను వరుణుడు మాత్రం కరుణించలేదు. భయపడినట్లుగానే తొలి రోజు ఆటలో చాలా భాగం వర్షం బారిన పడింది. తొలి రోజు సంఘీభావం, సంతాపం మినహా రోజ్ బౌల్లో ఎలాంటి విశేషాలు లేకుండానే క్రికెట్ సాగింది. సౌతాంప్టన్: సీజన్‌కు తగినట్లుగానే ఇంగ్లండ్‌లో వాన తన ప్రతాపం చూపించడంతో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ నిరాశాజనకంగా మొదలైంది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు తగిన వినోదం దక్కలేదు. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (55 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉంది. రెండో ఓవర్లోనే... సుమారు పది నెలల తర్వాత వెస్టిండీస్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న పేసర్ షెనాన్ గాబ్రియెల్ తన తొలి ఓవర్లోనే సత్తా చాటాడు. అతను వేసిన నాలుగో బంతిని ఆడకుండా చేతులెత్తేసిన సిబ్లీ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత పదే పదే వచ్చిన అంతరాయాల మధ్య బర్న్స్, డెన్లీ జట్టు ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత ఆగిన ఆట మళ్లీ మొదలు కాలేదు. మళ్లీ మళ్లీ... తొలి టెస్టు ఆరంభమే ఆలస్యమైంది. ఉదయం నుంచి వర్షం కురవడంతో మ్యాచ్ మొదలు కాలేదు. చివరకు సరిగ్గా 3 గంటలు ఆలస్యంగా... భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తొలి బంతి పడింది. సరిగ్గా 3 ఓవర్లు సాగగానే వర్షంతో ఆట ఆగిపోయింది. వాన తగ్గాక మళ్లీ ఆడితే 7 బంతుల తర్వాతే మళ్లీ చినుకులతో బ్రేక్ పడింది. కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. అంతా బాగుందనుకున్న సమయంలో వెలుతురులేమితో మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే మరోసారి వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయక తప్పలేదు. బ్రాడ్ అవుట్... ఇంగ్లండ్ తుది జట్టులో సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు దక్కలేదు. సొంతగడ్డపై జరిగిన ఒక టెస్టులో బ్రాడ్ ఆడకపోవడం 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మోకాళ్లపై కూర్చోని... అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్‌లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇటీవలే కన్నుమూసిన విండీస్ దిగ్గజ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన కరోనా బాధితుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. భుజానికి నల్ల బ్యాండ్లు ధరించారు. రూట్‌కు రెండో అబ్బాయి... ఇంగ్లండ్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్‌కు మరో బాబు పుట్టాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా రూట్ అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య ప్రసవం కారణంగానే రూట్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ‘ఇంగ్లండ్ జట్టుకు బెస్టాఫ్ లక్. మేం మ్యాచ్ చూస్తూ మీకు మద్దతునిస్తాం’ అంటూ కొత్తగా పుట్టిన అబ్బాయి, తన పెద్ద కొడుకు ఆల్ఫ్రెడ్ విలియమ్‌తో కలిసి ఉన్న ఫోటోను అతను పోస్ట్ చేశాడు. విరామం అనంతరం రూట్ నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఆ తర్వాత రెండో టెస్టు కోసం అతను మాంచెస్టర్‌లో జట్టుతో కలుస్తాడు. రూట్ గైర్హాజరు కారణంగా తొలి టెస్టులో జట్టుకు స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున 81వ కెప్టెన్‌గా స్టోక్స్ నిలిచాడు. -
మీరూ... కోహ్లిలా శ్రమించాలి
చెన్నై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లిలా వెస్టిండీస్ ప్లేయర్లు కూడా చెమటోడ్చాలని ఆ జట్టు సహాయ కోచ్ రాడీ ఎస్ట్‌విక్ అన్నాడు. శుక్రవారం అతను మీడియాతో మాట్లాడుతూ ‘హెట్‌మైర్, నికోలస్ పూరన్, హోప్లాంటి యువ క్రికెటర్లు ప్రత్యర్థి కెప్టెన్ కోహ్లిని చూసి నేర్చుకోవాలి. ఆట కోసం అతను ఎంతో శ్రమిస్తాడు. నిత్యం జిమ్‌లో కసరత్తు చేస్తాడు, నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తాడు. కఠోరంగా శ్రమించేతత్వానికి అతనే ఓ నిదర్శనం. కుర్రాళ్లంతా అతన్ని అనుసరించాల్సిందే. కష్టపడితేనే విజయమైనా... ఏదైనా... లేదంటే ఏదీ రాదు’ అని ఎస్ట్‌విక్ అన్నాడు. టి20 సిరీస్‌లో రాణించినట్లే ఈ వన్డే సిరీస్‌లోనూ తమ జట్టు రాణిస్తుందని చెప్పాడు. తమ కుర్రాళ్లకు ఈ పర్యటన ఓ పాఠంలా పనికొస్తుందన్నాడు. విండీస్ పొట్టి ఫార్మాట్లో 1–2తో సిరీస్‌ను కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ తొలి వన్డే జరుగుతుంది. -
కార్న్‌వాల్‌కు 7 వికెట్లు
లక్నో: ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రాకిమ్ కార్న్‌వాల్ తన ఆఫ్‌స్పిన్ బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అఫ్గానిస్తాన్‌తో బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఏకైక టెస్టులో కార్న్‌వాల్ 75 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అఫ్గాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే ఆలౌటైంది. జావేద్ అహ్మదీ (39), అమీర్ హమ్జా (34), అఫ్సర్ జజాయ్ (32) ఫర్వాలేదనిపించారు. హోల్డర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం విండీస్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (11), షై హోప్ (7) విఫలం కాగా... క్యాంప్‌బెల్ (30 బ్యాటింగ్), బ్రూక్స్ (19 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ మరో 119 పరుగులు వెనుకబడి ఉంది. భద్రతాకారణాలరీత్యా అఫ్గానిస్తాన్ తమ దేశంలో కాకుండా అంతర్జాతీయ మ్యాచ్‌లను భారత్ కేంద్రంగా ఆడుతోంది. -
అందుకే విహారి జట్టులోకి వచ్చాడు: కోహ్లి
నార్త్ సౌండ్: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్ 318 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్ తొలి రోజు తుది జట్టు ఎంపికపై పలు విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను ఆడించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై జట్టు కెప్టెన్ కోహ్లి మ్యాచ్ ముగిసిన తర్వాత వివరణ ఇచ్చాడు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా జట్టు ప్రయోజనాల కోసమేనన్న కెప్టెన్... టెస్టులో సహచరుల ఆటపై ప్రశంసలు కురిపించాడు. ‘తుది జట్టు విషయంలో మేమందరం కలిసి ముందుగా చర్చించుకొని ఆ తర్వాత టీమ్‌కు ఏది మేలు చేస్తుందో ఆ నిర్ణయం తీసుకుంటాం. ఆడే 11 మంది విషయంలో ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఏం చేసినా జట్టు ప్రయోజనాల కోసమేనని అందరూ అర్థం చేసుకుంటారు’ అని కోహ్లి స్పష్టం చేశాడు. రోహిత్ శర్మను కాదని హనుమ విహారిని ఎంచుకున్న నిర్ణయాన్ని కెప్టెన్ సమర్థించుకున్నాడు. ‘కాంబినేషన్ కీలకం కాబట్టి విహారి జట్టులోకి వచ్చాడు. అతను నాణ్యమైన పార్ట్‌టైమ్ బౌలర్. ఓవర్‌రేట్ పెరిగిపోతోందని అనిపించిన సమయంలో విహారి పనికొస్తాడు’ అని విరాట్ చెప్పాడు. తాను అనుకున్న వ్యూహాలను సహచరులందరూ సమర్థంగా అమలు చేయడం ఆనందంగా ఉందని కెప్టెన్ వ్యాఖ్యానించాడు. ఇక ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి త్రుటిలో తొలి టెస్టు సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 93 పరుగులతో ఆకట్టుకున్న అతను ఇకపై తన ఆఫ్‌స్పిన్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించాడు. 1: విదేశీ గడ్డపై భారత్‌కు ఇదే (318 పరుగులు) అతి పెద్ద విజయం. 2017లో శ్రీలంకను (గాలే) భారత్ 304 పరుగులతో ఓడించింది. 27: కోహ్లి కెప్టెన్సీలో భారత్‌కు ఇది 27వ టెస్టు విజయం. అత్యధిక విజయాల భారత కెప్టెన్‌గా ధోని (27) రికార్డును కోహ్లి సమం చేశాడు. 12: కోహ్లి కెప్టెన్సీలో విదేశాల్లో భారత్ 12 టెస్టులు గెలిచింది. ఈ క్రమంలో విదేశీ గడ్డపై అత్యధిక విజయాల భారత కెప్టెన్‌గా గంగూలీ (11) ఘనతను విరాట్ అధిగమించాడు. 100: అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) కెప్టెన్‌గా కోహ్లికిది వందో విజయం. అతనికంటే ముందు భారత్ తరఫున ధోని (178), అజహర్ (104) వందకంటే ఎక్కువ విజయాలు సాధించారు. 100: భారత్‌పై విండీస్‌కు ఇదే అత్యల్ప స్కోరు. 2006లో ఆ జట్టు 103 పరుగులు చేసింది. -
కాచుకో... విండీస్
కరీబియన్ పర్యటనలో భారత జట్టు చివరిదైన టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. జట్లకు ఏమోగానీ... ఇది టీమిండియా కెప్టెన్ కోహ్లి అరుదైన రికార్డులకు వేదికగా మారే వీలుంది. వన్డే ప్రపంచ కప్ వైఫల్యం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మన జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. భారత యువ ఓపెనర్లకు పరీక్షగా, స్పెషలిస్ట్ ఆటగాళ్లకు ప్రత్యేకంగా మారనున్న ఈ సిరీస్‌లో తమదైన ముద్ర వేసేది ఎవరో? నార్త్‌సౌండ్ (అంటిగ్వా): ఆసక్తి రేపుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో టీమిండియా ప్రయాణానికి నేటితో తెరలేవనునంది. కరీబియన్ దీవుల పర్యటనలో భాగంగా వెస్టిండీస్, భారత్ తొలి టెస్టు గురువారం ప్రారంభం కానుంది. 8 నెలల విరామం అనంతరం సంప్రదాయ ఫార్మాట్ బరిలో దిగుతున్న కోహ్లి సేనకు తుది జట్టు కూర్పు ఎలా అనే ఆలోచన తప్ప... గాయాలు, ఫామ్ లేమి వంటి ఇబ్బందులు లేవు. టి20, వన్డే సిరీస్‌లు కోల్పోయిన ప్రత్యర్థి వెస్టిండీస్ టెస్టుల్లోనైనా ప్రతాపం చూపాలని భావిస్తోంది. ఈ సిరీస్ కూడా ఓడితే ఆ జట్టు సొంతగడ్డపై తొలిసారిగా భారత్‌కు మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు కోల్పోయిన దారుణ రికార్డు మూటగట్టుకుంటుంది. బలాబలాలరీత్యా టీమిండియానే ఫేవరెట్ అయినప్పటికీ, విండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. కోహ్లి ఓటు 5+1+5కేనా? టెస్టుల్లో విజయానికి కెప్టెన్ కోహ్లి నమ్మే సూత్రం ఐదుగురు బ్యాట్స్‌మెన్, కీపర్, ఐదుగురు బౌలర్లు. మరీ ముఖ్యంగా విదేశాల్లో అతడు దీనిని ఎక్కువగా ఆచరిస్తాడు. ఈ లెక్కన చూస్తే మాత్రం ఆరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌కు అవకాశం లేనట్లే. ప్రాధాన్య ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌కు చోటు ఖాయం. రెండో ఓపెనర్‌గా రాహుల్‌కు తెలుగు ఆటగాడు హనుమ విహారి పోటీ ఇస్తున్నాడు. వన్‌డౌన్‌లో పుజారా, నాలుగో స్థానంలో కోహ్లితో దుర్బేధ్యంగా ఉంది. ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా త్రయం పేస్ బాధ్యతలు మోస్తారు. మరో పేసర్ ఉమేశ్ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. ఇద్దరు స్పిన్నర్ల వ్యూహానికి కట్టుబడితే అశ్విన్–జడేజా ద్వయం బరిలో దిగుతుంది. హార్దిక్ పాండ్యా దూరమైనందున లోయరార్డర్లో వీరిద్దరూ బ్యాట్‌తోనూ రాణించాల్సి ఉంటుంది. రహానే–రోహిత్ మధ్య కుర్చీలాట... టీమిండియాకు కొన్నాళ్లుగా వన్డేల్లో నాలుగో స్థానం ఎంత సమస్యగా మారిందో టెస్టుల్లో ఐదో స్థానం అంతే ఇబ్బంది కలిగిస్తోంది. వైస్ కెప్టెన్ హోదాలో ఓ బాధ్యత ఉన్న అజింక్య రహానే విఫలమవుతుండటమే దీనికి కారణం. రహానే సెంచరీ చేసి రెండేళ్లు దాటింది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రంజీలు, ఇంగ్లండ్ కౌంటీల్లో తనను తాను పరీక్షించుకున్నా రహానే సాధించిందేమీ లేదు. ఇప్పుడు రోహిత్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్నాడు. వన్డే ప్రపంచ కప్ తర్వాత రోహిత్ స్థాయి పెరిగింది. టెస్టుల్లో వరుసగా అవకాశాలు ఇవ్వాలనే స్థితికి అది చేరింది. మరి... ఐదో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ రహానేలలో కెప్టెన్ మొగ్గు ఎవరివైపు ఉంటుందో చూడాలి. విండీస్ ఎలా ఆడుతుందో? ఈ ఏడాది మొదట్లో తమ దేశంలో పర్యటించిన ఇంగ్లండ్‌ను తొలి టెస్టులో 381 పరుగులతో; రెండోదాంట్లో 10 వికెట్లతో విండీస్ ఓడించింది. స్వదేశంలో కరీబియన్లు ప్రమాదకారులు అని చెప్పడానికి ఇదే సంకేతం. ఈ సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు పేసర్ రోచ్ నుంచి సవాలు తప్పదు. స్పిన్ ఆల్‌రౌండర్ చేజ్ సైతం గట్టి పిండమే. కెప్టెన్ హోల్డర్ ఆల్‌రౌండ్ పాటవం విండీస్‌కు సానుకూలాంశం. ఓపెనర్ బ్రాత్‌వైట్, హోప్, హెట్‌మైర్‌లతో బ్యాటింగ్‌లో జట్టు బలంగా ఉంది. మహాకాయుడు కార్న్‌వాల్ అరంగేట్రం చేయనున్నాడు. గెలిస్తే 120 పాయింట్లు... రెండు మ్యాచ్‌ల సిరీసే కాబట్టి... డబ్ల్యూటీసీలో భాగంగా ఒక్కో టెస్టు విజయానికి 60 పాయింట్లు దక్కుతాయి. రెండూ గెలిస్తే 120 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతానికి భారత్ టాప్‌లోకి చేరుతుంది. న్యూజిలాండ్‌పై తొలి టెస్టు నెగ్గిన శ్రీలంక 60; యాషెస్‌లో మొదటి టెస్టు గెలిచి, రెండో టెస్టును డ్రాగా ముగించిన ఆస్ట్రేలియా 32 పాయింట్లతో ఉన్నాయి. తుది జట్లు (అంచనా) భారత్: రాహుల్/విహారి, మయాంక్, పుజారా, కోహ్లి (కెప్టెన్), రహానే/రోహిత్, పంత్/సాహా, జడేజా, అశ్విన్,షమీ, బుమ్రా, ఇషాంత్. వెస్టిండీస్:బ్రాత్‌వైట్, కాంప్‌బెల్, హోప్, డారెన్ బ్రేవో, హెట్‌మైర్, చేజ్, డౌరిచ్, హోల్డర్ (కెప్టెన్), కార్న్‌వాల్/కీమో పాల్, రోచ్, గాబ్రియెల్. పిచ్, వాతావరణం ఇక్కడి సర్ వివియన్ రిచర్డ్స్ మైదానంలో రెండేళ్లుగా విండీస్ పేసర్లు, ప్రత్యేకంగా రోచ్ చెలరేగుతున్నాడు. 2018లో ఐదు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను 43 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలకంగా నిలిచాడు. ఈ జనవరిలో ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. పిచ్ స్వభావ రీత్యా పేసర్లకు ఈసారీ పండుగే. ఇంగ్లండ్‌తో టెస్టు అనంతరం ఈ పిచ్‌కు ఒక డీ మెరిట్ పాయింట్‌తో పాటు, బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. అంటిగ్వాలో వాతావరణం మబ్బులు పట్టి ఉంది. మూడో రోజు నుంచి జల్లులు పడతాయి. 1: కోహ్లి మరొక్క సెంచరీ చేస్తే అత్యధిక శతకాలు బాదిన కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (19) సరసన చేరతాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 109 టెస్టుల్లో 25 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 26: కోహ్లి నేతృత్వంలో ఆడిన 46 టెస్టుల్లో భారత్ గెలిచిన టెస్టుల సంఖ్య. మరోటి నెగ్గితే మాజీ కెప్టెన్ ధోని (60 మ్యాచ్‌ల్లో 27) అత్యధిక విజయాల రికార్డును అతడు సమం చేస్తాడు. కోహ్లి సేన జలకాలాట ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం రెండు రోజుల విరామం లభించడంతో కోహ్లి సేన పూర్తిగా సేదదీరింది. కెప్టెన్ సహా ఆటగాళ్లు అంటిగ్వా బీచ్‌లో సందడి చేశారు. ‘కుర్రాళ్లతో ఓ అద్భుతమైన రోజు’ అంటూ మయాంక్, బుమ్రా, ఇషాంత్, పంత్, రహానే, రోహిత్, రాహుల్‌లతో ఉన్న ఫొటోను కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. -
శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాడు: కోహ్లి
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: రెండో వన్డేలో యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాడని టీమిండియా కెప్టెన్ కోహ్లి కితాబిచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బీసీసీఐ వెబ్సైట్ కోసం సహచరుడు యజువేంద్ర చహల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ... ‘బ్యాటింగ్ ఆర్డర్లో టాప్–3 బ్యాట్స్‌మెన్‌లో ఒకరైనా నిలబడి భారీస్కోరు చేస్తేనే ఇన్నింగ్స్ నిలబడుతుంది. ఓపెనర్లు శిఖర్, రోహిత్ విఫలమవడంతో ఇన్నింగ్స్ బాధ్యత నేను తీసుకున్నా. పిచ్, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 270 పరుగుల స్కోరు మంచి లక్ష్యమే అనుకున్నాం. ముందుగా బ్యాటింగ్ తీసుకుని మంచి పనే చేశాం. మీరు విండీస్ ఇన్నింగ్స్‌ను గమనిస్తే అదే అర్థమవుతుంది. లక్ష్యఛేదనలో ఆతిథ్య జట్టు తెగ కష్టపడింది. ఆ సమయంలో ఎవరికైనా బ్యాటింగ్ క్లిష్టమే అవుతుంది. హెట్‌మైర్, పూరన్ నిలదొక్కుకుంటున్న సమయంలో వాన పడటం కూడా మాకు కలిసొచ్చింది. ఈ జట్టులో ఎక్కువ మంది ఎడంచేతి బ్యాట్స్‌మెన్ ఉండటం వల్లే చహల్‌ను కాదని కుల్దీప్ను తీసుకున్నాం. ఈ ఎత్తుగడ కూడా మమ్మల్ని గెలిపించేందుకు దోహదపడింది’ అని అన్నాడు. వర్షం, బ్రేక్ సమయంలో తన డ్యాన్సింగ్పై మాట్లాడుతూ ‘విండీస్ సంగీతం వినపడగానే నా రెండు కాళ్లు ఆగవు. చిందులేసేందుకు ఉత్సాహం చూపిస్తాయి. ఆట విరామంలో ఈ సరదా కూడా ఉత్సాహపరుస్తుంది’ అని అన్నాడు. -
లంక విజయం
చెస్టర్ లీ స్ట్రీట్: రేసులో లేని మ్యాచ్‌లో శ్రీలంక పరుగుల డోసు పెంచింది. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి 300 మార్కు దాటింది. చివరకు 23 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీస్కోరు చేసింది. అవిష్క ఫెర్నాండో (103 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కుశాల్ పెరీరా (51 బంతుల్లో 64; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. హోల్డర్ 2 వికెట్లు తీశాడు. అనంతరం వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసి పోరాడి ఓడింది. నికోలస్ పూరన్ (103 బంతుల్లో 118; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక్కొట్టగా, అలెన్ (32 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మలింగకు 3 వికెట్లు దక్కాయి. ఫెర్నాండోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఓపెనర్ అంబ్రిస్ (5), షైహోప్ (5) మలింగ పేస్‌కు తలవంచారు. గేల్ (48 బం తుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా త్వరగానే ఔటయ్యాడు. హెట్‌మైర్ (38 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఎక్కువగా కష్టపడలేదు. దీంతో 84 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నికోలస్ పూరన్ దాటిగా ఆడటం మొదలుపెట్టాడు. అతనికి కెప్టెన్ హోల్డర్ (26; 4 ఫోర్లు) కాసేపు తోడయ్యాడు. ఐదో వికెట్‌కు 61 పరు గులు జోడించాక హోల్డర్ ఔట్కాగా...అనంతరం బ్రాత్‌వైట్ (8) రనౌటయ్యాడు. అలెన్ వచ్చాక పూరన్ మరింత రెచ్చిపోయాడు. గెలుపు మలుపు తీసుకుంటున్న దశలో ధాటిగా ఆడుతున్న అలెన్ రనౌటయ్యాడు. తర్వాత 92 బంతుల్లో సెంచరీ చేసుకున్న పూరన్ ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించడంతో ఓటమి ఖాయమైంది. సంక్షిప్త స్కోర్లు శ్రీలంక ఇన్నింగ్స్: 338/6 (50 ఓవర్లలో) (అవిష్క ఫెర్నాండో 104, కుశాల్ పెరీరా 64, తిరిమన్నె 45 నాటౌట్; హోల్డర్ 2/59) వెస్టిండీస్ ఇన్నింగ్స్: 315/9 (50 ఓవర్లలో) ( పూరన్ 118, అలెన్ 51, మలింగ 3/55). -
ఉత్కంఠ పోరులో కివీస్‌దే విజయం
-
ఉత్కంఠ పోరులో కివీస్‌దే విజయం
మాంచెస్టర్: చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ వెస్టిండీస్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి చేరింది. టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిలింది. ఇన్నింగ్స్ తొలిబంతికే గప్టిల్ (0)ను ఔట్ చేసిన కాట్రెల్ ఐదో బంతికి మున్రో (0)ను బౌల్డ్ చేశాడు. రెండో బంతికే క్రీజులోకి వచ్చిన విలియమ్సన్... టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. విలియమ్సన్ (154 బంతుల్లో 148; 14 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత శతకానికి తోడు... టేలర్ (95 బంతుల్లో 69; 7 ఫోర్లు) రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. విండీస్ బౌలర్ కాట్రెల్‌కు 4 వికెట్లు దక్కాయి. అనూహ్యంగా మ్యాచ్ అటూ ఇటూ..! 292 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ కుప్పకూలింది. 49 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ క్రిస్‌గేల్ (87), సెకండ్ డౌన్ బ్యాట్స్‌మన్ హెట్‌మైర్ (54) రాణించారు. మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. ఓ దశలో 27 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసిన వెస్టిండీస్‌ను మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కార్లోస్ బ్రాత్‌వైట్ 101 (82 బంతులు, 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. చివరి వికెట్‌కు 7 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయాలి. అయితే, 49వ ఓవర్ చివరి బంతిని భారీ సిక్సర్‌గా మలిచి జట్టుకు అనూహ్య విజయాన్నందించాలనుకున్న అతని ఆశ నెరవేరలేదు. నీషమ్ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అతను భారంగా పెలివిలియన్ చేరాడు. దీంతో విండీస్ కథ ముగిసింది. ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి గెలుపు దిశగా వెస్టిండీస్ పయనించడం.. చివర్లో ఓటమి పాలవడం స్టేడియంలో ఉన్న ప్రతిఒక్కరినీ బాధింపజేసింది. ముఖ్యంగా బ్రాత్‌వైట్ పోరాట పటిమకు అందరూ ముగ్ధులయ్యారు. -
భళారే బంగ్లా!
ఐర్లాండ్‌లో ఇటీవల జరిగిన ముక్కోణపు సిరీస్‌లో బంగ్లాదేశ్ మూడుసార్లు విండీస్‌ను ఓడించింది. అప్పుడు గేల్, రసెల్ లేరు కాబట్టే గెలిచారని అన్నారు. మరిప్పుడు ఆ విధ్వంసకారులున్న జట్టును... 300 పైచిలుకు లక్ష్యాన్ని 41.3 ఓవర్లలోనే ఛేదించి మరీ బంగ్లా సంచలన విజయం సాధించింది. అందుకేనేమో ఈ టోర్నీలో బంగ్లా కెప్టెన్ మొర్తజా దక్షిణాఫ్రికాను ఓడించినపుడే చెప్పాడు ‘ఇక మేం గెలిస్తే సంచలనం కానేకాదు’ అని ఇప్పుడీ ఫలితం చూస్తుంటే నిజమేననిపిస్తోంది..! టాంటన్: ప్రపంచకప్‌లోనూ వెస్టిండీస్‌పై బంగ్లా పంజా విసిరింది. ఎదురైంది పటిష్టమైన ప్రత్యర్థే అయినా... ఎదురుగా ఉన్నది భారీ స్కోరే అయినా... బంగ్లాదేశ్ చకచకా ఛేదించింది. అది కూడా 8.3 ఓవర్లు మిగిల్చి మరీ విండీస్ భరతం పట్టింది. ఈ మెగా ఈవెంట్లోనే అసాధారణ ఫామ్‌లో ఉన్న షకీబ్ అల్ హసన్ (99 బంతుల్లో 124 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించేదాకా పోరాడాడు. అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన లిటన్ దాస్ (69 బంతుల్లో 94 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఈ గెలుపులో వాటా దక్కించుకున్నాడు. దీంతో విండీస్‌పై బంగ్లా 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మొదట వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీస్కోరు చేసింది. షై హోప్ (121 బంతుల్లో 96; 4 ఫోర్లు, 1 సిక్స్), లూయిస్ (67 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (26 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, ముస్తఫిజుర్ రహ్మాన్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 41.3 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. అజేయ సెంచరీతోపాటు రెండు వికెట్లు కూడా తీసిన షకీబ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. హోప్ సెంచరీ మిస్... టాస్ నెగ్గిన బంగ్లా బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్ భాగస్వామ్యం గేల్ (13 బంతుల్లో 0)తో విఫలమైనా... మరో ఓపెనర్ లూయిస్, షై హోప్ ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచే భాగస్వా మ్యాన్ని నెలకొల్పారు. 24 ఓవర్లపాటు బంగ్లా బౌలర్లకు కొరకరాని కొయ్యలయ్యారు. ఈ క్రమంలో లూయిస్ 58 బంతుల్లో... తర్వాత హోప్ 75 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించాక లూయిస్‌ను షకీబ్ ఔట్ చేశాడు. దీంతో హోప్‌కు పూరన్ (30 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్) జతయ్యాడు. క్రీజులో పాతుకుపోతున్న దశలో పూరన్‌ను షకీబే పెవిలియన్ చేర్చాడు. రసెల్ (0) డకౌటైనా... హెట్‌మైర్ విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. కెప్టెన్ హోల్డర్ (15 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ముస్తఫిజుర్ బౌలింగ్‌లో లిటన్ దాస్ క్యాచ్ పట్టడంతో హోప్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. ధనాధన్ ఛేదన... వెస్టిండీస్ బౌలింగ్ పరంగా చూస్తే 322 పరుగుల లక్ష్యం కష్టతరమైందే! కానీ ప్రత్యర్థిపై ఇటీవలి రికార్డు, షకీబ్ అల్ హసన్ వరల్డ్‌కప్ ఫామ్ అద్భుతంగా ఉండటంతో సీన్ మారిపోయింది. దీనికి తగ్గట్లుగానే ఓపెనర్లు సౌమ్య సర్కార్ (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తమీమ్ ఇక్బాల్ (53 బంతుల్లో 48; 6 ఫోర్లు) బీజం వేశారు. తొలి వికెట్‌కు చకచకా 52 పరుగులు జోడించారు. సర్కార్ ఆట ముగిశాక వచ్చిన షకీబ్ తన జోరు కొనసాగించాడు. రన్‌రేట్ పడిపోకుండా తమీమ్, షకీబ్ జోడీ జాగ్రత్త పడింది. దీంతో 13.5 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగులు చేరింది. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాక తమీమ్ రనౌటయ్యాడు. ముష్ఫికర్ (1) విఫలమయ్యాడు. అప్పటికి 19 ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు స్కోరు 133/3. బంగ్లాదేశ్‌కు గెలిచేందుకు 189 పరుగులు కావాలి. మిథున్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన లిటన్ దాస్... షకీబ్‌కు జతయ్యాడు. ఇద్దరు టాంటన్‌లో ఠారెత్తించారు. చూస్తుండగానే 30 ఓవర్లకంటే ముందే జట్టు స్కోరు 200 (29 ఓవర్లలో) పరుగులు దాటింది. షకీబ్ 83 బంతుల్లో శతకం సాధించాడు. ఈ టోర్నీలో అతనికిది రెండో సెంచరీ. లిటన్ దాస్ 43 బం తుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. గాబ్రియెల్ వేసిన 38వ ఓవర్లో లిటన్ హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టాడు. షకీబ్ బౌండరీ బాదడంతో ఈ ఓవర్లోనే 24 పరుగులొచ్చాయి. ఈ ఓవర్‌కు ముందు 79 బంతుల్లో 52 పరుగులుగా వున్న లక్ష్యం కాస్తా 72 బం తుల్లో 28 పరుగులుగా మారిపోయింది. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 189 పరుగులు జోడించి షకీబ్, లిటన్ బంగ్లాకు సంచలన విజయాన్ని అందించారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (సి) రహీమ్ (బి) సైఫుద్దీన్ 0; లూయిస్ (సి) సబ్–షబ్బీర్ (బి) షకీబ్ 70; హోప్ (సి) లిటన్ (బి) ముస్తఫిజుర్ 96; పూరన్ (సి) సర్కార్ (బి) షకీబ్ 25; హెట్‌మైర్ (సి) తమీమ్ (బి) ముస్తఫిజుర్ 50; రసెల్ (సి) రహీమ్ (బి) ముస్తఫిజుర్ 0; హోల్డర్ (సి) మహ్ముదుల్లా (బి) సైఫుద్దీన్ 33; బ్రావో (బి) సైఫుద్దీన్ 19; థామస్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 321. వికెట్ల పతనం: 1–6, 2–122, 3–159, 4–242, 5–243, 6–282, 7–297, 8–321. బౌలింగ్: మొర్తజా 8–1–37–0, సైఫుద్దీన్ 10–1–72–3, ముస్తఫిజుర్ 9–0–59–3, మెహిదీ హసన్ 9–0–57–0, మొసద్దిక్ 6–0–36–0, షకీబ్ 8–0–54–2. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (రనౌట్) 48; సౌమ్య సర్కార్ (సి) గేల్ (బి) రసెల్ 29; షకీబ్ (నాటౌట్) 124; ముష్ఫికర్ (సి) హోప్ (బి) థామస్ 1; లిటన్ దాస్ (నాటౌట్) 94; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (41.3 ఓవర్లలో 3 వికెట్లకు) 322. వికెట్ల పతనం: 1–52, 2–121, 3–133. బౌలింగ్: కాట్రెల్ 10–0–65–0, హోల్డర్ 9–0–62–0, రసెల్ 6–0–42–1, గాబ్రియెల్ 8.3–0–78–0, థామస్ 6–0–52–1, గేల్ 2–0–22–0. 4 వన్డేల్లో 6 వేల పరుగులు చేసి 250 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడు షకీబ్. ఈ జాబితాలో ఆఫ్రిది, కలిస్, జయసూర్య ఉండగా...అందరికంటే తక్కువ మ్యాచ్‌లలో (202) షకీబ్ ఈ ఘనత సాధించాడు. -
హతవిధీ... సఫారీ ఆశలు ఆవిరి!
సౌతాంప్టన్: ఈ ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. దక్షిణాఫ్రికాను నిండా ముంచేసింది. ఇంకా విజయాల బోణీ కొట్టని సఫారీ జట్టుకు ఇది కీలకమైన పోరు. కానీ ఈ మ్యాచ్ రద్దవడంతో డు ప్లెసిస్ సేన సెమీస్ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. మొత్తానికి దక్షిణాఫ్రికాను ఈ మెగా ఈవెంట్లో ప్రత్యర్థులే కాదు వర్షం కూడా దెబ్బకొట్టింది. వానతో ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్ ఎంతోసేపు సాగలేదు. వర్షంతో ఆట నిలిచే సమయానికి దక్షిణాఫ్రికా 7.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. టాస్ నెగ్గిన వెస్టిండీస్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. డికాక్ (17 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి సఫారీ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆమ్లా (6) విఫలమయ్యాడు. కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో గేల్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మార్క్రమ్ (5)ను కూడా కాట్రెలే ఔట్ చేశాడు. కెప్టెన్ డుప్లెసిస్ (0 నాటౌట్) క్రీజులోకి వచ్చిన కాసేపటికే వర్షం కూడా వచ్చింది. మైదానాన్ని ముంచెత్తింది. దీంతో ఆటకు చాలా సేపు అంతరాయం ఏర్పడింది. చివరకు పిచ్, ఔట్‌ఫీల్డ్ మ్యాచ్ నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు పాల్ విల్సన్, రొడ్ టక్కర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లు ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. చిత్రంగా మూడు మ్యాచ్‌లాడినా పాయింట్లు గెలవలేకపోయిన దక్షిణాఫ్రికా ఖాతాలో ఎట్టకేలకు రద్దయిన మ్యాచ్‌తో ఓ పాయింట్ చేరింది. ప్రపంచకప్‌లో నేడు శ్రీలంక vs బంగ్లాదేశ్ మధ్యాహ్నం గం.3 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఆసీస్...ఆసీసే!
ఎంతైనా ఆస్ట్రేలియా... ఆస్ట్రేలియానే! మొదట వెస్టిండీస్ పేసర్ల దెబ్బకు కుదేలైనా గొప్పగా తేరుకుంది. అనంతరం కీలక సమయంలో కరీబియన్లకు ముకుతాడు వేసి మ్యాచ్‌ను వశం చేసుకుంది. మొత్తంగా తమనెందుకు ప్రొఫెషనల్ జట్టు అంటారో చాటింది. తామెంత బలంగా ఉన్నామో చాటుతూ పరోక్షంగా ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిందీ డిఫెండింగ్ చాంపియన్. మ్యాచ్‌లో 8వ నంబరు బ్యాట్స్‌మన్ కూల్టర్ నైల్ (60 బంతుల్లో 92; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అసాధారణ ఇన్నింగ్స్ ఓ విశేషమైతే... స్టీవ్ స్మిత్ సాధికారిక ఇన్నింగ్స్... పేసర్ మిచెల్ స్టార్క్ (5/46) ఐదు వికెట్ల గణాంకాలు మరో మెరుపు ప్రదర్శన. పాపం... వెస్టిండీస్! అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో పైచేయి సాధించినట్లే సాధించి పట్టు విడిచిపెట్టి పరాజయం పాలైంది. వారి పేసర్ల ప్రతాపం మరుగున పడిపోయింది. నాటింగ్‌హామ్: మ్యాచ్‌ను అదుపులోకి తెచ్చుకోవడం ఎలాగో, ప్రత్యర్థికి కళ్లెం వేయడం ఎలాగో చూపుతూ వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 15 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కూల్టర్ నైల్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (103 బంతుల్లో 73; 7 ఫోర్లు), వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (55 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు. కార్లోస్ బ్రాత్‌వైట్ (3/67) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కీపర్ షై హోప్ (105 బంతుల్లో 68; 7 ఫోర్లు), నికొలస్ పూరన్ (36 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ హోల్డర్ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) రాణించినా... మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యం... ఆసీస్ బౌలర్లు స్టార్క్, కమిన్స్ (2/41) పదునైన బంతులకు విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులే చేయగలిగింది. చెదిరిన ఇన్నింగ్స్‌ను నిలిపారు... థామస్ లయ తప్పడంతో తొలి ఓవర్లోనే ఆసీస్‌కు 10 పరుగులొచ్చాయి. ఈ ఆనందం కాసేపే. భీకర వేగంతో మరుసటి ఓవర్లో థామస్ ప్రతాపం చూపాడు. గుడ్ లెంగ్త్‌లో ఆఫ్ స్టంప్‌పై వేసిన రెండో బంతికి కెప్టెన్ ఫించ్ (6) వెనుదిరగ్గా, కాట్రెల్ బౌన్సర్‌ను స్క్వేర్ డ్రైవ్ ఆడబోయి మరో ఓపెనర్ వార్నర్ (3) వెనుదిరిగాడు. రసెల్... ఖాజా పనిపట్టాడు. మ్యాక్స్‌వెల్ (0)ను ఖాతా తెరవకుండానే కాట్రెల్ ఔట్ చేశాడు. అప్పటికి స్కోరు 38/4. ఈ దశలో స్మిత్, స్టొయినిస్ (19; 4 ఫోర్లు) నిలిచి 41 పరుగులు జోడించారు. స్టొయినిస్‌ను హోల్డర్ పెవిలియన్ చేర్చడంతో కంగారూలు మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు. ఈ దశలో స్మిత్, క్యారీ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. స్కోరు పైకి వెళ్తున్న క్రమంలో క్యారీని ఔట్ చేసి 68 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి రసెల్ ముగింపు పలికాడు. కథ మార్చిన కూల్టర్ నైల్... ఈ దశలో ఆసీస్ 200 చేసినా గొప్పే అనుకుంటుండగా ఉరుము లేని పిడుగులా వచ్చి పడ్డాడు కూల్టర్ నైల్. తొలి రెండు బంతులకు దాదాపు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతడు అనంతరం గేరు మార్చుకుంటూ పోయాడు. అంతకుముందు తమ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చిన బౌలర్లలో ఎవరినీ లెక్కచేయకుండా షాట్లు కొట్టాడు. అవతలి ఎండ్‌లో 77 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న స్మిత్... కూల్టర్ నైల్‌కు ఎక్కువగా స్ట్రయికింగ్ వచ్చేలా చూశాడు. 41 బంతుల్లో కూల్టర్ కెరీర్ తొలి అర్ధ సెంచరీ అందుకున్నాడు. సెంచరీ ఖాయమనుకుంటుండగా 49వ ఓవర్లో భారీషాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో స్టార్క్ (8) కూడా ఔటవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. కాట్రెల్... ఓ అద్భుత క్యాచ్ ఆసీస్ ఇన్నింగ్స్‌లో కాట్రెల్ పట్టిన స్మిత్ క్యాచ్ అద్భుతం అని చెప్పాలి. 44వ ఓవర్ రెండో బంతిని థామస్ ఫుల్ లెంగ్త్‌లో వికెట్లకు దూరంగా వేయగా స్మిత్ తనదైన శైలిలో లాంగ్ లెగ్‌లోకి షాట్ ఆడాడు. అంతా అది సిక్స్ అని భావించారు. కానీ, 20 గజాల దూరం నుంచి పరిగెత్తుకు వచ్చిన కాట్రెల్ ఎడమ చేతితో బంతిని మెరుపులా అందుకున్నాడు. రోప్‌కు అతి సమీపంలో ఉండటంతో గాల్లోకి ఎగరేశాడు. అనంతరం లైన్ దాటి వచ్చి క్యాచ్ పట్టాడు. విండీస్ ఆడినట్లే...ఆడి! విండీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లలో లూయిస్ (1), గేల్ (21; 4 ఫోర్లు) త్వరగానే ఔటయ్యారు. హోప్ మూడో వికెట్‌కు పూరన్ తో 68 పరుగులు, నాలుగో వికెట్‌కు హెట్‌మైర్ (21; 3 ఫోర్లు)తో 50 పరుగులు జోడించి కరీబియన్లను పోటీలోకి తెచ్చాడు. సమన్వయం కొరవడి హెట్‌మైర్ రనౌటవడం దెబ్బకొట్టింది. హోల్డర్, హోప్ 46 బంతుల్లో 41 పరుగులు జత చేసి ఆశలు రేపారు. 90 బంతుల్లో 99 చేయాల్సిన స్థితిలో హోప్ ఔటయ్యాడు. రసెల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోతున్నాడనగా స్టార్క్ యార్కర్ లెంగ్త్ బంతితో బలిగొన్నాడు. ఈ క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ చక్కగా అందుకున్నాడు. 46వ ఓవర్ చివరి బంతికి హోల్డర్ ఔటవడంతో విండీస్ పోరాటం ఓటమిలో పరుగుల అంతరాన్ని తగ్గించేందుకే అన్నట్లయింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) హెట్‌మైర్ (బి) కాట్రెల్ 3; ఫించ్ (సి) హోప్ (బి) థామస్ 6; ఖాజా (సి) హోప్ (బి) రసెల్ 13; స్మిత్ (సి) కాట్రెల్ (బి) థామస్ 73; మ్యాక్స్‌వెల్ (సి) హోప్ (బి) కాట్రెల్ 0; స్టొయినిస్ (సి) పూరన్ (బి) హోల్డర్ 19; క్యారీ (సి) హోప్ (బి) రసెల్ 45; కూల్టర్ నైల్ (సి) హోల్డర్ (బి) బ్రాత్‌వైట్ 92; కమిన్స్ (సి) కాట్రెల్ (బి) బ్రాత్‌వైట్ 2; స్టార్క్ (సి) హోల్డర్ (బి) బ్రాత్‌వైట్ 8; జంపా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 288. వికెట్ల పతనం: 1–15, 2–26, 3–36, 4–38, 5–79, 6–147, 7–249, 8–268, 9–284, 10–288. బౌలింగ్: థామస్ 10–0–63–2, షెల్డన్ కాట్రెల్ 9–0–56–2, రసెల్ 8–0–41–2, బ్రాత్‌వైట్ 10–0–67–3, హోల్డర్ 7–2–28–1, ఆష్లే నర్స్ 5–0–31–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 21; లూయిస్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 1; హోప్ (సి) ఖాజా (బి) కమిన్స్ 68; పూరన్ (సి) ఫించ్ (బి) జంపా 40; హెట్‌మైర్ (రనౌట్) 21; హోల్డర్ (సి) జంపా (బి) స్టార్క్ 51; రసెల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 15; బ్రాత్‌వైట్ (సి) ఫించ్ (బి) స్టార్క్ 16; ఆష్లే నర్స్ (నాటౌట్) 19; కాట్రెల్ (బి) స్టార్క్ 1; థామస్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–7, 2–31, 3–99, 4–149, 5–190, 6–216, 7–252, 8–252, 9–256. బౌలింగ్: స్టార్క్ 10–1–46–5, కమిన్స్ 10–3– 41–2, కూల్టర్ నైల్ 10–0–70–0, మ్యాక్స్‌వెల్ 6–1–31–0, జంపా 10–0–58–1, స్టొయినిస్ 4–0–18–0. -
విండీస్ వలలో పాక్ గిలగిల
ప్రపంచ కప్‌లో ప్రేక్షకులు హోరాహోరీ సమరాలు మాత్రమే చూడాలి, ఏకపక్ష మ్యాచ్‌లు ఉండరాదని చిన్న జట్లకు చోటు లేకుండా చేశాం. తాజా వరల్డ్ కప్ గురించి ఐసీసీ ఇచ్చుకున్న వివరణ ఇది. అయితే పది జట్ల పోరులో కూడా చెత్త ప్రదర్శన సాధ్యమేనని చూపించిన పాకిస్తాన్ ఆట ఐసీసీకి కూడా షాక్ ఇచ్చి ఉంటుంది! ఏమాత్రం వెన్నెముక లేని బ్యాటింగ్‌తో వరల్డ్ కప్ బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్ బౌలింగ్ ముందు కుదేలైంది. ఆడుతోంది వన్డేనా, టి20 మ్యాచా కూడా అర్థం చేసుకోలేని రీతిలో కేవలం 21.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నాటితరం తమ పేసర్లను గుర్తుకు తెచ్చే విధంగా ఈతరం విండీస్ బౌలర్లు వరుసగా షార్ట్‌పిచ్ బంతులతో చెలరేగడంతో బెంబేలెత్తిపోయిన పాక్ చేతులెత్తేసింది. పాక్ ప్రపంచ కప్‌లో తమ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేయగా... 36.2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన విండీస్ వరల్డ్‌కప్‌లో రికార్డు స్థాయిలో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. నాటింగ్‌హామ్: సరిగ్గా రెండు వారాల క్రితం ఇదే మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో పాకిస్తాన్ 340 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. పాక్ ఆటతీరు ఎలాంటిదో చెప్పే విధంగా ఇప్పుడు ఆ జట్టు మరో ఉదాహరణను చూపించింది. వంద పరుగులు దాటడమే కష్టమై తమ అనిశ్చితిని మరోసారి ప్రదర్శించింది. శుక్రవారం ఇక్కడి ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 21.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్), బాబర్ ఆజమ్ (33 బంతుల్లో 22; 2 ఫోర్లు) టాప్ స్కోరర్లు కాగా మరో ఇద్దరు రెండంకెల స్కోరు దాటారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఒషాన్ థామస్ (4/27) ప్రత్యర్థిని కుప్పకూల్చగా... హోల్డర్ 3, రసెల్ 2 వికెట్లు తీశారు. అనంతరం విండీస్ 13.4 ఓవర్లలో 3 వికెట్లకు 108 పరుగులు చేసి విజయాన్నందుకుంది. క్రిస్ గేల్ (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తనదైన శైలిలో చెలరేగగా, నికోలస్ పూరన్ (19 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఆమిర్‌కే 3 వికెట్లు దక్కాయి. టపటపా... తన రెండో ఓవర్లో ఇమామ్ ఉల్ హఖ్ (2)ను ఔట్ చేసి కాట్రెల్ పాక్ పతనానికి శ్రీకారం చుట్టగా, ఆ తర్వాత విండీస్ పేసర్లు తమ పదునైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. 10 ఓవర్లు ముగిసేసరికి పాక్ 45 పరుగులు చేసింది. 12 పరుగుల వద్ద హెట్‌మైర్ క్యాచ్ వదిలేసినా బాబర్ ఆజమ్ దానిని పెద్దగా వాడుకోలేకపోయాడు. కీపర్ హోప్ అద్భుత క్యాచ్‌తో అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత హోల్డర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాక్‌ను మళ్లీ దెబ్బ తీశాడు. ముందుగా కీపర్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి సర్ఫరాజ్ (8) వెనుదిరిగాడు. బంతి బ్యాట్‌కు తగల్లేదని భావించి అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగా... విండీస్ రివ్యూ కోరి ఫలితం సాధించింది. అదే ఓవర్లో షార్ట్ బంతిని ఆడలేక ఇమాద్ (1) పెవిలియన్ చేరాడు. మరో ఆరు పరుగుల వ్యవధిలో షాదాబ్ (0), హసన్ అలీ (1), హఫీజ్ (16) పెవిలియన్ చేరడంతో పాక్ స్కోరు 83/9 వద్ద నిలిచింది. వంద పరుగులు దాటడం కూడా కష్టమే అనిపించిన స్థితిలో వహాబ్ రియాజ్ (18) కొన్ని పరుగులు జత చేశాడు. హోల్డర్ వేసిన ఓవర్లో అతను 2 సిక్సర్లు, ఫోర్ కొట్టడం విశేషం. చివరకు వహాబ్‌ను థామస్ క్లీన్ బౌల్డ్ చేసి పాక్ ఆట ముగించాడు. గేల్ జోరు... అతి స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ తక్కువ వ్యవధిలోనే హోప్ (11), డారెన్ బ్రేవో (0) వికెట్లు కోల్పోయింది. అయితే గేల్ మాత్రం అభిమానులను ఆనందపర్చడంలో విఫలం కాలేదు. అతని దెబ్బకు పేసర్ హసన్ అలీ బిత్తరపోవాల్సి వచ్చింది. హసన్ అలీ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను... హసన్ తర్వాతి ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు, మూడో ఓవర్లో కూడా మరో రెండు ఫోర్లు బాదాడు. తన తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసి ఆత్మవిశ్వాసం ప్రదర్శించిన వహాబ్ రియాజ్ రెండో ఓవర్లో వరుసగా 6, 4, 4 బాది గేల్ దూకుడు ప్రదర్శించాడు. 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం గేల్‌ను ఆమిర్ వెనక్కి పంపగా, మిగిలిన పనిని పూరన్ పూర్తి చేశాడు. వహాబ్ ఓవర్లో 4, 6 కొట్టిన పూరన్... అదే బౌలర్ మరుసటి ఓవర్లో మరో ఫోర్, సిక్స్ దంచి మ్యాచ్‌ను గెలిపించాడు. రసెల్ 18 బంతుల్లో... ఇది చూడగానే ఎప్పటిలాగే చెలరేగి ఏ 50 పరుగులో చేసి ఉంటాడు అనే ఆలోచన రావడం సహజం. కానీ ఈసారి మాట్లాడుతోంది అతని బౌలింగ్ గురించి! బ్యాటిం గ్లో ఆండ్రీ రసెల్ విధ్వంసం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు... ఇటీవల ఐపీఎల్లో అతని మెరు పులు చూశాం. కానీ శుక్రవారం పాక్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లో రసెల్ బౌలింగ్ ఒక అద్భుతం. షార్ట్...షార్ట్...షార్ట్... దాదాపు 146 కిలోమీటర్ల వేగంతో వరుసగా షార్ట్ పిచ్ బంతులు విసిరి అతను పాక్ బ్యాట్స్‌మెన్‌ను ఒక ఆటాడుకున్నాడు. ఎక్కడా వేగం తగ్గకుండా, కచ్చితత్వంతో, నిలకడగా షార్ట్ బంతులు వేయడంలో అతని అసాధారణ ప్రతిభ కనిపించింది. రసెల్ వేసిన 18 బంతుల్లో 15 బంతులు షార్ట్ పిచ్‌వే కావడం విశేషం! అతని మూడు ఓవర్ల స్పెల్ పాక్‌లో భయం పుట్టించింది. రసెల్ తొలి ఓవర్లో బౌన్సర్‌ను ఫఖర్ జమాన్ ఆడలేకపోయాడు. అతని హెల్మెట్ గ్రిల్‌కు తగిలి బంతి వికెట్లపై పడింది. రెండో ఓవర్లో షార్ట్ బంతులను ఆడలేక బాబర్ బెదిరిపోయాడు. మెయిడిన్‌గా ముగిసిన మూడో ఓవర్లో ఎత్తులో వేగంగా దూసుకొచ్చిన బంతిని ఆడలేక సొహైల్ వికెట్ సమర్పించుకున్నాడు. 3 ఓవర్లలో కేవలం 4 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన రసెల్ బౌలింగ్ ప్రదర్శన రాబోయే రోజుల్లో ప్రత్యర్థులకు ప్రమాద హెచ్చరికగా చెప్పవచ్చు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఇమామ్ ఉల్ హక్ (సి) హోప్ (బి) కాట్రెల్ 2; ఫఖర్ జమాన్ (బి) రసెల్ 22; బాబర్ ఆజమ్ (సి) హోప్ (బి) థామస్ 22; సొహైల్ (సి) హోప్ (బి) రసెల్ 8; సర్ఫరాజ్ (సి) హోప్ (బి) హోల్డర్ 8; హఫీజ్ (సి) కాట్రెల్ (బి) థామస్ 16; ఇమాద్ (సి) గేల్ (బి) హోల్డర్ 1; షాదాబ్ (ఎల్బీ) (బి) థామస్ 0; హసన్ అలీ (సి) కాట్రెల్ (బి) హోల్డర్ 1; రియాజ్ (బి) థామస్ 18; ఆమిర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (21.4 ఓవర్లలో ఆలౌట్) 105. వికెట్ల పతనం: 1–17, 2–35, 3–45, 4–62, 5–75, 6–77, 7–78, 8–81, 9–83, 10–105. బౌలింగ్: కాట్రెల్ 4–0–18–1; హోల్డర్ 5–0–42–3; రసెల్ 3–1–4–2; బ్రాత్‌వైట్ 4–0–14–0; థామస్ 5.4–0–27–4. వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (సి) షాదాబ్ (బి) ఆమిర్ 50; హోప్ (సి) హఫీజ్ (బి) ఆమిర్ 11; డారెన్ బ్రేవో (సి) ఆజమ్ (బి) ఆమిర్ 0; పూరన్ (నాటౌట్) 34; హెట్‌మైర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (13.4 ఓవర్లలో 3వికెట్లకు) 108. వికెట్ల పతనం: 1–36, 2–46, 3–77. బౌలింగ్: ఆమిర్ 6–0–26–3; హసన్ అలీ 4–0–39–0; రియాజ్ 3.4–1–40–0. ఫఖర్ జమాన్ బౌల్డ్ -
విండీస్‌ను ఆపగలదా పాక్!
నాటింగ్‌హామ్: తమదైన రోజున అద్భుత ప్రదర్శన చేయగల విండీస్–పాక్ మధ్య మ్యాచ్ అంటే అభిమానులకు ఎంతో కొంత మజా దక్కడం ఖాయం. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, విధ్వంసక ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ పునరాగమనంతో పుంజుకొన్న వెస్టిండీస్‌ను ఎదుర్కొనడం... ఇటీవలి కాలంలో వన్డే ఫామ్ తీసికట్టుగా ఉన్న పాకిస్తాన్‌కు సవాల్‌తో కూడుకున్నదే. అయితే, రెండేళ్ల క్రితం ఇక్కడే చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలో టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, బాబర్ ఆజమ్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. వీరు రాణించి భారీ స్కోరు అందిస్తే... పేసర్లు ఆమిర్, షాహీన్ ఆఫ్రిది మిగతా బాధ్యత చూసుకుంటారని భావిస్తోంది. విండీస్ వీరులు ఎలా ఆడతారో? గతాని కంటే భిన్నంగా ఉన్న వెస్టిండీస్ ఈసారి కప్‌లో మెరుగైన ఫలితాలు సాధించేలా కనిపిస్తోంది. జేసన్ హోల్డర్ నేతృత్వంలో మెరుగ్గా రాణిస్తోంది. నాలుగు నెలల క్రితం సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను వన్డేల్లో నిలువరించింది. నిలకడగా ఆడే షై హోప్, దూకుడుగా బాదే హెట్‌మైర్ జట్టుకు మరింత బలాన్ని చేకూర్చారు. గేల్‌కు తోడుగా ఇన్నింగ్స్ ప్రారంభించే ఎవిన్ లూయిస్ సైతం భారీ షాట్లతో హడలెత్తించగలడు. మిడిలార్డర్లో డారెన్ బ్రావో ఫామ్ అందుకోవాల్సి ఉంది. రోచ్, కాట్రెల్ ప్రధాన పేసర్లు కాగా... ఒషేన్ థామస్, గాబ్రియెల్‌లో ఒకరికే అవకాశం దక్కనుంది. పేస్ ఆల్‌రౌండర్లు హోల్డర్, రసెల్ పాత్ర కీలకం కానుంది. ఏకైక స్పిన్నర్‌గా ఆష్లే నర్స్ ఆడనున్నాడు. బ్యాటింగ్‌లో చెలరేగితేనే విండీస్‌కు విజయావకాశాలు ఉంటాయి. పరాజయ పరంపరకు అడ్డుపడుతుందా? ప్రాక్టీస్ మ్యాచ్ సహా గత 10 వన్డేల్లో పాక్ ఓటమి పాలైంది. దీన్నిబట్టే ఆ జట్టు పరిస్థితి తెలుస్తోంది. ఈ పరంపరకు విండీస్‌పై విజయంతో అడ్డువేయాలని భావిస్తోంది. మిడిలార్డర్ నుంచి మెరుగైన ప్రదర్శన లేకపోవడం ఒక కారణమైతే, బౌలింగ్‌లో పదును తగ్గడం మరో కారణం. ఓపెనర్లు ఇమాముల్ హక్, ఫఖర్ జమాన్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ ఫామ్‌తోనే జట్టు కాస్తయినా నిలవగలుగుతోంది. హారిస్ సొహైల్, మొహమ్మద్ హఫీజ్లలో చోటు దక్కినవారు నాలుగో స్థానంలో దిగుతారు. ఐదో స్థానంలో వచ్చే సర్ఫరాజ్ ఔటైతే స్కోరును నడిపించేవారు లేకపోవడం ఇబ్బందికరం. ఆమిర్, హసన్ అలీ, ఆఫ్రిది పేస్ త్రయం చేసే మ్యాజిక్ పాక్ గెలుపునకు కారణం కాగలదు. ముఖాముఖి రికార్డు రెండు జట్లు మొత్తం 133 వన్డేల్లో తలపడ్డాయి. 70 మ్యాచ్‌ల్లో విండీస్, 60 మ్యాచ్‌ల్లో పాక్ గెలిచాయి. మూడు మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్లు పది మ్యాచ్‌ల్లో ఎదురుపడగా విండీస్ ఏడింటిలో నెగ్గింది. పాకిస్తాన్‌కు మూడింటిలో విజయం దక్కింది. ఇంగ్లండ్ వేదికగా ఈ రెండు జట్లు ఆరుసార్లు ‘ఢీ’కొన్నాయి. ఒక మ్యాచ్‌లో పాక్ నెగ్గగా... ఐదింటిలో విండీస్ గెలిచింది. అటు పటిష్టమైన జట్లుగానూ చెప్పలేని... అంతమాత్రాన బలహీనమైనవిగానూ పరిగణించలేని పాకిస్తాన్, వెస్టిండీస్ శుక్రవారం ప్రపంచ కప్‌లో తలపడనున్నాయి. నిలకడ లేని, అనూహ్య ఆటతీరుకు ఈ రెండు జట్లు పెట్టింది పేరు. భారీ హిట్టర్లతో కూడిన విండీస్‌ను ఎంతమేరకు నిలువరిస్తుందనే దానిపైనే పాక్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇదే సమయంలో ఆమిర్ వంటి నాణ్యమైన పేసర్లు చెలరేగితే కరీబియన్లకు ముకుతాడు పడినట్లే. -
బంగ్లాదేశ్ కొత్త చరిత్ర
ఢాకా: టెస్టు చరిత్రలో బంగ్లాదేశ్ తమకంటూ ఓ ఘన చరిత్రను సొంతం చేసుకుంది. చివరిదైన రెండో టెస్టులో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 184 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటిదాకా 112 టెస్టులాడిన బంగ్లాదేశ్ 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే ఇందులో ఇన్నింగ్స్ విజయం లభించడం మాత్రం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. తద్వారా ఐదు నెలల క్రితం వెస్టిండీస్ గడ్డపై తమకెదురైన వైట్‌వాష్‌కు బదులు తీర్చుకుంది. బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు తీసుకున్నాడు. ఆదివారం ఒక్కరోజే అతను 9 వికెట్లను పడగొట్టిన తొలి బంగ్లా బౌలర్‌గా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోరు 75/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్టిండీస్ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాకు 387 పరుగుల భారీ అధిక్యం లభించింది. హెట్‌మైర్ (39; 3 ఫోర్లు, 1 సిక్స్), డౌరిచ్ (37; 3 ఫోర్లు) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మెహదీ హసన్ (7/58) స్పిన్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ తలవంచారు. తర్వాత ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగుల వద్ద ఆలౌటైంది. టాపార్డర్‌లో హోప్ (25), రోచ్ (37; 7 ఫోర్లు) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా... హెట్‌మైర్ (93; 1 ఫోర్, 9 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మెహదీ హసన్ 5, తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 508 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
విండీస్‌తో మూడో టి20కి సిద్ధార్థ్ కౌల్
వెస్టిండీస్‌తో ఆదివారం చెన్నైలో జరుగనున్న ఆఖరి టి20 మ్యాచ్ నుంచి టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఈ ముగ్గురికి తగినంత విశ్రాంతి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. పంజాబ్ పేసర్ సిద్ధార్థ్ కౌల్‌ను జట్టులోకి తీసుకున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2–0తో నెగ్గిన విషయం తెలిసిందే. కౌల్ ఈ ఏడాది ఐర్లాండ్‌పై టి20 అరంగేట్రం చేశాడు. -
హర్మన్ సేన ఏం చేస్తుందో?
వేగంగా ఎదుగుతున్న భారత మహిళా క్రికెట్‌కు ప్రపంచ కప్ కల తీరనిదిగానే ఉంది. వన్డేల్లో రెండుసార్లు విశ్వకిరీటం తుది మెట్టుపై చేజారగా, టి20ల్లో దానికి దగ్గరగా కూడా రాలేక పోతోంది. 2009, 2010 ప్రపంచ కప్‌లలో సెమీ ఫైనల్స్ చేరడమే ఇప్పటివరకు ఉత్తమం. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఈసారి ఆశలు రేపుతోంది. టి20లకు తగిన బ్యాట్స్‌మెన్, స్పిన్‌తో మాయ చేసే బౌలర్లు ఉండటమే దీనికి కారణం. ప్రొవిడెన్స్ (గయానా): టి20 ప్రపంచ కప్‌లో తమ చివరి ఘనత అయిన సెమీఫైనల్‌ను వెస్టిండీస్ గడ్డపైనే (2010) అందుకున్న భారత్... మరోసారి అదే చోట అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఇక్కడి గయానా నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో అమీ సాటర్‌వెయిట్ నాయకత్వంలోని న్యూజిలాండ్‌తో తలపడనుంది. టోర్నీలో మొదటి మ్యాచ్ కూడా ఇదే. తమకంటే మెరుగైన కివీస్‌ను ఆరంభంలోనే ఢీ కొనడం టీమిండియాకు ఒకింత పరీక్షే. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ సేన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే, రెండుసార్లు రన్నరప్ అయిన న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతుంది. దానికి అడ్డుకట్ట వేయాలంటే టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాల్సిందే. ఆ ప్రయాణం స్ఫూర్తితో... పేలవమైన టి20 ప్రపంచ కప్ రికార్డును సరిదిద్దుకునే క్రమంలో భారత్‌కు గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రదర్శన ప్రేరణ కానుంది. మిథాలీ రాజ్, పూనమ్ యాదవ్, కెప్టెన్ హర్మన్, స్మృతి మంధాన వంటి అనుభవజ్జులతో పాటు జెమీమా రోడ్రిగ్స్, వికెట్ కీపర్ తానియా భాటియా, పూజా వస్త్రకర్, తెలుగమ్మాయి అరుంధతీరెడ్డిలతో జట్టు అనుభవజ్ఞులు, యువత కలయికగా ఉంది. అయితే, వీరిలో ఏడుగురు 15 కంటే తక్కువ టి20లు ఆడటం కొంత ప్రతికూలత. హర్మన్, స్మృతి, జెమీమాల భారీ హిట్టింగ్‌కు, మిథాలీ సంయమనం తోడైతే భారీ స్కోరుకు బాటలు పడతాయి. ముఖ్యంగా ఇటీవల ఇంగ్లండ్ లీగ్‌లలో చెలరేగి ఆడిన మంధానపై ఎక్కువ ఆశలున్నాయి. నెమ్మదైన విండీస్ పిచ్‌ల కారణంగా బౌలింగ్‌లో స్పిన్నర్లపై భారీ అంచనాలున్నాయి. పూనమ్ లెగ్ స్పిన్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్‌ల ఎడమ చేతి వాటం స్పిన్ కీలకం కానుంది. కానీ, అనుభవశీలి జులన్ గోస్వామి రిటైర్మెంట్తో పేస్ బౌలింగ్‌లో లోటు కనిపిస్తోంది. అరుంధతీ, పూజా వస్త్రకర్, మాన్సి జోషి త్రయం దీనిని ఏమేరకు తీరుస్తుందనేదానిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. భారత జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), మిథాలీరాజ్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, తానియా భాటియా, వేదా కృష్ణమూర్తి, ఏక్తా బిష్త్, దయాలన్ హేమలత, అనూజ పాటిల్, దీప్తి శర్మ, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, పూజ వస్త్రాకర్, మాన్సి జోషి, అరుంధతీరెడ్డి రాత్రి గం. 8.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
సమమా? సిరీసా?
టి20లు అంటేనే మెరుపు షాట్లు... భారీ స్కోర్లు! కానీ, కోల్‌కతాలో ఆదివారం తొలి మ్యాచ్ ఇలాంటి మెరుపులేమీ లేకుండానే సాగింది. వెస్టిండీస్ ఆట ఇంతేనని సరిపెట్టుకుంటే, టీమిండియా సైతం కొంత కష్టంగానే లక్ష్యాన్ని ఛేదించింది. జట్ల బలాబలాలు ఎలా ఉన్నా, పిచ్ గురించి వస్తున్న విశ్లేషణలను చూస్తే లక్నోలో జరుగనున్న రెండో మ్యాచ్ కూడా మొదటిదానికి భిన్నంగా ఉండేట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తెలివిగా ఆడిన జట్టుదే విజయం అనడంలో సందేహం లేదు. మరి... మరో గెలుపుతో రోహిత్ బృందం సిరీస్‌ను ఇక్కడే కైవసం చేసుకుంటుందా? పర్యాటక జట్టు పుంజుకుని పోటీ ఇస్తుందా? లక్నో: టెస్టు, వన్డే సిరీస్‌ల తరహాలోనే టి20 సిరీస్‌నూ ఒడిసి పట్టేందుకు మరో విజయం దూరంలో టీమిండియా. వెస్టిండీస్‌తో మంగళవారం లక్నోలో కొత్తగా నిర్మించిన ‘భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి అంతర్జాతీయ స్టేడియం’లో రెండో మ్యాచ్. రోహిత్ సేనకు అటు సిరీస్‌తో పాటు పొట్టి ఫార్మాట్ ప్రపంచ చాంపియన్‌పై విజయాల రికార్డు మెరుగుపర్చుకునే అవకాశం. అయితే, అప్పటివరకు ఎలా ఆడినా, ఉప్పెనలా విరుచుకుపడి క్షణాల్లో ఫలితం మార్చేసే కరీబియన్లకు ఏమేరకు ముకుతాడు వేస్తారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంది. మరోవైపు పిచ్ నెమ్మదిగా ఉంటుందనే అంచనాల రీత్యా అభిమానులకు ఉర్రూతలూగించే క్రికెట్ విందు లేనట్లే. భారత్... భువీతో! బంతి ఆగిఆగి బ్యాట్‌పైకి రావడంతో కోల్‌కతాలో టీమిండియాకు ఛేదన ఏమంత సులువు కాలేదు. ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైనా, లోతైన బ్యాటింగ్ లైనప్‌తో భారత్ పెద్దగా కంగారు పడాల్సిన పని లేకపోయింది. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు అరంగేట్ర ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అండగా నిలిచి లాంఛనాన్ని ముగించాడు. అయితే, ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంతవరకు సరైన ఇన్నింగ్స్ ఆడకపోవడం జట్టుకు కొంత ఇబ్బందిగా ఉంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగితే కెప్టెన్ రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్, మనీశ్ పాండే సాధ్యమైనన్ని పరుగులు అందించాల్సి ఉంటుంది. రిషభ్ పంత్ మరోసారి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గానే వచ్చే వీలుంది. దినేశ్ కార్తీక్, కృనాల్ ఆఖర్లో చెలరేగితే ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించవచ్చు. ఛేదన అయినా ఇదే తీరులో ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌కు భారత్ బౌలింగ్‌లో ఒక మార్పుతో బరిలో దిగే అవకాశం ఉంది. పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకి వస్తాడు. బుమ్రా, ఖలీల్ అహ్మద్ అతడితో పాటు బంతిని పంచుకుంటారు. స్పిన్ బాధ్యతలు కుల్దీప్, కృనాల్ తీసుకుంటారు. విండీస్... పోరాడితే ప్రత్యర్థి ప్రతిభ కంటే మ్యాచ్, పిచ్ పరిస్థితులను పట్టించుకోకుండా ఆడటమే కోల్‌కతాలో వెస్టిండీస్ పరాజయానికి ప్రధాన కారణమైంది. బ్యాట్స్‌మెన్ సహజ శైలిలో షాట్లకు దిగి వికెట్లు పారేసుకోవడంతో మోస్తరు లక్ష్యాన్నీ నిర్దేశించలేకపోయింది. ఫామ్‌లో ఉన్న షై హోప్ అనవసర రనౌట్ మరింత దెబ్బతీసింది. బౌలింగ్‌లోనే జట్టు ప్రతిఘటన చూపగలిగింది. కెప్టెన్ బ్రాత్‌వైట్, పియర్ పొదుపైన బౌలింగ్‌కు తోడు పేసర్ థామస్ మెరుపు స్పెల్ ఆశలు రేపినా అది విజయానికి సరిపోలేదు. హెట్‌మైర్, పొలార్డ్, బ్రావో తలో చేయి వేసి... ఆఖర్లో బ్రాత్‌వైట్ బ్యాట్ ఝళిపిస్తే భారత్‌కు సవాల్ విసిరే స్కోరు చేయగలదు. ఏదేమైనా బ్యాట్స్‌మెన్ కాస్త ఓపికగా ఆడి భారీగా పరుగులు సాధిస్తేనే విండీస్ విజయం అందుకోగలదు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, కేఎల్ రాహుల్, పాండే, పంత్, దినేశ్ కార్తీక్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, ఖలీల్. వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), హోప్, రామ్‌దిన్, హెట్‌మైర్, బ్రావో, పొలార్డ్, రావ్మన్ పావెల్, అలెన్, కీమో పాల్, పియర్, థామస్. పిచ్, వాతావరణం కొత్తగా నిర్మించిన ఈ మైదానంలో పిచ్ చాలా నెమ్మదిగా ఉంది.వర్ష సూచనలు లేవు. రాత్రి వేళ మంచు కురుస్తుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కే మొగ్గు చూపొచ్చు. రాత్రి గం.7 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఈడెన్ గార్డెన్స్‌లో నేడు వెస్టిండీస్‌తో తొలి టి20
-
ధోని లేకుండానే... ధనాధన్‌కు
మహేంద్ర సింగ్ ధోని... దాదాపు 12 ఏళ్ల క్రితం టీమిండియా ఆడిన తొలి టి20 నుంచి జట్టు సభ్యుడు. దేశానికి ప్రపంచ కప్ అందించిన ఘనుడు. మధ్యలో అప్రధానమైన ఒకటీ, అరా సిరీస్‌ల నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నా, ఇన్నేళ్లలో అతడు లేకుండా తొలిసారిగా భారత్ పొట్టి ఫార్మాట్ బరిలో దిగుతోంది. ఇదే విశేషాంశంగా ఆదివారం వెస్టిండీస్‌తో మొదటి టి20లో తలపడనుంది. అటు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి నేపథ్యంలో స్వదేశంలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే ఓపెనర్ రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. గడ్డ ఏదైనా,ఏ క్షణంలోనైనా విరుచుకుపడి అంచనాలను తలకిందులు చేయగల సమర్థులైన కరీబియన్లతో... క్షణాల్లో ఫలితంతారుమారయ్యే ఈ ఆధునిక క్రికెట్లో మరి ఆధిపత్యం ఎవరిదో...? కోల్‌కతా: టెస్టు సిరీస్‌ను ఏకపక్షంగా గెల్చుకుని, వన్డే సిరీస్‌ను ఒడిసిపట్టిన టీమిండియా... టి20 సిరీస్‌లోనూ వెస్టిండీస్ సంగతి తేల్చేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. మిగతా విషయాలు ఎలా ఉన్నా తమ ఆటతీరుకు సరితూగే పొట్టి ఫార్మాట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పర్యాటక జట్టు అత్యంత కఠినమైనది. పైగా ఈసారి దాదాపు చాలామంది కొత్తవారితో ఆడనుంది. వారి సామర్థ్యంపై అంచనాకు వచ్చి, చెలరేగే లోపు అడ్డుకునేందుకు భారత్ వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుంది. కృనాల్ అరంగేట్రం? ఆరుగురు బ్యాట్స్‌మెన్ సహా ముగ్గురేసి పేసర్లు, స్పిన్నర్లతో టీమిండియా మరోసారి ముందు రోజే 12 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఇందులో ముంబై ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పేరుంది. కుల్దీప్ రూపంలో ఇప్పటికే ఒక ఎడంచేతి వాటం స్పిన్నర్ ఉన్నందున తుది కూర్పులో అతడికి చోటు దక్కుతుందో? లేదో? చూడాలి. ఆల్‌రౌండర్ కోటాలో పరిగణిస్తే మాత్రం కృనాల్ అరంగేట్రం ఖాయం. బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్ తర్వాత కేఎల్ రాహుల్ వన్‌డౌన్‌లో వస్తాడు. మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ 4, 5 స్థానాల్లో దిగుతారు. ధోని బాధ్యతలు రిషభ్ పంత్ తీసుకుంటాడు. పేస్ భారాన్ని భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్ పంచుకుంటారు. మరో కోణంలో చూస్తే... సొంతగడ్డపై బ్యాటింగ్ గురించి బెంగపడాల్సిన పని లేదు కాబట్టి, విండీస్ దూకుడైన ఆటకు అడ్డుకట్ట వేయాలని భావిస్తూ కృనాల్‌కు తోడుగా ఐదుగురు ప్రధాన బౌలర్లతో ఆడినా ఆడొ చ్చు. అప్పుడు పాండే, కార్తీక్‌లలో ఒకరిని పక్కనపెడతారు. అలాగైతే ఇది కొత్త ప్రయత్నమే అవుతుంది. విండీస్ ఏం చేస్తుందో? టి20ల్లో మెరుపు ఆటకు పెట్టింది పేరు కరీబియన్లు. కానీ, ఈ సిరీస్‌కు కీలక ఆటగాళ్లు దూరమైనందున ఆ జట్టు కూర్పుపై స్పష్టత కరవైంది. కనీసం ఓపెనర్లు ఎవరనేదీ తెలియడం లేదు. తాజాగా ఆల్‌రౌండర్ రసెల్ గాయం కారణంగా టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాథమికంగా చూస్తే, డారెన్ బ్రావో, రవ్మన్ పావెల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించవచ్చు. యువ హెట్‌మైర్ వన్‌డౌన్‌లో దిగుతాడు. దినేశ్ రామ్‌దిన్, కీరన్ పొలార్డ్ తర్వాత వస్తారు. కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ సహా కారీ పియరీ, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ ఆల్ రౌండర్ నైపుణ్యం కలవారు. వన్డేల్లో తేలిపోయిన పేసర్లు ఒషేన్ థామస్, కీమో పాల్, స్పిన్నర్ అలెన్... ఈసారి టీమిండియాకు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. పంత్‌కు ఇది చక్కటి అవకాశం ధోని వంటి గొప్ప ఆటగాడు లేకపోవడం మాకు లోటే. పరిమిత వనరులతో ప్రపంచ కప్‌నకు వెళ్లలేం. ప్రత్యామ్నాయాలను సరి చూసుకునే ప్రయత్నంలో ఇది రిషభ్ పంత్‌తో పాటు దినేశ్ కార్తీక్‌కు తమను తాము నిరూపించుకునే గొప్ప అవకాశం. కెప్టెన్సీ చేపట్టడం అన్ని విధాలా సహాయ పడుతోంది. టి20ల్లో విండీస్ బలమైన ప్రత్యర్థి. చాలా ప్రమాదకరం కూడా. –రోహిత్‌శర్మ, భారత కెప్టెన్ భారతే ఫేవరెట్... కానీ... గెలుపు గణాంకాల్లో మేం మెరుగ్గా ఉన్నా, సొంతగడ్డపై భారతే ఫేవరెట్. ముఖ్యంగా ఐపీఎల్ వారికి ఎంతో ఉపయోగపడింది. అయినా, మేం అండర్ డాగ్స్ కాదు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటిన ఉత్సాహవంతులైన కుర్రాళ్లతో బరిలో దిగుతున్నాం. సంచలనం సృష్టించి ట్రోఫీ నెగ్గాలనుకుంటున్నాం. ధోని, కోహ్లి లేకపోవడం మాకు లాభమే. కానీ, భారత జట్టులో ప్రతిభకు లోటు లేదు. –వెస్టిండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, కృనాల్ పాండ్యా/కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, యజువేంద్ర చహల్. వెస్టిండీస్: కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, హెట్‌మైర్, పొలార్డ్, రామ్‌దిన్, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, కారీ పియరీ, ఒషేన్ థామస్, మెకాయ్, రావ్మన్ పావెల్. పిచ్, వాతావరణం ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనది. మ్యాచ్‌కు వర్షం నుంచి ముప్పు లేదు. గత వారం అకాల వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే గత మూడు రోజుల్లో ఎండ కాయడంతో మ్యాచ్‌కు మైదానం సిద్ధమైంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. -
కోలుకొని కొట్టేయాల్సిందే..
సరిగ్గా రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లోనే 3–2తో వన్డే సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత సొంతగడ్డపై ఏ సిరీస్‌లో కూడా టీమిండియా రెండు మ్యాచ్‌లు ఓడిపోలేదు. అయితే ఇప్పుడు మూడో వన్డే ఫలితం తర్వాత మరోసారి అలాంటి సందేహం కనిపిస్తోంది. అభేద్యమైన కోహ్లి సేన అతి సునాయాసంగా సిరీస్ గెలుస్తుందని భావిస్తే వెస్టిండీస్ ఒక్క సారిగా పరిస్థితిని మార్చేసింది. ముందుగా ‘టై’తో బయటపడి ఆ తర్వాత పూర్తి స్థాయి బలగం ఉండి కూడా మ్యాచ్ ఓడిన భారత్... వెంటనే దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే రెట్టింపు శ్రమించాల్సి ఉంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో సాధించిన గెలుపు విండీస్ శిబిరంలో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెంచేసింది. ఈ నేపథ్యంలో నాలుగో మ్యాచ్ కీలకంగా మారింది. ముంబై: భారత జట్టు గత ఏడాది దాదాపు ఇదే సమయంలో సొంతగడ్డపై శ్రీలంకతో ఆడుతున్నా... రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన గురించే ఎక్కువగా ఆలోచించింది. ఇప్పుడూ అలాగే ఆస్ట్రేలియా సిరీస్‌కే సిద్ధమైపోవాల్సిన సమయంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌ను కూడా సీరియస్‌గా తీసుకోవాల్సి వస్తోంది! విండీస్ పోరాటపటిమ కోహ్లి సేనను అలా మార్చేసింది. తొలి వన్డేలో 322 పరుగులు చేసి... రెండో మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చి... మూడో మ్యాచ్‌లో ఏకంగా గెలుపు రుచి చూసిన హోల్డర్ బృందం మన జట్టుకు సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు నేడు నాలుగో వన్డేలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మక వాంఖడే మైదానంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం నేపథ్యంలో బ్రబోర్న్ స్టేడియానికి (సీసీఐ) మార్చారు. జాదవ్‌కు చోటు... ఒక్క మ్యాచ్‌కే మిడిలార్డర్ వైఫల్యం అని సూత్రీకరించలేం కానీ ప్రమాద ఘంటిక మాత్రం మోగినట్లే. టాప్–3లో ఒక మ్యాచ్‌లో కనీసం ఇద్దరు అద్భుతంగా ఆడుతుండటంతో భారత్‌కు ఇప్పటి వరకు ఈ సమస్య కనిపించలేదు. కానీ రోహిత్, ధావన్ విఫలం కావడం... మిడిల్, లోయర్ ఆర్డర్లలో ఎవరూ కోహ్లికి అండగా నిలవకపోవ డంతో భారత్ గత వన్డేలో పరాజయం పాలైంది. నాలుగో స్థానం కోసం ఇప్పటికే కోహ్లి విశ్వాసం పొందిన అంబటి రాయుడు నిలకడగా రాణించడం ఎంతో అవసరం. ఇక ఐదు, ఆరు స్థానాల్లో పంత్, ధోని సత్తా చాటితేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. పంత్‌కు తొలి సిరీస్ కాబట్టి ఇంకా సమయం పట్టవచ్చు కానీ ఇప్పటికే టి20ల్లో చోటు కోల్పోయిన ధోని తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అతను ధనాధన్ షాట్లు ఆడి చాలా కాలం కాగా... వన్డే శైలికి తగినట్లుగా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ కీలక పరుగులు సాధించాల్సి ఉంది. పుణే వన్డేలో ఐదుగురు బౌలర్లతో ఆడటంతో ఏడో స్థానంలోనే భువనేశ్వర్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఈసారి ఖలీల్ స్థానంలో జడేజాకు అవకాశం దక్కితే జట్టు బ్యాటింగ్ మెరుగవుతుంది. మరోవైపు కేదార్ జాదవ్ కూడా తుది జట్టులో ఆడటం దాదాపుగా ఖాయమైంది. అతని వైవిధ్యమైన బౌలింగ్ జట్టుకు అదనపు బలం కానుంది. అయితే జాదవ్‌ను ఆడించేందుకు పంత్‌ను పక్కన పెడతారా అనేది చూడాలి. అన్నింటికి మించి తిరుగులేని ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న విరాట్ కోహ్లి అత్యద్భుత ఫామ్‌తో భారత్ పైచేయిగానే కనిపిస్తోంది. అయితే అతని ఒక్కడి ఆట విజయానికి సరిపోదని గత మ్యాచ్ నిరూపించిన నేపథ్యంలో టీమిండియా సమష్టిగా చెలరేగాల్సి ఉంది. అదే జట్టుతో... తమ బ్యాటింగ్ ప్రదర్శనే భారత జట్టు ప్రధాన పేసర్లు బుమ్రా, భువనేశ్వర్‌లను తిరిగి జట్టులోకి తీసుకొనేలా చేసిందని వ్యాఖ్యానించిన వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా మూడో వన్డేలో తమ జట్టు ఆటతో కచ్చితంగా సంతోషించి ఉంటాడు. బుమ్రా నాలుగు వికెట్లు తీసినా... భువనేశ్వర్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు మరోసారి అదే జోరు కొనసాగించాలని విండీస్ భావిస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న షై హోప్, అతనికి తోడుగా చెలరేగిపోతున్న హెట్‌మైర్‌లు మళ్లీ ఇన్నింగ్స్‌లో కీలకం కానున్నారు. కెప్టెన్ హోల్డర్ ఆల్‌రౌండ్ నైపుణ్యం పుణేలో కనిపించగా... అనూహ్యంగా నర్స్ కూడా తన బ్యాటింగ్ బలాన్ని చూపించాడు. బౌలర్లను లెక్క చేయకుండా ఎదురుదాడి చేస్తేనే ఫలితం ఉంటుందని విండీస్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ చూపించింది. ఇప్పుడూ అదే విశ్వాసంతో ఆడితే మరోసారి ఆ జట్టుది పైచేయి కావచ్చు. బ్యాటింగ్‌లో మెరవకపోయినా మూడు కీలక వికెట్లు తీసిన శామ్యూల్స్ అనుభవం కూడా విండీస్‌కు పనికొస్తోంది. కోహ్లిని ఆపలేకపోయినా... ఇతర ఆట గాళ్లను కట్టడి చేయగలిగితే మ్యాచ్ గెలవొచ్చని ఆ జట్టుకు అర్థమైంది. మూడో వన్డేలో ప్రతీ ఒక్కరు తమ బాధ్యతను నెరవేర్చడంతో తుది జట్టులో మా ర్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాయుడు, పంత్/ జాదవ్, ధోని, జడేజా, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా. వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), కీరన్ పావెల్, హేమ్రాజ్, హోప్, శామ్యూల్స్, హెట్‌మైర్, రావ్మన్ పావెల్, అలెన్, నర్స్, రోచ్, మెక్కాయ్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. సిరీస్‌లోని గత మ్యాచ్‌లలాగే భారీ స్కోరుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ 2017 ఫిబ్రవరి తర్వాత ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కూడా జరగలేదు కాబట్టి అంచనా వేయడం కష్టంగా మారింది. ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అయితే 2009లో (శ్రీలంకతో టెస్టు) అయింది. ధోని తీవ్ర సాధన... ఫామ్ కోల్పోయి, టి20ల్లో చోటు కోల్పోయి పరుగుల కోసం తంటాలు పడుతున్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అదనంగా శ్రమించేందుకు సిద్ధమయ్యాడు. మ్యాచ్ ముందు రోజు ఆదివారం ‘ఆప్షనల్ ప్రాక్టీస్’ అయినా అతను మాత్రం నెట్స్‌లో చెమటోడ్చాడు. స్థానిక బౌలర్లు బంతులు వేయగా దాదాపు 45 నిమిషాల పాటు ధోని బ్యాటింగ్ చేశాడు. ధోనితో పాటు రోహిత్, అంబటి రాయుడు, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ సాధన చేయగా మిగతా జట్టు సభ్యులు మాత్రం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. వెస్టిండీస్ ఆటగాళ్లు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. -
మూడో రోజే ముగించారు
ఐదేళ్ల వ్యవధి... అదే రెండు టెస్టుల సిరీస్... అదే 2–0 ఫలితం... మళ్లీ మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్... 2013లో రెండు ఇన్నింగ్స్ విజయాలైతే... ఈసారి ఒక ఇన్నింగ్స్, మరొకటి 10 వికెట్ల గెలుపు... సొంతగడ్డపై ఆడుతూ వెస్టిండీస్‌పై భారత్ అపార ఆధిపత్యానికి మరో నిదర్శనం... తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల స్వల్ప ఆధిక్యమే కోల్పోయినా రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కోలేక విండీస్ చతికిల పడింది. ఫలితంగా మరోసారి భారీ విజయాన్ని పళ్లెంలో పెట్టి భారత్‌కు అప్పగించింది. ఉమేశ్ ముందుండి నడిపించగా మిగతా ముగ్గురూ తలా ఓ చేయి వేయడంతో ప్రత్యర్థిని కుప్పకూల్చిన టీమిండియా 72 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ అందుకుంది. సాక్షి, హైదరాబాద్: రెండో టెస్టు తొలి రోజు వెస్టిండీస్ ఆట చూస్తే ఈ మ్యాచ్ మాత్రం మూడు రోజుల్లో ముగిసిపోదని అనిపించింది. కానీ విండీస్ అందరి అంచనాలను తప్పని నిరూపించింది. తమకే సాధ్యమైన రీతిలో కుప్పకూలి వేగంగా ఓటమిని ఆహ్వానించింది. ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముగిసిన రెండో టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 127 పరుగులకే ఆలౌటైంది. సునీల్ ఆంబ్రిస్ (38)దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం 72 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 16.1 ఓవర్లలో 75 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు పృథ్వీ షా (45 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అజేయంగా నిలిచారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 308/4తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (134 బంతుల్లో 92; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (183 బంతుల్లో 80; 7 ఫోర్లు) సెంచరీలు సాధించడంలో విఫలమయ్యారు. హోల్డర్‌కు 5 వికెట్లు దక్కాయి. కెరీర్లో తొలిసారి మ్యాచ్‌లో పది వికెట్లు (10/133) పడగొట్టిన ఉమేశ్ యాదవ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... ఒక సెంచరీ, ఓ అర్ధసెంచరీ సహా 237 పరుగులు చేసిన పృథ్వీ షాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈనెల 21న గువాహటిలో జరిగే తొలి మ్యాచ్‌తో ఐదు వన్డేల సిరీస్ మొదలవుతుంది. రాణించిన అశ్విన్... మూడో రోజు పూర్తి ఉత్సాహంతో ఆట ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్ ఆశించిన స్థాయిలో సాగలేదు. పంత్, రహానే సెంచరీలు చేజార్చుకున్నారు. 59 పరుగులకే జట్టు మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. ముందుగా ఒకే ఓవర్లో రహానే, జడేజా (0)లను ఔట్ చేసి హోల్డర్ దెబ్బ తీశాడు. కొద్ది సేపటికే గాబ్రియెల్ వేసిన బంతిని పంత్ కట్ చేయగా కవర్ పాయింట్లో హెట్మెయిర్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దాంతో వరుసగా రెండో టెస్టులో కూడా పంత్ 90ల్లోనే వెనుదిరిగాడు. కుల్దీప్ (6)ను ఔట్ చేసిన హోల్డర్ తన ఖాతాలో ఐదో వికెట్ వేసుకోగా, ఉమేశ్ (2) కూడా నిలవలేదు. అయితే మరో ఎండ్‌లో అశ్విన్ (83 బంతుల్లో 35; 4 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. గాయం కారణంగా బౌలింగ్‌కు దూరమైన శార్దుల్ (4 నాటౌట్) బ్యాటింగ్‌కు వచ్చి అండగా నిలవడంతో అశ్విన్ మరికొన్ని పరుగులు జోడించాడు. 19 బంతుల వ్యవధిలో నాలుగు బౌండరీలు బాదిన అనంతరం గాబ్రియెల్ బౌలింగ్‌లో అశ్విన్ బౌల్డ్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెర పడింది. టపటపా... తొలి ఇన్నింగ్స్‌లో ప్రదర్శించిన స్ఫూర్తి, పట్టుదలను వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కొనసాగించలేకపోవడంతో ఆ జట్టు పతనం వేగంగా సాగింది. తొలి ఇన్నింగ్స్‌లో చివరి రెండు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్ మీద నిలిచిన ఉమేశ్ తొలి ఓవర్ తొలి బంతికి దానిని పూర్తి చేయలేకపోయినా... తర్వాతి బంతికే బ్రాత్‌వైట్ (0)ను వెనక్కి పంపించాడు. అనంతరం అశ్విన్ తన రెండో ఓవర్లో పావెల్ (0)ను ఔట్ చేశాడు. గత 18 ఏళ్లలో భారత గడ్డపై విదేశీ జట్టు ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ కావడం ఇదే తొలిసారి. అనంతరం కొద్దిసేపు పోరాడి నిలబడే ప్రయత్నం చేసిన హెట్మెయిర్ (17), హోప్ (28) ఐదు బంతుల వ్యవధిలో వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఛేజ్ (6)ను ఉమేశ్ చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతో 68 పరుగులకు విండీస్ సగం వికెట్లు కోల్పోయింది. డౌరిచ్ (0) కూడా తొలి బంతికే వెనుదిరిగాక టీ విరామం వచ్చింది. ఆ తర్వాత ఆంబ్రిస్, హోల్డర్ (19) ఏడో వికెట్‌కు 38 పరుగులు జోడించి కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి విండీస్ 19 పరుగులకు చివరి 4 వికెట్లు కోల్పోయింది. అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. పృథ్వీ, రాహుల్ చకచకా పరుగులు సాధించారు. ముఖ్యంగా రాహుల్ కొంత ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. 12 పరుగుల వద్ద సబ్‌స్టిట్యూట్ వికెట్‌కీపర్ హామిల్టన్ సునాయాస స్టంపింగ్‌ను వృథా చేయకుండా ఉంటే భారత్ తొలి వికెట్ కోల్పోయేదే. ఆ తర్వాత భారత్ మరో అవకాశం ఇవ్వలేదు. నిర్ణీత సమయం ముగిసినా ఫలితం వచ్చే అవకాశం ఉండటంతో పొడిగించిన అదనపు సమయంలో టీమిండియా విజయాన్ని అందుకుంది. బిషూ బంతిని కవర్స్ దిశగా షా ఫోర్ కొట్టడంతో గెలుపు పరిపూర్ణమైంది. స్కోరు వివరాలు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311; భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) హోల్డర్ 4; పృథ్వీ షా (సి) హెట్మెయిర్ (బి) వారికెన్ 70; పుజారా (సి) సబ్–హామిల్టన్ (బి) గాబ్రియెల్ 10; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) హోల్డర్ 45; రహానే (సి) హోప్ (బి) హోల్డర్ 80; రిషభ్ పంత్ (సి) హెట్మెయిర్ (బి) గాబ్రియెల్ 92; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) హోల్డర్ 0; అశ్విన్ (బి) గాబ్రియెల్ 35; కుల్దీప్ యాదవ్ (బి) హోల్డర్ 6; ఉమేశ్ (సి) సబ్–హామిల్టన్ (బి) వారికెన్ 2; శార్దుల్ ఠాకూర్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (106.4 ఓవర్లలో ఆలౌట్) 367. వికెట్ల పతనం: 1–61, 2–98, 3–102; 4–162; 5–314; 6–314; 7–322; 8–334; 9–339; 10–367. బౌలింగ్: గాబ్రియెల్ 20.4–1– 107–3, హోల్డర్ 23–5–56–5, వారికెన్ 31–7–84–2, ఛేజ్ 9–1–22–0; బిషూ 21–4–78–0, బ్రాత్‌వైట్ 2–0–6–0. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (సి) పంత్ (బి) ఉమేశ్ 0; పావెల్ (సి) రహానే (బి) అశ్విన్ 0; హోప్ (సి) రహానే (బి) జడేజా 28; హెట్మెయిర్ (సి) పుజారా (బి) కుల్దీప్ 17; ఆంబ్రిస్ (ఎల్బీ (బి) జడేజా 38; ఛేజ్ (బి) ఉమేశ్ 6; డౌరిచ్ (బి) ఉమేశ్ 0; హోల్డర్ (సి) పంత్ (బి) జడేజా 19; బిషూ (నాటౌట్) 10; వారికన్ (బి) అశ్విన్ 7; గాబ్రియెల్ (బి) ఉమేశ్ 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (46.1 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–0; 2–6; 3–45; 4–45; 5–68; 6–70; 7–108; 8–109; 9–126; 10–127. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 12.1–3–45–4; అశ్విన్ 10–4–24–2; కుల్దీప్ 13–1–45–1; జడేజా 11–5–12–3. భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (నాటౌట్) 33; రాహుల్ (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 75. బౌలింగ్: హోల్డర్ 4–0–17–0; వారికన్ 4–0–17–0; బిషూ 4.1–0–19–0; ఛేజ్ 4–0–14–0. ► భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన మూడో భారత పేసర్ ఉమేశ్ యాదవ్. గతంలో జవగళ్ శ్రీనాథ్ (13/132 కోల్‌కతాలో పాకిస్తాన్‌పై 1999లో), కపిల్‌దేవ్ (రెండుసార్లు; 11/146 చెన్నైలో పాక్‌పై 1980లో; 10/135 అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌పై 1983లో) మాత్రమే ఈ ఘనత సాధించారు. ► స్వదేశంలో భారత్‌కిది వరుసగా (2013 నుంచి) పదో సిరీస్ విజయం. సొంతగడ్డపై అత్యధిక వరుస సిరీస్‌లు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా (రెండుసార్లు 10 చొప్పున; 1994–95 నుంచి 2000–01 వరకు; 2004 నుంచి 2008–09 వరకు) పేరిట ఉన్న రికార్డును భారత్ సమం చేసింది. ► వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన చివరి మూడు టెస్టు సిరీస్‌లలో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. 2011లో అశ్విన్, 2013లో రోహిత్ ఈ ఘనత సాధించారు. ► అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు పొందిన పదో క్రికెటర్‌గా, భారత్ నుంచి నాలుగో క్రికెటర్‌గా పృథ్వీ షా గుర్తింపు పొందాడు. ► రాహుల్ ద్రవిడ్ తర్వాత (92, 93 శ్రీలంకపై 1997లో) వరుస ఇన్నింగ్స్‌లలో 90ల్లో ఔటైన రెండో భారత క్రికెటర్‌గా రిషభ్ పంత్ నిలిచాడు. ► భారత్‌పై భారత్‌లో ఒకే టెస్టులో అర్ధ సెంచరీ చేసి, ఐదు వికెట్లు కూడా తీసిన ఐదో విదేశీ పేస్ బౌలర్ జేసన్ హోల్డర్. గతంలో బ్రూస్ టేలర్ (న్యూజిలాండ్; కోల్‌కతాలో 1965); జాన్ లేవర్ (ఇంగ్లండ్; ఢిల్లీలో 1976); ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్; ముంబైలో 1980); మాల్కమ్ మార్షల్ (వెస్టిండీస్; కోల్‌కతాలో 1983) ఈ ఘనత సాధించారు. ► రవిశాస్త్రి (న్యూజిలాండ్‌పై వెల్లింగ్టన్లో 1981లో), కపిల్‌దేవ్ (ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో 1985లో) తర్వాత ఓ టెస్టులో నాలుగు బంతుల తేడాలో మూడు వికెట్లు తీసిన మూడో భారతీయ బౌలర్ ఉమేశ్ యాదవ్. హోల్డర్, పృథ్వీ షా-జడేజా సంబరం -
తొలి ఆసియా దేశంగా
ఇమ్రాన్ ఖాన్, వసీం ఆక్రమ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని వంటి మహామహుల సారథ్యాలలోని జట్లు ఈ మైదానంలో విజయాన్ని సాధించలేకపోయాయి. టెస్ట్ ప్రారంభానికి ముందు ట్యాంపరింగ్ ఉదంతం.. కెప్టెన్ చండిమాల్‌పై వేటు.. ఒత్తిడిలో లంక యువ జట్టు.. సురంగ లక్మల్‌కు సారథ్య బాధ్యతలు.. సిరీస్‌లో వెనుకంజ.. టెస్టులో పలుమార్లు వర్షం అంతరాయం. ఇవన్నీ శ్రీలంక విజయానికి అడ్డంకి కాలేదు. ఆసియా జట్లకు కలగా ఉండే కింగ్స్టన్ ఓవల్ మైదానంలో గెలిచి శ్రీలంక చరిత్ర సృష్టించింది. బ్రిడ్జిటౌన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. పేస్‌కు స్వర్గధామమైన కింగ్స్టన్ ఓవల్ మైదానంలో గెలిచిన తొలి ఆసియా దేశంగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. చివరి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సిరీస్‌లో విశేషంగా రాణించిన విండీస్ కీపర్ షేన్ డౌరిచ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ డేనైట్ టెస్టులో చివరకు విజయం లంకనే వరించింది. 144 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకను హోల్డర్ దెబ్బతీశాడు, వరుసగా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచాడు. దీంతో ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ దశలో శ్రీలంక 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో డి పెరీరా (23 నాటౌట్), కుశాల్ పెరీరా (28 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు విజయాన్నందించారు. రెండో ఇన్నింగ్స్‌లో హోల్డర్ ఐదు వికెట్లు సాధించగా, కీమర్ రోచ్‌కు ఒక్క వికెట్ దక్కింది. చివరి టెస్టులో ఇరజట్ల స్కోర్ వివరాలు వెస్టిండీస్ : 204 & 93 శ్రీలంక : 154 & 144/6 -
విండీస్ తడబాటు
సెయింట్ లూసియా: శ్రీలంకతో రెండో టెస్టులో వెస్టిండీస్ తడబడింది. మూడో రోజు ఆరంభంలోనే కీలకమైన స్మిత్ (61; 4 ఫోర్లు, 1 సిక్స్), హోప్ (19; 2 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. 123/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన వెస్టిండీస్ కడపటి వార్తలందేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 62 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులు చేసింది. ఆట ఆలస్యంగా: మూడో రోజు ఆట రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. రెండో రోజు ఆట ముగిసే దశలో బంతి ఆకారం మారిందని సందేహించిన ఫీల్డు అంపైర్లు అలీమ్ దార్, ఇయాన్ గౌల్డ్ మూడో రోజు బంతిని మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆటకు ముందే లంక కెప్టెన్ చండిమాల్‌కు చెప్పారు. దీంతో లంక జట్టు మైదానంలోకి దిగేందుకు ససేమిరా అనడంతో వివాదమైంది. ఈ దశలో మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్... లంక కోచ్ హతురుసింఘా, మేనేజర్ గురుసిన్హాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపాక ఎట్టకేలకు లంకేయులు ఆడేందుకు సిద్ధమయ్యారు. -
పాక్ చేతిలో విండీస్ వైట్‌వాష్
కరాచీ : అనుకున్నట్లే జరిగింది. టీ20లో అద్భుతాలకు మారుపేరైన వెస్టిండీస్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ వేదిక జరిగిన సిరీస్‌లో ఎలాంటి మ్యాజిక్‌లు చేయలేదు. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన విండీస్ ఓటమితోనే సిరీస్‌ను ముగించింది. విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఇదివరకే రెండు టీ20లను పాక్ గెలిచిన విషయం తెలిసిందే. పాక్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జామన్‌కు ‘ప్లెయర్ ఆఫ్ ది మ్యాచ్’, బాబర్ అజామ్‌కు ‘ప్లెయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు లభించాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన విండీస్.. బ్యాట్స్‌మెన్ ప్లెచర్(52; 43బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), శ్యాముల్స్(31; 25బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివర్లో రామ్‌దిన్ (42; 18బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగుల చేసింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా నవాజ్, ఉస్మాన్ ఖాన్, అష్రాష్ తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పాక్ 16.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ ఓపెనర్లు ఫఖర్ జామన్ (40; 17బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), బాబర్ అజామ్(51; 40బంతుల్లో 6ఫోర్లు) శుభారంభం ఇవ్వగా, హుస్సేన్(31నాటౌట్; 28బంతుల్లో 3ఫోర్లు), ఆసిఫ్ (25 నాటౌట్; 16బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) రాణించారు. స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు లేక నిరాశ చెందిన పాక్ అభిమానులకు ఈ సిరీస్‌తో భవిష్యత్తు సిరీస్‌లపై ఆశలు చిగురించాయి. -
క్రికెట్ క్యాలండర్ 2018
కొత్త ఏడాదిలో కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, మరికొన్ని కొత్త ఆశయాలు... ప్రపంచాన్ని గెలిచేందుకు, ప్రపంచానికి పరిచయమయ్యేందుకు మీ కోసమే అంటూ ఎన్నో వేదికలు, మరెన్నో ఆహ్వానాలు... క్రీడాకారులు అద్భుతాలు సృష్టించేందుకు ప్రతీ ఏడూ కొత్త రూపంలో అవకాశాలు వెతుక్కుంటూనే వస్తాయి. గత పరాజయాలను మరచి విజయాల వైపు దూసుకెళ్లేవారు కొందరైతే, సాధించిన ఘనతలతో సరిపెట్టుకోకుండా ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసేవారు మరికొందరు. అలాంటి క్షణాలను ఆస్వాదిస్తూ ఆటగాళ్ల గెలుపును తమ గెలుపుగా భావించే అభిమానులందరి కోసం కొత్త సంవత్సరం పసందైన క్రీడా సమరాలతో సిద్ధంగా ఉంది. క్రికెట్లో మన పదునేమిటో చూపించేందుకు దక్షిణాఫ్రికా నుంచి మొదలు పెట్టి ఇంగ్లండ్, ఆపై ఆస్ట్రేలియా వరకు మూడు కఠిన పర్యటనలు. క్రికెట్ జనవరి 5–9: భారత్–దక్షిణాఫ్రికా, తొలి టెస్టు (కేప్‌టౌన్) జనవరి 13–17: భారత్–దక్షిణాఫ్రికా, రెండో టెస్టు (సెంచూరియన్) జనవరి 24–28: భారత్–దక్షిణాఫ్రికా, మూడో టెస్టు (జోహన్నెస్‌బర్గ్) జనవరి 27–28: బెంగళూరులో ఐపీఎల్–11 వేలం కార్యక్రమం ఫిబ్రవరి 1: భారత్–దక్షిణాఫ్రికా, తొలి వన్డే (డర్బన్) ఫిబ్రవరి 4: భారత్–దక్షిణాఫ్రికా, రెండో వన్డే (సెంచూరియన్) ఫిబ్రవరి 7: భారత్–దక్షిణాఫ్రికా, మూడో వన్డే (కేప్‌టౌన్) ఫిబ్రవరి 10: భారత్–దక్షిణాఫ్రికా, నాలుగో వన్డే (జోహన్నెస్‌బర్గ్) ఫిబ్రవరి 13: భారత్–దక్షిణాఫ్రికా, ఐదో వన్డే (పోర్ట్ ఎలిజబెత్) ఫిబ్రవరి 16: భారత్–దక్షిణాఫ్రికా, ఆరో వన్డే (సెంచూరియన్) ఫిబ్రవరి 18: భారత్–దక్షిణాఫ్రికా, తొలి టి20 (జోహన్నెస్‌బర్గ్) ఫిబ్రవరి 21: భారత్–దక్షిణాఫ్రికా, రెండో టి20 (సెంచూరియన్) ఫిబ్రవరి 24: భారత్–దక్షిణాఫ్రికా, మూడో టి20 (కేప్‌టౌన్) మార్చి 8–20: శ్రీలంకలో టి20 ముక్కోణపు టోర్నీ (భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్) ఏప్రిల్ 4–మే 27: ఐపీఎల్–2018 జూలై 3: భారత్–ఇంగ్లండ్, తొలి టి20 (మాంచెస్టర్) జూలై 6: భారత్–ఇంగ్లండ్, రెండో టి20 (కార్డిఫ్) జూలై 8: భారత్–ఇంగ్లండ్, మూడో టి20 (బ్రిస్టల్) జూలై 12: భారత్–ఇంగ్లండ్, తొలి వన్డే (నాటింగ్హమ్) జూలై 14: భారత్–ఇంగ్లండ్, రెండో వన్డే (లార్డ్స్) జూలై 17: భారత్–ఇంగ్లండ్, మూడో వన్డే (లీడ్స్) ఆగస్టు 1–5: భారత్–ఇంగ్లండ్, తొలి టెస్టు (బర్మింగ్హమ్) ఆగస్టు 9–13: భారత్–ఇంగ్లండ్, రెండో టెస్టు (లార్డ్స్) ఆగస్టు 18–22: భారత్–ఇంగ్లండ్, మూడో టెస్టు (నాటింగ్హమ్) ఆగస్టు 30–సెప్టెంబర్ 3: భారత్–ఇంగ్లండ్, నాలుగో టెస్టు (సౌతాంప్టన్) సెప్టెంబర్ 7–11: భారత్–ఇంగ్లండ్, ఐదో టెస్టు (లండన్) సెప్టెంబర్: ఆసియా కప్ (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, క్వాలిఫయర్) అక్టోబర్–నవంబర్: భారత్‌లో వెస్టిండీస్ పర్యటన (3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టి20) నవంబర్–డిసెంబర్: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన (4 టెస్టులు) -
తొలి వన్డే న్యూజిలాండ్‌దే
వాంగరీ: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న న్యూజిలాండ్ వన్డేల్లోనూ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లెవిస్ (76), పావెల్ (59) అర్ధ సెంచరీలు సాధించారు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (16) విఫలమయ్యాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రేస్‌వెల్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసింది. హెరిక్ వర్కర్ (57), టేలర్ (49 నాటౌట్), మున్రో (49) కివీస్‌ను గెలిపించారు. ఈ ఫలితంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యం సాధించింది. రెండో వన్డే శనివారం క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది. -
పోరాడుతున్న విండీస్
వెల్లింగ్టన్: ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవడానికి వెస్టిండీస్ పోరాడుతోంది. 386 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (79 బ్యాటింగ్; 7 ఫోర్లు, ఒక సిక్స్), హోప్ (21 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 447/9తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ జట్టు 9 వికెట్లకు 520 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి టెస్ట్ ఆడుతున్న టామ్ బ్లండెల్ (107 నాటౌట్; 13 ఫోర్లు ఒక సిక్స్) సెంచరీ చేయడం విశేషం. -
పట్టుబిగించిన కివీస్
వెల్లింగ్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ పట్టు బిగించింది. గ్రాండ్‌హోమ్ (74 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో పాటు రాస్ టేలర్ (93; 10 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 313 పరుగుల ఆధిక్యంలో ఉంది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ టెస్టులో ఓటమి తప్పించుకోవాలంటే కరీబియన్ జట్టు తీవ్రంగా పోరాడాల్సిందే. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 85/2తో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ జీత్ రావల్ (42) వికెట్ త్వరగానే కోల్పోయింది. ఆ తర్వాత రాస్ టేలర్‌తో జత కలిసిన నికోల్స్ (67) విండీస్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. గ్రాండ్‌హోమ్ క్రీజులోకి వచ్చాక ఆట స్వరూపమే మారింది. వచ్చీరాగానే టి20 తరహా ఇన్నింగ్స్ ఆడుతూ... 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది తొమ్మిదో వేగవంతమైన శతకం. ఆట ముగిసే సమయానికి బ్లండెల్ (57 బ్యాటింగ్, 6 ఫోర్లు)తో పాటు బౌల్ట్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో రోచ్ 3, కమిన్స్, చేజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. -
జింబాబ్వే 159 ఆలౌట్
బులవాయో: లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ (5/79) ధాటికి జింబాబ్వే జట్టు విలవిల్లాడింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. మసకద్జా (42; 4 ఫోర్లు, 1 సిక్స్), ఎర్విన్ (39; 5 ఫోర్లు) మాత్రమే రాణించారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (38 బ్యాటింగ్), హోప్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ 148 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
బెన్ స్టోక్స్ పిడిగుద్దులు!
లండన్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. బ్రిస్టల్‌లోని పబ్ బయట ఒక వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించిన ఘటనకు సంబంధించి పోలీసులు స్టోక్స్‌ను అరెస్ట్ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు. విచారణ అనంతరం అతడిని విడుదల చేశారు. సహచర క్రికెటర్ అలెక్స్ హేల్స్ కూడా స్టోక్స్‌తో పాటు ఉన్నాడు. విండీస్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం అనంతరం సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఒక నిమిషంలో స్టోక్స్ పదిహేను పిడిగుద్దులు కురిపించి సదరు వ్యక్తి తీవ్ర గాయాలు కావడానికి కారణమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియా ఇప్పుడు వైరల్ అయ్యింది. నేరం రుజువైతే స్టోక్స్‌కు అక్కడి చట్టాల ప్రకారం కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. స్టోక్స్, హేల్స్ కోచింగ్ క్యాంప్‌కు హాజరు కాలేదంటూ ఈ ఘటనను నిర్ధారించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్... వీరిద్దరిని బుధవారం జరిగే నాలుగో వన్డే నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. స్టోక్స్ ఈ తరహాలో ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు. 2012లో తప్పతాగి రాత్రంతా గొడవ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి హెచ్చరికతో వదిలి పెట్టారు. తర్వాతి ఏడాది ఇంగ్లండ్ ‘ఎ’ జట్టు సభ్యుడిగా ఉన్నప్పుడు మళ్లీ తాగుడు కారణంగానే అతడిని జట్టు నుంచి తప్పించారు. 2014లో మత్తులో లాకర్‌పై పిడిగుద్దులు కురిపించి చేతిని గాయపర్చుకున్న అతను టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. -
బెన్ స్టోక్స్ పిడిగుద్దులు!