వెస్టిండీస్‌ క్రికెటర్‌ ఊచ కోత.. కేవలం 26 బంతుల్లోనే! | Charles hits 93 to lead Sharjah Warriors to 5 wicket win over Dubai Capitals | Sakshi
Sakshi News home page

ILT20: వెస్టిండీస్‌ క్రికెటర్‌ ఊచ కోత.. కేవలం 26 బంతుల్లోనే!

Published Tue, Jan 23 2024 10:11 AM | Last Updated on Tue, Jan 23 2024 11:16 AM

Charles hits 93 to lead Sharjah Warriors to 5 wicket win over Dubai Capitals - Sakshi

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్-2024లో షార్జా వారియర్స్‌ తొలి విజయం నమోదు చేసింది. సోమవారం దుబాయ్‌ వేదికగా దుబాయ్‌ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో షార్జా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

దుబాయ్‌ బ్యాటర్లలో సామ్‌ బిల్లింగ్స్‌(52) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సికిందర్‌ రజా 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. షార్జా వారియర్స్‌ బౌలర్లలో డానియల్‌ సామ్స్‌ 3 వికెట్లు పడగొట్టగా.. తీక్షణ, క్రిస్‌ వోక్స్‌ తలా రెండు వికెట్లు సాధించారు. 

చార్లెస్‌ ఊచకోత..
అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా వారియర్స్‌ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షార్జా బ్యాటర్లలో విండీస్‌ ఓపెనర్‌ జాన్సెన్‌ చార్లెస్‌ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

కేవలం 26 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు బసిల్‌ హమిద్‌(24) ఆఖరిలో బౌండరీలు వర్షం కురిపించి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు.
చదవండి: AUS vs WI: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్‌వెల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement