Sharjah
-
షార్జా స్టేడియంలో చిరంజీవి సందడి (ఫోటోలు)
-
అక్టోబర్ 6న భారత్, పాక్ పోరు
దుబాయ్: బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తరలి వెళ్లిన మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీని యూఏఈలోని రెండు వేదికల్లో (షార్జా, దుబాయ్) నిర్వహిస్తారు. రెండు మ్యాచ్‌లు ఉంటే... భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. టాప్–10 దేశాలు పోటీపడుతున్న ఈ టోరీ్నలో మొత్తం 23 మ్యాచ్‌లున్నాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో... అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. భారత్ సెమీఫైనల్ చేరుకుంటే అక్టోబర్ 17న దుబాయ్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో ఆడుతుంది. అక్టోబర్ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్‌కు ‘రిజర్వ్ డే’ కేటాయించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక... గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లున్నాయి. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు 10 ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
వెస్టిండీస్ క్రికెటర్ ఊచ కోత.. కేవలం 26 బంతుల్లోనే!
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో షార్జా వారియర్స్ తొలి విజయం నమోదు చేసింది. సోమవారం దుబాయ్ వేదికగా దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో షార్జా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దుబాయ్ బ్యాటర్లలో సామ్ బిల్లింగ్స్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సికిందర్ రజా 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. షార్జా వారియర్స్ బౌలర్లలో డానియల్ సామ్స్ 3 వికెట్లు పడగొట్టగా.. తీక్షణ, క్రిస్ వోక్స్ తలా రెండు వికెట్లు సాధించారు. చార్లెస్ ఊచకోత.. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా వారియర్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షార్జా బ్యాటర్లలో విండీస్ ఓపెనర్ జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు బసిల్ హమిద్(24) ఆఖరిలో బౌండరీలు వర్షం కురిపించి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. చదవండి: AUS vs WI: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్వెల్.. -
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్‌పై నిషేధం
ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌పై దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) నిషేధం విధించింది. లీగ్‌లో భాగమైన షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నవీన్‌పై 20 నెలల నిషేధం విధిస్తున్నట్లు లీగ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. నవీన్‌కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నవీన్‌పై నిషేధం విధించింది. నవీన్ ఈ ఏడాది ఆరంభంలో (2023, జనవరి) జరిగిన ILT20 సీజన్-1లో షార్జా వారియర్స్ తరపున ఆడాడు. ముందస్తు అగ్రిమెంట్లో భాగంగా ఫ్రాంచైజీ యాజమాన్యం నవీన్‌కు రిటెన్షన్ నోటీసులు పంపింది. అయితే నవీన్ సదరు నోటీసులపై సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో లీగ్ మేనేజ్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో నవీన్‌పై 20 నెలల నిషేధం విధించింది. నవీన్.. 2023 సీజన్లో వారియర్స్ తరఫున మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, 24.36 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ లీగ్‌లో నవీన్ ప్రాతినిథ్యం వహించిన షార్జా వారియర్స్ ఐదో స్థానంతో గత సీజన్‌ను ముగించింది. ఈ సీజన్లో వారు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించారు. -
పసికూనపై ప్రతాపం.. క్లీన్ స్వీప్ చేసిన విండీస్, ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు కూడా..!
షార్జా వేదికగా యూఏఈతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో విండీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి పసికూనపై ప్రతాపం చూపింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. విండీస్ స్పిన్నర్లు కెవిన్ సింక్లెయిర్ (4/24), కారియ (2/34) మాయాజాలం ధాటికి 36.1 ఓవర్లలో 184 పరుగులకు చాపచుట్టేసింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో భారత సంతతి ఆటగాడు అరవింద్ (70) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్ ముహమ్మద్ వసీం (42), రమీజ్ షెహజాద్ (27), అలీ నసీర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. అలిక్ అతనాజే (45 బంతుల్లో 65; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), షామారా బ్రూక్స్ (39), రోస్టన్ ఛేజ్ (27 నాటౌట్) రాణించడంతో మరో 89 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యూఏఈ బౌలర్లలో అయాన్ అఫ్జల్, ముహమ్మద్ జవాదుల్లా, కార్తీక్ మెయ్యప్పన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో విండీస్ ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. విండీస్ ఓపెనర్ అలిక్ అతనాజే వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టి సాధించాడు. అతనాజే 26 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. తద్వారా టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (26 బంతుల్లో) పేరిట ఉండిన రికార్డును సమం చేశాడు. టీమిండియాకే చెందిన మరో బ్యాటర్ ఇషాన్ కిషన్.. తన వన్డే అరంగేట్రంలో 33 బంతుల్లో ఫిఫ్టి చేశాడు. చదవండి: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్ ఫైర్ -
రూట్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. శతక్కొట్టి గెలిపించిన ప్రత్యర్ధి బ్యాటర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో వరుసగా రెండు రోజుల్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. నిన్న (జనవరి 20) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (59 బంతుల్లో 110; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ బాదగా.. ఇవాళ (జనవరి 21) దుబాయ్ క్యాపిటల్స్‌పై షార్జా వారియర్స్ ఓపెనర్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కాడ్మోర్ సుడిగాలి శతకంతో ఊగిపోవడంతో క్యాపిటల్స్ నిర్ధేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ కేవలం 14.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాడ్మోర్, జో డెన్లీ (17 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) వారియర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్ బౌలర్లలో అకీఫ్ రజా 2 వికెట్లు పడగొట్టగా.. చమిక కరుణరత్నేకు ఓ వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ జో రూట్ (54 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకంతో, లారెన్స్ (38 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. వారియర్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో టామ్ కోహ్లెర్ కాడ్మోర్ బాదిన శతకం రెండోది కాగా, అంతకుముందు మ్యాచ్‌లో అలెక్స్ హేల్స్ చేసినది లీగ్‌లో తొట్టతొలి సెంచరీ కావడం విశేషం. -
నిజామాబాద్: షార్జాకి తీసుకెళ్లి.. పత్తా లేకుండా పోయి..
మోర్తాడ్(బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షార్జాలో అల్వాజ్ క్యాటరింగ్ కంపెనీలో పని ఉందని చెప్పి 250 మందిని విడతల వారీగా విజిట్ వీసాలపై పంపించిన ఏజెంట్ పని చూపకుండా చేతులెత్తేశాడు. షార్జాకు మొదట విజిట్ వీసాలపై వెళ్లాలని అక్కడ వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్ దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించాడు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఆ కార్మికులు షార్జాలోని ఒక హోటల్లో గత నెల రోజులుగా ఉండిపోగా.. కొందరు తమకు తెలిసిన వారి ద్వారా మరో కంపెనీలో పని వెతుక్కున్నారు. మరికొందరు ఇంటిముఖం పట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.75వేలు వసూలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వర్ని మండలం కొత్తపేట్‌కు చెందిన ఓ వ్యక్తి ట్రావెల్ ఏజెన్సీని కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నాడు. లైసెన్స్ లేకపోయినా ఎంతో మందిని నమ్మకంగా గల్ఫ్ దేశాలకు పంపించాడనే ఉద్దేశంతో వలస కార్మికులు అతనిపై నమ్మకంతో డబ్బులు, పాస్‌పోర్టులు అందించారు. సదరు వ్యక్తి వివిధ ప్రాంతాల్లో దాదాపు 40 మందిని సబ్ ఏజెంట్లుగా నియమించుకుని వారి ద్వారా షార్జా పంపించడానికి 250 మంది కార్మికులకు విజిట్ వీసాలను జారీ చేశాడు. ఒక్కొక్కరి వద్ద విజిట్ కమ్ వర్క్ వీసాల కోసం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు వసూలు చేశాడు. అయితే కేవలం విజిట్ వీసాలనే కార్మికులకు అంటగట్టి షార్జా పంపించాడు. అక్కడ వర్క్ వీసా ఇప్పించకుండా పత్తా లేకుండా పోయి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడంతో ఏజెంట్ మోసం బయటపడింది. కాగా, వలస కార్మికుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో ఏజెంట్ సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేఎస్ ట్రావెల్స్‌కి చెందిన చిట్యాల స్వామిపై వలస కార్మికుల కుటుంబ సభ్యులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందనేది విచారణ చేస్తున్నాం.. అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు సాక్షికి వెల్లడించారు. -
ఆ ఒక్క సిక్స్‌తో '1998 షార్జా'ను గుర్తుచేశాడు
టీమిండియా దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సచిన్ బ్యాటింగ్ జోరును ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 ఏళ్ల వయసులో భారీ షాట్లతో విరుచుకుపడి అభిమానులకు వింటేజ్ సచిన్‌ను గుర్తుచేశాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తాజాగా ఈ మ్యాచ్‌లో సచిన్ కొట్టిన మూడు సిక్సర్లు వేటికవే స్పెషల్ అని చెప్పొచ్చు. అయితే క్రిస్ ట్రెమ్లెట్ బౌలింగ్‌లో అతను కొట్టిన ఒక సిక్స్ మాత్రం 1998 షార్జాను గుర్తుచేసింది. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌ను అభిమానులు ముద్దగా ''Desert Strome'' అని పిలుచుకున్నారు. ఆ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సచిన్ కళ్లు చెదిరే సిక్సర్లతో మెరిశాడు. అందులో ఫ్రంట్‌పుట్ వచ్చి స్ట్రెయిట్ సిక్సర్ బాదడం అప్పట్లో ఒక ట్రేడ్‌మార్క్‌గా నిలిచిపోయింది. ఇలాంటి షాట్లు సచిన్ కొడుతుంటే అభిమానులు ఉర్రూతలూగిపోయేవాళ్లు. ట్రెమ్లెట్ బౌలింగ్‌లో 6,6,4 బాదిన సచిన్.. ఆ ఓవర్లో మొత్తంగా 16 పరుగులు పిండుకున్నాడు. ఇక సచిన్ షార్జా 1998 గుర్తుచేస్తూ.. ఫ్రంట్‌ఫుట్ వచ్చి స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు. దీంతో అభిమానులు 1998 షార్జా, ప్రస్తుతం సచిన్ కొట్టిన సిక్సర్లను ఒకే ఫ్రేమ్‌లో జోడించి ట్వీట్స్ చేశారు. ''సచిన్ సిక్సర్లు చూస్తుంటే మనం 1998లో ఉన్నామా''.. ''వింటేజ్ సచిన్‌ను తలపిస్తున్నాడు'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 40 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 15 ఓవర్లకు కుదించారు. సచిన్ మెరుపులకు యువరాజ్ విధ్వంసం తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెజెండ్స్ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. 𝗦𝗵𝗮𝗿𝗷𝗮𝗵 𝟮.𝟬 😍🙌🔟🏏 whattttt a playerrr 💙@sachin_rt turning back the clock 🕰️🔄#RoadSafetyWorldSeries #sachintendulkar #sharjah #GOAT #God pic.twitter.com/DflUaugI4N — Ashish Verma (@ashu112) September 22, 2022 Vintage Sachin Tendulkar pic.twitter.com/qvogWLkVqC — Sachin Tendulkar🇮🇳FC (@CrickeTendulkar) September 22, 2022 చదవండి: ఒకే ఫ్రేమ్‌లో ఆ 'నలుగురు'.. షేక్ అవుతున్న ఇంటర్నెట్ సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
షార్జా-కొచ్చివిమానంలో లోపం: సేఫ్ ల్యాండింగ్
కొచ్చి: జాతీయ, అంతర్జాతీయ, విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతున్న ఘటనలు రోజుకొకటి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా షార్జా నుంచి కొచ్చి వస్తున్న ఎయిర్ అరేబియా విమానం(జి9-426) విమానం ల్యాండ్ అవుతుండగా సమస్య ఏర్పడింది. దీంతో విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది గందర గోళానికి గురయ్యారు. కొచ్చికి వస్తున్న ఎయిర్ అరేబియా విమానం (జి9-426)లో లోపం తలెత్తింది. యుఎఇలోని షార్జా నుండి ఈరోజు సాయంత్రం కొచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నప్పుడు సమస్య తలెత్తింది. అయితే అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో విమానంలో ఉన్న మొత్తం 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారని కొచ్చిన్ విమానాశ్రయంలో కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని డీజీసీఏ తెలిపింది. A Kochi-bound Air Arabia flight (G9- 426) departed from Sharjah in UAE and had a hydraulic failure while landing at Kochi airport, today evening. The aircraft landed safely. All 222 passengers and 7 crew members on board are safe: Cochin International Airport Authority pic.twitter.com/1bGS7xygTY — ANI (@ANI) July 15, 2022 -
మా గగనతలంపై మీ విమానాలొద్దు: పాకిస్తాన్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నగరాన్ని కలుపుతూ నడిచే ‘గో ఫస్ట్’ పౌర విమానాలను తమ గగనతలం మీదుగా వెళ్లనివ్వబోమని పాకిస్తాన్ మంగళవారం స్పష్టంచేసింది. గతంలో గోఎయిర్‌గా పిలవబడిన గో ఫస్ట్ పౌర విమానయాన సంస్థ ఈ ఏడాది అక్టోబర్ 23 నుంచి శ్రీనగర్–షార్జా నగరాల మధ్య డైరెక్ట్ విమానసర్వీసులను ప్రారంభించింది. ఈ నగరాలను కలిపే విమానాలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ఆ విమానాలన్నీ పాక్ మీదుగా రాకపోకలు సాగించాయి. అయితే తాజాగా తమ ఎయిర్‌స్పేస్‌ను వాడుకోవద్దంటూ పాకిస్తాన్ కరాఖండీగా చెప్పేసింది. దీంతో మంగళవారం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం సుదూరంగా గుజరాత్ మీదుగా ప్రయాణిస్తూ షార్జా నగరానికి చేరుకుంది. దీంతో విమానం మరో 40 నిమిషాలపాటు ప్రయాణించాల్సి వచ్చింది. హఠాత్తుగా తమ నిర్ణయం మార్చుకున్నందుకు సరైన కారణాలను పాకిస్తాన్ ఇంతవరకు భారత్‌కు తెలియజేయలేదు. దీనిపై గో ఫస్ట్ సంస్థ నుంచి సైతం ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెగాసస్ Vinisha Umashankar: మీ తీరు చూస్తోంటే..కోపం వస్తోంది! శభాష్ వినీషా! -
హమ్మయ్య.. శ్రీనివాస్ క్షేమంగా వచ్చేశాడు!
పెగడపల్లి(ధర్మపురి): లెబనాన్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ షార్జాలో జైలు పాలయిన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మ్యాక వెంకయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాస్ గల్ఫ్‌లో బందీ అయిన విషయంపై ‘సాక్షి’లో ‘జైలు నుంచి విడిపించరూ..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి సభ్యులు స్పందించారు. షార్జా జైలు నుంచి ఇంటికొచ్చిన శ్రీనివాస్‌ను బుధవారం ‘సాక్షి’పలకరించింది. శ్రీనివాస్ 2013లో దుబాయ్‌కి వెళ్లగా జీతం తక్కువగా ఉండటంతో అక్కడే కల్లివెల్లి కార్మికుడిగా మారాడు. ఓ గదిలో పదిమందితో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో 2015లో గదిలో ఎవరో నల్లుల మందు పెట్టగా.. అది విషంగా మారి పక్క గదిలో ఉన్న ఒకరు చనిపోయారు. ఆ కేసులో సీఐడీ పోలీసులు శ్రీనివాస్‌ను జైలులో పెట్టి 20 రోజుల తర్వాత విడుదల చేయగా స్వగ్రామానికి వచ్చేశాడు. తర్వాత 2018లో లెబనాన్ వెళ్లిన శ్రీనివాస్ ఈ ఏడాది మార్చి 24న షార్జా నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా శ్రీనివాస్‌పై కేసు ఉందని, రెండు నెలలు జైలుతోపాటు రూ.45 లక్షలు జరిమానా చెల్లించాలని చెప్పారు. ఆయన స్నేహితుడు ఈ విషయాన్ని గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహకు తెలపగా, ఆయన చొరవతో ఎలాంటి జైలుశిక్ష, జరిమానా లేకుండానే విడుదలై, స్వగ్రామం చేరుకున్నాడు. గల్ఫ్‌లో కార్మికుల గోస.. ఆదుకోవాలని వేడుకోలు -
'ముంబైతో మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు మేలే'
షార్జా : ఐపీఎల్ 13వ సీజన్లో లీగ్ మ్యాచ్‌లు నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. షార్జా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఆఖరి లీగ్ పోరు జరగనుంది. కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటికే 18 పాయింట్లతో టాప్ లేపి ప్లేఆఫ్‌కు చేరగా.. ఎస్ఆర్హెచ్కు మాత్రం ఈ మ్యాచ్ చావోరేవో అనే పరిస్థితి. ముంబైతో మ్యాచ్‌లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ చేరుతుంది.. ఓడిపోతే కేకేఆర్ వెళుతుంది. అయితే విండీస్ దిగ్గజం.. మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా మాత్రం ముంబైతో జరిగే మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు మేలు చేయనుందని అంటున్నాడు. (చదవండి : ప్లీజ్ ఆ నిబంధనను తప్పనిసరి చేయండి : సచిన్) ' ముంబై.. ఈ మ్యాచ్‌లో సమూల మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లీగ్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో టాప్ స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అడుగుపెట్టిన ముంబై ఈ మ్యాచ్‌ను పెద్దగా పట్టించుకోదనే అనుకుంటున్నా.ఇప్పటివరకు అవకాశం రాని ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లకు ముంబై తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఈ అవకాశం ఎస్ఆర్హెచ్కు లాభం చేకూర్చనుంది. దీనిని వినియోగింకొని ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ చేరుతుందనే అనుకుంటున్నా. 'అంటూ లారా చెప్పుకొచ్చాడు. (చదవండి :‘ధోని 400 పరుగులు చేయగలడు’) -
చెన్నైకి విజయం వరించేనా!
షార్జా : ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరగనుంది. కాగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఈ సీజన్లో మంచి ప్రదర్శన కనబరుస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండగా.. మరోవైపు సన్‌రైజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై జట్టు 6వ స్థానంలో కొనసాగుతుంది. తొలి అంచెలో సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 44 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇక ఇరు జట్ల విషయానికి వస్తే సీఎస్కే.. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే మరోసారి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. వాట్సన్, రాయుడు, డుప్లెసిస్లతో టాప్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తున్నా.. మిడిలార్డర్ మాత్రం మంచి ప్రదర్శన కనబరచలేకపోతుంది. బౌలింగ్ విభాగంలో బ్రావో, దీపక్ చాహర్, శార్థూల్ ఠాకూర్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లు ఉన్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్లతో పాటు శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, అజింక్యా రహానేలతో బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో కగిసో రబడ మంచి ఫామ్ కనబరుస్తుండగా.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పరుగులు నియంత్రించడంతో పాటు కీలక వికెట్లు తీస్తున్నాడు. రిషబ్ పంత్ గాయంపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో అతను ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం లేదు. ప్రస్తుతం ఢిల్లీ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు చెన్నై మూడు విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. -
ఈ పేరును కొంచెం గౌరవించండి : గేల్
షార్జా : విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్ 13వ సీజన్లో తన ఆటను ఆరంభించాడు. గురువారం ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆఖరి బంతికి విజయం సాధించి లీగ్‌లో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో మొదటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన గేల్ 54 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గేల్ ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. గేల్ మ్యాచ్ ఆడుతున్నాడంటే అక్కడ ఉండే సరదా వేరుగా ఉంటుంది. తాను చేసే అల్లరితో గ్రౌండ్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మోడ్‌లోకి మారిపోతుంది. (చదవండి : ఉత్కంఠ పోరు.. చివరి బంతికి గెలిచారు) తాజాగా కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌లో గేల్ తన అర్థసెంచరీ పూర్తి చేశాక ఒక సన్నివేశం చోటుచేసుకుంది. ఫిప్టీ పూర్తయిన తర్వాత బ్యాట్ పైకెత్తిన గేల్ బ్యాట్‌పై ఉన్న స్టిక్కర్‌ను చూపించాడు. ఆ స్టిక్కర్‌పై ది బాస్ అని రాసి ఉంది. బ్యాట్‌పై ఉన్న స్టిక్కర్ ద్వారా గేల్ ఒక మెసేజ్‌ను పాస్ చేశాడు. ' అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. నేను చూపించే ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి' అంటూ పేర్కొన్నాడు. కాగా గేల్ చేసిన పనిపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రస్తావించాడు.(చదవండి : కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై) When he is on the mic, expect nothing less than entertainment and laughs 😅😅#Dream11IPL | @henrygayle pic.twitter.com/I62YPN1pES — IndianPremierLeague (@IPL) October 15, 2020 గేల్ ఒక మంచి గుణం కలిగిన ఆటగాడని.. క్రికెట్లో గొప్పగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఆటగాళ్లలో అతను ముందు వరుసలో ఉంటాడని కొనియాడాడు. అతను ఉన్న చోట ఎంటర్టైన్మెంట్కు కొదువ ఉండదు.. అందుకే గేల్ మంచి మనసున్న ఆటగాడయ్యాడని తెలిపాడు.అనంతరం మ్యాచ్ గురించి ప్రస్తావించగా.. కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడని.. అతనికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు. కింగ్స్ పంజాబ్ అసలైతే ఐదు మ్యాచ్‌లు గెలవాల్సి ఉండేది.. కానీ వారికి అదృష్టం కలిసిరావడం లేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ కూడా ఈజీగా గెలవాల్సినా.. చివరివరకు ఆడి క్లిష్టతరం చేసుకున్నారని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అంతేగాక క్రీడల్లో గొప్ప అథ్లెట్‌గా కోహ్లితో పాటు ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోలను మొదటి చాయిస్‌గా తీసుకుంటానని రవిశాస్త్రి ఇంటర్య్వూలో సమాధానమిచ్చాడు. కాగా కింగ్స్ పంజాబ్ 8 మ్యచ్‌లాడి కేవలం రెండు విజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. లీగ్‌లో ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లను పంజాబ్ గెలవడంతో పాటు రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటేనే ఫ్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. -
ఆర్సీబీ భళా.. కేకేఆర్ డీలా
షార్జా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ను 112 పరుగులకే కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌లో ఛేదించే క్రమంలో కేకేఆర్ పూర్తిగా తేలిపోయింది. శుబ్‌మన్ గిల్(34; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. కేకేఆర్ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ముందుగా బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆర్సీబీ..అటు తర్వాత బౌలింగ్‌లోనూ విశేషంగా రాణించింది. కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. వాషింగ్టన్ సుందర్, మోరిస్‌లకు తలో రెండు వికెట్లు సాధించగా, చహల్, ఉదాన, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీలకు ఒక్కో వికెట్ దక్కింది. సుందర్ నాలుగు ఓవర్ల కోటాలో 20 పరుగులే ఇవ్వగా, చహల్ నాలుగు ఓవర్లకు 12 పరుగులిచ్చాడు. మోరిస్ నాలుగు ఓవర్లకు 17 పరుగులివ్వగా, సైనీ మూడు ఓవర్లలో 17 పరుగులిచ్చాడు. (‘ఈ ఏడాదే టీమిండియాకు ఆడతాడు’) ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. దేవదూత్ పడిక్కల్(32; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) అరోన్ ఫించ్(47; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్), ఏబీ డివిలియర్స్(73 నాటౌట్; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోహ్లి(33 నాటౌట్; 28 బంతుల్లో 1 ఫోర్)లు రాణించడంతో ఆర్సీబీ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించింది. దేవదూత్ పడిక్కల్, అరోన్ ఫించ్‌లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఫించ్‌కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ స్టైక్ రొటేట్ చేశారు. కానీ ఫోర్లు, సిక్స్‌లు రావడం కష్టం కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. ఆర్సీబీ స్కోరు వద్ద ఫించ్ ఔటైన తర్వాత గేమ్ స్వరూపం మారిపోయింది. ఫించ్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఏబీడీ విశ్వరూపం ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తిచేస్తున్నాడు. ఆర్సీబీ రన్‌రేట్‌ను పెంచుకుంటూ పోయాడు. బౌలర్లు ఓవర్ ద వికెట్, రౌండ్ ద వికెట్ వేసినా అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఏబీడీ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ 190 పరుగుల మార్కును చేరింది. కాగా, కోహ్లి ఫోర్ కొట్టడానికి చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. 19 ఓవర్లో కానీ కోహ్లి ఖాతాలో బౌండరీ రాలేదు. అదొక్క బౌండరీనే ఈ మ్యాచ్‌లో కోహ్లి సాధించాడు. కేకేఆర్ బౌలర్లలో రసెల్, ప్రసిద్ధ్ కృష్ణలకు తలో వికెట్ లభించింది.ఇది ఆర్సీబీకి ఐదో విజయం కాగా, కేకేఆర్‌కు మూడో ఓటమి. -
చెలరేగిన డివిలియర్స్
షార్జా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. దేవదూత్ పడిక్కల్(32; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అరోన్ ఫించ్(47; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్), ఏబీ డివిలియర్స్(73 నాటౌట్; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోహ్లి(33 నాటౌట్; 28 బంతుల్లో 1 ఫోర్)లు రాణించడంతో పోరాడే స్కోరును బోర్డుపై ఉంచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించింది. దేవదూత్ పడిక్కల్, అరోన్ ఫించ్‌లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఫించ్‌కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ స్టైక్ రొటేట్ చేశారు. కానీ ఫోర్లు, సిక్స్‌లు రావడం కష్టం కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. ఆర్సీబీ స్కోరు వద్ద ఫించ్ ఔటైన తర్వాత గేమ్ స్వరూపం మారిపోయింది. ఏబీడీ విశ్వరూపం ఫించ్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఏబీడీ విశ్వరూపం ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తిచేస్తున్నాడు. ఆర్సీబీ రన్‌రేట్‌ను పెంచుకుంటూ పోయాడు. బౌలర్లు ఓవర్ ద వికెట్, రౌండ్ ద వికెట్ వేసినా అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఏబీడీ కడవరకూ క్రీజ్‌లోకి ఉండటంతో ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కాగా, కోహ్లి ఫోర్ కొట్టడానికి చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. 19 ఓవర్లో కానీ కోహ్లి ఖాతాలో బౌండరీ రాలేదు. అదొక్క బౌండరీనే ఈ మ్యాచ్‌లో కోహ్లి సాధించాడు. కేకేఆర్ బౌలర్లలో రసెల్, ప్రసిద్ధ్ కృష్ణలకు తలో వికెట్ లభించింది. -
సునీల్ నరైన్ ఔట్
షార్జా: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ కోల్‌కతా, ఆర్సీబీలు తలో ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలు సాధించాయి. ఇరుజట్లు వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. సీఎస్కేతో ఆడిన గత మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపును అందుకుంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 24సార్లు తలపడగా కేకేఆర్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆర్సీబీ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు కేకేఆర్ వివాదాస్పద స్పిన్నర్ సునీల్ నరైన్ దూరమయ్యాడు. కింగ్స్ పంజాబ్‌తో ఆడిన గత మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు అంపైర్లు ఫిర్యాదు చేశారు. దాంతో నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై తుది నివేదిక వచ్చే వరకూ అతను దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ క్రమంలోనే నరైన్‌ను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. మరి రాబోవు టోర్నీలో నరైన్ ఉంటాడా..లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ నరైన్ యాక్షన్ సరిగా లేదని తేలితే మాత్రం ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమవుతాడు. కోహ్లి వర్సెస్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో కోహ్లి-కమిన్స్‌ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఆర్సీబీ ఆడిన ఆరంభపు మ్యాచ్‌ల్లో తడబడిన కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆపై మంచి ఫామ్‌లోకి వచ్చాడు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఓ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో సహకరించాడు. ఆ మ్యాచ్‌లో అజేయంగా 90 పరుగులు సాధించి పెద్ద విజయాన్ని బెంగళూరుకు అందించాడు. కోహ్లి ఎదుర్కొన చివరి 22 డెలివరీల్లో 56 పరుగులు సాధించాడు. దాంతో కోహ్లి మరోసారి మెరిసే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ జట్టు పేస్ విభాగంలో కమిన్స్ కీలకం కానున్నాడు. కమిన్స్‌ది కూడా కోహ్లి కథే. సీజన్ ఆరంభంలో తడబడ్డ కమిన్స్.. ఆపై బ్యాట్స్‌మెన్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. వికెట్లు సాధించకపోయినప్పటికీ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌లతో పరుగులు నియంత్రిస్తున్నాడు. కానీ వరల్డ్ బెస్ట్ బౌలర్లలో ఒకడైన కమిన్స్ ఏ క్షణంలోనైనా తన ట్రాక్‌ను అందుపుచ్చుకోవచ్చు. ఇప్పటివరరకూ తన స్థాయికి తగ్గ బౌలింగ్ వేయకపోయినప్పటికీ కమిన్స్‌తో ఆర్సీబీకి ప్రమాదం పొంచి ఉంది. కమిన్స్ ఆరు మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు మాత్రమే తీయగా, కోహ్లి ఆరు మ్యాచ్‌ల్లో 223 పరుగులు చేశాడు. ఇక్కడ కోహ్లి యావరేజ్ 55.75గా ఉండగా, స్టైక్‌రేట్ 128.90గా ఉంది. ఆర్సీబీ తుదిజట్టు విరాట్ కోహ్లి(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, అరోన్ ఫించ్, దేవదూత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉదాన, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, చహల్ కేకేఆర్ తుదిజట్టు దినేశ్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, టామ్ బాంటాన్, ఆండ్రీ రసెల్, ప్యాట్ కమిన్స్, నాగర్కోటి, ప్రసిద్ద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి -
ముంబైతో మ్యాచ్‌కు భువీ దూరం
షార్జా : ఐపీఎల్ 13వ సీజన్లో నేడు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య షార్జా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు విజయాలు సాధించిన సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. మరోవైపు ఓ మ్యాచ్‌లో ఓడి.. మరో మ్యాచ్‌లో గెలుస్తూ.. రెండు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్పై గెలవాలనే కసితో బరిలో దిగనుంది. ఇప్పటి వరకూ ఇరు జట్లు దుబాయ్, అబుదాబిల్లో మాత్రమే మ్యాచ్‌లు ఆడాయి. కాగా తొలిసారి షార్జాలో ఆడబోతున్నాయి. కాగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఇరు జట్ల బలబలాలు రోహిత్ శర్మ, పొలార్డ్, డికాక్, పాండ్య, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లతో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. చిన్న స్టేడియంలో ముంబై ఇండియన్స్ సిక్సర్ల మోత మోగించే అవకాశం ఉంది. ముంబై బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్‌లకు సన్‌రైజర్స్‌పై పెద్దగా చెప్పుకునే రికార్డేం లేదు. గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో పొలార్డ్, పాండ్యాలను రషీద్ ఖాన్ నిలువరించగా.. కాగా పొలార్డ్‌కు 22 బంతులేసిన భువీ అతన్ని 3 సార్లు ఔట్ చేశాడు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్, రాహుల్ చాహర్‌లతో ముంబై పటిష్టంగానే ఉంది. ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే వార్నర్ టచ్‌లోనే కనిపిస్తున్నా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. బెయిర్ స్టో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. మనీష్ పాండే, కేన్ విలియమ్సన్‌లు తమ ఫామ్‌ను కొనసాగిస్తే ముంబైకి కష్టాలు తప్పకపోవచ్చు. చెన్నైతో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మలు మరోసారి రాణిస్తే ఎస్ఆర్హెచ్ జట్టుకు తిరుగుండదు. మరోవైపు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ప్రధాన బౌలర్ భువీ గాయపడిన సంగతి తెలిసిందే. భువనేశ్వర్ గాయంతో మ్యాచ్‌కు దూరమవడంతో అతని స్థానంలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ స్థానంలో సిద్దార్థ్ కౌల్ జట్టులోకి వచ్చారు. ఇప్పటివరకు ఐపీఎల్లో ముంబై, సన్‌రైజర్స్‌లు 14 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరో ఏడుసార్లు చొప్పున గెలుపొందాయి. కాగా ఈ మ్యాచ్ ద్వారా పలువురు ఆటగాళ్లు పలు మైలురాళ్లను చేరుకోనున్నారు. ట్రెంట్ బౌల్ట్‌కిది 100వ టీ20 మ్యాచ్ కాగా ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కు ఇది 50వ మ్యాచ్. మనీష్ పాండే ఐపీఎల్లో 3వేల పరుగుల మైలురాయిని చేరడానికి ఇంకా 40 పరుగులు దూరంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా సన్‌రైజర్స్ జట్టు : డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సామద్, అభిషేక్ శర్మ, ప్రియాం గార్గ్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, టి. నటరాజన్ -
షార్జాలో భారీ అగ్ని ప్రమాదం
షార్జా: షార్జాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అల్ నహ్ డ్ ప్రాంతంలోని 49అంతస్తుల అబ్కో టవర్ లో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. పదో అంతస్తులో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకూ వ్యాపించాయి. దీంతో ఫ్లాట్స్ లో ఉన్న స్థానికులు బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు 3 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ బిల్డింగ్ లో 250 కుటుంబాలు నివాసముంటుండగా.. ఎక్కువ మంది భారతీయులేనని తెలుస్తోంది. ఘటనలో ఏడుగురు గాయపడగా.. వారిని హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో విలువైన వస్తువులు, నగదు కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అక్కడి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. చదవండి: బాయ్స్ లాకర్ రూం: హైకోర్టు సీజేకు లాయర్ లేఖ ఎక్కువ మంది చనిపోతారు.. మాస్కు పెట్టుకోను -
‘దారుణంగా కొట్టాడు.. సాయం చేయండి ప్లీజ్’
షార్జా: భర్త వేధింపులను భరించలేని ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా తన మనో వేదనను పంచుకుంది. భర్త రోజూ వేధిస్తున్నాడని, తనకు సహాయం కావాలంటూ ట్విటర్లో ఓ వీడియోను పోస్టు చేసింది. వెంటనే ఈ విషయంపై స్పందించిన పోలీసులు బుధవారం సదరు మహిళ భర్తను అరెస్టు చేశారు. ఈ ఘటన యూఏఈలోని షార్జాలో చోటుచేసుకుంది. వివరాలు.. భారత్ చెందిన జాస్మిన్ సుల్తాన్(33) అనే మహిళకు మహ్మద్ ఖిజార్ ఉల్లా(47) అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఉద్యోగరీత్యా షార్జాలో స్థిరపడ్డ వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల భర్త నుంచి వేధింపులు ఎక్కువయ్యామని, తనపై హింసాత్మకంగా దాడి చేస్తున్నాడని నవంబర్ 12న ఓ వీడియోను ట్వీట్ చేసింది. అంతేగాక తమ పాస్‌పోర్టులను, బంగారాన్ని లాక్కొన్ని చిత్ర హింసలు పెడుతున్నాడని ఆమె వాపోయింది. భర్త నుంచి తనను, పిల్లలను రక్షించి సొంత ఊరు అయిన బెంగుళూరుకు పంపాలని అభ్యర్థించింది. తనకు ఇక్కడ(షార్జా)లో తెలిసిన వారు ఎవరూ లేరని పోలీసులను వేడుకుంది. ఇక దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహ్మద్ ఖిజార్ ఉల్లాను విచారిస్తున్నారు. -
షార్జాలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు
గల్ఫ్ : షార్జాలో ఇండియన్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి మురళీధరన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. షార్జాలోని ఇండియన్ అసోసియేషన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉత్సవాల్లో కాన్సుల్ జనరల్ విపుల్, ఇండియన్ పీపుల్స్ ఫోరం జాతీయ కన్వీనర్ భూపేందర్, ఉపాధ్యక్షుడు జనగామ శ్రీనివాస్, సభ్యులు రమేష్, మహేందర్‌రెడ్డి, బాలకిషన్, గిరీష్ పంత్, విజయ్, ఐపీఎఫ్ అల్ ఎమిరేట్స్ సభ్యులు, ఇండియన్ కమిటీ సభ్యులు, ఇండియన్ అసోసియేషన్ షార్జా సభ్యులు, ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. కాగా, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. -
విమానంలోనే ప్రాణాలొదిలిన వ్యక్తి
తిరువనంతపురం : ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు మార్గమధ్యలోనే ప్రాణాలొదిలాడు. తిరువనంతపురం-షార్జా ఎయిరిండియా విమానంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వివరాలను ఇంకా గుర్తించాల్సి ఉందనీ అధికారులు తెలిపారు. ఈ విషాదం కారణంగా విమానం ఆలస్యంగా షార్జాకు బయలు దేరింది. తిరువంతనపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.24 నిమిషాలకు విమానం బయలుదేరింది. ఇంతలో ఒక ప్రయాణికుడు అనారోగ్యానికి గురికావడంతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. కానీ అప్పటికే సదరు ప్రయాణీకుడు కన్నుమూశాడని వైద్యులు ధృవీకరించారు. ప్యాసింజర్ వివరాలను గుర్తించి, బంధువులకు సమాచారం ఇచ్చేందుకు ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎయిరిండియా విమానం 967 తిరువనంతపురం ప్రయాణీకులలో ఒకరు జబ్బుపడి మరణించంతో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ధనుంజయ్ కుమార్ తెలిపారు. అతనికి సంబంధించిన వస్తువులను సిబ్బందికి అందజేసామన్నారు. అయితే ప్రయాణికుడి ఆకస్మిక మృతికి గల కారణాలు తెలియరాలేదన్నారు. -
లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు
దుబాయ్: యూఏఈలోని షార్జాలో సోషల్ మీడియా లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించి న భారత యువతిని ఆ దేశ పోలీసులు సకాలంలో అడ్డుకుని ప్రాణాల ను కాపాడారు. సోషల్ మీడియాలో స్వయంగా పోస్టు చేసిన తన చిత్రానికి ఎక్కువగా వ్యతిరేక స్పందనలు రావడంతో మనస్తాపం చెందిన యువతి బలవ న్మరణానికి యత్నించిందని పోలీసులు తెలిపారు. షార్జాలోని ఏ1 నహదా ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో సోషల్ మీడియాలో వీడియో లైవ్ పెట్టి ఆత్మహత్యకు సిద్ధం కాగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆమె ఉంటున్న ఇంటి వద్దకు చేరుకుని తలుపు తట్టగా...ఆ యువతి తండ్రి తలుపు తీశాడు. పోలీసులు కన్పించేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి ఆ యువతిని ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు. ఆమెకు వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. -
మేకప్ తీశాక గుర్తుపట్టలేక విడాకులు...
అరబ్: కొత్తగా పెళ్లైన దంపతులు ఎంజాయ్ చేద్దామని షార్జాలోని అల్‌మాంజర్ బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో దిగి బయటకు వచ్చాక మేకప్ పోవడంతో భర్త తన భార్యను గుర్తు పట్టలేకపోయాడు. మేకప్‌తో తనను మోసం చేసిందని, ఇప్పుడు ఆమె అందంగా లేదంటూ విడాకులు కోరాడు. ఈ వింత సంఘటన యూఏఈలో వెలుగు చూసింది. 28 సంవత్సరాల వయసున్న ఆ మహిళ డాక్టర్. అబ్దుల్ అజీజ్ అసఫ్ అనే సైకాలజిస్టును కలిసి ఈ విషయం గురించి ప్రస్తావించారు. మహిళ వివరాలను గోప్యంగా ఉంచుతూ ఈ విషయాన్ని గురించిన సమాచారాన్ని గల్ఫ్‌న్యూస్‌కు వెల్లడించారు. పెళ్లికి ముందు జరిగిన పలు సర్జరీలతో పాటు, కంటి చుట్టూ వేసుకున్న మేకప్ విషయాన్ని కూడా అతడి వద్ద దాచిందని ఆ సైకాలజిస్ట్ వెల్లడించారు. దీంతో పెళ్లికొడుకు విడాకులు కోరాడని, చివరకు ఆ మహిళ ముందుకు వచ్చి నిజం చెబుతానని ప్రయత్నించినా అతడిని ఒప్పించలేకపోయామని అన్నారు. వారికి పెళ్లయి ఆరు నెలలు కావడం గమనార్హం. -
షార్జాలో మరో అద్భుత నిర్మాణం
షార్జా : అరుదైన నిర్మాణాలకు ఖ్యాతిగాంచిన యూఏఈ మరో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దుబాయ్ తీరంలో ‘పామ్ ఐలాండ్’ పేరుతో నిర్మించిన దీవి.. ప్రపంచ పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తున్నదో తెలిసిందే. దాదాపు అదే తరహాలో ‘సన్ ఐలాండ్’ పేరుతో సముద్ర భాగంలో చిన్నచిన్న ఎనిమిది ద్వీపాలను కలుపుతూ ఏకంగా నగరాన్నే నిర్మించ తలపెట్టింది. మొదటి విడతలో ఖరీదైన 231 విల్లాలతో నిర్మిస్తున్న ఈ వాటర్ ఫ్రంట్ సిటీకి సన్ ఐలాండ్ గా నామకరణం చేసింది. తాజాగా ఈ సన్ ఐలాండ్ నమునా చిత్రాన్ని విడుదల చేశారు దీని డెవలపర్లు. మొదటి దశలో ఖరీదైన 231 విల్లాలో కొన్ని మూడు, నాలుగు బెడ్రూంలతో, మరికొన్ని ఐదు, ఆరు బెడ్రూంలతో నిర్మించనున్నారు. 2019 చివరి నాటికి ఈ వాటర్ ఫ్రంట్ సిటీ నిర్మాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే కెంపిన్స్కీ, డ్యూసిట్ కంపెనీలు ఈ ప్రాజెక్టులో ఆపరేటర్లుగా చేసేందుకు సంతకాలు చేశాయి. విల్లాల్లో వాణిజ్య యూనిట్లు, షాపింగ్ మాల్స్, వాటర్ పార్కు, హోటళ్ళు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును నిర్మించే ప్రదేశం హమ్రియయా జోన్ కిందికి వస్తుంది. 8 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందట. ఈ వాటర్ ఫ్రంట్ సిటీ ద్వారా ప్రక్కనే ఉన్న దుబాయ్, అబుదాబి వంటి ఎమిరేట్స్ వాసులకు వినోదం, విశ్రాంతికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ ఎమిరేట్స్‌ను ఆకర్షించే నీటి టాక్సీలను అందించే దుబాయ్ ఆర్టీఏతో డెవలపర్లు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని తెలిసింది.